Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

అంతర్యామి

బిజినెస్‌(https://www.eenadu.net/business)
క్రీడలు (https://www.eenadu.net/sports)
సినిమా (https://www.eenadu.net/cinema)
ఫీచర్ పేజీలు
ఫొటోలు (https://www.eenadu.net/photos/gallery)
వీడియోలు (https://www.eenadu.net/videos/gallery)
ఎన్ఆర్ఐ (https://www.eenadu.net/nri)
ఇంకా..
(https://twitter.com/intent/tw
(https://api.whatsapp.c
(https://telegram
(https://w
ARCHIVES (//www.eenadu.net/archives/home)
E PAPER (https://epaper.eenadu.net/)యోగక్షే

SITARA
మం url=https://www.eenadu.net/
text= url=https%3A%
-
https%3A%2F%2Fw

జీవితం అనేది ఒక ఉత్సవం. మనిషి జీవించినంతకాలం అది అలాగే సాగిపోవాలి. కాలంతోపాటు ఎంతో సంతృప్తినివ్వాలి. ఆనందమయం చేసేది మనిషి మానసిక స్థితే. మనిషిది
చంచలమైన స్వభావం. మనసు కోరుకున్న విధంగా జరిగినంతకాలం మనిషికి సంతోషం, కాకపోతే బాధ... ఆందోళన. నిత్యం సుఖదుఃఖాల మధ్య ఊగిసలాటే!

మనిషి అంతరంగంతో బలమైన సంబంధం ఏర్పరచుకుంటే ప్రేమ, కరుణ, సమానతలకు రూపంగా మారడం జరుగుతుంది. ఇది ఒక ధ్యానస్థితి. యోగా ఇక్కడే మొదలవుతుంది. గీతలో
శ్రీకృష్ణుడు మనసును ఎలా నిర్వహించుకోవాలో అర్జునుడికి చెబుతూ- చేసే పనులు సమతుల్యతతో ఒక యోగి మనసులాంటి నిశ్చల చిత్తంతో, సంపాదించుకున్న నైపుణ్యాలతో ఒక
యోధుడిలా కాకుండా, అంటే ద్వంద్వాలకు అతీతంగా స్థితప్రజ్ఞతో చేయాలంటాడు. ఈ యోగ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. ఎన్నో యుగాలుగా భౌతిక మానసిక
రుగ్మతలను నయం చేయడానికి యోగా విధానం ఆచరణలో ఉంది.

మన మనసు నిరంతరం గతం-భవిష్యత్తుల నడుమ పరిభ్రమిస్తుంటుంది. వరస ఆలోచనలు మనసును మబ్బుల్లా కమ్మేస్తాయి. యోగ సాధకుడు స్వచ్ఛమైన స్వేచ్ఛ కలిగిన మనసుతో
ఉంటాడు. యోగాభ్యాసం సానుకూలమైన ఆలోచనలను కలిగిస్తూ ప్రేమ, కరుణ లాంటి అనుభూతులతో నింపుతుంది. ఎటువంటి తికమకలు, సందేహాలు జీవితంలో లేకుండా చేస్తుంది.
చిత్తశుద్ధి కలిగి ఉండటం వల్ల ముఖంలో సంతోషం ప్రకాశిస్తుంది.

యోగాభ్యాసం చేసినవారు ప్రపంచాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది.

నిజానికి యోగాసనాలు శరీరానికి సంబంధించినవి కావు. ఉండవలసిన సామర్థ్యానికి సంబంధించినవి. చాలామంది కొన్ని క్షణాలపాటైనా నిలకడగా కూర్చోలేరు. ఎక్కడో దురద పుట్టినట్లు,
పురుగు పాకినట్లు, కాళ్లు తిమ్మిరెక్కినట్లు... ఎన్నో మొదలైపోతాయి. ఇవన్నీ కూడా కదలికల కోసం వెతుక్కునే సాకులు.

పతంజలి ఆసనాలు, భంగిమలు శారీరక శిక్షణకు సంబంధించినవి కావు. అవి- జీవి అంతరంగ శిక్షణ కోసం. ఒక భంగిమలో ఉండగలిగినప్పుడు శరీరం దాసోహమవుతుంది. అది
మనల్ని అనుసరిస్తుంది. అది ఎంతగా అనుసరిస్తే మన అంతర్గత శక్తి అంతగా పెరుగుతుంది. ఎప్పుడైతే శరీరం కదలదో, మనసూ నిశ్చలమవుతుంది... చలించదు. మనసు, శరీరం-
రెండూ వేర్వేరు కావు. ఒకే వస్తువుకు రెండు ధ్రువాల్లాంటివి. శరీరం, మనసు చలించకపోతే మనిషి కేంద్రంగా, స్థిరంగా ఉంటాడు. అప్పుడే అణకువ. అణకువతోనే అభ్యాసం. అప్పుడే
శిష్యుడు కాగలుగుతాడు. అది గొప్ప విజయం.

పతంజలి మహర్షి ‘అష్టాంగ యోగా’ ద్వారా ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయడానికి ఎనిమిది మార్గాలను ప్రతిపాదించారు. అవి- యమ(నీతి), నియమ (కోపం లేకపోవడం) గురుసేవ,
శౌచం, మితాహారం, అప్రమత్తత... అయిదు నియమాలు), ఆసన (నిశ్చలంగా, సుఖంగా కూర్చోవడం), ప్రాణాయామ (ఒక క్రమ పద్ధతిలో గాలి పీల్చి వదలడం), ప్రత్యాహార (భౌతిక
వస్తువుల నుంచి ఇంద్రియాలను ఉపసంహరించడం), ధారణ (మనసును నిలకడగా ఉంచడం), ధ్యాన (ధ్యానం), సమాధి (ధ్యాన విషయంలో లయం కావడం).

ఒక్క ముక్కలో చెప్పాలంటే యోగా శరీరానికి ఒక పెట్టుబడి. బరువు తగ్గడం, శరీరం-మనసుల సమతుల్యత లాంటి ప్రయోజనాలున్నాయి. యోగ ముద్రలు, ఆసనాలు క్రమం తప్పకుండా
చేస్తే ఆరోగ్యానికి మార్గం ఏర్పడినట్టే.

యోగా ఒక శాస్త్రం.  అది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతికి బాటలు పరుస్తుంది. చేసే ప్రతి చర్యా ఎరుకతో చేయడం యోగా.
- మంత్రవాది మహేశ్వర్‌

You might also like