V8

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

7/7/22, 5:33 PM (1) Pranati Television - YouTube

శ్రీ వారాహి న‌వ‌రాత్రుల‌లో భాగంగా ఎనిమదవ రోజు 07 జూలై గురువారం నాడు ఆచ‌రించ‌వ‌ల‌సిన
విధివిధాన‌ము.

కిరిచక్రమనునది వారాహి యంత్రము. వరాహములచే లాగబడుచున్న ది. ఇట్టి రధము ఆరోహించిన వారాహి
దేవి, పరమేశ్వ రికి ఎడమ పార్శ్వ మున ముందుగా నడుచుచుండును. ఈ రథములకు 5 పర్వ ములు కలవు.
మొదటి పర్వ ములో వారాళ్యా ది దేవతలు వారి ఆయుధాలతో ఉంటారు. రెండవ పర్వ ములో బ్రాహ్మీ ,
మాహేశ్వ రీ, కౌమారీ, వైష్ణవీ, మాహేంద్రీ, చాముండీ అను ఆరుగురు, వారికి దిగువ యాకినీ, రాకినీ, లాకినీ,
కాకినీ,శాకినీ, హాకినీ అను ఆరుగురు శక్తు లు వారి ఆయుధములతో ఉంటారు. మూడవ పర్వ మున అంథినీ,
బంధినీ, జృంభిణీ, మోహినీ, స్తంభినీ శక్తు లు దేవమంత్ర పరాయణులై వారి ఆయుధాలతో ఉంటారు.

నాల్గవ పర్వ మున జంభినీ, మోహినీ, స్తంభిణీ అను శక్తు లు వారి ఆయుధములతో ఉంటారు. ఐదవ పర్వ మున
ప్రకాశించే మేఘసమాన శరీరకాంతితో ప్రకాశిస్తూ దండినీ అను వారాహి దేవి అధివసించి ఉండును. పైన
చెప్పి న దేవతలు ఆయా రధముపై పరివేష్టించి ఉంటారని భావిస్తూ , 8వ రోజున శ్రీ వారాహి దేవిని ప్రార్ధించి
పూజించాలి.

ధ్యా నం - శ్లో ॥ హ్రీంకారాసన గర్భి తానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం

సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వ లామ్ | |

వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూ షితా ముజ్జ్వ లాం

త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప రకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||

ధ్యా నించిన తదుపరి దిగువ నామాలను పఠిస్తూ జగన్మా తను ధ్యా నించేది.

ఓం త్రిపురాయై నమః

ఓం త్రిపురేశ్యై నమః

ఓం త్రిపురసుందర్యై నమః

ఓం త్రిపురాసిద్ధయే నమః

ఓం మహాత్రిపురసుందర్యై నమః

ఓం శ్రీవారాహీదేవ్యై నమః

ఓం మహా మహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞ్యై నమః

నమస్తే నమస్తే నమస్తే నమః

నివేదన-కొర్రబియ్యం లేక బియ్య పురవ్వ తో బెల్లం లేక పంచదార, ఆవునెయ్యి , పాలు, సుగంధ ద్రవ్యా లతో
చేసిన పాయసం నివేదించాలి.

https://www.youtube.com/c/PranatiTelevision/community 1/1

You might also like