Reflections On FATHER's CENTENARY

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 7

నమస్సుమాంజలి

శత  సంవత్సర  స్మృతి పత్రం


కొడాలి నారాయణ  రావు గారు ( 1919 శివరాత్రి  - 2016  భీష్మఏకాదశి )

Full many a gem of purest ray serene,


The dark unfathom'd caves of ocean bear:
Full many a flower is born to blush unseen,
And waste its sweetness on the desert air.”

Thomas Gray,     An Elegy Written In A Country Churchyard

జ్ఞా న సముపార్జ న ధ్యేయంగా మొదలై మిత వ్యయానికి కరదీపికగా మారిన  జీవితం  

బాల్యం-కౌమారం (1919 -1940)


దేశం పరాధీనం , రైతు జీవితం వాతావరణాధీనంగా వున్న కాలంలో జన్మించారు మధ్య తరగతి వ్యవసాయ
కుటుంబంలో, కవుతరం  అనే గ్రా మంలో మాతామహుల ఇంట్లో . స్వగ్రా మం అప్పికట్ల అయినా అప్పటి
సాంప్రదాయం అనుసరిస్తూ  మేనమామ- కానూరి పేద వెంకట దాసయ్య గారి  ఇంట్లో నే విద్యా బుద్ధు లు
నేర్చారు. అప్పటికి అప్పికట్ల లో  కేవలం వ్యవసాయ రైతు  కుటుంబాలు, వ్యవసాయ పనివారు, వృత్తు ల
వారు మాత్రమే ఉండేవారు. విద్యా వ్యాసంగానికి అవకాశం లేదు 
 
వీరితల్లి పిచ్చమ్మ (వెంకటమ్మ)గారు  19 వ శతాబ్ది లో , అంటే స్త్రీ విద్య విప్ల వాత్మకంగా భావించే రోజులలో
స్కూలుకి వెళ్లా రు. స్కూలు నుంచి తిరిగి వఛ్చినప్పుడు ప్రతి రోజు స్నానం చేసి ఇంట్లో ప్రవేశించవలసి వచ్చేది
, బయటకు వెళ్లి మైల పడినందుకు! అప్పటికి కొందరి ఇళ్ల ల్లో ఘోషా పధ్ధ తికూడా  ఉండేది. సాంసారిక స్త్రీలు
పరులకు కనబడ గూడని వ్యవస్థ . 
ఆ తల్లి బిడ్డ డైన నారాయణ గారికి విద్య యందు అభినివేశం సహజంగానే కలిగింది. కొన్నాళ్ళకు కవుతరంలో
ఎలిమెంటరీ స్కూలు విద్య పూర్తి కాగా ప్రక్కనే వున్న గుడ్ల వల్లేరు  గ్రా మంలో  మిడిల్ స్కూల్లో చేరారు 
1935 సంవత్సరంలో  ఏడవ తరగతి పూర్తి అయ్యింది . దానితో చదువుకు స్వస్తి చెప్పవలసివచ్చింది . 
ఎందుకంటే. 1930 దశకంలో ఆర్ధిక  మాంద్యం  (depression ) వచ్చింది.డిప్రెషన్ వచ్చినపుడు వస్తు వుల,
పొ లాల  విలువలు దారుణంగా పడిపో తాయి . రూపాయికి కొనుగోలుశక్తి బాగా పెరుగుతుంది. దురదృష్ట
వశాత్తు వీరి కుటుంబం  2000 రూపాయలు అప్పుచేసి పొ లం కొన్నారు. ఆరోజుల్లో అందరు ప్రతి  రెండు
ఏళ్ళు పంటలు రాగానే కొంత అప్పు చేసి పొ లం కొనేవారు, తరువాత ఏడు అప్పు తీర్చేవారు. 
వీరికి ఆ అప్పు తీర్చడానికి కొన్న పొ లమే కాక వీరిది రెండు ఎకరాలు కూడా పో యింది. ఈ పరిస్థితులలో
చదువు మాని అప్ప్పికట్ల వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది తండ్రి గారికి వృద్ధా ప్యం  వచ్చింది వీరికి ఒక
అన్న, ఒక తమ్ముడు వున్నారు 
అప్పికట్ల లో  అప్పటికి ఆదిరాజు అమృతేశ్వర రావు అనే ఒక  అధ్యాపకుణ్ణి  విజయవాడనుండి
తీసుకవచ్చారు . వారు సాంప్రదాయ గురువు- అమరకోశం తో మొదలుపెట్టేవారు. వ్యవసాయ కుటుంబాల్లో
సంస్కృత జ్ఞా నం, భాష యందు ఆసక్తి  తక్కువ . పైగా ఇంగ్లీషు చదువులు ప్రా చుర్యం లో వున్నాయి. 
'యస్య  జ్ఞా న దయా  సింధో ..' అమరం మొదలవుతుంది, కొద్ది రోజులలోనే నారాయణ గారు దానిని 'గోడ
దూకితే అదే సందో ' అని చెప్పి  ముగించానని  చెప్పారు.   తన దృష్టి ఇంగ్లీషు చదువు మీదే , కానీ వూళ్ళో
అవకాశం లేదు  బెనారస్ మెట్రిక్ ప్రయత్నించారు గాని కుదరలేదు. 
ఇంతలో వ్యవసాయానికి  అంకితమయిన పెద్ద సో దరుడి వివాహం అయ్యింది  కుటుంబం పెద్దదయ్యింది  
కుటుంబం  ఒక నిర్ణ యం తీసుకుంది -చిన్న వాళ్ళు ఇద్ద రిలో  ఒకరికి మాత్రమే పై వూళ్ళో చదువు
వీలవుతుంది, రెండవ వారికి  తరతరాల వృత్తి  వ్యవసాయము ఎలాగూ ఉంది . ఈయనకు ఎంత చదుకోవాలి
అని వున్నా , చిన్నవాడైన  జానకి రామయ్యకు చదువు అవకాశం లభించింది. 
అయినప్పటికీ జ్ఞా న తృష్ణ తగ్గ క ఎక్కడ పుస్త కం కనపడినా  చదివి అర్థ ం చేసుకుంటానికి ప్రయత్నించేవారు 
ఇది ఇలా ఉండగా పెద్ద అన్నయ్య అకాలమృత్యువు  పాలయ్యారు. వదిన  గార్ని వారి సహో దరులు తమతో
ఉండటానికి  తీసుకు వెళ్లా రు 
 కొంత నైరాశ్యంతో వీరు వ్యవసాయం కొనసాగించారు . 

తల్లి గారికి ఆస్తిక వారసత్వం ఉన్నది. వైష్ణవ మతానికి చెందిన దాక్షిణాత్య  గురువులు  దేశాటనం చేస్తూ
శిష్యులకు బో ధ , వైష్ణవీకరణ ( చక్రా ంకితము-వారి ధర్మం ప్రకారం  సమాశ్రయణం) చేస్తా రు. వైష్ణవ
నామకరణం కూడా చేస్తా రు  నారాయణ, జానకీరామ నామధేయాలు ఆలా వచ్చినవే. పేర్ల  వరకే గాని
పిచ్చమ్మగారి గాఢ భక్తి సంతానానికి రాలేదు.  ఆవిడ ప్రతి ఉదయం స్నానం చేసి తిరుచూర్ణ ం, తిరుమణి
ధరించి, పెరుమాళ్ళ కైంకర్యం చేసి, నాలాయిరమ్ ప్రబంధ పాశుర పఠనం గావించి, పల్లా ండు చెప్పేటప్పటికీ
11 గంటలయ్యేది. ఇవేమి లేకపో గా  నారాయణ గారు  నాస్తికత్వం ఒంటబట్టించుకున్నారు త్రిపురనేని
రామస్వామి చౌదరి గారి సూత పురాణము - 4 సంపుటాలు, శంబూక వధ లాంటి పుస్త కాలు చదివి
నాస్తికతను పెంచుకున్నారు తాను నమ్మిన దానిని ఆచరించి, అందరికి చెప్పేవారు, కానీ ఎవరిని మారమని
చెప్పేవారు కాదు. 
ఏది ఎలా ఉన్న, కుటుంబ ఆర్ధిక పరిస్థితి, వెనుకటి పొ లం కొనుగోలు వ్యవహారం ఆయనలో నిరాశావాదాన్ని
పెంచాయి. 

యావనం (1940-1952)
1937 లో కాంగ్రెస్ నుండి విడివడిన కమ్మూనిస్టు లు రెండవ ప్రపంచ యుద్ధ ం సమయంలో (1939-1945)
కార్యక్రమాలను పెంచారు. ముఖ్యంగా కృష్ణా  జిల్లా లో సంపన్న కుటుంబాలవారు కూడా ఉద్యమంలో
పాల్గొ న్నారు. మార్క్స్ ఎంగెల్స్ పుస్త కాలూ బహుళ ఆదరణను పొ ందాయి. నారాయణ రావు గారు కూడా
ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో, 1943 ఏప్రిల్ నెలలో  వారికి వివాహమయ్యింది పెనమకూరికి చెందిన
మైనేని రవ్వామణి గారితో. వారికి కూడా సామ్యవాద కుటుంబ వాతావరణం, సభ్యులు ఉండటంతో  వీరి
శ్రద్ధా సక్తు లు పెరిగాయి.  ఇంతలో స్వతంత్రం వచ్చింది. అప్పటికి దంపతులకు ఇద్ద రు పిల్లలు- బాబురావు
(1944), ప్రమీలారాణి (1947) కలిగారు .తరువాత  1950 లో మూడవ సంతానం నిర్మల ఉదయించింది.
రవ్వామణి వారి తల్లి తండ్రు లకు ఏకైక సంతానం, వివాహ సమాయానికే ఆమె తండ్రి గతించారు . ఆవిడ
తల్లితో  పెనమకూరు లో ఉండేవారు. ఈయనకూడా అక్కడే వుంటూ ఇంటల్లు డి స్వేచ్చాసుఖాల్ని కొన్నాళ్ళు
అనుభవించారు. 

1948 లో కమ్మూనిస్టు లు నిజాం రాష్ట ం్ర లో సాయుధ పో రాటం చేసిన నేపథ్యంలో దానిని దేశమంతా వ్యాప్తి
చెయ్యాలి అని అనుకున్నారుకానీ ఎలా చెయ్యాలో గుర్తించలేక పొ య్యారు  ఆ పార్టీ ముఖ్యులు  కృష్ణా  జిల్లా
లోనే ఉండేవారు. చండ్ర  రాజేశ్వర రావు గారు ఆంధ్ర కమ్యూనిస్టు  పార్టీ కార్యదర్సి( తరువాత అఖిల
భారతానికి  కార్యదర్సి అయ్యారు) ఈ జిల్లా వారే . కేంద్ర ప్రభుత్వం దీనిని సాయుధ తిరుగుబాటులా  తీసుకొని
మిలిటరీ ని పో లీసులకి సహాయకారి గా తెప్పించి క్రూ రంగా  అణచి వేశారు.ఇల్లిల్లు వెదికేవారు.
సానుభూతిపరులను కూడా వదిలి పెట్టలేదు ఆరోజులలో వారికీ ఆశ్రయం ఇవ్వటం ఆత్మహత్యా
సదృశమయినా  వీరు కేవలం  సానుభూతి  పరుడైనా , ధైర్యం చేసి కొంత మందికి రక్షణ కల్పించారు. ఆఖరికి,
రాష్ట ్ర పార్టీ సమావేశం కూడా ఒక సారి వీరి ఇంట్లో రాజేశ్వరరావుగారి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వపు
మలబారు పో లీసులు కొద్దీ రోజులలోనే   జిల్లా లో 400 మందిని కాల్చివేశారు . ఇంతలో 1952 మొదటి
సాధారణ ఎన్నికలు వచ్చాయి.  ఆ సందర్బంగా   కమ్యూనిస్టు ల మీద ఆంక్షలు తీసివేశారు.  ప్రజలలో వారి
యెడల సహానుభూతి కారణంగా తరువాతి  ఎన్నికలలో వారి పార్టీ కృష్ణా జిల్లా లో అఖండ విజయం
సాదించింది. ఆంధ్ర రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత 1955 లో కమ్యూనిస్టు లు ప్రకాశం గారి ప్రభుత్వాన్ని పడగొట్టి
మధ్యంతర ఎన్నికలు తెచ్చారు కానీ విజయం వరించలేదు. అప్పటినుండి ఆ పార్టీకి తిరోగమనమే, అది
నారాయణ రావు లాంటి వారికి శరాఘాతమయింది. 
చదువుకుందామంటే కుదరలేదు. నమ్మిన సిద్ధా ంతాలు, పార్టీ పో కడలు నిరుత్సాహం కలిగిస్తు న్నది . 
ముందునుంచి వున్ననిరాశావాదం  విజృంభించి  ఆత్మ విశ్వాసాన్ని, నిర్ణ య సామర్ధ్యాన్ని తగ్గించింది.          

గార్హస్త్యం  (1952-1975)
  
నిర్మల జననం తరువాత క్రమేపి రవ్వామణి గారి ఆరోగ్యం క్షీణించింది. 1952 ఎన్నికలప్పటి నుండి ఆవిడ
అప్పికట్ల లోనే కాపురం. కొద్దిరోజుల తరువాత వారి తల్లి అన్నపూర్ణ మ్మ కూతురికి సహాయంగా పూర్తిగా
అప్పికట్ల వచ్చేశారు  డాక్టర్లు  రవ్వామణి గారికి  బీ.ఎం.ఆర్. బాగా తక్కువగా ఉందని చెప్పి మందులు
వాడారు . ఆయనని వాసెక్టమీ ఆపరేషను చేయించుకోమన్నారు. అప్పటికి ఆపరేషనుకు సంఘంలో ఏమాత్రం
ఆమోదం లేదు, సరి గదా న్యూనతా భావం ఉంది.  ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆపరేషన్
చేయించుకున్నారు. 
కుటుంబ బాధ్యతలు పెరిగాయి .వ్యవసాయదారులకు సంపాదన ఎలా పెరుగుతుంది? వూళ్ళో వ్యాపార
పంటలు అలవాటు కాలేదు.  పైగా ఆయనకు సంపాదించే విద్యలు ఏవీ  రావు.  కాబట్టి ఒక నిర్ణ యానికి
వచ్చారు ఖర్చు తగ్గించు  కోవటమే  సంపాదించడమని .
 మిత వ్యయం , నకారాత్మక సంవిధానం  ఆయన జీవన విధానం అయ్యాయి. 
తనకి బాగా ఇష్ట మైన పొ గాకు చుట్ట మాని వేశారు, పిల్లలకు, పెద్దలకు బట్ట లు చిరిగిపో తేనే కొనటం . ఎలాగూ
కమ్యూనిస్టు  సిద్ధా ంతం కాబట్టి పండగలకి, పబ్బాలకి ఖర్చు లేదు .దినసరి ఖర్చు అన్నపూర్ణ మ్మ గారి పాడి
సంపాదనతో జరిగి, రోజు వెళ్లి పో యేది.  ఒక సంవత్సరం పంట ఒకసారి  వస్తే, 365 రోజులు దాని జాగ్రత్తగా
వాడాలి. ఇలా అలోచించి , దానిని అమలులో పెట్టేసరికి, ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి, ఇంట్లో నూ,
ఊళ్లో నూ, అయినా ఆయన గుండె దిటవుతో దేనిని లెక్క చెయ్య లేదు.
 ఏది ఎలా వున్నా  జ్ఞా న దాహం మాత్రం తగ్గ లేదు. ఇంట దుష్కర ఆర్ధిక కూపంలోకూడ  కొత్త విషయాలు
తెలుసుకోవాలనే కోరిక, అప్పుడే కాదు, ఆజన్మాన్త ం ఆయనతోనే   వుంది. 
పిల్లలు పెద్దవాళ్ల వుతున్నారు. కొడుకు SSLC (11 వ క్లా సు) స్కూలు ఫస్టు గా  పాసయ్యాడు. పై చదువులు
ఎలా? ఆయన కింకర్త వ్యతా విమూధుడయ్యారు ఇంతలో అన్నపూర్ణ మ్మ గారు తన కొంచెం పొ లం అమ్మి
కుటుంబాన్ని ఆదుకున్నారు. 
కొడుకు కాలేజి , యూనివర్సిటీ చదువులు ముగిసి 1963 లో సంపాదనపరుడయ్యాడు  ఆడ పిల్లలు కూడా
స్కూల్ చదువు పూర్తి చేసారు ప్రమీల కాలేజీ లో ఒక సంవత్సరం చదివిన తరువాత పెళ్లి చేసారు. నిర్మల
డిప్లొ మా లో  చేరి పూర్తి చేసింది.
ఈసమయంలో జానకి రామయ్య గారు నారాయణ గారిని రాయగడ వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు అమ్మే పొ లాలు
ఇతరులతో కలిసి  కొని వ్యవసాయం చేయమన్నారు.ఈయన అంగీకరించారు.  బ్యాంకులు ఆర్థిక సహాయం
చేసాయి కాలక్రమేణా 1965 లో  నారాయణ  గారు, రవ్వామణి  గారు అక్కడికి తరలి వెళ్లా రు.  అప్పికట్ల
పొ లాలు ఆప్త జ్ఞా తులు  కొడాలి  రాధాక్రిష్ణయ్య గారు , వారి కుమారుడు రాజా రామమోహనరావు గారు
చూచేవారు  
70 వ దశకంలో నిర్మలకు , బాబూరావుకు పెళ్లి ళ్లు అయినాయి, తర్వాత 1975 లో రుణవిముక్తు డనయ్యానని
ఆయన భావించారు. 

వానప్రస్తం, వార్ధ క్యం (1975-2016)


ఋణాలు, బాధ్యతలు లేకపో యినా ఆయనలో మితవ్యయ దీక్షా పరతంత్రత, వీలయినంతవరకు నిర్ణ య
విలంబన  తగ్గ లేదు. 
 ఇంత  కాలం ఓర్పు వహించిన రవ్వామణి ప్రశ్నించటం మొదలుపెట్టా రు. ఇంతలో 1979 లో ప్రమీల భర్త
దివంగతులయ్యారు. పిల్లలు సత్య, సుబ్బారావు  12,10 సంవత్సరాల వయసు వాళ్ళు. వారి విద్యాభ్యాసానికి
ప్రమీలకు సహకరించారు. కొన్నాళ్ళకు సత్య ప్రయోజకుడై రాయగడలోనే ఉద్యోగానికి వచ్చాడు 1991 లో
పరిసరాల్లో ని బంధువుల అమ్మాయి శ్యామని వివాహం చేసుకొన్నాడు మరికొంత కాలానికి సుబ్బారావు కూడ
పెళ్లి చేసుకుని, ఇద్ద రు కుమార్తెలకు తండ్రియై, ఒక కారు ప్రమాదంలో మరణించాడు, ఇలా రెండు విషాదాలకు
గురియైన ప్రమీల ఇతోధికంగా తల్లి తండ్రు లకు తోడుగా గడిపేది, వుయ్యురూ , రాయగడలమధ్య ప్రయాణాలు
చేస్తూ . 
ఇది ఇలా ఉండగా ఇన్నేళ్లు సాహస విముఖత్వంతో, వస్తు సంచయ విరాగంతో వున్న నారాయణ గారు
సహస్రచంద్రదర్శనం తరువాత, నూతన శతాబ్ద ంలో,   హఠాత్తు గా, మొదటిసారిగా తెంపు తో రెండు నిర్ణ యాలు
తీసుకొన్నారు. ఒకటి నూతన గృహ నిర్మాణం( అప్పటివరకు రేకుల ఇంట్లో ఉండేవారు), ఇంకొకటి రాయగడ
పొ లాన్ని అమ్మి డబ్బుగా మార్చటం. 
ఇల్లు కట్టి  పైన డాబా గది ఏర్పాటుచేసుకున్నారు ఇంటికి అపరాజిత అని పేరు పెట్టా రు,( ఇప్పుడు ఆయనికి
తాను  పరాజితుణ్ణి అనే భావన నిర్మూలితమయ్యింది). నూతన గృహంలో ఒక దశాబ్ద ం నిరుపహతంగా
జీవించారు.
 
రెండో నిర్ణ యము కొంత  ఇబ్బంది పెట్టింది, కారణం ఈయన అమ్మిన వెంటనే  పొ లం స్థ లంగ మారి  విలువ
దిన దిన ప్రవర్ధ మానంగా పెరిగి ఊహకు అందనంత అయ్యింది. జీవితమంతా నకారాత్మకంగా గడిపి ఇప్పుడు
ఇలా చేసానేమిటి అనుకొని ఉంటారు, కానీ ఎప్పుడు తన భావాలూ వెలిపుచ్చలేదు. జీవితమంతా గిరి గీచి
బరి దాటకపో యినా, విధి ఎలా వేధంి చకలదు అన్న దానికి  ఒక ఉదాహరణ . 
నిండు జీవితం గడిపి, మరణ శాసన లేఖనం కూడ వాయిదా వేసి తన 98 వ ఏట నిద్రలోనే శాశ్వత నిద్ర
పొ ందారు. 
ఊరందరు గుర్తు పెట్టు కునేవి ఆయన మేధాశక్తి,- చక్కటి విశ్లేషణ తో, పూర్వా పరాలు తెలియచేస్తూ
అర్థ మయ్యేటట్లు చెప్పగిలిగే ధీశక్తి,
అసాధారణ ధారణ - ఏ విషయాన్నైనా ఫలానా రోజు, ఫలానా చోట అని గుర్తు తెచుకొని చెప్పేవారు. ఒక ఊరి
పేరు ఆ ఊరి వారందరి గుణ గణాలు, చుట్ట రికాలు  చెప్పగలిగేవారు 

 వారసత్వం 
నారాయణ రావు గారి వలన వారి బిడ్డ లకు  సంక్రమించిన గుణాలు /విధానాలు  
1. జ్ఞా న సంపాదనకు పెద్ద పీట,  వస్తు , వస్త ,్ర హిరణ్య మోహ రాహిత్యము 
2. ఆర్ధిక క్రమశిక్షణ - ఉన్న దానితో సరిపెట్టు కోవడం
3. సాహస ప్రవృత్తి  పట్ల విముఖత(Risk averse ), ఉన్నది చాలు, పో గు చెయ్యక్కరలేదు - అనే స్వభావం 
4. యోగం కన్నా క్షేమం ముఖ్యం ,సంపాదించటం కన్నా ఉన్నది జాగ్రత్త చేసుకోవడం అనే పధ్ధ తి 
5. ఆతిధేయిగా ఆనందం అల్పం 
6. ఇవ్వటం లో కలిగే పరస్పర ఆనందం మితం 
7. తోటివారిలా వస్తు సంగ్రహణలో ఉత్సాహం లేకపో వడం 
8. వినిమయ తత్వ (consumerism ) విముఖత 
లౌకికదృష్టితో చూస్తే ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రగతి సాధనాలు కాని , పరిణామశీల   సామాజిక అవసరాలకు
సహాయకారులు కావు  

అన్నట్టు ముందు ఉన్న ఇంగ్లిష్ పద్యం ఆయనే వారి అబ్బాయికి నేర్పించారు. విచిత్రమేమిటంటే ఆయన
చదివింది 7 వ తరగతి, వారి అబ్బాయి చదువు మొదలే 8 వ తరగతి తో 

పద్యానికి స్వేచ్చానువాదం
అంతుతెలియని సాగరాంతరాల చీకటి లోతుల్లో  
స్వఛ్చచ్ఛవిమయ రత్నమణిపవ
్ర ాళాలు ఎన్నో,ఎన్నెన్నో 
సువిశాల నిర్మానుష్య సైకతపు ఎడారి గోతుల్లో  
వికసించి నశించే సౌగంధ పుష్పాలు ఎన్నో,ఎన్నెన్నో  
Gray గారి పద్యంలో చెప్పినట్లు నారాయణ రావు గారు అగాథ సంద్రంలో అజ్ఞా తంగా ఉన్న ఆణిముత్యమో ,
మరుభూమిలోని అనాఘ్రా త సౌరభ సుమమో కాలమే నిర్ణ యిస్తు ంది

You might also like