Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 8

ప్రతి ఒక్కరి జీవితం లో కొన్ని సున్నితమైన క్షణాలు ఉంటాయి.

ఆ టైం లో వాళ్ళని అనుక్షణం

కనిపెడుతూ ఉండాలి. లేకపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు పెనుముప్పుగా మారతాయి. ఆ క్షణం

లో ఎలాంటి పెద్ద విషయాన్నీ అయిన చిన్న విషయం మార్చాల్సింది స్నేహితులు, తల్లిదండ్రు లే. వాళ్ళు

స్పందించాల్సిన విధంగా స్పందించకపోతే ఆ తరువాత వచ్చే ఫలితాన్ని జీవిత కాలం మోయ్యల్సిందే.

నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా, అందంగా ఉండే వాళ్ళని కోరుకోరు, తన ప్రపంచాన్ని అందంగా

మార్చే వాళ్ళని కోరుకుంటారు. అలాగే అనుకోని ఆమె, అతన్ని ప్రేమించింది. వాళ్ళు ప్రేమలోని

మాధుర్యాన్ని ప్రతి క్షణం ఆస్వాదించారు. కాని వాళ్ళ ప్రేమకి ఊహించని చుక్కెదురయ్యింది. తెలుగు

తెర మీద కూడా చూడని హై డ్రామా నడిచింది. చివరికి ఆ కథ ఏమైంది. ఇవాల్టి ఇది కథ కాదు లో

సీన్ నెం 1 :

సుమేర్ సింగ్ (25), కాజల్ కుమారీ (22) ఇద్దరు పార్క్ లో నవ్వుకుంటూ తిరగటం. బైక్ మీద

తిరగటం. ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ మాట్లా డుకోవటం. సుమేర్ సింగ్ ఏదో కాజల్ చెవిలో

చెప్పటం. ఆమె నవ్వుతు అతన్ని తల మీద కొట్టటం, ఐస్ క్రీం తినటం. సినిమాలకి వెళ్ళటం. పార్క్ లో

పడుకొని ఇయర్ ఫోన్ ఒకటే పెట్టు కొని ఇద్దరు పాటలు వినటం.వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తరువాత

బాత్రూం లో తలుపులు వేసుకొని నవ్వుకుంటూ మాట్లా డటం.


v.o
హై దరాబాద్ కి చెందిన సుమేర్, కాజల్ లు ప్రేమలో ఉన్నారు. అన్ని లవ్ stories లాగే, వాళ్ళ బంధం

స్నేహంతో మొదలై , ప్రేమగా మారింది. నీతో ఉన్న ఈ క్షణమే తెలుసుకున్న ఇవ్వటమే ప్రేమని, తిరిగి

ఆశించటమే స్వార్ధం అని సుమేర్ అంటే, జ్ఞాపకానికి రూపం వస్తే ఎంత బావుంటుంది, ప్రతి క్షణం

నువ్వు నాతో ఉంటావు అని ప్రేమ బాష లో కాజల్ రిప్లై ఇచ్చింది. వాళ్ళు ఇలా ప్రేమలోని మాధుర్యాన్ని

ప్రతి క్షణం ఆస్వాదిస్తు న్నారు.


సీన్ నెం 2 :

కాజల్ bus స్టా ప్ లో వెయిట్ చెయ్యటం. సుమేర్ రావటం. కాజల్, సుమర్ దగ్గరకి వచ్చి హాగ్

చేసుకొని, బైక్ ఎక్కటం. దూరంగా ఉన్న కాజల్ తండ్రి శరత్ (50), కాజల్ ని చూడటం.

తలకోట్టేసినట్లు ఫీల్ అయ్యి తల దిన్చుకోవటం.


v.o :

సుమేర్ రావటం తో ఆమె మొహం నవ్వు వికసించింది. వాళ్ళు ఆ క్షణం లో ప్రపంచాన్ని మర్చిపోయి,

రోడ్ కి అటు వైపు ఉన్న కాజల్ తండ్రి ని గమనించలేదు.

సీన్ నెం : 3

కాజల్ నవ్వుకుంటూ ఇంట్లోకి రావటం. శరత్ సీరియస్ గా సోఫా లో కూర్చొని ఉండటం. పక్కన తల్లి

రాధ (46) నిల్చొని ఉండటం. కాజల్ తండ్రి ని గమనించటం. కాజల్ ఏదో జరిగింది అని గ్రహించి

మెల్లగా తన గదిలోకి వెళ్ళటానికి ట్రై చెయ్యటం. తల్లి ఆమెని పిలవటం. దొరికం అనుకుంటూ

రావటం. తండ్రి మందలించటం. కాజల్ ఏడవటం. తండ్రి సీరియస్ మాట్లా డుతూ ఉండటం. కాజల్

తల ఊపటం. కాజల్ కళ్ళు తుడుచుకుంటూ తన రూమ్ కి వెళ్ళటం. బ్యాగ్ పక్కన విసిరేసి, మంచం

మీద పడి ఏడవటం. సుమేర్ నుంచి కాల్ రావటం.


v.o
కాజల్.. ఏ తండ్రి ఇవ్వనంతా స్వేచ్చ నేను, నీకు ఇచ్చాను, ఇప్పటికే చాలా మంది నీ గూర్చి ఏదేదో

చెప్తు న్నా, నీ మీద ఉన్న నమ్మకంతో నేను నిన్ను ఏ రోజు ఒక్క మాట అడగలేదు. ఉదయం నా కళ్ళతో

చూస్తే కాని తెలియలేదు, నేను విన్నది ప్రతిది నిజమని. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి గర్వం

చెప్తా ను, మా అమ్మాయి అందరిలాంటిది కాదు అని, ఇవ్వాళ నువ్వు నా నమ్మకాన్ని నాశనం చేసావు

అంటాడు. ఒక్క సరిగా తండ్రి ఇలా రియాక్ట్ అవటం తో ఎం మాట్లా డాలో అర్థం కాలేదు కాజల్ కి.

ఇక నుండి మీరు చెప్పినట్లే వింటా అంటుంది కాజల్. వెంటనే తండ్రి, డెన్ ప్రూ వ్ ఇట్ కాజల్
అంటాడు. కాజల్ మౌనంగా తల ఊపి అక్కడి నుండి తన రూమ్ వెళ్లి తన లో తనే కుమిలిపోతుంది.

సీన్ నెం 4 :

కాజల్ బెడ్ రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉండటం. సుమేర్ కాల్ వెంట కాల్ చేస్తూ ఉండటం.

కాజల్ కట్ చేస్తూ ఉండటం. (intercut ravali : సుమేర్ bus స్టా ప్ లో ఒంటరి గా వెయిట్

చెయ్యటం. సుమేర్ మెసేజ్ చెయ్యటం. శరత్ , సుమేర్ ని చూడటం. శరత్ కాల్ చెయ్యటం.) కాజల్

ఏడుస్తూ మెసేజ్ చెయ్యటం, మెసేజ్ సెంట్ అవగానే, ఫోన్ పక్కన పడేసి కుళ్ళి కుళ్ళి ఏడవటం.
v.o :

ఆ క్షణం లో తండ్రి కి మాట ఇచ్చిందే కాని, కాజల్ అంత తెలికగా తన ప్రేమ ని మర్చిపోలేకపోతుంది.

కాని అనుక్షణం తండ్రి అన్న మాట గుర్తు కు రావటం తో ఏమి చేయాలో అర్థం కాని కాజల్ కి, సుమేర్

కి మెసేజ్ చేసింది , ఇట్స్ ఆల్ ఓవర్, డోంట్ మీట్ మీ అగైన్ అని. మెసేజ్ పంపినంత తేలికగా తనలోని

ప్రేమని బయటకి పంపలేకపోయింది. ఒక్కతే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. bus స్టాండ్ లో సుమేర్ ని

చూసిన కాజల్ తండ్రి, ఆవేశం లో కాజల్ కి పెళ్లి చేయాలనీ అప్పటికప్పుడు ఆవేశం లో నిర్ణయం

తీసుకొని పెళ్ళిళ్ళ బ్రోకర్ కి కాల్ చేసాడు. ఆ క్షణం లో ఆవేశం గా తీసుకున్న ఆ నిర్ణయం, తన

కూతురు జీవితము లో ఎలాంటి మలుపులను తీసుకోని రాబోతుందో ఆ క్షణం శరత్ ఊహించలేదు.

సీన్ నెం 5 :

ఇంట్లో పెళ్లిచూపులు. పెళ్ళికొడుకు, తల్లి, తండ్రి వచ్చి అమ్మాయి కోసం ఎదురు చూడటం. శరత్

వాళ్ళతో ఏదో మాట్లా డటం. పక్కన ఉన్న భార్య రాధకు చెప్పటం. రాధ లోపలి వెళ్ళటం. రాధ, కాజల్

ని తీసుకోని రావటం. కాజల్ ముభావకంగా ఉండటం. పెళ్ళికొడుకు తండ్రి, శరత్ అడగటం. శరత్

ఏదో చెప్పటం. ఇద్దరు నవ్వుకోవటం. పెళ్లికొడుకు, అమ్మాయిని చూడటం. నచ్చినట్లు తన తల్లికి

చెప్పటం. వాళ్ళు ఏదో పిచపాటి మాట్లా డుకోవటం. కాజల్ ఏదో పరధ్యానం లో ఉండటం. రాధ ఆమె
భుజం తట్టటం. ఆమె తల ఊపటం. అందరు సంతోషపడటం. రాధ, కాజల్ ని తీసుకోని లోనికి

వెళ్ళటం.
v.o :

సుమేర్ తో బ్రేక్ అప్ తరువాత, కాజల్ చాలా ముభావంగా ఉంటుంది.తల్లిదండ్రు లు గమనించిన

చిన్నగా అదే సర్దు కుంటుందిలే అనుకున్నారు. శరత్, కూతురికి పెళ్లి చెయ్యటం కోసం ఒక

సంబంధాన్ని చూసాడు. వాళ్ళు, కాజల్ ని చూడటానికి వచ్చారు. శరత్ తో వాళ్ళతో పిచ్చాపాటి

మాట్లతుండగా, రాధా వెళ్లి కూతుర్ని తీసుకోని వచ్చింది. కాజల్ ముభావకంగా ఉండటం గమంచిన,

అబ్బాయి తండ్రి విషయం ఏంటి అని అడిగితే, శరత్, వొంట్లో చిన్న నలత చేసింది అందుకే అలా ఉంది

అంటాడు. అబ్బే మీ పెంపకం గూర్చి మాకు తెలియదా, ఏదో మాటవరసకు ఓ మాట, మా అబ్బాయి

కి అయితే మీ అమ్మాయి నచ్చింది, మీ అమ్మాయి అభిప్రాయం అనటం తో, రాధ , తన కూతురిని

తట్టి పిలవటం తో, ఆమె తలూపుతుంది. అది ఆమె అంగీకారంగా భావించి అందరు

సంతోషపడతారు.

సీన్ నెం : 6

కాజల్ ఒంటరి గా బాధ పడటం. కొత్త పెళ్లి కొడుకు ఫోన్ చెయ్యటం. కాజల్ చిరాకు పడటం. కాజల్

ఏడుస్తూ షవర్ కింద కూర్చోవటం. ఏదో ఆలోచన వచ్చి సీరియస్ లేచి, బయటకు వచ్చి సుమేర్ కూ

మెసేజ్ చెయ్యటం. రెడీ అయ్యి బ్యాగ్ తీసుకోని బయటకు రావటం. బయటకు వస్తుంటే తల్లి

కనిపించటం. తల్లి మాటలాడటం. కాజల్ తిరిగి ఏదో చెప్పటం. తల్లి ఊపటం. కాజల్ ఇంటి నుంచి

బయటకు వెళ్ళిపోవటం.
v.o
ఒక్కసారిగా తన లైఫ్ లో వచ్చిన మార్పులకూ కాజల్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ప్రాణానికి ప్రాణం

ప్రేమించిన ప్రియుడు ఒక వైపు, తన మీదే పూర్తి నమ్మకాలు పెట్టు కున్న తల్లితండ్రు లు ఒక వైపు. తన

తండ్రి లాగే, కాజల్ కూడా ఆవేశపూరితమైన నిర్ణయాన్ని తీసుకుంది. వెంటనే సుమేర్ కి మెసేజ్

చేసింది, ఫలానా చోట నీ కోసం ఎదురుచుస్తుంటానని. రెడీ అయ్యి బ్యాగ్ తీసుకోని తన రూమ్

నుండి బయటకు వస్తే, ఎదురుగా తల్లి ఉండటం తో, కాలేజీ లో రికార్డు సబ్మిట్ చేసి వస్తా నని

చెప్తుంది. తల్లి, నాన్న గారు నిన్ను బయటకు పంపవద్దు అన్నారు, ఆయన వచ్చే లోపు ఇంటికి తిరిగిరా

అనటం తో, కాజల్ సరే అని బయటకు వెళ్తుంది.

సీన్ నెం : 7

కాజల్ ఏదో ఆలోచిస్తూ ఎదురుచూస్తూ ఉండటం. సుమేర్ రావటం. చాలా కాలం తరువాత సుమేర్

ని చూడటం తో ఒక్క సరిగా ఏడవటం. ఏడుస్తూ ఏదేదో చెప్పటం. సుమేర్ షాక్ అవ్వటం. సుమేర్

వారించటం. కాజల్ , సుమేర్ చెప్పేది వినకపోవటం. కాజల్, తన బ్యాగ్ లో ఉన్న వెడ్డింగ్ కార్డు సుమేర్

కి చూపించటం. సుమేర్ తల పట్టు కోవటం. మళ్ళి కాజల్ ఏదో చెప్పటం. ఇద్దరు కలిసి బైక్ మీద

వెళ్ళటం. కాజల్ అతన్ని హాగ్ చేసుకొని ఏదో ఆలోచిస్తూ ఉండటం. బండి ఒక కెమికల్ షాప్ ముందు

ఆగటం. సుమేర్ లోపలి వెళ్లి ఒక ప్లా స్టిక్ డబ్బా తీసుకోని బయటకు రావటం. ఇద్దరు కలిసి అక్కడి

నుండి వెళ్ళటం.
v.o :

కాజల్, సుమేర్ కోసం ఎదురుచూస్తుంది. సుమేర్ రావటం తో, అతన్ని గట్టిగా హాగ్ చేసుకొని భోరున

ఏడుస్తుంది కాజల్. నా వల్ల అవటం లేదు, నిన్ను వదులుకోలేకపోతున్న, అలా అని నాన్న మాటకి

ఎదురు చెప్పలేకపోతున్న. పెళ్లి కార్డ్స్ కూడా వచ్చాయి కాని నా పేరు పక్కన, నీ పేరు కాకుండా,

ఇంకొక పేరు ఊహించుకోలేకపోతున్నాను. అన్ని ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను, మనం

చచ్చిపోదాం అంటుంది. సుమేర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆమెని వారించే ప్రయత్నం చేస్తా డు
కాని ఆమె వినకపోవటం పోగా, నీకు నా మీద ప్రేమ లేదా... నేను సూసైడ్ చేసుకుంటే... నువ్వు

హ్యాపీగా ఉండగలవా?" అని అడిగింది. ఉండలేనన్నట్లు తల ఊపటం తో, అందుకే ఇద్దరం

చచ్చిపోదాం అంటుంది.  చివరికి సుమేర్ తప్పక సరే అంటాడు. ఇద్దరు అక్కడి నుంచి బైక్ మీద

వెళ్ళిపోతారు. కాజల్ అతన్ని హాగ్ చేసుకొని ధీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది.

సీన్ నెం : 8

కాజల్, సుమేర్ లు ఒక రూమ్ కి వెళ్ళటం. వెంట తెచ్చిన కూల్ డ్రింక్ లో సుమేర్ వైట్ పౌడర్

కలపటం. ఇద్దరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి హాగ్ చేసుకోవటం. కాజల్ ఏడవటం. సుమేర్ కళ్ళు

తుడవటం. సుమేర్ ముందుగా తాగటం. సుమేర్ గొంతు పట్టేసినట్టు , పొట్టలో తిప్పేస్తు న్నట్లు  నటిస్తూ

పడిపోవటం. (ఇక్కడ కట్ రావాలి. ఇక్కడ నుండి మిగిలినది క్లైమాక్స్ లో ట్విస్ట్ రెవీల్ చేసినప్పుడు

చూపించాలి.) కాజల్, సుమేర్ ని గమనించటం. సుమేర్ దొంగ చూపులు చూడటం. కాజల్ కి ఏదో

అనుమానం రావటం. సుమేర్ ని నిలదియటం. కాజల్, సుమేర్ వాదులాడుకోవటం. సుమేర్ కోపం

గా ఆమె ని మంచం మీదకు నెట్టటం. దిండు తీసుకోని ఆమెని చంపటం. హోటల్ సిబ్బంది రావటం.

సుమేర్ పడిపోయినట్లు ఆక్ట్ చెయ్యటం. పోలీసులు రావటం.


v.o :

ఇద్దరు ఒక హోటల్ లో రూమ్ కి వచ్చారు. మనమేన్నా తప్పు చేస్తు న్నామా ? అని సుమేర్ అడగటం

తో, మనకి ఇంకేమన్నా ఒప్షన్స్ ఉన్నాయా అని కాజల్ అడుగుతుంది. సుమేర్ తల అడ్డంగా ఊపటం

తో, కాజల్ అతన్ని హాగ్ చేసుకొని ఏడుస్తుంది. సుమేర్ తన పాటు తెచ్చిన, మత్తు పదర్దా న్ని కూల్

డ్రింక్ లో కలిపి, కాజల్ కి ఒకటి ఇచ్చి, అతడు ఒకటి తీసుకుంటాడు. కాజల్ తాగబోతుంటే ఆపి ,

ముందు నేను తాగి చనిపోతాను. ఎందుకంటే నువ్వు చనిపోతూ ఉంటే నేను చూడలేను అంటాడు.

ఆ మాటకి కాజల్ కంటి వెంట అప్రయత్నంగా నీరు కారుతుంది. సుమేర్, ఆమె కంటి నీటిని తుడిచి

ఆ కూల్డ్రింక్ ని తాగేస్తా డు. అతని కళ్ళు మూతపడతాయి.


సీన్ నెం : 9

హాస్పిటల్ లో సుమేర్ ఉంటాడు. అతనికి సెలైన్ ఎక్కిస్తుంటారు. సడన్ గా మెలుకువ వస్తుంది. కేకలు

వేస్తా డు. పోలీసులు వస్తా రు. సుమేర్ కేకలు వేస్తూనే ఉంటాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ సుమేర్ ని గట్టిగా

ఒకటి కొడతాడు. సుమేర్ భయపడతాడు. అక్కడ ఉన్న ఆశ్చర్యంగా చూస్తా రు. ఇన్స్పెక్టర్ చేయి

చాపితే కాన్స్టేబుల్ పోస్ట్ మార్టెం, రిపోర్ట్ ఇస్తా డు. దాన్ని సుమేర్ మొఖాన విసిరేస్తా డు. సుమేర్ లేచి

పారిపోబోతుంటే పోలీసులు పట్టు కొని జీప్ ఎక్కించుకొని వెళతారు. ఇంటరాగేట్ చెయ్యటం. సుమేర్

అమాయకంగా ఆక్ట్ చెయ్యటం. 2 దెబ్బలు కొట్టక నిజం చెప్పటం.


v.o .

స్పృహ తప్పి పడి ఉన్న సుమేర్ ని హాస్పిటల్ లో జాయిన్ చేస్తా రు. సుమేర్ కి స్పృహ లోకి వచ్చి, కాజల్

చనిపోయింది అన్న విషయం తెలిసి , నన్నెందుకు బతికించావు దేవుడా, నా కాజల్ లేకపోతే, నేను

బ్రతకలేను అని హృదయ విదారకంగా , గుండెలు పగిలేలా ఏడుస్తా డు. చూసిన వాళ్ళు జాలి

పడతారు. ఇంతలో ఇన్స్పెక్టర్, అతని సిబ్బంది తో హాస్పిటల్ కి వస్తా డు. ఇన్స్పెక్టర్ ని చూసి కూడా

సుమేర్, గట్టిగా ఏడుస్తూనే ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఎవరు ఊహించని విధంగా గట్టిగా ఒకటి కొడతాడు.

ఆ సౌండ్ కి అందరు షాక్ అయ్యి చూస్తే, ఇన్స్పెక్టర్, కాజల్ పోస్ట్ మార్టెం రిపోర్ట్ ని, సుమేర్ మొఖాన

విసిరి అతన్ని కాలర్ పట్టు కొని జీప్ లో పడేస్తా డు. స్టేషన్ కి తీసుకోని వెళ్లి, సుమేర్ ని తమదైన స్టైల్ లో

విచారిస్తే అసలు నిజం కక్కాడు.

సీన్ నెం 8 (కంటిన్యూ) :

కాజల్, సుమేర్ ని గమనించటం. సుమేర్ దొంగ చూపులు చూడటం. కాజల్ కి ఏదో అనుమానం

రావటం. సుమేర్ ని నిలదియటం. కాజల్, సుమేర్ వాదులాడుకోవటం. సుమేర్ కోపం గా ఆమె ని

మంచం మీదకు నెట్టటం. దిండు తీసుకోని ఆమెని చంపటం. హోటల్ సిబ్బంది రావటం. సుమేర్

పడిపోయినట్లు ఆక్ట్ చెయ్యటం. పోలీసులు రావటం.

v.o :
కాజల్, సుమేర్ చనిపోలేదు, నటిస్తు న్నాడు అని కనిపెట్టి, అతన్ని నిలదీయటం తో అతను, నాకు

ఇప్పుడే చనిపోవాలని లేదు, నువ్వు కావాలంటే చావు, నన్ను వదిలేయి అని అక్కడ నుండి

వెళ్లబోతుంటే, కాజల్ ఆపటం, వాళ్ళ మధ్య గొడవ మొదలయ్యింది. సుమేర్ లో మూర్ఖత్వం

పెరిగిపోయింది. అతని లో ఉన్న రాక్షసత్వం బైటకి వచ్చింది, ఆమె గొంతు నులిమి చంపాడు. ఆమె

చనిపోయాక, అతని లో భయం మొదలైంది. ఆమె మరణాన్ని ఆత్మహత్య గా చిత్రించటానికి

విశ్వప్రయత్నం చేసాడు. కాని అతను చేసిన పాపం, పోస్ట్ మర్టెం రిపోర్ట్ లో బయటపడింది.

అనాలోచితంగా మరణం తో సమస్య లని పరిష్కరించుకోవచ్చు అనుకునుంది కాజల్ కాని రానున్న

సమస్యలను గుర్తించలేదు. సుమేర్, స్వార్ధం తో తను మాత్రమే బ్రతలనుకున్నాడు, వేరే ప్రయత్నాల

ద్వారా కాజల్ మనసు మార్చే ఆలోచన చెయ్యలేదు. ఏది ఏమినప్పటికి ఒక అనాలోచిత ఆలోచన,

ఒకరికి మరణనాకి దగ్గర చేస్తే, ఇంకోకరి జీవితాన్ని శాశ్వతంగా చీకటి చేసింది.

You might also like