Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

అరుదైన జానపద పాట!

:--

ప్రముఖ కథారచయిత రావి ఎన్ అవధానిగారితో పరిచయానికి వారంరోజుల

వయస్సుకూడా లేదు కానీ ఎన్నో ఏళ్ళో పరిచయంలాగానే సాగుతున్నాయి మాటలు.

నిన్న మధ్యాహ్నం ఉన్నట్లు ండి వాట్సప్ లో ఓ పో స్టు పెట్టా రు. అదేంటంటే, అడవి

బాపిరాజు గారు 1940 ప్రా ంతంలో రాసిన "కొండొండో రి సెరువుల కాడా......" పాటను 1970

ప్రా ంతంలో ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి మేనకోడళ్ళు అమెరికాలో

ఆలపించారు. అయితే ఈ పాటకు సంబంధించి మా నాన్నగారు (యామిజాల పద్మనాభ

శాస్త్రిగారు), అన్నా, ఆ రుద్ర గారు (భాగవతుల సూర్యనారాయణశాస్త్రిగారు. ఆరుద్రగారికి

స్వయానా అన్నయ్య) మధ్య ఐడవి బాపిరాజు గారు ఏ అర్థ ంతో రాసి ఉండొ చ ్చో అనే

దానిపై చర్చ జరిగిందట.ఒకరు ఒకటంటే మరొకరు మరొక కోణంలో అర్థ ం చెప్పడం. వీరి

మధ్య జరిగన
ి చర్చకు ప్రత్యక్షసాక్షులు రావి ఎన్. అవధానిగారు, ఆయన బావ జి. విజయ్

గారు. ఇంతకూ వారి మధ్య సరైన భావం పుట్టిందో లేదో తెలీదుకానీ ఈ పాటకు రచయిత

తాడేపల్లి పతంజలిగారి వివరణ వెలువడినట్లు తనకు తెలియడంతోనే అవధానిగారు

నాకా అర్థా న్ని పంపారు.

1983 వ సంవత్సరంలో ఆంధ్రపద


్ర ేశ్ సంగీత అకాడమీ ప్రచురించిన జానపద గేయాలలో

ఈ పాట చివరిది. ఆ పుస్త కానికి సంపాదకురాలు కళాప్రపూర్ణ శ్రీమతి ఎం.

అనసూయాదేవిగారు.ఇక దీని భావమేంటో చూద్దా ం......ఇది ప్రధానంగా ప్రతీకాత్మకంగా

చమత్కారపు బాటలో నడిచిన పాట.11 చరణాల ఈ పాటలో మొదటి రెండు పంక్తు లు

ముగ్గు రిని గురించి చెబుతుంటే , మిగిలిన రెండు పంక్తు లు రెండింటిని గూర్చి


చెబుతుంటాయి. విచిత్రమేమిటంటే ఆఖరుగా ఉన్న రెండు పంక్తు లు మొదటి మూడింటి

ఫలితాల గురించి వివరిస్తు ంటాయి. నా ఊహకు తోచిన అర్థా లు ఇవి అంటూ

తాడేపల్లివారు చెప్పిన మాటలు ఈ కింద చదువుకోవచ్చు.

1. కొండొండో రి సెరువుల కాడా సే సిరి ముగ్గు రు ఎగసాయం యొకడికి (త్రిమూర్తు లు 1. బ్రహ్మ, 2.


విష్ణు వు, 3. మహేశ్వరుడు.) కాడి లేదు రెండు దూడాలేదు అనంతకోటి బ్రహ్మాండాలలో (కొండొండో రి
సెరువుల) త్రిమూర్తు లు సృష్టి వ్యవసాయం మొదలుపెట్టా రు. వ్యవసాయానికి కాడి, దూడా ఉండాలి కదా !
కాని వీరి వ్యవసాయానికి అవిలేవు. (మిగతా చరణాలన్నింటిలోను ఇదేరీతిగా సమన్వయించుకోవాలి)

2. కాడిదూడా లేనెగసాయం పండెను మూడు పంటాలొకటి (1. సత్త ్వము, 2. రజస్సు, 3. తమస్సు) వడ్లు
లేవు రెండు గడ్డీ లేదు పంటలకి వడ్లు , గడ్డీ ఉండాలి కదా ! కాని 1. సత్త ్వము, 2. రజస్సు, 3. తమస్సు
అను పంటలకు వడ్లు , గడ్డీ లేవు.

3. వడ్లు గడ్డీ లేని పంటా ఇశాఖపట్నం సంతలో పెడితే( విశాఖ= ఔన్నత్యపు శాఖలు లేని సంసారం) వట్టి
సంతేకానీ సంతలో జనం లేరు ( సత్వ రజస్త మోగుణాల పంటను శాఖలు లేని సంసారంలో పెట్టా రు. జనం
వాటిలో మునిగిపో యారు. ప్రపంచం ఉన్నది కాని ప్రపంచంలో సంసారపు ఊర్ధ ్వమూలాన్ని
ఆలోచించటానికి ఎవరూ లేరని భావం)

4. జనంలేని సంతలోకి వచ్చిరి ముగ్గు రు షరాబు లొకరికి (షరాబులు = కంసాలులు 1. అగ్ని, 2.


వాయువు, 3. సూర్యుడు.) కాళ్ళు లేవు రెండు సేతుల్లేవూ

5. కాళ్ళు చేతులు లేని షరాబు తెచ్చిరి మూడు కాసూలొకటి ( త్రిదండాలు 1. వాగ్ద ండము (మౌనము),
2. మనోదండము (ఆశ లేకుండుట), 3. కాయదండము (స్వధర్మాచరణము)) వొలాల్లొ ల్ల దూ రెండు
సెల్లా సెల్లవు ( త్రిదండాలకు ఈలోకంలో చెల్లు బాటు లేదని భావం)

6. ఒల్లా సెల్లని కాసులు తీసుకు ఇజయనగరం ఊరికిబో తె ఒట్టి ఊ రేగాని ఊళ్ళో జనం లేరు ( విజయ
అనగా మిక్కిలి గెలుపు. సహస్రా ర చక్ర భేదనమనే ఊరు. ఈలోకంలో చాలామంది దృష్టిలో పనికిరాని ఆ
త్రిదండాలను ఆచరించి ఉత్త మ యోగాభ్యాసంతో ఆ సహస్రా ర చక్ర భేదనమనే ఊరుకు వెళదామని చూస్తే
ఆ ఊరు చేరిన వారు లేరు. యోగులెవరు లేరని భావం)

7. జనం లేని ఊల్లో ను ఉండిరి ముగ్గు రు కుమ్మల్లొ కడికి (త్రికాలాలు 1. భూతకాలము, 2.


భవిష్యత్కాలము, 3. వర్త మానకాలము.) తల లేదు - రెండు కి మొలాలేదు ( ఉత్త మ యోగాభ్యాసము చేసే
వారు ఎవరూ లేకపో యినా తలా మొలా లేని- అనగా ఆకారం లేని త్రికాలాల కుమ్మర్లు వస్తూ నే ఉంటారని
భావం. )

8. తల మొల లేని కుమ్మర్లు చేసి రిమూడు భాండాలొకటికి (1. భూలోకము, 2. స్వర్గ లోకము, 3. పాతాళ
లోకము.) అంచులేదూ . రెంటికి అడుగు లేదు ( కాలం సృష్టించిన లోకాలకు అంచులేదు. అడుగు లేదు.)

9. అంచు అడుగు లేని భాండాల్లో ఉంచిరి మూడు గింజలొకటి (త్రిదో షాలు శ్లేష్మం, పిత్తం, వాతం.) ఉడకా
ఉడక దు రెండు మిడకామిడకావూ (ఈలోకాలలో జీవులతో ఆడుకోవటానికి కాలం శ్లేష్మం, పిత్తం, వాతం
అను మూడు గింజలను ప్రతి జీవిలోను ప్రవేశపెట్టింది)

10. ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గు రు సుట్టా లొకడికి (1. మనస్సు, 2. వాక్కు, 3.
కర్మ. త్రికరణాలు) అంగు ళ్లే దూ రెండు మింగు ళ్లే దూ (శ్లేష్మం, పిత్తం, వాతం అను అనువాటిని త్రికరణాలు
జీవుల చేత అను భవింపచేస్తు న్నాయి)

11. అంగుడుమింగుడు (= లోకుత్తు క) లేని సుట్టా లు తెచ్చిరి మూడు సెల్లా లొకటి (1. ధర్మము, 2.
అర్థ ము, 3. కామము.-త్రిగణము) సుట్టు లేదు , రెండు మద్దెలేదు. (అంచుల్లేని సన్నని బట్ట ను సెల్లా
అంటారు. 1. ధర్మము, 2. అర్థ ము, 3. కామము.-త్రిగణములు అటువంటివి సెల్లా లు. వీటిని తెచ్చిన వారు
త్రికరణాలు. 1. ధర్మము, 2. అర్థ ము, 3. కామములకు చుట్టూ లేదు. అనగా ఒక పరిధిలేదు. మధ్య
లేదు. )

ఆంధ్రు లముందుకొచ్చిన ఈ అరుదైన పాట ఉత్త రాంధ్ర జానపద శైలికి అద్ద ం పట్టేది. ఇంతటి ఆసక్తికరమైన
విషయాన్ని పంచుకున్న అవధానిగారికి ధన్యవాదాలు.-

You might also like