Test

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 180

5/19/23, 4:13 PM

test

Written by

Udit

about:blank 1/180
5/19/23, 4:13 PM

EXT. COUNTRY SIDE FOREST ROADS - EVENING

VFX: Establish the location, how that area has become


from greenish it into yellowish showing the intensity
of the drough. People coming into that areas as small
villages formed, later leading to 20 villages across.
Wakanda2 establishing shots.

VFX: ఆకాశం నుంచి రాలుతున్న నీటి బిందువు; ఆ ప్రాంతం మారిన విశేషాలు.

DIRECTOR

13 శతాబ్దం లో, పాలేటి గంగను దాటి, నెల్లూరు


వైపు వలస వచ్చిన యాదవుల రాజైన యలమంచలి
కాటమరాజు పై చోడ రాజైన నల్ల సిద్ది దండెత్తి
వచ్చినప్పుడు, ఆయన తో పాటు పోరుకు యగబడి న
అలమందలలో, ఈ నెల్లిమన్ధ ఒకటి.

ఆ ఎర్రగడ్డపాడు పోరుకు యగాబడిన రాజు, యనక్కి


రాకపాయే, తోడోచ్చిన పాలేటి గంగమ్మ ఆ కాల గర్భం
లో కలిసిపాయే. కాల ప్రవాహం లో మందలు కాస్తా
పుట్ట కో ఊరు, వాగు కో ఊరు గా మరిపాయే, ఆ
అమ్మతో పాటు, ఆ ఊర్లల్లో పచ్చదనము కూడా
ఇంకిపాయే.

అస్సలే బొందారాలు తెగిన భుమాయే, దశాబ్దా లు


మారినా కరువు ఈ ప్రాంతాన్ని వదిలి
పోకపాయే. కరుణించిన యంకన్న.. గొంతారిన మా
ఊర్లకి ఆ గంగమ్మను సాగనంపే.. 

ఓపెన్ చేస్తే.. రెండు ఎద్దు ల బండ్లు వక్కల మూటలు తో, వొకదాని వెంట వొకటి చిన్నగా
అడవి మర్గాన వెళ్తుంటాయి. ఆ రెండు బండ్లు , వాటి కి వెనకాల లాంతర్లు
యాలాడుతూ, బండ్లు నిండా మూటలు, వెనకాల వాటికి కాపలాగా ఒబులేషు
నడుచుకుంటూ వస్తు న్నాడు. రెండవ బండి ని తోలుతూ వీరన్న, ధర్మన్న ఆ బన్డి మీద
కుర్చీని, వక్కాకు వేసుకుంటూ, వక్క దొరక్క పోతే, ఆ వక్కల మూట లో ఏలు పెట్టి,
అందులోనుంచి వోక్కను తీసుకొని, వక్కాకు వేసుకొని వస్తు న్నారు. బన్డి శబ్దా లు, ఆ
బండల్లో వాళ్ళు ఎద్దు లని గడిలించడం

వీరన్న
( VO )

ఆ హయ్!

about:blank 2/180
5/19/23, 4:13 PM

ధర్మన్న - వీరన్నకి చిన్నాయన వరస. తను చేసిన బొక్క వల్ల, చిన్నగాఒక వొక్క బండి
తోలుతున్న వీరన్న మీద పడుతుంది.

అప్పటిదాకా చిన్నగా వెనకాల వస్తు న్నా ఎద్దు ల బన్డి హటాత్తు గా ఒక వేప చెట్టు దగ్గర వచ్చి
ఆగిపోతుంది.

వీరన్న

చిన్నాయినా, మల్లి వోక్కల మూటకి బొక్క పెడితివివా?


ఇట్లైతె, ఇంటికి.. వోక్కలు కాదు ఉత్త సంచులే
వస్తా యి.

అంటే, అప్పుడు తన మీద ఒక చినుకు పడటం తో, పైకి చూసి.

ధర్మన్న

నువ్వు ముందర చూసి నడుపు రా, వాన దిగే టట్టు


ఉంది

అంటే.. ఇంత లో ఒక చుక్క వర్షం బిందువు పైన ఉన్న ఒక మూట లో పడుతుంది.


అప్పుడు చిన్న గా ఉరుము తుంది.. అప్పుడు, వొక్క సారిగా ఎద్దల బండి
నిలబడుతుంది

వీరన్న

ఆ!!.. ఏయ్.. ఎజ్జ.. పదే!! ఏయ్..

అని అదిలిస్తా డు, కాని అవి బెదురుతూ, వెనకడుగు వేస్తా యి, అపుడు..

ధర్మన్న

ఏమైంది రా ఈరిగా?

అనగానే వీరన్న ధర్మన్న తో

వీరన్న

యాల్నో ఎద్దు లు, బెదురుతాఉండాయి, చిన్నాయనా!.

అప్పుడు, ధర్మన్న వీరన్న తో

ధర్మన్న

about:blank 3/180
5/19/23, 4:13 PM

ఇంకో రెండు పర్లాంగులలో ఊరు వచ్చేస్తుంది, ఆ


గూటం తీసుకొని, ఎగదోలు రా!

అని అంటే అప్పుడు, వీరన్న, తన కుడి పక్కన ఉన్న గూటాన్ని, తీసుకొని, ఎద్దు లని
అదిలిస్తా డు, కాని అవి, ససేమేరా ముందుకు వొక్క అడుగు కుడా పెట్టా వు.

వీరన్న

ఉహు!, ఎనక బోరువు అనుకుంటా!, మిట్ట లాగలేక


పోతా ఉండాయి.

అప్పుడు, ధర్మన్న వోబులేషు తో

ధర్మన్న

రేయి ఓబీ గా!

వోబులేషు

వోయి!

ధర్మన్న

ఆ ఎనకాల చక్రా ల కి రాయి అడ్డపెట్టు .

వోబులేషు

నోవ్! అదిలిచ్చుమను నా అట్టా , ఎక్కేస్తా యి!

ధర్మన్న

రేయి.. ముందు నువ్వు చెప్పిన పని చెయ్య!

అప్పుడు, బన్డి ఎనకాల ఉన్న వోబులేషు, దారి పక్కన ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి బన్డి
చక్రా లకి అడ్డు గా పెడుతాడు. అప్పుడు ఎద్దు లు ఉనట్టుంది కింద కుసుంటాయి, బండి కాస్త
కుడివైపు కు వోరిపోతుంది, ఒక మూట కిందకి పడుతుంది, ధర్మన్న పడిపోతూ, కిందకి
దూకుతాడు..

పడిన వక్కల మూటు కాస్తా .. చల్లా చెదురు అవుతుంది, అందులో నుంచి చిన్నపాటి
నల్లటి రాయి కూడా దోర్లు కుంటూ.. దోర్లు కుంటూ కొద్ది దూరం లో పడుతుంది,
అప్పుడు వాటిని చూసి, ధర్మాన్న.

ధర్మన్న

about:blank 4/180
5/19/23, 4:13 PM

రేయి ఓబీ..నువ్వు మూట మూతి సరిగ్గా కట్టినట్టు


లా, వక్కలన్ని పడిపోయినాయి.. వచ్చి ఏరి సంచికి
పోద్దు వు రా!

అంటే వోబులేషు వచ్చి ఆ వక్కాలన్ని ఎరుతుంటాడు,

ధర్మన్న
( VO )

యీరీగా!, ఎద్దు లు ఎగబోస్తా ఉండాయి గాని, ముందు


వాటిని ఇప్పి, ఆ చెట్టు కు కట్టు బో!

అప్పుడు తన చేతికి ఆ రాయి తగలటం తొ, దాన్ని తీసి వెనక్కి విసురుతాడు, అప్పుడు
ఆ రాయి కాస్తా అటు గా ఉన్న వేప చెట్టు కింద కి పోయి నిలబడుతుంది. ఇంతలో ఒక
ముత్తైదువు చెయ్యి వోబులేషు వెనక నుంచి వచ్చి అతన్ని తట్టి పిలిస్తుంది. అప్పుడు
వోబులేషు వెనక్కి తిరిగి చూస్తా డు.. అప్పుడు ఆ వేప చెట్టు మొదులు వైపు చూస్తే,
తను విసిరేసిన రాయి నిలబడి ఉంటుంది, అందులో లో నుంచి, చిన్నగా వెలుగున్న అకండ
దీపం.. కనిపివ్వటం తో, వోబులేషు బిత్తర పోతాడు.. అది చూసి, వీరన్న, ధర్మన్న
కూడా కంగు తింటారు.. ధర్మన్న మోకాళ్ళ మీద నిలబడటం చూసి వోబులేషు, వీరన్న
లు కూడా మోకాళ్ళ మీద నిలబడి ఆ బండని చూసి ముక్కుతారు.

వోబులేషు

అమ్మా!, నువ్వు ఎవరో తెలియక అపచారం


జరిగిపాయే. క్షమించి, మా తో వచ్చి, మా ఇళ్ళు
వాకిలి, పిల్లా పాప, గొడ్డు గోదా సల్లగా ఉండేటట్టు
చూడు తల్లే.

అని మోకాలి మీద పడి వేడుకుంటాడు. అప్పుడు ఆ జ్యోతి కాస్త అకండ ద్రావాలన జ్వాల
గా ఎగిసిపడటం తో, ధర్మన్న కు, ఆ దేవత అక్కడే ఉండాలనుకుంటోంది అర్ధం చేసుకొని.

ధర్మన్న

అర్ధమైంనాది అమ్మా, నా ఇంటి కి, ఆడబిడ్డ లా


వస్తా వనుకుంటి, కాని మా ఊర్లకి కాపలాగా ఈడ
కుసుంటివి. నీ ఇష్టము ఎట్లా ఉంటే అట్లే గాని తల్లి.

అంటే, ఆ మంట కాస్తా మళ్ళి దీపం లా మారిపోతుంది, అప్పుడు ధర్మన్న తన సంచి


లోంచి ఒక గులాబీ రంగు చీర, పసుపు జాకెట్టు , వాక్క ఆకులు, పచ్చ గాజులు,
చవాకు, పూలు తీసుకొచ్చి, ఆ రాయి కి పసుపు పూసి, కుంకుమ తో రూపాయి అంత
బొట్టు పెట్టి, కడ్డిలు తిప్పి

about:blank 5/180
5/19/23, 4:13 PM

ధర్మన్న

ఇక నుండి ప్రతి ఏడు, నా ఇంటి ఆడ బిడ్డలతో


పాటు నీకు చీర సారె ఇచ్చి పూజలు జరిపిస్తా ము.
నీకు సమ్మతమే నా తల్లి.. చెప్పమ్మా.. చెప్పు.

అని, ఆప్పుడు ఆ రాయి మీద ఉన్న మందారం పువ్వు ఆ చీర మీద పడుతుంది.
అప్పుడు ధర్మన్న, ఆది చూసి బోర్లా పడి పారవశ్యంతో మొక్కుతాడు. అది చూసి మిగతా
అందరూ కూడా ముక్కుంటాడు.

EXT. COUNTRY SIDE PADDY FIELDS - EVENING

జమిందారి పని మీద వెళ్ళిన ఎగువపల్లి రెడ్డి (VAO) రెడ్డోళ్ళ ఎంకటరాముడు, తన గుర్రం
తో, తిరిగి ఎగువపల్లి వస్తుండగా, అలసి.. సేద తీర్చుకోడానికి ఓక చెట్టు కింద
పడుకుంటాడు. బాగా దూర ప్రయాణం చేసినట్టు ఉన్నాడు, ఇట్టే నిద్ర పట్టేసింది.

ఆకాశవాణి

ఎంకటరాముడు... ఓ ఎంకటరాముడు... నన్ను


ఇక్కడ ఎండ కి, వానల కి వదిలేసి ఎల్లిపోయినారు
రా. పట్టించుకునే వాళ్ళే లేకపాయిరే.

అని ఆకాశవాణి వినిపించడం తో, పడుకున్న స్థలం లోనే, తనని ఆ శబ్దం వస్తు న్నా
(కుడి) వైపు ఎత్తి చూస్తా డు. చుట్టూ మాయాన్ధా కారం, వేప చెట్టు మొదలు లో బోగి
మంటలు మండుతున్నటు గా వెలుగులు, ఆ కాంతులు ఆకాశానికి భూమికి నిచ్చాన
వేసినట్టు గా ఉంటాయి. ఆ వెలుగులు ఎంకటరాముడు ముఖం నిండా కనిపిస్తుంటాయి.
అది చూసి, ఎంకటరాముడు, దిగ్గున లేచి, తన మోకాళ్ళ పైన కూర్చుంటాడు, ఆ
వెలుగు ను ఎగా దిగా చూస్తా డు, ఆ వెలుగు మధ్యలో నల్లటి బండ, త్రిశూలం, కత్తి
ఎంకటరాముడు కంటి పాప లో స్పష్టంగా కనిపిస్తుంటుంది.

ఎంకటరాముడు

నువ్వు ఈడ ఉండావు అని నిదర్శనం సూపించినావు


అమ్మా. అర్థమైంది తల్లి.. నీకు గుడి కట్టిచ్చి,
దిన్నమూ నీ పూజల కి ఏ లోటు రాకుండా దగ్గర ఉండి
నేనే చేయిస్తా ను.ఇప్పుడై నా శాంతించి, మా గ్రామాల్ని
సల్ల గా చూడు తల్లే.

అని, మొక్కుకుంటాడు, ఆ భీకర మంటలు కాస్తా సరళమైన అఖండ దీపం గా మారి,


ఆ దీప కాంతి, వేప చెట్టు మొదలు నుంచి అదృశ్య కంచ లా గా మారి, ఆ చుట్టు
పక్కల గ్రామాలను రక్షణ కంచ గా మారి అదృశ్యం అవుతుంది.

about:blank 6/180
5/19/23, 4:13 PM

EXT. NELLIMANDA TEMPLE - EVENING/DUSK

ఊరంతా, పండగ వాతావరణం, టై మ్ ల్యాప్స్ లో, ఆ వేప చెట్టు కింద గుడి ఉండటం,
పందిళ్ళు, petromax లైట్ల, దివిటీల మధ్య, గుడి ఎదురుగ్గా, ఎనుపోతు, పోటేలికి
పూజ చేసి, పెద్ద డప్పులతో.. పాలేటి గంగమ్మ జాతర చాటింపు. వెయ్యటం.

EXT. REDDY HOUSE - NIGHT

ఫాస్ట్ కట్స్ లో, పెద్ద ఇల్లు , ఆ ఇంటి గాదె ఇంట్లో కుండ లోనుంచి పాలేటి గంగమ్మను
తియ్యటం. 

అమ్మవారి విగ్రహాన్ని ఆ ఇంటి ముందు కు తీసుకొచ్చి, అమ్మవారి కి మంగళ స్నానం


చేయించడం, అలంకరిచటం. 

అక్కడికి పూజారి, అమ్మవారి వేషధారణ, అలంకరణ వేసుకొని, అమ్మ వారికి పూజ చేసి,
ఆమె మేడలో ఒక రుద్రాక్ష మాల ను వేసి, తన మేడలో ఇంకొక రుద్రాక్ష
వేసుకొని, మందార మాల ఆ అమ్మవారికి అలంకరిచి, ప్రాణ ప్రతిష్ట పూజ చేస్తా డు,
అయ్యాక హారతి ఇస్తా డు.

ఆ తరవాత అమ్మ వారి ఉత్సవ విగ్రహాన్ని తల మీద పెట్టు కొబొతూఉంటే, అందరూ..


“కోబలి, కోబలి” అని అరుస్తా రు. మంగళ వాయిద్యాల మధ్య ఆ అమ్మవారు ఊరేగింపు
గా ఊర్లు తిరుగుతూ వెళ్తుంటారు.

వాళ్ళ ఊరికి వచ్చినందుకు వడ్రంగి వారు వచ్చి, అమ్మ కి పల్లకి ని ఇస్తా రు. అమ్మ వారిని
పల్లకి లో ఎక్కిచ్చి, పూజారి తల మీద అకండ జ్యోతి ని పట్టు కొని గుడి కి
బయలుదేరుతారు. వక్కల వాళ్ళు చీర సార ని ఇస్తా రు, ఎనుపోతు, పోటేలి ని
తీసుకొస్తా రు, ఈడిగపల్లి లో కళ్ళు కుండ వస్తుంది, ఇలా అందరిని చేరుచుకుంటూ..
తాళ మేళాలతో, పలకలు, కొమ్ముల మధ్య, కొంత మంది నాట్యం చేస్తూ, అంగ రంగ
వైబవంగా అమ్మవారు బయలుదేరుతారు.

EXT. NELLIMANDA TEMPLE - DAY/NIGHT

టై మ్ ల్యాప్స్ లో, అమ్మ వారి గుడికి రావటం, మూడు చుట్లు చుట్టటం, ముందర
ఎనుపోతు, పొట్టేలి, వెనకాల అమ్మ వారు ఆ గుడి చుట్టటం. వక్కల వాళ్ళు, చీరా సారే
తెస్తా రు, సాకలి వాళ్ళు జ్యోతి ని, ఈడిగ పల్లి నుంచి కళ్ళు కుండ వస్తుంది. పూజారి
వాళ్ళు వచ్చి, ధర్మకర్తకు, బొట్టు పెట్టి, మెడలో పూల హారం వేసి, తాంబూలం ఇచ్చి,
తన చేతిలో ధర్మ దండం పెడతారు. అప్పుడు..

పూజారి

about:blank 7/180
5/19/23, 4:13 PM

సామీ!, మా ఇంటోళ్ళు, తోటోడు, వూరి


సాకలోడు,18 ఊళ్ళోళ్ళు, ఈ పాలేటి గంగమ్మ తల్లి
జాతర జరిపేదానికి ఇక్కడ వచ్చినాము. దగ్గర ఉండి
జరిపించే దానికి మీకు సమ్మతమే నా, సమ్మతమే నా,
సమ్మతమే నా?

అంటే,

ఎంకటరాముడు

సమ్మతమే!

అంటాడు, అప్పుడు అమ్మ వారి కి కప్పిన తెర, తీసి, అమ్మవారి ని పూజించి, అమ్మ


శక్తి ని ఆ వాహనం చేసుకుంటాడు, అప్పుడు, టెంకాయ కొడతాడు, ఆ టెంకాయ లో
పువ్వు వస్తుంది, సాంబ్రాణి, కర్పూర హారతులు ఇస్తా రు. 

రచ్చ బండ మీద పెద్దలు కూర్చుంటారు. దేవర ముగించి, అమ్మవారి కి హారతి ఇచ్చే
సరికి, పూజారి లోకి పూనుతుంది, అమ్మ వారి ముందర కూర్చొని, అక్కడ ఉన్నవారి తో
మాటలు మాట్లా డుతూ, కష్ట సుఖాల్ని వింటూ, కోరిన వారికి వరాలిస్తూ వుంటుంది.

ఇంతలో అక్కడకి వీభూది పూసుకొని వున్నా అర్ధ దిగంబరులు 10 మంది అగోరాలు


వస్తా రు, అమ్మ వారిని చుసిన ప్రాయ వయస్కుడు అయిన ప్రదాన అగోరా వచ్చి గర్వంగా
నిలబడతాడు. అప్పుడు ఆ అమ్మవారిని చూసి.

అగోరా

నీ గురించి జనాలు చెప్పుకుంటూ ఉంటే విన్నాము,


నాకూ వొక కోరికుంది, తీరుస్తా వా?.. 

అంటే, అమ్మవారు అటు ఎటో చూస్తూ.. ఏమి మాట్లా డదు.. అప్పుడు, సహనం లేని
ఆ అఘోరా.. గట్టిగా

అగోరా

ఆ ముల్లోకాలనే ఏలే ఆ ముక్కంటిని మెప్పించినోడిని..


నా చెయ్యి చాచి అడుగుతున్నా .. చెప్పు తీరుస్తా వా?

అంటే.. అప్పుడు

అగోరా

పాలేటి గంగా మాట్లా డు.. తీరుస్తా వా?

అంటే, హటాత్తు గా అమ్మవారు లేచి వచ్చి ఆ అగోరా గొంతు పట్టు కుంటుంది. 

about:blank 8/180
5/19/23, 4:13 PM

ఆ అగోరా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఉరుము తుంది, ఆమె పట్టిన పట్టు కి, ఆ అగోరా కు,
కను గుడ్డు బయటకి వచ్చి, ఊపిరి ఆగిపోయే పరిస్తితి వస్తుంది.

ఇంతలో అది చూసి ఆ పూజారిని పట్టు కోవటానికి ఆ పక్కలో ఉన్న ఒక వ్యక్తి వస్తా డు,
ఆయన వైపు చూసి వురమటం తో, ఆ వ్యకి వెనక్కి వెళ్ళిపోతాడు. 

ఇంతలో గంట శబ్దం వినపడుతుంది, ఆమె తన గొంతుని వదిలేస్తుంది. ఆ అగోరా గొంతు


పట్టు కొని దగ్గుతా ఉంటాడు, అప్పుడు ఎంకటరాముడు వచ్చి.

ఎంకటరాముడు

సామి, నడిజాము కావస్తింది, అమ్మను సాగనంపాల..


ఇంక తమరూ.. 

అంటే, అమ్మవారి వైపు కోపం గా చూస్తూ, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, ఆ వెనకాల


ఉన్న అగోరాలు, అమ్మ ను చూసి, ముక్కుకొని ఆయన వెంటే వెళ్ళిపోతారు.

అమ్మకి హారతి ఇచ్చాక, అమ్మవారు పూజారి లో నుంచి వెళ్ళిపోతుంది, పూజారి అక్కడి


కక్కడే కుప్ప కులిపోతాడు.

ఆ తరవాత అమ్మ వారిని పల్లకిలో పెట్టి, తీసుకెళ్ళే సమమయంలో, ఎంకటరాముడు ఆ


పల్లకీకి ఎదురు వచ్చి, ఆపమని చేయిని చూపిస్తా డు. అప్పుడు, వెనక్కి చూస్తూ..

ఎంకటరాముడు

మునుసబూ!

అని చెయ్యి చస్తా డు, అప్పుడు

మునుసబు

అయ్యా!

అంటూ, మునుసబు ఆ పెద్దమనుషుల్లో నుంచి బయటకి వచ్చి, ఆ


పత్రాలు ఎంకటరాముడి చేతిలో పెడతాడు. ఎంకటరాముడు వాటిని దక్షణ గా ఆ పత్రాలను
ఆమ్మ కాలి దగ్గర పెడతాడు.

ఎంకటరాముడు

ఆ అమ్మ వారి నిత్య పూజలకి ఎవ్వరి దగ్గర చెయ్యి


చాచ కుండా, ఈ యాల నుంచి అమ్మ ఉండే ఈ నేల
అంతా, ఆ అమ్మకే చెందుతుంది.

about:blank 9/180
5/19/23, 4:13 PM

అంటే, అక్కడ ఉన్న పూజారి, తల వంచి నమస్కరించి

పూజారి

సంతోషం సామి, ఇందుకు, ప్రతిపలం గా ప్రతి ఏటా,


మొదటి బాణం, మొదటి యాట మా అమ్మ
తరపున మీకు ఇచ్చుకుంటాము.

అంటే

ఎంకటరాముడు

నా తదనతరం, ఈ 18 గ్రామాలకు రెడ్డి గా ఉండి


ఈ ధర్మ దండం బాద్యతలు ఎవ్వరైతే మోయగలరో,
వారే ఈ గుడికి ధర్మకర్తలుగా కొనసాగుతారు, వాళ్ళ
ఇంటికే ఈ సాంగ్యం వెళ్తుంది .

అప్పుడు తన చేతిలో ఉన్న ధర్మ దండం అమ్మ కాళ్ళ దగ్గర పెడతాడు. అక్కడే దోసిడు
చాచి అమ్మ ముందు నిలబడతాడు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు అందరూ, మల్లె
పూలు అక్షతలు తో ఆయనని ఆశీర్వదిస్తా రు . చివ్వరగా తన చేతిలో ఆ అమ్మవారి కి
అలంకరించిన మందార మాల లోనుంచి ఒక మందార పువ్వు తన దోసిట్లో పడుతుంది,
ఎంకటరాముడు చిన్నగా తల ఎత్తి పల్లకి లో ఉన్న అమ్మవారిని చూస్తా డు, ఆ పువ్వును
తీసుకొని ఎంకటరాముడు పక్కకు తప్పు కుంటాడు, అమ్మవారి పల్లకి అలా వెళ్ళిపోతుంది.

EXT. REDDY HOUSE – BED ROOM - LATER

వెంకటరాముడు, తన ఇంట్లో, గదిలో పడుకొని ఉంటాడు, అప్పుడు పాలేటమ్మ తనకి


కలో లో కనిపిస్తుంది. అప్పుడు

ఆకాశవాణి

ఎంకటరాముడు, ఎండకు ఎండి, వానకి తడుస్తు న్న


నన్ని, కోట కట్టిచి..పొంగళ్ళు పెడితివి, ఈ ఊరోల్ల
మేలు కోరి.. నన్ను బొట్టు పెట్టి పిలిచి, అంగ రంగ
వైబోగంగా జాతర చేయించి నన్ను మెప్పిస్తివి.
ఇంతటి పుణ్యకార్యాన్ని చేసిన నీకు ఒక వరము
ఇస్తు న్నాను.. ఎమికవాలో కోరుకో

అంటే

ఎంకటరాముడు

అమ్మ.. ఎన్నో తరాలుగా గోడ్డు బోయిన మా ఊర్లకు


మళ్ళి పాణం పోసి, మా నోటికి కూడు అందిస్తివి,

about:blank 10/180
5/19/23, 4:13 PM

ఇంక ఈ వరము ఎందుకు తల్లి, నీ సల్లని సూపు మా


ఊర్ల మీద ఉంటే అదే సాలు తల్లి.

అంటే

ఆకాశవాణి

ఇచ్చిన వరాన్ని వద్దంటున్నావు కనుక, నీ వంశం లో


యవ్వరు, నా గుడికి ధర్మకర్త గా ఉండి, నన్ను బొట్టు
పెట్టి పిలిచి వరము అడుగుతారో.. అట్టి వాని కిరిక ని
తీరుస్తా ను.

అంటుంది, అది విన్న వెంకటరాముడు, నిద్ర లలో నుంచి లేచి.. దిక్కులు చూస్తా డు.

EXT. NELLIMANDA TEMPLE - MORNING

ఫాస్ట్ కట్స్ లో, అమ్మ వారి గుడి దగ్గర, కొంతమంది పెద్దమనుషుల మధ్య,
ఎంకటరాముడు శిలా శాసనం చేక్కిస్తూ ఉంటాడు, అన్ని అయిన తరవాత దానికి పూజ
చేస్తా రు.

EXT. SOME VILLAGE STREETS - MORNING

ఓపెన్ చేస్తే, అదే శిలా శాసనం చోటు, పుట్ట ఆ శిలా శాసనం పైకి పెరిగిపోయి
వుంటుంది. 

CUT TO: టైం లాప్సే లో; ఫాస్ట్ కట్స్ లో, ఒక వ్యక్తీ ఊరు, ఊరా తిరిగి, తోలు
డప్పు పెట్టు కొని, దండోరా వేస్తుంటాడు.

దండోరా వ్యక్తీ

ఇనండహో ఇనండి, మన అమ్మోరికి పూజలు సేసె


పాలేటి, చడ్డ చేయబట్టి, గుడికి మైలు
అంటుకునిందని, ఆ అమ్మోరు తల్లి మన ఊరిని వదిలి
ఎల్లిపోయిందంట, అందుకు, పాలేటి కుటుంబం ఊరు
ఇడిసి వెళ్లిపోవాలని, రెడ్డి గారు తీర్మానము హో!!

అంటూ, డప్పు వాయిస్తూ, 18 ఊర్లు మొత్తం తిరుగుతూ చాటింపు వేస్తుంటాడు. అలా


ఊర్లు తిరిగే టప్పుడు, పలేల్లో ఇంటి అరుగు మీద

ముసలి1

వాళ్ళ నాయన గారు లో ఉండే సత్యం, ఈడికి


యాడిదీ, చడబుట్టినోడు, ఏదో చేసే ఉంటాడు. వీడికి
దూము దగలా!

about:blank 11/180
5/19/23, 4:13 PM

ముసలి2

బాగ చేప్తివి లే! ఆ నా బట్ట, ముసిలిది అని కూడా


చూడకుండా, జాతర లో నన్ను తోసేస నే! ఆ
అమ్మోరు చూస్తా ఉంటాదా ఏంది. 

ఊరి పొలిమేర్లలో, రచ్చ బండ మీద

వ్యక్తీ1

కుంటోడు చేసిందానికి ఇంటోడిని వంగ బెట్టి నట్టు ,


ఈడు చేసిందానికి ఆ అమ్మోరు, ఎల్లే.. పాయ కదా
రా!

వ్యక్తీ2

పొయ్యే కాలం వస్తే ఇట్లనే అయ్యేది. ఇట్లా గుడుకి


వాకండ్లు వేస్తే ఎంత అనిష్టము.

ఇంకా అక్కడ అక్కడ కూర్చున్న వారు

వ్యక్తీ3

ఆ అమ్మోరు, మంచి సత్యముఉండే తల్లి కదా,


ఇట్టాంటి, తప్పుడు నాకొడుకు వొంటిమీదకి
ఎట్లవోస్తుంది.

వ్యక్తీ4

ఆ అమ్మోరు కూడా, వులుకూ పలుకూ లేకుండా ఎల్లే


పాయ. ఇంగా ఏమేమి సుడాల్సి వత్తుందేమో.

వ్యక్తీ3

రెడ్డి వాళ్ళని తరిమేస్తే అన్నా, ఆ అమ్మోరు మళ్ళి


వస్తుందేమో సూడాల. 

ఆ చాటింపు విని, చెవులు కోరుకుకుంటూ ఉంటారు.

EXT. POOJARI HOUSE, GOLLAPALLI - MORNING

ఒక పెట్టి ఇసరకొచ్చి ముసలిఆవిడ (మునెమ్మ – పూజారి తల్లి) కాళ్ళ దగ్గర పడుతుంది.


ఆ పక్కనే దేవుని పటాలు పెట్టే చక్క స్టాండ్ పడిఉంటుంది. ఆ పెట్టి లో ఒక ఫోటో
పూజారి అతని భార్య ది, వాటికి కుంకుమ పెట్టి ఉంటాయి, ఎండిపోయిన చెండుపూల

about:blank 12/180
5/19/23, 4:13 PM

హారం తో పడుతుంది, దాని మీదనే, రెండు రుద్రాక్షమాలలు, కంకణం, కొన్ని బట్టలు,


చీర పడుతాయి. ఆ పడిన వేగానికి, అద్దం పగిలిపోతుంది.

మునెమ్మ

అయ్యో, అయ్యో.. ని మొహం మండా!.. నీకు


దూము దగలా.. నిన్ను వల్లకాటిలో పెట్టా .. నీ
చేతులు పడిపోనూ..

అప్పుడు ఆ పటాన్ని వదిలి, సామాన్ల కోసం వెళ్ళిపోతుంది మునెమ్మ. ఆ పక్క నే ఉన్న


చిన్న పిల్లవాడు (చలపతి – పూజారి కొడుకు) ఆ పటం ముందు కూర్చొని, జాతర రోజు
పూజారి వేసుకొనే నగలు, రుద్రాక్షమాల నే చూస్తుంటాడు, ఆ పక్కన ఉన్న పటాన్ని
ఎత్తు కొని, పగిలిన అద్దా లని వోకొక్కటి గా తిసుంటాడు.

తన వెనకాల మునెమ్మ ఇంట్లో నుంచి వాళ్ళ సామాను బయట పడేస్తుంటారు, వాటిని


ఏరుకుంటూ.. వారి తో మునెమ్మ వాదిస్తుంటుంది.

మునెమ్మ

ఒరేయి.. ఒరేయి.. నీ యమ్మ కడుపు కాలా.. అవి


మట్టి కుండలు రా! ముదనష్టపు సచ్చినోడా!

రెడ్డి అనుచరుడు

మొవ్!.. మాట్లా డకుండా.. పక్కకు జరుగు.. లే


డంటే నా!

మునెమ్మ

ఏమి! నాయనా.. వాటి తో నే.. మమ్మల్ని సంపి


రామ్మన్నా డా రా మీ రెడ్డి!..

అని, తన చేతిలో ఉన్న మట్టి బొకులను లాక్కోంటూ

మునెమ్మ

అవి ఇట్లా యీ.

అని, వాటిని తీసుకొని, అటూ గా పెడుతూ, చలపతి ని చూస్తుంది, చలపతి, గంగమ్మ


కు సంబంధించిన వస్తు వులను వోక్కొక్కటి గా వేసుకుంటూ ఉంటాడు, అప్పుడు.. తన
చేతిలో ఉన్న వి లాకొని.. డబ్బిలో ఎసుకుంటూ ఉంటుంది, అప్పుడు ఆక్కడికి తెల్ల పంచ
వేసుకొని ఉన్న ఒక వ్యక్తీ వస్తా డు. అది మునెమ్మ తమ్ముడు, గోపాలప్ప వచ్చి,

about:blank 13/180
5/19/23, 4:13 PM

గోపాలప్ప

అక్కా!

అంటే, అతన్ని చూసి మునెమ్మ, గోపాలప్ప దగ్గరకి వెళ్తుంది. అప్పుడు

మునెమ్మ

అంతా అయ్యిపాయ.. రా.. గోపాలు.. కడుపులో


పెట్టు కుంటుంది అన్న ఊరే.. కట్టు బట్టలతో
యలియేసతాఉంది చూడ రా!

అని.. మునెమ్మ సర్దు కుంటూ, వచ్చి వచ్చి చలపతి దగ్గర గా వచ్చి పేరుస్తూ ఉంటుంది..
అప్పుడు

గోపాలప్ప

అయ్యింది ఏదో అయ్యింది.. బాద పడితే ఏమొస్తుంది


చెప్పు.. మనకి ఆ దేవుడు ఉండ్లా .

అంటే.. జడ ముదిపెట్టు కుంటూ.. కోపం గా

మునెమ్మ

ఏ దేవుడు.. ర?, ఊరిని ఏలే ఆ దేవుడా, లేక


అంత పెద్ద కళ్ళు ఏసుకొని.. ఆ పొలిమేరలో కుసోనున్దే
ఆ దేవుడా...? మన లాంటోళ్ళకి.. ఏ దేవుడు..
లేడు.. రాడు.. అంతే!

అప్పుడు గోపాలప్ప చలపతి వైపు చూస్తా డు, అక్కడ చలపతి, పూజ సామాన్లు


ఎత్తు కుంటూ ఉంటాడు, మళ్ళి మునెమ్మ వైపు చూసి..

గోపాలప్ప

పోతే పోనీ.. ఆ పసి బిడ్డ ని చూసినా రా అక్కా,


మన ఊరికి పోదాము.

మునెమ్మ

నేను యాడికి రాలాదు గని.. నువ్వు పో.. లే!

వినకపోవడంతో, ఆమె మీద ప్రేమతో, కాస్త గట్టిగా

గోపాలప్ప

about:blank 14/180
5/19/23, 4:13 PM

ఇంకా ఈడ సచ్చిందని.. మొన్ను తప్ప, ఆడ


ఉంటే.. కనీసం రెండు పూటలకు కూడన్న
దొరుకుతుంది.

అప్పుడు, మునెమ్మ వెనక్కి తిరిగి గోపాలప్ప వైపు చూసి

మునెమ్మ

నీ ఇంటికాడికి వచ్చి అడుక్కోమంటావ రా


మమల్ని. పుట్టింది ఆ ఊరిలో నే అయినా, నన్ను
పుడిసేది మాత్రం ఈ మొన్నులో నే.. ఊరు వదిలి
పోమ్మనారు కాని, బతకొద్దు అనలేదే. నేను ఈడనే
ఉంటాను లే గాని, ఈడ నుంచి నువ్వు కదులు.

గోపాలప్ప

నువ్వు ఇక్కడే సావు, నేను వాణ్ణి అన్నా..

అని చలపతి వైపు చెయ్యి చూపిస్తా డు, అదే వైపు మునెమ్మ కూడా చూస్తుంది, చలపతి
ని చూసి వాళ్ళు ఇద్దరూ షాక్. 

చలపతి తన తండ్రి వేసుకునే ఆభరణాలు వీసుకొని, తల మీద గుడ్డని పెట్టికొని, దీపం


పెంకు ని పెట్టు కొని, ఒక చేతిలో తన తండ్రి ఫోటో ని, ఇంకో చేతిలో త్రిసులాన్ని పట్టు కొని
నిలబడి ఉంటాడు. అప్పుడు ముమెన్న చలపతి దగ్గరకి వచ్చి.

మునెమ్మ

జరిగింది సాలదా రా!. ఇంకోసారి వాటిని ముట్టు కో


చెప్తా .. నీ చమడాలు తీయకపోతే నా!

అని, చలపతి వేసుకొని ఉన్న ఆభరణాలు అన్ని వోక్కొక్కటి గా తీసివేస్తుంది. అందరూ,


వాళ్ళనే చూస్తూ ఉంటారు, అది గమనించిన మునెమ్మ, చేతిలో మన్ను తీసుకొని, ఆ ఉరి
జనాల మీద వేస్తూ వుమ్మేస్తుంది..

మునెమ్మ

తూ! మీ బతులుకు చడా.. మీరు మనుషులు కాదు


రా.. ఆ రెడ్డి కింద తొత్తు లు.. ఈడ.. ఇంత
జరగతాఉంటే, అడగకుండా.. బొమ్మల్లా చుట్టూ
నిలబడి చూస్తు న్నారే.. మీరేమి జనాలు రా. మీరా
నన్ని ఎలిఏసేది, ఈ రోజు తో నేనే మిమ్మల్ని,
ఎలేస్తా వుండా. పొండి రా!

అని, వొక చేతిలో చలపతి ని పట్టు కొని, అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

about:blank 15/180
5/19/23, 4:13 PM

మునెమ్మ

రా రా!.

గోపాలప్ప వారినే చూస్తూ, మార్చలేము అని తల కొట్టు కొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

INT. CHALAPATHI NEW HOUSE - MORNING

అది ఊరు అవతల, మునెమ్మ పొలం లో పెద్ద కంది కంచ, అందులో చిన్నపాటి గుడిసె
ఇల్లు , ఆ గుడిసె ముందు, ఆవులు, ఎద్దు ల బన్డి, గడ్డి వాము ఉంటాయి. ఇంటో
మునెమ్మ కట్లపోయ్యి దగ్గర, బుర్ర పెట్టు కొని, ఊదుతూ ఉంటుంది, తన వెనకాల మంచం
మీద చలపతి కూర్చొని ఉంటాడు, చలపతి చేతిలో పగిలిపోయిన పటం లోనుంచి తీసిన
తన తల్లి తండ్రు ల ఫోటో ఉంటుంది, తను ఆ ఫోటో నే దిర్గం గా చూస్తుంటాడు..
అప్పుడు తన చూపు మొరుగు న దాసిపెట్టిన పూజ సామాను పెట్టె మీద పడుతుంది.
మునెమ్మ పొయ్యి దగ్గర అటువైపు తిరిగి, సద్ది పిసుకుతూ ఉంటుంది, అప్పుడు

మునెమ్మ

చలపతీ..! యంగన్న వాళ్ళు సేనిగికాయలు ఇంగాడిస్తా


ఉండారంట, పని ఇస్తా రేమో పొయ్యి వస్తా ను,
నువ్వు సద్ది తాగేసి, గొడ్లని అడివికి తోలి రాబో
నాయినా!

అంటే చలపతి వులకడు, పలకడు, అప్పుడు మునేమ్మ వెనకాల, గంట శబ్దం


వినిపిస్తుంది.

మునెమ్మ చేస్తు న్న పని వొక్కసారిగా ఆపేసి, తన చెవులు ఆ వస్తు న్నా గంట శబ్దం మీద
దృష్తి సారిస్తా యి. వెనక్కి తిరిగి చూస్తే, గోడ మీద పటాలు పెట్టే స్టాండ్ ఉంటుంది,
దీపాలు ఉంటాయి, కాని ఏ దేవుడి విగ్రహాలు, పటాలు ఉండవు, ఆ స్టాండ్ పక్కలోనే
చలపతి, తన తండ్రి కట్టు కొనే పూజారి చీర, మేడలో రుద్రాక్ష పెట్టు కొని, వొక చేతిలో
కత్తి, ఇంకో చేతిలో గంట ని పట్టు కొని నిలబడి ఉంటాడు.

అది చుసిన మునేమ్మకి బయం వేసి, వొక్కసారిగా చలపతి దగ్గరకి వెళ్ళి, తన చేతిలో ఉన్న
వి, మెడ లో ఉన్నవి లాక్కుంటూ..

మునెమ్మ

రేయ్ పనికి మాలినోడా! ఎన్ని సార్లు చెప్పాల రా


నీకు.. వాటిని ముట్టు కోవోద్దు అని.

అంటే, చలపతి చుట్టు కున్న చీర విప్పుతూ, ఆమె నే చూస్తూ, దీనంగా

about:blank 16/180
5/19/23, 4:13 PM

చలపతి

నాయినమ్మ!

మునెమ్మ చలపతి వైపు చూసి

చలపతి

నాయిన గుర్తు కి వస్తా వుండాడు..

అంటే, మునెమ్మ freeze అయ్యి, విప్పు తున్న చీర ని పడేసి, చలపతి ని


హత్తు కుంటుంది, తన కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతాయి. అప్పుడు

మునెమ్మ

నువ్వు అట్టా అంటే, నా బాధని ఎవరికి చెప్పుకోవాల


రా. కాపాడుతుంది కాదా అని ముక్కితే, ముండని
చేసి నిలబెట్టే, కూడు పెట్టే కొడుకుని ఎత్తకపాయ.
ఇప్పుడు నిన్ను కూడా అంటే, నేను తట్టు కోలేను రా
చలపతి.

మీ నాయన సావుతో, ఆ అమ్మోరికి ఈ ఇంటికి రుణం


తెగిపాయ. ఏ కూలో నాలో చేసుకొని బతుకున్నాము
రా, ఆ అమ్మోరు సంగతి మనకి వద్దు .

అంటే, చలపతి చేతిలో ఉన్న ఆ రుద్రాక్షల దండ తునిగి ఆ రుద్రాక్షలు చల్లా చదురు
అవుతాయి.

INT. CHALAPATHI NEW HOUSE - LATER

వాకిలి దగ్గర, చలపతి కి తల దువ్వి వెల్ల బోతుంటే, అవ్వ చేతిలో నుంచి, గుద్దిలి, తన
బుజం మీద ఉన్న తువాలు తీసుకొని, గుమ్మం దగ్గరకి వెళ్ళి, దాల మందరం దగ్గర పెట్టిన
సద్ది క్యారియరు తీసుకొని, హవాయి చెప్పులు వేసుకొని, ఇంటి లోనుంచి వెళ్తా డు. 

Silhouette లో మునెమ్మ గుమ్మం దగ్గర నిలబడి, తన మనవడు ఒక చేత గుద్దిలి


ఇంకో చేతిలో సద్ది క్యారియరు పట్టు కొని కులికి వెళ్ళటం చూస్తూ ఉంటుంది. తన కాలి
కింద, చలపతి మెడ లో ఉన్న బలం తాడు, మునెమ్మ కాలి కింద ఉంటుంది

EXT. MANGO GROVES - MORNING

హవాయి చెప్పులు వేసుకొని, రెండు కాళ్ళు వచ్చి ఆగుతాయి. చలపతి సూటిగా చూసి,
రాయి గురి పెట్టి మామిడి చెట్టు పైకి విసురుతాడు. 

about:blank 17/180
5/19/23, 4:13 PM

మామిడి కాయ కిందకి పడుతుంది, అక్కడ ఉన్న తోట మాలి, గట్టి గా కేకలు పట్టటం
తో, (రాయితో తగిలిని శాధం తరవాత)

తోట మాలి

రేయి ఎవ్వర్రా అది, ఉండండి రా! దొంగ నా


కోడకల్లా రా! 

చలపతి ఆ పడిన కాయ ను తీసుకొని అక్కడ నుంచి పరిగెత్తు కుంటూ వస్తుంటాడు,


చలపతి వెనక్కి తిరిగి చూస్తే, తన తో పాటు, ఇంకా ముగ్గురు పిల్లలు, ఆ మామిడి
తోట లోనుంచి దిక్కుకు ఒకడు బయటకి పరిగెత్తు కుంటూ వస్తా రు. కొద్ది దూరం
తరవాత, ఒకచోట నిలబదాతాడు, గస పోసుకుంటూ, వెనక్కి తిరిగి చూస్తే, ఆ పిల్లలు
కూడా చలపతి వెంటే వచ్చఉంటారు. అప్పుడు ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు.
అందులో ఒకడు, ఆ మామిడి కాయనే చూస్తూ ఉంటాడు, అప్పుడు చలపతి వాడికి ఆ
కాయని తీసుకొమ్మని ఇస్తే, అందరూ దాని మీద చెయ్య పెడతారు.

వాళ్ళ దగ్గరకి, తలకి రక్తం కారు తున్న తోట మాలి వచ్చి నిలబడతాడు, అతడిని చూసి,
పిల్లలు అందరూ పరుగు తీస్తా రు – lead to grown up hero running.

INT/EXT. MULTIPLE LOCATIONS - DAY/NIGHT

చిన్న పిల్లవాడి కాళ్ళు leads to big guy legs, పెద్ద చలపతి, లుంగీ ఎగగట్టి
అడవి గుండా పరుగు తీస్తూ ఉంటాడు, తన తో పాటు గా తన చిన్న నాటి స్నేహితులు
కూడా ఏదో క్రూ ర మ్రు ఘన్ని వేటాడుతున్నట్టు పరుగెడుతూ ఉంటారు. అది వాళ్ళు
దొంగతనానికి వెళ్తు న్నారు అన్నట్టు ..

వేరు వేరు ఊర్లు , వేరు వేరు బట్టలు, వేరు వేరు సమయాలు, వేరు వేరు స్థలాల్లో, వేరు
వేరు గా దొంగతనాలు చేస్తూ, పరిగెడుతూ ఉండటం, వొకే లా దోచుకున్న సామాన్లు
అందరికి చలపతే పంచడం, తరవాత కల్లు కాంపౌండ్ లో కళ్ళు బిడి తాగి, అడవిలో నే
పడి నిద్రపోవటం, తెల్లవారితే మళ్ళి దొంగతనం. ఇక్కడ కదిరెప్ప, కదిరెప్ప కొడుకు
అక్కులప్ప, చలపతి వాళ్ళు ఎప్పుడు పోయినా, అక్కడే తాగుతూ చలపతి వాళ్ళని
వచ్చిపోయేది చూస్తూ ఉంటాడు.

ఒకసారి.. వొక ఊర్లో.. చలపతి వాళ్ళు ఒక మిద్దే ఇంటి వైపు వెళ్తుంటారు..అప్పుడు


సోమా

సోమా

మంచి ఇల్లు పట్టినావు రా చలపతి.. ఈ రోజు


మనకి డబ్బులే.. డబ్బులు, నగలే.. నగలు.. 

about:blank 18/180
5/19/23, 4:13 PM

అంటే

చలపతి

ఎవరిది రా ఇది..

అంటే

సోమా

ఇంకేవరిది.. ఆ గంగిరెడ్డి వోళ్ళ సుందరమ్మ ది.

అంటే, చలపతి అక్కడే ఆగిపోతాడు..

కోనా

వాడేక్కా! ఏంది రా వీడు ఊరికి వోకదాన్ని పెట్టు కొని


ఉండాడు.

ముందుకు వెళ్తు న్న తన స్నేహితులు వెనకకి చూసి.. వాళ్ళు నిలబడి వెనక్కి చూస్తా రు..
అప్పుడు

బుజ్జి

యాల ర.. ఆడే నిలబడి తివి?

చలపతి

పొయ్యి పొయ్యి.. ఆ నా కొడుకు తో యాల


గని.. దిగబడి పోదాము పదండి.. రా!

అని అక్కడ నుంచి ఇంకో చోటకి దొంగతనానికి వెళ్తా డు చలపతి.. అది చూసి వాళ్ళు
వొకరి ని ఇంకొకరు చూసుకొని.. చలపతి వెనకాలే వెళ్తా రు.

EXT. CHALAPATHI NEW HOUSE - MORNING

చలపతి, తన స్నేహితులు, తాగి ఇంటి ముందు వాకి దగ్గర వొక్కడు, అరుగుమింద


ఒక్కడు, పడుకొని ఉంటారు, తెల్లవారి, మునెమ్మ లేచి బయటకి వచ్చి చూస్తే.. వీళ్ళు
దిక్కుకు వొకడు పడుకొని ఉంటారు, అప్పుడు

మునెమ్మ

వోరి దొంగ సచ్చోల్లా రా! రాత్రంతా పికల దాక తాగటం,


ఇట్లా దొడ్లో పడి దొరలటం.. ఉండండి మీ పని

about:blank 19/180
5/19/23, 4:13 PM

చెప్తా ..

అని, కట్టి కోసం వెతుకుతూ..

మునెమ్మ

ఏది.. కట్టి

అని, అక్కడ ఉన్న కట్టి ని తీసుకొని, బోర్ల పడుకొని ఉన్న కోనా ముడ్డి మీద
కొడుతుంది, అప్పడు కోనా అబ్బా అంటూ అరుస్తూ లేస్తా డు.

మునెమ్మ

ముదనష్టపు సంచ్చినోడ.. నీ కష్టం కాల.. నీ పిండం


పిచ్చుకలు ఎట్టు కేల్లా .. తాగి.. పడి దోర్లటానికి నా
ఇల్లే దొరికిందా రా! నీ యమ్మ కడుపు కలా

అని, కోనా ని తిడుతూ.. కోడు తూ ఉంటుంది, అప్పుడు ఆ శబ్దా లకి లేచిన సోమా,
ఆ బాదుడు చూసి.. అక్కడ నుంచి చిన్నగా జారుకుంటాడు. అప్పుడు కోనా.. చలపతి
ని చూసి..

కోనా

రేయ్! చలపతి.. లేయ్యి రా.. నా చిన్నప్పుడు మా


యమ్మ కూడా ఇంతగా కొట్టింది లేదు..
సచ్చిపోతున్నా.. వచ్చి మీ అవ్వని ఆపరా!

అంటే.. తీరిగ్గా లేచి.. కొనా ని తరుముకుంటూ.. వస్తు న్నది చూసి.. లేచి, మునెమ్మ
కి అడ్డు పడతాడు [చెయ్య అడ్డం పెట్టి చూపించి]

చలపతి

మునెమ్మ.. ఏమిటి నీ ఆగడాలు, ఒక పసివాడిని


అనికూడా చూడకుండా.. వాణ్ని అలా సావ
కొడుతున్నావు

అంటే.. అప్పడు

మునెమ్మ

మిమ్మల్ని.. కొట్టా ల.. కోసి కరం పెట్టా లా

అని..

about:blank 20/180
5/19/23, 4:13 PM

మునెమ్మ

బంగారట్లా మనవణ్ణి, చదకోడతాఉండేది వీడు.. ఆ


సోమా గాడు కాదు.

అంటే, చలపతి.. పాప మొహం పెట్టి, అవును అంటాడు.

కోనా

ఏంది.. నేనా?

అంటే.

మునెమ్మ

కాదా!.. అవును లే.. నా బంగారమే సరిగ్గా


ఉంటె.. ఉరోల్లని అని ఏమి లాభము లే.

అంటే.. అప్పుడు ఫ్లా ష్ బ్యాక్ లోకి పోయినట్టు పొయ్యి..

మునెమ్మ

ఎట్టా బతికినోడు మీ తాత.. వొక అలవాటు అనేది


లేదు

అంటే, అప్పుడు..

చలపతి

మళ్ళి మొదలు పెట్టింది రోయి

పద.. పద అని.. వాళ్ళు సల్లగా జారుకుంటారు.. అప్పడు సిగ్గు లో నుంచి మేఉకొని


చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు.. అప్పడు

మునెమ్మ

రేయ్! చలపతి సచ్చినోడా! సాయంకాలం.. సరుకులతో


ఇంటికి రా లేదో.. నీ కాళ్ళు ఇరిచిపోయి లో పెడతా
ఏమనుకున్నావో!

అని తిడుతుంది.

EXT. GUDUMBA CENTER - LATER

about:blank 21/180
5/19/23, 4:13 PM

ఒకరోజు కళ్ళు కాంపౌండ్ లో కదిరెప్ప కొడుకు అక్కులప్ప, కదిరెప్ప కులానికి చెందిన


మనుషులు కూర్చొని బాగా తాగుతున్నారు, అక్కులప్ప దగ్గర డబ్బులు అయిపోతాయి,
జేబులు తడుముకొని, కళ్ళు ఇచ్చే వాడి దగ్గరకి తూలుతూ పోయి.

అక్కులప్ప

సుబన్నా! ఇంకా రెండు ముంతలు ఈ రా!

సుబన్న

రూకలు ఇచ్చి తెసుకొని పో!

అంటే,

అక్కులప్ప

ఇప్పుడు లేవు గాని, రేపు ఇస్తా ను

సుబన్న

ఆట్టా ఐతే రేపే వచ్చి తాగు!

అంటే, సుబ్బన్నని గురాయిస్తూ..

అక్కులప్ప

నువ్వు ఎవరూ!, మా.. వోడు, అందుకే,


అగ్గావకైనా, ఈ అంగిడి ని నీకి అమ్మింది..

అంటూ ఉంటే, మధ్యలో కలగచేసుకొని.

సుబన్న

యోవ్! యాపారం జరిగే చోట, ఏంది రా నీ నస,


జరుగట్ట.

అంటే, అటుగా చలపతి, కోనా ఆ కళ్ళు పాక కు వస్తు ..

చలపతి:

పొద్దు న్నే.. ముసల్ది, నా బుర్రని, మసాలా ఎసి


నూరేసింది రా.. సల్ల దిగబడితే గాని ఈ యాల బండి
కదలదు.

కోనా నీ కన్నా తిట్లూ.. నాకు ఏకం గా వొళ్ళు వునము చేసేసింది..

about:blank 22/180
5/19/23, 4:13 PM

చలపతి కోనా.. రూకలు చేతిలో ఎగరేసుకుంటూ వస్తుంటారు, అది చూసి

అక్కులప్ప

మింగను మెతుకు లేకపోయినా, మీసాలకు మాత్రం


సంపంగె నూనె అడిగినాడంట, వాడెవడో. అటుఉంది
ఇది.. ఇల్లు వాకిలి లే, అయ్యినా ఈ చలపతి గాడు
దిన్నాము తాగేదానికి మాత్రం దుడ్లు తెస్తా ఉండాడు? 

సుబన్న

రేయ్! పొయ్యి పొయ్యి కొరివి తో ఎందుకు రా తల


గోక్కుంటావు, తాగింది సాలు గాని ఇక ఇంటికి పో!

అని సుబ్బన్న చెయ్యి అక్కులప్ప కి తగిలి, కాస్త పక్కకు వాలుతాడు, అప్పుడు..

అక్కులప్ప

యోవ్! ఎట్టాంటి.. తప్పుడు నా కొడుకులకు


బయపడే రకం కాదు నేను.

అని అక్కులప్ప ఆ పక్క కి కూర్చుంటాడు, తిన్నగా చలపతి సుబ్బన్న దగ్గరకి పోయి

చలపతి

సుబన్నా! ఈ యాల, నీ సరుకా.. నా రూకలా.


ఏది ముందు కాలి అవుతాయో సూడాలా!

అని, రూకలు ఇస్తా డు, అది చూసి, ఆనందం తో

సుబన్న

నువ్వు ఎంత అంటే అంతే రా అల్లు డూ!

అంటాడు, అప్పుడు అటూ ఇటూ చూసి..

చలపతి

ఏంది.. సుబన్నా! పందెము ఏద్దా ము అంటే. పందిలి


కాలిగా ఉంది..

అంటే.. చలపతి బీడీ ఎలిగిచ్చే దానికి పోతాడు,

సుబన్న
( OS )

about:blank 23/180
5/19/23, 4:13 PM

రేయ్ అల్లు డూ!.. నీ బల్లెం గురి


తెలిసినోడు..ఎవ్వాడు పందెం కట్టా డు రా!

అక్కడ అప్పుడు అక్కులప్ప ని చూసి చూడనట్టు గా చలపతి ఉంటె.. అప్పుడు చలపతి


నే చూస్తూ.

అక్కులప్ప

అవును వొరే! నేను అంటే, మా నాయన


సంపాదిచ్చింది, ఉంది.. అది అమ్మి తాగతావుండా.

నీకాడ ఏముంది రా?, ఇల్లా లేదు!, కొంపలో సామన్లా .. అవీ లేవు, ఇంక


యాడనుండి వస్తా వుండాయి రా ఇన్ని దుడ్లు ? కొంపదీసి ముసిలిదాన్ని!.. యాడదైనా?

అనే లోపే, అక్కులప్ప తల ని గట్టిగా కళ్ళు కుండ (గ్లా స్ బాటిల్) ఎసి కొడతాడు
చలపతి, అది చుసిన అక్కులప్ప మనుషులు, చలపతి తో గొడవకు దిగుతారు. అక్కడ
ఉన్న కర్ణం, తల మీద తన టవాలు గుడ్డ ని కప్పుకుంటాడు – Lead to fight,
finally

ఆ గొడవలో, అందరూ చలపతి ని చుట్టు ముట్టి, గట్టి గా బిగిస్తా రు, అప్పుడు


అక్కులప్ప, ఆ పక్కలో ఉన్న యాట కొడవలి తీసుకొని.

అక్కులప్ప

సంపేయండి రా ఆ లంజా కొడుకుని. ఈ నా


కొడుకులు వల్లే ఈ ఊర్లు ఇట్ల ఎడిసినాయి.

అంటే, మొండిగా, వాళ్ళని తోసుకుంటూ అక్కులప్ప వైపు వస్తుంటాడు, అటుగా


ఉన్న మండుతున్న కొరివి ని తీసుకొని అక్కులప్ప వైపు విసురు తాడు, అది అక్కులప్ప
మొహం మీద పడి మొహం కాస్త కాలిపోతుంది, కోడవిలి కింద పడేసి, మొహాన్ని నిలల్లో
ముంచుతాడు.

ఆ ఫైట్ లో వోడిపోతున్నాము అని తెసుసుకొని, అక్కులప్ప అక్కడ నుంచి పరిగెట్టి


పారిపోతుంటాడు. అప్పుడు వాళ్ళని కొట్టి, అటు గా పందిలి కి నిలబెట్టిన కట్టిని గట్టిగా
కాలితో తంతాడు చలపతి, అది సగానికి ఈటె లా పోదునుగా విరుగు తుంది. దాన్ని
తీసుకొని గురు చూసి అక్కులప్ప వైపు విసురుతాడు.

అది పోయి, సరిగ్గా అక్కులప్ప కాళ్ళ సందుల్లో పంచ కి గుచ్చుకొని, పంచ వూడిపోయి,
కళ్ళు తోన్డు రుకొని పల్టీలు కోడుతూ, కిందకి పడతాడు. అప్పుడు అక్కడికి చలపతి
వస్తా డు. అక్కులప్ప కి చలపతి వస్తు న్న విధానం చూసి భయం వేస్తుంది. చలపతి వచ్చి

about:blank 24/180
5/19/23, 4:13 PM

నిలబడతాడు, అక్కులప్ప భయంతో చలపతి కాళ్ళు పట్టు కుంటాడు. చలపతి అక్కులప్ప నే


చూస్తూ ఉంటాడు.

అక్కులప్ప

తప్పు అయిపోయింది, వదిలెయ్యా రా చలపతి!

అంటే, కొద్ది సేపు తరవాత, తన చేతిలో ఉన్న కొడవలి ని కిందకి విడిచిపెడతాడు, వెనక్కి
పోయి, ఆ కట్టికి చిక్కుకున్న అక్కులప్ప పంచ ని తెసుకొని వచ్చి అక్కులప్పకి ఇస్తా డు.

చలపతి

మావా! ఇది, ఇక్కడే వోదిలేస్తే అందరికి మంచిది.


కాదు, కూడదూ.. పంచాయతి అంటావా? ఇప్పుడు
పంచలు మాత్రమే ఊడినాయి, పానాలు
వూడకొట్టు కోవోద్దు .

అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు, అక్కడే కూర్చొని ఉన్న ఆ ఊరి కర్ణం


చూస్తుంటాడు. చలపతి వెళ్ళిపోయాక, తల మీద గుడ్డ ని తీసి, అక్కడ పడి ఉన్న
అక్కులప్ప దగ్గరకి వస్తు

కర్ణం

ఏ రా. తాగినోడు.. తాగి నట్టు


ఉండకుండా,.. వాని నోట్లో ఏలు పెడితివి,
ఏమాయ.. వాడు పెంట పెంట చేసి పాయ.
ఇదిగో.. మీ బాగు కోరి చెప్తా వుండా.. ఈడ
జరిగింది, రెడ్దోరు ఇంట్లో తెలీసిందా.. వాణ్ణి ఏమో
గాని.. మిమ్మలి మాత్రం బతకనియుడు... ఆ పైన
మీ ఇష్టం

అని, అక్కడ నుంచి చిన్నగా జారు కుంటాడు. అక్కులప్ప ని చూసి, తన కులం లో


ఉన్న వారు, “చిన్న జాతి వాడి కాళ్ళు పట్టు కున్నాడు అని ఎంగిలి ఉంచుతారూ”.

EXT. FOREST ROADS - LATER

గుడుంబా తాగి వస్తు న్నప్పుడు.. ఇంతలో కోనా, చలపతి ముందుకు వచ్చి.. చలపతి
వొక్క చోటో sudden గా ఆగు తాడు, తన స్నేహితులు కూడా వచ్చి తన పక్కనే
నిలబడతారు, అప్పుడు

కోనా

రేయ్! నిలబడు రా!

about:blank 25/180
5/19/23, 4:13 PM

అంటే, అప్పడు నిలబడతారు

కోనా

ఏంది రా నీ యవ్వరము.. ఆ బిత్తిరి నా కొడుకు


ఏమో అన్నాడు అని.. వాణ్ణి సావ కోడితివి, ఇప్పడు
రెడ్డి కి తెలిస్తే ఎంత పనిచేటు..

అప్పుడు, చలపతి.. అటు ఇటూ చూస్తూ..

చలపతి

ష్!

శబ్దం చెయ్యకు అని సైగ చేస్తా డు, ఆ నిశబ్ధం లో నిలబడి చవి పెట్టి సుష్మంగా
ఆలకిస్తా రు. అప్పడు, గాలిలో లేసుగా మాటలు ఉంటాయి, ఎద్దు ల బండ్లు వేల్తు నట్టు
వినిపిస్తా యి. తొంగి చూస్తా రు, అటుగా ఆడ పెళ్లి వారు ఎద్దు ల బన్డిలో వెళ్తుంటారు.
ఇంతలో వారికి ఒకతను అటువైపు తిరిగి ఉచ్చ పోస్టు కనిపిస్తా డు, (sound lead to
reveal his back urinating) చలపతి మరి తన స్నేహితులు, బట్టలు సర్దు
కుంటూ ఉచ్చపోస్తు న్న అతని దగ్గరకి వెళ్తా రు. ఇంతలో అతను, తన పని ముగించుకొని
వెనక్కి తిరుగుతాడు, ఇంతలో శబ్దం రావటం తో, ఆ వ్యక్తీ అక్కడే నిలబడి పోతాడు.

చలపతి

అమ్మయ్యా!! బోరువు దించేస్తే.. ఎంత హాయిగా


ఉంది రా!!

అంటూ, చలపతి మరి తన స్నేహితులు మొరుగు లో నుంచి బయటకి వస్తా రు, వచ్చి ఆ


వ్యక్తీ (శరబయ్య) వైపు చూసి. ఆ వ్యక్తీ చాల బాగా తెలిసినట్టు ..

చలపతి

ఆభ భభా!, ఎంత దూరం అని బిగబెట్టు కునేది,


ఊరు ఈడా ఆడా ఉందా?

చలపతిని చూసు శరబయ్య అమాయకగా

శరబయ్య: అవను అవును, ఇరికిపెంట నుంచి మిట్టపల్లి


పెళ్లి కూతురిని పిలుచుకొని పోవాలంటే, తమాసా.
చానా దూరం ఉండ్లా !

అప్పడు చలపతి శరబయ్యా వైపు చూసి,

చలపతి

about:blank 26/180
5/19/23, 4:13 PM

సంపితివి బో!

ఆ వ్యక్తీ అదిరి పడతాడు

చలపతి

ఇరికిపెంట నుంచి వస్తా ఉండే మీరేనా?, 

అప్పుడు ఆసక్తి గా

శరబయ్య

అవనూ?.. ఎందుకూ?

చలపతి కోనా వైపు చూస్తా డు, అప్పుడు

కోనా

మిమ్మల్ని ఈ అడివిలో పొద్దు గాల నుంచి యాడని


ఎతికేది స్వామి.

శరబయ్య, కోనా వైపు చూసి, బయంతో కూడిన ఆసక్తి తో..

శరబయ్య

అదే ఎందుకూ?

అంటే, అప్పుడు చలపతి

చలపతి

ఈ అడివిలో గాడిదే రక్తం తాగే గజ దొంగలు


ఉండారూ, తెలీదా?

అప్పుడు చలపతి శరబయ్య కి దగ్గరగా వచ్చి తన నాగల్లి చూస్తూ

చలపతి

శెట్టి!.. నీలా, నిగ నిగ లాడే వాళు అంటే, ఇంక


అంతే! కోతికి కొబ్బిరి చిప్పే!

అంటే, నెత్తిన తువాలు వేసుకొని, శరబయ్య ఏడుస్తూ

శరబయ్య

about:blank 27/180
5/19/23, 4:13 PM

గాడిదే రక్తం తాగే గజ దొంగలా? వోరి దేవుడో!


ఇప్పుడు ఏంది చేసేది, అస్సలే నాకు.

అని రెండు వేళ్ళతో సైగ చేసి చూపిస్తూ ఏడుస్తా డు, అప్పుడు, సోమా దగ్గరకి వచ్చి

సోమా

రెండా, ఏంది?

ఏడుపు ఆపేసి, సిగ్గుపడుతూ

శరబయ్య

పెళ్ళాలు!

అప్పుడు చలపతి జ్యోక్యం చేసుకొని

చలపతి

అందుకే! మీకు తోడుగా ఉండమని పంపిచింది, ఆ


పెద్దా యన.

అంటే, అమాయకంగా

శరబయ్య

ఎవరూ? తిప్పయ్య శెట్టి బావా?

అంటే

చలపతి

ఆ ఆయనే!

అంటే, అప్పడు, తన తల మీద ఉన్న గుడ్డని తీసి

శరబయ్య

ఓరిని దుంప దేగా, సావు కబురు సల్లగా చేపతవే?


రా!. నాతొ రండి.

అని, వెనక్కి తిరిగి పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్తా డు, అతని వెంటే చలపతి వాళ్ళు
కూడా వెళ్తా రు. 

EXT. FOREST ROADS - LATER

about:blank 28/180
5/19/23, 4:13 PM

కాస్త దూరం లో నిలబడి ఉన్న, ఎద్దు ల బండ్ల దగ్గరకి తీసుకెల్తా డు. ముందర బన్డి లో
బిగ్గరం గా కూర్చొని కట్టే చేత పట్టు కొని ఉన్న ఓ పెద్దా యన దగ్గరకి తీసుకొని పొయ్యి

శరబయ్య

నో! ఈ అడివి లో గాడిదే రక్తం తాగే గజ దొంగలు


ఉన్నారని, మీ వియ్యంకుడు వీళ్ళని పంపిచ్చాడంట.

అంటే, ఆ కూర్చొని ఉన్న వ్యక్తీ (పిచ్చయ్య శెట్టి) వాళ్ళని చూసి

పిచ్చయ్య శెట్టి

ఎవరూ?

అంటే, అప్పడు చలపతి

చలపతి

ఇంకెవరూ! మిట్టపల్లి తిప్పయ్య శెట్టి.

అప్పడు ఆ పిచ్చయ్య శెట్టి చలపతి వాళ్ళని ఎగా దిగా చూసి

పిచ్చయ్య శెట్టి

కాపలా కి వస్తే, మరి వీళ్ళ చేతుల్లో కర్రలు ఏవి?

అప్పుడు చలపతి, లావుగా ఉన్న తన స్నేహితున్ని చూపించి

చలపతి

వాడు ఎవరో తెలుసా?

అంటే

శరబయ్య

ఎవరూ?

చలపతి

వీర మల్లు ! పోటిల్లో పది మందిని సునాయాసం గా


లేపి అవతల పారేస్తా డు తెలుసా!

అంటే, శరబయ్య వచ్చి చలపతి స్నేహితున్ని బుజాలు తడుముతాడు, అప్పుడు

about:blank 29/180
5/19/23, 4:13 PM

శరబయ్య

అబ్బో!! మంచి కండ పుష్టే!

అంటే, ఆ పైన కూర్చొన్న పిచ్చయ్య శెట్టి

పిచ్చయ్య శెట్టి

సరే, సరే! ముందర ఇద్దు రు, ఎనకాల ఇద్దు రు


పదండి!

అంటే, అప్పడు చలపతి వాళ్ళని చూసి

చలపతి

ఉహు! ఇట్టా కాదు గాని, ముందు మీ నగలన్ని


మూట కట్టి, ఆ పెద్దా యన దగ్గర కి ఇయ్యండి.

అని పిచ్చయ్య శెట్టి వైపు చూపిస్తా డు, అది విని శరబయ్య, పిచ్చయ్య శెట్టి కంగు తిని
చలపతి వైపు చూపిస్తా రు, అప్పుడు వాళ్ళని చూసి

చలపతి

చూడు పెద్దా యనా! ఇట్లా చెప్పినానని, తప్పు గా


అనుకోవద్దు , ఎందుకు చెప్పినానో ఆలోచించు.  

అని, ఆ బన్డి లో ఉన్న వాళ్ళని చూపిస్తూ

చలపతి

ఇట్టా పారా దిగేసుకొని పోతే, మిట్టపల్లి ఏమో గాని,


వోటికుంట కూడా దాటలేరు. 

అని,అంటే పిచ్చయ్య శెట్టి కొద్ది సేపు చలపతి ని శరబయ్య చూసి.

పిచ్చయ్య శెట్టి

ఆ పిల్లోడు చెప్పింది చెయ్యండబ్బా!

అంటే, బన్డి లో ఉన్న వారు అంతా, టువాలు గుడ్డ లో మూట కడతారు, అప్పుడు

చలపతి

ఎవరైనా అడిగితే సావుకు పోతాఉండాము అని చెప్పండి.

about:blank 30/180
5/19/23, 4:13 PM

అటుగా సంత నుంచి వస్తు న్నా ఇద్దరూ వ్యక్తు లు ఆ బన్డిలో ఉన్న వాళ్ళని చూసి

వ్యక్తీ6

నో! ఎందాక!, గుంపుగా పోతావుండారు?

అప్పుడు, పిచ్చయ్య శెట్టి, చలపతి వైపు చూసు

పిచ్చయ్య శెట్టి

మిట్టపల్లి లో సావుకు లే.

అంటే,

వ్యక్తీ7

ఓ, అట్టనా, పొద్దు పోతావుండ్లా , ఎల్లబారండి

ఆ మూట ని పిచ్చయ్య శెట్టి తీసుకోని, తన పక్కనే ఉన్న గడ్డి లో బద్ర పరుస్తా డు,
వాళ్ళు ముందుకు బయలుదేరుతారు. 

కాస్త దూరం వెళ్ళి మలుపు తిరిగితే పొగ.. అందులోకి వెళ్ళాక..

పిచ్చయ్య శెట్టి
( VO )

దొంగ, దొంగా!

అని అరుస్తా డు.

EXT. MANGO GROVES - EVENING

చిన్నబ్బ, గంగిరెడ్డి కి కుడి బుజం, గంగిరెడ్డి చేసే అరాచకాలు అన్ని, వీడి ద్వారానే
చేయిస్తుంటాడు. ఈ చిన్నబ్బ, గంగిరెడ్డి కి చెందిన మావిడి తోపు లో, కలుపు
దున్నిస్తు న్నాడు. కొంత మంది ఆడవాళ్ళు అక్కడ గడ్డి పీకుతూ ఉంటారు. ఇంకొక కూలి
అక్కడ మామిడి చెట్లు నాటటానికి, గడ్డపార తో గుంత తవ్వుతుంటాడు. చిన్నబ్బ ఒక
మామిడి చెట్టు కింద మడత మంచం మీద కూర్చొని ఉంటే, ఇంతలో ఒక పాలేరు వచ్చి
కొబ్బరి కాయ కొట్టి కొడవలి చెయ్యి తడబడుతుంటే,

చిన్నబ్బ

నిదానం, రా! దాన్ని ఆడ పొయ్యి కొట్టు పో, నాకు


యాడన్నా తెగెను.

about:blank 31/180
5/19/23, 4:13 PM

అంటే, ఆ కొడవలిని ఆ పక్కనే ఉన్న కొమ్మకి చెక్కి, చిన్నబ్బ చేతికి టెంకాయ ఇస్తా డు,
అది తాగుతూ

చిన్నబ్బ

కాదు రా! ఆ ఎర్రాబ్బ నాటుతాఉండే చెట్టు సచ్చేటట్టు


లేదు?

అంటే, అందుకు, పాలేరు

పాలేరు

యాడ లేదు సామి! యండకి ఆట్టా వాలింది. 

చిన్నబ్బ

జాగ్రత్త గా చూసుకోండి రా, అయ్యగారికి


మావిడికాయలు అన్నా, మావిడి చెట్లన్నా మా చెడ్డ
ఇష్టం రా!

పాలేరు

దిగదాల మడిలో పందికుక్కులు వుండాయి, సంపి ఏస్తే


అదే బతుకుంటుంది లే!.

చిన్నబ్బ

ఏంది రా అట్టా లేసుగా మాట్లా డుతావుండావు! ఆ


రాకాలు ఈడ యాడ దొరకవని, కర్ణాటకా నుంచి
తెప్పిచ్చినాడు.

పాలేరు

ఏంది.. కర్ణాటకా నుంచి వచ్చినాయా?

అంటూ ఉండగా, గుంత తవ్వు తున్న అతని గడ్డపార దేనికో తగిలి.. ఖంగు అని శబ్దం
వినిపిస్తుంది, కొబ్బరి ఆయ తాగుతున్న చిన్నబ్బ చెవులకు ఆ శబ్దం వినిపిస్తుంది. ఆ
తవ్వుతున్న వ్యక్తీ, మళ్ళి గడ్డపార తో ఇంకో పోటు పొడుస్తా డు. ఆ శబ్దం కాస్తా కంచు
గంట లా స్పష్టం గా వినపడుతుంది. అప్పుడు చిన్నబ్బ తన చేతిలో ఉన్న కొబ్బరి కాయని
విసిరేసి, లేచి నిలుచొని, ఆ దున్నుతున్న వాళ్ళతో

చిన్నబ్బ

about:blank 32/180
5/19/23, 4:13 PM

రేయి!, పొద్దు పోయినాది గాని, అవి ఆడ పారేసి,


రేపు రాబొండి.

అంటే, ఫాస్ట్ కట్స్ లో, అక్కడ ఉన్న వారు అందరు, పని ముట్లు తీసుకోని అక్కడ
వెళ్ళిపోతారు, వెళ్ళిపోయారు అని నిర్ధా రించు కొని, అక్కడ గడ్డపార తీసుకోని తవ్వుతాడు,
పార తో మట్టిని తీస్తుంటే, ఒక చిన్నపాటి ఇత్తడి బింది లా కనిపించడం తో, అక్కడ
నుంచి చిన్నబ్బ హడావిడి గా, అక్కడ నుంచి రెడ్డి ఇంటికి పరుగు తీస్తా డు.

INT/EXT. REDDY HOUSE - DUSK

గంగిరెడ్డి, వెంకటరాముడి ముని మనమడు, ప్రస్తు తం ఆ 18 ఊర్లకి గాను రెడ్డి గా


ఉంటున్నాడు. అదే ప్రాంగణం, కాకపోతే అక్కడ కాంపౌండు, గేటు ఉంటాయి. ఆ
ఆవరణం నిండా, ఎడ్ల బండ్లు , ఎద్దు లు, ఆవులూ ఉంటాయి, గడ్డివాము.

అక్కడ ఒక మూల చిన్న చక్క బెంచి మీద ఒక పెద్దా యన (మునుసబు వీరబద్రయ్య)


కూర్చొని ఏదో పత్రాలు చూస్తుంటాడు.. కాదు కాదు.. పత్రాల సాకు తో, అటుగా
బోకులు తోముతున్న.. పని పిల్ల జారిన అందాలను లొట్టలేసుకుంటూ.. చూస్తు న్నాడు..

అటుగా ఒక 10 ఏళ్ళ పిల్లవాడు, ఆ పిల్లవాడు జిల్లా కోడి ఆడుతూ ఉంటాడు,


కొంతమంది పాలేరు వాళ్ళు చిన్న పాటి పనులు చేసుకుంటూ ఉంటారు.

గంగిరెడ్డి ని కలవటానికి.. ఒక చిన్న జాతి కుటుంభానికి చెందిన వాళ్ళు ఒక పది మంది,


ఆ కాంపౌండ్ దగ్గరకు వస్తా రు. చెప్పులు ఉన్న వారు తీసి, వాళ్ళ తువాలు లో చుట్టు కొని,
ముట కట్టు కొని, వీపు వైపు వేసుకొని, వంగుతూ, ఆ కాంపౌండ్ ఎంత దూరం ఉంటే
అంత, వంగి నడుచుకుంటూ, అడుగు లో అడుగు వేసుకుంటూ గేటు వద్దకు వస్తా రు.
తొంగి చూసి, చిన్న గా గేటు లోనికి వెళ్తా రు.

అప్పటి వరకూ.. పని పిల్ల అందాలను చూస్తు న్న, మునుసబు కి, ఆ పిల్ల పరక చూపిచ్చి
వెళ్తుంది.. ఆ వెళ్తు న్నా చూపులో అటుగా వస్తు న్న ఆ 10 మందినీ చూసి.. వాళ్ళతో

మునుసబు
( వీరబద్రయ్య )

రేయ్!.. ఎక్కడికి రా.. ఆడనే సావండి.. ఎవర్రా


మీరంతా..?..

అంటే.. అందులో ఉన్న ఒక పెద్దా యన్..

సుబ్బడు

మాది దండోర్లపల్లి సామీ! నా కూతురి పెళ్లి


పెట్టు కున్నాము.. అందుకు.. పెద్దయ్య ని వొక పాలు

about:blank 33/180
5/19/23, 4:13 PM

దర్శనం చేసుకొని పోదామని వచ్చినాము

అంటే..

మునుసబు

మీ వాలకం చూస్తుంటే.. అర్ధమైంది లే గని.. ఆడ


దూరం గా పొయ్యి కుసొండి.. 

అని.. ఆ పెద్దా యన చేతిలో ఉన్న పత్రాలు చూసి

మునుసబు

అది సరే గాని.. ఏంది రా అవి?

సుబ్బడు

నా ఆస్తి పత్రాలు సామి

మునుసబు

సరే.. అయ్యాగారు వచ్చినాక పిలుస్తా ను. పొండి

అని.. వెనక్కి వెళ్తా డు.. వాళ్ళు అక్కడ గొడ్ల సావిడి ఉండే కాడ కూర్చుంటారు..
ఇంతలో ఇంట్లో గంట మోగుతుంది, వరదారెడ్డి అది విని, లోనికి పరిగెడుతూ లోనికి
వెళ్తా డు. వరదారెడ్డి POV లో పరిగెత్తు కుంటూ లోనికి పోతాడు.. అక్కడ ఇంట్లో
రెడోరమ్మ, 

 దేవుని గది దగ్గరకు వస్తా డు, అక్కడ గంగిరెడ్డి భార్య, కొడుకు, కోడలు నిలబడి
ఉంటారు, గంగిరెడ్డి నిలబడి, అమ్మవారికి దీప దూప, నైవేద్యాలు పెట్టి, మల్లె పూలు
అలంకరించి, మావిడి పళ్ళు నివేదం పెట్టి, గంట కొడుతూ, దూపం చూపిస్తుంటాడు.
నానమ్మ పక్కలో చేరుతాడు వరదారెడ్డి. ఆ దేవుడి రూమ్ అంతా దూపం తో నిండి
ఉంటుంది.

ఇంతలో ఇంట్లోకి చిన్నబ్బ పరుగులు తీస్తూ వస్తు న్నది చూసి.. మునుసబు.. చిన్నబ్బ
దగ్గరకి.. ఎక్కడ పూజ కి బంగం కలుగుతుందో అని..

మునుసబు

ఓ రేయ్, చిన్నగా ర!.. అక్కడ పూజ మొదలైంది.

అంటే.. చిన్న గా నడుచుకుంటూ లోనికి వెళ్తా డు. 

about:blank 34/180
5/19/23, 4:13 PM

పూజ గది దగ్గరకి వచ్చి, గంగిరెడ్డి చెవిలో, ఆ శబ్దం విష్యం రహస్యం గా చెప్తా డు. అలా
ఒక్క సెకనుకు హారతి, గంట ఆగి, వింటాడు. చెప్పిన తరవాత చిన్నబ్బ ని వెళ్ళమని,
కళ్ళతో చెప్పగా, చిన్నబ్బ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 

ఆ పూజ అంతం అవుతున్న సమయంలో.. అమ్మవారి కి, కోడిని బలి ఇచ్చే సమయం
లో, దాన్ని చూస్తు న్న వరదారెడ్డి కళ్ళను ముసివేస్తుంది గంగిరెడ్డి భార్య. గంగిరెడ్డి మాత్రం
గంభీరం గా నిలుచొని, అమ్మవారి విగ్రహానికి పెద్ద తట్ట లో, అతి పెద్దగా హారతి
పడతాడు. హారతి అయ్యాక, తను ఇంటి లో ఉన్న వాళ్ళకి హారతి ఇస్తా డు, వరదారెడ్డి కి
మాత్రం, తన చేతితో, హారతి చూపిస్తా డు, ఇంకో ఇంట్లో మంచం మీద పడి ఉన్న, తన
తల్లి కి కూడా తన చేతి తో హారతి ని ఇచ్చి, బయటకి వస్తు వస్తు , tourchlight
తీసుకొని బయటకి వస్తా డు

గంగిరెడ్డి ఎర్రటి కండువా ని మెట్లమీద గా రాకుకుంటూ దిగి వస్తుంటే ఆయనను చుసిన


మునుసబు లేచి నిలబడతారు, ఎడమవైపు గొడ్లసావిడి వైపు కూర్చున్న జనం కుడా లేచి,
తల ఎత్తకుండా, వంగే ఉంటారు, అక్కడకి వారి తలలు, గంగిరెడ్డి కాలికి సమానం అనట్టు
ఉన్నాయి. ఆ పెద్దా యన చేతిలో, తన ఆస్తి పత్రాలు ఉంటాయి, తను, అవి వంగి..
ప్రసాదం లా గంగిరెడ్డి కి చూపిస్తుంటాడు.. వాళ్ళని చూసి చూడకుండా, వెళ్తూ వెళ్తూ,
ఆ పాత్రలను లాక్కొని, మునుసబు వైపు చూస్తూ.

గంగిరెడ్డి

ఏయి, మునుసబు, వీళ్ళకి ఏమి కావాలో ఇచ్చి


పంపిచ్చు..

అని అక్కడ నుంచి వెళ్తూఉంటే, ఆ పెద్దా యన.. రెడ్డి ని చూసి మురిసిపోతాడు.


అప్పుడు మునుసబు గొడ్ల సావిడి వైపు చూస్తూ, ఒక వ్యక్తిని రమ్మని పిలుస్తా డు.

మునుసబు

రేయి మూగోడా, అయ్యగారు, బయలుదేరినారు, ఆ


కాగడా పట్టు కొని రా!

అంటే, అటు నుంచి ఒక వ్యక్తీ, ఆ పక్కలో పెట్టిని కాగడా ని తీసుకొని జనం ముందు


నుంచి నడుచుకొని వెళ్తు న్న గంగిరెడ్డి కి దివిటి పడతాడు. వాళ్ళు ఆ ఇంటి నుంచి ఒనిమి
వైపు వెల్ల సాగుతారు.

EXT. ONIMI - LATER

ఒనిమి దారి అంతా, స్మశానం కన్నా నిర్మానుశం, కిర్కెట్లు , గుడ్లగూబల, కుక్కలు


అరపుల, సల్లగాలి కి వూగుతున్న టెంకాయ పట్టా లు, కాలికింద పడి నలుగుతున్న

about:blank 35/180
5/19/23, 4:13 PM

ఎండుటాకుల, రెమ్మల, ముందుగా వెళ్తు న్న ముగోడి దివిటి గాలికి రెప రేపల తప్ప శబ్దా లు
అంతా నిశబ్ధం. అలా వెళ్తూ వెళ్తూ, ముగోడి తో

గంగిరెడ్డి

ఏరా!, నీ పెళ్ళాం కడుపుతో దా?

అంటే, ఆ ముగోడు నడుస్తూ.. నడుస్తూ.. అవును అని, తల ఊపుతాడు

గంగిరెడ్డి

అవునా.. ఎన్నో నెల దానికి?

అప్పుడు మూడు అని వెనక్కి తిరిగి చూడకుండా వేళ్ళతో చూపిస్తా డు.

EXT. MANGO GROVES - LATER

ముగోడు, గంగిరెడ్డి ఒనిమి దాటి, మామిడి తోపు దగ్గరకు రాగానే, నక్కలు కుస్తా యి.
కొద్ది దూరం లో ఆ గుంత తవ్విన చోట లాంతరు చేత పట్టు కొని చిన్నబ్బ నిలబడి ఎదురు
చూస్తూ ఉంటాడు. 

చిన్నబ్బ ని చూసి నడుస్తూ నడుస్తూ, గంగిరెడ్డి పంచ ఎగగట్టి, చేతి లోని లైట్ ఒక
పక్కకు విసిరి, అటు గా ఉన్న, చిన్నబ్బ కి టెంకాయల కొట్టిన చోట మాగిన మావిడి పళ్ళ
రాశి పక్కనే పెట్టిన వేట కొడవలిని తీసుకొని.. ముందుగా వెళ్తు న్న మూగోడి తల ని ఒకే
ఎటుకు నరుకుతాడు.

ఒకే ఎటుకు తల తెగి గుంతలో పడుతుంది, మొండెం లేని శరీరం మాత్రం కొద్దిదూరం,
దివిటి పట్టు కొని నడిచి, నడిచి ఆ గుంత దగ్గర పడుతుంది, ఆ పడటం తో.. తన
మొండెం నుంచి చిమ్ముతున్న రక్తం ఆ లంకెల బింది మీద పడి తడుస్తుంది. ముగోడి చేతి
లో ఉన్న కాగడా అలాగే ఉంటుంది, మరి గంగి రెడ్డి పడేసిన లైట్ వెలుతుర్లో, ముగోడి
కాళ్ళు కొట్టు కోవటం ఆగిపోతాయి. అదే సమయం లో మూగోడి మొండెం నుంచి నెత్తు రు
ఏరులా గంగిరెడ్డి ఎడమ కాలి చెప్పు కింద పారుతుంది.

EXT. NELLIMANDA TEMPLE - LATER

నెల్లిమన్ధ గుడి ఎదురుగ్గా ఉన్న రాచ్చబడ కట్ట మీద పడుకొని ఉన్న అగోరా ఒకతను,
బిగ్గున కన్నులు తెరిచి, లేచి ఆ మామిడి తోపు వైపు గా ఉరుముతూ చూస్తా డు.

EXT. MANGO GROVES - LATER

about:blank 36/180
5/19/23, 4:13 PM

చిన్నబ్బ మూగోడి చేతి నుంచి దివిటి ని లాక్కుంటాడు, గంగిరెడ్డి మూగోడి శరీరం మీద


కాలు పెట్టి ఆ గోతిలో ఉన్న బిందె ని చూస్తా డు, రక్తం తో తడిసి ఉంటుంది ఆ బిందె,
పక్కనే ముగోడి మొండెం.

గంగిరెడ్డి:

చిన్నబ్బ, ఆ కోడిని లాగేయి..

అంటే

చిన్నబ్బ

అట్నే అయ్యా!

ఇంతలో, ఆ చుట్టూ, పొదల్లో శబ్దం అయ్యినట్టు ఉంటుంది, అప్పుడు చిన్నబ్బ tourch


light, అటు ఇటూ పొదల్లో ఏస్తా డు. తన తో పాటు, గంగిరెడ్డి కూడా చూస్తా డు,
కాని అక్కడ ఎవ్వరూ ఉండరు.

అప్పుడు గంగిరెడ్డి, గుంతలో ఉన్న ఆ బిందె ని తీసుకొని కొద్ది గా వేనక్కి వచ్చి


నిలబడతాడు.

చిన్నబ్బ, ముగోడి శరీరాన్ని, అక్కడ దూలానికి కట్టి, నిప్పంటిస్తా డు. ఇంతలో ఆ పక్కనే
పొలానికి కట్టిన నీళ్ళు, కట్ట తెంచుకొని, వచ్చి రక్తం మరకల తో ఉన్న గంగిరెడ్డి
చెప్పులను, స్వయాన ఆ గంగామ్మే కడిగినట్టు గా, అక్కడ పొలానికి పారే నీళ్ళు తన
పాదాలను కడుగుతాయి. మంట పెట్టి, కాలిపోతున్న మూగోడి శరీరం దగ్గర నుంచి,
వాళ్ళు వెళ్తా రు (exit screen), వాళ్ళ కళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతాయి.

EXT. ONIMI - LATER

వాళ్ళు కుండ ని ఒనిమి లో తెసుకేల్తు న్నారు. 

గంగిరెడ్డి

ఏది ఏమైనా.. రేయ్.. వాణ్ణి ఆడ కాల్చిండ


కూడదు.. అనవసరం గా ఆ మావిడి చెట్టు ని
సంపితివి..

చిన్నబ్బ

అట్టా ఏమి కాదు సామి! ఆ మూగోడి బూడిదే,


చెట్టు కి అవుతాది.. సుస్తా వుందండి.. వారం రోజుల్లో
ఎట్టా పచ్చగా అవుతుందో!

about:blank 37/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

అంతే అంటావా?

అంటూ.. కొద్ది దూరం పొయ్యక, వాళ్ళ ఎనకాల పొదల్లో ఏదో విచిత్ర శబ్దం అయ్యినట్టు
ఉంటుంది, అప్పుడు గంగిరెడ్డి ఆ శబ్దం విని అక్కడే నిలబడతాడు. గంగిరెడ్డి ని చూసి
చిన్నబ్బ కూడా నిలబడతాడు. వాళ్ళకి ఘమ ఘమా ని మల్లెపూల వాసనా గాలిలో
వస్తుంది. అప్పుడు చిన్నబ్బ ఆ వస్తు న్న వాసన ని పిలుస్తూ, ముక్కులు యగారేస్తూ,
ఏందా అని

చిన్నబ్బ

అయ్యా, ఘమ ఘమా ని మల్లెపూల వాసన


వస్తా ఉండాది

అని వెనక్కి చూడబోతే, ఆది గమనించిన గంగిరెడ్డి

గంగిరెడ్డి

చూడొద్దు !

అంటే, చిన్నబ్బ వెనకి తిరగకుండా ఆగిపోతాడు, అప్పుడు గంగిరెడ్డి, మెడ తిప్పకుండా


వెనక్కి చూస్తా డు.

గంగిరెడ్డి

రే! ఎనక్కి తిరిగి చూడకుండా, గబ్బ గబా నడు!

అంటే, చిన్నబ్బ ముందు కాస్త పెద్ద అడుగులు వేస్తూ వెళ్తా డు, వెనకంటి గంగిరెడ్డి కూడా
పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతారు.

EXT/INT. REDDY HOUSE - LATER

చినబ్బా గంగిరెడ్డి వెనక్కి వస్తా రు, గంగిరెడ్డి బిందె పట్టికొని ఇంటిలోనికి వెళ్తా డు, చిన్నబ్బ
బయటే ఉంటాడు.

గంగిరెడ్డి సరాసరి దేవుడి గది లోకి ఆ అమ్మవారి ముందు లంకెబిందె పెట్టి, దండం పెట్టి  

గంగిరెడ్డి

నాకు తెలుసమ్మా, నీ సల్లని సూపు నా మీదే


ఉంటుందని. నువ్వు ఉండేంతవరకు.. నాకు అన్ని
మంచి రోజులే తల్లి. ఇట్నే ఆ దొర మనస్సు కరిగితే,

about:blank 38/180
5/19/23, 4:13 PM

ఈ చుట్టూ 100 గ్రామాల్లో నాతో తూగే మొగోడు


ఉండడు.

అని ముక్కుతాడు

EXT. REDDY HOUSE - MORNING

గంగిరెడ్డి ఇంటి ముందు, ఒకపక్క, కొంతమంది జనాలకి వడ్లు పంచుతూ ఉంటారూ,


ఇంకో వైపు గంగిరెడ్డి వాలు కుర్చీ లో పడుకొని, ఆకాశ వాని వింటూ ఉంటాడు, చుట్ట
కాలుస్తూ ఉంటాడు. తన పక్కనే.. బాగా మాగిన మావిడిపళ్ళు ఉంటాయి, గంగిరెడ్డి ని
దాటుకుంటూ, ఇద్దరూ కూలీలు.. మావిడి పళ్ళు లోనికి 

రెడ్డికి నిడగా ఒక వ్యక్తీ గొడుగు పడుతూ ఉంటాడ. అప్పుడు ఆకరుగా వడ్లు తీసుకోని
వెళ్తు న్న అతను, తన సంచి ని చూసుకుంటూ.. ఆనందం తో ఏడుస్తూ, గంగిరెడ్డి కి
దండం పెడతాడు. వెళ్తు న్న అతన్నే (వెంకటసుబ్బా) గంగిరెడ్డి చూస్తుంటాడు.
అప్పుడు.. మునుసబు ను పిలిచి..

గంగిరెడ్డి

మునుసబు.. వాడు మన ఈడిగిపల్లి వెంకటసుబ్బా


కదా?

అంటే.. ఆ వ్యక్తినే చూస్తూ..

మునుసబు

అవును దేవరా! వాడే..

అని.. మళ్ళి గంగిరెడ్డి వైపు చూస్తూ..

గంగిరెడ్డి:

ఆహా! మీరు ఏదైనా వొక్క సారి చూస్తే.. అది మీ


బుర్ర లో అచ్చు గుద్దా ల్సిందే.

అంటే

గంగిరెడ్డి

నువ్వు నాకు చిడతలు కొట్టటం అప్పి.. ముందు


వానికి ఏమైందో చెప్పు..

అంటే.. అప్పుడు

about:blank 39/180
5/19/23, 4:13 PM

మునుసబు

అప్పుడెప్పుడో.. 50 ఎకరాల ఆసామీ లెండి! ఇప్పుడు


అడుక్కునేదానికి ఇస్తరాకు, కప్పుకునేదానికి
తాటాఆకు.. తప్ప ఏమి లేవు..

గంగిరెడ్డి

ఏమి పాపం!

మునుసబు

మీకు తెలియంది ఏముంది చప్పండి.. 

అంటే.. గంగిరెడ్డి మునుసబు వైపు చూస్తా డు.. అప్పుడు

మునుసబు

కరువు .. కరువు.. దాని పైన ఆ మహమ్మారి


వ్యాదులకు ఊల్లకు.. ఊళ్ళు.. వూడ్చుకొని..
పోతున్నాయి.. ఇప్పుడు ఆ ఈడిగిపల్లి కాస్తా
ఇటుకులపల్లి అయ్యిపోయింది..

గంగిరెడ్డి

ఎంత ఘోరం అయ్యా.. మునుసబు.. ఆ దేవుడికి..


బొత్తిగా కరుణా, జాలి ఏమి లేవు! ఉంటె.. వాణ్ణి
అట్టా బాధపెట్టే బోదులు.. ఏకం గా తీసకపోయున్నా
బాగుండు..

మునుసబు

మీరు తలుచుకుంటే.. అది ఎంత పని.. లెండి!

అంటే, మునుసబు ని ఉరిమి చూస్తా డు.. అప్పుడు మునుసబు నోరు


ముసుకుంటాడు..

మునుసబు

ఇప్పుడు, ఆ వ్యాది మన ఊరికి కూడా వచ్చేసింది


అండి. ఆ కదిరెప్ప గాడి లేడు, వాడి బావమరిది
కూడా అది సోకి నిన్నే సచ్చి పోయాడంట.

అంటే, రెడ్డి మునుసబు ని చూస్తూ ఘంబీరంగా

about:blank 40/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

ఏయి ఆపు!, యదవ సోది.. నిన్ను ఊరిలేకి


పంపిచ్చేది, జనాబా లెక్కలు తెస్తా వని కాదు, నేను
అడిగేవి మాత్రమే చెప్తా వని.

అంటే, అది విని అక్కడ ఉన్న వారంతా హడలిపోతారు. మళ్ళి నోరు ముసుకుంటాడు

మునుసబు

శ్రీవారు.. క్షమించాలి

గంగిరెడ్డి

అది సరే గాని.. ఆ ఊరి అవతల కొన్ని పురుగులు


ఉండాలనే.. వాటి గురించి.. ఏమైనా చెప్పు?

అందుకు..

మునుసబు

అయ్యా.. ఈ చుట్టు పక్క 22 ఊర్లు మీవి.. ఇక్కడ


మీ మాటే.. శాసనం.. అట్టాంటిది.. మీ మాట ని
కాదని వాళ్ళకి..

అంటే.. గంగిరెడ్డి మునుసబు వైపు చూస్తా డు.. అప్పుడు

మునుసబు

కాదు కాదు.. ఆ పురుగులకి.. ఈ చుట్టు పక్కల


ఊర్లల్లో గుప్పెడు గింజలు కాదు కదా.. గుక్కెడు
మంచినీళ్ళు కూడా పుట్టా వు!.. వాళ్ళు ఇంక అంతే..
గాలిలో కలిసిపోయినట్టే!

ఎల్లిపోయినట్టే అని చేతి లో సైగ చేస్తా డు

గంగిరెడ్డి

ఏది ఏమైనా, ఆ పాలేటి గాడు తొందర పడిండకూడదు


రా!

అంటే

మునుసబు

about:blank 41/180
5/19/23, 4:13 PM

అవును సామి! వాడికి పొయ్యే కాలం.. వొచ్చి..


మీతో..

అంటే.. అప్పుడు గంగిరెడ్డి.. కలగచేసుకొని

గంగిరెడ్డి

ఇంకొక మాట ఆ నోటి నుంచి వచ్చిందనుకో.. చిన్న


నాటి స్నేహితుడు అని కూడా చూడను.. అడ్డంగా
నరికిచ్చేస్తా ను.. పోయ్యి సావు అక్కడ!

అంటే, మునుసబు మూతి మీద చెయ్యి వేసుకొని.. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


అప్పుడు కర్ణం తో..

గంగిరెడ్డి

ఏ మయ్యా.. కర్ణము.. వాడికి వో కొడుకు ఉనట్టు


ఉండ్లా ?

అంటే

కర్ణం

అవును సామి.. వాడు కూడా వాళ్ళ అవ్వతో నే


వుండాడు లెండి.

అంటే

గంగిరెడ్డి

అది కాదయ్యా! వాడూ.. వాళ్ళ నయినా మాదిరే


పూజలు గట్రా ఏమైనా?

కర్ణం

అబే! వాడు బొత్తిగా పనిచేటు స్వామి! వాడో బురద


పాము లెండి, గుట్లేమ్మడి గాలికి తిరుగు
కుంటావుండాడు. వాడికి గంట పట్టు కునేదే రాదు,
ఇంక పూజలు యాడ చేస్తా డు.

అంటే

గంగిరెడ్డి

about:blank 42/180
5/19/23, 4:13 PM

మొర్తా నికి, ఆ అమ్మోరికి పూజలు చేసేదానికి ఇక


ఎవ్వరు లేరు అంటావు.

కర్ణం

అంతే కదా సామి!

గంగిరెడ్డి

కలియుగం అంతం అంటే.. ఇదే నెమో.. ఆ


అమ్మోరు తో నే.. అన్ని పాయ.. ఇక మన ఊర్ల ని
బాగుపరిచే వాళ్ళు ఎవరో.. ఆ తల్లి కే తేలియాల!

EXT/INT. CHALAPATHI NEW HOUSE - EVENING

ఒక పెట్ట కోడిని పట్టు కొని, చేతిలో గుడ్డ బ్యాగు తగలేసుకొని, నెత్తిన బియ్యం మూట
పెట్టు కొని, ఇంటికి వస్తుంటాడు..

మునెమ్మ

ముదనష్టపు సచ్చింది.. నా కొంపే దొరికిందా..


దీనికి.. తేరగా వొచ్చి తినిపోఏదానికి.. ఇంకో సారి రా
ఈ పక్క, కోసి కరం పొడి చల్లతా. ఏమనుకున్నావో

మునెమ్మ బయట కూర్చొని, పురుగులు పట్టిన నూకలు చెరుగు కుంటూ ఉంటుంది. తను
చెరిగి ఏసే నూకలని తినడానికి వచ్చిన కోడి ని తిడుతూ ఉంటుంది అప్పుడు మునెమ్మ ని
చూసి చలపతి

చలపతి

ఓ మునేమ్మో ఎట్టా ఉండావు?

మునెమ్మ చలపతి ని చూడకుండా, చెరుగుతా

మునెమ్మ

వచ్చినావా! రా! ఇన్నాళ్ళకి ఇంటికి దారి కనిపించినట్టు


ఉందే అయ్యాకి?

అని చలపతి ని చూస్తుంది, ఆ చాట ని పక్కన పెట్టి లేచి చలపతి వైపు వస్తూంటుంది,
అప్పుడు

చలపతి

మల్లీ అలిగినావా! సరిపాయ బో.

about:blank 43/180
5/19/23, 4:13 PM

అంటే, మునెమ్మ వచ్చి, తన చేతిలో సంచి తీసుకుంటూ

మునెమ్మ

లేకా! నువ్వు రంగాల్నే.. హారతి ఇమ్మంటావా?


వారాలు తరబడి దేశాలు పట్టు కొని పోతావు..  యాడ
ఉంటావో తెలిదు, యాడ పని చేస్తా వో తెలిదు..
అయ్యో! ముసిల్దే, ఎట్లుందో ఏమో, అని ఏమన్నా
ఉందా రా ని కి..

చలపతి అరుగు దగ్గరకి వచ్చి, తల మీద ఉన్న మూట ని దించుతూ

చలపతి

నీకేమే తల్లి, గుండ్రాయి లా ఉంటే!..

కొంపదీసి మీ ఇంటి ఆయన ఏమన్నా రామ్మన్నాడా ఏంది?.. అట్లాంటి పనులు యాడై నా


చేసేవు, ముందే పెండ్లి పెటాకులు లేనోడిని.. అనాధ నై పోతాను.. 

మునెమ్మ

సాల్లే సంబడం.

అంటూ.. తన ఇంకో చేతి సంక కి తగలేసుకొని ఉన్న కోడి పెట్ట ని ఇస్తూ

చలపతి

ఇందా.. మంచి మసాలా ఎసి, కూర వొండె..


నాలుక సచ్చిపోయింది.

అని లొట్టలు వేస్తా డు, ఇంతలో చలపతి స్నేహితుల్లో వొకడు (కోనా) వెనకల నుంచి

కోనా

ఇక్కడ నా నాలిక కూడా అట్నే ఉండాది.

అంటే, కోనా వైపు చూసి

చలపతి

హ్మం! ఇంక దాన్ని తిన్నట్టే, ఆ కోడి ఏ ముక్కులేకి


రా నికి. దాని వంశాన్ని మొర్థం కోసి పెట్టినా సలేటట్టు
లేదు ఆ కడుపు కి.

మునేమ్మ

about:blank 44/180
5/19/23, 4:13 PM

సాల్లె రా, దిష్టి పెట్టద్దు తినే బిడ్డకి, 

అని అరుగు మీద సాప వేస్తూ కోనా వైపు చూసి

చలపతి

దిష్టి! నేను, వాణ్ని చూసినావా ఎట్టుంటాడో.. వాడు.

మునెమ్మ

ఈ యగసక్కాలకు ఏమి కొదవ లే!, పొయ్యి నీళ్ళు


కొట్టు కొని రా బో!

అని టువాలు చలపతి కి ఇస్తుంది, చలపతి దాన్ని తీసుకోని బచ్చలి వైపు వెళ్తా డు, కోనా
వైపు చూసి

మునెమ్మ

వాని మాటలకు ఏమి కాని, ఇందా

అని, సూరికత్తి కోనా చేతికి ఇచ్చి

మునెమ్మ

ఆ కోడిని కోసి, బొచ్చు పీక్కొని రాబో!

అంటే, నోరు తెరుసి

కోనా: ఎవరూ నేనా!

అని మునెమ్మ వైపు చూస్తుంటాడు,

మునెమ్మ

నిన్నే రా! కోడిని కోసుకొని రా రా అంటే, నా మూతి


చుస్తా వేంది రా బూడిదే మొహమోడా! పో!

అంటే, కోనా వాటికి తీసుకుంటాడు, అప్పుడు

కోనా

ఇత్తు మంచిది ఐతే కదా, చెట్టు సరిగ్గా ఉండేదానికి.


దొందు దొందే రా సామి!.

అని, అంటే, మునెమ్మ లోపల నుంచి

about:blank 45/180
5/19/23, 4:13 PM

మునెమ్మ

ఏంది రా అంటావుండావు!

అంటే, గోనుగుకుంటూ

కోనా

యాడ పోయిన ఈ బొచ్చు పీకే ఉద్యోగమ మాత్రం


పోదు!

అని, కోనా అటు గా చీకటి లోకి వెళ్తా డు, కోడిని కోసే సౌండ్స్ (sfx)

EXT/INT. CHALAPATHI NEW HOUSE - LATER

వాళ్ళు ఇద్దరికీ ప్లేటులో సంగటి పెట్టి, కోనా కి మాత్రం ఇస్తరాకు లో పెడుతుంది, అది
చూసి

చలపతి

యాల, వాడికి కూడా కంచం లో నే పెట్టకూడ దా

చలపతి వైపు చూస్తుంది, చలపతి కూడా మునెమ్మ ని చూసి.

చలపతి

వీటికి ఏమి తక్కువ లే!.

అంటే, కోనా వాళ్ళని చూసి

కోనా

వున్నిలే రా!, దేంట్లో తింటే ఏమి, నువ్వు కాని..

అని, మునేమ్మని చూసి

కోనా

నువ్వు పెట్టు మా!.

అంటే, చలపతి కి కాస్త కిందకు పెట్టి, కోనా కు, కాస్త ఎత్తి వోడ్డిస్తుంది, వాళ్ళు తింటూ
ఉంటారు అప్పుడు. మునెమ్మ లిపలికి పోతుంది. అప్పుడు

కోనా

about:blank 46/180
5/19/23, 4:13 PM

చలపతి, కొట్టు కొచ్చిన సొమ్ము అని ఆ కొమిటోడు..

అంటే!

చలపతి

వాడి సంగతి మళ్ళా చూడొచ్చు గాని, దిగవపల్లి లో


రేపు రెండు పెండిండ్లు ఉన్నాయంట! నీకి ఏమైనా
తెలుసా?

కోనా

ఆ కుమ్మరోల్ల చిన్నప్ప లేడు.. వాని కుతురిది నూ,


ఆ ఊరి ఆసామి గాని కొడుకుది.

చలపతి

సర్లే!.. నువ్వు తినేసి, మనోళ్ళని ఆ చెరువు కింద


రాగి మాను కాడికి తోడుకోనోచ్చెయ్, నాయునమ్మ
నిద్దర పోయినాక, నేను వస్తా ను.

అంటే

కోనా

సరే!

అని, కోనా తినేసి, ఆకు ముడిసి, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

EXT. MARRI CHETTU - NIGHT

రాత్రి, బాగా చీకటి గా ఉన్న ప్రదేశం, అడవి దగ్గర చెంద్రు డి వెలుతురూ లో వూగుతూ
ఉన్న పెద్ద గా ఉండే మర్రి మాను, అటుగా పొలాలు, కాలవలు, దూరం నుంచి ఆ
మాను కింద కి ముగ్గురు వ్యక్తు లు, రెండు లాంతర్ల తో వస్తా రూ. ఇంకొక పక్క నుంది,
ఇంకొక వ్యక్తీ బాటరీ లైట్ తో అక్కడికి వస్తా డు. అక్కడ చెట్టు కింద నిలబడి, వాళ్ళు
బిడిలు ఎలిగిచ్చు కుంటారు, కాస్త కల్లు కూడా తాగి.

కోనా

ఇప్పుడు కల్లు ఎందుకు రా?

చలపతి

దైర్నానికి లే!

about:blank 47/180
5/19/23, 4:13 PM

అలాగే ఇంకో బాటిలు తీస్తా డు.. అప్పుడు

సోమా

ఎన్ని నువ్వే తాగుతావా?!! నాకు కొంచం పొయ్యి,


దైర్నం కావాలి.

చలపతి

ఇది కొసరు.. లే రా.. అయ్యిపోయింది.

బుజ్జి

సరిపాయ..రా ఇంక దొంగతనం చేసినట్టే..

అని తాగి, లాంతర్లు ఆపేసి, ఆ బాటరీ ఉన్న వ్యక్తి తో, అతని గుండా వెళ్తా రు.

EXT. DIGUVAPALLI VILLAGE – MAIN STREET - LATER

దిగువపల్లి మైలు రాయి, 8 కాళ్ళు ఆ మైలు రాయి ని దాటుకొని, ఆ పల్లిలోకి


వెళ్తా యి. వెళ్తూ వెళ్తూ.. వాళ్ళ వీపులు కనిపిస్తా యి. ఆ ఊరి వీదులంతా చాలా
నిర్మానుషంగా ఉంటాయి, చూసిన ఇంటికి కంతా బీగాలు వేసి ఉంటాయి, ఊరంతా తిరిగి
ఒక పెండ్లి ఇంటికి వచ్చి నిలబడతారు. అప్పుడు

సోమా

చలపతి! ఏంది రా ఊరంతా ఇంత కాళిగా ఉంది.

మాట్లా డుకుంటూ వాళ్ళు ఒక చిన్న ఇంటి దగ్గరకు వస్తా రు, అక్కడ పందిరి వేసిఉంటారు.
అది కుమ్మరి వారి ఇల్లు అని చూసిన వెంటనే చెప్పయొచ్చు

కోనా

పెండ్లి ఇల్లు కుడా బీగాలు ఎసినారు అంటే, ఏ


దెయ్యమో, పిశాసో.

బుజ్జి

దెయ్యలు ఉంటె, ఇండ్లకి బీగాలు ఏంటికి ఏస్తా రు రా,


కొంపదీసి, మనము వస్తా ఉండామని ఏమన్నా ముందే
తెలిసిపోయిందా?

అప్పుడు చలపతి వాళ్ళని చూసి

about:blank 48/180
5/19/23, 4:13 PM

చలపతి

అబ్బా! నోరు ముయ్యండి రా, అరిసి మీరే దండోరా


ఏసే టట్టు ఉన్నారు.

అంటే, వాళ్ళు శబ్దం చేయటం ఆపుతారు, ఇంతలో వాళ్ళకి హార్మోనియం శబ్దం


వినిపిస్తుంది, అప్పడు

సోమా

రేయ్, యాడనో హర్మోనియ్ము

అంటే

చలపతి

అదీ కథ!.. నాటకాలు ఏస్తు న్నారు అనుకుంటా,


ఊరంతా ఆడనే ఉన్నట్టు ఉండారు గని, మన పని
కాన్నిద్ధం పదండిరా!

అని అటుగా పోతుంటే, అప్పుడు

బుజ్జి

యాడికో ఎందుకు.. ఎదురుగ్గనే ఉందిగదా, పెండి


ఇల్లు .

చలపతి మళ్ళి వచ్చి.. బుజ్జిని తో

చలపతి

వొద్దు బుజ్జి!, కుమ్మరోడు మట్టి పిసికి, కూతురికి


పెండ్లి చేసింటాడు, వాని నోట్లో మట్టి కొట్టేది వొద్దు , ఆ
ఆసామి గాని ఇంటికి పదాము పదండి.

అంటే, బుజ్జి ఎనక్కి తిరిగి చూస్తా డు, అప్పుడు చలపతి తల ఊపి

బుజ్జి

సరే పదా!

అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. Off Screen

EXT. DIGUVAPALLI VILLAGE – SUB STREET - LATER

about:blank 49/180
5/19/23, 4:13 PM

వాళ్ళు ఆసామి ఇంటికి వెళ్తు న్న దారి లో ఒక సందులో నుంచి బయటకు వస్తా రు, నేరుగా
ఆ నాటకం జరుగుతున్నా స్థా లానికి వస్తా రు.అక్కడ జనాలు కూర్చొని నాటకం చూస్తూ,
అందులో లీనమై ఉంటారు.

సోమా

సరిపాయ, పొయ్యి పోయి ఈడికే వస్తిమా!

అంటే, అప్పుడు చలపతి

చలపతి

ష్! ఎవరైనా చూస్తా రు రా!.. పదండి రా!

అని, ఆ నాటకం వేస్తు న్న దగ్గర నుంచి వెళ్లబోతూ, ఆ నలుగురూ వొక్కసారి వెనక్కి
తిరుగుతారు, వాళ్ళ వెనకాలే ఆ ఉరి వ్యక్తీ నిలబడి ఉంటాడు. అతను తాగి ఉంటాడు,
వాళ్ళు అతన్ని చూసి కంగు తింటారు, వాళ్ళని చూసి ఆ వ్యక్తీ

వ్యక్తీ9

యోవ్! యాడికి యా పోతావుండేది, ఆడ నాటకం


మంచి రసపట్టు లో ఉంటే

అని, చలపతి చెయ్యిని పట్టు కొని లాక్కుంటూ వెళ్తా డు, స్టేజి మీద ఇంద్రు డు గౌతముడి
వేషం లో అహల్య ఇంటికి వస్తా డు, అహల్య నిద్ర పోతావుంటుంది

ఇంద్రు డు

అహల్యా!, అహల్యా!

అంటూ నిద్ర లేపుతాడు, అహల్య వేషం లో ఉన్న వెంకటలచ్చిమి, స్టేజి మీద వున్నా
మంచం మీద నుంచి లేచి వస్తుంది, ఒక్క సారిగా వెంకట లచ్చిమి ని చుసిన చలపతి,
అదేదో అద్బుతాన్ని చూసినట్టు , తన కళ్ళు తెరుచుకుంటాయి, వెంకటలచ్చిమి అందాలను
చుసిన చలపతి, వొక్కసారి ఆ చందామామ వైపు చూసి, మళ్ళి కన్ను ఆర్పకుండా తనే
చూస్తుంటాడు, అప్పుడు వెంకటలచ్చిమి మాటలు తప్ప చలపతి కి ఏమి ఇనిపియ్యవు,
లాక్కుంటూ వెళ్తు న్న అతని వెంట మయమరచిపోయి వేల్లిపోతుంటాడు, చలపతి అలా
పోవడం చుసిన తన స్నేహితులు

సోమా

ఆడు చూడు, వచ్చిన పని వొదిలేసి, ఎట్టా సొంగ


కార్చుకుంటున్నాడో.

about:blank 50/180
5/19/23, 4:13 PM

చలపతి ని పిలవటానికి ప్రయత్నిస్తా రు, కాని అక్కడ ఉన్న జనాల్ని చూసి ఆగిపోతారు,
అప్పుడు

కోనా

వొద్దు రా, ఊరిజనాలు ఈడనే వుండారు, తేడా వస్తే


ఈడే సస్తం. మైకం వొదిలితే వాడే వస్తా డు లే,
మనము పదాము రండి.

అని అక్కడ నుంచి వాళ్ళు చిన్నగా జారుకుంటారు. అప్పుడు చలపతి తనని తానే
ఇంద్రు డిలా ఊహించుకొని, ఆ పాత్ర లో పరకాయ ప్రవేశం చేసినట్టు ఊహించుకుంటాడు..
అప్పుడు అహల్య ని ఎగా దిగా చూసు

చలపతి

ఆ హా ఏమి ఈ లావణ్యము. దేవి, ఆ దేవలోక


కాన్తలైన, రభా, ఊర్వసి, మేనకలు నీ కల్దూలి లికి
సమానులే.

అని తన దగ్గరకి రాబోతే, అహల్య నే చూస్తూ

వెంకటలచ్చిమి

ఆ!

అని దగ్గరకి రాకండి అని చెయ్యి చూపిస్తుంది, అప్పుడు ఇంద్రు డు.

చలపతి

నన్ను ఆపకు దేవి, మల్లె పూల సుగంధాలతో,


ముంచెత్తిన, ఈ నిలువేత్తు సౌందర్యము, గిలిగింతలు
పెట్టి, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  

ఆ మాటలు విన్న అహల్య, వచ్చింది ఇంద్రు డు అని తెలుస్తుంది. అప్పుడు ఇంద్రు డిని
చూసి అహల్య సిగ్గుపడి, అతన్ని వోరకంట గా చూస్తుంది. అది చూసి ఇంద్రు డు

వెంకటలచ్చిమి

స్వామీ, ఏమిటి ఈ విచిత్రం

చలపతి

విచిత్రం కాదు కోమలి, నీ వొరకంటి చూపు తోనే నా


హృదయ వీణను మీటి, మరులు రేకెత్తించే నయన

about:blank 51/180
5/19/23, 4:13 PM

సుందరివి. సరసాలు కురిపించే సొగసు జవరాలివి, ఇక


నైనా నా ఆవేదన ఆలకించు.

అంటే, ఇంద్రు డి చంతకు వస్తుంది అహల్య, అప్పుడు ఇంద్రు డు, తన బాహుబందాలలో


అహల్యను బందిస్తా డు, అప్పడు అహల్య ఇంద్రు డిని చూసి..

వెంకటలచ్చిమి

మదనా, హృదయేశ్వరా!

అంటూ, అహల్య ముద్దు ఇవ్వటానికి ముందుకు వచ్చి కళ్ళు ముసుకుంటుంది, ఇంద్రు డు


కూడా ముద్దు కోరుతూ ముందుకు వస్తా డు, అప్పుడు

చలపతి

సకి, నీ ముఖారవిందమున, ఈ రోమాలు ఎక్కడివి

అంటే, మగ గొంతు తో..

వ్యక్తీ9

రోమాలు కాదు రా అవి, మీసాలు

అంటే, మైకం నుంచి తేరుకుంటూ..

చలపతి

మీసాల?

అంటూ, కళ్ళు తెరుస్తా డు, ఒక నల్లటి వ్యక్తీ ని హత్తు కొని ఉంటాడు, చలపతి కళ్ళు
తెరవంగానే ఆ వ్యక్తి ని చూసి, కంగు తిని, అటూ ఇటూ చూస్తా డు, నాటకం కాస్తా
అయ్యిపోయి వుంటుంది, వాళ్ళు గడ్డివాము దగ్గరే పడివుంటారు.. ఆ వ్యక్తీ ఇంకా
మత్తు లోనే ఉంటాడు చకపతి లేచి అతన్ని చిన్నగా తన్ని, ఉమ్మేస్తూ, ఆ నాటకం జరిగిన
పందిరి దగ్గర సర్దు తూ ఉన్న ఒక వ్యక్తీ దగ్గరకి వెళ్ళి

చలపతి

నో, ఈ నాటకాల ఎసినోళ్ళు యాడ ఉండారు నా?

వ్యక్తీ9

వాళ్ళు ఇంకా యాడ వుంటారు, ఎప్పుడో బురుజు పల్లి


దాటే సింటారు.

about:blank 52/180
5/19/23, 4:13 PM

చలపతి
( గోనుగుతూ )

బురుజుపల్లి, దాటే సింటారా?..

అని తల గోక్కుంటాడు. అప్పుడు చలపతి కి ఈల శబ్దం వినిపిస్తుంది, ఆ ఈల విన్న


చలపతి, అక్కడ నుంచి చిన్న గా జారుకుంటాడు. (Off Screen)

EXT. DIGUVAPALLI VILLAGE – AASAMI HOUSE - MORNING

దిగువపల్లి ఆసామి ఇంట్లో ఆ ఊరి జనం గుమిగూడింటారు, ఆసామి అందరి మొహాలు


చూస్తుంటాడు, అందరూ తల కిందకి వొంచుకొని వుంటారు, అప్పుడు

ఆసామి

మీ మొహాలు నేలకేసి చూస్తే, ఎట్టా రా!

అంటే, ఆ గుంపులో ఒక వ్యక్తీ, తల ఎత్తి

వ్యక్తీ10

ఏమి చేసేది సామి, కాని కాసు మిగాలించకుండా,


మొర్థం వూడిచేసారు.

ఆసామి

పోయింది మీవే కాదు రా. నా ఇల్లు కూడా సూద్దాం


గా నాకేసారు... ఆ నా కొడుకులు ఎంతో దూరం
పోయ్యుండరు, చెట్టు కొకడు, పుట్టకొక్కడు ఎతకండి
రా!

EXT. MARRI CHETTU - LATER

చలపతి, కోనా, సోమా, బుజ్జి అదే అడవి దగ్గర ఉండే మర్రి చెట్టు కింద కూర్చొని,
కొట్టేసిన సొమ్ములు పంచుకుంటూ ఉంటారు, చలపతి మాత్రం ఆ చెట్టు కింద బల్ల పైన
పనుకొని, ఆకాశం వైపు చూస్తూ, పరధ్యానం లో ఉంటాడు. చలపతి కి ఎటు చూసినా
అహల్య ఏ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కొట్టేసిన సొమ్ములు పంచుకున్నాక, సోమా,
కోనా బుజ్జి వెనక దగ్గర ఇంకో చిన్న సంచి వుండడం గమనించి, అప్పుడు

సోమా

రేయ్, బుజ్జి..నీ కాడ ఉండే సంచి బయట తీ రా!

అంటే, బుజ్జి, తల ఊపుతూ,

about:blank 53/180
5/19/23, 4:13 PM

బుజ్జి

నా కాడ ఏమి లేవు!

అంటే, ఆ మిగతా వాళ్ళకి అనుమానం వచ్చి, ముగ్గురు కోనా వైపు అనుమానం గా


చూసి తన మీద మీద పడతారు, కింద వాళ్ళు గీజులాడుకుంటున్నా, ఏమి జరగనట్టు ,
పరధ్యానం లో ఉంటాడు చలపతి, వీళ్ళ మాటలు లేసుగా వినిపిస్తుంటాయి. అప్పుడు
కోనా, ఆ సంచిని బలవంతంగా పిక్కుంటాడు, దాన్ని ఓపెన్ చేస్తే, అందులో చక్కిలాలు
ఉంటాయి. ఆ చక్కిలాలని, కోనా ని చూసి!

సోమా

తిండిపోతు నా యాలా! గంగమ్మ కి ఎనుపోతు మీద


ఉనట్టు , నీ ధ్యాసంతా తిండి మీదే. సొమ్ములు ఎత్తక
రా రా అంటే, చెక్కిలాలు కొట్టు కోచ్చినాడు.

అంటే, అప్పుడు బుజ్జి తన సంచి లో చెయ్యి పెడతాడు. అహల్య ధ్యాస లో ఉన్న


చలపతి కి, గంట శబ్దం వినిపిస్తుంది. ఆ గంట శబ్దం విని, దిగ్గున లేచి అటు ఇటూ
చూస్తా డు, అప్పుడు బుజ్జి అరచేతిలో చిన్నటి అమ్మవారి విగ్రహం, ఇంకో చేతిలో గంటను
పట్టు కొని కొడుతూ ఉంటాడు, అది చుసిన చలపతి, కాలితో బుజ్జి ని తంతాడు, వాడు
అటు గా ఎగిరి పక్కకి కి పడిపోతాడు, వాళ్ళు అందరు చలపతి ని చూసి కాస్త
బయపడుతారు. అప్పుడు చలపతి బుజ్జి ని చూసి..

చలపతి

చ! పో రా!

అని, తన మీద తనే విసుక్కొని

చలపతి

ముందు, ఆ బొమ్మని యాడై నా పడేసి రా బో రా.

అంటే, బుజ్జి లేచి పరిగెత్తు కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు కోనా దగ్గరకి
వచ్చి

కోనా

ఏమైంది రా నీకు, ఎబ్బుడు లేనిదీ, వాణ్ణి అట్ట


తంతివి.

చలపతి

about:blank 54/180
5/19/23, 4:13 PM

ఏమో రా, ఆ గంట శబ్దం వింటే, మా నాయన


గుర్తు కు వస్తా డు.

కొనా

మీ నాయన అంటే, ఎందుకు రా నికి అంత కచ్చి

చలపతి

దేవుడు. దేవుడు అని, వాడు ఎట్లా బాగుపడలా,


మమ్మలి బగుపడనీల.. వాడే సరిగ్గా ఉండుంటే,ఈ
యాల నేను ఇట్టా ఉండాల్సిబడలే.

సోమా

అది సరే రా, ఆ దేవుడు మీద నమ్మకం లేకపోతే,


దాన్ని అమ్ముకోనేడానికి ఏమి?

చలపతి

ఆ దేవుడు వొద్దు .. దేవుడి సొమ్ము వొద్దు .. కాని..


నేను పోతావుండా

అని, అక్కడ నుంచి లేచి అడవి బాట పడతాడు, చలపతి వెళ్ళిపోతున్నది చూసి

సోమా

ఎక్కడికి రా చలపతి?

చలపతి

మనస్సు బాగోలేదు రా!, మీరు పొండి, నేను మల్ల


వస్తా .

EXT. VILLAGE HOUSE (RANDOM PERSON) - LATER

ఊరిలో ఒకరి ఇంటిలో చావు, ఆ చావుకు బ్రంహన్న వచ్చిఉంటాడు, అక్కడ కూర్చున్న


కొంతమంది పెద్ద మనుషులలో ఒక పెద్దమనిషి, బ్రంహన్న తో

వ్యక్తి

ఈ ఇంటో.. ఈ వారం లోనే.. ఇది రెండో సావు..


రా బ్రంహన్నా.. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో
ఏమో?

బ్రంహన్న

about:blank 55/180
5/19/23, 4:13 PM

మన చేతుల్లో ఏముంది చెప్పు.. బావా! అంతా ఆ


దేవుడి రాత

వ్యక్తి11

నాకు తెలిసి ఎప్పుడై తే ఆ అమ్మోరి జాతర అర్ధాంతరంగా


ఆగిపాయనో, అప్పటి నుంచే మనకి ఈ దరిద్రం
పట్టు కున్నట్టుంది. పోనీ.. ఈ పాలేనా జరిగేనా

అంటే

బ్రంహన్న

ఏమో బావా! నువ్వు నేను అనుకున్నంత మాత్రానా,


జరిగిపోతుందా చెప్పు, ఆ గుడిలో ఉండే అమ్మోరు,
ఈ ఊరిలో ఉండే రెడ్దోరు పూనుకోవాలి గాని.

వ్యక్తి11

ఈ రోజుతో.. అయ్యిపాయ! మీ యక్కా.. నేను


తప్పిచ్చి నా వంశం అంతా మన్నులో కలిసిపాయిరి
కదరా

అంటే

బ్రంహన్న

ఊరుకో బావా

అనే లోపు.. అక్కడికి ఒక వ్యక్తీ వచ్చి

వ్యక్తి12

తాతా, తలకు సీకాయ పెట్టా లంట, వాళ్ళు


పిలస్తా వుండారు రా!

అంటే, ఆ వ్యక్తీ అక్కడ నుంచి లేచి 

EXT. REDDY HOUSE - LATER

నాటకాల వాళ్ళు (రాఘవయ్య, అతని భార్య, వెంకట లచ్చిమి, లక్ష్మీపతి ఇంకొంతమంది


నాటకం పెద్దలు), రీతి రివాజు గా, నాటకం వేసే ఊరి పెద్దల ఆశీర్వాదం కోసం వాళ్ళ
ఇండ్లకు పోవటం, వాళ్ళు ఇచ్చే ధన ధాన్యాలు, బట్టలు పుచ్చుకోవటం ఆనవాయితీ,
అందుకు ఈ సారి నాటకం గంగిరెడ్డి వాళ్ళ ఊరిలో కావటం తో, సమ్మతం కోసం వాళ్ళు

about:blank 56/180
5/19/23, 4:13 PM

ఆయన ఇంటికి వస్తా రు. అక్కడ ఇంటివైపు తిరిగి.. గంగిరెడ్డి టెంకాయ చేట్టు కింది, నీడ
పట్టు న నూలు ఈచీ కిర్చి మీద కూర్చొని ఉంటె.. మంగలోడు గడ్డం చేస్తుంటాడు..

గంగిరెడ్డి

ఒరేయ్.. సుబ్బిగా.. నువ్వు గడ్డం గోకతాఉంటే..


శానా సమ్మగా ఉండాది కదరా..

ఆటే.. వాడు నవ్వుతాడు.. ఇంతలో ఈ నాటకాల వాళ్ళకి ఈ ఊరి అలవాట్లు


తెలికపోవటం తో, వాళ్ళ సరాసరి గంగిరెడ్డి ని పోగుడుకుంటూ.. వస్తుంటారు..
రాఘవయ్యా తో పాటు తన గుంపు ఆ తనని పొగుడుతూ

రాఘవయ్య

అయ్యా.. ఆపత్బంధవా!, అపరాకుబెర..!


భూపాల, కళాపిపాసి.. దొరా..

వచ్చేస్తుండటం తో, వారి ని చుసిన మునుసబు, పరిగెత్తు కుంటూ వారి వచ్చి..

మునుసబు

యాడికి రా యగేసుకుంటూ.. వస్తు న్నారు.. వచ్చిందే


కాకుండా.. ఆయన్ని పిశాసి.. గిశాసి అని.. ఏదో
అంటున్నారు

అంటే, వాళ్ళు అక్కడే నిలబడతారు, గంగిరెడ్డి అద్దం లో చూసి..

గంగిరెడ్డి

ఒరే! మునుసబు.. వాడు స్పష్టంగానే పలికాడు నువ్వు


అనేది.. అనేసి.. వాని మీద తోయ్యోద్దు లే
గాని... వాళ్ళను పంపిచ్చు..

అంటే.. వెళ్ళండి అని చెప్తా డు.. గంగిరెడ్డి కుర్చీ పక్కనే.. మావిడి కాయలు,
తింటూ.. తన మనవడు తింటుంటాడు. అది చూసి.. లచ్చిమి కి నోరు వూరి..
వాటినే చూస్తూ.. అక్కడ గంగిరెడ్డి. సరాసారు వెంకట లచ్చిమి ని, గంగిరెడ్డి అద్దంలో
చూస్తుంటాడు. అప్పుడు గంగిరెడ్డి ఆ గడ్డం గీసే వాణ్ణి, ఆపమని చెయ్య చూపిచ్చి.. లేచి
రాఘవయ్య వైపు వస్తూ..

గంగిరెడ్డి

రాఘవయ్యా.. నువ్వు చెప్పేది అక్షరాలా నిజమైనా..


మళ్ళి పాతకాలం మనుషులు లా ఆ పొగడ్తలు మన
వొంటి కి పట్టవు లే గాని.. చెప్పు..

about:blank 57/180
5/19/23, 4:13 PM

ఇంతలో.. మునుసబు జోక్యం చేసుకొని

మునుసబు

అయ్యా, పోయిన వారం.. ఉగాది పండక్కి నాటకాల


వాళ్ళని కబురు పెట్టమన్నారు.. తమరు..
మరచిపోయినట్టు ఉన్నారు.

అంటే, మునుసబు మీద పళ్ళు కొరుకుతా..

గంగిరెడ్డి

అర్థమైంది.. లే గాని.. నువ్వు నోరు ముయ్యి..

అని, రాఘవయ్య ని చూసి

గంగిరెడ్డి

చూడు.. రాఘవయ్యా, మీ నాటకాలు ఈ


చుట్టు పక్కల 18 ఊర్లల్లో బ్రమ్హండ్లం గా జరగాల. మీకు
ఏమి అవసరం వచ్చినా, నన్ను వచ్చి అడగొచ్చు.

అని గంగిరెడ్డి చిన్నబ్బ వైపు చూస్తా డు, చిన్నబ్బ లచ్చిమి ని చూసి, సరే అని తల
ఉపుతాడు. ఆ విషయం లచ్చిమి గమనిస్తుంది, తన అమ్మ వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది.
అప్పుడు

రాఘవయ్యా

అంటనే సామి. మీరే చూస్తా రు కదా!

అంటే, అప్పుడు మునుసబు తో

గంగిరెడ్డి

మునుసబు, బురుజుపల్లి దగ్గర ఉండే కోటం కాలి


చేయించి వీళ్ళకి ఈ. అట్నే రెండు సంచులు లో
బీము, బెల్లము, సరుకులు ఇచ్చి పంపించు.

మళ్ళి చిన్నబ్బ వైపు చూసి

గంగిరెడ్డి

చిన్నబ్బ, ఆ యమ్మి చానానే సిగ్గు పడతావుంది,


రెడ్దోరమ్మ ని అడిగి, రైక గుడ్డలు ఇచ్చి పంపిచ్చు

about:blank 58/180
5/19/23, 4:13 PM

అని, లచ్చిమినే చూస్తూ.. రాఘవయ్య దగ్గరికి వచ్చి, గంగిరెడ్డి తన లుంగీ లో చెయ్యి


పెట్టి, కొద్దిగా డబ్బులు తీసి, రాఘవయ్య కి ఇస్తా డు, అప్పుడు, రాఘవయ్య, కూర్చొని,
తన టువాలు జోలి గా పడతాడు, అందులో కొద్దిగా డబ్బులు పడేసి, అక్కడ నుంచి
వెళ్ళిపోతాడు.

EXT. BURUJUPALLI – KOTAM - EVENING

Halfway లో వాళ్ళు అందరూ, గంగిరెడ్డి ఇచ్చిన కోటం దగ్గర బస చేస్తా రు, ఆ కోటం
అనుకొనే, ఇంకొంత మంది గుడారాలు ఎసుకొంటారు, ఆ పక్కనే ఎద్దల బండ్లు నిలబెట్టి
ఉంటారు, రాఘవయ్యా ఒక బండ మీద కూర్చొని, తన చినిగిపోయిన బట్టలు కుడుతూ
ఉంటాడు, తన భార్య చాటలో చెరుగుతూ ఉంటుంది. లచ్చిమి ఇంటి బయట కూర్చొని.

వెంకటలచ్చిమి

నాన.. నువ్వు చెప్పు, ఆ రెడ్డి వాలకం చూస్తా వుంటే,


ఏదో తేడా గా వుండ్లా ..

అంటే, దానికి రాఘవయ్య, లచ్చిమి చూస్తూ

రాఘవయ్యా

లచ్చిమి!.. ఇప్పుడు రెడ్డి సంగతి


నీకేందుకు.. ఏదంటే, అది వాగకుండా, కుదురుగ్గ
ఉండేది నేరుచుకో. అసలే ఈ ఊరోళ్ళు.. మొండి
రకాలు.

అంటే, ఇంతలో వాళ్ళ అమ్మ.

సీతమ్మ

పంగా పాటా లేదే నికి, రేపటికి రిబ్బన్లు లేవంటివే!,


మీ చిన్నాయన ని పిలుచుకొని సంతకి
పొయ్యిరాకూడదా?

అంటే, ఇంతలో అక్కడికి కట్లు తెస్తూ, ఆ నాటకం వ్యక్తీ

వ్యక్తీ

ఇంకా యాడ ఉండాడు! ఈ మోపు నా చేతికి ఇచ్చి,


ఆడ ముంత పట్టు కోనివుండాడు చూడు బో.

అంటే..

రాగావయ్య

about:blank 59/180
5/19/23, 4:13 PM

సరిపాయ! మొదలుపెట్టినాడా?

EXT. RANDOM PLACE – NATUSARA SELLER - DUSK

బురుజుపల్లి దగ్గర నాటుసారా కాచే చెట్టు కింద కూర్చొని, చిన్న చిన్న ముంత ల తో
తాగుతూ ఉంటాడు లక్ష్మీపతి. (ఇతను రాఘవయ్యా కి తమ్ముడు, తన భార్య అనారోగ్యం
తో చనిపోయివుంటుంది, అప్పటి నుంచి, తాగుడే అతని భార్యగా భావిస్తూ, ఎక్కడ పడితే
అక్కడ తాగి తూలుతూ ఉంటాడు.)

లక్ష్మీపతి

ఇదుగో తమ్ముడూ, ఏందయ్యా, చానా చిన్న చిన్న


బుడిగలు లా ఉన్నాయి ముంతలు

అప్పుడు ఆక్కడ సారాయి అమ్మే వ్యక్తీ

నారిగాడు

ఆ! నువ్వు ఇచ్చే 40 పైసలికి, ముంతలు కాక


కడవలు వస్తా యేమి?

లక్ష్మీపతి

సర్లే!.. ఇంకో రేడు ముంతలు ఈ!

నారిగాడు

ముందు తాగిన రెండింటికి, డబ్బులు పెట్టి, తీసుకో

లక్ష్మీపతి

వారిని పాసునుగోల్లా .. మంచి యాపారస్తు డే..

అని, తన షర్టు జేబిలో చెయ్యి పెట్టి.. వెతుకుతాడు, డబ్బులు కనిపియ్యవు, తన కింద


చడ్డిల్లో కూడా వెతుకుతాడు, కనిపియ్యవు. లక్ష్మీపతి అలా వెతుక్కోవటం చుసిన
నారిగాడు..

నారిగాడు

యోవ్! ఏంది, వొళ్ళంతా తడమ తా ఉండావు..


కొంప తీసి.. డబ్బులు లేవా ఏంది?

అంటే, లక్ష్మీపతి కి తాగిన మైకం దిగిపోతుంది.. అప్పుడు, లేవు అనే లోపే.. తన


కాళ్ళ ముందరకి.. రెండు ముంతలు వస్తా యి., వాటిని చూసి లొట్టలు వేస్తూ

about:blank 60/180
5/19/23, 4:13 PM

ఉంటాడు.

లక్ష్మీపతి

ఎవరూ ఈ ముంత వీరుడు, వూరిచ్చింది సలేబ్బా, నా


కాడ డబ్బులు లేవు!

ఆ ముంతలు తెచ్చింది చలపతి.. అప్పుడు చలపతి ని చూసి..

చలపతి

మీరు.. ఆ నాటకాల వాళ్ళే కాదు

అంటే, విసుకుతో... కూర్చుంటూ

లక్ష్మీపతి

ఆ ఐతే

చలపతి

మీ నటనా కౌసలం, మమ్ములను, బహు బాగుగా


ఆకర్షించినది

అప్పడు, తల గోక్కుంటూ.. విసికిపోయి

లక్ష్మీపతి

ఏ!! ఆపు, తెలుగులో ఏడు! 

చలపతి

అహల్యా, నాటకంలో ఏమి ఇరగదీసారు గురువుగారు..

లక్ష్మీపతి

ఆ, అంత బాగా నచ్చిందా?

చలపతి

అబ్బబ్బ బా! ఏమి వేషం.. స్టేజి అద్దిరిపోలా.

అనుమానం తో

లక్ష్మీపతి

about:blank 61/180
5/19/23, 4:13 PM

నేను యేసింది.. కోడిపుంజు.. వేషం రా!

చలపతి తత్తర పడుతూ.. దొరికిపోయాను అని అనుకోని..

చలపతి

ఆ! మనిషి యేషం ఏముంది లే మావా! ఎవడై నా


ఎస్తా డు.. కాని కోడి యేషం ఎసినావు చూడు..
అది.. ఆ కోడి ని లాగ చెయ్యలేందు తెలుసా..

అంటే, అప్పుడు లక్ష్మీపతి.. చాలా గర్వంగా ఫీల్ అవుతూ, మీసాలు తిప్పుతుంటే..

చలపతి

తిప్పింది సాలు గాని.. ఇందా, ముందు ఇది కాని..


తరవాత మాట్లా డుకున్నాము..

అంటే, లక్ష్మీపతి వాటిని తీసుకొని తాడుతాడు, కాసేపటి తరవాత,ఆ రెండు ముంతలు


కాస్త.. 10 అవుతాయి., అప్పుడు

లక్ష్మీపతి

అది సరే గాని, ఇంతకీ.. నాకు ఎందుకు పోస్తు న్నటో?

చలపతి

ఏమి లేదు మావా! చిన్నప్పటి నుంచి, నాటకాలు


అంటే చానా ఇష్టం, నేను కూడా నీ అంతటి, పెద్ద
నటుడు కావాలంటే, ఏమి చెయ్యాలి?

లక్ష్మీపతి

వోసి.. అంతే నా.. నా యనకమ్మడి


వచ్చేయి.. అంతే.. 

మళ్ళి.. కొద్దిగా ఆలోచింది...

లక్ష్మీపతి

ఇదిగో.. నువ్వు సారాయి పోసినందుకు కాదు


వోప్పుకునుంది.. 

చలపతి

మరి?

about:blank 62/180
5/19/23, 4:13 PM

లక్ష్మీపతి

నా లా పెద్ద నటుడు అవుతానంటివి.. అందుకే!

చలపతి

మరి.. వచ్చినాక.. ఆడ ఎవరన్నా.. ఏమన్నా అంటే

అక్కడ నుంచి, చిన్న గా వుగుకుంటూ.. వెళ్తూ

లక్ష్మీపతి

ఎవర్ర నిన్ను అనేది.. ఆడ ఉండే దంతా లోత్త


గవ్వలే.. కాని వోరేయి.. అక్కడ వెంకటలచ్చిమి అని
ఉంటది.. దాని జోలికి మాత్రం పోవద్దు రోయి..
అస్సలే దాని నోరు మంచిది కాదు..

EXT. BURUJUPALLI –KOTAM - MORNING

తెల్లవారు జాము వెంకటలచ్చిమి లేచి పరక పట్టు కొని, కోటం వాకిలి తెరుచుకుంటూ..
హావలించుకుంటూ, బయటకి వస్తుంది. బయట చలపతి, లక్ష్మీపతి ఇద్దరు, యెద్దల బన్డి
చక్రా నికి వాలి నిద్రపోతుంటారు. వాళ్ళను చూసి కోపవంతో, పరక ఇసిరేసి, లంగా ఎగ్గట్టి..
అటు.. ఇటు చూస్తూ.. దేనికోసమో వెతుకుతూ.. అటుగా ఉన్న నీళ్ల బాకీని తీసుకొని

వెంకటలచ్చిమి

దొంగ సచ్చినొడా, తాగేసి వచిందే కాకుండా, కొంపకి


ఎవరిని పడితే వాల్లని తీసుకొస్తా వ! ఉండు నీ పని
చెపతా

ఆని, ఆ నీళ్ళ బొకిని తిసుకొచ్చి, ఇస్సిరి వాళ్ళ మీద నీళ్ళు పొస్తుంధి. నీళ్ళ్ పడిన
వెంటనే, చలపతి గబాలని లెచి..

ఛలపతి

వాన,. నిల్లు .. చలి

ఆని, ఆ పక్కనే ఉన్న బిందె ని ఎత్తు కుంటుంది. అప్పుడు ఆ షబ్ధా లు విని, లక్ష్మిపతి
లేచి వచ్చి, చలపతి ని పక్కకి లాగుతాడు.

లక్ష్మిపతి

నువ్వు రా రా ఇట్లా !

about:blank 63/180
5/19/23, 4:13 PM

ఆని,

లక్ష్మిపతి

ఎందే ఇధి.. రాను రాను రాజు గారి గుర్రం గాడిదె


అయ్యినంట.. అట్లా ఉంది నీ యవ్వారం.. అంత
తొందర ఎందుకే నీకి? ఇంకొంచేపు ఉంటే.. మెమే
స్నానం చెసుకునింటాము కదా?

అని అంటే, అ షబ్ధా లకి లచ్చిమి వాల్ల అమ్మ సితమ్మ, నాన్న రాఘవయ్య ఇద్దరు బయటకి
వస్తా రు

శితమ్మ

ఆబ్ బబ్ బా.. ఏందే పొద్దు పొదున్నే, చెవి కొసిన


మేక లాగా అరుస్తా వుండావు!

ఆంటె.. రఘవయ్య లక్ష్మిపతి ని చుసి

రాఘవయ్య

తెల్లా రిందో లేదో.. మొదలు పెట్టినారా.. మీ


రామాయనాలు..

ఆని, చలపతి వైపు చుసి, లక్ష్మిపతి తొ

రాఘవయ్య

ఏవరు రా ఆ పిల్లొడు?

ఆంటె,

లక్ష్మీపతి

వీడా! నా బావమరిది కొడుకు లే

రాఘవయ్య

నాకు తెలియకుండా నీకు బావమరిది యాడ ఉండాడు


రా!

లక్ష్మీపతి

ఉండాడు లే, నా పెళ్ళాం వాళ్ళ, కు చిన్నమ్మ


పెద్దకొడుకు బిడ్డ లే!

about:blank 64/180
5/19/23, 4:13 PM

ఇక్కడ చలపతి.. కాస్త ఊపిరి పిల్చుకుంటాడు, ఇంతలో వెంకటలచ్చిమి చలపతి ని


చూస్తూ..

వెంకటలచ్చిమి

ఆ బిడ్డ ఈడ ఏమి చేస్తా వుందో? 

అంటే,

లక్ష్మీపతి

నీ కన్నా ఆ పోలిసోల్లే నయమే.. సక్కంగానేనా


అడుగుతారు..

రాఘవయ్య

అది అడిగినదానికి సమాధానం చెప్ప రా!

అంటే.. అప్పుడు చిన్నగా ఆలోచించి

లక్ష్మిపతి

వాడికి నాలాగ చిన్నప్పటి నుంచి, మంచి నటుడు


కావాలని కోరిక, అందుకే నన్ను వెతుక్కుంటూ
వచ్చేసినాడు.

అంటే, రాఘవయ్యా చలపతి దగ్గరకి వొచ్చి

రాఘవయ్య

ఏమి పేరు?

అంటే,

చలపతి

వెంకటాచలపతి, ఇంటోళ్ళు చలపతి ని పిలస్తా రు.

అంటే, అందుకు

రాఘవయ్య

నటుడు అవుతావా, లేక మీ మామ మాదిరి తయ్యారు


అవుతావా?

about:blank 65/180
5/19/23, 4:13 PM

చలపతి

నటుడే అవుతా నండి.

ఇంతలో లక్ష్మీపతి

లక్ష్మీపతి

నువ్వు వొద్దంటే.. ఊరికి ఎల్లిపోతాడు లే.. న్నా!

అంటే, అందుకు కొద్దిగా అలోచించి

రాఘవయ్య

సర్లే.. అందరితో పాటు వీడు ను, తలా ఒక ముద్దేస్తే


ఈడనే ఏదో పని చేసుకొని ఉంటాడు!.

అని, లక్ష్మీపతి వైపు చూసి

రాఘవయ్య

నువ్వు ఆ సారాయి నీళ్ళకి పోకుండా.. నాటకానికి


కావాల్సిన వి సంతకి పొయ్యి తీసుకొని రా పో.

అని అక్కడ నుంచి కోటం లో కి వెళ్తూ వెళ్తూ.

రాఘవయ్య
( OS )

ఆ చలపతి ని కూడా నీతో తోడుకొని పో..

అంటూ, కోటం లోపలికి వెళ్తా డు... శితమ్మ ఆ పక్కన పడిన పరక ను తీసుకొని..


ఎద్దు లు కట్టేసిన చోటుకు వెళ్తుంది.

వెంకటలచ్చిమి

ఇన్నావు కదా! సత్రం లో ఉన్నట్టు ఉంటె సరిపోదు,


పనులు చెయ్యల..

అని, కళ్ళలో, కళ్ళు పెట్టి.. చేతిలో నిల్ల బింది పెడుతుంది. అప్పుడు,

లక్ష్మీపతి

వెంకటలచ్చిమి.. మేము సంతకి పోవాలా.. పొయ్యి


మంచి సొంటి కాపి పెట్టక రాబో.

about:blank 66/180
5/19/23, 4:13 PM

అంటే, దానికి

వెంకటలచ్చిమి

ఆ! హా! హా!.. జడకుచ్చిలు తెమ్మంటే త్యలేదు


గాని.. సొంటి కాపి కావాలంట! నీకు కాపి కాదు..
కుడితి పోస్తా .. ఉండు.

అని, గోనుగు కుంటూ కోటం లోకి వెళ్తుంది.

లక్ష్మీపతి

అది రా.. దాని వాలకం. ఇది మాములే గని,


మనము అట్లా దిగబడి పోదాము రా!

అని సారాయి అని చెయ్యి చూపిచ్చి, అక్కడ నుంచి లేస్తా డు, అప్పుడు

చలపతి

తెల్లా రిందా సామి నికి.. నేను రాను గని .. నువ్వు


పో!

అని అక్కడ నుంచి చలపతి బిందె తీసుకొని వెళ్తా డు.

INT. REDDY HOUSE - KITCHEN - MORNING

గంగిరెడ్డి మరియు.. గంగిరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, చివ్వర గా కర్ణం


తనను ఇనాం గా వచ్చిన పట్టా లు ఇవ్వటం.

రెడోరమ్మ, ఇంట్లో దోసి పోస్తా వుంటుంది, గంగిరెడ్డి బెంచి మీద కూర్చొని తింటాఉంటాడు,
దోసి కాలినాక తీసుకొచ్చి రెడ్డి కి వేస్తుంది రెడోరమ్మ.. అప్పుడు ఒక ముద్ద నోట్లో
పెట్టు కొని 

గంగిరెడ్డి

ఆహా.. ఏమి ఎసి..పోస్తు న్నవే.. దోసెలు.. ఇంత


రుచి గా వుండాయి.

అంటే..

రెడోరమ్మ

దోసిపిండి..

about:blank 67/180
5/19/23, 4:13 PM

అప్పుడు.. కూర వేసుకుంటూ

గంగిరెడ్డి

దీనికి తోడు నువ్వు చేసిన తునకల కూర.. ఏసుకొని


ఇంతావుంటే.. ఓహో! బ్రంహాండలం..

రెడోరమ్మ

సాల్లే సంబడం

తింటూ.. తింటూ.. గుమ్మం వైపే చూస్తుంటాడు, అది గమనించిన రెడోరమ్మ 

రెడోరమ్మ

వాడి కోసం వాకిలి కి కావాలి ఉండకపోతే, వాడిని


ఇక్కడే ఉండమని చెప్పొచ్చు కదా?

గంగిరెడ్డి

నీ కొడుకు ఇనె రాకమా చెప్పు.. పెద్ద సదువులు


సదివిచ్చమని, పోరు పెట్టి పంపిస్తివి.. ఏమాయ
ఉద్యోగం, సద్యోగం అని, ఆ బెంగలూరు లో నే
ఉండిపాయ.

అంటే.. ఇంతలో, బయటకి వెళ్ళిన.. తన కొడుకు.. కొడాలు, మనవడు.. ఇంటికి


వస్తా రు.. గంగిరెడ్డి ని చుసిన వెంటనే.. తన మనవడు.

వరదారెడ్డి

తాతా!

అంటూ.. వచ్చి వాలిపోతాడు.. ఉంటుంది అప్పుడు రెడోరమ్మ

రెడోరమ్మ

రేయ్.. వచ్చినాడమ్మా.. చిన్న కుసిలి గాడు.. ఇంక


తాతా మనవణ్ణి ని పట్టా ను పగ్గాలు ఉండవు.

అంటే, గంగిరెడ్డి మనవడిని ఎత్తు కొని, ముద్దు లు పెడతాడు.. అప్పుడు, గంగిరెడ్డి.. తన


కొడుకుని కోడాలిని చూసి

గంగిరెడ్డి

ఏమ్మా, ప్రయాణం బాగానే జరిగింది కదా ?

about:blank 68/180
5/19/23, 4:13 PM

అంటే,కోడలు తల వూపుతుంది, రెడోరమ్మ వెళ్ళి, కోడలిని లోనికి తీసుకొని పోతుంది,


అప్పుడు, వరదా రెడ్డు తన తాతకి, ఒక ఫోటో చూపిస్తా డు, అది గంగిరెడ్డి తన భార్య
దిగిన ఫోటో, గంగిరెడ్డి దాన్ని తీసుకొని చూస్తా డు, అందులో గంగిరెడ్డి గంగిరెడ్డి భార్య,
ఉంటారు, అది గంగిరెడ్డి ని అర్దా నికి చింపి ఉంటుంది. ఆ ఫోటో ని చూసి..

గంగిరెడ్డి

ఏంది రా నన్ని అర్ధా నికి చింపేసినావు..

అంటే

గంగిరెడ్డి కొడుకు

నువ్వు అమ్మ పక్కన ఉండకూడదంట నాన్నా. వాడి


దగ్గరే ఉండాలంట.

అంటే.. అప్పుడు.. గంగిరెడ్డి ముద్దు పెడతాడు. అక్కడకి వస్తు ..

రెడోరమ్మ

మీ తాతను.. పట్టలేక పోతావుండాము.. రా


నాయనా.. అట్లా న్నా పిలచకపో మీ ఇంటికి.

అంటే..

గంగిరెడ్డి

నాకే మే.. తక్కువా.. నా మనవడు.. ఆ మావిడి


కాయలు ఉంటె సాలు.

అంటే, .. ఇంతలో అక్కడికి కర్ణం వచ్చి

కర్ణం

అయ్యా!

అంటే, అప్పుడు కర్ణం వైపు చూస్తా డు, అప్పుడు తను వంగి దండం పెడితే, అప్పుడు..

గంగిరెడ్డ

రా వయ్యా కర్ణము.. మా ఆవిడ దోశలు పోస్తా వుంది,


చెయ్య కడుక్కొన్ని రాబో.. నువ్వు కూడా తిందువు.

about:blank 69/180
5/19/23, 4:13 PM

అంటే, తన చేతిలో కొన్ని ఆస్తి పత్రాలు చూపిస్తా డు, అప్పుడు, గంగిరెడ్డి లేచి వచ్చి ఆ
పాత్రలను తీసుకుంటాడు. అప్పుడు

గంగిరెడ్డి

అన్ని వుండాయి కదా?

అంటే

కర్ణం

అయ్యా! అన్ని పక్కా గా ఉండాయి, సంస్థా నం వారు


ఇనాం గా ఇచ్చిన 22 ఎకరాలు ఇక మీవే 

అంటే! తన భార్యను పిలుస్తా డు

గంగిరెడ్డి

శాహబాష్.. అయ్యా కర్ణము.. పొద్దు గాల.. పెద్ద


వార్తే మోసుకొచ్చావు.. అందుకు.. ఇనాం గా.. ఆ
దోక్కలోనిపెంట లో ఉండే 3 ఏకరాల టెంకాయ తోపు
ఈరోజు నుంచి నిదె.. ఆ కాగితాలు ఏందో తీసుకొని
రా, సంతకాలు అవి.. పెడుతా.

అంటే.. ఆ వార్తకి కరిగిపోయి.. దండం పెడుతూ..

కర్ణం

అయ్యా.. అపర దాన కర్నా.. మీరు సాక్షాతూ ఆ


కర్ణుడి అంశమే!

గంగిరెడ్డి

అట్నే గాని లే వయ్యా.. మరీ పోగిడేస్తు న్నావు..

అంటే.. గంగిరెడ్డి, మునుసబు ని పిలిచి..

గంగిరెడ్డి

మునుసబు..

అంటే,

మునుసబు

about:blank 70/180
5/19/23, 4:13 PM

అయ్యా!

అంటూ, దోస తింటున్న వాడుమ పరిగేతుకుంటూ వస్తా డు.. అప్పుడు

గంగిరెడ్డి

ఇందా!

అని ఆ పత్రాలు అతనికి ఇస్తా డు.. అప్పుడు

మునుసబు

అయ్యా ఇవి.. యక్కడ పెట్టమంటారు.. ఇక్కడ


పెట్టమంటారా.. లేక చిన్న ఇంటికి చేర్చమంటారా?

అంటే.. అందుకు..

గంగిరెడ్డి

నా నెత్తిన పెట్టు .. నీకు వొళ్ళు పెరిగినదే కాని.. బుర్ర


కాసింతైనా పెరిగి సచ్చింది లేదు..

మునుసబు

శ్రీవారు క్షమించాలి..

గంగిరెడ్డి

అదే.. చించినాను లే గాని.. లోపల పెట్టు బో.. పో!

అంటే

మునుసబు

చిత్తం

అని.. ఆ కాగితాలు తీసుకొని లోనికి వెళ్తా డు.. అప్పుడు అక్కడే నిలబడి ఉన్న కర్ణం ని
చూసి.

గంగిరెడ్డి

ఏమయ్యా కర్ణము.. ఇక్కడే ధ్వజస్తంభం లా


నిలబడకపోతే.. ఆ పత్రాల పనేదో చూడు.. పో.

అంటే, అది విని కర్ణం అక్కడ నుంచి పరిగెత్తు కుంటూ వెళ్తా డు.

about:blank 71/180
5/19/23, 4:13 PM

INT. KANDURU ROAD – FOREST - MORNING

చలపతి, లక్ష్మీపతి.. ఇద్దరూ, సంతకి బయలుదేరు తారు, వాళ్ళు సంచులు మూట


కట్టు కొని.. కాలిబాటన.. అడివి దావా లోకి చేరుకుంటారు..

చలపతి: అవును మావా, ఆ జడకుచ్చిలు గొడవ


ఏంది

అంటే..

లక్ష్మీపతి: అందో పెద్ద కథ లే రా.. తీరిగ్గా చెప్తా ను

అంటే.. ఇంతలో వాళ్ళు దావ మలుపు తిరుగుతారు, కొద్ది దూరం లో.. కొంతమంది
గుంపు, శవానికి పూజ చేస్తుంటారు (దింపుడు సంగ్యాం) లాంటిది చేస్తుంటారు. ముందు
లక్ష్మీపతి, వెనకాల చలపతి వెళ్తుంటారు, లక్ష్మీపతి వాళ్ళని పట్టించుకోకుండా, వెళ్తుంటాడు,
చలపతి వాళ్ళని చూస్తూ ముందుకు వెళ్తుంటాడు, ఆ శవం ఎవరిదా అని వొక్క క్షణం ఆగి
తొంగి.. తొంగి చూస్తుంటాడు. ఇంతలో లక్ష్మీపతి ముదుకు వెళ్ళిపోయి
ఉంటాడు. అక్కడ జనం బాగా ఉండటం తో, చలపతి కి మొహం కనిపియ్యాడు, ఆ
శవాన్ని మళ్ళి ఎత్తు కొని వెళ్ళే సమయం లో తన మొహం చూస్తా డు. అది ఈడిగిపల్లి
“వెంకటసుబ్బ” ది. ఆ శవాన్ని, ఎత్తు కొని వాళ్ళు అక్కడ నుంచి ఒక చేను లోకి
వెళ్ళిపోతారు. కాని చలపతి అక్కడే నిలబడి.. వెంకటసుబ్బ ని ఎక్కడో చూసినట్టు ..
ఏదో సన్నివేశం గుర్తు కు తెచ్చుకోబోతాడు.. ఎంతకీ గుర్తు కి రాకపోవటం తో, వెనక్కి తిరిగి
వేల్లబోతాడు. తనకి ఎదురుగ్గా తెల్లగా విబూది పూసుకొని ఉన్న, ఒక అగోరా నిలబడి
ఉంటాడు. ఆ శవాన్ని చూసి, ఆ అగోరా ని హటాత్తు గా చూడటం తో.. వొక్క సారిగా
బయబ్రాంతులకి గురి అయ్యి, తన చేతిలో ఉన్నవి పడేసి.. ఎగ్గిరి ఆ పక్కకి పడుతాడు.

ఆ కింద పడిన చలపతి దగ్గరికి రాబోతుంటే.. చలపతి.. వెనక్కి.. వెనక్కి పాకుకుంటూ


వెళ్తుంటాడు, అగోరా ముందుకు వస్తుంటాడు, అప్పుడు.. తన దగ్గరకి వచ్చి తొంగి
మొహం వైపు చూసి..

అగోరా2

సమస్య నుంచి పారిపోతున్నావు.. ఈ ఊర్లు శ్మశానాలు


కాక ముందే కండ్లు తేరువు..

అని, తన చేతిలో ఉన్న విభూది ని నోదుట పెట్టి.. అక్కడ నుంచి వెళ్తూ.. వెళ్తూ..

అగోరా2

ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు.. చెయ్యి చాచి


పిలూ!!

about:blank 72/180
5/19/23, 4:13 PM

అంటూ, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, ఆ అగోరా నే చూస్తూ ఉండిపోతాడు.. ఇంతలో


అక్కడికి లక్ష్మీపతి వెనక్కి వచ్చి..

లక్ష్మీపతి

రేయ్! ... రేయ్! అల్లు డూ.. ఏమైంది రా..


ఈడ పడిండావు?

అంటే, తన లోకంలోకి వచ్చి.. ఆ అగోరా వెళ్ళిన వైపు, చెయ్యి చూపిస్తూ..

చలపతి

ఆ డేవడో వొచ్చి.. ఏదేదో మాట్లా డి బెదరకోట్టి


మావా!.

లక్ష్మీపతి అటుగా చూస్తే.. ఎవ్వరు ఉండరు,

లక్ష్మీపతి

ఆడ ఎవ్వరు లేరు లే గాని.. లేసి రా.. పోదాము..


పొద్దు పోతావుంది.

అని, అక్కడ నుంచి లేపుకొని, పిలుచుకొని వెళ్తా డు.. చలపతి, వెళ్తూ, వెళ్తూ.. వెనక్కి
తిరిగి తిరిగి చూస్తూ.. వెళ్తా రు

EXT. REDDY HOUSE - EVENING

గంగిరెడ్డి తన ఇంటి ముందు కూర్చొని, తుపాకి ని క్లీనింగ్ చేస్తుంటాడు, అక్కడ కర్ణం,


మునుసబు, చిన్నబ్బ తన చుట్టూ నిలబడి ఉంటారు. అక్కడ అక్కడా పనివాళ్ళు పనులు
చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఒక బ్రిటిషు పోలీసు (తెల్ల దొర) వస్తా డు.

కర్ణం

అయ్యా! తెల్ల తోలు..

అంటే, అప్పుడు.. గంగిరెడ్డి తన తుపాకి తూట్లు లో నుంచి ఆ బ్రిటిషు పొలిసు వస్తు న్నది
చూస్తా డు.

అతను వచ్చి, ఒక ఉత్తరాన్ని అందిస్తా డు. ఆ వుత్తరం మీద బ్రిటిషు వారి seal
ఉంటుంది. అప్పుడు ఆ ఉత్తరాన్ని తీసుకొమ్మని గంగిరెడ్డి మునుసబు వైపు చూస్తా డు.
అప్పుడు, మునుసబు దాన్ని తీసుకొని తెరచి, చదువుతాడు.

మునుసబు

about:blank 73/180
5/19/23, 4:13 PM

అయ్యా! రేపు దొరసానమ్మ పుట్టిన రోజని దొర వారు


కుటుంబ సమేతం గా మన ఊరికి వస్తా వుండారు అని
రాసుంది.

గంగిరెడ్డి

ఈ తెల్ల కాకి, ఏమి మోసుకోచ్చాడా అని


అనుకున్నా.. పరవాలా.. మంచి సమాచారమే! 

అని, అటు గా ఉన్న కర్ణం ని పిలిచి

గంగిరెడ్డి

ఇందో! కర్ణము!

అంటే, అప్పుడు కర్ణం తన దగ్గరకి వచ్చి

కర్ణం

అయ్యా!

అంటే.. అప్పుడు.. లేచి..

గంగిరెడ్డి

ఇన్నావు గదా! వాళ్ళ రాక రాక మన ఊరికి


వస్తా వుండారు. నేను ఇచ్చే మర్యాదలతో.. ఆయన
నన్ను 100 ఊర్ల ఆ సామిని చెయ్యాల..
అర్థమైనాదా?

అంటే

బలరాముడు

శ్రీవారు.. ఆ విషయం మళ్ళి చెప్పాలా!

అని చిన్నబ్బ వైపు చూస్తూ..

గంగిరెడ్డి

చిన్నబ్బ! రేపటికి యాట ని కొట్టి కూర వొండిచ్చు.


సుక్కా.. ముక్కా.. విష్యం లో మాట రాకూడదు
చెప్తాండా. వొచ్చిందా.. ని తోలు కర్రే!

అని తన దగ్గరకి వచ్చి చిన్నగా

about:blank 74/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

ఇదిగో.. ఇంకో మాట.. ఆయన ఆవురు అవురు ఆని


మంచి ఆకలి మీద వస్తా డు.. పొందు లేనిదే.. పొద్దు
పోదు.. ఆ ఏర్పాట్లు నివ్వె దగ్గర ఉండి చూడు.

చిన్నబ్బ

అట్టనే అయ్యా!

అని వెళ్లబోతుంటే

గంగిరెడ్డి

చిన్నబ్బ! పొరపాటున ఎంగిలిది యాడన్నా పంపిచ్చేవు..


ఆ నాటకాలదాన్ని..

అని సైగ చేస్తా డు, అప్పుడు తల ఊపి. అక్కడ నుంచి వెళ్తా డు, అప్పుడు..మినుసాబు
కాపి తెచ్చి ఆయనకీ ఇస్తా డు, అది తీసుకొని

EXT. BURUJUPALLI – KOTAM - EVENING

వెంకటలచ్చిమి అద్దం ముందర నిలబడి, కాటుక రాసుకుంటూ ఉంటుంది, వెనక నుంచి


చిన్నబ్బ అక్కడకు వొచ్చి, వెంకటలచ్చిమి అందాలను పైకి కిందకి చూస్తుంటాడు, అది
అద్దం లో గమనించిన వెంకటలచ్చిమి, వెనక్కి తిరిగి

వెంకటలచ్చిమి

ఓయి! ఏంది చుస్తా వుండావు?

చిన్నబ్బ

మీ నాయన లేడా?

అంటే,

వెంకటలచ్చిమి

లేడు, గుడుకాడ ఉంటాడు పో.

అంటే, చిన్నబ్బ కొద్దిగా ముందుకు వచ్చి.. తన జోబిలో చెయ్యి పెట్టి, డబ్బులు తీసి,
ఇస్తా డు

చిన్నబ్బ

about:blank 75/180
5/19/23, 4:13 PM

ఇందా! నాటకానికి.. కర్చులకు. పెద్దయ్య, ఇవి..


ఇచ్చి రమ్మన్నాడు.

అంటే, వెంకటలచ్చిమి, ఆ డబ్బులని తిసుకునేదానికి ముందుకు వచ్చి చెయ్యి చాస్తుంది.


అదే అదును గా చూసుకొని, వెంకటలచ్చిమి చెయ్యి పట్టు కొని తనవైపు లాక్కుంటాడు
చిన్నబ్బ. అప్పుడు వెంకటలచ్చిమి చిన్నబ్బ వైపు వోనబడుతుంది, చేతిని వెనక్కి మడిచి
వెనక్కి తిప్పి, తనవైపు లాక్కుంటాడు..

వెంకటలచ్చిమి

వొదల రా దొంగ సచ్చినోడా!

వెంకటలచ్చిమి, చిన్నబ్బ నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తుంది, కాని చిన్నబ్బ గట్టిగా


పట్టు కొనిఉండటం తో, అతన్ని వదిలించుకోలేక పోతుంది.. అప్పడు చిన్నబ్బ తన చవి
దగ్గరకి వచ్చి

చిన్నబ్బ

వోదలటానికి కాదే నిన్ను పట్టు కునింది, నిన్ను


దాటనీకి. 

వెంకటలచ్చిమి

అది నీ కల లో కూడా జరగదు రా బజారు నాయాల.

అంటే, అప్పుడు, చిన్నబ్బ వెంకటలచ్చిమి నడుము పైన చెయ్యి ఎసి, గట్టిగా బిగిస్తా డు

చిన్నబ్బ

అబ్బా! ఎమున్నావే!.. ఎన్ని రోజులని, ని పొంగుల్ని


చూస్తూ.. సొంగ కార్చుకునేది. అందుకే ఈరోజు తాడో
పేడో తేల్చుకుందా మనే వొచ్చినా! ఈరోజు తాడో పేడో
తేలిపోవాల. ఈ యాల 

అంటాడు, అప్పుడే సంత నుంచి అక్కడకి వచ్చిన చలపతి వెంకటలచ్చిమిని ఎడిపిస్తు న్న ది
చూస్తా డు. అది చూసి కోపం కట్టలు తెచుకొని వస్తుంది, తన చేతిలో ఉన్న సంచుల్ని
విసిరేస్తూ.. పరిగెత్తు కుంటూ వచ్చి, చిన్నబ్బ జుట్టు పట్టు కోను లాగుతాడు.

ఆ నొప్పికి గట్టిగా అరుస్తూ.. వెంకటలచ్చిమి ని వదిలేస్తా డు, అప్పుడు చలపతి తన


కాలితో, చిన్నబ్బ మోకాలిని గట్టిగా తంతే, విరిగిన శబ్దం వచ్చి.. కింద కుసనబడతాడు..
అప్పుడు ఎగిరి మోకాలితో, చిన్నబ్బ వీపు మీద గుద్దు తాడు.. ఆ నొప్పికి ఇరగ బడి
ఆకాశాన్ని చూస్తూ అరుస్తా డు.. ఎగ్గిరి తంతే.. దొర్లు కుంటూ పడతాడు..
అప్పుడు చిన్నబ్బ.. అటుగా పడి ఉన్న కట్టి కోసం లేచి వెల్లబోతే.. చలపతి చూసి..

about:blank 76/180
5/19/23, 4:13 PM

దాన్ని తీసికొని, గటి గా కొడతాడు.. ఇంతలో అక్కడికి సీతమ్మ, రాఘవయ్య లు


పరుగెత్తు కుంటూ వస్తా రు. అప్పుడు, చలపతి ఆ తుండు తీసుకొని, చిన్నబ్బ గొంతుకేసి
గట్టిగా అడుముతాడు, చిన్నబ్బ, ఊపిరి ఆడక, గిల గిలా కొట్టు కుంటాడు.. ఇంకేమి..
సచ్చిపోతాడు, అనే టప్పుడు.. వెంకటలచ్చిమి చలపతి దగ్గరకి వచ్చి

వెంకటలచ్చిమి

బావా!

అనంటే, చలపతి వెంకటలచ్చిమి వైపు చూస్తా డు, అప్పుడు వెంకటలచ్చిమి వద్దు అని తల
వూపుతుంది. అప్పుడు చలపతి.. నెమ్మదిగా చిన్నబ్బ గొంతుకు పెటిన తుండు తీసి, ఆ
పక్కన పారేసి..

చలపతి

చిన్నబ్బ!.. ఇంకోపాలు.. వెంకటలచ్చిమి చుట్టు పక్కల


కనిపిస్తే, నా కొడకా.. నీ సావు నా చేతిలోనే..
గుర్తు పెట్టు కో.

అంటే, చిన్నబ్బ, చలపతి వైపే చూస్తుంటాడు, తను లేచు వెళ్లబోతుంటే

చలపతి

చూడు! తోళ్ళు ఏసుకొని ఆడే వాళ్ళ కాని, తోలు


అమ్ముకునే రకం కాదు అని చెప్పు పొయ్యి.. నిన్ను
పంపిచ్చినోడికి..

అంటే. చిన్నబ్బ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు సీతమ్మ వెంకటలచ్చిమి దగ్గరకి


వస్తుంది, వెంకటలచ్చిమి సీతమ్మ ని హత్తు కొని ఏడుస్తుంది. అప్పుడు రాఘవయ్య చలపతి
దగ్గరకి వచ్చి, కంట తడి పెడుతూ!

రాఘవయ్య

పిడికెడు బువ్వ పెట్టినందుకే, దాన్ని నీ గుప్పెట్లో పెట్టి


కాపాడితివే, నువ్వు చేసిన ఈ మేలు కి, ఏమిస్తే నీ
రుణం తీరుతుది రా చలపతి!

అని దండం పెట్టబో తే, రాఘవయ్య చెయ్యి పట్టు కొని..

చలపతి

చ!.. ఏంది మావా ఇది!!..

about:blank 77/180
5/19/23, 4:13 PM

అంటే, రాఘవయ్య, చలపతి ని హత్తు కుంటాడు, అది చూసి వెంకటలచ్చిమి తన కళ్ళల్లో


నీళ్ళు తుడుచుకుంటుంది.

EXT. CHERUVU / YERU - BURUJUPALLI - MORNING

సూర్యోదయం అవుతూ ఉంటుంది, నాటకాల కొటం లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ


ఉంటారు, రాఘవయ్యా ఎద్దు లకు గడ్డి వేసుకుంటూ, లక్ష్మీపతి పోయ్యిలేకి కట్టెలు కొట్టి
అటు గా బయటే సీతమ్మ వంట చేస్తా వుంటుంది, అక్కడికి తీసుకేల్లి వేస్తా డు. అప్పుడు
అక్కడ ఉన్న కాపి తీసుకొని తిప్పుతూ, చలపతి నోటిలో యాప పుల్ల పెట్టు కొని
తోముతుండటం, చూసి లక్ష్మీపతి,

లక్ష్మీపతి

రేయ్, చలపతి.. తోమింది సాలు లే గాని, పొయ్యి


నోరు కడుగు పో, కాపి తాగుదువు..

అంటే, చలపతి, బచ్చలి వైపు వెళ్తా డు, అక్కడ అప్పుడే స్నానం చేసుకొని బచ్చలి నుంచి
బయటకి వస్తుంది వెంకటలచ్చిమి. ఆ తడి బట్టలలో వెంకటలచ్చిమి ని చూడగానే చలపతి
కి తన నోరు తన ప్రమేయం లేకుండానే తెరుచుకొని పోతుంది, కన్నులు ఆర్పకుండా తననే
చూస్తుంటాడు, అల నోరు తెరవంగాల్నే.. తన నోటిలోనుంచి పుల్ల బయట పడిపోతుంది,
అప్పుడు దాన్ని చూసి వెంకటలచ్చిమి వెళ్తూ వెళ్తూ, చలపతి మీద తన జుట్టు తో నీళ్ళని
చిలకరిస్తుంది, అప్పడు చలపతి మైకం నుంచి బయటకి వస్తా డు, అప్పుడు నోరు మూసుకో
అని సైగ చేస్తూ.. అక్కడ నుంచి కోటం వెనక వైపు వెళ్తుంది. తన వెనకాలే వెల్లబోతే,
అప్పుడే, అక్కడికి లక్ష్మీపతి వచ్చి

లక్ష్మీపతి

ఇంకా కడగాలేదా? కాపి సలారిపోతాంది రా

అంటే, అక్కడ నుంచి వెనక్కి వస్తు .. వస్తు

చలపతి

నిన్ను.. గుద్దా ల చూడు.. సరిగ్గా వచ్చి


చడగోట్టిన్నాడు..  

అని, గుద్దటానికి వెళ్ళి నట్టు వెళ్ళి.. బెదిరించి.. కాపి కోసం వెళ్తా డు.

లక్ష్మీపతి

ఏమి చడగోట్టిన్నాను రా?

about:blank 78/180
5/19/23, 4:13 PM

అక్కడ పొయ్యి దగ్గర పెట్టిన కాపి ని తాగుతుంటాడు, అప్పుడు అక్కడికి లక్ష్మీపతి


వచ్చి..

లక్ష్మీపతి

ఎట్లుంది రా కాపి, నేనే పెట్టా ను

అంటే

చలపతి

అబ్బ బ్బ బా, చక్కిరి బోదులు యాప చేదు


కలిపినట్టు ఉన్నావు చూసుకో!

అని, కాపి గ్లా స్ గ్లా సు లక్ష్మీపతి కి ఇస్తా డు, అప్పుడు

లక్ష్మీపతి

యాపచేదా?

అని, ఆ కాపి ని తాగుతాడు

లక్ష్మీపతి

లేదే!, తియ్యగానే ఉందే.. ఈ యాల ఏదో


అయినట్టుంది వీడికి.

అని, ఆ గ్లా స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు.

EXT. BURUJUPALLI – KOTAM - LATER

వెంకటలచ్చిమి తలస్నానం చేసుకొచ్చి, చలపతి కి కనిపిచ్చే లా తన జుట్టు కి సాంబ్రాణి


పెట్టు కుంటూ, తన అందాలని చూపిస్తూ ఉంటుంది. అది బన్డి కి కందిని కాన్చుకుంటూ,
బన్డి చక్రా నికి పెడుతూ, వెంకటలచ్చిమి అందాలని చూస్తుంటాడు. అప్పుడు అక్కడికి
లక్ష్మీపతివచ్చి అడ్డు గా నిలబడతాడు, అప్పుడు లక్ష్మిపతి ని చూస్తూ..

చలపతి

ఏంది మామా నువ్వు, పానకం లో పుడంగి లాగా,


ఎప్పుడు చూసినా అడ్డము వస్తా వు,

అని, కాస్త అటు గా పోతాడు, కాని వెంకటలచ్చిమి అక్కడ ఉండదు, అటు ఇటూ
చూస్తా డు, అప్పుడు లక్ష్మీపతి కి చలపతి ఎందుకు ఇలా అన్నాడో అని, అర్థం కాక,
చలపతి వెంట పోయి

about:blank 79/180
5/19/23, 4:13 PM

లక్ష్మీపతి

ఉండ్రా!

అంటే, చలపతి నిలబడతాడు, అప్పుడు

లక్ష్మీపతి

నేను పానకం లో పుడింగి ఆ! ఎప్పుడు చూసినా


అడ్డము వస్తా నా? అస్సలు ఏమి జరుగుతోంది రా
ఇక్కడా?

అంటే..

చలపతి

విసికిచ్చకు సామి నన్ని! చానా పని ఉండాది..


ఇప్పుడు నీకు ఏమి కావాల ని, పొద్దు న్నుంచి యంట
పడతావుండావు?

అంటే, చిన్న గా ఇకిలిస్తా డు, అప్పుడు చలపతి కి అర్థమౌతుంది,

చలపతి

ఆ గడ్డి వాము కింద పెట్టిన్నాను తీసుకోపో!

అంటే లక్ష్మీపతి గోనుగుకుంటూ,

లక్ష్మీపతి

రాను రాను.. నేను అంటే లెక్క లేకుండా పోయింది


వీడికి.. వో మంచి లే! మర్యాద లే!.. నాకు ఒక
రోజు వస్తుంది రా!

అంటే

చలపతి

ఏంది?

అని, చలపతి అంటే

లక్ష్మీపతి
( OS )

ఏంది లేదు లే నీ పని కాని..

about:blank 80/180
5/19/23, 4:13 PM

EXT. BURUJUPALLI – KOTAM - LATER

కొద్ది సేపటి తరవాత, బట్టలు వేసుకొని, జడకుచ్చిలు, గాజులు వేసుకొని, లంగా వోని
లో బయటకి వస్తుంది, ఎద్దు లకి మేత వేస్తు న్న చలపతి వెంకటలచ్చిమి చూసి చూడనట్టు
ఉంటాడు. అప్పుడు వెంకటలచ్చిమి చలపతి కి అటువైపు గా పని చేస్తు న్న వెంకాయమ్మ
దగ్గరకి

వెంకటలచ్చిమి

వెంకాయమ్మ అత్తా .. వెంకాయమ్మ అత్తా ..

అంటూ వచ్చి..

వెంకటలచ్చిమి

వో వెంకాయమ్మ అత్తా

అని, తన కొత్త గాజులు, జడ కుచ్చిలు, పైట పావడా లని చూపిస్తు న్న సోట్టు తో,
అక్కడికి వస్తుంది. చలపతి చూసి చూడనట్టు గా ఉంటాడు, చలపతి తనని చూడాలి
అని.. మళ్ళి

వెంకటలచ్చిమి

నేను చెప్పేది, వినపడుతోందా? నిన్నే

అంటే, వెంకాయమ్మ చుసిననత సేపు చూసి..

వెంకాయమ్మ

నాకు చవుడు యాడ లేదు గని, ఆ సూపిచ్చేది ఏందో


వానికే సుపిచ్చు బో!

అని, చలపతి వైపు చూస్తూ

వెంకాయమ్మ

వొరే చలపతి.. దినికల్ల అంట చూడరా.. తెగ


మెలికలు తిరిగి పోతావుంది.

అంటే, గబుక్కన నోరు ముస్తుంది.. అప్పుడు

వెంకటలచ్చిమి

about:blank 81/180
5/19/23, 4:13 PM

నువ్వేమి చెప్పక్కర లేదు లే, నేనే చూపిస్తా , నా


కేమైనా బయ్యమా ఏంది!

అంటుం వెంకటలచ్చిమి చలపతి దగ్గరకి నడుము వుపుకుంటూ.. వస్తుంది, అప్పుడు

వెంకాయమ్మ

పో పో ఏ.. ని లాంటి టక్కులాడి ని ఎంతమంది ని


చూడాలా!

అంటుంది, వెంకటలచ్చిమి చలపతి దగ్గరకి వచ్చి ఎలా వున్నాయి అని చలపతి ని తన


కళ్ళు తో అడుగుతుంది. అప్పుడు చలపతి

చలపతి

నిన్ను ఇలా చూస్తుంటే, ఆ చందమామ నే తీసుకొచ్చి,


నీకు దిష్టి చుక్కల లా పెట్టా లేమో అన్నంత ముద్దు గా
ఉన్నావే లచ్చిమి.

అని తన దగ్గరకి వచ్చి.. తన నడుము మీద తన ముని వేళ్ళ తో మీటుతాడు. అప్పుడు


వెంకటలచ్చిమి మెలికలు తిరుగుకుంటా కోటం వైపు వెళ్తుంది.. అప్పుడు, అక్కడికి అప్పుడే
వచ్చి వెంకటలచ్చిమి అలా వెళ్ళటం చూసిన లక్ష్మీపతి చలపతి ని చూసి

లక్ష్మీపతి

ఏమి జరిగింది రా, అది అంతలా మెలికలు తిరుగుతా


పోతావుంది.

అంటే: LEAD TO SONG

INT/EXT. MULTIPLE LOCATIONS - DAY/NIGHT

బోగి పండుగ రోజు, వాళ్ళు ఇద్దరూ.. బోగి మంట వెయ్యటం, కట్టెలు కాలి అయ్యాక,
అక్కడ ఉన్న పాత సామాన్లు తో పాటు, అక్కడ ఉన్న ముసలిదాని దిండు సాపలని
తీసుకొస్తుంటే, “వోరాయే దొంగ సచ్చినోడా, వుండు రా నీ పని చెప్తా అని వెంట
బడటం, అది చూసి వెంకటలచ్చిమి పగలబడి నవ్వటం, తను నవ్వుతున్నది చలపతి
నిలబడి చూస్తూ ఉండటం”.

దేవుని పటం పట్టు కొని.. ఆడుకోవటానికి వచ్చే వాళ్ళని తరిమి కొట్టటం.. అందులో ఒక
సాధువు.. చలపతి మీద బూడిదే చల్లి పరుగెత్తటం, అక్కడి వారు నవ్వటం.

రాత్రి అందరూ బయట పడుకొని ఉంటారు, అందరూ పడుకున్నాక వెంకటలచ్చిమి అనుకోని


లక్ష్మీపతి దుప్పటి లాగుతాడు చలపతి, అది చూసి పక్కున నవ్వుతుంది, అప్పుడు రమ్మని

about:blank 82/180
5/19/23, 4:13 PM

సైగ చేస్తా డు.. వాళ్ళు ఇద్దరు.. గడ్డి వాము మీద పడుకొని.. రాత్రి చుక్కలు
చూస్తుంటారు, వాళ్ళు లేరు అని గమనించిన లక్ష్మీపతి లాంతరు ఏసుకొని వెతుకుతూ
ఉంటాడు.

వాళ్ళు ఇద్దరూ, చెట్టు చేమ, పుట్టా గుట్టా తిరుగుతారు. వాళ్ళు ఇద్దరూ.. ఎద్దు లబన్డి
లో వెళ్ళటం, చలపతి స్నేహితులు చూస్తా రు.

రాఘవయ్య చలపతి దగ్గరకి వచ్చి, “చలపతి.. పూజ లో పెట్టే దానికి తామర పువ్వులు
కోసుకొని రా బో” అని అడిగితే, తెస్తా ను అని వెళ్లబోతుంటే, తన తో పాటు
వెంకటలచ్చిమి కూడా వెళ్తా ను అంటే.. రాఘవయ్య వెళ్ళమంటాడు..

వాళ్ళు తామర పువ్వులు ఉన్న వాగు దగ్గర కి వెళ్తా రు, అక్కడ చెట్టు కింద గాజులమ్మ గుడు
ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెంకటలచ్చిమి ముక్కుంటుంది, పక్కన చూస్తే.. చలపతి
అక్కడే నిలబడి ఉంటాడు, పిలుస్తుంది, రాను అని సైగ చేస్తా డు, వెంకటలచ్చిమి వచ్చి
తనకి బొట్టు పెట్టబోతే “వద్దు , నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు” అని అంటాడు,
అప్పుడు “బావ! ముక్కితే నే కదా ఆ దేవుడు ఉన్నాడో లేదో తెలిసేది” అంటే
ఆలోచిస్తుంటే.. చలపతి చెయ్యి పట్టు కొని తీసుకెళ్తుంది. అప్పుడు చలపతి ఆ గాజులమ్మ ని
“వెంకటలచ్చిమి ని నన్ను వొకటి చెయ్య అమ్మా, నువ్వు వున్నావు అన్న నిధర్శన్మ
చూపించు” అని ముక్కుంటాడు. అప్పుడు, వెంకటలచ్చిమి, తనకి బలం తాడు
కడుతుంది.. వెంకటలచ్చిమి కి కూడా, అదే బలం తాడు కడుతాడు.. అలా
ముక్కుంటాడో లేదో, వెంకటలచ్చిమి వెనక్కి వచ్చే సమయం లో కాలు జారుతుంది, తను
నీళ్ళల్లో పడిపోతూ, చలపతి ని కూడా లాక్కొని పోతుంది.. వాళ్ళు ఇద్దరూ ఆ తడిసిన
బట్టలు ఆరపెట్టు కుంటారు .. వొకరిని వొకరు చూసుకొని, ఆలింగనం చేసుకుంటారు.

కొత్త బట్టలు వేసుకొని.. ఆ రోజు ఇంట్లో బంతి భోజనం చెయ్యటం; చలపతి కి ప్రత్యేకం
గా వడ్డించటం, లేచి పోతుంటే.. వెంకటలచ్చిమి వెళ్ళి చెయ్య కడుక్కోవటానికి చెంబు తో
నీళ్ళు పోసి, టువాలు ఇవ్వటం, తను వదిలేసినా బంతి లో వెంకటలచ్చిమి కూర్చోవటం,
అది లక్స్మిపతి గమనించటం. “ఇక్కడ ఏదో జరగతాఉంది, కాని ఏమి జరగతావుందో అర్థం
కావటం లేదు”.. అయినా కనిపెడతా!

వెంకటలచ్చిమి, చలపతి అలా నడుచుకొని ఉరి దావన వెళ్తుంటే.. ముగ్గురు అమ్మాయిలు


ఎదురుగ్గా వస్తుంటారు, వాళ్ళలో ఒక అమ్మాయి చలపతి ని చూసి కన్ను కొట్టి, ఏంది
బావా.. ఈ మధ్య రావటం బొత్తిగా మానేసావు” అంటే.. వెంకటలచ్చిమి వాళ్ళిద్దరిని
చూసి.. “యవ్వరే నీకు బావ” ఆ అమ్మాయి మీదకి గలాటాకి వెళ్తుంది.
చలపతి, వెంకటలచ్చిమి కదలకుండా గట్టి గా నడుము పట్టు కుంటాడు. ఆ అమ్మాయిలు
పారిపోతారు.

about:blank 83/180
5/19/23, 4:13 PM

చలపతి, బచ్చలి లో స్నానం చేస్తుంటే, సీకాయ మర్చిపొయాడని వెంకటలచ్చిమి వెళ్ళి


“బావా సీకాయ అక్కడే మర్చిపోయావు” అంటే, చలపతి, గబుక్కున వెంకటలచ్చిమి
చెయ్యి పట్టి లాగటం.., వెంకటలచ్చిమి సిగ్గుపడుతూ.. బయటకి రావటం లక్ష్మీపతి
చూడటం. అప్పుడు లక్ష్మీపతి“ ఇప్పుడు నాకు అంతా అర్థమౌతాఉంది.. నాటకం..
బూటకం అని ఇక్కడ చేరింది.. దీని కోసమా?..”

రాత్రి పూట, కోటం వెనకాల మావిడి చెట్లల్లో, మంట పెట్టు కొని, కోడిని కాల్చుకుంటూ,
చలపతి, కళ్ళు తాగుతుంటే, వెంకటలచ్చిమి లచ్చిమి వచ్చి తను కూడా తాగటం.. తనకి
ఎక్కువ అవ్వటం, చలపతి పక్కనే కుర్చీని.. “ఒ రేయ్ చలపతి గా.. నువ్వు నా
బంగారాణి వి.. తెలుసా! నువ్వు అంటే నాకు చాలా ఇష్టం..రా బావా! నువ్వు లేకుండా
నేను బతకలేను.. నన్ను వదిలిపెట్టి పోవు కదూ” అంటూ, పడిపోతే, చలపతి లేపడానికి
చూస్తా డు, ఎంత ఊపినా లేయ్యకపోవటం తో, చలపతి వెంకటలచ్చిమి ని ఎత్తు కొని
వస్తా డు

అలా వచ్చేవాళ్ళని, లక్ష్మీపతి చూస్తా డు, చలపతి అవ్వాక్కు అవుతాడు, వెంకటలచ్చిమి ని


నులకమంచం మీద పండబెట్టి, దుప్పటి కప్పుతాడు.. అప్పుడు

లక్ష్మీపతి

ఒరేయి, ఇన్నినాళ్ళు నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా,


పెద్దగా పట్టిచుకోలే.. అది తల్లి లేని పిల్ల రా, దాని
జీవితం తో ఆడతాను అంటే.. నీ పేగులు ఎల్లబికుతా.

అని, సూరి కత్తి చూపిస్తా డు, అప్పుడు

చలపతి

దాన్నితో అవసరం ఉండదు లే మావా!.

అని, చిన్న గా లాక్కుంటాడు

చలపతి

నాటకం ఆడి మీ గుంపు లో చేరిండోచ్చేమో గాని,


వెంకటలచ్చిమి తో మాత్రం కాదు, అది నా పాణం..
మా పెండ్లి విషయం.. పెద్దమావా తో ఎట్ట చెప్పాలో
అని నేను ఆలోచిస్తుంటే.. నువ్వు వొకడు.

అంటే

లక్ష్మీపతి

about:blank 84/180
5/19/23, 4:13 PM

అది, మీ పెద్దమావ కూతురు కాదు.. నా కూతురు

అంటే, అది విని చలపతి అవాక్కు అవుతాడు.

లక్ష్మీపతి

మీ అత్త పోయినాక, నేను తాగుడుకి అలవాటుపడితే,


అది యాడ అగుడు పడుతుందేమో అని.. 4 ఏళ్ళ
బిడ్డప్పుడు నుంచి.. మా అన్నే దాన్ని
పెంచుకుంటున్నాడు. నా యసనం దానికి శాపం
కాకూడదని.. మనస్సు సంపుకొని దాన్ని దూరం
పెట్టిండాను చలపతి!

చలపతి

మామా.. ఏంది ఇది.. ఊరుకో!

లక్ష్మీపతి

నేను పొయ్యే లోపు.. దాని పెళ్లి చూస్తా నో లేదో అని


భయం గా ఉంది రా!

అని, అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ..

లక్ష్మీపతి

నేను పొయ్యే లోపు.. దాని పెళ్లి చూస్తా నో లేదో అని


భయం గా ఉంది రా!

చలపతి అక్కడే కూర్చొని.. లక్ష్మీపతి నే చుస్తా వుంటాడు. అటుపక్క మల్లు కోని


కళ్ళుమూసుకొని పడుకున్న వెంకటలచ్చిమి కళ్ళలో నీళ్ళు కారుతాయి.

EXT. BURUJUPALLI – KOTAM - MORNING

లక్ష్మీపతి కోటం బయట కూర్చొని ఉంటాడు, అప్పుడు వెంకటలచ్చిమి వచ్చి కాపి ఇస్తూ

వెంకటలచ్చిమి

నాన, కాఫీ తీసుకో నాయినా!

అంటే, అలా సైలెంటు అయ్యి, తలఎత్తి, వెంకటలచ్చిమి ని చూస్తా డు. తన కంట్లో నీళ్ళు
తిరుగుతాయి, అటుగా ఉన్న చలపతి ని చూస్తా డు, అప్పుడు చలపతి, అవును అని సైగ
చేస్తా డు. మళ్ళి వెంకటలచ్చిమి ని చూసి, గ్లా స్ పక్కన పెట్టి, లేచి, వెంకటలచ్చిమి చెయ్యి
పట్టు కొని.

about:blank 85/180
5/19/23, 4:13 PM

లక్ష్మీపతి

20 ఏళ్ళ నుంచి.. నన్ను నాన్నా అని


ఎప్పుడు పిలుస్తా వా అని ఎదురు చూస్తు నాను అమ్మా

అంటే, కంట నీరు పెట్టు కుంటాడు

వెంకటలచ్చిమి

ఊరుకో నాన్నా!

చలపతి

మామోయి!.. దానిమీద ప్యాడా వోలకబోసింది


సాలుగాని.. ఆడ నాటకానికి రమ్మంటున్నారు..

అంటే..

లక్ష్మీపతి

మీరు వెళ్ళండి.. లేకపోతే.. మీ పెద్ద మామ


విసుక్కుంటాడు. ముందే కోపిస్టి.

అంటే. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు

EXT. BURUJUPALLI – KOTAM - LATER

Halfway లో, రాఘవయ్య నాటకాల గుంపు మొర్థం, ఇంటి ముందు నాటకం


(అయ్యప్పస్వామీ జననం) సాధన చేస్తుంటారు, అందులో మహీషి, తపస్సుకు మెచ్చి,
బ్రంహదేవుడు ప్రత్యక్షము అవ్వుతాడు, అప్పుడు.

అందులో శివుడు వేషం చలపతి, కేశవ (ఆడ) వేషం వెంకటలచ్చిమి వేస్తుంటారు.


రాఘవయ్య చక్క కుర్చీలో కూర్చొని నాటకాన్ని చూస్తుంటాడు.

బ్రంహదేవుడు

మహిషి!

అంటే, మహిషి; కళ్ళు తెరిచి, లేచి నిలబడి

బ్రంహదేవుడు

నీ తపస్సుకు మెచ్చినాను! అసాధ్యకరమైన తపస్సు చేసి


నన్ని మెప్పించావు, అబిష్ట వరం కోరుకో,
అనుగ్రహిస్తా ను!

about:blank 86/180
5/19/23, 4:13 PM

మహిషి

బ్రంహదేవా! నేను అమేయ భల పరక్రమాలతో, చిరంజీవి


గా వుండు నట్టు వరము ఇవ్వండి 

అంటే

బ్రంహదేవుడు

చావు ను తప్పించడం, ఆ హరి హరులకు కూడా


అసాధ్యం, కనుక ఇంకేదైనా వరము కోరుకో? 

అంటే

మహిషి

ప్రజాపతి! అటులేనా, ఆ హరి హరులకు జన్మించిన


కుమారిడి చేతిలో మరణించే వరాన్ని అయినా ఇవ్వండి

అంటే

బ్రంహదేవుడు

తతాస్తూ!

అని, అక్కడ నుంచి మాయమౌతాడు. మహిషి గట్టిగా లోకాలు దద్దరిల్లే లా నవ్వుతుంది.

మహిషి పెట్టే బాధలను తాళలేక, పదవి బ్రష్టు డై ఇంద్రు డు, బ్రంహదేవుడి వద్దకు వస్తా డు

ఇంద్రు డు

పరమేష్టి, అమ్మా భువనేశ్వరి, ప్రణామము

అంటే, ఇంద్రు డిని చూసివాళ్ళు, అసిర్వదిస్తా రు, అవల్లకు ముక్కుతాడు, అప్పుడు

బ్రంహదేవుడు

అమరేంద్రా, మీ హటాన్ రాకకు గల కారణము

అంటే

ఇంద్రు డు

ఇదంతా, మీ అనుగ్రహమే కదా విరించి. ఆ మహిషి కి


ఇవ్వరాని వరం ఇచ్చారు, అది మమ్ములను
చిత్రహింసలకు గురి చేస్తోంది. చివ్వరు దేవతతలందరూ

about:blank 87/180
5/19/23, 4:13 PM

అమరావతి ని విడిచి వెళ్ళే పరిస్థిది వచ్చినది కదా


ప్రజాపతి.

అంటే

బ్రంహదేవుడు

ఆవేదన వలదు మహింద్రా! ఆ మహిషి అంతమవు


సమయం ఆసన్నమైనది

ఇంద్రు డు

అటులైన మీరు ఇచ్చిన వరము లో శివ కేశవుల కి


పుత్రు డు జన్మించుట, ఎటుల సాధ్యము..
స్వయంభూ.

అంటే, అప్పుడు

బ్రంహదేవుడు

రాక్షసం ప్రళయ తాండవం చేసినప్పుడు, ధర్మాన్ని


కాపాడతానికి, బగవంతుడు అవతరణ తత్యము.

అంటే

బ్రంహదేవుడు

అటు చూడు, బస్మాసురుడి ని సంహరించిన ఆ


జగన్మోహిని రూప దారి ఐన ఆ పద్మనాభుడి అందానికి
మయమరచి, ఆ మన్మధుడిని గెలిచినటు వంటి ఆ
ముక్కంటి ని చూడు, తనను తాను మయమరిచి, ఆ
జగన్మోహిని తో ఎలా రసోత్తరంగా నాట్యం చేస్తు న్నాడో.

అంటే, అటు చూస్తా డు: LEAD TO REAL DRAMA

EXT. DRAMA STAGE – YEGUVAPALLI - NIGHT

అక్కడ శివ కేశవులు, వొకరిని వొకరు, పట్టు కోవటానికి ప్రయత్నిస్తూ.. మధ్య మధ్య లో
నాట్యం చూస్తూ.. వారికీ చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు, చివ్వరికి శివుడి
చేతికి చుక్కుకుంటుంది మోహిని..

శివున్ని చూసి, గంగిరెడ్డి.. చిన్నబ్బ తో రాక్షసం ప్రళయ తాండవం చేసినప్పుడు, ధర్మాన్ని


కాపాడతానికి, బగవంతుడు అవతరణ తత్యము.

about:blank 88/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

చిన్నబ్బ! ఆ శివుని ఏసం కట్టినోడు, మన పాలేటి


గాడి కొడుకు లా ఉండ్లా ! 

అంటే..

చిన్నబ్బ

అవును సామి.. వాడే

గంగిరెడ్డి:

ఏంది.. నిన్ను చితగోట్టింది, ఆ కదిరెప్ప గాని కొడుకు


ని కుల్లబోడిసింది కూడా వాడే ఐతే!

అంటే, తల దిన్చుకుంటాడు.. అప్పుడు గంగిరెడ్డి భార్య.. తనని తట్టి.. నాటకం


చూడమంటుంది.

రెడోరమ్మ

మీ పంచాయతి.. ఇంటికాడ పెట్టు కోండి.. ఆడ


నాటకం చూడండి!

నాటకం

అప్పుడు తన నుంచి వస్తు న్న సుగంధ పరిమలాలకు


మోహితుడై మోహిని ని ఆలింగనం చేసుకుంటాడు, ఆ
తరవాత.. వాళ్ళు వొకరిని వొకరు చూస్తూ.. వాళ్ళు
రసవత్తరమైన నాట్యం చేస్తా రు. అప్పుడు వారి కలయిక
తో, శ్వేతా బిందువు పుడుతుంది, ఆ శ్వేతా బిందువు
నుంచి అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తా రు.

EXT. DRAMA STAGE – YEGUVAPALLI - LATER

నాటకం అయిపోతుంది, అక్కడికి వచ్చినవారు అందరూ తప్పట్లు కొడతారు, గంగిరెడ్డి


కుటుంభం కూడా వచ్చి ఉంటుంది. ఆ నాటకం చూడటానికి వచ్చిన తన స్నేహితులు
చలపతి ని చూడటానికి ఆ స్టేజి వెనక్కి వస్తా రు. చలపతి ఇంకా వెంకటలచ్చిమి ని
హత్తు కొనే ఉంటాడు. అది చూడకుండా.. కోనా

అక్కడ శివ వాళ్ళని చూసి, వెంకటలచ్చిమి కి పరిచయం చేస్తా డు. తన నాయినమ్మ కి


వెంకటలచ్చిమి ని పరిచయం చేస్తా డు

కోనా

about:blank 89/180
5/19/23, 4:13 PM

రేయ్ చలపతి

అని అరుస్తా డు.. అప్పుడు వాళ్ళు ఇద్దరూ విడిపోతారు, అప్పుడు సోమా దగ్గరకి వచ్చి..

సోమా

ఏదో పనిలో ఉన్నట్టు వున్నారు, మళ్ళి వొచ్చేదా?

అంటే.. వాళ్ళని చూసి.. సంతోషం లో

చలపతి

రేయ్! మీరూ ఇక్కడ ఏమి చేస్తు న్నారు రా?

అంటే

కోనా

మాతో పాటు, మీ నాయినమ్మ కూడా వొచ్చింది..

అంటే, అంతలో మునెమ్మ కూడా అక్కడికి వస్తుంది. అపుడు చలపతి ని చూసి

మునెమ్మ

ఎంత బాగా చేసావు రా చలపతి. అచ్చం శివున్ని


చూసినట్టే ఉంది.

అంటే, అప్పుడు తన పక్కనే ఉన్న వెంకటలచ్చిమి గబుక్కున మునెమ్మ కాళ్ళమీద


పడుతుంది, అపుడు..

మునెమ్మ

లే అమ్మా, నువ్వు కూడా బాగానే చేసావు లే!

అంటే, సోమా తన తల పట్టు కుంటాడు. ఇంతలో అక్కడికి లక్ష్మీపతి వచ్చి

లక్ష్మీపతి

వోరేయి అల్లు డూ! ఇక్కడ ఉన్నారా.. అక్కడ మీ


పెద్దమావ మిమ్మల్ని రమ్మంటున్నాడు..

చలపతి

ఆ మామ వస్తు న్నాము..

అంటే, మునెమ్మ వాళ్ళని చూసి

about:blank 90/180
5/19/23, 4:13 PM

మినేమ్మ

అవును రా! వాడు అల్లు డూ అంటునాడు, నువ్వేమో


మామా అంటున్నావు.. కొంపదీసి ఈ అమ్మాయి ని
పెళ్లి గాని.

ష్! అని, మునెమ్మ నోరు మూస్తూ.. చలపతి వెంకటలచ్చిమి ని వెళ్ళమని సైగ


చేస్తా డు.. తను వెళ్ళిపోయాక, అప్పుడు మునెమ్మ చలపతి చేతిని కొట్టి.

మునెమ్మ

పెళ్లి చేసుకున్నావా అని అడిగితే, నా మూతి


ముస్తా వెందుకు రా.. ముదనష్టపు సచ్చినోడా!

అంటే

చలపతి

గొంతు పిసికేస్తా చూడు.. ఆ నోరు ఏసుకొని.. నీకు


తెలీకుండా చేసుకోను లే ఏ తల్లి!

అని గొంతు పట్టు కోబోతాడు, అప్పుడు

మునెమ్మ

సర్లే! నా నోరు మూఇచ్చే దాంట్లో నే ఉండు.. దాని


కులం, గోత్రం అయినా చూసుకున్నావా లేదా?

చలపతి

అన్ని.. ఇంటికి వొచ్చి.. తీరిగ్గా చెప్తా ను ను లే గాని


మీరు ఊరికి పొడి..

అని, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు చలపతి స్నేహితుల వైపు చూస్తూ

మునెమ్మ

వీడు ఇట్లా తయారు అయ్యేదానికి కారణం మీరు


కాదు! దొంగ కోళ్ళు పట్టే వాలకాలు మీరు!

అనే లోపే.. తలా వో దిక్కు వెళ్ళిపోతారు. మునెమ్మ వాళ్ళనే చూస్తూ నిలబడి పోతుంది.

EXT. DRAMA STAGE – YEGUVAPALLI - LATER

about:blank 91/180
5/19/23, 4:13 PM

సీతమ్మ, వెంకటలచ్చిమిలు వాళ్ళ సామాన్లు సర్దు కుంటూ ఉంటారూ, అప్పుడు ఆ నాటకం


అయ్యాక బట్టలు మార్చుకోవటానికి అటు సర్దు కుంటూ ఉంటారు, అప్పుడు వెంకటలచ్చిమి

వెంకటలచ్చిమి

అమ్మా! ఆ రెడ్దోరమ్మ వంగ పువ్వా చీర చూస్తివా!


చానా బాగుండ్లా .. ఆ రైకకి.. ఎంతుంటుందో కదా

అంటే

సీతమ్మ

ఎంతుంటే ఏమే! కొనగలమా పాడా!

అంటే

వెంకటలచ్చిమి

అవును లే! అదీ నిజమే! అట్టాంటి చీర.. నేను


ఎప్పుడు.. కడతానో ఏమో!

తల మీద వొకటి ఇచ్చి

సీతమ్మ

కలలు కనేది ఆపి.. ముందు ఆ పని కాని, నడివీది


పూజకి యాల అవుతా ఉండాది, బండ్లు పోనిరు.

అంటే, అటుగా వస్తు న్న చలపతి వాళ్ళ మాటలు వింటాడు, విని అక్కడ నుంచి సంచి
ఎద్దల బన్డి దగ్గరకి తీసుకెళతాడు.

EXT. YEGUVAPALLI – NADIVEEDHI - NIGHT

MIDWAY లో యగువపల్లి నడివీధి గంగమ్మ కు పూజ చేస్తుంటారు, అక్కడ గంగిరెడ్డి తో


పాటు, ఆ చుట్టు పక్కల 18 ఊర్ల పెద్దలు, ఇంకొంతమది వుంటారు. వాళ్ళు ఊరికి ఒక
గుంపు గా నిలబడి వుంటారు, పూజ చేసి సాకలోడు మేక పోతును బలి ఇస్తా రు, ఆ
తెగిన మొండెం ముక్కు దగ్గర.. వేప ఆకుల తో నీళ్ళు పోస్టు .

సాకలివాడు

అమ్మా.. తల్లి, ఈ ఏడు అన్నా మాకు వానలు


పడి, పంటలు పండుతాయా, మా ఊర్లకు పట్టిన
మహమ్మారి పోతుందా?

about:blank 92/180
5/19/23, 4:13 PM

అని అడిగితే.. సమాధంనం రాదూ, అది గంగిరెడ్డి ఆ మేకపోతూ తలనే ఆత్రు త గా


చూస్తు నే ఉంటాడు Low angle shot.. with SUSPENSE MUSIC..

AS GANGIREDDY IS VERY EGAR TO LEAR WEATHER THE


GANGAMMA IS GOING TO SAVE THIS VILLAGES OR NOT.

సాకలివాడు

పలుకమ్మా.. పలుకూ..

అంటే.. సమాధానం ఉండదు, అప్పుడు ఆ సాకలి వాడు, రెడ్డి వైపు చూసి.. లేదు
అని తల ఉపుతాడు, అది చూసి, రెడ్డి అక్కడ నుంచి వెళిపోతాడు. ఆయన
వెళ్ళిపోయాక, ఆ గుంపులో ఒక పెద్దమనిషి Top and Low angel covering
both saakalivaadu and reddy.

పెద్దమనిషి
( OS )

రేయ్! లచ్చుమన్నా.. ఆ అమ్మోరు ఇకా యాడ ఉంది


గని, ఆ కూడు కలిపి.. బలి ఎసిరాబొ.

పెద్దమనిషి-1
( OS )

చడబుట్టిన జాతి వల్లే.. ఈ అనిష్టం అంతా!

అంటే, ఆ గుంపు లో ఉండే వాళ్ళు సాకలివాడి వెనకాల తోసుకుంటూ ఉంటారు, ఈ


సాకలి వాడు మాత్రం వాళ్ళని పట్టించుకో కుండా, బలి కూడు కలిపి.. అక్కడ తోటి
వాణ్ణి వెంట బెతుకొని. బలి కూడు వెయ్యటానికి వెళ్తా రు.

EXT. REDDY HOUSE - LATER

MIDWAY లో గంగిరెడ్డి ఇంట్లో ఆ గొడవకి పంచాయతి. అటుగా ఆ తల లేని మేకపోతు


తోలు తీస్తూ ఉంటారు. అక్కడ పెద్దమనుషులు అందరూ చెయ్యి కట్టు కొని నిలబడి
ఉంటారు, తక్కువ జాతి వాళ్ళు ఇంకోపక్క గొంతు కూర్చొని ఉంటారు, చివ్వర గా ఆ
సాకలి వాడు, తనతో వెళ్ళిన తోటోడు కూడా వచ్చి అక్కడ గొంతు కూర్చుంటారూ,
అప్పుడు సాకలి వాణ్ణి చూసి గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఏ రా! అన్ని తొక్కులు చల్లినావా?

about:blank 93/180
5/19/23, 4:13 PM

సాకలివాడు

ఊ! సామి.. దొడ్డిలో, గొడ్ల సావడి.. అంతా


సల్లినాకే.. ఊరంతా సల్లినాన.

అంటే.. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి గంగిరెడ్డి తో

పెద్దమనిషి

అయ్యా! .. ప్రతి ఈడు లాగా.. ఈ ఈడు


కూడా!..

అనే లోపే గంగిరెడ్డి INTERRUPTING చేస్తూ

గంగిరెడ్డి

హే! ఏందయ్యా మీ పంచాయతి, సంక్రాంతి


వచ్చిందంటే.. ఇదే గోడు! కొట్టు కొని సస్తా రు.

పెద్దమనిషి

ఈ ఈడు కూడా అమ్మ పలకక పొయ్యే సరికి, ఏదో,


బాధ తట్టు కోలేకా! అట్టా జరిగిపోయింది.

అంటే.. ఇంతలో ఇంకో ఉరి వాడు

పెద్దమనిషి1

ఆ బ్రంహం గారు అనట్టూ.. ఈ చుట్టు పక్కల 18


గ్రామాలు నూ అర్ధా నికి అర్ధం అయిపోయినాయి.

అంటే.. ఇంతలో ఇంకో ఉరి వాడు

పెద్దమనిషి2

అవును స్వామి! ఆ మహమ్మారి కొంతమంది ని


ఎత్తు కొని పోతే, తినేదానికి తిండి లేకా ఇంకొంత మంది
జానాలు సచ్చిపోతావుండారు.. ఇప్పుడు ఈ తల్లి
కూడా మన మీద దయ చూపిచ్చాటం లేదు అంటే!

ఆ గుంపులో నుంచి అదే ఊరికి చెందిన ఒక ముసలివాడు గంగిరెడ్డి ని చూసి

బ్రంహన్న

ఇది నిజం గంగిరెడ్డి! నన్ను అడిగితే.. మన ఊర్లు ,


ఇన్ని కస్టా లు పాలు అవ్వటాని కారణం, ఆ అమ్మోరు

about:blank 94/180
5/19/23, 4:13 PM

జాతర జరక్క పోవటమే!

అంటే.. అందరూ బ్రంహన్న వైపు చూస్తా రు, అప్పుడు మళ్ళి

బ్రంహన్న

ఆ అమ్మోరి జాతర జరిగిందా! మళ్ళి మనఊర్లు


బాగుపడుతాయి.. ఇటాగే ఉంటే మన ఊర్లు దిబ్బల
కిందకి మారక తప్పదు గంగిరెడ్డి.

అంటే

గంగిరెడ్డి

చూడు పెద్దనాయనా! నువ్వు చెప్తా వుండేది అక్షరాలా


నిజమే.. జాతర అంటే, నువ్వు నేను చేసే యవ్వారం
కాదు, నాలుగు ఊర్లు కలిసి చేసే ఆచారం. ఆ
అమ్మోరిని కాదని చేసేదానికి అవునా? నువ్వే చెప్పు..
పోనీ చేసేదానికి పూనుకున్నాము అనుకో వీళ్ళు ఇట్టా
కోట్లడుకుంటా ఉంటే.. ఏటా చేసేది..

అంటే..

బ్రంహన్న

ఇప్పుడు ఏమంటావు గంగిరెడ్డి.

అంటే

గంగిరెడ్డి

మన ఊర్లు బాగుపడతాయి అంటే, అంతకన్నా


సంతోషం ఏమి లే! పెద్దనాయనా!

అని, అక్కడ వచ్చిన పెద్దమనుషులని చూస్తూ

గంగిరెడ్డి

చుడండబ్బా! మీరందరూ వొకమాట మీద నిలబడి


రండి, నా పాణం అడ్డు ఏసి అయినా జాతర దగ్గర
ఉండి నేను జరిపిస్తా . ఇది నా మాట. అట్ట అయినా
ఆ తల్లి శాంతిస్తుందేమో చూద్దాం.

అంటే.. అంతలోనే.. ఆ గుంపులో ఉన్న వ్యక్తీ

about:blank 95/180
5/19/23, 4:13 PM

పెద్దమనిషి3

జాతర జరిగితే! అమ్మోరు.. ముందు మా ఇంటి కాడ


నుంచే ఎల్లబారాల.. లేకపోతే నా!

అంటే.. అప్పుడు

గంగిరెడ్డి

ఏయి! నోరు ముయ్యరా!, అడ్డం పుట్టిన నాయాల!


బొక్క తెరిస్తే ఇక్కడే నిన్ను అడ్డం గా నరుకుతా.
ఏమనుకున్నావో.

అని, బ్రంహన్న ని చూసి

గంగిరెడ్డి

సుస్తివా.. పెద్దనాయనా! ఆకు కాలి వోకడి


ఏడిస్తే..  తోక కాలి ఇంకొక్కడు ఎడిసినంట.. వీళ్ళు
జాతర జరిపించేది..? వీళ్ళు మారరు.. ఆ జాతరా
జరగదు.. గాని మీ ఇండ్లకు పొయ్యి తడిగుడ్డ
ఏసుకొని పడుకోబొండి, పొండి!

అంటే, అందరూ.. ఏదో మాట్లా డుకుంటూ అక్కడ నుంచి వెళ్తా రు.

EXT. CHALAPATHI NEW HOUSE - LATER

చలపతి, తన ఇంటికి కొన్ని సామాన్లు తీసుకొని వస్తా డు, అక్కడ మునెమ్మ పాతర్లు
తోముకుంటా ఉంటుంది, దూరం నుంచి చలపతి, ని మాత్రమే చూసి

మునెమ్మ

రా రా! మనవడా! ఎట్లుంది నీ కొత్త పెళ్ళాం.. 

అంటే, దానికి

చలపతి

లబ లాబా ని నోరు ఎసుకోకపోతే.. ఈడ కండ్లు పెట్టి


చూడు!

అంటే, అప్పుడు తొంగి చూస్తుంది, తన తో పాటు లక్ష్మి కూడా వచ్చుంటుంది. అప్పుడు


గబ, గబా లేచి, తన చేతులు కడుక్కొని వాళ్ళదగారకి వస్తుంది. చలపతి తల మీద ఉండే

about:blank 96/180
5/19/23, 4:13 PM

నూకల సంచి, అరుగు మీద పెడతాడు, వెంకటలచ్చిమి మునెమ్మ కాళ్ళకి దండం


పెడుతుంది. అప్పుడు

మునెమ్మ

ఇప్పుడు ఇవన్ని ఎందుకు అమ్మా! లే!

అని లేపుతుంది, తనని చూస్తూ.. అప్పుడు చలపతి మునెమ్మ దగ్గరకి వస్తు ..

మునెమ్మ

ఆ రోజు రాతిరి లో సరిగ్గా కనిపియ్యలేదు కాని..


ఎంత బాగుంది రా నీకు కాబోయేది!

అని, మళ్ళి

మునెమ్మ

ఇంత కీ మీది యా వూరు!

అంటే

వెంకటలచ్చిమి

బురుజుపల్లి.. అమ్మమ్మ

అని చెప్పి.. చలపతి వైపు చూస్తుంది.. అప్పుడు

మునెమ్మ

ఏది మన బురుజుపల్లా ?

అనబోయ్యే లోపు.. చలపతి కలగచేసుకొని

చలపతి

ఇదే నా మీ యమ్మ నేర్పిచ్చింది.. కొత్త మనవరాలు


ఇంటికి వచ్చిందే.. కాసిన్ని నిమ్మకాయ నీళ్ళు ఇద్దమే
అనేమన్నా ఉందా! లేకా అట్నుంచి అట్టే పంపిచ్చేస్తా వా!

అంటే.. ఆత్రు త తో

మునెమ్మ

నువ్వు.. రా అమ్మా.. 

about:blank 97/180
5/19/23, 4:13 PM

అని మునెమ్మ లోకిని పోతూ..

మునెమ్మ

ఆ నా బట్ట కి.. మా యమ్మాని ఆడి


పోసుకోకపోతే.. నిద్ర పట్టదు..

అని ఇంటిలోకి పోతుంది.. వెంకటలచ్చిమి సరాసరి.. చలపతి పక్కన కూర్చుంటుంది..

వెంకటలచ్చిమి

ఏంది చలపతి.. అమ్మమ్మ తో అట్లా మాట్లా డేది..

చలపతి

ఇది మాకు మాములే లే! కాని.. ఏంది సంగతి?


అప్పుడే ఆడంగులు ఒక జట్టు అయ్యినట్టు ఉన్నారు.

వెంకటలచ్చిమి

అదేమి లే! నేను ఎప్పుడూ ని జట్టే!

అని తన మీద వాలుతుంది, అది లోపలి నుంచి వస్తు న్న మునెమ్మ చూస్తుంది.. శబ్దం
చెయ్యగా.. వాళ్ళు ఎదావిధిగా కూర్చుంటారు. అప్పుడు మునెమ్మ రెండు గ్లా సుల్లో
నిమ్మకాయ నీళ్ళు తెస్తుంది, ముందు వెంకటలచ్చిమి కి ఇస్తుంది.. ఇంతలో అటుగా కోనా
పోతుంటాడు, అది చూసి

చలపతి

రేయ్ కోనా!

అప్పుడు మునెమ్మ చేతిలోని గ్లా సు లాక్కొని.. హడావిడి గా తాగేసి.. వెళ్తూ వెళ్తూ..


వెంకటలచ్చిమి కొంగు కి మూతి తుడుచుకొని.. మళ్ళి వస్తా .. అని అక్కడ నుంచి
పరిగెత్తు తాడు. వెంకటలచ్చిమి తన పైటనే చూసుకుంటూ ఉంటుంది.

చలపతి
( OS )

మనోళ్ళు యాడ!

అంటే

కోనా
( OS )

about:blank 98/180
5/19/23, 4:13 PM

ఇంటికాడ!

అంటే

చలపతి
( OS )

ఐతే.. మర్రి చెట్టు కాడికి రమ్మను

అంటే.. వెంకటలచ్చిమి వాళ్ళనే చూస్తుంది

EXT. MARRI CHETTU - LATER

చెట్టు కింద, కోనా, సోమా.. కూర్చొని ఉంటారు.. చలపతి మాత్రం, కోనా మీద తల
పెట్టి పడుకొని ఉంటాడు.. అప్పుడు

బుజ్జి

ఏంది రోవ్! మంచి గ్యలం ఎసినట్టు ఉండావు.. ఆ


బిడ్డే లా మీ గుంపులో.. మంచి పిల్ల ఉంటే నాకు
కూడా చూడొచ్చు కద రా!

సోమా

ఆ దిగవపల్లి లో ఉండేది సాలదా రా నీ మొగానికి

అంటే.. అప్పుడు

చలపతి

ఆహా! నోరు ముయ్యండి రా.. కాకి గోలా!

అంటే, అప్పుడు కోనా చలపతి ని చూసి

కోనా

బలే.. కంతిరి నాయాలు రా నువ్వు.. నాటకాలోల్ల


ఇంటికే పొయ్యి.. వాళ్ళ తో నే నాటకాలు
ఆడతావుండావు.. అది సరే గాని నువ్వేంది
చప్పాపెట్టకుండాగా.. వూడి పడినావు! ఏంది సంగతి!

అప్పుడు,

చలపతి

about:blank 99/180
5/19/23, 4:13 PM

వెంకటలచ్చిమి ఆ రెడోరమ్మ కట్టు కునే చీరలమీద మోజు


పడింది రా.

సోమా

అందుకు..

చలపతి

ఎట్టైనా చేసి.. ఆ చీర ఇప్పియాల..

కోనా

కొంటావా? రెడోరమ్మ కట్టేవి.. పట్టు చీరలు రా!..


ఎంతవుటాయో తెలుసా!

సోమా

ఎంతుంటాయో!

కోనా

యట్లలేదన్నా కనీసం 2 వేలు కి తక్కువ ఉండవు ర.

అంటే.. అందరూ కోనా వైపు చూస్తా రు.. చలపతి లేచి సోమా వైపు చూస్తా డు.

చలపతి

దీ నేమ్మ.. అంత కాసింత చీరకి 2 వేలా!

కోనా

అంత డబ్బులు అంటే కష్టం కదరా!.. నీ అదృష్టా నికి


ఆ శెట్టి గాడు కూడా ఊర్లో లేడు.

చలపతి

ఆ వాడు లేకపోతే ఏమి.. ఆ మగ్గాలోడు ఉండాడు


గదా.

సోమా

ఏంది పట్ట పగలే దొంగతనానికా.

చలపతి

about:blank 100/180
5/19/23, 4:13 PM

ఇప్పుడు ఈ విష్యం.. ఊరంతా పిలిచి.. దండోరా


ఎస్తా వా? పదా రా!

అంటే, వాళ్ళు ముదుకు వెళ్తా రు, చలపతి మాత్రం.. కొద్ది దూరం లో ఉన్న ఎద్దు ల బన్డి
చక్రా నికి ఉన్న చీల లాక్కుంటాడు, అప్పుడు

బుజ్జి

అది దేనికి రా?

అప్పుడు, చలపతి

చలపతి

ఇన్ని యేండ్ల గా దొంగతనం చేస్తా ఉండావు.. అది


కూడా తెలిదా?

అని, వాళ్ళు అక్కడ నుంచి వెళ్తా రు.. వెంకటలచ్చిమి ఆ చెట్టు వెనకాల నుంచి వింటూ
ఉంటుంది.

EXT. MAGGALA HOUSE - EVENING

చలపతి, వాళ్ళు, ఊరిలోనుంచి మగ్గాల వాళ్ళ ఇంటికి దగ్గరకి వస్తా రు.

సోమా

రేయ్ చలపతి.. అదే ఇల్లూ

అంటే.. చలపతి.. అటూ ఇటూ చూస్తూ.. ఎవ్వరు లేనిది చూసి.. వాళ్ళ ఇంటిలోకి
దూరుతాడు. చలపతి తో పాటు.. సోమా, కోనా లు కూడా వెళ్తా రు. వాళ్ళు
దొడ్డిదారింటా.. కిటికీ దగ్గర కు వెళ్తా రు. అప్పుడు సోమా కింద కూర్చొని, ఒక పుల్ల
తో, కిటికీ తెరిచి చూస్తా డు.. ఇంట్లో తొంగి చూస్తా డు.. ఎవరూ లేనిది చూసి..
చలపతి కి సైగ చేస్తా డు.. చలపతి.. అప్పుడు అక్కడ ఉన్న వెనకాలా వాకిలి ని ఒక కట్టి
తో.. పైన పెట్టిన చిలుకు ను తిసి.. లోనికి వెళ్తా డు. 

INT. MAGGALA HOUSE - LATER

అక్కడ నిదానం గా ఇంటిలోకి వెళ్తుంటే.. ఒక గది లో నుంచి.. ఇద్దరూ మనుషులు


(ఆడా, మగ), సరసాలు ఆడుతునట్టు ఈక.. ఈకలు, పక పకలు వినిపిస్తా యి. అవి
విని,అటు గా వెళ్తా డు చలపతి, అక్కడ మగ్గాలు ఏసే వాడు (చౌడప్ప) ఎవరితో నో
సరసాలు ఆడుతుంటాడు, అది చుసిన చలపతి మెల్లగా అక్కడ కు వెళ్ళి నిలబడతాడు.

చౌడప్ప

about:blank 101/180
5/19/23, 4:13 PM

( OS )

ఒసే నరసమ్మ.. ఓ.. నరసమ్మ..

అప్పుడు నరసమ్మ రంజుగా

నరసమ్మ
( OS )

అబ్బా.. ఏందో చెప్పు..

ఆ గదిలో, చౌడప్ప.. నరసమ్మ లు ముసుగు వేసుకొని సరసాలు ఆడుతుంటారు ..


అప్పుడు

చౌడప్ప

ఇన్ని అందాలు పెట్టు కొని.. ఇన్నాళ్ళు.. బలే


వూరించినావు గదే?

అంటే, నరసమ్మ.. చిన్న గా నవ్వుతుంది, అప్పుడు

నరసమ్మ

నువ్వు మాత్రం, ఏమి తక్కువా? ఇంటినిండా ఇన్ని


చీరలు పెట్టు కొని.. వురించాలా!

అంటే

చౌడప్ప

నీకు వో విష్యం చెప్పేదా ?

నరసమ్మ

హు!

చౌడప్ప

నిన్నిట్టా .. చూస్తా వుంటే.. లేత సక్కిరి పాకం లో


ముంచిన జిలేబి లా.. మా ముద్దోచ్చేతున్నవే..

అప్పుడు నరసమ్మ(ఆశ్చర్యంగా)

నరసమ్మ

నువ్వు చెప్పేది నిజమేనా?

about:blank 102/180
5/19/23, 4:13 PM

చౌడప్ప

నిజమే నే!.. నిన్ను కట్టు కున్న చంద్రిగాని మీద


వొట్టు ..

నరసమ్మ

అమ్మో! చంద్రిగాడు అంటే గుర్తు కు వచ్చింది.. నువ్వు


బిరినా కాని సామి... అవతల నా మొగుడు సంత
నుంచి నుంచి వచ్చేపొద్దు అయితావుంది.

చౌడప్ప

ఉండవే.. ఇంకొంత సేపు నీ అందాలని సూడని?

నరసమ్మ

వొట్టి చూసుడే నా.. లేక చేసేది ఏమన్నా ఉందా ?

చౌడప్ప

అబ్బా మేయి! చెవి కోసిన మేకలాగా అరవక


పోతే..  అట్టా .. రంజుగా.. ములగొచ్చు కదా..
ఈడ సల్ల పడిపోతావుంది!

అని మూలిగి చూపిస్తూ

నరసమ్మ

2 గంటల నుంచి చుస్తా వుండా! ఇదే సేస్తా వుండావు..


నీ మగతనమంతా మాటలలోనే, మంచం మీద ఏమి
లే!..

చౌడప్ప

విసుక్కుంటావు ఎందుకు.. మే! కొద్దిగా ములగూ!

అని మూలిగి చూపిస్తా డు..

చలపతి

పోనీ నన్ను మూలగమంటావా.. ఊరంతా ఇనిపిస్తుంది!

అంటే.. వాళ్ళిద్దరూ చలపతి ని చూసి.. వాళ్ళు చేస్తు న వి అప్పి, సర్దు కుంటూ..

చౌడప్ప

about:blank 103/180
5/19/23, 4:13 PM

ఏయి! ఎవరూ నువ్వు.. ఈడ ఏమి చేస్తు న్నావు

చలపతి

వోరి ఎర్రి బాగులోడా.. దొంగ ని.. నువ్వు ఎవరూ..


ఈడేమీ చేస్తు న్నావు అని...కాదు అడిగేది.. నికేమి
కావాలి.. ఎంత కావాలి. అని అడగాలి.

అంటే

నరసమ్మ

పోనీ.. నన్ను అడగమంటావా?

అంటే.. అప్పుడు

చలపతి

తూ! నీ యమ్మా!

అంటే.. అదిరి పడి..

చౌడప్ప

ఇదిగో.. నువ్వు అనుకుంటున్నట్టు .. నా కాడ


సొమ్ములు ఏమి లేవు!

చలపతి

నా కు సొమ్ములు కాదు.. వో నాలుగు అయిదు..


పట్టు చీరలు కావాలా!

చౌడప్ప

ఏంది! పట్టు చీరలు.. ఈడ ఏంటికి వుంటాయి..

అని.. పక్కున నవ్వి, పంచి కట్టు కుంటా

చౌడప్ప

ఇప్పుడు.. ఎర్రిబగులోడు నేను కాదు.. నువ్వు. ఆ


పట్టు చీరలు రెడోరమ్మ లాంటి వాళ్ళు తప్పా.. ఈ
ఊరి ఆడోళ్ళు అవి కట్టి చానా ఏండ్లు ఎయ్యింది
అబ్బా!

అంటే, అప్పుడు

about:blank 104/180
5/19/23, 4:13 PM

నరసమ్మ

దొంగ సచ్చినోడా.. నిన్న.. అడిగితే.. చీరలు


ఉండాయి.. ఇస్తా ను అంటివి కదా రా.. 

అని, అక్కడ నుంచి వెళ్ళిపోతూఉంటుంది.. అప్పుడు

చౌడప్ప

ఒసేయి నరసమ్మ, అది నిన్న ఏ.. ఆ రెడోరమ్మ కి


ఈ యాలె ఇచ్చి పంపిచ్చింది..

అది విని.. చలపతి, బయటకి వెళ్తా డు.. ఇంట్లో కూర్చున్న చౌడప్ప తల మీద గుడ్డ
వేసుకొని..

చౌడప్ప

దీనెమ్మ జీవితం.. వచ్చే.. నా కొంప కుల్చ..


పాయ.. ఇప్పడు ఏ కొంప మీద పడతాడో!

EXT. YEGUVAPALLI ROADS - EVENING

చలపతి.. సరాసరి.. తలుపు తీసుకొని బయటకి వస్తా డు.. చలపతి కాస్త దూరం
వెళ్ళాక.. కోనా, సోమా లు.. పరిగెత్తు కుంటూ వస్తా రూ.. వాళ్ళు కూడా చలపతి
వెంటే నడుస్తూ.. వెంటే వస్తా రు

కోనా

ఏంది రా అట్టా చప్పా పట్టకుండా.. నీ పాటికి నువ్వు


వచ్చేస్తివి.. ఇంకొంచేపు ఉన్నింటే.. ఆ చౌడప్ప గాని
పెళ్ళాం తో పరకెట్లు తినింటాము.

అంటే, ఏమి మాట్లా డకుండా.. వెళ్తుంటాడు

సోమా

ఏమైంది రా.. ఉత్త చేతులతో వస్తా వుండావు.. చీరలు


లేవా ?

అంటే..

చలపతి

చీరలు వీడి కాడ లేవంటా.

about:blank 105/180
5/19/23, 4:13 PM

అంటే.. కోనా విసికి.. ముందుకు వచ్చి..

కోనా

ఇంగ యాడ?

అంటే.. కంటి తో చూపిస్తా డు.. కోనా యనకాల తిరిగి చూస్తా డు, అది గంగిరెడ్డి
ఇల్లు .. అది చూసి.. నోరు తెరుచికుంటూ..

కోనా

ఏంది.. గంగిరెడ్డి ఇంట్లో నా?

అంటే.. అవును ని తల ఉపుతాడు

కోనా

మతి ఉండే మాట్లా డుతున్నావా రా ? వాడి ఇంటికాడికి


పోయ్యేదానికే.. కాయలు జారి చేతిలోకి వస్తా యి..
అట్టాంటిది నువ్వు ఏకం గా వాని ఇంటిలేకే కన్నం
ఎసేదానికి పోతవుండావా?. 

అంటే, అప్పుడు సోమా

సోమా

అస్సలు, నువ్వు.. నువేనా రా..? రెడ్డి సాని


కొమ్పలేకే అడుగు పెట్టనొడివి.. ఇప్పుడు ఏంది రా
ఇది?

అంటే

చలపతి

ఇప్పుడు ఏమి.. మీరు వస్తా రా రార?

అంటే.. అప్పుడు సోమా

సోమా

రాము ర.. నీకు నిన్న కాక.. మొన్నొచ్చిన


వెంకటలచ్చిమి మాట తీపి అయ్యుండొచ్చేమో గాని..
మాకు కాదు.. నువ్వు యాడన్నా సావు.. మేము
పోతావుండాము.

about:blank 106/180
5/19/23, 4:13 PM

అని.. కోనా ని లాక్కొని పోతాడు.. అతను వెళ్తూ.. వెళ్తూ

కోనా

చలపతి! పొయ్యి పొయ్యి.. సావును ఎతుక్కుంటా


పోతావుండావు.. జాగ్రత్త.

అని.. వాళ్ళు ఇద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు చిన్నగా గంగిరెడ్డి ఇంటి
వెనక వైపు వెళ్తా డు.

EXT. CHALAPATHI NEW HOUSE - LATER

MONTAGES: వెంకటలచ్చిమి చలపతి ఇంటికి వచ్చి మునేమ్మని పట్టు కొని ఏడుస్తుంది..


అప్పుడు మునేమ్మకి.. అక్కడ జరిగిన విషయం చెప్తుంది. మునెమ్మ వోదరుస్తుంది.. కాని
వినకుండా.. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చలపతి కట్టిన బలం తాడు కింద
పడివుంటుంది.

వెంకటలచ్చిమి వేల్లిపోయిది చూసి.. మునెమ్మ, అక్కడ అరుగు మీద కాసేపు కూర్చొని..


కళ్ళు తుడుచుకొని.. చలపతి బట్టలు బయటకి విసిరేసి.. తను ఒక పెట్టి పెట్టు కొని,
ఇంటికి బీగాలు వేసి.. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

EXT. REDDY HOUSE - DUSK

MIDWAY లో గంగిరెడ్డి ఇంటి ముందు, కుర్చీలో కూర్చొని ఉంటాడు, అక్కడ కర్ణం ని


బాగా చితకకొట్టి, మోకాళ్ళ మీద కూర్చో బెట్టి ఉంటారు

గంగిరెడ్డి

ఏరా కర్ణము.. బలే ఉంది రా నీ యవ్వారం. నాకు


సేవ చేసుకున్నావు కదా అని. 3 ఎకరాలు రాసిస్తే,
నువ్వు ఏమి చేసినావు? మూడు పక్కన సున్నా పెట్టి
ముప్పై చేసుకున్నావు..

అని అడిగితే.

కర్ణం

అయ్య!.. అయ్య! నన్ను క్షమించండి.. బుద్ది గడ్డి


తిని.. పొరపాటు చేసాను.. నా మీద దయుంచండి
మహా ప్రబో!

అని, గంగిరెడ్డి.. కాళ్ళ మీద పడి

about:blank 107/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

ఆ బుద్ది.. నేను ఇచ్చిన కాగితాల్ని దిద్దక ముందు


వుండాల! తరవాత కాదు... చూడు కర్ణము..
నువ్వు ఈది కుక్క లాంటోడివి.. ఈ రోజు నన్ను
చూసి “బోవ్వ్” మొరిగావు.. నిన్ను ఆదర్శంగా
తీసుకొని.. రేపు ఇంకో 10 కుక్కలు
మొరుగుతాయి.. అప్పుడు ఈ ఊర్లకు.. రెడ్డి గా
నాపెద్దరికం యాడఉంటాది చెప్పు.. అందు చేతా..
సచ్చిపో.. 

అని, అంటే.. తన కాళ్ళ దగ్గరకి వచ్చి.. కల్లు గట్టి గా పట్టు కుంటాడు.. అప్పుడు

కర్ణం

అయ్యా! అంతపని చెయ్యకండి. నేను పోకపోతే..


పిటల మీద.. నా కూతురి పెళ్లి ఆగోపోతుంది.

అంటే, చిన్నబ్బ ని చూసి..

గంగిరెడ్డి

అబ్బా.. చిన్నబ్బ! గొర్రి మాదిరి అక్కడే నిలబడక


పోతే, వాణ్ణి లాగేయి రా! నా.. కాళ్ళు నొప్పి
నొప్పేస్తు న్నాయి.

అంటే.. ఇంకా గట్టిగా పట్టు కొని

కర్ణం

అయ్యా!.. ఈ సారికి నన్ను క్షమించి..


వదిలెయ్యండి.. కావాలంటే.. నా ఆస్తి మొర్తం
రాసిస్తా ను..

అంటే.. అప్పుడు చిన్నబ్బ ని ఆగమని సైగ చేసి..

గంగిరెడ్డి

ఏంది.. మొర్థం ఆస్తి.. నా?

అని ఆశ్చర్యం గా అడిగితే

కర్ణం

అవును దేవరా!

about:blank 108/180
5/19/23, 4:13 PM

అంటే.. అప్పుడు

గంగిరెడ్డి

నన్ను.. బాగా మొహమాటం పెట్టేస్తు నావు.. కదయ్యా


కర్ణము.. నీ మాట కాదనలేక పోతావుండాను..
అని.. సరే.. అట్నే కాని

అని, మునుసబు తో..

గంగిరెడ్డి

మునుసబు.. ఆ బీరువాలో.. కాళి పత్రాలు


ఉంటాయి, తీసుకొని రా!

అంటే, మునుసబు వెళ్ళి తెసుకోస్తా డు, అప్పుడు, చిన్న గా లేపుతూ.. 

గంగిరెడ్డి

లే వయ్యా.. కర్ణము.. ఆ సంతాలు ఏదో బిరినా


పెట్టేయి.. అక్కడ ముహూర్తం దగ్గర పడతావుంది.. 

అప్పుడు కర్ణం అన్ని కాళి కాగితాల్లో, సంతకాలు పెడతాడు. అప్పుడు.. పెట్టా క,


అవితిసుకొని, మునుసబుకు ఇచ్చి, ఎడమ చేతితో.. కర్ణం గొంతు కోస్తా డు.. తన
చేతుల నిండా రక్తం. Use Alfred Hitchcock rule of Visual
Storytelling, showing the emtions from the hands.

గంగిరెడ్డి

నా ఉప్పు తిని, నా మాటకి ఎదురు తిరిగే వాళ్ళు..


నా కాడే కాదు.. ఈ బూమి మీదే ఉండ కూడదు.

కర్ణం అక్కడి కక్కడే.. కుప్పకులుతాడు. అప్పుడు అక్కడ చిన్నబ్బ

గంగిరెడ్డి

అట్టా , జండా మాను లా నిలబడే ఉండావు ఎదుకు


రా..  అక్కడ ముహూర్తం దగ్గర పడతావుంది.. మరి
తండ్రి లేకపోతే.. కష్టం కదా.. కాని

అని చేతితో తీసుకోనిపోమ్మని సైగ చేస్తా డు.. అక్కడ నుంచి కర్ణం ని లాక్కుంటూ వెళ్తా డు
చిన్నబ్బ..

EXT. REDDY HOUSE - LATER

about:blank 109/180
5/19/23, 4:13 PM

FLASH CUTS లో, హత్య జరిగిన చోటు మొదట గంగిరెడ్డి, ఆతరవాత వోకొక్కరే
వెళ్ళిపోతారు, చివ్వరకి చిన్నబ్బ వచ్చి అక్కడ రక్తం కడుగుతాడు, లాంతర్లు , దీపాలు,
Lights ఆరిపోతాయి.. 

అదే అదును చూసుకొని.. ఇంటి వెనకాల గడ్డివాములో దాక్కొని ఉన్న చలపతి..


బయటకి వచ్చి.. చిన్నగా కొమ్మలు ఎక్కి.. ఇంటి మిద్ది మీదకు దుంకుతాడు. అక్కడ
తలుపులు తెరిచి ఉండటం తో.. లినికి వెళ్ళి..

చలపతి

ఓయమ్మో.. ఎంత పెద్ద కొంప! ఇంత బంగళాలో


చీరలు.. యాడుండాయి అని ఏతికేది.

మనస్సులో అనుకుంటూ.. చిన్నగా గదుల్లో చూస్తా డు.. అక్కడ అందరూ పడుకొని


ఉంటారు.. అక్కడ గంగిరెడ్డి మంచం మీద పడుకొని ఉంటాడు.. కాని నిద్దర రావటం
లేదు, లేచి తన మంచం మీద కూర్చుంటాడు.. అప్పుడు తన భార్య.. లేచి

రెడ్దోరమ్మ

ఏంది బా, పడుకోలా ఇంకా?

అంటే

గంగిరెడ్డి

ఈరోజు ఎందుకో.. చానా దిగులు.. దిగులు గా


ఉందే.. 

రెడ్దోరమ్మ

ఆ కర్ణం గురుంచి అలోచిస్తా వుండావేమొ.. కాసిన్ని


పాలులు తెచ్చేదా?

గంగిరెడ్డి

వద్దు లే.. నువ్వు పనుకో.. నేను అట్లా గాలికి పొయ్యి


వస్తా .

అని, తన రూమ్ లో నుంచి బయటకి వస్తా డు.. అప్పుడే చలపతి కూడా మిద్ది మీద
నుంచి కిందకి దిగి.. 1వ మాడి మీదే చోట నిలబడి.. అటు ఇటూ చూస్తూ..
ఉంటాడు.. వాళ్ళకి తెలియకుండా నే వాళ్ళ ఇద్దరి పిల్లి ఎలుక లా దాగుడు మూతలు
ఆడుతారు. చివ్వర గా మెట్లు దిగితాడు. గంగిరెడ్డి మెట్లు దగ్గర అలజడి అవ్వటం తో..

about:blank 110/180
5/19/23, 4:13 PM

అక్కడ కి వచ్చి నిలబడతాడు.. కాని అక్కడ ఎవ్వరూ లేరు అని.. మిద్దె ఎక్కి పైకి
వెళ్తా డు. 

చలపతి.. కిందకి వెళ్తా డు. ఆ ఇల్లు పెద్దది గా ఉండటం తో.. అక్కడ చిన్న గా అటు
ఇటు చూస్తూ.. ముందుకు వెళ్తుంటాడు.. చిన్నగా చక్క బీరువా తీసి.. చూస్తా డు..
ఏమి దొరక్కపోవటం తో.. అది ముసి.. తన ఎడమ పక్కకి చూస్తా డు.. అక్కడ ఏదో
గది ఉన్నట్టు ఉండటం తో.. అటు గా వెళ్తా డు. అది దేవునిగది.. అక్కడ ఉన్న
గంగమ్మ ని ముక్కి.. కింద ఉన్న గడపని ముక్కుతాడు, తన చెయ్యి.. పోరపాటులో..
అక్కడే పెట్టిన వక్క ఆకు ని తాకుతుంది. అప్పుడు లచి -SFX Water flowing
in background

చలపతి

అమ్మ.. ఇంత పెద్ద కొంప లో.. దంత గద్ది చీర..


యాడ అని ఎతికేది.. నువ్వే చెప్పు..

అని ముక్కి.. వెనక్కి తిరుగుతాడు.. అప్పుడే.. అమ్మ చేతిలో ఉన్న మందారం


పువ్వు.. కింద పడుతుంది.. చలపతి.. అక్కడ నుంచి వెళ్తుండగా.. తన ద్రు ష్టి.. ఆ
గదిలోనే ఉన్న పెట్టి మీద పడుతుంది. ఆ పెట్టి మీద చీర ని చూసి.. అక్కడికి వెళ్ళి

చలపతి

సంకలో బిడ్డని పెట్టు కొని.. ఊరంతా ఎతికినట్టుంది..


రా చలపతి.. 

సంతోషం ఆ చీరని తీసుకోబోతే.. చెయ్యి జారి.. ఆ చీర కింద ఉన్నా కంచు పళ్ళెం..
కింద పడబోతుంటే.. చలపతి.. దాన్ని పట్టు కుంటాడు.. దాన్ని యదా విదిగా
పెట్టబోతే... లేసుగా మల్లె పూల వాసన రావటం తో, అలా గాల్లో ని వాసన చూస్తూ..
ఇంతలో తన వెనకాల గజ్జలు శబ్దం వినిపిస్తుంది.. వెనక్కి తిరుగుతాడు..
అప్పుడు.. అటు గా గోడ అవతల ఎవరో ఉన్నట్టు గా అనిపిస్తుంది.. చలపతి..
చిన్నగా..నడుచుకుంటూ.. రెండు.. మూడు అడుగులు వేస్తా డు.. ఇంకో అడుగు..
వెయ్యబోతే.. 

చీర కుచ్చి రాకపోవటం తో.. గబాలున వెనక్కి తిరిగి చూస్తా డు.. మాయన్ధకరం,
హటాత్తు గా రౌద్ర రూపిని అయిన ఆ అమ్మవారు సాక్షాత్కరిచి ఉంటుంది.. తన చేతిలో
ఆమె చీర పైట కొంగు పట్టు కొని ఉంటాయి.. తన చుట్టూ.. మయాన్ధకారం.. చలపతి
ముందు నిలబడి ఉన్న ఆ అమ్మవారి ని చూస్తూ.. తన చేతిలో ఉన్న పైట కొంగు ని
నిదానం గా వదిలేసి.. చలపతి ఆ అమ్మవారిని తన్మయత్వంతో చూస్తా డు..
ఆ తన్మయత్వంతో పులకించిన చలపతి, కళ్ళలో తెనకి తెలియకుండా నే.. నిరు
కారుతుంది... నిదానం గా ఆ మాయన్ధకారం తొలగిపోతుంది.. మళ్ళి ఆ నీళ్ళ

about:blank 111/180
5/19/23, 4:13 PM

శబ్దా లు.. గుడ్లగూబలు,కీచురాళ్ళ శబ్దా లు.. వినిపిస్తా యి.. చలపతి... ఆ తన్మయత్వం


లోనే.. బయటకు పరుగెత్తటం.

EXT. REDDY HOUSE - LATER

ఈ విషయాలు ఏమి తెలియని గంగిరెడ్డి.. తన మెడ మీద నిలబడి చుట్ట కాలుస్తూ


ఉంటాడు.. ఇంతలో అటు గా అడవి నుంచి.. కొన్ని విచిత్ర శబ్దా లు
రావటంతో.. ఏమిటా అని ఇంటి వెనక వైపు వైపు వెళ్ళి చూస్తా డు.. ఇంతలో దిడీ
అంటూ తన ఇంటి ముఖద్వారం వైపు వాకిళ్ళు తెరుచుకుంటాయి. 100 సురిళ్ళ కాంతి
లో నుంచి ఏదో లోకం లో ఉన్న చలపతి బయటకి వస్తా డు అక్కడ నుంచి, చిన్నగా
చీకటిలో కి కలిసిపోతాడు.. చలపతి వేల్లిపోయ్యక, మళ్ళి ఆ వాక్కిల్లు గట్టి గా
మూసుకుంటాయి. ఆ శబ్దం విన్న గంగిరెడ్డి ఏమిటా అని తొంగి చూడటం తో, అప్పుడు
ఇంటి వాలికి ముసుకోవటం గమనిస్తా డు, అక్కడ బండ్ల పైన.. తన ఇంటి లో నుంచి
ఎవరో బయటకి వెళ్ళినట్టు నట్టు నీటి పాదాల అచ్చులు గమనించిన గంగిరెడ్డి.. గెట్టి గా
కేకలు పెడతాడు..

గంగిరెడ్డి

ఒరేయి.. చిన్నబ్బ.. యాడ సచ్చిన్నారు రా.. ఎవరో


మన ఇటికి వచ్చి పోయినట్టు ఉన్నారు.. ఎవడో
చూదండి రా!

అని అరుస్తూ.. ఇంటి మిద్దే మీద నుంచి ఇంటి ముందుకు వస్తా డు.. అక్కడ ఎవ్వరూ
ఉండరు.. గంగిరెడ్డి వచ్చిన తరవాత.. ఆ ఇంట్లో దీపాలు వెలుగుతాయి.. దివిటీలు
పట్టు కొని, తన అనుచరులు వెతకటానికి వెళ్తా రు.. గంగిరెడ్డి.. మొదటిసారి గా తన
ఇంటి మెట్లమీద కూర్చుంటాడు.

EXT. NELLIMANDA TEMPLE - LATER

తన్మయత్వంలో చలపతి, గుడి దగ్గరకి రావటం, ఇంతలో గట్టిగా ఉరుములు, అవి కాస్తా
పిడుగు గా మారి.. చలపతి దగ్గర గా పడటం, ఆ పిడుగు పడిన తాకిడికి.. చలపతి
ఎగిరి అటుగా ఉన్న పుట్ట మీద పడటం, స్పృహ కొలిపోవటం, ఆ పుట్ట విరిగిపోవటం.
కుండపోతగా కురుస్తు న్న వాన కి ఆ బండ రాయి (శిలా శాసనంలో) బయట పడటం. ఆ
బురద కరిగి.. చలపతి నిండిపోవటం.

EXT. REDDY HOUSE - LATER

ఉరుములతో వర్షం రావటం తో, మెట్లమీద కూర్చున్న గంగిరెడ్డి.. ఆకాశం వైపు చూసి,
అక్కడ నుంచి లేచి.. సరాసరి.. దేవుడి ఇంట్లోకి వెళ్తా డు, అక్కడ అంగుళం అంగుళం
వెతుకుతాడు, అక్కడ అని సరిగ్గానే ఉంటాయి.

about:blank 112/180
5/19/23, 4:13 PM

EXT. REDDY HOUSE - LATER

Midway లో వర్షం పడుతూ ఉంటుంది, గుమ్మం ముందు గంగిరెడ్డి బయట వైపు గా


మొహం పెట్టి నిలబడి ఎదో ఆలోచిస్తూ ఉంటాడు, అప్పుడే, వర్షం లో తడుచుకుంటూ
వచ్చి తన ఎదురుగ్గా చిన్నబ్బ తగ్గులో నిలబడతాడు, అప్పుడు గంగిరెడ్డి ని చూసి

చిన్నబ్బ

అయ్యా! ఈ చుట్టు పక్కల అన్ని చోట్లా ,


వెతికేసినాము, ఎవరూ కనిపియ్యలా.

అప్పుడు, మునుసబు

మునుసబు

నన్ను అడిగిత్తే, మీరు బ్రమ పడుతున్నారేమో అని


అనిపిస్తోంది అయ్యా, అయినా మన ఇంటి, లోపలి
దాకా వచ్చే దమ్ము, దైర్నం ఎవరికీ ఉండాది మీరే
చెప్పండి?

గంగిరెడ్డి: నువ్వు చెప్పేది నిజమే అనుకో. కాని నేను వాడిని స్పష్టంగా చూసినానే..
కొంపదీసి.. వాడేమన్నా వచ్చుంటాడా ? 

అంటే, అప్పుడు

మునుసబు

ఎవరూ.. ఆ వాన పాము చలపతి గాడా?

గంగిరెడ్డి

వాణ్ణి చూస్తుంటే, ఆ అమ్మవారిని ఎక్కడ చెయ్యి


పట్టు కొని గుడిలో వదిలేస్తా డో అని ఒక చిన్న దిగాలు
అంతే!

అప్పుడు, ఒక ఉరుము వురమటం ఆ వేలుతురిలో గంగిరెడ్డి వెనకాల తన మనవడు


నులబడి వింటూ ఉండటం, అది గమనిస్తా డు చిన్నబ్బ, మళ్ళి ఇంకో ఉరుమురావటం,
అక్కడ ఎవ్వరూ లేకపోవటం

మునుసబు
( OS )

మీకు ఆ దిగులు లేదు లెండి, వాడు నాటకాలు


పట్టు కొని పోయి చానా నాళ్ళు అయ్యింది.

about:blank 113/180
5/19/23, 4:13 PM

అది గమనించిన గంగిరెడ్డి, వెనక్కి తిరిగి చూసి..

గంగిరెడ్డి

ఏముంది అని అక్కడ చూస్తు న్నావు?

చిన్నబ్బ

అయ్యా.. అదీ.. చిన్నయ్య

గంగిరెడ్డి

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..చుట్టకి నిప్పు


కావలన్నాడుట నీలాంటివోడు.. ఆడ ఎవ్వరూ లేరు లే
గని, పొయ్యి రేపు ఆ నాటకాల వాళ్ళని రమ్మను పో.

అంటే, తల ఊపి, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు

గంగిరెడ్డి

మునుసబు, ఇదంతా నా బ్రమే నంటావా?

మునుసబు

శ్రీవారికి, ఈ మధ్యలో బుర్ర వేడి ఎక్కి అలా


కనిపిస్తు నాయే తప్ప.. వేరే ఏమి లేదండి.

అంటే,

గంగిరెడ్డి

సర్లే! బాగా పొద్దు పోయింది.. నువ్వు పోయి


పనుకోబో, రేపు ఆముదాల సూరమ్మ కాడికి
పోయ్యిరావాల!

అని, లోపలికి వెళ్ళి వాకిలి వేసుకుంటాడు

EXT. NELLIMANDA TEMPLE - LATER

వర్షం ఆగిపోయ్యి ఉంటుంది, చలపతి స్పృహలో వచ్చి రానట్టు ఉంటాడు, బయట తనకోసం
వెతుకుతున్న వారి శబ్దా లు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు అలా వెళ్ళిపోయాక, ఆ బురద
లో నుంచి బయటకి వొక్కసారిగా తల బయటకి పెట్టి కదులుతాడు. ఆ బురద లో నుంచి
లేచి తన మీద ఉన్న బురదను ఇదిలిచ్చు కుంటూ ఉంటే, ఆ శిలా పలకం కనిపిస్తుంది.
దాని దగ్గర గా వెళ్ళి చూస్తూ ఉంటే, వెనకాల ఎండు కొమ్మాల్ని తొక్కినట్టు శబ్దం

about:blank 114/180
5/19/23, 4:13 PM

వినిపిస్తుంది, అప్పుడు వెనక్కి తిరిగి గుస్తే, అహోరా ఉంటాడు. దగ్గరకి వచ్చి, తనని
మూగి చూస్తా డు, అప్పుడు

అగోరా

ఏమి జన్మ రా నీది. ఆగోర తపస్సు చేసే ఋషులు,


మునులకు దొరకని ఆ శక్తి దర్శనం నీ కు దొరికింది.

అంటే, అక్కడ నుంచి లేచి నిలబడతాడు, అప్పుడు శిలా పలకాన్ని ఆ అగోరా చూసి

అగోరా

అర్థం కా లేదు కాదు

అంటే, చలపతి కూడా ఆ పలకని చూస్తూ, తిరిగి అయోమయం గా చూస్తా డు,


అప్పుడు

అగోరా

ఈ ఊర్లు , ఇట్లా స్మసానాలు గా ఎందుకు మారినాయో


తెలుసుకోవాలన్ని ఉందా? మీ నాయిన ఎందుకు
సచ్చినాడో తెలుసా?

అంటే, తల వూపుతాడు, అప్పుడు గాలిలోకి వీభుది చల్లి

అగోరా

ఐతే చూడు

అని, చలపతి దగ్గరకి వచ్చి.. తన చేతితో చలపతి తల ని పట్టు కొని, ఆ వీభుది


వలయం లోకి దొబ్బుతాడు.

INT. REDDY HOUSE - EVENING

వెంకటరాముడు చనిపోతూ, తన ధర్మ దండాన్ని, వెంకటరాముడు కొడుకు, గంగిరెడ్డి కి


తండ్రి అయిన చంగల్రయప్ప కి ఇస్తా డు.

వెంకటరాముడు, చావు బతుకుల మధ్య మంచం మీద పడుకొని ఉంటాడు, అప్పుడు


అక్కడికి, తన కొడుకు చంగల్రయప్ప తో పాటు, తన 12 ఏళ్ళ మనవడు గంగిరెడ్డి
కూడా వస్తా రు. అప్పుడు తన పక్కన ఉన్న వ్యక్తీ వైపు చూస్తా డు, అప్పుడు, తను తట్టలో
నుంచి ధర్మ దండం తన చేతిలో పెడతాడు, అది వెంకటరాముడు చంగల్రయప్ప కి
ఇస్తూ..

about:blank 115/180
5/19/23, 4:13 PM

వెంకటరాముడు

చంగల్రయ, ఈ ఊరు మనల్ని నమ్ముకొనే


బతుకుతావుండారు. ఎంత తలమీధకు వొచ్చినా వాళ్ళని
ఆ అమ్మోరి ని చెయ్యి జర్చుకోవోద్దు . 

అని ఇస్తా డు, అప్పుడు

చంగల్రయప్ప

అట్నే నాయినా!

అంటే, ఆతరవాత గంగిరెడ్డి ని చూసి, రమ్మంటే, తను తన వెనకాల ఉన్న పాలేరు వైపు
చూస్తా డు, అప్పుడు తను గంగిరెడ్డి ని ఎత్తి మంచం మీద కూర్చో పడతాడు, తను వెళ్ళి
పక్కన కూర్చుంటాడు, అప్పుడు.

వెంకటరాముడు

గంగిరెడ్డి, మన కింద పని చేసే వాళ్ళు, ఎప్పటికి మన


బిడ్డల్లాంటి వాళ్ళు, దగ్గరకి తీసుకోవాలె తప్పా, కులం
తక్కువని దూరం పెట్టకూడదు నాయనా. కొద్దిగా కోపం
తగ్గించ్చుకొని, మీ నాయన మాట వినాల అబ్బా!

INT. NELLIMANDA TEMPLE - NIGHT

వెంకటరాముడి జ్ఞాపకార్థం, ఆయన ఫోటో గుడిలో ఉంటుంది, చంగల్రయప్ప వయ్యస్సు


మళ్ళి వుంటాడు, గంగిరెడ్డి వయస్సులో ఉంటాడు, వాళ్ళు రచ్చబండ మీద కూర్చొని
ఉండటం, అప్పుడు పూజారి, చంగల్రయప్ప కి కుంకుమ పెట్టి, దండ వేసి, తన చేతికి,
ధర్మ దండం ఇస్తా డు. ఇంతలో ఈడిగిపల్లి వెంకటసుబ్బ తన కుటుంభం తో, గిడికి కళ్ళు
కుండ తెస్తా డు, వెళ్తూవెళ్తూ వెంకటసుబ్బ కూతురు, గంగిరెడ్డి ని చూస్తూఉంటుంది. కాని
గంగిరెడ్డి పట్టించుకోడు, కళ్ళు కుండ దించి వెంకటసుబ్బ రచ్చబండ దగరకి వస్తా డు,
రచ్చబండ మీద స్థలం లేకపోవటం తో, గంగిరెడ్డి ని

చంగల్రయప్ప

గంగిరెడ్డి, ఆయన ఈడిగిపల్లి కి ఆసామి, నిలబెట్టి


మాట్లా డి తే మర్యాద ఉండదు.. నువ్వు పొయ్యి నీ
తోటి వాళ్లతో ఉండు పో.

అని గంగిరెడ్డి ని లేపి, వెంకటసుబ్బ ని కుర్చోమంటాడు. అది గంగిరెడ్డి కి ఇష్టం


లేదు, వెంకటసుబ్బ నే చూస్తూ.. అక్కడ నుంచి లేచి కొద్ది దూరం లో తన స్నేహితులు
దగ్గరకి వస్తా డు.

about:blank 116/180
5/19/23, 4:13 PM

INT. NELLIMANDA TEMPLE - LATER

గంగిరెడ్డి వాళ్ళ స్నేహితులు, చిన్నపాటి బల్ల మీద కూర్చొని ఉంటాడు, అక్కడ


కూర్చొని వెంకటసుబ్బ నే చూస్తుంటాడు. అప్పుడు గంగిరెడ్డి ని చూసి, తన స్నేహితులో
ఒకడు

స్నేహితుడు1

రా రా గంగిరెడ్డి.. మీ నా యన చెప్పేదానికి,
గంగిరెద్దు లా తల వూపుకుంటూ వస్తా వుందావా?.

స్నేహితుడు2

రెడ్డి కొడుకు గంగిరెద్దు .. సరిపాయ లే

అని, అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతారు.

స్నేహితుడు3

రేయ్! గంముండండి రా.. వాన్నెందుకు కలబెదతా


ఉండారు?

స్నేహితుడు2

నువ్వేంది రా.. మునుసబు కొడకా.. వానికి వోత్తసు


పలుకుతావుండావు?

అంటే, అతను కుడా గమ్మున ఉంటాడు.

స్నేహితుడు1

ఈరోజు ఈడిగి పల్లోనికి వీడి జాగా ఇచ్చినాడు, రేపు


పొద్దు న్న.. చెప్పులు కుట్టే నాయల్లను తెచ్చి
కుసబెడతాడు.. కుసుంటావా?

అంటే, అప్పుడు తన ద్రిస్టి తన నే చూస్తు న్న వెంకటసుబ్బ కూతురి మీద మల్లు తుంది,


తన ని చూసి, పక్కకు రమ్మని సైగ చేస్తా డు, అందుకు వస్తా ను అని తను కూడా సైగ
చేస్తుంది. గంగిరెడ్డి అటుగా వెళ్తుంటే

స్నేహితుడు3

యాడికి రా గంగిరెడ్డి?

గంగిరెడ్డి

about:blank 117/180
5/19/23, 4:13 PM

వెంకటసుబ్బ కి ఉరి తాడు ఎసేదానికి.. 

అంటే, వాళ్ళ స్నేహితులు అందరూ.. నోళ్ళు ఎల్లబెడతారు.

INT. RANDOM GUDISI – EEDIGIPALLI - NIGHT

చిన్న పాటి గుడిసే లో మంచం మీద వాళ్ళు ఇద్దరూ, వొకరి మీద వొకరు పడుకొని
ఉంటారు, ఆ అమ్మాయి బొట్టు చదిరి ఉంటుంది, అప్పుడు వెంకటసుబ్బ కూతురు చంగి

చంగి

మీరు నిజంగా దేవుడే సామి, గొప్ప మనస్సు ఉన్న రా


రాజు

గంగిరెడ్డి

దేనికే.. ఇంతలా పోగిడేసున్నావు

చంగి

మీ నీడ కూడా తాకకూడని జాతి మాడి, అట్టాంటి


దాన్ని మీ లో వోకరిని చేసుకున్నారు కదా! అందుకు

అంటే

గంగిరెడ్డి

ఇంకా ఈ జాతి గోల ఏందే, మనిద్దరమూ, సున్నం


లో బూడిదే లా కలిసిపోతే నూ..

అంటే, అప్పుడు

చంగి

అది కాదు దేవుడూ, నాకు నెల తప్పి మూడు నెలలు


అయింది.. మీ తో ఎట్టా చెప్పేది అని

అంటే

గంగిరెడ్డి:

వోసి పిచ్చి మొహమా! ఇంత పెద్ద విషయం. ఇట్టా


సల్లగా నా చెప్పేది. ఎగిరి గంతు ఏయ్యకుండా!

చంగి తో సరసమాడుతూ..

about:blank 118/180
5/19/23, 4:13 PM

చంగి

అది కాదు సామి, ఈ విషయం మా ఇంట్లో తేలిక


ముందే.. నా మేడలో ఆ పసుపుకొమ్ము ఏదో పడితే!

అందుకు,

గంగిరెడ్డి

అంతే నా, తెల్లవారితే మన పెళ్లి.. సాలా?

అంటే.. చంగి చానా సంతోషం గా ఉంటుంది, వాళ్ళు మళ్ళి వొకటి అవుతారు.

EXT. CHINTAMAANU – EEDIGIPALLI - MORNING

MIDWAY లో చంగి చింతమానుకు తన చీరతో యాలాడుతూ ఉంటుంది, వెంకటసుబ్బ


కుటుంభం పరిగెత్తు కుంటూ వచ్చి.. ఆ అమ్మాయి కళ్ళు పట్టు కొని ఏడుస్తూ..

వెంకటసుబ్బ: ఏందే! తల్లి.. నీకు ఏమి తక్కువ


చేసినామని, ఇట్లా చేసినావు?

అప్పుడు అక్కడికి ఏమి తెలియనట్టు గంగిరెడ్డి రావటం, అది చూసి, వెంకటసుబ్బ పరిగెత్తు


కుంటూ వచ్చి గంగిరెడ్డి కాళ్ళు పట్టు కొని ఏడుస్తా డు, తన కన్నీళ్ళు గంగిరెడ్డి కాళ్ళ మీద
పడుతాయి, ఏడుస్తూ నే, తన టువాలు తో తుడుస్తు .

వెంకటసుబ్బ

అయ్యా.. ఘోరం జరిగిపోయింది బాబు.. నా


కూతురు నన్ను వదిలి వెళ్లిపోయింది. 

అంటే,

గంగిరెడ్డి

వెంకటసుబ్బ.. లే.. ఏడిస్తే.. పోయిండే పాణం


తిరిగి వస్తుందా చెప్పు..

అని, ఆ గుంపులో ఉన్న వాళ్ళని చూసి

గంగిరెడ్డి

రేయ్! ఆ శవాన్ని, దింపి.. జరగాల్సింది.. చూడండి

అంటే, అప్పుడు వెంకటసుబ్బ, గంగిరెడ్డి కి దండం పెడతాడు.

about:blank 119/180
5/19/23, 4:13 PM

EXT. REDDY HOUSE - EVENING

గంగిరెడ్డి మాడి మీద తన స్నేహితులతో నిలబడి, మావిడి పళ్ళు తింటూ.. మాట్లా డుతూ


ఉంటాడు

స్నేహితుడు2

అబ్బ.. ఏమి తియ్యగా ఉండాయి రా..

స్నేహితుడు3

అవి వోపినని డబ్బులు పోసి, డిల్లి నుంచి


తెప్పిచ్చినాడు.. మన రెడ్డి

అంటే

స్నేహితుడు1

మొర్తా నికి అన్ని విషయాల్లో గంగిరెడ్డి.. గంగిరెద్దు


కాదు.. మీసము మొలిచిన మొగోడు అని
నిరూపించుకున్నావు.

ఇంతలో అక్కడికి వోడ్డిపల్లి పల్లి నుంచి కొంతమంది రావటం, మాడి మీద నుంచి గంగిరెడ్డి


చూస్తా డు,

స్నేహితుడు3

ఇప్పుడు చెప్పండి రా.. గంగిరెడ్డి ఆ మజాకా!

గంగిరెడ్డి చూస్తు న్నది చూసి, తన తో పాటు, వాళ్ళ స్నేహుతులు చూస్తా రు. అక్కడ
కొంతమంది

స్నేహితుడు2

వోడ్డిపల్లోల్లు రా! ఈడ ఏమి చేస్తు న్నారు

గంగిరెడ్డి

ఇంకెందుకు.. వడ్లగింజలు అయిపోయుంటాయి,


అడుక్కోవటానికి వచ్చింటారు.. ఇది ఉండేదే కదా
మాకు

అంటే, అప్పుడు, లోపలి నుంచి చంగల్రయప్ప, కొన్ని పత్రాలు వాళ్ళలో వొకరికి ఇస్తా డు.
అది చూసి గంగిరెడ్డికి కోపం వస్తుంది, అప్పుడు

about:blank 120/180
5/19/23, 4:13 PM

స్నేహితుడు1

వొడ్ల గింజలు కాదు, ఆస్తి పత్రాలు.. ఇట్లే దానాలు


చేసుకుంటూ పోతే.. నువ్వు అదే వోడ్డిపల్లోల్ల దగ్గరకి
పొయ్యి అడుక్కోవాల్సిందే చూసుకో!

అంటే, గంగిరెడ్డి కి కోపం వచ్చి, తన స్నేహితుడి చేతిలోఉన్న మావిడి పండు ను


తోసేస్తా డు. మళ్ళి ఆ వడ్డీపల్లి వాళ్ళనే కోపం గా చూస్తా డు.

INT/EXT. MULTIPLE LOCATIONS - DAY/NIGHT

కొంతమంది వూరి జనాలు, గంగిరెడ్డి ఇంటికి వస్తా రు, తన ఇంటి కి ఎదురుగ్గా కుర్చీని
ఉంటారు, అప్పుడు అక్కడికి గంగిరెడ్డి బంటు బసవ, వస్తా డు, ఆ ఇంటి తంతు
చూడటానికి కొంత మంది ఊరి పెద్దమనుషులు కూడా వస్తా రు. అక్కడ జనాలు గుస గుస
లాడుతూఉండటం చూసి

బసవా

ఏ రా అందరూ ఈ యాలప్పుడు కట్ట కట్టు కొని


వచ్చినారు ?

అంటే,

ఒకవ్యక్తీ

మీ వొళ్ళు.. ఈ యాల మా ఇండ్లకి కి వచ్చి ఇంట్లో


పిల్లా జల్లా ఉండారని కూడా లేకుండా, కొట్టి ఆస్తి
కాగితాలు తెసుకొని వచ్చేసినారు సామి

అంటే, ఇంతలో అక్కడికి గంగిరెడ్డి తిని, తమలపాకు వేసుకొని వస్తా డు, వచ్చి అక్కడ
కూర్చుంటాడు, అతను రావటం చుసిన ఆ ఊరి పెద్దమనుషులు కొంత మంది లేస్తా రు,
ఇంకొంతమంది లెవరు.. తన తల మీద తన తండి చంగాల్రయ్యప ఫోటో కి దండ ఎసి
ఉంటాది. గంగిరెడ్డి ని చూసి అందరూ చెవులు కోరుక్కుంటారు గర్వంగా.

గంగిరెడ్డి

హ్మ్.. ఏంది రా?

అంటే.. బయపడుతూ.. బయపడుతూ

ఒకవ్యక్తీ

about:blank 121/180
5/19/23, 4:13 PM

ఉనట్టు ఉండి, మా నోటికాడ కూడు లాక్కుంటే ఎట్టా


చెప్పు సామి.. పిల్లా జల్లా ఉన్నోల్లము, మా మీద
కాస్త దయ ఉంచండి దేవరా

అంటే

గంగిరెడ్డి

ఐతే ఇప్పుడు ఏమంటావ్?

అంటే

ఒకవ్యక్తీ

ఏముంది.. మావి మాకు ఇచ్చేస్తే వెళ్లిపోతాము

అంటే, వాణ్ణి చూసి గంగిరెడ్డి..

గంగిరెడ్డి

ఇట్రా ర..

అంటే, అతను ముందుకు వెళ్తా డు, అప్పుడు గంగిరెడ్డి తన రొమ్ముల మీద తంతాడు,
చిన్నగా వాడి దగరకి వచ్చి, తన కాలి తో తన్నటం మొదలు పెడతాడు, తనకు మొహం
నిండా రక్తం, అప్పుడు తన భార్యా పిల్లలు వచ్చి, తన కాళ్ళు పట్టు కొని

గంగిరెడ్డి

అయ్యా.. సచ్చిపోతాడు.. వొదిలెయ్యండి సామి

అంటే.. అప్పడు..

గంగిరెడ్డి

నీకు నోరు ఉండేది తినేదానికి మాత్రమే, కాదు


కూడదు దాన్ని ఎట్లా బడ్తితే.. అట్ల వాడుతాను
అంటివా, దాన్ని అడ్డా నికి చీల్చుతా నా కొడకా.

అంటే.. అక్కడ ఉండే వాళ్ళు, జంకి, కాస్త వెనక్కి వెళ్తా రు.

గంగిరెడ్డి

పొయ్యి మీ మీ ఊర్లల్లో చెప్పండి.. ఈరోజు మీరు


అనుభవిస్తు న్నది, నా తాతలు ఇస్సిరేసిన బిచ్చమే. నాకు
తల వొంచినోడు, నా నీడ లో సల్లగా ఉంటాడు, అట్ట

about:blank 122/180
5/19/23, 4:13 PM

కాదని తల ఎత్తి తిరిగాడా.. ఆడి తల నా వాకిలికి


యాలడ తీస్తా ! పో..!

అంటే.. వాడు.. కుంటూ కుంటూ.. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాడు


పోతుంటే.. గంగిరెడ్డి ఎనక్కి తిరుగుతాడు, అప్పుడు వెనక కుర్చున్నటు వంటి
పెద్దమనుషులు లేచి.. చిన్నగా లేచి నిలబడి.. మెట్లు దిగి.. కిందకి వచ్చి
నిలుచుంటారు. గంగిరెడ్డి మళ్ళి తన కుర్చీ దగ్గరకి వస్తుంటే, మెట్లు ఎక్కే తప్పుడు.. ఆ
గుంపు లో నుంచి ఒక చిన్నవాడు.. గంగిరెడ్డి ని చూసి.. తప్పట్లు కొడతాడు, వెనక్కి
తిరిగి చూస్తా డు.. ఇంతలో అక్కడికి, బసవ ఆ పిల్లవాడిని చూసి

బసవా

రేయ్.. చిన్నాబ్బ.. ఈడ ఏమి చేస్తా ఉండావు.. పో


ఇంటికి..

అంటే..

గంగిరెడ్డి

ఉండని రా.. పోల్లోడు మంచి జోరు మీద ఉన్నాడు,


చూసి నేరుచుకుంటాడు.

గంగిరెడ్డి తన కుర్చిలో కుసోని.. ఆ వచ్చిన జనాలని వెళ్ళమని చేతితో సైగ చేస్తా డు,
అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు.

EXT. NELLIMANDA TEMPLE - MORNING

వెంకటరాముడు, చంగల్రయప్ప ల జ్ఞాపకార్థం, ఆయన ఫోటో గుడిలో ఉంటాయి, పాలేటి,


కొంతమంది పెద్దమనుషులు, ఆ గుడి దగ్గర నిలబడి, కొంతమంది కూర్చొని ఉంటారు.
అక్కడికి గంగిరెడ్డి కాస్త వయస్సు అయ్యిఉంటుంది, తన వెనకాల కొంత మంది బలగాన్ని
వేసుకొని, అక్కడ కు వస్తా డు, అందరూ లేచి నిలబడి నమస్కారం పెడతారు. ఆయన కి
ఆ గుడి పూజారి పాలేటి వచ్చి, గంగిరెడ్డి కి మంగళ హారతి ఇస్తా రు, అది తీసుకొని,
అక్కడ రచ్చ బండ మీద కూర్చుంటాడు.

అప్పుడు మిగతా పెద్దమనుషులు ఆయన పక్కన కూర్చోవటానికి వచ్చినప్పుడు, వాళ్ళని ఒక


కంటి తో ఒక వురుము ఉరుముతాడు,.. వాళ్ళు బయం తో.. కూర్చోకుండా
నిలబడిపోతారు. అప్పుడు పూజారి తో

గంగిరెడ్డి

ఎప్పుడు అనుకుంటున్నారు రా?

about:blank 123/180
5/19/23, 4:13 PM

అంటే, అప్పుడు పాలేటి, వచ్చి గంగిరెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని

పాలేటి

పెద్దలందరూ.. ఈ శుక్రవారం అనుకుంటున్నారు సామీ.

అంటి.

గంగిరెడ్డి

మీరు అనుకుంటే జాతర జరిగిపోతుంది అంటే, ఇంక


గుడిలో ఆ అమ్మోరు ఎందుకు.. గుడి బయట నేను
ఎందుకు రా?.

అంటే, పాలేటి వాళ్ళ వైపు చూస్తా డు, అటు గా ఉన్న అందరూ తలలు దించుకునే
ఉంటాయి.. అప్పుడు గంగిరెడ్డి తో.

పాలేటి

ఎంత మాట అంటివి దేవుడు! మీరు ఎప్పటికి మమ్మల్ని


ఏలే మారాజులు, మేము మీ కింద సేవకులం,
అట్టాంటిది, మీరు లేకుండా నా?

అంటే, అప్పుడు

గంగిరెడ్డి

ఇక్కడ నీకు తప్ప.. మిగతా వాళ్ళకి నా మీద విలువ


లేనట్టె ఉంది కదా రా?

అందుకు, ఆ గుంపులో నుంచి కదిరెప్ప వచ్చి

కదిరెప్ప

అయ్యా, సచ్చిన పామును ఇకా సంపకండి, మీరు


యట్లంటే, అట్నే కానిద్దాం. 

అంటే అప్పుడు

గంగిరెడ్డి

సరే! రా మీరు అంతా ఇంతగా అడుగుతున్నారు


కాబట్టి.. ఈ శుక్రవారం దేవున్ని ఎల్లదీసి, ప్రాణ ప్రతిష్ట
చేసి, వచ్చే సోమవారం కల్లా జాతర పెట్టు కుందాం.

about:blank 124/180
5/19/23, 4:13 PM

అంటే, అప్పుడు పాలేటి లేచి..

పాలేటి

చిత్తం దేవరా!.

అని, గంట కొట్టి, గంగిరెడ్డి కి బొట్టు పెట్టి హారతి ని తీసుకొచ్చి ఇస్తా డు, ఆయన
తరవ్వత ఊరి పెద్దలకు ఇవ్వబోతే

గంగిరెడ్డి

అబ్బా, పాలేటి.. నిది మరీ చాదస్తం రా, వాళ్ళు


ఎంత దూరం పోవాల, నువ్వు బొట్టు .. హారతి
అనుకుంటా ఉంటె, పొద్దు పోదు.. వాళ్ళు ఇంటికి
పోయి పెట్టు కుంటారు లే !

అని, వాళ్ళ వైపు చూసి

గంగిరెడ్డి

ఇంక మీరు ఎల్లబారండి రా !

అంటే, అప్పుడు, వాళ్ళు అందరూ.. దూరం నుంచే హారతి తీసుకొని, గంగిరెడ్డి కి


దండం పెట్టి, అక్కడ నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు గంగిరెడ్డి తన స్నేహితుల వంక
చూస్తే, వాళ్ళు తల వొంచుకుంటారు.

INT. REDDY HOUSE - POOJA ROOM

గంగిరెడ్డి భార్య, దేవుడి గది దగ్గరకి తన ఇంటి నుంచి తెచ్చిన ఒక పటము తెస్తుంది,
అక్కడ స్థలం లేకపోవటం తో.. రెడోరమ్మ

రెడోరమ్మ

ఒసేయ్.. లచ్చుమూ..!

అంటే, చేతిలో పరక పట్టు కొని, పరిగెత్తు కుంటూ లచ్చుము వస్తుంది.

లచ్చుము

అమ్మా!

రెడోరమ్మ

about:blank 125/180
5/19/23, 4:13 PM

ఆ పటం అక్కడ కొట్టించాల.. నువ్వు పొయ్యి


ఇద్డు రుని పిలుచుకొని రా బో

అంటే, సరే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. Midway లో అక్కడికి ఇద్దరూ పనివాళ్ళు


వచ్చి ఆ గదిలో కి వెళ్ళి.. సన్నగా ఉన్న జాగా లో దూరటానికి చూస్తా డు, కాని..
పట్టకపోగా..

.. అందులో ఒక పాలేరు చేయ్యి జారి, తన వైపు ఉన్న పీఠం మీద ఇన్న అమ్మవారి
విగ్రహం పడిపోబోతుంది.. అప్పుడు రెడోరమ్మ పడిపాయ నే అని నోరు ఎల్లబేట్టు తుంది.
అప్పుడు

రెడోరమ్మ

చిన్నగా రా! దానికేమైనా ఐతే.. మీ పెద్దయ్య ఏమి


లే! ఇంట్లో ఎవ్వరిని ఉన్నిడు..

అదే సమయం లో అది ఇంకో క పాలేరు టక్కున పట్టు కుంటాడు. అప్పుడు రెడోరమ్మ
ఆశ్చర్యం కాస్తా .. ఆసక్తి గా ఆ బొమ్మ ని చూస్తుంది.. చిన్నగా నడుచుకుంటూ
వస్తుంది.. వచ్చి ఆ అమ్మోరు విగ్రహం కింద రెండు తాళ్ళపత్రాలు పడిఉంటాయి.. అవే
చూస్తుంది ముందుకు వెళ్తుంది.. వాటిని పట్టు కుంటుంది.

EXT. REDDY HOUSE - LATER

అప్పుడే తన స్నేహితుడు వీరబద్రయ్య తో ఇంటికి వస్తు న్న గంగిరెడ్డి కి, హాడావిడి గా


పరిగెత్తు కుంటూ ఇంటి బయటకి రెడోరమ్మ వస్తుంది, ఆమె ని చూసి

రెడోరమ్మ

ఏందే! ఏమి జరిగింది.. అట్లా తోక కాలిన కోతి


మాదిరి, గంతులు ఎసుకుంటూ వస్తు న్నావు. చిన్నగా
రా!

అంటే.. అప్పడు, తన దగిరికి వచ్చి

రెడోరమ్మ

ఈ పత్రాలు, దేవుడి ఇంట్లో దొరికాయి

అని, తనకి చూపిస్తుంది.. అప్పుడు ఆ పత్రాలు ఏమిటా అని

గంగిరెడ్డి

పత్రాలా?

about:blank 126/180
5/19/23, 4:13 PM

అని, వాటిని తీసుకొని

గంగిరెడ్డి: అవి ఇట్లిచ్చి.. కాసంత కాపి పెట్టు బో

అంటే, అవి ఇచ్చి ఆమె వెళ్ళిపోతుంది. వాటిని వాళ్ళిద్దరూ ఎగా దిగా చూస్తా రు, వాళ్ళకు
ఏమి చెయ్యాలో అర్థం కాదు, గంగిరెడ్డి.. వాటిని చదవటానికి ప్రయత్నిస్తా డు, కాని ఆ
వ్రాత సంస్కృతం కావటం తో.. అర్తం కాక తల గోక్కుంటున్న సమయం లో, వీరబద్రయ్య
వాటిని తీసుకొని చూస్తూ..

వీరబద్రయ్య

గంగిరెడ్డి, ఇవి.. యా.. రాజుల కాలం నాటివో..


నిధులు.. నిక్షేప్పల గురించి రాసుంటారు అంటావా?

అంటే, అప్పుడు

గంగిరెడ్డి

సదువుకున్నావు కదా.. నువ్వే చెప్పు..

వీరబద్రయ్య

ఈ రాతలు మనలాంటి వాళ్ళకి అర్థం కావు గాని. ఆ


యల్లమ్మ కొండ కింద.. కొంతమంది తెల్ల సాములు
వుండారు.. వాళ్ళని అడిగితే.. సరిగ్గా చెప్తా రు.

అంటే, వీరబద్రయ్య వైపే చూస్తా డు.

EXT. FOREST - AGHORA PLACE - LATER

MIDWAY లో గంగిరెడ్డి, ఆ అగోరాలు ఉండే చోటుకు వెళ్తా డు, అక్కడ అక్కడా


అగోరాలు కూర్చొని, బీడీలు తాగుతూ.. వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. వీళ్ళు
నడుచుకుంటూ.. నడుచుకుంటూ లిపలికి వెళ్తా రు

గంగిరెడ్డి

ఇంత దూరం వస్తా ఉండాము, పని


అయితుందిఅంటావా?

అంటూ, అక్కడ పూజ లో ఉంటున్న ఒక విభూది పూసుకొన్న అగోరా దగ్గర వెళ్లబోతుంటే,


అప్పుడు హటాత్తు గా ఒక అగోరా వాళ్ళకి ఎదురు పడతాడు.. వాళ్ళు బయం తో ఎగిరి
పడతారు, గంగిరెడ్డి చేతిలో ఉన్న ఆ తాళ పత్రం కింద పడుతుంది, దాన్ని చుసిన..
ఆయన వాళ్ళని చూసి.. అకారణం గా

about:blank 127/180
5/19/23, 4:13 PM

అగోరా1

పొండి.. వెళ్ళిపొండి, మీరు అనుకునేవి.. ఇక్కడ


జరగవు.. మా వల్ల కాదు, మేము ఏమి
చెయ్యలేము.. ముందు.. ఇక్కడ నుంచి
వెళ్ళిపొండి..  

అంటే, అప్పుడు గంగిరెడ్డి

గంగిరెడ్డి

అదికాదు స్వామి.. ఈ పత్రాలు

అంటే..

అగోరా1

ఇక్కడ ఏది కాదు..ఆ పత్రాలకు మీరు అర్హులు


కాదు.. వినాశనం కొని తెచ్చుకోవోద్దు ..నీ మంచికే
చెప్తు న్నా.. పో!

అని, గట్టిగా అనేసరికి.. వాళ్ళు అక్కడ నుంచి వెనక్కి మళ్లు తారు.

గంగిరెడ్డి

అదేంది రా.. అట్లా గదురుకున్నాడు?

అని అనుకుంటూ, వేల్తింటారు.. అప్పుడు కొద్ది దూరం వచ్చాక, వాళ్ళని ఒక అగోరా


పిలిచినట్టు అవుతుంది.

అగోరా

ఆగండి

అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి ఆయన వైపు చూస్తా రు, ఆయన ఒక రాయి మీద నిలబడి
ఉంటాడు.

అగోరా

మీరూ అడిగింది నేను తీరుస్తా ను, ఎన్నో ఏళ్ళు గా


నాకు ఒక కోరిక ఉంది, అది నువ్వు తీరుస్తా వా?

అంటే.. అప్పుడు, కాస్త ఆలోచిస్తా డు, అప్పుడు

అగోరా

about:blank 128/180
5/19/23, 4:13 PM

నాకు నీ దగ్గర నుంచి మని మాన్యాలు అవసరం


లేదు, నీ చేతులతో.. పెడికెడు ఉప్పు సాలు.

గంగిరెడ్డి

ఇది కదా లావాదేవీలు అంటే.. 

వీరబద్రయ్య

అదెంత పని సామి, ఇందులో ఉన్న నిది ని మాకు


తిసివ్వలె కాని.. మావోడు మీకు ఏమి కావాలో
చూసుకుంటాడు..

అంటే, అప్పుడు, ఆ పత్రాలను చూస్తా డు, అప్పుడు

అగోరా

అందులో మీరు అనుకుంటున్నట్టు ఇందులో నిది


నిక్షేపాలు యాడా లేవు. 

అంటే, అందుకు, ఆ అగోరా దగ్గర నుంచి ఆ పత్రాలను లాక్కొని

వీరబద్రయ్య

నిది కాకుండా ఇంకేముంది సామి?

అని, అక్కడ నుంచి వెనక్కి మళ్ళి వెల్లబోతే

అగోరా

సాక్షాత్తు ఈ ముల్లోకాలను శాసించే ఆ గంగ శక్తి.

అంటే.. వాళ్ళు ఆశ్చర్యం తో చూస్తా రు, గంగిరెడ్డి బయపడి.. కిందకి పారేస్తా డు,
అప్పుడు ఆ అగోరా వచ్చి దాన్ని తీసుకని, దగ్గరకు వచ్చి, అది గంగిరెడ్డి చేతిలో పెట్టి..

అగోరా

ఈ శక్తి, నీ మాట వినేటట్టు చేసి.. ఈ చుట్టపక్కల


నీకు ఎదురు లేకుండా చేస్తా .

గంగిరెడ్డి

అందుకు నేను ఏమి చెయ్యాలి స్వామీ?

అగోరా

about:blank 129/180
5/19/23, 4:13 PM

ఈ శుక్రవారం, ఆ పాలేటి గంగమ్మ కి ప్రాణ ప్రతిష్ట


ఉంది కాదు?

అంటే, అవును అని తల వూపు తాడు

అగోరా

ప్రాణ ప్రతిష్ట పనుల్లో నువ్వుండు, ఆ శక్తిని నీ ఇంట్లో


కుర్చోపెట్టె పని లో నేను ఉంటాను.

అని గంగిరెడ్డి ని దగ్గరకు రమ్మని, అతని చేవిలో ఏదో రహస్యం చెప్తా డు, అప్పుడు

గంగిరెడ్డి

అలాగే.. మీరు చెప్పినట్టే చేస్తా ను

అని, ఆయనకి వాళ్ళు నమస్కారం చేసి అక్కడ నుంచి వెళ్తా రు, వాళ్ళు వెళ్ళిపోయాక,
ఇంకొక అగోరా వచ్చి, నమస్కరించి

అగోరా1

గురువా, ఆ అమ్మ శక్తి ని మీరు మళ్ళి తక్కువ


అంచనా ఎస్తు న్నట్టు న్నారేమో?.

అగోరా

ఆ ఊరి జనాల ముందు నన్ని అవమానించిన ఆ


అమ్మోరికి .. ఇన్నేళ్ళ తరవాత నా శక్తి ని చూపించే
అవకాషం వచ్చింది.

అని, ఆ అగోరా వైపు చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

INT. REDDY HOUSE - HALL

Midway లో ఆ అగోరా తన శిషులతో, గంగిరెడ్డి ఇంట్లో, ముగ్గు వేసి అందులో


దిక్కుకు ఒకడు కూర్చొని ఉంటారు, వాళ్ళ ఎదురుగ్గా కిర్చోని ఉంటాడు గంగిరెడ్డి,
అప్పుడు అగోరా చెయ్యి చాచి

అగోరా

ఉప్పు

అంటే, అప్పుడు గంగిరెడ్డి, తన చేతిలో పిడికెడు ఉప్పు పోస్తా డు, అంతలో, తన ఇంటి


దగ్గరకి మేలతాలాలు వస్తు న్నట్టు తో, అప్పుడు అటువైపు చూస్తూ..

about:blank 130/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

స్వామి వాళ్ళు వచ్చినట్టు న్నారు, నేను పొయ్యేదా?

అంటే, గంగిరెడ్డి వైపు చూస్తూ

అగోరా

నేను చెప్పింది గుర్తుంది కదా?

అంటే, తల వూపుతాడు, అప్పుడు వెళ్ళమని సైగ చేస్తా డు, గంగిరెడ్డి అక్కడ నుంచి
బయటకి వస్తా డు.

EXT. REDDY HOUSE - NIGHT

గంగిరెడ్డి ఇంట్లో నుంచి వచ్చేసరికి, అందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు, ఆయన
బయటకి వస్తా డు, అక్కడ ఉండేవాళ్ళు అందరూ లేచి నిలుచుంటారు, అప్పుడు

గంగిరెడ్డి

రేయ్ పాలేటి.. పూజ మొదలు పెట్టు

అంటే, అక్కడ fast cuts లో అమ్మవారిని తీసుకొని బయటకి రావటం, బయటే


నిలబడి ఉన్న పాలేటి, అమ్మవారి ని తీసుకొచ్చి, పీట మీద పెట్టి, పూజ చెయ్యటం,
గంగిరెడ్డి వచ్చి, హారతి తీసుకోవటం, టెంకాయ కొట్టి, పొట్టేలి ని బలి ఇవ్వంగాల్నే..
అక్కడ కోబలి లు పలకటం, కొమ్ములు దప్పుల శబ్దం మద్య.. ఆ అమ్మవారు పాలేటి
మీదకు.. పూనటం, అప్పుడు వెంటనే.. తాంబూలం పాలేటి చేతిలో పెట్టి, అమ్మవారిని
మనస్సులో కోరుకోవటం.

గంగిరెడ్డి

అమ్మా! పాలేటమ్మా తల్లి.. మా తాత


వెంకటరాముడికి నువ్వు ఇచ్చిన వరాన్ని
కోరుకుంటున్నాను, తీరుస్తా వా తల్లి 

అంటే, పాలేటి.. ఆ తాంబూలం వైపు చూసి, గంగిరెడ్డి వైపు చూసి.. ఆ అగోరా ఉన్న


వైపు కూడా చూసి, మళ్ళి గంగిరెడ్డి వైపు చూస్తా డు. అతని చుట్టూ, మాయాన్ధకారం,
చిన్నటి వెలుగు తన ఏదురుగ్గా ఉంటుంది, అప్పుడు..

ఆకాశవాణి

అడుగు గంగిరెడ్డి, 

about:blank 131/180
5/19/23, 4:13 PM

అంటే,

గంగిరెడ్డి

ఇప్పటి నుంచి, నువ్వు నా ఇంటికి మాత్రమే దేవత వి


కావాలి, నా ఇంటిలోనే ఉండాలి, నా కుటుంభాన్ని
మాత్రమే సల్లగా చూడాలి, నేను ఏలే ఈ ఊర్లు
పొలిమేర్ల వరకూ.. నన్ను ఎదిరించే వాడు
ఉండకూడదు, ఇక్కడ నేను చేసినదే న్యాయం, నేను
చెప్పిందే శాసనం కావాలా.. తీరుస్తా వా ?

అప్పుడు, పక్కున నవ్వి, ఆ జావాల కాస్త పెద్ద మంట గా మారి

ఆకాశవాణి

గంగిరెడ్డి.. తల్లి రొమ్ము నే కోసి ఇమ్మంటున్నావు, ఈ


ఊరి జనాలు బతుకులు, నీ కాళ్ళకింద
పెట్టమంటున్నావు. తప్పు గద నాయనా. నీ మంచి
కోరి చేపుతావుండా, ఇంకేదైనా కోరుకో

గంగిరెడ్డి

నువ్వు నాకు మాటఇచ్చావు.. అమ్మా.. నేను అడిగిన


వరం.. ఇచ్చి తీరాల్సిందే 

అంటే,

ఆకాశవాణి

ఐతే సరే! ఇప్పటి నుంచి, ధర్మదండంపట్టి, అరచేతిలో


తాంబూలం పెట్టి, బొట్టు పెట్టి రమ్మని పిలిచేంతవరకూ,
నీ గడప దాటాను, సరే నా? 

అని, గంగిరెడ్డి కళ్ళు తెరుస్తా డు, అప్పుడు పూజారి పాలేటి, తన చేతిలో చెయ్యి వేసి
వొట్టు వేసి ఉంటాడు, తల మీద జ్యోతి, చేతిలో ధర్మదండం, పట్టి, పాలేటి గంగిరెడ్డి
ఇంట్లోకి వెళ్తుంటాడు, అలా గడప దాటి లోపలికి వెళ్ళాతాడు, అక్కడ ఉన్న జనాలు
అందరూ, పాలేటి చేస్తు న్న ది, చూసి ఆశ్చర్యం తో, గుస గుసలు ఆడుతారు. లోపలికి
వెళ్ళాక, తన తల మీద ఉన్న జ్యోతి ఆరిపోతుంది, పాలేటి మళ్ళి వెనక్కి తిరిగి గంగిరెడ్డి
ఇంటి గడపమీద కూర్చుంటాడు, అతను చేస్తు న్నది చూసి.. ఆ గుంపులో

బ్రంహన్న

ఇది ఏంది గంగిరెడ్డి.. అమ్మ యల్లబారకుండా,


గడపకాడ కుసున్నింది? పూజ లో ఏమైనా తప్పు

about:blank 132/180
5/19/23, 4:13 PM

జరిగిందంటావా?

గంగిరెడ్డి

అట్ల ఏమి లేదు లే పెద్దనాయనా?

అంటే, అప్పుడు పాలేటి అక్కడ కుప్ప కులిపోతాడు. బయట ఉన్న వాళ్ళ అది చూసి,
ఆ గుంపులో

వ్యక్తీ13

ఎప్పుడూ లేదు కదరా ఇట్లా ! ఈడు పూజలో ఏదో


తప్పు చేసినట్టు ఉండాడు.

అప్పుడు

గంగిరెడ్డి

రేయ్! నోరు ముయ్యండి రా! ఇన్నేండ్ల నుంచి వాని


కుటుంభమే పూజ చేస్తా వుండేది, వాడుకి అంత మాత్రం
తెలిదా ఏంది

అంటే, అప్పుడు పడిపోయిన పాలేటి లేచి చూస్తా డు, అప్పుడు, తను ఉన్న చోటు
నుంచి, పరిగెత్తు కుంటూ, గంగిరెడ్డి దగ్గర కి వచ్చి..

పాలేటి

అయ్యా, క్షమించాలి, నేను కావాలని మీ గడప


తొక్కలేదు సామి.

అంటే

గంగిరెడ్డి

పరవాలేదు లే రా.. పో.. పొయ్యి.. అమ్మోరు ని


కదిలిచ్చుబో.. ఊరంతా ఎదురు చుస్తా వుండారు. 

అంటే, లేచి దండం పెట్టి.. హారతి ఇచ్చి

FASTCUTS – అమ్మవారిని ఉరి వాళ్ళు ఊరేగింపు గా తీసుకొని వెళ్తా రు. వాళ్ళు


వెళ్ళటం చూస్తూ.. గంగిరెడ్డి మాత్రం అక్కడే నిలబడిపోతాడు.

EXT. REDDY HOUSE - LATER

about:blank 133/180
5/19/23, 4:13 PM

అమ్మవారి ఊరేగింపు వెళ్ళిపోయాక, గంగిరెడ్డి ఇంట్లోనుంచి, పని ముగించి, అగోరా, తన


శిషులు బయటకి వస్తా రు, వాళ్ళు వచ్చేది చూసి, వంగి దండం పెడతాడు, గంగిరెడ్డి..
అప్పుడు

అగోరా

గంగిరెడ్డి, నువ్వు అనుకున్నది సాదించావు, ఇంక నువ్వు


పట్టిందెల్లా బంగారమే పో.

అంటే,

గంగిరెడ్డి

అంతా మీ అసీర్వాధమే స్వామీ

అంటాడు, అప్పుడు

అగోరా

వోక్కవిషయ గుర్తు పెట్టు కో, ఏ తల్లి తన బిడ్డలు


కష్టా ల్లో ఉంటే చూస్తూ ఒకే చోట ఉండదు, ఈమె
కుడా అంతే, బయటకి రావటానికి ప్రయత్నిస్తుంది. ఆ
గడప దాటి ఎవ్వరిని లోపలికి రానివ్వకు..

అని దగ్గరగా వచ్చి

అగోరా

ముక్యంగా ఆ పూజారి కుటుంభాన్ని.. ఈ ఇంతకి 

అంటే...

గంగిరెడ్డి

చిత్తం

అంటాడు, అప్పుడు అక్కడ నుంచి వెళ్లిపోతుంటే

గంగిరెడ్డి

స్వామీ, మరి మీకు రావాల్సింది?

అంటే, వెనక్కు తిరిగి..

అగోరా

about:blank 134/180
5/19/23, 4:13 PM

సన్యాసిని, నాకు ఎందుకు పనికొస్తా యి చెప్పు నీ మని


మాన్యాలు.. ఏ ఊరి జనాలముందైతే నా గొంతు
పట్టు కొని అవమానించిందో, అదే జనం ముందు, నా
శక్తి తో ఆ అమ్మోరు గొంతు పూడిసేసినా! ఇక ఆ
అమ్మోరుకి మాటలలు రావు!

అంటే, అది విని, ఆశ్చర్య పోతాడు గంగిరెడ్డి.. అప్పుడు

అగోరా

ఇది కూడా ఒకందుకు నీకు మంచిదే లే గంగిరెడ్డి

అని, తన చేతిలో ఉన్న విభూతి ని, తన నొసట పూసి, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు,
ఆయననే చూస్తూ.. అప్పుడు, వీరబద్రయ్య ను పిలిచి,

గంగిరెడ్డి

రేయ్ వీరబద్రా, ఇటు రా!

అంటే, ఆయన వస్తా డు.. అప్పుడు

గంగిరెడ్డ

చూడ రా.. నువ్వు నన్ను గడ్డు కాలాలో ఉనప్పుడు


చాలే సాయం చేసినావు, కాని ఆకిరు గా చేసిన సాయం
ఎవరికీ తెలియకూడని, చప్పకూడని.. అందుకు..

అంటే.. అంతలో, గంగిరెడ్డి ఏమి చెప్పబోతున్నడో అర్థమై.. తన కాళ్ళు పట్టు కొని

వీరబద్రయ్య

అయ్యా! మహా ప్రభో.. మీకు సహాయం చెయ్యాలనే


చేసాను కాని, మీ మీద నాకు ఎలాంటి చెడు ఉద్దేశం
లేదు.. నన్ను నమ్మండి.. కావాలంటే, రాత్రింబవళ్ళు
మీ ముందే ఉంటాను..

అంటే.. కొద్దిగా ఆలోచింది..

గంగిరెడ్డి

సర్లే! నువ్వు బంగారు బాతు లంటోడివి, నున్ను కోసుక


తింటే ఏమోస్తుంది చెప్పు.. అందు చేత నీ బుర్ర
నాకాడ ఉంటే..

అంటే, తన తల ఎత్తి చూస్తా డు..

about:blank 135/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

మనము చెయ్యల్సింది చానా ఉంది.. లేయ్యవయా


మునుసబు

అంటే.. అప్పుడు

వీరబద్రయ్య

అర్థమైంది దేవరా, ఏమి చెయ్యాలో చెప్పండి..

అంటే

గంగిరెడ్డి

ఆ గుడిముందు, ఊర్ల చిచ్చు రాగలాల. వాళ్ళలో


వాళ్ళు కొట్టు కొని సావాల. అంతా ముగిసిపోయినక..
శ్రీ కృష్ణ పరమాత్ముడి లా నేను వచ్చి.. వాళ్ళను
శాంతా పరచాల..

అని అంటే.. అప్పుడు,

వీరబద్రయ్య

అయ్యా! వాళు.. మన

అంటుంటే, వీరబద్రయ్య ను మాట్లా డనివ్వకుండా

గంగిరెడ్డి

ఎవ్వరైనా సరే ములాజానే లే! నా ఇంటి గడపె కాదు,


కదా.. నా మాట.. అంతెందుకు, నా ఆలోచన లో
కూడా ఎవ్వడూ.. నాకు ఎదురు నిలబడకూడదు,
కాదు కూడదు అని వచ్చినాడా, వాని సావు
మీగతావాల్లకు సమాధానం కావాలి. అర్థమైందా?

అంటే, అప్పుడు లేచి..

వీరబద్రయ్య

అర్థమైంది, స్వామి..

నమస్కరించి, అక్కడ నుంచి వెళ్తా డు.. అప్పుడు.. గట్టిగా

గంగిరెడ్డి

about:blank 136/180
5/19/23, 4:13 PM

చిన్నబ్బా.. బన్డి కట్టమను రా.. సోమల కి పోవాల.

చిన్నబ్బా
( OS )

అట్నే అయ్యా!

EXT. NELLIMANDA TEMPLE - NIGHT

పాలేటి అమ్మవారి ముక్కి, ఆ అమ్మవారి తెర ని తీసి, ముక్కుతాడు, అక్కడ అమ్మవారి


శక్తి అతనికి తెలియకపోగా, ఏదో చికాకు లో ఉన్నాడు, ఆ తరవాత టెంకాయ కొడతాడు,
ఆ టెంకాయ కాస్తా చెడిపోయి ఉంటుంది. అప్పుడు ఆ పక్కనే ఉన్న అక్కండ జ్యోతి
ఆరిపోతుంది. అది చూసి గ్రామస్తు లు చెవులు కోరుక్కుంటారు. ఎంత సేపటికి, వక్కల
వాళ్ళ సాంగ్యం రాక పోవటం తో, తాగి ఉన్న బలిజపల్లి కొమ్మిరెడ్డి ఇంటి నుంచి సాంగ్యం
వస్తుంది.. అక్కడ ఉన్న జనాలు వాళ్ళని చూసి కంగు తింటారు..

కొమ్మిరెడ్డి

రేయ్ పాలేటి.. వక్కలోళ్ళు వచ్చేటట్టు లేరు గాని,


మా సంగ్యం అమ్మ కాళ్ళ కాడ పెట్టి.. పూజ కాని

అంటే.. అందుకు

పాలేటి

నోవ్! తోలిపుజ వక్కలోల్లది.. వాళ్ళ ది కాదని పెడితే,


మనకే అనిష్టం.. కొంచం వోపిక పట్టు కో..

అంటే, అప్పుడు తట్ట పక్కకు ఇచ్చి, పాలేటి చంపకి కొడతాడు, అది చూసి.. అక్కడ
నిశబ్ధం

కొమ్మిరెడ్డి

ఏంది.. రా వోపిక పట్టేది..  తొలిపూజ వక్కలోల్లె


చెయ్యాలని.. యాడా రాసి.. ఉంది రా?.. వాళ్ళు
యా జాముకాడ వస్తా రో.. కాసుకొని ఉండాల్నా?

.. అప్పుడు అక్కడ ఉన్న మేళగాడు.

మేళగాడు

యోవ్! తాగేసోచ్చి.. ఏంది యా నీ రుబాబు?

అంటే.. అప్పుడు అక్కడ రచ్చబండ మీద కూర్చొని ఉన్న, ఈడిగిపల్లి లో ఒకడు

about:blank 137/180
5/19/23, 4:13 PM

వ్యక్తీ13

నువ్వు ఏంది రా ఆ తప్పుడు నా కొడుక్కి వోత్తా సు..


మంగలోడు.. మంగలోడు గా ఉండు.. వాడు
అడిగిన్దాంట్లో తప్పేముంది రా..

అటుపక్కనే ఉన్న ఇంకొక పల్లోడు..

వ్యక్తీ14

అట్లా అడుగు మావా? రెడ్డి ఇంటికాడ, జరిగింది


అనిష్టం కాదా?.. ప్రతి ఈడు వచ్చే అమ్మోరు.. ఈ
ఈడు మాత్రం ఎందు కు రాలేదు రా?..

అప్పుడు అక్కడ సాకిరేవుపల్లో డు ఒకడు..

వ్యక్తీ15

వాణ్ణి అంటే.. ని కెందుకు అప్పా పోడుసుకోస్తా వుంది?

అప్పుడు అక్కడ నిలబడి ఉన్న బలిజపల్లి కొమ్మిరెడొల్లు

కొమ్మిరెడ్డి

నువ్వు ఎవడు రా మాట్లా డేదానికి.. లండికొడకా

అని.. ఆ తట్ట లో ఉన్న టెంకాయను తీసి..

ఆ వ్యకి తలకి కొడతాడు.. తనకి రక్తం రావటం తో.. అతని వాళ్ళు.. ఇతని మీదకు
గలాటాకి వస్తా రు.. అకడ పాలేటి, వాళ్ళు, బలిజోల్లు , వక్కలోల్లు కొట్లా డుకుంటూ
ఉంటె, ఎవరో.. కదిరెప్ప బావమరిది ని పొడిచి వెళ్ళిపోతారు.. అది చుసిన కమ్మపల్లి
వాళ్ళు, గాండ్లపల్లి వాళ్ళు కొడవళ్ళతో కొట్లా డుకుంటారు.. 

అక్కడ దివిటి ని పట్టు కొని ఉన్న ఆ సాకలివాని తలకి ఎటు పడటం తో.. ఆ నొప్పికి,
తన చేతిలో ఉన్న నునే గిన్నె, దివిటి తన పక్కనే నిలబడి ఉన్న బోయోళ్ళ రామచంద్ర మీద
పడి అతను కాలిపోతూ.. వెళ్ళి.. బాయి లో దుంకుతాడు. 

అది చూసి.. అక్కడ వొక జాతి వారు ఇంకో జాతి వారి మీద కాలు దువ్వి, కత్తు లు
ఎత్తి, కొట్లా డుకుంటారు, ఈ గలాటాలో.. రచ్చబండ దగ్గర నిలబడి ఉన్న బ్రంహన్న
వాళ్ళని చూసి, అక్కడ నుంచి వెళ్ళిపోవటం.. అక్కడ గొంతు కూర్చొని ఉన్న పాలేటి తల
మీద చెయ్యి పెట్టు కొని ఉంటాడు.

about:blank 138/180
5/19/23, 4:13 PM

ఇంతలో అక్కడి కి గంగిరెడ్డి వచ్చి, నిలబడి తన దగ్గర ఉన్న తుపాకి తో, గాలి లోకి
కాల్చటం, అక్కడి వాళ్ళు ఎక్కడి కి అక్కడ ఊర్లు ఊర్లు గా విడిపోవటం, గంగిరెడ్డి
చిన్నగా నడుచుకుంటూ వెళ్ళటం, అక్కడ పడిన శవాలను చూడటం. అప్పుడే. పెద్ద శబ్దం
(బ్రిటిషు వారి పోలీస్ జీపు) హరన్ కొట్టటం పోలీస్ జీపు హెడ్ లైట్ల, గంగిరెడ్డి మధ్య లో
పడటం, ఆ హెడ్ లైట్ల వైపు చూడటం, ఆయన బింభం పెద్దదిగా నూ, అమ్మవారు
చిన్నగా నూ ఉండటం. బ్రిటిషు పోలీసులు వచ్చి ఉండటం. అక్కడ పడిన శవాలను
చూసి..

దొర

Oh god!! This is cold-blooded


massacre.

అని.. గంగిరెడ్డి దగ్గరకు వచ్చి..

దొర

గంగిరెడ్డి.. జాతర జరుపుకోవటానికి, పర్మిషన్


ఇచ్చింది.. ఈ ఊర్ల బాగు కోసమే.. కాని.. ఇలా
మీ లో మీరు తన్నుకొని చావడానికి కాదు...

అంటే, అక్కడ జనాలు తమ చేతుల్లో ఉన్న ఆయుధాలు పారేస్తా రు. కొంత మంది,
అక్కడ గాయ పడిన వారిని పక్కకి తీసుకోనిపోతావుంటారు..

దొర

ఇంత manslaughter కి కారణం.. ఈ జాతర


జరగటమే.. అందుకు..

అని, తన కానిస్టేబుల్ల వైపు చూసి.

దొర

Seize the idol, Arrest them all

అంటే, అప్పుడు.. ఆ గుంపులో ఉన్న వాళ్ళు జనాలు అయ్యా అని అరుస్తా రూ.
అప్పుడు గంగిరెడ్డి వాళ్ళ కు నేను మాట్లా డుతాను అని చెయ్యి చూపించి..

గంగిరెడ్డి

చూడు దొరా! గొర్రెలు అడ్డ దావన పోతావుండాయి


అంటే, తప్పు ఆ కాపరిది.. గోర్రెలది కాదు.
అట్నే.. నా ప్రజలు తప్పుడు పనులు చేస్తు న్నారు

about:blank 139/180
5/19/23, 4:13 PM

అంటే.. అందులో నా తప్పు కూడా ఉంది.


అందుకు.. పరిష్కారం గా.. నా యావదు ఆస్తి
మొర్తా న్ని జామీను కింద మీకు ఇస్తు న్నా.. వాళ్ళని
వదిలిపెట్టంది.

అంటే, అప్పుడు మళ్ళి కానిస్టేబుల్ల వైపు చూసి

దొర

ఆ అమ్మోరు idol ని మాత్రం.. తీసుకొని రండి!

కానిస్టేబుల్లు వెళ్ళి, చెప్పులు బయట వదిలి, తెల్ల తోలు పోలీసులు మాత్రం.. బూట్లు
వేసుకొని లిపలికి వెళ్ళి ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని.. రివర్స్ చేసి ఉన్న బ్రిటిషు వారి
పోలీస్ జీపు లో పెట్టు కొని.. వెళ్తా రు. గంగిరెడ్డి ఆ అపీసారు ను చూసి దండం
పేట్టటం, ఆ జీపు వెళ్ళిపోవటం, దాన్నే చూస్తూ ఊరివాళ్ళు ఉండటం.

EXT. NELLIMANDA TEMPLE - LATER

ఊరివాళ్ళును చూస్తూ.. గంగిరెడ్డి ఉంటె, అప్పడు అక్కడికి బ్రంహన్న వచ్చి

బ్రంహన్న

అదేంది రెడ్డి.. అమ్మోరిని.. అట్టా


ఎత్తకపోనిస్తివి.. పాలేటికి సాగనంపకుండా.. ఎల్లిపోతే
అనిష్టం కాదా?

అంటే, అందుకు

గంగిరెడ్డి

పెద్దనాయనా!.. అమ్మోరికి మన మీద కోపమువొచ్చి


ఎప్పుడో ఎల్లిపోయింది.. వాళ్ళు తీసకపోతావుండేది వొట్టి
విగ్రహం మే.  ఆ దేవుడే లేనిది.. విగ్రహం తెచ్చి ఏమి
చేసుకోను చెప్పు..

అంటే.. అటు ఇటూ చూసి.. ఇంతలో అక్కడ నుంచి ఒకడు వచ్చి..

చంగప్ప

అట్లైతే! అన్ని తెలిసినోడివి.. ఇప్పుడు ఏమి చెయ్యాలో


కూడా నువ్వే చెప్పు.. సామి

అంటే.. అప్పుడు

about:blank 140/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

నా చేతుల్లో ఏముంది చెప్పు చంగప్పా!.. ఇన్ని రోజులు


దేవుడే వచ్చి, ఏమి చెయ్యాలో చెప్పేది.. ఇప్పుడు
కూడా అంతే.. ఈ ఊరికి, ఆ అమ్మోరు అంతకి
అమ్మోరే వచ్చింది, ఇపుడు ఆమంతకి ఆమ్మే
ఎల్లిపోయింది.  ఆ తల్లే వొచ్చి ఏమి చెయ్యాలో
చెప్పేంత వరకూ ఓపిగ్గా ఉండాల్సిందే..

అంటే.. అప్పుడు.. ఆ గుంపులో వెనకాల ఒక వ్యక్తీ చేయి తగిలి, చిన్న కుండ కింద
పడుతుంది. అందులో నుంచి కొన్ని నిమ్మకాయలు, కోడి గుడ్డు , కొన్ని పూలు, ఆకులు,
వక్కలు, రెండు గాజులు కిందకు పడుతాయి. అవి చూసి అందరూ నివ్విర పోతారు.
పాలేటి వాటినే చూస్తుంటాడు, గంగిరెడ్డి పాలేటి ని చూస్తా డు, అప్పుడు అక్కడ ఉన్న
ముసలమ్మా

ముసలమ్మా

గుడిలో చాతబడా?

అంటే.. ఇంకో క వ్యక్తీ

వ్యక్తీ16

అది కథ.. సత్యం గల తల్లి.. బయట పెట్టింది


చూడు.. అస్సలు కధ..

ఇంకో వ్యక్తీ..

వ్యక్తీ17

ఎవరికీ అంత దైర్ణము?

అక్కడ ఇంకో క వ్యక్తీ

వ్యక్తీ18

ఇంకెవరూ.. ఆ పాలేటి గాడే ఉంటాడు.. 

అంటే.. పాలేటి.. పరిగెత్తు కుంటూ గంగిరెడ్డి దగ్గరకు వచ్చి..

పాలేటి

సామి.. ఆ అమ్మోరు తల్లి సాచ్చిగా చెప్తా వుండా..


అవి ఎంటివో కూడా నాకు తెలుదు.

about:blank 141/180
5/19/23, 4:13 PM

అంటే.. అప్పుడు గంగిరెడ్డి.. వాటి ని చూపిస్తూ..

గంగిరెడ్డి

చూస్తివా పెద్దనాయనా.. ఇప్పడు ఏమంటావు..

అంటే, అతని నోట్లో మాట రాదు, అప్పడు..

గంగిరెడ్డి

ఈ గుడి కి, ఎవడో ఏదో చేసినాడు.. మైలు


పట్టినట్టు ఉంది.. ఈ గుడి ముసేయాలని..నా
తీర్మానము.. ఈ యాల నుంచి ఇక్కడ పూజలు
జరగవు.

అని, గర్భ గుడి వైపు చూసి

గంగిరెడ్డి

ఎయ్యి రా గుడికి బీగాలు.

అంటే, insert గుడి కి తాలాల్లు వేస్తా రు (match cut)

INT. PALETI HOUSE - LATER

Match Cut, పాలేటి ఇంటి తలుపులు తెరుస్తుంది పాలేటి భార్య, పాలేటి.. ధర్మ
దండం తెచ్చి, ఇనపపెట్టి మీద పెట్టి, మంచం మీద కూర్చుంటాడు.. తన పక్కన,
చలపతి వచ్చి కూర్చుంటాడు, అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి..

పాలేటి భర్య

చలపతి! నాయన అలసిపోయి వచ్చినాడు నువ్వు మీ


అవ్వ దగ్గరకి పో!

అంటే, చలపతి.. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పాలేటి భార్య.. తను దిగాలు
గా ఉండటం చూసి.. తన దగ్గరకి కుర్చోని.

పాలేటి భర్య

భా! ఏమైనా మాట్లా డు.. నువ్వు ఇట్టా ఉంటె నేను


చూడలేను..

అంటే

about:blank 142/180
5/19/23, 4:13 PM

పాలేటి

ఏమి మాట్లా డేదే! సుస్తివే.. ఎంత జరిగిపాయనో..


నేను ఏ పొరపాటు చెయ్యలేదే! 

పాలేటి భర్య

ఎప్పుడు లేనిది, ఈ యాల మాత్రం.. యాడ చేస్తివి


లే!

పాలేటి

ఈ యాల ఊరోళ్ళు.. మాట్లా డే మాటలకి..


సచ్చిపోయినా బాగుండు అనిపిస్తా ఉండాది!

పాలేటి భర్య

ఏంది భా! ఆ మాటలు.. రాత్రి పూట..


అయినా.. మన చేతల్లో ఏముంది చెప్పు..

అంటే, అప్పుడు మునెమ్మ అక్కడ కు వచ్చి.

మునెమ్మ

నేను ఒక మాట అంటా.. వింటావా? 

అంటే, అప్పుడు మునేమ్మను చూసి

పాలేటి

చెప్పు మా!

అప్పుడు

మునెమ్మ

నాయనా.. పొద్దు న్నుంచి, వోక్కపోద్దు లోనే ఉండావు..


నాలుగు మెతుకులు తిని.. ఆ రెడ్దోరు ఇంటికాడికి
పోయిరాబో.. ఏమైనా దారి ఉంటె చెప్తా డు.

అంటే.. పాలేటి భర్య 

పాలేటి భర్య:

అవును భా! మన రెడ్డి.. దేవుడు, ఒక పాలు అట్టా


పొయ్యి రాబో!

about:blank 143/180
5/19/23, 4:13 PM

అంటే, సరే అని తల వూపుతాడు, అప్పుడు Jump Cut: పాలేటి, చెప్పులు


ఏసుకొని, గడప దాటి వెళ్ళటం, తన కండువా.. గడపమాను మీద పడిపోవటం,
match cut to పాలేటి భార్య, పెట్టే మీద నుంచి గుడ్డ ని తీస్తుంది, కింద
ధర్మదండం ఉంటుంది.. దాన్ని చూసి, చేతిలో పట్టికొని.. రెడ్దోరు ఇంటికి వెళ్తుంది.

EXT. REDDY HOUSE - NIGHT

గంగిరెడ్డి ఇంటి తలపులు ముసి ఉంటాయి బయట, అప్పటి పాటలు రేడియో పెట్టు కొని..
గంగిరెడ్డి వాలు కుర్చీ లో కూర్చొని ఉంటాడు, పక్కన విసనకర్ర పెట్టు కొని మునుసబు
ఊపుతూ ఉంటాడు. అప్పుడు.. పాలేటి తన ఇంటి గేటు దగ్గరికి వచ్చి, చెప్పులు
వదిలి, తన ఇంటి వాసల్లో అడుగు పెడతాడు, హటాత్తు గా, తన కి గుడి లో రావాల్సిన
శక్తి ఆవాహనం, ఇక్కడ రావటం, శక్తి ఉందన్న  భావన తన మొహం లో కనిపిస్తుంది,
అతని కళ్ళ ముందర అక్కడ ఏమి జరిగింది అని flash cuts లో అతని ముందు
రావటం జరుగుతాయి. అప్పుడు అమ్మారు గంగిరెడ్డి ఇంట్లో నే బంది గా ఉన్నారు అని
తెలుసుకొన్న పాలేటి, గుండె బోరువేక్కి.. చిన్నగా లోపలికి వస్తా డు.. చీకట్లో.. గంగిరెడ్డి
వైపు గా వస్తు న్న పాలేటి ని చూసి మునుసబు..

మునుసబు

ఎవర్రా అక్కడా.. ఎలుతురు లేకి రా రా!

అంటే, గంగిరెడ్డి లేచి నిలబడి చూస్తా డు, అప్పుడు పాలేటి చిన్నగా వచ్చి గంగిరెడ్డి ముందు
నిలబడతాడు.

మునుసబు

నువ్వా!

అంటే.. ఎవరా అని గంగిరెడ్డి.. లేచి చూస్తా డు..

గంగిరెడ్డి

ఏంది రా పాలేటి.. ఈ యాల కాడ

అంటే.. అప్పుడు చిన్నగా వెళ్ళి, తన కళ్ళు పట్టు కొని, కన్నీళ్ళ తో

పాలేటి

వరము ఇచ్చిన అమ్మ నే బందించి, చానా పెద్ద తప్పు


చేసేసినారు సామి, ఆ అమ్మోరు ఊరి సొత్తు , దయచేసి
ఇడిచిపెట్టండయ్యా!

about:blank 144/180
5/19/23, 4:13 PM

అప్పుడు గంగిరెడ్డి.. అక్కడ వాల్చి పెటిన మడక ను తీసుకొని, తిప్పి తన తలకి


కొడతాడు, పాలేటి తల చిట్లి.. రక్తం గంగిరెడ్డి మొహం మీద పడుతుంది.. పాలేటి
ఇస్సరకపోయి.. అవతల పడతాడు. అది చూసి, తన వెనకాలే వచ్చిన.. పాలేటి
భార్య గట్టిగా కేక వేసినప్పుడు, గంగిరెడ్డి వెనక్కి చూస్తా డు, అప్పుడు, చిన్నబ్బ ఆమె వెనక
నుంచి గొంతు పట్టు కొని, బిగేస్తా డు.. వాళ్ళు ఇద్దరూ జీవస్తా వం లా పడిపోతారు,
గంగిరెడ్డి చిన్నగా వచ్చి ఆమె చేతిలో ఉన్న ధర్మ దండం.. పీక్కుంటాడు.

గంగిరెడ్డి

పాలేటి.. ఏదైనా.. నాది కానంతవరకే మీది..


ఒక్కసారి నాది అనుకున్నానా.. అది గంగ అయినా,
గన్నేరు చెట్టు అయినా.. నాకాడే ఉండాలా!

అని,

గంగిరెడ్డి

రేయ్ మునుసబు.. ఈ పాలేటి గాడు వాని పెండ్లా ము


కలిసి.. గుడిలో చడ్డ చేసి, ఆ అమ్మోరిని ఎల్లగొట్టింది
ఈల్లే.. అర్థమైందా?

అంటే

మునుసబు

చిత్తం.. 

అంటే, అప్పుడు

గంగిరెడ్డి

చూడు.. ఈ యాల నుంచి.. ఎవ్వడై నా.. ఈ


గడపకి 10 అడుగుల దూరం లో నిలబదల్సిన్దే.. కాదు
కూడదు అని ముందుకు వస్తే.. మొండానికి
కత్తరిచ్చేయి కొడుకుల్ని..

అని చిన్నబ్బ ని చూసి..

గంగిరెడ్డి

రేయ్.. చిన్నబ్బ.. ఇవి తీసేయి.

అంటే.. చిన్నబ్బ.. వాళ్ళని లాక్కుంటూ వెళ్ళిపోతాడు. (MATCH CUT)- చిన్నబ్బ


కాళ్ళు

about:blank 145/180
5/19/23, 4:13 PM

INT/EXT. MULTIPLE LOCATIONS - DAY/NIGHT

MATCH CUT- చలపతి కాళ్ళు – ఆ అగోరా దగ్గర నుంచి తన గుండెల నుండా బాధ
ను పెట్టు కొని.. జీవస్తా వం లా నడుచుకుంటూ, వస్తుంటాడు..

తను, తన తల్లి తండ్రి ని విసిరేసిన.. బాయి అంచుల లో పడుకొని ఉంటాడు, తన


కు.. ఎన్నో సందర్భాల్లో.. ఎందరితో నో (మునెమ్మ, స్నేహితులు, వెంకటలచ్చిమి) తన
తండ్రి ని దూషించటం “ఏమిచ్చి నాడు” అనటం, చివ్వర గా, చిన్న పిల్లవాడు గా
ఉనప్పుడు పాలేటి మీద కళ్ళు వేసుకొని పడుకొని ఉండటం. 

Match cut: లో వాళ్ళ తన తండ్రి సమాధి మీద అలాగే కళ్ళు వేసి పడుకొని.. తన
తండ్రి తో మాట్లా డటం.

చలపతి

నిన్ను సంపినారన్న నిజం తెలీక పాయ. నన్ను


క్షమించు.. నాన్నా.

అని తన కి ముద్దు పెట్టి ఏడవటం.

తన ఇంటికి వెళ్ళటం, అక్కడ ఎవ్వరు ఉండకపోవటం, ఎక్కడివి ఆడ చల్లా చదురుగా


పడి ఉండటం. అక్కడ ఎవరినైనా అడగటం, తెలీదు అని వాళ్ళు చెప్పటం, అదే అరుగు
మీద పడుకోవటం, లేచి.. నడుచుకుంటూ వెళ్ళటం

నడుచుకుంటూ.. బురుజుపల్లి వెంకటలచ్చిమి దగ్గరకి రావటం, అక్కడా ఎవ్వరు


లేకపోవటం అక్కడ ఎవరినైనా అడగటం, తెలీదు అని వాళ్ళు చెప్పటం. ఆ ఇంటి దగ్గర
కూర్చోవటం, అక్కడ తను వెంకటలచ్చిమి కి ఇచ్చిన వి, ఒక సంచిలో పెట్టి, వదిలేసి
వెళ్ళిపోయి ఉండటం, వాటిని.. చూసుకుంటూ, తన జ్ఞాపకాలలో ఉండటం.. Max
30 sec (flash back montages) ex: her

తన ని చూసి, తన ముగ్గురు స్నేహితులు.. వేరు వేరు సన్నివేశాల్లో, చీదరించు కొని


వెళ్ళిపోవటం.

Jump cuts లో విశాలమైన అడవిలో, కొండల మధ్య.. పెద్ద పెద్ద వాగుల మధ్య..
వొంటరి గా ఉంటాడు. వర్షం వస్తే.. ఒక చిన్న పాటి బండ కింద పడుకొని ఉండటం.
ఇలా రోజులు సాయంకాలంగా అడవిలో కూర్చొని ఉన్నప్పుడు.. అగోరా చెప్పిన మాటలు
గుర్తు కు వస్తా యి..

అగోరా
( OS )

about:blank 146/180
5/19/23, 4:13 PM

ఈ ఊర్లు ఇట్లా కావటానికి కారణం, మీ నాయన


కాదు, ఆ గంగిరెడ్డి

అంటే, అప్పుడు అక్కడ నుంచి లేచి.. నడుచుకుంటూ.. వూరి వైపు వస్తా డు.

EXT. MANGO GROVES - LATER

గంగిరెడ్డి, రంగసాని తో, తన మావిడి తోపు లో ఉన్న చిన్న పాక దగ్గర, పక్కమంచం
మీద పడుకొని, తన ఎడమ చేతికి మల్లెపూలు చుట్టు కొని, రంగసాని పక్క లో
పెట్టు కొని.. సరసం ఆడుతుంటాడు.

గంగిరెడ్డి

అబ్బా.. ఇంత మంచి మావిడి చెట్ల మద్య.. మన్మధ


క్రీడలు ఆడేటప్పుడు.. అట్లా అలగకే.. నా ముద్దు ల
ఘని.. సొగసుల రంగసాని.

అంటే.. అప్పుడు ఆ రంగసాని, మొహం చేట్లించు కుంటూ..

రంగసాని

ఈ కవిత్వం కేమి కొదవ లేదు.. ఈ వాళ్ళ మొరుగు


బిళ్ళ తెస్తా నన్నారు. తెచ్చారా ?

అంటే.. అప్పుడు

గంగిరెడ్డి

మొరుగు బిళ్ళ కేమి కొదవే! నీకు ఏకంగా బంగారపు..


మొరుగే కట్టిసాను.. అందాక.. కొసరు గా
ఈ పాపిడి బిళ్ళ తీసుకో..

అది తీసుకుంటూ..

రంగసాని

ఈ కోతలకేమి కొదవ లేదు..

చలపతి.. నడుచుకుంటూ.. నడుచుకుంటూ వెంగం పెంచి, పెంచి.. పరిగెత్తు తూ..


వురిఅవతల ఉన్న మావిడి చెట్లల్లో వైపు వస్తు .. వస్తు .. పెద్ద కొమ్మ ని ఇంచుకొని.. ఒక
గేనుము మీద పెట్టిన కొడవలి ని తీసుకొని.. ఆ కొమ్మని జీవురుతూ.. ఒక బల్లెం లా
చేసి.. మావిడి తోపు దగ్గరకు వస్తా డు.. అప్పుడు అక్కడ సరసాలు ఆడుతున్న గంగిరెడ్డి
ని చూసి గురి చూసి విసురుతాడు.. అలా విసిరేసిన్దా న్ని.. తీసుకోనేదానికి లేస్తా డు
గంగిరెడ్డి.. అలా నులకమంచం మీద నుంచి లేసిన వెంట నే.. సరిగ్గా తన గుండె ఉన్న

about:blank 147/180
5/19/23, 4:13 PM

చోటు వచ్చి.. ఆ బల్లెం గుచ్చుకుంటుంది. అది చుసి వాళ్ళిద్దరూ కంగు తింటారు.


అప్పడు గంగిరెడ్డి గట్టిగా

గంగిరెడ్డి

ఎవర్రా! అక్కడా

అని, తరవాత.. అటుగా చూస్తూ..

గంగిరెడ్డి

రేయ్! చిన్నబ్బా! ఎక్కడ సచ్చావు రా! వాడెవడో..


నన్ను సంపేదానికి వచ్చినట్టు న్నాడు.. పట్టు కొండి రా
వాణ్ణి.

అంటే.. చలపతి.. అక్కడ నుంచి చిన్నగా జారుకుంటాడు.గంగిరెడ్డి అక్కడ ఉన్న కట్టినే


చూస్తుంటాడు. ఇంతలో అక్కడికి పరిగెత్తు కుంటూ.. చిన్నబ్బా, అతని అనుచరులు
వస్తా రు, చిన్నబ్బా గంగిరెడ్డి తో

చిన్నబ్బ

ఈడ ఎవరూ లేరు అయ్యా!..


అడివిలేకి పారిపోయినట్టు న్నాడు.

అంటే, లేచి.. గంగిరెడ్డి చిన్నబ్బ ని చూస్తూ.. అక్కడ ఉన్న రంగాసానిని చంపకి


కొడతాడు, అప్పుడు చిన్నబ్బ తల వొంచుకుంటాడు, అప్పుడు

గంగిరెడ్డి

దొంగలు పడిన ఆరు నెలలకు గాని కుక్కలు


మొరగాలేదంట.. అట్లా ఉంది రా నీ యవ్వారం.
ముప్పోదులా మూడు మూడు ముద్దలు మింగుతావు
గాని.. కాపలా కాయటం మాత్రం చేతగాదు.. లంగడ
నా కొడకా.

అంటూ.. సిషుడు..ఆ కట్టినే చూస్తూ.. ఉంటాడు, గంగిరెడ్డి వాణ్ణి గమనిస్తా డు,


అప్పుడు

గంగిరెడ్డి

రేయ్.. నీ కేమైనా దీని గురుంచి తెలుసా?

అంటే.. వాడు తల గోక్కుంటాడు, అప్పుడు, చిన్నబ్బ.. వాణ్ణి, పట్టు కొని కాస్త గట్టిగా

about:blank 148/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

రేయ్.. నిన్నే.. అడగతావుండ్లా ! తెలుసా.. తెలీదా?

అప్పుడు

చిన్నబ్బ శిషుడు

యాడనో చూసినట్టుంది సామి.. గుర్తు రావటం లేదు.

అప్పుడు..

చిన్నబ్బ

యాడనో.. అంటే.. మన ఊర్లో నా

అంటే.. లేదు అని తల ఊపు తాడు.. అప్పుడు

గంగిరెడ్డి

రేయ్ వాణ్ణి వోదులు.. మన ఊరి బిల్లి బిత్తిరి


నాయాళ్ళకి, అంత దమ్ము యాడిది రా. ఇది కచ్చితం
గా బయటోడే. ఆ రోజు ఇంటిలోకి వోచ్చినోడే ఈ పని
చేసుంటాడు ఉంటాడు.

అని, దగ్గరకి వచ్చి

గంగిరెడ్డి

చిన్నబ్బా.. ఇది రక్తం మరిగిన పిల్లి లా ఉండాది..


ఇది.. పులి గా మారకముందే, పట్టి నా ఇంటి గోడ
మీద తగలెయ్యాల.

ఈ యాల నుంచి.. ని మనుషులు.. ఈ చుట్టు పక్కల ఊర్లల్లో జల్లిడేసి గాలించాల,


ఎవడై నా కొత్త వోడు కనిపిస్తే.. నా కాడికి పట్టకరావాల; కాదు కూడదు అని
మొండికేసినాడా, వాని మెడకాయ కోసి ఎత్తక రావాల. అర్థమైనదా?

చిన్నబ్బ

ఊ సామి

అని, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళి పోతారు, గంగిరెడ్డి, ఆ కట్టి నే చూస్తూ.. దాన్ని
తీసుకొని, కోపం లో కిందకి ఎసి కొడతాడు (match cut)

EXT. VENKATALACCHIMI NEW LOCATION - AFTERNOON

about:blank 149/180
5/19/23, 4:13 PM

Match cut: ఒక అతను, గుడారము కు సంబందించిన గూటాన్ని కొడుతూ


ఉంటారు.. లక్ష్మీపతి, మూటలు, బన్డి లో నుంచి దించుతూ ఉంటాడు.. కొద్ది దూరం
లో వెంకటలచ్చిమి ఏదో పోగొట్టు కున్నా దాని లా కూర్చొని ఉండటం. ఇంతలో అక్కడికి
సైకిల్ వేసుకొని.. చిన్నబ్బ మనిషి ఎదురు రావటం, వాళ్ళను చూసి

చిన్నబ్బ మనిషి

యోవ్! నాటకాల వాళ్ళు.. మీరే నా?

అంటే, అప్పుడు..

లక్ష్మీపతి

అవును.

అంటే, అక్కడ కు రాఘవయ్య కూడా వస్తా డు, అప్పుడు.

చిన్నబ్బ మనిషి

సర్లే గాని, మిమ్మల్ని రెడ్డి రంమంటావుడాడు..


పదండి.

అంటే, లక్ష్మీపతి, తన దగ్గర ఉన్న పొదను పెట్టిన యాట కొడవలి ని చూసి..

లక్ష్మీపతి

ఏంది ఇప్పుడా ?

చిన్నబ్బ మనిషి

అవను.. బిరినా కట్టూ బన్డి!

అంటే, అప్పుడు రాఘవయ్య వైపు చూస్తే..

రాఘవయ్య

ఇక్కడ ఆడోళ్ళు ఉండారు, వాళ్ళకి గుడిసలు ఎసి


వచ్చేస్తా ము.. నువ్వు పద..

అంటే.. అప్పుడు, చిన్నబ్బ మనిషి.. అక్కడ ఉన్న ఆడవాళ్ళ ని చూసి.. వెళ్తూ వెళ్తూ

చిన్నబ్బ మనిషి

బిరీనా వొచ్చేయండి.. యోవ్.. యాడన్నా పనిచేటు


చేసేరు.. తలలు తెగిపితాయి.

about:blank 150/180
5/19/23, 4:13 PM

అని, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు.. రాఘవయ్య.. లక్ష్మీపతి ని చూసి..

రాఘవయ్య

ఆ మూటలు దించి రా పదాము..

బన్డి, లో నుంచి, ఒక మూట ని 

EXT. REDDY HOUSE - EVENING

Match Cut: ఒక వ్యక్తీ ని, చేతులు కళ్ళు కట్టేసి బన్డి లో నుంచి దిపటం, గంగిరెడ్డి
దగ్గరకు తీసుకొని రావటం.

చిన్నబ్బ మనిషి

అయ్యా!.. వీడు మన.. మావిడి తోపు కాడ


తిరుగుతావుంటే.. పట్టు కోచ్చినాము..

అప్పుడు గంగిరెడ్డి దగ్గరకు వచ్చి.. తను నిల్చున్న చోటు నుంచే.. తన ఎడమ కాలు
తీసు, ఆ వ్యక్తీ బుజం మీద కాలు పెట్టి నులుము తాడు, వాడు నొప్పి తో ములుగు
తుంటే.. కాలు తీసి.. అటు పక్కన వాణ్ని కొట్టి,

గంగిరెడ్డి

నాకు వాడి మూలుగులు వినపడతావుండ్లా .. ఆ


మూతికి కట్లు విప్ప రా..

అంటే, వాని, నోట్లో గుడ్డ పీకుతాడు, అప్పుడు.. మళ్ళి అక్కడ తన కాలు పెట్టి..


తొక్కు తాడు.. వాడు “అమ్మా అని గట్టిగా అరవటం” మహా ఆనందంగా మయమరచి
ఉంటుండగా.. తన ఎదురుగ్గా ఉన్న ఎండు గడ్డివాము నుంచి నల్లటి ముసుగు ఏసుకొని
చలపతి చేతిలో బల్లెం పెట్టు కొని ఎగిరి గంగిరెడ్డి మీదకు దుంకుతాడు, అది చుసిన,
చిన్నబ్బ, గంగిరెడ్డి కుర్చీ పక్కన ఉన్న తుపాకి ని తీసి, చలపతి కి గురి పెట్టి,
కాలుస్తా డు..

కాస్త గురి తప్పటం తో.. చలపతి కి గీసుకుంటూ, తను చుట్టు కున్న గుడ్డకి
తగులుతుంది, ఆ గుడ్డవూడిపోవటం తో, గంగిరెడ్డి ని చంపటానికి వచ్చింది, చలపతి అని
అందరికి అర్థమౌతుంది; అదే సమయం లో అక్కడికి వచ్చిన లక్ష్మీపతి, రాఘవయ్య లకి
కూడా తెలుస్తుంది, ఆశ్చర్య పోతారు. గంగిరెడ్డి కూడా ఆశ్చర్యం గా చూస్తూ
స్తంబించిపోయి ఉంటాడు. తన పక్కన నిలబడి ఉన్న అనుచరుడు, గంగిరెడ్డి ని
తోసేస్తా డు, గంగిరెడ్డి పక్కకి పడిపోవటం తో, గురి తప్పి, చలపతి పక్క కి పడతాడు..
అప్పుడు చిన్నబ్బ

about:blank 151/180
5/19/23, 4:13 PM

చిన్నబ్బ

పట్టు కోండి రా నా కొడుకుని..

అంటే, చలపతి చిన్నగా అక్కడ నుంచి తప్పించుకుంటాడు. చలపతి వెంట కొంతమంది


వెళ్తా రు. తన అనుచరులు, పనివాళ్ళ మధ్య గంగిరెడ్డి కింద కూర్చొని కళ్ళు విప్పరిచ్చి షాక్
లో నే ఉంటాడు. ఆ పక్కనే ఉన్న మునుసబు ని చూసి

గంగిరెడ్డి

నువ్వు పోరపాటు పడ్డా వు.. మునుసబు! వాడు వాన


పాము, కాదు, దెబ్బ తిన్న నాగుపాము. అది
ఇప్పుడు పడగెత్తి బుస్సాలు
కోడతాఉండాది. కాటేయ్యకముందే, దాని కోరలు పీకి,
దాని చర్మం తో నా చెప్పులు కుట్టిచ్చుకోవాల.

అని లేచి గట్టగా అరుస్తు .. తన చేతికి దొరికింది ఎత్తి కిందు పడేస్తా డు.

గంగిరెడ్డి

రేయ్! అది ఏ బొక్క లో ఉన్నా సరే.. రేపు పొద్దు గాల


కల్లా , వాడు నా కాళ్ళ కాడ ఉండాలా. బతికినా సరే.
సచ్చినా సరే..

EXT. RANDOM PLACE (FOREST) - DUSK

దెబ్బ తిన్న చలపతి, పరిగెత్తు కుంటూ ఊరికి దూరం గా గుట్టా పైకి ఎక్కుతాడు, వెనక్కి
తిరిగి చూస్తే, దూరం గా ఆ ఊరిలో కాగడాలు పట్టు కొని వెతికినట్టు ఉంటుంది, అక్కడ
నుంచి వెళ్ళిపోయి.. తను కొద్ది దూరం అడవిలోకి పోయి.. ఒక చిన్న బండ వెనకాల
కూర్చొని.. తన కి తగిలిన గాయాన్ని చూస్తా డు, అక్కడ కాస్త లోతుగా దెబ్బ తగిలి
ఉంటుంది, అప్పుడు.. కొన్ని పుల్లలు ఏరి, అక్కడ మంట పెట్టి, అగ్గిని తీసి ఆ పుండు
మీద కల్చుకుంటాడు, ఆ మంటకి గట్టిగా అరుస్తా డు, ఆ పుల్ల ని పక్క కి పాడేస్తా డు.

EXT. REDDY HOUSE - NIGHT

MATCH CUT: చిన్న కొవ్వొత్తి ని తీసుకొని, ఇంట్లో, గంగిరెడ్డి గది దగ్గరకి రావటం,
అక్కడ గంగిరెడ్డి వొంటరి గా పడుకొని ఉంటాడు, చలపతి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి,
గంగిరెడ్డి తల దగ్గరకి వచ్చి నిలబడి, వేట కొడవలి తో.. వొకే ఎటుకు తల నరుకుతాడు
(కొడవలి ఎత్తి.. నారికే తప్పుడు; గంగిరెడ్డి POV).. 

గంగిరెడ్డి.. అరుసుకుంటూ.. మంచం మీద నుంచి లేచి.. తన గొంతు ను తడుముకొని


చూస్తా డు..

about:blank 152/180
5/19/23, 4:13 PM

తను తొట్టి దగ్గరకి పోయి; తన ప్రతిబింబం చూసుకొని, ఆ నీళ్ళను మొహానికేసి


కొట్టు కుంటాడు..

EXT. RANDOM HOUSE - MORNING

Match cut: నిద్రలో ఉన్న చలపతి కి మొహం మీద నీళ్ళు కొట్టి లేపుతాడు..
లక్ష్మీపతి, తన కళ్ళు రెండు తెరిచి చూసే సరికి.. లక్ష్మీపతి కనిపిస్తా డు.. ఎక్కడ
ఉన్నానా అని అటు ఇటు చూస్తా డు, అప్పుడు తను ఒక మంచం మీద పడుకొని
ఉంటాడు, చిన్నగా లేచి చూస్తా డు, అక్కడ లక్ష్మీపతి, కోనా, సోమా ఉంటారు.
లేయ్యబోతుంటే.. తన గాయం నొప్పివేస్తుంది, అప్పుడు గాయం వైపు చూస్తా డు,
అక్కడ ఆకు తో పసరు మందు పెట్టి ఉంటారు. నీరసం గా ఉండి లేవబోతూ..

కోనా

ఏంది రా చలపతి ఇది.. సమయానికి మీ మామ


వొచ్చే కాబట్టి సరిపాయ..

అంటే, ఏమి మాట్లా డకుండా లేచి, షర్టు వేసుకోని, వెళ్లబోతుంటే, వాళ్ళిద్దరూ


వొక్కసారిగా వచ్చి చలపతి ని పటుక్కోబోతు

లక్ష్మీపతి

ఆగ రా!

అంటే, అప్పుడు, ఎర్రటి తన కళ్ళతో.. .. ఆ రౌద్రా న్ని చుసిన లక్ష్మీపతి, కొద్దిగా


జంకుతాడు.. అప్పుడు, చలపతి, తనను.. తానూ సమాధానం తెచ్చుకుంటాడు. తన
లో ఉన్న బాధ ను.. ఎలా పంచుకోవాలో తేలిక..

అని.. తను కుప్ప కులుతాడు.. తన కళ్ళల్లో ఏడుపు వస్తు న్నా.. దిగమింగుకొని


ఉంటాడు, అప్పుడు.. లక్ష్మీపతి, తనని.. పట్టు కొని.

లక్ష్మీపతి

ఏమైంది రా చలపతి!

అని అడిగిన వెంట నే

చలపతి

అన్యాయంగా.. చంపెసినారు మావా!

about:blank 153/180
5/19/23, 4:13 PM

అని, జరిగిన కధ ని టైం లాప్స్ లో.. జరిగిన కథ ని చెప్తా డు. (లాక్కొని పోయి,
బాయిలో వెయ్యటం)

లక్ష్మీపతి

ఇప్పుడు ఏమి చేద్దా మని.

అంటే

చలపతి:

వాడు ఈ భూమి మీద ఉండకూడదు మావా!

అప్పుడే అగోరా.. దబా అని ఆ ఇంటిలోకి తలుపులు తెరుచుకొని వచ్చి.

అగోరా

ఇప్పుడు నువ్వు చెయ్యల్సింది, వాణ్ణి సంపటము కాదు;


ఆ భగవంతున్నే బొమ్మలా ఆడిస్తు న్న ఆ మానవ
మారనహోమం తో ధర్మ యుద్ధం.

అంటే, అప్పుడు

చలపతి

ధర్మ యుద్ధం ఆ?

అంటే.. అప్పుడు

అగోరా

ఏ ఊరి జనాలను చూసి వాడు బలవంతుడని


విర్రవీగుతున్నాడో, అదే ఊరి జనం వాడి బలహీనం
అవ్వాలి; అప్పుడే, నివురు కప్పిన వాడి నిజ స్వరూపం
బయటపడి, ఊరి జనాలకు జరిగిన వాస్తవం
తెలుస్తుంది.

అని.. వెళ్ళిపోతూ.. (Check options for transitional match


cut; chalapthi and his friends coming to village
outskits and aghora voice as V.O)

అగోరా (V.O): ఒక్క విషయం గుర్తు పెట్టు కో! వచ్చే నెల ఉత్తర ఫల్గుని నక్షత్రం
నడిజాము కెక్కె లోపు; అమ్మ వాడి చర నుంచి విడుదల అవ్వాలి. అలా జరగలేదో..
ఈ ఊర్లు శాశ్వతం గా మట్టిలో కలిసిపోవలసిందే.

about:blank 154/180
5/19/23, 4:13 PM

EXT/INT. MULTIPLE LOCATIONS - DAY/NIGHT

చలపతి, తన స్నేహితులు, ఒక ఉరి పొలిమేర్ల దగ్గరికి వస్తా రూ, పొలిమేర్ల దగ్గర తన


స్నేహితులు ఆగి పోతారు, చలపతి మాత్రం ఒక్కడే ఒక ఊరి మైలు రాయి దాటి లోపలికి
వెళ్తా డు. ఆ ఊరి పెద్ద; ఇంకొంత మంది, చిన్న పాటి రచ్చ బండ మీద కూర్చొని
ఉంటారు, వాళ్ళ దగ్గరకి పోయి, నిలబడ తాడు, ఆ పెద్దమనిషి చలపతి ని చూస్తూ..
Metaphorically showing beetal nuts-

పెద్దమనిషి

ఎవరూ బాబు

అంటే

చలపతి

ఆవులోళ్ళ పాలేటి కొడుకును

అంటే.. అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యం గా చూస్తా రు, అప్పుడు ఆ పెద్దమనిషి..

పెద్దమనిషి

సరే! ఏంది సంగతి..

అంటే.

చలపతి

ఏమి లేదు మావా.. పాలేటమ్మ.. జాతర జరిగి 22


ఏండ్లు ఐతాఉంది, ఈ ఈడన్నా చేపిస్తే
బాగుంటుందేమో అని. 

అంటే, అప్పుడు షాక్ లో చలపతి వైపు చూస్తా డు.

పెద్దమనిషి

అమ్మోరు జాతర జరుగుతుంది అంటే, మాకు మాత్రం


సంతోషం ఉండదా చెప్పు.. ముందు పిలాల్సింది
మమ్మల్ని కాదు రా.. మీ ఊరివాళ్ళని..

అంటే.. చలపతి, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు మొదట బలిజపల్లి కొమ్మిరెడోల్ల


ఇంటికి పోతాడు. అక్కడ వాకిలి తీసి, ఒక వ్యక్తీ వస్తా డు, తన వెనకాల కొమ్మిరెడ్డి
చనిపోయిన ఫోటో ఉంటుంది.

about:blank 155/180
5/19/23, 4:13 PM

చలపతి

అయ్యా.. నేను.. పాలేటి కొడుని; పాలేటమ్మ..


జాతర గురించి..

అనే లోపే..

కొమ్మిరెడ్డి కోడుకు

యాల రా.. మీ నాయన చేసింది సాలదనా?..


ఇప్పుడు నువ్వు వచ్చినావు. జాతరా లేదు.. జిల్లెడి
కాయ లేదు.. ముందు నువ్వు ఇక్కడ నుంచి పో
రా!

అని, అక్కడ నుంచి తరిమేస్తా డు, అప్పుడు, చలపతి వెళ్ళిపోయాక.. కొమ్మిరెడ్డి


కోడుకు, చిన్నబ్బ ను కలిసి, జరిగిన విషయం చెప్తా డు. చిన్నబ్బ మనుషులు, చలపతి
కోసం గాలిస్తూ ఉంటారు. ఇంకో ఊరికి వెళ్తా డు; అక్కడ ఒక విధవ ఆవిడ, బయట
ముగ్గు వేస్తూ ఉంటుంది, అక్కడ కి వెళ్తా డు, ఆవిడ చెప్పినంత సేపు చెప్పి, పరక
ఎతుకుంటుంది.. చలపతి చిన్నగా అక్కడ నుంచి వచ్చేస్తా డు,

ఇంకొక పెద్దా యన నీళ్ళు కడుతుంటే.. అక్కడ కు వెళ్తా డు, అతను కూడా చీధరించు
కుంటాడు,

ఇంకొకరి ఇంటికి వెళ్తా డు, తన మూతి చూసి, అక్కడ నుంచి వచ్చేస్తా డు. ఇంకో
ఇంటికాడికి పోతే.. కల్లా పు చల్లు తుండగా.. అక్కడికి వెళ్తే.. చలపతి ని చుసిన
వెంటనే.. పేడ నీళ్ళు మొహం మీద వేయటం, తనకు తుడుచుకొని.. అక్కడ నుంచి
వెళ్ళిపోవటం. అడవిలో.. గాజులమ్మ గుదికాడికి వెళ్ళటం, అక్కడ గుడి దగ్గర
కూర్చోవటం.

EXT. GUDUMBA CENTER - EVENING

చిట్ట చివర గా గాండ్లపల్లి కల్లు దుకాణం దగ్గరకి వస్తా డు, అక్కడ కదిరెప్ప తన గ్లా సు ని
బోర్లిచ్చి కూర్చొని, బీడీ తాగుతూ ఉంటాడు. చుట్టూ పెద్ద బాటిళ్ళు ఉంటే, తన ముందు
మాత్రం, చిన్న ముంత ఉంటుంది. చలపతి తన ముందు పెద్ద బాటిల్ కళ్ళు పెడతాడు,
దాన్ని ఏంతొ ఆశగా తీసుకోబోయి, తల పైకెత్తి చూస్తా డు, తెచ్చింది చలపతి అని చూసి..
చిన్నగా ఆ బాటిల్ ని వదిలేస్తా డు, అప్పుడు..

చలపతి

నేను తెచ్చిన కల్లు తాగితే కూడా మత్తు ఎక్కుతుంది లే


మావా!

about:blank 156/180
5/19/23, 4:13 PM

అంటే, అటూ, ఇటు చూసి, మళ్ళి చిన్నగా ఆ బాటిల్ ను పట్టు కొని, గుట గుటా తాగి
కాలిచేస్తా డు.

చలపతి

ఎట్టా ఉండేవాడివి మావా! పోసే చెయ్యి


నీది, అట్టాంటిది.. అదే.. అంగడిలో ఇప్పుడు
చెయ్యి చస్తా ఉంటే చూడలేక పోస్తు న్నాను మావా!

అంటే, కంటి లో నీళ్ళు పెట్టు కొని

కదిరెప్ప

ఆ అమ్మోరు ని అడ్డము ఎసుకున్నదుకు ఇంటిల్లి పాది


నరకం అనుభవిస్తా ఉండాము లే రా.

అంటే

చలపతి

చ! అదేమి మాటలు మావా! అన్ని తెలిసినోడివి..


నువ్వే ఇట్లంటే ఎట్టా చెప్పు..

అంటాడు, అప్పుడు

కదిరెప్ప

ఏమి చేసినా.. ఇంగ... అంతే!

చలపతి

అట్టా అనకు మావా.. మనము జాతర జరిపిస్తే..


మళ్ళి మన ఊర్లు పాణం పోసుకొంటాయి.

అంటే, కళ్ళు తాగే వాడు, బాటిల్ కింద పెట్టి

కదిరెప్ప

అయినా... ఆ అమ్మోరే మనల్ని వదిలి


ఎల్లిపోయినాక.. ఇంకా ఏ జాతర చెప్పు?.

అంటే..

చలపతి

about:blank 157/180
5/19/23, 4:13 PM

పోరాపాటు పడతావుండావు మావా!.. వదిలేసుకొని


ఎల్లిపోయింది.. అమ్మోరు.. కాదు ననము..

ఇంతలో అందరూ చలపతి చూసి, తను చెప్తు న్నది ఉంటారు.. అప్పుడు

చలపతి

ఆ రోజు జరిగింది.. ఒక్క సారి గుర్తు కు తెచ్చుకో?


అమ్మోరంతకీ అమ్మోరే ఎల్లిపోయిందా, లేక మీరే ఇచ్చి
పంపిచ్చేసినారా?

కదిరెప్ప

మేమే!

చలపతి

నిజానికి అమ్మోరు ఇక్కడే ఉండాది మావా! మళ్ళి


జాతర పెట్టి.. పిలిస్తే కచ్చితం గా వస్తుంది.

కదిరెప్ప

నువ్వు చెప్పేది.. నిజమే అయినా.. జాతర జరిపిచ్చేది


అంత సులువు కాదు రా. దానికి రెడ్డి సమ్మతం
కావాలి. 

చలపతి

ఆ రోజు నడీది పూజ లో రెడ్డే చెప్పినాడు కదా,


జనాలు వొప్పుకుంటే జరిపిస్తా ? 

కదిరెప్ప

అది సరే రా.. ఇప్పుడు నన్ను ఏమి చెయ్యమంటావు.

అంటే

చలపతి

నా మొహం చూసి తలుపు ఏసే వాళ్ళే గాని, నా


మాట ఇని ముందుకు వచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు..
అందుకు నువ్వు ముందర పడాలి మావా!

అంటే

కదిరెప్ప

about:blank 158/180
5/19/23, 4:13 PM

ఈ విషయం రెడ్డి కి తెలిస్తే, మెడకాయ మీద


తలకాయ ఉన్నిడు రా? 

అప్పుడు, చలపతి

చలపతి

రెడ్డి తో నేను మాట్లా డుతాను.. నువ్వు పెద్దమనుషుల్ని


ఎట్టా తీసుకొని రావాలో ఆలోచించు.

అంటే, కొద్ది గా ఆలోచింది..

కదిరెప్ప

సరే! ఆ బ్రంహన్న తో ఒక్క సారి మాట్లా డి చూస్తా ను

అనే లోపే..

చలపతి

చాలా సంతోషం మావా, చాలా పనులు ఉండాయి నేను


వస్తా ...

అని, అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. అతన్నే చూస్తూ ఉండిపోతాడు కదిరెప్ప.

EXT. REDDY HOUSE - MORNING

గ్రామా పెద్దలు, బ్రంహన్న, కదిరెప్ప, కదిరెప్ప కొడుకు, ఊరి జనాలు, ఆడా, మగ,
పిల్లా పీసు.. దండు ఎత్తినట్టు గా గంగిరెడ్డి ఇంటికి వస్తా రు. రెడ్డి తన ఇంటి దగ్గర
తాపిగా కూర్చొని గడ్డం గీకిచ్చుకుంటూ ఉంటాడు, అప్పుడు వాళ్ళ రావటం చూసి

మినుసబు

అయ్యా! అడ చూడండి, జనాలు మీ మీదకి దండు


ఎత్తి వచ్చినట్టు న్నారు..

అంటే, అప్పుడు గంగిరెడ్డి, అద్దం లో చూస్తా డు, అన్ని కులాల వాళ్ళు కల కలిపి రావటం
తో, గొంతు మీద కత్తి ఉండటం కూడా గమనించకుండా, వాళ్ళ వైపు తిరుగుతాడు,
అప్పుడు.. ఆ గడ్డం గీసే వాళ్ళని వొక్కటి పీకి.. ఆ పక్కనే ఉన్న టువాలు గుడ్డ ని
తీసుకొని, తుడుచుకుంటూ.. వాళ్ళని అందరిని ఒక పాలు చూసి.. అప్పుడు బ్రంహన్న
తో

గంగిరెడ్డి

about:blank 159/180
5/19/23, 4:13 PM

ఏంది పెద్దనాయనా! ఊరి జనాలు అందరినీ తోలుకొని


వచ్చిండావు. ఏంది సంగతి?

అక్కడికి వచ్చిన వక్కల వాళ్ళని చూసి

గంగిరెడ్డి

ఇదెందబా.. ఇడ్డు రము.. చానా ఏండ్ల తరవాత..


వక్కలోళ్ళు కూడా వచ్చినారు.. కొంపదీసి,
ఎన్నుపోటు.. కార్యక్రమాలు ఏమి చెయ్యలేదు కదా?

అంటే, అపుడు

బ్రంహన్న

అదేమి కాదు గంగిరెడ్డి. నువ్వు ఈ ఊరి జనాలకు


ఇచ్చిన మాట ని నెరవేర్చుకొమ్మని అడగటానికి
వచ్చినాము.

అంటే.. వెనక్కి తిరిగి చూస్తా డు..

గంగిరెడ్డి

ఏందో అది

అంటే, అప్పుడు.. వాళ్ళ మధ్య లో నుంచి, చలపతి తాంబూలం తట్ట పట్టు కొని
వస్తా డు.

చలపతి

పాలేటమ్మ జాతర.

అతన్ని చూసిన గంగిరెడ్డి, కంగు తింటాడు..

చలపతి

అందరూ.. కలిసివస్తే.. జాతర జరిపిస్తా నంటివే..


లెక్క చూసుకో.. 18 గ్రామాలు, 12 జాతులు, 3
కులాలు కలిసి.. వచ్చినాము..

అప్పుడు.. గంగిరెడ్డి.. చిన్న గా ఇక్కిలిస్తూ..

గంగిరెడ్డి

about:blank 160/180
5/19/23, 4:13 PM

బాగుంది రా!.. మీకు. బొచ్చు నరిసింది కాని, దాని


కింద ఉండే బుద్ది ఏ మాత్రం పెరగలా..

అప్పుడు.. బ్రంహన్న

బ్రంహన్న

గంగిరెడ్డి..

గంగిరెడ్డి

అరవకు!.. నిన్ను కూడా చేర్చే చెప్పింది..

అంటే.. అప్పుడు.. బ్రంహన్న చిన్నగా తల వొంచుకుంటాడు. అప్పుడు

గంగిరెడ్డి

ఇంత బతుకూ.. బతికి.. ఇంటి ఎనకాల


సచ్చినట్టు .. పొయ్యి పొయ్యి దొంగ ని నమ్మి
వచ్చినారే.. మీరేమి పెద్దమనుషులు రా?

అంటే.. అందరూ, అవాక్కు అవుతారు.. అప్పుడు కదిరెప్ప..

కదిరెప్ప

ఏంది.. వీడు.. దొంగ నా?

అంటే..

గంగిరెడ్డి

కాదని ఆ అమ్మోరు మీద వొట్టేసి చెప్పమనయ్య..

అంటే.. అందరూ, చలపతి వైపు చూస్తా రు.. చలపతి.. తల వొంచు కుంటాడు..


అప్పుడు గంగిరెడ్డి..

గంగిరెడ్డి

ఈ నాయాలు.. దేవాలయం లాంటి.. నా ఇంటికే


కన్నమేసి.. దేవుడు లాంటి.. నన్నే సంపెదానికి
చిసినోడు.. ఆ అమ్మోరు దయ... ఈ ఊరి జానాల
కు నేను చేసిన మంచే.. నన్ను కాపాడినట్టుంది.లేక
పోతే నా!

అంటే.. అప్పుడు కదిరెప్ప..

about:blank 161/180
5/19/23, 4:13 PM

కదిరెప్ప

వీడు, జాతర జరిపిస్తే.. ఊరు బాగుపడుతుంది


అంటే.. వీన్ని నమ్మి వస్తిమి దేవరా!

అంటే..

గంగిరెడ్డి

గొర్రెలు కసాయివోడిని నమ్మినట్టు .. నమ్మి వచ్చిన్నారు


కదా రా కదిరేప్పా!.. వీడి చెప్పిందేల్లా ..
ఇంటావుంటే.. కడాకు.. మిగిలేది.. చిప్పే.. ఈ
రోజు జాతర అన్నాడు.. రేపు వొచ్చి.. ఆ అమ్మోరు
ని మా ఇంట్లో కట్టేసుకున్నాను అంటాడు.. ఇన్నేళ్ళు
గా జాతర జరగకపోవటానికి కారణం కూడా నేనే అని
అంటాడు.. కడాకు.. ఈడి అమ్మా బాబు ని సంపి
సంపి.. బాయులో పడేసింది కూడా నేనే అని
చెప్తా డు.

అంటే

చలపతి

కాదని.. ఆ అమ్మోరు మీద వొట్టేసి చెప్పు..

అప్పుడు కదిరెప్ప

కదిరెప్ప

రేయ్! సాలిచ్చరా.. మమ్మలి.. యర్రిముండలు


చేసింది కాకుండా.. చిన్నతరం, పెద్దంతరం లేకుండా..
దేవుడు లాంటి రెడ్డి ని పట్టు కొని.. ఏదంటే అది
మాట్లా డుతా ఉండవు!

అంటే.. అప్పుడు..

గంగిరెడ్డి

కదిరేప్పా! .. వాణ్ణి చెప్పా నీ.. ఆ సీత కే తప్ప


లేడంట.. పీత కస్టా లు.. నేను అంతా ఎంత..
వాడు ఏలు చూపిచ్చింది.. నా వోక్కడి మీద
కాదయ్యా. నా యనకాల ఉండే.. ఆ అమ్మోరు తల్లి
మీద.. నిజం ఆ తల్లే నిరూపించాల..

అంటే, .. మునుసబు వైపు చూసి

about:blank 162/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి:

మునుసబు, తెప్పించు కర్పూరము..

అంటే.. మునుసబు.. లోనికి వెళ్తా డు.. అప్పుడు..

చలపతి

బలే నటిస్తు న్నావు.. రెడ్డి.. వీళ్ళు నిజం గా


గొర్రెలు.. కాకపోతే.. మేక తోలు కప్పుకున్న నీలాంటి
నక్కని ఇంకా పసిగట్టలేక పోతున్నారు. తెప్పించు..
నీలో ఎంత సత్యం ఉందో చూద్దాం.

అంటే.. ఇంతలో అక్కడికి కర్పూరం పళ్ళెం లో పెట్టి తీసుకోనివస్తా డు.. అప్పుడు,


చలపతి.. వెంకటలచ్చిమి వైపు చూస్తా డు.. వెంకటలచ్చిమి.. కూడా చూస్తుంది..
అప్పుడు.. సరిగ్గా గంగిరెడ్డి ఆ కర్పూరం మీద వొట్టు ఏసేటప్పుడు.. వెంకటలచ్చిమి..
పూనకం వచ్చిందాని మాదిరి గా నటిస్తుంది.. అప్పుడు అందరూ.. వెంకటలచ్చిమి వైపు
చూస్తా రు.. వెంకటలచ్చిమి..వూగిపోతుండటం తో.. మునుసబు.. వెంకటలచ్చిమి ని
చూసి.. గంగిరెడ్డి తో..

మునుసబు

అయ్యా.. ఆ అమ్మోరే స్వయం గా వచ్చినట్టుంది.. 

అంటే గంగిరెడ్డి.. తన ఇంటి వైపు చూస్తా డు... ఇంతలో అక్కడ ఉన్న ఒక ఆడావిడ..
మునుసబు చేతిలో ఉన్న హారతి ని తీసుకెళ్ళి.. వెంకటలచ్చిమి కి చూపిస్తూ..

పెంచులమ్మా

అమ్మా! తల్లి.. నువ్వు ఎవరో.. నీకు ఏమి కావాలో


చెప్పు తల్లి..

వెంకటలచ్చిమి

పెంచులమ్మా..నేనే! పాలేటి ని.. 

అంటే.. అక్కడ ఉన్నవారు అందరూ.. వెంకటలచ్చిమి కి ముక్కుతారు.


గంగిరెడ్డి..గుడ్లు ఎల్లబెట్టి.. తన ఇంటివైపు.. వెంకటలచ్చిమి వైపు చూస్తా డు..

పెంచులమ్మా

అమ్మా! పాలేటమ్మ.. నువ్వు వస్తా వని అనుకోలేదు..


తల్లీ.. ఇప్పటి కైనా మా మీద కోపం తగ్గిందా తల్లీ?

about:blank 163/180
5/19/23, 4:13 PM

అంటే.. అప్పుడు

వెంకటలచ్చిమి

నేను ఎక్కడికి పోలేదే!.. ఇక్కడే ఉన్నాను..!

అంటే.. అప్పుడు.. అక్కడ ఉన్న ఆడంగులు.. చలపతి చేతిలో ఉన్న పళ్ళెం


తీసుకొని.. పసుప, కుంకుమలు తెచ్చి, వెంకటలచ్చిమి కి పూస్తా రు. అప్పుడు..
బ్రంహన్న వెంకటలచ్చిమి దగ్గరకి వచ్చి.. ముక్కొని..

బ్రంహన్న

అమ్మా!.. మేము ఇప్పటికే అర్ధం


సచ్చిపడున్నాము.. నువ్వు.. నిజం గా మా
పాలేటమ్మ వే నా తల్లి?

అంటే.. అప్పుడు గంగిరెడ్డి

గంగిరెడ్డి

పెద్దనాయనా.. అది మన పాలేటమ్మ కాదు..

అంటే.. అప్పుడు వెంకటలచ్చిమి, వొంటి కాలు మీద లేచి..

వెంకటలచ్చిమి

కాక.. ఈడిగిపల్లి.. చంగి అనుకున్నావ రా గంగిరెడ్డి?

అంటే.. అప్పుడు గంగిరెడ్డి కి అర్థం కాదు.. మొహం లో చమటలు


పడతాయి.. ఇంతలో అక్కడే ఉన్న బ్రంహన్నా ని చూసి

వెంకటలచ్చిమి

ఏమి బ్రంహన్నా.. నిరుడు.. ప్రసాదం అడిగితివే?


ఎట్టా ఉండాడు నీ మనవడు?..

అంటే.. గబుక్కున.. ఆమె కాళ్ళ మీద పడి..

బ్రంహన్న

వాడు నీ ప్రసాదం అమ్మా.. సల్లగా ఉండాడు తల్లి..


అమ్మా..

అంటే..

about:blank 164/180
5/19/23, 4:13 PM

వెంకటలచ్చిమి

మీరు సల్లగా నే ఉండారు రా! నన్నే.. 22 ఏండ్ల గా


పట్టిచ్చుకునే వాడు లేకపాయ కదా రా..

అంటే..

బ్రంహన్న

మా వళ్ళ తప్పు జరిగిపోయింది.. తల్లి.. సల్ల


మనస్సుతో.. క్షమించు.. నీకు ఏమి కావాలో చెప్పు
అమ్మా.. తీరుస్తా ము

అంటే

వెంకటలచ్చిమి

తీరుస్తా రా? మాట తప్పారు కదా?

అంటే

బ్రంహన్న

ఆరూ నూరైనా.. తీరుస్తా ము తల్లి..

అంటే..

వెంకటలచ్చిమి

నన్ను బొట్టు పేటి పిలిచి.. జాతర జరిపించండి రా!


జాతర.

అంటూ.. సోమ్మసిల్లిపోతుంది. అప్పుడు అయోమయం లో ఉన్న గంగిరెడ్డి.. దగ్గరకి


పెద్దలు వచ్చి.

కదిరెప్ప

అయ్యా.. వచ్చింది మన పాలేటంమ్మే.. అనుమానమే


లేదు.. అమ్మ అడుగుతా ఉంది.. జాతర జరిగి
తీరాల! 

అంటే.. అక్కడ ఉన్న వాళ్ళు.. అవును.. అవును.. అప్పుడు

బ్రంహన్న

about:blank 165/180
5/19/23, 4:13 PM

అవును గంగిరెడ్డి.. ఆ అమ్మోరే స్వయంగా వచ్చి అడిగి


నాక.. ఆలస్యం చేయటం నీకు మంచిది కాదు.. ఈ
ఊరికి మంచిది కాదు.

అంటే.. అప్పుడు చిన్నగా మునుసబు గంగిరెడ్డి దగ్గరకి వచ్చి.. చెవిలో

మునుసబు

అయ్యా.. దారం తెగే వరకూ లాగకండి.. వాళ్ళు


ఇప్పుడు వుడుకు మీద ఉండారు, ఇప్పుడు మీరు
కాదు.. కూడదు అన్నారంటే.. మిమ్మల్ని ఎలేసినా..
ఎలేయోచ్చు.. నా మాట విని.. కాదనకుండా..
జరిపిస్తా నని చెప్పండి.. తరవాత చూసుకుందాం..

అంటే.. గంగిరెడ్డి ఆలోచన లో ఉండటం తో, అప్పుడు మునుసబు..

మునుసబు

ఇదిగో.. బ్రంహన్నా.. అయ్యా గారు.. సమ్మతం


తెలిపినట్టే.. జాతర కి చాటింపు ఏపిచ్చండి.

అంటే, అప్పుడు.. అందరూ గంగిరెడ్డి వైపు చూస్తా రు. అప్పుడు గంగిరెడ్డి, బ్రంహన్న వైపు
చూసి.. కానివ్వమని చెయ్య చూపిస్తా డు.. అప్పుడు అక్కడ ఉన్న గ్రామా ప్రజలు..
చానా సంతోషం గా ఉంటారు, అందులో నుంచి ఇద్దరూ డప్పులోల్లు ఆనందం తో వచ్చి
పలకలు కొడతారు. అందరితో పాటు.. ఆనందం గా ఎగురుకుంటూ..
ఉరివాళ్ళు అని.. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు చలపతి.. చిన్నగా చేతిలో
వక్కలు ఆకు పట్టు కొని, గంగిరెడ్డి దగ్గరకు వచ్చి, బలవంతం గా గంగిరెడ్డి చెయ్యి ని
తీసుకొని, చేతిలో పెట్టి, మొహం లో మొహం పెట్టి, కంటిలో కన్ను పెట్టి చూస్తూ..
తనకు మాత్రమే ఇనిపిచ్చే టట్టు గా..

చలపతి

గంగిరెడ్డి.. నువ్వు అడక్కొచ్చిన నూకలు ఈ రోజుతో


ఆవిరి అయ్యిపాయ. ఇంకనైనా ఆ తల్లి ని, తన
బిడ్డలకి ఇచ్చేయి.. కాదు కూడదు అంటివా.. ఆ
అమోరు వుట్టి దిగి వచ్చే లోపు.. నీ పాణం
కొండేక్కుతుంది.. చూస్తుండు..

చలపతి తో పాటు.. అక్కడ మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు తన చేతిలో ఉన్న


తాంబూలం పక్కకు ఇసిరేస్తా డు.. కోపం తో రగిలిపోతున్న..

EXT. RANDOM VILLAGE ROADS - MORNING

about:blank 166/180
5/19/23, 4:13 PM

మొట్టమొదటి సారిగా, ఉరి పెద్దల సమక్షం లో దండోరా వెయ్యటం.. అప్పుడు

దండోరా వ్యక్తీ1

ఇందుములము గా.. యావద్మందికి..


తెలియచేయునది.. ఏందంటే.. మళ్ళి మన
ఊర్లల్లో.. పాలేతమ్మ జాతరఅందహో!

EXT. RANDOM VILLAGE ROADS - LATER

గంగిరెడ్డి.. ఆ పడిన తట్ట వైపే చూస్తుంటాడు అప్పుడు మునుసబు గంగిరెడ్డి దగ్గరకి


మునుసబు వచ్చి..

మునుసబు

అయ్యా..

అంటే.. మునుసబు వైపు చూసి..

గంగిరెడ్డి

వాడు చెప్పిందిదానికి.. నా పై పానాలు.. పైనే ఏగిరి


పొయ్యేంత పని ఆయ కదయ్యా..వీరబద్ర, ఏ జాతరైతే
జరగ కూడదు, జరగ కూడదు అని ఇన్ని ఏళ్ళు రాత్రి
పగలు.. కాపలా కాసానో, వీడు, ఒకే పూటకి.. నా
కలలు అన్ని బూడిదలో పోసేస కదా అయ్యా...
అవనూ.. వచ్చింది.. నిజం గా ఆ అమ్మోరే అంటావా
?

అంటే.. చిన్నగా ..అప్పుడు

మునుసబు

అయ్యా.. మీకి, ఆ చంగి కి ఉన్న సంబంధం,


మీకీ నాకు తప్ప మూడో కంటికి తెలిసే అవకాశమే
లేదు.. అందు చేత.. వచ్చింది కచ్చితం గా
అమ్మవారే! 

అంటే..

గంగిరెడ్డి

కొంప దీసి, మన ఇంటిలో నుంచి ఎల్లిపోయుంటుంది


అంటావా?

about:blank 167/180
5/19/23, 4:13 PM

అంటే..

మునుసబు

ఎప్పటి కైనా ఆ అమ్మవారు ఉండాల్సింది, ఆ గుడి లో


నే కదండయ్యా... అందుచేత..
ఎల్లిపోయుంటుందేమో అని నా అనుమానం అండి. 

అంటే.. అప్పుడు గంగిరెడ్డి.. మునుసబు ను చూసి..

గంగిరెడ్డి

శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ


ఎక్కడ చచ్చింది అన్నాడట.. నీ లాంటోడు..
ఉపాయం ఉంటే చెప్పా రా మగడా అంటే.. పుండు
మీద కారం చల్లు తావు ఎందుకయ్యా!

అంటే.. అప్పుడు

మునుసబు

అయ్యా! ఒకే ఒక ఉపాయం ఉంది..

అంటే..

గంగిరెడ్డి

ఏందో చెప్పి సావు.

మునుసబు

అయ్యా! ఇక్కడ ప్రాణ ప్రతిష్ట జరిగే లోపు.. మళ్ళి ఆ


అమ్మోరిని మీ నట్టింటిలో నిలబెట్ట గల శక్తి.. ఒక్క
సాములోరికి మాత్రమే ఉంది.

అంటే..

గంగిరెడ్డి

ఇన్నేళ్ళకి నీ మట్టి బుర్ర సమయానికి.. పని చేసింది రా


వీరబద్ర.. పద..

అని..లేచి.. అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లా డుకుంటున్నది గంగిరెడ్డి


మనవడు, వరదా రెడ్డి వింటూ ఉంటాడు.

about:blank 168/180
5/19/23, 4:13 PM

EXT. CHALAPATHI NEW HOUSE - LATER

చలపతి, వెంకటలచ్చిమి ని వెంటపెట్టు కొని.. తన ఇంటికి వస్తా డు, అక్కడ ఇద్దరి


కుటుంబీకులు ఉండటం, మునెమ్మ వెనక్కి వచ్చి ఉండటం. అక్కడ కాస్త పండగ
హడావిడి కనిపిస్తుంది. అప్పుడు ఇంటి లోగిల్లో నుంచి లోపలికి రాబోతుంటే.. మునెమ్మ
వాళ్ళ ని చూసి..

మునెమ్మ

వొరే! అక్కడే ఉండండి..

అంటూ.. ఇంటి లోకి వెళ్ళి, హారతి పళ్ళెం తీసుకోచి.. దిష్టి తీస్తుంది.. అప్పుడు..

మునెమ్మ

నా నాయనే.. నా యమ్మే.. ఎట్లా చిక్కిపోయినాడో


చూడు..

అంటూ.. చలపతి ని చూసి.. మునెమ్మ మురిసిపోతుంది.

మునెమ్మ

ముదనష్టపు దాన్ని.. ఈ బంగారటా మనవడినా..


నేను వదిలేసి పోయింది..?

అంటే, అప్పడు, చలపతి లక్ష్మీపతి వైపు చూస్తా డు. లక్ష్మీపతి కూడా.. అవును అని తల
వూపుతాడు. అప్పుడు..

చలపతి

అబ్బా.. కాళ్ళు పీకుతున్నాయే.. తల్లి..

అంటే.. అక్కడ ఉన్న వాళ్ళు పక్కున నవ్వుకుంటారు..

మునెమ్మ

అయ్యో! నా మతి మండా!..వాకిట్లో నే నిలబెట్టి


అడిగేస్తు నాను.. పదండి రా లోపలికి! 

అని లోపలికి వచ్చి అరుగు మీద కూర్చుంటాడు, వెంకటలచ్చిమి, వాళ్ళ అమ్మ వెనకాల
వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు రాఘవయ్య.

రాగావయ్య

about:blank 169/180
5/19/23, 4:13 PM

ఏమైనా గాని అత్తా !.. మన చలపతి బలే దెబ్బ


కొట్టినాడు.. తాడి ని తన్నేవాడుంటే వాడి తల తన్నే
వాడు ఉంటాడని.. ఊరికే అన్నారా ఏంది? 

అంటే.. మునెమ్మ

మునెమ్మ

మరే!.. తిక్క కుదిరింది.. దొంగ సచ్చినోడికి

వెంకటలచ్చిమి చలపతి వైపు చూస్తూ ఉంటుంది..

చలపతి

ఆ గానకార్యం.. నాది కాదే, వెంకటలచ్చిమి ది..


అబ్బబ్బా.. నటనలో.. సావిత్రిమ్మ ని మించిపోయింది
అనుకో.

అని.. చివ్వర గా తను కూడా వెంకటలచ్చిమి వైపు చూస్తా డు

EXT. FOREST - AGHORA PLACE - EVENING

ఏ అగోరా ఐతే, గంగిరెడ్డి కి సహాయం చేసాడో, అదే అగోరా దగ్గరకి వెళ్ళి


కూర్చొనిఉంటాడు, అక్కడ ఆ అగోరా చిన్నపాటి హోమం ముందు కూర్చొని.. మంత్రాలు
చదువుతూ, తమలపాకు మీద, నల్లటి అంజనం పూసి, అందులో నుంచి
చూస్తా డు. అప్పుడు, ఆ ఆత్రు త తట్టు కోలేక

మునుసబు

సాములోరు.. అమ్మోరు ఎల్లిపోయినత్తేనా

అంటే, గంగిరెడ్డి, మునుసబును ఉరిమి చూస్తా డు, అప్పడు

అగోరా

హ్మ్!

అని, వాళ్ళ వైపు చూసి.. మళ్ళి ఆ ఆకు ని చూస్తా డు, ఆ ఆకు కాలిపోతుంది,
అప్పుడు అది చూసి వాళ్ళు బిక్కమొహం వేస్తా రు

అగోరా

గంగిరెడ్డి.. అమ్మోరు.. నీ ఇంట్లోనే ఉంది. 

about:blank 170/180
5/19/23, 4:13 PM

అంటే, అప్పుడు వాళ్ళు ఊపిరి పిల్చుకుంటారు, అప్పుడు

గంగిరెడ్డి

ఎంతటి చల్లని మాట చెప్పినారు సామి..

అంటే, గంగిరెడ్డి వైపు చూసి

అగోరా

ఇల్లు అలకంగాల్నే పండగ అయిపోదు రెడ్డి.. నీ


ఏమరపాటు వల్ల.. ఆ అమ్మోరి పతకం
పలిన్చినట్టుంది. ఆమె అనుకునిన్దే జరిగి.. ఆ
అష్టదిక్బంధన నుంచి.. విడుదలై, నీ గడప దాటి
వచ్చిందో.. నువ్వు నిలువునా బూడిదే!.

అంటే.. బిత్తరపోతాడు గంగిరెడ్డి అప్పుడు.. అగోరా కళ్ళు పట్టు కొని..

గంగిరెడ్డి

మీరే నాకు దిక్కు దేవరా! ఎట్లైనా చేసి.. ఆ


అమ్మోరు ని శాశ్వతం గా నా ఇంట్లోనే ఉండేటట్టు
ఉపాయం ఏదైనా చెప్పండి. స్వామి

అంటే, అప్పుడు తల ఊపుతూ..

అగోరా

అది నువ్వు అనుకుంటున్నంత సులువు కాదు రెడ్డి..

అంటే.. అప్పుడు

గంగిరెడ్డి

మీరే అట్లా అంటే ఎట్లా చెప్పండి.. మీరు సాక్షాత్తు ఆ


పరమశివున్నే మెప్పించినోడు అంటారే.. మీ కాని పని
ఏమన్నా ఉందా సామి?.

అని అంటే, దానికి సంతసించిన అగోరా

అగోరా

కష్టమన్నానే కాని..ఆసాధ్యము అనలేదు.. ఆలే. ఒకే


ఒక ఉపాయం ఉంది. మహా దిక్బంధనం. కాశ్మీరం
నుంచి నా శిష్య ఘన్నాన్ని రప్పించి, అకండ మంత్ర

about:blank 171/180
5/19/23, 4:13 PM

జపాల మధ్య, ఆ పాలేటి గంగ ని.. పట్టి, శాశ్వతం


గా నీ నట్టింట కోర్చోపెదతా.. 

అంటే

గంగిరెడ్డి

ఆ అమ్మయ్యా! ఇప్పుడు నా గుండె సల్లబడింది


సామి. మీరు ఇచ్చిన ఈ దైర్నానికి, ఎవ్వడు ఎదురు
వచ్చినా. బూమిలో కలిపేస్తా .

అని ఆ అగోరా కి ముక్కి.. అక్కడ నుంచి వచ్చేస్తా డు

EXT. REDDY HOUSE - NIGHT

గంగిరెడ్డి, బాగా తాగి, మోసం చేసారు అన్న కోపం లో అగ్గి మీద ఉన్న గుగ్గిలం లా
ఎగిసిపడుతూఇంటాడు

గంగిరెడ్డి

22 ఏళ్ళు, ఏక చక్రదిపత్యం చేసిన ఈ గంగిరెడ్డి.. ని


ఉరి జనాలముందు గంగిరెద్దు ను ని చేసి ఆడుకున్నాడు
కదా రా!

తన చేతిలో ఉన్న ముంత ని కోపం తో కిందకేసి కొడతాడు, అప్పుడు అక్కడ ఉన్న


మునుసబు.. అక్కడ పక్కనే మండుతున్న మంటల మధ్య.. ఎరుపు రంగులో..
రౌద్రు డు అయిన గంగిరెడ్డి ని చూసి చానా ఏళ్ళు అవ్వటం తో.. బయమేసుంది...

గంగిరెడ్డి

ఏ జాతరైతే జరగడు అని దీమా లో ఉన్నా నో, అదే


జాతర కి వీడు, ఒకే పూటకి.. నా చేతే చాటింపు
ఏయించినాడు కదా రా వీరబద్ర..!

అంటే.. అప్పుడు.. చిన్న గా నడుచుకుంటూ వచ్చి..

మునుసబు

అయ్యా! మీరు కోపపడను అంటే.. జాతర తప్పించే


దానికి నా దగ్గర ఒక దిక్కుమాలిన సలహా ఉంది..
ఇవ్వమంటారా

అంటే.. గంగిరెడ్డి తన వైపు చూస్తా డు.. అప్పుడు

about:blank 172/180
5/19/23, 4:13 PM

మునుసబు

తాళిబొట్టు లేకపోయినా పెళ్లి జరగోచ్చేమో కాని,


పూజారి లేకుండా మన ఊరి పాలేటమ్మ జాతర జరిగే
ప్రసక్తే లేదు. అందుచేత.. ఆ పాలేటి గాని కుటుంభం
లో చిట్టా చివర మొగోడు ఈ చలపతి గాడే.. వాడే
రానప్పుడు.. ఆ అమ్మోరు.. మీ నట్టింటి గడప దాటి
రావటం అసాధ్యం.

అంటే.. అప్పుడు

గంగిరెడ్డి

చిన్నబ్బ! అర్థమైన్డా దా?

అంటే..

చిన్నబ్బ

వాని జోరుకి, మన వోళ్ళు సల్ల బడిపోయినారు సామి,


చిత్తు రోళ్ళు ఐతే నా

అంటే

గంగిరెడ్డి

ఎవడై నా సరే.. కర్చు ఎంతైనా సరే.. రేపు ఈ


యాలకి వాడు అమ్మోరి లెక్కలో కలిసిపోవాల!

చిన్నబ్బ

మీరే చూస్తా రు కదా.. ఆ నా కొడుకు.. గంగలో


కలిసినట్టే.

అంటే.. అప్పడు అక్కడ నుంచి చిన్నబ్బ వెళ్ళిపోతాడు.

గంగిరెడ్డి

మునుసబు.. పొయ్యి.. మంచి దుడమట్టం గా


ఉండే యాటని చూడు.. రేపు ఆమ్మోరు కి బలి
ఇయ్యాల.

INT/EXT. MULTIPLE LOCATIONS - DAY/NIGHT

about:blank 173/180
5/19/23, 4:13 PM

MONTAGES: మరుసటి రోజు, కొన్ని ఏళ్ళు గా మూత పడిన పాలేటి అమ్మవారి గుడి
తలుపులు తెరవటం.

గంగిరెడ్డి ఇంటి ముందు, తోరణాలు కట్టటం, అది చూసి.. తాగుతున్న కాపి గ్లా సు
కోపం తో కింద కి ఇస్సిరి కొట్టం. ఊర్లల్లో.. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గు లతో,
ఇంటి.. ఇంటికి తోరణాలతో అలంకరించి.. ఊరంతా పండగ వాతావరణం గా ఉండటం,
ఇండ్లల్లో, పిండి వంటలు, పిల్లల సందడి

కదిరెప్ప, కళ్ళు కుండ కి పసుపూ కుంకుమ బొట్లు పెట్టి, దానికి పూజ చెయ్యటం.

అక్కడ అక్కడ ఊర్లల్లో, చెట్లకింద, రాతి అమ్మవార్లకు పూజ చేయటం.

చలపతి ఇంట్లో, మునెమ్మ చలపతి, తను విప్పేసిన విప్పేసిన బలంతాడు కట్టటం, కాలి గా


ఉన్న దేవుడి గూడు, మళ్ళి దేవుళ్ళు తో నిండి ఉండటం. అక్కడ పాలేటి, వాళ్ళ అమ్మ
ఫోటో లకి కూడా దండలు వేసి ఉండటం.

ఉరి ముత్తైదువులు రావటం, వాళ్ళు చలపతి ని మంగళ స్నానం కి తీసుకెళ్లటం..


అప్పుడు, మునెమ్మ

మునెమ్మ

ఆగ రా!

అంటే, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మునెమ్మ వైపు చూస్తా రు..అప్పుడు తన అడ్డు
తప్పుకుంటుంది, తన వెనకాల నుంచి వెంకటలచ్చిమి కూడా తెల్ల బట్టల లో ఉంటుంది.
వెంకటలచ్చిమి లక్ష్మీపతి వైపు చూస్తుంది, తను వెళ్ళమని సైగ చేస్తా డు.

వాళ్ళ ని ఆ అమ్మ వారి గుడి ఎదురుగ్గా కూర్చోపెట్టి, ముత్తైదువులు మంగళ స్నానం


చేయిస్తా రు. ఆ తరవాత వాళ్ళు అమ్మవారి ని ముక్కి, హారతి ని తీసుకునే టప్పుడు,
చలపతి, వెంకటలచ్చిమి కి కుంకుమ దిద్దు తాడు, (తాళి మేడలో పడుతుంది) అది చూసి
లక్ష్మీపతి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, తువాలు తో తుడుచుకుంటాడు. ఆ రవాత..
వెంకటలచ్చిమి, తన కి కంకణం కడుతుంది.

7. గుడి కాస్తా బాగా అలంకరించి, సున్నం ఎర్రమన్ను పటిలు పూసి, తోరణాలు,


టెంకాయ పట్టా ల పందిల్లతో .. కళకళ లాడుతూ ఉంటుంది, అక్కడ ఎనుపోతు కి పూజ
చేయటం.

INT. REDDY HOUSE - HALL - NIGHT

50 మంది అగోరాలు.. గంగిరెడ్డి ఇంటిలో కి రావటం, ప్రధాన అగోరా ని చూసి,


గంగిరెడ్డి వంగి నమస్కరించటం, తను అసిర్వధం ఇచ్చి లోనికి వెళ్ళిపోవటం.

about:blank 174/180
5/19/23, 4:13 PM

ప్రధాన అగోరా, కూర్చొని ఉండటం, శిషులు ముగ్గులు వేయం

ఇద్దరూ, అమ్మవారి విగ్రహానీ తీసుకొచ్చి ఆ ముగ్గులో పెట్టటం

అందరూ.. మంత్రాలు చదవటం.. ప్రధాన అగోరా.. ఆవాహనం మంత్రాలు చదవటం..


ఇంతలో ఆ ఇంట్లో ఆ ముగ్గు కాస్త అష్ట బంధనం లా పైకి ఎగసి పడటం.

EXT. NELLIMANDA TEMPLE - LATER

గుడి దగ్గర పని చేసుకుంటున్న వెంకటలచ్చిమి ని చిన్నబ్బ మనిషి, పట్టు కొని, లక్కెల్తా డు,
అది అద్దం లో నుంచి చుసిన చలపతి, వెంకటలచ్చిమి ని కాపాడటానికి వస్తు న్న చలపతి కి
చిన్నబ్బ, అతని అనుచరులు ఎదురు వస్తా రు: Lead to fight.

ఈ సారి అందరూ చేరి కొట్టటం తో, చలపతి కి బాగా దెబ్బలు తగులుతాయి,


చివ్వరకు.. చిన్నబ్బ చలపతి ని పొడుస్తా డు, చలపతి.. అక్కడే పడిపోతాడు, స్పృహ
కోల్పోయిన చలపతి ని చూసి వెంకటలచ్చిమి బోరున ఏడుస్తుంది, అటు గా ఉన్న కత్తి
తీసుకొని తనని పట్టు కున్న వాడిని, కొస్తుంది, అప్పుడు చిన్నాబ్బ వెంకటలచ్చిమి ని
కొడతాడు, అప్పుడు వెంకటలచ్చిమి చిన్నబ్బ వెంకకాల చూసి ఆనంద పడుతుంది, ఏమిటా
అని వెనక్కి చూస్తా డు, అది చలపతి చిన్నగా లేస్తా డు, తనని తీసుకొని పొమ్మని సైగ
చేసి, చలపతి వైపు వస్తా డు.. అప్పుడు గుడిలో ఉన్న పసుపూ ని పిడికిలి లో తీసుకొని,
ఆ పుండు కి పట్టించి.. దానికి గుడ్డ బిగించి..

చలపతి

రా నా కోడ కా.. రా 

అంటూ.. పరుగేతుకుంటూ.. వెళ్ళి, ఎగిరి, చిన్నబ్బ వేనల దుంకి.. తిరిగి, తన తల


పట్టు కొని.. అమ్మవారి కి కోడిని బలి ఇచ్చినట్టు , బలి ఇస్తా డు.

EXT. REDDY HOUSE - NIGHT

22 ఏళ్ళ తరవాత జాతర ఆయే, గంగిరెడ్డి ఇంటి ముందు, జన ప్రవాహమే


అనుకోవచ్చు.. ఏక్కడ చూసినా జనాలే, పిల్లా .. పీసు, ఆడ, మగ, ముసలి ముతికి
అని తేడా లేకుండా గంగిరెడ్డి ఇంటికి వస్తా రు.

Fast cuts: లో అమ్మవారిని బయటకి తీయటం, అలంకరించి ఉంటారు.

INT. REDDY HOUSE - LATER

అగోర, అతని శిషులు.. అమ్మవారిని నట్టింట నిలబెట్టి, మహా బంధనం, ముద్రలు


వేసి.. ఆ ముగ్గులో నిలబెట్టిన అమ్మవారి బొమ్మ చుట్టూ మళ్ళి చక్రం ఏర్పడుతుంది..

about:blank 175/180
5/19/23, 4:13 PM

అక్కడ ఉన్నవారు, హోమాలు, జపాలు చేస్తూ ఉంటారు. ఆ ఇంటి చుట్టూ అదృశ్య


వలయం ఏర్పడుతుంది.

EXT. REDDY HOUSE - LATER

బయట ఉరి జనాలు, గంగిరెడ్డి చలపతి రాక కోసం ఎదురు చూస్తుంటారు, ఎంత సేపటికి
రాకపొయ్యే సరికి అప్పుడు గంగిరెడ్డి అందరిని ఉద్దేసించి.

గంగిరెడ్డి

పెద్దనాయనా, మీ అందరి మాట మీద.. ఇంత సేపు


చలపతి కోసం ఎదురు చూస్తిమి, ఇప్పుడు నేను చెప్తా ను

అంటే, అక్కడ ఉన్న బ్రంహన్న..

బ్రంహన్న

ఇంకొంత 

అనే లోపే, అతన్ని ఆగమని చెయ్యి చూపిచి

గంగిరెడ్డి

చలపతి గాడు రాడు, ఆ అమ్మోరు ని కాదని, జాతర


జరిపిస్తు న్నదుకు, వాళ్ళ నాయన మాదిరే, వీడు కూడా
ఏ బయి లో నో సచ్చి పడి ఉంటాడు.. చూడు
బొండి.

అంటే, అప్పుడు అందరు.. ఒకరి మొహాలు వొకరు చూస్తా రు.. అప్పుడు

బ్రంహన్న

అంత కచ్చితం గా ఎట్టా చెప్తు న్నావు అంటే..

అప్పుడు

గంగిరెడ్డి

రేయ్, దాన్ని లాక్కొని రాండిరా

అంటే, అటు గా వెంకటలచ్చిమి ని లాక్కుంటూ వస్తా రు, అప్పుడు ఉరి జనాలు చెవులు
కోరుక్కుంటారు.

గంగిరెడ్డి

about:blank 176/180
5/19/23, 4:13 PM

ఇదిగో నాటకాల గంగమ్మ.. దీన్నే అడగండి..రా ఈ


అమ్మోరు పూనినట్టు .. ఇది ఆ చలపతి గాడు
కలిసి నాటకాలు ఆడి మన కంట్లో మట్టి కొట్టా రు.
సమయానికి ఆ ఈభుది బాబా వచ్చి శాంతి
చేస్తా వుండాడు కాబట్టి, సారిపాయ, ;లేకపోతే ఎంత
అనర్థం జరిగాతావుండే. 

అంటే.. ఇంతలో, వెంకటలచ్చిమి లేచి..

వెంకటలచ్చిమి

నాలుక ఎట్లా తిరిగితే.. అట్లా


మాట్లా డుతాఉండావు.. నువ్వు వొక మనిషివే
నా.. కాసిన్ని కన్నీళ్ళు కారిస్తే, కంకర రాయి
అట్టాంటిది కరిగిపోతుందే, ఇంతమంది కన్నీళ్ళు
రాలుస్తు న్నా.. నువ్వు మాత్రం కరగవు కదా? నీ
చుట్టు పక్కల ఊర్లకి ఊర్లు స్మసానాలు అవుతున్నా, నీకు
అనవసరం, నీ ఇల్లు మాత్రం సల్లగా ఉంటే సాలు..
నువ్వేమి యజమానివి రా?  

అని, గంగిరెడ్డి మీద గాండ్రించి ఉమ్మేస్తుంది... అప్పుడు, గంగిరెడ్డి కొట్టటానికి ముదుకు


వస్తే..

వెంకటలచ్చిమి

ఏమన్నావు.. రాడు అంటివి కదా?

అంటే.. ఇంతలో అక్కడికి గజ్జల శబ్దం వినిపిస్తుంది, అప్పుడు గంగిరెడ్డి, గేటు వైపు
చూస్తా డు, అక్కడ అకండ జ్యోతి ని పట్టికొని, ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో తల ని
పట్టు కొని నిలబడతాడు చలపతి. అప్పుడు గంగిరెడ్డి ని చూసి.. తన చేతిలో ఉన్న తలని
ఇసిరేస్తా డు.. అది దొర్లు కుంటూ.. దొర్లు కుంటూ వచ్చి గంగోరెడ్డి కాళ్ళ మీద పడుతుంది,
అది చూసి బయం తో ఎగిరి పడతాడు గంగోరెడ్డి. దాన్నే చూస్తూ.. చిన్న గా నవ్వటం
మొదలు పెట్టి.. చివ్వరకు పెద్దగా నవ్వుతాడు. గగ్నిరెడ్డి ఎందుకు నవ్వుతున్నాడో తెలియక
ఆశ్చర్యపోతారు.. చిన్నగా నావు ఆపుకొని..

గంగిరెడ్డి

ఈడి తల తెస్తే.. బయపడి. నా ఇంట్లో ఉండే


అమ్మోరుని ఇడిచి పెడతా అనుకుంటివేమొ?.. ఈడు
నా ఆతు తో సమానం..

అంటే, అది విన్న ఉరి జనాలు అవాక్కు అవుతారు. అప్పుడు వోకొక్క అడుగు వొక్కొక
నిజానికి వేసుకుంటూ.. వస్తా డు చలపతి.

about:blank 177/180
5/19/23, 4:13 PM

గంగిరెడ్డి

ఈ జనాల ను వుద్దరిద్డా మనుకున్తివేమో. ఈళ్ళు గోర్లు


రా, ఈల్లకి మంచి కి, చడ్డ తేడా
తెలియ్యాదు..  అట్టాంటి నా కొడుకుల కోసమా
ఇప్పుడు నువ్వు ఈ పూజకి పూనుకునింది? చూడు..
నీకు కావాలంటే గొల్లపల్లి.. గొల్లపల్లంతా నికే రాసిస్తా ,
ఆ జోతి ని ఆర్పేసి.. వచ్చి నా కాళ్ళు పట్టు కో..
వదిలేస్తా . 

అంటే, అడుగులు ఇంకో అడుగు వేస్తా డు.

గంగిరెడ్డి

రేయ్, నీకు నా గురించి తెలియదు, నన్ను


రెచ్చకొట్టొద్దు చలపతి; నా తో సమానం గా
కుసున్నందుకే.. ఆ ఈడిగిపల్లి వెంకటసుబ్బా గాడి
కుటుంభం మొర్తన్ని నెల మట్టం చేసినోడిని.. నిన్ను
ఏమి చెయ్యగలనో ఆలోచించు.  

అంటే..

చలపతి

ఆ అమ్మోరు తప్ప.. నాకు ఏ ఆలోచనా లేదు రెడ్డి

అంటే..

గంగిరెడ్డి

ఏంది.. నన్ను దాటుకొని నా ఇంట్లో ఉండే అమ్మోరు


ని పిలుచుకొని పోతావా? పిల రా నీ అమ్మోరు ని,
పిలూ 

అంటే.. అప్పుడు తన తల మీద ఉండే జ్యోతి ని కింద పెట్టి, తన చేతిలో ఉండే కత్తి
కింద పెట్టి, ధర్మ దండం పట్టు కొని, తమలపాకులు తీసుకనే లోపు.. గంగిరెడ్డి వచ్చి తనకి
పొడిచిన చోటే.. ఇంకొకసారి పొడుస్తా డు.. ఆ గడ్డ పార లాగినప్పుడు తన రక్తం
అమ్మవారి కాళ్ళమీద పడుతుంది,అప్పుడు తన చేతిలో రక్తం తో తడిసిన తమలపాకులు,
రెడ్డి ఇంటి గడప మీద పడుతాయి. అంతా ముగిసిపోయింది అనుకున్న గంగిరెడ్డి..

గంగిరెడ్డి

చిలక్కి చెప్పినట్టు చెప్తే కూడా ఇనలా.. ఈడి అమ్మ


బాబులు సచ్చిన్నట్టె.. ఈడు కూడా నా చేతుల్లోనే

about:blank 178/180
5/19/23, 4:13 PM

పాణం పోగొట్టు కుంటావుండాడు.

అని జనాల ని చూసి.

గంగిరెడ్డి

రేయ్.. వాణ్ణి, నా ఇంటికి బలి ఇస్తా ను గాని.


జాతరా లేదు.. గీతరా లేది.. పొండి

అంటే, అప్పడు, గాలికి ఆ తమల పాకులు గడపదాటి ఇంటిలోకి పడతాయి. అది చుసిన
కోన ఊపిరితో ఉన్న చలపతి, చిన్నగా లేచి, వొంటి మోకాలు మీద నిలబడి.. చెయ్యి
చాచి.

చలపతి

అమ్మా రా!

అని గట్టిగా అరుస్తా డు. అప్పుడు ప్రచండ ద్రావాలనోజ్వలిత, ఘబీర.. మహా రౌద్రు రాలు
అయిన ఆ అమ్మవారు, వొక్కసారిగా ఊపిరి పిల్చుకున్నట్టు అయ్యి.. ఆ ఇంటి లో ఒక
అనువాయుధం పేలినట్టు కాంతులు, వెదజల్లు తూ.. వొక్కసారిగా పేలినట్టు అవుతుంది,
లోక ఉన్న అగోరాలు, కాలి బుదిడై .. ఎక్కడ చూసినా వాళ్ళ కళేబరాలు.. పుర్రెలు
అంతా నిశబ్ధం. వొక్కసారిగా ఆ పుర్రెల నుంచి లేచి కూర్చుంటాడు చలపతి. చలపతి
చూడటానికి, అపర కాలి అవతారామే దిగివచ్చినట్టు ఉంది.. బీకర, బయకార రూపమది.
జనాలు బక్తి బావనలో నమస్కరిస్తా రు.. ఆ అమ్మవారు బయటకి వచ్చింది అన్న ఆనందం,
తనని బంధించాడు అన్న కోపం రెండిటి ని ప్రదర్శిస్తూ.. ఉగ్ర రూపం ఏసుకొని, నాట్యం
ఎసుకుంటూ.. తన చేతి లో కత్తి పట్టు కొని, ఎగిరి వొకే ఎటుకు గంగిరెడ్డి తలని నరికి ఆ
రక్తా న్ని ఆ పుర్రెల మీద కుర్చీని తాగుతుంది. అది చూసి ప్రజలు “కోబలి” ని అరుస్తా డు,
ఉరుములతో కూడిన వర్షం వస్తుంది. ఆమె శాంతిస్తుంది. అప్పుడు.. చిన్న గా ఆ గుంపు
లో నుంచి వరదారెడ్డి వచ్చి, ఆ అమ్మవారికి ముక్కి, తన చెయ్యి పట్టు కొని,
పిలుచుకేల్తా డు, అలా నడిచి వెళ్తు న్న అమ్మవారిని చూసి.. తాళ మే ళా లతో.. ఆ
అమ్మవారిని ఊరేగింపు గా తీసుకెళ్ళి గిడిలో వల్దిలేస్తా డు వరదారెడ్డి

EXT. NELLIMANDA TEMPLE - NIGHT

ఆ గుడిలో అమ్మవారు, ప్రజల  కోరికలు వింటూ.. వింటూ.. చలపతి శరీరం నుంచి


వెళ్ళిపోతుంది.. చలపతి అక్కడే పడిపోతాడు..

about:blank 179/180
5/19/23, 4:13 PM

Created using
Studiovity

about:blank 180/180

You might also like