Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

ఆత్మయొక్కస్వస్వరూపం

ఈ ప్రపంచంలోని సమస్తజీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు మాత్రమే కాదు. శరీరం


నశించినా కూడా నాశనం చెందని చైతన్యం ఒకటి ఉంది, ఆ నాశరహితమైన చైతన్యాన్నే "ఆత్మ"
అంటారు. ఆత్మఅంటే తెలియక చాలామంది దానిని దయ్యమని, భూతమని ఇలా దానికి లేనిపోని
రూపాలను సృష్టించి నిజమైన ఆత్మస్వరూపాన్ని మరియు ఆత్మ యొక్క అర్థా న్ని మారుస్తు న్నారు.

‘ఆత్మ’అనే పదం ప్రతీ ధర్మగ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ దాని అర్థా న్ని అంతరార్థా న్ని

సరిగ్గా గ్రహించలేక విపరీతార్థా లను చెబుతూ చాలా మంది వారు స్వయంగా అయోమయానికి

లోనౌతూ తమ చుట్టూ ఉన్నవారిని కూడా అయోమయంలోకి నెట్టేస్తు న్నారు. మతగ్రంథాలలోని

సూక్ష్మమైన రహస్యాలను బోధించేవారికి సైతం ఇది ఎలా ఉంటుందో తెలియదు.

ఆత్మస్వరూపం గురించి శ్రీకృష్ణపరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు “ఎవరో ఒక


మహాపురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైనదానినిగా చూచును. మరియొక
మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని
ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో, చూచినవారిలో, చెప్పిన వారిలో కూడా

కొందరు మాత్రమే దీనిని గూర్చి పూర్తిగా యెరుగుదురు”.(2:29)

ముండకోపనిషత్తు లో ఆత్మను గురించి ,"జ్యోతిస్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం.


అణువుకంటే సూక్ష్మం. అంతటా వ్యాపించినదీ, అత్యంత సూక్ష్మమైనదీ, సృష్టికి
మూలకారణమైనది అని తెలిపుతుంది. అపరిమితమైన జ్యోతిస్వరూపం అయిన ఆత్మలో

ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం, అది ఈ శరీరలోనే ఉన్నది."

ఆత్మచైతన్యం దేహం అంతా వ్యాపించి జ్ఞానేంద్రియాలకు, మనస్సుకు, బుద్దికి అన్నింటికీ


పని చేసే శక్తిని ఇస్తుంది. అందువలన ఆత్మే పని చేస్తోంది అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆత్మ
ఏ పనీచేయదు. మనకు సంక్రమించిన కర్మల వలన వచ్చే బాధలకు, సుఖాలకు ఆత్మకు
సంబంధంలేదు . అన్ని భావాలను తెలియచేసేది ఆత్మచైతన్యము. ఆ ఆత్మచైతన్యం కేవలం చూస్తూ
ఉంటుంది. కానీ అనుభవాన్ని పంచుకోదు. అంటే ఆత్మ సాక్షిగా ఉంటుంది. ఆత్మకు కర్తృత్వం ,
భోక్తృత్వం లేదు. దేహము, ఇంద్రియాలు జడస్వరూపమైనవి. ఇవి అన్నీ కూడా ఆత్మ చైతన్యం
వలనే వాటి పనులు చేస్తా యి. ఆత్మ వాటిని ప్రకాశింపచేస్తుంది. ప్రకాశాన్నిచ్చేది, ప్రకాశింపబడేది
ఒక్కటి కాదు, కాలేదు! జడస్వరూపాలైన ఈ ఇంద్రియాలు ఆత్మను తెలుసుకోలేవు. ఆ
ఆత్మచైతన్యం అన్నింటినీ సాక్షిగా చూస్తుంటుంది,అనుభవాలను మాత్రం పంచుకోదు.

మానవుడు తన జీవితకాలంలో ఈ ఆత్మను గురించిన జ్ఞానాన్ని పొందడం సాధ్యమేనా


అంటే, సద్గురువు కృప ఉంటే సాధ్యపడుతుంది. సంపూర్ణ హరదేవ వాణిలో బాబాజీ తెలిపినట్లు గా
-
ఈ జ్ఞానదర్పణమును ఆత్మకు గురువు చూపించనంతవరకు

తెలుసుకోలేడు మానవుడు దీని అసలు స్వరూపం ఏమిటని

జ్ఞానదర్పణాన్నిపొందు సద్గురువు నుండి నిన్ను నీవు తెలుసుకోగలవు

హరదేవుని మాటిది మానవుడా నీవు ఈ పరమేశ్వరుని గుర్తించగలవు

ఎవరైతే ఆత్మజ్ఞానం ద్వారా వారి హృదయాలలో భగవంతుడిని సాక్షాత్కరించున్నారో వారికి


మాత్రమే ఆత్మతత్త్వము అంటే ఏమిటో, అసలు ఈ సృష్టికి మూలకారణమైన శక్తి ఏమిటో
తెలుస్తుంది. ఆత్మజ్ఞానమే మోక్షానికి మార్గం. మనల్ని మనం తెలుసుకునే జ్ఞానమే ఆత్మజ్ఞానం.
జ్ఞానం కలిగి మోక్షం సిద్దించేంత వరకు ఎన్ని జన్మలైనా కలుగుతూనే ఉంటాయి. ఆ జన్మలు ఇన్ని,
ఇవి అని చెప్పడం సాధ్యంకాదు. రానున్నజన్మలు మానవజన్మ అని చెప్పలేము. కారణం ప్రస్తు త
జన్మలో మనం చేసుకున్న కర్మఫలితంగా వచ్చే జన్మ అధారపడి ఉంటుంది.

"ఆత్మజ్ఞానం" అంటే "ఈ శరీరమే నేను" అని నమ్మే మానవుని యొక్క మనస్సులోని
భ్రమలను బ్రాంతులను తొలగించి తన స్వస్వరూపమైన ఆత్మ అనే ఆనందసాగరంలో ఏకం
చెయ్యడమే. మానవుని మనసులోని ప్రాపంచిక విషయాలే అతని దుఃఖానికి కారణం. ఎప్పుడైతే ఆ
విషయవాసనలు తొలగిపోతుందో అప్పుడు మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందుతాడు.
శరీరం, మనస్సుతో అనుభవించే ఆనందాలను అయితే శరీరంలో భాగమయిన నాలుకతో
మాటల ద్వారా వర్ణించగలము. కానీ ఆత్మానందం శరీరానికిగాని, మనస్సుకు గాని అందేది
కాదు. కాబట్టి మనం దానిని మాటలలో వర్ణించలేము.
ఇక్కడ దేనికీ మరణమూ లేదు

దేనికీ జననమూ లేదు

ఉన్నది కేవలం ఏకైక నిరాకార "చైతన్యమే"

అదే అన్ని జీవులలో ఉన్న "ఆత్మ"

కదిలేదీ అదే – కదిలించేది అదే

అజ్ఞానం తొలిగాక మానవుని అనుభవం ఇదే. దీన్నిమించి నమరొక అనుభవము కానీ


సత్యము కానీ లేదు అని సంతులు తెలుపుతున్నారు.

You might also like