Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

(https://twitter.

com/intent/tw
(https://api.whatsapp.c
(https://telegram
(https://w
అనుక్షణ యజ్ఞం url=https://www.eenadu.net/
text= url=https%3A%
-
https%3A%2F%2Fw

మనం కాలాన్ని సద్వినియోగం  చేయడమంటే  ఒక గొప్ప పనిని తలకెత్తుకోవడమో, సొంత పేరు ప్రతిష్ఠల కోసం వినియోగించుకోవడమో కాదు. సద్వినియోగం అంటే ఒక పనితో పోదు. ఒక
కాలపరిమితికి లోబడిన కార్యం కాదు. ప్రతి క్షణం, ప్రతి పని, ప్రతి శ్వాస. అవును... శ్వాస. శ్వాస శుభ్రమైంది కావాలి మనకు. సువాసన పూరితం అయితే మరీ మంచిది. పనికూడా అంతే. ప్రతి
క్షణం అంతే. చివరి క్షణం వరకు అనాలోచితంగానే, అప్రయత్నంగానే ప్రతి క్షణాన్నీ ఒక ఉత్తమ చర్యతో మలచుకోవాలి. ఉత్తమోత్తమంగా నిర్దేశించుకోవాలి. నిర్మించుకోవాలి. ముఖ్యంగా ఏ
క్షణమూ ఇతరులకు హానికారకం కాకూడనిదిగా, ఉపయోగకరం అయ్యేదిగా ఉపయోగించుకోవాలి. ఆ విధానమే జీవన విధానంగా జీవించాలి. ఇదో ఉపదేశమో, సందేశమో, సుభాషితమో కాదు.
మనిషి సహజ స్వరూపం. సహజ స్వభావం. మన శరీరానికి, మనసుకు ఉన్న వనరులు మన ఉపయోగానికి, ఆపదల నివారణకేగానీ ఇతరుల అపకారానికో, అనవసర హింసకో కాదు. పశువుల
కొమ్ములు వాటి స్వీయ రక్షణకేగాని ఇతర అర్భక జీవుల్ని పొడిచి బాధ పెట్టడానికి కాదు. జ్ఞానమున్న మనిషి ప్రతి క్షణం చెట్టులా జీవించాలి. పుట్టలా ఉపకారం చేయాలి. చెట్టుగానే
మరణించాలి. ఏ క్షణమూ తనకోసమే నంటూ జీవించని చెట్టు చివరి క్షణాన్ని కూడా పరోపకారంలోనే ముగిస్తుంది. పుట్ట- తనను పెట్టింది, కట్టుకుంది చీమలేనని  పాములను తిరస్కరించదు.
తిప్పి కొట్టదు. ఆశ్రయమివ్వడమే దాని పని. ఆ పనే చేస్తుంది.      
ఫలానా వారికని, ఫలానా పని అని అనుకోనంతవరకు, ఎంపిక చేసుకుని మాత్రమే ఉపకారం చేయనంతవరకు మనిషికి అనుక్షణం ఉపకారంలోనే జీవించే అవకాశం ఉంది. అదృష్టం ఉంది.
మనిషికి మరేం పని లేదా... పరోపకారం, పరమపద అన్వేషణ, ఆరోహణ తప్ప!? లేదు. ఉండదు. ఉండకూడదు. ఈ సృష్టిని భగవంతుడు అలా నిర్మించాడు. అలా నియమించాడు.
నిర్దేశించాడు. ఏక మాత్రంగా, ఏక సూత్రంగా, ఏక కణంగా సృష్టించిన ఈ సర్వ సృష్టిలో జీవన మరణాలు, జీవప్రక్రియ వరకు సాలెగూడులా నిరంతర చక్ర భ్రమణానికి లోబడి ఉంటాయి.
ఉండాలి. అప్పుడు ప్రతి జీవి, ప్రతి అణువు ఒక నియమావళికి, ఒక నిబద్ధతకు, ఒక స్వీయ క్రమశిక్షణకు లోబడి ఒక  ఉత్తమోత్తమ కార్యాచరణతో సార్థకం అవుతాయి. దేవుడి సర్వ శ్రేయోదాయక
ప్రణాళికను పరమ పవిత్రంగా నెరవేర్చినదవుతుంది.            
నిజమే... బేకారుగా, బే ఫికరుగా బతికేవారికి ఏ నియమాలూ వర్తించవు. ఎందుకంటే భవిష్యత్తుమీద వారికి ఎలాంటి అంచనాల్లేవు.  ప్రణాళికల్లేవు. అసలు అవగాహనే లేదు. యథాలాప
జీవితం, యథాలాప మరణంగా బతికేస్తారు. కానీ, జీవితం అది కాదు. అలాంటిది కాదు. పరమ పవిత్రమైన పారిజాతాల దోసిటితో పట్టి పరమాత్ముడికి అర్పించవలసిన అపురూప పుష్పాంజలి
అది. అత్యంత జాగరూకతతో నిభాయించి నిటలాక్షుడికి సమర్పించవలసిన నవ మౌక్తికమది.  ఎలాంటి కౌలు, కిస్తు లేకుండా మనకిచ్చిన సుక్షేత్రం అది... మన జీవితం.  దాన్ని పండించి,
ఫలాలను అనుభవించి, అనుభవిస్తూనే మరింత సొబగులద్ది, సొగసులు దిద్ది కృతజ్ఞతతో దాన్ని ఇచ్చిన ఆ పరమాత్ముడికి తిరిగి సమర్పించవలసిన మాగాణి పంట... జీవితం!  
- చక్కిలం విజయలక్ష్మి

You might also like