Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 5

తెలుగు SA-1 Important Q/A

1. మాతృభావన
1. మాతృభావన నేపథ్యం వ్రా యండి.

జ. కళ్యాణి దుర్గంపై దండయాత్ర చేసి అబ్బాజీసో దేవుడు విజయం సాధించాడు. విజయోత్సాహంతో శివాజీ వద్దకు
వచ్చాడు. శివాజీ ఆజ్ఞతో దుర్గం జయించి దాని సర్దా రు ‘మౌలానా అహ్మద్’ను పట్టి బంధించాడు. అతని
రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చినట్లు శివాజీకి చెప్పాడు. అది విన్న శివాజీకి చాలా కోపం వచ్చింది. తరువాత
పాఠ్యభాగం మొదలవుతుంది.

2. మాతృభావన ప్రక్రియ వ్రా యండి.

జ. ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రి యకు చెందింది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం చారిత్రకకావ్యం. ఇది డాII
గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన 'శ్రీ శివభారతం' తృతీయాశ్వాసం లోనిది.

3. మాతృభావన రచయిత గూర్చి వ్రా యండి.

జ. కవి - కీ.శే. గడియారం వెంకట శేషశాస్త్రిగారు

కాలము - 20 వ శతాబ్దం

తల్లి దండ్రు లు - నరసమాంబ, రామయ్య

జన్మస్థలం - కడపజిల్లా , జమ్మల మడుగు తాలూకా, “నెమళ్ళ దిన్నె” గ్రా మంలో జన్మించారు

రచనలు - మురారి, పుష్పబాణ విలాసము మొ||నవి

 బిరుదు - కవితా వతంస, కవిసింహ, అవధాన పంచానన

ఇతర విశేషాలు - వీరు రాజశేఖర గారితో కలిసి కావ్యనాటకాలు రచించారు. గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ
శివభారతం” గుర్తు కు వస్తు ంది.

4.  మీ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.

జ. శివాజీ వ్యక్తి త్వము : వ్యక్తి త్వం అంటే, మాటలకూ చేతలకూ తేడా లేనితనం.
1) ధర్మమూర్తి :
శివాజీ ధర్మప్రభువు. ఇతడు శత్రు దుర్గా లపై దండయాత్రకు పోయినప్పుడు, అక్కడ స్త్రీలకు హాని చేయవద్దని తన
సర్దా రులను ఆజ్ఞా పించేవాడు.
2) తప్పు చేస్తే శిక్ష :
సో దేవుడు కళ్యాణి దుర్గా న్ని జయించినా, రాణివాస స్త్రీని బంధించాడని, అతడిపై కోపించి ప్రా ణం తీస్తా నని శివాజీ
హెచ్చరించాడు.

3) పశ్చాత్తా పం కలవాడు :
యవనకాంతను విడిపించి, తన సర్దా రు తప్పు చేశాడనీ, అందుకు తన్ను మన్నించమనీ కోరి, ఆమెను పూజించి
మర్యాదగా ఆమెను ఇంటికి పంపాడు.

4) క్షమామూర్తి :
సో దేవుడు తాను కావాలని తప్పు చేయలేదనీ, కోటను జయించిన ఉత్సాహంతో తాను తప్పు చేశాననీ, తన్ను
మన్నించమని కోరగా, శివాజీ అతడిని క్షమించి విడిచాడు.

5) స్త్రీలపై గౌరవం :
పతివ్రతలు భూలోకంలో తిరిగే పుణ్య దేవతలని శివాజీ భావన. పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని శివాజీ
మెచ్చుకున్నాడు. స్త్రీలు అగ్నిజ్వాలలవంటి వారని, అపచారం చేస్తే వారు నశిస్తా రనీ శివాజీ నమ్మకం.

6) తప్పును సరిదిద్దడం :
ధర్మ ప్రభువై న శివాజీ, యవనకాంతను విడిపించి, ఆమెను గౌరవించి, తన సర్దా రు చేసిన తప్పును సరిదిద్దా డు.
శివాజీ ఈ విధంగా గొప్ప వ్యక్తి త్వం కలవాడు.

5. గుర్తు గల పద్యాలకు ప్రతిపదార్థా లు రాయండి.

పద్యం -1

శా॥ “ఆ-యేమీ ? ……….. మౌహిత్య మోర్వన్ జుమీ”


ప్రతిపదార్థం :
ఆ – యేమీ = (ఆశ్చర్యం, కోపం కలిపి) ఆ ఏమిటి ?
పుణ్య + ఆవాసమున్ = పుణ్యానికి నిలయమై న
ఒక = ఒక
రాణివాసమును = రాణివాసాన్ని
తెచ్చినావా = బందీగా తీసుకొచ్చావా?
ఏ హై ందవుఁడు + ఐననూ = హై ందవుడు ఎవడై నా
ఈ గతిన్ – = ఈ విధంగా
అమర్యాదన్ = మర్యాద తప్పి (మర్యాద లేకుండా)
ప్రవర్తి ంచును + ఏ = ప్రవర్తి స్తా డా?
మా + ఆజ్ఞన్ = నా ఆజ్ఞను
గమనింపవు + ఓ = గమనించలేదా? (పట్టి ంచుకోలేదా?)
మద + ఉన్మాదంబునన్ = గర్వం మత్తు లో
రేఁగి = అతిశయించి
నీ = నీ యొక్క
ఆయుః + సూత్రములు = ప్రా ణాలనే సూత్రా లు (దారాలు)
ఈవ = నీవే
త్రు ంచుకొనెదు + ఓ : తెంచుకుంటావా?
ఔద్ధత్యము = ఈ తెగింపును (గర్వమును)
ఓర్వన్ + చుమీ = సహించను సుమా !

పద్యం -4

మ| శివరాజంతట …………….తప్పు సై రింపుమీ !


ప్రతిపదార్థం :
శివరాజు = శివాజీ మహారాజు
అంతటన్ = అప్పుడు
మేల్ముసుంగుఁదెరలోన్; మేల్ముసుంగు = సువాసినీ స్త్రీలు వేసుకొనే మేలు ముసుగు యొక్క (బురఖా)
జయ = (యుద్ధంలో) విజయం పొందిన
తెరలోన్ = తెరలోపల
స్నిగ్దా ంబుదచ్ఛాయలోన్, (స్నిగ్ధ + అంబుద + ఛాయలోన్) = దట్టమై న
అంబుద = మేఘము యొక్క
ఛాయలోన్ = నీడలో (మాటున నున్న)
నవసౌదామినిన్ = కొత్త మెరుపు తీగను
పోలు = పోలినట్లు ఉన్న
ఆ, యవన కాంతారత్నమున్ = ఆ రత్నము వంటి యవనకాంతను (మహమ్మదీయ స్త్రీని)
భక్తి గౌరవముల్ = భక్తి యునూ, గౌరవమునూ
పాఱగన్ + చూచి = స్ఫురించేటట్లు చూసి
పల్కెన్ = ఈ విధంగా అన్నాడు
వనితారత్నంబులు = రత్నముల వంటి స్త్రీలు (శ్రే ష్ఠు లై న స్త్రీలు)
ఈ=ఈ
భవ్య హై ందవ భూ జంగమ పుణ్యదేవతలు; భవ్య = శుభప్రదమై న
హై ందవ భూ = భారత భూమిపై
జంగమ = సంచరించే (తిరుగాడే)
పుణ్యదేవతలు = పుణ్యప్రదమై న దేవతల వంటివారు
మాతా! = అమ్మా
తప్పున్ = మా వారు చేసిన తప్పును
సై రింపుమీ = మన్నింపుము (క్షమింపుము)

పద్యం -6

మ|| అనలజ్యోతుల ………… దుశ్చారిత్రముల్ సాగునే?


ప్రతిపదార్థం :
అనల జ్యోతులన్ = అగ్ని జ్వా లల వంటి,
ఈ పతివ్రతలన్ – ఈ పతివ్రతలను
పాపాచారులై (పాప + ఆచారులు + ఐ) = అపచారం చేసేవారై
డాయు = కలిసే
భూజనులు + ఎల్లన్ = భూమి పై నున్న ప్రజలు అందరునూ
నిజ సంపదల్ = తమ సంపదలను
తొఱగి = వీడి (పోగొట్టు కొని)
అసద్వస్తు లై (అసద్వస్తు లు + ఐ) = సర్వ నాశనమై నవారై
పోరె = పోకుండా ఉంటారా?
విత్తనమే – విత్తనము (వారి వంశవృక్షం
యొక్క విత్తనం)
నిల్చునె = నిలుస్తు ందా? (అనగా వంశం నిలుస్తు ందా?)
మున్ను = పూర్వం
పులస్త్య బ్రహ్మ సంతానమున్ = పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడై న రావణుని గూర్చి
ఎఱుంగమై = మనకు తెలియదా?
హై ందవ భూమిని – భారత భూమియందు
ఈ పగిది = ఇటువంటి
దుశ్చరిత్రముల్ = చెడు పనులు (దుశ్చర్యలు)
సాగునే = సాగుతాయా? (సాగవు)

పద్యం -8

శా॥ మా సర్దా రుఁడు ………….. దాల్ని సారింపుమీ!


ప్రతిపదార్థం :
మా సర్దా రుడు = మా సర్దా ర్ సోన్ దేవుడు బ
తొందరన్ బడి = తొందరపాటుపడి
అసన్మార్గంబునన్ (అసత్ + మార్గంబునన్) = తప్పుడు మార్గంలో
పోయెన్ = వెళ్ళాడు (పొరపాటున నిన్ను బంధించి తెచ్చాడు)
ఈ దోసంబున్ = ఈ దోషాన్ని
కని = చూచి
నొచ్చుకోకు = బాధపడకు
ఇప్పుడే = ఇప్పుడే
నినున్ = నిన్ను
నీ గృహంబున్ = నీ ఇంటిని (నీ ఇంటికి)
చేరున్ = చేరుస్తా ను
నా సై న్యంబున్ = సై న్యాన్ని
తోడుగాన్ = నీకు సాయంగా
పనిచెదన్ = పంపిస్తా ను
నా తల్లి గాన్ = నా యొక్క తల్లి వలెనూ
తోడుగాన్ = నా తోడబుట్టి న సోదరిగానూ
దోసిళ్లన్ = (నా) అరచేతులపై
నడిపింతున్ = నడిపిస్తా ను (నిన్ను కాలుక్రి ంద పెట్టకుండా నా అరచేతులపై సగౌరవంగా నడిపించి మీ ఇంటికి
పంపిస్తా ను)
నీ కనులయందున్ = నీ కళ్లల్లో
తాల్మిన్ = ఓర్పును
సారింపుమీ = ప్రసరింప చెయ్యి (చూపించుము)

You might also like