Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 52

[12/30/2020, 10:10 AM] 🌹🌹🌹🌹

వాహనం కిటికీ నుండి చూస్తే...మనతోపాటే చెట్లు ,చేమలు పరుగెత్తు కు వస్తు న్నట్లు భ్రమపడతాం...
అలాగే...అధికారం,డబ్బు, పదవి వచ్చాక,
అందరూ మనతోపాటే ఉన్నట్లు కనిపిస్తా రు.
వాహనం ఆగాక.....పదవి,అధికారం,డబ్బు చేజారాక...అసలు కథ బోధపడుతుంది...
నీ నీడను చూసి,నీ బలం అనుకుంటే పొర పాటే...ఎందుకంటే,నీడ కూడా వెలుగును బట్టి,తన తీరునుమారుస్తుంది..మనుషులు
కూడా అంతే...అవసరాన్ని బట్టి పిలుపు..,
అవకాశాన్ని బట్టి తమతీరును మారుస్తా రు.
మనం వెళ్లిన చోట,మర్యాద ఇవ్వలేదనడం తప్పు..!.అసలు మర్యాద లేని చోటకు,నీవు వెళ్లడమే పెద్ద తప్పు..
*మంచి అలవాట్లు న్న వ్యక్తికి..... విలువ పెరుగుతూ ఉంటుంది.దురలవాట్లు న్న వ్యక్తి కి విలువ తగ్గుతూ ఉంటుంది.
[12/30, 🌹❤️🌹
*పుడుతూనే ఏడుస్తాం.వెంటనేనిద్రపోతాం.!
అక్కడి నుంచీ రోజూ నిద్రపోతూనే ఉంటాం. ఇది సర్వసాధారణ వ్యవహారం...! అందుకే నిద్ర గురించి మనం ఎప్పుడూ పెద్దగా పట్టిం
చుకోం..... మనమే కాదు.. వైద్యరంగం కూడా చాలా శతాబ్దా ల పాటు నిద్రని అంత గా పట్టించుకోలేదు.....
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నిశ్చింతగా నిద్ర అన్నది ఏదో కొద్దిమందికి దక్కే అదృష్టంలా తయారైంది..... నిద్ర లేక,
నిద్ర రాక, నిద్ర చాలక..ఇలా ఎంతోమంది రోజూ ఏదో నిద్ర చికాకు అనుభవిస్తూనే ఉన్నారు. అందుకే ఆధునిక వైద్యరంగం నిద్ర మీద
ఇప్పుడు లోతుగా పరిశోధనలు చేస్తూ నిద్రకు సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశా లు..,రకరకాల చికిత్సలు..నిద్ర గురించి అస లు
ప్రత్యేకంగా పరిశోధించాల్సిన అవసరం ఉందా....
చాలాకాలం లేదనే అనుకున్నారు! మొదట్లో వైద్యరంగం కూడా నిద్రను ఏమంత ప్రత్యేక వ్యవహారంగాతీసుకోలేదు.పడుకుంటేచాలు,
ఎవరికైనా నిద్ర అదే వచ్చేస్తుందనీ,ఆ సమ యంలో ఒంట్లో జరిగే పనులన్నీ నిలిచిపో తాయనీ భావించే వాళ్ళం..... నిద్ర అనేది
మెలకువకూ,మరణానికీ మధ్య దశ అను కున్న రోజులూ ఉన్నాయి.నిద్రకు కొన్ని ప్రత్యే క ప్రయోజనాలుంటాయని కూడా అప్పట్లో
ఎవరూ అనుకోలేదు....
ఇలాంటి పరిస్థితుల్లో కలల మీద ఆసక్తి కొద్దీ సిగ్మండ్‌ఫ్రాయిడ్‌వంటి మానసిక వైద్యులే తొలినాళ్లలో నిద్ర మీద ఎక్కువగా దృష్టి
పెట్టా రుగానీ ఆ తర్వాత కాలంలో దీనిపై న్యూరాలజిస్టు లే ఎక్కువగా పరిశోధనలు చేశారు. ఎందుకంటే నిద్ర అనేది ప్రధానంగా
మెదడుకు సంబంధించిన వ్యవహారం.మొట్ట మొదటగా గురకను,నిద్రలో తలెత్తే శ్వాస సమస్యలను (స్లీప్‌అప్నియా) గుర్తించిందీ,
అధ్యయనాలు చేసింది కూడా క్రిస్టిన్‌గిలిమి నో అనే న్యూరాలజిస్టే.అది కూడా చాలా చిత్రంగా జరిగింది.ఓ రోజు హై బీపీతో బాధ
పడుతున్న చిన్నపిల్లా డిని ఆయన దగ్గరకు తెచ్చారు.బొద్దు గా ఉన్న ఆ పిల్లా డు నిద్రలో శ్వాస సరిగాతీసుకోలేక పోతున్నాడని గుర్తిం
చారాయన. దీనికి మూలం ఎక్కడుందన్న ప్రశ్నతో మొదలైన ఆయన ప్రయాణం.. నిద్ర మీద లోతైన పరిశోధనలకు దారి తీసింది.
నిద్రపై అధ్యయనాలు మొదలైంది 50-60 ఏళ్ల క్రితం నుంచే అయినా..ఈ కొద్ది సంవత్స రాల్లోనే ఈ శాస్త్రం చాలా విస్తరించింది.
పాశ్చాత్య దేశాల్లో దీనిపై అవగాహన చాలా పెరిగిందిగానీ మన దేశంలో ఇంకా అంత పురోగతి లేదు.... వైద్యుల్లో కూడా నిద్ర విష
యంలో ప్రత్యేక శిక్షణ పొందినవారు ఇక్కడ తక్కువగా ఉన్నారు.మరోవైపు నిద్ర సమస్య లతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ
పెరిగిపోతోంది.నిద్ర అనేది శారీరకంగా,మాన సికంగా ఎన్నో సంక్లిష్టమైన అంశాలతో ముడి పడింది.కాబట్టి నిద్ర సమస్యలూ చాలా
రకా లుగా ఉంటాయి,పరిణామాలూ తీవ్రంగా ఉంటాయి......బ్లూ లైట్‌’ దెబ్బతీస్తోంది!
పూర్వం మనకు కరెంటు లైట్లు లేవు.చీకటి పడుతూనే అంతా ప్రశాంతంగా నిద్రకు ఉప క్రమించేవాళ్లు .కానీ ఇప్పడు నిద్ర పోబోయే
ముందు కూడా ఐప్యాడ్లు ,కంప్యూటర్లు ,సెల్‌ఫోన్లు పెట్టు కుని చూస్తు న్నాం.వీటి స్క్రీన్ల నుంచి వచ్చే ‘బ్లూ లైట్‌’ మనల్ని ప్రేరేపిస్తూనే
ఉంటుంది.ఇది నిద్రను ప్రేరేపించే ‘మెలటోని న్‌’ ఉత్పత్తిని అడ్డు కుంటుంది. దీంతో నిద్ర పట్టదు. పడుకున్నా ఇంకా నిద్ర రావటం
లేదేమిటన్న వేదన మొదలవుతుంది.దీంతో నిద్ర సమస్యగా తయారవుతోంది.
అసలు ఎవరికైనా ఎంత నిద్ర అవసరం?
ఇది చాలా వరకూ మన వయసును బట్టీ, మనిషిని బట్టీ మారుతుంటుంది.పసిబిడ్డలు పుట్టగానే పాలకు,మరేదైనా అవసరాలకు
తప్పించి మేలుకోవటం చాలా తక్కువ. రోజులో 16-18 గంటలు నిద్రపోతుంటారు. స్కూలు వయసు వచ్చేసరికి 11-12 గంటల
వరకూ పడుకుంటారు. యుక్తవయస్కులకు 9-10 గంటలు అవసరం.పెద్దల్లో7-8గంటలు సరిపోతుంది.కొందరికి 6 గంటలే
పడుకున్నా హాయిగానే ఉంటుంది.వాళ్లకు అదే చాలను కోవచ్చు.చాలా కొద్దిమందికి మాత్రమే 4-5 గంటల నిద్ర
సరిపోతుంది.స్కూళ్లు ,ట్యూషన్ల పేరుతో మనం పిల్లలను నిద్ర కోల్పోయేలా చేస్తు న్నాం.తెల్లవారుజామునే లేపితే ముఖ్యంగా ‘రెమ్‌’
నిద్ర దెబ్బతింటుంది. దీంతో సృజనాత్మక,ఎదుగుదల ప్రభావిత మయ్యే అవకాశం ఉందేమో ఆలోచించాలి.
పెద్దవయసులో నిద్ర తగ్గిపోయే మాట నిజమే...వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర పట్టటంలోనూ, నిద్ర పోవటంలోనూ తేడాలు
రావటం కొంత సహజమే. వృద్ధు ల్లో ‘స్లో వేవ్‌’ నిద్ర కచ్చితంగా తగ్గుతుంది, అలాగే ఒక దశ నుంచి మరో దశకు మారటంలో కూడా
తేడా లు రావచ్చు.రాత్రి పూట ఎక్కువ సార్లు లేస్తుండొచ్చు.అయినాఇవేంసమస్యలుకావు. ఆరోగ్యకరంగా ఉన్న పెద్దవారికి ఎలాంటి
నిద్ర సమస్యలూ ఉండాల్సినఅవసరంలేదు. ఒక రకంగా ఆ వయసులో బరువు బాధ్యత లు, ఒత్తిళ్లు ఉండవు కాబట్టి.. వృద్ధు లకు
మరింత హాయిగా నిద్రపట్టొచ్చు.వాళ్లకు ఎంత హాయిగా నిద్రపడుతోందన్నది వాళ్లెంత ఆరోగ్యంగా ఉన్నారన్న దాని మీద ఆధార పడి
ఉంటుంది.రకరకాల ఆరోగ్య సమస్య లతో బాధలు పడుతూ,వాటికి మందులు వేసుకుంటున్న లేదా మానసిక సమస్యలతో
బాధపడుతున్న వృద్ధు లకు సాధారణంగానే నిద్ర దెబ్బతింటుంది. అయితే వృద్ధు ల్లో చికిత్స కొంత సులభమని చెప్పుకోవచ్చు.
సరైన నిద్ర లేకపోతే మనకేమవుతుంది?
నిజం చెప్పాలంటే ఇప్పటికీ నిద్ర అవసరం ఏమిటో మనకు కచ్చితంగా తెలియదు. కానీ నిద్ర లేకపోతే ఏమవుతుందో, ఆ నష్టం ఎలా
ఉంటుందో మాత్రం స్పష్టంగా తెలుసు.
*నిద్రలేమి వల్ల..తక్షణ సమస్యలు చూసు కుంటే- పగటిపూట మత్తు ,మగత ముంచు కొస్తుంటాయి.ఏకాగ్రత,పని సామర్థ్యం దెబ్బ
తింటాయి.జ్ఞాపక శక్తి మందగిస్తుంది.ఉద్యో గాలు పోగొట్టు కోవటం,జబ్బుల పాలై ఆసు పత్రు ల చుట్టూ తిరగటం,డ్రైవింగ్‌చేస్తూ
ప్రమాదాలు కొని తెచ్చుకోవటం వంటివన్నీ తటస్థిస్తా యి.
దీర్ఘకాలంలో- ఒంట్లో హార్మోన్ల మధ్య సమ తౌల్యం (హై పోథాలమస్‌,పిట్యూటరీ యాక్సి స్‌) దెబ్బతింటుంది.జీవక్రియలన్నీ అస్తవ్యస్త
మవుతాయి.ఒంట్లో కార్టిసోల్‌హార్మోన్‌స్థా యులు పెరుగుతాయి.ఆకలిని తగ్గించే ‘లెప్టిన్‌’ అనే హార్మోన్‌తగ్గి,ఆకలికి కారణమై న
‘ఘ్రెలిన్‌’ పెరుగుతుంది.దీంతో అవసరాన్ని మించి ఎక్కువగా తినేస్తా రు.ఇన్సులిన్‌నిరో ధకత, వూబకాయం ముప్పు పెరుగుతాయి.
నిద్రలోనే మన శరీరం అవసరమైన మరమ్మ తులు చేసుకుంటుంది.నిద్ర లేకపోతే ఇవన్నీ నిలిచిపోయి శారీరక,మానసిక పునరుత్తేజం
కొరవడుతుంది.మెదడుపనితీరుమందగించి చదవటం,అర్థం చేసుకోవటం వంటి విషయ గ్రహణ శక్తు లూ దెబ్బతింటాయి.
పిల్లల్లో,యుక్తవయస్కుల్లోఎదుగుదలకు కీల కమైన ‘గ్రోత్‌హార్మోన్‌’నిద్రలోనే (ముఖ్యం గా స్లోవేవ్‌
దశలో)ఎక్కువగాస్రవిస్తుంటుంది.నిద్ర లేకపోతే ఈ గ్రోత్‌హార్మోన్‌సరిగా ఉండదు.
నిద్ర లేకపోతే రోగనిరోధక వ్యవస్థ బాగా బలహీనపడుతుంది.చీటికీమాటికీ జబ్బు పడుతుంటారు.
భావోద్వేగాలు మారిపోతాయి.తేలికగా కోపం,చికాకు వంటివి వస్తుంటాయి.ఇప్పటి కే డిప్రెషన్‌,బై పోలార్‌వంటి మానసిక వ్యాధు
లుంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
గుండె జబ్బులు,వూపిరితిత్తు ల వ్యాధుల వంటివీ క్లిష్టంగా తయారవుతాయి.మధుమే హం అదుపు తప్పుతుంది.రాత్రిపూట హార్మో న్ల
స్థా యులు చాలా మార్పులకు లోనవు తుంటాయి. యువకులకు నిద్ర లేకపోతే- వారిలో ఈ హార్మోన్లు తీరు వృద్ధు ల స్థా యికి
దిగిపోతోంది....
నిద్రకు సంబంధించిన సమస్యలేమిటి...?
నిద్రలేమి (ఇన్‌సోమ్నియా), నిద్రలో శ్వాస ఆడని సమస్య (స్లీప్‌అప్నియా), నిద్రలో కాళ్లను విపరీతంగా కదుపుతుండటం (రెస్ట్‌లెస్‌
లెగ్‌సిండ్రోమ్‌)..వీటికి తోడు నిద్రలో రకరకాల జర్క్‌లు వస్తుండటం..ఇవన్నీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి.కొందరు నిద్ర లో
తన్నటం,గుద్దటం వంటి ఉద్రేకపూరిత పనులు చేస్తుంటారు.దీన్నే ‘రెమ్‌బిహేవి యర్‌డిజార్డర్‌’ అంటారు.వీటన్నింటికీ
చికిత్సలున్నాయి.
ఎక్కువగా నిద్రపోతే నష్టం....
పనేం లేదని అతిగా నిద్రపోవటం కూడా అవసరాన్ని మించి ఎక్కువ తినటంలాంటి దే.దీనివల్ల శరీరంలో కచ్చితంగా ఏం జరుగు
తుందన్నది ఇంకా పూర్తిగా తెలియకపోయి నా మరీ ఎక్కువగా,లేదా మరీ తక్కువగా నిద్ర పోతున్నవారిలో మరణాలు ఎక్కువగా
ఉంటున్నట్టు స్పష్టంగా గుర్తించారు.సరైన పోషకాహారం,తగినంత వ్యాయామం, తగి నంత నిద్ర, ఒత్తిడి లేని మానసిక స్థితి.. ఈ
నాలుగూ ఉంటే చాలు.. ఆరోగ్య పరిరక్షణ సాధ్యమే!
*నిద్ర మాత్రలతో సమస్యలు తీరవా?*
నిద్ర ఇబ్బందిగా అనిపిస్తు న్నప్పుడు వెంటనే ‘స్లీపింగ్‌పిల్స్‌’ తీసేసుకోవటం సరికాదు. లోపం ఎక్కడుందన్నది గుర్తించటంముఖ్యం.
నిద్ర పట్టకపోవటానికి- ఒత్తిడి, ఆలోచనలు ఎక్కువ కావటం,పగలంతా కాఫీలు తాగటం వంటి అలవాట్లుండటం వంటివన్నీ దోహదం
చేస్తా యి. పడుకునే ముందు ల్యాప్‌టాప్‌, మొబై ల్‌వంటివి చూడటం వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు.ముఖ్యంగా రకరకాల నొప్పుల
వంటి ఇతరత్రా శారీరక బాధలు కూడా నిద్ర పట్టకుండా చేస్తుంటాయి. డిప్రె షన్‌వంటివి ఉన్నవాళ్లు పడుకోగానే ఏదో ఆలోచనలు
వచ్చి, ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ నిద్రలేమికి ముఖ్య కారణాలే. ఏదైనా కారణం కనుక్కోవాలి.ముందు వారి అల వాట్లను,
జీవనశైలిని అడిగి తెలుసుకుని, వాటిని సరిచెయ్యాలి.అవసరమైతే ‘కాగ్ని టివ్‌బిహేవియరల్‌థెరపీ’ వంటివి ఇవ్వాలి. వీటితో
ప్రయోజనం లేనప్పుడే మాత్రలతో చికిత్స గురించి ఆలోచించాలి.నిద్ర సమస్య లకు మరీఎక్కువ పరీక్షల అవసరంఉండదు. ఒక్క
‘స్లీప్‌అప్నియా’ బాధితులకు మాత్రం ‘స్లీప్‌స్టడీస్‌’ చెయ్యాల్సి వస్తుంది.
*అసలు నిద్ర అంటే ఏమిటో,నిద్రలో ఏం జరుగుతుందో మనకు పూర్తిగా తెలుసా....
మొదట్లో అంతా నిద్ర అంటే ‘మెదడుకు విశ్రాంతి’ అనుకునేవాళ్ళం....కానీ పరిశోధి స్తు న్న కొద్దీ నిద్రలో మన మెదడులో చాలా
పనులు జరుగుతుంటాయనీ,ఆ సమయం లో మెదడు మరింత చురుకుగా ఉంటోందని తేలటం విశేషం. ...
పసిపిల్లల్లో పాలు తాగే అలవాట్లను అర్థం చేసుకునేందుకు అధ్యయనాలు చేస్తే....
రాత్రంతా మేలుకుని పిల్లలను గమనిస్తుంటే ఓ ఆసక్తికరమైన అంశం బయటపడింది. నిద్రలో మధ్యమధ్యలో పిల్లల కనుగుడ్లు చాలా
వేగంగా,గుండ్రంగా కదులుతుండటా న్ని గమనించి..... దీంతో నిద్రలో- 1.వేగంగా కనుగుడ్డు కదులుతుండే దశ ‘ర్యాపిడ్‌ఐ
మూవ్‌మెంట్‌(రెమ్‌)’ 2.అంత వేగంగా కద లని దశ (నాన్‌రెమ్‌) అని రెండుంటాయని నిర్ధరణకు వచ్చారు.నిద్రకు సంబంధించి
ఇదో పెద్ద ఆవిష్కారం.... ఎందుకంటే అప్పటి వరకూ నిద్ర అంటే గాఢనిద్ర ఒక్కటే అనుకు నేవాళ్లు . దీంతో నిద్రలో వివిధ దశలుంటా
యని తేలింది, ఆ దిశగా పరిశోధనలు......
క్రమేపీ నాన్‌రెమ్‌దశలో మళ్లీ 3 దశలున్నా యని, ఒక్కో దశలో మెదడులోని ఒక్కో భాగం చురుకుగా ఉంటోందని,వాటికి సంబం
ధించిన నాడీ రసాయనాలు, వాటి ప్రభావం కూడా మారిపోతోందని గుర్తించి...రాత్రంతా నిద్ర ఒకే రకంగా ఉండదా....దశలు ఎలా
మారుతుంటాయి ....
రాత్రి నిద్ర పడుతూనే- ముందు ‘నాన్‌రెమ్‌’ దశ మొదలవుతుంది. ఇందులో మళ్లీ ఎన్‌1, ఎన్‌2, ఎన్‌3 అని మూడుంటాయి.ఒకదా
న్నుంచి మరో దశకు మారుతూ- ఎన్‌3కి చేరుకుంటాం.ఇది గాఢమైన నిద్రా దశ.ఈ దశలో మెదడు పనితీరు,దానికి సంబంధిం చిన
తరంగాలన్నీ చాలా నెమ్మదించేస్తా యి. అందుకే దీన్ని ‘స్లో వేవ్‌’ దశ అనీ అంటారు. ఎన్‌3 తర్వాత..మళ్లీ ఒకసారి ఎన్‌1, ఎన్‌2 ల్లోకి
వెళ్లి... అక్కడి నుంచి నేరుగా ‘రెమ్‌’ దశకు వెళ్లి ఎక్కువసేపు ఆ దశలోనేఉంటాం. ఇలా ఒకసారి ఎన్‌1 నుంచి రెమ్‌వరకూ వెళ్లి తిరిగి
ఎన్‌1కు రావటానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది, దీన్ని ఒక ఆవృతం అనుకోవచ్చు. ఒక రాత్రి నిద్రలో ఇలాంటి ఆవృతాలు
ఐదారుంటాయి! రాత్రి మొదట్లో ఎక్కువ సమయం స్లో వేవ్‌దశ ఉంటుంది, రాత్రి ముదురుతున్న కొద్దీ రెమ్‌నిద్ర పెరుగు
తుంటుంది. ఒక్కో దశలో మన శరీరంలో ఒక్కోరకమైన మార్పులుసంభవిస్తుంటాయి.
నాన్‌రెమ్‌నిద్రలో:కండరాలన్నీ బాగా విశ్రాం తిలోకి వెళ్లిపోతాయి.సగటున 72 ఉండే గుండె వేగం 50-60కి వచ్చేస్తుంది.మెదడు
చురుకుదనం నెమ్మదిస్తుంది.క్రమేపీ విశ్రాంతి కి చిహ్నమైన స్లో వేవ్‌తరంగాలు మొదలవు తాయి.మనిషి గాఢమైన విశ్రాంతిలోకి వెళ
తారు.గురక పెట్టేవాళ్లలో- ఈ దశలోనే గురక శబ్దం పెరుగుతుంది.మెదడు ఈ దశలోనే- అనవసర జ్ఞాపకాలను గుర్తించి,తొలగించే
స్తుంటుంది.రెండోది- కుట్లు ,అల్లికలు,డ్రైవిం గ్‌వంటి పనులేమైనా నేర్చుకుంటే..ఆ నైపు ణ్య సమాచారాన్ని మెదడు ఈ దశలోనే
పదిలపరుస్తుంది.
రెమ్‌నిద్రలో: భావోద్వేగాలు,అవసరమైన జ్ఞాపకాలన్నీ స్థిరపడే దశ ఇది. కండరాలపై పట్టు బాగా తగ్గి, అవి చచ్చుబడినంతగా
విశ్రాంతిలోకి వెళతాయి.ఒకవైపు మెదడు చాలా చురుకుగా పని చేస్తుంటుంది,శరీరం మాత్రం పూర్తిగా చచ్చుబడినట్లుండే చిత్ర మైన
దశ ఇది.గుండె వేగం,బీపీ ఎగుడుదిగు ళ్లవుతుంటాయి.ఈ రెమ్‌దశలోనే కలలు ఎక్కువ.అందుకే రాత్రి మనం పడుకున్న దగ్గరి
నుంచీ చూసుకుంటే తెల్లవారు జాము కే కలలు ఎక్కువగా వస్తుంటాయి.
అయితే... ప్రతి రాత్రీ అందరిలోనూ నిద్రా దశలన్నీ ఇదేక్రమంలో ఉంటాయనిచెప్పలేం. దీర్ఘకాలంగా నిద్ర సరిగా లేని వారిలో ఈ దశల
క్రమంలో ఒక పద్ధతంటూ ఉండదు. ఏది ఎప్పుడై నా రావొచ్చు.దీని ప్రభావం ఆరోగ్యం మీదా పడుతుంది.అందుకే దీన్ని
సరిచెయ్యటం చాలా అవసరం......
రోజూ ఒకే సమయానికి నిద్రపోవటం,లేవ టం ముఖ్యం.
మద్యానికి దూరంగా ఉండాలి.దీనివల్ల మొదట్లో నిద్ర బాగానే వచ్చినట్లు న్నా ఆల్క హాల్‌స్థా యులు తగ్గుతున్న కొద్దీ నిద్ర సరిగా
ఉండదు. పగలు కాఫీ టీల వంటి ఉత్తేజకర పదార్ధా లు 2-3 కప్పులకు మించి తాగకపో వటం ఉత్తమం.నిద్ర పోవటానికి 2-3 గంటల
ముందు నుంచీ వీటిని తాగొద్దు .
ఒంటికి శ్రమ ఉంటేనే తర్వాత విశ్రాంతి తీసు కోగలుగుతుంది.కాబట్టి రోజూకొంతవ్యాయా మం తప్పనిసరి. రాత్రిపూట శ్రమ
ఎక్కువగా ఉండే వ్యాయామం చెయ్యొద్దు .
మన దేశంలో రాత్రి భోజనం లేటుగా చెయ్య టం అలవాటుగా మారుతోంది.లేటుగాతింటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి,నిద్ర కష్ట
మవుతుంది.నిద్ర పోవటానికి 2-3 గంటల ముందే భోజనం చేసెయ్యాలి.ఆకలి అనిపిస్తే పడుకోబోయే ముందు ఏదైనా తేలికపాటి
చిరుతిండి తినొచ్చు.
నిద్రపోయే ముందు ఇంట్లో పెద్ద లైట్లు ,ధ్వను లు, టీవీ షోస్‌వంటివన్నీ బంద్‌చెయ్యాలి. పడుకోవటానికి ఓ అరగంట ముందునుంచీ
సంగీతం వినటం,పుస్తకం చదవటం వంటి మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చెయ్యా లి. అరటి పండులోనూ,పాలలోనూ ‘ట్రిప్టో
ఫ్యాన్‌’ ఉంటుంది.పడుకునే ముందు ఇవి తీసుకుంటే కొందరికి నిద్ర బాగా పడుతుంది.
ఇవన్నీ పాటించిన తర్వాత కూడా నిద్ర ఇబ్బందిగా ఉంటే అప్పుడు......
కాగితాలను కలిపి ఉంచడాని పిన్ను గుచ్చ వలసిఉంటుంది.
అక్కడ పిన్ను ఉద్దేశం....కాగితాలను గుచ్చి
బాదపెట్టా లనికాదు..అన్నిటిని కలిపి ఉంచాలని...అలాగే కుటుoబాన్ని,సంఘాన్ని
కలిపి ఉంచాలనుకునే వారు..కోపం చూపి నంత మాత్రాన వారికి ద్వేషం ఉన్నట్లు కాదు.
పాప కార్యాలు చేస్తూ భగవంతుని ఆరాధిం చడంలో అర్థం లేదు.ఇవి రెండుయునూ పరస్పర విరుద్ధములు.ఇట్టివారు తాము
భగవంతుని భక్తు లమని చెప్పుకునే హక్కు లేదు!. జీవులను హింసించి పొట్ట నింపుకునే వారు కేవలము పాపమును మాత్రమే భుజి
స్తు న్నారు.పాప కార్యములకు,హింసకుదూర ముగా లేనంత కాలం మనం భగవంతునికి దగ్గర కాలేము.ఆయన అనుగ్రహమూపొంద
లేము.నిజముగా దేవుని సన్నిథిని కోరుకొను వారు హింసకు ,పాప కార్యాలకు దూరము గా నుండాలి. గుర్తుంచుకొండి! నేడు మన
కర్మలకు ఒకానొక సమయమందు దేవుని ముందు నిలబడి ఒంటరిగా సమాదానం చెప్పుకోవాలి....
నేను(మనం)ప్రార్ధిస్తే దేవుడు నన్ను(మనల్ని) ఇష్టపడతాడు,కానీ....నేను (మనం) పని చేస్తే నన్ను (మనల్ని)దేవుడు గౌరవిస్తా డు.
[12/30, 10:13 AM] 🌹🖤🌹
*కాలసర్పదోషం.....*
కాల అంటే కాలము అని అర్థం. సర్ఫ అంటే పాము అని అర్థం. కాలసర్ప అంటే కాలం సర్పముగా మారి జాతకులకు అనేక రకాల
కష్టా లు రకరకాల ఇబ్బందులు చేయడాన్ని కాలసర్ప యోగం లేదా కాలసర్పదోషం అని అంటారు. కాలసర్ప దోషం ఉన్నవారు తమ
వృత్తిలో పైకి రావడానికి చాలా చాలా కష్ట పడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఎంత కష్ట పడినా కూడా తగిన ఫలితం దొరకదు. ఒక వ్యక్తి
జాతక చక్రం లో రాహువు మరియు కేతువు మధ్య 6 గ్రహాలు ఉండి ఒక గ్రహం రాహువు తో కానీ , కేతువు తో కానీ కలిసి
ఒకేస్థా నంలో ఉంటే దాన్ని పూర్ణకాలసర్పయోగం అని అంటారు. అలా కాకుండా 6 గ్రహాలు రాహువు మరియు కేతువు మధ్య ఉండి
మిగిలిన 7 వ గ్రహం వేరుగా ఉంటే దాన్ని అర్థకా లసర్పయోగం అనీ అంటాం.......
పూర్ణకాలసర్పయోగం కంటే కూడా అర్థ కాలసర్ప దోషమే జాతకునికి అనేక వినాశ కర ఫలితాలను చూపిస్తుంది....
12 రకాల కాలసర్ప దోషాలు.... అనంతకాలసర్పయోగం,.కులిక కాలసర్ప యోగం.,వాసుకి కాలసర్ప యోగం.,శంకపాల కాలసర్ప
యోగం.,
పద్మ కాలసర్ప యోగం.,మహాపద్మ కాలసర్ప యోగం.,తక్షక కాలసర్ప యోగం.,కర్కోటక కాలసర్ప యోగం.,శంఖచూడ కాలసర్ప
యోగం.,ఘటక కాలసర్ప యోగం.,విషధర కాలసర్ప యోగం.,శేషనాగకాలసర్పయోగం.
ఈ కాలసర్ప యోగం మనిషి వ్యక్తిగత జీవి తంలో ఎంతగానో చెడు ప్రభావాలను చూపు తుంది.కాలసర్ప యోగం ఉన్న వారికి వారి
వృత్తి , వ్యాపారాల్లో హఠాత్తు గా పెరిగి అంత కంటే హఠాత్తు గా పతనం కావడం జరుగు తుంది.కాలసర్ప యోగం తీవ్రంగా ఉంటే ఆ
జాతకులకు అనేక విపరీతాలను ఎదుర్కోవ డమే కాక మరణం కూడా సంభవించవచ్చు. సర్పయోగం ఉన్నవారు
తమతమకుటుంబా లకు దూరం కావడం ,పెద్ద మొత్తంలో ఆస్తిని కోల్పోవడం ,ఎటువంటి కారణం లేకుండానే
సమాజంలో,కుటుంబ సభ్యుల మధ్య అప కీర్తి పాలవడం,ఊహించని విధంగా యాక్సి డెంట్లు అవడం,కాలసర్ప యోగం ఉన్న వారు
చట్టవిరుద్ధమైన మరి అవినీతి పర మైన కార్యాలకు పాల్పడి శిక్షలకు గురి అవ డం జరుగుతుంది.కాలసర్ప యోగం కుటుం బం లో
ఒక వ్యక్తికి ఉంటే అది తరతరాలుగా ఆ కుటుంబం లోని వారసులకు బదిలీ అవు తుంది అని గమనించాలి.సరైన సమయం లో సరైన
పరిహారాలు పాటించడం,సక్రమ మైన జీవితాన్ని పద్దతులనుఅనుసరించడం వల్ల కాలసర్ప యోగం నివారణ అవడానికి అవకాశం
ఉంది.
జాతక చక్రం లో 7 గ్రహాలు రాహువు ,కేతు వులు అనే రెండు గ్రహాల మధ్య చిక్కుకొని ఉన్నట్లయితే దానిని కాలసర్ప యోగం అని
పిలుస్తా రు.అంటే లగ్నానికి దగ్గరలో రాహు వు దూరంగా కేతువు ఉండటం జరుగు తుంది.
రాహువు జాతక చక్రం లో అన్ని గ్రహాలకంటే పైన ఉండాలి. కేతువు కింద ఉండాలి. అంటే రాహువు మొదటి ఆరు రాశులైనమేష,వృష
భ, మిధున,కర్కాటక,సింహ,కన్య రాశులలో ఏదో ఒక దానిలో ఉండగా కేతువు తుల , వృశ్చికం, మకరము, కుంభం, మీనం రాశిలో
ఉండగా ఈ రెండు గ్రహాల మధ్య ఉండే రాశులలో ఇతర 7 గ్రహాలు ఉంటాయి.దాని నే కాలసర్ప యోగం అని పిలుస్తా రు.
కాలసర్ప యోగం జాతక చక్రం లో ఏర్పడి ఉంటే రాహువు తో గానీ ,కేతువుతో గానీ ఒక్క గ్రహం కూడా కలిసి ఉండకూడదు. అలా
కలిసి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి.
కాలసర్ప యోగం ఏర్పడి ఉన్నప్పుడు జాతక చక్రం లో రాహువు విశాఖ నక్షత్రం లో ఉంటే కాలసర్ప యోగ ప్రభావం ఉండదు .
*కాలసర్ప యోగాల్.....
అనంత కాలసర్ప యోగము :- రాహు కేతు వులు 1,7 స్థా నాలలో ఉన్నప్పుడు ఏర్పడే కాలసర్ప దోషాన్ని అనంత కాలసర్ప దోషం అని
అంటాం.ఈ దోషం ఉన్న వారికి వివాహ జీవితం చాలా విచారకరంగా ఉంటుంది. దాని ఫలితంగా ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గం లోకి
వెళ్ళవలసి వస్తుంది.ఈ దోషం జాతకు నికి 27 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉంటుంది.
కులిక కాలసర్ప యోగము:- రాహువు రెండ వ స్థా నంలో,కేతువు 8వ స్థా నంలో ఉన్నప్పు డు దానిని కులిక కాలసర్పదోషం అనిఅంటా
రు. ఈ విధమైన దోషం ఉన్నవారు ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. ఈ విధమైన దోషం ఉన్నవారు కొన్ని సార్లు అవి నీతి
పరమైన మార్గాలలో ధనం సంపాదించి నా మళ్లీ ఆ ధనాన్ని పొగొట్టు కుని హీనమైన స్థితికి చేరుకుంటారు. ఈ రకమైన దోషం ఆ
జాతకులకు 33 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటుంది.
వాసుకి కాలసర్ప యోగము:-రాహు కేతు వులు 3, 9 స్థా నాలలో ఉన్నప్పుడు ఏర్పడే కాలసర్ప దోషాన్ని వాసుకి కాలసర్ప దోషం అని
అంటారు. ఈ దోషం ఉన్న జాతకులు తమ సోదరుల వల్ల, అక్కా చెల్లెళ్ళ వలన అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ఈ దోషం
ఉన్న జాతకులు గొప్ప పేరు ప్రఖ్యాతు లు పొందినా వారివ్యక్తిగత జీవితంలో చాలా బలహీనంగా ఉండటం జరుగుతుంది.ఈ విధమైన
దోషం జాతకులకు 36 ఏళ్ల వయ సు వచ్చే వరకు ఉంటుంది.
శంఖ పాల కాలసర్ప యోగము :- రాహువు కేతువులు 4 మరి 10 స్థా నాలలో ఉన్నప్పు డు ఏర్పడే కాలసర్ప దోషాన్ని శంఖపాల
కాలసర్ప దోషం అని అంటారు.ఈ విధమైన దోషం ఉన్నవారు కుటుంబ సంబంధాలలో తీవ్రమైన అసంతృప్తిని ,దుఃఖం మిగులు
తుంది వీరికి,ఈ విధమైన దోషం ఉన్నవారు తమ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదు ర్కోవడం జరుగుతుంది.42 సంవత్సరాలు
దాటిన తర్వాత వీరి జీవితంలో అనేక రకాల విజయాలను సొంతం చేసుకుని ఎదగటం జరుగుతుంది.ఈ విధమైన దోషం ఉన్నవారి కి
42 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ దోషం ఉంటుంది.
పద్మకాల కాలసర్ప యోగము:- రాహువు కేతువులు 5, 11 స్థా నాలలో ఉన్నప్పుడు ఏర్పడే కాలసర్ప యోగము వలన ఆ జాత కులు
స్నేహితుల వలన అతి దారుణమైన వంచనకు గురి అయి ఎంతో నష్టపోవడం జరుగుతుంది.అదే విధంగా ఈ యోగం ఏర్పడిన
జాతకులు సంతానం లేకపోవడం గానీ,అల్పసంతానం గానీ ఉండటం జరుగు తుంది.ఈ విధమైన దోషం ఉన్నవారు అనా రోగ్యం
పాలైయితే కోలుకోవడం చాలా సమ యం పడుతుంది.ఈ విధమైన దోషం ఉన్న జాతకులకి 48 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు
ఉంటుంది.
మహాపద్మ కాలసర్ప యోగము:- రాహువు కేతువులు 6, 12 వ స్థా నాలలో ఉన్నప్పుడు ఏర్పడే కాలసర్ప యోగాన్ని మహాపద్మ కాల
సర్ప యోగము అని చెబుతాం.ఈ దోషం లో ఉన్న వారు గొప్ప విద్యావంతులు మరియు పండితులు అయినప్పటికీ అతనికి అనేక
రకాల రోగాల వలన భాధ ఉంటుంది.ఈ యొగం పట్టీన జాతకులు శత్రు వుల కుట్రల వల్ల కారాగారానికి వెళ్ళే అవకాశాలు కూడా
ఉంటాయి. ఈ యోగం అనుకూలంగా పని చేస్తే ఆ జాతకులకు గొప్ప అధికారాన్ని,రాజ కీయపరమైన విజయాలను సొంతం చేసు
కుంటారు.అయితే వ్యక్తిగత జీవితంలో
మాత్రం బాధలు సమస్యలు ఉంటాయి. ఈ దోషం ఆ జాతకులకు 54 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉంటుంది.
తక్షక కాలసర్ప యోగము:- ఒక వ్యక్తి జాతక చక్రం లో 1 వ స్థా నంలో కేతువు,7 వ స్థా నం లో రాహువు ఉండి మధ్యలో మిగిలిన
గ్రహాలు ఉన్నట్లైతే దాన్ని తక్షక కాలసర్ప యోగము అని చెబుతారు.ఈ విధమైన దోషం ఉన్నవారు వివాహ జీవితం లో మరి
భాగస్వామ్య వ్యాపారంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.
కర్కోటక కాలసర్ప యోగము:- కేతువు 2 వ స్థా నంలో , రాహువు 8 వ స్థా నంలో ఉండి మధ్యలో మిగిలిన 7 గ్రహాలు ఉన్నట్లైతే దాన్ని
కర్కోటక కాలసర్ప యోగము అని చెబుతారు. ఈ విధమైన దోషం ఉన్నవారు తండ్రి సహకారాన్ని కానీ,ఆస్తు లను గానీ
పొందలేరు.ఇలాంటి దోషం ఉన్నవారు స్నేహి తులతో తరచుగా విశ్వాస సంబంద విభేదా లు ఏర్పడతాయి.రాహువు 8 వ స్థా నంలో
ఉండటం వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు రావడమే కాకుండా ఆకస్మిక మరి హింసాత్మ క మృతిని పొందేఅవకాశంకూడాఉంటుంది.
శంఖచూడకాలసర్ప యోగం:-కేతువు 3 వ స్థా నంలో, రాహువు 9 వ స్థా నంలో ఉండి మధ్యలో మిగిలిన 7గ్రహాలు ఉన్నట్లైతేదాన్ని
శంఖచూడ కాలసర్ప యోగమనిచెబుతారు. ఈ విధమైన దోషం ఉన్నవారు తరచూ ప్రభు త్వం తో మరియు ఉన్నత స్థా యి
అధికారు లతో తగాదాలు పడవలసి వస్తుంది.
ఘటక కాలసర్ప యోగము:- కేతువు 4 వ స్థా నంలో, రాహువు 10 వ స్థా నంలో ఉండి మధ్యలో మిగిలిన 7 గ్రహాలు చిక్కుకొని
ఉన్నట్లయితే దానిని ఘటక కాలసర్ప యోగ మని అంటారు.వృత్తి స్థా నమైన 10వ స్థా నం లో రాహువు ఉండటం వల్ల ఉద్యోగపరమైన
అనేక సమస్యలు తరచూ ఏర్పడతాయి. ముఖ్యంగా పై అధికారులతో వృత్తి పరంగా మాటలు పడాల్సి వస్తుంది. చీటికిమాటికి
ఉద్యోగాలు మారాల్సి వస్తుంది.
విషధర కాలసర్ప యోగము:- కేతువు 5 వ స్థా నంలో, రాహువు 11 వ స్థా నంలో ఉండి మధ్యలో మిగిలిన 7గ్రహాలు చిక్కుకొని ఉన్న
ట్లయితే దానిని విషధర కాలసర్ప యోగము అని చెబుతారు.ఈ విధమైన దోషం ఉన్న వారు తన కంటే పెద్ద వారు అయిన సోదరు
లతో అనేకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇలాంటి దోషం ఉన్నవారు తమ జన్మస్థలానికి దూరంగా దాదాపు జీవితం
మొత్తం దూరం గా ఉండవలసిన అవసరం ఉంటుంది.ఇలాంటి దోషం ఉన్నవారికి గుండె సమస్యలు,నిద్ర సమస్యలు ఎక్కువగా
ఉంటాయి.
శేషనాగ కాలసర్ప యోగము:-6 వ స్థా నంలో కేతువు,12 వ స్థా నంలో రాహువు ఉండి ఆ రెండింటి మధ్య ఇతర 7 గ్రహాలు ఉన్నట్లైతే
అలాంటి పరిస్థితిని శేషనాగ కాలసర్పయోగ ము అని చెబుతారు.ఈ దోషం ఉన్నవారు తమకి ఏ రోజూ పరిచయం లేని వారితో
విరోధాలు రావడం జరుగుతుంది.ఈ విధ మైన దోషం ఉన్నవారికి గుప్త శతృవులు ఎక్కువగా ఉంటారు.పై తెలిపిన 12 రకాల
కాలసర్ప యోగాలు కాకుండా మరో రెండు రకాల కాలసర్ప యోగాలు ఉన్నాయి అవి అనులోమ కాలసర్ప యోగం,విలోమ కాల
సర్ప యోగము ఇవి కూడా జాతక చక్రంలో కనిపిస్తా యి.
అనులోమ కాలసర్పయోగము:-అనులోమ కాలసర్ప యోగములో జాతక చక్రంలోని లగ్నం నుండి 6 స్థా నాల లోపల ముందు
వైపుకు రాహువు ఉండి అన్ని గ్రహల వెన కాల కేతువు ఉన్నట్లైతే అనులోమ కాలసర్ప యోగము ఏర్పడుతుంది. ఉదా :- ఒక వ్యక్తి
జాతక చక్రం లో లగ్నం తుల అయితే తుల నుంచి 6 వ స్థా నంలో సవ్యదశలో అంటే మీనరాశి లో రాహువు ఉన్నాడు,అన్నిగ్రహా ల
వెనకాల అంటే మిధున రాశి లో కేతువు ఉన్నాడు .ఇది అనులోమ కాలసర్ప యోగ ము. ఈ యోగం కలిగి ఉన్న వారు జీవితం లో
అత్యున్నత స్థా యిని చేరుకుంటారు. అత్యంత అద్భుతమైన ఫలితాలను చూపి స్తుంది ఈ యోగం.
విలోమ కాలసర్ప యోగము:-విలోమ కాల సర్ప యోగము లో జాతక చక్రం లోని లగ్నం నుండి 6 స్థా నాల లోపల ముందు వైపుకు
కేతువు ఉండి అన్ని గ్రహల వెనకాల రాహు వు ఉన్నట్లైతే విలోమ కాలసర్ప యోగము ఏర్పడును. ఈ యోగం కలిగి ఉన్న వారు
జీవితం లో అనేక రకాల కష్టా లను మరియు విపరీతంగా నష్టా లు  చాలా తీవ్రస్థా యిలో పొందుతారు. అందు వల్ల విలోమ కాలసర్ప
యోగము ఉన్న వారు చెడు ఫలితాలు చూస్తా రు.
మనిషి జాతకం లో ఏలినాటి శనిని మరి కాలసర్ప యోగాలు విపరీతమైన చెడుప్రభా వాలను ,ఫలితాలు కలిగిస్తుంది.రాహువు
కేతువులు సహజంగా పాపగ్రహములు అయినప్పటికీ ఆ గ్రహాలు కొన్ని సార్లు రాజ యోగాన్ని కూడా కలిగిస్తా యి.ఒక వ్యక్తి జాతకం
లోని కేంద్రములు లేక కోణములలో రాహువు లేదా కేతువు ఉన్నట్లైతే ఆ జాతకు లకు రాజయోగం పడుతుంది.
రాహువు లేదా కేతువు ఒక వ్యక్తి జాతక చక్రం లోని ఉపచయములలో అంటే లగ్నం నుండి 3, 6, 10, 11 స్థా నములు ఉన్నట్లైతే ఆ
జాతకులకు కచ్చితంగా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒక వ్యక్తి జాతక చక్రంలో వృషభం లేదా కర్కాటకం లేక సింహం లేదా
కన్యారాశిలో రాహుగ్రహం ఉంటే ఆ జాతకు డికి రాజయోగం పడుతుంది.
జాతక చక్రా లలో కాలసర్ప యోగము ఉన్న వారు జీవితంలో అనేక కష్టనష్టా లను,అనేక సమస్యల్ని ఎదుర్కొని అభివృద్ధి సాధించా ల్సి
ఉంటుంది.ఒక రకంగాచూస్తేఆ కాలసర్ప దోషం ఉన్న జాతకులు విపరీతమైన ఓర్పుని అనుభవాన్ని సమస్యలను ఎదుర్కొనే నేర్పు ని
కలిగిస్తుంది .
🌷❣️🌷
      
హిరణ్మయకోశము,ఈ హిరణ్య గర్భస్థితి దివ్య యానమునకు ఆధార భూతమైనటు వంటి స్థితి.కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక హిర ణ్య
గర్భస్థితిని అందుకోవలసిన అవసరం ఉన్నది సాధకులందరికి కూడా.ఋషులైపో తారు అన్నమాట..ఎవరైతే ఈ హిరణ్యగర్భ స్థితిని
తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడ బ్రహ్మనిష్ఠు లై మహర్షులౌతారు.ఎందువల్లం టే ఈ హిరణ్మయకోశమే సర్వసృష్టికి ఆధార
భూతమైనటువంటి స్థితి.
      ఇక్కణ్ణుండి ఏం చెబుతున్నారు?- యజ్ఞంలో అంటే ఋత్త్విక్కులు యజ్ఞం చేసే టప్పుడు అరణిని మధిస్తా రు.అంటే మన
అగ్గిపుల్లల అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికి రాదు అన్నమాట.అది స్వాభావి కమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే
సాధ్యమై ఉన్నదో,దానిని స్వీకరించాలి అనే టటువంటి నియమం ఉందన్నమాట.
అందువలన అరణిని మధిస్తూ ఉంటారు. ఎక్కడై నా యజ్ఞం చేసే చోట మొట్టమొదట అంకురారోహణ తరువాత అక్కడ అరణిని
మధిస్తూ ఉంటారు.అరణి అంటే అర్ధం ఏమి టంటే రావి,జువ్వి అనేటటువంటి కఱ్ఱలుం టాయి. ఈ రావి,జువ్వి అనే కర్రలు ఒకదాని
పై ఒకటి పెట్టి,వాటిని మధిస్తా రన్నమాట.
        ఆ పైనించి ఒక కఱ్ఱ ఉంటుంది,క్రింద ఒక కఱ్ఱ లో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో, వడ్రంగి బర్మా తిప్పినట్లు గా,అది
బాగా బలవత్తరంగా తిప్పుతారు.ఆ రాపిడి వలన ఈ కఱ్ఱ కఱ్ఱ రాపిడి వలన,రెండు కఱ్ఱలలోకూడ ఆంతర్భూతమైఉన్నటువంటి అగ్ని
ఉత్పన్నమౌతుంది.ఆ ఉత్పన్నమైనటు వంటి అగ్నిని జాగ్రత్తగా ఆ దూది ద్వారా మండించి,ఆ దూది ద్వారామండినటువంటి అగ్ని ని
ఇతరితర హవ్య ద్రవ్యాలనుమండిం పచేసి, అట్టి అగ్నిని తీసుకు వచ్చి,యజ్ఞాన్ని ప్రారంభిస్తా రు.
    ఈ రకంగా ఋత్త్విక్కులు అరణి చేత మంధించబడినటువంటి అగ్నిని ఎలా అయి తే వాళ్ళు కాపాడుకుంటూ వస్తు న్నారు.
అయితే ఇది ఎప్పటినుండీ ప్రారంభమైంది?- ఋగ్వేదకాలం నుండి ప్రారంభమైంది.కృత యుగ కాలం నుండి ఈ యజ్ఞ విధానం
ప్రారంభమైంది.కాబట్టి అప్పటినుండి అను చానంగా,సాంప్రదాయంగా,గురుశిష్య పారం పర్యంగా ఈ అరణి ద్వారా అగ్నినిమంధించే
టటువంటి,అగ్ని ద్యోతక విధానాన్ని మనం కాపాడుకుంటూ వస్తు న్నాము.ఏమిటి అసలీ అరణి? దీనిలో ఉన్న తాత్త్విక దృక్పథమే
మిటి?- అంటే ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రింది భాగమేమో జీవా త్మ, పై భాగమేమో పరమాత్మ. పరమాత్మ
యొక్క ప్రభావం చేత జీవాత్మ నడుపబడు చున్నది. పరమాత్మ- జీవాత్మ ఏదైతే ప్రత్య గాత్మ – పరమాత్మ వున్నాయో ఈ రెండింటి
మధ్యలో అగ్ని ఉన్నది.అగ్ని చేతనే సర్వ సృష్టి పోషింపబడుచున్నది.
సర్వ సృష్టి సృష్టించబడుచున్నది.సర్వ సృష్టి లయింపబడుచున్నది.పునః ప్రాదుర్భవించే ది కూడ ఆ అగ్ని వలనే.కాబట్టి అట్టి అగ్ని
స్థా నమును,అట్టి అగ్ని యొక్క స్థితిని తెలు సుకోవలసినటువంటి అవకాశం అవసరం అందరికీ ఉన్నది.దీనికి అందుకంటే చయన
విద్య,అగ్ని విద్య అని కొన్ని నామాంతరము లు కూడ ఉన్నాయి.
    సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారముతో పోషించుకోవా లి. అధికమైన ఆహారాన్ని తినకూడదు.ఎవ రైతే
అధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరి స్తా రో, వారు శరీరభావాన్ని,శరీర తాదాత్మ్య తను సులభంగా పొందుతారు.కారణం భోజనం
ఫుల్లు గా [full] తిన్న తరువాత నిద్ర వచ్చేస్తుంది.ఆ నిద్ర అనేటటువంటి మత్తు శరీరభావం చేతనే కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి
పూట పోయే నిద్ర కూడ శరీర తాదాత్మ్యతాప్రభావం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మనిష్ఠు లై ఉన్నారో,ఎవరైతే
జీవన్ముక్తు లై ఉన్నారో వారి కి నిద్ర అనేది ఉండదు.వారు ఎపుడూ తురీ యనిష్ఠలో ఉంటారు.
     అట్టి తురీయనిష్ఠ యందు శరీరమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు ఉన్నప్పటికీ, తాను విలక్షణుడై ఉండుటచేత, తాను సాక్షీ
భూతుడై ఉండుటచేత,తాను సాక్షీ మాత్రు డై ఉండుటచేత,సదా హిరణ్మయకోశమందు రమించేటటువంటి లక్షణం కల్గి ఉండుట
చేత,సదా అగ్ని దీప్తిని కలిగి యుండుట చేత,సదా స్వయం ప్రకాశాన్ని కల్గి ఉండుట చేత ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని,
అజ్ఞానాంధకారాన్ని తాననుభవించడు.దీని కొక ఉపమానం ఉంది.ఎట్లా అంటే సూర్యుని యందు చీకటి ఉండే అవకాశం ఉందా?
అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు...
🌷💟🌷
        
ఒక్కనారాయణ నామమే సారమని వేద శాస్త్రా ల ప్రమాణము కలదు.మరియు శృతులు కూడా అదేమాట చెప్పినవి.కావున నామ
జపము చేయవలెను.
జపము,తపము మరియు కర్మలు హరి
నామములేని ఏ ఇతరధర్మాలైనా అనవసర మైన శ్రమ.సమయమంత వ్యర్థమైపోవును. కమలముపై వ్రాలి మకరందమును గ్రోలు
చున్న తుమ్మెదతీరుగ.హరిపాఠమును అను సరిస్తూ నడిచేవారంతఆనందంగాజీవిస్తా రు.
హరినామము ఒక దివ్యమైనశస్త్రము.నామ పఠనము చేసే వారి కుల గోత్రీకులను కూడ యముడు పట్టజాలడు
వేద శాస్త్రా ల ప్రమాణము
శృతులు చెప్పిన వచనము
నారాయణ నామమే సారము
నామ జపము తరుణ్ పాయము
జపతప కర్మలు సర్వము
హరినామము వీడిన ధర్మము
“పనికి మాలిన కష్టము
వ్యర్థమయ్యెను జీవితము”
హరిపాఠమున ప్రయాణము
అయినారు వారు సుస్థిరము
తుమ్మెద గ్రోలిన చందము
కమలములోని మకరందము;
జ్ఞానదేవుని మంత్రము
హరినామము దివ్య శస్త్రము
కుల గోత్రీకులను సహితము
వర్జించును యముడు సత్యము....
*It is only those who persevere to the end that succeedz.
*చివరి వరకు ఎవరు పట్టు దలతో ఉంటారో వారే జయిస్తా రు.
*We want to get everything from nature, but we find in the long run that nature takes everything from us,
depletes us and casts us aside.
*ప్రకృతి నుండి అన్నింటినీ పొందాలని అను కుంటాం.కానీ ప్రకృతి మన సర్వస్వాన్ని సంగ్రహించి శక్తిని పూర్తిగా హరించి,పక్కన
పారేస్తుందని చివరికి తెలుస్తుంది.
🌷💛🌷
           
*దోషాలను శుద్దిచేసే స్పిరిట్ మనలోనే ఉంది... అదే స్పిరిచ్యువాలిటి...
*గుణాలను నమోదు చేసుకునే మనసే తిరిగి వాటికి ఫలితాలనుకూడాఅందిస్తుంది. మనఆశ,కోపం,అసూయ,ద్వేషం అన్నింటినీ
శుద్ధి చేసేది వాటికితగిన ఫలితాలనుఅందిం చడం ద్వారానే.ఆ శుద్ధి కార్యక్రమాన్నే మనం మనకోణంలో చూసి శిక్షలుగా భావిస్తా ము.
మన దోషాలను శుద్దిచేసే స్పిరిట్ మనలోనే ఉంది.అదే మనని గుణరహితంగాచేసే స్పిరి చ్యువాలిటి.మన సుఖాలకు కారణం మనం
చేసిన పుణ్యం,మన దుఃఖాలకు కారణం మనంచేసిన పాపం.అందరికీ వర్తించే ఈ శాశ్వతసత్యం స్మరణలో ఉంటే వేదన చెంద కుండా
మన పాప,పుణ్యకార్యాలనుమనమే నియంత్రించుకుంటాము. మనకు తెలిసినా , తెలియకపోయినా మనంచేసే పాప, పుణ్య
ఫలాలు ఖచ్చితంగా మనతోనే ఉంటాయి!..
🌷🧡🌷
       
*"ఓం సత్యం పరం ధీమహి"అనునది నిజ మైన గాయత్రి మంత్రం.పరమైనది,సత్యమై నది అను దానిని నేను ఆరాధనచేస్తు న్నాను
అని అర్ధము.ఈ మంత్రము బ్రహ్మమును చేరడానికి ఈయబడిన మంత్రము.
*"ఓం సత్యం పరం ధీమహి" అనునది ఏక పధ గాయత్రి.ప్రాపంచిక విషయములందు సంగము లేనివారు ఎక్కువగా ఈమంత్రము
చేస్తా రు."తత్సవితుర్వరేణ్యమ్ భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్" ఇది మూడుపాదాల గాయత్రి.ఇది విశ్వామిత్రు ని
ద్వారా మనకు అంది వచ్చినది.
💖
      
*"నువ్వు నువ్వుగా ఉండు' అనే బోధలోని ఆంతర్యం ఏమిటి...."
'నేను మనిషిని' అని అనుకోకపోయినా మనందరం మనుషులమే.మనందరం దైవ స్వరూపులమని వేదం చెప్తుంది.కాబట్టి నేను
దైవాన్ని అనుకోకపోయినా మనందైవస్వరూ పులమే.తాము ఆత్మస్వరూపులం అన్న పరిపూర్ణ జ్ఞానం కలిగిన మహానుభావులు 'నువ్వు
నువ్వుగా' ఉండమని బోధించారు. మనం మనంగా ఉండటమంటే నేను ఆత్మ నని, అజ్ఞానినని,దైవాన్నని,దేహాన్నని ఏదీ
అనుకోవాల్సిన అవసరం లేదు.వ్యవహారం లో తగినంత మితంగా ఉంటేచాలు.ఇప్పటికే ఆత్మస్వరూపులుగా ఉన్న మనం ఆత్మగా
మారటానికి ఏ సాధనచేయనక్కర్లేదు.మనం చేయాల్సిన సాధన అంతా ఇప్పుడున్న అనాత్మభావనను తీసేసుకోవడానికే !..
💚
        
లోకాయుతులు(భౌతికవాదులు)పామరజనులు ఇంద్రియ గోచరమైన ప్రత్యక్షమును, మిథ్యను,మాత్రమే ఆశ్రయించి కూటస్థము
మొదలు శరీరము వరకు గల సంఘాతము ను ఆత్మ అందురు.
తమ వాదము వేదసమ్మతమని చెప్పుటకు వారు అన్నమయకోశమును విరోచన సిద్ధాం తమును ప్రమాణముగ ఊటంకింతురు...
మరికొందరు లోకాయుతులు,జీవాత్మ శరీర మును వదలినపుడు శరీరముమరణించుట వలన,ఆత్మ నిశ్చయముగ శరీరము కంటె
భిన్నం..."నేను మాటలాడుచున్నాను" మొదలగు ప్రయోగముల వలన దేహము కంటె భిన్నమగు అహం బుద్ధిని సూచించు
ఇంద్రియములే ఆత్మ...
🌷 💕🌷
      
*నా వైభవమును,వీరికి నాతోగల యోగము ను గూర్చిన జ్ఞానమును ఆవశ్యకత బట్టి  కొందరు జీవులకు కూడా కల్పింతును.ఇప్పు
డు నీకెట్లు కలిగించితినో వారికి అట్లే కల్పిం తును.వారే మంత్ర ద్రష్టలు,శాస్త్రకర్తలు,ధర్మ మూర్తు లై లోకమును కాపాడుటకు నిమిత్త
మాత్రము అగుదురు.ఇట్టినా వైభవమును, వీరితో గల యోగమును తత్త్వముగ తెలిసి నవాడు అచంచలమైన యోగస్థితి పొంది నా
యందు వసించును.
*ఎవరియందు ఏది ప్రత్యేకత వహింపవలెనో వారి యందు వైభవమును నా భావముగ కల్పించి నేనుగ నుందును.ఇట్లు ఈ సమస్త
మునకు 'నేనే' ఉత్పత్తి కారణమనియు 'నా' యందే భావములుగ జగత్తు లు వర్తించు చున్నవనియు స్మరించి నన్ను ఆరాధించు
వారు బుధులు అనబడుదురు.వారికందరి కిని నా భావములే యుండును.లోకములం దు జ్ఞానము జీవులకు ప్రకాశించుటకు
వారే గురువులు.
*వారు 'నేనే' చిత్తముగా జీవించుచు,వారు బోధించు బోధగా నన్నే అనేక కథలరూపము న చెప్పుకొనుచు,సంతోషించుచు,స్వేచ్ఛా
విహారము చేయుచుందురు.ఆ కథలే సర్వ మానవ పురాణ గాధలు.నా కథల యందు ఇట్లు ప్రీతి కలిగి యోగస్థితిలోన ఆరాధించు
వారికి బుద్ధిరూపమున ప్రసన్నమై నా జ్ఞాన మును వారియందు నిలుపుటకు క్రీడగొని యుందును.దీనినే నా అనుగ్రహమందురు.
అది కలిగిన వానికి తెలియనిది ఏమియు లేదు.వానియందు'నేను'జాలిగొని వారిలోని నేనుగ జ్ఞానదీపమై ఉండి,అజ్ఞాన తిమిర ము
సమీపించకుండ చూచుకొందును.
🌷💜🌷
    
ఏ బుద్ధిచేత దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను,భయమును,దుఃఖమును,సంతాప మును (దిగులును),మదమును విడువక
యుండునో -అట్టి ధైర్యము తామసమైనది.
ధైర్యము గొప్పసుగుణమే.కాని అది దుర్వి షయములందు వినియోగింపబడునపుడు నిష్ఫలమైపోవును.తమోగుణయుతుడు
ఒకానొక ధైర్యమవలంబించి తన అతినిద్ర ను, భయమును,దుఃఖమును,దిగులును, మదమును వదలకయే యుండును.ధైర్య
మను గొప్ప సుగుణము అట్టి నిద్రాభయాది నికృష్టవస్తు సంపాదనమున వినియోగింప బడుటచే నిరర్థకమైపోయినది.
కాబట్టి ఆ ధైర్యమునే సద్వస్తు సంపాదన
మునకు,సచ్ఛీలసముపార్జనకు,మోక్షప్రాప్తికి, దైవకరుణను సంపాదించుటకు వినియోగిం చుట ఉత్తముని ధర్మమైయున్నది.వాల్మీకికి
అపారధైర్యము,పట్టు దలకలదు.కాని మొట్ట మొదట ఆ ధైర్యమును,పట్టు దలను దుర్వృ త్తు లందు,పరమహింసాకార్యములందు
ఉపయోగించి విఫలుడయ్యెను.కాని మహ నీయుల సాంగత్య ప్రభావముచే తిరిగి ఆ ధైర్యమునే రామనామజపమందును,దైవ
ధ్యానమందునువాడుకొని ధన్యుడయ్యెను.
“దుర్మేధా” - అనిచెప్పుటవలన అతనికి మేధ (తెలివి) యున్నప్పటికిని దానిని వక్ర మార్గమున ప్రవేశపెట్టెనని భావము.
"స్వప్నమ్” - (నిద్ర) ఇచట నిద్రయని చెప్పిన చోట "అతినిద్ర' యని భావించుకొనవలెను. ఏలయనిన మితనిద్ర సర్వులకును అవస
రమే అయియున్నది.
*తామసధైర్య మెట్టిది...*
ఏ ధైర్యముచే దుర్బుద్ధిగలవాడు నిద్రను, భయమును,శోకమును,దిగులును,మద మును విడువకయుండునో అది
తామసధైర్యం...
🌹💙🌹
        
* ఆమము ,విదగ్ధము ,విష్టంభము ,రస శేషము అను భేదములచే అజీర్ణము 4విధ ములుగా ఉండును.వీటన్నిన్నిటికి మజ్జిగ
ఔషధముగా పనిచేయును .
*భోజనాంతరము చేతిని కడుగుకొనిన తరువాత అరచేతితో నేత్రములనుతుడుచు కొనిన గాని ,అరచేతితో నీటిబొట్టు ను నేత్ర
ములలో వేసుకొనినగాని నేత్రరోగములు మానును .
భోజనము చేసి పనిలేకుండా కూర్చుండు వాడు లంబోదరుడు అగును.భుజించిన తరువాత శయనించువారికి సుఖము కలు
గును. భోజనము చేసి కొంత సమయము తరువాత శ్రమించువానికి ఆయుర్వృద్ది కలిగి మరణము దూరము అగును.
*ఆకలిగా ఉన్నప్పుడు భుజించుతూ , ఎడమవైపు తిరిగి పడుకొనినవానికి వైద్యునితో పని ఉండదు.
ఆకలితో ఉన్నవాడు సమయానికి భుజించ ని యెడల కట్టెలు లేని ఆగ్నిహోత్రము వలే జఠరాగ్ని నశించి శరీరము కృశించును .
*భోజనం చేసిన పిమ్మట ఎడమప్రక్కకు తిరిగి పడుకుండిన యెడల పిత్తా శయము నుండి ఆహారం జీర్ణం అగుటకు కావలసిన
పైత్యరసము సరిగా ప్రసరించి జఠరాగ్ని వృద్ది అగును. కావున భోజనానంతరం ఎడమప్రక్కకు తిరిగి పడుకొనవలెను .
* నిద్రపోవు కాలము నందు ఎడమప్రక్కన పరుండినప్పుడు 32 సార్లు ,కుడివైపు పరుండినప్పుడు 25 సార్లు ఉచ్ఛ్వాస
నిచ్ఛ్వాసములు వెడలును.ఇతర విధముల పరుండప్పుడు పదిసార్లు కలుగును.
*అనవసరముగా ఔషధసేవన చేయుట , కుడివైపు ఎక్కువుగా పడుకోవడం ,భోజన మునకు బదులు ఇతరవస్తు వులు భుజించ టం
వలన మనుష్యునకు తృప్తి కలగవచ్చు ను కాని అనారోగ్యం తప్పక కలుగును .
*జఠరాగ్ని ఆహారమును వచింప ( జీర్ణం ) చేయును .ఆహారం లేనివారికి ఈ జఠరాగ్ని శరీరమునే దహింపచేయును .దానివల్ల
సర్వధాతువులు క్షీణించి ప్రాణములు కూడా పోవును .
* భోజనం చేసిన పిమ్మట భుక్తా యాసం తగ్గువరకు కొంచంసేపు విశ్రాంతి తీసికొన వలెను .తరువాత 100 అడుగులు అటు ఇటు
తిరగవలెను.కుర్చొని లేచుచూ ఉండవలెను .
*భుజించిన ఆహారం మరునాటికి రసధాతు వుగాను ,మూడొవ రోజుకి రక్తముగాను , నాలుగొవ రోజుకి మాంసముగాను , అయి
దోవ రోజుకి మేధస్సుగాను ,ఆరోవరోజుకి అస్థిధాతువుగాను ,ఏడోవ రోజుకి మజ్జి ధాతువుగాను ,ఎనిమిదొవ నాటికి ఉత్క్రు ష్టమైన
శుక్రధాతువుగా మారును....
*అజ్ఞః సుఖ మారాధ్య...
ఏమీ తెలియని వానిని సులభముగ సేవిం పవచ్చును.అనగా అతనికి చెప్పి ఒప్పింప వచ్చును.
విశేషముగా జ్ఞానముకల వానిని మిక్కిలి సులభముగా సేవింపవచ్చును.
ఇక తెలిసిన/ కలిగిన కొద్దిపాటి జ్ఞానమునకే తనకంతా తెలుసునని అహంకరించెడి వానిని సాక్షాత్తు బ్రహ్మకూడ,అనగా అతడిని
పుట్టించినవాడుకూడ రంజింపజేయ లేడు.
అనగా అట్టివాడు ఎవ్వరుచెప్పినా వినడు..
🌹🌹🌹🌹🌹
*కొంతమందిని ఐదు నిముషాల్లోనే నమ్మొచ్చు....,ఇంకొంతమందిని ఐదు సంవ త్సరాలైనా నమ్మలేకపోవచ్చు....నమ్మకం,
స్నేహం,ప్రేమ,బంధం ఇవన్నీ  బ్రతిమాలు కుంటే వచ్చేవి కావు....
గ్రాడ్యుయల్ గా సంపాదించుకునేవి...వేచి చూసే ధోరణి ఉంటే,దొరికితే దొరుకుతాయి లేకుంటే పోతాయి.
వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతగాని వాళ్లు , నీపర్సనల్ ..కులం,ధనం, వర్ణం గురించి మాట్లా డుతారు....మనం వినేవి,
చూసేవి అన్నీ నిజాలుకావు.ఒకరు తప్పించు కోవడానికి,ఇంకొకరిని ""బలి"" చేసేస్తా రు,
జాగ్రత్త...
ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లా డ కు ముందు నీ జీవితం గురించి ఆలోచించు కో బతికినంత కాలం బాగుపడతావు .
  ప్రతి హృదయానికి బాధ ఉంటుంది కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు కళ్ళల్లో దాచి పెడితే మరికొందరు
నవ్వులో దాచిపెడతారు.
    మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు.అలా ఉంటారనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన
గుండె దైర్యం తప్ప మరోకటికాదు.
    జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసిన నన్ను
నమ్ముకునవాళ్ళని నేనెప్నుడూ మోసం చేసింది లేదని.
   సమాజం దృష్టిలో గొప్పగా ఉన్న లేకున్నా పర్వాలేదు కానీ మనసాక్షి ముందు గర్వాం గా తలెత్తు కొని బ్రతకగలిగితే అంతకంటే 
గొప్ప జీవితం ఉండదు , ప్రేమ ,ద్వేషం , సంపద ,పేదరికం ఇవన్నీ దాచడం చాలా తేలిక వ్యక్తిత్వని దాచడం చాలా కష్టం.
*మనిషిది చాలా చిత్రమైన స్వభావం,
ఇసుకలో సౌదంచూస్తా డు. రాయిలో శిల్పం   చూస్తా డు.లోహంలో ఆభరణం చూస్తా డు.
ఆకులో ఔషధం చూస్తా డు.అద్దంలో అందం చూస్తా డు..కానీ,సాటి మనిషిలో మాత్రం_
మనిషిని చూడలేడు.
       🌹💙🌹
*ఏమని ప్రార్థించాలి.....ప్రార్థన (ప్ర+ఆర్థన) అంటే చక్కగా వేడుకోవడం.ఈ వేడుకోలుకు అర్థం,పరమార్థం అనేవి రెండూ బొమ్మ
బొరుసు లాంటివి.మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం,అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం సహ జం.
ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు.
ధనం ఇంధనంలా దహించుకుపోతుంది. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటా యి.ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు
అర్థం అవుతుంది.అప్పుడు ఈ భౌతి కమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న ఎరుక కలుగుతుంది.వీటికి మించిన శాశ్వ తానందం
ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవు తుంది.గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష,ఒక ఆర్తనాదమై ఒక
ఆవేదనారూపమై చెలరేగుతుంది.అదే ప్రార్థన!
దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డ ను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు , భగవంతుడు భక్తు లనులాలించి,పాలిస్తా డు.
పరమ ప్రేమస్వరూపుడై న భగవంతుడికి తన సంతానంపైఉన్న అనంతమైన ప్రేమాను రాగాలను వరాల రూపంలో అందిస్తా డు.
సాత్వికులైన ధ్రు వుడు,ప్రహ్లా దుడు శ్రీమహా విష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే
పరమానందం కావాలని అడిగారు. తపస్సుచేసిన హిరణ్యకశిపుడు,రావణుడు అధికారం,ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని
వారే కొని తెచ్చుకున్నారు.పరుల సుఖాల్నే మన సుఖమని,విశ్వశ్రేయమే మనకూ శ్రేయోదాయకమని,బుద్ధిగా జీవించాలని త్రికరణ
శుద్ధితో ఆ పరమాత్మ కు చేసే విన్నపమే ప్రార్థన! అదే మన ఆధ్యా త్మిక ప్రగతికి తొలి సోపానం.
భగవంతుణ్ని సేవించే భక్తు లను నాలుగు తెగలుగా చెబుతారు- ఆర్తి,అర్ధా ర్థి,జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా
దగ్గరివాడు జ్ఞాని.....
భగవంతుడు అన్నీ ఇచ్చాడు.అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది.కారణం ఏదో ఒకమూల
స్వార్థపిశాచం పీడించడం వల్లే అలామనసు అల్లా డుతూ ఉంటుంది.మనం చేయవలసి నదేదో శక్తివంచన లేకుండా,సక్రమంగా చేస్తే
చాలు...తక్కినదంతా ఆయనే చూసుకుం టాడు.... అయినా అజ్ఞానం,అహంకారం, మమకారం...ఈ మూడూ ఏకమై మనల్ని
పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.
అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని,ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని,
పరోపకారంవైపు బుద్ధిని మరల్చమని,మాట లకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడు కోవడమే నిజమైన ప్రార్థన.ఆ ప్రార్థన సన్నని
వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడి పిస్తుంది.‘సర్వేజనాః సుఖినో భవంతు’అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి
అందించింది.అదే మన జీవితాలకో దారి దీపమై వెలుగు చూపాలని అర్థించాలి.అదే మనం చేయవలసిన ప్రార్థన......
🌹💙🌹
         
మనవ శరీరమంతా,ఒకానొక శక్తి వలయం తో చుట్టబడియుంటుంది.ఆ శక్తి-తేజో వల యం, ప్రతి మనిషికి ఉంటుంది.ఈ శక్తి-తేజో
వలయం, మనిషి తల చుట్టూ,మరింత దట్టంగా వ్యాపించి ఉంటుంది.ఈ ఆరా లేదా తేజోవలయం..చాలాసార్లు రంగుల మయం గా
కూడా ఉంటుంది.ఆరాలో ఉండే రంగుల ను బట్టి,ఒక వ్యక్తిని సమగ్రంగా విశ్లేషించ వచ్చును.ఈ ఆరా-థెరపీని, alternative
medicine గా కూడా ఉపయోగించడం,ఈ రోజు జరుగుతోంది.ఆరాను ఫోటోగా కూడా తీసారు.అదే Kirlian Photography.ఈ
కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా,ఒక వ్యక్తి లేదా జంతువు లేదా జీవ వస్తు వు యొక్క aura ను కొంతవరకు భౌతికంగా గమనించవచ్చు.
అయితే ఒక సిద్ధ పురుషుడికి,ఈ భౌతిక ఉపకరణాలేవీ అవసరం లేదు.అయితే మనం ఒక్క విషయం గమనించాలి.
   మనిషి శరీరం చుట్టూతా ఉన్న"ఎథిరిక్".. దాదాపు,మనిషి శరీరాకృతిని ప్రతిబింబిస్తూ ఉంటుంది.కానీ "ఆరా"మాత్రం మనిషి
శరీరం చుట్టూ,దాదాపు అండాకృతిలో ఉంటుంది. ఒక మనిషి,భౌతికంగా-మానసికంగా-ఆధ్యా త్మికంగా గొప్ప శక్తి కలిగియున్నాడు
అంటే, అతని "ఆరా" కొన్ని అడుగులదూరం వ్యాపి స్తూ,విస్తరించి ఉంటుంది.
మన చుట్టూ,శక్తివంతమైన విద్యుదయ స్కాంత శక్తి వలయం వ్యాపించి ఉంటుంది. ఈ శక్తి వలయం మన aura లోపలికి కూడా
చొచ్చుకొని వచ్చి,ఉంటుంది.
    శక్తి స్వరూపంలో భాగమే "ఆరా"లేదా "కాంతి వలయం".రోగాన్ని నిదానించే లేదా రూపుమాపే పద్ధతిలో,ఒక యోగి లేదా సిద్ధు
డు, సూక్ష్మ శరీరంలో గానీ,శక్తి ప్రవాహంలో ఆటంకాలు తొలగించుకుంటూ,శరీరమంతా ప్రాణశక్తిని ప్రవహింజేస్తా రు.ప్రాణ శక్తి ఆటం
కాలవలనే,ఆది-వ్యాదులు వస్తా యని,చాలా మందికి తెలుసు! మీతేజో వలయం (aura), మీ మనస్సును తెలియ జేస్తుంది కూడా!
'ఆరా'అంటే,జీవ-విద్యుదయస్కాంత శక్తి వలయం కావచ్చు.ఇంకా సైన్సు పరిశోధన చేయాలి.ఈ శక్తివలయం ప్రతిమనిషి,మొక్క
లు-చెట్లు ,జీవుల-నిర్జీవుల చుట్టూ... భిన్న భిన్నాలుగా ,భిన్న భిన్న తరంగ దైర్ఘ్యాలలో వ్యాపించి ఉంటుంది.
ఆరా భిన్న రంగుల(మనం చూడని రంగులు కూడా)తోనూ,భిన్న అంశాలతో కూడియుం టుంది.ప్రతి రంగుకూ,ప్రత్యేక అర్థం
ఉంటుం ది! ఒక మనిషి చనిపోతే,అతని aura,క్రమ క్రమంగా అదృశ్యం అయిపోతూ ఉంటుంది. వైశ్విక చైతన్యంలో లీనమై
పోతుంది.కానీ అతని etheric మాత్రం,మరికొంత కాలం కొనసాగుతుంది.కొన్ని నిబంధనలపై ఈ కొనసాగింపు ఉంటుంది!..
     సతత ధ్యానము,ధూమ్ర పురుష సాధన, ఆకాశమందు స్వరూప దర్శనం,స్వరోదయ శాస్త్రప్రయోగము,త్రాటకము,సమాధిఅభ్యా
సం, మంత్ర (ఆరాకు సంబంధించి) సాధన, చక్ర సాధన...ఇత్యాది సాధనలు నిరంతరం అభ్యసించుట వలన...ఒక వ్యక్తి యొక్క
కాంతి వలయం కనిపించవచ్చును.ఆ కాంతి వలయంలో,ప్రస్ఫుటించు రంగులను బట్టి, ఆ కాంతి వలయాన్ని విశ్లేషించవచ్చును.ఒక
వ్యక్తి తానునటించిననూ,ఒకసిద్ధు డై నయోగి అతని ఆరాను చూచుట వలన,అతని నాట కము పరి సమాప్తి అగును.ఆ వ్యక్తి నిజ స్వ
భావము తేట తెల్లమగును.ఆరాలో మన కంటికి కనిపించే వర్ణాలే కాకుండా,మనకంటి చూపు పరిధిలోకి రాని వర్ణాలు కూడా ఉన్నా
యి. ఆ రంగులకి,పేర్లు పెట్టలేం.చాలా రంగు ల మిశ్రమాలకి పేర్లు పెట్టలేం.
  కొన్నిసార్లు కొంతమందికి etheric కనబడు తూ ఉంటుంది.వారు దానిని aura గా భ్రమ పడతారు.నిజానికి etheric వేరు.aura
వేరు.ఒక మనిషి చనిపోకముందే,అతని aura పూర్తిగా మాయమై,ethiric మాత్రం మిగిలియుంటుంది. Ethiric అంటే లింగ
శరీరం అని అర్థం చేసుకోవాలి మరి!..
   ఒక వ్యక్తి చనిపోయిన తరువాత..అతని aura ఆ కళేబరం వద్దనే తచ్చాడుతూ ఉంటుంది.అట్టి ఆరాను లేదా ఆ చనిపోయి న
వ్యక్తి  బయట ఉన్న aura ను చూడగలిగి న శక్తి ఉన్న ఒక సిద్ధ యోగి,ఆ వ్యక్తి మరణా నికి కారణమేదో తెలుసుకోగలడు.
     కొన్ని సార్లు ,కాంతి వలయంలో (aura) గల నెగెటివ్ ఫోర్సెస్ ను,పరిశుభ్రం చేస్తు న్న సమయాలలో....చక్రా లపై,ప్రాణశక్తి ప్రవాహా లపై
కూడా దృష్టి మరలుతుంది.ఒక సిద్ధు డై న యోగి,వాటిని కూడా healing చేస్తా డు. ఈ శక్తి ప్రవాహ ఆటంకాలు ఎందుకుఏర్పడు
తున్నాయి....అన్న వాటిపై కారణాలు విశ్లే షణ చేస్తా డు.భౌతిక కారణాల కంటే,భౌతికే తర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై
శోధన చేస్తా డు.తదనుగుణ పరిష్కా రాన్ని ఇస్తా డు.
      ఈ తేజో వలయం (aura),రంగు రంగు లతో - కాంతులతో,వివిధ సూక్ష్మ శబ్దా లతో, వివిధ ఆకృతుల్లో ఉంటుంది.ఈ "ఆరా",
తటస్థ ఆలోచనలతోనూ,నమూనాలతోనూ మరియూ ఆధ్యాత్మిక శక్తు లతోనూ...తయా రు చేయబడియుంటుంది.ఈ
"ఆరా",సూక్ష్మ శరీరములోగల చక్రా లతో భ్రమణముచేస్తూ, వైశ్విక శక్తిని గ్రహిస్తుంది కూడా! ఈ ఆరా సుశిక్షితుడై న యోగికి
కనిపిస్తుంది....
      🌹🧡🌹
భరతుడు తాత తండ్రు ల నుండి సంక్రమిం చిన ధనమును పుత్రు లకు పంచిఇచ్చి సంప దలను గృహములను విడిచి పులహముని
ఆశ్రమమునకు పోయెను.
ఆ ఆశ్రమమున లక్ష్మీ సమేతుడై న నారాయ ణుడు మహానుభావుల రూపమున ప్రత్యక్ష ముగా చరించుచుండెను.అచ్చటనివాసము
చేసి అతడు సాలగ్రామ శిలలు‌గల గండకీ నదిని సమీపించి ఏకాంతమున నారాయ ణుని అర్చించెను.బహువిధ పుష్పములను
చిగురుటాకులను,తులసీదళములను,తీర్థ జలములను కందమూల ఫలాదికములను పద్మములను సమర్పించుచు సేవ చేసెను.
ఈ సాధన వలన ఇంద్రియార్థములపై అభి మానము తొలగించుకొని శమదమాది గుణ ములను కలిగి యథేచ్ఛముగా చరించెను.
నారాయణుని సేవ యందు భక్తి భావము కలిగి ధ్యానింపగా హృదయమందలి అహం కారమను ముడి ఆనందానుభవంతో విప్ప
బడెను‌.అతడు పులకించి ఆనందబాష్పము లతో నిండిన కన్నులు‌గలవాడై భక్తియోగ మునకు ఫలమైనఅనుభవమునుపొందెను.
అమృతపు కోనేటిలో స్నానము చేసినట్లని పించెను‌తాను పూజించుచున్న పూజ గూడ జ్ఞప్తి లేనంతగా నారాయణాను భూతి
కలిగెను. అనుదినము‌లేడిచర్మమే వస్ర్తము గా కట్టు కొని ఉదయము,మధ్యాహ్నాము, సాయంకాలము స్నానము చేసి తడిసిన ఎర్రని
జడల చుట్టలు గలవాడై సూర్యమం డల మందలి నారాయణుని బంగారు రంగు‌కిరణముల విగ్రహముగా ధ్యానించి‌ఇట్లు
స్తు తించెను.....
🌹❤️🌹
       
   కారణం ఏమిటి? అంటే ఈ విశ్వుడు అన్న సాక్షిత్వాన్ని జీవుడు సరిగ్గా సాధించలేదు కాబట్టి. కాబట్టి,ఈ ఎనిమిది శరీర అధిష్టా న
స్థా నములని ఏవైతే చెబుతున్నారో,ఆ అధి ష్టా న స్థా నములన్నీకూడా సాక్షిత్వ సాధనలో పరిచయమయ్యేటటువంటి స్థితులుకాబట్టి,
విశ్వుడు,తైజసుడు,ప్రాజ్ఞుడు,ప్రత్యగాత్మ, విరాట్,హిరణ్యగర్భ,అవ్యాకృత,పరమాత్మ లు అనేటటటువంటి ఎనిమిది సాక్షిస్వరూ
పాలు,పరమాత్మ అనేటటువంటి,సర్వసాక్షి స్వరూపములో అంశీభూతములు.అలా సాక్షి సాధన చేసేటటువంటి వారు మాత్రమే, ఈ
ఎనిమిది అధిష్ఠా న కేంద్రాలను,ఎనిమిది అధిష్టా న స్థితులను తెలుసుకోగలుగుతారు.
అలా ఎనిమిది అధిష్టా న స్థితులను తెలుసు కోలేని వాళ్ళు,ఆ యా వ్యవహారమునే సత్య మనుకుంటారు.ఆయా శరీర వ్యాపారమునే
సత్యమనుకుంటారు.ఉదాహరణ చెపుతా... ప్రతి ఒక్కరూ కలలు కంటూఉంటారు.కలలు కన్నప్పుడల్లా ఆయా కలలో అనేక
రకములై నటువంటి సినిమాలు వస్తుంటాయి.
అవన్నీ తమ జీవితములో ఉన్నటువంటి, తానే నేర్పించినటువంటి,తానే నటించినటు వంటి, తానే నర్తించినటువంటి,తానేపాటలు
పాడినటువంటి,తానే ఫైటింగులు చేసినటు వంటి... సినిమాలన్నమాట.అన్నీ ఆయనే.. కథ,రచయిత,మాటలు,పాటలు,దర్శకత్వం,
ప్రొడక్షన్‌అన్నీ ఆయనే.
మరి అటువంటి కల అనే సినిమాను ప్రతి రోజూ మానవుడు దర్శిస్తూనే వున్నాడుకాని ఏ తెరమీదైతే,ఈ కల అనే సినిమా జరుగు
తుందో,ఆ తెర ప్రకాశించడానికి ఆధారభూత మైనటువంటి,ఆ ప్రకాశంలో మాత్రమే ఈ సినిమా కనబడుతోంది కదా.మరి ప్రకాశం
ఆధారంగా కనబడుతున్న సినిమాని నేనా? ప్రకాశం నేనా? అనేటటుంవంటి విచారణ దృక్పథం... కలగడం లేదు.
ఏ రోజుసినిమా ఆ రోజు వస్తూనే ఉంటుంది. ఆ రోజు కలని ‘అనుభోక్తవ్యం’ అనుభవి స్తూనే ఉంటాడు.అందులో ఏర్పడుతున్నటు
వంటి సుఖదుఃఖాలని అనుభవిస్తూనేఉంటా డు.అట్టి అనుభవరీత్యామరలాకలలోకూడా అవే
సుఖదుఃఖాలుఏర్పడుతూనేఉన్నాయి.
మరి ఇలలోనూ సుఖదుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి.లేదంటే మిశ్రితంగా ఏర్పడుతూ ఉన్నాయి.అలాగే కలలో కూడా సుఖదుఃఖా
లు మిశ్రితముగా ఏర్పడుతున్నాయి.కాబట్టి, కర్మఫలము త్రివిధములుగా ఉన్నది.అయితే సుఖము,లేకపోతే దుఃఖము,లేక పోతే
మిశ్రితము.
మరి ఈ రకంగా ఏర్పడుతున్నటువంటి దాని లోనుంచి ఏట్లా బయటపడాలంటే,అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేటటుంవంటి శ్లోకం
పురుషోత్తమ ప్రాప్తి యోగం (భగవద్గీత) లో ఉంది.అధ్యాత్మ-ఆత్మ వస్తు వును నిత్యమైన వస్తు వుగా గుర్తించి విచారణ చేసేటటువంటి
దృక్పథాన్ని మానవుడు అభ్యాసం చేయాలి. తత్త్వజ్ఞానార్థ దర్శనం-ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఎక్కడికి దారితీయాలటా?
తత్త్వ జ్ఞానార్థ దర్శనం.
🌹💞🌹
      
సర్వ సుఖాలలో హరి నామము మధురమై నదని ఆరు శాస్త్రా లు ఎన్నిక చేసి చెప్పినవి. కావున అర నిమిషము కూడ వృధా గడప
బోకుము.సంసారమంత క్షణ భంగురము. కావున హరి సంబంధము వీడినచో చావు పుట్టు కలు వ్యర్థమై పోతాయి.
కృష్ణ నామమందు మనసు పెట్టి సంకల్పము చేసి నామ మంత్రమును జపముచేయు వారి కోటిపాపాలు తొలగిపోతాయి.సర్వ
మాయలను త్రుంచివేసి నిజ వృత్తు లను బయటకు తీసి ఇంద్రియాలబడి తిరుగక జాగురుకతో ఉండుము.
భావన పెట్టి తీర్థ వ్రతాలు చేయుట వలన శాంతి,దయ నీకు ప్రియ బాంధవులై హరి యొక్క కరుణ ప్రాప్తించగలదు.సద్గురువు
నివృత్తినాధులు కృపతో ఇచ్చిన జ్ఞానము వలన నాకు సంజీవని సమాధి కలిగినదని జ్ఞానదేవులు ప్రమాణ పూర్వకంగా తెలిపి నారు.
సర్వ సుఖాలలో అతి మధురము
సకల శాస్త్రా లు ఎన్నిన నామము
వృధాగడపకు అర నిమిషము
హరినామము గానము చేయుము
స్వప్నంలాంటిది వ్యవహారము
సంసారమంత అదే విధము
వ్యర్థమవును జనన మరణము
లేని యెడల హరి సంబంధము
నామ మంత్రము జపము చేయుము
కోట్ల కొలది పాపాలు మాయము
సంకల్పము చేసి కృష్ణనామము
దృఢతరమున పట్టు నిలుపుము
నిజవృత్తు లను బయటకు తీయుము
మాయలన్నియు తుడిచి వేయుము
“ఇంద్రియాలబడి తిరుగబోకుము”
వివేకముతో అణిచి వేయుము
తీర్థ వ్రతము భావ బలము
కరుణా హృదయము కల్గి ఉండుము
శాంతి దయా ప్రేమ యుక్తము
ధృఢమై తీరును హరి సంబంధము
జ్ఞానదేవుని ప్రమాణము వినుము
నివృత్తినాథులు ఇచ్చిన జ్ఞానము
సమాధి సంజీవని హరి పాఠము
భక్త జనులకు తరుణోపాయము.
Have faith in yourselves, great convictions are the mothers of great deeds.*
*ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మహోన్నత విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.
The mainspring of the strength of every race lies in its spirituality, and the death of that race begins the
day that spirituality wanes and materialism gains ground.
*ఏ జాతికైనా జవజీవాలను ప్రసాదించేది ఆధ్యాత్మిక చింతన మాత్రమే.పారమార్ధిక ప్రవృత్తి క్షీణించి ప్రాపంచికత మితిమీరిన రోజున,ఆ
జాతికి అంత్యకాలందాపురిస్తుంది
*You gain nothing by becoming cowards....Taking a step backward, you do not avoid any misfortune.
*పిరికివారుగా మారి మీరు సాధించేదేమీ ఉండదు.ఒక్క అడుగు వెనుకకు వేయడం వల్ల మీరు ఏ విపత్తు నూ తప్పించుకోలేరు.
🌹❣️🌹
          
"మనోధ్యానవైభవం అంటారు,అది ఏమిటి? ఆ స్థితి ఎలాంటిది !?".
శాంతిని అనుభవిస్తే మనోధ్యానవైభవం ఏమిటో అర్థం అవుతుంది.సుఖదుఃఖాలకు అతీతంగా ఉండే స్థితినే శాంతి అంటారు.
మనసు శాంతిగా ఉంటే ఆ సమయంలో మనం భగవత్స్వరూపులంగానే ఉంటాం. కాబట్టి మనసాధన అంతా మనసునుశాంతి గా
ఉంచుకోడానికే.మనశ్శాంతికే మరో పేరు ధ్యానం.'శాంతి-ధ్యానం-దైవం'వేర్వేరు కాదు. అది మన మనసుతో అంటిపెట్టు కొని ఉన్న
గుణమే.మంచినీటికి దాహం తీర్చే గుణం ఎలా ఉందో అలాగే సర్వకాల సర్వావస్థల్లో మనసును శాంతి అంటిపెట్టు కొనే ఉంది.
ఒక్కసారి నీరు త్రాగితే ఆ నీటి గుణం తెలిసి నట్లే, ఒక్కసారి శాంతిని అనుభవిస్తే మనో ధ్యానవైభవం తెలుస్తుంది !.
💖
       
*దైవంపై ఇష్టమే నిష్ఠగా మారుతుంది !.
వేదాంత రహస్యంఅంటే ఎవరికీతెలియనిది, తెలియకూడనిది అని కాదు.అలాంటిదే అయితే మనదాకా రాదు.మనకు మనంగా
తెలుసుకోవాల్సింది అని దాని అర్ధం.ఇతర్లు చెప్పినా అది మనకు అనుభవంలోకి వచ్చే వరకూ అర్థంకాదు కనుక రహస్యమే అవు
తుంది.బ్రహ్మము గురించి తెలుసుకోవాలన్న తీవ్రమైన ఇష్టమే నిష్ఠ అవుతుంది. అలాంటి ఇష్టంకలిగి ఉంటే అది సాధించడం సులభం
అవుతుంది.అది తెలిస్తేనే అన్నీ బోధలోకి వస్తా యి.సులభం అంటే ప్రయత్నిస్తే ఎవరి కైనా తేలిగ్గా లభించేది అని.అంతే కానీ అప్ర
యత్నంగా లభించేదని కాదు.శుభేచ్చ,శ్రద్ధ ఉంటే అది అనాయాసంగా లభించేది అని దాని భావం !.
🌹💚🌹
        
ఒక రాజు నిండా ఆభరణాలతో అడవిలో ప్రయాణిస్తు న్నారు....ఒక చిలుక రాజుని చూసి అందరూ రండి బాగా బంగారు ఆభర ణాలు
డబ్బులు ఉన్న మనిషి వస్తు న్నాడు రండి రండి అని అక్కడ ఉన్న బందిపోటు లకు తెలియజేసింది.అప్పుడు బందిపోటు రాజును
వెంబడించారు.రాజు ప్రాణ భయం తో పరుగు పెట్టా డు..
ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుం డగా.... ఆ చెట్టు పైన ఇంకో చిలుక అయ్యా పక్కన ఆశ్రమం ఉంది.గురువుగారు మంచి
భోజనం పెడుతారు.మీకు రక్షణ కల్గుగుతుం ది అని చిలుక చెప్పిన మాటలను విని రాజు గురువుగారి దగ్గరకు వెళ్తా డు
వెళ్ళగానే మంచి నీరు ఇచ్చి ,రుచికరమైన భోజనాన్ని పెట్టా రు,సేధ తీసుకోమ్మని చెప్పా రు. అప్పుడు రాజు గురువు గారితో ఇలా 
అన్నాడు.మొదలు నేను బయలుదేరి నప్పు డు ఒక చిలుక ప్రాణభయాన్ని కలిగించింది.
రెండవ చిలుక ప్రాణ రక్షణకు మార్గం చూపిం చింది.రెండు చిలుకలే కదా వాటి గుణం ఎందుకు అలా ఉంది అంటే.....
    మొదటి చిలుక బందిపోట్ల మధ్యలో పెరిగింది.రెండవ చిలుక గురువు ఆశ్రమంలో పెరిగింది.మొదటిది దోచుకోవడం నేర్చుకు
న్నంది..రెండవదిఆదరించటంనేర్చుకున్నంది.
అంటే మనం ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే  అలాంటి గుణాలు కలుగుతాయి/అలవడతాయి....
🌹💜🌹
         
*శుక్రము నుండి పిండోత్పత్తిలో కొంత భాగ ము పాదములు,చేతులు,కన్నులు,చెవులు, నోరు మున్నగునవి ఏర్పడును.విభాగము
లు పొందిన వెనుక చేతులు చెవులుకాలేవు. చెవులు కన్నులు కాలేవు.ఏ భాగమును మరియొకటి కాజాలదు. కానీ విభాగము
చెందక ముందు శుక్ర స్థితిలో ఏ భాగము ఏది అయిననూ కాగలదు.నదిలోని నీరు ఎవరు త్రాగగల మంచినీరు అయిననూ కాగ
లదు.ఎవని దాహమైననూ తీర్చును.ఒకరు త్రాగిన నీరు ఇంకొకరికి మాత్రము దప్పిక తీర్చలేదు.అట్లే  జ్ఞేయమగు ఈపరబ్రహ్మము
నందు ఎప్పుడు ఎందుండై ననూ ప్రకృతి పురుషులు,సూర్యచంద్రాదులు,జీవరాసులు ఉద్భవింపగల సంకల్పము సర్వ తంత్ర
స్వతంత్రముగా నుండును.ఇది సర్వమును ఆవరించి సర్వమునందు ఉన్నది.
ఇది మనలో అన్ని ఇంద్రియముల గుణము లుగను భాసించుచున్నది.దానికి ఏఇంద్రియ ము లేదు.సర్వమునందు ఉండి భరించు
చున్నది.దేనియందును వర్తింపదు.అన్ని గుణములను అనుభవించుచున్నది.తాను ఏ గుణమును కాదు.
జీవుల యందును,పంచ భూతముల యందును లోపల బయట అను భేదముచే తెలియబడునదిగా ఉన్నది.తెలియునది,
తెలియబడునది అను తత్వములుగా పర స్పర సాపేక్షకమై చరతత్వమైయున్నది.దాని యందు ఈ భేదములు లేకుండుటకే అచర
ముగా నున్నది.ఏ తత్వమైననూ దీనితో దీనియందు ఉత్పన్నమగుచున్నది కనుక, అన్నిటి యందు నిండి ఉండియు సూక్ష్మత వలన
తెలియబడక వర్తించుచున్నది.దూర మున ఉన్న వస్తు వునకు,ద్రష్టకు నడుమ దూరమనబడుతత్వముగానున్నది.ఒకదాని
యందొకటి ఇమిడి ఉండుట,ఉద్భవించుట, లీనమగుట అను తత్వములకు నడుమ సామీప్యమను తత్వముగా నున్నది.ఎల్ల
వారిచే 'అది'అని మరియొక వస్తు వుగా తెలి యబడుటవలన జ్ఞేయముగానున్నది...
🌹 💕🌹
    
అంతరాలవాదుల ఆత్మ అణువువలె సూక్ష్మ మందురు.ఏలన వెంట్రు కలో వెయ్యవ భాగ ము వలె సూక్ష్మమైన నాడులయందు అది
సంచరించును.
అణువు కంటే అణుస్వరూపమైనది,సూక్ష్మ ము కంటే సూక్ష్మతరమైనది ఇట్లు వందల కొలది వేలకొలది శ్రు తివాక్యములు ఆత్మ
యొక్క అణుత్వమును వర్ణించుచున్నవని  వారందరు తమ వాదమును సమర్థింతురు.
వెంట్రు క చివర యొక్క నూరవ భాగములో నూరవభాగము జీవుడు.దానిని తెలిసికొన వలెను అని మరొక శ్రు తిచెప్పును.(ఈ శ్వేతా
శ్వతర తెలిసికొనుట ఎంతకష్టమో సూచిం చుటకు ఉద్దేశింపబడినది గాని పరిమాణ మును తెలుపుటకు గాదు.)
దిగంబరులైన జైనులు ఆత్మ మధ్యమ పరి మాణము గలదందురు.అపాదమస్తకము చైతన్యము వ్యాపించి ఉండుటవలనను
"గోరుల చివరల నుండి తల వరకు ఆత్మ వ్యాపించి ఉన్నది"
మధ్యమ పరిమాణమనగా శరీరముతో సమానమైన పరిమాణమని అర్థము. ఆత్మ తన సూక్ష్మమైన అవయవములచే సూక్ష్మ
ములైన నాడులను ప్రవేశించును.సన్నవియ గు చొక్కా చేతులయందు స్థూలశరీరపు చేతులు ప్రవేశించినట్లే.ఆత్మకుఅవయవము లు
గలవని దిగంబర జైనుల సిద్ధాంతము.
ఆత్మ యొక్క అవయవములు సంకోచించు ట వలనను వ్యాకోచించుట వలనను చిన్న వి పెద్దవగు వివిధ శరీరములందు ప్రవేశింప
గలుగును.ఇట్లు ఆత్మకు సాధారణ పరిమా ణము మధ్యమమని వారు నిశ్చయింతురు.
🌹🌹🌹🌹
       
శూరత్వము,తేజస్సు (కీర్తి, ప్రతాపము), ధైర్యము,సామర్థ్యము,యుద్ధము నందు పాఱిపోకుండుట,దానము,(ధర్మపూర్వక)
ప్రజాపరిపాలనాశక్తి(శాసకత్వము)-ఇయ్యవి స్వభావమువలన పుట్టిన క్షత్రియకర్మయై యున్నది.
"యుద్ధేచాప్యపలాయనమ్” యుద్ధమునందు పాఱిపోవుట క్షత్రియుని ధర్మముకాదనియు తెలుపబడినది.అయితే బాహ్యయుద్ధ
మెపుడో యొకపుడు సంభ వించును. కాని అంతర్యుద్ధము మోక్షపర్యం తము సర్వజీవులయందును జరుగుచునే యుండును.
మంచికి చెడ్డకు, ధర్మమునకు అధర్మమునకు,దైవసంపదకు అసురసంప దకు సంగ్రామము హృదయమున నిరంతర ము
సాగుచునే యుండును.బలవత్తరమగు మాయతో జరుగు అట్టి యుద్ధమున ప్రతి మనుజుడు ఇట్టి క్షాత్రమునే ప్రదర్శించ
వలసియుండును.అనగామాయ(ప్రకృతి)తో జరుగు యుద్ధమున వెన్ను చూపరాదు. ముందు వేసిన అడుగును వెనుకకు త్రిప్ప
రాదు.బాహ్యయుద్ధమునక్షత్రియులుచూపు, ధైర్య,పరాక్రమముల కంటె అధిక తరముల గు ధైర్యసాహసములను మనుజుడు తన
అంతర్యుద్ధమున జూపవలసి యుండును. అపుడే విజయము కరతలా మలకమై జీవు డు మోక్షసామ్రాజ్యాభిషిక్తు డు కాగల్గును..
కావున బ్రహ్మతేజము,క్షాత్రవీర్యము - అను నీ రెండిటిని జీవుడు సంపాదించవలసి యున్నది. మఱియు లక్ష్యమగు ఆత్మసాక్షా
త్కారము,జీవన్ముక్తి పొందువఱకు మనుజు డు వెనుకకు మఱలరాదు.ఇవ్విధమున “యుద్ధేచాప్య పలాయనమ్' అను ఈ క్షత్రి య
ధర్మసూత్రమును ప్రతివాడును తన అంతర్యుద్ధమున అవలంబించి కృతార్థు డు కావలయును.
*క్షత్రియుని స్వభావ జనిత కర్మలెవి.....
(1) శూరత్వము
(2) తేజస్సు (కీర్తి, ప్రతాపము)
(3) ధైర్యము
(4) సామర్థ్యము
(5) యుద్ధమునందు వెనుకకు మఱలకుండుట (6) దానము
(7) ప్రజాపరిపాలనాశక్తి (శాసకత్వము) ఇవి క్షత్రియుని కర్మములు.
🌹💞🌹
       
మేఘము క్రమ్మినపుడు సూర్యుడు గోచరిం పడు. నిజమునకు సూర్యుని దరిదాపుల యందు మేఘ ముండదు.భూమి పరిసర
ముల యందే మేఘ ముండును.భూమి జీవులు సూర్యుని మేఘము క్రమ్మినదని భావింతురు.అది వారి భ్రమ.సూర్యుని మేఘము
క్రమ్మలేదు.
అట్లే ప్రకృతిబద్ధు లైన జీవులకు అజ్ఞానమను మేఘము క్రమ్మును.కాని ప్రతి జీవియు నిజ ముగ ఒక సూర్యుడే. పరబ్రహ్మము నందు
నిష్ఠతో బుద్ధిని నిలిపి,అతని స్మరణమున తన్మయము చెందువారిని కల్మష పూరితమ గు అజ్ఞాన మంటదు.
అట్టివారికి కుక్కమాంసము నందు, దానిని తిను చండాలుని యందు,ఏనుగునందు, ఆవునందు విద్యావినయసంపదగల బ్రాహ్మ
ణుని యందు,సృష్టియందలి సమస్త వస్తు జాల మందు బ్రాహ్మ దర్శనమే జరుగుచుం డును.వారిని సమదర్శనులు అందురు.
బ్రహ్మమునందు స్థిరపడిన మనసు కలవారు దేహము నందున్నను వారిని జనన మరణా దులు గాని,సంసారము గాని అంటదు.అట్టి
వాడు స్థిరబుద్ధి కలిగి యుండుటచే మోహ పడడు.అతనికి ప్రియముగాని,అప్రియము గాని యుండదు.
🌹🌹🌹🌹
        
ఉద్యోగం చేస్తు న్నప్పుడు, మనతో పనిచేసే వ్యక్తిని – ఒక మామూలు వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మమేనా? అది వీలవుతుందా?
ఒకవేళ అతడు సేవక వృత్తిలో ఉంటేమాత్రం అలా చెయ్యవచ్చా? ఎవరి హద్దు లు వారు మీరరాదు.ఉద్యోగ ధర్మాన్ననుసరించి ఒకడి
ముందు మరొకడు చేతులు కట్టు కుని నిల బడి ఉండవచ్చు.అయితే లోపల ఉండేస్థితి కి, లౌకికజీవన విధానానికి ముడిపెట్టు కో
కూడదు.
ఏ అంతస్థు లో,ఏ ఉద్యోగం,ఏ నిర్వహణలో ఏపాత్రను మనుష్యులు పోషిస్తు న్నారో-ఆ పాత్ర ఔచిత్యం దాటకూడదు.అది ధర్మం
అవుతుంది. అలా చేస్తే,ధర్మందాటిన దోషం వస్తుంది.ప్రతి సంఘటనలోనూ తన యొక్క ధర్మ పాలకత్వం,ధర్మనిష్ఠ ఎంత హద్దు ల్లో
తనున్నాడో శ్రీకృష్ణుడు తెలియపరిచాడు.
తను పరమేశ్వరుడే! పాండవపక్షపాతి అని తనకు పేరు ఉంది.వీళ్ళందరూ తనకు భక్తు లు.అలా అయినప్పటికీ,తన పరమేశ్వర శక్తిని
వాళ్ళయందు ప్రసరింపచేసి వారిని రక్షించి కాపాడాడా! లేదు.అభిమన్యుడు పాండవులకు ఒక్కడే వంశాంకురం.16-18 ఏళ్ళ
చిన్నవాడు.అతడు చచ్చిపోతుంటే చూస్తూనే ఊరుకున్నాడు కృష్ణపరమాత్మ! అభిమన్యుడు చనిపోయడు.
అయినా తన దివ్యశక్తు లతో కాపాడారా !. నేనున్నాను అని అర్జు నుడికి చెప్పారా? నేను కాపాడతాను అన్నారా? అలా అన లేదు
సరికదా, “నువ్వు యుద్దంచెయ్యి. రాజ్యాన్ని గెలుచుకుంటే ఏలుకుంటావు. యుద్ధంలో చచ్చిపోతే స్వర్గానికి పోతావు” అన్నాడు
యుద్ధప్రారంభంలోనే.ఇది ఆయన ఇచ్చిన వాగ్దా నం! అందులో ఏమైనా హామీ ఉందా! తను చెప్పాలా ఆమాట! “నువ్వు ఉన్నావు
కదా! నీ అండదండలు చూసుకుని యుద్దంచేస్తా ను”అనడానికి లేదు.రెండుదా రులు చెప్పాడే తప్ప,నేను కాపాడతానని ఆయన
అనలేదు.ఎందుకంటే,అది తన ఉద్యోగం కాదు.వారి అర్హత ఎంతో తనహద్దు కూడా అంతే.తాను జ్ఞాన స్వరూపుడు.శుద్ధ
స్వరూపుడు.శాంతుడు.అందుచేత సృష్టిలో ఉన్న ఏ సంఘటనలో ఏదీ కూడా ఆయన లో(కృష్ణునిలో) వికారాన్ని కలిగించలేదు.
కృష్ణుని జీవితం అడుగడుగునా బొధయే! భారతంలో అడుగడుగునా ధర్మబోధ తప్ప మరొకటి లేదు. ధర్మబోధ తెలుసుకోవాలంటే
మహాభారతం కంటే గొప్ప పాఠ్యప్రణాళిక మరొకటిలేదు. ‘పంచమవేదం’ అని దానికి పేరు. దానికి తగినపేరు పంచమవేదం.అంటే
నాలుగు వేదములు,ఇంకా ఎంతో అని అర్థం చేసుకోవాలి; అంతే కాని,కొంత మిగిలితే ఆ శేషం పంచమవేదం అని కాదు అర్థం.....
🌹 💚🌹
      
శాశ్వతమైన భగవంతుని అనంత స్థితిని ఎరుకతో అనుభూతిని పొందుటయే :: జీవితగమ్యము.
మానవరూపములో"అహంబ్రహ్మాస్మి" స్థితిని పొంది,సత్యానుభవమును పొందుటయే గమ్యస్థా నము.
అనుభవ దివ్యత్వము.ఈ స్థితిలో మానవు డు తన స్వభావము అనంతానందమేగాని పరిమిత స్థూలకాయము కాదనియు,అనం
తశక్తియేగాని పరిమితప్రాణము కాదనియు, అనంత జ్ఞానమే గాని పరిమిత మనస్సు కాదనియు అనుభవమును పొందును.
చైతన్యము సంస్కారములను పూర్తిగా వది లిన తరువాత ఇంకెన్నడును అయదార్థపు అభావమును నిజమని అనుభూతి నొందక
సత్యమునే అనంత పరమాత్మగా అనుభవ మును పొందును.
[1/7, 5:07 AM]  🌹💚🌹
*ఒకరోజు విందులో ఆ శ్రీరాముడు హను మంతుడు ఒకే అరిటాకులో బోంచేయాల్సిన వేళ శ్రీరాముడు ఆకులో సగానికి అలా గీత
గీ శారట., రామయ్య హనుమయ్య ఎదురె దురుగా కూర్చుని భుజించ ప్రారంభించారు.
రామయ్య వైపు ఉన్న ఆకులో మానవులం తినే ఆహారాన్ని ఉంచగా హనుమయ్య వైపు వానరాలు తినే ఆహారాన్ని అని ఉంచడం
జరిగిందట.అప్పటి నుండి అరిటాకులోఅలా గీత రావడం మొదలైందట.
అందరికి అనుమానం అరిటాకు తినేవారి ముందు  ఎటువైపు ఉంచి వడ్డించాలి అని.
కూర్చున్న వారి ఎడమవైపున చిన్నదైన మూల భాగమును వెడల్పైన భాగాన్ని కుడి వైపున ఉండాలట.మనం కుడిచేతితో కలు
పుకుని తినాలి కనుక అటువైపు విశాల భాగం ఉండాలని పెద్దలు చెప్పారు. ఆకులో మొదట వడ్డించిన విస్తరిలో తీపి తినాలని
ఎందుకు అంటారు.ఎడమవైపు పైభాగాన తీపు పళ్ళు అన్ని వడ్డిస్తా రు. ఆహారానికి ముందు తీపి తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ
చురుకుగా మొదలై మనం తీసుకునే ఆహరం బాగా జీర్ణం అవుతుందని తీపిని మొదట తినమంటారు.
ఇలా ఎన్నో ఉపయోగాలు ఉండడం వల్లనే మన పెద్దలు ఎటువంటి శుభ అశుభ కార్య క్రమాలకు ఈ అరిటాకులనే వాడేవారు.మన
ఇంటికి వచ్చిన అతిథి ఆరోగ్యంతో ఉండాల నే ఆలోచనవల్ల కానీ ఆసంప్రదాయాన్ని మరి చి ప్లా స్టిక్ ఆకులు ప్లా స్టిక్ ప్రేమలు ఎక్కువ
య్యాయి ఇప్పటికైనా మారుదాం. సంప్రదా యాలను పాటించి ఆరోగ్యంగా జీవిద్దాం
🌹🖤🌹
      
మనిషి కొండంతవిలువను పోగొట్టేది గోరంత కోపం.కోపం వచ్చిన మనిషి విచక్షణను కోల్పోయి పశువుగా మారతాడు.
కోపాన్ని జయించిన మనిషి గోవిందుడు. జనం అతణ్ని మెచ్చుతారు.అతడి సాంగ త్యాన్ని ఇష్టపడతారు.
*సప్త రుషుల్లో విశ్వామిత్రు డు,జమదగ్ని ఉగ్రస్వభావులు.కశ్యప,అత్రి,భరద్వాజ, గౌతమ,వసిష్ఠు లు సాధుపుంగవులు. మును ల్లో
దుర్వాసుడు ముక్కోపి.
*పుడమిపై పాపభారం పెరిగి,పుణ్యాత్ములు హింసపడుతుంటే భగవంతుడికీ కోపం వస్తుంది. పర్యవసానమే- అవతారాలతో దుష్ట
శిక్షణ,శిష్టరక్షణ నెరపడం.
*శాంతం మనిషిముఖాన్ని,రూపాన్ని ఉద్దీ పింపజేస్తుంది. ధ్యానంలో ఉన్న బుద్ధభగవా నుడి ప్రశాంత వదన దర్శనం మానవుడిలో ని
కోపాన్నినశింపజేస్తుంది.నవరసాల్లో వీరం, భయానకం,బీభత్సం,రౌద్రాలకు కారణం కోపమే! తన కోపమే తన శత్రు వు అన్నాడు
సుమతీ శతకకారుడు బద్దెన.కోపంమనిషిని ఏకాకిని చేస్తుంది.పనులకు విఘాతం కలిగి స్తుంది. సమాజ జీవి అయిన మనిషికి పది
మంది శ్రేయోభిలాషులుంటేనే సంఘజీవనం సంతోషదాయకం అవుతుంది.పరిస్థితులన్నీ ఎప్పడూఒక్కలాగాఉండవు.ఒక్కోసారి
అను కోని విధంగా,ఆయా విపత్కర సమయాలు మనిషి కోపానికి హేతువు లవుతాయి.
అలాంటప్పుడే సంయమనం పాటించి, మనసును నియంత్రించుకోవాలని మానసిక శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తా రు.సమాజంలో
ఉన్నత స్థా యి వ్యక్తికి అహంకారంతో కోపం వస్తే,అధమ స్థా యి వ్యక్తి కోపానికి ఏమీ చేయలేని నిస్సహాయత కారణమవుతుంది.
* స్థా యీభేదాలన్నది ఈ శరీరానికే,ఆత్మకు అంటవు అన్న పురాణ వచనాలు మనిషిలో ని ఈశ్వరుణ్ని పరిచయం చేస్తూ,సమానత్వ
భావనల్ని అంకురింపజేస్తా యి.అందరిలో తనను చూసుకునే వ్యక్తిలో కోపానికి ఆస్కా రం ఉండదు.ప్రకృతికి కోపం వస్తే,అది అన్ని
క్రోధాలకన్నా భయంకరమైనది అంటాడు చాణక్యుడు.అదెంతటి నిజమో సోదాహర ణంగా రుజువవుతూనే ఉంది!.
కార్యార్థి సామ,దాన,భేద],దండోపాయాలతో కార్య సాఫల్యత పొందాలి.కార్యసాధకుడికి కోపం ఉండకూడదు.నొప్పింపక,తానొవ్వక,
సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఫలితం సాధించాలి.సంధి ప్రయత్నాల కోసం శత్రు శిబిరాలకు వెళ్ళడమంటే,పులిగుహలోకి
అడుగుపెట్టడంతో సమానం.అక్కడ కవ్విం పులు, వెక్కిరింపులు,కయ్యానికి కాలుదు వ్వడం అత్యంత సహజం.దూతలుగా వెళ్ళే
వారిలో సదా శాంతి,సామరస్యభావాలు తొణికిసలాడాలి.
ఇళ్లలో నవ్వుతూ శాంత స్వభావాన్ని వ్యక్తం చేసే సభ్యుల ఛాయాచిత్రాలు ఉంటాయే తప్ప,కోపాన్ని ప్రతిఫలించేవి ఉండవు కదా!
శాంతం మిఠాయి అయితే,కోపం కారంలాం టిది. సాధారణంగా ఎవరైనా మిఠాయిని ఇష్టపడినట్టు గా కారాన్ని కోరుకోరు.
శుభవార్తలను సంతోషంగా పంచుకోవడానికి మిఠాయినే ఎంచుకుంటారు.శాంతం లేక సౌఖ్యం లేదు .అన్నది త్యాగరాజ కృతి.
మనసులో కోపం ఉన్న మనిషికి సుఖం, శాంతి ఉండవు.కోపాన్ని అదిమి ఉంచడానికే నవ్వుతూ బతకాలంటారు వ్యక్తిత్వ వికాస
నిపుణులు.
కోపం నరక సదృశం,శాంతం స్వర్గతుల్యం అన్నది ఆధ్యాత్మిక ఉపదేశం.ప్రశాంతచిత్తమే మోక్షపథం కనుక మనిషి,ఇతర జీవుల్ని ఈ
విషయంలో అధిగమించాలి. ఉత్తమంగా నిలవాలి!
🌹💕🌹
        
*నిర్విరామంగా ఆలోచనల్ని అల్లే మనసు మూలాన్ని అన్వేషించు.ఎగసిపడే ప్రతికూల భావాల్ని తిరస్కరించు.అన్నింటికీ ఆద్యమై న
మనోబలాన్ని విశ్వసించు.హృదయాన్ని శాంతిధామంగా నిర్మించు.ఆ అనంత మౌనం లో విశ్రమించు.ఆధ్యాత్మికంగా ఉన్నతిని
సాధించు’...
*‘నిన్ను నువ్వు తెలుసుకో’-ఆధ్యాత్మిక చింత నకు ఇదే ప్రథమ సోపానం.అంతర్వీక్షణ లేనిదే ఆత్మోద్ధరణ సాధ్యం కాదు.అంతరం
గాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ‘నేను’ అనే అహంకారాన్ని విడనాడాలి.శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూప సంబంధిత అంశాలతో
మనసు అనుసంధానం కావాలి. అప్పుడు జ్యోతిర్మయంగా మనో మందిరం వెలుగుతుంది.’....
*అద్వైత యోగాన్ని పరిపూర్ణంగా..... భక్తి, కర్మ, జ్ఞాన,రాజయోగాలలోని మార్మికతను, అంతర్లీన భావగరిమను ఏకోన్ముఖంగా
అందుకుందాం.
*'ప్రజ్ఞానం బ్రహ్మ’ అనేది ఉపనిషద్వాక్యం.
ప్రజ్ఞ ద్వారా అన్నింటినీ తెలుసుకునే నేర్పు అలవడుతుంది.
*‘నాకు జ్ఞానోదయం కావాలి స్వామీ! నేను అజ్ఞానిని........నువ్వు అజ్ఞానివా...? ఆ విష యం నీకు నిజంగా తెలుసా?’......
‘తెలుసు స్వామీ! నేను పరమ అజ్ఞానిని...‘నీ గురించి నీకు తెలిసింది కదా! నువ్వు జ్ఞానివే.ఇక నీకు నాతో పని లేదు’
*'ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధ రించుకోవాలి.జీవన్ముక్తి అంటే జీవితంనుంచి ముక్తు లు అని కాదు. ఈ జీవితంలోనే ముక్తి
ని పొందాలి. ముక్తి అంటే మరణానంతరం పొందేది కాదు.పరంజ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తు న్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు
సంస్కరించుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి.....
*'ఆనందమే నా స్వరూపం’ అనే నవ్యమైన స్థితికి చేరుకోవడానికి ఆధ్యాత్మికత ఉపకరి స్తుంది. ‘నేను దీనుణ్ని,నాకు ఆనందం లేదు.
నా జీవితం నిస్సారం. నాకు ఉన్నతి లేదు’ అని భావించేవారికి ఆధ్యాత్మిక అనురక్తి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రతికూల భావాలనే
చీకట్ల నుంచి సానునిలుస్తుంది. ఆయుధాలుగా విజయ సోపానాల్ని అధిరో హించడానికి ఆధ్యాత్మిక శక్తి కరదీపికగా నిలుస్తుంది.
*'ఒక్క ఆధ్యాత్మిక దీపశిఖ నీలో వెలుగుతుం టే చాలు- నువ్వు అఖండ తేజోపుంజమై వెలుగు పువ్వుల్ని వెదజల్లు తావు’ అని
రమణులు పేర్కొన్నారు.
*‘భగవంతుడనే సంపూర్ణ,సమున్నత స్థితి కి, మనకు ఉన్న దూరం ‘నేను’ అనే అంశం ఉన్నంత వరకే! నేను,నాది,నాకు అనే వ్యక్తి
గతమైన అహాల్ని నిర్మూలించుకుంటే పరమ పూజ్యుడై న పరమాత్మ రూపం మనలోనే సాకారమవుతుంది అని రమణులు నిర్దేశిం
చారు.పరబ్రహ్మతత్త్వానికి మౌనమే భాష్యం. మౌనం మహా శక్తిమంతమైన ఆయుధం.
*శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి ప్రయాణం చేయడమే.....
ప్రశ్నేదైనా సరే,ప్రేమతో బదులిస్తే,మనం గడి పే ప్రతి రోజు,ఇంకొంచెంఅందంగావుంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ,ఎవ్వడూ ఆలోచిం
చడు. నీ పలకరింపుని మాత్రమే గుర్తు పెట్టు కుంటాడు..అది మనిషి సహజ స్వభావం.
కాకి ,కోయిల రెండూ అరుస్తా యికాని,కాకిది గోల అంటారు, కోయిలది పాటంటారు.ఆలో చించు ఎందుకో!బదులిచ్చే విధానంతోనే
సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు....
🌹🧡🌹
        
*దుఃఖానికి మూలం స్వార్థమే... విపరీతమైన కోరికలు,ఆశలు,వికారాలు మనిషిని మృగముగా,స్వార్థమనే అగ్నిలో దగ్ధం చేస్తుంది.
*ప్రేమా,ఔదార్యం,సహనం నిస్వార్తన్ని వృద్ధి చేస్తా యి.ఇంద్రియ సంయమనం మరమార్థి క చింతనకు పాదు చేస్తుంది.
*సత్ సాంగత్యం ఆత్మ జ్ఞాన ప్రాప్తికై దోహదం చేస్తుంది.సత్ కర్మలతో హృదయాన్ని,శరీరా న్ని పునీతం చేసుకోవాలి.ప్రతీ అణువులో
దైవాన్ని చూసే దృష్టిని అలవర్చుకోవాలి.
*ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలి.చెట్టు , చెఱువు,గోవు,నదులు,మొదలైనవి పరుల కోసమే జీవిస్తు న్నాయి.వాటిలో ఇషుమంత
యు స్వార్థం లేదు.
*మనస్సు,బుద్ది,వాక్కు,లాంటి అనంతమైన శక్తి సామర్థ్యలను భగవంతుడు మనకు వారాలుగా నొసగాడు.అలాంటి మానవుల మైన
మనలో ఎంత నిస్వార్థమైన కార్యా చరణ ఉండాలి....?
*ఉడుత, జఠాయువు వంటి ప్రాణులు సైతం రామునికి మహోపకారం చేస్తే,ప్రతీగా రాము డు చేసిన ధర్మవర్తనం మనకు
తెలియనిదా.
*ఈ నిస్వార్థ గుణం పశు,పక్షాదుల నుండి నేర్చుకోవాలిసిన దౌర్భాగ్యస్థితి మనిషికి దాపురించింది అంటే... మానవ జాతి భవిత రేపు
ఎలా ఉంటుందో ఒక్క సారి  ఊహిస్తే... మనిషి ఎంత స్వార్థ పరుడిగా మారిపోతు న్నాడో అవగతమౌతుంది.
*అవయవదానం,రక్తదానం,వస్త్రదానం,
అన్నదానం వంటి దానగుణాలు అలవర్చు కోంటు,మన పిల్లలకు చిన్ననాటినుండే పరు లకు ఉపకారం చేసే సంస్కార భావాన్ని
నేర్పించాలి.
*పరోపకారాయ పుణ్యాయ :పాపయ పర పీడనం : పరులకు మేలుచేస్తే అది పుణ్యం, అపకారం చేస్తే అది పాపం...పరులకు మేలు
చేయడం దేవుడెరుగు కానీ,అపకారం మాత్రం  తలపెట్టవద్దు .
*సొంతలాభం కొంతమానుక పొరుగు వారికి తోడుపడవోయ్...అన్న గురుజాడగారి సందేశం మనకు వెలుగు మేడ అని గ్రహించ
గలిగితే... అన్ని అనర్థా లకు మూలమైన స్వార్థా న్ని తరిమికొట్టగలం..
[1/7, 5:09 AM] 🌹💖🌹
*సూర్యుని అంతర్భాగంలో శక్తిఎలా ఉత్పత్తి అవుతుంది.ఆ శక్తి కొన్ని వందల సంవత్సరా లకు గానీ సూర్యుని ఉపరితలంపైకి రాదు.
ఎందువల్ల.....
సూర్యుడుభూమికన్నా సుమారు 3,30,000 రెట్లు ఎక్కువ బరువుంటాడు.సూర్యుడిలో 3/4 భాగం హై డ్రోజన్‌ఉంటే మిగతాది
హీలియం.సూర్యుడు అంత బరువుగాఉండ బట్టే అక్కడ గురుత్వాకర్షణ శక్తి అత్యధికం గా ఉండి అందులోని వాయువులను ఒకే
చోట పట్టి ఉంచడమే కాకుండా గ్రహాలన్నిటి నీ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు.
సూర్యుని అంతర్భాగం కేంద్రం నుంచి 25 శాతం వ్యాసార్థం మేర వ్యాపించి ఉంటుంది. ఇక్కడ సూర్యునిలోని ద్రవ్యాన్ని(వాయువు)
అంతా గురుత్వశక్తి కేంద్రంవైపు ఆకర్షించడం తో విపరీతమైన పీడనం (ఒత్తిడి) ఉత్పన్న మవుతుంది.ఇది ఎంత ఎక్కువగా ఉంటుం
దంటే,హై డ్రోజన్‌వాయువు పరమాణువులు ఒక చోటకు చేరి కేంద్రక చర్యలు ప్రారంభమ వుతాయి.రెండు హై డ్రోజన్‌పరమాణువులు
కలుసుకొని,హీలియం పరమాణువులతో పాటు కొంత శక్తి ఉత్పన్నమవుతుంది.ఈ దశలో ఉష్ణోగ్రత 15 మిలియన్‌డిగ్రీల సెంటి
గ్రేడుకు చేరుకుంటుంది.ఈ శక్తి కిరణాలు, నీలలోహితకిరణాలు,కంటికికనిపించేకాంతి, పరారుణకిరణాలు,మైక్రోతరంగాలు,రేడియో
తరంగాల రూపంలో వెలువడుతుంది. సూర్యుడు శక్తిమంతమైన న్యూట్రాన్లు ,ప్రోటా న్లతో కూడిన 'సౌరపవనాలు'వెలువరిస్తా డు. ఈ
శక్తి వికిరణ,సంవాహన మండలాలు దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుం ది. సూర్యుని అంతర్భాగం నుంచి 55 శాతం మేర
వ్యాపించి ఉండే వికిరణ మండలంలో అంతర్భాగం నుంచి వెలువడే శక్తి 'ఫోటాన్ల' ద్వారా రవాణా అవుతుంది. ఫోటాన్ల నుంచి
వాయుకణాలు శక్తి సంగ్రహించి వేడెక్కడం తో కొత్త ఫోటాన్లు ఆవిర్భవిస్తా యి.అవి మళ్లీ వాయుకణాలను వేడెక్కించడం ద్వారా శక్తి
సంవాహన మండలాన్ని చేరుకుంటుంది. సంవాహన మండలం మిగతా 20 శాతం సంవాహన ప్రక్రియద్వారా క్రమేణా సూర్యుని
ఉపరితలానికి చేరుకుంటుంది.ఈ మండలం లోని కొన్ని పొరలలో వేడెక్కిన వాయు ప్రవా హం పైకి లేస్తుంది.ఈ ప్రవాహం తక్కువ
ఉష్ణోగ్రత ఉన్న పొరల వాయువులతో ఉష్ణా న్ని పంచుకుంటుంది.చల్లా రిన పొరలు మళ్లీ కిందికి పయనిస్తా యి.ఈ విధంగాఫోటాన్లకు,
వాయుకణాలకు మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఉష్ణ,కాంతి శక్తు లు వికిరణ, సంవాహన మండలాల్ని దాటి సూర్యుని
ఉపరితలానికి చేరుకుంటాయి.సూర్యుడు సెకనుకు 400 మిలియన్‌టన్నుల హై డ్రోజన్‌ను పూర్తి శక్తిరూపంలోకి మారుస్తా డు.
సూర్యుని వికిరణ మండలం నుంచి ఒక ఫోటాన్‌సూర్యుని ఉపరితలానికి చేరుకోవ డానికి పట్టే కాలమే సుమారు లక్ష నుంచి రెండు
లక్షల ఏళ్ల వరకు ఉంటుంది.......
🌹🌹
           ♥️
ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం కావచ్చు లేదా హెచ్చరికగానూ ఉండవచ్చు. ప్రతి జీవితం ఎలా జీవించాలో,జీవించకూడ దో
తెలియజేసే ఒక పాఠం అవుతుంది.
*నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలేకాని ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
పుస్తక పఠనం ద్వారా ఎంత నేర్చినా,మను షులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు.
ప్రతి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం.నాన్న నుంచి క్రమశిక్షణ,అమ్మనుంచి సందర్భోచిత నాయకత్వ లక్షణాలు,మామ్మ నుంచి మనః
శ్శక్తి, తాతయ్యనుంచి అప్పగింతలు,తోబు ట్టు వుల నుంచి క్షమ,ఇలా ఎన్నో నేర్చుకో వచ్చు.
మనిషి కళ్లు తెరిచిన దగ్గర్నుంచీ నేర్వదగ్గ పాఠాలు బోలెడు.
మీరా నుంచి భక్తి,హనుమనుంచి సమర్పణ భావం,సంకల్పబలం,అసాధ్యాన్నిసుసాధ్యం చేయడమెలాగో పట్టు విడవని సాధన.ప్రతి
జీవితం జ్ఞానసముపార్జనకు అద్భుత అవకాశం కల్పిస్తుంది. మనిషి తనలో ఉండే విద్యార్థిని సజీవంగా ఉంచడమనేది కీలకం, లోపల
అన్వేషకుడు నిరంతరం అన్వేషిస్తూ నే ఉండాలి.
ఎవరినుంచైనా,దేనినుంచైనా,ఏ పరిస్థితిలో నైనా నేర్చుకోవడమన్నది విడవకూడదు. చాలామందిలో పాఠశాల రోజులతోనే నేర్చు
కోవడం ఆగిపోతుంది.
మనిషిలో శక్తిసామర్థ్యాలు పెరగాలంటే, ఆరోగ్యంగా ఎదగాలంటే అధ్యయనం జీవి తాంతం సాగాలి.అది శ్వాసతీసుకోవడంలా,
తుదిక్షణాల వరకు నిలవాలి.ఆటపాటల్లో మునిగి,తేలే పిల్లల్ని చూస్తే వర్తమానంలో జీవించడమంటే ఏమిటో బోధపడుతుంది.
ఎదురయ్యే సంఘటనల నుంచి గ్రహించే దంతా అనుభవం అవుతుంది.అది పరిపక్వ తను పెంచుతుంది.ప్రాముఖ్యం లేని సంఘ
టనలు సైతం అద్భుతమైన అవకాశాలై జీవి తంలో గొప్ప అనుభవాలుగా నిలుస్తా యి. ఎందరికో మార్గదర్శకం అవుతాయి.
కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు అవగతమ వుతుంది.మనిషికి పరిపక్వతకు ఒకఅడుగు తక్కువలో ఉందన్న విషయం.పరిస్థితులకు
తలకిందులైపోయి,చెదిరిపోయి,ఉద్విగ్నత కు లోనై నిరుత్సాహపడితే నేర్చుకునేది ఏమీ లేకపోగా అవేపరిస్థితులు పునరావృత
మవుతుంటాయి.
జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుం ది. ఆ తరవాతే పాఠం నేర్పుతుంది.కొందరికి నెలలు, ఏళ్లు పడితే... మరికొందరికి జీవిత
కాలం సరిపోదు. అనుభవాలు రకరకాలు. జయాపజయాలు,మంచిచెడులు,అనుకూల ప్రతికూలాలు... ప్రతి అనుభవం ఒక పరీక్షే.
అవన్నీ నేటి నుంచి ఎలా ఉండనుందో తెలి యని రేపటికి తీసికెళ్ళేందుకు మనిషిని సిద్ధం చేయడం కోసమే.తాను చేసే పొరపా ట్లవల్ల
మనిషి లోతైన పాఠాలు నేర్చుకుంటా డు. అపజయాలు గుర్తుండిపోయే పాఠాలు నేర్పుతాయి.విజయం ప్రేరణనందిస్తే,పరా జయం
బోధకుడి పాత్ర పోషిస్తుంది.మనిషి పొరపాట్లకు మానసికంగా చలించిపోతే 'రేపు' కొత్తగా ఉండదు.బతుకు భారమని పిస్తుంది.
జీవితం ఒక ఆట.లెక్కకు మించిన అవకాశా లను, సవాళ్లను దారిపొడుగునా.విసురు తూనే ఉంటుంది.పట్టు దలఉంటే వాటినందు
కుంటూ జీవితాన్ని మెరుగుపరచుకుంటూ మనిషి ముందుకు సాగిపోగలుగుతాడు.
💜🌹
        
   మానవుని జీవితానికి ఆలంబనగా నిలిచే ముగ్గురు స్నేహితులు....
     మొదటిది సంపద.... అదృష్టం ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది.
   రెండవది.బంధువులు,.స్మశానం వరకు తోడుగా ఉండి అక్కడ వదిలేస్తా రు.మళ్లీ ఎప్పటికో కానీ తలవరు...
  ఇక మూడవది...మనం చేసిన పుణ్యం...
స్మశానం దాటిన తర్వాత కూడా మనల్ని అనుసరిస్తుంది
    సజ్జన సాంగత్యం,సత్సంభాషణం సత్క ర్మాచరణం ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తా యి...
    మంచి స్నేహితులు ఉంటే ఎంతటి దూర మైన ప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది.
    సజ్జన సాంగత్యం వల్ల జీవన ప్రయాణం ఆహ్లా దంగా ఉంటుంది.
   సజ్జన సాంగత్యం అనేది సుగంధపరిమళ ద్రవ్యాల దుకాణం లాంటిది...ఆ దుకాణం వద్దకు వెళితే చాలు మనం కొన్నా, కొనక
పోయినా సువాసన అంటుకునే తీరుతుంది.
    అందుకే మానవ జన్మ పొందిన మనం నిరంతరం సజ్జన సాంగత్యం కలిగి ఉందాం..
దుర్లభమైన మానవ జన్మ పొంది యీ జన్న లోనే భగవత్సాక్షొరానికి ప్రయత్నించని జన్మ నిరర్థకము
ముందు భగవంతుని కనుగొని పిందప సంపదనార్జించు .అంతేగాని తద్విరుద్దంగా చెయ్యవద్దు .ఆద్యాత్మికతను సాదింఛిన తర్వాత
ప్రాపంచిక జీవితం గడిపినప్పటికీ నువ్వు మనశ్శాంతిని కోల్పోవు .....
*విజ్ఞానేనాత్మానం సంపాదయేత్.....
   పెద్దలసహవాసం చేసి సంపాదించుకొన్న
విజ్ఞానం చేత తనను సంపాదించుకోవాలి. వినయం ,విజ్ఞానం ఈ రెండు లేనివాడు
తనను తాను కోల్పోయినట్లే.ఆ రెండు ఉన్న వాడు తనను తాను చక్కబరుచుకొన్న
వాడవుతాడు
శైవం,వైష్ణవం,శాక్తం,వేదాంతం....ఇవన్నీ భగవంతుడినే లక్ష్యంగా కలవి.అయితే ఆయనే నిరాకారుడిగా,సాకారుడిగానూ
విరాజిల్లు తున్నాడు.అన్నీ రూపాలూ ఆయనవే.
ప్రకృతి రమణీయతతో నిండి,చాలా విశాల ముగా వున్న,ఈ గొప్ప భూమండలమునం దున్న పెద్ద పెద్ద రాజులు మేమే గొప్పవారం
అను అహంకారమును,అహంభావమును విడిచిపెట్టి,నీ దయాదాక్షిణ్యములకై వచ్చి,నీ సింహాసనము చుట్టూ చేరి వుండగా,వారిని
నీవు అనుగ్రహించావే.అందుకే మేముకూడా వారి వలె నీ సన్నిధికివచ్చివున్నాము.సూర్య కిరణములు సోక గానే మెల్లమెల్లగా వికసిం
చే తామరపువ్వుల వలె, సుందరములైన నీ కళ్లు మెల్ల మెల్లగా తెరచుకొని,మమ్మల్ని ఆనందింపచెయ్యి స్వామి.ఒక చిరు గంట
లాగా,విచ్చిన తామర పువ్వులాగా,ముద్దు లొలుకు నీ సోగకన్నులను అరమోడ్పుగా విప్పి,మాపై అనుగ్రహ ముతో ప్రేమగా దయ
చూడు స్వామి.నీ విక సిత నయన కమల ములతో ఒక్కసారి మమ్మల్నిచూడుస్వామి. సూర్య చంద్రు లు ఒక్కసారే ఆకాశములో
ఉదయించినట్లు గా ఉండే నీ రెండు దివ్య నేత్రములతో ఒక్కసారి మావైపు చూసి కటా క్షించు స్వామి.నీ దివ్య కరుణా కటాక్షముల
తో మా పూర్వ జన్మ పాపకర్మలు అన్నీ పటా పంచలు అయిపోయేటట్లు గా నీ చల్లని చూపులతో మమ్మల్ని చూడు స్వామి,అని
ఆండాళ్ తల్లి గోపికలో కలిసి ప్రార్థిస్తూ, మేల్కొలుపుతున్నారు.ఇదియే ఇందులోని అభిప్రాయము.....
🌹🌹🌹🌹🌹
     
ప్రతి చిన్న... విషయానికి మన మనస్సు..... విచలిత మవుతువుంటుంది. దీనికి కారణం మనం ఈ జీవితం అనే నాటకాన్ని తీవ్రంగా
తీసుకోవటమే.....
జీవితమంటే పూర్తి అవగాహనలేక మనవలె అజ్ఞానంలో ఉన్నవారితో మనం పోల్చుకోవ డం కూడా ముఖ్యకారణం.మనకు పోయే
దేమీ లేదు.వచ్చేదేమి లేదు.
మరి ప్రాణమే అశాశ్వతం మైనప్పుడు మన జీవితంలో జరిగే సంఘటలను ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి..ఇక్కడ తీవ్రంగా తీసు
కోకపోవడం అంటే విచ్చలివిడిగా ప్రవర్తించ డం, లేదా భాద్యతారాహిత్యంగా ప్రవర్తించ టమని కాదు..ఈ జీవితం అనే నాటకంలో నీ
పాత్ర అద్భుతంగా పోషించమని....
పరిస్థితులు మనంఅనుకున్నట్లు గాఉండవు. పరిస్థితులను మనం నిర్ణయించలేము.పరి స్థితుల వల్ల మనం బాధకు గురవుతున్నా
మని అనుకుంటాం.కానీ ఇది నిజం కాదు. మనిషిని ఎవరు బాధించలేరు, తనుతప్ప.
మన ప్రతిస్పందన మనకు బాధను కలిగి స్తుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ఎల్లవేళలా సంతోషంగా ఉండవచ్చు.
మనం అలా సంకల్పించడం లేదు అంతే....
మన తోటి వారు మనకన్నా  బాగున్నరనో... ఫలానావారితో సమానంగా ఉండాలనో మనం కోరుకోకపోతే మనం ఎప్పుడు
సంతోషంగా ఉండొచ్చు....
మనం వాళ్ళలాగా,వీళ్ళలాగా  ఉండాలను కుంటున్నామంటే అహంకార పిశాచాన్ని పోషిస్తూ సంతోషాన్ని పొందటానికిప్రయత్నం
చేస్తు న్నాం.మన ఉనికిని వేరేవాళ్ళు నిర్దేశిం చేటట్లు చేసుకుంటున్నాం.మన సంతోషాన్ని ఇతరులు నిర్దేశించడం ఏమిటి...?నిజానికి
మనం సమాజానికి చేయగలిగే గొప్ప సేవా సదా మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండటమే...
జీవితమనే నాటకంలో మనం మన పాత్రను ఎంత సమర్థ వంతంగా పోషిస్తు న్నామో చూసుకోవడమే మన చేయాల్సిందల్లా .అను
కూల, ప్రతికూల సమయంలో విచలితం కాకుండా ప్రశాంతంగా ఉంటూ,చుట్టు ఉన్న వాళ్ళ వ్యక్తిత్వాలతో,ప్రవర్తనతో సంబంధం
లేకుండా ఎల్లప్పుడు సంతోషంగా ఉండగలి గితే మనం మన పాత్రను అద్భుతంగా పోషిస్తు న్నామన్న మాట.....
నేడు సమాజంలో చాలా మంది జనులు శాంతికి అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. శాంతి లేకుండా సంతోషం రాదుకదా....
'అశాంతస్య  కుతః సుఖం..?శాంతి లేకుండా సుఖమెలా కలుగుతుంది అంటాడు భగవానుడు.
అన్ని వేళల్లో మనం ప్రశాంతంగా ఉండాలం టే...మనకు నిస్సంగ బుద్ది అలవడాలి.ఈ ప్రపంచం ఒక వింత నాటకమని,అందులో
మనం కేవలం పాత్రదారులమన్న భావన గట్టిగా మన మనస్సులో నాటుకోవాలి.
కష్టంతోనైనా,దుఖంతోనైనా భగవంతుడివై పుకు ప్రయాణించడమే మనం చేయాల్సిం ది. ఒక్కోసారి కష్టా ల రూపంలో ఆయన
మనల్ని తనవైపుకు తిప్పుకుంటాడు.ప్రత్యే కమైన అనుగ్రహాన్ని వింతరీతిలోకురిపిస్తా రు
మనతో ఎవరు ఉన్నా లేకపోయినా జీవితం సాగిపోతునే ఉండాలి,ఎవరితో కలిసి రాలే దు మనం అలా అని ఎవరితోనూ కలిసి
పోలేము ఇది మనకు ఒంటరి ప్రయాణం పోతూ పోతూ కొందరి మనసుల్లో స్థా నం సంపాదించుకుని పోవడమే జీవితం.
    అందరినీ మార్చాలి అనుకోవడం మన పొరపాటు ఒక్కరిని కూడా మార్చలేము అనుకోవడం ఇంకా పొరపాటు ,ఏ ఒక్కరినీ
మార్చలేకపోవడం ఇంకా ఇంకా పొరపాటు , ప్రయత్నించి ఓడిపొవడం తప్పుకాదు మనం ఏ ప్రయత్నం చెయ్యకపోవడమే పెద్ద తప్పు
.
  ఈ లోకంలో మంచి అనేది మంచులాంటిది రోజు రోజుకు కరిగిపోతుంది. చెడుఅనేది చెత్తలాంటిది రోజు రోజుకు పెరిగిపోతుంది .
చెడ్డవారు,మంచివారు అని వేరువేరుగా లే రు ఇప్పుడు నటనరానివారు,నిజం మాట్లా డే వారు చెడ్డవారిగా మిగిలిపోతున్నారు.
అంతే ఎవరైతే నీతో మంచిని చూసినప్పుడు నీతో ఉన్నారో నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతో ఉంటారో వారే నీ నిజమైన
ఆప్తు లు.....
" ఇతరులతో పదే -పదే మనల్ని పోల్చుకోవ టమంటే - అసూయను,అహంకారాన్ని   ఆహ్వానించటమే ..
" మంచి చేయడానికి ఆరాటపడాలి.అంతే కాని మంచి అనిపించుకోడానికి ఆరాట పడకూడదు...." 
"ఆచరిస్తూ చెప్పే మాటలకుఆదరణఎక్కువ.
ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ ...."
*పోటీలేని గెలుపు కష్టపడకుండావచ్చేడబ్బు నమ్మకంలేని బంధం ఇవి ఏవి తృప్తినివ్వవు.
       🌹❤️🌹
పైకి ఏదో వేదాంతంలా,వైరాగ్యంలా ఈమాట లు కనిపిస్తా యి కానీ, దృఢమైన వైరాగ్యం మనస్సులో ఉన్న వాడే అవినీతికి పాల్పడ
కుండా ఉంటాడు.నవజీవనంలో కావాల్సింది కూడా అదే.ఏమిటా వేదాంతం? ఏమిటా వైరాగ్యం? ఏమిటా దృఢమైన విశ్వాసం?
అంటే...శ్రీకృష్ణపరమాత్మ అర్జు నుడి దివ్య బోధ మొదలుపెడుతూ ఇలా అంటాడు.....
దేహినోస్మిన్‌యథా దేహే కౌమారంయౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి
ఎనిమిదేళ్ల వరకు ‘బాల్యం’ అంటారు.పద హారేళ్ల వరకు ‘కౌమారం’, పదహారు నుంచి ముప్ఫైఆరు వరకు యవ్వనం,అక్కడినుంచి 
‘ప్రౌఢ వయస్సు’ అని అంటారు.యాభై ఆరే ళ్లు దాటాక ‘వార్థక్యం’ అంటారు.కౌమారం, యవ్వనం,ముసలితనం...ఇవన్నీ ఏవిధంగా
ప్రాప్తిస్తు న్నాయో,‘తథా దేహాంతరప్రాప్తిః’ అదేవిధంగా మరణం కూడా వస్తుంది.అది కూడా మరొక దశ.అందుచేత వయస్సు
శాశ్వతం కాదు.మనస్సు శాశ్వతం కాదు. ‘ధీరస్తత్ర న ముహ్యతి’ అంటే ధీరుడై న వాడె వడూ ఈ మరణం గురించి శోకించడు.
శరీరంలో వచ్చే ఇన్ని మార్పులకు సిద్ధమైన ప్పుడు,జీవితంలో వచ్చే మార్పులకు భయ పడడం ఎందుకు? మృత్యువు ఎప్పుడూ
సన్నిహితంగానే ఉంటుంది.కాబట్టి చావు గురించి బాధగానీ,భయంగానీ లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్లా లి.
ఉన్నంత కాలం మన పని మనం చేశామా? లేదా? వయస్సులు మారుతున్నాయి.మన స్సులు మారుతున్నాయి.అభిప్రాయాలు
మారుతున్నాయి.అనుబంధాలు మారుతు న్నాయి.ఏదీ శాశ్వతం కానప్పుడు ఎందుకు బాధపడాలి?ఈ గంభీరమైన నివృత్తిని మన
స్సులో ఉంచుకుంటేఎవరిపట్లఎలాఉండాలో అలాగేఉంటాం.ఎప్పుడూనిశ్చింతగాఉంటాం
ప్రపంచంలోని భక్తివిశ్వాసాలకు సంబంధించి మనుషుల్ని ఆస్తికులు,నాస్తికులుగా భావి స్తుంటాం.భగవంతుణ్ని అర్చించనివారు,
నమ్మనివారు అందరూ నాస్తికులేనా? నమ్మ నివారు అంటే,వారు భగవంతుడికి శత్రు వు లని అనుకోలేం.శత్రు త్వమైనా,అసలంటూ
అక్కడ ఒక రూపం ఉండాలి.అప్పుడే కదా శత్రు త్వం ఉండేది......
హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపాది రాక్షసులు ‘హరి’ అని ఒక రూపం ఉందని భావించే, ఆయన పట్ల శత్రు త్వం వహించారు.నాస్తికు ల
కంటే శత్రు వులే నిరంతరం హరి స్మరణ చేస్తుంటారు.భక్తు ల కంటే అధికంగా స్మరిస్తా మన్నారు జయ విజయులు.అందుకే వారు
హరి భక్తు లుగా ఏడు జన్మలు కాకుండా,హరి తో వైరాన్ని మూడుజన్మలపాటు కోరుకున్నా రు. ఆయనతో ఎడబాటును మూడు
జన్మ లకు ముగించాలన్నదే వారి కోరిక! మానవ జాతిలో ఆస్తికులు,నాస్తికులు కాకుండా మధ్యేమార్గంలో కొందరుంటారు.వారిది
డోలాయమాన వైఖరి,దయనీయ పరిస్థితి. వారికి భక్తి ఉందాఅంటే,లేదనిపిస్తుంది.లేదా అంటే ‘ఉంది’లా ఉంటుంది.ఏమిటిది?భక్తిని
అనుసరించాలని,దైవాన్నినమ్మాలని,దైవభా వననే సాధన చేయాలని పలువురికి మన సులో ఉంటుంది.లోపల ఏదో ఒక భయం,
బెరుకు ఉంటాయి.భక్తి అంటే ఏమిటి,ఏం చేయాలి; భగవంతుడు నన్ను,నావంటివారి ని కరుణిస్తా డా అని ప్రశ్నించుకుంటారు.
వారిలో అనేక నియమ నిష్ఠలుంటాయి.పాప భీతి, దేన్నీ వదులుకోలేని తత్వం నెలకొని ఉంటాయి.ఏ మాత్రం అనుభవంలేని రంగం
కాబట్టే-వారిలో ఎన్నో అపోహలు,సందేహా లు. భగవంతుడు లేడని అనుకుందామా అంటే,దానికీ మనసు ఒప్పదు! ఒకవేళ
ఆయనంటూ ఉంటే-ఇంతవరకు ఆయన కోసం ఎలాంటి ప్రయత్నాలూచేయనిజీవితం వారిది.ఎటూ తేల్చుకోలేనంతటి సందిగ్ధ,
సందేహ అవస్థలు వారివి.మనిషి ఎప్పుడూ క్రియాశీలుడు,కర్మయోగి కావాలి.మనసు స్థిరంగా ఉండాలి.దేవుడు ఉన్నాడన్న నమ్మ కం
నూరు శాతం కలిగి ఉంటే,చలించని మానసంతో నిలుస్తా డు మానవుడు.అదే మానవజన్మ పరమార్థం,అతడు నెరవేర్చా ల్సిన
కర్తవ్యం. ఉత్కృష్ట జీవితం అంటే అదే! భగవత్‌స్పృహ సర్వకాలాల్లోనూ శ్రేయస్క రం. తాను పొందింది ఏమిటో మనిషికి తెలి
యకున్నా- ఏదో కోల్పోయిన వెలితి,బాధ అతడికి ఉండవు.దేవుడు ఉన్నాడు... ఉన్నాడా, లేడు... లేడా? ఈ డోలాయమాన స్థితి
మనిషికి స్థిరత్వమివ్వదు.దేవుడు లేడు అనే కంటే, ‘ఉంటే ఏం చేయాలి,ఆ కృపఎలా పొందాలి,అది నాకు సాధ్యమేనా’ అనుకొని
ఎంతో నమ్మినవారు ఎందరో ఉన్నారు.సాధ నలో వారు ముందున్నారు. ఇవన్నీ కాదు. పుట్టిన ప్రతి జీవీ గిట్టడం ఎంత సత్యమో-
అతడితో పాటు అతడి లోపల,బయట భగ వంతుడు ఉన్నాడన్నదీ అంతే సత్యం.వేల సంవత్సరాలు చీకటి నిండిన గదిలోనూ,
చిరుదీపంవల్లఅంతటావెలుగునిండుతుంది. అలాగే మానవుడు దేవుడి పట్ల కలిగించు కునే, వెలిగించుకునే చిన్నపాటి నమ్మకమే
అతడి జీవితంలోని గాఢాంధకారాన్ని పటా పంచలు చేస్తుంది.వెలుగు లక్షణం,లక్ష్యం- చీకటిని పారదోలడం.మనిషి జీవితంలో
నమ్మకాన్ని వెలిగించుకుంటేచాలు.భక్తి,సాధ న,గమనం,గమ్యం...ఆయనేచూసుకుంటా డు.భగవంతుడు ఉన్నాడని నమ్మడమంత
భద్రమైన జీవితం మరెక్కడాలేదు. నిన్నే నమ్ముకున్నానని ఆయనకు హామీఇవ్వనక్క ర్లేదు.ఒట్టు పెట్టిమరీచెప్పనక్కర్లేదు. ఆ భావం
మనసులో ఉదయిస్తే చాలు.పువ్వును అను సరించే పరిమళంలా,భగవంతుడి అనుగ్రహ ప్రకాశం భక్తు డి నమ్మకాన్ని వెన్నంటివస్తుంది.
అదేఆహ్లా దకరమైనభావం.

*కాళ్ళు తడవకుండా కడలిని దాటవచ్చు గాని,కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం


కన్నీళ్లు వచ్చాయంటే, కష్టం వచ్చినట్లేకాదు
మనసున్నట్లు తప్పుచేస్తే దోషి అనేకాదు
పొరపాటు మానవనైజం అని అర్ధం చేసు కుంటే,జీవితం అర్ధవంతంగా ఉంటుందని  తెలిసుకోవాలి..   
"ఇరవై ఏళ్లప్పుడు సాహసంముప్ఫయిలలో శక్తి, నలభైలలో సంపద,యాభైలలో వివేకం లేని వారికి అవి ఎప్పటికీ ఉండవు."
"నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి."
జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దు కోవటం...
*"మంచి చేయడానికి ఆరాటపడాలి.అంతే కాని మంచి అనిపించుకోడానికి ఆరాటపడ కూడదు."  
*"ఆచరిస్తూ చెప్పేమాటలకు ఆదరణ ఎక్కువ.ఆదరణ పూర్వకంగాచెప్పే మాటల కు ఆచరణ ఎక్కువ....
  ఏం చేస్తు న్నావు కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి,సంపాదన గురించి కాకుండా
సంతోషంగా ఉన్నావా అని అడగండి. ఎగ తాళి చేయకుండా,ఏం పర్లేదు అన్ని సర్దు కుంటాయి అని భుజం తట్టండి. పోయాక
అయ్యో పాపం కాకుండా ఉన్నప్పుడు మేమున్నాం అన్న భరోసానివ్వండి.పనిఉన్న ప్పుడే కాకుండా పనికట్టు కు మాట్లా డండి.
అన్ని సర్దు కుoటాయి.         
      🌹💖🌹
భయమే మరణం:-భయపడుతూ జీవించే వారు అనుక్షణం మరణిస్తూఉంటారు.అలా గే వీరికి తరుచూ అనారోగ్యాలు వస్తా యి.
ఎవరో ఏదో తీసుకెళ్లిపోతారనీ,మన నుండి లాగేసుకుంటారనీ, మనల్ని తొక్కేస్తా రనీ కుంచించుకుపోయి భయంభయంగా బ్రతక డం
మంచిది కాదు.
జీవితం నుండి శాశ్వతంగా తీసుకెళ్లగలిగేది ఏదీ ఉండదు.వేరే వాళ్లు లాక్కునేది ఏదీ ఉండదు.నిరంతరం మొహంపై వెలిగే కల్మ షం
ఎరుగని చిరునవ్వు మాత్రమే ఉన్నన్నా ళ్లూ జీవితాన్ని వెలిగిస్తుంది.మన సంకుచితా లు అన్నీ మన మనస్సుని బంధీఖానా చేసి
ఒరిపిడికి గురిచేసే ఛెయిన్స్ మాత్రమే.వాటి ని ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది.
స్వార్థా లూ, కుట్రలూ,గాసిప్స్,పక్కోడి గురిం చి చెడ్డగా మాట్లా డడాలూ,అనవసరమైన క్యూరియాసిటీలూ,కుల,మత,ప్రాంతీయాభి
మానాలూ,ఇతర సంకుచిత స్వభావాలను అధిగమించినప్పుడు మాత్రమే నిజమైన హృదయం వికసిస్తుంది.లేదంటే ఉండేది బానిస
బ్రతుకే.జైల్లో ఖైదు చేసిన నేరస్థు డు, స్థంభానికి కట్టేసిన జంతువు ఎలాగైతే అటూ ఇటూ ఓ ఛట్రంలో తిరుగాడుతూ సంఘర్షణ
పడుతుందో అలాంటి నీ మానసిక సంఘ ర్షణే నీ శాపాలూ,నీ దురదృష్టం అనే పదా లూ! వాటిని అధిగమించు.ఆత్మ విశ్వాసం,
భగవాన్ పై విశ్వాసం,ధర్మ ఆచరణ,ఇదే ఉత్తమ స్థితిని శాంతిని అందిస్తుంది.
              🌹💚🌹                                                                                     ఆలయాల్లో ఇతరులకు నమస్కారము
చేయకూడదు.ఎందుకంటే భగవంతుని ముందు- అందరూ సమానులే అని భావిం చాలి.దేవాలయాలు పంచ (ఐదు) రకము
లుగా ఉంటాయి.
స్వయంవ్యక్త స్థలాలు:- భగవంతుడే స్వయంగా వెలసినవి.
దివ్యస్థలాలు:- దేవతలచేప్రతిష్టింపబడినవి.
సిద్ధ స్థలాలు:- మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందినవి, స్వాములు ప్రతిష్టించినవి.
పౌరాణిక స్థలాలు:-పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.
మానుష స్థలాలు:- రాజుల చేత,భక్తు ల చేత ప్రతిష్ట చేయబడి ఉంటాయి.
దేవాలయ గోపురాలు:-హిందూ దేవాలయా ల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి. గాలిగోపురం,ప్రధాన ద్వారం,వైకుంఠద్వారం,
ధ్వజ స్తంభం,గర్భగుడి,ద్వారపాలకులు, వంటశాల తదితర విభాగాలు ఉంటాయి.
ఈ పనులు చేయకండి:-దేవాలయాల్లో ఆగ మశాస్త్రం ప్రకారము పూజారులు,భక్తు లు, అధికారులు ఏవిధంగా వ్యవహరించకూడ
దంటే ముఖ్యంగా ఆలయంలోపలికిఎవ్వరూ కూడా వాహనాలలో రావడం చెప్పులు, బూట్లు ,పాదరక్షలు వంటి వాటితో తిరగడం
చేయరాదు.
దేవాలయమునకు ప్రదక్షణలు చేసేఅప్పుడే లోపలికి ప్రవేశించాలి.ఆలయం లోపలికి తలపాగా,టోపిధరించి వెళ్లకూడదు.అలాగే
చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టు కుని అస్సలు ప్రవేశించకూడదు.
మనముతినే,తినుబండారాలను తీసుకుని వేళ్ళరాదు.ఆలయంలో దైవసన్నిధికి ఒట్టి చేతులతోగాని,కుంకుమ పెట్టు కోకుండాగాని,
తాంబూలచర్వణంచేస్తూగాని,తినుబండా రాలేవైనా తింటూగాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు. దేవాలయము
తీసిఉన్న సమయమున నిద్రపోరాదు.
దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత పగ లు, నిద్రపోవడం,కాళ్లు చాపుకుని కూర్చోవ డం వంటి పనులను కూడా చేయరాదు.
అలాగే ఆలయ ప్రాంగణంలో మల,మూత్ర విసర్జన, ఉమ్మివేయుట,వంటి పనులు చేయ కూడదు.దేవాలయమున దైవసన్నిధి లోన
వివాదాలు పెట్టు కోరాదు.అలాగే దేవా లయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించ డం లేదా హింసించడం వంటివి అస్సలు చేయ
రాదు.
ఇతరులతో దేవాలయముపై విమర్శలు,
దైవదూషణ,పరనింద చేయకూడదు.
దేవాలయ ప్రాంగణంలో అహంకారం,గర్వం తో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడ దు. దేవుని ఎదుట పరస్తు తిని,పరనింద
వంటి పనులను చేయరాదు.                                  ఒకే చేతితో నమస్కారం చేయరాదు.అధికా ర గర్వంతో దేవాలయమున
కూడని సమ యాన అకాలమందున దైవప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయించరాదు. అలాగే,దేవుని ఎదుట ప్రు ష్ఠభాగం
చూపిస్తూ కూర్చోకూడదు.అధికాదర్పము చూపించి తనఉనికిమరచి ప్రవర్తించరాదు.తనకు భక్తి శ్రద్దలేకుండా
తనద్రవ్యం,తానుసంపాదించని పూజా ద్రవ్యములతో పూజలు చేయించు కొనరాదు.దాన,దక్షణలులేని పూజలు నిరర్ద కములు
.ఫలితము నివ్వజాలవు.అశుభ హేతువులు.                     దేవాలయములందు ఆగమవిధులను అను సరించి
నడచుకొనవలెను.దేవాలయ పరి పాలనకు సహకరించి దేవాలయ నిత్యసేవా దులు నడచుటకై ధనమును దానమిచ్చుట.
భగవానునికి ధనము(హుండిలో) నిక్షిప్తము చేయుట, (వేయుట) ఆర్జిత సేవలయందు దేవాలయమున సహస్రనామ,అష్టోత్తర శత
నామ,అభిషేకము,హోమములకు, వివిధ పూజాసేవలకై,తప్పనిసరిగా అందరు టిక్కే ట్టు తీసుకొనుట,విధిగా చేయవలసిన పని
యని,టిక్కేట్టు ను తీసుకొనుట అవమానమ ని భావించి టిక్కేట్టు ను తీసుకొనక చేయిం చుకొను పూజలు దైవాపరాధములు,దైవ
ద్రోహముగా ఆగమమున చెప్పబడినది.అట్టి పుాజ ఫలసూన్యము.అశుభముగా తెలియ నగును.             
పత్రం,పుష్పం,ఫలం,తోయం,యో మేభక్త్యా ప్రయచ్చతి,అని శాస్ర్తవచనము.కావున  మనము భక్తి శ్రద్దతోదేవాలయ మందు మెల గ
వలసి ఉన్నది.ఆలయ నియమానుసార విధులను అనుసరించి దైవదర్శనము అర్చ నలు,సేవలు,కైంకర్యములు చేయవలసిన అవసరం
ఉన్నది......
🌹🖤🌹
      
*మోక్ష కారకుడు కేతువు......
చిన్నప్పుడు సామాన్య శాస్త్రం లో మనం చదువుకున్న చిన్న పాఠం.మొక్కలలో కిరణ జన్య సంయోగ క్రియ జరిగినప్పుడు పత్ర
హరితం ప్రాముఖ్యత వహిస్తుంది.అనగా ఆకులలోని ఆకుపచ్చరంగు సూర్యరశ్మిలోని కాంతిని శోషించి పోషణపదార్థా న్నితయారు
చేస్తుంది.కొత్త ఆకులు వచ్చినప్పుడు పాత ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి.
ఇది కేతు గ్రహానికి,మానవజీవితానికి మధ్య అన్వయించి చూడాలి.ప్రతిమానవునికి చిత్ర విచిత్రమైనకోరికలు వయసుతోపాటు వస్తూ
నే ఉంటాయి.వాటికి అంతుఉండదు.భగవా నుడు కోరికలే దుఃఖానికి మూలమని అన్నా రు అదేవిధంగా దుఃఖమే కోరికలని కూడా
ప్రస్తా విస్తా రు.కోరికలన్నింటిలోకి శృంగార వాంఛ అతి ముఖ్యమైనది.ఈ వాంఛను అధిగమిస్తే ముక్తి లభిస్తుంది.అది లభించడా నికి
కావలసిన అనుగ్రహం కేతువు.మోహ ములు తీర్చడం,అకస్మాత్తు గా వ్యామోహ ములు తీరి ఆధ్యాత్మిక చింతన బాట పట్టే లా
చూడగలిగేది కూడా కేతు దశలోనే.
వివాహం చేసుకుని సంసారం చేసేది వంశా భివృద్ధి కొరకు అనగా సంతానంకోసం  మాత్రమే......
అశ్విని మఖ మూల కేతు నక్షత్రములు అగ్నితత్వ రాశులలో మొదటి నక్షత్రములై ధర్మ త్రికోణంలో ఉంటాయి.అశ్వని నక్షత్రం ఉన్న
రాశిలోనే సూర్యుడు ఉచ్ఛ స్థితిని పొందుతాడు. పంచ భావమైన సింహరాశి సూర్యునికి మూల త్రికోణము అని పిలువ
బడుతోంది.నవమ భావం మన పితృదేవత లకు సంబంధించినది..అంటే మన వంశం యొక్క మూలాలలోకి ఆధారాన్ని చూపించే
ది. ధర్మ త్రికోణ రాశులకు అధిపతులు అయిన కుజ,రవి,గురువులకు సంసార జీవ నానికి సంబంధం ఉంటుంది.వీరి అనుగ్రహం
లేనిదే ఆనందమైన జీవితం ఏ గృహస్థు నకు కూడా సాధ్యం కాదు.ఈ రాశిలో ఉండే కేతు వు కూడా అంతే
ముఖ్యపాత్రవహిస్తు న్నారు.
కనుక ,కేతువును కార్మిక సంబంధమైన గ్రహ ముగా చెప్పడంలో అతిశయం లేదు.సూర్యు ని అనుగ్రహం లేనిదే సంతానం పొందడం
కష్టం అదేవిధంగా కేతువు ప్రభావాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది.ఒక విధంగా చూస్తే  గృహస్థు లు అనే శృంగార వాంఛ నియంత్రిం
చేది కేతు గ్రహం అనడంలో సందేహం లేదు. పండిన ఆకులురాలి..కొత్త చిగురు వచ్చిన ట్లు గా సంతానం గృహ సౌఖ్యం పొందడానికి
పెద్దలు ఆధ్యాత్మిక మార్గం అవలంబించాలి.  ఒక వ్యక్తి ధర్మబద్ధమైన కామ వాంఛ కలిగి ఉండడం కేతువు కారణం అవుతాడు.కుజ
కేతువులును సంతాన కారకులుగా,వారి అధిదేవతలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు అని గుర్తిస్తూ సంతానం కోసం
వారిని ప్రార్థించాలని పెద్దలు చెప్తా రు.ఎందు కంటే ఆదిదంపతులైన శివపార్వతులను సంతానమే వీరు.ఆదిదంపతుల లోని అను
రాగాన్ని,వైరాగ్య భావనను ఒకేసారి చూడ గలం.అదే మన భారతీయ దంపతుల లక్ష ణంగా మహర్షుల ఆశీస్సులుగా,వేదవాక్కు గా
మనం స్వీకరించాం.
సంతానం పొందిన తర్వాత వారి అభివృద్ధి   కొరకు పాటుపడడం,శృంగార భావనను విడనాడి ఆధ్యాత్మిక చింతనను అలవర్చు
కోవడం గృహస్తు లక్షణం,ధర్మం.
కాల పురుష చక్రమున తులా రాశిలో లేదా సప్తమంలో కేతువు ఉన్నప్పుడు అటువంటి వైరాగ్య భావం సాధ్యమవుతుంది.ఎందు కంటే
తులారాశి లోనే రవి తన ప్రభావాన్ని కోల్పోతాడు కర్మ కారకుడు శని ఉచ్ఛస్థితిని పొందుతాడు.ఇవన్నీ మనిషిలోని ధర్మ ప్రవృ త్తి
పెంపొందించడానికి దోహదపడతాయి.
"కామిగాని వాడు మోక్షగామి కాడు" అని అందుకే అంటారు.శుక్ర గ్రహం కళత్ర కారకు డు,సుఖములకు ముఖ్య కారకుడు
అయిన ప్పటికీ కూడా కేతువు యొక్క వైరాగ్య భావ న తోడు కాకపోతే దుఃఖానికి కారణం అవు తాడు. ఎందుకంటే" అతి సర్వత్ర
వర్జయేత్ " అనే నానుడి వుంది కదా.శుక్రా చార్యునికి వర ప్రసాదమైన మృత సంజీవిని విద్య కూడా శివుని అనుగ్రహం వలన
ప్రాప్తించిన దే అని మనం మర్చిపోకూడదు.పైవన్నీ ఒక పద్ధతిలో విశ్లేషణ చేసుకుంటే కేతువు ముక్తి కారకుడు అని ఎందుకంటారో
మనకు అర్థ మవుతుంది.
అందుకే విద్యార్థు లకు గణపతి ఆరాధన మరియు సరస్వతీ దేవి దయవలన కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పెంపొందింప
జేస్తుంది.విష్ణువు,లక్ష్మీ ఆరాధన వలన కేతు వు దంపతులకు సుఖాన్ని కలగజేస్తుంది.శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు,గణపతి అనుగ్రహంతో
కేతువు చల్లని చూపు వలన సంతానం ప్రాప్తి స్తుంది.బాధ్యతలు తీరాక ఆదిదంపతుల అనుగ్రహంతో తప్పకుండా కే
🌹🌹
        ♥
నామోచ్ఛారణ చేయడానికి కాల వేళాదుల నియమము ఏమీ లేదు.నామ స్మరణ చేయువారి ఇరుపక్షాలు ఉద్దరించిపోతాయి.
రామకృష్ణ నామము సర్వ దోషాలను హరిం చి వేయును.ఒక్క హరి నామమే జడ జీవు లను తరించి వేయగలదు.హరినామ సార
ము యొక్క రుచి మరిగిన నాలుక దైవము ను వర్ణించి చెప్పడము ఎవ్వరికి సాధ్యము కాదు.
హరిపాఠమును పఠించి హృదయస్థము చేసుకున్న వారి పూర్వజులకు కూడ వైకుంఠ మార్గము సులభము కాగలదు.....
లేదు కాల వేళాదుల నియమము ఉచ్ఛరిం చుటకు హరి నామము
ఇరు పక్షముల పరివారము
అయిపోవుదురు ఉద్గారము
రామకృష్ణ మధుర నామము
సర్వదోషహరణ కారణము
జడజీవులను తరించడము
హరి ఒకడికే ఇది సాధ్యము
హరినామము వేద సారము
నామ రుచి మరిగిన నాలుక భాగ్యము;
వర్ణింపనెవరి వైఖరి తరము
ఆ భక్త జనుల దైవ వైభవము
జ్ఞానదేవుని నామకీర్తనము
అయిపోయినది పరిపూర్ణము
పూర్వజులకు వైకుంఠ మార్గము
సులభముగా అయినది సాధ్యము.
🌹💖🌹
          
తురీయనిష్ఠ యందు శరీరమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు ఉన్నప్పటికీ,తాను విలక్షణుడై ఉండుటచేత,తాను సాక్షీ భూతు డై
ఉండుటచేత,సదా హిరణ్మయకోశమందు రమించేటటువంటి లక్షణం కల్గి ఉండుట చేత, సదా అగ్ని దీప్తిని కలిగి యుండుట చేత,
సదా స్వయం ప్రకాశాన్ని కల్గి ఉండుట చేత ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని,అజ్ఞా నాంధకారాన్ని తాననుభవించడు.దీనికొక
ఉపమానం ఉంది.ఎట్లా అంటే సూర్యుని యందు చీకటి ఉండే అవకాశం ఉందా? అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు
చీకటి ఏర్పడదు.
కాబట్టి సూర్యస్థా నంలో ఎట్లా అయితే చీకటి ఏర్పడదో,అట్లే తురీయనిష్ఠు డై నటువంటి, బ్రహ్మనిష్ఠు డై సిద్ధించినటువంటి,హిరణ్యగర్భ
స్థితినిసాధించినటువంటి,సిద్ధించినటువంటి మహానుభావులు ఎవరైతే మహర్షి ఎవరైతే ఉన్నారో,అతనికి అజ్ఞానాంధకారమనే
సుషుప్త్యావస్థ లేదు.
కేవలము భౌతికమైనటువంటి శరీరము తనకు తా ధన్యవంతమగుట గాని,తనకు తా విరమించడం గాని ఒక పనిముట్టు వలే
జరుగుతూ ఉంటుంది.జరగడమే ఉంటుంది గాని,అతను అవస్థా త్రయమునకు లొంగుట ఉండదు.
ఈ రకంగా అగ్నిని మనం ఆశ్రయించి,అగ్నిని ఆరాధించి ఆ అగ్ని యొక్క ఆధారముగా... ‘హవ్యవాహనుడు’.. అందుకే ఆయన
పేరు “హవ్యవాహనుడు”.ఈ అగ్ని యందు అర్పిం చబడేటటువంటి సమస్తమూ కూడహవిస్సు లు. వీటిని ఆధారముగా
మనందివ్యత్వాన్ని పొందటానికి శ్రోతస్సులు అంటాం.ఈరకంగా హవిస్సులే వారి దివ్యత్వాన్ని సాధించినపు డు శ్రోతస్సులు
అవుతున్నాయి,అంటే శ్రు తి భాగములు అవుతున్నాయి.
      ఏవైతే శ్రోతస్సులవుతున్నాయో,అట్టి శ్రు తి భాగములన్నీ కూడ ఏ పరమాత్మనైతే జపిస్తూ ఉన్నాయో,ఏ పరమాత్మనైతే నిర్ణ
యిస్తూఉన్నాయో,ఏ పరమాత్మ స్థితిని ఆశ్ర యిస్తు న్నాయో అట్టి పరమాత్మను నేనే అనే టటువంటి స్థితికి చేరాలి.
అలా ఎవరైతే సిద్ధ స్థితిని పొందుతారో,అలా ఎవరైతే దేశికేంద్రు లైనటువంటి స్థితిని సాధి స్తా రో, అలా ఎవరైతే అఖండ ఎరుకైననటు
వంటి పరబ్రహ్మమును దాటుతారో,లేని ఎరు కైనట్టి పరబ్రహ్మమునుదాటతారో,పరమాత్మ స్థితిని దాటి బయలు అనేటటువంటి స్థితికి
చేరతారో,ఇట్టి అధియఙాగ్నిని జాగరణ శీలు రైన ఋత్విక్కులు ప్రతి నిత్యమూ కాపాడు చున్నారు.
   కాబట్టి ఈ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని ఆంతరికం యజ్ఞం నిరంతరాయంగా జరు గుతూ ఉంటుంది.ఈ తురీయనిష్ట అనేటటు
వంటి ఆంతరికయఙం నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి.అట్లా ఈ ఆంతరిక యజ్ఞంలో ఎవరైతే తనను తాను లేకుండా
చేసుకుంటున్నారో,తనను తాను దగ్ధం చేసు కుంటున్నారో,ప్రారబ్ద ఆగామి సంచిత కర్మ లన్నీ దగ్ధం కాగా, త్రిపుటి అంతా దగ్ధం కాగా
- కర్మ త్రయం,దేహత్రయం,శరీరత్రయం,అవ స్థా త్రయం,గుణత్రయం,ఈ రకంగా త్రిపుటి అంతా ఏదైతేఉందో ఆ త్రిపుటి అంతా కూడ
ఈ జ్ఞానయజ్ఞంలో ఈ జ్ఞానాగ్నిలో ఈ అంత రిక యజ్ఞంలో దగ్ధమైపోగ జీవభావము నిశ్శే షముగా లేనిదై బ్రహ్మనిష్టు డౌతున్నాడు.
అపుడు హిరణ్యగర్భ స్థితిని సాధిస్తా డు.
తురీయనిష్ట చేత పొందదగినటువంటి ఆర వ కోశమైనటువంటి ఈ హిరణ్మయ కోశము, ఈ హిరణ్యగర్భ స్థితి అత్యుత్తమమైనటు
వంటి బ్రహ్మనిష్టకు ఆశ్రయమైనటువంటి స్థితి.ఈ హిరణ్యగర్భస్థితినుంచి ఏ జ్ఞానాగ్ని ద్వారా అనంతంగా ఉన్నటువంటి,అవధులు
లేకుండా ఉన్నటువంటి అనంత విశ్వము కూడ దగ్ధమైపోతుంది మరల.సంచితంఎలా అయితే లేకుండా పోయిందో,జ్ఞానపరమైన
రుణానుబంధము ఎట్లా లేకుండా పోతుందో అట్లే అఖండ విశ్వమూ కూడ ఈ హిరణ్య గర్భ స్థితియందు లయమైపోతున్నటువంటి
ఆ లయ స్థితిని తాను దర్శన విధిగా దర్శి స్తా డు.అట్లా విరాడ్రూ పంగా ఉన్నటు వంటి అనంత విశ్వమూ ఈఅగ్నియందు లేకుండా
పోతుంది.ఈ అగ్నియే,ఈ హిరణ్మయకోశమే పరమాత్మగామారిపోతుంది,పర బ్రహ్మము అయిపోతుంది.అఖండ ఎరుక లేని ఎరుక
అయిపోతుంది.
      ఆ విధంగా పూర్ణ గురువు సహాయంతో అనంత విశ్వము పిల్లలాటలవలే తోచేటటు వంటిది ఎరుక లేని పద్ధతి.సంకల్పము-
సంకల్పాతీతముశూన్యము-శూన్యాతీత ము. లేకుండా పోవుట అనేది శూన్యము, అలా ఎరుక లేకుండా పోవుట,లేని ఎరుక
అగుట శూన్యాతీతమగుట.అలాగేకాలము-  కాలాతీతము.కాలుని సహాయ సహకారం తో, కాలుని అనుగ్రహంతో,ఆ కాల పురుషు
ని యొక్క కృప చేత,ఈ అఖండ ఎరుకను దాటి, బయలు అనేటటువంటి దర్శనాన్ని పొంది,ఆ బయలు స్థితిలోకి చేరుతారు....్
*What the world wants is character. The world is in need of those whose life is one burning love, selfless.
That love will make every word tell like thunderbolt... Bold words and bolder deeds are what we want.
Awake, awake, great ones!.
*లోకానికి కావలసింది సత్ప్ర వర్తన (సౌశీ ల్యం),ఎవరి జీవితం ఉజ్జ్వల ప్రేమయుతమై, స్వార్థరహితమై ఉంటుందో అలాంటి వారే
లోకానికి అవసరమై ఉన్నారు.అటువంటి ప్రేమతో కూడిన ప్రతి పలుకూ పిడుగువలె తాకుతుంది. ధీరవాక్కులు,ధీరతరమైన చేతలు
మనకు కావలసిఉన్నవి.మహనీయు లారా! లేవండి,మేల్కొనండి!.
🌹❣️🌹
       
*మనము దైవాన్ని ఆరాధన చేసేటప్పుడు భ్రూమధ్యములో ఉన్నట్లు భావనచేయమని శ్రీకృష్ణుడు చెప్పాడు. అక్కడ త్రిగుణాత్మక
మైన త్రిభుజమువలె ఒక ద్వారము ఉంటుం ది.అది ఏమిటంటే సత్వము,రజస్సు,తమ స్సు,లేక త్రిమూర్తు లు,లేక ఇచ్ఛ,జ్ఞాన,క్రియా
శక్తు లుగా మనకిఇడా,పింగళ,సుషుమ్నఅను మూడు నాడులు కేంద్రాలుగా ఫాలభాగము లో ఉంటాయి.ఆ ఫాల భాగములో ఉండే
త్రిభుజములో నుంచి ఆవలకి వెళ్ళాలి.
*అది రజస్సు నుండి,తమస్సు నుండి వీలు పడదు.సత్వ,రజస్తమస్సులు సమన్వయిం పబడాలి.అపుడే సమకోణ త్రిభుజము ఏర్ప
డుతుంది. సత్వము నుండి,నిత్యసత్వము లోకి ప్రవేశించి, నిత్యసత్వములో నుంచి గుణాతీతము లోనికి ప్రవేశిస్తే ద్వారము దాటినట్లే.
*దత్తా త్రేయుడు యోగమునకు అధిదేవత. ప్రతి సద్గురువు దత్తా త్రేయ స్వరూపమే. 'గురుర్బ్ర హ్మ'అని మనము చేసే స్తోత్రము
దత్తా త్రేయునికే చెందుతుంది.మనలో ఉండే బ్రహ్మ,విష్ణు,శివ స్వరూపమైన ఇచ్ఛ,జ్ఞాన, క్రియా శక్తు లను సమన్వయ పరచడమే
దత్తా రాధన లోని ప్రధానమైన అంశము. అందుకనే ఆయన మూడు తలలతో ఉంటా డు. దత్తా రాధన చేస్తు న్నప్పుడు మనలో ఉండే
ఇడ,పింగళ,సుషుమ్న నాడులను మూడు తలకాయలు గాను,సుషుమ్న నాడి మూలాధారము వరకు ఉంటుంది కాబట్టి అది
ఆయనశరీరముగాను భావనచేయాలి.
*మనలో దత్తస్వరూపము మూలాధారము వరకు ఏర్పడి ఉంటుంది.ఆయనలో శివత త్త్వము, విష్ణుతత్త్వము,బ్రహ్మ తత్త్వము
ఉన్నాయి కాబట్టి  శూలము,చక్రము,పద్మం చంద్రు ని ధరించి ఉంటాడు.వృషభము, హంస,గరుడుడు ఏకమై మనకి ఒక గోవుగా
కనిపిస్తుంది.నాలుగు వేదములు నాలుగు జాగిలములుగా కనిపిస్తా యి.యోగవిద్య కావాలన్నా,యోగస్థితి నుంచి క్రిందకు జార
కుండా ఉండాలన్నా దత్తా రాధనముఖ్యము.
🌹💞🌹
           
*"వాస్తవంలో జీవించటం అంటే......
*వాస్తవంలో జీవించటం అంటే ఉన్నదున్న ట్లు గ్రహించటం.మనం దేనికైనా ఇచ్చే విలు వ దాన్నుంచి పొందే ప్రయోజనాన్నిబట్టి
ఉంటుంది. ఏది మనకు ప్రయోజనకరమో, ఏది అప్రయోజనకరమో,ఏ ప్రయోజనం శాశ్వతంగా నిలుస్తుందో,ఏది అశాశ్వతంగా
ముగుస్తుందో తెలుసుకుంటే ప్రపంచం విష యంలో మన మనసుకి తగిన పరిమితులు ఏర్పడతాయి. భార్యాపిల్లలతో, కుటుంబ
సభ్యులతో, సమాజంలో ఎవరెవరితో ఎంత వరకు ఉండాలి, ఎలా ఉండాలో తెలుసు కోవాలి. మన నిజమైన అవసరాలకు,కోరు
కుంటున్న సౌకర్యాలకు, విలాసాలకు ఉన్న అంతరం ఏమిటో అవగాహన చేసుకోవటం ద్వారా వాస్తవంలో జీవించటం అలవాటు
అవుతుంది !
🌹 💕🌹
         
*ప్రవర్తనలో మార్పురావడమే మనలోని భక్తికి కొలమానం !.
*దేశవిదేశాల్లో భక్తు లు కలిగి ఉన్న మహనీ యులైనా వారి ప్రక్కనే తిరిగే వారిని మార్చ లేకపోవచ్చు.వ్యక్తి గొప్పతనానికి మహత్తు లే
కొలమానం కానక్కర్లేదు.అన్నీ తెలిసి అతి సామాన్యుడిగా,భక్తు డిగా వినయంగా ఉండ టంలోనే నిజమైన మహత్మ్యం ఉంది.మహా
త్ములపై భక్తి కలిగి ఉండటం అంటే కేవలం భౌతికమైన వినయ,విధేయతలు మాత్రమే కావు. మనసులో గౌరవంతో కూడిన ప్రేమ కలిగి
ఉంటేనే అది మనని ప్రభావితంచేసి సంస్కరిస్తుంది. మనం సమాజం అని పిలి చేది వ్యక్తు ల ప్రవర్తననే.సమాజానికి కీడు చేసే వారిలో
చాలామందికి ఇష్టదైవం,గురు వు ఉంటారు.మరి అవి ఎందుకు వారిని మార్చటంలేదంటే వారికున్నది నిజమైన భక్తి కాదు.
"ప్రవర్తనలో మార్పురావడమే మన లోని భక్తికి కొలమానం”!.
🧡
           
*యోగి అని సంబోధించితివి.అనగా నీలో నన్ను భావించి అందు యోగివైతివి.నిన్ను ధ్యానించుట,తెలియుట ఎట్లు సాధ్యము? ఏ
యే భావములయందు నీవు ధ్యానింప బడుదువో, దర్శింపబడుదువో, మాకెట్లు తెలియును? నీవే వివరింపవలెను.
*నీకును, జీవులకు నడుమగల యోగమను సంబంధము, జీవుల యందు వర్తించు నీ యోగమాయ మున్నగు నీ వైభవ విస్తృతిని
గూర్చి మరల పలుకుము.వినుచున్న నా తృప్తికి ఆద్యంతములుండవు.
*అంతకన్న కావలిసినదేమి!దివ్యములైన ఆత్మ వైభవములను తప్పక వర్ణింతును. కాని నాకు కూడా సాధ్యము కాదు..
*'నేను' వ్యాపించు వైభవమునకు ఆద్యంత ములు లేవు.కనుక వానిని సంపూర్ణముగ ఎట్లు వర్ణింతును? వానికి నేనే మొదలు,
నడిమి,అంతము అని మాత్రము ఎరుగు దును. అందరి సర్వ జీవులలో ఆత్మగ ఉన్నాను. ఎవరికి వారు నేను అనుకొందు రు. నేను
ఉన్నానని ఎరుగుదురు.ఈ నేను అహంకారము.అది ఎరుగుట ఎట్లు అని ప్రశ్నించినచో నన్ను నేను ఎరుగుదును.అను జ్ఞానము
కలుగును.ఈ జ్ఞానమే ఆత్మ.ఇది సర్వజీవుల ఆశయముగ ఉన్నది.దానికి స్థా నము హృదయము.
🌹 💙🌹
        
*సాత్త్వికసుఖముయొక్క లక్షణము....
ఏ సుఖము ప్రారంభమునందు విషము వలెను, పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో, తన బుద్ధి యొక్క
నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్త్వికమని చెప్పబడినది.
అధ్యాత్మక్షేత్రమున సాధకునకు అభ్యాస కాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ఠ,ధ్యాన, వైరాగ్యాదులు ఒకింతకష్టముగా తోచ వచ్చు 
కాని అభ్యాసము,సాధన పూర్తియగుకాల మున అమృతతుల్యముగ నుండును.ఆత్మ సుఖము నవి కలుగచేయును -అని యిచట
వచింపబడినది.
కావున సాధనదశలోగాని,అభ్యాసకాలము లో గాని ఎవరికైనను కష్టముకలిగినచో, విసుగు జనించినచో,అధైర్యపడక,అది వాస్తవమగు
బాధకాదనియు,పరిణామము న అనంతానందము కలుగుననియు నిశ్చ యించి సాధనను విడనాడక ధైర్యముతో
కొనసాగించవలెను.కనుకనే "విషమివ' అని చెప్పిరేకాని "విషమ్” అని చెప్పలేదు.అనగా ఆ ప్రారంభకష్టము విషమువలె తోచునేగాని
వాస్తవముగ విషముకాదని భావము.ఇచట ప్రయోగించిన ‘ఇవ' అను పదమునందు గొప్ప అర్థముకలదు.‘బాధవలె తోచునేకాని
బాధకాద’ని ఆ పదమువలన స్పష్టమగు చున్నది.
    ఒకానొక రోగమునకు "వేపఉండ"అను మందు ఇచ్చుదురు.అది చేదుగా నున్నను ఆరోగ్యమును గలుగజేయును.ఔషధము
సేవించునపుడుఅప్రీతిగానున్నను,బలవంత ముగా నైనను సేవించవలసినదే ఆరోగ్యము కొఱకు.ఒక ఱాయి దేవవిగ్రహముగా మారు
టకు మొదట ఉలిదెబ్బలు తినునట్లు ను, బంగారము శిరోభూషణముగా మారుటకు స్వర్ణకారుని సుత్తిదెబ్బలు తినునట్లు ను -
అనంతమగు బ్రహ్మానందము ననుభవించు టకు ముందు జీవుడొకింత త్యాగము చేయ వలసియుండును.
అట్లు అల్పసుఖమును వదలునప్పుడు ఒకింత దుఃఖము కలుగవచ్చును.అనేక జన్మలనుండి ఆ విషయసుఖములను బంధువులు
జీవుని హృదయగేహములో నివసించుచున్నారు.వారు పోవునపుడు బంధువియోగమందువలె తాత్కాలిక ఆవే దన
కొంతకలుగును.అంతమాత్రముతో సాధకుడు బెదరిపోరాదు.కొంత ఓపికబట్టి సాధనను విడువక కొనసాగించినచో ఆ కష్ట కాలము
తొలగిపోయి సుఖకాల మేతెంచు ను.ఒక విద్యార్థిదశలో రేయింబవళ్లు కష్టపడి చదువును. తదుపరి ఉద్యోగకాలమందు
సుఖించును.
అట్లే అధ్యాత్మరంగమున ఇంద్రియాదులను నిగ్రహించునపుడు,అంతర్యుద్ధఫలితముగ కొంత ప్రయాస కలిగినపుడు దానిని సహిం
చుకొని ముందునకు సాగిపోవలెను.అంతి యేకాని భయపడి సాధనను విరమించ రాదు. కనుకనే భగవానుడిచట సాత్త్విక
సుఖముయొక్క నిజస్థితిని తెలుపుచున్నా రు. విషరూపదుఃఖములో అమృతరూప సుఖముయొక్క బీజములున్నవని సెలవి చ్చిరి.
తాత్కాలికకష్టరూపమగు ఆ విషము నెట్లైనను దిగమ్రింగివేసినచో వానిలోనగల అమృతబీజములపుడు మొలకెత్తు ను.
ఇది విషమువలె నున్నదికదాయని పారవేసి నచో దానిలోని అమృతబీజములనుగూడ జనులు పోగొట్టు కొనినవారగుదురు.కాబట్టి
సాధకు లివ్విషయమున కడు జాగరూకులై యుండి భగవానుని ఈ అమూల్యోపదేశ ము జ్ఞప్తియందుంచుకొని అనంతాత్మ సుఖ
ము తమకై వేచియున్నదని భావించి, కష్ట సహిష్ణువులై, త్యాగశీలురై,సాధనను విడువ కుండ చేయుచునే యుండవలెను.కనుకనే
‘కశ్చిద్ధీరః’-ఏ ఒకానొక ధీరుడో(అన్నికష్టము ల నోర్చుకొని)ప్రత్యగాత్మను చూడగలడు
     మఱియు 'అమృతోపమమ్'- అమృత మునుబోలి అని యిచట చెప్పుటయు చాల సమంజసముగా నున్నది.ఏలయనిన,ఆత్మ
సుఖము,దైవసుఖము దేవతల అమృతము ను పోలినదేకాని,జడమగు ఆ దేవతల అమృతముకాదు.దానికంటె ఎన్నికోట్ల రెట్లో
అధికశక్తివంతమైనదది.దేవతల యొద్దగల అమృతము స్థూలదేహమునకు కొంతకాల ము మృతిలేకుండ నివారించును.కాని ఈ
ఆత్మసుఖరూపమగు అమృతము శాశ్వత ముగ జననమరణ సంసారప్రవాహము నుండి జీవుని తప్పించివేయును.
"ఆత్మబుద్ధి ప్రసాదజమ్”- ఆ సాత్త్వికసుఖము (ఆత్మసుఖము) యెట్లు కలుగగలదు? బుద్ధి నిర్మలముగానున్నచో, విషయదోషము
లెవ్వియు లేకయుండినచో, నిర్మలదర్పణమున ప్రతిబింబమువలె ఆత్మ సుఖము అందు గోచరింపగలదు.అనుభూ తము
కాగలదు.కాబట్టి సుఖము నపేక్షించు వారు మొట్టమొదట తమబుద్ధిని నిర్మలము గా నొనర్చుకొనవలెను..
"మోక్షమెచటనున్నది? సుఖమెచటనున్నది?”- అని కొందరు ప్రశ్నిం చుదురు.దానికి భగవానుడిచట సమాధాన
మొుసంగిరి.మోక్షము,దైవసుఖము ఆకాశ ములో లేదు.పాతాళములో లేదు.నిర్మలమ గు తన బుద్ధియందే కలదు.
*సాత్త్వికసుఖముయొక్క లక్షణమేమి.....
ప్రారంభములో(అభ్యాసకాలములో) విష మువలె కష్టముగతోచి తుదకు అమృతము వలె సుఖదాయకముగ నుండునది సాత్త్వి
కసుఖము.
*అట్టి సాత్త్వికసుఖము జీవున కెట్లు కలు గును....నిర్మల బుద్ధి నుండి ఆ సుఖము జనించును. కావున సుఖాభిలాషి బుద్ధిని
నిర్మలమొనర్చుకొనవలయును.
*జీవుని కర్తవ్యమేమి.....
ఆధ్యాత్మికసాధనలు గావించునపుడు కలుగు కష్టములకు జంకక భగవంతునిపై పూర్ణ విశ్వాసముంచి,సాధనను ధైర్యముతో
కొనసాగించి,బుద్ధియందు విషయదోష మెద్దియు లేకుండ అద్దా నిని సునిర్మలముగా గావించవలెను.అత్తఱి మహత్తరమగు ఆత్మ
సుఖ మాతనికి అనుభూతము కాగలదు. అదియే మోక్షము
                 🌹💜🌹
మానవులకు తెలుసు కొనుటలో గల ఆసక్తి చేయుటలో లేదు.తెలుసుకున్న కొలది యింకను తెలుసుకొన వలెనను ఆరాటమే గాని,
తెలిసినది ఆచరించుట యుండదు. తెలిసినది ఏ కొద్దియైనను,దాని నాచరించు ట ఆరంభించినచో తెలియవలసినది ఎప్ప
టికప్పుడు తెలియుచునే యుండును.ఆచ రింపక తెలుసుకొనుట ఆరంభించినచో అది వ్యసనమై స్థిరపడును.తెలుసుకొనుట,ఆచ
రించుట ఉచ్ఛ్వాస నిశ్వాసలవలె ఎవరి యందు జరుగునో అట్టివారే ముముక్షు మార్గమున పయనించువారు.అందులకే
ఉత్తిష్ఠ,అతిష్ఠ (లెమ్ము, ఆచరింపుము)..
హృదయమందు పుట్టిన అజ్ఞానమును,ఈ తెలుపబడిన జ్ఞానమను ఖడ్గముచే ఛేదిం చుము. నిష్కామముగ కర్మమును నిర్వర్తిం
చుము.సంశయింపక లెమ్ము.అర్జు నుడు సంశయమున పడుట చేతనే అతని హృద యమున అనేకానేక ప్రశ్నలుఉద్భవించినవి.
ప్రశ్నల నుండి ప్రశ్నలు పుట్టు చున్నవి.సహజ ముగ జ్ఞానవంతుడై నను అతడు సంశయ మున పడుటచే అతని నజ్ఞాన మావరించి
నది. అజ్ఞానము,సంశయముతోడై ,అశ్రద్ధ జనింపగ శ్రీకృష్ణుడు తెలిపిన విషయమునే మరల మరల తెలుపవలసి వచ్చినది.అర్జు నుని
యందుకల వాత్సల్యముతో దైవము మరల మరల నిష్కామ కర్మయోగ ప్రభావ మును వివరించినాడు.
🌹🧡🌹
              
తన దగ్గర ఎంత ఉంది,ఎంత ఇచ్చాడు అనే దాన్నిబట్టి దానంయొక్కమహత్తు ఉంటుంది. అంతే కాని ఎంత ఇచ్చాడు అనేదానినిబట్టి
కాదు. ఒక కోటీశ్వరుడు లక్షరూపాయలు దానం చేస్తూ యథాశక్తి అంటే,అది దోషం. “నా బుద్ధి చిన్నది.లక్షకంటే ఎక్కువ ఇవ్వటం
లేదు. నేను ఇవ్వగలిగినవాడినే! యాభై లక్ష లు ఇవ్వగలిగినవాడినే! కాని నాబుద్ధి చిన్న ది. స్వీకరించి అనుగ్రహించండి”అనిఅనాలి.
. “యథాశక్తి ఇస్తు న్నాను.ఏకంగా లక్షరూపా యలు ఇస్తు న్నాను.చాలా పెద్దమొత్తం ఇస్తు న్నాను” అనుకోవటం వాడికి దానమే కాదు.
తనశక్తికి సరిపడేటట్లు ఇస్తేనే అది దానం. ‘శక్త్యనుసారం’–‘యథాశక్తి’ అనరాదు,అలా అనకూడదు.‘యథాబుద్ధి’ అనాలి. యథా
శక్తి అంటే ‘యావఛ్ఛక్తి’ అనే అర్థం.దానికి అదే అర్థం.జ్ఞాపకం పెట్టు కోవాలి.
ఇవ్వగలిగితే లక్ష ఇవ్వాలి.ఇవ్వలేకపోతే ఒప్పుకోవాలి! అప్పుడు దోషం ఉండదు. ఎప్పుడూ కూడా ఆ మాట-యథాశక్తి అనే మాట-
వాడకుండా ఉండటమే న్యాయం, క్షేమం.నిజానికి మనం దానం యథాశక్తిగా ఎప్పుడూ ఎందులోనూ చెయ్యటంలేదు. ఏదో
యథాబుద్ధి చేస్తు న్నాం.ఒకవేళ చేసినా, దానిని దానం అనే అంటారు.అంతే కాని అది త్యాగం అనిపించుకోదు.త్యాగం వేరు.
ఒకదాత,కోటి ఇవ్వకలిగినవాడు,లక్షే ఇస్తే, దానం చేసిన వాడవుతాడు.దానికుండే ప్రతి ఫలం ఎదో ఉంటుంది.అది పుణ్యమే అవు
తుంది.అయితే ఉన్నదంతా ఇవ్వగలి గినవా డు త్యాగంచేసినవాడవుతాదు.దానంవల్ల పుణ్యంవస్తే,త్యాగంవల్ల మోక్షమేవస్తుంది.
‘త్యాగేనైకే అమృతత్వమానశుః.....’
🌹💙🌹
             
ఉన్నతర చైతన్యము:-ఆధ్యాత్మిక మార్గము, మహోన్నత చైతన్యము:- భగవంతుడు, సర్వోన్నత చైతన్యము:-సద్గురువు లేక అవతార
పురుషుడు.
సృష్ట రూపములలో ఉన్నత చైతన్యము:- మానవుడు,మానవులలో మహోన్నత చైత న్యము:-భగవంతుడు.భగవదనుభూతిపరు డై న
మానవుడు (జ్ఞానముతో,విశుద్ధచైతన్య ముతో కూడిన) సర్వశక్తిమంతుడు.సత్యస్థి తి యందు జాగరూకుడై యుండును.అతడే
జ్ఞానము-జ్ఞాని-జ్ఞేయము,ప్రేమ-ప్రేమికుడు- ప్రియతముడు.
ప్రతి జీవాత్మలో తానున్నాననియు,తనలో ప్రతి జీవాత్మ ఉన్నదనియు అతడెరుంగును. అతడే సమస్తమునకు ఆద్యంతములని
కూడా ఎఱుంగును.తాను శాశ్వతముగా, ఆ.... సత్యసాగరునిగనే యుంటిననియు, ఉన్నాననియు,ఉందుననియు ఎరుంగును.
కాని, సామాన్య మానవునకు తానెక్కడ నుండి వచ్చెనో,ఎక్కడికిపోవునో తెలియదు. దేవుడి పాదాల చెంతపడి ఉన్న పువ్వు..
దేవుడి మెడలో దండై ..హారంగా కొలువున్న
పూలని చూసి..అసూయగా.......
నువ్వూ నేనూ ఒకటే కదా..మరి నువ్వు మెడలో..నేను పాదాల దగ్గర..నీ గొప్పతనం ఏంటి..దండలో ఉన్నపువ్వు చిన్నగానవ్వి మాలలో
చేరడానికి నన్ను సూదిలో గుచ్చి  నాగుండా దారాన్ని నింపుతారు..నొప్పి భరిం చి నిలబడటంవలెనే నాకీ చోటు దక్కింది. ఎవరైనా
మనకంటే ఉన్నతస్థా యిలో ఉన్నా రంటే,వాళ్ళు ఆ స్థా నాన్ని చేరుకోడానికి ఎంత నొప్పిని అనుభవించి ఉంటారో.
🌹💟🌹
        
ప్రపంచంలోఅన్నింటికన్నా శక్తిఉన్నది ప్రేమకి.
ఆ ప్రేమకోసం ఎంతదూరమైన వెళ్ళిపోతారు ఎన్ని త్యాగాలు అయినా చేస్తా రు ఎవరినైనా ఎదిరిస్తా రు..బిడ్డలు చెప్పిన మాట వినక
పోయిన మీమల్ని ఎదిరించిన బాధ పెట్టిన వారికి దూరం కారు వారిని వదిలించుకోరు మారాలి మార్చుకోవాలి అనుకుంటారు వారి
కోసం బతుకుతారు వాళ్లకోసం కష్టపడతారు కష్ట పెడతారు ఏమైనా చేస్తా రు ఎందుకంటే ప్రేమ బిడ్డలు అనే బంధం మమకారం,అదే
ప్రేమ భగవంతుడు పట్ల ఉండాలి నిరంతరం ఆలోచనలో మనసులో దైవాన్ని అరాధిస్తూ నే ఉండాలి ఆ ప్రేమ అనేది ఉంటే నువ్వు
ఎక్కడ ఉన్నా,ఏమిచేస్తు న్న భగవంతుడు కోసం మనసు తపిస్తూ ఉంటుంది...
నేను ఎన్ని పూజలు చేసాను కానీ దైవం నన్ను అనుగ్రహించడం లేదు నాకు నమ్మకం పోయింది అని అంటుంటారు.అక్కడ ప్రేమ
ఉంటే ఆమాట ఎందుకు వస్తుంది భగవంతు డు నీకు నువ్వు తట్టు కోగల శక్తిని ఇచ్చాడు. నువ్వు బాగుపడే ఎన్నో అవకాశాలు ఇచ్చా
డు అని గమనించరు..
10 నెలలుగా ఆదాయం లేదు దేవుడికి ఎన్నో పూజలు చేశాము అంటారు..మరి ఆదాయం లేకున్నా నీ ఇల్లు గడుస్తుంది. ఎంతో
కష్టమైన స్థితిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కడ నుండి వస్తుంది నీ బిడ్డలు నువ్వు ఇన్ని బాధల్లో సురక్షితంగా ఎలా ఉన్నారు కష్టంలో ఉన్న
బిడ్డను తల్లితండ్రి ఎంతగా అండగా ఉంటారో అలానే కష్టంలో ఉన్న నిన్ను ఒక్క క్షణం కూడా భగవంతుడు వద లడం లేదు అందుకే
ధైర్యంగా ఉన్నావు నీ నీడను నిందిస్తు న్నావు..
ఒక ఉదాహరణకు నీ బిడ్డకు ఆజీర్తి చేసి కడుపులో నొప్పితో బాధ పడుతూ ఉన్నాడు మీరు వెంటనే వైద్యం చేయిస్తా రు తగిన ఉప
చారాలు చేస్తు న్నారు ఔషదం ఇస్తు న్నారు కానీ నొప్పి తట్టు కోలేని బిడ్డ ఆ నొప్పి తన తండ్రి తీసుకోవడంలేదు తనకు బాధ తొల
గించడం లేదు అని నిందిస్తూనే ఉన్నాడ. వైద్యం చేయిస్తా రు కానీ తగ్గే వరకు ఆరోగ్యం కోలుకునే వరకు ఆ బాధను ఎవరు భరించా
లి బిడ్డే భరించాలి. ఎందుకంటే ఆ మలినం అతని కడుపులో ఉంది అది తొలగించుకునే అవకాశం తండ్రి కలిపిస్తు న్నాడు ఎప్పుడై తే
ఆ మలినం తొలగిపోతుందో అప్పుడు ఆరో గ్యం కుదుట పడుతుంది..
దాహమే వేయకూడదు అని కోరుకోకూడదు దాహం వేసిన సమయంలో ఎక్కడవున్నా కాసిన్ని నీళ్లు దొరకాలి అని అనుకోవాలి..
వానపడితే ఎండకాస్తే గొడుగు లాగా దైవం కష్టం దాటడానికి ఆసరాగా ఉంటాడు పడవ లాగా సంద్రాన్ని దాటిస్తా డు అంతే కాని వాన
ఎండ లేకుండా పోతే సృష్టి ఉంటుందా..కష్టం తర్వాతే సుఖం,కష్టపడి ఈస్థా యికివచ్చాడు అంటారు కానీ సుఖంగా ఈ స్థా యికి
వచ్చా డు అని ఎక్కడై నా విన్నారా అలా అడ్డదారి లో వచ్చినా దాన్ని నిలుపుకోలేదు.
అలాగే మనలో ఉన్న మలినాలు వల్ల బాధ లు పడుతున్నాము అది తొలగించుకునే ఉపాసనా మార్గాన్ని దైవం అనుగ్రహించింది
దానిద్వారా ఉపశమనం కలుగుతుంది దాని ద్వారా బాధ తగ్గుతుంది దాని ద్వారా శాశ్వ తమైన పరిష్కారం లభిస్తుంది..
🌹💛🌹
        
*ప్రేమను పెంచుకోవడం ఎలా......
మనలో ప్రేమ యొక్క అనుభవంఉంది కానీ, అది బలహీనంగా ఉంది.ఆ ప్రేమను ఇంకా బలీయంగా చేసుకోవడానికి మార్గం ఒక్కటే
అది ప్రేమను ఇంకా ఎక్కువ వ్యక్తీ కరించడ మే. ప్రేమను ఎంతఎక్కువగావ్యక్తీకరిస్తా మో, అది అంతగాపెరిగి మరింతగాఅనుభవంలో కి
వస్తుంది.ప్రేమతోచేసేఏకార్యమైనా అది పనిలాగా అనిపించదు.అది ప్రేమను వ్యక్త పరిచే విధానమవుతుంది.తండ్రి ఆఫీసు నుండి
వస్తూ ఏదో ఒక బొమ్మ, డ్రెస్ బిడ్డకు ఎలా తెస్తా డో అలాగ.బిడ్డ ఆ డ్రెస్ గురించి గాని,ఆ బొమ్మ గురించి గాని ఆలోచించక
పోయినా,తండ్రి ఏదో ఒకటి ఇవ్వాలని బిడ్డ అనుకుంటుంది.ఆయన ఎంత ఎక్కువగా ఇస్తా రో,అంతగా తండ్రితో బాంధవ్యాన్ని
పెంచుకుంటుంది.ఆ తండ్రి కూడా అలాగే పెంచుకుంటాడు.“లేదు,నా ప్రేమనుమనస్సు లోనే ఉంచుకోవాలి,వ్యక్తపరచకూడదు,ఈ
భావాలతో లాభమే ముంది? ఇవన్నీ బాల్య చేష్ఠలు అని తండ్రి అనుకుంటాడా? అతను ప్రేమను వ్యక్తీక రించలేకపోతే,బిడ్డను హత్తు
కుని ముద్దు పెట్టకపోతే కొంతకాలానికి బిడ్డ తో అతని బాంధవ్యము తగ్గిపోయి సారహీ నమై పోతుంది.*ప్రేమను ఎప్పుడూ వ్యక్త
పరచాలి.
ఈ ఆచారాలన్నీ-అందరూ నా దగ్గరకు రావ డం,నమస్కారం చేసుకోవడం,ఏదైనా సమ ర్పించడం ఇవన్నీ ప్రేమ యొక్క వివిధ భావ
ప్రకటనలు.అవి ప్రేమను వ్యక్తపరచే భావమ యినప్పుడు,అది నిజమైనఆచారమవుతుం ది. లేకపోతే అది వ్యర్థం.భజన కానీ,ఆచా రం
కానీ,ఏ విధమైన పని కానీ అది ప్రేమను వ్యక్తపరచినపుడు‘పూజ’అవుతుంది.
🌹🌹🌹🌹
         
భయపడుతూ జీవించేవారు అనుక్షణం మరణిస్తూ ఉంటారు.అలాగే వీరికి తరుచూ అనారోగ్యాలు వస్తా యి.ఎవరో ఏదోతీసుకెళ్లి
పోతారనీ,మన నుండి లాగేసుకుంటారనీ, మనల్ని తొక్కేస్తా రనీ కుంచించుకుపోయి భయంభయంగా బ్రతకడం మంచిది కాదు.
జీవితం నుండి శాశ్వతంగా తీసుకెళ్లగలిగేది ఏదీ ఉండదు.వేరే వాళ్లు లాక్కునేది ఏదీ ఉండదు.నిరంతరం మొహంపై వెలిగే కల్మ షం
ఎరుగని చిరునవ్వు మాత్రమే ఉన్నన్నా ళ్లూ జీవితాన్ని వెలిగిస్తుంది.మన సంకుచితా లు అన్నీ మన మనస్సుని బంధీఖానా చేసి
ఒరిపిడికి గురిచేసే ఛెయిన్స్ మాత్రమే.వాటి ని ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది.
స్వార్థా లూ,కుట్రలూ,గాసిప్స్,పక్కోడి గురిం చి చెడ్డగా మాట్లా డడాలూ,అనవసరమైన
ద్వేషాలు,కుల మత ప్రాంతీయాభిమానా లూ, ఇతర సంకుచిత స్వభావాలను అధిగ మించినప్పుడు మాత్రమే నిజమైన హృద యం
వికసిస్తుంది.లేదంటే ఉండేది బానిస బ్రతుకే.జైల్లో ఖైదు చేసిన నేరస్థు డు, స్థంభా నికి కట్టేసిన జంతువు ఎలాగైతే అటూఇటూ ఓ
ఛట్రంలో తిరుగాడుతూ సంఘర్షణ పడు తుందో అలాంటి నీ మానసిక సంఘర్షణే నీ శాపాలూ,నీ దురదృష్టం అనే పదాలూ! వాటి
ని అధిగమించు.ఆత్మ విశ్వాసం ,భగవాన్ పై విశ్వాసం,ధర్మ ఆచరణ,ఇదే ఉత్తమ స్థితి ని....శాంతి ని అందిస్తుంది......
🌹🌹🌹🌹🌹
     
*మనిషికి... మనిషి...నచ్చుతాడేమో గానీ,
మనిషి... మేధావితనం.....మాత్రం నచ్చదు.
ఎందుకంటే..... ఎవరికివారు..తమను గొప్ప వారుగా అనుకుంటారు..నిజమే...మాటలు నమ్మేవారికి..అబద్దా లు సులువుగా చెప్పి
నమ్మించొచ్చు ..మనిషిని నమ్మేవారికి,అబ ద్దా లు చెప్పి నమ్మించడం కష్టమే...ఒక వ్యక్తి ఎదురుగా మాట్లా డితే,మనసు విప్పి మాట్లా
డినట్లు ....ఆ మనిషి లేకుండా మాట్లా డితే,
చాడీలు చెప్పినట్లు .మనిషికి మనిషికి మధ్య ఆస్తి తగవులకంటే,చెప్పుడు మాటలు తెచ్చే తగవులే ఎక్కువ వుంటాయి...
మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం,ఆ వ్యక్తి త్వ విలువ, మన జీవన విధానాన్ని మార్చే స్తుంది.....అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే....
సర్వస్వం కోల్పోయినట్లే....
మీ సహచరులపై నాయకత్వం వహించాల నే ఆలోచన చేయకండి.దానికి బదులు వారి కి మీరు చేయగలిగిన సహాయం చేయండి...
అగ్ని నిప్పు ని మండుతున్నప్పుడు ముట్టు కుంటే చేయికాలుతుంది.చల్లగా ఉన్నప్పుడు ముట్టు కుంటే చేయ్యి నల్లబడుతుంది.
చెడ్డవానితో ఎలా ఉన్నా...ముప్పే.అమావా స్య రోజున వెన్నెల ఇవ్వలేదని చంద్రు ణ్ణి నిందించడం ఎంత తప్పో.కోపంలోఒకమాట
అన్నారని నాఅనుకునే మనుషుల్ని వదులు కోవడం అంతే తప్పు.
    ఒకరు నిన్ను ప్రతిరోజూ పలకరిస్తూన్నా రంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంతమందిఉన్నా వారి మనసులో మీస్థా నం చాలాప్రత్యేకమైం
దని అర్థం.
  బంధాలను అనుబంధాలను సార్థం కోసం వాడుకొంటే మన తోడు‌ఎవరు మిగలరు.... జీవితం చాలా చిన్నది ఎదుటి వారిని ప్రేమిం
చు కానీ వారితో నటించకు.నీకు ఎదుటి వారికి వీలైన్నంతమెరకు సహాయం చెయ్యి తిరిగి ఆశించకు
మాట్లా డు మాటలతో మాయ చేయకు
నమ్మించు నమ్మకద్రోవం చేయకు జీవించు.. నిన్ను నువ్వు మోసం చేసుకోకు.
    మనసుకి హత్తు కునేలా మాట్లా డేవారు కొందరు ,మనసు నోచ్చుకునేలా మాట్లా డే వారు మరి కొందరు ,మనస్ఫూర్తిగా మాట్లా డే
వారు ఇంకొందరు ,అందరిమధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం.
   *బంధాలు అనేవి వాటంతట అవే దూరం కావు మన ప్రవర్తన వలన,మనం ఎదుటి వారిని నిర్లక్ష్యం చేయటంవలన,మనం ఎదు టి
వ్యక్తి వ్యక్తిత్వంవలన,ఒకరిని ఒకరు అర్థం చేసుకోక పోవడంతో దూరం అవుతాయి .
     మొక్క ఎదగాలంటే దానికి కావాల్సింది ఖరీదైన కుండికాదు .నాణ్యమైన మట్టి.. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి
కావాల్సింది సంపాదన కాదు సంస్కారం.
*జీవితంలో సక్సెస్ అంటే ..అవార్డు లు,రివా ర్డు లు వస్తేనో ( లేక )సన్మానాలు‌,సత్కారాలు చేస్తేనే కాదు,మన చుట్టూ ఉన్నసమాజంలో,
మనకంటూ ప్రత్యేకతమైన ఓ స్థా నాన్ని సంపాదించడం,విలువలతో కూడిన జీవితా న్ని గడపడం.....
*నిజకార్యసముద్దర....
ఎంత గొప్పవానికైనా,చెడు..సమయం వచ్చి నప్పుడు నీచుని వేడుకొనుట తప్పు కాదు..
*విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం.కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోలేక పోవడంమనదురదృష్టం.
'శరీరం' ఎంత చలిస్తే అంత ఆరోగ్యం.'మన స్సు' ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం.
తాను ఏం మాట్లా డాలో తెలిసినవాడు తెలి వైనవాడు.ఏం మాట్లా డకూడదో తెలిసిన వాడు వివేకవంతుడు.....
🌹 💕🌹
       
*జీవితం – ఎందుకింత కష్టం.....ఎందుకు? జీవితం కష్టంగా ఉన్నప్పుడు శాంతి దొరికే మార్గం ఉందా?
*లోకంలో మనం చూస్తు న్న వాటిని ఎలా వివరించగలం?తీవ్రవాదుల దాడులు,లైంగి క బానిసత్వం, జాతి వైషమ్యాలు,ఆకలి కేకలు
మొదలైనవాటికి జవాబేది?.
*బహశా మనసు అట్టడుగు పొరల్లో అప్పు డప్పుడు మనకు మనమే ఈ ప్రశ్నలు వేసు కుంటామేమో గాని దానిమీద అంతగా శ్రద్ద
పెట్టము.ఒక్క క్షణం ఆగి ‘ఎందుకిలా’? అని ఆగి ఆలోచించే తీరిక కూడా లేనట్టు గా బ్రతికేస్తు న్నాం.
*అయితే ఉన్నట్టుండి ఏదో సంఘటన మన ల్ని కుదిపేస్తుంది.కుటుంబ సభ్యుల మరణం మన వీధిచివర్లోఉండే
అమ్మాయిఆత్మహత్య  అవుతుంది.బంధువుల్లో ఒకరికి ఏదో వస్తుం ది. అది ఒక్కసారిగా మనల్ని మేల్కొలుపు తుంది. అయితే కొద్ది
రోజుల్లోనే మళ్ళీ మా మూలైపోతాం-మళ్ళీ ఎప్పుడో మరో విషా దం మనల్ని కుదిపేసే వరకు.ఏమిటిదంతా? ఏదో తేడా ఉందే ?
జీవితమంటే ఇలా ఉండ కూడదు కదా? అని అప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తాం.
*ఎందుకు చెడ్డ సంగతులు జరుగుతున్నా యి? ఈలోకం మెరుగైన ప్రదేశంగా ఎందుకు లేదు?‘ఎందుకిలా’ అనే ఈ ప్రశ్నకు
జవాబు మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది. అయితే ఆ జవాబు వినడం చాలామందికి ఇష్టం ఉండదు.ఈ లోకం ఇలా
ఎందుకున్న దంటే , ఓ రకంగా అది మనం కోరి తెచ్చుకు న్నదే,.వినడానికి విచిత్రంగా ఉంది కదూ?
*ఏది లేక ఎవరు ఈ లోకాన్ని ఇప్పుడున్న డానికి భిన్నంగా చేయగలరు? ఈ జీవితాన్ని అందరికీ అన్ని వేళలా బాధారహితంగా
చేయగల భరోసా ఏది లేక ఎవరు ఇవ్వగల రు? దేవుడు చేయగలడు.దేవుడే దాన్ని చేయగలడు.అయితే ఆయన చేయడు.
ప్రస్తు తానికైతే ఆయనచేయట్లేదు.ఫలితంగా మనం ఆయన మీద కోపంగా ఉన్నాం.“దేవు డు నిజంగా సర్వశక్తిమంతుడు,సర్వ రక్షకు
డు అయ్యుండడు.ఆయన నిజంగా ప్రేమమ యుడు,సర్వశక్తిమంతుడు అయ్యుంటే,ఈ లోకం ఇలాఎందుకుంటుంది?”అని
అంటుం టాం.ఇలా అంటేనన్నా దేవుడు తనపద్దతి మార్చుకుంటాడనే ఆశతో అలా అంటుం టాం. ఆయన మీద దోషారోపణ
చేస్తే,ఆయ న పనిచేసే పద్దతి మార్చుకుంటాడనే ఆశతో అలా మాట్లా డుతుంటాం.అయితే ఆయన మాత్రం ఏమీ దిగొచ్చినట్టు గా
కనబడడు. ఎందుకనో?.
*దేవుడేమీ పట్టించుకున్నట్లు గా కనబడడు. ఇప్పటికిప్పుడు పరిస్థితులనుఆయనమార్చ డు. ఎందుకంటే మనం కోరుకున్నదే
ఆయన మనకిచ్చాడు.ఆయన లేడన్నట్లు గా,ఆయన మనకవసరం లేదన్నట్లు గా మనం ప్రవర్తించే ఈ లోకం -మనం కోరు కొన్నదే.
*నేటి సమాజంలో మనుషులు ,దేవునితో పని లేకుండా,తామే దేవునిలా అవ్వగలమ ని ఆశిస్తు న్నారు.వారు దేవునికన్నా విలువై నది
ఇంకాభూమి మీద ఏదోఉందనీ,ఆ దేవు నితో వ్యక్తిగత సంబంధంకన్నా మరింత విలువైనదేదో ఉన్నదనే ఆలోచనలో మునిగి
పోయారు.ఆనాడు వారు ఎన్నుకున్న దాని ఫలితమే -అన్ని లోపాలతో కూడిన ఈనాటి ఈ లోక వ్యవస్థ.
*ఇదే మనందరి కథ కాదా?బయటికి చెప్పక పోయినా,కనీసం తమహృదయంలో నైనా -“ఓ దేవుడా,నీతో నాకుఅవసరంలేదు.
నాకు నేనే దీన్నిచేయగలను.నీతో నాకు పని లేదు “ అని చెప్పని వారెవరు?
*దేవునితో పని లేకుండానే సైన్సులో  జీవిం చాలని మనందరం ప్రయత్నిస్తు న్నాం.ఎందు కిలా చేస్తు న్నాం? బహుశా- దేవునికన్నా
మరింత ముఖ్యమైన,మరింత విలువైనదేదో ఉందనే అభిప్రాయాన్ని పెంపొందించు కోవ డం వల్ల కావచ్చు.ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో
లా ఉండొచ్చు కానీ వాళ్ళందరిలో ఉండే మనస్తత్వం ఒక్కటే – “జీవితంలో దేవుడు అంత ముఖ్యం కాదు.మరీ చెప్పాలంటే,
ఆయనతో పని లేకుండానేనేనుబ్రతగ్గలను.”
*మరి దీనికి దేవుని ప్రతిస్పందన ఏమిటి?
ఆయన దాన్నిఅనుమతిస్తా డు.చాలామంది, భగవంతుని సృష్టికి భిన్నంగా తాము లేక ఇతరులు చేసే నిర్ణయాలకు ఫలితంగా కలిగే
బాధాకరమైన ఫలితాలను అనుభవిస్తా రు. హత్య, లైంగిక వేధింపులు,అత్యాశ,అబద్దం, వంచన,దూషణ,వ్యభిచారం,కిడ్నాప్,మొద
లైనవి. దేవునికి,ఆయన ప్రభావానికీ తమ జీవితాల్లో చోటివ్వని వారి క్రియల ఫలితమే ఇవన్నీ.వారు తమకిష్టం వచ్చినట్లు గా బ్రతు
కుతుండడం వల్ల తమకూ,ఇతరులకు కూడా బాధ కలిగిస్తా రు.
దీన్నంతటినీ దేవుడు ఎలా చూస్తు న్నాడు?
అయితే, జీవితం అన్యాయంగా ఉందని పించినపుడు పరిస్థితి ఏమిటి? ఇంకొకరి మూలంగా మనకు ఎదురయ్యే భయంకర
పరిస్థితుల మాటేమిటి? మనం బాధించబడి నామని అనిపించినపుడు- దేవుడు కూడా ఇతరులవల్ల భయంకర అనుభవాన్ని చవి
చూసాడని గ్రహిస్తే,అది మనకెంతో ఉపయో గకరంగా ఉంటుంది.మనం గ్రహించ గలిగిన దానికన్నా ఎక్కువగా దేవుడు మన పరిస్థితి
ని అర్ధం చేసుకుంటాడు.
*భయంకరమైనదేదో నీకు జరుగబోతోందని ముందుగానే తెలిస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకో! భౌతిక,మానసిక వేదన
ఎలా ఉంటుందో మనం  అర్ధం చేసుకోగల మా,..బాధ,తీవ్రమైన శ్రమ,ఈలోకంలోఉన్నా యనడంలో సందేహమేమీ లేదు.అందులో
కొన్ని ఇతరుల స్వార్ధపూరితమైన,ద్వేషంతో కూడిన చర్యల ఫలితమని చెప్ప వచ్చు. మరికొన్నిటికైతే ఈ జీవితంలోనే జవాబు
దొరకదు.అయితే రాముడు కుడా తాను కూడా శరీర ధారిగా ఉన్నప్పుడు శ్రమను, బాధను,సహించియున్నాడు గనుక మన
శ్రమ,బాధ,మన అవసరాలను గూర్చిన అవగాహన కలిగి యున్నాడు. *భయపడడానికి,కలత పడడానికిబోలెడన్ని కారణాలు
మనకున్నాయి.అయితే వాటన్ని టిని మించిన గొప్ప శాంతిని ఆయన జీవి తం మనకివ్వగలదు.
*ఆయన శక్తిమంతుడే కాక,మనలను సన్ని హితంగా ఎరిగిన వాడు. ప్రతీ అత్యల్పమైన సంగతినీ తేటగాఎరిగినవాడాయన.మనల్ని
ఎంతో భయపెట్టే మరణాన్ని భీష్ముడు  అనుభవించి దాన్ని జయించాడు.జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టమైన పరిస్థితిలో నైనా
మహాభారతం లోని పాత్రలు  మనకు తోడుగా ఉండి నడిపిస్తా యి,నిత్య జీవానికి మనలను చేరుస్తా యి.
“జీవితం ఎందుకింత కష్టంగా ఉంది?”అని నీకు నీవే ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు.జీవి తంలో దేవుడు లేకపోతే, మానవాళి చాలా
సుళువుగా ద్వేషం,జాతి వైషమ్యం,లైంగిక విశృంఖలత్వం,ఒకరినొకరు చంపుకోవడం మొ!!న వాటిలోనికి జారిపోతుంది.
నేను సంతోషముగా ఉండాలనుకుంటున్నా ను. ప్రపంచం మొత్తంలో సంతోషంగా ఉండే వారిలో నేను ఒకడిగా ఉండాలను కుంటు
న్నాను.నాజీవితము యొక్క అర్ధా న్ని తెలు సుకోవాలనుకుంటునాను.నేను స్వేచ్చగా ఉండాలనుకుంటున్నాను.ప్రపంచంలో ఉన్న
వారందరిలో నేను పూర్తి స్వేచ్చ కలిగిన వ్యక్తిగా ఉండాలని ఉంది.నా విషయంలో స్వేచ్చ అంటే నాకు నచ్చినది మాత్రమేచేయ టం
కాదు. అలా అయితే ఎవరన్న చేయ గలరు. కాని,నాకు స్వేచ్చ అంటే నీవు ఏదై తే చెయ్యాలో అది చేసేటువంటి అధికారం కలిగి
ఉండటం.చాలా మందికి వారు ఏమి చేయ్యాలో తెలుసుకాని ఆపని చేసే అధి కారం ఉండదు.
*జీవితం మారాలంటే పరువు సంపాదిస్తే సరిపోతుందనిపించింది.ఒక్క నాయకుడిగా ఉండి ఒక లక్ష్యం కలిగి జీవిస్తూ ఆ లక్ష్యం
కోసమే పని చేస్తూ ఉంటేసరిపోతుందని అనుకుందాం.అలా అయితే ఒక్క రాజకీయ నాయకులకు మాత్రమే జీవితం విలువ తెలి సి
మోక్షం పొందేవారు కాని అది ఎన్నటికి జరిగే పనా?..
*జీవితం మార్పుకోసం వెదకటం,ప్రారంబి ద్దాం మంచి మార్పు.జీవితపు ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి  ఆశక్తిగా వెతుకుతుదాo
ఉదయించే రవి కిరణంలో ;సముద్రంకెరటం నురగలో ;పొయ్యిమీద పొంగే పాలుపొయ్యి లో కణకణలాడే నిప్పు ఉదృతంగా ప్రవహిం
చే సెలయేరు దోమ ఈగ నల్లి పిల్లి బల్లి పులి చలి వాన ఎండా నీడ కష్టం సుఖం శత్రు వు మిత్రు డు చివరకు మనం వాడి పారేసే ఆకు
ప్రతిది ఒక సార్ధకంకోసం జన్మించినవే ఇవన్ని కూడా ఆశజీవులే మనలాగే ఇవి కుడా ఆ భగవంతునిచేతిలోనుంచే సృష్టించబడ్డా యి.
   *వెలుగు చీకటి ఎంత సహజమో అంతే సహజమైన జననం దానిని వెన్నంటే మర ణం. కాని మనం చీకటిలో ఉంటే ఉదయం
వెలుగుని చూస్తా ము అనే ఆశ ఎలాఉంటుం దో అలాగే వెలుగులో ఉంటే చీకటి పడుతుం ది అనే ఒక అలవాటు అయిన నమ్మకాన్ని
పెంపొందించుకున్నాము.జననాన్ని వెన్నంటి ఉండే మరణం గురించి అలోచిoచాలంటేనే మనo భయపడతాము.వెలుగు ఉండగానే
అన్ని చక్కపెట్టు కోవాలి అని ఎలా అనుకుంటామో... అలాగే మరణం అనేది వెన్నంటే ఉందని ఈ జన్మ ఉండగానే చక్క
పెట్టు కోవలసినవి చాలా ఉంటాయి అని మన ఉహలోకి కూడా రావు.
*సంతోషం-ఆనందం... సంతోషం అంటే ఒక విజయాన్ని పొందాకా కలిగే తాత్కాలికoగా ఉండేది.అదే సంతృప్తి కరమైన జీవితం
గడు పుతున్నాం అనుకోండి అదే ఆనందకరమైన జీవితం అవుతుంది. ఆనందం అంటే మనకి ఉన్న దాంట్లో తృప్తిని పొందటo,మనం
కోరు కున్న వాటిని సాధించే దిశగా జీవితాన్ని సాగించటం ఆనందకరమైన ఆసక్తికరమైన అంశం.
*చివరిగా..సృష్టిలో ఎవరూకూడా అన్నింటా ప్రతిభావంతులు కారు.ఎవరి ప్రతిభ ఎవరి పరిధి వారిదే.తప్పులు చేయటం అనేది
సహజాతిసహజం.కాని క్షమించటం అనేది అందరి వల్లా కాదు.మనం చేసిన తప్పుల నుంచి మనం గుణపాటాలు నేర్చుకోవటం
ద్వారా జీవితాన్ని సార్ధకం చేసుకోవచ్చు....
*తదేవాస్య పరం మిత్రం యత్ర....
అద్దమున ప్రతిబింబము కనబడునటుల మిత్రు డు కనబడిన వెంటనే దుఃఖము గాని, ఆనందము గాని ప్రతిబింబించినచో అదియే
గొప్ప స్నేహము.
[1/10, 5:01 AM]  🌹💖🌹
అంతా మానవత్వాన్నే కలిగియున్నారు. మానవత్వాన్ని కలిగియున్నవారందరూ మానవులే.కాబట్టి,అలా లక్షణ రీత్య నిర్ణ యం
చేసేటటువంటి ఎదుగుదలను మాన వుడు సాధించాలి.ముఖ్యంగా సాధకులు సాధించాలి.
నీ చుట్టు పక్కల ఉన్నటువంటి నీ సంసారం లో, నీవు గుర్తించేటటువంటి మనుషులు కానీ,నిన్ను గుర్తించే మనుషులు కానీ,ఏవైతే,
ఎవరైతే ఉన్నారో,వారంతా ఎవరు?నీ ఇంట్లో ఉన్నవస్తు వులు కానీ,నువ్వు ప్రపంచంలో గుర్తు పట్టేటటువంటి వస్తు వులు కానీ,ఇదం తా
కూడా ‘ఇదం’,ఇదం అంటే నేను కాదని. ‘ఇదం’ -అనేటటువంటిది అంతాకూడా నేను కాదు.మరి నేను ఎవరిని?ఆ ఇదంకి ఉన్న
లక్షణాలకి వ్యతిరేకంగా ఏ సాక్షిత్వము అయితే ఉన్నదో... అంటే అర్థం ఏమిటి? నీవు ఒకవస్తు వును చూస్తూ ఉన్నావు. చూస్తూ ఉంటే
ఆ వస్తు వు నువ్వు అవుతా వా? ఆ ఘటము నువ్వు అవుతావా? ఓ కుండలో నీళ్ళు పట్టా వయ్యా!కుండలోనీళ్ళు చల్లగా
ఉంటాయయ్యా! అది దాని లక్షణం.
కుండనువ్వా? నీళ్ళు నువ్వా? చల్లదనం నువ్వా అంటే,ఈ మూడు నేను కాదు.కార ణం ఏమిటి? నేను చూస్తూ ఉన్నాను,నేను
అనుభవిస్తూఉన్నాను,నేను తెలుసుకుంటూ ఉన్నాను. జ్ఞాతుం,ద్రష్టుం,ప్రవేష్టుం,అధిగచ్ఛ తి. నేను అధిగమించి ఉన్నటువంటి సాక్షిని.
సర్వదా సాక్షిని.సర్వ సాక్షిని.కాబట్టి,నాకేమీ అంట లేదు,కుండ అంట లేదు,నీళ్ళు అంట లేదు,చల్లదనము అంట లేదు.
నాకు ఏ సంగత్వము లేదు అనేటటువంటి సాక్షిత్వ స్థితిని సాధించడం చాలాఅవసరం. మరి కుండ అవసరం లేదా? మంచి నీళ్ళు
అవసరం లేదా? అందులో చల్లటి మంచి నీళ్ళు అవసరంలేదా? అది భౌతికఅవసరం.   
ఆత్మ అభౌతికం.ఆత్మ సూక్ష్మం.ఎన్ని అవస రాలున్నప్పటికీ,అవసరాలమేరకు పనిచేసే టటువంటి వాడు,అనిత్య వస్తు వులయందు
రమించకుండా,కలిసిపోకుండా,తాదాత్మ్యత లేకుండా,సంగత్వ దోషం లేకుండా,తాను తానుగా ఉండి,తానైనటటు వంటి స్థితిలో
నిలిచి ఉండి, బట్టబయలే బ్రహ్మము అనే టటువంటి జన్మరాహిత్యలక్షణానికి ఆశ్రయం గా ఉండేటటువంటి,తత్త్వజ్ఞాన లక్ష్యం
దృష్ట్యానే,వ్యావహారిక లక్షణాలను చూస్తా డు. ఈ రకంగా వ్యావహరిక దృష్టి అనేటటు వంటిది సామాన్యమైపోయింది.
అప్రధానం అయిపోయింది.అనిత్య వస్తూప లబ్ది చేత ప్రేరేపించబడడం లేదు.పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల అనేక వస్తు వుల
ఉపలబ్ది జరుగుతూ ఉంటుంది.
🌹❤️🌹
                   
*కర్మత్యాగము,కర్మయోగము రెండును విముక్తి కలిగించ గలవు.రెండిటిలో కర్మ యోగమే శ్రేష్ఠము. కర్మల నెవ్వరును త్యాగ ము
చేయలేరు.నిద్రించుట,లేచుట,ఆలోచిం చుట,భుజించుట,మాటాడుట దేహకి తప్ప నిసరి యగు కర్మలు.కర్మత్యాగ మనగా,కర్మ
ఫలత్యాగమే అని తెలియవలెను.అంతియే కాదు,కర్మసంగ త్యాగము కూడ.కర్మల నాచ రించుచు,వానిచే తగులకొన బడకుండుట
కర్మ యందు కౌశలము."కర్మ బ్రహ్మాద్భం విద్ధి" - కర్మ బ్రహ్మము నుండి పుట్టు చున్నదని, బ్రహ్మము అక్షర పరబ్రహ్మము నుండి పుట్టిన
వాడని,కావున సృష్టియందు కర్మ మనివార్య మని, కర్మమును బ్రహ్మవలె నాచరించినచో జీవుడు ముక్తు డుగ నుండునని ముందే
తెలుపబడినది.
కర్మయోగము,కర్మత్యాగము రెంటిని పలుకు చున్నావు.ఇంతకును జీవుడు కర్మయోగము నందుండవలెనా,కర్మత్యాగము
నందుండ వలెనా.......
కర్మత్యాగము,కర్మయోగము రెండును విముక్తి కలిగించ గలవు.రెండిటిలో కర్మ యోగమే శ్రేష్ఠము.
కర్మల నెవ్వరును త్యాగము చేయలేరు. నిద్రించుట,లేచుట,ఆలోచించుట,భుజించు ట, మాటాడుట దేహకి తప్పనిసరి యగు
కర్మలు.కర్మత్యాగ మనగా,కర్మఫలత్యాగమే అని తెలియవలెను.
అంతియే కాదు,కర్మసంగ త్యాగము కూడ.   కర్మల నాచరించుచు,వానిచే తగులకొనబడ కుండుట కర్మ యందు
కౌశలము.కర్మలను నిర్వర్తింపకుండుటకు ఎవ్వడునుసమర్థు డు కాడు.నిర్వర్తించునపుడు కర్మ సంగము,కర్మ ఫలము
కలుగుచుండును.త్యాగము చేయ వలసినది సంగము,ఫలమేగానికర్మలుకాదు.
ఫలముల నాశించక,కర్తవ్య కర్మలను నిర్వ ర్తించుచు,నిర్వర్తింపబడు కర్మలనుండి సంగ ము పొందక నిర్వర్తించుట కర్మయోగమే
యగును.
*కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన....
నాలుగు సూత్రములుగ కర్మలు నిర్వర్తించు పద్ధతి దైవము తెలిపినాడు.(వివరమునకు పై శ్లోక వివరము చూడుడు).అట్లా చరించిన
వాడు కర్మయోగియే.ఈ మార్గమున కర్మ క్షాళనమై,జీవుడు ముక్తు డగును....కర్మల నాచరించు కర్మయోగి క్రమముగ, కరృత్వ
భావనను కూడ విసర్జించును. తన నుండి కర్మలు జరుగు చున్నవి గాని,తాను చేయుట లేదని తెలియును.
"కర్మ బ్రహ్మాద్భం విద్ధి" -కర్మ బ్రహ్మము నుండి పుట్టు చున్నదని,బ్రహ్మము అక్షర పరబ్రహ్మ ము నుండి పుట్టినవాడని,కావున సృష్టి
యందు కర్మమనివార్యమని,కర్మమును బ్రహ్మవలె నాచరించినచో జీవుడు ముక్తు   డుగ నుండునని ముందే తెలుపబడినది.
కావున కర్మయోగమున నిష్ణాతుడై నవాడు తననుండి జరుగు కర్మ యంతయు దైవ సంకల్పమని తెలిసియుండును.కర్త తాను
కాడు కనుక, కర్మలు చేయుచున్నానను భావన కూడ యుండదు.
కర్తృత్వ భావన లేక చేయుచు నుండును. ఈ స్థితిని కర్మ సన్న్యాస స్థితి అందురు. కర్మయోగికే కర్మ సన్న్యాస స్థితి లభించును.
కర్మలు మానుట కర్మ సన్న్యాసము కాదు.
🌹💞🌹
                  
విశ్వరూపదర్శనంకూడా కృష్ణుడు అర్జు ను డికి లోపల అంతఃకరణలో తెరతీసి చూపిం చాడే తప్ప,అర్జు నుడు సంపాదించుకున్న
జ్ఞానం కాదు అది.అతడి మోహాన్ని తొలగిం చటానికి లోపల తెరతీసి చూపించాడు. అతనికి దృష్టినిచ్చాడు ఒక్కక్షణం.తనే కన బడితే
ఊళ్ళో అందరికీ కనబడవలసిందే!. ఆ యుద్ధరంగంలో ఎవరికీ కనబడలేదే!. ఎవరి హృదయంలో తెరతీసాడో వాళ్ళకే కనబడ్డా డు.
కౌరవసభలో పూర్వం,వాళ్ళు ఆయనను బంధించే ప్రయత్నం చేసినప్పుడు,విశ్వరూప దర్శనం ఇచ్చాడు.ఆ గుడ్డివాడై న దృతరా
ష్ట్రు డికికూడా అది ప్రసాదించాడు.కానీ అత డు జ్ఞానాన్ని అడగలేదు.నువ్వు మహా పురుషుడివి అన్నాడు.కృష్ణుడికి దణ్ణం పెట్టా డే
తప్ప,అతడికి పుత్రవ్యామోహం పోలేదు.జ్ఞానార్థికాలేదక్కడ.జ్ఞానార్థి అయితే జ్ఞానం వచ్చేదే.
“మీరు నన్నేమీ చెయ్యలేరు.నేను సర్వాంత ర్యామిని.విరాట్పురుషుణ్ణి.నన్ను మీరు శిక్షించటమేమిటి?”అని వారి అహంకారాన్ని
తగ్గించేందుకు ఇచ్చిందే ఆ దర్శనమంతా! వీళ్ళందరూ మూర్ఛపోయారు.ఎవ్వరూ చూడలేదు.సభఅంతా మూర్ఛపోయింది.
బ్రహ్మాండమయిన వెలుగేదో కనబడింది. వాళ్ళు స్పృహతప్పిపడిపోయారు.ధృతరా ష్ట్రు డు ఆ తేజస్సును కళ్ళతో-చర్మ చక్షువు లతో-
చూడలేదు కాబట్టి, అతడు మూర్ఛ పోలేదు.అతడికి కృష్ణుడు అంతర్దర్శనం అప్పుడే ఇచ్చాడు.
నదిలో స్నానంచేస్తుంటే చెత్తకొట్టు కొస్తుంది. ఇలాఅలా తోసేసి మళ్ళీ మునుగుతాం.లేచే సరికి మళ్ళీ చెత్తవస్తుంది.అక్కడి పరిశుద్ధత
మనం మునిగి లేచేలోపల అయిపోతుంది. దానికి అంతే పారిశుద్ధ్యం!.మళ్ళీ చెత్త కొట్టు కుని వస్తూనే ఉంటుంది.అలాగే ఈ ప్రకృతి
అనే మహాప్రవాహంలో ఎప్పుడూ మనం ఉంటాము.జ్ఞానంక్షణికంగాఉంటుంది.ఎందు కంటే ఉన్నదంతా బ్రహ్మాడమైన చీకటి.నల్లని
మబ్బు.జ్ఞానం మెరుపులా ఒక్క క్షణం వచ్చి బ్రహ్మాండంగా వెలుగు చూపిస్తుంది.ఎంత సేపుంటుంది?ఏదీఉండదు.చూస్తుండగానే
అంతర్థా నం అయిపోతుంది.అజ్ఞానం అనే ఈ నల్లనిమబ్బుల్లో,అంధకారంలో మెరిసే మెరుపులాగా.క్షణంమాత్రమేఉండిపొతుంది
ప్రపంచంలో,జీవితంలో ఈ సుఖంఅనేది కూడాఅంతే!.మెరుపులాగా క్షణం కనబడేదే! ఎప్పుడో అలాగ ఒక్కక్షణం మాత్రం మెరిసే
మెరుపుని పట్టు కుని శాశ్వతంగాపెట్టు కుందా మని ప్రయత్నం చేయడం ఏమి వివేకం? ఎప్పుడూ సుఖంగా బతకాలి అనేమాట
కూడాఅజ్ఞానంతోకూడినదే.ఏముందిసుఖం ? ఎలా ఉంటుంది శాశ్వతంగా! దీనికి సిద్ధ పడే ఇక్కడజీవించాలి కాని,భ్రమలలోకాదు.
లేదా,“ఇక్కడికి నేను కర్మక్షయంకోసం వచ్చా ను” అనే దృక్పథంతో జీవించడంఒకమార్గం. అంటే,కష్టపడటానికే వచ్చాను అనే వివేక
మన్నమాట.“నేనెంతమందికి బాకీఉన్నానో, సేవచేసి ఆ ఋణం తీర్చుకోవటానికి వచ్చా ను” అనే దృక్పథం.ఇలాగ ఉండి,ఈ మాట
లు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టు కుంటే దుఃఖం ఉండదు.
🌹💛🌹
              
బ్రహ్మజ్ఞానము :-పరిమిత అహం,అంటు లేకుండా పోయి,ద్వైతము పూర్తిగా అదృశ్య మైన తరువాత,మానవుడు ఈ జ్ఞానమును
చేరుకొనును.
సర్వ సాధారణంగా ప్రతియొక్కరును సర్వో త్తమ జ్ఞానమును బడయుటకు మధ్యతరగ తులను దాటి రావలసిందే కానీ సద్గురుదర్శ
కత్వంలో మెలగినవారు,ఈ మధ్యేమార్గం ఒక్కసారిగా బ్రహ్మజ్ఞానము పొందుదురు.
సప్తమ భూమికలో బ్రహ్మీ బూతుడు:- ఇచ్చట భగవంతుడు భగవంతునిగా తనను ప్రతివారిలో ప్రతి దానిలో చూచును.ఇది
పంచఆధ్యాత్మిక సత్యములలో నొకటి.
*Stand up, be bold. You are the sole and only cause.
*లేవండి, ధైర్యంతో సమర్ధు లై నిలబడండి, మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి.
*Why not do as much as lies within your power? Even if you cannot give to others for want of money,
surely you can at least breathe into their ears some good words or impart some good instruction, can't
you? Or does that also require money?*
*నీ శక్తి మేరకు ఎందుకు చేయకూడదు? ధనాభావంవల్ల నీవు ఇతరులకు ఏమీ ఇవ్వ లేకపోయినా కొన్ని మంచి మాటలుగాని,
కొన్ని హితోపదేశాలుగాని వాళ్ళ చెవిన ఎందుకు వేయకూడదు? అలా చేయలేవా? దానికి కూడా ధనం అవసరమా?
🌹💕🌹
         
*భక్తి, జ్ఞాన,యోగ,వైరాగ్యాలు నాలుగు ఒకే సాధనకు సంబంధించినవి.ఒకటి అందుకుం టే రెండవది అందింపబడుతుంది.భక్తి
గురిం చి మనకు అవగాహనఉండి,అందులో రుచి పెరిగితే క్రమముగా జ్ఞానములోనికి ప్రవేశి స్తా ము.జ్ఞానము మనలో ఉన్న
అజ్ఞానాన్ని తొలగించుకుంటూ వస్తూ ఉంటే,వైరాగ్య భావన వస్తుంది.ఏది నిత్యము,ఏది అనిత్య ము అనితెలిసి జీవించడం
ఉంటుంది.
*జ్ఞానము మన యందు బాగా వికసిస్తు న్న కొద్దీ దైవీతత్త్వము మనయందు ఎట్లా ఉందో తెలిసి,ఆ తత్త్వముతో అనుసంధానం కలిగి
ఉండడము జరుగుతుంది.అలా దివ్యతత్త్వ ముతో కూడి ఉండుటను యోగమందురు. ఏ విషయములతో మన భావము ప్రధాన
ముగా ముడిపడి ఉందో ఆ విషయముతో మనము యోగము చెందినట్లు .భక్తి కారణ ము గానే జ్ఞాన,యోగ, వైరాగ్యము లోకి
వస్తా ము.
*మొదట్లో గుళ్లోనేదేవుణ్ణిచూస్తా రు అప్పుడు తాను కర్మ యోగి.తర్వాత ఎదురుగా ఉన్న జగత్తు గా దేవుణ్ణి చూస్తా డు.అప్పుడు తాను
భక్తి యోగి.చివరగా 'తన'లోనే దేవుణ్ణి చూస్తా డు-అప్పుడు తాను జ్ఞాన యోగి.
*సత్ (Existence) = ఆత్మ,
*చిత్ (Awareness) = శక్తి,
*ఆనందం (Bliss) = ఆత్మ + శక్తి.
🌹💚🌹
          
*‘మనంచేసే ప్రతి చర్యకూ దానికి సమాన మైన,వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది’. కర్మసిద్ధాంతంలో దీనినే ‘ప్రారబ్ధం’అంటారు!.
*అనంతమైన ఈ సృష్టిలోగల 84లక్షల జీవ రాశులలో భగవంతుడు మానవుని అగ్రభా గాన ఉంచాడు.ఏ ఇతర ప్రాణికీ లేనన్ని శక్తి
యుక్తు లను,తెలివితేటలను ఇచ్చాడు.ప్రకృ తిని అర్థం చేసుకోవడమేగాక..కొంతవరకూ తన నియంత్రణలో ఉంచుకోగల్గినసామర్థ్యా
న్నిచ్చాడు.‘నీఇష్టా నుసారం జీవితాన్ని గడప వచ్చు’ అంటూనే ఒక కఠినమైన,దాటలేని గీటు గీశాడు.ఏమిటా గీత అంటే..కర్మ ఫలం.
*‘‘నీవు మంచి చెయ్యి,చెడు చెయ్యి,అది నీ ఇష్టం.కానీ..ఏది మంచి,ఏది చెడు అనే విష యాన్ని గ్రహించడానికి నీకు విచక్షణ జ్ఞానం
ఇస్తు న్నా.కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకో.మంచి పనిచేస్తే మంచి ఫలితం.చెడ్డ పనిచేస్తే చెడ్డఫలితం’’అని దైవ
శాసనం.ఒక్కమనిషికే ఈనియమం.పశు పక్ష్యాదులకు,మృగాలకు,కీటక జాతులకు ఈ నియమం వర్తించదు.విచక్షణజ్ఞానం
సంతరించుకోని చిన్న పిల్లలకు కూడా ఈ నియమం వర్తించదు.
*ఉదాహరణకు ఒక ఆవును స్వేచ్ఛగా వది లేస్తే తనకు ఇష్టమైన చోట,అనుకూలంగా ఉన్న చోట మేత మేస్తుంది.‘ఇక్కడ మేయ
వచ్చా? ఇది నా యజమానిదా? పరాయి వారిదా’,ఇవేవీ దానికి తెలియవు.ఇతరుల పంటపొలాలలో పడి తింటే దానికి స్వేచ్ఛ
నిచ్చిన యజమానిదే తప్పవుతుంది గానీ, పైరును మేసిన పశువుదిగాదు.అలాగే.. వేటాడి,ఇతర జంతువులనువధించి,కడుపు
నింపుకోవడం మృగజాతి లక్షణం.కనుక వాటికి పాప,పుణ్యాలఫలితాలు వర్తించవు!.
*‘పని’కి కర్మ అనే పేరుంది.పని చేయడమం టే కర్మ చేయడమని అర్థం.అందుకే.. పని ఫలితం అనకుండా ‘కర్మ ఫలం’
అంటున్నాం. మనం ఏ కర్మ చేసినా అంతే మోతాదులో కర్మ ఫలం అనుభవించవలసి ఉంటుంది.ఒక రకంగా ఆధునిక సాంకేతిక శాస్త్ర
సూత్రాలు కూడా ఈ సిద్ధాంతాన్ని సమర్థిస్తు న్నాయి.
*భౌతిక శాస్త్రంలో న్యూటన్‌సూత్రాలు 3 ఉంటాయి.వాటిలో..‘మనంచేసేప్రతిచర్యకూ దానికి సమానమైన,వ్యతిరేకమైన ప్రతిచర్య
ఉంటుంది’ అనే సూత్రం కర్మఫలానికి అతికి నట్టు సరిపోతుంది.కర్మసిద్ధాంతంలో దీనినే మన పెద్దలు ‘ప్రారబ్ధం’ అని చెబుతారు.
*సైన్స్‌లోచర్యకుప్రతిచర్యవెంటనేఉంటుంది. కానీ, కర్మ సిద్ధాంతంలో మనం చేసే కర్మ తాలూకూ ఫలితం వెంటనే అనుభవంలోకి
రావచ్చు.లేదా కొంతకాలానికి రావచ్చు.లేదా మరు జన్మలో,ఆపైజన్మలోనైనా అనుభవాని కిరావచ్చు.అనుభవించడం మాత్రం తథ్యం.
అది ఎప్పుడు ఎట్లా అనేది దైవ నిర్ణయం.
*జనని గర్భము నుండి జనియించినప్పుడు కంఠమాలలేవి కానరావు..మంచి ముత్యపు సరుల్‌మచ్చుకైననులేవు- మేల్మి బంగరు
దండలు మెడకులేవు కాని,కలదోక మాల మీ కంఠమందు,అదియే మీ కర్మలన్నియు చేర్చిన కంఠమాల - ప్రారబ్ధమనియెడి
చద్దిమూట’ అంటారు.
*మన ప్రయాణం ఆరంభించినపుడు మధ్య లో తినడానికి ఎలాంటి పదార్థా లను మూట కట్టు కున్నామో..ప్రయాణంలో అవే తినాలి
కదా !.వేరే పదార్థా లు ఎట్లా వస్తా యి.ప్రారబ్ధ మూ అంతే.అనుభవించక తప్పదు.
*కాబట్టి, ఎల్లప్పుడూ మంచి పనులే చేస్తే అంతా మంచే జరుగుతుంది.ఆ మంచి ఫలి తాన్ని కూడా తీసుకోకుండా దేవుడికి అర్పిస్తే
పాప,పుణ్యాలు లేక,మరుజన్మ ఎత్తే బాధ తప్పుతుంది.అదే మోక్షం.
🌹💜🌹
          
*"ధ్యానం ద్వారా మనకు ఏమేమి కలుగు తాయి !?"
*ధ్యానం కోసం ముందుగా మనం చేయవల సిన త్యాగం ఒకటుంది.సంఘర్షణకు కారణ మైన వాటిని ఎప్పుడై తే త్యాగం చేస్తా మో
తత్-క్షణమే మనలోవున్న శాంతి,ధ్యానం మనని ఆవరించేస్తా యి.ధ్యానంలో బుద్ధి వికాసం కలుగుతుంది.బుద్ధివికాసం అంటే
కష్టసుఖాల ఎడల అవగాహన కలుగటం. బుద్ధివికాసమనేది ఒకవిషయంలోనైపుణ్యం కాదు.సమగ్రమైన అవగాహన.శాంతిని పొందిన
మనోవైభావం ఎలా ఉంటుందంటే శేషశాయితో సమంగా ఉంటుంది.వెయిపడ గల ఆదిశేషుని కౄరత్వాన్ని లెక్కచేయ కుం డా
దానిపై నిద్రించే నిర్భయత్వం.లక్ష్మీదేవి అందించే సేవలతో సృష్టిలోకెల్లా అత్యంత ఉన్నతమైన సుఖాన్ని పొందుతూ కూడా
పట్టించుకోని స్థిరత్వం శాంతాకారుడై న శ్రీమహావిష్ణువుకే సాధ్యం.అది శాంతివైభవం
💙🌹❣️
         
*పరిపూర్ణమైన అవగాహన రావడమే నిజమైన దైవదర్శనం !.
*మౌనం అంటే మాట్లా డకుండా ఉండటం కాదు.మనసు నిర్మలంగా ఉండటం.మనసు అవసరంలేని ఆలోచనలు చేయడమే దానికి
అంటుకునే మలం.అవాంఛనీయ ఆలోచన లు పోయినరోజు మనసు నిర్మలంగా మౌనం గా ఉంటుంది.మనసుకి మౌనమే స్నానంగా,
జపంగా,తపంగా ఉంటుంది.ఏది కావాలని గాని..వద్దనిగానీ లేని మానసికస్థితి మౌనం. ఏ గీతాసారమయినా లౌకిక ఫలాల గురించి
చెప్పింది కాదు.పారలౌకికమైన దైవాన్ని గురించి చెప్పింది.దైవాన్ని దర్శించడం అంటే ఒక భౌతికవస్తు వును కళ్ళతో చూసినట్లు
కాదు.అది ఇంద్రియాలతో తెలుసుకోవడం లాంటిదీ కాదు.దైవం అంటే ఏమిటో ఒక పరి పూర్ణమైన అవగాహన రావడమే నిజమైన
దైవదర్శనం !.
🌹💖🌹
             
*పురుషుని,ప్రకృతిని,గుణములను తెలియ వలెను.పురుషునియందు ప్రకృతిని గుణ ములను తెలియవలెను.ప్రకృతియందున్న
పురుషుని తెలియవలెను.గుణముల యం దున్న అంతర్యామియైన పురుషుని తెలియ వలెను.ఇట్లు తెలిసినవాడు ఈ తెలివియం
దుండి ఎట్టి ప్రవర్తన యందు వర్తించు చున్న ను ఏమరుట,మరచుట,అయుక్తముగా ప్రవర్తించుట అను లొంగుబాటులు చెందడు.
కొందరు ధ్యానము నందు ఆత్మను దర్శిం తురు.కొందరు తనయందు ఆత్మను దర్శిం తురు.కొందరు తెలుసుకొనుట అను సాంఖ్య
మార్గముతో యోగము చెంది ఆత్మను దర్శిం తురు.కొందరు తమ సర్వ కర్మలను యజ్ఞార్థ ము ఆచరణ యోగము చెంది ఆత్మ
ననుభ వింతురు.
*కొందరు ఈ మార్గములలో తమకు తామే, అనుభవమును ఇంకను పొందజాలని స్థితి యందున్నారు.వారు ఇతరుల వలన విని,
తెలుసుకుని,ఆచరించి పొందుచున్నారు. వీరే శ్రు తిపరాయణులు.వీరికి శ్రు తి గ్రంథాదు లును,వానిని విప్పి చెప్పువారును ప్రమాణ
ములు.ఈ ప్రమాణముల ఆధారమున తమ స్థితిని దాటి,ప్రమాణములను దాటి తామే ఆదియై మృత్యువును దాటుచున్నారు.
*కదలకుండునది,కదులునది,అస్థిత్వము పొందినది,ఏది సంభవించి యున్నను,అది నీకు తెలియుటయే గాని దానికి సంభవము
కాదు.అది సమస్తము క్షేత్రము,క్షేత్రజ్ఞుడు అను రూపములలో నీకును దానికిని గల సంయోగముగా తెలుసుకొనుము.
🌹🧡🌹
          
కరిగించిన బంగారు వర్ణముతో మెరయు చూ, మహోగ్రతీక్షణ వీక్షణములతో కన్నుల నటునిటు త్రిప్పుచు 'ఉగ్రనరసింహ రూప
మున'- ఆ అసురునికి కనిపించితివి.ఆ రూపమున ఉన్న నీవు,నీ మోముపై పరచు కొన్న జూలును విదల్చగా,ఆ కాంతి ఆకాశ
మునకెగసి మిక్కిలి ప్రకాశించెను.
దీర్ఘముగా తెరవబడిన నీ నోరు ఒక విశాల మగు కొండగుహను తలపించెను.బయటకు చాచిన నీ నాలుకకొన,వాడియైన కత్తిమొన
వలెనున్నది.ఆ నాలుకకు ఇరువైపులా బయ టకు పొడుచుకొని వచ్చిన రెండు కోరలతో, ఉద్భవించిన ఆ నీ రూపము,ప్రభూ! అత్య
ద్భుతమైనది మరియు భయంకరమైనది.
ముల్లోకాలను తన క్రూ ర రాక్షస స్వభా వం తో బాధిస్తూ వారి ప్రాణాలను హరిస్తూ భయాందోళన కలిగిస్తూండేవాడు హిరణ్య
కశిపుడు,అతనికి కుమారుడుగా అసమాన హరి భక్తి సంపున్నుడై న "ప్రహ్లా దుడు" జన్మిం చాడు,హరి భక్తి మానమని ప్రహ్లా దుడికి
ఎంతగానో చెప్పి,చివరకి కుమారుడు అని కనికరము కూడా లేకుండా ఎంతో క్రూ రంగా హింసించి ప్రాణాలు సైతం తీయటానికి వెన
కాడలేదు హిరణ్యకశిపుడు,అయన ప్రహ్లదు నికి చిన్న గాయము కూడా కాకపోవటం అతనికి సందేహం కలిగింది,ప్రహ్లా దుడ్ని శ్రీ హరి
ఐన శ్రీమహావిష్ణువే కాపుడుతున్నాడు అనితలచాడు హిరణ్యకశిపుడు.శ్రీమహా వి ష్ణువుపై ఇంకా శత్రు త్వం పెంచుకున్నాడు. అతని
మనస్సులో రోషం అగ్నిలా భగభగ మండింది.ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అత నిలోని విజ్ఞానము,అణుకువలను కాల్చివే
శాయి.ధైర్యగాంభీర్యాల వలన అతని హృద యం ధగ ధగ మెరిసింది.హృదయ చాంచ ల్యం వలన తామస గుణం విజృంభించింది.
ఆ తామస గుణం వల్ల అతని స్థైర్యం చిందు లు త్రొక్కసాగింది.అంతట పట్టలేని ఆవేశం తో హిరణ్యకశిపుడు ప్రహ్లా దుడిపై హుంకరిం
చాడు.“దీనిలో హరిని చూపించరా”అనం టూ సభామండప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు.ఆ దెబ్బకు అతని చేతి
బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి.ఆ రాక్షస రాజు దిగ్గజాల దంతాలను విరిచేయ గలిగిన తన బలిష్ఠ మైన
చేతితో కొట్టిన ఆదెబ్బకి చిటిలి పిటిలి ఆ మహాస్తంభం ఫెళఫెళమని భయంకర ధ్వనులు చేసింది.పది దిక్కులా విస్ఫులింగా లు
విరజిమ్మాయి.
కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త విధ మహావాయువుల ఒత్తిడి వల న ఉరుములతో ఉరకలువేసే భయంకర ప్రళయ
మేఘాలు వర్షించే పిడుగుల వంటి భీకర ధ్వని వెలువడింది.ఆ ఛటపటారావా లు విపరీతంగా పైకి ఎగసి ఆకాశం అంతా నిండి
కర్ణకఠోరంగా వినిపించసాగాయి.బ్రహ్మ దేవుడు,ఇంద్రు డు,వరుణదేవుడు,వాయు దేవుడు,అగ్నిదేవుడు మొదలైన దేవతలంద
రితో,సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండ భాండం గుండెలవిసేలా ఒక్కసారి ఫెఠేలున పగులినట్లయింది.స్తంభం ఛిన్నా భిన్నం.
అయింది.దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహ దేవుడు ఆవిర్భ వించాడు.
ఆ నరసింహదేవుని పాదాలు చక్రం,చాపం, నాగలి,వజ్రాయుధం,మీనం వంటి శుభరేఖ లు కలిగి,వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తు
న్నాయి.ఆ స్వామి దివ్య పాదాలతో అడు గులు వేస్తుంటే,ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ,కులపర్వతాలూ,కూర్మరాజూ
అణిగి మణిగిపోతున్నారు.
ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసము ద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి.పీతాం బరం
ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డా ణం గణగణ మని మ్రోగుతోంది.ఆ స్వామినాభి
ఆకాశగంగానదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది.
ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడే టంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియలాగా అతి
కఠినంగా,విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది.ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి,రాక్షససేనల తలను తెగగోసే కొడవళ్ళ
లాగా ఉన్నాయి.
రాక్షసరాజుల బండబారిన గుండెలనే పొలా లను దున్నే పదునైననాగళ్ళుఆగోళ్ళు.శత్రు వుల కళ్ళకి మిరుమిట్లు గొలిపేమంటలు
మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు.అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు.అయినా అవి శరణా గతులైన భక్తు ల నేత్రాలకు మాత్రం చకోరాల
కు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తా యి. మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహస్వామి మూర్తి బాహువులు శంఖ,
చక్ర,గదా,ఖడ్గ, కుంత,తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి.వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసంఅనే సముద్రా నికి
చెలియికట్టల లాగా ఉన్నాయి.అనేక పుష్ప మాలికలతో విరాజిల్లు తున్నాయి.
కాంతులీనే కడియాలు,మణులు పొదిగిన మనోహరమై విరాజిల్లేహారాలు,భుజకీర్తు లు, కంకణాలు,మకర కుండలాలు వంటి అనేక
ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసి పోతు న్నాడు.ఆ విభుని కంఠం మూడు రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది.
ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజా త పల్లవంలాగా రాగరంజితమై,కోపావేశాల తో అదురుతోంది.శరత్ కాలంలో మేఘాల
మధ్య మెరిసే మెరుపుతీగల్లా గా ఆ ఉగ్రమూ ర్తి కోరలు తళతళలాడుతున్నాయి.
ప్రళయకాలంలో సమస్తలోకాలనూ కబళించ టానికి పరాక్రమించే అగ్ని జ్వాలలలాగా నాలుక బహు భీకరంగా ఉంది. ఆ వీరనర
సింహస్వామి నోరు,నాసికా రంధ్రాలు మేరు మంథర పర్వతాల గుహల్లా బహువిస్తా రం గాఉన్నాయి.ఆ నాసికా రంధ్రాలనుండి వచ్చే
వేడి నిట్టూర్పులకు తట్టు కో లేక సప్త సాగరా లు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ భీకరమూర్తి కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకా
శించే సూర్య మండల కాంతులు తేజరిల్లు తున్నాయి.ఆ నేత్రాల అంచులు విరజిమ్ము తున్న విస్ఫులింగాల వలన సర్వ గ్రహమం
డలాలూ,నక్షత్ర మండలాలూ కకావికలై క్రిందు మీదలౌతున్నాయి.ఇంద్రధనుస్సులా వంగిఉన్న ఆ నరసింహావతారుని కనుబొమ లు
ముడిపడి ముఖం భయంకరంగాఉంది. ఆయన చిక్కనిచెక్కిళ్ళు గండశిలలలాగ మిక్కిలి కఠినంగా ఉన్నా,అంత కమనీయం గానూ
ఉన్నాయి.దీర్ఘమైన జటలు సంధ్యా సమయంలో ఎఱ్ఱ బడిన మేఘమాలికలను పోలిక మెరుస్తు న్నాయి.ఆ జటలను అటు నిటు
విదల్చటం వలన పుట్టిన వాయువుల వేగంవల్ల ఆకాశంలో ప్రయాణిస్తు న్న విమా నాలు వైమానికులతో సహా ఉయ్యాలలాగ
ఊగుతున్నాయి.ఆ ప్రభువు చెవులు నిశ్చల ములై శంఖాలవలె స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంలా చేసి చిలికేట
ప్పుడు గిరిగిర తిరిగే ఆ గిరి వేగానికి పాల సముద్రంలో పుట్టి ఆకాశం అంతా ఆవరించి న తుంపర్లు వలె ఆ భీకరావతారునికే సరా లు
భాసిల్లు తున్నాయి.
శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశంచే వెన్నెలవలె వెలిగిపోతోంది.ఆ నర సింహుని సింహగర్జనకు అష్టదిగ్గజాలైన
కుముదము,సుప్రతీకము,వామనము,ఐరా వతము,సార్వభౌమాల చెవులు పగిలి పోతున్నాయి.
ఆ నరసింహ మూర్తి తెల్లనిదేహం వెండికొండ లా ప్రకాశిస్తూ,చూడటానికి శక్యంకాని విశేష కాంతితో వెలుగిపోతోంది.ఆ శరీర
కాంతులు శత్రు వులైన రాక్షసుల గర్వాంధ కారాన్నిచీల్చి వేస్తు న్నాయి.ఆ నరకేసరిఆకారం ప్రహ్లా దునికి సంతోష
కారణంగానూ,హిరణ్యకశిపునికి సంతాప కారణంగానూ ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణా రసంతోనూ, బహిరంగం
వీరరసంతోనూ విరాజిల్లు తూ ఉన్నాయి.దివ్యప్రభావ సంపన్నుడై న శ్రీనర సింహావతారుడు ఈ విధంగా సభా స్తంభం మధ్యనుండి
ఆవిర్భవించాడు.పరమాద్భుత మైన శ్రీనరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టు డై చూశాడు.
🌹💞🌹
       
"యతః ప్రవృత్తిర్భూతానామ్” -ఎవరి నుండి సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి మొదల గునవి కలుగుచున్నవో -అని చెప్పుటవలన,సమస్త
జీవులకును ఆధారభూతుడు ఆ పరమాత్మ యే యని స్పష్టమగుచున్నది.
జడమైన వస్తు వు చైతన్యము యొక్క సహా యములేనిదే ఏమియు చేయజాలదు.జడ మగు ప్రకృతి చిద్రూప పరమాత్మవలననే
స్పందించుచున్నది.(మయాధ్యక్షేణ ప్రకృతి స్సూయతే స చరాచరమ్).కాబట్టి జీవులు తమ సమస్తమునకును కారణభూతుడై న ఆ
పరాత్పరునియెడల అపార భక్తిశ్రద్ధలు గలిగి వారినే యారాధించుచు పరమ శ్రేయ ము నొందవలెను.
“యేన సర్వమిదం తతమ్" - ఇదే వాక్యము గీతయందు మూడుపర్యాయములు ప్రయో గింపబడినది."దేనిచేత ఈ సమస్త
ప్రపంచం వ్యాపింపబడియున్నదో "అనిదానియర్థము. పరమాత్మ సర్వవ్యాపకులై యుండుటవలన ఈ ప్రపంచమున వారు లేనిచోటు
లేదని నిశ్చితమగుచున్నది.పాలలో వెన్నవలె వారు సర్వత్ర వ్యాపించియున్నారు.స్థూలనేత్రము నకు వారు గోచరము
కాకున్నను,జ్ఞాననేత్ర మునకు సర్వత్ర గోచరించుదురు.
ఈ ప్రకారంగా అణువణువునందును భగ వంతుడు వ్యాపించియుండుటచే,సర్వసాక్షి యై సమస్తము పరికించుచుండుటచే జీవు
లాతని సాన్నిధ్యంను సర్వత్రానుభూతమొ నర్చుకొనుచు,పాపకృత్యం లెవ్వియు చేయ క,భక్తిభావ సమన్వితులై యుండవలెను
"స్వకర్మణా తమభ్యర్చ్య”-మనుజుడు మోక్ష  సిద్ధిని కర్మాచరణముద్వారా ఎట్లు పొంద గలడను ప్రశ్నకు భగవానుడిచట చక్కగ
సమాధానమొసంగిరి-"నీవు నీ కర్మచేసికొను చు దైవమును ఆరాధించు చుండుము, స్మరించుచుండుము,ఈశ్వరార్పణముగా నీ
కర్మముల నాచరింపుము.అనగా నీ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధింపుము.అట్టిచో నీవు జ్ఞానసిద్ధిని,తద్ద్వారా మోక్షసిద్ధిని బడ
యగలవు -అని భగవానుడిచట బోధించిరి. ఈ ప్రకారముగ కర్మను ఈశ్వరార్పణబుద్ధితో చేయునపుడే చిత్తశుద్ధిద్వారా యది జ్ఞానా
విర్భావమునకు హేతువై మోక్షప్రదమగును. అట్లు కాక ఫలాభిలాషతో చేసినచో కర్మ మోక్షహేతువు కానేరదు.
"కర్మను చేయుము కాని ఫలమును ఈశ్వరా ర్పణము గావింపుము"-ఇదియే కర్మ ద్వారా ఈశ్వరుని యారాధించుట.అనగా భగవ
త్ప్రీత్యర్థము కర్మలనాచరించవలె నని భావము.
కర్మచే మోక్షము లభించునా యని కొందఱు ప్రశ్నించుదురు."లభించును,కాని,దానిని చేయవలసినపద్ధతిలో చేసిననే లభించును"
అని తెలియవలెను. ఆపద్ధతి యేదియనిన, ఆ కర్మచే భగవంతుని అర్చించవలెను. అనగా ఆ కర్మనాచరించి తత్ఫలితమును
భగవంతున కర్పించవలెను. నిష్కామముగ (భగవదర్పితముగ)కర్మాచరణచేయవలెను.
అత్తఱి కర్మయందలి దోషము తొలగిపోయి చిత్తశుద్ధిద్వారా యది మోక్షసాధనముగ పరిణమించును.ఇదియే కర్మమార్గమందు గల
కీలకము.ఆ కీలకమును,ఆ కర్మరహస్య మును భక్తు లపై కరుణచే భగవంతుడిచట వెల్లడిచేసివైచిరి."ఓజీవుడా!,కర్మచేయుము. కాని
ఈశ్వరార్పణబుద్ధితో చేయుము.
ఆ కర్మచే ఈశ్వరుని యారాధించుము. ఫలితములను కోరకుము.కర్మచేయుటయే నీ వంతు.ఫలితమును భగవంతునకే
అర్పింపుము" అని యిచట చక్కగ బోధింప బడినది.ఈ పద్ధతిద్వారా కర్మ తన కర్మత్వ మును పోగొట్టు కొని,తన బంధరూపమును
తొలగించుకొని మోక్షహేతువుగా మారిపోవు చున్నది.
దీనిని బట్టి కర్మ నింద్యము కాదనియు,కర్మ మార్గము నికృష్టముకాదనియు,దాని నాచ రించు పద్ధతిని తెలిసికొనినచో అది తక్కిన
భక్తి జ్ఞానాదులవలె పరమ పవిత్రమగు ఒకా నొక మోక్షసాధనము కాగలదనియు ఈశ్లోక ముద్వారా స్పష్టమగుచున్నది.కాని
"స్వకర్మణా తమభ్యర్చ్య” (స్వకీయకర్మచే భగవంతుని ఆరాధించుట) - అను ఈ పద్ధ తిని జనులు సరిగా గమనించక,దైవార్చిత
ముగ కర్మలు చేయుటమాని కామ్యబుద్ధితో జేయుచున్నారు.అందువలన కర్మ బంధన రూపముగామారిపోవుచున్నది.భగవానుడో,
కర్మను మోక్షరూపముగ మార్చవచ్చునని తెలిపి దాని కిచట ఉపాయమునుగూడ సెలవిచ్చిరి.
కాబట్టి ముముక్షువులెల్లరు ఈ సత్యమును జ్ఞాపకము నందుంచుకొని,ఈ భగవద్వాక్య ములపై విశ్వాసముంచి తాము చేయు సమ
స్తకర్మలను ఈశ్వరార్పణబుద్ధితో,భగవత్కైం కర్యబుద్ధితో చేయవలయును.అట్లు చేసిన చో "సిద్ధిం విన్దతి మానవః” అనునట్లు  
మానవుడు జ్ఞానసిద్ధిని, మోక్షసిద్ధిని తప్పక బడయగలడు....
*కర్మ,భక్తి,జ్ఞానములయొక్క సముచ్చయ ము తెలుపబడినది.ఎట్లనిన -కర్మనాచరిం చుట -(కర్మ) దానిద్వారా భగవంతుని ఆరా
ధించుట (భక్తి) అట్లు ఆరాధించుటచే చిత్త శుద్ధికలుగజ్ఞానమావిర్భవించుట(జ్ఞానము).
కర్మయను ప్రమిదలో భక్తియను తైలమును పోసి ధ్యానమను వత్తినిబెట్టి జ్ఞానమను జ్యోతిని వెలిగించవలెను.
*సమస్త ప్రాణికోట్లు ఎవనినుండి ఉత్పత్తిని బొందుచున్నవి....పరమాత్మనుండి.
*ఈ ప్రపంచ మంతయు ఎవనిచే వ్యాప్తమై యున్నది..పరమాత్మచే.......
*జీవుడు మోక్షసిద్ధిని యెట్లు పడయగలడు.
స్వకీయకర్మచే భగవానుని ఆరాధించినచో, అనగా ఈశ్వరార్పణబుద్ధితో (నిష్కామము గ) కర్మలను ఆచరించినచో చిత్తశుద్ధిద్వారా
జ్ఞానమును,దానిచే మోక్షమునుపొందును..
[1/10, 5:27 AM]  🌹🌹🌹🌹
*చీమలు నిద్రపోతాయా......
పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయి...రాణి చీమలు రోజుకి 92 సార్లు మాత్రమే నిద్రపోతాయి....
కాని నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆరు నిముషాల పాటు నిద్రపోతాయి. అంటే రోజు మొత్తంలో 9.4
గంటల సమయం నిద్రిస్తా యి....
సాధారణంగా చీమలు నిద్రపోవని చెప్తా రు..
అయితే రాత్రివేళల్లో చీమలు పని చేయవు కాబట్టి అవి ఏదో ఒక రూపంలో విశ్రాంతి తీసుకుంటాయి. కానీ నిద్రపోయే సమయం
ఒక్కొక్క చీమకు ఒక్కొక్కరకంగా ఉంటుంది.
        🌹💙🌹
"ఆహారం, నిద్ర, భయం," అనబడే మానసిక భావనలు సకల ప్రాణులకు సహజమే......
ఏదైనా చూడలేని సంఘటన,వినజాలని శబ్దము విన్నప్పుడు భయం అనే మానసిక మైన భావన కలుగుతుంది.మనిషికి భయం
ఉంటుంది,కానీ దానివల్లనష్టా లుఉన్నాయా? లేక ఉండవలసిందేనా.? అనుకున్నప్పుడు...
మనిషికి, భయం తగిన మోతాదులో ఉండా లి.అతి భయం వల్ల మనిషికి కష్టా లు,నష్టా లు ఉంటాయి.భయం కొందరికి శాశ్వ తంగా
ఉండవచ్చు.కొందరికి తాత్కాలికంగా ఉండ వచ్చు.అతి భయం పనికిరానిది.దానివల్ల దుష్ఫలితాలుసంభవించవచ్చు.కొందరు
భయంవల్ల కూడా చనిపోవడం సంభవిస్తుం ది. భయం వల్ల శారీరక,మానసిక స్థిరత్వం లో మార్పు కనిపిస్తుంది.భయంతో చెమట లు
పట్టవచ్చు.కాళ్లు వణకవచ్చు.శరీరం స్వాధీనం తప్పవచ్చు.....
జంతువులలోకూడా కొన్నిమార్పులు కలుగు తాయి.జంతువులు,పక్షులు,క్రిములు,కీటకా లు తమకు భయం కలిగినప్పుడు పరిగెత్త
డం చూస్తుంటాం.విధిలేని పరిస్థితుల్లో మాత్ర మే అవి మనిషికి ఎదురు తిరుగు తాయి....
భయం పుట్టు కతోనే వచ్చే సహజమైన భావ న.ఈ భయమే మానవుడిని పిరికివాడిగా చేస్తుంది.అసమర్థు డుగా తయారు చేస్తుం
ది.భయం వల్ల మనిషి యొక్క ప్రతిభ మరు గున పడిపోతుంది.....
శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగాఉన్నా, భయం వల్ల మనిషి ముందుకు పోలేక పోతా డు.కొన్ని పనులు నిర్వహించ లేక
పోతాడు.  ఆలోచనా రాహిత్యంతో మనిషి మనసు స్వాధీనం తప్పుతుంది తాను ఏం చేస్తు న్నా డు ఏం చేయాలో అనే విచక్షణ జ్ఞానం
కూడా మరచి పోతాడు.
ఈ భయం లోంచి"దైవం"అనే భావన పుట్టు కొచ్చింది కాబట్టి,అదే ఆలోచనలోంచి మనిషి బయటపడలేక పోతున్నాడు.మేము
మను షులకు దేవునికి మధ్య వారధులమని చెప్పే వారిని ప్రజలు తల ఊపి వారేదో దైవాంశ సంభూతులు అని నమ్ముతూ ఉంటారు.
వారికి సాష్టాంగ ప్రణామములు చేస్తూ భయంతో విధేయులై ఉంటారు.ప్రపంచంలో సాధారణంగా ప్రజలందరికి ఉండేభయాలు..
క్రూ రమృగాల భయం..చీకటిభయం..భూకం పాల భయం..పెను తుఫానులభయం.ఇంకా అనేకానేక ప్రకృతి పరమైన భయాలు
ప్రపం చంలో అందరి ప్రజలకిఒకేరకంగాఉంటాయి. ప్రపంచంలో ఏ దేశ ప్రజలకు లేని విచిత్రమైన భయాలు మన ఇండియాలో
ఉన్నాయి.....
భారతీయులకు,ప్రపంచంలో,ఏ దేశంలో ఏ ప్రజలకు లేని ఒక విచిత్రమైన భయం ఉంది.
అదేంటంటే......
సెంటిమెంట్ల భయం..మూఢనమ్మకాల భయం..మత గ్రంథాలను ప్రశ్నిస్తే ఏమవు తుందోనని, కీడు కలుగుతుందని భయం..
భక్తి భయం..దేవుడి భయం..పాప భయం..
నరక భయం..ప్రశ్నించడం అంటే భయం..
చేతబడులకు గడ్డిపోచ కూడా కదలదని తెలిసినా.ఎదురు తిరగడం అంటే భయం..
పూజించటం కీర్తించడం లంచం ఇవ్వటం ఇవి చేయకపోతే పనులుకావు అనే భయం.
గుడ్లగూబ అరిస్తే భయం..కాకి కావు కావు అంటే భయం..మరీ ముఖ్యంగా కడుపుకు తినేటప్పుడు,పదార్థా ల మీదభయం..
రోడ్లమీద కనపడితే భయం.(నిమ్మకాయలు, కొబ్బరి కాయలు,ఎర్ర నీళ్లు ,మిరపకాయలు, అన్నపు ముద్దలు,గుడ్లు మొదలగునవి.)
బాణామతికి బయపడతాడు రాళ్లకు కేవలం పసుపు కుంకుమ పెట్టి అగరబత్తి వెలిగించి దాన్ని తొక్కితే ఏమవుతుందోనన్న భయం.
దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఆత్మలు లేవని తెలిసినా వాటి గురించి మాట్లా డితే భయం.......
ఇలా ప్రతి దానికి భయపడి భారతీయులు భయం నీడలో బతుకుతున్నారు కాస్త బుర్ర పెట్టి  హేతుత్వంతో ఆలోచిద్దాం...
ఇవన్నీ కేవలం ఉట్టి భయాలుతప్ప,వాస్తవ మైన విషయాలు కావు. వీళ్ళ భయానికి కారణం సహేతుకంగా ఆలోచించ లేకపోవ
డమే...విషయాన్ని సమగ్రంగా,ఆలోచించి విశ్లేషించించక పోవడమే.భారతీయులు మతాలఊబిలో మెడదాకా కూరుకు పోయా రు.
కనీసం చదువుకున్న వారు అయినా ఆలోచిస్తా రేమోనని ఆశిస్తే, ఆశాభంగమే కలుగుతుంది......
వాళ్ల మెదళ్ళు....... మతాలకు, కులాలకు, దైవాలకు, అహేతుకమైన, అసంగతమైన, అనవసరమైన, అర్థరహితమైన ఊహలకు
తాకట్టు పెట్టబడ్డా యి......
తరాల నుంచి కొనసాగుతూ వస్తోంది.ఇప్ప టికిప్పుడు మారాలంటే కొన్ని తరాలు గడిచి పోవాలి.కనీసం చదువుకున్నవారైనా మార
తారని ఇతరులకు వాస్తవజ్ఞానాన్ని చెప్తా రని ఆశిస్తే ఆశాభంగం కలుగుతుంది.ఈ భారతీ య సమాజం మారడానికి ఇంకా కనీసం
వందేళ్లు అయినా పట్టవచ్చేమో.......
🌹
         ♥️ ♥️
*ఆలయ గర్భగుడిలోకి ఇతరులు..ఎందుకు ప్రవేశించరాదు....
మన దేశంలోని కొన్నిఆలయాల గర్భగుడుల లోనికి కొందరిని రానిస్తు న్నారు.ముఖ్యంగా జ్యోతిర్లింగాలను అందరూ స్పర్శించవచ్చు
- అని కొందరంటారు.కానీ కొన్ని ఆలయాలలో గర్భగుడిలోనికి వెళ్ళక పోవడం నియమం. అది శాస్త్రా లు ఏర్పరచినది.ఏ వర్ణంవారు
కూడా గర్భగుడి లోనికిరారు.దానికంటూ నియమించిన అర్చకులు తప్ప.దీని వెనుక భౌతిక - ధార్మిక కారణాలున్నాయి. మూర్తిని
తాకాలన్నా,అర్చించాలన్నా సదాచారం, శాస్త్ర నియమాలు అవసరం.అవి అందరికీ సాధ్యం కావు.“సదాచారం లేనివారు,రజస్వ
లయైన వారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహం/లింగంలోని దైవ శక్తి ఇంక ఉండదు.వెంటనే ప్రోక్షణాదులు జరపాలి.లేకపోతే క్రమంగా ఆ
విగ్రహాదుల్లోకి పిశాచాలు ప్రవేశిస్తా యి. ఆ గ్రామ,నగరాలలో ఉపద్రవాలు వస్తా యి. వ్యాధులతో,శోకాలతో ప్రేతాలు భయాన్ని
కలిగిస్తా యి"-అని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది.
సంప్రోక్షణం ప్రకుర్వీత
తద్దోషస్యోపశాంతయే|
దోషైరుపహతం జ్ఞాత్వా
ప్రాసాద ప్రతి మాదికం|| (ఈశ్వర సంహిత)

విలంబనే తు నిష్కృత్యా
వినశ్యేద్దేవ సన్నిధిః|
తత్స్థాః ప్రేతా భయం కుర్యుః
వ్యాధి శోకాదిభిర్నృణామ్... (విష్ణు సంహిత)
ఆలయంలోని విగ్రహంలో దేవుడున్నాడని విశ్వసిస్తే,వీటినీ విశ్వసించాలి.విగ్రహాన్ని దేవతా శక్తిగా మార్చడం ఒక మహా ప్రక్రియ.
ప్రతిమాశోధన -అనేది మంత్ర,యజ్ఞయాగా దులతో, పాలతో కళాన్యాసం చేసి దేవతని ప్రతిష్ఠిస్తా రు.వాటిని స్పర్శించాలన్నా,అర్చిం
చాలన్నా ఆయా నియమాలను అనుష్టించే వారికే అర్హత ఉంటుంది.అయితే దేవాల యం లోని మూర్తిని తాకవలసిన అవసరమే
ముంది?నమస్కరిస్తేచాలు-ఆ మూర్తినుండి శక్తి తరంగాలు ప్రసరిస్తా యి.ధ్యానిస్తే చాలు - తరించిపోతాం.అందుకే -గర్భగుడి,అంతరా
లయం,ముఖమండపం- వంటివి అందరూ దర్శించి అనుగ్రహం పొందడానికై ఏర్పాటు చేశారు.యుగాలనుండి అందరూ ఆలయా
నికి వెళ్ళి స్వామిదయను పొందుతున్నారు. భౌతికంగా ఆలోచించినా-గర్భాలయంలోకి జనం ఎక్కువైనా,అందరూ తాకుతున్నా
ప్రశాంతత దెబ్బతినడం,విగ్రహశిల అరిగి పోవడం వంటివి జరుగుతాయి.కొద్ది మంది నియమితంగా సేవిస్తే- అవి పదిలంగా
ఉంటాయి.స్థూలంగా ఆలోచిస్తే అసమంజ సంగా అనిపించేవి,సూక్ష్మంగా గమనిస్తే సముచితంగా అనిపిస్తా యి.ఆ సూక్ష్మదృష్టి,
తెలివిలేని మూర్ఖులు మన మతాన్ని విపరీ త దృష్టితో చూస్తు న్నారు.వైద్యచికిత్సా కేంద్రాలలో శస్త్ర చికిత్సవంటివి జరిగేచోట
వైద్యుడు,రోగితప్ప ఎవరూఉండరు. ఎందు కు? అది ఒక సూక్ష్మ విజ్ఞానం.అలాగే దేవతా వ్యవస్థది మరొక సూక్ష్మవిజ్ఞానమే.నమ్మితే
ఈ విజ్ఞానాన్నీ నమ్మాలి.
సర్వవ్యాపకుడై న పరమేశ్వరునికి ఏ పరిమి తులు, నియమాలు ఉండవు.ఎవరైనా,ఎక్క డై నా, ఎలాగైనా స్మరించి,ధ్యానించి,కీర్తించి
ధన్యులు కావచ్చు.కానీ ఒక విగ్రహంగా దివ్య శక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తిస్తా యి....
🌷♥️🌷
*మంత్రాలకు అర్థం ఉందా? మంత్రం వెను కున్న మర్మమేమిటి...అసలు మంత్రం అంటే ఏమిటి? మంత్రానికి ఉన్న అర్థమేమిటి?
మననాత్ త్రాయతే ఇతి మంత్ర:అని అంటా రు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం.అలాంటి మహా శక్తివం
తమైన మంత్రాలను మనరుషులు అమోఘ తపశ్శక్తితో,భగవదావేశంలో పలికిన వాక్యా లే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌.
మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తు న్నాయి.
*ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలా? ఈ బీజాక్షరాలను ఎలా పలకాలి? బీజాక్షరాలు చాలానే ఉన్నా...ఉపాసాన పద్ధతిలో
చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చును.ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం
అనంతం.మాన్యుల నుంచి సామా న్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్క టంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ
మంత్రసాధనే.
*అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రా లుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపి స్తుంది. మంత్రాల అసలు లక్ష్యం.మన ఇష్ట
దేవతలను ప్రసన్నం చేసుకోవడం.అలా మూడు విధాలుగా విభజించి...ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది.క్షుద్రంతో
ఉచ్చాటన చేసే తామసమంత్రాలు..యుద్ధం లో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక
మంత్రాలుగా కాలక్రమంలోఆవిర్భవించాయి.
*అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం.అదెవరికైనా అనితర సాధ్యం కాని పనికాదు.ఇలా ఎందుకు పలికాలి?
ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవం తం కాదు.అలాంటి మంత్రం ప్రాణవాయువు లేని జీవం లాంటిది.
*ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది.ఆ ధ్వనే ఓంకారంగా రూపాంత రం
చెందింది.ఓం నుంచి వేదరాశులే ఉద్భ వించాయ్.రుగ్వేదం నుంచి ఆకారం,యజు ర్వేదం నుంచి ఊకారం,సామవేదం నుంచి
మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నదిరుషివాక్కు.అందుకే ఓంకారా న్ని బీజాక్షరంతో ముడిపెట్టా రు మన
పెద్దలు.
*అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి?.. భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్ష రాల
ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?..కళ్లకు కనిపించనివి.. 
కొలతకూ,తూకానికీ దొరకనివేబీజాక్షారాలా?
*ఈ జగత్తు స్థూలమనీ,సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు.శరీరం స్థూలమైతే మనస్సు సూక్ష్మం.స్థూలమైన దానికంటే
సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ.మన శారీరక శక్తికంటే,మానసికశక్తి చాలా గొప్పది.బలవ త్తరమైనది కూడా.
*సూక్ష్మశక్తు ల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయ గలుగుతాడు.ఈ సూక్ష్మశక్తు ల జాగృతికి మంత్ర
శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తు లనే కాదు,ప్రకృతిలో ఆవరించి
ఉన్న అనేక అదృశ్య శక్తు ల్నికూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తా యంటారు.వర్షాలు కురిపించడం,దీపాలు
వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.
*అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇది నిజం.కానీ ఇక్కడొక ముఖ్యమైన విష
యాన్ని గమనించాలి.మంత్రాలను పలికిన ప్పుడు చాలా స్పష్టంగా పలకాలి.సరియైనా ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పల
కాలి.అలా అయితేనేదానిఫలితంఉంటుంది. మనకు కనిపిస్తుంది.జీవులలోని సూక్ష్మ శక్తు ల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తు ల్నీ ప్రేరేపించడా
నికీ,దైవశక్తిని మనకు అనుసంధాన పరచ డానికీ మంత్రశబ్దా లు ఉపకరిస్తా యనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.
*ప్రకృతిలోనే కాకుండా,సృష్టిలో కూడా అనం తంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు... సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తా యి.
*దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం.మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం.మనసా,వాచా,కర్మణా శుద్ధి
కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది.కంప్యూటర్‌కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది.క్రమంగా
తరిగిపోతుంది.అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లు తుంది.పురాణ కాల మేధా వులు మంత్రాలకు చింతకాయలనే కాదు,
అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్ట గలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని
విమర్శించడం అవివేకం.చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసు కోవడం వివేకం.
*అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం.ప్రతి బీజా క్షరం దేవతాశక్తి స్వరూపం.విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతిసూక్ష్మంగా
కనిపించే అతీంద్రియ శక్తేమంత్రం.అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తి కరమైన శాస్త్రంకూడా.ఎంతోఅపురూపమైన
మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయ వచ్చు.సిద్ధిని,లబ్ధిని,దివ్యానుభూతిని పొంద వచ్చు.దీనికి శాస్త్రీయత ఉంది.అసశాస్త్రీ
యంగా రుజువు అయింది కూడా.!!
*మరి మంత్రాలకు,వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో,వేదాల్లోనూ మంత్ర ప్రస్తా వన ఉందా?..మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌
కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే...ఆధు నిక కాలాన్ని
యంత్రయుగమనిపిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలు తాయా?కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి
విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?.ఇలా మంత్రాల గురించి,బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో
చాలారకాలైన అపోహలు ఉన్నా యి .అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు.
*మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తా యని చెబుతున్నారు పండితులు.పురాణాల్లోని సైన్సు
విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగా హన ఉండి తీరాలి.ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర
తంత్రాలు కనిపిస్తా యిమనకు. అందుకే మంత్రాలకూ,సైన్సుకూఉన్న సంబం ధాన్ని తెలుసుకొని తీరాలి.పురాణకాలంగా
మంత్రయుగంగా...ఆధునికకాలం యంత్ర యుగంగా మారుతుంది.ఇదినిజమేకావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం
కాదు.ఇది నిజం కానే కాదు.మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.
*దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించ డాన్ని మంత్ర జపం అంటారు.కొన్ని అక్షరా లను క్రమబద్ధంగా కలిపి వాడటమే.ఇలా
వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవిం చిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరే
కంగా గాని మారుతుంది.అది మంత్రానికి ఉన్న పవర్‌.తరుచూగా ఉచ్చరించే శబ్ధతరం గాలే మంత్రాలు.ఆ మంత్ర శబ్ధ తరంగాలు
చాలా శక్తివంతమైనవి కూడా.శబ్ధ తరంగా లు జీవుల మీదా,ప్రకృతి మీదా,సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తా య్.ఇది సైన్సు కూడా
ఒప్పుకుంటున్న సత్యం.
*జీవుల శారీరక,మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది.కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం,
భయంకలగడం,నిరాశఆవరించడం చూస్తుం టాం. మరి కొన్ని శబ్ధ తరంగాలవల్ల ఆరోగ్యం బాగుపడటం,ఉత్సాహం రావడాన్ని
కూడా గమనిస్తుంటాం.అందుకే మంత్రాలంటే శక్తి మంతమైనవి శబ్దతరంగాలే.అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా,షట్‌
చక్రా లపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుం ది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది.మంత్ర శబ్దా లు
గ్రంథు లకు చలనం కలిగించి జాగృతంచేస్తుంది. పోగొట్టు కున్న శక్తిని అవిమేల్కొలుపుతాయి. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన
శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి,తర్వాత మెదడుకు వెళ్తా యి.మెదడు నుంచి మంత్ర శబ్ధతరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని
ద్విగుణీ కృతం చేస్తుంది.
*ఎక్కడ కనిపించని అత్యంతశక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్ర సాధన.మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే
కాదు.శక్తికి ప్రతిరూపాలు.పరమేశ్వరానుగ్ర హంతో,పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి
ఆలోచనాశక్తి అనిర్వచనీయమై న అనుభూతిని ఇచ్చేది మంత్రమే.
🌷❣️🌷
            
*మూలభాష సంస్కృతమే.....:-
*వేదముల విషయంలో ఒక పదం యొక్క అర్థం కంటె,శబ్దమే ముఖ్యం.ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి.వైదిక భాష
''ఛందస్సు'' అందుండి ఉదయించినది సంస్కృతం.వీటిలో కొన్ని పదాలని ఉచ్ఛరిం చేప్పుడు వాటి అర్థం కూడా స్ఫురిస్తుంది.
''దంత'' అన్న పదం తీసుకొందాం.ఈ మాట కర్థం పన్ను (దంతం).ఈ పదాన్ని పలకటాని కి పళ్లనే ఎక్కువగా
ఉపయోగించాలి,నాలుక ఉపయోగం అప్పుడప్పుడే.పళ్లు లేని వాళ్లు దీనిని పలుకటం ఎంత కష్టమో తేలికగా తెలుసుకోవచ్చు.ఆ
మాటని శుద్ధంగా పలు కలేరు.భాషా శాస్త్రజ్ఞులు ఆయా భాషలు ఎప్పుడు పుట్టా యో పరిశోధిస్తూ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలను
కూడ పట్టించు కొంటారు.వాళ్లు కూడ గమనించవలసిన విషయమొకటుంది..
*సంస్కృతం, గ్రీక్‌, లాటిన్‌, జర్మన్‌- వీటిని ట్యుటానిక్‌వర్గపు భాషలంటారు (ఇంగ్లీషు కూడ వీటిలో చేరినదే).ఆధునిక ఫ్రెంచి,మరి
కొన్ని భాషలు కెల్టిక్‌వర్గానికి చెందినవి. భాషాశాస్త్రజ్ఞుల ప్రకారం ఇవన్నీ ఒకే మాతృ భాషనుండి జనించాయనీ ఆ భాష ఇండో-
యూరపియన్‌వర్గానికి చెందినదే అని అంటారు.కాని ఆ మాతృభాష ఏమిటో నిశ్చ యంగా పండితులు చెప్పలేక పోయారు.
సంస్కృతం (ఇందులో వైదిక భాష అయిన ఛందస్సు కూడా కలుస్తుంది) ఆ మాతృభాష అని మాత్రం ఒప్పుకోరు. 'దంత'' వంటి
మాటలు ఈ దృక్పథాన్ని సమర్థిస్తా యి. ఆంగ్లంలోని ''డెంటల్‌'' అన్న పదానికి కూడ ''దంతాలకు సంబంధించిన'' అని అర్థం.
''దంత్‌''కీ ''డెంట్‌''కీ పోలిక ఉంది.ఫ్రెంచి, లాటిన్‌భాషలలోని పదాల శబ్దం కూడ ''దంత'' వలెనే ఉంటుంది.అంటే ''త'' అన్న శబ్దం
''ద''అన్న శబ్దంకంటె ప్రముఖం సంస్కృ తంలో వలెనే. ''సరే,శబ్దా లలో పోలిక ఉండ వచ్చు. అంత మాత్రాన సంస్కృతమే మాతృ భాష
ఎట్లా అవుతుంది''అనవచ్చు.పైన చెప్పి నట్టు ''దంత'' అన్న సంస్కృత పదాన్ని సరి గ్గా ఉచ్ఛరించటానికి అన్ని పళ్లూ అవసరం.
''డెంటల్‌'' వంటి ఇతర భాషలలోని పదాలని ఉచ్ఛరించటానికి ప్రయత్నించు.అప్పుడు పళ్లతో పెద్ద పని లేదని తెలుస్తుంది.పదం
యొక్క అర్థా న్ని శబ్దమే సూచించాలనుకొంటే ఇది సంస్కృతంలోని ''దంత''లోనే సంభవి స్తుంది.అందువల్లనే అది మూలం,''డెంటల్‌''
అన్నది తజ్జనితం.కొన్ని చోట్ల వర్ణక్రమాన్ని మారిస్తే సన్నిహిత పదం వస్తుంది.
*''సింహం'' యొక్క ముఖ్యలక్షణమేమిటి? - ''హింస'' పెట్టటం.'హింస' బదులు 'సింహ' వచ్చింది.దేవతలు,దానవులు,మానవులు -
అందరకీ కాశ్యపుడనే ఆది ఋషి,పితరుడు. ఆయన కాపేరు ఎట్లా వచ్చింది? ఆయన సత్యాన్నిదర్శించాడు.అంటే ఆయన భగవం
తుని నిజరూపాన్ని దర్శించాడు.జ్ఞానాన్ని సంస్కృతంలో దృశ్యం అని అంటారు.దర్శిం చేవాడిని సంస్కృతంలో ''పశ్యకా''అంటారు.
కొద్ది మార్పులతో ఇదే 'కాశ్యప' అయింది. ఉచ్చారణా నియమాలు :- శిక్షాశాస్త్రం శబ్దా లని పలకటానికి సంబంధించిన వివిధ
నియమాలను ఇస్తుంది.
*ఇవిఉచ్చారణ,స్వరం,మాత్ర,బలం,సామం, సంతానం (పదాలను సంధి చేయటం) వీటి ని పాటించటం వల్ల
శబ్దంశుద్ధంగాఉంటుంది. అంతేకాదు,శరీరంలో ఏయే భాగాలనుండి శబ్దోచ్చారణ ఉదయించాలి,ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి
అని కూడ చెప్తుంది. ఇదంతా సశాస్త్రీయం,ఆచరణీయం కూడా. కొన్ని అక్షరాలను నెమ్మదిగా ఉచ్ఛరించాలం టే పెదవులను ఏ
విధంగా కలపాలో ఈ శాస్త్రం చెప్తుంది.
*తదనుసారంగా చేస్తే శబ్దోచ్చారణ నిర్దు ష్టం గా ఉంటుంది.ఈ సందర్భంలో ఇంకొక విష యం కూడా జ్ఞాపకం వస్తుంది ''ప'' ''మ''
''వ'' అన్న అక్షరాలను పలికేప్పుడే పెదవుల ప్రమే యం ఉంటుంది. 'క', 'జ్ఞ' 'చ' 'గ', 'ణ', 'థ', 'న' వంటి అక్షరాలను పలికేటప్పుడు
పెదవుల ప్రమేయం లేనేలేదు.పెదవుల అవసరం లేకుండా పలుకగల అక్షరాలతోనే రామాయ ణాన్ని ఎవరో తయారు చేశారు.దాని
పేరు ''నిరోష్ఠ రామాయణం''.ఓష్ఠ అంటే పెదవి. దీని నుండే ''ఔష్ట్రకం'', అంటే ఒంటె -అన్న మాట వచ్చింది.ఒంటెకి చాలా పెద్ద పెదవు
లుంటాయి.నిరోష్ఠమంటే పెదవులు లేకపో వటం. ఆ రచయిత తన ప్రజ్ఞనిచూపించు కోవటానికే ఈ కావ్యాన్ని వ్రాసి యుంటాడు.
ఇంకొక కారణం కూడా ఉండవచ్చు.శారీరక పారిశుద్ధ్యమంటే ఆయనకి ఎంతో పట్టింపు ఉండేదేమో! భగవంతుని నామాలను ఉచ్ఛ
రించేప్పుడు ఆ శబ్దా లను అశుచి చేయట మిష్టం లేకపోయిందేమో!పాణిని మహిర్షి (వైయ్యాకరణుడు) 'పాణనీయశిక్ష'లో వైదిక
పదాలను ఎంత శ్రద్ధతో ఉచ్ఛరించాలో ఒక శ్లోకంలో ఇట్లా పేర్కొంటాడు.
*వ్యాఘ్రీ యథా హరేత్‌పుత్రాన్‌!దంష్ట్రా భ్యాం చ న పీడయేత్‌! భీత పతనభేదాభ్యాం!తావద్‌వర్ణాన్‌ప్రయోజయేత్‌!
*వేదాక్షరాలను స్పష్టంగా పలకాలి.శబ్దా లకి మచ్చరాకూడదు.శబ్దం అణగిపోకూడదు. హీనమై పోకూడదు.పెరుగుతున్నట్టు ఉండ
కూడదు.శబ్దా లను అశ్రద్ధగా,పేలవంగా ఉచ్చ రించకూడదు కటువుగానూ ఉచ్చరించకూ డదు.పులి తన పిల్లలను ఎట్లా
పట్టు కొంటుం ది? పులులూ,పిల్లు లూ తమ సంతానాన్ని పళ్ల తో పట్టు కొంటాయి.పిల్ల జారిపోకుండా పళ్లు గట్టిగా పట్టు కొంటాయి
అయినా పిల్లకి ఏ విధమైన బాధా,గాయమూ కాదు.ఆవిధం గానే మాటలను సున్నితంగా,ధృఢంగా పల కాలి అంటాడు పాణిని.ఆ
పాణినియే వ్యాక రణమనే వేదాంగానికి ఎంతోఅమూల్యమైన సేవ చేశాడు.పాణినియే కాక ఇతర యోగు లు ''శిక్ష'' గురించి
వ్రాశారు.దాదాపు 30 గ్రంథాలున్నాయి ఈవిషయమై.వీటిలో పాణి నిదీ,యాజ్ఞవల్క్యునిదీ అతి ముఖ్యమైనవి.
          🌷💛🌷

You might also like