Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 30

హరిః ఓం

పరమేశ్వర స్వరూపమయిన సభకు నమస్కారము

గుణాద్రూ పా గుణాచ్చాపి ప్రీతి భూయోవర్ద తః అంటారు వాల్మీకిమహర్షి. ఎందుచేత అంటే


ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి ఎందుకు అంత
ప్రియామయిన భార్య కాగలిగింది అంటే దశరధమహారాజుగారు తనకి భార్యగా నిర్ణ యించి
చేసినటువంటి పత్ని కనుక. కేవలము ఆ కారణము చేత భార్య అయిన మాట యధార్ధ ము అయినా
తదనంతరము ఆవిడ తన సౌందర్యము చేత అతిశయించిన గుణసంపద చేత రామచంద్రమూర్తికి
అత్యంత అనుకూలమయినటువంటి ఇల్లా లు అయినది. ఒండురులు ఒకరి హృదయములో ఒకరు
ద్విగుణీకృతముగా భాసించి ఒకరి హృదయము ఒకరు పుచ్చుకున్నవారయి ఇద్ద రిదీ ఒకటే
హృదయమయి ఏకాత్మన ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యముగా గడుపుతున్నారు అని బాలకాండను
పూర్తి చేసారు.

ఇవ్వాళ అయోధ్యకాండను ప్రా రంభము చేస్తా రు, అయోధ్యకాండ యధార్ధా నికి


రామాయణానికి నిజానికి ఆయువు పట్టు . ఎందుచేత నేను ఈ మాట అంటున్నాను అంటే
అయోధ్యకాండ అంతా ధర్మాల గురించే ఉంటుంది, చాలా ప్రధానముగా ఒక దశరధమహారాజుగారి
పాత్ర ఎలా నడుస్తు ంది ఎప్పుడెప్పుడు ఎటువంటి భావావేశానికి లోనవుతుంది, ఆయన జీవితము
అయోధ్యకాండలోనే పూర్తి అయిపో తుంది. అలాగే రామచంద్రమూర్తి పరమ ధర్మాత్ముడిగా ఎలా
ప్రవర్తించి మనకందరికీ ఆదర్శప్రా యుడు అవుతాడు, తండ్రి దగ్గ రకు వెడితే ఎలా ప్రవర్తిస్తా డు, తల్లి
దగ్గ రకు వెడితే ఎలా ప్రవర్తిస్తా డు, భార్య దగ్గ రకు వెడితే ఎలా ప్రవర్తిస్తా డు, తమ్ము దగ్గ రకు వెడత
ి ే ఎలా
ప్రవర్తిస్తా డు, ప్రజల దగ్గ రకు వెడితే ఎలా ప్రవర్తిస్తా డు, గురువుల దగ్గ రకు వెడితే ఎలా ప్రవర్తిస్తా డు,
ఒకవేళ సత్యమునకు ధర్మమునకు వ్యతిరిక్తముగా తనకి విశేషమయినటువంటి ఫలము ఏదయినా
వచ్చినా స్వీకరిస్తా డా, సత్య ధర్మముల వైపు మొగ్గు చూపుతాడా.

రామాయణములో ఏయే పాత్రలు సత్యాన్ని పట్టు కుని ధర్మాన్ని వదులుతాయి, ధర్మాన్ని


పట్టు కుని సత్యాన్ని వదులుతాయి, కానీ రాముడు ఒక్కడు మాత్రము సత్యధర్మములను
సర్వకాలముల యందు ఎలా అనుష్టా నము చేస్తా డు అని మనకి ప్రత్యేకించి గృహస్తా శ్రమములో
ప్రవేశించడము అనేటటువంటిది మనుష్యజీవితములో కీలకమయిన ఘట్ట ము. ఎందుచేత అంటే
మనము గృహస్తా శ్రమములో ప్రవేశించేది దేని కొరకు అంటే ధర్మపత్ని గా స్వీకరిస్తా ము భార్యను,
ధర్మపత్ని అంటే మనని ధర్మము నందు ప్రవర్తింప చేయడము కోసమని ఆవిడ మనకి
ఆలంబనముగా తోడుగా వచ్చింది. ఆవిడ మనచేత ఉద్ద రింపబడాలి, మనము ఆవిడని ఉద్ద రంి చాలి
ఇద్ద రూ కలిసి ఒకరి చేయి ఒకరు పట్టు కుని ధర్మమార్గ ములో ముందుకు నడుస్తా రు. అందుచేత
గృహస్తా శ్రమము అనేటటువంటిది పరామపావనమయిన ఆశ్రమము.

అటువంటి ఆశ్రమములో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఆచారకాండ ఉంది కానీ మనము


అవన్నీ చదవగలమా, నిజంగా అటువంటి సన్నివేశము వచ్చినప్పుడు జ్ఞా పకములో ఉంటాయా,
కానీ రామాయణము అయోధ్యకాండ కాని జీర్ణ ము అయ్యిందనుకోండి, అయోధ్యకాండ బాగా
మనసులోకి వెళ్ళిందనుకోండి మీకేమి భయము ఉండదు ఇంక. ప్రతీ సందర్భములోను కూడా
రాముడు స్పురణలోకి వస్తూ ంటాడు, ఈ ఈ ఘట్టా లలో రాముడు ఇలా ప్రవర్తించాడు కదా మనకి
ఎందుకు ఆదర్శము కాదు, రాముడు నరుడిగా ప్రవర్తించాడే, రాముడు దేవుడిగా ప్రవర్తించలేదు.

రాముడు దేవుడిగా ప్రవర్తించాడు అని మీరు చదివితే అయోధ్యకాండ ప్రత్యేకించి ఆ కాండకు


ప్రయోజనము ఏమీ ఉండదు. ఎందుచేత అంటే రాముడు దేవుడు కనుక అలా ప్రవర్తించాడు,
రాముడు దేవుడు కనుక తండ్రికి నమస్కరించాడు, రాముడు దేవుడు కనుక రాజ్యాన్ని వదిలిపెట్టా డు
మేమెలా వదిలిపెడతాము అనుకుంటే అయోధ్యకాండ వినడము కాదు అసలు రామాయణము
వినడము అనవసరము. రామాయణాన్ని ఎప్పుడు చదివినా రామాయణములో రాముడు దేవుడు
అని చదివితే అంతకన్నా అర్ధ రహితమయిన విషయము ఇంకొకటి లేదు. రాముడు కేవలము
నరుడు, మనిషిగా రాముడు జీవిస్తు న్నాడు రాముడు కూడా ఒక మనుష్యుడే అన్న భావనతో
మీరుండాలి.

అందుకే చతుర్ముఖ బ్రహ్మాదులు వచ్చినా సరే యుద్ధ కాండలో నువ్వు సాక్షాత్తు


శ్రీమన్నారాయణుడివి అన్నారు. ఆయన అన్నాడు మీరేదో చెపుతున్నారు నాకేమీ
తెలియడములేదు, నేను విష్ణు వు ఏమిటి, నేను నారాయణుడు ఏమిటి కాదు నాకు
తెలుసున్నంతవరకు నేను దశరధమహారాజుగారి కుమారుడిని, నేను దాశరధిని, రాముడిని అంతే
అన్నాడు. అందుకని ఆయన మనసా వాచా ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తా డో అలా ప్రవర్తించాడు.
ఆయాన్నే శ్రీమన్నారాయణుడిగా ప్రవర్తించాలి అనుకుంటే సుదర్శనాన్నే ప్రయోగించవచ్చు
రావణాసురిడి మీదకు, కాని ప్రతిద్వంధి అయినటువంటి వాడు రావణాసురిడి మీద యుద్ధ ము
చేసినప్పుడు ఎలా అలిసిపో తాడో తాను అలా అలసిపో యాడు. ఆసాంతము మనకు గురువుల
యొక్క అనుగ్రహము చూపించాడు, ఎందుకని రామాయణములో రామచంద్రమూర్తి యొక్క
జీవితాన్ని రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని అంత అందముగా తీర్చి దిద్దినటువంటి
మహాపురుషులు వశిష్టు లు విశ్వామిత్రు డు. ప్రా రంభములో వాళ్ల యితే వెళ్ళేకొద్దీ రామాయణములో
రామచంద్రమూర్తి జీవితములో, ఆయన జీవితాన్ని ప్రభావితము చేసినటువంటి వ్యక్తు లను మీరు
చూడండి సర్వకాలములయందు గురువులే.

అరణ్యకాండలోకి వెళ్ళేటప్పటికి ఇంక ప్రా రంభము అవుతారు మనకి ఆశ్చర్యము వేస్తు ంది
ఏమిటిరా వీళ్ళ జీవితాలు, ఏమి మహర్షు లురా అనిపిస్తు ంది. శరభంగుడు, సుతీక్షణుడు, శబరి
వరుసగా వీళ్ల ందరూ వస్తా రు, వీళ్ల o దరినీ మించి మకుటాయమానమయిన వ్యక్తి మహానుభావుడు
అగస్త్యుడు వీళ్ల ందరూ వస్తా రు. వీళ్ల ందరి అనుగ్రహాన్ని పొ ందుతాడు, చిట్ట చివర కూడా యుద్ధ కాండలో
రామచంద్రమూర్తి రావణాసురుడిమీద యుద్ధ ము చేసేటప్పుడు అలసటకు లోనయితే ఒకరు
పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి ఆదిత్యహృదయాన్ని ఉపదేశము చేసన
ి టువంటివాడు
అగస్త్యుడు. మనకి రామాయణము జీవితములో గొప్ప ధైర్యాన్ని ఇస్తు ంది, నువ్వు సత్యధర్మాల్ని
పట్టు కో వెతుక్కోవలసింది ఏమీ ఉండదు. నీ అంత నువ్వుగా ఎన్ని తెచ్చుకు దాచుకుంటావు, ఎన్ని
తెచ్చి సంపాదించుకుంటావు, ఎన్ని తెచ్చి రావాలిసనటువంటి కష్ట ము నుంచి గట్టెక్కగలవు. ఎన్ని
తెచ్చి దాచుకోండి, ఎన్ని తెచ్చిపెట్టు కోండి కష్ట ము అనేటటువంటిది వెన్నాడుతూనే ఉంటుంది. మీ
శక్తితో కష్టా న్ని అధిగమించగలను అనుకున్నంతకాలము కూడ అహంకారము లోపల ఉన్నంత
కాలము కూడా పరివేదన ఉంటూనే ఉంటుంది.

కష్ట మే కానివ్వండి సుఖమే కానివ్వండి ఇదంతా వెనకనుండి మా రామచంద్రమూర్తి


ఇస్తు న్నారు, నేను సత్యధర్మములను నమ్మి ఉన్నాను అని ఉంటే అటువంటివాడికి పిలిచినా
పిలవకపో యినా భగవంతుని యొక్క శక్తి ఎలా కటాక్షింప బడుతుందో మనకి రామాయణము
నిరూపించి చూపిస్తు ంది. ఎందుచేత అంటే యుద్ధ కాండలో ఇంద్రజిత్తు నాగాస్త మ
్ర ులతో బంధించాడు,
బాణములు పాములుగా మారుతాయి, ఇంద్రజిత్తు కు ఉన్న గొప్పతనము అది. అవి వచ్చి
కట్టేసాయి, కట్టేస్తే చలనము లేకుండా పడిపో యారు యుద్ధ భూమిలో రామలక్ష్మణులు, పడిపో తే
ఎవరు పిలిచారు ఎవరూ పిలవలేదు గరుత్మంతుడు వచ్చాడు. వస్తే ఆ పాశములన్నీ కూడా
నాగపాశములు విడిపో యాయి, విడిపో తే రామలక్ష్మణులు స్పృహలోకి వచ్చారు, గరుత్మంతుడిని
చూసారు, గరుత్మంతుడు కౌగలించుకుని ఒక మాట అన్నాడు, నన్ను గరుత్మంతుడు అంటారు నీకు
నాకు ఏమి స్నేహము ఎప్పటి స్నేహము నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు రక్షించావు ఈ
ప్రశ్నలు అడగకు రామా నీకు తెలుస్తు ంది నీకు నాకు ఉన్న స్నేహము ఏమిటో ముందు తెలుస్తు ంది
అంటాడు. ఎందుకు రామచంద్రమూర్తికి ఎలా వచ్చి సహకరించాడు.

అందుచేత అలసిపో తే అగస్త్యుడిని ఎవరు పిలిచారు, వచ్చి మీరు నాకు ఆదిత్యహృదయాన్ని


ఉపదేశము చెయ్యండి అని రామచంద్రమూర్తి ఏమయినా అడిగారా, ఏం అంతమంది తతో యుద్ధ
పరిశ్రా ంతం సమరే చింతాయస్థితమ్ రావణం చాగ్రతా దృష్ట్వా యుద్ధా య సముపాస్థితం, దైవతస్చ
సమాగమ్య ద్రష్టు మభ్యాగత తోరణం ఉపాగమ్యా బ్రద్రా విమా ఆగస్త్యో భగవాన్ ఋషి ః అంటారు. ఏం
రావణుడికి ఉపదేశము చెయ్యకూడదా, చెయ్యరు, వేదము చదువుకోలేదా చదువుకున్నాడు, పూజ
చెయ్యడా చేస్తా డు అయినా ఎందుకు రామచంద్రమూర్తికి మాత్రమే ఆదిత్యహృదయము ఉపదేశము
చేసారు అంటే ఆయన జీవితములో విడిచిపెట్టనివి రెండే.

సత్యాన్ని ధర్మాన్ని ఆయన విడిచిపెట్టడు, ఈ రెండు విడిచిపెట్టకుండా ఉండడానికి కారణము


ఈ రెండిటిని అంత గట్టిగా పట్టు కోగలగడానికి కారణము గురువులు చెప్పినటువంటి మాటలు. అవి
రాముడి జీవితములో ప్రభావితము చేసాయి. ఆ రెండిటి పాదములు పట్టు కున్నాడు, ఎన్ని
కష్ట ములనయనా ఓర్చుకున్నాడు, అందుకని రాముడు రాజారాముడు ఆయ్యాడు, సీతారాముడు
అయ్యాడు ఇవ్వాళ మనకందరికీ ఆదర్శప్రా యుడు అయ్యాడు.

దీనికి మెట్లు ఎలా ఎక్కాలో జీవితము ఎలా ఉంటుందో ఒక్కొక్క పాత్ర ఎలా మారుతుందో
ఎలా మాట్లా డుతుందో మనకి నిజంగా శల్యులాయిడ్ మీద సినిమా చూపించినట్టు ఎంత అందముగా
వాల్మీకిమహర్షి ఆ పాత్రలని చూపిస్తా రో ఎక్కడెక్కడ ఏ పాత్ర వైక్లభ్యాన్ని పొ ందుతుంటుందో
సత్యధర్మాలని అనుష్టా నము చెయ్యడములో ఒక్క రాముడు మాత్రము మారకుండా ఎలా
నిలబడతాడో , రాముడిని పట్టు కున్నవాడిని కూడా ఎలా నిలబెడతాడో మనకి అయోధ్యకాండ
నిరూపిస్తు ంది. అందుకే నాకయితే అనిపిస్తు ంది వ్యక్తిగతముగా అయోధ్యకాండ లాంటి కాండ
రామాయణములో ఇంకొకటి లేదు, సుందరాకాండ పరమోత్కృష్ట మయిన కాండ సందేహము లేదు
కానీ అది ఉపాసన కాండ. కానీ సామాన్యమయినటువంటి వ్యక్తి జీవితము దగ్గ రనుంచి ఎలా
నడవాలో, నడువడి ఎలా ఉండాలో నిరూపించాలంటే అయోధ్యఖాండే . అంత పరమోత్కృష్ట మయిన
కాండని ఇవాళ ప్రా రంభము చేస్తు న్నాము.

ఇందులో వాల్మీకిమహర్షి మొట్ట మొదట శ్లో కాన్ని రచిస్తూ అంటారు గచ్చతా మాతులకులం
భరతేనా తదానఘః, శత్రు ఘ్నో నిత్యశత్రు ఘ్నోనీతః ప్రీతిపురస్కృతః అంటూ మొదలుపెట్టా రు.
గచ్చతా అంటూ మొదలుపెట్టా రు అదో గమ్మత్తు వాల్మీకి రచనావైచిత్రి ఎంత అందముగా
మాట్లా డుతారో చూడండి గచ్చతా వెళ్ళాడు అన్నారు. వెళ్ళిపో యినది అన్న శబ్ద ముతో ప్రా రంభము
అయ్యింది అయోధ్యఖండ. అయోధ్యకాండ పూర్తిఅయిపో యేటప్పటికి రాముడు అరణ్యవాసానికి
వెళ్లి పో తాడు, లక్ష్మణుడు రాముడి వెంట వెళ్లి పో తాడు, భరతుడు నందిగ్రా మానికి వెళ్లి పో తాడు.

ఇప్పటివరకు ఇన్ని తరాలనుంచి అయోధ్యలో ఉన్న సింహాసనము నందిగ్రా మానికి


వెళ్లి పో తుంది, ఎందుకని పరిపాలన అంతా అక్కడ జరుగుతోంది సింహాసనము అక్కడ ఉన్నట్టే లెక్క
అందుకని నంది గ్రా మానికి వెళ్లి పో తుంది. దశరధమహారాజుగారు శరీరాన్ని విడిచిపెట్టి ఊర్ధ ్వలోకాలకు
వెళ్లి పో తాడు. ఇన్నీ వెళ్లి పో తాయి అన్నీ వెళ్లి పో వడము ప్రా రంభము అవుతోంది, ఇంక కదలడము
ప్రా రంభము అవుతోంది, ఇప్పటివరకు వశిష్ట విశ్వామిత్రా దుల చేత శిక్షింపబడినటువంటి
మహో త్కృష్ట మయినటువంటి బుద్ధి కలిగిన రాముడు కూడా కదలడము ప్రా రంభిస్తు న్నాడు. మనకి
పాఠము ప్రా క్టికల్ గా ఆచరణ పూర్వకముగా అయోధ్యకాండలో ప్రా రంభము అవుతోంది. అందుకే
మొదటిశ్లో కము గచ్చతా అని మొదలవుతుంది.

గచ్చతా మాతులకులం భరతేనా తదానఘః, శత్రు ఘ్నోనిత్యశత్రు ఘ్నో నీతః ప్రీతిపురస్కృతః


ఆ శతృఘ్నుడు భరతునిచేత తీసుకుపో బడ్డా టుట, ఎక్కడకి అంటే భరతుడు మాతులకులం తన
మేనమామగారింటికి వెడుతున్నాడు యుధాజిత్తు గారింటికి. అయితే యుధాజిత్తు గారు అసలు
బాలకాండలోనే వచ్చాడు, కేకయ రాజుగారి కూతురు కైకేయి, ఆ కైకేయమ్మ యొక్క తమ్ముడు
యుధాజిత్తు అందుచేత యుధాజిత్తు భరతుడికి మేనమామ అవుతాడు. ఈయన ఈ యుధాజిత్తు
బాలకాండలో సీతారామకల్యాణము కొసమని దశరధమహారాజుగారు మిధిలానగరానికి వెళ్ళినప్పుడు
ఆయోధ్య వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పారు, వివాహాన్ని పురస్కరించుకుని,
తన కుమారులకు వివాహము చెయ్యడము కోసము సంబంధాలు నిశ్చయము చెయ్యడము కోసము
దశరధమహారాజుగారు మిధిలా నగరానికి వెళ్లా రని చెప్పారు.
ఈ మాట వినగానే యుధాజిత్తు బయలుదేరి ఆకడకు వెళ్ళాడు మిధిలానగరానికి. వెడితే
దశరధమహారాజుగారు చూసి ఆశ్చర్యపో యారు, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగారు. అడిగితే
మేము అయోధ్యకు వెళ్లా ము, కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రు లు వారు చెప్పారు, మీరు మా
మేనళ్లు ల్ల వివాహప్రయత్నములో మిధిలానగరానికి వచ్చారని తెలిసింది, అందుకని నేను కూడా
మిధిలకు వచ్చాను అన్నాడు. అందులో ప్రేమకి ప్రేమా ఉంది ఎందుచేత అంటే మనకి శాస్త మ
్ర ులో
ఒక మాట ఉంది మేనమామల ముద్దు మేలయిన ముద్దు , తాతలకు తా ముద్దు తాను అబ్బాయి
అని. అపారమయిన ప్రేమ ఎవరిది మేనమామది, మేనమామ మేనల్లు డిని తన కొడుకుని కలిపి
సమానముగా చూడగలడు అంది శాస్త మ
్ర ు, అందుకని మేనమామల ముద్దు మేలయిన ముద్దు
చాలా ప్రేమగా చూస్తా రుట మేనమామ.

మేనమామగారు కనుక తన మేనల్లు డు అయినటువంటి భరతుడుకి వివాహము


జరుగుతోందని తెలిసి అక్కడకు వెళ్ళాడు, అంత ప్రేమగా పిలవకపో యినా వచ్చినటువంటి అతిధి
కనుక విశిష్ట అతిధిగా బావించారు దశరధమహారాజుగారు. అందుకని విశేషమయినటువంటి
సత్కారము చేసారు, వివాహము అయిపో యిన తరువాత యుధాజిత్తు తన సామ్రా జ్యానికి వెళ్లి పో తూ
తన మేనల్లు డు అయినటువంటి భరతుడిని తన ఇంటికి పంపించవలసినదిగా దశరధ
మహారాజుగారిని అడిగారు, అందుకని అయోధ్యకు వచ్చినతరువాత దశరధమహారాజుగారు తన
కుమారుడు అయినటువంటి భరతుడిని మేనమామగారింటికి పంపారు. అయితే భరతుడు వెడితే
అర్ధ ము ఉంది ఎందుకంటే మేనమామగారి ఇల్లు కాబట్టి వెళ్ళాడు, కానీ తోచీ తోచనమ్మ తోడికోడలు
పుట్టింటికి వెళ్లి ందని మద్యలో భరతుడు వెడితే శతృఘ్నుడు ఎందుకు, పో నీ భరతుడు శతృఘ్నుడు
వరసకు అన్నదమ్ములే తప్ప ఏకోదరులు కారు. ఎందుచేత అంటే భరతుడు కైకమ్మ యొక్క
సంతానము, శతృఘ్నుడు సుమిత్ర యొక్క సంతానము, లక్ష్మణ శతృఘ్నులు సుమిత్రకు
జన్మించారు. అటువంటప్పుడు భరతుడు మేనమామ గారింటికి వెడుతున్నప్పుడు శతృఘ్నుడు
వెళ్లడము ఏమిటి, పో నీ వెళ్ళాడు అంటే నేనూ వస్తా ను అందాకా అన్నయ్యా అని ఒక మాట అడిగితే
అర్ధ ము ఉంది, కానీ అలా వెళ్ళినవాడు కాడుట నీతః తీసుకుపో బడ్డా డు.

భరతుడు తీసుకుపో యాడుట, తీసుకుపో తే ఆయనతో పాటు వెళ్లి పో యాడుట మనకి


రామాయణములో చాలా తక్కువగా కనపడి తళుక్కుమని మెరిసే పాత్రలలో శత్రు ఘ్న పాత్ర ఒకటి.
మీకు శత్రు ఘ్న పాత్ర అయోధ్యకాండలో ఇంకోసారి మెరుస్తు ంది. ఎక్కడమెరుస్తు ందో ఆ సందర్భము
వచ్చినప్పుడు చెపుతాను, ఎందుకంటే ఎలాగూ రామాయణము చెపుతున్నాము కనుక మళ్ళీ
నేనోసారి అటెళ్ళి మళ్ళీ ఇటొచ్చి ఎందుకు అనవసరము. అందుకని మెరిసినప్పుడు మెరుస్తో ంది అని
చెపుతాను, మెరిసినప్పుడు మెరుస్తో ంది అని చెప్పడము అవివేకము. అందుచేత ఇక్కడ మెరిశాడు
ఒకసారి, ఎలా నీతః తీసుకుపో బడి అది ఆ శ్లో కము ఉన్న అందము. ఎలా తీసుకుపో బడ్డా డుట,
భరతుడు వెడుతున్నాడు, శత్రు ఘ్నుడినీ తీసుకుని వెళ్లి పో యాడు. ఎందుకు వెళ్లి పో తాడు అలాగ,
అంటే భరతుడిని విడిచి శతృఘ్నుడు ఉండలేడు కనుక, అందుకని భరతుడితో వెడతాడు. ఏది
శతృఘ్నుని యొక్క శీలము, అంటే ఆయన పేరు శతృఘ్నుడు అని పెట్టా రు మహానుభావుడు
వశిష్ట మహర్షి. ఎందుకు పెట్టా లి, అంటే శత్రు వులను జయించినవాడు కనుక, ఏ శత్రు వులని
జయించాడు, అప్పటివరకు శతృఘ్నుడు ఏ రాజుగారి మీదకు అయినా యుద్ధా నికి వెళ్ళి ఎవర్ని
అయినా చంపినట్టు ఉందా రామాయణములో, ఎక్కడా లేదు మరెందుకు శతృఘ్నుడు అంటే ఆయన
గెలిచినటువంటివి రెండు ఉన్నాయి. ఈ రెండూ ఎవ్వరూ గెలవలేనివి ఆయన మాత్రమే గెలిచినవి,
అవి అహంకార మమకారములు ఈ రెండిటిని ఎవ్వరూ గెలవలేరు.

భరతుడు కైకమ్మ కొడుకు, శతృఘ్నుడు సుమిత్ర కొడుకు ఆ మాటకొస్తే భరతుడు కైకమ్మ


కొడుకు కనుక మూడో భార్య కొడుకు, శతృఘ్నుడు సుమిత్ర కొడుకు రెండవ భార్య కొడుకు అందుచేత
యధార్ధ మునకు భరతుని కన్నా శతృఘ్నుని స్థా నము ఉద్దా త్త మే ఎక్కువే. అటువంటివాడు
ఎప్పుడూ భరతుడిని శాసించడము కానీ నేను సుమిత్ర కొడుకుని అన్న భావన ఉండదు. కానీ
పుట్టు కులో మాత్రము భరతుడికి శతృఘ్నుడు తమ్ముడు, ఎందుకని భరతుడి కన్నా వెనక
పుట్టా డు. లక్ష్మణుడు, శతృఘ్నుడు ఏకకాలములో జన్మించారు ఉదయము భరతుడు పుట్టా డు
మధ్యాహ్నము వాళ్ళు పుట్టా రు, అందుచేత తమ్ముడు అవుతాడు శతృఘ్నుడు, అన్నగారు
భరతుడు. అన్నగారు భరతుడయినా మీరు ఒక్క విషయము ఆలోచించాలి, ఇద్ద రికీ ఎంత తేడా
ఓపూట, ఆయన పొ ద్దు న ఈయన మధ్యాహ్నము ఎవరితో కలిసి ఉండాలి ఇద్ద రూ కవలపిల్లలు
పుట్టినవారు లక్ష్మణ శతృఘ్నులు పుట్టా రు. పుట్టినప్పుడు శతృఘ్నుడు ఎప్పుడూ ఎవరితో ఉండాలి
లక్ష్మణుడుతో ఉండాలి, కానీ ఎవరితో ఉంటాడు లక్ష్మణుడి పక్కన కనపడడు.

ఎవరిపక్కన కనపడతాడు భరతుడి పక్కన కనపడతాడు, లక్ష్మణుడు ఎక్కడ కనపడతాడు


రాముడి పక్కన కనపడతాడు. సుమిత్రకు ఉన్నది ఇద్ద రు సంతానము, కానీ ఇద్ద రూ ఎప్పుడూ
తనింట్లో ఉండరు ఇది గమ్మత్తు . అసలు కౌసల్యకు ఒక్కడే కొడుకు రామచంద్రమూర్తి, ఆయన
కౌసల్యమ్మగారింట్లో ఉంటాడు, భరతుడు కైకమ్మకు ఒక్కడే కొడుకు కైకమ్మ ఇంట్లో ఉంటాడు,
సుమిత్రకు ఇద్ద రు కొడుకులు లక్ష్మణ శతృఘ్నులు ఇద్ద రూ ఇంట్లో ఉండరు. లక్ష్మణుడేమో రాముడు
దగ్గ రకు వెళ్లి పో తాడు, శతృఘ్నుడేమో భరతుడు దగ్గ రకు వెళ్లి పో తాడు. ఇద్ద రూ చెరుకొకరి దగ్గ రా
ఉంటారు.

ఇదే రామాయణములో ఆశ్చర్యము. ఎందుకు అలా ఉంటారు, అంటే భగవంతుడిని


ఆశ్రయించి లేదా సర్వకాలములయందు ధర్మమును ఆశ్రయించి అనుష్టా నము ఉంటుంది. ధర్మము
రాముడు, ఎందుకు రామో విగ్రహవాన్ ధర్మః రాశీభూతమయినటువంటి ధర్మాన్ని
రామచంద్రమూర్తిగా చూస్తే అనుష్టా నము లేనటువంటి ధర్మము అయోమయము. అందుకని
లక్ష్మణుడు సర్వకాలములయందు సేవ చేస్తా డు అందుకని ధర్మముతో అనుష్టా నము కలిసి
ఉంటుంది. భరతుడు భక్తి, భక్తి శక్తితో కలిసి ఉంటుంది, శక్తి లేని భక్తి అర్ధ రహితము ఎందుచేత భక్తి
ఉన్నదనుకోండి నీ అశక్త త జ్ఞా పకము రాకూడదు. అందుకని భరతశతృఘ్నులు ఒకచోట ఉంటారు,
రామలక్ష్మణులు ఇద్ద రూ ఒకచోట ఉంటారు. అయితే తీసుకుపో బడ్డా డు అనడములో మాత్రము
పెద్దలు ఒక అద్భుతమయిన విషయము దర్శనము చేసారు. శత్రు ఘ్నః నీతః తీసుకుపో బడ్డా డు,
ఎందుకు తీసుకుపో బడ్డా డు అంటే ఇది సర్వకాలములయందు భరతుడిని ఆశ్రయించేటటువంటి
శతృఘ్నుడు భక్తి ఎక్కడ ఎక్కువగా వెతుక్కోబడుతుంది అంటే భగవంతుడిలో వెతుక్కోము
యధార్ధ ము. భగవంతుడి దగ్గ రకు వెళ్ళి మీరు భక్తిగా ఉండడానికి ఆయన పట్ల భక్తిగా ప్రవర్తించడానికి
భగవంతుడు కాదు మార్గ ము, భాగవతులు మార్గ ము. ఎందుకని, భక్తు లు ఎలా ప్రవర్తిస్తు న్నారో
దాన్ని చూసి మీరు ప్రవర్తిస్తా రు.

గురువు యందు నీకు విశ్వాసము ఉంటే ఆ గురువు వెంట వెళ్లి పో వాలి, ఆ గురువు
తీసుకుపో తాడు అంతే నిన్ను ఎలా, తన వెంట ఒక వస్తు వుని తీసుకుపో యినట్టు తీసుకుపో తాడు
భక్తు డు, తీసుకుపో తే ఆ భాగవతులను అనుసరించి అలా వెళ్లి పో తాడు. ఎలా వెళ్లి పో యాడు తను
రాజకుమారుడు, తను కూడా దశరధమహారాజుగారి కొడుకే, భరతుడూ దశరధమహారాజుగారి కొడుకే
నువ్వు మేనమామగారింటికి వెడితే నన్ను తీసుకువెళ్లి పో వడము ఏమిటయ్యా నేనెందుకు వస్తా ను
అనడు, భరతుడు ఎక్కడుంటే అక్కడుంటాడు, ఎప్పుడూ భరతుడి సేవ చేసుకుంటాడు, ఎప్పుడు
చూసినా భాగవతుల సేవ చేసుకుంటాడు, ఎక్కువ ప్రీతి భగవానుడికి ఎప్పుడు కలుగుతుంది. తన
సేవ చేసిన కన్నా తన పాదములు పట్టి సేవ చేసేటటువంటి భక్తు ల యొక్క సేవ చేసిననాడు
భగవంతుడు ఎక్కువ ప్రీతి చెందుతాడు.

అందుకే మనము పూజ చేసినా ఎప్పుడూ తిన్నగా భగవంతుడిని పిలవము, మీరో


శివార్చన చేస్తు న్నారనుకోండి, నంది బృంగి రిట వీరచ వీరభద్ర చండీశ్వర ప్రమధ ముఖ్య మహా
గణేభ్యః అని పరమశివుడిని ఆశ్రయించి ఉండేటటువంటి గణములు అన్నింటిని పిలుస్తా ము. మీరొక
విష్ణా లయములోకి వెళ్లా రనుకోండి ఆళ్వారులను సేవించి శ్రీమహావిష్ణు వు యొక్క దర్శనానికి
వెడతాము, మీరొక శివాలయములోకి వెళ్లా రనుకోండి ముందు నందీశ్వరుడిని సేవించి చండీశ్వరుడిని
సేవించి ఆ పైన ఉండేటటువంటి త్రిశూలానికి ఒక నమస్కారము చేసుకుని అప్పుడు
శివాలయములోకి ప్రవేశిస్తా ము. ముందు బయట ఉండేటటువంటి పరివార దేవతలతో కలిసి
ఉన్నటువంటి పరమాత్మ ప్రసన్నుడయి ఉంటాడు. అందుకని ఎప్పుడూ భాగవతులతో కూడి
ఉన్నవాడిని పిలుస్తా ము, అందుకే భగవంతుడిని పిలిచినా పూర్వదిక్కున ఉన్నటువంటి
శచీపురంధరాభ్యోన్నమః అని చెప్పి అరుంధతి వశిష్టా భ్యాన్నామః అని చుట్టూ ఉన్నటువంటి
ముందు ఆ ఋషులందరికీ నమస్కారము చేసి అప్పుడు భగావానుడికి చేస్తా ము.

అందుకని ఆయన శతృఘ్నుడు అయ్యాడు, అందుకని తీసుకువెళ్లడములో గచ్చతా


మాతులకులం భరతేనా తదానఘః, శత్రు ఘ్నోనిత్యశత్రు ఘ్నో నీతః ప్రీతిపురస్కృతః. అందుచేత
గచ్చతా మాతులకులం భరతేనా తదానఘః, శత్రు ఘ్నోనిత్యశత్రు ఘ్నో నీతః ప్రీతిపురస్కృతః అని
ఆంతరమునందు ఉన్నటువంటి విషయాన్ని చెప్పి బాహ్యమునందు మాత్రము భరతుడిని విడిచిపెట్టి
ఉందని స్వభావము శతృఘ్నుడది. అందుకని భరత శతృఘ్నులు ఇద్ద రూ భరతుని మేనమామ
అయినటువంటి యుధాజిత్తు గృహమునకు చేరుకున్నారు. చేరుకున్న తరువాత ఇక్కడ అయోధ్యా
పట్ట ణములో సంతోషముగా కాలము గడిచిపో తోంది. అక్కడ ఉన్నా విచిత్రము ఏమిటంటే వెళ్ళింది
ఎవరింటికి వెళ్ళాడు యుధాజిత్తు గారింటికి వెళ్ళాడు భరతుడు. మేనమామగారికి మేనల్లు డు అంటే
మహాప్రీతి, ఇంక అనుభవించడానికి వీలుకానట్టి, వీలులేదు అని చెప్పడానికి అవకాశము లేని
సమస్త భోగములు అక్కడ ఉన్నాయి. తాతగారు ఉన్నారు, ఇన్ని ఉన్నా, ఇన్ని భోగములు ఉన్నా
భరత శతృఘ్నుల దగ్గ ర మీరు జ్ఞా పకము పెట్టు కోవలసిన గుణము ఏమిటో చెప్పారు.
ఇన్ని భోగములయందు ఉండి కూడా ఏది జ్ఞా పకము పెట్టు కున్నారుట భరతశతృఘ్నులు
తత్రా పి నివాసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః, భ్రా తరౌ స్మరతా౦ వృద్ధ ం దశరధం నృపమ్ వాళ్ళు
అన్నీ భోగములను మేనమాగారింట్లో అనుభవిస్తు న్నా సర్వకాలములయందు వారు స్మరించినది
మాత్రము తండ్రిగారిని స్మరించారుట. సర్వకాలములయందు స్మరింపబడుతున్నారు తల్లి తండ్రు లు
ఏమిటి అర్ధ ము, నీకు తల్లితండ్రు ల యందు భక్తి ఉన్నది, తండ్రికూడ స్మరిస్తు న్నాడుట ఎలా తేషామపి
మహాతేజా రామో రతికరః పితుః, స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్త రః ఆయన
నాలుగు బాహువులు ఒక మనిషికి ఉంటే ఒక బాహువు యందు ప్రీతి ఉండి ఒక బాహువు యందు
ప్రీతి లేకపో వడము ఉండదు కదా అలా దశరధమహారాజుగారు మాత్రము ఎప్పుడూ నలుగురి
కొడుకుల్నీ స్మరిస్తు ండేవాడుట అది తండ్రికి చాలా సహజమయిన విషయము.
దశరధమహారాజుగారుకు నలుగురు బిడ్డ లయందు సమానమయిన ప్రీతి ఉంది.

అందుచేత కుడిచేతికి ఎడమచేతికి ఎలా భేదము చెప్పవో నాలుగు కొడుకుల యందు


భేదము చూడనివాడు దశరధమహారాజుగారు. మరి అలా అయితే రాముని యందు ఎందుకు
ఎక్కువ ప్రీతి ఉంది, ఎంత అందముగా చెపుతారో చూడండి వాల్మీకిమహర్షి తేషామపి మహాతేజా
రామో రతికరః పితుః, స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్త రః ప్రపంచములో అన్ని
భూతములు ఉన్నాయి అన్ని ప్రా ణులు ఉన్నాయి, అయినా అన్ని ప్రా ణుల కన్నా చతుర్ముఖ
బ్రహ్మగారు గొప్పతనాన్ని ఎందుకు పొ ందారు. అందుచేత ఆయన ఎలా ఉత్కృష్ట మయినటువంటి
ప్రా ణో అలా ఆయన శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి విషయాన్ని విని ఎలా సృష్టి చేసి
నారాయణుడిని ఆనందింప చేసాడో అలా రామచంద్రమూర్తి తన గుణముల చేత తన తండ్రిని ఎక్కువ
ప్రీతి పొ ందేటట్టు చేసాడు. ఇది ఆ కొడుకు యందు గుణములు ఎక్కువ ఉన్నాయి, ఆ కొడుకు
అందరినీ ఆనందింప చేస్తా డు, అందుకని రాముడంటే మాత్రము కించిత్ ఎక్కువ ప్రీతి ఆ
కారణముచేత ఉందిట తప్ప మిగిలిన కొడుకుల యందు ప్రీతి లేని వాడు కాడు
దశరధమహారాజుగారు. ఏమి రాముని యందు ఎక్కువ గుణాలు ఉండడము చేత
దశరధమహారాజుగారిని ఎక్కువ ఆనందింప చేసాడు అన్నారు కదా ఏమిటా గుణాలు అని వెంటనే
మనకు అనుమానము వస్తు ంది.

అందుకని వాల్మీకి మహర్షి అంటారు స టు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం తు భాషతే ,


ఉచ్యమానో 2 పి పరుషం నోత్తరం ప్రతిపద్యతే ఆయన రామచంద్రమూర్తికి ఉన్నటువంటి
మొట్ట మొదటి ఉన్న గొప్ప గుణము ఏది, అంటే స టు నిత్యం ప్రశాంతాత్మా ఎప్పుడూ కూడా
నిర్మలమయిన చిత్త ముతో ప్రశాంతముగా ఉంటాడుట. మృదుపూర్వం తు భాషతే మీ మనస్సు మీ
ఆధీనములో ఉంటుంది, మీ మనస్సు నిర్మలముగా ఉండడము, మీ మనస్సు ప్రశాంతముగా
ఉండడము మీ ఆధీనము. మనస్సు ప్రశాంతముగా ఉన్నవాడు కనుక ఎప్పుడూ మృదువుగా
మాట్లా డుతాడు. మనిషికి ఉండవలసిన లక్షణము మృదుత్వము. ఎంత శత్రు వే కానివ్వండి
రాముడికి రావణుడు ఎలా శత్రు వు ఆయ్యాడో అటువంటి శత్రు వు ప్రపంచములో ఇంకొకడికి
ఉంటాడా, అటువంటి శత్రు వు కళ్లె దుట పడినా, ఒక్క తప్పు మాట రామచంద్రమూర్తి యొక్క నోటి
వెంట రాలేదు. ఇలా వాక్కుని నిగ్రహించగలగడము, వాక్కుని ఎలా వాడినా మిమ్మలని ఎవరూ
ఏమనరు,

రాముడి మనస్సు ప్రశాంతముగా ఉంటుంది, రాముడు మృదుపూర్వం తు భాషతే,


ఉచ్యమానో 2 పి పరుషం నోత్తరం ప్రతిపద్యతే ఇదేట రాముడు చేసింది కూడాట నోత్తరం ప్రతిపద్యతే
జవాబు చెప్పడు. వాడొ చ్చినా నిబ్బరముగా ఉంటాడు ఏమీ తెలియని వాడిలా అమాయకుడిలాగా
నిశ్సబ్ద ముగా ఉంటాడు, ఎందుకని అవతలివాడు పాపమును మూట కట్టు కుంటున్నాడు. కట్టు కోనీ
అనుభవిస్తా డు నాకేం చెపితే వినడు, వాదిస్థా యిలో అరవడము నేనూ మూటకట్టు కోవాలి, నేను
కట్ట ను అందుకని నిశ్సబ్ద ముగా ఉంటాను వాడు కట్టు కుంటున్నాడు, కట్టు కోనీ అనుభవైకవైధ్యము
అయ్యినతరువాత అనుభవానికి వచ్చినతరువాత బాధబడతాడు, వాడికి చెపితే వినే మనిషికాడు. ఆ
తరువాత దెబ్బ తిన్నాక మారాక వస్తా డు అప్పుడు చూద్దా ము.

అందుకని నోత్తరం ప్రతిపద్యతే ఉద్రేకపదేటటువంటి వాళ్ళ దగ్గ ర వెర్రి కేకలు వేసవ


ే ాళ్ల దగ్గ ర
సమాధానము చెప్పే అలవాటు రామచంద్రమూర్తికు లేదు. కథ౦చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి, న
స్మరత్యపకారాణా౦ శతమప్యాత్మావత్త యా వెంటనే కిందశ్లో కములో చెపుతారు మహర్షి. ఈ శ్లో కము
వెంటనే కింద ఎందుకు చెప్పాలి. మనస్సు ప్రశాంతముగా ఎలా ఉంటుందో చెప్పారు, ముందు
చెప్పేసాను ఆ విషయాన్ని అర్ధ ము అవ్వడము కోసము. కథ౦చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి
వాడెప్పుడూ ఎవరికీ ఉపకారము చేసే మనిషి కాడు. కథ౦చిత్ అనుకోకుండా ఒక ఉపకారము
చేసాడు వాడు, అనుకోకుండా ఒక ఉపకారము చేసినా దానిని పదిమాటులు తలుచుకుంటాడుట
రాముడు, ఏమిటి దానివలన ఉపయోగము. వాడు చేసస
ే ాడు, కావాలని చేయలేదు, అనుకోకుండా
ఏదో చేసాడు ఓ ఉపకారము, వాడికి జరుగుతుంది తప్పదు అందుకని ఉపకారము చేసాడు వాడు,
అటువంటి ఉపకారము చేసినా రాముడు వాడిని తలుచుకు తలుచుకు తలుచుకు సంతోషిస్తా డుట.
న స్మరత్యపకారాణా౦ శతమప్యాత్మావత్త యా నూరు తప్పులు వాడు చేసన
ి ా రాముడు
స్మరించడుట, ఎందుకని ఆత్మావత్త యా మంచి మనస్సు ఉన్నవాడు కాబట్టి. నీ మనస్సు మంచి
మనస్సో నీ మనస్సు చెడ్డ మనస్సో నువ్వు సాక్షివి, దానికి జడ్జి వేరొకరు ఉండరు. ఎంత గొప్ప
ప్రిస్క్రిప్షన్ తీర్పు ఇవ్వాళ వాల్మీకిమహర్షి చెప్పారో చూడండి. ఇది జ్ఞా పకముగా పెట్టు కోగలిగితే
కథ౦చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి, న స్మరత్యపకారాణా౦ శతమప్యాత్మావత్త యా అవతల వారు
చేసిన అపకారము జ్ఞా పకము చేసుకోడు, కావాలని చెయ్యకపో యినా ఒక్క ఉపకారము వాళ్ళ వలన
జరిగినా గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకని తన మనస్సు ప్రశాంతముగా ఉంచుకోవడము కోసము.
తనని తాను ఉద్ద రించుకోవడము కోసము ఇది రాముడు చేస్తే మీరెండుకు చేయలేరు. ఏమిటి
ఉపయోగము, ఇదీ రాముడు నేర్పాడు ఎలా బతకాలో ఇవయ్యా నీ కొడుకు గుణాలు వాల్మీకిమహర్షి
చెపుతున్నారు.

ఇందుకని తండ్రికి ఇష్ట ముట రాముడంటే బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియంవద,


వీర్యవాన్ న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. బుద్ధిమాన్ అంటే, బుద్ధి అంటే నిర్ణ యము చేసేదవ
ె రో
దానిపేరు బుద్ధి, ఇది బుద్ధిమాన్ ఎందుకన్నారు ఆ మాట ఎప్పుడూ మంచి వైపుకు నడిపిస్తు ంది
నిర్ధా క్షణ్యముగా, నిస్పక్షపాతముగా కూర్చుని ఏది మంచి ఏది చెడు సంకాల్పాలలో ఉన్న మంచి
చెడులను విచారణ చేసి, ఇది మంచి పక్షపాతము లేకుండా ఆలోచించి ఇటెళ్లు . అందుకని బుద్ధిమాన్
మధురాభాషీ పూర్వభాషీ దానివల్ల ఏమవుతు౦ది ఎప్పుడూ సత్వగుణము ఉన్నచోట
తిరుగుతున్నాడు కాబట్టి నోటవ
ి ెంట వచ్చేటటువంటి మాట కూడా మధురాతిమధురముగా ఉంటుంది.
మధురాభాషీ పూర్వభాషీ ప్రియంవద ఎప్పుడయితే మనస్సులో సత్వగుణము వచ్చిందో ఒక గోప్ప
లక్షణము వస్తు ంది.

అదికాదుట రాముడు పలకరించేది పూర్వభాషి తను ముందు మాట్లా డుతాడుట.


అవతలవారు తనని పలకరిస్తే అరెరె వారొచ్చి నన్ను రామా బావున్నావా అని అడిగారు, నేను
వారిని అడగలేదు అని బెంగపెట్టు కుంటాడుట అని తనే ముందు అయ్యా బావున్నారా కులాసాయా
అంటాడుట, ఎలా ప్రియంవద అతి ప్రియముగా మాట్లా డుతాడుట. ఈ అందము ఈ మాట ఈ ధో రణి
ఈ సాత్వికత ఈ నిర్మలమయిన మనస్త త్వము రాముడికి ఉంది. పూర్వభాషి ఇది నేర్చుకుంటే
అహంకారము గెలుచుకున్నట్టే. అందుకని పూర్వభాషి ప్రియంవద ముందు మాట్లా డుతాడుట
ప్రియముగా మాట్లా డుతాడుట, ఇదిట రాముడి లక్షణము. రాముడు నోరు విప్పి మాట్లా డడనుకోండి
అబ్బ ఎంత సంతోషముగా ఉంటుందో అంత అందముగా మాట్లా డుతాడు. అంత అందముగా అంత
ప్రేమగా మాటలాడడము రాముడికున్న లక్షణము, అందుకని పూర్వభాషి ప్రియంవద.

వీర్యవాన్ న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః ఆయన పరాక్రమవంతులకు


పరాక్రమవంతుడు. అటువంటివాడయ్యి కూడా ఎన్నడూ కూడా అహంకారము లేని వాడు, ఎన్నడూ
కూడా నేనింత గొప్పవాడిని అన్న భావన మనసులో ఉంచుకునేవాడు కాదు. ఆ భావన ఉందా ఇహ
మీరు నలుగురితో కలవలేరు, అలా నలుగురితో కలవడము కోసమని నేనింత వాడినని భావన
మరిచిపో యేటటువంటి స్వభావము ఉన్నవాడు. న చానృతకథో విద్వాన్ వృద్దా నాం ప్రతిపూజాకః,
అనురక్త ః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే ఆయన దగ్గ ర ఎప్పుడూ కూడా అసత్యము లేదుట.
రామచంద్రమూర్తి అంతఃపురములో కూర్చుని ఉండగా పెద్దలయినటువంటి వాళ్ళు
వస్తు న్నారనుకోండి నేను రాముడిని, దశరధమహారాజుగారి పెద్ద కుమారుడిని అని కూర్చునేవాడు
కాదుట. వారు పెద్దలు వస్తు న్నారు అంటే గభాలున తన ఆసనము మీంచి లేచి ఎదురెళ్ళేవాడుట.
ఎదురెళ్ళి అయ్యా రండి రండి రండి అని మీకు ఎదర చూపిస్తా ను వశిష్టు డు వస్తే రాముడు బయటకు
వచ్చి రధములోంచి దిగుతూంటే తన చెయ్యి ఇచ్చి వశిష్టు డిని కిందకు దింపుతాడు.

పెద్దలపట్ల అంత జాగ్రత్తగా ప్రవర్తించేవాడుట రాముడు. ఇది రామాయణము అంటే ఎంత


అందముగా నేర్పేరో చూడండి మహానుభావుడు. అందుచేత నా2 శ్రేయసి రతో విద్వాన్ న
విరుద్ధ కథారుచిః, ఉత్త రోత్త రయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా ఆయన ధర్మవిరుద్ధ మయినటువంటి
మాట మాట్లా డేవాడు కాడుట, శ్రేయస్కరము కాని పని చేసవ
ే ాడు కాదుట. శ్రేయస్కరము కాని
పనిలోకి వెళ్లడుట, ధర్మ విరుద్ధ మయిన మాట మాట్లా డుట. ధర్మము కాని మాట అయితే రాముడు
నోటివెంట రాదుట, అది ధర్మభద్ద మయితే అవతలవారు ఎంత గొప్పవారయినా సరే తను వెనక్కి
వెళ్లడుట. అది ధర్మాభాద్ద మయిన మాట అందుకని దానికి నేను నిలబడతాను అంటాడుట. ఇవి
రక్త ములో కలిసిపో యాయి రామచంద్రమూర్తిలో. ఎందుకని వశిష్ట విశ్వామిత్రా దుల చేత
శిక్షింపపడ్డా డు. వారి చేత మహానుభావుడు విధ్య గడపబడ్డా డు, అందుచేత ఇటువంటి లక్షణాలు
అన్నీ వచ్చాయి. అటువంటి మహానుభావుడయినటువంటి రామచంద్రమూర్తి ఆ గుణాలతో
శోభిల్లు తుంటే అన్నిటికన్నా ఉండవలసిన లక్షణము ఏమిటిట, విశ్వామిత్రు డు చాలా పాఠాలు
చెప్పాడు, వశిష్టు డూ చాలా పాఠాలు చెప్పాడు.

ధర్మకామార్థ తత్త ్వజ్ఞ ః స్మృతిమాన్ ప్రతిభానవాన్, లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః


అందుకని గురువులు చెప్పినటువంటి విషయాల్ని అవసరమయినప్పుడు స్మరించగలిగినటువంటి
నేర్పు ఉందిట, సమయస్పూర్తి తో మాట్లా డగలిగినటువంటి నేర్పు ఉందిట, అన్నిటినీ మించి
వ్యవహారము చేసేటప్పుడు ఆచారమేదో పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా తానుకూడా
ప్రవర్తించగలిగినటువంటి దక్షత ఉందిట. అందుచేత ఆచారము నందు పెద్దలు ఎలా ప్రవరించారో అలా
ప్రవర్తిస్తా డుట రాముడు. ఇది రాముడు దగ్గ ర నేర్చోకోవలిసిన గుణసంపత్తి . అన్నిటికన్నా
గొప్పవిషయము సత్సంగ్రహప్రగ్రహణే స్థా నవిన్నిగ్రహస్య చ, ఆయకర్మణ్యుపాయజ్ఞ ః సందృష్ట వ్యయ
కర్మవిత్ ప్రా జ్ఞు లు అయినటువంటి వారిని తత్పురుషులని రక్షించడము ఎలాగో రాముడికి తెలుసుట.
ఎవర్ని ఎక్కడ ఉంచాలో, ఎవర్ని ఎలా నియమించాలో రాముడికి తెలుసుట, ఎలా ఆర్జించాలో
రాముడికి తెలుసుట, ఎలా ఖర్చుపెట్టా లో రాముడికి తెలుసుట.

ఆర్జ నా న్యాయభద్ద ము అయ్యుండాలి, వ్యయము న్యాయభద్ద ము అయ్యుండాలి, ఎందుచేత


తనకి కావలిసినంత ఖర్చుపెట్టు కోకుండా బ్రతికినటువంటి వాడు తనకి తాను ద్రో హము
చేసుకున్నట్టు . యశస్సు కొరకు, ధర్మము కొరకు, సంతానము కొరకు వీటన్ని౦టికీ విభాగము
చేసుకుని ఖర్చుపెట్టగలిగనటువంటి వాడయ్యి ఉండాలి. ఈ నియమాలు ఆయనకు తెలిసినటువంటి
వాడుట, సంగీత శిల్ప నృత్యాది విద్యలయందు ఆరితేరినటువంటివాడుట. అవన్నీ ఆయనకు
తెలుసుట. అన్నిటికన్నా ఆరోహే వినయేచైవ యుక్తో వారణవాజినామ్ లొంగనటువంటి గుర్రా ల్ని
ఏనుగులని లొంగతీసి వాటిమీదకు ఎక్కి స్వారీ చెయ్యగల శక్తి ఉన్నవాడుట. ధనుర్వేదవిదాం శ్రేష్టో
లోకే2 తిరథసమ్మతః, అభియాతా ప్రహర్తా చ సేనానయవిశారదః ప్రపంచములో అతిరధులయి
నటువంటివాళ్లు ఎంత కొద్దిమందో ఉంటారు అటువంటివాళ్ల లో శ్రేష్టు డయినటువంటివాడు రాముడు.

ఇన్ని అస్త్రా లు ఉన్నా శస్త్రా లు ఉన్నా ఇంత ధనుర్విద్య తెలిసినా నిష్కారణముగా ఎన్నడూ
ఒక బాణప్రయోగము చెయ్యనివాడు. ఎప్పుడూ అవతలవారి ఉపకారాన్ని స్మరించి ఓర్పుతో
ఉండగలిగనటువంటి వాడు. ఇన్ని గుణములు ఉన్నాయయ్యా రాముడి దగ్గ ర అందుకే రాముడంటే
అందరికీ ఎంత సంతోషమో అందరిని సంతోషింపచేయగలిగనటువంటి గుణములతో
ప్రకాశించేటటువంటి స్వరూపము ఉన్నవాడు కనుక తన కుమారుడిని చూసుకుని దశరధ
మహారాజుగారు మరింత ప్రీతి పొ ందుతాడుట. నలుగురినీ ప్రేమించినా గుణములు అధికముగా
ఉండడము చేత రాముడంటే దశరధమహారాజుగారికి మరింత ప్రీతిట. ఇంత ప్రీతి కలిగినటువంటి
దశరధమహారాజుగారు ఒకసారి మంత్రు ల్ని, ఇతర రాజులని, ప్రభుత్వోద్యోగులని, జానపదుల్ని,
అయోధ్యా పట్ట ణవాసుల్ని, కోసలదేశములో ఉన్నటువంటి ప్రధానమయిన వ్యక్తు లని అందరినీ పిలిచి
పేద్ద సమావేశము ఏర్పాటుచేసారు.

వృద్ధు డు అయిపో యాడు మహానుభావుడు, మహాతేజస్సుతో వచ్చి సింహాసనము మీద


కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చునేవరకు లేచి నిలబడి ఎవరెవరికి ఏయే ఆసనములయందు
కూర్చోవాలో ఆయా ఆసనములయందు ఉచితరీతిలో అందరూ కూర్చున్నారుట. కూర్చున్న
తరువాత దశరధమహారాజుగారు ఒక విషయము ఆలోచించారు, దివ్యంతరిక్షే భూమౌ చ
ఘోరముత్పాతజా౦ భయమ్, పంచచక్షే చ మేధావీ శరీరేచాత్మనో జరామ్. ఆయన అనుకున్నాడుట
అంతరిక్షములో ఉత్పాతములు కనపడుతున్నాయి, భూమి మీద కూడా ఉత్పాతములు
కనపడుతున్నాయి, నా శరీరము జర్జ రీభూతము అయిపో యింది, దీనికి వృద్ధా ప్యము వచ్చేసింది,
దీనికి పూర్వము ఉన్నటువంటి పటుత్వము లేదు. కనపడుతున్న ఉత్పాతములను బట్టి
తోకచుక్కలు మొదలయినవి కనపడుతున్నాయి కాబట్టి ఘోరమయినటువంటి ఉపద్రవము
ముంచుకొస్తో ంది.

బహుశా నేను శరీరము విడిచిపెట్టేయవలిసినటువంటి సమయము దగ్గ రకు వచ్చేస్తో ంది,


నేనన్నీ అనుభవించాను కానీ నాకు ప్రియాతిప్రియమయిన కుమారుడు సకల గుణాభిరాముడు
అటువంటివాడు కనుక ఆ రామచంద్రమూర్తికి తొందరగా యవ్వరాజ పట్టా భిషేకము చేసేస్తే నా ప్రజలు
అందరూ క్షేమముగా ఉంటారు. ఒక రాజు ఆలోచించే రీతిలో ఆలోచించాడు, అందుకని నేను
తొందరగా పట్టా భిషేకము చేసస
ే ్తా ను, అందరికీ కబురులు చేసి బంధువలకి పిలిచి వాళ్ళను పిలిచి
మిత్రు లను పిలిచి పిలవాలంటే కనపడుతున్న ఉత్పాతములను బట్టి అంతకాలము నేను ఉంటానో
ఉండనో, అందుకని తొందరగా పట్టా భిషేకము చెయ్యాలి అందుకని న తు కేకయరాజానం జనకం వా
నరాధిపః, త్వరయా ఛానయామాస పశ్చాత్ తౌ శ్రో ష్యతః ప్రియమ్ ఆ తొందర తొందరతో
పనిచెయ్యాలనేటటువంటి ఉద్దేశముతో ఉన్నాడేమో కేకయ రాజుగారికీ కబురు చెయ్యలేదు, అటు
జనకమహారాజుగారికీ కబురు చెయ్యలేదు, రామచంద్రమూర్తికి పట్టా భిషేకాము చెయ్యాలనేటటువంటి
ఉద్దేశముతో ఆ సభలోకి వచ్చారు వచ్చి సింహాసనము మీద కూర్చున్నాడు.

ఆ సభలో ఉన్నవారందరినీ ఒక్కసారి చూసాడు, ఎంత అందమయిన మాట మాట్లా డుతాడో


చూడండి దశరధుడు, నిజంగా నాకు ఈశ్లో కము అంటే ఎంత ఇష్ట మో ఇలా మాట్లా డడము
దశరధమహారాజుగారికే చెల్లి ంది అటువంటి శ్లో కాన్ని ఇవ్వడము ఒక్క వాల్మీకిమహర్షికి చెల్లి ంది ఎంత
గొప్పశ్లో కమో చూడండి. ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాహితమ్, పాండురస్యాతపత్రస్య
చ్ఛాయాయాం జరితం మయా ఈ తెల్లటి గొడుగు కింద కొన్నివేల సంవత్సరాలనుంచి కూర్చున్నాను.
ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరము జర్జ రీభూతము అయిపో యింది అన్నాడు.
ఏమిటి ఆమాటకు అర్ధ ము, తెల్లటి గొడుగు కింద కూర్చోవడము అంటే రాజుగా ఉండడము, ఈ తెల్లటి
గొడుగు కింద కూర్చోవడములో, రాజుగా ఉండడములో, రాజ్యపరిపాలన చెయ్యడములో నేను
రాజుని, నేను రాజుని అని భోగాలు అనుభవించడములో సంతోషముగా కాలము గడిపేయడములో
నాకు తెలియలేదు.

ఇలా చూసుకుంటే నా శరీరము అంతా ముడతలు పడిపో యింది , ఈ శరీరములో పూర్వము


ఉన్న పటుత్వము లేదు అని తెలుసుకున్నాను, ఈ శరీరము జర్జ రీభూతము అయ్యింది, ఎక్కడ ఈ
తెల్ల గొడుగు కింద ఇది టైమ్ తెలియనివ్వలా. భోగము ఉన్నన్నాళ్ళు ఒంట్లో ఒంపిక ఉన్నన్నాళ్ళు,
ఇంట్లో డబ్బు ఉన్నన్నాళ్ళు అందినంత ఆనందము అనుభవించగలిగన ఆరోగ్యము ఉన్నన్నాళ్ళు
గడిచిపో తున్న సమయము తెలియదు. అందుకని వీటన్నిటికీ కల కారణము ఏమిటి, పైనున్న
శ్వేతచత్రమ, దాని కింద జీర్ణ ము అయిపో యింది ఈ శరీరము. ప్రా ప్య వర్షా సహస్రా ణి
బహూన్యాయూంషి జీవతః, జీర్ణస్యాస్య శరీరస్య విశ్రా ంతిమభిరోచమే ఈ శరీరము జర్జ రీభూతము
అవ్వడములో ముసలది అయిపో వడములో చాలా పటుత్వము తప్పిపో వడములో ఇది విశ్రా ంతి
కోరుకుంటోంది. నేను కొంతకాలము విశ్రా ంతి తీసుకోవాలను కుంటున్నాను.

అందుకని అనురూపః స వై నాథో లక్ష్మీవాన్ లక్షణాగ్రజః, త్రైలోక్యమపి నాథేన యేన


స్యాన్నాధవత్త రమ్ మూడులోకములను శాసించగలిగినటువంటి కాంతి కలిగనటువంటి,
మహాపురుషుడు అయినటువంటివాడు నా కుమారుడుగా ఉన్నాడు రామచంద్రమూర్తి, ఆయన
ఇంద్రు డితో సమానుడు అటువంటివాడు కనుక నా జ్యేష్టు డు అయినటువంటి రాముడికి యవ్వరాజ్య
పట్టా భిషేకము చేద్దా మని అనుకుంటున్నాను. కానీ ఒక్కటి ఆలోచించండి నా అంత నేనుగా చేసిన
నిర్ణ యము సర్వకాలముల యందు ఖచ్చితముగా ఉండకపో వచ్చు ఎందుకని ఈ నిర్ణ యములో ఒక
పక్షపాత బుద్ధి ఉండొ చ్చు నా కొడుకు నా కొడుకు అన్న భావన రాముడు నా జేష్ట కుమారుడు అన్న
భావన నా కళ్ల ను కప్పివేసి ఉండొ చ్చు. న్యాయాన్యాయ విచక్షణ నేను చేయలేకపో యి ఉండొ చ్చు,
సర్వకాలములయందు నా కొడుకులో నాకు గుణములే కనపడి ఉండొ చ్చు. కానీ మీ అందరికీ
కూడా అలా గుణములు కనపడుతున్నాయో కనపడటలేదో నాకు తెలియదు, మీరు పక్షపాతము
లేకుండా స్వతంత్రముగా నిర్ణ యము చెయ్యగలిగనవారు, నా తరువాత ఉత్త రాధికారిగా ఈ
సింహాసనము మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మభద్ద ముగా పాలించాలి, ఇంద్రియములకు
లో౦గనివాడు అయ్యుండాలి. రాజ్యములోని ప్రజలను తన బిడ్డ లుగా చూసుకోగలిగనటువంటి
వాడయి ఉండాలి, రాముడు నా పెద్దకుమారుడు అని పట్టా భిషేకానికి యోగ్యుడు అని నేను
అనుకుంటున్నాను కానీ అలాంటివాడు అవునో కాదో మీరు విచారించండి.

నేను రాజుని చెప్పాను అని మీరు అనుకోకండి , నిస్పక్షపాతముగా మీరు మద్యవర్తు లు


కనుక రాగద్వేషములు లేకుండా ఆలోచించి నిర్ణ యము చెయ్యండి, మీరందరూ కూడా రాముడు
పట్టా భిషేకానికి అర్హు డు అని అనుకుంటే పట్టా భిషేకము చేస్తా ను మీరు ఆలోచించి మీ నిర్ణ యాన్ని
చెప్పండి అన్నాడు. ఎంత గొప్పగా మాట్లా డాడో చూడండి దశరధుడు, తన నిర్ణ యాన్ని రుద్ద లేదు
మిగిలినవారిమీద. వాళ్ళందరూ అన్నారుట ఒకేసారి స్నిగ్ధో నునాదీ సంజజ్నే తత్ర హర్షసమీరతః,
జనౌఘౌద్ఘు ష్ట సన్నాదో విమానం కంపయన్నివ వాళ్ళందరూ ఒకేసారి సంతోషముతో
దశరధమహారాజా నువ్వు చెప్పినటువంటి ప్రతిపాదన మేమందరము అంగీకరిస్తు న్నాము. వెంటనే
రాముడికి యవ్వరాజ్య పట్టా భిషేకము చేసేసెయ్యి అని అరిచినటువంటి అరపులకి అక్కడ
ఉన్నటువంటి అంతఃపురము ప్రా కారము కదిలిపో యిందా అన్నంత ధ్వని చేసారుట. ఎలా అందరూ
మాట్లా డుకోలేదుట spontaneous ఒకేసారి అరిచారుట, గొప్ప ప్రతిపాదన చెప్పవయ్యా
దశరధమహారాజా చేసేసెయ్యి.

అనేకవర్షసాహస్రో వృద్ద స్త్వమసి పార్థివ, స రామం యువరాజానామ్ అభిషించస్వ పార్థివమ్


నువ్వు చాలా కాలము కొన్ని వేల సంవత్సరములు పరిపాలించి వృద్ధు డవయిపో యావు, అన్ని
గుణములు కలిగినటువంటి రాముడికి వెంటనే పట్టా భిషేకము చేసస
ే ెయ్యి ఇచ్ఛామో హి మహాబహుం
రఘువీరం మహాబలమ్, గజేన మహతా యాంత౦ రామం చత్రా వృతాననమ్ రాముడు
పట్ట భద్రు డయి ఆ ఏనుగుమీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరెరుగుతుంటే ఎప్పుడెప్పుడు చూస్తా మా
అని మా మనస్సులన్నీ తల్ల డిల్లి పో తున్నాయి, అలా చూడాలని ఉత్సాహముతో ఉన్నాయి.
అందుకని దశరధమహారాజా వెంటనే పట్టా భిషేకము చేసేయి అన్నారు.
విన్నాడుట దశరధమహారాజుగారు, సంతోషించాడు, ఓహో చాలా గొప్ప మాట చెప్పారయ్యా
మీరందరూ కానీ నేనొక్క మాట అడుగుతాను జవాబు చెప్పండి అన్నాడు. ఏమిటి అడగమన్నారు,
ఆయన అన్నాడు కొన్ని వేలసంవత్సరాల్నించి మీరందర్నీ కన్నబిడ్డ ల్ని పరిపాలించినట్టు ధర్మము
తప్పకుండా పరిపాలించాను, ఇవ్వాళ నేను నా కుమారుడయిన రాముడికి యవ్వరాజ్య
పట్టా భిషేకము చేస్తా ను అని చెప్తే మీలో ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చిన లోటేమిటి, నువ్వు
మమ్మల్ని తండ్రిలా పరిపాలిస్తు న్నావు కొన్ని వేలాసంవత్సమురలనుంచి ధర్మము తప్పలేదు అని
ఒక్కడు అనలేదు. నా కొడుకుని యవ్వరాజ్యపట్టా భిషేకము చేస్తే చూడాలని ఉంది అంటున్నారు,
నేనన్నానని మీరన్నారా లేకపో తే నా పాలనలో లోటు కనపడిందా, నా కన్నా గొప్ప గుణాలు
రాముడిలో కనపడ్డా యా, రాముడు మీకు యువరాజుగా కావలసివచ్చిందో చెప్పండి అన్నాడు.

ఎంత పరీక్ష పెట్టా డో చూడండి, తన కొడుకు అని అంత తొందరగా రాజ్యమేమి ఇవ్వలేదు
దశరధమహారాజుగారు. దశరధమహారాజుగారు రాముడికి రాజ్యము ఇవ్వాలంటే ప్రజలందరిలో
కూడా ఆమోదము ఉందో లేదో ఎంత పరిశీలన చేసాడో చూడండి ఇది దశరధుడు అంటే . ఇది అసలు
ప్రజాస్వామ్యము అంటే, ఇది ప్రజలయొక్క మనసుల్లో ఉన్న అభిప్రా యాన్ని కనిపెట్టి
పరిపాలించడము అంటే. అంటే వాళ్ల న్నారు, మాకందరికి ఎందుకు ఇష్ట మో తెలుసా రాముడంటే
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః, సాక్షాద్రా మాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ
రాముడు సత్పురుషుడు ఈలోకము మొత్త ము మీద. ఆయన సత్యధర్మ పరాయణుడు, ఆయనకు
సత్యము ధర్మము ఈ రెండే కావాలి, అన్నిటినీ మించి రాముడి దగ్గ ర ఉన్న గొప్ప గుణము ఏమిటో
తెలుసా దశరధా, ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడము రాముడికి తెలుసు అన్నారు.

అందుకని రాముడికి తెలుసున్నదేమిటో తెలుసా ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచుతాడు, ఈ


ఉంచడము లోకమునంతటికి రక్షణ, అందుకని రాముడు సింహాసనము మీద ఉంటే లోకము కూడా
అలాగ ఉంటుంది. లోకము అలా ఉంటే ధర్మము తో కూడిన లక్ష్మి ఉన్నచోట దేవతల యొక్క
అనుగ్రహము ఉంటుంది. ఏ భాదలు లేకుండా ప్రజలు ఉంటారు రామరాజ్యము అవుతుంది,
అందుకని మేము రాముడిని రాజుగా కావాలని అడిగాము. అన్నిటినీ మించి రాముడు వస్తే మాకు
ఎలా ఉంటుందో తెలుసా ఒక్క మాటలో చెప్పేస్తా ము.

ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయాః క్షమాగుణైః, బుద్ధ్యా బృహస్పతేస్తు వీర్యే సాక్షాత్


శచీపతేః రాముడు చంద్రు డిని చూసాడనుకోండి, ఎవడయినా ఈ చంద్రు డు ఏమిటండీ బాబూ ఊరికే
విసిగించేస్తు న్నాడు అని ఎవడయినా అంటాడా, చంద్రు డిని చూసేటప్పటికి ఎవడికయినా అబ్బా ఎంతో
హాయిగా ఉందనిపిస్తు ంది. మేడ మీదకు వెళ్ళి కూర్చున్నాడనుకోండి పౌర్ణ మి చంద్రు డు
ఉన్నాడనుకోండి, ఆహ్లా దముగా ఉంటుంది. రాముడిని చూస్తే అంత ఆహ్లా దముగా ఉంటుంది, కాడుట
రాముడి దగ్గ ర ఎన్ని అస్త్రా లు ఉన్నా గబుక్కున తీసి ప్రయోగించేసేయడు అంత ఓర్పు ఉన్నవాడు,
భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. బృహస్పతికి ఎంత బుద్ధో రాముడికి అంత బుద్ధి,
ఇంద్రు డికి ఎంత శక్తో రాముడికి అంత శక్తి ఇన్ని గుణాలు రాముడిలో ఉన్నాయి. అందుకని మేము
రాముడిని రాజుగా కావాలని కోరుకుంటున్నాము, అన్నిటికన్నా గొప్ప గుణము మేము
అనుభవించిన గుణము ఒకటి చెపుతాము దశరధా ఆ నీకోడుకులో జాగ్రత్తగా విను.

ఇది వినండి, ఒక్కసారి మానసికముగా visualize చెయ్యండి మీరు ఎంత సంతోషిస్తా రో


రాముడికి మేము వారసులమని చూడండి రాముడి గొప్పతనముట యదా వ్రజతి సంగ్రా మం
గ్రా మార్థే నగరస్య వా, గత్వా సౌమిత్రిసహితో నావిజిత్య నివర్త తే, సంగ్రా మాత్ పునరాగమ్య కుంజరేణ
రథేన వా, పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్చతి, పుత్త్రేష్వగ్నిషు దారేషు ప్రేష్యశిష్యగణేషు
చ, నిఖిలేనానుపూర్వ్యాచ్చ పితా పుత్త్రా నినౌరసాన్ రాముడు లక్షణుడుతో కలసి ఎక్కడికి అయినా
యుద్ధా నికి వెళ్లా డనుకో విజయము చేపట్ట కుండా తిరిగిరాడు, అటువంటి రాజు మాకు కావాలి.
రాముడు చాలా కాలము యుద్ధ ముచేసి అయోధ్యకు తిరిగి వచ్చాడనుకో విజయముతో, లోపలకి
వెళ్ళినటువంటి రాముడు చాలా కాలము యుద్ధ ము చేసి వచ్చానని లోపల గొప్ప గొప్ప
ఆనందముతో సంతోషముతో లోపల మేజువాణీలతో కాలము గడిపేటటువంటివాడు కాడు, లోపలకు
వెళ్లి న రాముడు స్నానము చేసి వెంటనే రధామో ఏనుగో ఎక్కి అయోధ్యలో బయటకు వస్తా డు.

వచ్చి ప్రతీ వాళ్ళ దగ్గ రకు వచ్చి పూర్వభాషీచ రాఘవ ముందు ఆయనే పిలుస్తా డు నువ్వు
సంతోషముగా ఉన్నావా ఇన్ని ప్రశ్నలు వేస్తా డు, తల్లి దగ్గ రనుంచి, తండ్రి దగ్గ రనుంచి, అఘ్నిహో త్రా ల
దగ్గ రనుంచి, గురువుల దగ్గ రనుంచి, శిష్యుల దగ్గ రనుంచి ఇన్ని ప్రశ్నలు ఏనుగో, రధమో ఎక్కి ప్రతీ
ఇంటిముందు నుంచి వెడుతూ కనపడ్డ వాళ్ల ందరినీ ముందు తను పిలిచి తను ప్రశ్నిస్తా డు.
ఎవరయ్యా రాజు ఇలా వచ్చి మమ్మల్ని ప్రశ్నించేవాడు, అటువంటి గుణము నీ కొడుకులో ఉంది
అందుకు మాకు కావాలి రాముడు రాజుగా. అటువంటివాడు రాజుగా లేకపో తే మా బ్రతుకు
ఎందుకయ్యా ఇంక అందుకు అడుగుతున్నాము రాముడిని. అంతేకానీ నువ్వన్నావని మేమనటము
లేదు ఇదీ రాముడి దగ్గ ర ఉన్న గుణము.

అన్నిటికన్నా ఇంకా గొప్ప గుణము ఏమిటో తెలుసా వ్యసనేషు మనుష్యాణా౦ భృశ౦ భవతి
దుఃఖితః, ఉత్పనేషు చ సర్వేషు పితేన పరితుష్యతి. రాముడు వ్యసనేషు మనుష్యాణా౦ భృశ౦ భవతి
దుఃఖితః, ఉత్పనేషు చ సర్వేషు పితేన పరితుష్యతి. రాముడు ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి
సంతోషినట్టు సంతోషిస్తా డు, తండ్రి ప్రేమకు అవధి ఉండదు. అందుకే భర్త ృ ప్రేమ, మాతృ ప్రేమ, తల్లి
ప్రేమ, తండ్రి ప్రేమ వీటిని ప్రేమ అని పిలుస్తా రు, ప్రేమ అన్నమాటకు అర్ధ ము ఏమిటో తెలుసాండీ,
తాను అనుభవించడానికి తగినటువంటి యోగ్యత లేకపో యినా, తాను అనుభవించకపో యినా,
తనవారు అనుభవిస్తు ంటే వారనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందించగలగడము ప్రేమ
అని పేరు.

ఇది రామాయణము మనకి నేర్పింది ప్రేమంటే ఏమిటో. వ్యసనేషు మనుష్యాణా౦ భృశ౦


భవతి దుఃఖితః తండ్రిలా ప్రేమిస్తా డుట ప్రజల్ని రాముడు. రాముడు తను అనుభవించాలని
కోరుకోడుట, తన రాజ్యములో ఉన్నవాళ్లు అనుభవిస్తే తను అనుభవించాననుకుంటాడుట. రాముడు
ఎప్పుడు బాధపడతాడుట భృశ౦ భవతి దుఃఖితః వచ్చిన కష్ట ము పో వచ్చుట ప్రజలకి, కానీ
రాముడు మాత్రము ఆ కష్ట ము మర్చిపో యి బాధపడడము ఆపడుట ఇది తల్లికుండే లక్షణము.
ఇదయ్యా రాముడంటే, ఎన్ని అపరాధములు మేము చేసినా మాకు కష్టా లు వస్తే మా కష్టా లు
గట్టెక్కిపో వచ్చు, కానీ మా కష్టా ల్ని తలుచుకుని బృశమ్ భవతి దుఖితః రాముడు భాదపడుతూనే
ఉంటాడు. నేను రాజుగా ఉండగా ఆనాడు నా ప్రజలు ఫలానా కష్ట ము పడ్డా రని, ఏమయ్యా మాకు
అటువంటి రాజు అక్కర్లా ఇప్పుడు చెప్పు దశరధా నువ్వు అడిగావని మేమడిగామా, మాకిలాంటి
వాడు రాజు కావాలని అడిగామా ఇన్ని కళ్యాణగుణములు ఉన్నాయి రాముడి దగ్గ ర మాకు అక్కర్లా
రాజుగా అందుకని పట్టా భిషేకము చెయ్యి యవ్వరాజ్యము ఇయ్యి, మేము సంతోషిస్తా ము.
రాముడు గొప్పతనము ఏమిటో తెలుసా బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః,
దేవాసురమనుశ్యేషు సగంధర్వోరగేషు చ, ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురావరే తథా, అభ్యంతరశ్చ
బాహ్యశ్చ పౌరజానపదో జనః రాముడి యొక్క గొప్పతనము ఏమిటంటే ఏమీ తెలియని జానపదులు,
ఆడవాళ్లు ఆయనకి స్నేహితులు, స్నేహితులు కానివాళ్లు , పరిచయము ఉన్నవాళ్లు , పరిచయము
లేనివాళ్లు ప్రతీరోజు ఉదయము పూజామందిరము దగ్గ రకు వెళ్ళి నమస్కారము చేసేటప్పుడు ఏం
నమస్కారము చేస్తా రో తెలుసా దశరధా మా రాముడికి ఆరోగ్యము, ఆయుర్ధా యము ఇయ్యే స్వామీ
ఆ రాముడుంటే మమ్మల్న౦దరినీ రక్షిస్తా డు, మా రాముడు ఆరోగ్యముగా ఉండాలి, మా రాముడు
సంతోషముగా ఉండాలి అని ఏమీ తెలియని స్త్రీలు, జానపదులు, పిల్లలు, పెద్దలు, స్నేహితులు,
ఏమీకానివాళ్లు అందరూ నమస్కారము చేస్తా రయ్యా ఇదయ్యా నీ గొప్ప, నువ్వు నీ కొడుకు గురించి
పూజ చెయ్యడము గొప్ప కాదయ్యా రాజ్యములో ఉన్నవారందరూ స్త్రీ బాల సహితముగా రాముడి
యొక్క వృద్ధిని కోరుకుంటారు. ఇదీ రాముడంటే, అటువంటి రాముడు రాజుగా ఉండాలని కోరుకోమా
దశరధా అందుకని రాముడు దశరధుడిగా కావాలని అడిగారు.

అడిగితే ఎంత సంతోషాపడిపో యాడంటే తప్పకుండా రాముడికి యవ్వరాజ్య పట్టా భిషేకము


చేస్తా ను చైతః
్ర శ్రీమానయం మాసః పుణ్యః పుష్పితకాననః, యౌవరాజ్యాయ రామస్య
సర్వమేవోపకల్ప్యతామ్. ఇది చైతమ
్ర ాసము పరమ పవిత్రమయిన మాసము అరణ్యాలన్నిటిలోనూ
చెట్లు పుష్పించి శోభించి ఉంటాయి, ఇంత పరమ పావనమయిన కాలము కనుక రాముడికి
తప్పకుండా పట్టా భిషేకము చేస్తా ను. త్రేతాయుగములో వారాలు ఉండేవికావు, ఆదివారము,
సో మవారము, మంగళవారము అని పుష్యమీ నక్షత్రముతో కలిసి ఉన్నప్పుడు చంద్రు డు
పట్టా భిషేకము చేస్తా ను అందుకని ముందు నక్షత్రముతో చంద్రు డు ఉన్నాడు, పుష్యమీ నక్షత్రములో
అభిషేకము చేస్తా నని వెంటనే ప్రకటించాడు, ప్రకటించి ఆ సుమంత్రు డిని పిలిచాడు, పిలిచి నువ్వు
వెళ్ళి రాముడ్ని తీసుకు రమ్మన్నాడు, వశిష్టు డిని పిలిచాడు, పట్టా భిషేకము చెయ్యడానికి
కావలిసినటువంటి ఏర్పాట్లు అన్నీ మహానుభావా వశిష్టా నువ్వు పూర్తి చెయ్యి అన్నాడు.

అనేసరికి సువర్ణా దీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి, శుక్ల మాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ
మధుసర్పిషీ, అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి, చతురంగబలం చైవ గజం చ
శుభలక్షణమ్, చామరవ్యజానే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురమ్, శతం చ శాతకుంభానామ్
కుంభానామాగ్నివర్చసామ్, హిరణ్యశృంగమ్ ఋషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ, ఉపస్థా పయత ప్రా తః
అగ్న్యగారం మహీపతేః. వశిష్టు డు అన్నాడు అక్కడుండేటటు వాళ్ళ౦దరినీ పిలిచి మీరివన్నీ సిద్ధము
చెయ్యండి ఏవి రత్నాల్ని సిద్ధము చెయ్యండి, తెల్లటి వస్త్రా ల్ని సిద్ధము చెయ్యండి, పేలాల్ని సిద్ధము
చేయండి, పేలాలూ శుభము కోరుతాయి. ఒక్కొక్కదానికి ఒక శక్తి ఉంటుంది, ఘంటానాదము చేస్తే
దేవతలకు పిలుపు, బిందె చప్పుడు చేస్తే పితృదేవతలకు పిలుపు, బిందెలో చప్పుడు చేస్తే దెయ్యాలకి
భూతాలకు పిలుపు, క౦చాన్ని చప్పుడు చేస్తే పితృదేవతలకు పిలుపు. అందుకే ఒక్కొక్కచోట
ఒక్కొక్క క్రియాకలాపము చేస్తు న్నప్పుడు ఒక్కొక్క చప్పుడు చేయిస్తూ ంటారు. శంఖానాదము చేస్తే
విజయానికి పిలుపు, పేలాలు ఇంట్లో చల్లినా, ఇంట్లో తిన్నా, ఇంట్లో చేతుల్లో పట్టు కున్నా, ఇంట్లో
పేలాలు ఉన్నా దేవతలు సంతోషపడతారు. అందుకే పేలాలు నైవేద్యము పెట్టినా, పేలాలు బెల్లము
నైవేద్యము పెట్టినా, పేలాలు చేతిలో పట్టు కుని తింటున్నా, ఇంట్లో పిల్లలు పేలాలు తింటూ అక్కడా
ఇక్కడా పడేసన
ి ా దానివల్ల ఇల్లు వృద్ధిలోకి వస్తు ంది.

అందుకని మహానుభావుడు వశిష్టు డు అన్నాడు లాజాంశ్చ ఆ పేలాలు తీసుకురండి,


చతురంగబలాలు సిద్ధము చెయ్యండి, ఏనుగుని మంచి ఏనుగుని ఒకదానిని సిద్ధము చేయండి ,
తెల్లటి గొడుగు సిద్ధము చెయ్యండి, చామరము సిద్ధము చెయ్యండి, ఆ తరువాత అఘ్నిహో త్రములా
మెరిసిపో యేతటువంటి నూరు కుంభములను సిద్ధము చెయ్యండి, బంగారపు తొడుగులు
ఉన్నటువంటి కొమ్ముల్లు నటువంటి ఎద్దు సిద్ధము చెయ్యండి, ఎక్కడా తెగప
ి ో నటువంటి పులిచర్మాన్ని
సిద్ధము చెయ్యండి, ఆ తరువాత వీటన్నిటిని తీసుకువెళ్లి దశరధమహారాజుగారి యొక్క
అఘ్నిగృహములో పెట్టండి. అంటే ఆయన అఘ్నిహో త్రము చేస్తా డు అక్కడ, అందుకని
అఘ్నిగృహములో పెట్టండి.

రేపటి రోజున రామచంద్రమూర్తికి పట్టా భిషేకము జరుగుతుంది, ద్వారాలన్నిటిని తోరణాలతో


అలంకారము చెయ్యండి, గంధము కలిపినటువంటి నీళ్ళతో గడపల్ని కడగండి. ఇంట్లో శుభకార్యాలు
జరిగితే ఎలా ప్రవర్తించాలో నేర్పింది మనకు రామాయణము. గంధము కలిపిన నీళ్ళతో గడపల్ని
కడగండి, ధూపము వెయ్యండి, ఆ తరువాత పాలు పెరుగు అన్నముతో కలిపి ఉన్నటువంటి వాటిని
బ్రా హ్మణులకి పెట్టండి, వాటిని సిద్ధము చెయ్యండి. పాలు పెరుగు కలిసినటువంటి అన్నము
తినడము దేవతలకు ప్రీతికరమయినటువంటి విషయము. అందుకని బ్రా హ్మణులను పిలిచి స్వస్తి
వాచకము చేయిస్తా ము, ఆ తరువాత ప్రతి ఇంటిమీద పతాకాలు ఎగరవేయండి, ఆ తరువాత ఎక్కడ
చూసినా కూడా నాటకాలు వేసేటటువంటి వాళ్ళని, పాటలు పాడగలిగినటువంటి వాళ్ళను సిద్ధము
చెయ్యండి, వేశ్యలు అలంకారము చేసుకుని రావాలి, వాళ్ళు రాజంతఃపురములో రెండవ కక్ష్య వరకే
వచ్చి అక్కడ నిరీక్షించాలి.

దేవాలయాలన్నిటిలోనూ ప్రత్యేక పూజ చేయించండి, అభిషేకాలు చేయించండి, పొ డుగయిన


కత్తు లు పెట్టు కున్న వీరులు వచ్చి సిద్ధముగా ఉండాలి, ఆలయాలలో నివేదన చేయడానికి వేరే
మహానైవేధ్యానికి ఏర్పాట్లు చెయ్యండి. ఇవన్నీ చేసి సిద్ధము చెయ్యండి, రేపు రామచంద్రమూర్తికి
అభిషేకము జరుగుతుంది అని చెప్పారు. చెప్పిన తరువాత దశరధమహారాజుగారు చూసారు,
సంతోషించారు. ఆ సభలోనే కూర్చుని ఒక్కసారి సుమంత్రు డిని పిలిచి నువ్వు వెళ్ళి
రామచంద్రమూర్తిని సభకు తీసుకురమ్మన్నారు. వెళ్లా రు, సుమంత్రు డు వెళ్ళి మహానుభావా నిన్ను
దశరధమహారాజుగారు పిలుస్తు న్నారు సభకు విజయము చెయ్యమన్నారు. ఆయన ఉత్త మమయిన
రధము ఎక్కారు, వెనక అంజలి ఘటించి సుమంత్రు డు నిలపడ్డా డు. రధము దిగారు, ఆ పైకెక్కి
దశరధమహారాజుగారు కూర్చున్నటువంటి సభలోకి రామచంద్రమూర్తి ప్రవశి
ే ంచారు.

ప్రవేశించి చిత్రము చూడండి, రామవర్మాహంభో అభివాదయే అని రాజులు అయితే చిట్ట చివర
వర్మ పెట్టు కుంటారు, బ్రా హ్మణులు అయితే శర్మ పెట్టు కుంటారు. చతుస్సాగర పర్యంతం
గోబ్రా హ్మణేభ్యః అని ప్రవర చెపుతారు, చెప్పి తండ్రిగారి పాదముల వంక చూసి నేను రామవర్మను
వచ్చాను అని చెప్పి చెవులు పట్టు కుని ఆయన పాదాలకు శిరస్సు తగిలేటట్టు నమస్కారము
చేసాడుట రామచంద్రమూర్తి. చూసారుట దశరధమహారాజుగారు రాముడి వంక, ఈ గుణాల వల్ల కదా
రామా నేను కట్టు బడిపో యాను, ప్రజలందరూ సంతోషిస్తా రు, రోజు రోజుకీ వృద్ధిలోకి వచ్చినా నా
పాదములు కనపడగానే ఒంగి నమస్కారము చేస్తా వు, ఇంత పితృభక్తి కలిగినవాడివి కాబట్టే రామా
నాకింత ప్రీతి అనుకున్నాడుట. దశరధమహారాజుగారి మనస్సులో కలిగిన భావమేమిటో ఎంత
సున్నితముగా, ఎంత అందముగా వాల్మీకి మహర్షి చెప్తా రో చూడండి.

అందుకని వాల్మీకిమహర్షి అంటారు తం పశ్యమానో నృపతిః తుతోష ప్రియామాత్మజమ్,


అలంకృతమివాత్మానమ్ ఆదర్శతలసంస్థితమ్. అక్కడ చూసినటువంటి వాడికి ఎలా ఉందిట,
ఆద్ద ములో యవ్వనములో ఉండగా తన ఎదురుగా నిలబడి తన ప్రతిబింబము చూసుకుంటే ఎలా
ఉంటుందో అలా అనిపించిందిట రాముడిని చూస్తే. రాముడ్ని చూసి అన్నాడు రామా నీకు
పట్టా భిషేకము చేద్దా మని అనుకుంటున్నాను, ఎందుచేత అంటే రెండు కారణములు ఉన్నాయి, ఈ
రెండు కారణములచేత పట్టా భిషేకము చేస్తు న్నాను.

దశరధుడు ఎంత అందముగా మాట్లా డుతాడో చూడండి జ్యేష్టా యామసి మే వత్న్యా౦


సదృశ్యాం సదృశస్సుతః, ఉత్పన్నస్త ్వం గునశ్రేష్టో మమ రామాత్మజః ప్రియః నువ్వు ఒక్కటి నా
పెద్దభార్య నా యొక్క శీలమును తెలుసుకున్నది, గొప్ప ధర్మము కలిగినది నిరంతరము నన్ను
అనువర్తించేది అయినటువంటి కౌసల్య యొక్క పెద్ద కుమారుడివి రెండు నువ్వు గొప్ప గుణములు
కలిగినవాడివి పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడివి అయినా నీకు గుణములు లేకపో తే ఏమో కానీ
నీకు గుణములు ఉన్నాయి అందుకని పుష్యమీ నక్షత్రములో అభిషేకము చేద్దా మనుకుంటున్నాను,
రామా ఒక్క విషయము జ్ఞా పకము పెట్టు కో నీ కున్న వినయ సంపత్తి కి నేనేమీ చెప్పక్కరలేదు, కానీ
వినయము ఉన్నవాడివి కాబట్టి ఒక విషయము చెపుతున్నాను.

భూయో వినయమాస్థా య భవ నిత్యం జితేంద్రియః, కామాక్రో ధసమూత్థా ని త్యాజేధా


వ్యసనాని చ రామా రెండు రకములయిన వ్యసనములు ఉంటాయి ప్రపంచములో. రాజువి
అయినతరువాత ఇవి విజృంభిస్తా యి, ఇప్పుడు నువ్వు జితేంద్రియుడవు, నీకు అటువంటి
వ్యసనాలు లేవు కానీ తండ్రి చెప్పిన మాటను గౌరవించేవాడివి కాబట్టి చెపుతున్నాను వినని వాడివి
అయితే నీకు చెప్పడము ఎందుకు. రామా ఈ రెండు వ్యసనాలు దగ్గ రకు రాకుండా చూసుకో
కామము చేత పది వ్యసనములు వస్తా యి క్రో ధము చేత ఎనిమిది వ్యసనములు వస్తా యి.
మనుస్మృతిలో చెప్పారు ఆ వ్యసనాలు.

కామము ఉంటే వచ్చేటటువంటి పదివ్యసనములు ఏమిటో తెలుసాండీ నిష్కారణముగా


వేటాడదాము అన్న బుద్ధి పుడుతుంది, జూధము ఆడదామని బుద్ధి పుడుతుంది, పగటిపూట
నిద్రపో దామన్న అలవాటు వస్తు ంది, పారదో షములకు సంభందించినటువంటి విశేషాలు ఎప్పుడూ
కూర్చుని ఇంకోళ్ళ దగ్గ ర వినాలనిపిస్తు ంది, పగటిపూటా అనికూడా చూడకుండా స్త్రీతో
సంభోగిద్దా మనిపిస్తు ంది, దానితోబాటుగా మధ్యము మొదలయినవి తాగుదామనిపిస్తు ంది, పగలు
లేదు రాత్రి లేదు అసలు తాగకూడదు కానీ తాగాలనిపిస్తు ంది, నృత్యము పగటిపూట కూడా
చూడాలనిపిస్తు ంది, గీతములు విందామనిపిస్తు ంది, అందుకని అలాంటివి అన్నీ వస్తా యి అందుకని
కామ సంభందమయిన ఈ పదిదో షములు రానివ్వకు. క్రో ధ సంభందముగా ఎనిమిది దో షాలు
వస్తా యి చాడీలు చెప్పాలనిపిస్తు ంది, రెండు సత్పురుషులు అయినటువంటి వాళ్ల మీద క్రో ధము వచ్చి
వాళ్ళను నిర్భందించాలని అనిపిస్తు ంది.
మూడు కపటముగా ఒకరికి తెలియకుండా వేరొకరిని చంపాలనిపిస్తు ంది నాలుగు ఇతరులు
వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనము వస్తు ంది, ఇంకొళ్ళలో ఉన్న గుణాన్ని దో షముగా చెప్పాలినిపిస్తు ంది,
ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తు ంది, వాక్కు యందు పారుష్యముతో ఎప్పుడూ క్రో ధముతో
అవతలవారి మనస్సు భాదపడేటట్టు మాట్లా డాలనిపిస్తు ంది, చేతిలో ఒక ఆయుధము పట్టు కుని
అవతలవాడిని నిష్కారణముగా శిక్షించాలనిపిస్తు ంది. ఈ ఎనిమిది క్రో ధజనితములయిన వ్యసనాలు.
అందుచేత ఈ ఎనిమిది దగ్గ రకు రానీయకు నీకు పుష్యమీ నక్షత్రములో యవ్వరాజ్య పట్టా భిషేకము
చేస్తు న్నాను రామా నువ్వు బయలుదేరవచ్చు, వెళ్ళి ఉపవాసము చెయ్యి అన్నాడు.

ఇవ్వాళ ఉపవాసము అంటే ఏమిటో అసలు ఉపవాసము అంటే ఏమిటో ఎంత తేడా
ఉంటుందో మీరు చూద్దూ రుగాని. అందుకని రాముడు బయలుదేరి వెళ్లి పో యాడు, మంత్రు లందరితో
కలిసి అక్కడ ఉన్న జానపదుల్ని, పౌరుల్ని వెళ్లి పొ మ్మన్నాడు. ఒక్క రాజులున్నారు, మంత్రు లు
ఉన్నారు వాళ్ళతో అన్నాడు మీరు ఇంకొకసారి ఆలోచించండి నేను పెట్టు కున్న ముహూర్త ము
వశిష్టు డు పక్కన ఉండగా, పుష్యమీ నక్షత్రములో యవ్వరాజ్య అభిషేకము చేస్తా నని.
దశరధమహారాజుగారి కారెక్టెర్ లో ఉన్న పెద్ద బలహీనత తొందరబాటు. పక్కన వశిష్టు డు ఉన్నా
అడగడు, నేనెప్పుడు చెయ్యను యవ్వరాజ్య పట్టా భిషేకము అని. అప్పటికి తనకి తోచిందనుకోండి
extempore చూసారా, ఎప్పటికి ఏదనిపిస్తే అది వెంటనే చేసేయ్యాలనుకుంటాడు. అందుకని
పుష్యమీ నక్షత్రములో నేను అభిషేకము చేస్తా నన్నాను మీరు కూడా ఆలోచించారా చెయ్యనా
అన్నాడప్పుడు.

అంటే వాళ్ళు అన్నారు తప్పకుండా చెయ్యి అన్నారు. అన్న తరువాత వాళ్ళను కూడ
పంపించేసాడు. పంపించేసి అంతఃపురములోకి వెళ్ళాడు. వెళ్ళిపో యిన తరువాత సుమంత్రు డిని
పిలిచాడు, మళ్ళీ వెళ్ళి రాముడిని తీసుకురా అన్నాడు. ఇప్పుడు దశరధుడి హృదయము
బయటపడుతుంది. ఇప్పుడు ఎవ్వరికీ తెలియకూడని రహస్యాలు రాముడి దగ్గ ర మాట్లా డుతాడు,
సుమంత్రు డు మళ్ళీ వెళ్ళి మీ నాన్నగారు ఎందుకో మళ్ళీ తీసుకురమ్మన్నాడు, రావడము
రాకపో వడము నీ ఇష్ట ము అన్నాడు. ఎందుకని, ఇప్పుడేకదండీ మానాన్నగారితో మాట్లా డాను,
మళ్ళీ రావడము ఏమిటండీ అని రాముడు అంటాడేమో అని. కానీ తండ్రి పిలుపు కన్నా గొప్పది
రామచంద్రమూర్తికి ఇంకొకటి లేదు. ఇదిగో వస్తు న్నాను అని రధము ఎక్కాడు మళ్ళీ వెళ్ళాడు,
తండ్రిగారు కూర్చుని ఉన్నాడు ఒక ఉన్నతాసనము మీద, సింహాసనము కాదు అది
అంతఃపురములో ఉన్నాడు రాముడు మాత్రము వెళ్ళి కూర్చోడు అదీ గొప్పతనము. దూరముగా
నుంచుని నమస్కారము చేసి నిలబడ్డా డు, రామా వచ్చి కూర్చో అన్నాడు, అంటే వెళ్ళి
కూర్చున్నాడు.

రాముడు తండ్రిచెప్పేదాక కనీసము కూర్చోడు నిలబడతాడు, మళ్ళీ ఎందుకు పిలిచారు


నాన్నగారు అని కూడా అడగడు, మళ్ళీ పిలిచారంటే ఏదో చెప్పడానికే, ఆ మాట నేనడగడము
ఎందుకు, నిలబడతాడు అంతే, రామా ఇలా వచ్చి కూర్చో అన్నారు, కూర్చున్నాడు. కూర్చున్న
తరువాత దశరధుడు అంటాడు ఎంత గమ్మత్తు గా మాట్లా డుతాడో చూడండి, రామ వృద్దో2 స్మి
దీర్ఘా యుః భుక్తా భోగా మయేప్సితాః, అన్నవద్భిః క్రతుశతైః తథేష్టం భూరిదక్షిణైః, అనుభూతాని
చేష్టా ని మయా వీర సుఖాన్యపి, దేవర్షిపితృవిప్రా ణామ్ అనృణో2 స్మి తథా22 త్మనః తరువాత నాకు
అపి చాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్, సనిర్ఘా తా దివోల్కా చ పతతీహ మహాస్వనా.

రామా నేను జీవితములో అనుభవించని సుఖము లేదు, అన్ని సుఖాలు అనుభవించేసాను,


ఈ శరీరము జర్ఝరీ భూతము అయిపో యింది. నూరు క్రతువులు చేసాను, పితృ యజ్ఞ ము చేసాను,
తండ్రిగారి రుణము తీర్చుకున్నాను, మీ బిడ్డ లు పుట్టా రు, నేను యజ్ఞ యాగాది క్రతువులు చేసాను,
దేవతలు రుణము తీర్చుకున్నాను, ఋషులకు బ్రా హ్మణులకు గొప్ప దానాలు చేసాను, ఋషి
రుణము తీర్చుకున్నాను, స్వాధ్యాయణము చేసాను, వేదము చదువుకున్నాను పురాణాలు
చదువుకున్నాను. అన్ని రుణాలు తీరిపో యాయి, ఈ శరీరము జర్ఝరీ భూతము అయ్యింది,
అందుచేత రామా నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను చేయవలసిన పని అంటూ ఉంటే నీ
పట్టా భిషేకము ఒకటే. ఎందుకింత తొందర పడుతున్నావు అని నువ్వడగచ్చు.

నాకు పీడకలలు వస్తు న్నాయి, పైగా పగటిపూట ఉల్ఖ లు కింద పడుతున్నాయి, తోక
చుక్కలు కనపడుతున్నాయి, అన్నిటినీ మించి నా జన్మానక్షత్రా న్ని ఇవ్వాళ సూర్యుడు, కుజుడు,
రాహువు అనేటటువంటి మూడు పాప గ్రహములు ఆవరించి ఉన్నాయి. అందుకని ప్రమాదము
ముంచుకు వచ్చేస్తో ంది, ఈ శరీరము పెద్దదయిపో యింది, ఇది పడిపో తుంది అని నేను బెంగ
పెట్టు కోవడము లేదు రామా, కానీ ప్రజలు దిక్కు లేని వారు కాకూడదు, నీకు తొందరగా
పట్టా భిషేకము చేసేస్తా ను, పుష్యమీ నక్షత్రములో నీ అభిషేకము పూర్త యిపో తుంది.

అందుకని ఎందుకు పట్టా భిషేకము పూర్తి చేస్తు న్నానో తెలుసా, ఎంత గుంభనమయిన మాట
వాడేశాడో చూడండి నతద్యావదేనా మే చేతో న విము౦చతి రాఘవ, తావదేవాభిషించస్వ చలా హి
ప్రా ణినాం మతిః. ఒక ఆలోచన వచ్చింది నీకు పట్టా భిషేకము చెయ్యాలని, ఈ మనస్సు
మారిపో కముందే పట్టా భిషేకము పూర్తి అయిపో నీ రామా. అయితే నీకొక్కటి చెపుతాను విప్రో షితశ్చ
భరతో యావదేవ పురాదితః, తావదేవాభిషేకస్తే ప్రా ప్త కాలో తతో మమ భరతుడు చలా మంచివాడు.
దూరముగా యుధాజిత్తు వాళ్ళ మేనమామగారి దగ్గ ర ఉన్నాడు, భరతుడు రాకముందు నీ
పట్టా భిషేకము పూర్తి అయిపో వాలి రామా. భరతుడు రాకముందు పట్టా భిషేకము అయిపో వాలని
అంటున్నానని, భరతుడు నీకు పట్టా భిషేకము జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాడని
అనుకుంటున్నావేమో అతను ధర్మాత్ముడు, శిక్షింపడిన బుద్ధి కలవాడు, నిన్ను
అనువర్తించేటటువంటి స్వభావము ఉన్నవాడు, చాలా మంచివాడు.

కానీ రామా నేనొక్క మాట చెపుతాను కింతు చిత్త ం మనుష్యాణామ్ అనిత్యమితి మే మతిః,
సతా౦ తు ధర్మనిత్యానాం కృతశోభి చ రాఘవ. అందుచేత నాకొక్క అనుమానము ఉంది, ఎంత
ధర్మము నందు బుద్ధి ఉన్న పెద్దలయినా, ఎంత సాదుపురుషులు అయినా మనస్సు
మారుతుంటుంది ఒక్కొక్కసారి. రామా నేనంె దుకు చెప్పానో భరతుడు వాళ్ళ మేనమామగారి
ఇంటినుంచి తిరిగి వచ్చే లోపల ఎల్లు ండి నీకు యవ్వరాజ్య పట్టా భిషేకము పూర్తి అయిపో వాలి.
అందుకని రామా తొందరగా నీ పట్టా భిషేకము అయిపో తుంది, జనకుడికి, కేకయ రాజుకీ కూడా
చెప్పను ఇది దృష్టిలో పెట్టు కో ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తా యి, నీ
స్నేహితులు అందరినీ కూడా అప్రమత్తు లయి ఉండమని చెప్పు, నువ్వు ఉపవాసములోకి వెళ్ళు,
వెళ్ళి దేవతలను ప్రా ర్ధ న చెయ్యి, సీతాసహితుడవై ధర్భాసనము మీద పడుకో.

ఎందుకు చెప్పాడు ఈ మాట, కౌసల్యతో చాలా కాలము సంసారము చేసాక


దశరధమహారాజుగారికి బిడ్డ లు పుట్ట లేదు, అందుకని సుమిత్రను చేసుకున్నారు, బిడ్డ లు పుట్ట లేదు,
అరవైవేల సంవత్సరాలు వచ్చాక కైకమ్మను చెసుకోవలనుకున్నారు. కైకమ్మ మహా సౌందర్యారాశి,
చాలా విధ్యలు తెలుసు ఆ కైకమ్మను చేసుకోవాలనుకుంటే కేకయ రాజుగారు అన్నాడు నువ్వు మహా
వృద్ధు డివి కదా, నీకు బిడ్డ ను ఇస్తా ము, ఎందుచేత మంచి యవ్వనములో ఉంది మా అమ్మాయి.
అయినా నువ్వు ధర్మాత్ముడివి, గొప్ప రాజ్యానికి రాజువి ఇస్తా ను, కానీ నాకో మాట కావాలి అన్నాడు
కేకయ రాజు. ఏమిటి అన్నాడు దశరధుడు, ఒకవేళ నా కుమార్తెకు బిడ్డ లు పుడితే ఆ బిడ్డ డికి
నువ్వు పట్టా భిషేకము చెయ్యాలి అన్నాడు. అంటే దశరధుడు అనుకున్నాడు, కౌసల్యకు బిడ్డ లు
లేక కదా సుమిత్రను చేసుకున్నాను, సుమిత్రకు బిడ్డ లు లేక కదా కైకమ్మను చేసుకున్నాను.
నిజంగా కైకమ్మకు బిడ్డ లు పుడితే అంతకన్నా ఆనందకరమయిన విషయము ఏముంది , ఆ బిడ్డ కే
పట్టా భిషేకము చేస్తా ను, ఇప్పుడొ చ్చిన నష్ట ము ఏముంది. తప్పకుండా కైకమ్మకు పుట్టిన
సంతానానికి పట్టా భిషేకము చేస్తా ను అని మాటిచ్చాడు, ఇచ్చి వెనక్కు వచ్చాడు.

ఇప్పుడు నలుగురు కుమారులు జన్మించారు. పెద్దకుమారుడయిన రామచంద్రమూర్తి సకల


గుణాభిరాముడు. సకల గుణాభిరాముడయిన రాముడికి రాజ్యము ఇవ్వకుండా భరతుడికి రాజ్యము
ఇవ్వలేడు ఇవ్వాళ. అందుకని ఇవాళ భరతుడికి రాజ్యము ఇస్తా ను రామా అని తన నోటితో
అనలేడు, అని తాను బ్రతకలేడు. అలాగని తాను మాట తప్పితే సత్యము తప్పిన వాడవుతాడు.
అందుకని తప్పుకోవడానికి ధర్మాన్ని పట్టు కున్నాడు, సత్యము వదిలాడు ధర్మము పట్టు కున్నాడు.
పెద్ద కొడుకు కాబట్టి రాముడికి రాజ్యము ఇవ్వచ్చు. అందుకని ఏమన్నాడు, కౌసల్య పెద్ద భార్య,
పెద్దభార్య పెద్దకుమారుడివి విశేషించి గుణవంతుడివి నీకు పట్టా భిషేకము చేయడము ధర్మము
అందుకు చేస్తా ను అన్నాడు.

ఇది భరతుడు వస్తే యుధాజిత్తు కు తెలిసినా కేకయ రాజుకి తెలిసినా నువ్వు ఇక్ష్వాకు
వంశములో ఉండి సత్యము తప్పుతున్నావంటారు. వియ్యంకుడు అయినా జనకమహారాజుగారు
వస్తే పో నీ రాముడి తరుపన తీర్పు చెప్పడు, జనకుడు పెద్దవాడు మహాజ్ఞా ని, తన అల్లు డిని దృష్టిలో
పెట్టు కుని అదేమిటయ్యా పెద్దవాడికి పట్టా భిషేకము చేయ్యొచ్చు అనడు జనకుడు. ఎందుకనడు,
ఆయన జ్ఞా ని, తప్పయ్యా సత్యము తప్పకూడదు, భరతుడికే పట్టా భిషేకము చెయ్యి అంటాడు.
అందుకని కాలము లేదని చెప్పేస్తా ను, వేళ లేదని చెప్పేస్తా ను, ఎల్లు ండి పట్టా భిషేకము చేసస
ే ్తా ను.
అటు జనకుడిని పిలవను ఇటు కేకయ రాజుని పిలవను, భరతుడిని పిలిస్తే ఇంత అర్జెంట్ గా
భరతుడు ఎందుకు అని అడిగితే మళ్ళీ వాళ్ళకు తెలుస్తు ంది అందుకని భరతుడిని పిలవను. అసలు
భరతుడుకు కూడా ఇది తెలియకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు. అందుకని భరతుడు లేకుండా
ఈ పట్టా భిషేకము అయిపో వాలి, రామా నువ్వు జాగ్రత్త పడు అన్నాడు.
ఇంత గుట్టు కడుపులోపెట్టు కుని చెప్పకుండ చెప్పాడు, రాముడికి పట్టా భిషేకము
చేయడానికి సిద్దపడి ఉపవాసము చెయ్యమన్నాడు. ఉపవాసము అంతే ఏమి చేసాడో తెలుసాండీ
రాముడు, వశిష్టు డిని పిలిచి వెళ్ళి ఉపవాసము చేయించమన్నాడు, ఆయన వెళ్ళి మంత్రపూరిత
మయిన ఉపవాసము ఏమిటో చెప్పాడు. వశిష్టు డు అక్కడకు వెడితే చెయ్యిచ్చి దింపాడు,
నమస్కారము చేసాడు, కూర్చోపెట్టా డు ఉపదేశము చేసేసి ఎలా చేయాలో ఉపవాసము
మహానుభావుడు మంత్రపూరిత ఉపవాసాన్ని చెప్పి రధము ఎక్కి వశిష్టు డు వెళ్లి పో యాడు.

ఏమిటో తెలుసాండీ ఆయన చేసిన ఉపవాసము, ఏది ఉపవాసము అంటే, తన స్నేహితులు


అందరితో సంతోషించి, స్నేహితులు అందరూ వెళ్ళి కౌసల్యకు చెప్పారు. రాముడికి పట్టా భిషేకము
చేస్తు న్నారని. ఆభరణములు ఇచ్చి కౌసల్య శ్రీమహావిష్ణు వుని ప్రా ర్ధ న చేస్తూ కూర్చుంది. సుమిత్ర,
సీతమ్మ, లక్ష్మణుడు అక్కడ చేరారు. రాముడు వెళ్ళి కౌసల్యకు చెప్పాడు, అమ్మా నాకు
పట్టా భిషేకము చేస్తు న్నారని. కౌగలించుకుని సంతోషించి ఆనందభాష్పాలు కార్చి శ్రీమహావిష్ణు వుని
ప్రా ర్ధ న చేసి ఏ నక్షత్రములో పుట్టా వురా నాయనా ఇన్ని గుణములతో నీ తండ్రిని సంతోషపెట్టా వు,
యవ్వరాజ్య పట్టా భిషిక్తు డవు అవుతున్నావు. నేను కౌసల్యను అయినందుకు, జ్యేష్ట భార్యను
అయినందుకు కృతార్ధు రాలును అయ్యాను అంది కౌసల్య.

ఇంత సంతోషించాడు, లక్ష్మణా నేను యవ్వరాజ్య పట్టా భిషేకము చేసుకుంటే నీకూ


యవ్వరాజ్య పాట్టా భిషేకము జరిగినట్టే అన్నీ సుఖాలు అనుభవించు అన్నాడు. వచ్చి స్నేహితులను
అందరినీ పంపించిన తరువాత స్నానము చేసి పూజాగృహములో ప్రవేశించి, హవిస్సుని
తలపెట్టు కుని తీసుకువచ్చి, శ్రీమహావిష్ణు వికి హవిస్సులు ఇచ్చారు అఘ్నిలో, ఇచ్చి
మిగిలిపో యినటువంటి హవిస్సును తాను తిన్నాడు. ఇవ్వాళ చాలా మండి దృష్టిలో అన్నము
మానేయడము ఉపవాసము, అది ఉపవాసము కాదు అసనము. నూవ్వు ఒక జన్మలో వేరొకరికి
పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిదమ
్ర ు అనుభవిస్తు న్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను
పడిపో తుంది కాబట్టి, కన్ను పడిపో నంత సాత్వికమయిన పదార్ధ ము, శరీరము నిలబడడానికి
కావలసినంత ఈశ్వరానుగ్రహముగా తిని ఆ ఓపికతో శరీరమాజ్యంకులకి ఇది ధర్మసాధనము కాబట్టి
భగవదారాధనము చెయ్యడము ఉపవాసము.
ఉప అంటే సమీపము నందు వసి అంటే నివసించుట. ఈశ్వరుని గుణముల యందు తాను
మునుక వేయుట. అందుకని ఈశ్వరారాధన చేసి హవిస్సు తాను భుజించి ధర్భాలతో కూడిన చాప
వేసుకుని ఆ చాపమీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడయి, భార్యతో కలిసి
పూజామందిరములో ధర్భాసనము మీద నిద్రపో యాడు రాముడు. ఇంకొక ఝాము ఉందనగానే నిద్ర
లేచాడు. నిద్ర లేచి అలంకృతము చేసి సంధ్యావందనము చేసి, బ్రా హ్మణులని పిలిచి అక్కడంతా
స్వస్తివాచనము చేయించి, చేసాడు పురము అంతా సంతోషము ఎక్కడ చూసినా ఆనందముతో ఉంది
దీనికి ఉపవాసము అని పేరు. రామాయణము చూపించింది ఉపవాసము చెయ్యడము ఎలాగో
కూడా.

సర్వం శ్రీ ఉమామహేశ్వర పరఃబ్రహ్మార్పణమస్థు


స్వస్తి

You might also like