నేటి వార్తలు (10.10.2022)

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

నేటి వార్త లు (10.10.

2022)

నేటి ప్రత్యేకత: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.


హైడ్రో జన్ ను కనుగొన్న బ్రిటిష్ శాస్త వ ్ర ేత్త హెన్రీ కేవిండిష్ జయంతి(1731)
ప్రముఖ భారతీయ ఆంగ్ల భాషా రచయిత ఆర్. కె.నారాయణ్ జయంతి(1906)
అంతర్జా తీయ వార్త లు:..
● రష్యాను క్రిమియాతో కలిపే కీలకమైన కెర్చ్ వంతెన పై విస్పోటనం తర్వాత రష్యా దళాలు ఉక్రెయిన్ లోని జపో రిజియా పై
క్షిపణి దాడులను తీవ్రతరం చేశాయి. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా పలు అపార్ట్మెంట్లు ధ్వంసం అయ్యాయి.
● ప్రపంచవ్యాప్త ంగా 120 దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు పాల్గొ నే, ద్వితీయ ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియో
స్పెషల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ నేటి నుండి శుక్రవారం వరకు హైదరాబాద్ లో జరగనుంది. జియోస్ ఫేషియల్ ఇన్ఫర్మేషన్
తోడ్పాటుతో ప్రపంచమే ఒక గ్రా మం…. ఎవరు వెనుకబడకూడదు" అనే నినాదంతో జరుగుతున్న ఈ సదస్సును ఉద్దేశించి
రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రసంగించనున్నారు.
● తన భూభాగంపై రష్యా నేతృత్వంలో " ఇన్ డిస్టక ్ర ్టబుల్ బ్రదర్ హుడ్-2022" పేరుతో జరగనున్న కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ
ఆర్గ నైజేషన్ (సి.ఎస్.టి.ఓ.) కూటమికి చెందిన ఆరు దేశాల సైనిక విన్యాసాలను కిర్గిజిస్థా న్ ఏకపక్షంగా రద్దు చేసింది.
● చైనాలో ఈనెల 16న జరగబో యే కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ సదస్సుకు సన్నాహకంగా నిన్న నిర్వహించిన అధికార
కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశంలో అధ్యక్షుడు జిన్ పింగ్ భవిష్యత్తు దార్శనికతపై ఒక వర్క్ రిపో ర్టు ను సమర్పించారు.
జాతీయ వార్త లు:.
● ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లోని మొఢేరా గ్రా మాన్ని దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్తు వినియోగ గ్రా మంగా
ప్రకటించారు.
● దేశంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్ లోని పురాతన మహాకాళేశ్వర్ ఆలయ ఆవరణ అభివృద్ధి
ప్రా జెక్టు తొలిదశ కింద రూ.856 కోట్ల వ్యయంతో నిర్మించిన తొలి దశ "మహాకాల్ లోక్" నిర్మాణాలను ప్రధానమంత్రి నరేంద్ర
మోడీ రేపు ప్రా రంభించనున్నారు.
● ఐఐటి ల వంటి ఉన్నత సాంకేతిక, సాంకేతికేతర విద్యాసంస్థ లలోంచి బో ధనా మాధ్యమంగా క్రమంగా ఇంగ్లీషును తప్పించి,
ఆయా రాష్ట్రా లలో స్థా నికంగా మాట్లా డే భాషలలో బో ధన జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికార భాష పార్ల మెంటరీ కమిటీ
రాష్ట ప
్ర తికి సిఫార్సు చేసింది.
● దేశ రాజధాని నగరమైన ఢిల్లీ లో గత 24 గంటల్లో రికార్డ్ స్థా యిలో 74 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీని ప్రభావంతో
పలు ప్రా ంతాలలో ట్రా ఫిక్ స్త ంభించి పో వడంతో పాటు ఉష్ణో గ్రతలు 10 డిగ్రీల మేర పడిపో యాయి.
రాష్ట ్ర వార్త లు:.
● రాష్ట ్ర సాంస్కృతిక రాజధానిగా పేరుందిన విజయనగరం వైభవాన్ని చాటి చెప్పేలా మూడు రోజులపాటు ఉత్సవాలు
నిర్వహిస్తు న్నామని ఈ ఉత్సవాల ప్రా రంభోత్సవం సందర్భంగా రాష్ట ్ర విద్యాశాఖ మంత్రి బొ త్స సత్యనారాయణ
తెలియజేశారు.
● గత ఆర్థిక సంవత్సరం 2021 22 లో దేశవ్యాప్త ంగా ఈ-గవర్నెన్స్ అమలులో ఆంధ్రపద ్ర ేశ్ రాష్ట ం్ర 4వ స్థా నంలో నిలిచింది.
టాప్-10 రాష్ట్రా లలో తొలి మూడు స్థా నాలలో పశ్చిమబెంగాల్, ఉత్త రప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయి.
● రాష్ట ం్ర లో తొలిసారిగా సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చే డి శాలినేషన్ ప్లా ంటును రూ.400 కోట్ల తో శ్రీకాకుళం
జిల్లా పైడిభీమవరం ప్రా ంతంలో ఏ.పీ.ఐ.ఐ.సి. అభివృద్ధి చేస్తో ంది.
● రాష్ట ం్ర లోని దివ్యాంగులకు మూడు చక్రా ల మోటార్ వాహనాలను ఉచితంగా అందించేందుకు ఈనెల 31వ తేదీలోపు
దరఖాస్తు చేసుకోవాలని, ఆంధ్రపద ్ర ేశ్ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజెన్స్ సహకార సంస్థ
(ఏ.పీ.డి.ఏ.ఎస్.సి.ఎ.సి.) మార్గ దర్శకాలను విడుదల చేసింది.
క్రీడా వార్త లు:
● భారత దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నిన్న రాంచీలో
జరిగిన రెండవ వన్డేలో భారత్, దక్షిణాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ ను 1-1 తో సమం చేసింది.
● నిన్న సుజుకా లో జరిగిన జపనీస్ గ్రా ండ్ ప్రి ఫార్ములా వన్ రేసులో రెడ్ బుల్ కు చెందిన నెదర్లా ండ్స్ రేసర్ మాక్స్ వెర్
స్తా పెన్ విజయం సాధించడం ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 18 రేసులలో 12 విజయాలు సాధించి ఫార్ములా వన్ ప్రపంచ
టైటిల్ ను గెలుచుకున్నాడు.
● పుణె లో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఐ.ఎస్.ఎల్. 9వ సీజన్ మ్యాచ్ లో హైదరాబాద్ ఎఫ్.సి. 3-3 తో ముంబై సిటీ
ఎఫ్. సి. పై డ్రా చేసుకుంది.
● బెంగళూరులో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ పీ.కే.ఎల్. 9వ సీజన్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లలో తెలుగు టైటాన్స్
జట్టు , బెంగాల్ వారియర్స్ చేతిలో ఓటమిపాలవగా, బెంగళూరు బుల్స్ జట్టు పూణే రి పల్టా న్ పై విజయం సాధించింది.
● ఆస్ట్రేలియా తో మూడు మ్యాచ్ ల టి-20 సిరీస్ లో భాగంగా నిన్న పెర్త్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లా ండ్ జట్టు 8
పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ను ఓడించింది.
జిల్లా వార్త లు:
● ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా విద్యార్థు లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా శ్రీహరికోటలోని సౌండ్ రాకెట్
కాంప్లెక్స్ నుంచి నేటి ఉదయం 11:40 గంటలకు రోహిణి సౌండ్ రాకెట్ ఆర్ హెచ్ 200 ప్రయోగం చేపట్ట నున్నారు.
● తిరుపతి, చిత్తూ రు జిల్లా లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న డిప్లమా సీట్లకు ఈనెల 13వ తేదీన స్పాట్
అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు.
Prepared by B.C.Raju, Lecturer in Govt.DIET, KARVETINAGR

You might also like