Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

కృష్ణా జలవివాదాల న్యాయస్థా నం

వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.

సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి.

కృష్ణా జలాల పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణా టక, ఆంధ్ర ప్రదేశ్ ల మధ్య తలెత్తి న వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు
ఉద్దేశించినది, బచావత్ ట్రిబ్యునల్. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఏర్పడింది కాబట్టి దీన్ని బచావత్ ట్రిబ్యునల్ అన్నారు. అంతర్రా ష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు
లోబడి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటయింది.

1969 ఏప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా, షంషేర్ బహదూర్, డి.ఎం.భండారి సభ్యులుగా బచావత్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి, కృష్ణా నదిలో
లభ్యమయ్యే నీటిని మూడు రాష్ట్రాల మధ్య పంపకం చేయమని కోరింది.

విషయాలు
ట్రిబ్యునల్ పంపకాలు
వివాదాలు
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ మధ్య కృష్ణా జలవిభజన
మూలాలు, వనరులు
బయటి లింకులు

ట్రిబ్యునల్ పంపకాలు
కృష్ణా నదిలో నమ్మకంగా ప్రవహిస్తుందని అంచనా వేసిన 2060 టి.ఎం.సి. నికర జలాలను 1976లో ట్రిబ్యునల్ కింది విధంగా పంపకం చేసింది.

మహారాష్ట్ర: 560 టి.ఎం.సి.


కర్ణా టక: 700 టి.ఎం.సి.
ఆంధ్ర ప్రదేశ్: 800 టి.ఎం.సి.

పై నీటికి అదనంగా నదిలో 70 టి.ఎం.సి. ఊట (రీజనరేటివ్ ఫ్లో ) ఉంటుందని కూడా అంచనా వేసారు. ఈ నీటిని కూడా పంచాక మూడు రాష్ట్రాల వాటా ఇలా ఉంది.

మహారాష్ట్ర: 585 టి.ఎం.సి.


కర్ణా టక: 734 టి.ఎం.సి.
ఆంధ్ర ప్రదేశ్: 811 టి.ఎం.సి.

పై మొత్తా లకు మించి ప్రవహించే అదనపు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చింది. అయితే ఈ అధిక జలాలపై హక్కును మాత్రం ఆంధ్ర ప్రదేశ్ పొందదు.

స్కీము ఎ, స్కీము బి
ట్రిబ్యునల్ తన నివేదికను స్కీము 'ఎ', స్కీము 'బి' అనే రెండు భాగాలుగా ఇచ్చింది. అయితే తన తుది తీర్పులో మాత్రం స్కీము 'ఎ' ను మాత్రమే ప్రస్తా వించి, స్కీము 'బి' ని
వదలివేసింది. అయితే మూడు పక్షాలు అంగీకరిస్తే స్కీము 'బి' ని కూడా అమలు జరపవచ్చని వివరించింది.
ట్రిబ్యునల్ తీర్పు యొక్క సమీక్ష
బచావత్ ట్రిబ్యునల్ చేసిన పంపకాలను 2000 మే 31 తరువాత మరో అధికారిక సంస్థ చేత సమీక్ష చేయించవచ్చు.

వివాదాలు
ట్రిబ్యునల్ తీర్పులోని అదనపు జలాలను ఆంధ్ర ప్రదేశ్ వాడుకోవచ్చనే అంశం అనంతర కాలంలో వివాదాలకు దారితీసింది. అధిక జలాలను వాడుకునే స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి,
ఆంధ్ర ప్రదేశ్ తన వాటాకు మించి నీటి వినియోగానికై ప్రా జెక్టు ల నిర్మాణం మొదలు పెట్టింది. దీనికి మిగిలిన రెండు రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి. ఈ అభ్యంతరానికి ప్రధాన
కారణం: ఎగువనున్న రెండు రాష్ట్రాలు ట్రిబ్యునల్ తమకు పంచిన భాగపు నీటినే వాడుకునే ఏర్పాట్లు చేసుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం తన వాటాకు మించి వాడుకునేందుకు
ప్రా జెక్టు లు కడుతోంది. (తెలుగుగంగ ద్వారా రాయలసీమకు సాగునీటి సరఫరా అటువంటి ప్రా జెక్టే.) అంతర్జా తీయ జలవినియోగ నియమాల ప్రకారం మొదట వాడుకునే వారికి
మొదటి హక్కు అనే ఒక సూత్రం ఉంది. దాని ప్రకారం తరువాతి ట్రిబ్యునల్ ఏర్పాటయి నీటి పంపకాలు జరిగే సమయానికి ఈ అదనపు జలాలు ఆంధ్ర ప్రదేశ్ కు హక్కు
అయిపోతుందనే భయమే ఈ అభ్యంతరాలకు ప్రధాన కారణం.[1]

ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ మధ్య కృష్ణా జలవిభజన


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, న్యాయస్థా నం కాలాన్ని 2014 నుండి రెండేళ్లు పొడిగించారు. అయినా 2019లో కూడా ఇంకా పరిష్కారం కాలేదు. [2]

మూలాలు, వనరులు
1. VANDANA SHIVA (1991). "Ecology and the Politics of Survival• Conflicts Over Natural Resources in India" (https://web.archive.org/web/2012
0815051853/http://archive.unu.edu/unupress/unupbooks/80a03e/80A03E0h.htm). United Nations University. Archived from the original (http://
archive.unu.edu/unupress/unupbooks/80a03e/80A03E0h.htm) on 2012-08-15. Retrieved 2019-10-27.
2. "జలాల వివాదం తేలేదెప్పుడు" (https://web.archive.org/web/20191028061519/https://www.eenadu.net/stories/2019/10/22/219034707). ఈనాడు.
2019-10-22. Archived from the original (https://www.eenadu.net/stories/2019/10/22/219034707) on 2019-10-28. Retrieved 2019-10-28.
1. "కృష్ణా నదీజలాల పంపిణీ వాస్తవాలు-పరిష్కారాలు" (https://web.archive.org/web/20041206042512/http://www.prajasakti.com/ap_rivers/krishnajalaalu/
krishnawater_dispute.pdf) (PDF). ప్రజాశక్తి. Archived from the original (http://www.prajasakti.com/ap_rivers/krishnajalaalu/krishnawater_dispute.
pdf) (PDF) on 2004-12-06. Retrieved 2006-02-03.
2. బచావత్ ట్రిబ్యునల్ గురించి దక్కన్ హెరాల్డ్ లో (http://www.deccanherald.com/deccanherald/sep02/top.asp)
3. కృష్ణా బేసిన్‌లో వివాదం (https://web.archive.org/web/20070312082913/http://www.hinduonnet.com/fline/fl2209/stories/20050506001403100.htm)

బయటి లింకులు
ట్రిబ్యునల్ తీర్పు పూర్తి పాఠం (https://web.archive.org/web/20060519053955/http://www.irrigation.ap.gov.in/kwdtaward.html)

v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E

ప్రా జెక్టు లు ప్రకాశం బారేజి  · నాగార్జు నసాగర్  · శ్రీశైలం  · తెలుగుగంగ  · ఎ.మాధవరెడ్డి ప్రా జెక్టు  · శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ  · పులిచింతల  · ప్రియదర్శిని జూరాల  · పోతిరెడ్డిపాడు  ·

ఇతరాలు కృష్ణా జలవివాదాల న్యాయస్థా నం

"https://te.wikipedia.org/w/index.php?title=కృష్ణా _జలవివాదాల_న్యాయస్థా నం&oldid=3583871" నుండి వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 19 జూన్ 2022న 16:21కు జరిగింది.

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-ఎలైక్ లైసెన్సు; క్రింద లభ్యం


అదనపు షరతులు వర్తించవచ్చు.
మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.

You might also like