సోమయాజి 018

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

ఆధునిక బేతాళ కధలు: రావు కృష్ణారావు

18.సోమయాజి
పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దింపి భుజాన
వేసుకుని శ్మశానం వైపు నడవసాగాడు. అపుడు శవంలోని బేతాళుడు
“రాజా... ఏదైనా తన దాకా వస్తే గాని తెలియదంటారు. అటువంటి కథ
ఒకటి చెబుతాను. ఆయాసం తెలియకుండా ఉంటుంది విను! సోమయాజి
అనే ఓ పెద్ద మనిషి వున్నాడు. ఆయన చాలా ధనవంతుడు. ధార్మికుడని,
పరమనిష్టాగరిష్టుడని పేరు. నిజంగానే యజ్ఞం చేశాడని చెప్పుకుంటారు.
ఆయనకు ఒక్కగానొక్క కొడుకు. అతను డాక్టరు. ఇద్దరు మనవలు, ఒక
మనవరాలు... వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే కొడుకు, కోడలు, భార్య కారు
ప్రమాదంలో చనిపోయారు. మనవల్ని జాగ్రత్తగా పెంచి పెద్దచేశాడు.
మనవరాలికి ఘనంగా పెళ్ళిచేశాడు. పెళ్ళయిన కొద్దిరోజులకే ఆ అమ్మాయి
భర్త చనిపోయి మళ్ళీ తాత దగ్గరకే చేరింది. పెద్ద మనవడు సోము
బుద్ధిమంతుడు. మెడిసిన్‌ చదువుతున్నాడు. రెండవ వాడు సుమంత్‌కు చదువు
సరిగా అబ్బడం లేదు. జులాయి తిరుగుళ్ళు అలవాటయ్యాయి. సోమయాజి
పెద్ద మనవడికి మోటార్‌ బైక్‌ కొనిచ్చాడు. తనకూ కొనమని సుమంత్‌ గొడవ
చేశాడు. బుద్ధిగా చదువుకుంటేనే మోటార్‌ బైక్‌ కొంటానని, లేకపోతే మొత్తం
ఆస్తంతా సోముకే రాసేస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు సోమయాజి.
తాత కోపం గమనించిన సుమంత్‌ మౌనం వహించాడు. రెండురోజుల
తర్వాత ఓ సాయంత్రం డాబాపై విహరిస్తున్న సోమును ఆదమరిచి ఉన్నప్పుడు
క్రిందికి తోసేశాడు సుమంత్. రెండతస్తులపై నుండి కిందపడిన సోము తలకి
గట్టిదెబ్బ తగిలింది. తమ్ముడే తనను తోసేశాడని తాతకు చెప్పాడు.
వైద్యులెంత ప్రయత్నించినా ఫలితం లేక కొన్ని గంటల తర్వాత చనిపోయాడు.

58
ఆధునిక బేతాళ కధలు: రావు కృష్ణారావు

పొరపాటున డాబాపైనుండి పడిపోయాడని బంధువులకు చెప్పి మౌనంగా


రోదించాడు సోమయాజి. తర్వాత కొంతకాలానికి తనకు కారు కావాలని
గొడవ చేశాడు సుమంత్‌. ససేమిరా కొనివ్వనన్నాడు సోమయాజి. కోపంతో
రెచ్చిపోయిన సుమంత్‌ చేతికందిన రోకలి బండతో సోమయాజితలపై
కొట్టాడు. ఆ దెబ్బ కొద్దిలో తప్పి భుజంమీద తగిలింది. హాస్పిటల్‌లో చేరిన
సోమయాజి ఆ రాత్రి బాగా ఆలోచించి పోలీసులను పిలిపించి తన మనవడే
తన మీద హత్యాయత్నం చేశాడని, పెద్ద మనవడ్ని కూడా అతనే మేడపై
నుండి తోసి చంపేశాడని ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుమంత్‌ను అరెస్ట్‌
చేశారు. కోర్టు అతనికి పదేళ్ళ కఠిన కారాగారశిక్ష విధించింది. తర్వాత
సోమయాజి తన మనవరాలికి మళ్ళీ పెళ్ళి చేశాడు.

రాజా!.... సోమును హత్య చేసినపుడు సుమంత్‌ను రక్షించిన


సోమయాజి అతను తనపై దాడి చేసినపుడు మాత్రం ఎందుకు
క్షమించలేకపోయాడు? సొంత ప్రాణంతీపి ఎక్కువంటారు. అదే కారణమా?
ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరయిన సోమయాజి తన మనవరాలికి
మళ్ళీ పెళ్ళి ఎలా చేయగలిగాడు? ఇది అవకాశవాదంకాదా? తెలిసీ
చెప్పకపోయావో నీ తల వెయ్యి చెక్కలవుతుంది" అని ముగించాడు బేతాళుడు.

“బేతాళా! పెద్ద మనవడు చనిపోయినపుడు సోమయాజి లోకంలో


అందరూ ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించాడు. 'పోయిన వాడు ఎలాగూ
పోయాడు. భగవంతుడు వాడికంతే ఆయువునిచ్చాడు. వీడ్ని ఉరికంబమెక్కిస్తే
పోయినవాడు తిరిగొస్తాడా?’ అని సర్ది చెప్పుకుని ఉంటాడు. తన మీద హత్యా
ప్రయత్నం చేసినపుడు సుమంత్‌ను పోలీసులకు పట్టివ్వడానికి కారణం సొంత
ప్రాణంమీద మమకారంఅనుకోను. సోమయాజి తెలివైన వాడనిపిస్తోంది.
ఈర్ష్యతో, తాత్కాలిక ఆవేశంలో అన్నను చంపి ఉంటాడని వాడ్ని జైలుకి

59
ఆధునిక బేతాళ కధలు: రావు కృష్ణారావు

పంపితే తన తర్వాత మనవరాలు దిక్కులేనిదవుతుందని అపుడు


ఆలోచించిఉంటాడు. రోకలి బండతో తన మీద దాడి చేసిన తర్వాత అతనికో
విషయం అర్ధమయి ఉంటుంది. తన తర్వాతైనా సుమంత్‌ మనవరాల్ని
కడతేరుస్తాడు. ఆమెనైనా రక్షించాలంటే సుమంత్‌ను జైలుకు పంపడమే
సరియైనదని భావించిఉంటాడు. ఇక సోమయాజి ఆచారాల గురించి
అంటావా.... ఆధునికకాలంలో ఆచార సంప్రదాయాలను పాటించడం అనేది
తమ ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని లోకానికి చాటి ఆత్మసంతృప్తి చెందడానికే!
ఆపైన వాటి గురించి చెప్పే కబుర్లన్నీ ఆత్మవంచన, పరవంచన మాత్రమే! వేల
సంవత్సరాల క్రితం రూపొందిన ఆచారాలను జీవనపరిస్థితులు పూర్తిగా
మారిపోయిన తర్వాత పాటించడం సాధ్యంకాదు. వేషభాషల్లో, తన దైనందిన
జీవితంలో సోమయాజి ఆచారాలు పాటించి ఉండవచ్చు. కొడుకు, మనవడు
వైద్యులవడం తమ ధర్మానికి పూర్తి విరుద్ధమని సోమయాజికి తెలియదా?
అతని ఆచారాలు నియమనిష్టలు, యజ్ఞం ఇవేవీ కూడా అతని జీవితంలో
అతనికి సుఖశాంతుల నివ్వలేదు. అన్నీ కష్టాలే! అది గ్రహించలేనంత
మూర్ఖుడు కాడు సోమయాజి. అందుకే మనవరాలికి మళ్ళీ పెళ్ళిచేశాడు” అని
ముగించాడు విక్రమార్కుడు.

"రాజా!.... ఇలాంటి కథలు రోజూ కళ్ళెదురుగా చూస్తూ కూడా


అర్థంలేని ఆచారాలు, సంప్రదాయాలూ అంటూ తాము నానా అగచాట్లూ
పడుతూ అందరినీ వేధిస్తూంటారు చాలామంది మూర్ఖులు. కాలానికి
అతీతంగా ఆచారాలుండవనే సంగతి వీళ్ళకెప్పటికి తెలుస్తుందో... నేను
వెళుతున్నాను” అని శవంతో సహా మాయమయ్యాడు బేతాళుడు.

కధా క్రమం విశాలాంధ్ర 01-05-2005.

60

You might also like