Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

మిత్రు లందరికీ నమస్కారం.

ఒక యెదవని పక్కన పెట్టు kuni, అంతటితో ఆగక వాడి మాట విni, vaadu cheppindi chesthe,
ఎంత గొప్ప వాడైనా సరే ఎంత మంచి వాడైనా సరే చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయం, alaanti vaalla valla raktha
paatham jaragadam antha kante khaayam. ఇప్పుడు నేను అన్నఈ మాటలు 1948 లో హై దరాబాద్ రాజ్యంలో జరిగిన
ఆపరేషన్ పోలో అనే ఘట్టా నికి తాత్పర్యం గ కరెక్టు గా సరిపోతాయి. అసలు ఆపరేషన్ పోలో అంటే ఏమిటి ? అప్పుడు ఎం జరిగింది
అనే విషయాలను "స్టోరీస్ అఫ్ హై దరాబాద్" అనే సిరీస్ లోని ఈ నాలుగవ వీడియో లో తెలుసుకుందాం. మిత్రమా, ఈ నా ఛానల్
కు సబ్స్క్రయిబ్ చెయ్యండి. Ganta kottandi. నేనేం ఊరకనే అడగట్లేదు. మీరు మెచ్చే మీకు నాచే ఎన్నో అంశాలను నేను మీ
ముందుకు తీసుకొస్తా ను. Meeru subscribe chesthe naalanti kotha youtuberski adoka encouragement kuuda.
తప్పకుండా ఈ వీడియోలను షేర్ చెయ్యండి, ఎందుకంటే మన ఊరి కథ అందరికి తెలియాలి కదా. నా పేరు కిషోర్ అనంతరాజు
అండ్ వెల్కమ్ తో మై ఛానెల్ "స్టోరీస్ అండ్ హిస్తొరిఎస్"

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రా లతో మొత్తం దేశం ఏర్పాటు అవుతున్నప్పుడు , హై దరాబాద్ నిజాం మాత్రం తన
రాజ్యాన్ని మన దేశంలో కలపడానికి విముఖత చూపించాడు. అంతే కాక ఆయన రాజ్యం లో ఉన్న రజాకార్ల ఆగడాలు అంత ఇంత
కాదు. ఈ కారణాల చేత స్వాతంత్ర సమరయోధుడు, మరియు అప్పటి మన రక్షణ శాఖ మంత్రి ఐన సర్దా ర్ వల్లభాయ్ పటేల్ గారి
నేతృత్వం లో భారతీయ సైనిక దళాలు, 1948 September lo, నిజాం మీదకు దండెత్తి వచ్చి యుద్ధం చేసి చివరకు హై దరాబాద్ ని
భారత దేశం లో కలిపారు. ఈ యుద్ధం యొక్క కోడ్ నేమ్ "ఆపరేషన్ పోలో"

ఆపరేషన్ పోలో కథలోకి వెళ్లేముందు ఇంకో చిన్న కథ మనం తెలుసుకోవాలి. బ్రిటిష్ వాళ్లకి మన దేశంలో ఉన్న చాలా రాజ్యాల
మధ్యలో " సబ్సిడరీ అలయన్స్" అనే ఒక ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం

1 . ఈ రాజ్యాలకు ఈ రాజులకు బ్రిటిష్ సైన్యం రక్షణ కల్పిస్తుంది. వాళ్ళ రాజ్యాలలో బ్రిటిష్ సైన్యాల క్యాంపులు ఉంటాయి. వాళ్ళిచ్చే
రక్షణకు గాను, ఇక్కడి రాజులు వాళ్ళకి రుసుము చెల్లించుకోవాలి, అంటే మైంటెనెన్సు ఫీజు అన్న మాట. ఒక వేళా రుసుము
చెల్లించలేకపోతే , రాజ్యం లో కొంత భాగాన్ని పెనాల్టీ గ బ్రిటిష్ వారికి ధారాదత్తం చెయ్యాలి.

2 . ఒక బ్రిటిష్ ఆఫిషల్ రెసిడెంట్ ఈ రాజ్యాలలో ఉంటాడు. మన హై దరాబాద్ లో కోటి విమెన్స్ కాలేజీ బిల్డింగ్ లో ఒక రెసిడెంట్
ఉంటాడు.

3 . బ్రిటిష్ వాళ పర్మిషన్ లేకుండా ఈ రాజులు వేరే రాజులతోఇ సంబంధాలు పెట్టు కోకూడదు , యుద్దా లు చెయ్యకూడదు.

4 . ఒక వేళా పక్క రాజ్యంతో గొడవలుంటే, బ్రిటిష్ వాళ్ళే పరిష్కరిస్తా రు.

5 . ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలోని అత్యున్నత అధికారిక సంస్థ అని అందరు నమ్మాలి.

6 . బ్రిటిష్ వాళ్ళు తప్ప ఇంకా వేరే యూరోపియాన్స్ ని ఎవరినీ పని లో పెట్టు కోకూడదు.

అప్పట్లో మన నిజాంలు, అవాద్, మైసూర్, పీష్వా, scindhiya మొదలైన రాజులు ఈ సబ్సిడరీ ఆల్పైన్స్ లో ఉన్నారు.

1947 లో స్వాతంత్రయం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ అలయన్స్ ని రద్దు చేసి, ఈ రాజ్యాలు భారత దేశం లో కానీ పాకిస్థా న్
లో కానీ విలీనం రావొచ్చని , లేదా స్వతంత్ర రాజ్యాలు గా ఉండొచ్చని తెలిపారు. 1948 కాళ్ళ దాదాపు దేశంలోని అన్ని రాజ్యాలు
భారత దేశం లో కానీ పాకిస్థా న్లో కానీ విలీనం అయ్యాయి. హై దరాబాద్ రాష్ట్రం తో పాటు ఇంకో మూడు రాజ్యాలు ఇంకా ఎలాంటి
నిర్ణయం తీసుకోలేదు.
సరిగ్గా 1946 నించి 48 దాకా నిజాం రాజు qasim razvi ఒక యెదవని పక్కన చేస్చుకున్నాడు. Qasim razvi ఒక రాజకీయ
నాయకుడు. నిజాం అధికారిక సైన్యం కాకుండా Qasim razvi తన సొంత సైన్యాన్ని తయారుచేసుకున్నాడు. ఆ సైన్యాన్ని
"రజాకార్లు " అనే వారు. పచ్చిగా చెప్పాలంటే వీళ్ళు సైనికులు కాదు, వీళ్ళు ప్రైవేట్ గుండాలు, రౌడీలు, దోపిడీదారులు. Qasim
razvi హై దరాబాద్ ను పాకిస్థా న్ లో విలీనం చేయాల్సింది గ నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ ను చాలా ఒత్తిడి చేసాడు. అయితే,
పాకిస్థా న్ కు మన హై దరాబాద్ కు చాలా దూరం ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు నిజాం రాజు. కానీ, భారత దేశం లో
కుడా విలీనం అవ్వడం ఇష్టం లేదు నిజాం కు. స్వతంత్ర రాజ్యం గ ఉండాలని ఉంది తనకి.

ఆ సమయంలో తాను ఏ దిశగానైనా నిర్ణయించుకోవడానికి ఒక సంవత్సరం దాకా గడువు ఇస్తూ భారత దేశ ప్రభుత్వం "స్టాండ్ స్టిల్
అగ్రిమెంట్" ను తయారు చేసింది. దాని ప్రకారం, defense , ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు కమ్యూనికేషన్స్ విభాగాలకు
సంబంధించిన ఒప్పందాలు ఏ విధం గా అయితే బ్రిటిష్ వాళ్లతో ఉన్నాయో, అవే ఒప్పందాలు ఇప్పుడు భారత ప్రభుత్వం తో కుడా
ఉండాలి అని. అయితే, నిజాం రాజు మాత్రం వాటిని పక్కన పెట్టి, భవిష్యత్తు లో ఒక వేళా సహాయం అవసరమైతుందేమో అని,
అప్పటి పాకిస్థా న్ ప్రభుత్వానికి అప్పట్లోనే 15 మిలియన్ పౌండ్లను పంపించాడు. ఈరోజి భారతీయ కరెన్సీ లో అది 145 కోట్ల
రూపాయలకు సమానం. అంటే 72 సంవత్సరాల ముందు దాని విలువ ఇంకెంతో మీ ఊహకే వదిలేస్తు న్న. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్
ప్రకారం భారతీయ ప్రభుత్వ సైనికులు హై ద్రాబాద్లో ఉండకూడదు. కానీ బ్రిటిష్ సైన్యాలు మాత్రం సికింద్రాబాద్ లోని క్యాంపుల్లో ఇంకా
ఉన్నాయి. అదీ కాక రజాకార్లను ఇంకా చేర్చుకుంటూనే పోతున్నారు. సరిహద్దు ల్లో ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనే
నిర్ణయాలు తీసుకుంటున్నారు నిజాం యొక్క బృందం. ఇవన్నియు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కి ఉల్లంఘనలే.

ఇవన్నీ పక్కన పెడితే ఆ సమయంలో కమ్యూనిస్టు ల సహాయంతో తెలంగాణ రైతుల సాయుధ పోరాటం జరుగుతోంది ఇక్కడ.
రైతుల మీద కమ్యూనిస్టు ల మీద రజాకార్లు చేసే ఆగడాలకు అంతే లేదు. ఈ సాయుధ పోరాటం గురించి మనం ఇంకో వీడియో
లో డిటై ల్డ్ మాట్లా డుకుందాం.

ఇట్లా టి పరిస్థితిలో, హై దరాబాద్ నిజాం ను భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది అనే విమర్శలు దేశంలో చాలా మంది
చేయడం మొదలుపెట్టా రు. ఈ విమర్శలకు సమాధానం గ mariyu ఇక్కడి పౌరుల , రైతుల రక్షణ కోసం వల్లభాయ్ పటేల్ గారు
సంధించిన బాణం "ఆపరేషన్ పోలో "

ఆరోజు తారీఖు సెప్టెంబర్ 13 1948 , సమయం తెల్లవారుజాము 4 గంటలు. 35000 సైనికులతో భారత సైన్యం "Goddard
Plan " ప్రకారం రెండు వైపుల నించి హై దరాబాద్ మీదకు దండెత్తా యి. తూర్పున ఉన్న విజయవాడ నించి మేజర్ జనరల్ అజిత్
రుద్రా బృందం మరియు మహారాష్ట్ర లోని సోలాపూర్ నించి మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌధురి బృందం.

మొదటి రోజు యుద్ధం : సోలాపూర్ సికింద్రాబాద్ హై వే మీదుగా Naldurg కోటని ఆక్రమించాయి సోలాపూర్ సైన్యం.అక్కడి బోరి
నది , బ్రిడ్జి, రోడ్ లను తమ స్వాధీనంలోకి తెచ్చుకుని, 9 గంటల సమయానికి జలకోట్ నగరానికి చేరుకున్నది. అక్కడినించి
సాయంత్రం ౩ గంటలకు మహారాష్ట్ర లోని ఉమార్గ కు చేరింది. అదే సైన్యంలోని ఇంకో బృందం తెల్లవారుజామునే ఏక ధాటిగా 2
గంటలు నిజాం సైన్యంతో, రజాకార్లతో పోరాడి వాళ్ళను మట్టి కరిపించింది. బాగా పొంగిన లోహర నది వాళ్ళ, ఆరోజుకి అక్కడే
ఉండిపోయింది సైన్యం. మరి విజయవాడ నించి మొదలైన మేజర్ చౌధురి సైన్యం పొద్దు న్న 8 .౩౦ నిమిషాలకు కోదాడ చేరుకొని,
మధ్యాన్నానికి ఈనాటి సూర్యాపేట జిల్లా లోని ముంగల గ్రామానికి చేరింది.

రెండవ రోజు యుద్ధం :


ఉమార్గ లో ఆగిపోయిన సోలాపూర్ సైన్యం రాజేశ్వర్ కు చేరుకుంది. పూణే లోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వచ్చిన టెంపెస్ట్ వార్
ఎయిర్ క్రా ఫ్ట్స్ సాయంతో మధ్యాన్నానికి రాజేశ్వర్ నగరాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంది.తరువాత ఉస్మానాబాద్ మరియు జాల్నా
నగరాలను చేజిక్కించుకున్నాయి.

మూడవ రోజు యుద్ధం:

జాల్నా నుంచి బయలుదేరి లాతూర్ మోమినాబాద్ లను ఆక్రమించింది సోలాపూర్ సైన్యం. మరోవైపు విజయవాడ బృందం యుద్ధ
విమానాల సహాయంతో సూర్యాపేట ని ఆక్రమించింది. సూర్య పేట మూసి నది మీద ఉన్న బ్రిడ్జిని రజాకార్లు కూల్చివేయడంతో, ఆ
బ్రిడ్జి కి మరమ్మతులు చేసి ఆరోజు సాయంత్రానికి నార్కట్పల్లి కి చేరుకుంది.

నాలుగవ రోజు యుద్ధం:

సోలాపూర్ సైన్యం జహీరాబాద్ మీదుగా బీదర్ వెళ్లే జంక్షన్ దెగ్గరకు రాగానే రజాకార్లు గెరిల్లా పద్ధతి లో దాడులు చేశారు. వారికి
బాగా తెలిసిన ప్రాంతాలు కాబట్టి రజాకార్లు మెరుపు దాడులు చేయసాగారు. కొంత సైన్యాన్ని అక్కడ ఉంచి మిగతా సైనికులతో
సోలాపూర్ బృందం ఆ రాత్రికి ఇంకో 15 కిలోమీటర్లు ముందుకు వెళ్లా రు.

ఐదవ రోజు యుద్ధం : తారీఖు సెప్టెంబర్ 17

తెల్లవారు జామునే బీదర్ లోకి చొరబడింది సోలాపూర్ సైన్యం. మరోవైపు, నార్కట్ పల్లి నించి చిట్యాల చేరుకుంది విజయవాడ
బృందం.

అప్పటికే దాదాపుగా 1000 మంది నిజాం సైనికులు 1300 మంది రజాకార్లను కోల్పోయిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక రోజు
ముందే అంటే సెప్టెంబర్ 16 వ తారీఖుని తన దెగ్గర ఉన్న ప్రధాన మంత్రిని ఇతర మంత్రు లను రాజీనామా చెయ్యమని ఆదేశించాడు.
సెప్టెంబర్ 17 సాయంత్రం 4 గంటలకు భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ శ్రీ కే ఎం మున్షి గారిని కలిసి ఏమన్నాడంటే " రాబందులన్నీ
రాజీనామా చేశాయి. నాకేమో ఎం చెయ్యాలో తెలియట్లేదు." అని. హై ద్రాబాద్లోని పౌరుల రక్షణ కు భంగం కలగకుండా చూసుకో
ఈరోజుకి అని సలహా ఇచ్చారు మున్షి గారు. సాయంత్రం 5 గంటలకు యుద్ధం ఆగిపోయింది. 32 mandi sainikulu amaralu
kaaga, bharatha sainyam Vijaya bheri moginchindi.

మరుసటి రోజు సెప్టెంబర్ 18 న సాయంత్రం 4 గంటలకు నిజాం సైనిక మేజర్ జనరల్ EI Edroos జనరల్ జయంతో నాథ్ చౌధురి
గారి ఎదుట సరెండర్ అయ్యారు.
నాలుగు రోజుల తర్వాత September 23 na, మొట్ట మొదటి సారి ఒక రేడియో స్టేషన్ కి వెళ్లిన నిజాం, ప్రభుత్వాన్ని ఉద్దేశించి
ఇలా అన్నాడు " నేను పోయిన సంవత్సరంలోనే భారత దేశం లో విలీనం అయ్యేవాడిని, కానీ Qasim Razvi ఇంకా వారి రజాకార్లు
మా ఆలోచనలను తప్పు దోవ పట్టించారు. నా దెగ్గర ఉన్న ప్రధాన మంత్రిని బెదిరించి తనకు అనుకూలంగా ఉన్న వాడిని ప్రధాన
మంత్రిని చేశాడు Qasim Razvi . vaarikee ee raajyalo elaanti adhikaaram ledu. Kaani జనాలను మంత్రు లను
భయపెట్టి హై దరాబాద్ఎం రాజ్యంలో వారు అధికారం చెలాయించారు. ఎం జరుగుతోందో teleeni పరిస్థితిలో నేను
నిస్సహాయుడిని అయ్యాను."

ఇంతకంటే చేతకాని రాజు ఎక్కడైనా ఉంటాడా. ఈ ఆపరేషన్ వాళ్ళ జరిగిన అసలు హింస అసలు రక్తపాతం గురించి ఇప్పుడు చెప్తా
వినండి. చాలా రోజులనించి రజాకార్ల కాళ్ళ కింద నలిగిన కొందరు హిందువులు భారత సైన్యం ఒచ్చిందన్న ధైర్యంతో విచక్షణ
కోల్పోయి రజాకార్లతో పాటు సామాన్య ముస్లింల మీద కుడా దాడులు చేశారు. చాల మందిని చంపారు, వారి స్త్రీలను చెరచారు.
దోపిడీలు చేశారు. అప్పుడు జరిగిన ఈ జుగుప్సాకరమైన హింసలో దెగ్గర దెగ్గర 2 lacs మంది అమాయక ముస్లింలు తమ
ప్రాణాలను కోల్పోయారని కొంత మంది చరిత్రకారులు చెప్తా రు. అప్పటి ప్రభుత్వం నియమించిన పండిట్ Sunderlal కమిటీ ఇచ్చిన
రిపోర్ట్ ప్రకారం మాత్రం, 27000 - 40000 మంది దాకా మరణించి ఉంటారని తెలుస్తోంది. ఈ రిపోర్ట్ అసలు నిజాం కాదని
చాలామంది అభిప్రాయం. ఆపరేషన్ పోలో తరువాత ప్రభుత్వం హై దరాబాద్చా ప్రాంతం లో ఉన్న ఛాలా మంది ముస్లిం
అధికారులను తొలగించి వేరే ప్రాంతాల నుంచి వేరే భాషలు మాట్లా డే అధికారులను ఇక్కడ నియమించారు. వారికి ఇక్కడి
సంస్కృతి, ఇక్కడి మనుషులు, భాష అర్ధం కాక అదింకో గందరగోళానికి దారి తీసింది.

ఇంతటి హింసను, రాజకీయ అధికారిక సంక్షోభాన్ని ఆపగల తప్పించగల ఒక్క మగాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఆ నిజాం రాజు
ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రమే. కానీ yedavalanu పక్కన పెట్టు కుని, వాళ్ళ మాటలు విని, వాళ్ళు చెప్పింది చేసాడు కాబట్టి ఇదంతా
జరిగింది. మిత్రమా, ఇది నా అభిప్రాయం. నాకు మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ కామెంట్స్ లో రాయండి. మీకు
ఈ వీడియో నచ్చితే తప్పకుండ సబ్స్క్రయిబ్ చేసి మీకు తెలిసిన వాళ్లందరికీ షేర్ చెయ్యండి. ఉంటా మిత్రమా. మళ్ళీ కలుద్దాం.

You might also like