1 Ex Armed Forces Invitation 1

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

గౌరవనీయులైన కలెక్టర్ గారికి

ఒంగోలు,

ప్రకాశం జిల్లా .

విషయం:- జీవో నెంబర్ 67 68 ని రద్దు చేసి నూతన డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయాలి.

అయ్యా!

*అభ్యర్ధు లకు నిరాశ

పోస్టు లు తక్కువ... పోటీ ఎక్కువ

*502 ఖాళీలపై ఆగ్రహం

*మూడేళ్లు గా కానరాని ఉపాధ్యాయ నియామకాలు

*లక్షలాది మంది నిరుద్యోగులు లబోదిబో

> వయోపరిమితి పెంపుపై జగన్ సర్కారు నిర్లక్ష్యం

> ఉద్యమానికి అభ్యర్థు లు సన్నద్ధం

సీఎం జగన్ ప్రభుత్వం జంబో డీఎస్సీ ఇస్తుందంటూ మూడేళ్లగా ఎదురు చూస్తు న్న అభ్యర్థు లకు నిరాశే మిగిలింది. మూడేళ్ల తర్వాత

అత్తెసరుగా పరిమితి డీఎస్సీ పేరుతో, 502 ఉపాధ్యాయ పోస్టు లతోనే ప్రకటన జారీజేసి చేతులు దులుపుకుంది. అసలు ఇవి బ్యాక్ లాగ్

పోస్టు లా?, జనరల్ డీఎస్సీనా? అనేదీ విద్యాశాఖ ప్రకటనలో స్పష్టం చేయలేదు. కేవలం పరిమిత డీఎస్సీ పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.

అతి తక్కువగా ఉన్న పోస్టు లను చూసి, నిరుద్యోగులు లబోదిబో మంటున్నారు. గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1,2 ఉద్యోగాల ప్రకటనలోనూ

మొక్కుబడిగా ప్రభుత్వం ప్రకటించి, అభాసుపాలైంది. మూడేళ్ల నుంచి డీఎస్సీ లేనందున జనరల్ అభ్యర్థు ల వయోపరిమితిని 44 ఏళ్లకు

ప్రభుత్వం నిర్ధా రించడం వల్ల దాదాపు లక్షా 50 వేలకు పైగా అభ్యర్థు లు అనర్హులుగా మారనున్నారు. ఇటీవల జరిగిన టెట్ పరీక్షకు 5.50
లక్షల మంది హాజరయ్యారు. ఇందులో టెట్ ఉత్తీర్ణులు, నూతనంగా రాసిన వారూ ఉన్నారు. గతంలో దాదాపు లక్షా 50 వేల మంది

ఉత్తీర్ణత సాధించారు. డీఎస్సీ పోస్టు ల కోసం మొత్తంగా 7 లక్షలకు పైగా అర్హతగల వారున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 502 పోస్టు లలో

ఒక్కొక్క పోస్టు కు వేలాది మంది పోటీపడే పరిస్థితులున్నాయి. పోస్టు లు తక్కువ... పోటీ ఎక్కువగా మారడంతో చాలా మంది అసలు

దరఖాస్తు చేయడమే వృధా అనే భావనతో ఉన్నారు.

కావున వెంటనే ఈ జీవో నెంబర్ 67 68 ని రద్దు చేసి నూతన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏబీవీపీ ఒంగోలు శాఖ

కోరుతోంది

సదా భరత మాత సేవలో,

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్,

ఒంగోలు శాఖ,

ప్రకాశం జిల్లా .

You might also like