Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 18

దేవుడు చేయు నూతనక్రియ Isaih-43; 15-19

క్రొ త్త సంవత్సరానికి స్వాగతం పలుకుటకు విచ్చేసిన అందరికి వందనాలు

ఇంకా కొంత సమయమే ఉంది, అందరమూ New Year లోనికి ప్రవేశించెదమని నిరీక్షణ ఉన్నదిగదా

పాత సంవత్సరానికి -క్రొ త్త సంవత్సరానికి ఏమి మార్పు -జరగ బో తుంది

కేవలం -CALANDER మారబో తోందా?

లేదు -ఇంకేదో కొత్త దనం కొరకు అందరు ఆశిస్తా రు

ప్రపంచములో - ఈ క్రొ త్త సంవత్సరము ఆహ్వానము కొరకు - ఎంతో ఆరాటం -ఆర్భాటము - సంతోషం

ఆ సంతోషంలో - మత్హు లో మునిగి తేలేవారు -దరిదాపుగా సగము ప్రపంచ జనాభా ఉంటారా?

ఏమో – కానీ, క్రొ త్త సంవత్సరాన్ని సంతోషంతో ఆహ్వానించేవారు -దరిదాపు అందరు కదా?

ముఖ్యముగా రెండు విషయాలు

పాత సంవత్సరం & క్రొ త్త సంవత్సరం

A-పాత సంవత్సరం - దాదాపు జరిగి పో యింది - ఏమి ఆశించాము - ఏమి ఇచ్చింది - ఏమి మిగిల్చింది

(happy or Sad) మనము ఆశించిన వాటిని పొ ందామా?

 శరీర రీతిగా - లోక రీతిగా - ఆత్మీయ రీతిగా - ఇలా అన్నిటిలోను-ఆలోచిస్తే కొన్ని- తీర్మానాలు -

కొన్ని నిర్ణ యాలు -చేసికొంటూ ఉంటారు –

 కానీ కొంతమంది మధ్యలో మర్చి పో తారు - మల్లి ఈ రోజు లెక్క లేసుకొంటారు కదా

B-క్రొ త్త సంవత్సరం- మరలా - ఈ సంవత్సరానికి క్రొ త్త ప్రణాళికలు - క్రొ త్త తీర్మానాలు

మిగిలి పో యినవి - carry forward అవుచు ఉంటాయి కొన్ని

 ఈ లోక రీతిగా అనేక అతీర్మానాలు -ఉంటాయి

 కానీ మనము ఆత్మీయ తీర్మానాలను గూర్చి ఆలోచన చేద్దా ము

చేసికొన్నవెన్ని -పాటించినవెన్ని -కొనసాగుచు ఉన్నవెన్ని? అప్పుడే మరచి పో యినవెన్ని

మేము ఏమి తీర్మానాలు- చేసికోము - కేవలం -దేవుడిచ్చే వాగ్దా నముల కొరకు వచ్చాము అంటారా?

 కానీ, దేవుడు ప్రతి వ్యక్తికొరకు - నూతనమైన ప్రణాళికలు కలిగి -నూతన క్రియలను చేస్తా ను

అంటున్నాడు

 Isaiah-43;15-19 చదవబడ్డ వాక్యభాగములో నుండి 3-వాగ్ధా నాలు దేవుడు మనకు ఇస్తు న్నాడు
చాలా మంది shopping కి వెళ్లి గంటల గంటలు shopping చేస్తు ంటారు –

ఏది క్రొ త్త గా వచ్చింది – ఏది ఇప్పుడే దిగింది -ఏది latest, inter net లో browse చేసి మరి వెదకి కొంటారు

కానీ అతి కొద్దీ సమయములోనే - ఆ model out date అయిపో తూ ఉంటుంది –పాతది అయిపో తూ

ఉంటుంది

పాతదై పో వుటమే కాదు – అంతే వేగముగా దానియొక్క ధరతగ్గి పో తూ ఉంటుంది

EX - ఒక mobile లేదా ఒక latest క్రొ త్త కారు కొని – కొద్దిసేపు వాడి – ఒక గంట తరువాత వెళ్లి తిరిగి

అమ్మండి – లేక ఆ shop వాడికే తిరిగి ఇవ్వండి - కనీసం 10 % discount చేస్తా డు కదా

బంగారు ఆభరణమైన సరే – ఒక్కరోజు వాడి తీసికొనివెళ్ళితే – తరుగు వేస్తా డు –

 కానీ దేవుడు చేసే- నూతనక్రియ- అది క్రొ త్త గా – నిత్య నూతనముగా -శాశ్వితముగా –

దినదినా నికి విలువ పెరిగేదిగా ఉంటుంది – మరి ఈ క్రొ త్త సంవత్సరములో అలాటి దానిని

ఆశిస్తా మా!!

 ఈ నూతనత్వము –మనము పొ ందాలంటే మొదట -పాతది – వెళ్ళిపో వాలి

 పాతదైన బ్రతుకును -పాతిపెట్టా లి

రోమా-6; 4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును

నూతన జీవము పొ ందినవారమై నడుచుకొనునట్లు , మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొ ందుటకై

ఆయనతో కూడ పాతిపెట్ట బడితివిు.

అలాగే మనము నూతనజీవమును పొ ందినవారమై -నడుచుకొనవలెను

ఈ లోకములో ఏదైనను క్రొ త్త గా ఉండునని అనుకొనే దానికి ఉన్నదా?

ప్రసంగి అంటున్నాడు -సూర్యునిక్రింది –క్రొ త్త ది ఏమి లేదు – ఇప్పుడు క్రొ త్త ది –ఒకప్పుడు ఉండినదే, కాబట్టి

సూర్యుని క్రింద అంతా వ్యర్ధ మే –ఏదియు క్రొ త్త దికాదు

కానీ –యేసుక్రీస్తు నందున్న యెడల సమస్త ము –నూతనత్వము కలిగి ఉంటుంది –పాతగిల్లి పో దు

Roma-7;6. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింప బడితిమో దాని విషయమై చనిపో యిన వారమై, ధర్మశాస్త ్రము

నుండి విడుదల పొ ందితివిు గనుక మనము అక్షరానుసారమైన ప్రా చీన స్థితిగలవారము కాక ఆత్మాను

సారమైన నవీన స్థితి గలవారమై సేవచేయు చున్నాము.


 యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా రక్షణ పొ ందియున్న మనము – మన పాత స్వభావమును –

బాప్తీస్మము ద్వారా విడచిపెట్టి – నూతన స్వభావమును ధరించుకొని యున్నాము – యేసుక్రీస్తు

నందున్నవాడు నూతనసృష్టి అయి యున్నాడు

II-Cori-5; 17 కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతనసృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొ త్త వాయెను;

 అనుదినము అయన స్వభావము లోనికి సవీకరించ బడుటకు -ప్రతి విశ్వాసి – రూపాంతరము

చెందవలసి యున్నది

Epi-4;23. మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడినవారై, 24. నీతియు యథార్థ మైన భక్తియుగలవారై, దేవుని

పో లికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.

 ఆ రీతిగా మనలను అనుదినము నడుపుటకు –పరిశుద్ధా త్మను సంచకరువుగా మనలో

ఉంచియున్నాడు –మన ప్రభువు

 నిజమైన నూతనత్వము –క్రీస్తు యేసు నందు కలదు – దినదినము ఎదుగుచు – క్రీస్తు సారూప్యము

లోనికి, మనము మారవలెను –అదియే దేవునిచిత్త మై యున్నది

పౌలు –రోమా సంఘములతో – ఎఫిసు సంఘములతో ఈ మాటలే వ్రా యుచున్నాడు

Roma-12; 2. మీరు ఈలోక మర్యాదను అనుసరింపక, ఉత్త మమును, అనుకూలమును, సంపూర్ణ మునై యున్న

దేవుని చిత్త మేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొ ందుడి

Ephi-4; 15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

 కాబట్టి క్రీస్తు యేసు నందున్నవారు – అనగా ఆయన యందు - అంటుగట్ట బడి -వేరుపారి-

యేసుక్రీస్తు నందు నిలచియున్నాను అనుకొనేవారు – దినదినము నూతనమగుచు ఉందురు

యేసుప్రభువు తనలో నివసించి – అనుదినము అభివృద్ధిపొ ందాలని ఆశిస్తూ ఉన్నాడు

John-15; 2 నాలో ఫలింపని ప్రతితీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతితీగె మరి ఎక్కువగా

ఫలింపవ లెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.3 నేను మీతో చెప్పినమాటను బట్టిమీరిప్పుడు

పవిత్రు లైయున్నారు .4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రా క్షావల్లిలో

నిలిచి యుంటేనే గాని తనంతట తానే యేలాగుఫలింపదో , ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును

ఫలింపరు .5 ద్రా క్షావల్లిని నేను, తీగెలుమీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు

నిలిచియుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.


John-15; 7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో

అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.8 మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమ

పరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.

 యేసు క్రీస్తు లో ఉండువాడు -నూతనసృష్టి – ఎవరు ఆయనలో ఉండి ఫలిస్తూ ఉంటారో – వారు

బహుగా ఫలింపవలెనని – దేవుడు ఆశిస్తు న్నాడు

 మరి ఆ బహుగా ఫలించుటకు- దేవుడు ఏమి అడిగితే అది ఇస్తా డు –

 మరి ఆయనను ఏమి అడగాలి అని ఆశిస్తు న్నావు?

 పరలోక విషయములో –ప్రతి ఆశిర్వాదమును దేవుడు ఆయనయందుండు - బిడ్డ లకు ఏర్పరచి

సిద్ధపరచి యుంటున్నాడు

మరి – అడిగి పొ ందు కొందామా!

STORY; - ఒకసారి ఒక తండ్రిని –వాళ్ళ అబ్బాయి ఒకప్రశ్న అడిగాడు

Daddy ఒక చెరువు గట్టు మీద 3-కప్పలు కూర్చొని ఉన్నాయి; అందులో ఒక కప్ప – మిగతా కప్పలతో

అన్నది; " నేను ఈ గట్టు నుండి చెరువులో దూకి –అవతలి గట్టు కు వెళ్ళుటకు తీర్మానం చేసికొన్నాను” అని

కొద్దీ సేపటి తరువాత అక్కడ గట్టు మీద ఎన్ని కప్పలు ఉంటాయి? అనేది ప్రశ్న

ఆ తండ్రి - ఇంకెన్నిఉంటాయిరా -2-ఉంటాయి అన్నాడు –ఆ అబ్బాయి లేదు దాడి, ఆ సంఖ్య తప్పు అన్నాడు

మరలా, ఆ తండ్రి- ఓహో , అవి అన్ని కూడా Friends కదా –మిగతా 2-కూడా మొదటి కప్పను అనుసరించి

అవతల గట్టు కు వెళ్ళుటకు చెరువులో దూకి ఉంటాయి. కాబట్టి ఆగట్టు మీద ఏ కప్పు లేదు అన్నాడు

కానీ ఆ అబ్బాయి ఇది కూడా తప్పు అన్నాడు

ఆ తండ్రి ఆలోచనలో పడ్డా డు - ఇవి రెండు సరియైన జవాబులు కాక పో వుట ఏమి అని, పో నీ ఆ రెండిటిలో

ఒక్క కప్ప వెంబడించిo దా అని అన్నాడు

అప్పుడు ఆ అబ్బాయి - లేదు daddy – జవాబు ఆగట్టు మీద మూడు కప్పలు ఉన్నాయి – అక్కడ ఒక

కప్పు – చెరువులోదూకి అవతలిగట్టు కు వెళ్ళుటకు - "తీర్మానం మాత్రమే చేసింది" అన్నాడు

ఔను ఆ జవాబు సరియైనది, ఈ జవాబు మనకు ఎక్కడైనా touch అవుతుందా ?

చాల మందికి-DEC 31 రాత్రి చేసే తీర్మానాలు ఏమైనా గుర్తు కు వస్తు న్నాయా?

 ఔను , చాలామంది అనేక గొప్ప తీర్మానాలు చేస్తా రు


శరీర రీతిగా, రోజు ఉదయాన్నేలేచి – walking కివెళ్లా నని, Gym కి వెళ్లా నని- చెడు అలవాట్లు మానివేయాలి

విద్యార్థు లైతే – చక్కగా Carrier-Plan చేసి కోవాలని – U S –Canada plans

ఇంకా –ప్రతినెల పొ దుపు చేయాలనీ- ఒక ఇల్లు కట్టు కోవాలని-ఇలా అనేకమైన – తీర్మానాలు

విశ్వాసులు చేసే తీర్మానాలు

 ఈ సంవత్సరం - Bible సంపూర్ణ ముగా -చదివేయాలని – (కొన్నిసార్లు -ఆదికాండముదాటదు)

 అనుదినము వేకువ జామున లేచి ప్రా ర్ధించాలని

 TIME లోకూడా దశమ భాగము – దేవునికి ఇవ్వాలని -2 1/2 Hours

 సువార్త చెప్పాలని -

ఇలాఎన్నోన్నే మంచి తీర్మానాలు చేసికొని - నూతన సంవత్సరములోనికి ప్రవేశిస్తూ ఉంటారు

ఈరీతిగా – చేసికొన్నతీర్మానాలు ఎన్ని సంపూర్తి అయ్యాయి –కనీసం ప్రా రంభము అయ్యాయి

మనతీ ర్మానాలు –ఈ కప్పలాంటి తీర్మానాలేనా?

మనమందరము –క్రొ త్త దనాన్ని – క్రొ త్త వాటిని కోరుకొంటూ ఉంటాము - వాహనాలైన, వస్త్రా లైనా,

ఆహారమైన - క్రొ త్త ధనాన్ని క్రొ త్త రుచులను కోరుకొంటూ ఉంటాము -మనస్సు ఎప్పుడు క్రొ త్త దనం వైపు

పరుగులెడుచు ఉంటుంది

వాటిని పొ ందుట కొరకు - చాలా ప్రయాస పడుచు ఉంటాము

ఇక్కడ వ్రా యబడిన మాట - దేవుడు ఒక నూతన కార్యము మీ జీవితాల్లో చేస్తా డు

దేవుడు మన జీవితాల్లో చేసే నూతన క్రియ ఎలావుంటుంది -అనే ఆలోచన వస్తు ంది కదా!

ఆ నూతన క్రియ ఏమైయున్నది - ఎలావుంటుంది ? మనము ఆ నూతన క్రియను ఎలా పొ ందుకొనగలము?

ఎలా అనుభవించగలము? ఈ రీతిగా మన ఆలోచనలు సాగుతాయి గదా!

అయన ఎవరో మొదట తెలిస్తే - ఆయన చేయు నూతన క్రియ ఏమిటన్నదిమనకు అవగాహనకు వస్తు ంది

1) First-నూతన క్రియ చేసేదెవరు? అని ఆలోచిద్దా ము- నూతనక్రియను చేయువాడు -యెహో వా

Isaiah-43;15. యెహో వానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రా యేలు సృష్టికర్త నగు నేనే మీకు రాజును.

ఈ నూతన కార్యము చేసేవాడు - మీకు పరిశుద్ధ దేవుడు -అనగా మనకు పరిశుద్ధ దేవుడు

ఆ పరిశుద్ధ దేవుడు, మాట ఇచ్చి వాగ్దా నము నెరవేర్చడానికి ఇష్ట పడుచున్నాడు

అనగా - ఆ పరిశుద్ధ దేవుని యొద్ద కు వచ్చిన వారిలో నూతన కార్యమును చేయుచున్నాడు


1) నూతన క్రియలో మొదటిగా, నిన్ను పరిశుద్ధ మైన నూతన మైన వ్యక్తిగా చేయుట

అయన పరిశుద్ధ దేవుడు - పరిశుద్ధ త ఆయనలోనే చూడగలము

Levi-19; 2 మీరు పరిశుద్ధు లై యుండవలెను. మీ దేవుడనైన యెహో వానగు నేను పరిశుద్ధు డనై యున్నాను.

1) నేను పరిశుద్ధు డను గనుక - మీరును పరిశుద్ధు లై యుండవలెను

నేను పరిశుద్ధు డను గనుక - నేను మీ విషయములో పరిశుద్ధ కార్యములను చేస్తా ను

 అయన చేసే కార్యములు -పరిశుద్ద ములు గనుక - వాటిని పొ ందునట్లు - మనమును పరిశుద్ధు లై

యుండవలెను

 ఈ నూతన సంవత్సర ప్రా రంభములోనే - దేవుడు మనతో తెలియ చేస్తు న్న మాట – పరిశుద్ధు లై

యుండుడి -అయన పరిశుద్ధు డు గనుక -పరిశుద్ధ తో మొదట కార్యాన్ని ప్రా రంభిస్తా డు

అదేమిటంటే - నేను పరిశుద్దు డను గనుక -పరిశుద్ధ కార్యములను నీ జీవితములో చేస్తా ను

 ఆ పరిశుద్ధ కార్యము, ఏమనగా; యేసు ప్రభువు అయన పరిశుద్ధ రక్త మును ఆ సిలువలో కార్చెను

 యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ - రక్త ములో కడుగబడుట ద్వారా మనము పరిశుద్ధు లుగా

చేయబడ్డా ము

 అంతకు ముందు మనము -పాపులం – శపించబడిన వారము - భయంకరమైన శిక్షకు

పాత్రు లమై - వేదనను అనుభవించుచున్న వారము - నిత్యమరణానికి యోగ్యులము

 కానీ ఆ పరిశుద్ధ దేవుడు ఆ పరిశుద్ధ రక్తా న్ని కార్చిన తరువాత - ఆ పరిశుద్ధ రక్త ముతో -

నిన్ను నన్ను కడిగియున్నాడు

 ఎప్పుడైతే కడగా బడియున్నామో -అప్పుడు పాత జీవితమునుండి - మురికి గల బ్రతుకు

నుండి -పరిశుద్దు లుగా చేయబడియున్నాము

గత కాలములో మనము నామకార్థ బ్రతుకుతో జీవించాము - ఆప్పుడును - దేవుని బిడ్డ లు గానే,

చెప్పుకొన్నాము -కానీ బ్రతుకు మాత్రము పాతదిగా ఉండినది

 కానీ, ఇప్పుడు దేవుడు చెప్పుచున్న మాట -నేను పరిశుద్ధు డను గనుక – నా లాగ

మిమ్ములను పరిశుద్ధు లుగా మార్చ బో వుచున్నాను

 ఇది ఆ పరిశుద్ధ దేవుని నుండి వచ్చిన –మొట్ట మొదటి నూతన క్రియ


పుటము వేయబడిన బంగారము ఎలాగు పరిశుద్ధ పరచ బడుతుందో - మూసలో వేయబడిన

వెండి ఎలాగు స్వచ్ఛమగుతుందో – ఆ రీతిగా మన జీవితాలను -ఒక నూతనమైన అనుభవము లోనికి

తీసికొని వచ్చుటకు అయన బహుగా ప్రయాస పడుచున్నాడు- remember it

 గత కాలములో మన జీవితం- గత కాలములో మన నడక – ఒక సారి మనము జ్ఞా పకము చేసికొంటే

చాలా ఇబ్బంది కరంగాను - చాలా భాదాకరంగాను - అయ్యో అనే స్థితిలో - ఉండి యుండవచ్చు.

 ఇప్పుడు దేవుడు అంటున్నాడు;-

 నా చేయి నీ మీద పెడతాను-పుటము వేస్తా ను -పరిశుద్ధ పరుస్తా ను

 నీలో ఉన్న మష్టు ను తొలగించుటకు - క్షారము వేస్తా ను -నిన్ను శుభ్రం చేస్తా - నా రక్తా న్ని నీ

మీద ప్రో క్షిస్తా - నిన్ను ఆ రక్త ములో కడుగుతాను - పరిశుద్ధు నిగా చేస్తా ను

 అప్పుడు నీవు నూతనమైన రూపము లోనికి మార్చబడుదువు - పరిశుద్ధు నిగా సువర్ణ ము

వలె- మెరుస్తూ ఉంటావు

 ఒక నూతనమైన వ్యక్తిగా కనబడ బో వుచున్నావు,

ఈ సంవత్సరం ఎందుకో ఈ కార్యాన్ని దేవుడు మన హృదయాల్లో ప్రా రంభిచాడు

 గత సంవత్సర కాలంలో - నీ జీవితం మాసి పో యినట్లు గా - భయంకరమైన హీన స్థితిలో

యిన్నట్లు గా - అపవిత్రతను కూడగట్టు కొని యిన్నట్లు గా- ఉండియుండవచ్చు -

భయంకరమైన అనుభవాలతో జీవించినట్లు గా ఉండియుండవచ్చు

 కానీ ఈ సంవత్సరము - నిన్ను ఆలా విడచి పెట్టను, అంటున్నాడు దేవుడు -ఒక నూతన

కార్యాన్ని చేయుటకు ఆరంభించి యున్నాడు

 అయన మన జీవితమును నూతనముగా చేయుటకు -మన ప్రా ణాత్మ దేహములో-

నూతనత్వమును నింపుటకు; తన పరిశుద్ధ రక్త ములో కడిగి పవిత్రపరచి -నూతనమైన

వ్యక్తిగా చేయుటకొరకు ఇష్టపడుచు ఉంటున్నాడు

So, అయన మన జీవితాలలో -మన హృదయాలలో ఆ కార్యాన్ని చేయుటకు - ఒప్పుకొందామా?

నీ నా ఒప్పుకోలు తోనే- ఆ కార్యము మనలో జరగ గలదు- ప్రియమైన వారలారా


 అప్పుడు నీవు నిత్య నూతనముగా మెరిసిపో తూ ఉంటావు - పై పై మెరుపులు కాదు - నీ

హృదయములో నుండి వచ్చు మెరుపు

 (శోధింపబడిన మీదట నేను సువర్ణ మై మారె దను-అని ఒక భక్తు డు పాట వ్రా సాడు)

A) దేవుడు నూతన కార్యము మనలో చేయుటకు; నూతన హృదయాన్ని దయచేయుదును అంటున్నాడు

Jeremiah-31;33 ఈ దినములైన తరువాత నేను ఇశ్రా యేలువారితోను యూదావారితోను చేయబో వు నిబంధన

యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రా సెదను; యెహో వా వాక్కు ఇదే.

Ezekiel-36; 26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసద


ె ను,

రాతిగుండె మీలోనుండి తీసివస


ే ి మాంసపు గుండెను మీకిచ్చెదను.

 మనలో నూతన క్రియ చేయబడాలంటే ఉండవలసిo ది పరిశుద్ధ త, అప్పుడు ఈ కార్యాలు


జరుగుతాయి
అందుకు దేవుడు మనలో ముందు ఈ సిద్ధపాటును అనుగ్రహిస్తా డు
 ఇప్పుడున్న హృదయము - పాతది – అది కఠినమైనది -

నూతన కార్యములు మనలో జరగాలంటే – నూతనమైన హృదయము కావాలి –అదికూడా దేవుడే ఇస్తా డు

 ఎందుకనగా –మనలో నూతన కార్యములు జరగాలి అంటే –ఈ హృదయము అతి ముఖ్యమైనది- ఆ

హృదయము కూడా యేసు ప్రభువు రక్త ముతో ప్రో క్షించబడి –నూతన పరచబడాలి

 అందుకే ప్రభువు –కఠిన హృదయమైన పాత హృదయము తీసివేసి నూతనమైన మృదువైన

హృదయాన్ని ఇస్తా ను – ఆ హృదయము మీద నా యొక్క– క్రొ త్త కార్యమును వ్రా స్తా ను అంటున్నాడు

 ఎందుకంటే – ఈ హృదయము ఎప్పుడును -పాతదైన- భయంకరమైన వాటితో నింపబడి ఉంటుంది -

పగ, ద్వేషము, మోసము, అసూయ, ఈర్ష్య- ఇలాటి ఇవాటితో నింపబడి –కఠినమై పో యి ఉంటుంది.

ఎప్పుడు, లోక సంబంధమైన కోరికలతో –ఇచ్చకపు మాటలతో –మోసకరమైన చేతలతో ఉన్న

హృదయాన్ని మార్చి వేసి- క్రొ త్త హృదయాన్ని ఇస్తా ను అంటున్నాడు

కాబట్టి ఇకమీదట – చక్కగా మెరిసే స్వర్ణ ము లాగా – అందరు ఇష్టపడే మృదువైన హృదయము గలవానిగా –

ఒక నూతనకార్యమును చేయదలచి యుంటున్నాడు


 సొ లొమోను సామెతలలో – హృదయము అన్నిటికంటే ముఖ్యమైనది దాన్ని భద్రముగా కాపాడుకో

అని హెచ్చరిస్తు న్నాడు

Prov-4; 23. నీ హృదయము లోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటి కంటె ముఖ్యముగా నీ

హృదయమును భద్రముగా కాపాడుకొనుము

ఈ నూతనకార్యము ద్వారా – నీ మాటలో మార్పు – నీ రూపములో మార్పు రాబో తుంది

నూతనస్వభావము –నూతన జీవితము దేవుడు అనుగ్రహస్తు న్నాడు

 ఈ పరిశుద్ధ దేవుడు – మనలను పరిశుద్దు లుగా మొదట చేయుచున్నాడు

 ఈ పరిశుద్ధ దేవుడు మనతో ఉంటె – మనలో ఉంటె, గొప్పదైన నూతన కార్యములు మనలో

జరుగుతాయి

 ఇక మీదట జీవితాలు –వెలుగుతో నింపబడి – దీవెన కరముగా ఉండును

 ఇక నుండి పాత కార్యములకు తావులేదు – ఇదిగో క్రొ త్త కార్యములు మనలో జరుగుతాయి

 ఈ పరిశుద్ధ దేవుడు, మనలో ఉన్నప్పుడు –మన ప్రవర్త న, మాటతీరు,– చక్కగా ఉంటాయి

ఇదిగో ఇప్పుడు క్రీస్తు యేసు నీలో ఉంటాడు –నీవు నూతన సృష్టిగా ఉంటావు

 నీవు నీ కుటుంబము నూతన మైనదిగా ఉంటుంది- మరి నీవు నీ కుటుంబము ఆ పరిశుద్ధ దేవుని

యొద్ద కు వచ్చి, యేసు క్రీస్తు కార్చిన, ఆ పరిశుద్ధ రక్త ముతో కడగబడాలి

Ex ;- పాత వాడైన సౌలు – గుడ్డి భక్తితో - మూర్ఖు డిగా -గర్విష్టు డిగా -చీకటిలో -జీవించినవాడు

అయితే –దేవుడి హస్తా లలోబడ్డా డు – అతని పాతస్థితి పడిపో యి – అంధకార ద్రు ష్టిపో యి – నూతన

హృదయము –నూతనమైన జీవితము దేవుడు అనుగ్రహించాడు – ఇప్పుడు క్రొ త్త బ్రతుకు –క్రొ త్త పేరు –

పరిశుద్ధు డిగా చేయబడ్డా డు –పౌలుగా మారిపో యాడు - గొప్ప కార్యాలు చేసాడు

 ఈ నూతన సంవత్సరములో – నీ ద్వారా నూతన కార్యాలు జరగాలని దేవుడు కోరుకొంటున్నాడు

నూతన కార్యములు అంటే – నూతన గృహము కట్టు కొనుటకాదు – నూతన కారు –మరి ఇంకేదో కాదు

నూతన సృష్టిగా మార్చబో వుచున్నాడు గనుక – నూతనమైన కార్యములు జరగాలి – అవి ప్రభువు

మహిమ పరచబడు కార్యాలు సుమా

B) ఈ నూతన హృదయము లోనికి దేవుడు పరిశుద్ధా త్మను పంపుతాడు

అప్పుడు మన మాట –మన ప్రవర్త న సమస్త ము – ప్రేమతో కృపాసహితముగా ఉంటుంది


పరిశుద్దా త్మ మనలోకి వచ్చినప్పుడు-ప్రవర్త న మారుతుంది, హృదయములో దేవుని ప్రేమ-క్రు మ్మరించ బడును

II-Cori-5;5 దీని నిమిత్త ము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ

అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.

Gal-3;5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుత ములు చేయించువాడు ధర్మశాస్త ్రసంబంధ

క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?

Q- పరిశుద్ధ త లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు

దేవుడు – మనలను తన రక్త ము ద్వారా – తన వాక్యము ద్వారా – పరిశుద్దా త్మద్వారా పరిశుద్ధ పరచి

యున్నాడు–పరిశుద్ధు లే, దేవుణ్ణి చూడబో వుచున్నారు

కాబట్టి పరిశుద్ధు లైన మీరు దేవుణ్ణి చూడగలరు -మాటలాడగలరు –అయన మాటను వినగలరు

అది అను దినము దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా – వ్యక్తిగతముగా దేవుని సన్నిధిలో

ప్రా ర్ధించుట ద్వారా సాధ్యము

 మనకు ఈ నూతన సంవత్సరము దేవుడిచ్చే నూతనకార్యము –ఆయనను చూడగలుగుట

ఇంత కాలం –ప్రభుని ఎరుగని వారు –ఆయనతో మాటలాడని వారు – ఇప్పటివరకు దైవసన్నిధిని అనుభ

వించని వారు పరిశుద్దు లుగా ఉండుటద్వారా ఆయనతో మాట్లా డగలరు – ఆయనతో సహవాసము చేయగలరు

C) పరిశుద్ధ త ఎక్కడ ఉంటె –అక్కడ కార్యాలు దేవుడు చేస్తా డు

Joshua; 3; 5 యెహో షువ, రేపు యెహో వా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును

మీరు పరిశుద్ధ ప రచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.

పరిశుద్ధ పరచుకొంటేనే – దేవుని అద్భుత కార్యములు జరుగుతాయి

మనము పరిశుద్ధ పరచుకొంటే –అయన మనమధ్య వచ్చి గొప్పకార్యములు చేయు దేవుడు

పరిశుద్ధ ముగా ఉన్నప్పుడు -ఇశ్రా యేలీయులు –దేవుని గొప్ప కార్యములు చూచారు

Ex-నిబంధన మందసము మోయు –యాజకుల కాళ్ళు-యొర్దా ను నీటిని తాక గానే – యొర్దా ను రెండు

పాయలై నీటి ప్రవాహము ఆప బడి –మధ్యలో మార్గ మేర్పడినది

Joshua-3; 16. పై నుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు

దగ్గ ర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమను అరాబాసముద్రమునకు పారునవి బొ త్తి గా ఆపబడెను

పరిశుద్ద తను వీడి –పాపమును దాచు కొన్నప్పుడు – దేవుని శాపమును –శిక్షను అనుభవించారు
Ex—ఆకాను పాపము విషయములో మనము గమనించ వచ్చు

 కాబట్టి దేవుని –నూతనమైన కార్యములు – మీ జీవితాలలో ఈ సంవత్సరము చూడాలంటే –

మొదట పరిశుద్దు లుగా జీవించుచు ఉండాలి –అప్పడు గొప్పకార్యములు చూడగలమ అని

దేవుడు వాగ్ధా నము చేయుచున్నాడు –

ై నూతన మైన వ్యక్తిగా చేయుట


 మొదటి క్రియ -నిన్ను పరిశుద్ధ మన

2) నడిపంి చే వాడు -యెహో వా

Isaih-43;17 రథమును గుఱ్ఱ మును సేనను శూరులను నడిపించు వాడునగు యెహో వా ఈలాగు సెలవిచ్చు

చున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలె ఆరిపో యిరి.

రథమును గుఱ్ఱ మును సేనను శూరులను నడిపించువాడు దేవుడైన యెహో వా!

ఇప్పుడు -రథములు - గుఱ్ఱ ములు -సేనలు ఎక్కడ ఉన్నాయి అంటారా!

వాటి బదులు - కార్లు - బస్సులు - బైక్ లు - ట్రైన్లు -విమానాలు వచ్చాయి అని అనుకొందామా

రథసారథి -దేవుడైన యెహో వా

 డ్రైవర్ గదా వాటిని తొలిది ? అని అనుకొంటారా? అవును ఆ డ్రైవర్ – రథసారథి –యెహో వాయే-

ఆయనే, నడిపించే కార్యము తీసికొంటాడు – నిన్ను- నన్ను- నూతన మైన చక్కటి మార్గ ములో

నడిపస
ి ్తా డు

 రథము ఉంది -దానికి గుర్రా లు కట్ట బడి ఉన్నాయి - దాని మీద నీవు కూర్చున్నావు ?

 కానీ రథము నడిపేవాడు లేకుండా - ఆ రథమునకు కట్టిన గుర్రా లు పరుగెడితే - అందులో కూర్చొన్న

వ్యక్తి ప్రా ణాలు గాల్లో ఉంటాయి.

కారణం - ఆ గుర్రా లు వాటికీ నచ్చినట్లు గా పరిగెడతాయి - హద్దు అదుపు లేక - ఎగుడు దిగుడు

మార్గ ములో వెళ్ళవచ్చు - మార్గ ము తప్పి - పొ లములలో వెళ్ళవచ్చు-లోయలోనికి వెళ్లి పో వచ్చు - రథమును

పడవేయ వచ్చు

కాబట్టి ముందు రథము తొలి వారు కూర్చొంటారు - అయన రథ సారథి

 అయన -రథమును చక్కటి మార్గ ములో నడిపించుటకు యోగ్యుడైన వాడు - క్షేమముగా

రథమును నడిపంి చి - గమ్యమునకు చేర్చునుగదా


 అంతే కాకుండా – ఈ రథమును ఎక్కడ వేగంగా తీసికొని వెళ్ళాలి – ఎక్కడ నిలపాలి – ఎక్కడ

యుద్ద భూమి కలదు – ఎక్కడ ప్రమాదం కలదు –నెమ్మదిగా – చక్కగా – ప్రమాదాన్నితప్పించుచు –

అందులో ఉన్నవారిని జాగ్రత్తగా నడిపస


ి ్తా డు

 ఒకవేళ - నడిపించే రథ సారథి లేకపో తే - ఆ రథము యొక్క పరిస్థితి - ఆ గుఱ్ఱ ము యొక్క పరిస్థితి

ఏమవుతుంది ? ఆలోచించండి

 మరి మన జీవితమనే -రథాన్ని - మన మనస్సు అనే గుర్రా న్ని -చక్కగా నడిపంి చగలిగిన రథ

సారథి యున్నాడా? రథ సారథి లేకుండా నే జీవితమనే రథము వెళ్లు చున్నదా?

Q-లేక అపవాది అనే - అబద్ద పు తొవలోనికి - వంకర త్రో వలోనికి నడిపించే -వాడు రథ సారథిగా ఉన్నాడా?

 ఇంటికి రథ సారథి -యజమాని - సంఘమునకు - యేసు ప్రభువు అనే శిరస్సు

 ఇప్పుడు మన దగ్గ ర రథాలు లేవు -గుర్రా లు లేవు గదా అంటామా ? కానీ ప్రా ణ ఆత్మ దేహం -

వీటిని అదుపు చేయలేము

 ఆత్మ ఆశించేది ఒకటి-శరీరము కోరేది మరిఒకటి; ఆత్మ చెప్పేదానికి-శరీరము విరుద్ధ ముగ

ప్రవర్తిస్తూ ఉంటుంది - ఈ రెండిటికి పొ సగదు - వీటితో పో రాటంలో -పాణం అలసిపో తూ ఉంటుంది

 కాబట్టి మనుష్యులు - ప్రా ణాన్ని పో గొట్టు కొంటూ ఉంటారు -దానినే ఆత్మ హత్య అని పిలుస్తా రు

 కానీ రథ సారథి -ఉంటె - ఈ గుర్రా లను అదుపు చేయుచు - రథాన్ని సాఫీగా నడిపస
ి ్తా డు. ఇక్కడ -

ఇశ్రా యేలీయులు దేవుడే వారి రథసారథి కాగా - ఆ రథ సారథిని త్రో సివేసి - నాశనము అయ్యారు

 కానీ ఈ క్రొ త్త నిబంధన కాలములో - విశ్వాసులు & సంఘము -రథసారథి లేకుండా

ఉండకూడదు

 దేవుడు విశ్వాసులకు & సంఘమునకు - చక్కటి రథసారథిని అనుగ్రహించాడు

Roma-8;14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

ఎందరు -దేవుని ఆత్మ చేత నడిపంి చే బడుదురో -

ఇప్పుడు మన జీవితాలకు రథ సారథి ఎవరు? పరిశుద్దా త్మ దేవుడు

ఈ దినము యేసు క్రీస్తు రక్త ము ద్వారా కడగబడి యున్నాము - దేవుని బిడ్డ లుగా పిలువబడి యున్నాము

సంఘ సహవాసములో ఉంటున్నాము గదా ?


కానీ -శరీరము ఉరుకులు పరుగులు పెడుచు -తాను ఆశించిన రీతిగా జీవిస్తు ంది గదా?

అదుపు తప్పిన జీవితాలు కలిగి యున్నామా?

అంటే రథ సారథి -రథము మీద లేడా? ఆయన్ని దింపివేసావా? ఆలోచించుకోవాలి

ఈ క్రొ త్త సంవత్సరములో - పరిశుద్దా త్మ నడిపింపును కోరుకొని -ఆయనను వేడు కోవాలి -మన రథములకు

రథ సారథిగా ఉండమని

పరిశుద్ధ త లేనిచోట -అయన నివసింపలేడు సుమా?

మనస్సు యొక్క శరీరము యొక్క కోరికలు ఎక్కువై పో తే - ఆయనకు చోటు ఉండదు

నడిపించే వాడు లేనప్పుడు - జీవితము అటు ఇటు కొట్టు కొని పో తుంది - స్థిరత్వము ఉండదు

కాబట్టి ఈ నూతన సంవత్సరములో - మనము మనలను సరి చేసికొని - తిరిగి ఆయనను రథసారథిగా

ఆహ్వానిద్దా ము

I-John-1;8. మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చు

కొందుము; మరియు మనలో సత్య ముండదు.9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన

నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి

మనలను పవిత్రు లనుగా చేయును.

 అప్పుడు తిరిగి అయన మన రథాన్ని -గుర్రా ల్ని మన సేనలను- నడిపస


ి ్తా డు -అయన నాయకుడుగా

ఉంటూ - అయన మన ముందు ఉంటాడు

 ఆ దేవుడే మన హృదయాల్లో పరిశుద్దా త్మ దేవునిగా ఉంటూ మన జీవితాలను చక్కని త్రో వలో

నడిపస
ి ్తా డు -ఈ నూతన సంవత్సరములో

This Night- Let Us Invite HIM & Request HIM to Drive our Souls

 రథసారథి రథాన్ని, గుర్రా లను అదుపుచేస్తా డు, ఎక్కడికి వెళ్లా లో, ఎక్కడికి వెళ్లకూడదో , ఎక్కడ ఆగాలో

ఎక్కడ సాగివెళ్ళాలో, అయనకు తెలుసు - మనలను ఆరీతిగా నూతన మార్గ ములో నడిపిస్తా డు

గతములో మనస్సు ఇష్టము నెరవేరింది - అయన రథ సారథిగా ఉన్నప్పుడు -దేవుని ఇష్టం మన

జీవితాలలో నెరవేరుతుంది

 గతములో శరీరము -శరీర క్రియలవైపు నడిపంి చింది - ఇప్పుడు పరిశుద్దా త్మ దేవుడు -యజమానుడు

గనుక - ఆత్మ క్రియల వైపు నడిపిస్తా డు - ఆత్మ ఫలము ఫలిస్తా వు


ఈ నూతన సంవత్సరములో;-దేవునిచే నడిపించబడి నూతన కార్యములను చూస్తా వు, ప్రియమైన సో దరుడా

>>> మూడవ నూతన కార్యము చూద్దా ము

3) సముద్రములో -త్రో వను కలుగ చేయువాడు

Isaiah-43;16 సముద్రములో త్రో వ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గ ము కలుగ జేయు

వాడును

భూమి మీద -దారి తెలుసు - అడవిలో త్రో వ తెలుసు కోవచ్చు-కొండలమీద త్రో వ తెలిసికోవచ్చు.

కానీ సముద్రములో - అంత జలమయము – ఎటు చూసినా కనుచూపు మేర ఏమియు కానరాదు -

ఎప్పుడు గాలి -తుఫానులు - సూర్యుని దిక్కులు కూడా కానరావు

కానీ మన దేవుడు ఏమంటున్నాడు - సముద్రములో త్రో వను కలుగ చేస్తా ను -అది నూతన క్రియగా ఉండును

సముద్రము ప్రశాంతముగా ఉన్నట్లు కనబడదు - నెమ్మదిగా ఉండదు -స్థిరత్వమూ ఉండదు -

సముద్రా నికి తరంగాలు ఉంటాయి - ఎప్పుడును అలలచేత నిండియుంటుంది

 సముద్రమునకు ఉన్న మరియుక విశేషము ఏమనగా

 సముద్రము అలలు -ఒడ్డు న ఉన్న చెత్త అంతటిని తనలోకి తీసికొంటుంది - మరి కొంత సేపయ్యాక

మరలా బయటికి వేసేస్తు ంది

 ఈ సముద్రా నికి నిఖరము ఉండదు - నిలకడ ఉండదు - ఇది దారి అని చెప్పగలిగినది- ఏమి వుండదు

 అందుకే -ప్రయాణికులకు దారి కొరకు - హెచ్చరిక కొరకు - light house నిర్మించుతూ ఉంటారు

మన జీవితాలను - ఈ సముద్రము పైన ఉహించుకొంటే

 ఈ సముద్రపు అలలవలే ఎన్నో అలలు మన జీవితాలను అనుదినము కొట్టు చు ఉంటున్నాయి

 కొన్నిసార్లు మనకు బహు నష్టము తీసికొచ్చే అలలుకొన్ని

 కొన్ని సార్లు సునామి లాంటి రాకాసి అలలు -జీవితాలను అల్లో ల కల్లో లం చేస్తూ ఉంటాయి

 కొన్ని అలలు - అపవిత్రత అంతా - చెత్తలాగా తీసికొని వచ్చి ఒడ్డు న పారవేసి నట్టు గా - ప్రతి విధమైన

నిందలు -అపవాదులు మనమీదకు వస్తూ ఉంటాయి

సముద్రములో ఆటు పో ట్లు ఎలాగో జీవితము అలాగె, అని మన పెద్దలు జీవితాన్ని- సంసారాన్ని సముద్రా నికి

పో ల్చారు - సముద్రములో నావ ప్రయాణము - జీవిత ప్రయాణమునకు సాదృశ్యముగా చెప్పారు

నిజమే గదా! - ఈ రోజుల్లో ఎటుచూసినా, అల్ల కల్లో లమే తప్ప - శాంతి సమాధానము వుండదు
 ఈ సంవత్సరమంతా –మన జీవితాలను పరిశీలించుకొంటే –ఎన్నో ఆటు –పో ట్లు వచ్చాయి – అల్ల

కల్లో లములు వచ్చాయి

 చివరికి ఈ జీవిత నావ –ఎటు పో తుందో అని -భయపడిన సందర్భాలు ఉన్నాయి

 అలలచే కొట్ట బడిన స్థితి -అనేక మార్లు వచ్చియుండవచ్చు, కష్ట నష్టా లు సంభవించి యుండవచ్చు

 మనకు సంబంధము లేనివి వచ్చి మన నెత్తి న పడి-అలజడికి గురిచేసి యుండవచ్చు

 నెమ్మది లేని స్థితి -నిలకడ లేని బ్రతుకు కలిగి యిన్నారేమో!?

ప్రియమైన సహో దరులారా - అలాటి స్థితిలో ఉన్నారేమో - భయంకర స్థితి - అలలచే కొట్ట బడుచున్న స్థితి కలిగి

ఉన్నారేమో - స్థిరము లేని స్థితి - దారి కనబడని స్థితి కలిగి ఉన్నారేమో ?

కష్టా లు -నష్టా లు -నిందలు -అపవిత్రత అంతా నెత్తి మీద ఉన్నట్లు గా - నిరుత్సాహ స్థితిలో ఉన్నారేమో?

 కానీ అలాటి పరిస్థితులలో దేవుడు ఒక మార్గ ము చూపబో వుచున్నాడు - నీకు చక్కటి మార్గ ము

సిద్ధపరచ బో వుచున్నాడు

మార్గ మే లేదు - దారే లేదు అనుకొనే తరుణములో - దేవుడు దారి చూపగలడు

ఈ నూతన సంవత్సరములో- నీ జీవితములో ఒక కొత్త మార్గా న్ని కలుగ చేయబో వుచున్నాడు

 జీవితమనే సముద్రము మధ్యలో సమస్యలలో - దారి లేదు అనుకొనే తరుణములో -దేవుడు నీ

కొరకు - నూతన మార్గా న్ని చూపబో వుచున్నాడు

 సముద్రము లాంటి సమస్యలలో మీకు త్రో వ కలుగును

 సంసారమనే సముద్రములో - జీవితములో సమస్యలనే అలలో కొట్టు మిట్టా డుచు ఉన్నవారికి -నూతన

మార్గా న్ని -నూతన క్రియను చేయుచున్నాను

 నిజమే! ఇవి, మన కన్నులకు ఆశ్చర్యము - కానీ దేవునికి సాధ్యము - నీ నా జీవితములో

అయన నూతన కార్యాన్ని చేయగలడు - మరి ఆయనను ఆహ్వానిద్దా ము

ఈ 3- నూతన కార్యాలు దేవుడు మీ జీవితాలలో ఈ నూతన సంవత్సరములో చేయాలనుకొనుచున్నాడు

1) మొదటిది నిన్ను పరిశుద్ధ మైన నూతన మైన వ్యక్తిగా చేయుట

2) రెండవడిగా -నీ జీవితములో అయన అడుగు పెట్టి నీ జీవితానికి రథసారథిగా ఉండి నిన్ను నడిపిస్తా డు

3) మూడవదిగా మునుపెన్నడూ చూడని నూతన మార్గ మును -మార్గ ము కనబడని సముద్రము వంటి

జీవిత ప్రయాణములో, ఏర్పాటు చేయుచున్నాడు


గడచిన కాలములో, స్వంత నిర్ణ యాలతో - స్వంత ఇష్టా లతో సాగిపో యి;-కష్టా న్ని నష్టా న్ని

దుఃఖాన్ని -వేదనను - తెచ్చుకొని ఉండవచ్చు

దేవునికి మన జీవితాలు అప్పగించుకొనక - స్వంత ప్రయత్నాలతో - జీవిత నావ - కష్ట

నష్టా లనే -అలలతో కొట్ట బడి యుండి ఉండవచ్చు

అపరిశుద్ద మైన హృదయముతో- దేవునికి చోటు ఇచ్చి యుండక పో వచ్చు

 అయితే - దేవుడు సెలవిస్తు న్నాడు- మునుపటి సంగతులను - పాత జీవితాన్ని మరచి

పో వుడి -నేను ఒక నూతన క్రియను చేస్తు న్నాను - మిమ్మల్ని నూతన పరుస్తు న్నాను

 అది అప్పుడే ప్రా రంభమైనది - దాన్ని గూర్చి ఆలోచించండి - తెలిసికొని -విశ్వసించండి

 అప్పుడు ఆ నూతన కార్యము మీ జీవితాల్లో -జరుగుతుంది

దేవుడు ఈ నూతన సంవత్సరములో - నీ నా జీవితములో కొత్త కార్యము చేయాలి అని శిస్తు న్నాడు

 గనుక మొదటిగా - మనము శుద్ధు లవ్వాలి - మరియొక సారి - యేసు ప్రభువు సిలువ

దగ్గ రకు వచ్చి మనలను మనము పరిశీలించు కొందాము - పొ రపాట్ల ను ఒప్పుకొందాము –

 శుద్ధ హృదయమును -సమ్మతిగల మనస్సు- కొరకు వేడుకొందాము

 మన జీవితాలలో దేవుడు నూతన క్రియను చేయాలని ఇష్టపడుచు ఉన్నాడు

అయన చేయు నూతన కార్యము అప్పుడే అది మొలచెను -అనగా అది అప్పుడే ఆరంభమైయున్నది

మరి మన జీవితాలలో ఆరంభ మైనదా?

 ఆ నూతన కార్యముయొక్క ఆరంభము - యేసుక్రీస్తు నందు - ఆరంభమైనది -అయన

సిలువలో చేసిన రక్షణ కార్యములో ఆరంభమైయున్నది

 ఆయనను ఎందరు అంగీకరించియున్నారో వారందరును నూతన సృష్టిగా – అయి ఉన్నారు

 మరి నూతన సృష్టిగా అయి యున్నవారిలో - నూతన మైన క్రియలు జరగాలంటే అయన మన

జీవితానికి రథసారథిగా ఉండి నడిపంి చువాడై యుండాలి


అయన మన జీవితాలను నడిపిస్తే - చక్కటి త్రో వలో నడిపిస్తా డు - త్రో వలు కనబడని - అరణ్యమైనను

- త్రో వలు లేని సముద్రమైనను ఆయనే నీ కొరకు, నా కొరకు, మార్గ ము ఏర్పాటు చేసి ఆ మార్గ ములో

మనలను నడిపిస్తా డు

కాబట్టి - ఆయనకు మన జీవితాలను అప్పగించుకొందాము మన జీవిత నావకు -అయన రథ

సారథిగా ఉండి నడిపంి చమని వేడుకొందాము

May God Bless you all- Wishing you all Happy New-Year - Thank you

Isaiah-43;15. యెహో వానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రా యేలు సృష్టికర్త నగు నేనే మీకు

రాజును.16. సముద్రములో త్రో వ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గ ము కలుగ జేయు

వాడును 17. రథమును గుఱ్ఱ మును సేనను శూరులను నడిపించువాడు నగు యెహో వా ఈలాగు

సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనార వలె

ఆరి పో యిరి.18. మునుపటి వాటిని జ్ఞా పకము చేసక


ి ొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచు

కొనకుడి.19. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని

నాలోచింపరా? నేను అరణ్యములో త్రో వ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పార జేయు చున్నాను.

21. నా నిమిత్త ము నేను నిర్మించిన జనులు నా స్త్రో త్రమును ప్రచురము చేయుదురు.

పాతస్థితినుండి నూతన స్థితికి మార్చిన -గొప్ప దేవుణ్ణి స్తు తించి ఆరాధిద్దా ము - ఆయన స్త్రో త్రమును
ప్రచురము చేయుదురు.
1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని
గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్త ము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన
యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొ త్త యిన ప్రజలునై యున్నారు.

నేను - వెళ్ళే మార్గ ము - నా యేసుకే -తెలియును || 2 ||


శోధించ బడిన మీదట - నేను -సువర్ణ మై మారెదను || 2||
హల్లె లూయ, హల్లె లూయ, హల్లె లూయ, ఆమేన్ || 2 ||
 
1) కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున|| 2 ||
గురిలేని తరుణాన మెరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ || హల్లె లూయ, 2-నేను ||

2)జలములలో బడి నే వెళ్లి నా - అవి నా మీద పారవు || 2 ||


అగ్నిలో నేను నడచినా- జ్వాలలు నను కాల్చ జాలవు || హల్లె లూయ, 2- నేను ||

3)విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు || 2 ||


సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు || హల్లె లూయ, 2-నేను ||

You might also like