Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 20

ప్రశ్నోత్త ర రత్నమాలికా

శ్రీ గురుభ్యోమ్ నమః శ్రీ మాత్రే నమః


అపార కరుణాసింధుం జ్ఞా నదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

శ్లో కం 1

శంపాలతాసవర్ణ ం సమ్పాదయితుం భవజ్వర చికిత్సాం |

లింపామి మనసి కిఞ్చన కమ్పాతటరోహి సిద్ధభైషజ్యం ||

శ్లో కం 2

దధానో భాస్వత్తా ం అమృతనిలయః లోహితవపుః

వినమ్రా ణాం సౌమ్యః గురుః అపి కవిత్వం చ కలయన్ |

గతౌ మన్దో గంగాధరమహిషి కామాక్షి భజతాం

తమః కేతుః మాతః తవ చరణపద్మో విజయతే ||


భగవన్ కిమ్ ఉపాదేయం? గురువచనం హేయమ్ అపి చ కిమ్? అకార్యం
|
కో గురుః? అధిగత తత్వః శిష్య హితాయ ఉద్యతః సతతమ్ ||1II

తా: ఓ గురుదేవా! స్వీకరించవలసినదేది? గురువచనము.


విడచిపెట్టవలసినదేద? ి చెడుపని.
గురువెవరు? తత్త ్వము తెలుసుకున్నవాడు మరియు ఎల్ల ప్పుడు
శిష్యుని హితముకై ప్రయత్నించువాడు…1..

త్వరితం కిం కర్త వ్యం విదుషాం? సంసార సంతతిచ్చేదః|


కిం మోక్ష తరోః బీజం? సమ్యక్ జ్ఞా నం క్రియాసిద్ధమ్ ||2II

తా: పండితులు త్వరపడి చేయవలసినదేమిటి? సంసార బంధమును


తెంచుకొనుట.
మోక్షమనే చెట్టు కు విత్త నమేద?
ి క్రియలచే సిద్ధించిన
ఉత్త మజ్ఞా నము…2..

కః పథ్యతరో? ధర్మః కః శుచిః ఇహ? యస్య మానసం శుద్ధ మ్ |


కః పండితో? వివేకీ కిం విషమ్? అవధీరణా గురుషు ||3II

తా: మిక్కిలి హితకరమైనదేద?


ి ధర్మము. ఎవడు పవిత్రు డు? శుద్ధ మైన
మనస్సు కలవాడు. ఎవడు పండితుడు? వివేకము కలవాడు. ఏది
విషము? గురువులను అవమానించుట…3..

కిం సంసారే సారం? బహుశో అపి విచింత్యమానం ఇదంఏవ |


కిం మనుజేషు ఇష్ట తమం? స్వ పరహితయో ఉద్యతం జన్మ ||4II
తా: ఈ సంసారములో సారమేద? ి బహువిధములుగా చింతించబడిన
జ్ఞా నమే. మానవులు మిక్కిలి ఇష్ట పడునదేది? తనకు మరియు పరులకు
హితం చేయుటకై ఉద్యమించు జన్మ…4..

మదిః ఏవ మోహజనకః కః? స్నేహః కే చ దస్యవో? విషయాః |


కా భవవల్లీ? తృష్ణా కో వైర?
ీ యస్తు అనుద్యోగః ||5II

తా: మద్యము వలే మత్తెక్కించునదేది? అనురాగము. చోరులెవరు?


సుఖములు. ఏది సంసార పాశము? అత్యాశ. ఎవడు శత్రు వు?
సో మరిపో తు…5…

కస్మాత్ భయం ఇహ? మరణాత్ అంధాత్ ఇహ కో విశిష్యతే? రాగీ !


కః శూరః? యో లలనా లోచనబాణైః న చ వ్యథితః ||6II

తా: దేనినుండి ఈ లోకంలో భయము కలుగును? మరణము నుండి.


గుడ్డివాని కంటే చూడలేని వాడెవడు? అనురాగము కలవాడు. ఎవడు
శూరుడు? స్త్రీల కన్నులనే బాణములతో పీడింపబడనివాడు..6..

పాతుం కర్ణా ంజలిభిః కిం అమృతం ఇహ యుజ్యతే? సత్ ఉపదేశః |


కిం గురుతాయా మూలం? యదేతత్ అప్రా ర్థ నం నామ ||7II

తా: చెవులనే దో సిళ్ళతో అమృతం వలే త్రా గవలసినదేద?


ి మంచి
ఉపదేశము. గొప్పతనమునకు మూలమేద? ి యాచించకుండుట…7..
కిం గహనం? స్త్రీచరితం కః చతురః? యో న ఖండితః తేన I
కిం దుఃఖమ్? అసంతోషః కిం లాఘవమ్? అధమతో యాచ్నా ||8II

తా: అర్థ ం చేసుకోలేనిదేది? స్త్రీ ప్రవర్త న. ఎవడు చతురుడు? స్త్రీ ప్రవర్త నచే
దుఃఖపడనివాడు. దుఃఖమేది? అసంతృప్తి. నీచమైనదేద? ి అధముని
యాచించుట…8..

కిం జీవితమ్? అనవద్యం, కిం జాడ్యం? పాఠతో అపి అనభ్యాసః |


కో జాగర్తీ? వివేకీ కా నిద్రా ? మూఢతా జంతోః ||9II

తా: జీవితమేది? దో షములేనిది. జాడ్యమేద?


ి చదివినా పట్టు బడక
పో వుట. మేల్కొని ఉండువాడు ఎవడు? వివేకవంతుడు. నిద్ర ఏమిటి?
ప్రా ణి యొక్క మూర్ఖత్వమే…9..

నళినీగత జలవత్ తరళం కిం? యవ్వనం ధనం చ ఆయుః |


కథయ పునః కే శశినః కిరణసమాః సజ్జ న ఏవ ||10II

తా: తామరాకుపై నీరువలే చంచలమైనదేది? యౌవనము, ధనము


మరియు ఆయుర్దా యము.
చంద్రు ని కిరణములవలే ఆనందమునిచ్చువారు ఎవరు? సజ్జ నులే..10..

కో నరకః? పరవశతా కిం సౌఖ్యం? సర్వసంగవిరతిర్యా |


కిం సత్యం? భూతహితం ప్రియం చ కిం ప్రా ణినామ్? అసవః ||11II
తా: నరకమేమిటి? పరాధీనత. సుఖమేమిటి? బంధములన్నిటినీ
విడచుట. సాధించవలసినదేద? ి ప్రా ణులకు హితము. ప్రా ణులకు
ఇష్ట మైనదేద?
ి ప్రా ణములు…11..

కో అనర్థ ఫలో? మానః కా సుఖదా? సాధుజనమైత్రీ |


సర్వవ్యసన వినాశే కో దక్షః? సర్వథా త్యాగీ ||12II

తా: అనర్థ మును కలిగించునదేద?ి దురభిమానము. సుఖమునిచ్చునది


ఏది? సాధుజనులతో మైత్రి. అన్ని వ్యసనములను నశింపజేయ గలిగిన
వాడెవడు? అన్ని విధములుగా త్యాగియే..12..

కిం మరణం? మూర్ఖత్వం కిం చ అనర్ఘం? యత్ అవసరే దత్త మ్|


ఆమరణాత్ కిం శల్యం ప్రచ్చన్నం యత్కృతం పాపమ్ ||13II

తా: ఏది మరణము? మూర్ఖత్వము.


విలువ కట్ట లేనిదేద?
ి అవసరమైనప్పుడు ఇచ్చిన దానము.
మరణించునంతవరకు బాధ పెట్టు నదేద? ి రహస్యంగా చేసిన
పాపము…13..

కుత్ర విధేయో యత్నో? విద్యాభ్యాసే సదౌషధే దానే |


అవధీరణా క్వ కార్యా? ఖల పరయోషిత పరధనేషు ||14II

తా: దేనికోసం ప్రయత్నించవలెను? విద్యాభ్యాసము, మంచి ఔషధము


మరియు దానంచేయుట కోసం. తిరస్కరించవలసినదేద? ి దుష్టు డు,
పరస్త్రీ మరియు పరధనము..14…

కా అహర్నిశం అనుచింత్యా? సంసార అసారతా న తు ప్రమదా |


కా ప్రేయసీ విధేయా? కరుణా దీనేషు సజ్జ నే మైత్రీ ||15II

తా: రాత్రింబవళ్ళు ఆలోచించవలసినదేమిటి?


సంసారముయొక్క నిస్సారత. స్త్రీ గురించి కాదు.
దేనిని ఇష్ట పడవలెను? దీనులపై కరుణను మరియు సజ్జ నులతో
మైత్రిని..15…

కంఠ గతైః అపి అసుభిః కస్య హి ఆత్మా న శక్యతే జేతుమ్|


మూర్ఖస్య శంకితస్య చ విషాదినో వా కృతఘ్నస్య ||16II

తా: కంఠములో ప్రా ణములున్ననూ ఎవడిని జయించుట శక్యము కాదు?


మూర్ఖు ని, సందేహితుని, విషాదగ్రస్తు ని మరియు కృతఘ్నుని..16…

కః సాధుః? సద్వృత్త ః కం అధమం ఆచక్షతే? తు అసద్వృత్త మ్ |


కేనజితం జగత్ ఏతత్? సత్య తితిక్షావతా పుంసా ||17II

తా: సాధువెవడు? మంచి ప్రవర్త న కలవాడు. ఎవనిని అధముడని


అందురు? చెడునడవడి కలవానిని. ఎవనిచే ఈ ప్రపంచము
జయించబడును? సత్యము మరియు సహనము కలవానిచే..17..

కస్మై నమాంసి దేవాః కుర్వన్తి ? దయాప్రధానాయ |


కస్మాత్ ఉద్వేగః స్యాత్? సంసారారణ్యతః సుధియః ||18II

తా: దేవతలు కూడా ఎవరికి నమస్కరించెదరు? దయయే ప్రధానంగా


కలవానికి. దేనివలన ఉద్వేగము కలుగును? బుద్ధిమంతునకు
సంసారారణ్యము నుండి..18…
కస్యవశే ప్రా ణిగణః? సత్య ప్రియభాషిణో వినీతస్య |
క్వ స్థా తవ్యం? న్యాయ్యే పథి దృష్ట అదృష్ట లాభాఢ్యే ||19II

తా: ఎవడి ఆధీనంలో ప్రా ణులుండును? సత్యమును మరియు


ప్రియమును పలుకు వినీతునకు. ఎచట నిలువవలెను? ప్రత్యక్షములు
మరియు పరోక్షములు అగు లాభములను కలిగించు న్యాయ
మార్గ మునందు..19…

కః అంధః? యో అకార్యరతః కో బధిరో యో హితాని న శృణోతి |


కో మూకో? యః కాలే ప్రియాణి వక్తు ం న జానాతి ||20II

తా: ఎవడు గుడ్డివాడు? చెడుపనులు చేయువాడు. ఎవడు చెవిటివాడు?


హితవచనములను విననివాడు. ఎవడు మూగవాడు?
అవసరమైనప్పుడు ప్రియములు పలుకనివాడు..20…

కిం దానమ్? అనాకాంక్షం కిం మిత్రం? యో నివారయతి పాపాత్|


కో అలంకారః? శీలం కిం వాచాం మండనం? సత్యమ్ ||21II

తా: ఏది దానము? ప్రతిఫలము కోరనిది. ఎవడు మిత్రు డు? పాపము


నుండి నివారించువాడు. ఏది అలంకారము? శీలము. వాక్కులకు
భూషణమేది? సత్యము..21…
విద్యుత్ విలసితచపలం కిం? దుర్జ న సంగతిఃయువతయఃచ |
కులశీల నిష్ప్రకంపాః కే కలికాలేపి? సజ్జ నా ఏవ ||22II

తా: మెరుపు వలే చంచలమైనదేది? చెడువారితో సహవాసము మరియు


యువతులు.
మంచి కులము మరియు శీలము కలవారెవరు? కలికాలంలో కూడ
సజ్జ నులే..22…

చింతామణిః ఇవ దుర్ల భం ఇహ కిం? కధయామి తత్ చతుర్బద్రమ్ |


కిం తత్ వదంతి భూయో విధూత తమసో విశేషేణ ||23II

తా: చింతామణి వలే దుర్ల భమైనది ఈ లోకంలో ఏది కలదు?


చతుర్భద్రము అనబడు నాలుగు మంచి విషయములు. విజ్ఞా నులు
వాటినెట్లు వివరించుచున్నారు? ..23…

దానం ప్రియవాక్ సహితం జ్ఞా నం అగర్వం క్షమాన్వితం శౌర్యమ్ I


విత్త ం త్యాగసమేతం దుర్ల భం ఏతత్ చతుర్భద్రమ్ II24II

తా: ప్రియముగా మాట్లా డుచూ చేయు దానము, గర్వము లేని జ్ఞా నము,
సహనం కల శౌర్యము, త్యాగంతో కలసిన ధనము అనునవి దుర్ల భమైన
చతుర్భద్రము..24…

కిం శోచ్యం? కార్పణ్యం సతి విభవే కిం ప్రశస్త మ్ ఔదార్యమ్ I


కః పూజ్యో విద్వద్భిః? స్వభావతః సర్వదా వినీతోయః II25II
తా: శోచింపదగినదేది? సంపద ఉన్ననూ పిసినారిగా ఉండుట.
ప్రశంసించదగినదేది? ఔదార్యము. విద్వాంసులచే
పూజింపదగినవాడెవడు? స్వభావసిద్ధంగానే ఎల్ల ప్పుడూ
వినయవంతుడు..25…

కః కులకమలదినేశః? సతి గుణవిభవే అపి యో నమ్రః I


కస్య వశే జగత్ ఏతత్? ప్రియహితవచనస్య ధర్మనిరతస్య II26II

తా: కులమనే కమలమును వికసింపచేయు సూర్యుడెవడు? గుణములు


అధికంగా ఉండి కూడా వినయం కలవాడు. ఎవడి వశంలో ఈ ప్రపంచం
ఉన్నది? ప్రియముగా మరియు హితముగా మాట్లా డుచూ
ధర్మనిరతుడగువానికి..26…

విద్వన్ మనోహరా కా? సత్కవితా బో ధవనితా చ I


కం న స్పృశతి విపత్తి ః? ప్రవృద్ద వచనానువర్తినం దాన్త మ్ II27II

తా: విద్వాంసులకు మనోహరమైనదేద? ి మంచి కవిత్వము మరియు


జ్ఞా నోపదేశము. ఎవనిని విపత్తి అంటదు? పండితుల మాటలను
అనుసరించువానిని మరియు ఇంద్రియనిగ్రహముకలవానిని..27…

కస్మై స్పృహయతి కమలా? త్వత్ అలస చిత్తా య నీతివృత్తా య I


త్యజతి చ కం సహసా? ద్విజ గురు సుర నిందాకరం చ సాలస్యమ్ II28II

తా: ఎవనిని లక్ష్మి వరించును? సో మరితనం లేని మనస్సు కలవానిని


మరియు నీతిగా ప్రవర్తించువానిని. ఎవడిని వెంటనే త్యజించును?
బ్రా హ్మణుల, గురువుల మరియు దేవతల నిందచేయువానిని అట్లే
సో మరిపో తుని..28…

కుత్ర విధేయో వాసః? సజ్జ న నికటే అథవా కాశ్యామ్ I


కః పరిహార్యో దేశః? పిశునయుతో లుబ్ధ భూపశ్చ II29II

తా: ఎచట నివసించవలెను? సత్పురుషులవద్ద లేనిచో కాశీలో.


ఏ చోటు వదలిపెట్ట తగినది? క్రూ రుడు మరియు లోభియైన రాజు ఉన్న
దేశము..29…

కేన అశోచ్యః పురుషః? ప్రణతకళత్రేణ ధీరవిభవేన I


ఇహ భువనే కః శోచ్యః? సత్యపి విభవే న యో దాతా II30II

తా: మానవుడు దేనిచే దుఃఖించడు? అనుకూలవతియైన భార్యచే


మరియు స్థిరమైన సంపదచే.
ఈ లోకంలో శోకింపదగిన వాడెవడు? సంపద ఉన్ననూ దానం
చేయనివాడు..30…

కిం లఘుతాయా మూలం? ప్రా కృత పురుషేషు యా యాచ్నా I


రామాత్ అపి కః శూరః? స్మరశర నిహతో న యశ్చలతి II31II

తా: అగౌరవమునకు మూలమేమి? నీచులను యాచించుట.


రామునికంటే శూరుడెవరు? మన్మధబాణములు గుచ్చుకున్నా
చలించనివాడు..31…

కిం అహర్నిశం అనుచింత్యం? భగవత్ శరణం న సంసారః I


చక్షుష్మంతో అపి అంధాః కే స్యుః? యే నాస్తికా మనుజాః II32II

తా: రాత్రింబవళ్ళు చింతించవలసిన దేమున్నది? భగవచ్చరణము.


సంసారము కాదు. కళ్లు న్నా గ్రు డ్డివారెవరు? నాస్తికులగు
మానవులు..32…

కః పంగుః ఇహ ప్రథితో వ్రజతి చ యో వార్ధ కే తీర్థ మ్ I


కిం తీర్ధ ం అపి చ ముఖ్యం? చిత్త మలం యత్ నివర్త యతి II33II

తా: ఈ లోకంలో ఎవడు కుంటివాడు? ముసలితనంలో తీర్థా టన


చేయువాడు. ఏ తీర్థ ము ముఖ్యమైనది? చిత్త కాలుష్యమును
పో గొట్టు నది..33…

కి స్మర్త వ్యం పురుషైః? హరినామ సదా న యావనీ భాషా I


కో హి న వాచ్యః సుధియా? పరదో షశ్చ అనృతం తద్వత్ II34II

తా: మానవులచే స్మరించదగినదేది? ఎల్ల ప్పుడు హరినామము.


యవనుల భాష కాదు.
బుద్ధిమంతుడు పలుకరానిదేది? పరదో షము మరియు
అసత్యము..34…

కిం సంపాద్యం మనుజైః? విద్యా విత్త ం బలం యశః పుణ్యమ్ I


కః సర్వగుణవినాశీ? లోభః శత్రు శ్చ కః? కామః II35II
తా: మానవులచే సంపాదించదగినదేది? విద్య, ధనము, బలము,
యశస్సు, పుణ్యము.
ఏది గుణములనన్నింటినీ నశింపజేయును? లోభము.
శత్రు వేది? కామము..35…

కా చ సభా పరిహార్యా? హీనా యా వృద్ధ సచివేన I


ఇహ కుత్రా వహితః స్యాత్ మనుజః? కిల రాజసేవాయామ్ II36II

తా: ఏ సభ పరిహరించదగినది? అనుభవజ్ఞు డైన వృద్ధ మంత్రిలేనిది.


మానవుడు శ్రద్ధగా వ్యవహరించవలసినదెక్కడ? రాజ సేవలో..36…

ప్రా ణాత్అపి కో రమ్యః? కులధర్మః సాధుసంగశ్చ I


కా సంరక్ష్యా? కీర్తిః పతివ్రతా నైజబుద్ధిశ్చ II37II

తా: ప్రా ణముకంటే రమణీయమైనదేద? ి కులధర్మము మరియు


సాధుసంగమము.
రక్షించవలసినదేది? కీర్తి, పతివ్రత మరియు స్వబుద్ధి..37…

కా కల్పలతా లోకే?సత్ శిష్యాయ అర్పితా విద్యా I


కో అక్షయవటవృక్షః స్యాత్?విధివత్ సత్ పాత్ర దత్త దానం యత్ II38II

తా: ఈ లోకంలో కల్పలత ఏది? మంచి శిష్యునకు అర్పించిన విద్య.


నాశము లేని మర్రిచెట్టు ఏది?
యధావిధిగా చేసిన సత్పాత్రదానము..38…

కిం శస్త ం్ర సర్వేషాం? యుక్తిః మాతా చ కా? ధేనుః I


కిం ను బలం?యత్ ధైర్యం, కో మృత్యుః?యత్ అవధానరాహిత్యమ్
II39II

తా: అందరికీ శస్త మ


్ర ేద?
ి యుక్తి. తల్లి ఎవరు? ఆవు. బలమేద?
ి ధైర్యము.
ఏది మరణము? అజాగ్రత్త..39…

కుత్ర విషం? దుష్ట జనే, కిం ఇహ అశౌచం భవేత్? ఋణం నృణాం I


కిం భయం ఇహ? వైరాగ్యం భయమపి కిం?విత్త మేవ సర్వేషామ్ II40II

తా:విషమెక్కడ? దుష్ట జనునిలో. మానవులకు మాలిన్యమేది?


ఋణము. భయములేనిదేది? వైరాగ్యము. అందరికీ భయంకరమైనదేది?
ధనమే..40…

కా దుర్ల భా నరాణాం? హరిభక్తిః, పాతకం చ కిం? హింసా I


కో హి భగవత్ ప్రియః స్యాత్ యో అన్యం న ఉద్వేజయేత్ అనుద్విగ్నః
II41II

తా: మానవులకు దుర్ల భమైనదేది? హరిభక్తి. పాపమేద?


ి హింస.
భగవంతునకు ఇష్ట మైనవాడెవడు? ఇతరులను కష్ట పెట్టక తాను
కష్ట పడనివాడు..41…

కస్మాత్ సిద్ధిః? తపసః బుద్ధిః క్వ ను?భూసురే కుతో బుద్ధిః I


వృద్ధోపసేవయా కే వృద్ధా ః? యే ధర్మతత్త ్వజ్ఞా ః II42II

తా: దేనివలన సిద్ధి కలుగును? తపస్సు వలన. బుద్ధి ఎచట?


బ్రహ్మనిష్ఠు నిలో. బుద్ధి దేనినుండి లభించును? వృద్ధు లను సేవించుటచే.
వృద్ధు లెవరు? ధర్మతత్త ్వమును తెలిసినవారు..42…
సంభావితస్య మరణాత్ అధికం కిం? దుర్యశో భవతి I
లోకే సుఖీ భవేత్ కో? ధనవాన్ ధనమపి చ కిం? యత్ అచేష్టం II43II

తా:గౌరవము కలవానికి మరణం కంటే అధికమైనదేద? ి అపకీర్తి. లోకంలో


సుఖవంతుడెవడు? ధనవంతుడు. ధనమేద? ి కోరినదానిని
ఇచ్చునది..43…

సర్వసుఖానాం బీజం కిం?పుణ్యం, దుఃఖం అపి కుతః? పాపాత్


కస్య ఐశ్వర్యం? యః కిల శంకరం ఆరాధయేత్ భక్త్యా II44II

తా: అన్ని సుఖములకు కారణమేద? ి పుణ్యము. దుఃఖము దేనివలన


కలుగును? పాపము వలన.
ఐశ్వర్యము ఎవడికి ఉండును? భక్తిగా శంకరుని ఆరాధించువానికి..44…

కో వర్ధ త?
ే వినీతః, కో వా హీయతే? యో దృప్త ః I
కో న ప్రత్యేతవ్యో? బ్రూ తే యశ్చ అనృతం శశ్వత్ II45II

తా:వృద్ధి చెందు వాడెవడు? వినయము కలవాడు. క్షీణించువాడెవడు?


దర్పమున్నవాడు. ఎవడు నమ్మదగని వాడు? ఎప్పుడూ అబద్ధ ం
చెప్పువాడు..45…

కుత్ర అనృతే అపి పాపం? యత్ చ ఉక్త ం ధర్మరక్షార్థ మ్ I


కో ధర్మో అభిమతో? యః శిష్టా నాం నిజకులీనానామ్ II46II

తా: అబద్ధ ం చెప్పినా పాపంలేనిది ఎక్కడ? ధర్మరక్షణకై


అబద్ధ మాడినచోట. ఏది ధర్మము?
సత్ప్రవర్త న కలవారు మరియు తన కులములో జన్మించినవారు
ఆచరించునది..46…

సాధుబలం కిం? దైవం, కః సాధుః? సర్వదా తుష్ట ః I


దైవం కిం? యత్సుకృతం, కః సుకృతీ? శ్లా ఘ్యతే చ యః సద్భిః II47II

తా: మంచివానికి బలమేది? దైవము. ఎవడు మంచివాడు? ఎల్ల ప్పుడూ


సంతృప్తి పడువాడు. దైవమేద?
ి పుణ్యము. పుణ్యవంతుడెవడు?
సత్పురుషులచే పొ గడబడువాడు..47…

గృహ మేధినశ్చ మిత్రం? కిం భార్యా, కో గృహీ చ? యో యజతే I


కో యజ్ఞో ? యః శ్రు త్యా విహితః శ్రేయస్కరో నృణామ్ II48II

తా: గృహస్థు నకు మిత్రము ఏది? భార్య. ఎవడు గృహస్థు డు? దైవపూజ
చేయువాడు. పూజ ఏది?వేదముచే చెప్పబడినది. మరియు
మానవులకు శ్రేయస్సు కల్గించునది..48…

కస్య క్రియా హి సఫలా? యః పునరాచారవాన్ శిష్ట ః I


కః శిష్టో ? యో వేదప్రమాణవాన్ కో హతః? క్రియా భ్రష్టః II49II

తా: ఎవడి క్రియ సఫలమగును? ఆచారవంతుడైన శిష్టు నిది.


శిష్టు డెవడు? వేదమును ప్రమాణముగా గ్రహించువాడు. ఎవడు
నశించును? క్రియా భ్రష్టు డు..49…

కో ధన్యః? సంన్యాసీ, కో మాన్యః? పండితః సాధుః I


కః సేవ్యో? యో దాతా, కో దాతా? యో ఆర్ధి తృప్తిం ఆతనుతే II50II

తా: ధన్యుడెవడు? సన్యాసి. పూజించదగినవాడెవడు? పండితుడు


మరియు సాధువు.
సేవించదగినవాడెవడు? యాచకులను తృప్తిపరచు దాత..50…

కిం భాగ్యం దేహవతామ్? ఆరోగ్యం, కః ఫలీ? కృషికృత్ I


కస్య న పాపం? జపతః, కః పూర్ణో ? యః ప్రజావాన్ స్యాత్ II51II

తా: దేహమున్నవారికి భాగ్యమేమిటి? ఆరోగ్యము. ఎవడు సఫలుడు?


కృషి చేయువాడు. ఎవడికి పాపముండదు? జపించువానికి.
పరిపూర్ణు డెవడు? సంతానం కలవాడు..51…

కిం దుష్కరం నరాణాం? యన్మనసో నిగ్రహః సతతమ్ I


కో బ్రహ్మచర్యవాన్ స్యాత్? యశ్చ స్ఖ లితో ఊర్ధ ్వరేతస్కః II52II

తా: నరులకు చేయలేనిదేద? ి ఎల్ల ప్పుడు మనోనిగ్రహము. బ్రహ్మచర్యము


కలవాడెవడు? వీర్యస్ఖ లనము కానివాడు మరియు
ఊర్థ ్వరేతస్కుడు..52…

కా చ పరదేవతోక్తా ? చిచ్చక్తిః, కో జగద్భర్తా I


సూర్యః, సర్వేషాం కో జీవనహేతుః? స పర్జ న్యః II53II

తా: ఎవరు పరదేవత? జ్ఞా నశక్తి. ప్రపంచమునకు భర్త ఎవడు? సూర్యుడు.


జీవనమునకు హేతువు ఏది? మేఘము…53….
కః శూరో? యో భీతత్రా తా, త్రా త చ కః? స గురుః I
కో హి జగత్ గురుః ఉక్త ః? శంభుః, జ్ఞా నం కుతః శివాదేవ II54II

తా: ఎవరు శూరుడు? భయపడువారిని రక్షించువాడు. రక్షకుడెవరు?


గురువు. జగద్గు రువెవడు? శివుడు. ఎవని వలన జ్ఞా నం కలుగును?
శివుని వలన..54…

ముక్తిం లభేత కస్మాత్? ముకుంద భక్తేః ముకుందః కః I


యః తారయేత్ అవిద్యాం, కా చ అవిద్యా? యత్ ఆత్మనో అస్ఫూర్తిః II55II

తా: ముక్తి దేనివలన లభించును? ముకుందునిపై భక్తి ద్వారా.


ముకుందుడెవరు? అజ్ఞా నమును పో గొట్టు వాడు. అజ్ఞా నమేద?
ి ఆత్మ
ప్రకాశమును కలిగించనిదే..55…

కస్య న శోకో? యః స్యాత్ అక్రో ధః, కిం సుఖం? తుష్టిః I


కో రాజా? రంజనకృత్, కశ్చ శ్వా? నీచసేవకో యః స్యాత్ II56II

తా: ఎవడికి శోకముండదు? కోపము లేనివానికి. ఏది సుఖము?


సంతోషము. ఎవడు రాజు? రంజింపచేయువాడు. కుక్కవంటి వాడెవడు?
నీచులను సేవించువాడు..56…

కో మాయీ? పరమేశః, క ఇంద్రజాలాయతే? ప్రపంచో అయమ్ I


కః స్వప్ననిభో? జాగ్రత్ వ్యవహారః, సత్యమపి చ కిం? బ్రహ్మ II57II

తా: మాయ చేయువాడెవడు? పరమేశ్వరుడు. ఇంద్రజాలమేది? ఈ


ప్రపంచము. స్వప్నము
వంటిదేది? మెలకువ లోని వ్యవహారము. సత్యమైనదేద?
ి
బ్రహ్మము..57…

కిమ మిథ్యా? యత్ విద్యా నాశ్యం, తుచ్ఛం తు? శశవిషాణాది I


కా చ అనిర్వచనీయా? మాయా, కిం కల్పితం? ద్వైతమ్ II58II

తా: మిథ్య ఏది? విద్యచే నశించునది. తుచ్ఛమైనదేది? కుందేలు కొమ్ము


మొదలైనది. అనిర్వచనీయమైనదేది? మాయ. కల్పితమైనదేద? ి
జీవాత్మ, పరమాత్మ అను ద్వైతము..58…

కిం పారమార్థికం స్యాత్? అద్వైతం చ అజ్ఞ తా కుతో? అనాదిః I


వపుషశ్చ పో షకం కిం? ప్రా రబ్ధ ం చ అన్నదాయి కిం? చ ఆయుః II59II

తా: పారమార్థికము ఏది? బ్రహ్మ ఒక్కటే అను అద్వైతము.


అజ్ఞా నమెక్కడినుండి ఏర్పడినది? అనాదిగా ఉన్నది. శరీరమును
పో షించునదేది? ప్రా రబ్ధ ము. అన్నమునిచ్చునదేది?
ఆయుర్దా యము..59…

కో బ్రా హ్మణైః ఉపాస్యో? గాయత్రి అర్క అగ్నిగోచరః శంభుః I


గాయత్రి యమాదిత్యే చ అగ్నౌ శంభౌ చ కిం ను? తత్ తత్త ్వమ్ II60II

తా: బ్రా హ్మణులచే ఉపాసించదగినదేద?


ి గాయత్రి, సూర్యుడు, అగ్ని
అనువాటి ద్వారా గోచరించు శంకరుడు. గాయత్రి, సూర్యుడు, అగ్ని,
శంకరుడు అను వీటిలో ఏమున్నది? తత్త ్వము..60…
ప్రత్యక్షదేవతా కా? మాతా పూజ్యో గురుశ్చ కః? తాతః I
కః సర్వదేవతాత్మా? విద్యాకర్మాన్వితో విప్రః II61II

తా: ప్రత్యక్ష దేవత ఎవరు? తల్లి. పూజ్యుడైన గురువు ఎవడు? తండ్రి.


సర్వదేవతాత్ముడు ఎవడు? విద్య మరియు కర్మ కల్గిన
బ్రా హ్మణుడు..61…

కశ్చ కులక్షయహేతుః? సంతాపః సజ్జ నేషు యో అకారి I


కేషాం అమోఘవచనం? యే చ పునః సత్యమౌన షమషీలాః II62II

తా: కులక్షయమునకు కారణమేది? సజ్జ నులకు కల్గించిన సంతాపము.


ఎవరి వచనము అమోఘము? సత్యము, మౌనము, ఇంద్రియనిగ్రహం
కలవారిది..62…

కిం జన్మ? విషయసంగః కిం ఉత్త రం జన్మ? పుత్రః స్యాత్ I


కో అపరిహార్యో? మృత్యుః కుత్ర పదం విన్యసేచ్చ? దృక్పూతే II63II

తా: జన్మ ఏది? విషయ సంబంధమే. ఉత్త ర జన్మ ఏది? పుత్రు డు.
పరిహరించలేనిదేద?ి మరణము. ఎచట కాలు పెట్టవలెను? పరిశుద్ధ మైన
స్థా నంలో..63…

పాత్రం కిం అన్నదానే? క్షుధితం కో అర్చ్యో హి? భగవత్ అవతారః I


కశ్చ భగవాన్? మహేశః శంకరనారాయణాత్మైకః II64II

తా: అన్నదానమునకు అర్హు డెవడు? ఆకలిగొన్నవాడు. పూజించదగిన


వాడెవడు? భగవదవతారము. ఎవడు భగవంతుడు? హరిహరాత్మకమైన
మహేశ్వరుడు..64…
ఫలమపి భగవత్ భక్తేః కిం? తత్ లోకస్వరూపసాక్షాత్వమ్ I
మోక్షశ్చ కో? హి అవిద్యాస్త మయః, కః సర్వవేదభూః? అథ చ ఓం II65II

తా: భగవద్భక్తికి ఫలమేద?ి ఆయన లోకమును మరియు


స్వరూపమును సాక్షాత్కరింపచేసుకొనుటే. మోక్షమేది? అజ్ఞా న నాశము.
అన్ని వేదములకు పుట్టినిల్లు ఏది?
ఓం కారము..65…

You might also like