Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారా మస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే!

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః!!


అమ్మవారిని డబ్బు ఇమ్మని అర్థించే శ్లోకం ఇది. ఈ శ్లోకం చదివేటప్పుడు చేతులు చాచి ఉంచాలి. వర్షం కురవాలంటే
మేఘాలు అలముకోవాలి. అవి కూడా నీళ్లు నిండిన మేఘాలై ఉండాలి. నీళ్లు నిండుకున్న మేఘాలు అలముకున్నంత
మాత్రాన వర్షం పడుతుందన్న గ్యారంటీ లేదు. గాలి వీయాలి. ఆ గాలి కూడా పైరగాలి లాంటిదై ఉండాలి. వర్షం
కురవాలంటే మేఘాలుండాలి. ధన వర్షం కురవాలంటే ‘అమ్మ వారి కళ్లు ’ అనే మేఘాలుండాలి. నీ దయే దాన్ని
అనుసరించి వీచే గాలి తల్లి! ధన వర్షమే కురవాలి. చాతక పక్షి ఏ నీళ్లో తాగదు కదా! అలాగే నేను కూడా మరో దేవతను
ఆశ్రయించకుండా నిన్నే ఆశ్రయించా! పూర్వ కర్మ సరిగ్గా లేదంటున్నావు కదా! అది చెమట రూపం అనుకో! వర్షం
కురిసే ముందు గాలి వీయగానే చెమట పోయినట్టు గా నీ దయ అనే వర్షం కురిస్తే ఆ పూర్వజన్మ కర్మలన్నీ పోతాయి
కదా! మళ్లీ ఎప్పటికీ ఆ కర్మలు దరిచేరకుండా చేయలేవా తల్లీ! పైరగాలి చెమటను సుగంధం చేసినట్టే భగవానుగ్రహం
మన కష్టా లను సుఖాలుగా మారుస్తుంది.

You might also like