Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

మలబద్ధ కం గురించి వివరణ - నివారణా యోగాలు .

మలబద్ద కం అనేది సమస్త రోగాలకు మొదటి మెట్టు . మలం గాని ఆమం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన
శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గ ము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్ద కం
అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి "ఆనాహము" అని పిలుస్తా రు .

మలబద్ద కం సమస్య వలన నడుము , వీపు నందు పట్టు కొని ఉండటం , కడుపునొప్పి , ఆయాసము , వాంతి వంటి
లక్షణాలు వస్తా యి. దప్పిక , జలుబు , శిరస్సు నందు మంట , రొమ్ము పట్టినట్లు ఉండటం , తేన్పులు పైకి రాకుండా
ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్ద కం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు
వస్తా యి.

ఇప్పుడు మీకు మలబద్ద కం నివారణాయోగాలు వివరిస్తా ను .

నివారణాయోగాలు -

* రాచ ఉశిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును.

* కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును.

* ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను .

* చింతపండు చారు అద్బుతముగా పనిచేయును . అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును .

* బాగా పండిన అరటిపండు తినుచుండవలెను .

* నాగజెముడు , బొ ంతజెముడు , ఆకుజెముడు రసము 10 చుక్కలు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. శరీర


బలమును అనుసరించి 5 నుంచి 10 చుక్కలు తీసికొనవలెను .

* విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను . ఆముదం
తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను .

* రోజూ నిద్రపో యే ముందు రాత్రి సమయములో రెండు గ్లా సుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా
తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి
వచ్చి సాఫీగా జరుగుతుంది.

* సునాముఖి చూర్ణం చెంచాడు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును.

మలబద్ద కం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తు త కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ
అయ్యింది . ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం . వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను . ఋతువు
మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది.

చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది . అనే అపో హలో ఉంటారు. రోజుకి
రెండుసార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను . మనం తీసుకునే ఆహారం కూడా
మలబద్ద కం సమస్య రాకుండా ప్రధానపాత్ర పో షిస్తు ంది. ముఖ్యముగా నీరుని తీసుకోవడం , లేత ముల్ల ంగి , మునగ
ఆకులు , మునగకాయ , కాకరకాయ , పొ న్నగంటి కూర , ద్రా క్ష , వెల్లు ల్లి , ఆవుపాలు , ఆముదము , ఉలవకట్టు ,
పాతబియ్యం , నెయ్యి , వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధా లు అధికముగా తీసికొనవలెను .
పళ్ల రసాలు కంటే పళ్లు తినటం మంచిది .

శరీరము నుండి వ్యర్థపదార్థా లు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లి నప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పో గుపడవు . శరీరం
ఆరోగ్యకరంగా ఉండును.

గమనిక -

నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రా చీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల
యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టు పక్కల దొ రికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను
నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత
250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తు న్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా
ప్రచురించాను.

మన చుట్టు పక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొ మ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం
జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్ల ని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం ,
ముహూర్తా లను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు
మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు
సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన
ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రా చీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద
మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం
.పుస్త కములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో
ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టు గా 9885030034 నెంబర్ కి ఫో న్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్


సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

You might also like