Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

(https://twitter.

com/intent/tw
(https://api.whatsapp.c
(https://telegram
(https://w
(https://www.eenadu.net/)
ఆంధ్రప్రదేశ్ (https://www.eenadu.net/ap)
తెలంగాణ (https://www.eenadu.net/ts)
home (https://www.eenadu.net/) భయం - నిర్భయం url=https://www.eenadu.net/
text= url=https%3A%
జాతీయ- అంతర్జాతీయ
ఆదివారం, డిసెంబర్(https://www.eenadu.net/nationalinternational)
05, 2021
క్రైమ్ (https://www.eenadu.net/crime)
పాలిటిక్స్ (https://www.eenadu.net/politics) -
బిజినెస్‌(https://www.eenadu.net/business)
క్రీడలు (https://www.eenadu.net/sports)
సినిమా (https://www.eenadu.net/cinema)
ఫీచర్ పేజీలు https%3A%2F%2Fw
ఫొటోలు (https://www.eenadu.net/photos/gallery)
వీడియోలు (https://www.eenadu.net/videos/gallery)
ఎన్ఆర్ఐ (https://www.eenadu.net/nri)
ఇంకా..
ARCHIVES (//www.eenadu.net/archives/home)
E PAPER (https://epaper.eenadu.net/)
SITARA

మనిషి జీవితంలో సంతోషాన్ని, సుఖాన్ని దూరం చేసే అంతర్గత శత్రువుల్లో భయం ఒకటి. భయం మనిషికి దుఃఖాన్ని, బాధను, అశాంతిని కలగజేస్తుంది. ఆందోళన పెంచుతుంది.
అందుకే భయానికన్నా భయంకరమైనది మరొకటి లేదంటారు. నిజానికి భయం అనేది అజ్ఞానం వల్లనే కలుగుతుంది. జ్ఞాన సముపార్జనతో భయం తొలగిపోతుంది. మనిషిని భయం
నుంచి రక్షించగల ఏకైక ఆపన్న హస్తం ఆధ్యాత్మిక శక్తి అని పండితులు చెబుతారు. అంటే భయమనే వ్యాధికి దివ్యౌషధం భక్తి మాత్రమే.
శ్రీమన్నారాయణ స్మరణ చేస్తూ బాలభక్తుడైన ప్రహ్లాదుడు తండ్రి విధించిన శిక్షలన్నింటినీ నిర్భీతితో సహించాడు. భక్తకోటికి మహదానందాన్ని కలిగించే భాగవత కథా సుధామృతాన్ని
శుకుడు పరీక్షిత్తుకు వినిపించి మరణానికి భయపడకూడదని బోధిస్తాడు. తాను నిర్వహించే కర్మలు ధర్మబద్ధంగా, నిర్మలంగా ఉంటే మనిషి ఎవరికీ భయపడనవసరం లేదని గీతలో
శ్రీకృష్ణుడు వివరించాడు. పెద్దలంటే భయం, దైవమంటే భక్తి కలిగిన మనిషి నడత సక్రమంగా సజావుగా సాగుతుంది. మానవులకు ధర్మభీతి, పాపభీతి, న్యాయభీతి ఉండి తీరాలన్నది
శాస్త్రోక్తి. ధర్మబద్ధంగా జీవించినవారికి విజయం తప్పక చేకూరుతుందనడానికి పాండవులే ఉదాహరణ. అష్టకష్టాల పాలైనప్పటికీ పాండవులు ధర్మాన్ని వీడలేదు. చివరికి వారే కురుక్షేత్ర
యుద్ధంలో విజయం సాధించారు.
ధర్మ విరుద్ధంగా నిర్వహించే పనులను పాపకార్యాలు అంటారు. పాపభీతి లేనివారు ఏ పొరపాటు చేయడానికైనా వెనకాడరు. స్త్రీ లోలత్వం కారణంగా రావణుడు సోదరులను, పుత్రులను
పోగొట్టుకున్నాడు. చివరికి రాముడి చేతిలో హతమయ్యాడు. వరగర్వంతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని దుర్భాషలాడాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సును
ఖండించాడు. పాపకార్యాలకు ఫలితమే ఇది.
వైరాగ్యం ద్వారానే మనిషి భయరహితుడవుతాడని భర్తృహరి అంటారు. వైరాగ్యం మనిషికి నిర్భయాన్ని ప్రసాదిస్తుంది. మనిషిని శక్తిమంతుణ్ని చేస్తుంది. ‘దేనికీ భయపడవద్దు. సత్యాన్ని
నమ్ము. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. నీకు విజయం లభిస్తుంది’ అనేవారు మహాత్మాగాంధీ. ఆ మనోధైర్యం వల్లే ఆయన జాతిని నడిపించే నాయకుడయ్యారు. జాతిపితగా భాసిల్లారు.
‘నిర్భయంగా ఉండు’ అనేది స్వామి వివేకానంద నిరంతరం చేసే ఉపదేశం. ఆయన అలా బోధించడమే కాదు, అలా జీవించారు కూడా.
ఏ భయం ఉండాలి, ఏ భయం ఉండకూడదు అనే విచక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. అధర్మవర్తనకు, అన్యాయం చేయడానికి భయపడాలి. ధర్మరక్షణ కోసం భయపడకూడదు.
పుణ్యకార్యాలు చేయడానికి, న్యాయం కోసం పోరాడటానికి భయపడకూడదు. నిశ్చల మనస్కులు దేనికీ వెరవరు. మనో నిగ్రహం కలవారు దేనికీ లొంగరు. కష్టాలకు కుంగరు. వారు
ఎల్లప్పుడూ స్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఇలాంటి నిశ్చలత్వాన్ని, స్థితప్రజ్ఞను పొందాలంటే మనిషి ఆత్మజ్ఞాని కావాలి. అప్పుడతడు అన్నింటినీ సమదృష్టితో చూడగలుగుతాడు. సర్వకాల,
సర్వావస్థల్లో నిశ్చలంగా ధీరుడై ఉంటాడు. ఆత్మానంద స్వరూపుడై నిరంతరం భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు.
- విశ్వనాథ రమ

You might also like