Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

ఈ పాట అనవసరంగా పాడయిపోయిందే అని మీరు బాధపడ్డ సందర్భం ఏమిటి?

ఈ మధ్య కాలంలో ఒక పాట విషయంలో మాత్రం సాహిత్యానికి తగ్గ న్యాయం


చిత్రీ కరణలో జరగలేదని అనిపించింది. అది అరవింద సమేత వీరరాఘవ
చిత్రంలోని పెనివిటి పాట.
ఇప్పుడు నేను త్రి విక్ర మ్ గారు ఎలా తీశారు? అన్న దానిపై ఎలాంటి విమర్శ
చెయ్యట్లే దిక్కడ. ఎందుకంటే దర్శకుడిగా ఆయనకు సవాలక్ష టెన్ష న్స్ ఉంటాయి. అది
నేను అర్థం చేసుకోగలను. ఎన్నో పనులు ఉంటాయి. ఆయనకు క్ష ణం తీరిక కూడా
దొరకని రోజులు ఉంటాయి.
ఇక్కడ కేవలం నేను నా విషువలైజేషన్ ను మాత్ర మే పంచుకుంటున్నాను. ఆ పాటలోని
సాహిత్యానికి, సంగీతానికి మైమరచిపోయి ఇలా ఉండుంటే బావుండు అని
ఊహించుకున్నాను.
రచన - రామజోగయ్య శాస్త్రి గారు
సంగీతం - థమన్ గారు
గాత్రం - కాలభైరవ గారు

పెనివిటి సాంగ్ - నా విషువలైజేషన్


వీరరాఘవ తల్లి గారు తన భర్త గురించి రోజూ పడే తపనని వాళ్ళ ఇంటికి దగ్గ ర్లో నే ఉండే
ఒక సాధువు గమనిస్తూ ఉంటాడు. ఆవిడ రోజూ ఫలానా సమాయానికి మా శ్రీ వారు
వస్తా రు అని ఇంటి గుమ్మం దగ్గ ర ఎదురు చూడటం, ఆయన రాకపోవటం షరా
మామూలే అన్నట్టు ఉంటుంది. ఇంట్లో పని వాళ్ళు, వీర రాఘవ నాయనమ్మ గారు, తోడి
కోడళ్ళు అందరూ ఈవిడ గురించి విచార పడుతూ ఉంటారు. ఈ రకంగా నిద్రా హారాలు
మానేసి తన భర్త కోసం ఎదురు చూసే ఈవిడ ఏమైపోతుందా అని భయపడుతూ
ఉంటారు.
ఒక రోజు రాత్రి ఆవిడకి భర్త మీద బెంగ ఎక్కువైపోతుంది. తనకి తెలియకుండానే ఏడుపు
లోపలి నుండి తన్నుకొస్తూ ఉంటుంది. అదో రకమైన మనేదా(మనోవ్యథ).
రాత్రి పది గంటలు అవుతోంది. ఆవిడ ఇంటి గుమ్మం దగ్గ రే నిలబడి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు
ఇంకిపోగా ఏటో చూస్తూ ఇంటి గుమ్మానికి తన తల వాల్చి నిద్ర పట్ట కపోవటంతో తన
చుట్టూ శూన్యం ఆవరించినట్టు గా అనిపిస్తూ ఉన్న సమయంలో ఆ ఇల్లా లి బాధని
అప్పటి దాకా చూసిన సాధువు గళం విప్పుతాడు.
నిద్ద రని ఇరిసేసి
రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో
సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసిన రారా
పెనిమిటి ఎన్ని నాళ్ళయినాదో
నిను జూసి కళ్లా రా
ఎన్నెన్నీ నాళ్ళయినాదో
నిను జూసి కళ్లా రా
తినటానికి రాగి సంగటి, ఆ చల్ల టి రేయిలో కప్పుకోవటానికి కంబళి పక్కనే ఉన్నా ఆ
సాధువు దృష్టి అంతా ఆ ఇల్లా లి హృదయవేదన మీదనే కేంద్రీ కృతం అయ్యి ఉంది.
ఆవిడ అనుభవించే ఆవేదనకి ఆ రాత్రి పూట తనే సాక్షి అయ్యాడు. ఆ శివుడికి
బాధేసిందో ఏమో ఈ సాధువు రూపంలో ఆ ఇల్లా లి బాధను ఎలాగైనా సరే దూరం
చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
ఆ చీకటి రాత్రి లో పక్కనే ఉన్న చలిమంటల వెలుగులో నిప్పురవ్వలు పైకి ఎగసి ఎగసి
పడుతూ ఉండగా శివుడేదో ఆజ్ఞ వేసినట్టు గా పాడుతూ నృత్యం చేస్తు న్నాడా సాధువు.
చిమ్మటి చీకటి
కమ్మటి సంగటి
ఎర్ర గా కుంపటి
ఎచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి
కోయిలే ఒక్కటి
గుండెనే గొంతు సేసి
పాడతాంది రారా పెనిమిటి
చిమ్మటి చీకటి
కమ్మటి సంగటి
ఎర్ర గా కుంపటి
ఎచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి
కోయిలే ఒక్కటి
గుండెనే గొంతు సేసి
పాడతాంది రారా పెనిమిటి
గుండెనే గొంతు సేసి
పాడతాంది రారా పెనిమిటి
వీరరాఘవుడు ఆ సాధువు నృత్యాన్ని పైనున్న తన గది కిటికీలో నుండి చూస్తూ
కిందికొస్తా డు. అమ్మ ఇంకా అన్నం తినలేదని వాళ్ళ నాయనమ్మ చెప్పగా తెలుసుకున్న
వీరరాఘవుడు కంచంలో అన్నం కలుపుకుని తీసుకొస్తా డు. అమ్మకు ముద్ద లు
తినిపిస్తా డు తన చేతులతో. వీరరాఘవుడి కళ్ళలోకి ప్రే మగా చూస్తూ తన భర్త గుర్తు కొచ్చి
ఏడ్చేస్తుంది ఆవిడ. వీరరాఘవుణ్ణి గుండెలకు హత్తు కుంటుంది.
ఇదంతా చూస్తు న్న సాధువుకు ఏదో అర్థం అయినట్టు అనిపించి మళ్ళీ పాట
అందుకుంటాడు.
పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని
సూసి సూడకా సులకన సేయకు
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రారా పెనిమిటి
తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రారా పెనిమిటి
తనకు తోచిన రీతిలో నాట్యమాడుతున్న ఆ సాధువును చుట్టూ చేరిన కొద్ది మంది
ఆసక్తి గా చూస్తూ ఉంటారు. డమరుకం మోగిస్తూ నాట్యం చేస్తు న్న శివునికి మల్లే ఆ
సాధువు నాట్యం చేస్తూ ఉంటాడు. ఏమంటే చూసేవాళ్ల కు అది శివ తత్త్వంలా
కనిపించదు. సాధువుకు మాత్ర మే ఆ శివ చైతన్య శక్తి అనుభూతం అవుతూ
ఉంటుంది.
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో
వేళకు తింటివో ఎట్టా నువ్వుంటివో
ఏట కత్తి తలగడై ఏడ పండుకుంటివో
నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి
నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి
గతాన్ని అంతా ఒక్కసారి గుర్తు కు తెచ్చుకున్న వీరరాఘవుడికి ఆ రోజు ఆ సాధువు అలా
ఎందుకు నృత్యం చేసాడో, ఎందుకు పాడాడో ఇప్పుడు అర్థం అయ్యింది. అందుకే మళ్ళీ
ఒక్కసారి ఆ పాటని గుర్తు చేసుకుంటూ కొన్ని పంక్తు లు తన గొంతుతో పాడతాడు. ఆ
పాట, ఆ సన్నివేశం బాల్యంలో వేసిన బలమైన ముద్ర ని మరచిపోలేక ఆ సాధువుకు
కృతజ్ఞ తతో గద్గ ద స్వరంతో అమ్మ ఎన్ని కష్టా లు పడి తనను పెంచిందో గుర్తు
చేసుకుంటూ పాడతాడు.
నిద్ద రని ఇరిసేసి
రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో
సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
పెనిమిటి ఎన్ని నాళ్ళయినాదో
నిను జూసి కళ్లా రా
ఎన్నెన్నీ నాళ్ళయినాదో
నిను జూసి కళ్లా రా

ఇదే విధంగా పాట చిత్రీ కరణలో సాహిత్యానికి సరైన న్యాయం జరగలేదనిపించిన మరొక
పాట సామజవరగమనా.
అలవైకుంఠపురంలో చిత్రంలోని సామజవరగమనా పాటను ఇప్పటివరకు ఎన్ని సార్లు
వినుంటానో నాకే తెలియదు. అంత బాగా రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

పాటను విన్న దగ్గ రి నుండి ఎప్పుడెప్పుడు తెర పై చూద్దా మా అన్న ఆరాటం ఉండేది.
తీరా చూసాక ఆ పాటను త్రి విక్ర మ్ గారు వేరే విధంగా అనుకోవటం చేత అలా దాన్ని
పారిస్ లో తీశారని అర్థం అయింది. సినిమాలో బంటు పాత్ర భావాలకు సరిపోయేలానే
ఆ పాట చిత్రీ కరణ జరిగింది. ఇందులో నేనెలాంటి విమర్శ చెయ్యదలచుకోలేదు.
కానీ, మొట్ట మొదటి సారి ఆడియోలో ప్ర ప్ర థమంగా సామజవరగమనా గీతాన్ని ఒక
సంకీర్త నలా ఎన్నో సార్లు విని, విని ఎంతో ఊహించుకున్న సాహితీప్రి యులకు మాత్రం
నిరాశే మిగిలిందని చెప్పక తప్పదు.
అలాంటి వాళ్ళల్లో నేనూ ఒకడిని. అందుకే ఇక్కడ ఆ పాట తాలూకు విషువలైజేషన్ ను
నేను మీ అందరితో పంచుకుంటున్నాను. ఆ పాట ఎప్పటికీ నా మదిలో చిరస్థా యిలో
నిలిచిపోతుంది. అంత బాగా పాడారు సిడ్ శ్రీ రామ్ గారు. థమన్ గారు ఎంతో గొప్పగా
సంగీతాన్ని అందించారు. ఇక సీతారామ శాస్త్రి గారి గురించి ప్ర త్యేకించి చెప్పేదేముంది!
ఆయన అనుకోవాలి అంతే. ఇలాంటి అద్భుతాలు అలా జారిపడతాయి ఆయన
మస్తి ష్కంలో నుండి.
సామజవరగమనా - నా విషువలైజేషన్
ఒక వెయ్యి సంవత్సరాల క్రి తం పురాతనమైన వేంకటేశుని ఆలయం ఒకటి ఉంటుంది.
ఆ గుళ్లో బ్ర హ్మ ముహూర్తంలోనే స్వామి వారిని అనేక రకాలైన సుగంధ ద్ర వ్యాలతో
అర్చకులు సేవించుకుంటారు. ప్ర తీ రోజు అదే సమయంలో మన కథానాయిక
కుసుమాలను తీసుకుని స్వామి వారికి సమర్పించటానికి వస్తూ ఉంటుంది. సరిగ్గా
అప్పుడే తులసి మాలలు ఇవ్వటానికని మన కథానాయకుణ్ణి ఆలయానికి పంపిస్తా రు.
అర్చకులు అందరూ ఒక వరుసలో ఆ సుగంధ ద్ర వ్యాలను బిందెల్లో నింపుకుని తమ
భుజస్కంధాల పై మోసుకుంటూ ఆ వేంకటేశుని స్మరిస్తూ వస్తూ ఉంటారు. మన
కథానాయకుడు ఆ వరుసలో చివరి వాడిగా ఉంటాడు. ఎందుకంటే మొదటిగా స్వామి
వారిని చూసే అదృష్టం వారిదే. అది ఆ ఆలయంలోని కట్టు బాటు.
ఆ సమయంలో కథానాయిక, కథానాయకుని వెనుక నుండి ముందుకొస్తుంది. ఏదో
పరిమళం ఇటుగా కదిలి వచ్చినట్టు అనిపించి మన కథానాయకుడు కిందకు చూసే
సరికి గంధపు ముద్ర లుగా ఆ అమ్మాయి పాదాలు కనబడతాయి. స్వామికి కుసుమాలు
తెచ్చివ్వాలనే తొందరలో గంధము ఒక రాశిగా పోసి ఉంచిన చోటును చూసుకోకుండా
అడుగులు వేసినట్టుంది అందుకే పాదాలకు గంధం అంటినట్టుంది అనుకుని తనలో
తాను నవ్వుకుంటాడు కథానాయకుడు.
నేల తడిగా ఉండటంతో కథానాయిక వేసే ప్ర తి అడుగు గంధపు ముద్ర లా ఏదో అచ్చు
గుద్ది నట్టు గా ఉంటుంది. ఆ అడుగులనే చూస్తు న్న మన కథానాయకుడు ఆ అమ్మాయి
వెనకే ఉంటూ ఆ పాద ముద్ర లనే గమనిస్తా డు.
ఈ అమ్మాయి గురించి ఎన్నో రోజులుగా వింటూ ఎన్నో కలలు కంటున్న మన
కథానాయకుడు ఆ పాదముద్ర లను చూస్తూ ఉంటే ఆ ముద్ర లలోని గంధం మొత్తం
చక్కని పరిమళంలా మారిపోయి గాలిలో పయనిస్తూ ముందుకు పోతూ ఉంటుంది.
ప్రే మికుడి చూపుల స్పర్శలోని వేడికి ఆవిరైపోతున్న గంధపు పరిమళం అది.
అప్పుడు మొదలవుతుంది ఈ పాట.
నీ కాళ్ళని పట్టు కు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కాళ్ళని పట్టు కు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
Cut to
ప్ర స్తు తం - కరెంట్ డే
కథానాయిక ఆఫీస్ కి బయలుదేరాలనే తొందరలో అద్దం ముందర రెడీ అవుతూ
ఉంటుంది. ఐ లాషెస్ కి మస్కరా తో టచ్ అప్ ఇస్తూ ఉంటుంది. అంతలో ఎక్కడినుంచో
వచ్చిన దుమ్ము ఆ అమ్మాయి కళ్ళలో పడటంతో కళ్ళు నులుముకుంటుంది.
అదే సమయంలో తన ఇంటి దగ్గ ర ఆఫీస్ కెళ్ళాలనే తొందరలో టిఫిన్ చేస్తు న్న మన
కథానాయకుడు డెస్క్టాప్ లో కథానాయిక పిక్చర్ నే చూస్తూ తింటూ ఉంటాడు. ఘాటు
తగిలి పొలమారినట్టు గా అనిపించటంతో కళ్ళల్లో నీళ్లొ స్తా యి.
నీ కళ్ళకి కావలి కాస్తా యే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్ర గా కంది చిందేనే సెగలు
ఆఫీస్ కి చేరుకోగానే ఆ రోజు చల్ల గా ఎక్కడినుంచో వస్తు న్న గాలి కథానాయిక ముంగుర్ల
పైకి వీస్తూ ప్రి యుడిలా చేతి వేళ్ళతో సవరిస్తు న్నట్టు గా అనిపిస్తుంది. ఒక్క నిమిషం
ఉలిక్కిపడి చూస్తుంది. ఎవ్వరూ ఉండరు. చల్ల గాలి అని తెలుసుకుని సిగ్గు పడుతుంది.
ఈ దృశ్యాన్ని దూరం నుండి గమనిస్తు న్న మన కథానాయకుడు కూడా సిగ్గు పడుతూ
చల్ల గాలికి థాంక్స్ చెప్పుకుంటాడు.
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టే స్తే ఎలా నిట్టూ ర్చవటే నిష్ఠు రపు విలవిలలు
అదే సమయంలో శ్రీ వారి ఆలయంలోకి సుగంధ ద్ర వ్యాలతో అడుగుపెడుతున్న
అర్చకులు. వారి వెనకే శ్రీ వారికి కుసుమార్చన కోసం మన కథానాయిక. ఆలయంలోకి
అడుగుపెట్టే ముందే అక్కడ ఉంచిన ఒక అద్దంలో నుండి మన కథానాయిక మోమును
వెనక నుండే చూస్తా డు మన కథానాయకుడు.
ఆనందంతో స్వామికి దండం పెట్టు కుంటాడు బయటి నుండే.....
సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
ఆఫీస్ లో అడుగుపెట్టే ముందు మొట్ట మొదటిగా ఆ అమ్మాయి ముఖారవిందాన్ని
చూడటం మన కథానాయకుని అలవాటు. ప్ర తీ రోజు అంతే. అందుకే ఎప్పటిలానే ఈ
రోజు కూడా కథానాయిక వెనకాలే వస్తా డు తన లాప్టా ప్ బ్యాగ్ తో.
లిఫ్ట్ డోర్ దగ్గ ర ఆ అమ్మాయి నిలబడి ఉంటే, వెనకే మన కథానాయకుడు నిలబడి
ఉంటాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకుంటుంది. అందులో నుండి ఎవరో కొంత మంది
ట్రా న్స్పరెంట్ మిర్ర ర్ గ్లా స్ తీసుకొస్తూ ఉంటారు. ఆ అద్దంలో నుండి మన కథానాయిక
మొహం కనబడుతుంది కథానాయకుడికి.
ఆనందంతో చిరునవ్వు నవ్వుతాడు. తను కూడా నవ్వుతుంది.
ఇదంతా మనకు అద్దంలోనే కనిపిస్తుంది.
సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
ఆ అమ్మాయి వెనకే అనుసరిస్తూ ఆఫీస్ లోకి అడుగుపెడుతున్న కథానాయకుడు.
ఆ అమ్మాయి అందానికి మైమరచిపోయి తులసి మాలతో గుళ్ళోకి అడుగుపెడుతున్న
కథానాయకుడు.
నీ కాళ్ళని పట్టు కు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
కథానాయిక ప్ర తీ రోజు అదే సమయానికి అర్చన కోసం కోసిన పూలతో ఆలయంలోకి
అడుగుపెడుతుంది.
కట్ టు ప్రె సెంట్....
కథానాయిక కార్పొరేట్ ఆఫీస్ లో అందర్నీ విష్ చేస్తూ తన కేబిన్ లోకి
అడుగుపెడుతుంది.
అక్కడ భక్తి తో గుళ్ళోకి అడుగుపెడితే....ఇక్కడ చేసే పని పైన శ్ర ద్ధ తో ఆఫీస్ లో
అడుగుపెడుతుంది.
మల్లె ల మాసమా మంజుల హాసమా
ప్ర తి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పింఛమా విరుల ప్ర పంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంట ఎన్నెల వశమా
మన కథానాయకుడి విరహ వేదన మాత్రం రెండు సందర్భాలలోనూ ఒక్కటే.
అక్కడ స్వామి వారిని సేవిస్తూ కథానాయిక మన కథానాయకుణ్ణి దూరం పెడుతుంది.
ఇక్కడ ప్రొ ఫెషనల్ గా ఉంటూ నిత్యం పని గురించిన ఆలోచనల్లో నే తలమునకలై
ఉంటూ తనని ఆరాధిస్తు న్న కథానాయకుణ్ణి అస్సలు పట్టించుకోనట్టే ప్ర వర్తి స్తోంది.
అరె
నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా
ఆలయం బయటే నిలబడ్డ మన కథానాయకుడు
దూరంగా గర్భగుడిలో కనబడుతున్న ఆ మూలవిరాట్ ని, ఆయనకు మరింత దగ్గ రగా
వెళ్తో న్న కథానాయికను చూస్తూ …..
సామజవర గమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
ఆఫీస్ ఎంట్ర న్స్ బయటే నిలబడ్డ మన కథానాయకుడు
తన క్యాబిన్లో కి అడుగుపెడుతూ తన పనికి మరింత దగ్గ రవుతున్న కథానాయికను
చూస్తూ ……
సామజవర గమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
క్లా సికల్ డాన్స్ లా అంటే ఒక నృత్యరూపకంగా మన కథానాయకుని అంతరంగ
ఆవిష్కరణ జరుగుతుంది. కథానాయిక తన చేతిని శ్రీ వేంకటేశుని చేతిలో ఉంచి తను
మోకాళ్ళ మీద నిలబడి భక్తి , నమ్ర తతో తల దించుకుని ఉంటుంది. ఆ అమ్మాయి వైపే
ఆరాధనాభావంతో చూస్తూ తనకు తోచిన రీతిలో నృత్యం చేస్తూ ఉంటాడు మన
కథానాయకుడు.
నీ కాళ్ళని పట్టు కు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
ఆఫీస్ లో క్ల యింట్ తో ప్రా జెక్ట్ డెలివరీ సక్సెస్ అవ్వటంతో మన కథానాయకుడు
అడిగినట్టే కాఫీ డేట్ కి రావటానికి అంగీకరిస్తుంది మన కథానాయిక .
క్రి తం జన్మలలో దక్కని అదృష్టం ఈ జన్మలో దక్కటంతో ఎంతో భావోద్వేగానికి
లోనవుతాడు మన కథానాయకుడు.
కాఫీ తాగుతున్నా తననే చూస్తూ ఉంటాడు.
దూరంగా ఎక్కడో అవుట్ ఫోకస్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది.
నీ కళ్ళకి కావలి కాస్తా యే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్ర గా కంది చిందేనే సెగలు
కాఫీ తాగటం అయిపోయిన తర్వాత కథానాయిక స్వామి వారిని చూస్తూ , "నీ వల్లే ఈ
ప్రా జెక్ట్ సక్సెస్ అయింది స్వామి", అని లోలోపల అనుకుంటూ దండం పెట్టు కుంటుంది.
మన కథానాయకుడు విచిత్రంగా స్వామి వారినే చూస్తూ ఉంటాడు.
ఎన్ని జన్మలైనా సరే అందమైన ఆ అమ్మాయికి ఆకర్షి తుణ్ణి అవుతున్నాననే తను
అనుకుంటున్నాడు కానీ, ఆ అమ్మాయి అందంతో తను దగ్గ రవుతున్నది భగవంతుని
తత్వానికే నన్న విషయం గుర్తించలేకపోతున్నాడు అన్నది అంతర్లీ నంగా దాగున్న సత్యం.

You might also like