Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

*అద్దా లమండపం*

ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో, ఎతైన అధిష్టా నంమీద నిర్మింపబడి ఉన్న దీన్నే అద్దా లమండపమని
అయినామహల్ అని అంటారు. 43'×43' కొలతలున్న ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ
అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తు లకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. ఈ అరల
ప్రాంతాన్నే *ప్రసాదం పట్టెడ* అంటారు.
తులాభారం :-
శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తు లు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం,
కలకండ, కర్పూరం రూపేణ గాని తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తా రు.
రంగనాయక మండపం :-
కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప
శిల్ప శోభితమై విరాజిల్లు తూ ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తు లు కొంతకాలం
పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తు న్నారు. ఒకప్పుడు
నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తు తం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు
జరుగుతున్నాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే
వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తా రు.
తిరుమలరాయమండపం:-
రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాలు, తిరుమలేశుడు భక్తు లపై చూపుతున్న తరగని
ఉదారత్వానికి మచ్చుతునక ఈ తిరుమలరాయ మండపం.
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించాడు (సాళ్వ నరసింహ మండపం). శ్రీస్వామి
వారికి *"అన్నా ఊయల తిరునాళ్ళ"* అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం క్రీ.శ. 1473 లో ఈ మండపం నిర్మించాడు. ఆ
తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.
అణ్ణై అనగా తమిళంలో *హంస*.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి
వేంచేసి పూజలందుకుంటారు.
*రాజ తోడరమల్లు :-
ధ్వజస్తంభం మండపానికి 10 అడుగుల దూరంలో స్వామి వారికి నమస్కరిస్తు న్నట్లు 3 విగ్రహాలు ఉంటాయి. సహజంగా
కళ్యాణం ముగించుకున్న భక్తు లు సాధారణ భక్తు లతో కలిసే మార్గంలో ఉంటాయి.
అవి రాజా తోడరమల్లు , అతని తల్లి మోహనాదేవి, అతని భార్య పితాబీబీ విగ్రహాలు. ఈయన అనేక సంవత్సరాలు తిరుమలను
దుండగుల బారినుండి రక్షించారు.
*ధ్వజస్తంభ మండపం :-
ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా
బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తా రు. దీన్నే ధ్వజారోహణం అంటారు.
ధ్వజస్తంభం:-*
వెండివాకిలి ఎదురుగా సుమారు15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంవలెనున్న ఎతైన దారుస్తంభం
నాటబడింది. అదే ధ్వజస్తంభం.

You might also like