Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 23

స్థ ంబాద్రి

స్వామి వారికి మూడు పూటలా పూజలు జరుగుతాయి. ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవికి క్షీరాభిషేకము, ప్రతి ఆదివారము అన్నదానము

చేస్తు ంటారు. నరసింహ స్వామి పానక ప్రియుడంటారు. అందుకే నిత్యం పానకం తోనే స్వామి వారికి అభిషేకము చేస్తు ంటారు. ఇక్కడున్న

ఆరున్నర అడుగుల ఎత్తు ండే నల్ల రాతి సాయి బాబాను భక్తు లు శ్రీకృష్ణు ని అంశంగా భావించి శ్రీకృష్ణా ష్ట మి నాడు సాయిబాబాకు విశేష పూజలు

నిర్వహిస్తా రు. నరసింహ స్వామి అవతరించి నట్లు గా చెప్పే వైశాఖ శుద్ధ చతుర్థశి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయిదు

రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తా రు. శ్రా వణ మాసంలో స్వామి వారికి పవిత్రో త్సవాలు, అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. దేవీ

నవరాత్రు ల సందర్భంగా దసరా నాడు స్వామిని అశ్వ వాహనంపై ఊరేగిస్తా రు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమంటే హిందువులతో పాటు

ముస్లిములు కూడా తమ పెద్దల స్మారకార్థం ఏటా ఉగాదినాడు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లి ంచి కానుకలు సమర్పించుకుంటారు.

చాలా శతాబ్దా లుగా జరుగుతున్న ఎక్కడా లేని ప్రత్యేకమైన సాంప్రదాయం ఇది.

ఈరన్న ఆలయం, కర్నూలు జిల్లా

శైవ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం వేరు వేరు. వారి ఆలయాలు కూడా వేరు వేరుగా ఉంటాయి. కాని వైష్ణవ దేవుడైన నరసింహ స్వామికి

శైవుల ఆచారం ప్రకారం పూజలు జరిగే ఆలయం కర్నూలు జిల్లా లో ఉంది. అదే ఈరన్న ఆలయం: ఎమ్మిగనూరు నుండి ముప్పై కిలోమీటర్ల

దూరంలో ఈ ఆలయం ఉంది. ఇరవై ఏళ్ళ క్రితం వరకు సాదా సీదాగా ఉండిన ఈ గుడి శర వేగంగా అభివృద్ధి చెందొ తోంది. ప్రస్తు తం ఈ గుడి

వార్షికాదాయం ఐదు కోట్ల రూపాయల పై మాటే. ప్రతి ఏడు శ్రా వణ మాసంలో ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగు తాయి. ఆ సందర్భంలో మన

రాష్ట ం్ర నుండే గాక, మహారాష్ట ,్ర తమిళ నాడు, కర్ణా టక రాష్ట్రా ల నుండి కూడా భక్తు లు వస్తా రు. ఈ నెలలో సుమారు పది లక్షలకు పైగా భక్తు లు

ఈ స్వామి వారిని దర్శించు కుంటారని ఒక అంచనా. దేవాదాయ శాఖ నిర్మించిన వసతి గదులు, భక్తు ల విరాళాలతో ఏర్పాటు చేసిన నిత్య

అన్న దాన పథకం, తుంగ భద్ర దిగుగ కాలువ వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టా లు ఉన్నందున ఇక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి.

రూ‍పాల సంగమేశ్వరం, కర్నూలు

క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవశతాబ్ద ం మధ్య కాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్రా నది ఒడ్డు న అలంపురం ఆలయ సముదాయాన్ని

నిర్మించారు. ప్రస్తు తం బాదామి కర్ణా టక లోని చాగల్ కోట జిల్లా లో ఉంది. నిర్మాణాల కవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్ల పై తరలించే వారు. ఆ బళ్లు

నదిలో ప్రయాణిస్తు న్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పో యేది. మళ్లీ కొత్త గా వేయాల్సి వచ్చేది. ఆ చక్రా లకు వేసే కందెన తయారీకి

ఒక గ్రా మం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలుగా మారింది.

శ్రీకూర్మం , శ్రీకాకుళం జిల్లా

Lua error in package.lua at line 80: module 'Module:Format link' not found.

శ్రీకూర్మం ఆలయంలో ఒక భాగం


శ్రీకూర్మం ఆలయ ప్రధాన గోపురం

ఈక్షేత్రం ఎక్కడ ఉన్నది?

శ్రీ కూర్మనాథ క్షేత్రం శ్రీకాకుళం పట్ట ణానికి 13 కిలోమీటర్ల దూరంలోను, మండల కేంద్రమైన 'గార' నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది.

రవాణా సౌకర్యం బాగా ఉంది. శ్రీ కూర్మంలో తిరుమల- తిరుపతి దేవస్థా నం వారి సత్రం ఉంది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆరసవెల్లి

ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

పురాణేతిహాసం

"పూర్వం దేవ దానవులు అమృతం కొరకు క్షీర సాగరాన్ని మధించడానికి యత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. క్రింద
ఆధారం లేనందున మందర పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహా విష్ణు వుని ప్రా ర్థించగా, విష్ణు వు తాబేలు అవతారమెత్తి మందర

పర్వతానికి ఆధారంగా నిలిచాడు" అని కూర్మ పురాణం చెపుతున్నది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కూర్మంలో ప్రతిష్ఠించాడని

చెపుతారు. ఈ క్షేత్ర ప్రస్తా వన పద్మ పురాణం లోను, బ్రహ్మాండ పురాణాం లోను కనిపిస్తు ంది. అత్యంత సుందరమైన శిల్పసంపద కలిగిన ఈ

క్షేత్రా న్ని శ్రీరాముని కుమారులు లవ కుశులు కూడా దర్శించారని పురాణ కథనం. ఆలయ పైభాగం అష్ట దళ పద్మాకారంలో ఉంది. తూర్పు,

దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కను విందు చేస్తా యి. ఆస్థా న మండపంలోని నల్ల రాతి స్థ ంభాల పై రామాయణ, మహాభారత ఇతిహాస

ఘట్టా లు చెక్కి ఉన్నాయి. ఈ ఆలయ ఉపరిత భాగాన్ని గంధర్వులు నిర్మించారని, అందుకు దానిపేరు గంధర్వ విమానమని అంటారని ఒక

కథనం. గాలి గోపురం ఎదురుగా సుధా కుండం ఉంది. దీనిని శ్వేత కుండం అని, శ్వేత పుష్కరిణి అని కూడా అంటారు.

ఆలయ విశిష్ట త

ఏ ఆలయానికైనా ఒకే ధ్వజ స్థ ంభం ఉటుంది. కాని ఇక్కడ రెండు ధ్వజస్థ ంభాలుండడం విశేషం. అవి తూర్పు, పశ్చిమ దిశలలో ఉన్నాయి.

ఆలయ మూల విరాట్ పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉత్త రాన భగవద్రా మానుజులు, నైరృతిలో వేణుగోపాలస్వామి, వాయువ్యాన వైష్ణవి

దుర్గ , లక్ష్మి సన్నిధి ఉంది. ఆలయ ప్రా ంగణంలో సుమారు వందకు పైగా తాబేళ్లతో ఏర్పాటు చేసిన పార్కు కూడా ఉంది. జేష్ట బహుళ ద్వాదశి

నాడు ఈ స్వామి వారి జయంతి. జయంతి నాడు ఉదయం 5 గంటలకు స్వామికి క్షీరాభిషేకం చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తా రు.

(మూలం ఈనాడు: ఆదివారం: 2011 జూన్ 26)

జగన్మోహినీ కేశవస్వామి ఆలయం...ర్యాలి

శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పో రాడుకొనుచుండగా

శ్రీమహావిష్ణు వు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తా డు. జగన్మోహిని అవతార సమయం

లోమహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తా డు. మోహినీ

స్వరూపుడైన శ్రీ మహావిష్ణు వు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే

పడడం అని అర్థం) అని చెబుతారు .


జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, ర్యాలి

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. ఈ ప్రా ంతాన్ని కోనసీమ అంటారు. నిండైన

కొబ్బరి చెట్లకు కోనసీమ ప్రసిద్ధి. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రా ంతం. గోదావరి ఉపనదులు ఇక్కడ ప్రవహించ డంవల్ల ఈ ప్రా ంతం

సాక్షాత్తూ ‘అన్న పూర్ణ’. ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణు మూర్తి కొలువై ఉన్నాడు. ఇది ఏక శిలా విగ్రహం. ఇటువంటి శిలను సాల గ్రా మ

శిల అంటారు. ఈ విగ్రహం పొ డవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. విగ్రహానికి ముందువైపు విష్ణు మూర్తి, వెనుకవైపు

జగన్మోహిని. ఇటువంటి విచిత్ర మైన దేవాలయం మరెక్కడా లేదేమో? నల్ల రాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇం

దులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది అచ్చమైన నిదర్శనం.

కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి. అదేవిధంగా ‘శిఖ’ జుట్టు వెం ట్రు కలు చెక్కిన తీరు

చూస్తే ఇది శిల్ప మా, నిజంగా జుట్టు ఉందా? అనిపించే లా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే. ఈ వి గ్రహం పాదాల దగ్గ ర నుంచి, నీరు నిరం

తరాయంగా ప్రవ హిస్తూ ఉంటుంది. ‘వి ష్ణు పాదో ధ్బవి గంగ’ అనే ఆధ్యాత్మిక న మ్మకం మాట పక్కన పెడితే శిలల్లో ‘జల శిల’ అనే దా న్నుంచి

నీరు నిరంతరం విష్ణు మూర్తి పాదాలను కడుగుతూ ఉం టుందని భక్తు ల విశ్వాసం. గుడిప్రా ం గణమంతా దశావతారాలకి సంబంధించి న

శిల్పాలు కొలువై ఉన్నాయి.

ఆలయ నిర్మాణం...

ర్యాలి ప్రా ంతం 11 వ శతాబ్ద ంలో పూర్తిగా అరణ్యం. ఆ ప్రా ంతాన్ని పరిపాలిస్తు న్న చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, ఈ ఆలయాన్ని నిర్మించా

డు. తరువాతి రోజులలో దీనిని పునరుద్ధ రించారు.

‘ర్యాలి’ విశిష్ట త..

గోదావరి జిల్లా ప్రా ంతంలో ‘ర్యాలి’ అంటే ‘పడిపో వడం’ అని అర్ధం. ఈ ప్రా ంతాన్ని పూర్వం ‘రత్నపురి’ అని పిలిచేవారు. భాగవత కథ ప్రకారం...

దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రా న్ని చిలకడం ప్రా రంభిం చారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధ ర గిరని
ి కవ్వంగా

చేసుకుని, తలవైపు రాక్షసు లు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రా న్ని చిలికారు. అందులోంచి చంద్రు డు, కామధే నువు, కల్పవృక్షం,

లక్ష్మీదేవి, విషం... ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్ట చివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యా డు. దేవదానవులిరువురూ దాని

కోసం పో టీ పడుతుండగా, విష్ణు మూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి

ముందుకు నడుస్తు ండగా, వెనుకనుంచి విష్ణు వుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణు మూర్తి చెయ్యిప ట్టు కోగానే ఉలికిపాటుతో

విష్ణు వు వెనుకకు తిరిగాడు. ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది.

ర్యాలి పేరు ఎలా వచ్చింది;

ఆ కార ణంగా ఆప్రా ంతానికి ‘ర్యాలి’ అని పేరు వచ్చిందని స్థ లపు రాణం. విష్ణు వుని చూసిన శివుడు స్థా ణువులా నిలబడిపో యాడని అందుకే

శివాలయం, వైష్ణవాలయం ఎదురెదు రుగా ఉంటాయని స్థా నికులు చెప్తా రు. అలా వెనుకకు తిరిగిన విష్ణు మూర్తి ముందువైపు

పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తు ం ది. విష్ణు మూర్తి
జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తు ల నీరాజనాలు అందు కుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠ

చేసేటపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో మంత్ర పూతం కావించాడని స్థ లపురాణం. అదే విధంగా జగన్మో హినీకేశవస్వామి

విగ్రహాన్ని కూడా మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించారని చెబుతారు. గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ

అణువణువూ చూపిస్తా రు. నల్ల రాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది.

ఎలా వెళ్ళాలి?

ర్యాలిని దర్శించడానికి ఉత్త ర భారతంనుంచి వచ్చే యాత్రికులు విశాఖపట్నం మీదుగా (ఐదవ నెంబర్‌జాతీయ రహదారి) తుని, అన్నవరం,

రాజమండ్రి చేరు కోవాలి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా వెళ్ళి, బొ బ్బర్ల ంక దగ్గ ర ఎడమవైపు తిరగాలి. బొ బ్బర్ల ంక

మీదనుంచిలోల్ల మీదుగా మెర్లపాలెం దగ్గ ర కుడివైపుకి తిరిగితే ర్యాలి చేరుకుంటాం.విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రావులపాలెం (ఐదవ

నెంబర్‌జాతీయ రహదారి), దగ్గ ర కుడివైపుగా తిరిగి మెట్లపాలెం దగ్గ ర ఎడమవైపు తిరిగితే ర్యాలి చేరుకోవచ్చు.

హేమావతి సిద్ధేశ్వరాలయం, అనంత పురం జిల్లా

ఈక్షేత్రము ఎక్కడ ఉన్నది?

అనంతపురం జిల్లా అమరాపురం మండలం, హేమావతిలో ఉన్న సిద్దేశ్వరాలయం చాల ప్రసిద్ధి చెందినది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతి

మధ్యలో వెలసిల్లి న ఈ ఆలయానికి కొన్ని విశిష్ట తలు ఉన్నాయి.

చారితక
్ర ప్రా ముఖ్యము

ఇందులోని శిల్ప కళ చాల విశిష్ట మైనది. ఏడవ శతాబ్దా నికి చెందిన ఆలయమిది. ఈ ప్రా ంతాన్ని అప్పట్లో నొళంబ రాజులు పాలించారు. అందుకే

ఈ స్వామిని నొళంబేశ్వరుడు అని కూడా పిలుస్తా రు. హెంజేరు సామ్రా జ్యంలో అనంతపురం, చిత్తూ రు, కర్ణా టకలోని చిత్ర దుర్గ , కోలారు,

తమిళనాడు లోని ధర్మపురి, సేలం జిల్లా లోని 32 వేల గ్రా మాలు ఉండేవని ఇక్కడ చారితక
్ర ఆధారాలను బట్టి తెలుస్తు న్నది. ఈ స్వామి నొళంబ

రాజ వంశీకుల కులదైవం. వీరి వంశానికి చెందిన చిత్ర శేఖర, సో మ శేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారితక
్ర ాధారాలను బట్టి

తెలుస్తు న్నది. తమకు సంతానం కలిగితే విగ్రహ రూపాన శివాలయం నిర్మిస్తా మని వారు మొక్కు కున్నారట. అనంతర కాలంలో వారి కోరిక

నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. సిద్దేశ్వరుడితో పాటు వారు మరో నాలుగు శివలింగాలను

దొ డ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర, సో మేశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. వాటిలో మూడు ఆలయ ప్రా ంగణలోనే ఉండగా, నాలుగోది ఊళ్లో ని

మరో శివాలయంలో ఉంది. భైరవ రూప ధారి అయిన శివుడు సిద్ధా సనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్ధేశ్వరాలయంగా పేరు

వచ్చింది.

ఆలయ విశిష్ట త

గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలాతో కొలువైన సిద్ధేశ్వరుడి జటాజూటాన సూర్య,చంద్రు లు కనిపిస్తా రు. ఎడమ చేత బ్రహ్మకపాలాన్ని, దక్షిణ

హస్తా న జపమాలను ధరించి అర్థనిమీలిత నేత్రు డై ఉంటాడు స్వామి. ఇలా శివుడు విగ్రహరూపంలో ఆశీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం

భారతదేశంలో ఇదొ క్కటే నంటారు స్థా నికులు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే......ఆలయంలో సిద్ధేశ్వరుడి ఎదురుగా కొలువై ఉన్న నంది
ముఖం ఆ స్వామిని దర్శించుకున్నట్టు గా కాకుండా ప్రక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కుడ్యాలపై కనిపించే చోళ రాజుల శిల్ప కళా చాతుర్యం

సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తు ంది. రామాయణ, మహాభారత గాథలు ఇక్కడ జీవం ఉట్టి పడేలా చెక్కారు. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో కోటి

లింగాలు, కోటి నందులు ఉండేవని చెబుతారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఇప్పటికీ త్రవ్వకాలలో అక్కడక్కడా సందులు, లింగాలు

బయటపడు తుంటాయి. సిద్ధేశ్వరాలయానికి ఉన్న మరో ప్రత్యేకత....... శివరాత్రి రోజున గర్భగుడిలోని మూల విరాట్ సిద్ధేశ్వర స్వామి నుదుట

సూర్యాస్త మయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తా యి. పడమటి ముఖ ద్వారం కలిగిన ఈ ఆలయ ప్రా గణంలో ఉన్న కోనేరులో ఇరవై ఏళ్ల

క్రితం వరకు నీరు సప్త వర్ణా ల్లో కనిపించేదని, ఇందులో స్నానం చేసి స్వామి వారిని ఆరాధిస్తే సంతానంకలుగు తుందని సర్వ రోగాలు నయ

మవుతాయని భక్తు లు విశ్వసించే వారు. ఇప్పటికీ అనేక మంది వ్యాధి పీడితులు ఈ కోనేటిలో స్నానం చేస్తు ంటారు.

పూజలు.... అభిషేకాలు

ఆలయ ప్రవేశ ద్వారానికి ముందు ధూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తు లు తాము పండించిన

పంటల నుంచి కొంత భాగాన్ని మొక్కుబడిగా ఇందులో వేస్తా రు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని అష్టైశ్వర్యాలు

కలుగుతాయని భక్తు ల నమ్మిక. ఈ ఆలయానికి భక్తు లు తమిళనాడు, కర్ణా టక, మహారాష్ట ్ర ల నుంచి కూడా వస్తు ంటారు. రోజూ త్రికాల

పూజలు నిర్వహిస్తా రు. ఏటా శ్రా వణ మాసంలో నిర్వహించే ఎడగ జాతరకు భక్తు లు వేలాదిగా తరలి వస్తా రు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి

ఉత్సవాలు, కార్తీక మాసంలో 45 రోజుల పాటు విశేష పూజలు నిర్వహిస్తా రు. కార్తీక, మార్గ శిర పౌర్ణ మి దినాల్లో లక్ష దీపో త్సవం, పూల

రథో త్సవం, సిరిమాను ఉత్సవం, వసంతోత్సవాలను వేడుకగా చేస్తా రు. ఇక మహా శివరాత్రి సందర్భంగా అయితే ఎనిమిది రోజుల పాటు

బ్రహ్మోత్సవాలను అంగ రంగ వైభవంగా నిర్వహిస్తా రు. నిత్యం ఆ సిద్ధేశ్వరుడికి రుద్రా భిషేకం, పంచామృత స్నానం, బిల్వార్చన, భస్మ అర్చన,

ఆకు పూజ తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపిస్తా రు. (మూలం:ఈనాడు ఆదివారం: 24 ఏప్రిల్: 2011)

కదిరి నరసింహాలయం, అనంతపురం జిల్లా :

చారితక
్ర త

ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లు తున్న ఈ కదిరి నరసింహాలయం: 13 వ శతాబ్ద ంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని

శాసనాల వలన తెలుస్తు న్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా

పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్థ ంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు

అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి , తాయారు, ప్రహ్లా దులతో కలిసి

దర్శనిమిస్తా రు. " బేట్రా యి సామి దేవుడా....నన్నేలినోడా........... బేట్రా యి సామి దేవుడా కదిరి నరసింహుడా...................

కాటమరాయడా ................. ఇలా భక్తు ల చే కొనియాడబడే ఈ నరసింహ స్వామి విశిష్ట త చాల గొప్పది. వేదారణ్యమైన ఈ ప్రా ంతంలో ఖదిర

చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి కదిరి అని పేరు వచ్చింది. ఖదిరి చెట్టు అనగా చండ్ర చెట్టు . ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల

బొ మ్మలు శతాబ్దా ల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లు న్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్థ ంభం

నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తు ంది. ధ్వజ స్థ ంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉంది.

ఉత్సవాలు
ప్రతి ఏడు సంక్రా ంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రా రంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రా ంతి సమయంలో వచ్చే పశువుల పండుగ

రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్ల భుడు కదిరి కొండకు పారువేటకు వస్తా డని భక్తు ల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని

ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుక వస్తా రు. దీన్నే రథో త్సవం అంటారు. ఈ రథో త్సవానికి చాల ప్రా ముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల

బరువుండి ఆరు చక్రా లతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథో త్సవం సమయంలో

భక్తు లు రథంపై దవణం., పండ్లు , ముఖ్యంగా మిరియాలు చల్లు తారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు

నయమవుతాయని భక్తు ల నమ్మిక. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గు ణ బహుళ పౌర్ణ మిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు

భక్తు లు ఉపవాస ముంటారు. ఏటా ఈ అలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్ల ను వైశాఖ శుద్ధ పౌర్ణ మి,

చింతపూల తిరుణాళ్ల ను, అషాడపౌర్ణ మి, ఉట్ల తిరుణాళ్ల ను, శ్రా వణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.

ఆలయ విశిష్ట త

ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమంటే.............. .ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొ ని ఈ

స్వామిని కొలుస్తు ంటారు. ఇక్కడికి భక్తు లు సమీపంలోని తమిళనాడు, కర్ణా టక రాష్ట్రా ల నుండి కూడా వస్తు ంటారు. ఇక్కడి ఇంకో విశేష

మేమంటే, కదిరి పట్ట ణానికి సుమారు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రి మాను ఉంది. ఇది ఏడున్నర ఎకరాల స్థ లంలో

విస్త రించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్

రికార్డ్లో కూడా స్థా నం సంపాదించు కున్నది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లెలో యోగి వేమన సమాధి కూడా ఉంది. ఇది

కూడా పర్యాటకులను ఆకర్షిస్తు న్నది.

ఎక్కడున్నది ఈ క్షేత్రము ?

అనంతపురం జిల్లా లో ఉన్న కదిరి లోఈ ఆలయం ఉంది. ఇది పాకాల—ధర్మవరం రైల్వే మార్గ ంలో ఉంది. కదిరిలో స్టేషను కూడా ఉంది. అదే

విధంగా బస్సు సౌకర్యంకూడ బాగా ఉంది. (మూలం: ఈనాడు ఆదివారం: 2003 మార్చి 9)

చెన్నకేశవస్వామి ఆలయం, మార్కాపురం

స్థ లపురాణము

శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రా కారం నిర్మితమైంది. . మార్కండేయ మహర్షి తపస్సును కేశి

అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణు వు రాక్షసుని సంహరిస్తా డు.గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు

మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుక లోకి వచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని

జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశాడు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ

మండపాన్ని నిర్మించాడు ఆలయానికి ముందున్న రాతిస్త ంభాన్ని విజయసూచికగా ఆయనే నిలిపాడు.

చరితల
్ర ో మార్కాపురం

.
12 వ శతాబ్ద ంలో పల్నాటి రాజు మలిదేవుడు గురజాలలో జరిగిన కోడి పందేలలో ఓడి పో యాడు. అపుడు రాజు తన మంత్రి బ్రహ్మనాయుడితో
కలిసి చెన్న కేశవుణ్ణి పూజించాడు. ఈ విషయాన్ని శ్రీ నాథుడు తన గ్రంథం పల్నాటి వీర చరితల
్ర ో ప్రస్తా వించాడు. 1513 లో శ్రీకృష్ణ

దేవరాయలు స్వామి వారిని దర్శించుకొని, తన సామంత రాజు తిమ్మ రాజయ్యను పిలిపించి స్వామి వారికి అంతరాళం, మహాద్వారం,

గర్భగుడి పై విమాన గోపురం, రాజ్య లక్ష్మి అమ్మవారికి ఆలయాన్ని పూర్తి చేయమని ఆదేశించాడు. ఆ తర్వాత కాలంలో అచ్యుత దేవరాయలు

ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామి, వేణు గోపాల స్వామి, రంగనాయక స్వామి, గోదాదేవి, రామానుజుల వంటి మరికొన్ని ఆలయాలను

నిర్మించారు. గాలి గోపురం వివిధ దశలలో పూర్తి గావించ బడింది. 1929 లో అప్పటి తాలూకా గుమస్తా పో నంగి లింగ రాజు రెండు అంతస్తు లను

నిర్మించాడు. మిగతా ఏడు అంతస్తు లను 1936 లో నాటి మేజిస్ట్రేట్ రాయసం సంహో గేశ్వరావు భక్తు ల సహకారంతో పూర్తి చేశాడు. పురాతన

కాలంనుండి ఈ పవిత్రక్షేత్రా న్ని భక్తు లు దర్శించి తరిస్తు న్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సో మప్రభాపురం అని పిలిచేవారు.

క్షేత్ర విశిష్ట త

స్వామి వారి మూల విరాట్టు చుట్టూ మకర తోరణం ఉంది. ఈ తోరణం పై దశావతారాలున్నాయి. సాధారణంగా స్వామివారి కుడి చేతిలో

సుదర్శన చక్రం ఉంటుంది. ఈ స్వామి వారి ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంది. మూల విరాట్టు ప్రక్కనే మార్కండేయ మహర్షి, మారిక,

మారకయ్యల విగ్రహాలు కూడా ఉన్నాయి. అస్థా న మండపంలో ఉన్న స్థ ంభాలన్నీ ఏక శిలా స్థ ంభాలే. ఈ ఆలయంలో ఉన్న చూరు మరో

ఆకర్షణ. అన్ని విధాల ఒకే విధంగా ఉన్న రెండు స్థ ంభాలను అన్నదమ్ముల స్థ ంభాలంటారు.

ఎలా వెళ్లా లి ?

ఒంగోలు నుండి మార్కాపురానికి సుమారు 90 కిలోమీటర్లు . ఇది రోడ్డు మార్గ ం. విజయవాడ కర్నూలు రైలు మార్గ ంలో మార్కాపురం స్టేషను

ఉంది. అలా చేరుకోవచ్చు.

కోటిపల్లి / కోటిఫలి కోటీశ్వారాలయము

ఉమాసమేత కోటీశ్వరాలయ గోప్పురం, కోటిపల్లి

స్థ ల పురాణము

ఈక్షేత్రము పూర్వ కాలంలో కోటి తీర్థం గాను సో మ ప్రభాపురముగాను పిలువబడి, నేడు కోటి ఫలి మహా క్షేత్రముగా ఖ్యాతి గాంచింది. ఇచట

గౌతమీ పుణ్య నదిలో విష్ణు తీర్థ , రుద్ర తీర్థ , బ్రహ్మ తీర్థ , మహేశ్వర తీర్థత, రామ తీర్థ మొదలగు అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో

అంతర్వాహినులుగా ప్రవహించు చున్న కారణంగా దీనికి కోటి తీర్థ క్షేత్రముగా ప్రఖ్యాతి వచ్చింది. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరీ సహిత

సో మేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం

గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిఉన్నది. ఈ మూడు విగ్రహాలను ఇంద్రు డు,చంద్రు డు, కశ్యపమహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు.

ఇంద్రు డు తాను చేసిన పాపాలు పో గొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన
సో మేశ్వరుడిని చంద్రు డు ప్రతిష్ఠించి తన పాపాలు పో గొట్టు కొన్నాడని అంటారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన సిద్ధి జనార్దన స్వామి వారిని కశ్యప

ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు.

ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డు న ఉంది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు.

శ్రీగౌతమీ మాహాత్మ్యంలో ఈ విధంగా చెప్పబడింది: ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తా రో వారి సర్వ పాపాలు

పో తాయని. ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రా నికి కోటి తీర్థం అని కూడా పేరు.

క్షేత్ర విశిష్ట త

ఈ ఆలయ ప్రా ంగణములో ఉమాసమేత కోటీశ్వరాలయము, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం, భోగలింగము

ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయము ముందొ క ధ్వజస్త ంభము, నందీశ్వరుడు, కొలను ఉన్నాయి. ఈ రాజరాజేశ్వరీ సహిత

సో మేశ్వరాలయములో దసరా ఉత్సవములు, కార్తీక దీపో త్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తా రు. ఆలయానికి ఎదురుగా సో మగుండం

అనే ఒక పెద్ద చెరువు ఉంది.ఈ దేవాలయములో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రా ంగణంలో

కోటి దీపాలు వెలిగిస్తా రు. ద్రా క్షారామం చుట్టూ ఉన్న అష్ట సో మేశ్వరాలలో కోటిపల్లి ఒకటి. ఆలయ విశేషాలు

పూజలు, అర్చనలు

ఈ పవిత్ర గౌతమీ తీర్థం లోని పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తు ంది. శివ, కేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున:

పున: చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సో మేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తు ల కోరికలు తీర్చే తల్లి అని

భక్తు ల నమ్మిక. అర్చకులు ప్రతీరోజు ప్రా తః కాలమందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తా రు. సాయం

సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థా న సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తా రు. పురాతన కాలం నుండి ఈ పవిత్రక్షేత్రా న్ని

భక్తు లు దర్శించి తరిస్తు న్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సో మప్రభాపురం అని పిలిచేవారు. ఇక్కడ సో మ కుండం అనే ఒక పెద్ద పుష్కరిణి

నేటికీ ఉంది. ఆదిశంకరులు ఈ క్షేత్రా న్ని దర్శించారని చెబుతారు. ఆలయంలో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్త ర మండపంలో

కాలభైరవ స్వామి మందిరం ఉంది. ఈ దేవాలయం లోనే చంద్రమౌళీశ్వర స్వామి శంకరాచార్యుల మందిరం, ఉమా సమేత మృత్యుంజయ

లింగం, నవగ్రహాల గుడి ఉన్నాయి.

ఎలా వెళ్లా లి ?

కోటి ఫలి మహా క్షేత్రము తూర్పు గోదావరి జిల్లా , కె.గంగవరం మండలంలో ద్రా క్షారామ క్షేత్రా నికి సమీపంలో గౌతమీ నదీ తీరాన ఉంది. కాకి నాడ

నుండి బస్సు సౌకర్యమున్నది.

దేవుని కడప... శ్రీ వేంకటేశ్వరాలయం, కడప

స్థ లపురాణం

ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రా ంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రా నికి దేవుని కడప/ గడప

అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్ట ణానికి కృపాపురమని పేరు వచ్చింది.
కృపాపురమే కడపగా మారిందంటారు. ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న

వేంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఆయనకు ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ

పాడ్యమి నుండి సప్త మి (రథసప్త మి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్త మి రోజు రథో త్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది

భక్తు లు పాల్గొ ంటారు.

చారిత్రిక ప్రా ముఖ్యత

విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడులు, మాన్యాలు, బంగారు సొ మ్ములు ఈ

స్వామికి సమర్పించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు చెప్పాడు. ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల

విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి చూడదగినవి. ఇక్కడ ఇటీవల

నిర్మించిన అద్దా ల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ.

గర్భగుడి వెనుకవైపు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ప్రా ంగణంలో ఉండే

వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. దేవుని కడపలో ఇంకా సో మేశ్వరాలయం, దుర్గా లయం, ఆంజనేయ మందిరం

ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థా నం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది.

క్షేత్ర ప్రా శస్త ్యం

దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రా ంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్త ర భారతదేశ యాత్రికులు

రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్ద కు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గ ం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే

భక్తు లు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సో మేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రా లకు

వెళ్ళేవారు. ఇందువల్ల నే మూడు క్షేత్రా ల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. పూర్వ కాలం తిరుమలకు వెళ్లే భక్తు లు తమ యాత్రను

దేవుని కడపనుండే కాలి నడకన ప్రా రంభించేవారు. అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందున భక్తు లు కాలి నడకనే తిరుమలకు వెళ్లే

వారు. మైదాన ప్రా ంతంలో ఈ కాలి దారి కనుమరుగైనా తిరుమల కొండలలో అక్కడక్కడా కడప నుండి ఉన్న మెట్ల దారి అక్కడక్కడా

కనబడుతున్నది. ఈ దారి చాల దూరమైనందున, రాను రాను రవాణా సౌకర్యాలు పెరిగినందున ఈ మెట్లదారి కనుమరుగైనది.

ఆలయ విశిష్ట త

తిరుమలవరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనుక భాగాన నిలువెత్తు విగ్రహరూపంలో ఆంజనేయ

స్వామి నెలకొని ఉన్నాడు. ఆలయ ప్రా ంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ, చక్ర, ధ్వజ, గరుడ ఆళ్వారు,

హనుమత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డ ంగా

విభూతి పట్టీలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ

మండప పైభాగంలో రాతి బల్లు లు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తు లు ఆ బల్లు ల్ని తాకుతారు.

పూజలు, ఉత్సవాలు
ఈ ఆలయానికున్న మరో విశిష్ట త మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టు పక్కల ప్రా ంతాల్లో ఉండే ముస్లిం సో దరులు స్వామి వారిని

దర్శించుకోవడం కనిపిస్తు ంది. వారితో పాటు జైనులు కూడా వస్తు ంటారు. రథసప్త మి రోజు జనసందో హం మధ్య స్వామి రథాన్ని కులమతాల

కతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం. దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తా రు.

హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అనికూడా అంటారు. కొలనులోని నిరయమంటపం, పడమరన తీర్థవాశి మంటపం

ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి నీరొచ్చే మార్గ ం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తా రు. ఏటా

ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తా రు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు

జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్త మి (రథసప్త మి) నాడు జరిగే రథో త్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొ నేందుకు

భక్తు లు వేలాదిగా తరలివస్తా రు. రథో త్సవంలో భాగంగా స్వామి గ్రా మంలో ఊరేగుతాడు. తాళ్ళపాక అన్నమాచార్యులు దేవుని కడప శ్రీ

వేంకటేశ్వరుని కీర్తిస్తూ వ్రా సిన కీర్తన.

"కాదనకు నామాట కడపరాయా నీకు,,,, గాదెవోసే వలపులు కడపరాయా

కలదాననే నీకు గడపరాయా వో...........కలికి శ్రీ వేంకటాద్రి కడపరాయ"

ఎలావెళ్ళాలి ?

వై.ఎస్.ఆర్ జిల్లా ముఖ్యకేంద్రమైన కడప పట్ట ణంలోనే ఈ ఆలయమున్నది. ఇక్కడికి చేరుకోవడానికి రైలు, బస్సు రవాణా సౌకర్యాలు

ఉన్నాయి.

• మూలం.... వైఎస్ఆర్ జిల్లా విజ్ఞా న విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు

ఒంటిమిట్ట కోదండ రామాలయం

ఒంటిమిట్ట కోదండరామాలయ సముదాయము

ఎక్కడున్నదీ క్షేత్రం ?

ఒంటిమిట్ట , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట మ


్ర ులోని వైఎస్ఆర్ జిల్లా కు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గ ంలో 20 కి.మీ.

దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది.

ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ

చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థ ల

పురాణంలో వివరించబడింది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్

16 వ శతాబ్ద ంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. ఆంధ్ర
మహాభాగవతాన్ని రచించిన పో తన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం
గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రా ంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి, ఆయన కొంతకాలం ఇక్కడ

నివసించాడని భావిస్తు న్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డా రు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది.

హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొ క్కటే.

స్థ ల పురాణం

రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రు డు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ

కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రా ర్థించడంతో దుష్ట శిక్షణ

కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొ ది, పిడిబాకు, కోదండం, పట్టు కుని ఈ ప్రా ంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం

చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షు లు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ

విగ్రహాలను ప్రా ణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

ఆలయ విశిష్ట త

ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160

అడుగులు. 32 శిలాస్త ంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధ తిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర

శిల్పాలను పో లి ఉంది. పొ త్త పి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి

వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధ రించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా

కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొ మ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన

ఆభరణాలను చేయించగలిగాడు. పో తన, అయ్యలరాజు రామభద్రు డు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన

చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రా శాడు.

గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

చోళ, విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్థ ంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. చరిత్ర మధ్యయుగాల్లో మన

దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రా వెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. ప్రౌ ఢ దేవరాయల

ఆస్థా నంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రా ంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో

ఒకడైన అయ్యలరాజు రామభద్రు డు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్ట పడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పో తన,

జన్మస్థ లాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ

సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తా రు.

ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తు న్నాయి.

ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన

అబ్దు ల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తు లను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్త శుద్ధితో

పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని

సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తు డిగా మారిపో యాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని
తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని

పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం. పుట్ట పర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు

కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తు ంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపో తుంటారు.

పూజలు,ఉత్సవాలు

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణ మి నాడు

రథో త్సవం ఉంటాయి. నవమి నాడు పో తన జయంతి నిర్వహిస్తా రు. కవి పండితులను సత్కరిస్తా రు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా

ఆలయ సమీపంలో మహాకవి పో తన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సిద్ధు లకొండ., నెల్లూ రు జిల్లా

స్థ లపురాణము

ఒక దట్ట మైన అడవిలో ఒక కొండపైన ఇద్ద రు సిద్ధు లు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ సంచరిస్తు న్న ఒక గిరిజనుడు దేదీప్యమానంగా

వెలుగు విరజిమ్ముతున్న వారిని చూస్తూ అలాగే రెండు రోజులుండిపో యాడు. సిద్ధు లు తర్వాత కళ్లు తెరిచి గిరిజనుని చూసి తమగురించి

ఎవ్వరికి చెప్పొద్ద ని చెప్పితే తనకే ప్రమాదమని హెచ్చరించి వెళ్లి పొ మ్మన్నారు. కొన్నిరోజులు నిగ్రహించుకున్న ఆ గిరిజనుడు తాను చూసిన

వింతను తమ వారికి చెప్పాడు. అందరూ కలిసి ఆ అటవీ ప్రా ంతానికి వచ్చి చూడగా, ఆ సిద్ధు లు శిలలుగా మారిపో యారు. ఆ గిరిజనుడు

మరణించాడు. అప్పటినుండి గ్రా మస్థు లు ఆ సిద్ధు లను పూజిస్తూ వచ్చారు. వారి కోరికలు సిద్ధిస్తు ండడముతో ఆ కొండకు సిద్ధు ల కొండ పేరు

స్థిరపడింది.

చారిత్రికము

రాజరాజ నరేద్రు ని చిన్న భార్య చిత్రా ంగి రాజరాజ నరేంద్రు ని కొడుకు సారంగధరుని మోహించి భంగ పడి ప్రతీకారంతో రాజుగారికి తప్పుడు

ఫిర్యాదు చేస్తు ంది. దాంతో రాజు సారంగధరుని కాళ్లు , చేతులు నరికి వేయమని ఆదేశిస్తా డు. అతని ఆదేశాల ప్రకారం సైదాపురం మండలం

చాగణం సమీపంలో కత్తు ల కొండపై సారంగధరుని కాళ్లు చేతులు నరికినట్లు ఆధారాల వల్ల తెలియ వస్తు ంది. అవిటి వాడైన సారంగధరుడు

సిద్ధు ల కొండపైకి వచ్చాడు. శిలారూప నవకోటి, నవనాధసిద్ధు లయ్యలు.... సారంగధరుని తమ శిష్యునిగా చేసుకున్నారు. ఆ విధంగా సిద్ధు ల

తోపాటు సారంగధరుని బొ మ్మకూడ అక్కడ చేరిందని స్థా నికులు చెపుతారు. ఈ ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు

తెలుస్తు న్నది.

పూజలు, ఉత్సవాలు

ప్రతిఏడు కార్తీక మాసములో వచ్చే అన్ని సో మ వారాల్లో ఇక్కడ ప్రత్యేక తిరునాళ్ల ను నిర్వహిస్తా రు. అంతేగాక, కార్తీక పౌర్ణ మి, మహా శివరాత్రి,

నాగ పంచమి, వసంత పంచమి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తా రు. ఈ తిరుణాళ్ల కు పరిసరజిల్లా లనుండే గాక తమిళనాడు నుండి కూడా
భక్తు లు విశేషంగా తరలి వస్తా రు. గతంలో చిరుత పులి, పాము మొదలగునవి స్వాములను పూజించేవట. వీటిని దూరంగా పంపి, తాము

పూజ చేసుకోవడానికి వీలుగా పూజకొరకు కొండ ఎక్కే ముందు పూజారి శంఖం వూదేవాడట. ఆ ఆచారము మొన్నటిదాక కొనసాగిందని

స్థా నికులు చెపుతారు.

ఆలయవిశిష్ట త

మొదట్లో ఈ ఆలయానికి తలుపులు ఉండేవి కావు. ఆతర్వాత తలుపులు ఏర్పాటు చేసినా అవి ఉండేవి కావు. ఇది సిద్ధు ల మహత్యమని ఆ

తర్వాత తలుపులు ఏర్పాటు చేయడము మానేశారు. ఈ కొండపై సప్త దొ రువులుగా పిలిచే ఏడు కొలనులున్నాయి. వాటిలో స్నానమాచరిస్తే

సర్వ పాపాలు నశిస్తా యని భక్తు ల నమ్మిక. ఈ కొలనులో సర్వ వేళలా పుష్కలంగా నీరు ఉం డటము ఒక విశిష్ట త. ఈ ఆలయంలో మరో

విశేషమేమంటే.... భక్తు లు ఒక పుష్పాన్ని తీసుకొని మనసులో ఒక కోర్కెను కోరుకొని ఆ పుష్పాన్ని నవకోటి నవ నాథుల శిలా మూర్తు ల పై

పెడితే .... అది క్రింద పడితే వారు కోరుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఆ విధంగా కోరికలు తీరిన భక్తు లు తమ పిల్లలకు

సిద్ధు లయ్య, నవకోటి, నవ నాథ్, సారంగధర అనే పేర్లు పెట్టు కుంటారు. అందుచేత ఈ ప్రా ంతంలో ఆ పేర్లు ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. ఈ

కొండకు సమీపంలో బండరాతిపై సర్పాకృతిలో వెలసిన ఆకారాలను రాహు, కేతువులుగా చెపుతారు. అందుకే ఈ కొండను సర్పక్షేత్రమని

పిలుస్తా రు. ఈకొండ క్రింద సతీసమేత నవగ్రహ మంటపాలున్నాయి. నవగ్రహాలు ఎక్కడైనా ఉంటాయి. కాని సతీసమేత నవగ్రహాలు ఇక్కడ

మాత్రమే ఉన్నాయి.

వసతులు

కొండకు వచ్చే భక్తు ల కొరకు కార్తీక, మాఘ మాసాల్లో , ఇతర మాసాల్లో సో మ, శని వారాల్లో మధ్యాహ్నం పూట ఉచిత అన్నదానం

చేస్తు న్నారు. మాఘ మాసంలో వచ్చే వసంత పంచమి రోజున చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారు.

ఈ మధ్యన దాతల సహకారంతో... ఆలయ ప్రా ంగణంలో సాయిబాబా మందిరం, దక్షిణామూర్తి ఆలయం, యాగమంటపం నిర్మించారు.

ఎలావెళ్ళాలి?

నెల్లూ రు పట్ట ణానికి 50 కిలోమీటర్ల దూరంలోను, లేదా గూడూరు నుండి అరగంట ప్రయాణం చేసినా సైదాపురం చేరుకోవచ్చు. సైదాపురానికి

సమీపంలోనే ఉన్నదీ సిద్ధు లకొండ క్షేత్రము. (మూలం: ఈనాడు: 2 012 సెప్టెంబరు 2)

రుద్రకోటేశ్వరాలయం, చిత్తూ రు జిల్లా

స్థ లపురాణం

శివుని ఆజ్ఞ మేరకు దక్షిణాదికి వచ్చిన అగస్త ్య మహర్షి చంద్రగిరి - తిరుపతి మధ్యయలో ఉన్న తొండ వాడ ప్రా ంతలో స్వర్ణ ముఖి, భీమ, కల్యాణి

నదుల సంగమ ప్రదేశము పవిత్రమైన దని భావించి అక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించి రుద్ర కోటేశ్వరునిగా పూజలు చేశాడు. కాల క్రమంలో

అది రుద్ర కోటి అగస్తేశ్వరాలయం అనే పేరుతో స్థిరపడింది. నారాయణ వనంలో శ్రీనివాసుడు, పద్మావతి ల వివాహం జరిగింది. శ్రీనివాసుడు

పసుపు వస్త్రా లతో తిరుమలకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో తొండవాడలో అగస్త్యుని కోరిక మేరకు ఆ మహర్షి వద్ద ఆరు నెలలు ఉండి

పో యాడు. వెళ్తూ వెళ్తూ ఈ క్షేత్రంలో పెద్ద పాద ముద్ర పడేలా చేశాడు. ఇది హరిహరుల విగ్రహములు కొలువైన వేదిక వద్ద ఉంది.
క్షేత్ర విశిష్ట త

సామాన్యంగా శివాలయాలు, విష్ణు ఆలయాలు వేరు వేరుగా ఉంటాయి. కాని ఇక్కడ ఈ రెండు కలిసే ఉంటాయి. అదే ఈ క్షేత్ర విశిష్ట త. శివ,

కేశవులు ఒకే విగ్రహంలో చెరి ఒక వైపు కనిపించడము ఈ రుద్ర కోటేశ్వరాలయంలో మాత్రమే సాధ్యం. ఒక వైపునుండి చూస్తే శివుడు, మరొక

వైపునుండి చూస్తే శ్రీ హరి దర్శనమిస్తా రు. మరొక విశిష్ట త: పరమశివుని ద్వారా పాలకులు నంది, భృంగి. సాధారణంగా శివాలయల్లో నంది

మాత్రమే ప్రతిష్ఠించబడి ఉంటుంది. కాని ఈ క్షేత్రంలో నంది తోబాటు భృంగి విగ్రహం కూడా ఉంది. ఇది మరో విశేషము.

పూజలు, ఉత్సవాలు

ఈ క్షేత్ర ఆవరణంలో రావి చెట్టు తో పాటు వేప, ఊడగ, చింత, బిల్వ వృక్షాలు ఒకేచ ోట ఉండి ఒక మహావృక్షంగా కనిపిస్తు ంది. మహిళలు

సంతానం కొరకు ఈవృక్షాలకు పూజలు చేస్తా రు. ఈ ఆలయంలో ఏటా కార్తీక మాసం పౌర్ణ మి నాడు రుద్ర పాదాల ముక్కోటీ" పేరుతో పెద్ద

ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తు లు వస్తు ంటారు. కార్తీక మాసంలో మిగతా రోజులు, మహా శివరాత్రి నాడు కూడా

భక్తు లు విశేషంగా తరలి వస్తు ంటారు. ఈ ఆలయంలో హరిహరులతో బాటు విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు, వీరభద్రు డు, సుందరేశ్వరుడు, శ్రీ

కృష్ణు డు ఆంజనేయ స్వామి, అయ్యప్పస్వామి, దుర్గా దేవి, మహాలక్ష్మి దేవతా మూర్తు లు కూడా కొలువై ఉన్నారు.

ఎలా వెళ్ళాలి ?

ఈ క్షేత్రము చిత్తూ రు జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి, చారితక


్ర ప్రదేశమైన చంద్రగిరి మధ్యన తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో

ఉంది. తిరుపతి—చిత్తూ రు, తిరుపతి—చంద్రగిరి వెళ్లే ప్రతి బస్సు ఈ క్షేత్రము ముందునుండే వెడు తుంటాయి. తి.తి.దే వారి ఆలయ దర్శన

బస్సులు కూడా ఇక్కడి నుండే నడుస్తా యి. శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్న కళ్యాణ వేంకటేశ్వరాలయము కూడా ఇక్కడికి అతి

సమీపంలోనే ఉంది.

తిరుపతిలో శివాలయం, కపిల తీర్థం

కపిల తీర్థంలో దాని వివరాలు తెలిపే బో ర్డు . తిరుపతి

కపిల తీర్థంలో ఆంజనేయ ఆలయము

తిరుమల-తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రం. ఇక్కడ తిరుమల లోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంతోబాటు అన్నీ వైష్టవాలయాలే...

గోవిందరాజ స్వామి ఆలయం, కోదండ రామాలయం, కళ్యాణ వేంకటేశ్వరాలయము, వరదరాజ స్వామి ఆలయము, పద్మావతి అమ్మవారి

ఆలయము మొదలగునవన్నీ వైష్ణవాలయాలే. కాని తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయమున్నది. అదే

కపిల తీర్థము.
కపిల తీర్థం (తిరుపతి) ముందున్న నంది

కపిల తీర్థం క్షేత్రము (తిరుపతి)

పురాణేతిహాసము

కృత యుగంలో కపిల మహర్షి ఇక్కడ శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు భూమి చీల్చుకొని వచ్చి ఇక్కడ

వెలిశాడని స్థ ల పురాణం. కపిల ముని తపస్సు కారణంగా వెలసినది ఈశ్వరుడు గాబట్టి ఈ తీర్థా నికి కపిల తీర్థమని, ఇక్కడ వెలసిన స్వామి

కపిలేశ్వరుడని పేరు వచ్చింది. ఇక్కడి శివలింగాన్ని కూడా కపిల లింగమని అంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ దేవదేవుని

పూజించి నందున ఈ లింగాన్ని అగ్ని లింగమని కూడా అంటారు. ఇక్కడి కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువై ఉన్నాడు. ఈ కపిల

తీర్థము పరమ పవిత్రమైనదని పురాణాలు చెపుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లో కాల్లో ని సకల తీర్థా లు నాలుగు

గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తా యని ప్రతీతి.

కపిలతీర్థం కోనేరు ముందున్న మండపము

చారితక
్ర ప్రా శస్త ్యము

11 వ శతాబ్ద ంలో ఈ ప్రా ంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారితక్ర ఆధారాలను బట్టి
తెలుస్తు న్నది. రాజేంద్ర చోళ అనే అధికారి దీని నిర్మాణానికి ముఖ్య సూత్రధారి. చోళులు శివ భక్తితత్పరులు గాన ఈ ఆలయాన్ని వారు

్ర ్ధ లతో నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో విజయనగరాధీశుడైన అచ్యుత దేవరాయలు కాలంలో దీనిని ఆళ్వారు తీర్థంగా
అత్యంత భక్తిశద

మార్చారు. అప్పటినుండి 18 వ శతాబ్ద ం వరకు దీనిని ఆళ్వారు తీర్థంగానే వ్వవహరించేవారు.

కపిల తీర్థం క్షేత్రంలో ఒక ద్వారము

ఆలయ విశిష్ట త

ఎంతోఎత్తు నుండి జాలువారి ఆలయ పుష్కరిణిలో పడే జలపాత దృశ్యం అత్యంత మనోహరంగా, చూపరులకు అమిత ఆనందాన్ని ఇస్తు ంది.

వర్షా కాలంలో తిరుపతి పట్ట ణ ప్రా ంత ప్రజల దృష్టి అంతా ఈ కపిల తీర్థంవైపే. ఈ తీర్థా న్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆళ్వారు తీర్థమని

పిలిచేవారు. ఆ నాడు వైష్ణవులు ఇక్కడి పుష్కరణి చుట్టు నాలుగు మూలల్లో నాలుగు సుదర్శన రాతి శిలలను స్థా పించారు. అదే విధంగా

రాతిమెట్లు , సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. ఆ కారణంగా దీన్ని చక్ర తీర్థమని అనేవారు. ప్రస్తు తం శైవులు, వైష్ణవులు అనే భేదము

లేనందున, అన్ని వర్గా ల భక్తు లు ఈ క్షేత్రా న్ని దర్శిస్తు న్నారు. తి.తి.దేవస్థా నం వారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ

కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో బాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీ కృష్ణు డు, అగస్తేశ్వరుడు,

సుబ్రహ్మణేశ్వరుడు కూడా ఉన్నారు.


పూజలు, ఉత్సవాలు

కపిలతీర్థము పరమ పవిత్రమైనదని పురాణాలు ఘోషిస్తు న్నందున,..... ముల్లో కాల్లో ని సకల తీర్థా లు ఇందులో కొంత సమయం ఉంటాయని

చెపుతున్నందున ఈ తీర్థములో స్నానమాచరించుటకు భక్తు లు ఉవ్విళ్లూ రుతుంటారు. పైనుండి ధారగా పడే జలధారల క్రింద నిలబడి స్నానం

చేయడానికి భక్తు లు పో టీలు పడుతుంటారు. ఆ కారణంగా కార్తీక మాసం ప్రా రంభంకాగానే ఈ తీర్థా నికి భక్తు లు పో టెత్తు తారు. నిత్యం ఈ

తీర్థములో పుణ్య స్నానాలు చేసి పరమేశ్వరునికి దీపాలు వెలిగిస్తా రు. కార్తీక మాసంలో, ఆరుద్రా నక్షత్రం రోజున ..... ఆలయంలో లక్ష

బిల్వార్చన, అన్నాభిషేకము ఘనంగా జరుగుతాయ. శివ రాత్రికి ప్రత్యేక ఉత్సవాలతో బాటు ప్రతి ఏడు పుష్య మాసంలో తెప్పోత్సవాలు,

మాఘ మాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తా రు.

ఈక్షేత్రా నికి ఎలా వెళ్ళాలి ?

తిరుమల, తిరుపతి క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినందున ఈ క్షేత్రా నికి ఎలా వెళ్ళాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్తూ రు జిల్లా లో పవిత్ర

మైన తిరుపతి పట్ట ణానికి ఉత్త రదిక్కున తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి సమీపంలో ఈ క్షేత్రము ఉంది.

గుడిమల్ల ం... పరశురామేశ్వరాలయం, చిత్తూ రు జిల్లా

ఆలయ విశిష్ట త

గుడిమల్ల ం శివాలయం లోని శివుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. దేశంలో ఎక్కడా లేవి విధంగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.

సుమారు ఐదారు అడుగుల ఎత్తు న నిలబడిన పురుషాంగమే ఇక్కడి శివలింగము. ఈ తరహా మూల విరాట్టు మరెక్కడా కనబడదు. ఈ

లింగాకారము పైనే మరొక మానవాకృతి చెక్కబడి ఉంది. ఆ ఆకృతి ఒక పురుషునిపై నిలబడి ఒకచేతిలో ఒక పొ ట్టేలు కాళ్ళను పట్టు కొని,

మరొక చేతిలో ఒక చిప్పను పట్టు కొని భుజానికి గండ్ర గొడ్డ లిని తగిలించుకొని ఉంది. ఇందులోని శిల్పకళ అత్యంత సుందరంగా ఉంది. ఈ

మూల విరాట్టు మొత్త ం కాఫీ రంగు రాతిలో అత్యంత అందముగా చెక్కబడి ఉంది. ఈ ఆలయ గర్భాలయము మిగతా ఆలయ

ఆవరణముకన్నా భూమట్టా నికి సుమారు నాలుగడుగులు లోతులో ఉంది. మూలవిరాట్టు ఆలయ ప్రా ంగణానికి మధ్యలో కాకుండా ఒక

ప్రక్కగా ఉంది. మిగాతా ఆవరణము ఆనగా... అంతరాళము, రంగ మండపము అన్నీ భూ మట్టా నికి సమాంతరంగా ఒక ప్రక్కగా ఉన్నాయి.

గర్భాలయం వెనుక భాగము అర్థ చంద్రా కారంలో ఉంది. మూల విరాట్టు నకు ఎదురుగా ఆలయం గోడలకు రంధ్రా లున్నాయి. ఉదయ భానుని

కిరణాలు నేరుగా మూల విరాట్టు పై పడేటందుకు ఈ ఏర్పాటు చేసారు. ఈ ఆలయము తూర్పు ముఖంగా ఉన్నా తూర్పు ముఖాన ప్రవేశ

ద్వారము లేదు. దక్షిణాన ఉన్న ద్వారం గుండా ఈ ఆలయంలోనికి ప్రవేశించాలి. ఆలయం లోనికి ప్రవేశించగానే ఎడమ చేతి వైపున

భూమట్టా నికి దిగువున మూల విరాట్టు ఉంది.


ప్రస్తు తం ఈ ఆలయంలో ఎలాటి పూజా కార్యక్రమాలు జరగడము లేదు. ఇది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఆ శాఖవారి ఉద్యోగి ఈ

ఆలయానికి పరిరక్షకుడిగా ఉండి చూడ వచ్చిన వారికి చూపెట్టి ఆలయ వివరాలు చెపుతుంటాడు. ఆలయ ప్రా ంగణంలో పాతిన బండలపై

అస్పష్ట ంగా ఉన్న శిలా శాసనాలు చెక్కి ఉన్నాయి. ఈ ఆలయము అతి ప్రా చీనమైనది. చారిత్రా త్మక విషయాలపై ఆసక్తి ఉన్న వారు మాత్రమే

ఈ ఆలయ సందర్శనానికి వస్తు ంటారు. పూజాదికాలు లేకున్నా ఈ ఆలయము చాల ప్రత్యేకతలు సంతరించు కున్నది.

ఎలా వెళ్ళాలి ?.

ఈ ఆలయం చిత్తూ రు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్ల ం అనే చిన్న గ్రా మంలో ఉంది. ఇది ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతికి సుమారు

నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది. రేణిగుంట విమానాశ్రయం ముందు నుండి పాపానాయుడు పేట మీదుగా ఈ క్షేత్రా నికి చేరుకోవచ్చు.

తిరుపతి నుండి విరివిగా బస్సులున్నవి. ప్రత్యేకించి ఈ క్షేత్రా నికి మాత్రమే ఎటువంటి రవాణా సౌకర్యంలేదు. ఇక్కడికి వెళ్లలేని వారు....

చంద్రగిరి కోటలోని వస్తు ప్రదర్శనా శాలలో ..... ఈ ఆలయంలోని మూల విరాట్టు ప్రతిమను తిలకించవచ్చు. రూపు, రంగు, ఆకారము,

పరిమాణము ఇలా అన్నివిధాల ఒకే విధంగా ఉన్న ప్రతి రూపాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శనకు పెట్టా రు.

కాళ్ల కూరు వేంకటేశ్వరస్వామి,. ప.గో. జిల్లా

స్థ లపురాణము

పూర్వం తిరుమల కొండపై శ్రీధరుడనే బ్రా హ్మణుడుండే వాడు. అతను శ్రీవారి ఆలయంలో నాట్యంచేసే పద్మావతి అనే ఆమెను ప్రేమించి తనను

పెండ్లా డమని కోరగా ఆమె తిరస్కరిస్తు ంది. దానికి కోపగించిన శ్రీధరుడు ఆమెను శపిస్తా డు. దానికి కినుక వహించిన ఆమె కూడా శ్రీధరుడిని

శపిస్తు ంది. శాపవిమోచనము కొరకు ఆ ఇద్ద రు శ్రీ వేంకటేశ్వరుని సేవిస్తా రు. దాంతో ఆ దేవ దేవుడు కరుణించి పద్మావతికి తన పేరుతో నదిగా

గోదావరి సమీపాన అవతరిస్తా వని....... శ్రీధరునికి..... బ్రా హ్మణుడిగా జన్మించి అష్ట కష్టా లు పడి శిష్యులతో పద్మావతీ నది తీరంలో తన

విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తా డని .... శాప విమోచన మార్గా లు చెపుతాడు. కొన్నాళ్ల కు శ్రీధరుడు గోదావరి ప్రా ంతాన పద్మావతీ నదీ తీరాన వేంకటేశుని

బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. కాని ఆవిగ్రహం దొ ంగల పాలు కాగా, శ్రీవేంకటేశ్వరుడు... శ్రీధరుని కలలోకొచ్చి ... నదికి పశ్చిమాన

ఉన్న అశ్వత్థ వృక్షంలో శిలారూపంలో ఉన్నానని చెప్పగా,... శ్రీధరుడు ఆ విగ్రహాన్ని తెచ్చి నదికి తూర్పు దిక్కున ప్రతిష్ఠించి పూజించాడు.

అలా ఆ ఇరువురికి శాప విమోచనము కలుగుతుంది. శ్రీధరుడు ప్రతిష్ఠించిన విగ్రహము నడుము క్రింది భాగమంతా భూమిలో కూరుకు

పో యి.... కాళ్లు కనబడకుండా ఉండేది. అందువలన ఆ క్షేత్రా నికి కాళ్ల కూరు అనే పేరు స్థిరపడి పో యింది.

చారిత్రికము

గతంలో మొగల్తూ రు ప్రా ంతాన్ని పాలించిన కలిదిండి రంగరాజు ప్రస్తు తమున్న ఈ ఆలయ నిర్వహణకొరకు 83 ఎకరాల భూమిని దానంచేశాడు.

నేటికీ ఆ భూమి ఈ ఆలయ ఆధీనంలోనే ఉంది. ఇందులో కొంత భూమిలో వరి పండిస్తు ండగా మరి కొంత భూమిలో తోటలు, చేపల చెరువులు

ఉన్నాయి. ఈ క్షేత్రా నికి పూజలే కాదు కోరిక తీరిన భక్తు లు భూములు, ఇతర వసతులు కానుకలుగా సమర్పిస్తు న్నారు. తర్వాతి కాలంలో
అదే గ్రా మానికి చెందిన కొత్త పల్లి రామలింగరాజు దంపతులు 7.50 లక్షల రూపాయలతో భక్తు లకు విశ్రా ంతి గృహాన్ని నిర్మించారు. అలాగే

జవ్వల పల్లె గ్రా మానికి చెందిన గోకరాజు, మహాలక్ష్మమ్మ కుమారుడు నడింపల్లి వెంకట్రా మ రాజు ఇచ్చిన 7 లక్షల రూపాయలతో

కార్యనిర్వాహక అధికారి కార్యాలయాన్ని నిర్మించారు.

ఆలయవిశిష్ట త

పచ్చని పంటపొ లాల మధ్యన ఉన్న గ్రా మంలో కొలువై ఉండటం ఈక్షేత్రా నికి ఒక ప్రత్యేకత అయితే మరొక ప్రత్యేకత స్వామివారికి తల వెనుక

భాగంలో స్త్రీలకి వలె కొప్పు ఉండడము. ఈ విధమైన రూపము దేశంలో మరెక్కడాలేదు. అదే విధంగ స్వామి వారి హృదయంలో లక్ష్మీ దేవి

రూపం కనిపిస్తు ంది. స్వామివారికి కుడి ఎడమల్లో పద్మావతీ, ఆండాళ్ అమ్మ వార్లు దర్శనమిస్తా రు. ఈ స్వామి వారు కోరిన కోరికలను

నెరవేరుస్తా రని ..... పూజలే గాదు ... భక్తు లు భూములు ఇతర వసతులు కల్పిస్తు న్నారు. ఈ ఆలయ ప్రా ంగణము రంగు రంగుల పూలతో,

పచ్చని మొక్కలతో శోభిల్లు తుంటుంది. ఈ ఆలయ ఆవరణములో మనోహర మైన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమాచార్య విగ్రహం

మనోహరంగా కనిపిస్తు ంది. ఇంతటి విశిష్ట తలున్న ఈ ఆలయాన్ని తప్పక సందర్శించ వలసినదే.

పూజలు, ఉత్సవాలు

ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ ఏకాదశి, ఆశ్వయుజ శుద్ధ చతుర్ధశి రోజుల్లో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తా రు. ఆ సందర్భంలో తయారు

చేసే పొ ంగలి ప్రసాదానికి చాల ప్రా ముఖ్యత ఉంది. దానిని తింటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తు ల నమ్మిక, ఈ పులిహో ర

ప్రసాదానికి దేశ విదేశాల్లో ను మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. కొంత మంది భక్తు లు ఈ పులిహో ర పో పు తయారు చేయించుకొని విదేశాలకు

కూడా తీసుకెళుతుంటారు. తిరుమలలో శ్రీ వారి లడ్డు కు దేశ విదేశాలలో ఎంత ప్రా ముఖ్యత ఉన్నదో ఈ ఆలయంలోను పులిహో రకు స్థా నికంగా

అంతటి ప్రా ముఖ్యత ఉంది. ఈ ఆలయంలో శాంతి కళ్యాణం జరిపిస్తే తమ ఇంట మంచి జరుగు తుందని భక్తు ల విశ్వాసం. మొదటిసారి

ఉద్యోగంలో చేరిన వారు ప్రతి ఒక్కరు తమ మొదటి జీతాన్ని ఈ స్వామి వారికి ఇవ్వడము కాళ్ల కూరు పరిసర ప్రా ంతాల్లో సర్వ సాధారణము.

ఈ క్షేత్రా నికి ఎలా వెళ్ళాలి?

ఈ ఆలయము భీమవరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి కలిదిండి మీదుగా పశ్చిమ గోదావరి లోకి ప్రవేశించగానే

ఏలూరుపాడు, జువ్వలపాలెం గ్రా మాలు దాటాక ఈ క్షేత్రము కనిపిస్తు ంది. భీమవరం నుండి ఈ క్షేత్రా నికి ప్రతి అరగంటకు RTC

బస్సులుంటాయి.

తల్పగిరి రంగ నాధస్వామి ఆలయము: నెల్లూ రు

తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయ గాలి గోపురము: నెల్లూ రు

ఈ ఆలయము ఎక్కడున్నది ?

నెల్లూ రు పట్ట ణంలోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డు న ప్రా చీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం ఉంది.

రంగనాధస్వామిని విష్ణు వు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తా రు. ప్రసిద్ధి చెందిన రంగనాధ
స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి

అనువదించాడు.

చారితక
్ర ప్రా ముఖ్యత

12 వ శతాబ్దా నికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది.17 వ శతాబ్ద ం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ
స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

ఆలయ విశిష్ట త

ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తు లుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలి గోపురం పైభాగాన

బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దా రు. గర్భగుడిలోనికి ప్రవేశించే

ఉత్త ర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి ఉంచుతారు.

పూజలు.. ఉత్సవాలు

నిత్య పూజా కార్యక్రమాలు జరిగే ఈ ఆలయంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను

నిర్వహిస్తా రు. ఈ దేవాలయంలోని అద్దా ల మండపం ఇక్కడికి వచ్చే భక్తు లను విశేషంగా ఆకర్షిస్తు ంది. ఈ అద్దా ల మండపంలో పైకప్పుకు

చిత్రించిన శ్రీ కృష్ణు ని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తు న్నట్లు గా ఉండి, మనల్ని మంత్ర ముగ్ధు లను చేస్తు ంది.

మావుళ్ల మ్మ, ప.గో. జిల్లా

చారిత్రిక నేపథ్యం

మామిడి చెట్లు అధికంగా ఉన్న ప్రా ంతంలో వెలసింది గనుక ఈ అమ్మవారికి మామిళ్ళమ్మగా పేరు వచ్చింది. కాల క్రమంలో అది

మావుళ్ళమ్మగా మార్పు చెందినది. ఈ క్షేత్రము చాల పురాతనమైనా 1800 వ సంవత్సరం నుండి మాత్రమే చారిత్రికాధారాలు

లభ్యమవుతున్నాయి. ప్రస్తు తం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రా ంతంలో ఉన్న

వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థా నికుల కథనము. 1880 వ సంవత్సరంలో భీమవరానికి చెందిన మాచిరాజు, గ్రంథి

అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించ వలసినదిగా ఆదేశించిందట. అమ్మవారి ఆదేశానుసారం వారు

అయిదు దీపాలు ఉన్న ప్రా ంతంలో ఆలయం నిర్మించారు. 1910 వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తి న వరదల్లో అమ్మవారి విగ్రహం చాల

వరకు పాడైంది. 1920 లో కాళ్ళ గ్రా మానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం

భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చి దిద్దా డు.
ఆలయ విశిష్ట త

ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధు ని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడము ఇందలి ప్రత్యేకత. అమ్మవారి

ఆలయానికి భక్తు లు సమర్పించిన కానుకలు.... చీరలు వంటి వాటిద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తు ంది. ప్రస్తు తం

అమ్మవారికి ఆభారణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తు వులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర

ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.

దీని కొరకు స్థా నిక ప్రముఖులు.... విదేశాలలో ఉన్నవారు స్పందిస్తు న్నారు. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం

తయారు చేశారు. ప్రస్తు తం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రా మ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి

పెద్ద ఎత్తు న కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్ట త అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటాడు.

పూజలు, ఉత్సవాలు

ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహో రను ప్రసాదంగా భక్తు లకు ఉచితంగా అందిస్తా రు. జ్యేష్ట మాసంలో నెల రోజులు గ్రా మ జాతర, నిర్వహిస్తా రు. దేవీ

నవరాత్రు లలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తా రు. ప్రతి రోజు లక్ష కుంకుమార్చన, చండీ హో మం ఇతర పూజలు నిర్వహిస్తా రు.

ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థా నం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తా రు. ఆ సందర్భంగా సాంస్కృతిక

కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్ట లక్ష్ములుగా అలంకరించి పూజిస్తా రు. చివరిరోజున వేలాదిమంది

భక్తు లకు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.

ఈక్షేత్రం ఎక్కడున్నది?

పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్ట ణమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రము. (మూలం:

ఈనాడు.. ఆదివారము 2012 జనవరి 8)

శ్రీవేదనారాయణస్వామివారి ఆలయం నాగలాపురం .. చిత్తూ రుజిల్లా .

నాగలాపురం, వేదనారాయణస్వామి వారి ఆలయ ప్రధాన గోపురము. పై భాగమంతా ఈ మద్య కాలంలో తి.తి.దే. వారి చే నిర్మించ బడింది.

నాగలాపురం, వేదనారాయణ స్వామి వారి ఆలయ రెండవ గోపురము

స్థ లపురాణము
..

సో మకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. శ్రీమహావిష్ణు వు మత్స్యావతారము దాల్చి

సముద్ర గర్భమున సో మకాసురుని సంహరించి వేదాలను తెచ్చి, బ్రహ్మకిచ్చిన స్థ లము ఇదే. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్య

క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది.

చారితక
్ర ాంశాలు

ఈ ఆలయ ఉత్త కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలియ వచ్చిన విషయం: శ్రీకృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ పర్యటనలో ....

హరికంఠ పురములో పల్ల వులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదనారాయణ

స్వామి ఆలయంగా మార్చి, పంచ ప్రా కారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది,

పునర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురముగా నామకరణము చేసెనని తెలియుచున్నది.

దస్త ం్ర :Dwaja sthambam of nagalapuram temple9.JPG

నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్త ంభం

నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం వెనకనున్న మండపం పైనున్న స్వామి వారి మూర్తి ( ప్రధాన గర్భగుడి లోని మూర్తిని

పో లినది (స్వామి వారు మత్సావతారంలో)

పూజలు

ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్య పూజోత్సవము మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు

తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణ మి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా

జరుగును. ప్రతిరోజు ముప్పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థా నం వారి

ఆధీనంలోనికి వచ్చింది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.

ఆలయ విశేషాలు

ఈ ఆలయ ప్రధాన గోపురమందున్న ద్వారము అతి విశాలముగా నున్నది. దానిపైనుండిన గోపురము కూలిపో గా.... తి.తి.దేవస్థా నం వారు

కొత్త గా గోపురాన్ని నిర్మించారు. కనుక ఇది చిన్నదిగానున్నది. ఈ గోపురం నుండి సాగిన ప్రహరీలో కుడి ఎడమలకు మరో రెండు

గోపురములు ఉన్నాయి. అవి ఆనాటివైనందున శిథిలావస్థ లో నున్నందున ఇనుప స్త ంభాలతో భద్రపరిచారు. బొ మ్మ చూడండి ఈ ప్రా కారంలో

కొబ్బరి తోట, పూల తోటలు ఉన్నాయి. మరెటువంటి కట్ట డాలు లేవు. ఈ ఆవరణంలో వెనుకనున్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రా న్ని

చూడ వచ్చు. ఆ తరువాత రెండో గోపురముతో చుట్ట బడిన ప్రహరీ లోపల ప్రధాన ఆలయమున్నది. అందులోనే కళ్యాణ మండపము, ఇతర

దేవతా మూర్తు ల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రా కారంలో నుండి గర్భాలయం లోనికి వెళ్ళవచ్చు. చాల దూరంలో స్వామి వారి మూల విరాట్టు

ఉంది. మూల విరాట్టు పాదభాగము మత్స్య రూపంలో ఉండగా, శంఖు, చక్రా లు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించ వచ్చు. ఈ
గర్భాలయం చుట్టూ మరో ప్రా ంగణము ఉంది. అందులో వరండాలలో అనేక ఉప ఆలయాలు, దేవతా మూర్తు లతో అలారారు తున్నవి.

గర్భాలయ ప్రదక్షిణకు ఇదే మార్గ ము.

నాగలాపురం, శ్రీ వేదనారాయణ ఆలయ ప్రా ంగణంలో ఉన్న ఆలయ వివరాలను తెలిపే బో ర్డు

నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం ఎడమ ప్రక్కనున్న గోపురము పైభాగము

ఈ ఆలయ ప్రహరీ గోడలు అక్కడక్కడా కూలి పో యినందున తిరిగి నిర్మించి ఉన్నారు. (బొ మ్మ చూడుము) ప్రధాన గోపురాల లోని శిల్ప కళ

చాల అద్భుతంగా ఉంది. ప్రతి రోజు పర్యటక శాఖవారి ఆలయ దర్శన బస్సులు తిరుపతి నుండి నాగలాపురమునకు నడుపబడు చున్నవి.

ఆలయ విశిష్ట త

ఈ ఆలయ విశిష్ట త ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టు కు 630

అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున

స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తా యి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య

పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రా లనుండి కూడా భక్తు లు తండో ప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

ఎక్కడుందీ ఆలయం

ఆంధ్ర ప్రదేశ్... చిత్తూ రు జిల్లా లోని తిరుపతికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి అనేక బస్సులున్నాయి. తి.తి.దే వారి

ఆలయ దర్శన బస్సు ప్రతి రోజు ఇక్కడికి వస్తు ంది. మూలం: స్వయంసందర్శన: స్వామివారి సూర్యపూజా ఉత్సవాల ఆహ్వాన పత్రిక.

అప్పలాయగుంట ... ప్రసన్న వేంకటేశ్వరాలయం, చిత్తూ రు జిల్లా .

అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం ముందున్న, ఆలయ వివరాలు తెలిపే బో ర్డు

దస్త ం్ర :Appalaayagunta s.v. temple.JPG

అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయం ప్రధాన గోపురం

అత్యంత ప్రా ముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ

గుంటలో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొ లాలమధ్య ఆహ్లా దకరమైన వాతావరణంలో వెలసిన అందమైన

చిన్న ఆలయం ఇది.

స్థ ల పురాణం
శ్రీ వేంకటేశ్వరుడు........ నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ

అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్త ంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత

ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురంలో ఆరునెలలు ఉండి

అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థ ల పురాణం.

ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొ లాలు ఉండడముతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన

ద్వారం దాటగానే ధ్వజస్త ంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తు ంది. శ్రీ వారి

ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉంది.

అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయ కోనేరు, దీనికి అవతలనున్నది ఆంజనేయ స్వామి ఆలయం

దస్త ం్ర :Aanjaneya temple infront appalayagunta venkateswara temple0.JPG

అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయం ముందున్న ఆంజనేయ స్వామివారి ఆలయం.

ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు

పూజలు నిర్వహించి, భక్తు లకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తా రు. ఇక్కడకు వచ్చే భక్తు లు తక్కువ ఉన్నందున ఆలయం ప్రశాంత

వాతావరణములో ఉన్నందున భక్తు లు సావధానంగా చిత్త శుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు.

ఈక్షేత్రా నికి ఎలా వెళ్ళాలి?

అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి

పరిసరప్రా ంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడా ఇక్కడి వస్తు ంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.

You might also like