Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

తెలుగు సాహిత్యంలో పుస్తకాలు, కార్టూనులూ, సినిమాల ద్వారా మెరిసిన అపురూప ద్వయం-

ముళ్ళపూడి వెంకట రమణ, బాపూ గార్లు

పల్లెటూరి మధ్యతరగతి వారి అందాల భావాలు, ముఖ్యంగా పిల్లల, పెద్దల మధ్య అంతరాల అందాలు,
చక్కగా చిత్రీకరించిన ద్వయం ముళ్ళపూడి వెంకట రమణ, బాపూ గార్లు . నా కాలేజీ చదువులప్పటి నుంచీ
ఇప్పటి దాకా, వారి పుస్తకాలు, కార్టూన్లు , సినిమాలు తలచుకుంటే చాలు, మనస్సు సరదాగా అందంగా
అయిపోతుంది.

ఒక చిన్న ఉదాహరణగా, ఒక ముళ్ళపూడి వారి పుస్తకం "ఇద్దరమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు" నవోదయ


ప్రకాశకులు 1957 నుంచి

“సూర్యోదయ వర్ణన”

తెల్లవారిందనే దురభిప్రాయంతో కోడి కూసింది. కాకులు మేలుకున్నాయి, ఈగలు డ్యూటీకి


బయలుదేరాయి. దోమలు విశ్రాంతికి ఉపక్రమించాయి. దాలి గుంటల్లో పిల్లు లు బద్ధకంగా లేచి, వళ్ళు
విరుచుకుని బయటకి నడిచాయి. ఆవులు అంబా అంటున్నాయి. పువ్వులు వికసించాయి. నవ్వడం
అలవాటై న పిల్లలు చక్కగా నవ్వారు. ఉత్తిపుణ్యానికి ఏడవడం వృత్తిగా గల పిల్లలు చక్కగా ఏడుపు మొదలు
పెట్టా రు. కొద్దో గొప్పో పాడి గల ఇళ్లల్లో అమ్మమ్మలు, బామ్మలూ భూపాల రాగచ్ఛాయలో "అమ్మా
గుమ్మాడేడే" అంటూ మజ్జిగ చిలుకుతున్నారు.

ముద్దబంతిపూలలా బొద్దు గా, పచ్చగా ఉన్న అమ్మాయిలు పంచకళ్యాణి గుర్రాలకు మల్లె శోభిస్తూ
కళ్లు నులుముకుంటూ, అమ్మలచేత, బామ్మలచేత సున్నితంగా చివాట్లు తింటూ, ఇళ్ళు కళకళలాడేలాగ
కలియతిరుగుతున్నారు. కొందరు గుమ్మాలలో పేడనీళ్లు చల్లి, సంక్రాంతి ముగ్గులు తీర్చిదిద్దితూ,
ముగ్గులంతా అందంగా సజీవంగా నవ్వుతున్నారు. పదేళ్ల పిల్లలు గొబ్బిళ్ళు తట్టు తున్నారు. రౌడీతముళ్ళు,
రాలుగాయి కుర్రాళ్ళు లేచి, గోటీబిళ్ళలు, బొంగరాలు, పిడకల దండలు కులాసాగా ఉన్నాయో లేదా అని
చూసుకుని, చద్దన్నాలకి సిద్ధం అవుతున్నారు. బస్తీకెళ్ళొచ్చిన యువకులు గెడ్డా లు పెరగకపోయినా,
రేజరుసెట్లు , అద్దం సిద్ధం చేసుకుంటున్నారు, చీవాట్లు తింటూనే.

సాతానిజియ్యరు ఒక ట్రిప్పు పూర్తి చేసుకున్నాడు. కాలవరేవంతా నీటికడవలు నెత్తిన పెట్టు కుని నడిచే
అప్పలమ్మలతో, బిందెలు చంకన పెట్టు కుని పోయే బామ్మలతో చూడ ముచ్చటగా ఉంది. బస్తీకి
కూరకాయలు వెడుతున్నాయి. ఈసరయ్య హోటల్ నుంచి ఎండు తామరాకులలో వేడి వేడి ఇడ్లీలని
ఆఘ్రాణించి ఆనందిస్తూ కొందరు కుర్రాళ్ళు తిరుగుతున్నారు.
ఈ హడావిడి అంతా చూసి, నిజంగానే తెల్లవారిందనుకుని, సూర్యుడు ఉదయించాడు.

"బాపూ బొ మ్మ"

నేను బంబాయిలో ఉద్యోగం చేస్తు ండగా ఒకసారి ఏదో పని మీద మద్రా సు రావలసి వచ్చింది. నా

అదృష్ట ం కొద్దీ ఒక పెద్దా యన బాపూగారిని పరిచయం చేయడం సంభవించింది. ఆ కాసేపట్లో నేను

బాపూగారితో "బాపూ బొ మ్మ" గురించి ప్రస్తా వించడం, ఆయన వెంటనే దగ్గ ర ఉన్న కాయితం

తీసుకుని ఆయన స్కెచ్ పెన్తో ఒక చక్కటి తెలుగు వారి ఆడపిల్ల బొ మ్మ వేసి ఇవ్వడం జరిగింది.

అదే ఇది, జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చా:

You might also like