హైమండాఫ్

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

హైమండాఫ్

క్రిస్టో ఫర్ వాన్ ఫ్యూరర్ హైమండాఫ్ (Prof.Christoph von Fürer-Haimendorf) (1909-1995) [1] లండన్
విశ్వవిద్యాలయానికి చెందిన మానవశాస్త ్ర ఆచార్యుడు. 1940లో కొమరం భీం అనే గోండు విప్ల వకారుడు నిజాం
నిరంకుశత్వంపై, దో పిడీ విధానాలపై తిరుగుబాటును లేవదీశాడు. సాయుధ బలగాలను పంపి, కొమరంభీంని,
అదిలాబాదులోని "జోడేఘాట్" వద్ద కాల్చి చంపినా, గోండులలో చెలరేగిన అలజడిని, అశాంతిని అణచలేకపో యారు. ఈ
అశాంతి కారణాలను విశ్లేషించి, తగు సూచనల నివ్వవలసిందిగా అప్పటి నిజాం ప్రభుత్వం, లండన్ విశ్వవిద్యాలయంలో
మానవశాస్త ్ర (Anthropology) విభాగాధ్యక్షుడైన హైమండాఫ్ ను కోరింది. పరిశీలన కోసం వచ్చిన మనిషి, గోండుల
దైన్యాన్ని చూసి, కరిగిపో యి, ఆ సమస్యల పరిష్కారాన్ని అన్వేషిస్తూ , మార్ల వాయి గ్రా మంలో ఏళ్ళతరబడి
ఉండిపో యాడు. ఆయన పుణ్యమా అని, గోండులకు భూమిపై హక్కు, పట్టా లూ లభించాయి. వారి అభివృద్ధికై
ప్రపథ ్ర మంగా చట్టా లు చేయబడ్డా యి. ఈ ప్రా ంతాలలో వడ్డీ వ్యాపారం క్రమబద్ధ ం అయింది. వారికి సేవ చేయడమే కాక,
వారి ఆచారవ్యవహారాల గురించీ, సమస్యల గురించీ రెండు పుస్త కాలను వ్రా శాడు హైమండాఫ్. గోండుల గురించి పుస్త క
పరిజ్ఞా నం సంపాదించాలంటే, యీ రోజు వరకు, యీ పుస్త కాలు తప్ప వేరే లేవు.

హైమండాఫ్
ఆయన సతీమణి ఎలిజిబెత్ బర్నార్డో (బెట్టీ), లండన్ లో పుట్టిపెరిగినా, తన భర్త తో పాటు 1940 నుండి ఏళ్ళ తరబడి
ఆదిలాబాద్ అడవుల్లో గుర్రం మీద, కాలినడకన తిరుగుతూ, హైమండాఫ్ కు పరిశోధనలో తోడ్పడటమే కాకుండా,
ఆదివాసుల సమస్యలను మాతృదృష్టితో అవగాహన చేసుకొని, ఆ సమస్యల పరిష్కారానికి పై అధికారులకు వ్రా సి, సేవ
చేసిన వనిత. ఆమె 1987లో హైదరాబాదులో చనిపో యినప్పుడు, హైమండాఫ్ "నాకూ, ఆవిడకూ అర్థవంతమైన జీవితం
గడిచింది గోండుల మధ్యనే. మేము కలిసి నివసించిన మార్ల వాయి గ్రా మంలో గోండుల ఆచారాల ప్రకారం అంత్యక్రియలు
జరగాలి" అన్నాడట.

గోండులలో మెసం్ర వంశీయుల ఆరాధ్యదైవం నాగోబ దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో
ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌దగ్గ ర కెస్లా పూర్‌గ్రా మంలో ఉంది. ప్రతి యేటా యీ నాగోబా జాతర జరుగుతుంది.
కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో "దర్బార్‌" ఏర్పాటు
చేయాలని ప్రొ ఫెసర్ హైమండాఫ్ అనుకొని, మొదట 1946 లో దర్బార్‌ను నిర్వహించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత
జిల్లా కలెక్టర్‌ఆధ్వర్యంలో కొనసాగిస్తు న్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల
నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. ప్రొ ఫెసర్ హైమండాఫ్ మొత్త ం మూడు పుస్త కాలను
వ్రా శాడు.అవి : 1. ది గోండ్స్ ఆఫ్ ఆంధ్రపద ్ర ేశ్ : ట్రెడిషన్ అండ్ ఛేంజ్ ఇన్ యాన్ ఇండియన్ ట్రైబ్ (1979;ఢిల్లీ , లండన్) 2.
ఎ హిమాలయన్ ట్రైబ్ ఫ్రమ్ క్యాటిల్ టు క్యాష్ (1980;ఢిల్లీ , బెర్కెలీ) 3. ట్రైబ్స్ ఆఫ్ ఇండియా : ద స్ట గ
్ర ుల్ ఫర్ సర్వైవల్
(2000).

You might also like