Fibonacci Hemachandra

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

హేమచంద్ర ఎవరు? ఆయనకి, ఫిబొనాచీకి మధ్య సంబంధం ఏమిటి?

హేమచంద్ర పేరు నేను మొట్ట మొదట విన్నది కేవలం అయిదారేళ్ళ క్రి తం! ఈయన పేరు
మంజుల్ భార్గ వ చెబుతూ ఉండగా విన్నాను – అదీ అతను తబలా వాయిస్తూ చెబుతూ
ఉంటే విన్నాను.
మంజుల్ భార్గ వ ఎవరు? ఇతని అంకురం రాజస్థా న్‌లో. పుట్ట డం కెనడాలో.
అమెరికాలోని ప్రి న్స్‌టన్ విశ్వవిద్యాలయంలో గణితంలో ఆచార్యుడు. వయస్సులో మా
అబ్బాయి అంత ఉంటాడు. ఇతనికి ప్ర తిష్ఠా త్మకమైన ఫీల్డ్స్ మెడల్ (Fields Medal)
వచ్చింది. కుంభకోణంలో ఉన్న శాస్త్ర విశ్వవిద్యాలయం వారు ఇచ్చే రామానుజన్ పతకం
వచ్చింది. చాలా నిగర్వి. ఇతనిని చూస్తూ న్నంతసేపూ “మనవాడే!” అనే భావన
కలిగింది కాని “రాజస్థా నీ వాడు” అనే భావన స్మృతిపథంలో మెదలనే లేదు. గాంధీని
తలుచుకున్నప్పుడు “మన గాంధీ” అనే అనిపిస్తుంది కాని “గుజరాతీ బనియా”
అనిపించదు – ఎందువల్ల నో. రామానుజన్ అంతటివాడు కాకపోయినా, ఆ కోవకి
చెందిన వాడే ఈ మంజుల్ భార్గ వ! ఇతను చెప్పేడు హేమచంద్ర కథ – తబలా ముందు
కూర్చుని!!
ఆచార్య హేమచంద్ర (సా. శ. 1088 – 1173) పండితుడు, కవి, గణిత శాస్త్ర వేత్త .
తాత్త్వికుడు, యోగి, చందస్సులో దిట్ట – సూక్ష్మంగా చెప్పాలంటే బహుముఖ
ప్ర జ్ఞా వంతుడు. ఈ కవికి గణితంతో ఏమి పనిట?
గణితానికీ, ఛందస్సుకీ అవినాభావ సంబంధం ఉంది. ఒక పద్య పాదం చదవడానికి n
మాత్ర ల కాలం పడుతుందని అనుకుందాం. పాదాలలో ఉండే అక్ష రాలలో గురువులు,
లఘువులు అని రెండు రకాలు. లఘువు అనేది ఒక మాత్రా కాలంలో ఉచ్చరించగలిగేది.
గురువు అనేదానిని ఉచ్చరించడానికి రెండు మాత్ర ల కాలం పడుతుంది. ఒక పాదంలో
గురు-లఘువులు ఎన్నెన్ని ఉన్నా ఆ పాదం చదవడానికి (లేదా పాడటానికి) పట్టే కాలం
n మాత్ర లే. అలాంటప్పుడు ఒక పద్య పాదంలో గురు-లఘువులని ఎన్ని విధాలుగా
అమర్చవచ్చు? ఇదీ హేమచంద్ర వేసిన ప్ర శ్న!
మచ్చుకి n మాత్ర ల పొడుగు ఉన్న పాదంలో గురు-లఘువుల అమరికలు f(n)
ఉన్నాయని అనుకుందాం. ఈ పాదం చివర గురువైనా ఉండొచ్చు, లఘువైనా ఉండొచ్చు
కదా. మాటవరసకి ఈ పాదం లఘువుతో అంతం అయిందని అనుకుందాం. అంటే ఒక
మాత్ర ఖర్చు అయిపోయింది. ఇంకా (n-1) మాత్ర ల కాలం మిగిలింది. మన అనుకోలు
ప్ర కారం ఈ మిగిలిన (n-1) మాత్ర ల వ్యవధిలోనూ f(n-1) గురు-లఘువుల అమరికలు
ఉండొచ్చు. మన పాదం గురువుతో అంతం అయి ఉంటే దానికి రెండు మాత్ర ల కాలం
ఖర్చు అయిపోతుంది. అప్పుడు (n-2) మాత్ర ల కాలం మిగులుతుంది కనుక ఈ
వ్యవధిలో f(n-2) గురు-లఘువుల అమరికలు ఉంటాయి. కనుక
f(n) = f(n-1) + f(n-2)

అనే సమీకరణం చెల్లు తుందని హేమచంద్ర గమనించేరు. పాఠకులు కూడా ఒక్క


నిమిషం ఆలోచిస్తే ఈ గమనిక పరిస్పుటం అవుతుంది. ఫిబొనాచీ సంఖ్యలని ఈ
సూత్రం ప్ర కారమే కదా మనం తయారు చేసింది? అందుకని మంజుల్ భార్గ వ వీటిని
హేమచంద్ర -ఫిబొనాచీ శ్రే డి (series) అనమన్నారు.
ఈ శ్రే ఢికి హేమచంద్ర పేరు తగిలించే లోగా సా. శ. 1135 లో గోపాల కూడా ఈ శ్రే ఢిల మీద
పరిశోధనలు చేసినట్లు దాఖలాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే సా. శ. 7 వ శతాబ్దంలోనే
భారతీయ గణితశాస్త్ర వేత్త లు ఈ శ్రే ఢిలని పరిశోధించారు అని అనడానికి కూడా
దాఖలాలు బయటపడుతున్నాయి.
The famous Stanford University computer scientist Donald Knuth also wrote about
this, and I quote: "Before Fibonacci wrote his work, the sequence Fn had already
been discussed by Indian scholars, who had long been interested in rhythmic
patterns that are formed from one-beat and two-beat notes. The number of such
rhythms having n beats altogether is Fn+1; therefore both Gospala (sic) (before
1135) and Hemachandra (c. 1150) mentioned the numbers 1, 2, 3, 5, 8, 13, 21, …
explicitly."

ఇటువంటి "కనుక్కున్నది ఒకరు, కీర్తి దక్కినది మరొకరికి" అనే సంఘటనలు


శాస్త్రీ యలోకంలో కోకొల్ల లు. జాత్యహంకారం వంటి కారణాలు ఆపాదించి ఇప్పుడు మనం
బావుకునేది ఏమీ లేదు. ఈ రోజుల్లో కూడ బలవంతులు బలహీనులపై చేసే పనులు
చూస్తూ నే ఉన్నాము కదా. కనుక పనికొచ్చే పని మీద దృష్టి ని నిలుపుదాం.
గణితంతో గారడీలు చెయ్యడం తప్ప ఇటువంటి శ్రే ఢుల ఉపయోగం ఏమిటి? పద్య
రచనలో ఎలా ఉపయోగపడిందో సూచనప్రా యంగా చెప్పేను కదా. గణితంలో
ఇటువంటి శ్రే ఢులు ఎన్నో తారసపడుతూ ఉంటాయి. (Arithmetic series, geometric
series, harmonic series, … వగైరాలు ఎన్నో ఉన్నాయి.) వీటికి గణితపరమైన
ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. వీటిని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలా
అన్నది మన ప్ర యోజకత్వం మీద, పరిశీలనా శక్తి మీద ఆధారపడుతుంది. ఉదాహరణకి
హేమచంద్ర -ఫిబొనాచీ శ్రే ఢిని నిత్యజీవితంలో మనం ఎలా ఉపయోగించుకోవచ్చో
చెబుతాను. శ్రే ఢిలో వచ్చే సంఖ్యలని మరొక సారి చూడండి: 1, 1, 2, 3, 5, 8, 13,..
వగైరాలు. ఎప్పుడైనా మైళ్ళని కిలొమీటర్ల లోకి మార్చవలసి వచ్చినప్పుడు నేను చెప్పే ఈ
కిటుకు వాడితే మీకు సమాధానం ఉరమరగా వస్తుంది: 3 మైళ్లు = 5 కిలోమీటర్లు , 5
మైళ్ళు = 8 కిలోమీటర్లు , ….. దీనికి కారణం? 1 మైలు = సువర్ణ నిష్పత్తి (ఉరమరగా 1.6)
కిలోమీటర్లు !
బాగానే ఉందయ్యా? అటువంటప్పుడు 75 మైళ్ళు ఎన్ని కిలోమీటర్లో ఎలా చెప్పడం?
ముందు మన శ్రే ఢిని 75 వరకూ పొడిగించి రాద్దాం. 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55,
89,…ఈ వరసలో 75 లేదే! ఇటువంటప్పుడు మరొక గణిత సూత్రం మనని రక్షి స్తుంది.
ప్ర తి సహజ సంఖ్యని కొన్ని హేమచండ్ర -ఫిబొనాచీ సంఖ్యల మొత్తంగా రాయవచ్చు.
ఉదాహరణకి 75 = 55 + 13 + 5 + 2. అంటే 75 మైళ్ల ని నాలుగు భాగాలుగా విడగొట్టేం.
ఇప్పుడు ప్ర తి భాగాన్ని విడివిడిగా కిలోమీటర్ల లోకి మారుద్దాం: 75 మైళ్ళు = 89 + 21 + 8
+ 3 = 121 (75 మైళ్ళు = 120.7 కిలోమీటర్లు , ఖచ్చితంగా!). ఈ చివరి మెట్టు ఎలా ఎక్కేనో
అర్థం అయిందనే అనుకుంటాను.

You might also like