Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 10

పాల్కురికి సో మనాధుడు వ్రా సిన అక్షరాంక పద్యాలు- ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు 01-02-2018

పాల్కురికి సో మనాధుడు వ్రా సిన అక్షరాంక గద్య పద్యములను 13 వ శతాబ్ది లో మల్లికార్జు నపండితుడు
చిత్రకవితాబేధములలోఅక్షర చిత్రముక్రింద చెప్పాడట.అక్షరాలు లేదా పదాల ద్వారా సంఖ్యల
నిరూపణాన్ని అక్షరాంకము అంటారు.

క్రీ.శ. 950 ప్రా ంతానికి చెందిన రెండవ ఆర్యభట్టు అక్షరాలతో,పద్యాలలో సంఖ్యలని వ్యక్త ం చెయ్యడానికి
ఇతడు ఓ చక్కని పద్ధ తిసూచించాడు. దానికి "కటపయాది" పద్ధ తి అని పేరు. ఈ పద్ధ తిలోప్రతీ హల్లు కి
ఒక సంఖ్య విలువ ఇలా ఇస్తా రు.

క, ట, ప, య = 1 ;

ఖ, ఠ, ఫ, ర = 2

గ, డ, బ, ల = 3;

ఘ, ఢ, భ, వ = 4

జ, ణ, మ, శ = 5;

చ, త, ష = 6

ఛ, థ, స = 7;

జ, ద, హ = 8

ఝ, ధ = 9;

ఞ్, న = 0

అచ్చులకు "0" విలువ ఇవ్వబడుతుంది.హల్లు కి, అచ్చు ఏది చేరినా హల్లు విలువ మారదు.ఉదాహరణకి
గ, గా, గి, గీ, మొదలైన వాటన్నిటి విలువ 1 మాత్రమేమరి మన పాల్కురికి వ్రా సిన అక్షరాంక పద్యాలు
ఈదృష్టితో చూడాలా?

అక్షరాంక గద్యలో అ మొదలు క్ష వరకు మొత్త ం 50 అక్షరాల్లో వరుసగ అక్షరాంక గద్య రచన చేసినట్లు గా
ఈ అక్షరాంక పద్యరచనలు వ్రా సాడా?వీటికి జవాబులు చివరలో చెప్పుకొందాం.
ముందు మొదటి పద్యం ప్రతిపదార్థ ం చూద్దా ం .

టటకి ట టట్ట కట
ి ్ట టట కిట్టటటట్ట టకిట్టటట్ట కి

ట్ట టకిట టట్ట కిట్టట కిటట్ట ట టోన్ముఖటంకృతి స్ఫుటో

త్కటపటహాదినిస్వన వియత్త లదిక్తటతాటితార్భటో

ద్భట పటుతాండవాటన, "ట"కారనుతా! బసవేశ పాహిమాం!

పదవిభజన

టటకి ట టట్ట కట
ి ్ట టట కిట్టటటట్ట టకిట్టటట్ట కిట్టటకిట టట్ట కిట్టట కిటట్ట ట ట, ఉన్ముఖ టంకృతి, స్ఫుట+ఉత్కట

పటహ+ఆది, నిస్వన ,వియత్త ల, దిక్తట, తాటిత+ఆర్భట+ఉద్భట, పటుతాండవ+ అటన, "ట"కారనుతా!


బసవేశ ,పాహిమాం!

పద సమన్వయము

బసవేశ, టటకి ట టట్ట కిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్ట కిట్టటకిట టట్ట కిట్టట కిటట్ట ట ట, ఉన్ముఖ టంకృతి,
స్ఫుట+ఉత్కట

పటహ+ఆది, నిస్వన ,వియత్త ల, దిక్తట, తాటిత+ఆర్భట+ఉద్భట, పటుతాండవ+ అటన, "ట"కారనుతా!


పాహిమాం

ప్రతి పదార్థ ము

బసవేశ = ఓ బసవేశ్వరుడా !

టటకి ట టట్ట కట
ి ్ట టట కిట్టటటట్ట టకిట్టటట్ట కిట్టటకిట టట్ట కిట్టట కిటట్ట ట ట,= టకటక అను చప్పుళ్ల తో

ఉన్ముఖ = ఉత్+ముఖ= పైకి విస్త రిస్తు న్న

టంకృతి= ఆశ్చర్యముగొలుపు వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు కలిగిన

స్ఫుట= స్పష్ట మైన.

ఉత్కట= భయంకరమైన
పటహ=తప్పెట

ఆది= మొదలైన

నిస్వన = ధ్వనులతో

వియత్త ల=ఆకాశము

దిక్తట=దిక్+తట= దిక్కుల ప్రదేశములను తాకిన

తాటిత= కొట్ట బడిన

ఆర్భట=కేకలతో

ఉద్భట=అధికమైన

పటు తాండవ= నేర్పుకలిగిన నాట్యములో

అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !

ట"కారనుతా= టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొ గడబడినవాడా ! ఓ శివా !

మాం = నన్ను

పాహి= రక్షించు

తాత్పర్యము

ఓ బసవేశ్వరుడా ! నీ శివతాండవము టకటక అను చప్పుళ్ల తో పై పైకి విస్త రిస్తు న్న


వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు కలిగినది. స్పష్ట మైనది. భయంకరమైనది.తప్పెట మొదలైన
వాటి ధ్వనులతో ఆకాశము మరియు దిక్కుల అంచులను తాకుచున్నది.అనేక కేకలు
కలిగినది.అధికమైనది. నేర్పుకలిగిన నాట్యములోతిరుగువాడా! టకారము అను అక్షరముతో పలుమార్లు
ఈ పద్యంలో పొ గడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.

విశేషాలు

1. బసవేశ్వరుడు
కుల రహిత సమాజాన్ని 12 వ శతాబ్ద ంలో ప్రబో ధించి ఆచరించి చూపించినవాడు బసవేశ్వరుడు.
పాల్కురికి సో మనాథుడు ఈ బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆయననే ఈ పద్యంలో
సంబో ధిస్తు న్నాడు.

2. టంటంట టంటంట టటంట టంటం

కాళిదాసు పేరు మీదుగా ఈ ట కార సమస్య సంస్కృత సాహిత్యంలో ప్రసిద్ధం.

ఒక రోజు భోజరాజు టంటంట టంటంట టటంట టటంట టంటం " అని సమస్య పూరించమన్నాడు.. వెంటనే
కాళిదాసు ఇలా చెప్పాడు.

'రాజ్యాభిషేకే మద విహ్వాలయా:

హస్తా త్ చ్యుత: హేమ ఘటః యువత్యాః

సో పాన మార్గేషు కరోతి శబ్ద ం

టంటంట టంటంట టటంట టంటం"

(రాజుగారికి పరిచారికలు స్నాన ఘట్ట ం లో స్నానం చేయిస్తు న్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి
సౌందర్యం చూసి మై మరిచి పో యింది. ఆమె చేతి లోని బంగారు చెంబు జారి పో యి స్నానఘట్ట ం మెట్ల
మీదు గా దొ ర్లు తూ 'టంటంట టంటంట టటంట టంటం' అని మోత చేసింది. )

3. శివతాండవం

పార్వతీ పరమేశ్వరులు ఇద్ద రూ కలిసి కైలాస పర్వతంపై ఆనంద నాట్యం చేస్తా రట. పార్వతి చేసే నాట్యాన్ని
‘లాస్యం’ అంటారు. శివుడి నాట్యానికి ‘తాండవం’ అని పేరు.

జటాటవీగలజ్జ లప్రవాహపావితస్థ లే/గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |

డమడ్డ మడ్డ మడ్డ మన్నినాదవడ్డ మర్వయం/చకార చండతాండవం తనోతు నః శివః శివమ్(కదులుతున్న


తన జటలు అనే అరణ్యంలో సురగంగ యొక్క చిత్త డి(మిక్కిలి తడి) కలవాడుతన మెడలో వేలాడుతూ
కదులుతున్న సర్పముల వరుసలు కలవాడు డమ డమ ధ్వనులను వెలువరిస్తు న్న డమరుకము
కలవాడుభయంకరమైన తాండవము చేయుచున్నవాడు అయిన పరమ శివుడు మనందరికి శుభాన్ని
కలుగ చేయుగాక!) ఈ శివతాండవాన్ని పాల్కురికి సో మన టకారముతో మనకి సాక్షాత్కరింపచేసాడు.
----------------------------------------------------------------------------------------------------

పాల్కురికి సో మనాధుడు వ్రా సిన అక్షరాంక పద్యాలు- 02 వ పద్య ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు

డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జ గ

త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం!

ప్రతిపదార్థం

బసవేశ = ఓ బసవేశ్వరుడా !

డమరుగ= నీ చర్మవాద్య విశేషమునుండి

జాత =పుట్టిన

డండడ= డండడ అను చప్పుళ్ళతో

మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం


డమృం

డమృణ మృడండడం =మృడ (శివ)ధ్వనిని వెలార్చెడి మృడండ ....మృండమృణ మొదలయిన శబ్ద ములు

(అన్ని డ కార ధ్వనులు కావటం విశేషం)

కృతి=చేయుటను

విడంబిత=అనుకరించు

ఘూర్ణిత =తిరుగుడుపడినది

విస్ఫురత్=ప్రకాశించే, తళతళమని మెరిసే

జగత్= లోకమును
ప్రమథన =చిలుకు

తాండవ= నాట్యమునందు

అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !

డ"కారనుతా= డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొ గడబడినవాడా ! ఓ శివా !

మాం = నన్ను

పాహి= రక్షించు

తాత్పర్యము

ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే సమయంలో నీ డమరుకము నుండి


డండడ,మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడండమృం
డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి.ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో లోకాలు
తిరుగపడుతున్నాయి.. అటువంటి అద్భుతమైన డమరుక ధ్వనులు కలిగిన లోకాలను చిలుకు తాండవ
నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో పలుమార్లు ఈ
పద్యంలో పొ గడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు

విశేషాలు

డమరుకమును వాయించుటకు మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు.దానిని మణి


అంటారు.డమరుకమును కదలించినపుడు మణి డమరుకమునకు అటు ఇటు తగిలి డమరుకమును
మ్రో గిస్తు ంది.ఆ డమరుక మణుల కాంతులను పాల్కురికి ఈ పద్యంలో వర్ణించాడు.

డమరుకము :

శబ్ద గుణకము ఆకాశము. ఆకాశమునందు శబ్ద ము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము


మంత్ర జపము చేసినపుడు కాని, వినినపుడు కాని స్పందనలు / తరంగాలు ఏర్పడి. అవి శివ ఢమరుక
ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము
కలిగి తాండవము చేయును. దీనికి గుర్తు గానే శివుడు డమరుకను ధరించునని పెద్దలు చెబుతారు

---------------------------------------------------------------------------
పాల్కురికి సో మనాధుడు వ్రా సిన అక్షరాంక పద్యాలు- 03 వ పద్య ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢంమృణఢంమృణ ఢంఢణోద్ధ ణం

ధణనటన త్వదీయడమరూత్థ మదార్భట ఢంకృతి ప్రజృం

భణ త్రు టితాభ్రతార గణరాజ దినేశముఖగ్రహప్రఘర్

క్షణగుణతాండవాటన"ఢ"కారనుతా! బసవేశ పాహిమాం!

ప్రతిపదార్థం

బసవేశ = ఓ బసవేశ్వరుడా !

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢంమృణఢంమృణ ఢంఢణోద్ధ ణం

ధణ= ఢణ, ఢణ, ఉద్ధ ణ మొదలయిన చప్పుళ్ళతో

నటన = నాట్యము చేయు

త్వదీయ= నీ సంబంధమైన

డమరు= డమరుకము నుండి( చర్మవాద్యం)

ఉత్థ = పుట్టిన

మద= సంతోషపు

ఆర్భట = కేకలతో

ఢంకృతి=డో లుచప్పుళ్ళతో

ప్రజృంభణ =బాగా అతిశయించుచూ

త్రు టిత= తెగిన

అభ్ర=ఆకాశములోని

తారగణ= నక్షత్ర సమూహముల


రాజ = చంద్రు డు

దినేశ= దిన+ఈశ=సూర్యుడు

ముఖగ్రహ= మొదలుకొని మిగతా గ్రహముల

ప్రఘర్షణ = రాపిడి కలిగిన

గుణ= శ్రేష్ఠమయిన

తాండవ= తాండవనృత్యములో

అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !

ఢ"కారనుతా=ఢ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొ గడబడినవాడా ! ఓ శివా !

మాం = నన్ను

పాహి= రక్షించు

తాత్పర్యము

ఓ బసవేశ్వరుడా !ఓ పరమశివా ! ఢణ, ఢణ, ఉద్ధ ణ మొదలయిన చప్పుళ్ళతో నువ్వు తాండవం


చేయుచున్న సమయములో, నీడమరుకము నుండి పుట్టిన ధ్వనుల తీవ్ర వేగానికి ఆకాశములోని
నక్షత్రా లు తెగప
ి ో యాయి., చంద్రు డు, సూర్యుడు మొదలయిన గ్రహాలు కదిలిపో యి అటు ఇటు ఊగుతూ
ఒకదానికొకటి రాసుకొంటున్నాయి. ఇంతటి భయంకరమైన ధ్వనులు కలిగిన తాండవ నృత్యము
చేయువాడా ! ఢ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొ గడబడినవాడా !పరమశివా ! నన్ను
రక్షించు.

పాల్కురికి సో మనాధుడు వ్రా సిన అక్షరాంక పద్యాలు- 04 వ పద్య ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు

ఈ ఉత్పలమాల పద్యంలో “ణ”అను అక్షరాన్ని పలుమార్లు ప్రయోగిస్తూ దానిని శివుని తాండవానికి కవి
ముడి పెట్టా డు.

ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ

ణ్ణ ణ్మృణ నృత్త ్వదీయసుఖవిక్రమ జృంభణ సంచలన్నభో


ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన

ణ్ణ ణ్మృణ తాండవాటన "ణ"కారనుత బసవేశ పాహిమాం!

ప్రతిపదార్థం

ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ

ణ్ణ ణ్మృణ= ణ, ణ్మృణ అను శబ్ద ములతో

నృత్= ఆడుచూ

త్వదీయ= నీసంబంధమైన

సుఖ= సుఖమయిన(పవిత్రమయిన అని ఇంకొక అర్థం)

విక్రమ = పరాక్రమముతో

జృంభణ= అతిశయించుచూ

సంచలత్= కదులుచున్న(వణుకుచున్న)

నభః=ఆకాశము

ఉణ్ణ ణ్మృణ= ఉణ్ణ ణ, మృణ అను శబ్ద ములు చేయుచూ

దిక్= దిక్కులందు

క్వణత్= మ్రో గుచున్న(ప్రతిధ్వనించుచున్న

మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ = మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ మొదలగు

స్వనత్ = మ్రో గెడు

ణణ్మృణబసవేశ =ణణ్మృణ అను అక్షరముల సాన్నిహిత్యము కలిగిన ఓ బసవేశ్వరుడా !

తాండవ= తాండవనృత్యములో

అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !


ణ"కారనుతా =ణ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొ గడబడినవాడా ! ఓ శివా !

మాం = నన్ను

పాహి= రక్షించు

తాత్పర్యము

ఓ బసవేశ్వరా ! ఓ శివా ! “ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణణ్ణ ణ్మృణ ణ, ణ్మృణ
అను శబ్ద ములు

నువ్వు తాండవ నృత్యము చేయునప్పుడు పుడుతున్నాయి.

నీ సంబంధమైన పవిత్రమయిన తాండవ పరాక్రమముతో అతిశయిస్తూ ఆకాశము


కదులుచున్నది(వణుకుచున్నది)

ఉణ్ణ ణ, మృణ అను శబ్దా లు దిక్కులందు ప్రతిధ్వనించుచున్నవి.

మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ మొదలగు అక్షర శబ్ద ములు దిక్కులందు మారుమ్రో గుతున్నాయి.
ణణ్మృణ అను అక్షరముల సాన్నిహిత్యము కలిగిన ఓ బసవేశ్వరుడా ! తాండవనృత్యములో అటునిటు
తిరుగువాడా!ఓ పరమశివా !

ణ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొ గడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.

(ఇక్కడితో నాలుగు అక్షరాంక పద్యముల వివరణము సమాప్త ము.

పండితులు, పరిశోధకులకు విజ్ఞ ప్తి

శ్రీశైల మల్ల న్నను పాల్కురికి సో మన్న అచ్చులు,హల్లు లతో నుతించాడని చెబుతున్న ఒక


స్తో త్రా న్ని('అ'ఖిల లోకాధార

'ఆ'నంద పూర/'ఇ'న చంద్ర శిఖి నేత్ర /'ఈ'డితామల గాత్ర......)మరియు ఒక పద్యాన్ని ( అమిత యశస్క
ఆద్యయన ఇద్రు చి ఈశ్వర ....) ఈరోజు నేను చూసాను.నిజంగా ఇవి పాల్కురికి సో మన్నవేనా?ఏదన్నా
గ్రంథంలో ఇవి ఉన్నాయా?

లేక కేవలం జనశ్రు తిలోనే ఉన్నాయా?ఎవరైనా ప్రా మాణికసంస్థ లు వీటిని అచ్చువేసారా?

You might also like