ఓం శ్రీ గురుబ్యొనమ New file

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 7

శ్రీ సత్యనారయణ స్వామి వ్రథము

1
ఓం శ్రీ గురుబ్యొనమ:
ఓం శ్రీ మహగనాధి పథయెనమ:

ఓం శ్రీ సరస్వథ యెనమ:

ఒకటవ అధ్యాయము కథ ప్రారంభము:

శ్లో: ఎకదా నైమిశారణ్యె ఋషయశ్సౌనకాదయ:

పప్రఛ్చురానతం సర్వె సుతం పౌరణికంఖలు.

పూర్వకాలమందు ఒకప్పుడు శౌనకాది మహామునులు సూతమహాముని నైమిశారణ్యంలో ఒక ప్రశ్న అడిగిరి, ఏ వ్రతము, ఏ తపస్సు,
ఏ పూజ చేసినచో అనుకున్న పనులు నెరవేరుతాయో. అట్టి వ్రతము గురించి మాకు తెలుపుము అని సూతమహాముని అడిగిరి,
అప్పుడు సూతమహాముని చెప్పుచున్నాడు, మీరు నన్ను అడిగిన ప్రశ్న పూర్వకాలము నారద మహాముని విష్ణుమూర్తిని అడిగేను
విష్ణుమూర్తి నారద మహామునికి చెప్పిన కథలు మీకు చెపుతాను, శ్రద్ధతో, భక్తితో వినండి. ఒకప్పుడు నారద మహాముని అన్ని
లోకాలు తిరిగి భూలోకానికి వచ్చెను, అన్ని లోకాలలో సుఖ, శాంతులు ఉన్నాయో కానీ భూలోకములో ఉన్నటువంటి మానవులు
వారి, వారి పాపకర్మల చేత అనేకమైన కష్టములను దుఃఖములను బాధలను దరిద్రములను అనుభవించుచున్నారు. అప్పుడు నారద
మహాముని బాగా ఆలోచించి భూలోకము నుండి విష్ణు లోకానికి బయలుదేరును విష్ణుమూర్తి శంఖము, చక్రము, గదా, పద్మము
అలంకారముతో ఉన్నటువంటి విష్ణు మూర్తిని చూసి నమస్కరించెను, భూలోకంలో మానవులు అనుభవించే కష్టా లను గూర్చి పూర్తి
విషయములను తెలియజేసెను, అప్పుడు విష్ణుమూర్తి నారద మహాముని చెప్పిన విషయములను గ్రహించి చెపుతున్నాడు, అన్ని
కోరికలు తీర్చేటువంటి సత్యదేవుని వ్రతము ఒకటి కలదు, 14 లోకములలో దొరకనటువంటిది భక్తి, శ్రద్ధలతో ఏ మానవుడు
ఆచరిస్తా రో అప్పుడే కష్టా లు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరును శత్రు వులను జయించాలంటే
యుద్ధములో జయప్రదం కలుగును, సంతానము లేనివారికి సంతానము కలుగును, సర్వానికి శుభ ఫలితములను ఇచ్చును, ఈ
వ్రతము కార్తీకమాసము, మాఘమాసము లేదా వైశాఖమాసములో చెయడము మంచిది, ఏకాదశి లేదా పున్నమి రోజున లేకుంటే
మానవుడు ఎప్పుడు చెయ్యాలి, అనుకుంటే అప్పుడే మంచి తిథి చూసుకొని చేయవచ్చును. సంవత్సరమునకు ఒక్కసారైనా
తప్పక వ్రతము ఆచరించాలి. నెలకు ఒక్కసారి అయినా చేయడము మంచిది శుభకార్యం ఉన్న లేకున్నా సత్యదేవుని వ్రతము
చేయడము చాలా మంచిది. ఎవరైతే వ్రతము చేస్తా రో పూజా స్థలమును గోమూత్రము లేదా పేడతో శుభ్రపరిచి ముగ్గు వేసి పీఠము
పెట్టి తెల్లవస్త్రము వేసి బియ్యము పోసి శక్త్యానుసారము కలశము వెండిది రాగిది లేదా మట్టిది పెట్టి ఇ భక్తితో ఆచరించాలి,
సత్యదేవుని ప్రతిమను బంగారది, వెండిది లేదా రాగిది లేకుంటే సత్యదేవుని ఫోటోను పెట్టి పూజ చేయాలి ఎక్కువ ప్రాధాన్యత భక్తికి
ఇవ్వాలి గణేశుడు, లక్ష్మీదేవి, శంకరుడు, నవగ్రహాలు, అష్టదిక్కులు ముందుగా అన్నిదేవతలకు పూజ చేయాల్సి ఉంటుంది
పంచామృతాలతో పూజించాలి ఆవుపాలు ఉన్నట్లయితే చాలా మంచిది. పూజకు ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చును. ఉన్నంతలో
బంధువులను అందరినీ పిలుచు కొనవచ్చును. మంచి మనసుతో వ్రతము ఆచరించాలి సత్యదేవునికి ఇష్టమైన ప్రసాదము
అరటిపండ్లు , గోధుమరవ్వ, నెయ్యి, బెల్లం లేదా చక్కెర అ ఉన్నంతలో నైవేద్యం పెట్టవలయును తీర్థము ప్రసాదము భక్తితో
తీసుకోవాలి. సీత జాడ దొరకడానికి పూర్వము ఒక ముని సలహా ప్రకారము (రామలక్ష్మణులు ఈ వ్రతం ఆచరించిరి) నదిఒడ్డు న
ఈ వ్రతము చేసిరి, తరువాత సీతజాడ దొరికినది. ఈ వ్రతమహత్యము చేత చివరికి అయోధ్య చేరుకుని రాజ్యపరిపాలన చేసిరి. ఈ

2
కథ విష్ణులోకములో విష్ణుమూర్తి నారద మహామునికి చెప్పిరి, సూతమహాముని నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పిరి
ఒకటవ అధ్యాయము కథ సమాప్తము.

రెండవ అధ్యాయము కథా ప్రారంభము:

శ్లో: అథాన్యత్స మ్రప్రవక్ష్యామి క్రు తం యెన పురాద్విజ

రెండవ అధ్యాయములో ఈ విధముగా చెబుతున్నారు పూర్వము ఈ వ్రతము ఎవరు చేశారంటే, కాశీనగరంలో చాలా వేదము
చదువుకున్న బీద బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆకలితో బాధపడుతూ ప్రతి ఇల్లు బిక్షము కొరకై తిరుగుతూ వచ్చిన ద్రవ్యముతో
కుటుంబమును అతికష్టముతో పోషించు చున్నాడు. ఆ బీద బ్రాహ్మణునీపై విష్ణుమూర్తికి అనుగ్రహము కలిగినది. ఏదైనా
సహాయము చేయాలి అనుకున్నాడు, ఎదురు వచ్చి నీవు ఎందుకు తిరుగుతున్నావు నీబాధ ఏమిటి చెప్పు అని అడిగాను. అప్పుడు
బ్రాహ్మణుడు చెపుతున్నాడు నాది కాశీగ్రామము బీదవాన్ని సంసారము గడవడం లేదు భార్య పిల్లలను సాదడనికి ఈ విధముగా
బిక్షం గురించి తిరుగుతున్నాను అని జవాబు చెప్పను. బ్రాహ్మణుని మాటలు విని విష్ణుమూర్తి చెబుతున్నాడు, అన్ని కోరికలు,
కష్టా లు, తీర్చే సత్యనారాయణస్వామి వ్రతము కలదు, నీవు ఆ వ్రతమును ఆచరించు నీ దరిద్రము, కష్టా లు తొలగిపోవును అందుకు
సందేహము లేదు అని చెప్పను. ఆ మాటలు విని బ్రాహ్మణుడు రాత్రి సంకల్పము చేశాను. సత్యదేవా రేపు స్నానము చేసి బిక్షం
గురించి బయలుదేరుతాను వచ్చిన ద్రవ్యముతో పూజా సామాగ్రి తీసుకొని వచ్చి నీ వ్రతము చేస్తా నని మనసులో అనుకోను.
తెల్లవారిన తర్వాత సత్యదేవుని నమస్కరించి వెళ్లేను, భగవంతుని దయ వలన మంచి ద్రవ్యము లభించెను. ద్రవ్యముతో పూజా
సామాగ్రి తీసుకువచ్చి వ్రతము ఆచరించెను. కొంతకాలానికి వ్రత మహత్యము చేత దరిద్రము తొలగిపోయి గొప్ప ధనవంతుడు
అయ్యెను, సత్యదేవుని దయవలన నేను ధనవంతుని అయినాను కనుక కొంత ద్రవ్యము భగవంతునికి ఖర్చుపెట్టా లి అనుకొని
వ్రతము చేసెను, చాలా మందిని పిలిచి అన్నదానము జరిపించెను. అదే సమయంలో ఒక వ్యాపారి కట్టెలు అమ్మువాడు దారిన
పోతూఉండగా బ్రాహ్మణుని ఇంటియందు చాలా మందిని చూసి ఎందుకు ఇంత మంది ఉన్నారని అడిగితే సత్యదేవునివ్రతము
చేస్తు న్నాడు అని చెప్పేసరికి ఆ కట్టెలమోపు క్రింద దింపుకొని బ్రాహ్మణునికి నమస్కరించి విషయములు తెలుసుకొనెను. సత్యదేవా
నేను కూడా దరిద్రు ణ్ణి ఈరోజు కట్టెలు అమ్ముడుపోలేదు, నీ దయవలన కట్టెలు అమ్ముడుపోతే వచ్చిన ద్రవ్యముతో నీ వ్రతము
చేస్తా నని సంకల్పించి తీర్థము, ప్రసాదము తీసుకొని బయలుదేరెను. సత్యదేవుని దయవలన కట్టెలు అమ్ముడుపోయెను వచ్చిన
ద్రవ్యముతో పూజా సామాగ్రి తీసుకువచ్చి వ్రతము చేసేను. కొంతకాలానికి వీరిద్దరి దరిద్రములు తొలగిపోయి మోక్షము పొందిరి.
(కష్టము. సుఖము, పగలు, రాత్రి, అమావాస్య, పున్నమి, బాధలు దుఃఖములు. ఇవి అందరికీ మామూలే వస్తూ పోతూ ఉంటాయి)
కానీ భగవంతుని ప్రతిరోజు నమస్కరించడం మరిచిపోవద్దు , ఓపిక పట్టండి, భగవంతుని శక్తి మీకు అర్థమవుతుంది. నిదానముగా
చిన్న మొలకకు నీళ్లు పోస్తూఉంటే ప్రతిరోజు దిన దిన వృద్ధి చెంది పెద్దవృక్షము తయారై మనకు నీడను అందించును, అదే
విధముగా భక్తిని అలవాటు చేసుకుంటే దిన దిన అభివృద్ధి చేo దు దురు ఈ కథ విష్ణుమూర్తి నారద మహామునికి చెప్పిన కథా
రెండవ అధ్యాయము సమాప్తము.

కథ మూడవ అధ్యాయము ప్రారంభము:

శ్లో: పునరగ్రె ప్రవఢ్యామి శ్రు ణుధ్వం

మునిసత్తా మ: పురా చొలాముఖొనామ

న్రు పశ్చాసిన్మహీపతి:

3
మరొక కథ చెబుతాను వినండి అని సూతుడు చెబుతున్నాడు. పూర్వకాలము ఉల్పాముఖుడు అనే రాజు ఉండేవాడు,
సత్యవంతుడు, ధర్మవంతుడు, ప్రతిరోజు దేవాలయములకు వెళ్లి తీర్థము, ప్రసాదము తీసుకునేవాడు. మంచి గుణములు కలవాడు
ప్రజలకు మేలు చేసేవాడు. రాజుకు అన్ని వసతులు ఉన్నాయి కానీ ఒక సంతానము లేదు, సంతానము కొరకు రాజు, రాజు భార్య
ఇద్దరూ కలిసి భద్రశీల నదీతీరమున సత్యదేవుని వ్రతము ఆచరించిరీ, అదే సమయమున ఒక సౌకారి, వైశ్యుడు ధనసంపాదన కొరకై
వ్యాపారము చేయుటకు దారిన పోవుచుండగా రాజు దంపతులను చూసెను పడవదిగి రాజు దగ్గరకు వచ్చి, ఏమి పూజ
చేస్తు న్నారు, దీనివలన ఏమి ఫలము కలదు, దేని గురించి ఈ పూజ చేస్తు న్నారు అని అడిగెను. అప్పుడు రాజు చెబుతున్నాడు
భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ, ఒక సంతానము ఇవ్వలేదు, ఈ వ్రతము సత్యనారాయణస్వామి వ్రతము అంటారు,
సంతానము కొరకై ఈ వ్రతము చేయుచున్నాను. రాజుగారి మాటలు విని వైశ్యుడు చెబుతున్నాడు రాజు నాకు కూడా సంతానము
లేదు. నాకు సంతానము కలిగినచో నేను కూడా వ్రతము చేయుదును, అని సత్యదేవునికి శ్రద్ధతో నమస్కరించెను. కొన్నిరోజుల
తర్వాత సత్యదేవుని అనుగ్రహం వలన వైశ్యుని భార్య లీలావతికి కుమార్తె జన్మించినది, ఆ అమ్మాయికి కళావతి అను పేరుపెట్టిరి,
లీలావతి భర్తకు గుర్తు చెసెను సత్యదేవుని వ్రతము చేయాలని, కానీ వైశ్యుడు భార్య మాటలు వినక, తొందర ఎందుకు అమ్మాయి
పెండ్లి సమయములో చేస్తా మని జవాబు చెప్పను. కొంతకాలానికి కళావతికి వయస్సు వచ్చినది, పెళ్లి చేయాలని అనుకొని, వైశ్యుని
దగ్గర పనిచేసే దూతను పిలుచుకొని విషయము చెప్పెను, నీవు వెళ్లి కళావతికి సరిఅయిన వరుణ్ణి తీసుకురా అని చెప్పిపంపెను, ఆ
దూత వెళ్లి కాంచన నగరమునకు వెళ్లి మంచి పిల్లవాడిని చూసి తీసుకుని వచ్చెను. మంచి ముహూర్తమున బంధుమిత్రు లను
పిలుచుకొని వైభవముగా కళావతి పెళ్ళి జరిపించెను. కానీ సత్యదేవుని వ్రతము గురించి ఇద్దరూ మరిచిపోయిరి, బాధలు
వచ్చినప్పుడు మాత్రము భగవంతుడు గుర్తు కు వస్తా డు, అది పద్ధతి కాదు, ఎల్లప్పుడూ భగవంతుని పూజించాలి అది మంచి పద్ధతి,
సంతానము కావాలి అని నన్ను వేడుకొనెను, సంతానము ప్రసాదించితిని, కనీసము నా వ్రతము మరిచి పోయినారు, వాళ్లకు
గుర్తు కు తేవాలి అనుకొని శాపముపెట్టెను, భగవంతుని శాపము వలన, వైశ్యుల కుటుంబానికి, దుఃఖములు, బాధలు, కష్టములు
మొదలయినవి, ఒకరోజు మామ ,అల్లు న్ని పిలుచుకొని చెబుతున్నాడు, మనము ఇద్దరమూ ధనసంపాదన కొరకై రత్నసానుపురము
పోదాము, ఆ గ్రామానికి చంద్రకేతు మహారాజు పరిపాలించుచున్నాడు. ఆ గ్రామానికి బయలుదేరును, శాపము వలన ఆ రాత్రి
రాజుగారి ఇంట్లో దొంగతనము జరిగెను, వైశ్యులు ఉన్నచోట ద్రవ్యము పారవేసి దొంగలు పారిపోయిరి, రాజభటులు ధనము
అక్కడ ఉండడం చూసి ఆ వైశ్యులు దొంగలని నిర్ణయించి వారిని తాళ్లతో కట్టి రాజు దగ్గరికి తీసుకుపోయిరి, ప్రభు మన ధనము
దొరికినది, దొంగలు దొరికినారు, వీళ్లకు ఏమి శిక్షవేస్తా రో వేయండి అని చెప్పిరి. రాజు ఏమి విచారింపకనే వీరిని తీసుకొనిపోయి
కారాగృహము నందుంచుము అని ఆజ్ఞాపించెను. వైశ్యులను కారాగృహమున బంధించిరి, మెము దొంగలము కాదు అని ఎంత
చెప్పిన వినెవారు లెకపొయిరి, సథ్యదెవుని శాపము వలన కుటుంబములొ ఉన్నవారు అనెక కష్టములు అనుభవించుచున్నారు,
ద్రవ్యము దొంగలు ఎత్తు కపొయిరి, తినడనికి తిండిలెక ఇంటి ఇంటికి బిక్షము గురించి తిరుగుతున్నరు, ఒక్కసారి ఒకరి
ఇంటియందు సత్యదెవుని వ్రతము చెసుచున్నరు, కళవతి వ్రతమును చూసి కథలు విని, థీర్థ ప్రసదములు తీసుకొని ఆలస్యముగా
ఇల్లు చేరుకొనెను లీలావతి, బిడ్డ కళావతిని అడిగెను ఆలస్యము ఎందుకు అయింది ఆని, అంటే కళావతి చెపుతున్నది, ఒకరి
ఇంటి యందు సత్యదేవుని వ్రతము చేస్తు న్నారు వ్రతము విని వచ్చితిని అందుకు ఆలస్యం అయినది అని జవాబు చెప్పెను. ఆ
మాటలు విని లీలావతికి సత్యదేవుని విషయము గుర్తు కు వచ్చెను సత్యదేవా మా తప్పును క్షమించు నా భర్త, అల్లు డు క్షేమముగా
ఇంటికి రావాలి తప్పక నీ వ్రతము చేస్తా నని శ్రద్ధతో నమస్కరించెను. అదే రోజు రాత్రి చంద్రకేతు మహారాజుకు శంఖ, చక్రా లతో
స్వప్నమున కనిపించి కారాగారమున ఉన్న వారిని విడిచి పెట్టు ము వారి ద్రవ్యము వారికి ఇచ్చి వేయుము లేనిచో నీ రాజ్యము నీకు
దక్కదు అనేక కష్టములు ఎదురు కొందువు అని చెప్పను. తెల్లవారిన తరువాత స్వప్నములో వచ్చిన విషయమును పురోహితులకు
వినిపించెను, అప్పుడు పురోహితులు రాజుకు చెపుతున్నారు, రాజా వారిని విడిచిపెట్టండి మీకు మేలు కలుగుతుంది, సత్యదేవుడే
దర్శనమిచ్చి మీ నోట చెప్పించాడు అందుకు సందేహము లేదు అని సలహా ఇచ్చిరి. వైశ్యులను విడిచి పెట్టిరి, వైశ్యులు రాజుకు

4
నమస్కరించిరి అప్పుడు రాజు చెపుతున్నాడు, ఇక మీరు భయపడవద్దు భగవంతుని శాపము వలన ఈ విధముగా జరిగినది, మీ
గ్రామానికి మీరు వెళ్ళండి అని ద్రవ్యమును ఇచ్చి నూతన వస్త్రములు ఇచ్చి సాగనంపెను. వారు సంతోషముతో ఇంటికి
బయలుదేరును (సత్యానికి ఉన్నంత శక్తి అసత్యానికి ఉండదు ఎన్నటికైనా సత్యము, ధర్మము గెలుచును అబద్ధములు ఎప్పుడు
అరిష్టములకు దారి తీసును కనుక మానవుడు క్రమపద్ధతిగా నడవడము చాలా మంచిది ఎల్లప్పుడూ) ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని
మనము కాపాడితే అ ధర్మము మనలను కాపాడుతుంది. ఈ కథ సూతమహాముని సౌనకాది మహామునులకు చెప్పిరి మూడవ
అధ్యాయము కథ సమాప్తము.

కథా నలుగవ అద్యయము ప్రరంభము

శ్లో: యంత్రాం క్రు త్వా తతస్సాధు ర్మంశళాచారి

పుర్వకం బ్రామ్హాణెభ్యొధనం దత్వామమౌ

స్వీనశరం ప్రతి

ఆ వైశ్యులు దారిన ఉన్న తీర్థయాత్రలు సేవించుచు, నది ఒడ్డు కు చేరుకొనెను అది సత్యదేవుడు గమనించాడు, వీళ్లలో
మార్పు వచ్చినదా లేదా ఇంకా ద్రవ్యము పైనే ఆశ ఉన్నదా తెలుసుకుందామని సన్యాసి రూపములో వీళ్ళ దగ్గరకు
వచ్చాడు. మీ దగ్గర ద్రవ్యము ఉన్నది ఒక్కసారి చూపించరా అని అడిగెను, వైశ్యులకు అనుమానము వచ్చినది దొంగ
సన్యాసి అనుకొని అబద్దం ఆడవలసి వచ్చినది, మా దగ్గర ఏమీ లేదు ఆకులు ఉన్నవని ఏదోఒకటి తప్పించుకుందామని
అబద్ధము చెప్పిరి. ఆ సన్యాసి వాళ్ళ మాటలు విని కొంత దూరంలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లి కూర్చుండెను, ఆ వైశ్యులు
ద్రవ్యము చూసేసరికి, ద్రవ్యము కనిపించలేదు వాళ్ళ కంటికి ఆకులు మాదిరిగానే ద్రవ్యము కనిపించుచున్నది, ఆ సన్యాసి
మాయము చేసెను అనుకొని బాధతో ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి స్వామి మా తప్పును క్షమించు ద్రవ్యం ఉంచుకొని కూడా
లేదని అబద్ధము చెప్పితిమీ మమ్మల్ని క్షమించమని వేడుకొనిరి అప్పుడు ఆ సన్యాసి చెబుతున్నాడు, ఒకప్పుడు నీవు సత్యదేవుని
వ్రతము చేస్తా నని చేయలేదు ఇంకా నీకు ద్రవ్యము మీదే మనసు ఉన్నది నీ ద్రవ్యము నీకు దొరుకును కానీ, సత్యదేవుని వ్రతము
తప్పక ఆచరించు అని చెప్పెను అప్పుడు ద్రవ్యము కనిపించినది, అతనే సత్యదేవుడు అని గ్రహించి సత్యదేవా తప్పకుండా నీ వ్రతము
చేస్తా నని చెప్పి తన గ్రామానికి బయలుదేరెను. నది దగ్గరకు చేరుకునిరి. చాలా రోజుల తర్వాత వైశ్యులను కొంతమంది భటులు
చూసిరి, భటులు వెళ్లి లీలావతికి చెప్పిరి మీ భర్త అల్లు డు క్షేమముగా నది దగ్గర ఉన్నారు అని చెప్పిరి, లీలావతి సత్యదేవుని వ్రతము
శ్రద్ధతో ఆచరించి తీర్ధము ప్రసాదము తీసుకొని కూతురు కళావతికి చెప్పెను, నేను వెళుతున్నాను నది ఒడ్డు కు మీ నాన్నను
చూడడానికి నీవు కూడా సత్యదేవునికి నమస్కరించి తీర్థము ప్రసాదము తీసుకొని రమ్మని చెప్పి బయలుదేరును. కానీ కొన్ని రోజుల
తర్వాత భర్త వచ్చిండ్రు అని విషయము తెలిసేసరికి సంతోషముతో కనీసం తీర్థము, ప్రసాదము తీసుకొనక కళావతి నది ఒడ్డు కు
చేరుకునెను అదే సమయంలో నదిలోకి నీళ్లు ఎక్కువగా ప్రవేశించి కళావతి భర్త ఉన్న పడవ నీటిలో మునిగి కొట్టు కపోయెను,
అందరూ చూస్తు న్నారు కానీ ఎవరు కాపాడలేకపోయారు నా భర్తను కాపాడండి అని ఏడవసాగేను. ఒక నిర్ణయానికి వచ్చినది నా
భర్త లేనిచో నేను కూడా జీవించి ఉండను నీళ్లలో దుమికి చనిపోతానని నిశ్చయించుకున్నది, వైశ్యులు ఏడుస్తూ కూర్చున్నారు
సత్యదేవా మాటి మాటికి ఇబ్బందులు పెడుతున్నావు తప్పక నీ వ్రతము చేస్తా నని నది ఒడ్డు న చెప్పాను కదా ఇన్ని బాధలు ఏమిటి
భగవంత అనుకుంటూ ఏడవసాగిరి, ఆ సమయంలో ఆకాశమునుండి గొప్పశబ్దము వినిపించెను భగవంతుడె దిక్కు నీ కూతురు
కళావతి కనీసం తీర్థము, ప్రసాదము తీసుకొనక వచ్చినది అందుకే తన భర్త దూరమయ్యాడు తీర్థము తీసుకొని వచ్చినచో తన భర్త
క్షేమముగా లభించును అని ఆకాశమునుండి శబ్దముతో మాటలు వినబడెను. కళావతి ఇంటికి వెళ్లి దేవునికి నమస్కరించి తీర్థము

5
ప్రసాదము తీసుకొని వచ్చిన తరువాత కొంత దూరమున కళావతి భర్త పడవ దగ్గర ఉండడం జరిగినది, క్షేమముగా ఉన్నాడు.
అందరూ కలిసి ఆనందముతో ఇంటికి బయలుదేరిరి. పోయిన ద్రవ్యము దొరికినది అది మొదలుకొని వైశ్యుడు ప్రతి పున్నమికు
వ్రతము చేస్తూ అన్నదానములు జరిపించి సుఖము అనుభవించి చివరికి స్వర్గలోకము పొందెను. మర్రిచెట్టు గింజ విత్తనము చాలా
చిన్నదిగా ఉండును కానీ కొన్ని రోజుల తర్వాత పెద్ద వృక్షము తయారగును అదే ప్రకారము మన నిత్య కర్మ మనము ఆచరించాలి
ఉదయము, సాయంత్రం మరిచిపోకూడదు వృక్షము పెరిగిన రీతిగా దిన దిన అభివృద్ధి చెందును మానవుడు ప్రతి ఒక్కరూ
కర్మఫలమును అనుభవించక తప్పదు సూతమహాముని శౌనకాది మహామునులకు చెప్పిన నాలుగవ అధ్యాయము కథ
సమాప్తము.

ఐదవ అధ్యాయము కథ ప్రారంభము

శ్లో: అథాన్యత్సం ప్రవక్ష్యామి శ్రు ణుధ్వం మునిసత్తమా:

ఆసీ త్తుంగధ్వజొ రాజా ప్రజాపాలనతత్పర:

పూర్వకాలమున తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్నబిడ్డలవలె చూస్తూ ప్రజలకు మేలు చేసే వాడు, కీర్తి
సంపాదించినవాడు వందమంది సంతానము కలదు రాజుకు. ఒకరోజు తుంగధ్వజ రాజు వేటకు గుఱ్ఱముల బండిలో
బయలుదేరును, మారేడు చెట్టు దగ్గర కొంతమంది యాదవులు అందరూ సత్యదేవుని వ్రతము చేయుచున్నారు రాజును
చూశారు, పెద్దవారు కదా అని యాదవులు ప్రసాదము తెచ్చి రాజుకి ఇచ్చిరి, కానీ రాజు ఎవరో బీదవారు ఆ ప్రసాదం
నాకెందుకు అని అహంకారంతో ప్రసాదము తీసుకోలేదు, వెటాడి ఇంటికి వెళ్లేసరికి రాజు సంతానము తన కుమారులు
మూర్చపొయిరి క్షణములలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినది, ఎందుకు ఈ విధముగా జరిగినది, ఎవరికి
నష్టము చేయలేదు ఈ బాధలు నాకెందుకు వచ్చినవి, అని చాలా ఆలోచనతో ఉన్నాడు అప్పుడు అతనికి విషయము
గుర్తు కు వచ్చెను ఎవరో యాదవులు నాకు భక్తి శ్రద్ధలతో ప్రసాదము ఇచ్చిరి, నేను తీసుకోలేదు నా తప్పు నేను
తెలుసుకున్నాను అదే పొరపాటు చేశాను అని మనసులో అనుకుని, మరల వేటకు బయలుదేరెను, యాదవులు ఉన్నచొటికి
రాజు చెరుకొనెను, యాదవులు భగవంతుని నామస్మరణ చేస్తూ అక్కడే ఉన్నారు. రాజు రథము దిగి వాళ్ల దగ్గరికి వెళ్లి
సత్యదేవుని నమస్కరించి భగవంత నా తప్పుని క్షమించు అని వేడుకొని, వాళ్ళ చేత తీర్థ, ప్రసాదములు తీసుకొనేను. నేను
అహంకారముతో ప్రవర్తించితిని, మీ బీదల దగ్గర భగవంతుడు ఉంటాడు, అందుకే నాకు కొన్ని ఇబ్బందులు ఎదురు
అయినవి భగవంతుని తెలుసుకోలేక పోయాను అని తెలిపి, ఇంటికి బయలుదేరెను, సత్యదేవుని దయవలన పిల్లలు
క్షేమముగా ఉన్నారు. అది మొదలుకొని బ్రతికినంత కాలము వ్రతము చేసెను. రాజు వంశము వృద్ధికి వచ్చెను. ఎవరైతే భక్తితో
శ్రద్ధతో వ్రతము చేస్తా రో, వింటారో అందరికీ సత్యదేవుని అనుగ్రహము కలిగి అనుకున్న పనులు నెరవేరి, ఆయురారోగ్యమును
ప్రసాదించును పూర్వ కాలము నుండి ఒకరిని చూసి మరి ఒకరు చేస్తూ వస్తు న్నారు. ఈ విధముగా అందరికీ
తెలిసిపోయినది ప్రతి శుభకార్యములకు, పెండ్లికి, నూతన గృహప్రవేశమునకు శ్రీమన్నారాయణమూర్తి యగు సత్యదేవుని
వ్రతము చాలా గొప్పది, వ్రతమును మించిన మార్గము మరొకటి లేదు ఏ కష్టం వచ్చినా వ్రతము చేస్తూ ఉంటారు. ధైర్యే
సాహసే లక్ష్మి, ఎన్ని సమస్యలు ఎదురైనా అధైర్య పడకూడదు, మానవుడు ధైర్యాన్ని పెంచుకోవాలి భగవంతుని స్మరణ వలన
ధైర్యం వృద్ధి చెందును ఏదైనా మన మంచికి అనుకోవాలి. తన కోపమే తన శత్రు వు తన శాంతమే తనకు రక్ష. ఓర్పును

6
మించిన తపస్సు లేదు చేతిలో ఉన్నంతవరకు తోటి మానవునికి సహాయము చేయడం మంచిది. ఈ అయిదు
అధ్యాయములు సూతమహాముని శౌనకాది మహామునులకు చెప్పిన కథలు విష్ణులోకములో విష్ణుమూర్తి నారద
మహామునికి చెప్పిన కథలు సమాప్తము.

సత్య భగవానునికి జై సర్వేజనా సుఖినోభవంతు అన్ని దానముల కన్నా అన్నదానము గొప్పది.

You might also like