Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 15

Home ▸ APPSC Groups Practice Tests ▸ Indian History

 
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English
Cloud AWS Certification
Become a Cloud Architect
Master the skillset of a cloud solutions
architect, 40+ In-Demand Skills & 25+
Services,
simplilearn.com

OPEN

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరితీశారు?


    

 Sakshi Education

Become a Cloud Architect OPEN ↑


 
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English

స్వాతంత్రోద్యమ చరిత్ర :
1. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు ప్రథమంగా ఎప్పుడు వెళ్లాడు?
1) క్రీ.శ. 1889
2) క్రీ.శ. 1893
3) క్రీ.శ. 1895
4) క్రీ.శ. 1899

Next

Stay

View Answer

సమాధానం: 2
వివరణ: దాదా అబ్ధుల్లా ఆహ్వానం మేరకు మహాత్మా గాంధీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లాడు. అక్కడ జాతి
వివక్షను ఎదుర్కొని, సత్యాగ్రహం ప్రారంభించి సఫలీకృతుడయ్యాడు. 1915లో శాశ్వతంగా తిరిగి భారత్
చేరుకున్నాడు. స్వాతంత్రోద్యమానికి పూనుకున్నాడు.

2. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక?


1) నేషనల్ హెరాల్డ్
2) నవజీవన్ ↑
3) యంగ్ ఇండియా
 
4) ఇండియన్ ఓపీనియన్
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English

View Answer

సమాధానం: 4
వివరణ: భారతీయుల హక్కుల కోసం గాంధీజీ దక్షిణాఫ్రికాలో ‘ఇండియన్ ఓపీనియన్’ అనే పత్రికను
ప్రారంభించాడు. భారత్‌లో నవజీవన్, యంగ్ ఇండియా, హరిజన మొదలగు పత్రికలను ప్రారంభించారు.
జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను ప్రారంభించారు.

3. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ ఏ ప్రాంతంలో శాసనాలను ఉల్లంఘించాడు?


1) సబర్మతి
2) పోర్‌బందర్
3) దండి
4) వార్థా

View Answer

సమాధానం: 3
వివరణ: గాంధీజీ 1930 ఏప్రిల్ 6వ తేదీన అరేబియా సముద్రతీర ప్రాంతమైన దండిలో బ్రిటీష్ వారి
శాసనాలను ఉల్లంఘించాడు. అందుకే ఉప్పు సత్యాగ్రహానికి మరొక పేరు శాసనోల్లంఘనోద్యమం. దీనినే పౌర
నియమ అతిక్రమణ ఉద్యమం అని కూడా అంటారు. సబర్మతి గాంధీజీ ఆశ్రమం ఉన్న ప్రాంతం. పోర్‌బందర్
గాంధీజీ జన్మస్థలం, వార్థాలో 1937లో బేసిక్ ఎడ్యుకేషన్‌ను గాంధీజీ ప్రకటించాడు.

4. జతపరచండి.
జాబితా-1
1. అస్సాం కేసరి
2. పంజాబ్ కేసరి
3. దేశబందు
4. దీనబందు
జాబితా-2
ఎ. సి.ఎఫ్. ఆండ్రూస్
బి. చిత్తరంజన్‌దాస్
సి. లాలాలజపతిరాయ్
డి. అంబికారాయ్ చౌదరి ↑
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
 
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

View Answer

సమాధానం: 3
వివరణ: అసోం (అస్సాం)కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు అంబికారాయ్ చౌదరి, లాలా లజపతిరాయ్
ఆర్య సమాజ సిద్ధాంతాల వ్యాప్తి, అతివాద జాతీయవాద భావాలు ఉన్న స్వాతంత్రోద్యమ నాయకుడు.
బెంగాల్‌వాసి చిత్తరంజన్ దాస్ నేతాజీ బోస్‌కు గురువు. సి.ఎఫ్. ఆండ్రూస్ మానవతా విలువలు కలిగిన
మేధావి.

5. అతివాదులకు నాయకుడెవరు?
1) లాలా లజపతిరాయ్
2) భగత్‌సింగ్
3) బాలగంగాధర తిలక్
4) బిపిన్ చంద్రపాల్

View Answer

సమాధానం: 3
వివరణ: 1907లో సూరత్ ఐఎన్‌సీ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ నాయకులు అతివాదులు,
మితవాదులుగా తపతీ నది సాక్షిగా విడిపోయారు. సిద్ధాంతపరమైన విభేదాలే దీనికి కారణం. మితవాదులకు
గోపాలకృష్ణ గోఖలే, అతివాదులకు బాలగంగాధర్ తిలక్ నాయకులు. 1916లో లక్నో ఐఎన్‌సీలో తిరిగి
ఏకమయ్యారు.

6. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?


1) కటక్
2) కలకత్తా
3) ముర్షిదాబాద్
4) భువనేశ్వర్

View Answer


సమాధానం: 1  
వివరణ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కటక్ (ఒడిశా)లో 1897 జనవరి 23 తేదీన జన్మించారు. తండ్రి
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English
జానకీనాధ్ బోస్, తల్లి ప్రభావతి. భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. ఇండియన్ నేషనల్
ఆర్మీ (ఐఎన్‌ఎ)ని స్థాపించి స్వాతంత్రోద్యమానికి కృషి చేశారు. యాన్ ఇండియన్ ఫిలిగ్రిమ్, స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం
గ్రంథాలు రాశారు.

7. ‘గీతా రహస్యం’ గ్రంథకర్త ఎవరు?


1) గోపాలకృష్ణ గోఖలే
2) బిపిన్ చంద్రపాల్
3) లాలా లజపతిరాయ్
4) బాలగంగాధర తిలక్

View Answer

సమాధానం: 4
వివరణ: బాలగంగాధర తిలక్ ‘గీతారహస్యం’ రాశారు. అలాగే ‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ గ్రంథాన్ని కూడా
రాశారు. చలి ప్రాంతం నుంచి ఆర్యులు సప్త సింధూ ప్రాంతానికి వచ్చారు అని తెలియజేశాడు. ఈ
సిద్ధాంతాన్నే ‘ధృవప్రాంత సిద్ధాంతం’ అని కూడా అంటారు.

8. జతపరచండి.
జాబితా-1
1. మీరాబెన్
2. మార్గరేట్ నోబుల్
3. మేడం బికాజీకామా
4. కాదింబినీ గంగూలీ
జాబితా-2
ఎ. ఐఎన్‌సీ సమావేశాలకు హాజరైన తొలి మహిళ
బి. భారతదేశ స్వాతంత్య్ర విప్లవానికి మాత
సి. గాంధీజీ శిష్యురాలు
డి. స్వామి వివేకానంద శిష్యురాలు
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ

View Answer  
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌
సమాధానం: 2
English

వివరణ: మీరాబెన్ అసలు పేరు మాండలీన్ స్లేడ్ గాంధీజీ శిష్యురాలు. సిస్టర్ నివేదిత అని కూడా పిలువబడిన
మార్గరేట్ నోబుల్ స్వామి వివేకానంద శిష్యురాలు, జర్మనీలోని స్టట్‌గట్‌లో భారతదేశ పతాకాన్ని ఎగురవేసిన
మహిళ మేడం బికాజీ కామా, కలకత్తా విశ్వవిద్యాలయంలో వైద్య శాస్త్ర పట్టబద్దురాలై ఐఎన్‌సీ సమావేశాలకు
కూడా హాజరైన తొలి వనిత కాదింబినీ గంగూలీ.

9. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరితీశారు?


1) 1929 డిసెంబర్ 19
2) 1930 మార్చి 12
3) 1931 మార్చి 23
4) 1942 ఆగస్ట్ 9

View Answer

సమాధానం: 3
వివరణ: షహీద్ భగత్‌సింగ్‌ను లాహోర్ కుట్రకేసులో ఇరికించి రావి నదీతీరాన లాహోర్‌లో ఉరితీయడం
జరిగింది. ఈయనతోపాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను కూడా ఉరితీశారు. భగత్‌సింగ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’
(విప్లవం వర్థిల్లాలి) అనే నినాదాన్ని ఇచ్చాడు. 1931 మార్చి 23న భగవంతుని సన్నిధికి చేరుకున్నాడు.
స్వాతంత్య్ర సమరయోధులలో కొందరికి ఆయన స్ఫూర్తి ప్రధాత.

10. ‘భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు’ అనే మన దేశ ప్రతిజ్ఞ రాసిందెవరు?


1) శ్యామ్‌లాల్ పర్షాద్‌గుప్త
2) పైడిమర్రి వెంకటసుబ్బారావు
3) చందాల కేశవదాసు
4) దేవులపల్లి కృష్ణశాస్త్రి

View Answer

సమాధానం: 2
వివరణ: భారతదేశ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకటసుబ్బారావు రాశారు. ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా
అన్నెపర్తి. ‘ఝండా ఊంఛారహే హమారా’ రాసింది శ్యాంలాల్ పర్షాద్ గుప్తా, తొలి తెలుగు చలనచిత్ర గేయ
రచయిత చందాల కేశవదాసు, ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి...’ రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి.


11. 1908లో బాల గంగాధర తిలక్‌ను బ్రిటిష్‌వారు ఎక్కడ నిర్భంధించారు?
 
1) పూనా
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English
2) అండమాన్
3) కోయంబత్తూర్
4) మాండలే

View Answer

సమాధానం: 4
వివరణ: తిలక్‌ను స్వదేశీ ఉద్యమ సమయంలో దేశద్రోహ నేరం మోపి ఆరేళ్లు ప్రవాస శిక్ష విధించి మాండలే
(బర్మా) జైలులో నిర్భంధించారు. ఆ జైలులోనే ‘గీతా రహస్యం’ అనే గ్రంథాన్ని రాశారు. ‘భారతదేశ అశాంతి
జనకుడు’ అని వాలంటైన్ చిరోల్ అనే ఆంగ్లేయుడు ఈయనను వ్యంగ్యంగా అభివర్ణించాడు. బి.జి. తిలక్ అని
ఈయనను ముద్దుగా పిలుస్తారు.

12. జనగణమన గీతాన్ని తొలిసారిగా ఏ ఐఎన్‌సీ సమావేశంలో ఆలపించారు?


1) కలకత్తా - 1911
2) లక్నో - 1916
3) బెల్గాం - 1924
4) కాన్పూర్ - 1925

View Answer

సమాధానం: 1
వివరణ: రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన జనగణమన ప్రథమంగా తత్వబోధిని పత్రికలో ప్రచురితమైంది.
1911 కలకత్తా ఐఎన్‌సీ సమావేశంలో దీనిని తొలసారిగా ఆలపించారు. 1919లో దీనిని బి.టి. కాలేజి
(మదనపల్లె) జేమ్స్ కజిన్‌‌స అనే ప్రిన్సిపాల్‌తో కలిసి మార్గరేట్ కజిన్‌‌స స్వరబద్ధం చేయడం జరిగింది. 1950
జనవరి 24న జాతీయ గీతంగా రాజ్యాంగసభ ఆమోదించింది.

13.వందేమాతరం ఉద్యమం ప్రారంభ కేంద్రం ఏది?


1) ఢిల్లీ
2) మీరట్
3) కలకత్తా
4) సిమ్లా

View Answer ↑
సమాధానం: 3  
వివరణ: 1905లో లార్‌‌డ కర్జన్ బెంగాల్‌ను రెండుగా విభజించిన తర్వాత కలకత్తాలో 1905 ఆగస్ట్7న
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English
కలకత్తా టౌన్ హాల్‌లో నిరసన సభ జరిగింది. సురేంద్రనాధ్ బెన ర్జీ, రవీంద్రనాధ్ ఠాగూర్ లాంటి మేధావులు
పాల్గొన్నారు. రక్షాబంధన్ (నేను నీకు రక్ష నాకు నీవు రక్ష మనం దేశానికి రక్ష)ను రవీంద్రనాధ్ ఠాగూర్
ప్రారంభించాడు. ఈ కార్యక్రమాలకు కలకత్తా కేంద్రమైంది. 1905 అక్టోబర్ 16 నుంచి బెంగాల్ విభజన
అమలులోకి వచ్చింది.

14. స్వదేశీ సంస్థానాల విలీనీకరణ కాలంలో కాశ్మీర్ పాలకుడు ఎవరు?


1) దులీప్‌సింగ్
2) రంజిత్‌సింగ్
3) హరిసింగ్
4) ఖాన్ బహదూర్‌ఖాన్

View Answer

సమాధానం: 3
వివరణ: 1947 ఆగస్ట్ 15 తేదిన భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత స్వదేశీ సంస్థానాల విలీనీకరణ
పెద్ద సమస్యగా మారింది. సర్థార్ వల్లభాయ్ పటేల్ ధృఢ సంకల్పంతో 562 పైచిలుకు సంస్థానాలు భారత
భూభాగంలో విలీనం అయ్యాయి. హైదరాబాద్, జునాఘడ్, కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో వివిధ చర్యల ద్వారా
భారత్‌లో విలీనం చేయడం జరిగింది. ఆనాటి కాశ్మీర్ పాలకుడు హరిసింగ్ విలీనానికి అంగీకరించి సర్థార్
పటేల్‌కు లొంగిపోయాడు.

15. మంత్రిత్రయ రాయబారంలో ఉన్న సభ్యులెవరు?


1) పెథిక్ లారెన్‌‌స
2) సర్ స్ట్రాఫర్‌‌డ క్రిప్స్
3) ఎ.వి. అలెగ్జాండర్
4) పై అందరూ

View Answer

సమాధానం: 4
వివరణ: రెండో ప్రపంచ యుద్ధానంతరం ఇంగ్లండ్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లీ ప్రధాని
అయ్యాడు. భారత స్వాతంత్రోద్యమం పట్ల ఆయనకు సానుభూతి ఉంది. 1946లో మంత్రిత్రయ
రాయబారంను (పెథిక్ లారెన్‌‌స, సర్ స్ట్రాఫర్‌‌డ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్) భారత్ పంపెను. వీరు మన దేశ
నాయకులతో చర్చించి, కొన్ని సూచనలు చేశారు.
అవి..

1) దేశ విభజన వద్దు
2) కాంగ్రెస్ ముస్లింలీగ్‌తో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
 
3) రాజ్యాంగ నిర్మాణమునకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు
4) తర్వాత ఆంగ్లేయులు
టీఎస్‌పీఎస్సీ భారత్ వదిలి
స్టడీ మెటీరియల్ వెళ్తారు.సక్సెస్ స్టోరీస్ గైడెన్స్
బిట్ బ్యాంక్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English

16. 1946 ఆగస్ట్ 16న మహ్మదాలీ జిన్నా ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపు ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
1) ఆంగ్లేయులను తక్షణం భారత్ నుంచి వెళ్ళగొట్టడానికి
2) బలప్రయోగం ద్వారా పాకిస్తాన్ సాధన కోసం
3) ముస్లిం విద్యాసంస్థల నిధుల మంజూరు కోసం
4) ఏదీకాదు

View Answer

సమాధానం: 2
వివరణ: మంత్రిత్రయ రాయబారం తర్వాత పాకిస్తాన్ ఏర్పాటుకు అవకాశం లేదని మహ్మదాలీ జిన్నా
తలిచాడు. పాకిస్తాన్ సాధన కోసం ప్రత్యక్ష చర్యలకు పురికొల్పాడు. దీనినే ఈజీట్ఛఛ్టి అఛ్టిజీౌ ఛ్చీడ అంటారు.
ఈ చర్య ద్వారా కలకత్తా, నవకాళీ, అమృత్‌సర్ మొదలగు ప్రాంతాలలో హిందూ, ముస్లింల మధ్య హత్యలు
జరిగాయి. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ‘ఇది భారత చరిత్రలో
గాఢాంధకార దినం’ అని వ్యాఖ్యానించాడు.

17. హిందూ మహాసభను 1915లో స్థాపించింది ఎవరు?


1) మదన్ మోహన్ మాలవ్య
2) డాక్టర్ హెగ్డేవార్
3) ఎం.ఎస్. గోల్వాల్కర్
4) వి.డి. సావర్కర్

View Answer

సమాధానం: 1
వివరణ: హిందువులు, హిందూ సంస్కృతి, హిందూ రాజ్యం తన లక్ష్యాలని హిందూ మహాసభ ప్రకటించింది.
ఈ సంస్థను 1915లో మదన్ మోహన్ మాలవ్య స్థాపించాడు. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది.
ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)ను డాక్టర్ హెగ్డేవార్ స్థాపించారు. ఎం.ఎస్. గోల్వాల్కర్ (మాధవ్
సదాశివ్ గోల్వాల్కర్) ఈయనను ‘గురూజీ’ అని ముద్దుగా పిలుస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థతో సుదీర్ఘ సంబంధం
కలిగినవారు. వి.డి. సావర్కర్ ‘హిందువులను వారి దేశంలోనే దాసుల స్థాయికి దిగజార్చవద్దు’ అని అన్నారు.


18. 1929లో చేసిన శారదా చట్టం అమలులోకి వచ్చే నాటికి భారత వైశ్రాయి ఎవరు?
 
1) లార్‌‌డ ఇర్విన్
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English
2) లార్‌‌డ లిన్‌లిత్‌గో
3) లార్‌‌డ వెవేల్
4) లార్‌‌డ కర్జన్

View Answer

సమాధానం: 1
వివరణ: బాల్య వివాహాలను నిరోధించడానికి హరిబిలాస్ శారదా చ ట్టంను 1929లో చేశారు. 1930 నుంచి
అమలులోనికి వచ్చింది. ఆనాటి వైశ్రాయి లార్‌‌డ ఇర్విన్ ఈ చట్టం ద్వారా స్త్రీల కనీస వివాహ వయస్సు 14,
బాలుర వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు.

19. జతపరచండి.
సంస్థ:
1. ఎఐటీయూసీ
2. ఐఎన్‌ఎ
3. ఎస్‌ఎన్ డీపీవై
4. ఐఎన్‌సీ
స్థాపకులు:
ఎ. నేతాజీ సుభాష్ చంద్రబోస్
బి. శ్రీ నారాయణగురు
సి. ఎ.ఓ. హ్యుమ్
డి. ఎన్.ఎం. జోషి
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

View Answer

సమాధానం: 3
వివరణ: 1885లో భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)ని ఆంగ్లేయుడు. ఎ.ఓ. హ్యూమ్ స్థాపించాడు. శ్రీ
నారాయణ ధర్మపరిపాలనాయోగంను (ఎస్‌ఎన్‌డీపీవై) శ్రీనారాయణగారు కేరళలో స్థాపించారు. నేతాజీ


సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని (ఐఎన్‌ఎ) 1943లో సింగపూర్‌లో వ్యవస్థీకరించాడు. ఆల్
 
ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌ను ఎన్.ఎం. జోషి స్థాపించాడు.
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English

20. రాజాజీ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రకటించారు?


1) 1942
2) 1943
3) 1944
4) 1946

View Answer

సమాధానం: 3
వివరణ: సి.రాజగోపాలాచారి (రాజాజీ) ముస్లింలీగ్, భారత జాతీయ కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయ
అనిశ్చితిని తొలగించడానికి ఒక ఫార్ములా రూపొందించారు. దీనినే సి.ఆర్. ఫార్ములా అంటారు. ముస్లింలీగ్
తర్వాత ఐఎన్‌సీ నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరాలి. వాయవ్య, ఈశాన్య రాష్ట్రాలలో ముస్లింలు
అధికంగా ఉన్న చోట ప్రజాభిప్రాయ సేకరణతో దేశ విభజన సూత్రంను నిర్థేశించుట, ఇవి అన్నీ బ్రిటీష్‌వారు
పూర్తిగా భారత్‌కు అధికారం బదిలీ చేసినప్పుడే సాధ్యం. కాబట్టి ఈ ఫార్ములాను జిన్నా తిరస్కరించాడు.

Published date : 17 Jan 2020 04:13PM

 Tags

TSPSC Groups TSPSC Practice Test TSPSC Indian History

Photo Stories


5 Harsh Life Truths Top 10 Most All About Parliament 8 Mandatory
 
You Should Accept Populated Cities in 2.0 requirements while
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English
the .. apply..

View All >>

You May Like Sponsored Links by Taboola

Earn a Doctorate under the Expert Mentorship of ESGCI Faculty


upGrad | ESGCI Paris Learn More

Have summer fruits to be happy


Happiest Health

More Articles

Most Read

TSPSC Groups Applications 2023 : గ్రూప్-2, 3, 4 పోస్టులకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే...? ఈ కామన్‌
సిలబస్ చ‌దివితే..

TSPSC Group 2 Exam Dates 2023 : గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఇవే.. ఈ సారి ప‌రీక్ష‌ల‌ను..

TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

Telangana History for Competitive Exams: 'నిజాం' అనే బిరుదు స్వీకరించిన తొలి అసఫ్‌జాహీ రాజు ఎవ‌రు?

Telangana History Bitbank in Telugu: 'నైజాం పౌరసంఘం' మొదటి అధ్యక్షుడు ఎవ‌రు?

Telangana History Bitbank in Telugu: 'రామప్ప దేవాలయం'ను ఏ సంవత్సరంలో నిర్మించారు?

Indian Polity Study Material: రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతి ఏది?

Earn a Doctorate under the Expert Mentorship of ESGCI Faculty


Conduct research in the field of your choice with 1:1 thesis supervision from the experts
upGrad | ESGCI Paris | Sponsored Learn More

Have summer fruits to be happy ↑


Happily enjoy these four summer fruits to stay chilled hydrated and healthy
Happiest Health | Sponsored  
Read More

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English

Complete protection with iPru All-in-one Term Plan


ICICI Pru Life Insurance Plan | Sponsored Get Quote

Life Cover of 1cr at optimum rates with iPS Plan


ICICI Pru Life Insurance Plan | Sponsored Get Quote

These 2 Vegetables Will Kill Your Belly And Arm Fat Overnight!
Student Discovery | Sponsored

Tenth Class Marks: ఆ అభ్యర్థికి టెన్త్ లో 600కు 600 మార్కులు


పదో తరగతిలో 600కు 600 మార్కులు సాధించడం సాధ్యమయ్యే పనేనా?! కానీ ఓ అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు
చేసిన అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి.
Sakshi Education

Lose Belly Fat Without Surgery (See How)


Fat Removal | Search ads | Sponsored Search Now

Reduce Belly Fat Within Few Days


Cash On Delivery and Free Shipping Available
spikefitness | Sponsored Shop Now

APPSC Group1 & 2 Posts Notification 2023 : గుడ్‌న్యూస్‌.. గ్రూ ప్‌-1, గ్రూ ప్‌-2 నోటిఫికేషన్లకు↑
సీఎం గ్రీన్సి
‌ గ్నల్‌.. మొత్తం ఎన్ని పోస్టు లంటే..?
Sakshi Education
 
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English
Hyderabad: Laser Belly Fat Removal Cost (Current Price)
Belly Fat Removal | Search Ads | Sponsored

Related Articles

Indian History Quiz in Telugu: భారతదేశ చరిత్రలో చివరి పీష్వా ఎవరు?

Indian History Bitbank in Telugu: వందేమాతరం గేయాన్ని మొదట ఏ భాషలో రాశారు?

Indian History Bitbank: సూఫీ గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు?

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది?

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరితీశారు?

View all >>

Latest

Telangana Geography Bit Bank in Telugu: మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?

Telangana History Quiz in Telugu: మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఏ సంవత్సరంలో 'రాజ్‌ ప్రముఖ్‌'గా నియమితులయ్యారు?

Telangana History Quiz in Telugu: తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాల్లో ఉన్న పద్యాలు?

Indian History Quiz in Telugu: భారతదేశ చరిత్రలో చివరి పీష్వా ఎవరు?

Indian Geography: భారతదేశం - భౌతిక స్వరూపాలు.. హిమాద్రి పర్వత శ్రేణుల సరాసరి ఎత్తు ఎంత‌?

TSPSC Groups 1,2,3 Best Success Tips in Telugu : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1,2,3కి ఎలా చ‌ద‌వాలంటే..?


 
టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ సక్సెస్ స్టోరీస్ గైడెన్స్ సిలబస్ ప్రివియస్‌ పేపర్స్ ఎఫ్‌ఏక్యూస్‌ English

Class AP 10th Class TS 10th Class AP Intermediate TS Intermediate Engineering FAQs

Study Abroad Learning English Careers Current Affairs General Essays Budgets & Surveys

General Knowledge Exams ENTRANCE EXAMS EAMCET NEET JEE(MAIN & ADV) LAWCET

ICET AP/TS Polycet CSIR UGC NET Central Exams BANK EXAMS Civil Services RRB Exams

SSC Exams STATE EXAMS APPSC TSPSC TET/TRT/DSC AP Police TS Police

Panchayat secretary VRO-VRA AP Secretariat Jobs Notifications Education News Admissions

Fellowships Scholarships Internships University Updates Exam Reminder Hall Ticket Results

Online Courses Prev. Papers E-Store Videos Online Tests

Contact Us | About Us | Privacy Policy

© 2023 Sakshi Education, All rights reserved.

Powered by Yodasoft Technologies Pvt Ltd

You might also like