Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

యాచన కన్న యోచన మిన్న

శివుడు ఆది భిక్షువు. ఆయన ఎంతగొప్పవాడైన భిక్షాటన మాత్రం తలవంపు పనే . ఆయన కది తలవంపు కాక పోయినా ఆయన
భార్య పార్వతికి మాత్రం చిన్నతనంగానే తోచింది. అవును మరి. మగడు బిచ్చగాడైతే ఆలికి తలవంపే కదా! ఎలాగైన ఆయన్ని
మాన్పించాలి. ఎంతో ఆలోచించింది. ఆయనకు ఎలా నచ్చ చెప్పాలో నిర్ణయించుకుంది . చివరికి ఇలా సలహా ఇచ్చింది.
" ఏవండి! మీరు శ్రీ రాముని దగ్గరకు వెళ్లండి. కొంచెం భూమి ఇమ్మని అడగండి. ఆయన కాదనడు. తప్పకుండ కొంతభూమి
ఇస్తా డు. ఇక కుబేరుడు మీకు ఆప్తమిత్రు డే కదా! ఆయన్నడిగి విత్తనాలు తెచ్చుకోండి. బలరాముడున్నాడు. ఆయనదగ్గరకెళ్లి
నాగలి ఇమ్మని అడగండి. తప్పకుండ ఇస్తా డు. కాదనడు. యమధర్మరాజు దగ్గరకెళ్లి దున్నపోతునడిగి తీసుకు రండి. మన దగ్గర
ఒక ఎద్దు ఉండనే ఉందికదా! ఆ రెండు నాగలికి రెండుప్రక్కల కట్టడానికి సరిపోతాయి. ఇక మీదగ్గరున్న త్రిశూలం నాగలికి కర్రు గా
ఉపయోగపడుతుంది. (నీళ్ల బెడద లేనేలేదు. ఎందుకంటే ఆయన నెత్తి మీద గంగ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. గంగ సవతి
కాబట్టి పార్వతీదేవి ఈ విషయం ప్రస్తా వించలేదు. ఆమె ప్రస్తా వించక పోయినా అందరికి ఇది తెలిసిన విషయమే). నేనే మీకు
స్వయంగా అన్నం వండి పట్టు కొస్తా ను. మన అబ్బాయి కుమార స్వామి ఎద్దు ని దున్నపోతుని రోజు మేపుకొస్తా డు. మీరు
భిక్షాటనకు పోతుంటే నాకు చాల తలవంపుగ ఉంది. నేనెంతో బాధ పడుతున్నాను. మీరు దయచేసి నా బాధని అర్థం చేసుకోండి.
నేటి నుంచి యాచన మాని వ్యవసాయం చెయ్యాలనే యోచన చెయ్యండి " అనే పార్వతి పలుకులు అందరికి మేలు చేకూర్చు
గాక అని ఒక కవి అద్భుతమైన ఒక శ్లోకం వ్రాశాడు.
ఈ శ్లోకం కష్టపడి పనిచెయ్యడంలో ఉండే సంతృప్తిని హుందాతనాన్ని సూచిస్తోంది. ఈ నాడు సమాజంలో ఏ పని పాట లేకుండ
ఏదోవిధంగ కాలం గడుపుతున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇతరుల సంపాదనపై ఆధారపడి కాలం వెళ్ల బుచ్చుతున్నవాళ్లు కూడ
ఎంతోమంది లేకపోలేదు. అలాగే అర్థంలేని ఆర్భాటాల కోసం తమ భర్తల్ని అక్రమసంపాదనకు పురిగొల్పే భార్యామణులు కూడ
మనకు కనిపిస్తా రు. అదేవిధంగా భార్యమాటలకు లోనై రెండుచేతులా అక్రమంగా సంపాదిస్తూ చివరకు రెండు చేతులకు సంకెళ్లు
వేయించుకుని జైలు పాలైన వాళ్లు కూడ మనకు కనిపిస్తు న్నారు. పార్వతి ఈ శ్లోకం ద్వార తనభర్తకిచ్చే సందేశం అందరకు
ఆదర్శం కావాలి. మహిళాలోకమంత పార్వతి లాగ తమభర్తల్ని మంచి సలహాలతో ముందుకు నడిపిస్తే సమాజంలో
సుఖశాంతులకు ఎటువంటి లోటు ఉండదు. ఇంతా చదివి ఆ శ్లోకం చదవకపోతే ఏమీ బాగుండదు .
రామాద్యాచయ మేదినీం, ధనపతేర్బీజం, బలాల్లాంగలం
ప్రేతేశాన్మహిషం, తవాస్తి వృషభ:, ఫాలం త్రిశూలం తవ
శక్తా హం తవ చాన్నదాన కరణే, స్కందోస్తి గోరక్షణే,
ఖిన్నాహం తవ భిక్షయా, కురు కృషిం గౌరీవచ: పాతు వ: .
*****

You might also like