Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

*ఓం శ్రీ గురుభ్యో నమః - హరిః ఓం*

సూర్యభగవానుని ప్రార్థన
యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః !
ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహమ్ !!

*కాలము - దశాంగములు*
పఞ్చాఙ్గము కాలగణనకు చాలా ముఖ్యము. పఞ్చాఙ్గము అంటే 5 అంగములు అవి తిథి వార నక్షత్ర
యోగ కరణములు. కాల భాగములు మరొక 5 వీటితో కలిసి దశాంగములు (మొత్తము 10)
అవుతాయి. అవి,
1.సంవత్సరము 2.అయనము 3.ఋతువు 4.మాసము 5.పక్షము 6.తిథి 7.వారము 8.నక్షత్రము
9.యోగము 10.కరణము

*సంవత్సరము*
భూమి సూర్యభగవానుని చుట్టు ఒక ప్రదక్షిణము పూర్తి చేయటానికి పట్టు కాలము సంవత్సరము.
సంవత్సరములు 60, అవి
1.ప్రభవ 2.విభవ 3.శుక్ల 4.ప్రమోదూత 5.ప్రజోత్పత్తి 6.ఆంగీరస 7.శ్రీముఖ 8.భవ 9.యువ
10.ధాత

11.ఈశ్వర 12.బహుధాన్య 13.ప్రమాథి 14.విక్రయ 15.వృక్ష 16.చిత్రభాను 17.స్వభాను 18.తారణ


19.పార్థివ 20.వ్యయ

21.సర్వజిత్ 22.సర్వధారి 23.విరోధి 24.వికృతి 25.ఖర 26.నందన 27.విజయ 28.జయ


29.మన్మథ 30.దుర్ముఖి

31.హేవలంభి 32.విలంబి 33.వికారి 34.శార్వరి 35.ప్లవ 36.శుభకృత్ 37.శోభకృత్ 38.క్రోధి


39.విశ్వావసు 40.పరాభవ
41.ప్లవంగ 42.కీలక 43.సౌమ్య 44.సాధారణ 45.విరోధికృత్ 46.పరీధావి 47.ప్రమాదీచ
48.ఆనంద 49.రాక్షస 50.నల

51.పింగళ 52.కాళయుక్త 53.సిద్ధార్థి 54.రౌద్రి 55.దుర్మతి 56.దుందుబి 57.రుధిరోద్గారి 58.రక్తాక్షి


59.క్రోధన 60.అక్షయ

*అయనము*
సంవత్సరములో సగ భాగము అయనము అవుతుంది. భూమి సూర్యభగవానుని చుట్టు తిరిగే దీర్ఘ
వృత్తాకార కక్ష్యలో సగభాగము తిరుగుటకు పట్టు కాలము. అయనములు 2 అవి,
1.ఉత్తరాయణము 2.దక్షిణాయనము

*ఋతువు*
సంవత్సరములో 6 వ భాగము ఒక ఋతువు
1.వసంత ఋతువు 2.గ్రీష్మ ఋతువు 3.వర్ష ఋతువు 4.శరదృతువు 5.హేమంత ఋతువు 6.శిశిర
ఋతువు

*మాసము*
సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది, చాంద్రాయనమున మాసము
అంటే చంద్రుడు భూమి చుట్టి రావడానికి పట్టు సమయము దాదాపు 28 (27.322 రోజులు)
రోజులు. ఇవి ఒక ఋతువుకు 2 మాసములు, అంటే సంవత్సరముకు మొత్తము 12 మాసములు
అవి,
1.చైత్రము 2.వైశాఖము 3.జ్యేష్టము 4.ఆషాడము 5.శ్రావణము 6.భాద్రపదము 7.ఆశ్వయుజము
8.కార్తికము 9.మార్గశిరము 10.పుష్యము 11.మాఘము 12.ఫాల్గుణము
*పక్షము*
మాసములో సగము పక్షము అనబడును. మాసముకు రెండు పక్షాలు అవి కృష్ణపక్షము మరియు
శుక్ల పక్షము.
1. అమావాస్య ముందు పదిహేను రోజులు కృష్ణపక్షము
2. పౌర్ణమి ముందు పదిహేను రోజులకు గుర్తు శుక్ల పక్షము.
అంటే అమావాస్య తదుపరి పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షము
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షము.

*తిథి*
రాశి చక్రములో సూర్య చంద్రుల మధ్య గల దూరము ఆధారంగా నిర్ణయించినది తిథి. చంద్రుడు
సూర్యునికి దగ్గరగా వచ్చుకాలము కృష్ణపక్షము దూరముగా వెల్లు కాలము శుక్ల పక్షము. ఒక్కో
పక్షములో పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి
పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి,
ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి / అమావాస్య

*వారము*
ఉదయాత్ ఉదయం వారం, సూర్యోదయము నుండి సూర్యోదయమునకు గల కాలము వారము
(ఒక దిన ప్రమాణము) అనబడును. ఇవి 7.
వారములు : ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
*నక్షత్రము*

చంద్ర సూర్య గమనము ఆధారముగా ఏ ఏ కాంతి మండలాలపై సంచరిస్తున్నారో ఆయా కాంతి


మండలాలకు నక్షత్రములని పేరు. మొత్తము 27 నక్షత్రములు. ఒక నక్షత్రముకు 360/27 = 13.333
డిగ్రీలు. నక్షత్రములు 27 అవి
1.అశ్వని 2.భరణి 3.కృత్తిక 4.రోహిణి 5.మృగశిర 6.ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష
10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర ఫల్గుణి 13.హస్త 14.చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట
19.మూల 20 పూర్వాషాఢ 21.ఉత్తరాషాఢ 22.శ్రవణ 23.ధనిష్ఠ 24.శతభిష 25.పూర్వాభాద్ర
26.ఉత్తరాభాద్ర 27.రేవతి

*యోగము*

సూర్య చంద్రుల రేఖాంశముల కలయిక నక్షత్ర ప్రమానముతో భాగించగా వచ్చిన దానికి యోగము
అని 27 నక్షత్రముల ఆధారంగా 27 యోగములు

1.విష్కంభము 2.ప్రీతి 3.ఆయుష్మాన్‌4.సౌభాగ్యము 5.శోభనము 6.అతిగండము 7.సుకర్మము 8.ధృతి


9.శూలము 10.గండము 11.వృద్ధి 12.ధ్రువము 13.వ్యాఘాతము 14.హర్షణము 15.వజ్రము
16.సిద్ధి 17.వ్యతీపాత్‌ 18.వరియాన్‌ 19.పరిఫమ 20.శివము 21.సిద్ధము 22.సాధ్యము
23.శుభము 24.శుభ్రము 25.బ్రహ్మము 26.ఇంద్రము 27.వైధృతి.

వీటిలో, విష్కుంభ, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ మరియు వైధృతి
అనునవి తొమ్మిది నింద్యములు
*కరణము*

ఒక తిథిలో సగభాగము కరణము. ఒక తిథికి 2 కరణములు ఏర్పడతాయి. తిథి అంటే 12° కనుక ప్రతి
6° కు ఒక కరణం వస్తుంది.

1.బవ 2.బాలవ 3.కౌలవ 4.తైతుల 5.గరజి 6.వరాజి 7.భద్ర 8.శకుని 9.చతుష్పాత్‌10.నాగవము


11.కింస్తుఘ్నము

వీటిలో మొదటి 7 చర కరణాలు, చివరి 4 స్థిర కరణాలు. స్థిర కరణములు నింధ్యములు

**************************************************
*కాల విభజన*
ఒక రోజుకు 24 గంటలు
1 గంటకు 60 నిమిషములు
1 నిమిషముకు 60 క్షణములు

ఒక రోజుకు 60 ఘడియలు
1 ఘడియకు 60 విఘడియలు
1 విఘడియకు 60 లిప్తలు

1 ఘడియకు 24 నిమిషములు
1 విఘడియకు 24 క్షణములు

రెందున్నర ఘడియలు ఒక గంట


రెందున్నర విఘడియలు ఒక నిమిషము
రెందున్నర లిప్తలు 1 క్షణము
24 నిమిషములు ఒక ఘడియ
రెందున్నర ఘడియలు ఒక గంట అంటే
2.5 × 24 నిమిషములు (1 ఘడియ) = 60 నిమిషములు= 1 గంట.

**************************************************
*తెలుగు సంఖ్యలు*
పంచాంగములో ఘడియలు విఘడియలు తెలుగు సంఖ్యలతో గంటలు నిమిషములు ఆంగ్ల
సంఖ్యలతో సూచిస్తారు.

1 – ౧ ఒకటి
2 – ౨ రెండు
3 – ౩ మూడు
4 – ౪ నాలుగు
5 – ౫ అయిదు
6 – ౬ ఆరు
7 – ౭ ఏడు
8 – ౮ ఎనిమిది
9 – ౯ తొమ్మిది
10 – ౧౦ పది
**************************************************
*స్వస్తి*

You might also like