Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ऊँ!"శివస్తు తి'మానినిస్థ పంచపద్యసుమహారము..మద్విరచితం,గురుమహో దయ!!! నమః!!!

"

1) సాంబసదాశివసార్ధ తనూస్థితసర్పసుశోభితసామజభా!

అంబరమేవలువైన విషాశన!శంకర!నీవెగదాదెసయున్

అంబురుహానన కంజధరాకమలాప్త సమంచితరౌచ్యసమా!

శంభురమేశసుసాధితవశ్యుఁడ!శర్వుఁడ!భూతవశంకరుఁడా!!!!

2) మారెఁడుపత్రముమక్కువనెంతయుమావిభుఁడా శశిమౌళిభవా!

సారెఁడుపుష్పఁపుసౌరభసారము సన్నుత!యిత్తు ను సారెఁడుగా...

బారెఁడురూపుఁడ!బంగరుసామివి!భద్రు ఁడవీవయ!భాస్కరభా!

మారునిదర్పముమార్చినరుద్రు ఁడ!మాధవపూజిత !మాగతివే!!!!

3) ఏమనిచెప్పెద నిమ్మెయి నీమహిమేగద'సాంబుఁడ!'యేలికవే!

ఏమనినేర్వను నెమ్మెయిఁబ్రా ఁజదువేలనయావిధినెప్పుడహో ..

ఏమనియేడ్వనునిత్త ఱినీదయయేఁగలుగన్నిఁకనేమియునున్

ఏమనియందును నేసిరిఁబట్టెనొయేమిఫలమ్మొనదేకలఁదో ?!
4) మాన్యుఁడనైతినిమాధవపూజిత!మాదృశభక్తు లమాన్యతఁ..గా

రుణ్యుఁడవైమమురుచ్యమగున్నటు'రుద్రు ఁడ'.బ్రో వుమ రుండధరా!

ధన్యుఁడనైతినిధాన్యఁపురాశినిధారగనిచ్చియు ధన్యఁత..నే

నన్యుఁడఁ గానయ నామది యంతయు నమ్మిక నుంటివి నాశివుఁ డా'!!!!

5) హెచ్చగు కన్నులనేగలవాఁడవుహేమగిరీశునియేలికవే!

పెచ్చగుకోపముపిచ్చిగవచ్చినపిక్కటిలుంగదపిమ్మటగా....

అచ్చెరువైనటులన్ గరళమ్మునుహాయిగభక్షణమాయెనుగా

విచ్చెనునామదివింతగనీకథవిన్నపుడుంగద..'విశ్వపతీ'!!!!"

You might also like