Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినెన్షన్ సెంటర్ - T4C

Advisory - 11

Customer care Fraud

మనకు ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ కావాలంటే.. ముందుగా వెతికేది గూగుల్ లోనే.. అది
సరైనదా? కాదా? అనే విషయం అస్సలు పట్టించుకోం. అదే కొంప ముంచుతోందనేది
గుర్తుంచుకోవాలి. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లు, ట్రావెల్స్‌, కొరియర్‌,
గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం.. ఇలా.. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చాలానే వస్తున్నాయి. సైబర్
మోసగాళ్లు.. గూగుల్ యాడ్స్ కొనుగోలు చేసి, నకిలీ నంబర్లు పోస్టు చేస్తున్నారు.
అలాంటి నకిలీ నంబర్లకి కాల్ చేస్తే సైబర్ మోసగాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు. వాళ్లు
చెప్పింది ఈజీగా నమ్మేస్తాం. మనం ఎందుకు కాల్ చేశామో..మనతో చెప్పిస్తారు. రెండు
నిమిషాల్లో ప్రాబ్లమ్ తీర్చేస్తామంటూ.. లింక్స్ పంపించి మీ బ్యాంకు వివరాలు లాగేస్తారు లేదా
ఏదైనా రిమోట్ డెస్క్టాప్ యాప్( Any desk, Team viewer, Quick support etc..)
ఇన్స్టాల్ చేయించి దాని ద్వార మీ బ్యాంకు వివరాలు తెల్సుకొని మీ డబ్బులు కాజేస్తారు.
కస్టమర్‌ కేర్‌ నంబర్‌ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి సంస్థకు వెబ్‌సైట్‌ లేదా
యాప్‌ ఉంటుంది. అక్కడి నుంచే కస్టమర్ కేర్ నెంబర్ తీసుకోవాలి. సైబర్‌ నేరగాళ్ల చేతిలో
మోసపోతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.

సైబర్ క్రైమ్ ని www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు

సలహాల కోసం 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి


తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినెన్షన్ సెంటర్ - T4C
Advisory - 12

KYC Update Fraud

'డియర్ కస్టమర్, కేవైసీ అప్‌డేట్‌లేని కారణంగా మీ సిమ్ కార్డు రద్దు చేయబడింది. కేవలం 10
నిమిషాల్లో కేవైసీ అప్‌డేట్‌ప్రక్రియను పూర్తి అవుతుంది. ఈ లింక్‌పై క్లిక్ చేసి లేదా ఈ నెంబర్
కి కాల్ చేసి మీరు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు’ అని మీ ఫోన్‌కు మెసేజ్‌లు
రావొచ్చు. ఇలాంటి మెసేజెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కేవైసీ మోసాల ద్వారా మోసగాళ్లు
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తారు.
అలాంటి మెసేజెస్ లో వున్న నంబర్స్ కి కాల్ చేస్తే, సైబర్ మోసగాళ్ళు లింక్ పంపిచి KYC
అప్డేట్ చేస్కోమంటారు. అలాంటి లింక్‌పై క్లిక్ చేస్తే మీ బ్యాంకు వివరాలు మరియు ఓటిపి ని
అడుగుతుంది. వాటిని తెలియజేస్తే, సైబర్ మోసగాళ్ళు మీ అకౌంట్ లో డబ్బులు మాయం
చేస్తారు. అందుకే ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఓటిపి ని ఎవ్వరికీ
చెప్పవద్దు, ఎక్కడ ఎంటర్ చెయ్యొద్దు.
టెలికాం సంస్థ వారు కస్టమర్లకు KYC అప్డేట్ చేస్కోమని ఏలాంటి మెసేజెస్ పంపించవని
గుర్తుంచుకోండి. ఇప్పటికే చాలా మంది కి మోసపూరిత ఎస్ఎంఎస్‌లు వచ్చాయి. అందువల్ల
మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి.

సైబర్ క్రైమ్ ని www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు

సలహాల కోసం 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి


తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినెన్షన్ సెంటర్ - T4C
Advisory - 13

Sextortion

అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి,
మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి, మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
సోషల్ మీడియా లో తెలియని వ్యక్తులనుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే అక్సేప్ట్ చెయ్యకండి, వాళ్ళు
మిమల్ని ఆకర్షించి తమ శరీరభాగాలు పిస్తూ.. అదేవిధంగా మీరు చేయాలని కోరతారు. అలా
మీ వ్యక్తిగత అంశాలు, వీడియోలు, ఫొటోలు సేకరించి(దుస్తులు లేకుండా ఉండేవి) వాటిని
బహిర్గతం చేస్తామంటూ బెదిరిస్తూ మీ నుంచి డబ్బులు వసూలు చేస్తారు.
మీకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ని ప్రైవేటు గా ఉంచుకోండి. కొంత
మంది సైబర్ నేరగాళ్ళు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల నుండి మీ ఫోటోలను
సేకరించి వాటిని అశ్లీలంగా మర్చి, మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారు.

సైబర్ క్రైమ్ ని www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు

సలహాల కోసం 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి


తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినెన్షన్ సెంటర్ - T4C
Advisory - 13

Online Payment Frauds

ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు QR కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు
వస్తాయి అని చెప్తే నమ్మకండి. QR కోడ్ స్కాన్ చేసి UPI పిన్ ఎంటర్ చేస్తున్నారు అంటే
మీరు డబ్బులు పంపిస్తున్నారని అర్ధం. మీకు డబ్బులు రావటానికి UPI పిన్ ఎంటర్
చెయ్యవలసిన అవసరం లేదని గుర్తుంచుకోండి.
అనుమానాస్పద లింక్స్ పై క్లిక్ చేసి మీ బ్యాంకు వివరాలు తెలియజేయకండి. కస్టమర్ కేర్
సంస్థ వారు ఫోన్ ద్వార గాని మెసేజ్ ద్వార గాని మీ బ్యాంకు వివరాలు మరియు ఓ.టి.పి ని
అడగరని గుర్తుంచుకోండి.
అపరిచిత వ్యక్తులు మాటలు నమ్మి ఎలాంటి యాప్స్ ని మీ ఫోన్ నందు ఇన్స్టాల్ చెయ్యకండి,
అలాంటి యాప్స్ ఉపయోగించి మీ యొక్క బ్యాంకు వివరాలు సేకరించి, మీ డబ్బులు
కాజేస్తారు.
కస్టమర్ కేర్ నెంబర్లను సంబంధిత వెబ్ సైట్/యాప్ నుండి మాత్రమే తీసుకోండి. గూగుల్
నందు వెతికి, నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లకి కాల్ చేసి వాళ్ళు చెప్పింది చేసి మోసపోకండి.

సైబర్ క్రైమ్ ని www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు

సలహాల కోసం 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి

You might also like