ధర్మకర్తలు 017

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

ఆధునిక బేతాళ కధలు: రావు కృష్ణారావు

17. ధర్మకర్తలు
పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దింపి భుజానేసుకొని
శ్మశానం వైపు నడవసాగాడు. అపుడు శవం లోని బేతాళుడిలా చెప్పసాగాడు.
“విక్రమార్క మహారాజా.... అంధకరాజ్యంలో ప్రసిద్ధ ఎరువుల
కర్మాగారమొకటి వుంది. దానికి అనుబంధంగా ఒక ఫైనాన్స్‌ సంస్థ వుండేది.
తర్వాత ఎందువల్లనో మాతృసంస్థ ఆసంస్థతో తెగతెంపులు చేసుకుందట.
రాజ్యంలోని అన్ని ప్రైవేటు ఫైనాన్స్‌సంస్థల్లాగానే అదీ దివాలా తీసింది.

ఈ సంస్థలో డబ్బులు దాచుకున్న వారు గొల్లుమన్నారు. మాతృసంస్థ


పేరుప్రఖ్యాతులకు మోసపోయామని వీధుల్లో కేకలు వేశారు. మాతృసంస్థ
ప్రతిష్టను కాపాడటానికి ఆ సంస్థ అధిపతి రంగంలోకి దిగి టీవీలకు,
పత్రికలకు ఇంటర్వ్యూలిచ్చారు. డిపాజిట్‌ చేసిన వారికి అన్యాయం
జరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలో టీవీ
ప్రతినిధి “అయ్యా మీరు తలచుకుంటే ఖాతాదార్ల డిపాజిట్లన్నీ క్షణంలో
తిరిగిచ్చేయగలరు కదా” అన్నాడు. ఆ అధిపతి ఏమాత్రం కంగారు పడకుండా
“అవును, అది నాకు కష్టంకాదు. అయితే అలా చెయ్యకూడదు. అది మంచి
పద్ధతికాదు” అన్నారు. రాజా.... ఆయన చెల్లించలేనని అనలేదు.
ఆయనమాటల్లోని మర్మవేమిటో తెలిస్తే చెప్పు. తెలిసీ చెప్పకపోయావో నీ తల
వెయ్యిచెక్కలవుతుంది” అని చెప్పి ముగించాడు బేతాళుడు.

అపుడు విక్రమార్కుడిలా చెప్పసాగాడు. “బేతాళా... ఇది పెట్టుబడిదారీ


సమాజం. దీనికి ఆయువు పట్టు ప్రైవేటు ఆస్తి. పరమాత్ముని కంటే
పవిత్రమైనదీ ప్రైవేటు ఆస్తి. దీన్ని రక్షించడానికి అనేక చట్టాలున్నాయి. ధర్మ

55
ఆధునిక బేతాళ కధలు: రావు కృష్ణారావు

సూత్రాలున్నాయి, వీటి ప్రకారం ఒక కంపెనీ యొక్క ఆస్తులుగాని,


అప్పులుగాని, ఆ కంపెనీని నడిపే పెద్ద వాటాదార్లకు గాని, చిన్నవాటాదార్లకు
గాని నేరుగా చెందవు. లాభాలను పంచుకోవాలి. కంపెనీ నిర్వహణలో
ఎటువంటి పాత్రా లేని చిన్న వాటాదార్ల రక్షణకోసం,నష్టం చూపించి వారి
ఆస్తిని కాజేయకుండా వుండడంకోసం ఈ చట్టాలు చేసినట్లు చెబుతారు.
కంపెనీని నడిపే పెత్తందార్లు లాభాలు బాగా వచ్చినపుడు వాటిలో అధిక
భాగం దొడ్డిదారిన తరలించుకు పోతారు. వ్యాపారం అంత లాభసాటిగా
లేనప్పుడు కంపెనీ పేర అప్పులు తెచ్చి వాటిని అనేక పద్ధతుల్లో మింగేస్తారు.
అప్పులు పెరిగిపోయి కంపెనీ దివాలా స్థితికి చేరుకుంటుంది. పైన చెప్పిన
చట్టాల ప్రకారం అప్పులిచ్చిన బ్యాంకులు అప్పు తీర్చమని కంపెనీ
నిర్వాహకులను ఇబ్బంది పెట్టకూడదు. కంపెనీకి ఏమైనా ఆస్తులుంటే వాటిని
స్వాధీనం చేసుకోవచ్చు. అంతే! ఇలా కంపెనీలనూ, వాటిపెత్తందార్లనూ
వేరుచేసి చూడటమనేది కంపెనీ ఆస్తుల నేమాత్రం రక్షించకపోగా
ఆకంపెనీలను ముంచేసి బాగుపడిన పెద్ద మనుషుల ఆస్తులకు శ్రీరామరక్షగా
ఉపయోగ పడుతోంది.

దీన్ని ఆసరాగాచేసుకొనే దేశంలోని గొప్ప గొప్ప పెట్టుబడిదారులు


ప్రభుత్వ బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు ఎగవేయ గలిగారు. ఇంకా
పారిశ్రామికాభివృద్ధి సంస్థలు, ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు, యు.టి.ఐ. లాంటి
సంస్థలు, సహకార బ్యాంకులు ఇతర సంస్థలు, చిన్న వాటాదార్లు నష్ట
పోయింది ఇంతకు పదిరెట్లకు పైనే వుంటుంది. ఇదంతా సామాన్య
ప్రజలడబ్బే. కష్టపడి కంపెనీని సమర్థవంతంగా నిర్వహించి లాభాలు
గడించడం చేతగాని తనం, అడ్డదారుల్లో సంపాదించడం సమర్ధతకు చిహ్నం

56
ఆధునిక బేతాళ కధలు: రావు కృష్ణారావు

అయిపోయాయి. పాలక పక్షాలు కూడా మోసాలను అన్ని విధాల


ప్రోత్సహిస్తున్నాయి. ఒక కంపెనీని సమర్థవంతంగా నడుపుతున్న వ్యక్తి మరో
కంపెనీని ముంచేసి కోట్లరూపాయలు బ్యాంకు రుణాలు ఎగవేసినా అతనికి
“ఉత్తమ పారిశ్రామిక వేత్త”అవార్డులిస్తున్నారు. ఇది మోసాలకు
ప్రోత్సాహకంగా పనిచేసి మోసాలు పెరిగి పోతున్నాయి. ప్రజలను, ప్రభుత్వ
సంస్థలనూ ఎంత ఎక్కువ మోసగిస్తే అంతగొప్ప. దీనంతటికీ ఆలంబన
'కంపెనీ అప్పులకూ వాటి పెత్తందార్లకూ సంబంధంలేదు”అనే ధర్మసూత్రం.
ఈ ధర్మాన్ని అతిక్రమించ రాదనే ఎరువుల కంపెనీ అధిపతి అభిప్రాయం”

“బాగుంది రాజా.... బహు బాగుంది. దొంగ సొత్తును పంచు కోవడంలో


దొంగలకు కూడా ఒక నీతి, న్యాయం వుంటాయని విన్నాం గాని ఇదెక్కడి
విడ్డూరం! ఇక్కడ దోచుకోబడిన వారికే నియమాలు, నిబంధనలూ. దోపిడీ
దార్లకు ఏ బాధ్యతా లేదన్నమాట. కంపెనీలకు వాటి పెత్తందార్లు 'ధర్మకర్త' లే
గాని పూర్తి యజమానులు, బాధ్యులు కారన్న మాట. అలాగే సామాన్య ప్రజలు
తమ డబ్బుని ఎట్నుండి ఎవ్వడు లాగేసినా కాపాడుకోలేని చేతగాని
ధర్మకర్తలన్నమాట. ఈ ప్రభుత్వ బ్యాంకులు, సంస్థల్లో దోచుకుంటున్న
డబ్బంతా తమదేనని సామాన్యులకు తెలుసంటావా! కేపిటలిజం చేసే చిత్ర
విచిత్రాలను చూసి బిత్తర పోవడం తప్ప నువ్వూ, నేనూ ఏం చేయగలం!
ఏదైనా చేయగల ప్రజల్లో ఆచైతన్యం ఎప్పుడొస్తుందో! మరి నేను వెళ్ళనా!....”
అంటూ శవంతో సహా మాయయ్యాడు బేతాళుడు!

కధా క్రమం విశాలాంధ్ర 24-04-2005.

57

You might also like