Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 133

కృష్ణ సత్యపదీయము - పద్య కవితా సంపుటి

రచన: మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ


కృష్ణ సత్యపదీయము - పద్య కవితా సంపుటి

అంశం: తెలుగు పద్య కవిత్వము

రచన: మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ

ప్రచురణ: 15-01-2020(పౌష్య బహుళ పంచమి, వికారినామ సంవత్సరము)

ప్రతులు:1000

వెల:29 రూ.లు

హక్కులు: సర్వ స్వామ్యములు రచయితవే

ప్రతులకు:

రచయిత

16-31-63/7, బాలాజీనగరు,

11 వ లైను, పాతగుంటూరు

గుంటూరు-522 001

ఆంధ్రప్రదేశ్

గతిశీల: 8121499695
మున్నుడి

నన్ను అనుక్షణం ప్రో త్సహించుచు, నా వెన్నుఁ దట్టి పద్యరచన యందు


అనేక విషయ ములు ఉపదేశించి, రచనకు కావలసిన ధైర్యమును నింపుచూ,
ముందుకు నడిపించుచున్న మద్గు రు వరేణ్యులు, అనంతచ్ఛందం వాట్సాప్
సమూహ వ్యవస్థా పక నిర్వాహకులు, సాహితీ బంధు, బ్రహ్మశ్రీ తోపెల్ల బాల
సుబ్రహ్మణ్య శర్మ గారికి వేవేల కృతజ్ఞతాపూర్వక నమస్సులు.

నేను ఆకాశవాణి యందు, మరియు వివిధ మాధ్యమములందు


పూరించిన సమస్యా పూరణములను; నేను నిత్యము వ్రా సుకొన్నట్టి అనేక
విధముల పద్యములను ముద్రింపమని అమూల్యమైన సలహానిచ్చి, ఈ
ఖండిక రూపు దిద్దు కొనుటకు అనేక విధముల సహకరించిన కవి వరేణ్యులు,
ఉభయభాషా కోవిదులు, విశ్రాంతాంధ్రోపన్యాసకులు బ్రహ్మశ్రీ డా.రామడుగు

వేంకటేశ్వర శర్మ గారికి హృదయ పూర్వక వేవేల కృతజ్ఞతాభి వందనములు .

.....రచయిత
కవన మంత్రాల కోవెల!

ది.20-11-2019

డా. రామడుగు వేంకటేశ్శవర శర్మ

విశ్రాంతాంధ్రోపన్యాసకులు, గుంటూరు

సెల్: 9866944287

ఉ. మానవ జీవితమ్మును సమాజముతోడ సమన్వయించి, అ

మ్లాన శిరీష కోమల సమంచిత శైలిని – పల్కుబళ్ళతో

జాను తెనుంగు పద్యములు సంస్మరియించెడి రీతిసాగి – లో

కానికి కన్నువిప్పు నిడగల్గినచో నది కైత గాదొకో?

తే.గీ. పాట అన్నది పక్షియై వాలెనేని

వన్నెలొలుకుచో జింకయై వచన కవిత

భద్రగజమౌచు పద్యంబు వరలు గాదె!

భవ్యనవ్యాంధ్ర సాహిత్య వనములోన


అట్టి అక్షరాలు గలట్టి గట్టివాడు

ధన్యకవి “మంత్రవాది” – వేదాంత వేది||

తే.గీ. మంత్రమే నాదమైనట్టి “మంత్రవాది”

ఆతని గృహంబు పేరు; ఆతని యెడదను

కమ్రమౌ పద్య వచనైక కవిత జారు;

సుధల కథలొల్కు నాతని శోభవేరు;

కవన మంత్రాల కోవెల – కళల హేల||

సీ. వృత్తి యెన్నగ వకీలతడు- కాని – నవీన

తను నాచరించు మేధావి అతఁడు;

వయసేబదియె – కాని – పలు యం.ఎ. పట్టా లఁ

జేపట్టు నుత్సాహ శీలి అతఁడు;

బాలుండు కాకయే బహుబ్లా గులఁ గదల్చు

బాలుపాయింట్ పెన్ను ప్రతిభుడతఁడు;


సాంకేతిక జ్ఞాన సాధనన్ సాగుచు

నపజయ మ్మెఱుఁగని యలఘుఁడతఁడు;

“వేంకట”త్వంబు – పేరులో “వీర”తయును

అమృత గతితోడ సార్థకంబై దలిర్ప

“సత్య”మైన “నారాయణ్ణౌ”న్నత్యమొప్ప

ఆణిముత్యమౌ యశమొందు జాణ అతఁడు

సీ. నీసమస్యా పూరణా సమానాసక్తి

కడు మెచ్చఁదగినదిగాఁ జెలంగె;

“సత్యపదీయమౌ”న్నత్య మౌచిత్యమై

“అక్షరాలా” ముత్యమై దలిర్చె;

జయగురుదత్త విస్మయ లసన్మహిమయే

ఘనజయ నాదమా “కంద”మయ్యె;

అనుపమానంబు రామాయణ కథయె ఆ

”హనుమా!” “విజయరామ!” అయ్యెఁ గృతిగ;


“కృష్ణపదీయంబె” కృష్ణమై అభ్యాస

తృష్ణమై తీక్షణ తేజమయ్యె;

కమ్రభారతి – కలగూరగంప నీది;

రకరకంబుల రుచులీను ప్రకటముఎను;

లోకమే భిన్నరుచుల సుశ్లోకమౌర!

స్తు త్యమౌచిత్య కృషినీది “సత్య” సుకవి!

కం. ఛందము, కవి”తానంత!

ఛందమ్మ” భ్యాసమలర సంతత కృషినా

నందించు “సత్య” సుకవీ!

స్పందననిడు “వేంకటేశ శర్మ“ నతులనే


:: వందనీయులు::

తే.గీ. విఘ్ననాయక నినుదల్చి వేడు కొనగ


రామ చరితము వ్రా సెద రమను గూర్చి
కవన మేర్పడఁ జేయగ కరుణఁ జూపు
వేయి సన్నుతుల్ పల్కెద విఘ్న హారి!

తే.గీ. వాక్కు చేడియ! నుతియింతు వరము లిడుమ!


మధుర కావ్యము వ్రా యగ మధుర వాక్కు
లిడగ, కరుణతోడ కనుమ యిటను బ్రా హ్మి!
నీదు పదములు విడువను నీవె రక్ష!

కం.: పితరులు నాకు జననము సు


మతిగతి నిచ్చిరి మరిమరి మరులు గొనుచు నే
సతతము సన్నుతి జేయుచు
హితమైనవి యిచ్చెద కడు హెచ్చుగ భక్తిన్.

తే.గీ. గురువు పదములు బట్టగ, కరుణ తోడ,


విద్య కోరినంతనె నేర్పి వివరమిచ్చి
కవన విధులను తెలిపిరి కైత లల్ల
మతికి గీర్పతి ఛందంపు గతిని చూపె

25/12/2017
కం. మిథున వనమున్ శుకపికము
లధిగతితోఁ జేయు రవళుల మధురిమలన్
మిథున కవుల కయిత జిగి
మధుమాసపు విరియె యయ్యె మది యెల్ల వగన్

09.01.2017
:: తురంగి వృత్త ములు ::
పావన రఘురాముని పద సేవనమును వీడ డెపుడు హనుమ
ఆవడి గని లంకకు జని రావణ చెరయం దవనిజను గని
పావనికిని వందన మిడి సేవకుడను శ్రీకరునికి, ననగ
పావని విని సంశయమున ఏవము గని రాముని, మదిఁ దలచె.

వాక్పతి! యన కావవె నను వాక్పటి మొసంగి యనయము మది


వాక్పద మతి నీయ, దయను వాక్పద విరి మాలల నొసగెదను
వాక్పటిగను చేయవె నను వాక్పతి! కడు దీవెన లొసఁగఁగను
వాక్పదముల నే గొలిచెద వాక్పదగతి వీవు దయను గనుమ!
11.01.2017

:: మంజుల-మధనం ::

సుధలే కురిసే విరులన్


మధువే రుచిగా తగిలే
అధరం తెలిపే ప్రణయం
మథనం కలిగే మనసున్

తనువే వణికే తపనల్


కనులే అదిరే తలపున్
మనసే చెదిరే తలపన్
మనువే మదిలో కదిలెన్

పరువం పిలిచే అతనిన్


విరులే మురిసే ముదమున్
మెరిసే కనులే జిలుగున్
అరుసం కలిగే మదికిన్

మదిలో రగిలెన్ సెగలే


అదియే పెరిగెన్ దిగులై
మదిలో పొ గిలే వెతలే
ముదమే దిగులై కరిగెన్
నయగారముగా చెలియే
హొయలున్ యొలికించగనే
లయగా పలికెన్ విరి తే
నియలే కురిసే మధువై

తరులే మెరిసే వనమున్


మరులై తలపన్ మదిలో

విరులే విరిసే! వనమే


మెరిసే ఘుమలే తెలిసే

చెలియే కదిలే ముదమున్


కలలో కలయే నిజమై

పిలిచే దరికిన్, చనగా

కలయే చెదిరెన్ కనగా!

20.01.2018

ఆ.వె. రామ రామ యనుచు రాగముల్ సలిపిన


మోక్ష సిద్ధి గల్గు ముదము తోడ
రామ రామ యన్న రంజిల్లు హృదయమ్ము
భక్తి తోడ మీరు భజనఁ జేయ
ఆ.వె. పాలు గారు లేత పాపలున్ బెదురుచు
బండ రాయి వోలె, బరువు తోడ
సంచి మోయ లేక సంతసమ్ములు వీడి
పాఠశాల లన్న పరుగు దీసె!

ఆ.వె. మమ్మి డాడి పల్కు మంచిగా వినఁబడ


సంతసమ్ము మీరి సంబ్ర మలర
రాంకు రాంకు లంచు రాపాడి చెప్పించు
చావ గొట్టు నట్టి చదువులేల?

21.01.2018
కం. అరుచుచు నేర్చిన చదువులు
అరుగుల పాఠములు విడచె నాంగ్లము నేర్వన్
బరువులు టన్నులు భుజమున
బరువగు చదువుల కొరకును బారులు దీరెన్

ఆ.వె. ఆట పాటలాడి హాయిగా చదివెడి


నాటివిద్య నేడు నలుసు గదర
గుర్తు నెరిగి చూడ గుంజాటనే మిగులు
వీరె రేపు దిక్కు వివరమేల?

23.01.2018
:: షట్పది ::
వనమున షట్పది
ఘనముగ నెగిరెను
మనమున గురువులు కోరగను
అనిలము ఝుమ్మను
నినదము నొందగ
వినబడె పద్యము వింత గనన్

కం. అనయముc గావవె గణపతి


వినయము దోడను మనమున విఘ్నము దీర్పన్
వినతుల మొక్కెద నఘముల
ఘనముగ c బో గొట్టరావె! కరుణన్ గనవే!

కం. పలుకుల తల్లివి భారతి!


కొలువగ నిన్ను సతతమును కోమల వాక్కున్,
తెలివిని నొసగవె! రచనకు
పలువురు నాదు కవనములు పాడుచు నుండన్

కం. హరి నిను గొల్చెద మనమున


విరి కవితా ఝరులు కురియ వేదము నీయన్
అరుసము నొందగను జనులు
మరిమరి సంతసము గలుగ మత్కవితాళిన్

కం. గురువులు చెప్పగ చదువును


కరముల నొక్కటిగ నిలిపి కైతల కాన్కల్
విరులుగ జేసి వినయమున
చరణము లందిడగ గురువు చాటువు పల్కెన్

కం. భయపడు కూనను ముదమున


దయ నిడఁగన్ నను మరిమరి దారికి తేగన్
కయికొనఁగ నుతుల నిడెదను
భయమును దీర్పుమ! పరిపరి భక్తిని వేడన్.

27.01.2018
కం. పదపద యనగను జనులిల
పదములు కదుపుచు నడువగ పరిణతి కలుగున్
కదమున నభినుతి సలుపుచు
ముదమున నభిచర గణములు ముదలము కనగన్

కం. వడివడి అడుగుల చనుచును


పిడికిలి బిగువున నలుగురు పెరుగుట కొరకున్
సడలక అలయక వెరవక
నడకలు మునుపుకు తరలగ నడవడి తెలుపన్

కం. మనమున కలిగిన వెతలను


యనయము తలచుచు వగచిన యలమట పెరుగున్
మనమును కఠినము పరుచగ
నఘములు కడు గురువులగును ననుభవ మదియే!
29/01/2018
ఆ.వె. బావ బావ యంచు బావనే పెండ్లా డి
వేణిపూజ లంచు వేడుకాయె
బావ నాకు వేసె బాగుగా నాజడ
పక్కుమంచు నవ్వె పడతులంత!

07/02/2018
శా. సంగాతమ్మును వీడి గంగ వడిగా సాగంగ స్వస్థా న మే
గంగా దేవికి నీరు లేదు గదరా కారుణ్యముం జూప రా
వంగా దేవత లెల్ల రున్ వినతులున్ వాగగ్రముల్దో డ నో
గంగా! నీవిట లేనిచో జగములున్, గంగాధరుం డేమగున్!

22/02/2018
సమస్యా పూరణం
చం. శషభిషలేక వేడిరట శంకరు వేల్పును తేట మాటలన్
విషయము నాలకించ తనువేగము నంతట త్రా గె ప్రేమతో
విషము సురాసురుల్ మురియ వీడగ భీతి సురాళి కంతటన్
విషము సుధామ యంబనుచు వేల్పులు దెల్పిరి మానవాళికిన్

చం. విషయము దెల్సినంతనె వివేకులు కాలము వెళ్ళదీయరే!


శషభిష లందు యోచనలు సల్పిన యన్నము తా వికల్పమై
విషమగు నాలసించిన వివేచము నొంద సమస్య దీరగన్
విషము సుధా మయంబనుచు వేల్పులు దెల్పిరి మానవాళికిన్

25/02/2018
సమస్యా పూరణలు
ఉ. కాలవశమ్మునన్ కుజను కానల రావణు డాహరించగా,
గాలన జేయగన్ హనుమ, కన్గొ ని జానకి జాడ దెల్పగా
నాలము జేయకా హరియు ఆలరి రక్కసు సంహరింపఁగన్
రాలను పూలు పూచినవి రమ్య సుగంధములన్ వెలార్చు చున్

ఉ. ఆలి ధరించినట్టి విలువైనది మంగళ సూత్రముం గనన్


గాలముఁ గూడ సత్యనిధి గాంచగ శూలియు దీవెనం బిడన్
కాలిక జీవనమ్ము విడ, గాధి కుమారుడు సన్నుతించ, హా
రాలను పూలు పూచినవి రమ్య సుగంధములన్ వెలార్చు చున్

ఉ. గాలము నాకరిన్ మకరి కాకును జేయగ శ్రీహరీ! యనన్


ఆలము జేయగన్ సిరికి నాహరి జెప్పక వేగమేగగా,
గాలి మెకమ్మువోలె కరి గానగ క్రో ధము చే హరింపగా
రాలను పూలు పూచినవి రమ్య సుగంధములన్ వెలార్చుచున్

ఉ. వేలకు వేలుగా తరులు వేడుక సేయగ తోట యందునా


కాలము కోయిలల్ రవము కమ్మగ నూదగ సుస్వరాల గీ
తాలను పో లగా వనము తాముద మందగ నాతరుల్ వయా
రాలను పూలుపూచినవి రమ్య సుగంధములన్ వెలార్చు చున్

28/02/2018
తే.గీ. గాలి కబురులు పల్కుచు గట్ల దిరిగి
చెడ్డ తిరుగుళ్ళ దోడను చేటు జేసి
పిచ్చి చేష్టలు చేయుచు వచ్చి యింట
“తిట్లు దినువాడు పరులకు తీర్పులిచ్చు”.

04/03/2018
తే.గీ. బుద్ధి మంతులకునుఁ జూడ బువ్వ కరవు
సత్యముల్ బల్కు వానికి సతము వెతలె!
ఉచ్చ నీచములు మరచి యుటము, పచ్చ
"గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము"

కం. సుందర కాండను మించిన


సుందర మేమనిఁ దెలిపిన సుందర మగునే!
సుందర భావము లొప్పగ
సుందర రూపము నిడుగద సుమధుర మలరన్

:: సుగంధి వృత్త ము ::
సందె పొ ద్దు కాడ నీకు సద్ది బువ్వ బెడ్తి నా!
ఎందుకంత కోపమొచ్చె ఏమి కారణమ్ములే?
మంది జూడ పల్చనేగ మన్ని జూచి నవ్వరే!
కందిపో యె నీముఖమ్ము కాంచలేనె ఓచెలీ
బువ్వకాదు మావ నాకు బుద్ధి ముఖ్యమౌనురా!
ఎవ్వతైన నిన్ను జూడ ఎక్కు నాకు మంటరా!
నవ్వుకుంటు తుళ్ళతున్న నాకు నీవు తోడురా!
నువ్వునేను సంతసింప నూరు యేళ్ళు పండగా!

05/03/2018
::ఆకాశవాణి విజయవాడ పూరణలు ::
ఉ. పూసెడి పూవు లన్నియును పూజకు వేలుపు పాదముల్కడన్
రాసిగ జేర్చగన్ ప్రజకు రావిక నెప్పడు కంటకమ్ములున్
వాసముc పేద వారికిని వాసిగ నియ్యఁగ నట్టి సేవలున్,
చేసెడి ధర్మమే మిగులు నీక్షణ భంగుర జీవితంబునన్.

ఉ. వేసిన బీజముల్ భువిని వేగమెవ్యాపన మందగన్ జనుల్


వాసిగ బొందగన్ విధిగ భాగము పంచగ పుణ్యరూ పమున్
చేసెడు ధర్మమే మిగులు నీక్షణ భంగుర జీవితం బునన్
రాసిగ పాపముల్ గలుగ రౌరవ మందగ కంటకం బగున్

06/03/2018
:: ఆకాశవాణి హైదరాబాద్ సమస్యా పూరణలు ::
ఉ. తెచ్చెను చైత్రమున్ పసిమి తేనెల పూవులు పూయగన్నటన్
మెచ్చగ నేకదంతుడును మెండుగ నంతట సంతసించగన్
ఇచ్చగ భక్తితో దొరకు నిర్వది యొక్క దళమ్ము లియ్యగన్
వచ్చెనుగాది పర్వమిల భాద్రపదాన చిగుళ్ళు వేయగన్

ఉ. వచ్చెనుగాది పర్వమిల భాద్రపదాన చిగుళ్ళు వేయగన్


అచ్చెరు వొందగన్ జనులు నందరు పండుగ లందునాదిగా
వచ్చెడు నయ్యదే చవితి బాంధవు లందరు జేరగా నదిన్
అచ్ఛముగాది పర్వముగ ఆంధ్రము నందుజనంబు జూడగన్

ఉ. వెచ్చని గాడ్పులన్ జనులు వేడికి తాళగ లేక నుండగా


మచ్చుకు చూడగం ధరణి మాయుచు నెఱ్ఱె లు దీయుచుండగన్
ముచ్చట దీరఁ దోయధరముల్ ఋతుధర్మము నేగుదెంచగా
వచ్చెనుగాది పర్వమిల భాద్ర పదాన చిగుళ్ళు వేయగన్

09/03/2018
సీ. ఆది పూజ్యుడ! నీకునర్చనల్ జేసెద
భక్తితోడ వివిధ భావ మలర
నాదు సేవనములు నైవేద్య మంతయు
నారగించగను నన్నాదరింప
సర్వ కార్యములను జక్కగ వీక్షించి
నిర్విఘ్నముగ నేను నిర్వహింప
శక్తి నీయగ రావె శంకర నందన!
చరణ మంటి నీవె శరణ మంచు

ఆ.వె. ఆది పూజ్య! విఘ్న మాహరింప


మించి భక్తి తోడ మిమ్ములఁ దర్శించి
అర్చనాది సేవలందు కొనుమ! మీరు
కావు మయ్య నన్ను కాకు దీర్ప!

12/03/2018
తే.గీ. ఏల? భక్ష్య భోజ్యమ్ములు నేటికిటను
అమ్మ చేతి పచ్చడి యన్న మైన చాలు
నదియె చూడగ భువియందు నమృత సమము
ఆరు రుచులొక్కటై పో యె నౌర నేడు

తే.గీ. విరటుని కొలువు జేరగ వింత గొలుప


పాక నిపుణుడయ్యె నటను పక్వ మేర్చ
నారు రుచులొక్కటై పో యె నౌర నేడు
యనుచు వలలుని ఉత్త రు డదిరి పొ గడె

12/03/2018

::ఆకాశవాణి హైదరాబాద్ సమస్యా పూరణలు::


ఉ. మోదము లేకనా తపన మోర్వగ లేకయు నెత్తి నంటగన్
మోదగ రోహిణీ సెగలు మోయగ రోళ్ళును బీటలీయగా
వేదన చెందగన్ జనులు వీక్షణ జేయగ ఎండ మావులే
మేదిని మండనమ్ములగు మెండుగ నిండుగ మండు టెండలే
ఉ. ఖేదము నొందగా ప్రజలు ఖిన్నులు నయ్యెను, గ్రీష్మ తాపమున్
చేదగ నార్తితో జలము చేకొన జాలక దిక్కు తోచకన్
మీదుగ తాపముల్ పెరిగి మిక్కిలి గాడ్పులు వేగమొందగా
మేదిని మండనమ్ములగు మెండుగ నిండుగ మండుటెండలే

13/03/2018
ఉ. గారము పో వుచున్ పడతి కాలము నంతయు నందచందముల్
కోరి, సుగంధ పుష్పములు కొప్పున బెట్టి నలంకరించగా
మారుఁడు సైతమున్ కనులు మార్చగ లేడట! చూడగన్, అలం
కారమె భూషణంబు కద కాంతలకున్ మగవారికిన్ ధరన్

22/03/2018
:: ఆకాశవాణి, హైదరాబాద్ పూరణలు ::
ఉ. ధీరులు ధైర్యము న్విడువ ధీరత పో వగ యత్నమున్ని రా
కారము నొందగా మనము కష్టము పాలగు నౌర! యివ్విధిన్
భారము వీడగా పనిని బాధ్యత తోడను చేకొనంగ సా
కారము పైన జూప మమకారము చిత్త ము నిర్వి కారమౌ.

ఉ. నేరుగ చిత్త మున్ నిలిపి నీపద సేవను చేయనైతి నా


నేరము లెంచకయ్య హరి! నీదు కృపాది కటాక్ష మీయగన్
ఓరిమి లేక నీకరుణ నొందక, దూషణఁ జేయ నా దహం
కారము పైన జూప మమకారము చిత్త ము నిర్వికారమౌ

23/03/2018
:: జంధ్యాల పికిల్స్ వారి పద్య పో టీ ::
ఉ. ధర్మమదే యటం చపుడు ధాత్రిని ధర్మయుతంబు చేయగన్
ధర్మ పథాన నీవు సహధర్మ చరింగొని కానలం బడన్
ధర్మము నాశ్రయించితివి ధర్మ విభో! పితృవాక్య పాలకా!
ధర్మమె? ధర్మదేవతకు, ధర్మము జెప్పెడి వారలున్ వినన్

మ.కో. రామచంద్రు డు సీత తోడను రాజ్యమేగగ విప్రు లున్,


ఆమనిన్ దలపింప నాడట నయ్యదిన్ జన సంద్రమే
ఆమతిన్ గొన‌, రాఘవేశుని, యత్త రిన్నుతి సేయగన్
సేమమున్ దలచంగ పట్టము జేకొనెన్ శ్రు తి సన్నుతిన్

తే.గీ. రామ చంద్రు డు దేవుడు రమకు విభుడు


మర్మ మెరుగని వాడును మధుర మూర్తి
మహిని నేలిన యాతడు మాన్య గుణుడు
అదియె శ్రీరామ రాజ్యమై యనఘమయ్యె

ఆ.వె. హరిని గొల్వ జనము హరినామమును జేయు


హరిని వీడ రాదు హరియె దిక్కు
హరియె గాచు మనల నఘముల c దీర్చును
హరిని శరణు కోరు హరిని జేర.

కం. మనమున కొలువగ రాముని


అనయము విధిగను నహమ్ము నణచగ జనులున్

అననము సలుపక తలపఁగ

ననవధి సంపదల నిచ్చు నదియే సత్యమ్

25/03/2018
ఆ.వె. భవుఁడు! శివుఁడు! చరుఁడు భవభయ హరుఁడును
శుభము లిచ్చువాడు శూలి యనగ
బూది పూసి నంత భోగంబు లిచ్చును
దాచు కున్న దక్కు దాచి నంత

ఆ.వె. హరిని గొల్వ దరికి నఘములు చేరవు

హరియె సర్వ మనుచుఁ జరణ మంటఁమంట

గఁలుగు ఫలము మనలఁ గాచును నిరతము


దాచు కున్న దక్కు దాచి నంత

ఆ.వె. దోచు కున్న వాఁడు దొంగయౌ నిలలోన


చూచి నంత నాఁడు సుఖము మిధ్య
నీచ మార్గ మదియె నిక్కమ్ము తెలియఁగ
దాచు కున్న దక్కు దాచి నంత

ఆ.వె. గురుని పదము లంటి గుణవిన యమ్ము తో


విద్య నొందు వాడు విజ్ఞుఁ డౌను
అట్టి చదువు లన్ని యద్భుత నిధులౌను
దాచు కున్న దక్కు దాచి నంత

25/03/2018
తే.గీ. శ్రీశ! రఘువర! గననీదు శీల సుగుణ
రాశి యవనిని నిరతము రంజిలగను
మసలె జనమును భయమును మరచి, నీదు
రాచ విడిదిని ననయము రక్తి తోడ
మసలె హరిహరి యనుచును మదిని గొలువ.

31/03/2018
:: ఆకాశవాణి హైదరాబాద్ సమస్యా పూరణ ::
ఉ. మాటలు లేవు మూగ తనమందగ సంజ్ఞలు దప్ప నేమియున్
మాటలు రాని వాడతడు మర్మము లేమియు నేర్వలేడు; ఆ
నోటను శారదా జపము నోచగ వేగమె వాక్కు నీయగా
"మాటలు రాని వాని పలు మాటలు పద్యము లయ్యె వింతగన్"

31/03/2018
తే.గీ. శుచిగ రుచులనుఁ జేర్చిరి చూడనంత
నవియె జంధ్యాల వారిచ్చె నమృత లేహ్య
ములిట 'నచ్చగ తెలుగు'ను ముదము నొంద
ధన్య వాదము లిడగనే ధన్యుఁడైతి

04/04/2018
తే.గీ. ఎల్ల కాలము నొకరీతి నెంచి చూడ
బల్ల క్రిందను చేతులు బరువు కోర
తల్ల డిల్లిరి జనులును తావు లేక

“తెల్ల దొరలను మించిరి నల్ల దొరలు”

తే.గీ. తేట తెలుగును వర్జించి తెల్ల భాష


తీట పూసుకొని తిరిగి తెల్ల బో యి
మాట మాటకు యా..యా..ని మదము నొంది

“తెల్ల దొరలను మించిరి నల్ల దొరలు”

తే.గీ. పన్ను పన్నులంచు జనుల పల్లు పీకి


ఎన్నికల ఖర్చులకు కోట్ల నెంచి దోచి
ఎన్ని తరములు తిన్నను నినికి పో దు

“తెల్ల దొరలను మించిరి నల్ల దొరలు”

తే.గీ. వర్గములుగను విభజించి బానిసలుగ


జేర్చి మనిషి మనిషికిని చిచ్చు బెట్టి
తెలుగు వెలుగును దహియించె తెల్ల వారు

“తెల్ల దొరలను మించిరి నల్ల దొరలు”

05/04/2018
::ఆకాశవాణి హైదరాబాద్ సమస్యా పూరణలు::
ఉ. వెన్నుని భక్తితో గొలిచి వేడగ నాధృత రాష్ట్రు డున్ సుతుల్
ఎన్నడు లేని చందమున నెంచగ, కృష్ణు ని విశ్వరూపమున్
అన్నువు నొందగన్నతడు నాహరి దర్శన మంద నత్త రిన్

“కన్నులు లేనివాడు కన గల్గె ను లోకము కన్ను విందుగన్”

ఉ. మన్నన లొందుచున్ జనులు మంగళ శబ్ద ముఁ జేయు చుండగన్


అన్నువు నొందగా యువకు డద్భుత రీతిగ వాయులీనమున్
కన్నుల చూడ జాలకను కాకును వీడగ మీటు చుండగా

“కన్నులు లేనివాడు కన గల్గె ను లోకము కన్ను విందుగన్”

ఉ. అన్నువు నొందుచున్ దళము లర్చన జేయగ లింగ మూర్తికిన్


కన్నుల ధారలై రుధిర కల్కము గాంచెను బాధ నొందగన్
తిన్నడు ఖిన్నుడై తనదు దృష్టినొ నర్పగ కన్నడత్త రిన్

“కన్నులు లేనివాడు కనగల్గె ను లోకము కన్ను విందుగన్”

11/04/2018

మ. సెగలే వీడగ చల్ల నైన పసి వీచెన్ వెన్నెలల్ కాంతులై


జగమే నిండగ వేడి జాడలును వీసంబై చనంగా జనుల్
నగవుల్ చిందిల; తోటలో విరులు యానందంబునొందెన్నటన్

“పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వంబు లెన్నో మహిన్”

11/04/2018
తే.గీ. మనము నాశపడగ లేను మనసు దీర
ఘనముగ పదము వ్రా యగ గగన మాయె

అనరుఁ దీర్చగ గురువులు నంత కవిత


వనము నందున దిరుగాడు పద్య మనగ.

13/04/2018
తే.గీ. మీదు చేదుగ తేనీరు మలపు నిడదు
చుట్ట మింటను కుడువగ, సుంత లేదు

“చేదు, నేడాయె చక్కెర జిహ్వనకును”


మధుర తత్వము కలిగించె మనసు తీర.

తే.గీ. విందు జేయగ పదిమంది ముందు జేర


మధుర మైన మిఠాయిలు మనసు పడగ
నిత్య మనుభవించెడునట్టి నీదు జిహ్వ

“చేదు, నేడాయె చక్కెర జీహ్వనకును”

తే.గీ. పలు విధములైన పనులును ఫలము లేక


విసిగి వేసారి నాడది వినగ, ఫలము

“చేదు, నేడాయె చక్కెర జిహ్వలకును”


పట్టి సాధింప విజయపు ఫలము నొంద

18/04/2018
::ఆకాశవాణి హైదరాబాద్ సమస్యా పూరణలు::
మ. గతులన్ దప్పక పద్యముల్ రచన వేగంబున్ మధింపంగ స
న్మతి తోడన్ యతి ప్రా సలుం గలిపి థీమంతుల్ లిఖించన్ జనుల్
నుతులన్ జేయగ నట్టి పద్యములు గానంబే వినోదంబు; దు
ర్యతి సాంగత్యము లేని పద్యములు విద్యాదేవి వాద్య శ్రు తుల్

మ. శృతి హీనంబగు గీతమెవ్విధి ప్రకాశంబీయదో నవ్విధిన్


యతి లేనట్టివి హీనమౌ పదము లీయంజాల వర్సంబిటన్
నతిఁ జేయంగను, గబ్బముల్ కవుల నన్గా న్నఖండమ్మె; ఆ
యతి సాంగత్యము లేని పద్యములు విద్యాదేవి వాద్య శ్రు తుల్

25/04/2018
::ఆకాశవాణి హై దరాబాద్ సమస్యా పూరణలు::

చం. మదము శిరమ్ము జేరగ నమాయిక సీతను దెచ్చి దోసమున్


మదమున జేసి తీవు యవమానము తప్పదు నీకు రావణా!
వదరకు మీవనిం బలికె వాదము లేలని మర్కటుండు దు
ర్మదులకు భారమయ్యె మధు మాసపుఁ గోకిల గాన మాధురుల్

చం. మదమును గూడి మత్సరము మీరఁగ నంటుగ నున్న ద్రౌ పదిన్

వదరుచు దుస్ససేనుడు వివస్త్రగ జేయగ నెంచె, నామెయే

యుదరుచు పల్కె, వృద్ధు లును యూతినిఁ జేయఁగ లేకయున్న

మీ
మదులకు భారమయ్యె మధు మాసపు కోకిల గాన మాధురుల్

27/04/2018

తే.గీ. భద్రగిరి యందు రామ నవమిఁ గనగను


చలువ పందిళ్ళ నడుమనా జగము లేలు
తల్లి కిందాళి గట్టెను దాశరథియె
శ్రు తులు పఠియింప భూసుర సుధల మధ్య

28/04/2018

పూరణ

తే.గీ. కులము మతమంచు నాయకుల్ కుళ్ళు తోడ


వర్గములు జేసి పాలింత్రు బలము మీర

మనిషి మనిషికి మధ్యను మమత చెడఁగ


"కీడు చేయునదిగ రాజకీయ మనిన"

పూరణలు
తే.గీ. తండ్రి కొడుకుల నడుమను తగవు లాట
ఒకరి నొకరు నెంచు కొనగ నోర్వ లేక
మంచి మనముతో శుభముల నెంచి నంత

“కోరి రమ్మనె మామను కోడలంత”

తే.గీ. అత్త పై కోపమున మామ యలుక నొంది


మౌన దీక్షను జేయగ, మన్ననలను

“కోరి రమ్మనె మామను కోడలంత”

మమత నిండగ నాయింట మధుర మాయె

తే.గీ. మనసు దీరగ మాట్లా డు మనిషి లేక


ఒంటరిగ నుండ వలదని నోర్మి తోడ

“కోరి రమ్మనె మామను కోడలంత”


తండ్రి సమముగ సాకెను ధరణి పొ గడ

తే.గీ. అన్నవరము నందు వ్రతము యంత సలుప


సత్యదేవుని సన్నిధి చనగ నత్త

“కోరి రమ్మనె మామను, కోడలంత”


భర్తకు దెలిపి యొప్పించి పయన మయ్యె

తే.గీ. అలిగి వెళ్ళిన యత్త మామలను జూచి


కంట నీరు బెట్టు కొనియె, కరుణ జూప

“కోరి రమ్మనె మామను కోడలంత”

కలత వీడఁగ రండని క్షమను కోరె

04/05/2018

పూరణ
మ. కలలే పండగ దేవయాని యట శృంగారమ్ము లొల్కంగ నా

యలరుంబో డి మదిన్ననేక విధమౌ యాలోచనల్ చేయగన్


అలినీ సంబర నాదమై కచుని, యూహా తీరముంకౌగిలిం
తల, పువ్వుల్ వికసించి నప్పుడె కదా! ధన్యత్వ మీ జన్మకున్

06/05/2018
పూరణ

మ. వలపుల్ తేనియ లూరగన్ మనము నంభావా నుభూతిన్ సదా

తలపే యాకస వీధి యంచులను గీతం బాలపింపన్ పదిం


తల, పువ్వుల్ వికసించి నప్పుడె కదా! ధన్యత్వ మీ జన్మకున్

అలకల్ దీరగ నంతనే వనిత తా నాసించి చేరన్ వడిన్

10/05/2018
చ. సరమును దాటి మర్కటుడు శాంతము తోడ చనంగ నాగకే
సరములు తీసి ముద్ది డెను సంతస మందగ నద్ది తానుయున్
సరము సుగంధముల్ విడువ సంబరమున్ కలుగంగ నత్త రిన్

సరము సరాగమీయగను సాగుచు నుండె వనమ్ము నాతడున్

16/05/2018
పూరణలు
చ. కరుణను జూపి దాశరథి గాచుచు నుండ వనంబు నుండగన్
భరతుడు రామ పాదుకల భక్తిగ పట్టము గట్టి వేడ్క స

చ్చరితముతోడ పాలనము సల్పఁగ నెంచెను రాజు పేద యం


తరువులు గూల్చి నప్పుడె గదా! జగమందు సుఖంబు పెంపగున్

చ. చిరమున నట్టి మాయలనుఁ జిక్కగ కాలము వెళ్ళ దీయుచున్


కరచర వాణి జూపెడు వికారపు చేష్ట లశీల జాల చి
త్త రువులు గూల్చి నప్పుడె గదా! జగమందు సుఖంబు పెంపగున్
తరములు గర్వ మందగను ధాత్రి ముదమ్మున వృద్ధి నొందదే!

18/05/2018
తే.గీ. కఱవు కాటకములఁ జూచి కలత చెంది
దుష్ట నెయ్యము బడయక దూరమేగి
అతి యనావృష్టి కంటక మంటు తెవుల

దాపు నుండడో నాతడే ధన్య జీవి.

19/05/2018
తే.గీ. విద్య నభ్యసించిన వాడు విత్తు లేక
యున్న నతడు హీనుడు కాడు యున్నతుడగు
విద్య లేని ధనికుడెట్లు విజయ మొందు
ధనము మూలము కాదిట ధాత్రి యందు

20/05/2018
తే.గీ. ధనము రాజ్యము పో యిన దక్కు మరల
హితుని కోల్పోగ వేరొక హితుడుఁ గలుగు

పత్ని నెడబాయఁ పిమ్మటఁ బడయ వచ్చు

తనువు జారినన్ మరియెట్లు దాల్చగలము?

21/05/2018

పూరణలు

తే.గీ. స్వస్తి పలుక స్వధర్మము శమము నిచ్చు


చూడ నదియె సన్మార్గము శుభము కలుగ
పరుల ధర్మము పరికింప పాప మగును
పరుల ధర్మాచరణ మెప్డు పాడి గాదు

తే.గీ. సర్వ ధర్మము లెప్పుడు సమము కాదు


ఎవరి మార్గము వారికి నెపుడు రక్ష
తనదు మేలు కోరుకొనుచు మనెడి స్వార్ధ
పరు లధర్మా చరణ మెప్డు పాడి గాదు

23/05/2018
పూరణ
మ. నగవే కారణమయ్యె నా పడతిచే నానా విధమ్మత్త రిన్
పగతోడన్ రగులంగ నా కురుపతిన్ భారమ్ము నోర్చంగ లే

క, గతంబున్ మరువంగ లేక నట నా కయ్యమ్మునే కోరఁగన్


దగవే తెచ్చును గొప్పకీర్తి వసుధన్ తథ్యంబు ముమ్మాటికిన్

31/05/2018

శా. వీణా పాణి సపద్మ వాసిని! సిరీ! వేదాంగి! వాగ్వాణి నీ


పాణీ ప్రేమ జలంబు గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్
వాణీ! నీ చరణంబు లంటి నినునే వర్ణింపగా రావె గీ

ర్వాణీ! వేద పరంపరా దరిణివే వాగ్దేవి! నన్ గావవే!

02/06/2018
పూరణలు

తే.గీ. మగువ కాభరణము లన్న మనసు పడగ


స్వర్ణ మాకాశ మంతట సంచ రింప
మగని కోరె యనుకరణ నగలు పొంద

“ఇనుము బంగార మాయెగా యింతి కిపుడు”

తే.గీ. మనిషి చూడగ నాతడు మరుని బో లె


మనువు జరిగెను పెద్ద ల చనువు మీర
కనగ మేడి పండయ్యెను కర్మ కొలది

“ఇనుము బంగార మాయెగా యింతి కిపుడు”

తే.గీ. పెండ్లి నాటికి మగడుత్త విమతి వాడు


తెగువ నేర్పగ నతనికి తెలివి గల్గె
మక్కు వేర్పడ నిరువురి మనువు పండె

“ఇనుము బంగార మాయెగా యింతి కిపుడు”

తే.గీ. వెఱ్ఱి ఇల్లా లు మురిసెను వేడ్క మీర


పాత చీరెల నివ్వగ వాణిజుండు
ఇచ్చె నినుపంపు పాత్రలు యిచ్చ దీర
ఇనుము బంగార మాయెగా యింతి కిపుడు

08/06/2018
*వానరాణాం పక్షిణాంచ కథా*
తే.గీ. నర్మదా తీరమది యట నగము నడుమ
బూరుగు నగము పై పలు కేరజములు
గూండ్ల నల్లి ముదముతోడ గూడి యుండె
అంత నొకపరి నత్త రి నాకసమున

దట్టముగ మేఘము లచటఁ జుట్టు ముట్టె

తే.గీ. వర్ష ఋతువరు దెంచగ వరుణ ధార

తెరపి గానక వర్షించె తిరముగాను


ఎటుల గాంచిన వర్షపు టేరుల వడి
వరుణ దేవు నలజడికి వడకె ధరణి
తే.గీ. చేరె కోతుల మూకలు చింత నొంది

గజగజ వణుకుచు తిరుగ కుజము క్రింద


అంత పక్షులు నదిగని చెంత జేరి
ఓయి! వానరులార! ఈ హో రు వాన
యందు నిటుల బాధ పడుట చందమౌనె!

తే.గీ. మిమ్ము జూడగ గల్గె ను మించి కరుణ


గడ్డి పరకల ముక్కున గరచి పదిల
మేర్పడంగ గూండ్ల ను గట్టి నేర్పు తోడ
సుఖము బడయగ మమ్ముల చూడ రండు
బలురు మీరలు మీకిట్టి బాధలేల?

తే.గీ. వినగ వానరు లత్త రి వికల మొందె


గాలి జొప్పని గూండ్ల ను కట్టికొనగ
మనల నిందించె నివి యిట మనగనేల?
యనుచు యోచించె కూల్చగ నరుస మంద

తే.గీ. ముసురు వీడగ నాకోతి మూక, చెట్టు

నెక్కి గుడ్ల ను గూండ్లను నీశుతోడ


పెరికి వైచెను మొత్త ము పెడసరమున
మదుల కెక్కును నీతి దుర్మదుల కౌనె!

04/06/2018
పూరణలు

ఉ. సన్నుతి సల్పి చేరగను శౌరిఁ గుచేలుడు కూడె నత్త రిన్


ఎన్నగ లేని కష్టముల నీదగ లేనని వేడి నంతనే

వెన్నుడు ప్రేమతో చెలిమి వేదన దీర్పఁగ సంపదియ్యగన్

“అన్నము లేనివాడు పరమాన్నము పంచెను పల్లె పల్లె కున్”

ఉ. ఉన్నతి నొందగన్ పిదప నొప్పడు ధర్మము జేయ దల్పఁగన్


ఎన్నటి కివ్విధిన్ జరుగ దెన్నడు చూడగ ధాత్రి యందునన్

“అన్నము లేనివాడు పరమాన్నము పంచెను పల్లె పల్లె కున్”


ఎన్నగ నెవ్విధిన్ ధరణి నేరికి సాధ్యము వింత గొల్పగన్

15/06/2018
పూరణలు
మ. రణమే కావ్యము నందు జూడ నయ గారంబౌచు సాహిత్య తో

రణమై పండిత పామరాదులను మేల్రంజింప, రాజాగ్రణుల్

రణమే వీడగ పూరణంబులును ప్రా రూఢిన్ బరంబొంద, పా

“రణమే ప్రా ణము పో యు పద్యకళయై రాణించు సద్గో ష్ఠు లన్”

మ. ఘనమౌ తెన్గు న సాహితీ మధుర సంగాతంబు సారస్యమే


రణమై భాషకు భావమద్ద గను సారంబెల్ల తేటంపు తో
రణమే యౌనట పండితోత్త మలు నేరాళంబు నుప్పొంగ నా

“రణమే ప్రా ణము పో యు పద్య కళయై రాణించు సద్గో ష్ఠు లన్”

19/06/2018
తే.గీ. నూరు తడవులు స్తు తియింప సిరులు
బంధముల నుండి విడివడి భక్తి నెరుగ
నదియె తెలుసు కొనగ రండు హనుమ శక్తి
భవ్య గుణధామ శ్రీ రామ భక్త హనుమ!

20/06/2018

:: ఆకాశవాణి హై దరాబాద్ పూరణలు ::

చ. సరిగమ లేర్చి కూర్చగను సంగతు లెల్ల వినోద నాదమై

పరిగొని తాళ బద్ధముగ వఱ్ఱునుఁ బోలగ ముందు కేగుచున్


పరవడి త్రొ క్కునట్లు శ్రు తి పక్వము నత్త ఱి గానముల్ నప
స్వరములు లేని గీతములు శ్రా వ్యము లైనవి లోకు లెన్నగన్

చ. కరముల తోడ చేయగను ఖంగు మనంగ తరంగ విద్యుదే

క, రవములై వినంబడఁగ కర్ణములందు కఠోర మైన యా


స్వరములు లేని గీతములు శ్రా వ్యము లైనవి లోకు లెన్నగన్

గరగర కీచు శబ్దముల గానము సల్ప నవీన గాయకుల్


20/06/2018
:: అచ్చంగా తెలుగు ఏరువాక పద్య పో టీలు ::

తే.గీ. మండు టెండల కార్తి తా మరలి పో వ


వాన జల్లు ల మృగశిర పలుక రించె
పదును నొందగ ధాత్రియు పరవశించె

పుడమి యందలి జనమెల్ల పులకరించె


రైతు నాగలి పట్టు చు రయము నేగె.

కం. ధరణిని పరిపరి తలచుచు


అరగలి విడిచి నుతులనిడె నఘములు తొలగన్
హరహర యనుచును గొలువగ
నిరతము తగు ఫలము లిడుమని హరుని తలచెన్

సీ.ఆది పూజ్యుడవయ్య! యఘము లేర్పడఁగనుఁ

దీర్పఁగ వేగమే దెంచు మయ్య!

పిల్ల పాపల తోడ వేడుకొనఁగ నిన్ను

నేరువాకను సాగి యెదను వెట్ట

మంచి ఫలములను మాకు గూర్పఁగ రావె!

కుడుములం గైకొను కూర్మి తోడ


కంటకముల కోర్చి కర్షకు లైతిమి
కావంగ రావయ్య! గణపయార్య!

ఆ.వె. సిద్ధి బుద్ధి సహిత సిరులిచ్చు విఘ్నేశ!

భక్తి తోడ నీకు భజనఁ జేసి


ఏరు వాక సాగి యెడదను బెట్టగ
వేడు కొనగ సామి! వెతలు దీర్చు.

ఉ. తుంగను పెర్కి ధారణిని దున్నుచు సారము నత్త రిన్ వసిన్


సంగము జూడగన్ మదిని సంబర మేర్పడ మ్రొ క్కె దేవతన్
అంగద వీడగన్ అరసమందగ విత్తు లు జల్లి నంతనే
గంగను వేడ్కొనంగ నట కాల్వల యందు ఱికించె నంతటన్.

చ. హలమును జేర్చి సన్నుతిని హారతు లిచ్చి ముదంబు నొందగన్

పొ లమరి, బంధు, మిత్రు లు; నభోమణి కాంతులు జల్లు చుండగన్

అలయిక చెందకుండ వృషభార్చన జేసి నివేద నీయగన్


పొ లమును దుక్కి దున్ని యట భోజన పానములన్ ముగించగన్

06/07/2018
:: ఆకాశవాణి హైదరాబాద్ పూరణ ::

మ. కరుణా వీక్షణ మొందగన్ జనని హ్రీంకారాత్మ రూపన్! శివం

కరిఁ గామేశ్వరి! నర్చనల్ సలుపగన్ కార్యమ్ము లీడేర్చగా


అరుసంబేర్పడ మాతృ మూర్తిగను దుఃఖార్తిన్ నివారించు శాం
కరి! కాపాడుచు నుండె ముజ్జగములన్ కారుణ్య వారాశియై

09/07/2018

ఉత్సాహ:
తరికట తరికిట తరికిట తక తరికిట ఝణుత ఝం

ధిరికిట ధిరికిట ధిరికిట ధిమి ధిరికిట ధిమిత ఝం

సరిగమ పదనిస యని యను చరగణములు కనఁగ నా


హర పదగతి చలిత జనిత అనలము గని భయపడెన్

14/07/2018
:: ఉత్త ర కాండ సప్త మ సర్గ ::
(శ్రీమహావిష్ణు వు రాక్షసులను సంహరించుట.
రాక్షసులు పారి పో వుట.)
తే.గీ. రక్కసులను మేఘంబులు రణన జేయ

వరుణ విజృంభణము వోలె శరము లిడగ


నాడు శరవర్షము కురిసె నగధరుండు
నీలి పర్వతమై యట నిలచి యుండ

తే.గీ. నల్ల ని శరీరములతోడ కల్ల దాటి


నట్టి రక్కసి మూకలు చుట్టు ముట్టె
నచట నా నీల వర్ణంపు హరిని, చూడ
అంబుదమ్ము లంజన గిరి నాక్రమించె

తే.గీ. అసురుల ధనువులు వీడగ నాశరములు

వజ్ర, మన, వాయు వేగమున్ వచ్చి జేరె


ప్రళయ కాలము నందును పృశ్ని వోలె
శ్రీహరి శరీరమున ప్రవేశించు చుండె

తే.గీ. శాకినముఁ బ్రవేశించెడు శలభము వలె


చిచ్చును మశకములు గూడి చేరు నటుల
సుధను గ్రో ల మాక్షికములు జొరబ డునటు
సాగరమును జేరు మకర చయము బో లె

తే.గీ. రథముల నధిరోహింపఁగ రథికు లొచ్చె


ఏనికల నెక్కి యచపకు నేగుదెంచె
అశ్వ చోదకు లరుదెంచె నంత చూడ
గగన మందు నిలచి యుండె గాలి బంట్లు

తే.గీ. అచల సములయి నిక్కిన యసుర శ్రేష్ఠు


లంత శర పరంపర తోడ నదటు మీర
అస్త్ర శస్త్రముల్ సంధించి హరినిఁ జేసె
ఊపిరాడక, భూసుర లుసురు వోలె
తే.గీ. అండజము లన్నియు నొకటై యంబునిధిని
తగులుచును గొట్టి నటుల నా దైత్యులంత
చేరి తాడనమునుఁ జేయ, హరియు ధనువు
నెక్కు బెట్టగ శరములు గ్రక్కె నచట

తే.గీ. హరియు విడువగను శరము లత్త రిఁ గన


వజ్ర సమములై వాడిగ పదును తోడ
వందలును వేలకొలదిగ బాణ చయము
కీలు గొల్పుచు ఛేదించె కీల వోలె

తే.గీ. వామనుఁడు నంత యశముచే బయలు దేరి


వాయువు వరుణు నెవ్విధి చేయ గలదొ
నవ్విధి శర సమూహము నచ్చు పఱచి

చీల్చి శంఖము పూరించి చెలువుఁ జేసె

తే.గీ. శక్తి యుక్తు ల తోడను శార్ఞ్గి తాను


ప్రా ణ వాయువు నంతను పట్టి నిల్పి
పాంచజన్యము పూరించి భయము గొల్ప
త్రిజగముల నాధ్వని మిగుల తీక్ష్ణ మలరె

తే.గీ. శంఖముల యందు కడు గొప్ప శంఖ మదియె


సింధురములను భయపెట్టు సింహగర్జ

వలె నటను పాంచజన్యము పటహణించు


రవము దైత్యుల వణికించె రయము మీర

తే.గీ. శంఖ రుతమును వినినంత సత్వ ముడిగి


తురగములు చూడ గడగడ తూలగ నట
కుఞ్జ రము లెల్ల మదమును కోలు పడగ
వీరులు రథములన్ వీడి జారి పడిరి

తే.గీ. శ్రీ హరి ధనువు న్వీడుచు చెండుటకును


వజ్ర తుల్యమగు పదును భాగములకు
శంబముల గూర్చి యుండనా శరము లంత
దైత్యులెల్ల ర జీల్చుచు ధరణిఁ జేరె

తే.గీ. పద్మనాభుడు సంధించు బాణ చయము


రణము నందు రక్కసులపై రగిలి పడగ
వజ్రములచేత హరియించు వారిధరము
వోలె దానవు లెల్ల రుఁ నేల కొరిగె

తే.గీ. పర్వతములందు జనియించి పరఁగు స్వర్ణ


ధారలనుఁ బో లుచు నుండె దైత్య చయము
కపిల చక్రముఁ జేసిన గాయములనుఁ
గారెడు రుధిర ధారలు కనగ నచట

తే.గీ. చక్రి శంఖము జేసెడి సమర రవము


విష్ణు ధనువును సలిపెడి వీర రుతము

శంఖపాణి గావించు ప్రచండ ఘోష

దైత్య గర్జనన్ మ్రింగెనా తరుణమందు

తే.గీ. హరియు విడువగ వడిగను శరము లెల్ల


కదలు చుండెడు దైత్యుల కంఠములను
చలిత శరములన్ రథముల శరపు పొ దులఁ

ధను పతాకలన్ ధ్వజములఁ దాల్చ న

తే.గీ. శతములు సహస్రములు ననంత శరచయ మట


దినకరుని భయంకర కాంతి తీవ్ర మలర
సాగర జలము‌ప్రవహించు వేగ రీతి
గిరుల నుండి పరుగిడెడు కరినిఁ బో లె

తే.గీ. జలధరము నుండి వర్షించు జలము వలెను


అటుల శీఘ్ర మేతెంచగ నంబు చయము
విష్ణు మూర్తి ధనువు నుండి వెలువ రింప
వచ్చి చేరెను వేగమే భయము గూర్చ
తే.గీ. శరభ మృగముచే సింగ మదిరినటులను
సింహ గర్జన తోడ కరియు బెదరు తీరు
హస్తి వలనను వ్యాఘ్రము లంగలార

వ్యాఘ్రము చేతను చిఱుత భయము నొంద

తే.గీ. చిఱుత పులిచేత శునకము చెదరి నటుల


శునకము వలన మార్జా ల మనము వీడ
పిల్లిఁ జూడగ స‌ర్పము తల్ల డిల్లు

నటుల పాముచేత ఎలుక నంకి లొందు

తే.గీ. అవ్విధంబుగ రక్కసు లచట నుండి

నిష్ణు డాహరి చేతను నెగులు నొంది


తరిమి వేయబడగ నంత పరుగు లిడగ

అసుర శేషమత్త రి నేల నంటె వడిగ

తే.గీ. అంత నాయనంతశయను డతిశయమున


వేల కొలది రక్కసులను విత్తు మాల్చి
పూర్వపాలి మేఘములను పూరగించు
చందమున హరి పూరించె చింద రవము
తే.గీ. అక్షధరుడు సంధించిన అంబుజముల

ధాటికి చలించి శంఖ నాదమును వినగ


వ్యాకులపడి రక్కసి సేన కేక లిడుచు
ఓడిపో వగ లంకకు నుత్క్రమించె

తే.గీ. అసుర సేనలఁ వెన్నుని అంబుజములు


హత మొనర్చు చుండగ నంత నా, సుమాలి

నత్త రి ఎదిరింపఁ దలచి యనిల సఖుని


బాణ వర్షము కురిపించె పంగుఁ గూర్చ

తే.గీ. ఆ సుమాలియు పొ గతోడ నలరు మంచు


నెవ్విధి నహర్పతిని క్రమ్ము నవ్విధి నట

ననిల సఖునిపై కురిపించిన నలములును


తిరుగు వాఱగ దైత్యులు ధీరులయ్యె

తే.గీ. బలము చేతనా దైత్యుని పగటు దనము


నొంది గొప్ప ధ్వనిని సల్ప నులియు చుండ
రక్కసులకు నూపిరు లూది రక్ష జేయు
నటుల శీఘ్రము నెదురేగె నచ్యుతునకు

తే.గీ. కనఁగ నాదనుజు డచట కరినిఁ బోల


నూపుచుండె కరమునట నాపు లేక
సంతసము నొందగ నతడు సద్దు జేసె
మెరుపుతో కూడి యుండెడి మేఘ మటుల

తే.గీ. ఆ సుమాలి ధ్వనిని చేయ నచట అంశు

మాలి, దైత్య రథి కమ్ములు మేలిమి వలె


మెరయు చుండగ ఖండించె శిరము నంత
నత్త రి జవనము లచట నదుపుఁ దప్పె

తే.గీ. నిగ్రహము లేని కోర్కెల నిగ్రహింప

మానవు డెటుల గురిఁదప్పి మనగలేక


తేరు కొనజాల డవ్విధిఁ తేరుకాడు

విడువ నాధ్వజిన్ దైత్యుడు వీడి పో యె

తే.గీ. తురగములు నా దైత్యుని యరదము నట


నుండి దూరముఁ గొనిపో వ దండి తనము

తోడ సమర సన్నద్ధు డై ద్రు ణినిఁ దాల్చి


పో రు భూమిలో హరి తేరుఁ జేరె వడిగ

తే.గీ. కాంచనము తోడ నొప్పగ కాంతి నలరు


నంబు చయమెల్ల సంధింప నా సుమాలి
పక్షు లెవ్విధి నాక్రౌంచ పర్వతమునుఁ
జేరునటుల హరి తనువున్ జేరె నచట

తే.గీ. అంత మాలి వేల కొలది అంబు లిడగ

తనువు బాధింప విష్ణువు, మనిషి యెటుల

కోర్కెలను జయించగ నంత క్షోభ చెంద

నటుల నాత డాలమునందు నటుల నొప్పె

తే.గీ. పిమ్మట ననంతశయనుఁడుఁ బెట్టు తోడ


ఖడ్గ ము గదను ధరియించి కదన గతిని

ధరణి నాథుడై రక్షింప ధరణి నతడు


ధనువు సారించె మాలిపై దర్ప మణచ

తే.గీ. కాంతు లలరు మెఱుపు వోలె ఖగము లచట


వాలి, దేహము చేరగ గ్రో లు చుండె
రుధిర మత్త రి కనగ విషధరుల వలె

నమృతమును పీల్చు చందము నటను తోచె

తే.గీ. శంఖ చక్రములు గదయు శార్ఙ్గి దాల్చి


నా సుమాలిని సమరము నందు యుద్ధ

విముఖునిగఁ జేసి మకుట ధ్వజములు, ధనువు


నశ్వ చయమును విష్ణు వు నచట గూల్చె
తే.గీ. రథముఁ గోల్పోయినను యుద్ధ పథము నందు
గదను ధరియించి సింగము కదను త్రొ క్కి
అంబు ధరపు నగ్రము నుండి నత్త రి నట
మాలి క్రిందికి దుమికెను మదము మీర

తే.గీ. గదను ధరించి దుమికినట్టి మదపు యాసు


రుండు నా సుమాలి, యముఁడు రుదపు హరుని,
బహుధరము చేత నింద్రు డు పర్వతమును
నెవ్విధి చెనకి యాడెను నవ్విధి నట
పక్కిరాయుని ముఖముపై పంపు జేసె

తే.గీ. మాలి గదతోడ మిక్కలి యీలఁగఱచి


దండబెట్టగ నా ఖరణసుండు బాధ
పడుచు నుండగ యుద్ధము న్విడచి
వెన్నుడు మరలి పో వగ వెను దిరిగెను

తే.గీ. మాలి చేతను గరుడుఁడు మాఱునొంద

జిష్ణువునట పరాంగ్ముఖుఁ జేసి నంత


రక్కసి చయము గర్జించె రవము సలుప
నత్త రి మహత్త ర ధ్వని నతిశయించె

తే.గీ. ఇంద్ర సో దరు డైనట్టి యిందు సఖుడు


నఱచు చున్నట్టి యఱపులు విని

పక్షి రాయునిఁ జేరంగ పైన నెక్కి


అడ్డ ముగ కూర్చుని సుమాలి నణగఁజేసి
చంప, తిరుగక నటలనే చక్ర మొదిలె

తే.గీ. సూర్య మండలమున కాంతి శుష్మ మలర


కాల చక్రము తోడను కదియు నట్టి
విష్ణు చక్రము నాకాశ వీధి యందు
కాంతు లలరగ దైత్య శిరముఁ గత్త రించె

తే.గీ. విష్ణు చక్రము వలనను వింగడించి


నట్టి యామాలి భీకరమగు శిరమట

రాహు శిరమెటుల మునుపు రక్త మోడె!

యటుల రక్తముఁ గారుచు నచట పడెను

తే.గీ. అంతట సురలెల్ల రుఁ జేరి నా హరిఁ గని


సింహ నాదము చేసిరి శ్రేయ మొంది

మా‌లి మరణముఁ జూడ కీలాలకులట

వగవు నొందగ లంకకుఁ బారిపోయె

తే.గీ. గరుడు డంత తేరు కొనగ మరల తిరిగి


వచ్చె తొల్లినాడెటుల తా బలము తోడ

నుండెనో యట్లె యెగురుచు నొప్పగ నట


నెగులుతో రెక్కలనిలముఁ నెగుర గొట్టె

తే.గీ. దైత్య ముఖములు కొన్నిటిన్ తఱిగె విష్ణు నేమి


మరి కొందరి యడద నెముకలన్ని

నుగ్గు చేసె నాగదయును నగ్గలికము


తోడ కంఠము లన్నియు తునక లాయె

తే.గీ. తలలుఁ ముసలములు నట పగులఁగ గొట్ట


మరియు కొందరు తునగ బడిరట కత్తి
చేత, శర చయంబు వలన చెండఁ బడగ
అసురు లెల్ల రు దివినుండి యబ్దిఁ గూలె

తే.గీ. కేశ పాశముల్వీడగ నా యాశిరులను


కేశవుని ధనుష్టంకార ఖేలియ లట,

మెఱుపు లలరెడు సెలలచే; మేఘభూతి


చీల్చివేసె నవ్విధిఁ బో లె చెలగి వైచె

తే.గీ. సమర పథమున సేనల చామరములు


తునిగి పో యె, హనువులు తూలి కొనగ
ప్రేవులన్నియు బయటకు వెలువ రించ
చలిత నేత్రముల వలన జంకు నొందె

తే.గీ. హేమ శంఖుడు మర్దించ, సామజములఁ

జేర రక్కసి ధ్వనులును, భారి తోడ


నాక్ర మించబడగ నంత నత్త రి కరి

సలుపు రుతముల వేగము చాయవాఱె

తే.గీ. విష్ణు వత్క్రమించు శరము ల్విడచినంత


వారి నవి నిరోధించగ వారు ఖగము
లను విడుచు చున్న రక్కసు లటను కాల
మేఘముల వలె నుండగ మిట్టి పడగ
నీలి జలదములనుఁ బో లి నిర్గమించె

తే.గీ. సాల్వు లెల్లరు నంతనా చక్రఘాత


చేత శిరములు తెగిపడి చెదిరి పో వ
గదయు చూర్ణించె మేనులన్ ఖడ్గ ముత్త
రించ రెండు ఖండము లయ్యె నెంచగ నట
పుడమి తాల్పునుఁ బో లగ పుడమి కొరిగె

తే.గీ. మణి సరములు కుండల గణము లచట


వ్రేలఁబడు చుండ నసురులు నీలి మేఘ
ముల వలె నలరఁ గూల్చ, ఖతలము నుండి
కూలు నీలి జలదముల వోలె గోచరించె

16/07/2018
:: కవితా స్రవంతి పూరణలు ::

తే.గీ. ఛాయ లలరగ గంగ తా జడను నుండ


ముద్దు లొలుకుచు గౌరియు గద్దె నమర
శ్రద్ధ తోడ నర్చన సలుప శస్త ములను
యిద్ద రమ్మలఁ గూడిన యీశు డిచ్చు

తే.గీ. ఇందు వారము శివునికి నిచ్చఁ గలుగ


నొంటి పొ ద్దు నుపవసించి యోర్మి తోడ

కూర్మితోడ శుభములను కోరినంత

“యిద్ద రమ్మలఁ గూడిన యీశు డిచ్చు”

తే.గీ. సత్య దేవుడట! శ్రీశుండు సత్య మూర్తి!


సత్య నాభు డనంతుడు సత్య విభుడు

సత్యమట కోర్కె ల్దీర్చెడు సత్య హితుడు

“యిద్ద రమ్మలఁ గూడిన యీశు డిచ్చు”

తే.గీ. వల్లి నాథుడు శరవణ భవుడు నతడు

దేవసేనకు ప్రభువును దీన బంధు!


ఆర్తి తోడను నుతియింప నడుగ వరము

“లిద్ద రమ్మలఁ గూడిన యీశు డిచ్చు”

19/07/2018

:: ఆకాశవాణి హై దరాబాద్ పూరణలు ::


కం. పరుగుడు తత్త్వము తోడను

నురుకుచు దూకుచు పరుగుల నుదరుచు వెడలన్

తురగపుఁ దనువులు గల కి
న్నరులకు వానరులకు నిల నాలుగు కాళ్ళే!

కం. మరిమరి ధర్మము కోరగ

పరిపరి విధముల నడుగగ, పరుగిడు చుండన్

తిరుగఁగఁ ద్రిప్పెడు నా 'డో


నరు'నకు వానరునకు నిల నాలుగు కాళ్ళే.

కం. మురిపము లుండవు నింటను


పరుగుల జీవితము నతడు, బాసట లేకన్
పరుగిడు వాహనమున 'క్లీ
నరు’నకు వానరులకు నిల నాలుగు కాళ్ళే.

:: శారదా దండకం (రగణ) ::


వాగ్ఝరీ! శారదా! నిన్నునే గొల్వఁగన్ నామొరాలించవే

నన్ను గావంగ వేగమ్మె రారాగదే భారతీ! నీదు పాదమ్ములం


బట్టి వేడంగనే నీవుదప్పించి నాకెవ్వరూ లేరులే కావవే! బ్రో వవే!
నాదు విద్వత్తు నుం బెంచి విద్వద్వరేణ్యుల్కడన్ నాదు
కబ్బంబులన్నిల్పి వారల్ ప్రశంసింపగన్ వాఞ్ముఖీ! నీదరిం
జేరదీయంగ వాక్కుల్ ప్రసాదించి వాచస్పతిన్ గూడి నన్

బ్రో వుమా! భక్తితోడ న్నినుం గోరగన్ పావకీ! చాపిలా! నిర్ఘరీ!

కూలినీ! జక్కరా! ద్వీపినీ! వాహినీ! వేగినీ! శాంకరీ! శైలినీ!


వేదవిద్యాధరీ! శుక్లవస్త్రాంబరీ! నీవెదిక్కంచు వేడంగ
బ్రో వంగరా శారదా! నీకివే నా నమోవాకముల్ దెల్పుచున్
మ్రొ క్కు చుంటిన్నమస్తే నమస్తే .

19/01/2019
గర్భకవిత్వము *తురంగి*:

వాక్పతి యన గావవె నను వాక్పటిమల* మెండుగ నిడ* గుణపు

వాక్పద మతి నీయ, దయను వాక్పదముల* మాలల నిడ* గనిట

వాక్పటిగను జేయవె నను వాక్పతి! కడు* దీవెన లిడ*గ నిను

వాక్పదముల నే గొలిచెద వాక్పద గతి*వీవు పొ గడ* తరమె!

*తు.వ.ర*:
వాక్పతి యన గావవె నను వాక్పటిమల*మెండుగ నిడ*

వాక్పద మతి నీయ, దయను వాక్పదముల* మాలల నిడ*

వాక్పటిగను చేయవె నను వాక్పతి! కడు* దీవెన లిడ*

వాక్పదముల నే గొలిచెద వాక్పద గతి*వీవు పొ గడ*

*మధ్యాక్కర*:

వాక్పతి యన గావవె నను వాక్పటిమల* నివ్వఁగ నిడ*

వాక్పద మతి నీయ, దయను వాక్పదముల* మాలల నిడ*

వాక్పటిగను చేయవె నను వాక్పతి! కడు* దీవెన లిడ*

వాక్పదముల నే గొలిచెద వాక్పద గతి*వీవు పొ గడ*

*తే.గీ*:

వాక్పతి యన గావవె నను వాక్పటిమల

వాక్పద మతి నీయ, దయను వాక్పదముల

వాక్పటిగను చేయవె నను వాక్పతి! కడు

వాక్పదముల నే గొలిచెద వాక్పద గతి!

19/01/2019
పూరణలు

కం. ధీరులు మాటలు మీరరు


కోర రితరుల పరిభవము గొప్పల చేతన్

కారణ మదియే కన వెట

“కారమె పడిగాపు గాయు కట్టిడు వరకున్”

కం. మీరకు బంధముల నిలను

కోరకు వింతగ వరములు కూరిమి తొలగున్

తీరుగ వీడుమ! దురహం

“కారమె పడిగాపు గాయు కట్టిడు వరకున్”

కం. కోరిక తోడను తెలుగున

మీరగ కైతల తెలుపను మేలిమి వెలుగన్

భారము నెంచకు మిట నుడి

“కారమె పడిగాపు గాయు కట్టిడు వరకున్”

21/01/2019
పూరణ

కం. రాజరికమ్మునఁ బుట్టగ

తేజము తోడను నలరగ దీప్తిని బోలన్


యోజము సరిపడ నిర్వురి

“మోజే లేనట్టి వరుని ముద్దియ వలచెన్”

ఓజము=బేసిరాశి(జ్యోతిషము)

26/01/2019
పూరణ

కం. పో రును సలిపెడు పాండవ

వీరుల తోడను నడిచెడు వెన్నుడు చాలున్

తీరుగ నాతని కడు సహ

కారము కావలెను గాదె కార్యము జరుగన్

26/01/2019
పూరణలు

కం. వానలు నొకపరి కురియగ

చేనున రైతులు చదునుగ చేయుచు కృషితో

దీనత నొందగ నామ్ల పు

“వానలు గురియగను చేల పంటలు మాడెన్”

కం. కానగు రైతుల దుఃఖము


లానవు చూడగ ప్రభుతకు నిక్కము నదియే

దీనత నొందిరి దూరపు

“వానలు కురియగను చేల పంటలు మాడెన్”

కం. మానము పో యిన రైతులు

మౌనము దాల్చిన పిదపను మహిలో చూడన్

వాణిజ్య కేంద్ర జులుముల

“వానలు కురియగ చేల పంటలు మాడెన్”

29/01/2019
పూరణలు

కం. పదముల నల్ల గ శిష్యుడు

బెదరక యలుపెరుగ నట్టి విద్యను బొందన్

పదుగురు మెచ్చగ సద్గు రు

“పదముల నందిన మనుజులు పావన చరితుల్”

కం. ముదమున సన్నుతిఁ జేయుచు

వదలక నమక చమకముల భక్తిగఁ గొలవన్

సదమల మనమున శంకర


“పదముల నందిన మనుజులు పావన చరితుల్”

కం. హృదయము భక్తిని నిండగ

పదముల వేంకటపతి నెఱ పరి భజియింపన్

మది నేకాగ్రత నాతని

“పదముల నందిన మనుజులు పావన చరితుల్”

కం. మదమును వీడగ భువిలో

సదమల పావన పదముల సన్నుతిఁ జేయన్

వదలక సుందర మారుతి

“పదముల నందిన మనుజులు పావన చరితుల్”

కం. పదుగురు మోసముఁ జేయగ

మదిలో నఘములు కలుగును మహిలో నిజమే!

మది నెఱ నమ్ముచు శాంకరి

“పదముల నందిన మనుజులు పావన చరితుల్”

కం. అదుపును వీడక దీక్షగ


మది నటునిటును కదిలింప మానుచు నిలువన్

పదిపదుల నుతుల శ్రీహరి

“పదముల నందిన మనుజులు పావన చరితుల్”

కం. పదవుల కొఱకిట సత్యము

చిదుముచు కుట్రలొ నర్చెడు శ్రేష్ఠు లు వారే

యదనును చూడక ఓటరు

“పదముల నందిన, మనుజులు పావన చరితుల్”

కం. పదపద యనుచును తిరుమల

ముదమున నామము పఠింప మునుమున నేగన్

యదవద తీరును సిరిపతి

“పదముల నందిన మనుజులు పావన చరితుల్”

కం. పదములఁ గూర్పగ పద్యపు

పదములు పాడగ నుతులగు భక్తిని దెలుపన్

పదమును వీడుచు నాశివ


“పదముల నందిన మనుజులు పావన చరితుల్”

29/01/2019

పూరణలు

కం. బిత్త ర చూపులు చూచుచు

తత్త ర పాటున విరాట తనయుడు రణమున్

తిత్తి రి కూసిన, భీరుఁడు

“కత్తి ని పట్టిన మనుజుఁడు కఠినుండగునే?”

కం. బెత్త ముఁ బట్టిన గురువులు

విత్తి నిఁ గూర్పగ పరిపరి వెక్కస మగునా?

సత్తె ము నిల్పుట కొఱకిలఁ

“కత్తి ని పట్టిన మనుజుఁడు కఠినుండగునే?”

కం. చిత్త ము ధర్మము వీడఁగ

సత్తె ము ధూర్తు లు వధింప సతతము ధరణిన్

సత్త ముఁడగు నా కల్కియె

“కత్తి ని బట్టిన, మనుజుఁడు కఠినుండగునే?”


కం. పొ త్త ముఁ బట్టిన వాడును

విత్తి ని పొందగ ధరణిని విబుధుండగునా?

యొత్తి డి తోడను కరముల

“కత్తి ని బట్టిన మనుజుడు కఠినుండగునే?”

31/01/2019

పూరణలు

కం. మనమున నిండగ నాతడు

వినతులఁ జేయగ వరింప పెద్ద లు నొప్పన్

మనువట జరిగెను మామకు

“తనయుడె మగడవగ మెచ్చి తరుణులు మురిసెన్”

కం. మనసెరిగిన యభి మన్యుని

తనము పరిపరి విధముల తలచుచు నుండన్

గన యుత్త ర కట పార్థు ని

“తనయుడె మగడవగ మెచ్చి తరుణులు మురిసెన్!

01/02/2019
కం. అప్పులు చేయుచు నేతలు

తిప్పుచు మీసము ధరణిని తిరుగుచు నుండన్

గొప్పలు మీరగ జనులను

తిప్పలుఁ బెట్టగ నుపేక్ష దేనికి కనరే!

01/02/2019
పూరణ

కం. వీలుగ కన్నులు మూయుచు

మేలగు పాలను కుడువక మెలపును బొందన్

కాలపు మహిమల కల్తీ

“పాలను జూడంగ పిల్లి పరుగులు దీసెన్”

02/02/2019
పూరణలు

తే.గీ. కంటి కలక కలుగగను కంటియందు

మంట లెగసెను చూడగ కంటిపైన

రెప్ప తెరువగ భగభగ నొప్పి గలిగె

“కలువ కంటికి కుంకుమ గరళమయ్యె”


తే.గీ. కట్టు బొ ట్టు ను మఱువగ కాంతులేవి?

కంటి రెప్పకు బరువాయె కాటుకంత

పాదములకును కరువాయె పసుపు పూత

సంప్ర దాయము లేదిలన్ చంద మదియె

“కలువ కంటికి కుంకుమ గరళమయ్యె”

04/02/2019
కం. ఉరకలు వేసెడి వయసున

పరుగులు తీసెడు మనసును పరికింపంగన్

మరిమరి ముందుకు నెగబడ

మరచిరి సర్వము, చదువును మహిలో జనులే!

కం. కవి వరులు దయను జూపగ

కవనము లందు పొ రపాటు గనుగొని జెప్పన్

సవినయముగ నిటఁ గోరితి

ధవళపు టాశిషముల నిడి దరిఁజేర్చుకొనన్

07/02/2019
పూరణలు
కం. మరచుట మాతా పితరుల

మరచుట దైవము గురులను మన్నన యౌనా!

మరచుట విడువగ నదియే

“తరగని దోచంగ లేని ధనమిది జగతిన్”

కం. శరణని కొండల రాయని

పరిపరి విధముల నుతింప భవ్యము నొసగున్

నరయగ శ్రీపతి చరణమె

“తరగని దోచంగ లేని ధనమది జగతిన్”

కం. అరయగ పంచగ లేనిది

పెరుగును దినదినము నెంచ పేరిమి తోడన్

నెఱుకువ నిచ్చెడు విద్యయె

“తరగని దోచంగ లేని ధనమిది జగతిన్”

కం. తరతమ భేదముఁ జూపక

సరియగు మార్గము నెఱపుచు సాగగ నాస

ద్గు రువులు నేర్పిన విద్యయె


“తరగని దోచంగ లేని ధనమిది జగతిన్”

కం. తిరమగు సంపద జనులకు

హరికులు సో దరులు ప్రభువు లరయగ పొందన్

వరమట విద్యయె యెంచగ

“తరగని దోచంగ లేని ధనమది జగతిన్”

08/02/2019
పూరణలు

కం. గుణ సంపన్నుడు ధీరుఁడు

ప్రణయ దురంధరుఁడు సఖుని పాళము నందున్

పణముగ తాఁజేసిన విత

“రణమును దెల్పగ ముదమున రమణియె మురిసెన్”

కం. ఖణఖణ నిప్పులు కురియగ

గణగణ మని రథ రవళుల కదనము నందున్

చణముగ దానొనరించిన

“రణమును దెల్పగ ముదమున రమణియె మురిసెన్”


కం. అణువణువును శోధించుచు

నణచఁగ సేనల కిరీటి యదనును కొని యా

రణమున శత్రు చయంపు మ

“రణమును దెల్పగ ముదమున రమణియె మురిసెన్”

కం. అణుచును కామము క్రో ధము

లణుచును మోహము మదముల హరినిల వేడన్

మణిమయ దివ్యమగు హరి చ

“రణమును దెల్పగ ముదమున రమణియె మురిసెన్”

09/02/2019
పూరణలు

కం. విలువలు నాశము నొందగ

తలలకు జుత్తు బరువౌగ తలపులు మారెన్

తిలకము బరువగు నిల వని

“తలఁ జూడగ రోత గలుగు ధాతకు నైనన్”


కం. తలపుల ఖేదము నిండగ

కలతను పొందగ నవనిజ కన్నీరిడగన్

బలుడగు రావణు బెట్టు వె

“తలఁ జూడగ రోత గలుగు ధాతకు నైనన్.”

కం. కులమత జాడ్యము పెరిగెను

కలిపురుషుని మహిమతోడ కలియుగ మందున్

మలమల మాడగ నిల కల

“తలఁ జూడగ రోత గలుగు ధాతకు నైనన్”

కం. విలవిల లాడగ జనులా

కలి మంటలు చూడ వింత గాదట పుడమిన్

నిల నాయకుల పలుకు కో

“తలఁ జూడగ గలుగు ధాతకు నైనన్”

కం. పిల్ల ల తోడను పతితో

మెల్ల గ చేరిరట కంచి మేలును గోరన్

చల్ల ని స్వామిని బంగరు


బల్లినె తలచిన పడతికి పరవశ మగుగా!

12/02/2019
పూరణలు

కం. అల్ల ట నాయకు లెల్ల రు

నెల్ల లు నెంచక జనులకు నెమ్మిఁని గూర్పన్

కల్ల లుఁ జెప్పుచు నుందురు

“నల్ల ని నిజము ధరలేదు నమ్ముము సుమ్మీ!”

కం. కల్ల లు కావట చూడగ

పిల్ల లు పో యెడు వణిజుల విద్యల నెలవుల్

యెల్ల రు ప్రథమ శ్రేణట

“నల్ల ని నిజము ధరలేదు నమ్ముము సుమ్మీ!”

17/02/2019

సిపాయి

తే.గీ. నుదుట కళ్యాణ తిలకంబు చెదర లేదు

కాలి పారాణి చూడంగ కరుగ లేదు

మెడను తాళిబొ ట్టు కు పసుపు విడువలేదు


వీరుడగు భరత జవాను తీరు జూడు

కంట నీరొలికెడు భార్య కసటు నిదియె

యేరి కైన నోదార్చగ నిచట తరమ!

ముష్కరులు మూక లగుచును మూగి యుండ

దేశభక్తిని చాటుచు ధీరు డగుచు

త్యాగ మొనరించె నాతడు తనువు విడిచి

20/02/2019
పూరణ

కం. వీనుల విందుగ శ్రీహరి

గానము సో కగ జనులకు కామ్యము దీర్పన్

ధ్యానము గొని గానామృత

“పానముఁ జేయగ మనుజుడు పరమును బొందున్”

23/02/2019
పూరణలు

కం. తడిసిన వేదిక చూడగ

తడబడి జారెను చినుకుల తడులకు నటుడే

వడిగను పదముల నిల్పుచు


“నడువగ జాలని యతండు నాట్యము నాడెన్”

కం. మిడిమిడి బో ధన తోడను

పడిపడి చేసెడు నటనలు పదుగురు చూడన్

మడమలు నొప్పులుఁ బుట్టగ

“నడువగ జాలని యతండు నాట్యము నాడెన్”

కం. అడిగిన వెంటనె పదుగురు

వడివడి నడుగుల నరుగుచు బలముగ దూకన్

మడమలు బెణకఁగ నంతట

“నడువగ జాలని యతండు నాట్యము నాడెన్”

కం. బుడిబుడి నడకలు నేర్వగ

వడివడి వేగము సలుపుచు బాలుడు చనగన్

కడు ముదమున జనకుడు గన

“నడువగ జాలని యతండు నాట్యము నాడెన్”

కం. గడచిన కాలము తలఁపఁగఁ


దడబడు చుండెడు మనసున తమమును విడువన్

గడగడ మధువును జేకొని

“నడువగ జాలని యతండు నాట్యము నాడెన్”

24/02/2019
ఫూరణలు

కం. ఖలులకు విలువలు తెలియవు

తలపులు కక్కును విషమును తల కెక్కంగన్

సలికెద రకృత్యము లెపుడు

“విలువల వలువలు విడిచిన విజ్ఞు లిలపయిన్”

కం. విలువకు వలువలె విలువట

విలువల వలువల నొలిచిన విలువ లలరునే!

విలువల నెరుగని మనుజులె

“విలువల వలువలు విడిచిన విజ్ఞు లిలపయిన్”

కం. వలవల ఏడ్చుట తగదిల

విలువయె గూర్చును జనులకు విజ్ఞత విద్యల్


తెలివి నశించిన వారలె

“విలువల వలువలు విడిచిన విజ్ఞు లిల పయిన్”

కం. తలపులు వెఱ్ఱి ని పొందగ

వలపులు నాగములఁ బో లి పడతులఁ జెఱచన్

బలవంతులుగ తిరిగెదరు

“విలువల వలువలు విడిచిన విజ్ఞు లిల పయిన్”

కం. కలిమిని కల్గిన వారలు

చెలిమిని హేళన సలిపెడు చిత్త ము తోడన్

బలమని తలతురు వాపును

“విలువల వలువలు విడిచిన విజ్ఞు లిల పయిన్”

12/03/2019
పూరణలు

కం. ధనమట చూడగ నాగము

మన మాశ పడగ కలుగును మదము నరయగన్


మనమున నేర్పడు కడు క్రో

“ధనమెన్నటికైన నిలనుఁ దగవులఁ దెచ్చున్”

కం. వినదగు పెద్దలు చెప్పగ

మనమున శంకలు కలిగిన మహిలో జనులా!

పెనఁకువ లొందగ నా యిం

“ధనమెన్నటికైన నిలనుఁ దగవులఁ దెచ్చున్”

కం. వినయము నేర్తు రు శిష్యులు

ఘనముగ విద్యను గురువులు కఱపగ నంతన్

మనమున నిండిన చెడు బో

“ధనమెన్నటికైన నిలనుఁ దగవులఁ దెచ్చున్”

13/03/2029
పూరణలు

తే.గీ. గట్టు గట్టు న తిరుగుచు గద్ద వోలె

పట్టు బట్టగ నేతలు ప్రజల పొ ట్ట


గొట్టి బిల్వపత్రంబులఁ గోసి జేత

పట్టి లింగంబు మెడగట్ట భక్తుఁడగునె!

15/03/2019
కం. ధీరులు ధైర్యము వీడగ

చోరులు విచ్చల విడిగను చొచ్చుకు రాగన్

దారుల వెంబడి తిరుగుచు

గారడి చేయంగ ఘనులు గమిఁగాడ్రె సుమీ‌!

కం. పేరుకు పెద్దలు చూడఁగ

వారలు జనులను జలగల వలె పీడింపన్

తీరుగ మోసపు పల్కుల

“గారడి చేయంగ ఘనులు గమిఁగాండ్రె సుమీ!”

కం. ఏరును దాటఁగఁ దెప్పనుఁ

దీరుగ నెరియిం తురిలను తెలుపగ లేరే!

మారు ముఖముల ధరించుచు

“గారడి సేయంగ ఘనులు గమిఁగాండ్రె సుమీ!”


కం. ధారుణి రాజ్యము సంపద

హారకు డాశకుని మామ హరియింపంగన్

కౌరవు లంతటి వారలు

“గారడి చేయంగ ఘనులు గమిఁగాండ్రె సుమీ!”

కం. బేరము కుదిరెను ఓట్ల కు

తేరగ పొందగ పదవులు తిష్ఠ లు వేయన్

తీరుగ మాయల తోడను

“గారడి చేయంగ ఘనులు గమిగాండ్రె సుమీ!”

16/03/2019
కం. మెచ్చగ కాశీనాథుం

డిచ్చును సతతము మనలకు నీప్సిత సిద్ధి న్

ముచ్చట శిరియాళుని కథ

నిచ్చగ నెల్ల రు పఠింప నీశుడె రక్షా!

16/03/2019
పూరణలు

కం. ఇల వైకుంఠము తిరుపతి


నిలయము నాయకులకదియె నిత్యము భృతియై

వెలవెల బో యెను ధర్మము

కలియుగ వైకుంఠముఁ గన కలగా మిగిలెన్

కం. పిలిచిన భక్తు లు పలుకడు

వలదని యాగమ నియమము వర్జింపంగన్

తలచిరి కాసుల నిధియని

“కలియుగ వైకుంఠముఁ గన కలగా మిగిలెన్”

కం. వెలసెను కనుమల నడుమను

తలగాచగ జనుల నిలను తనకలిఁ దీర్పన్

కలవారి చేతల వలన

“కలియుగ వైకుంఠము గన కలగా మిగిలెన్”

17/03/2019
పూరణ

కం. తిరమని సంపద లెల్ల ను

తరముల కొరకిల సరిపడ దండు కొనంగన్


కరముల నెంగిలి తోడను

కరటము నైనను తఱమరు కలియుగ మందున్

18/03/2019
కం. శంకర! శరణని వేడగ

శంకలఁ బాపును దయఁగని సన్మతి నిచ్చున్

శంకర భగవత్పాదులె

పంకముఁ దీర్పగ జనించె భగవ ల్లీలన్

19/03/2019
పూరణలు

కం. కరముల గాజుల సవ్వడి

“తరుణికి నందమ్ము నొసగు, తలపై కొమ్ముల్”

హరిణము పొందగ నత్త రి

ధరణిని తిరుగాడినంత ధన్యులు కారే!

కం. దరుమము కాదట చూడఁగ

“తరుణికి నందమ్ము నొసగు తలపై కొమ్ముల్”

పరువపు వయసున తురుమగ


విరులగు మల్లె లు మరువము వేడ్కను బొందన్

కం. పొ రబడి యనంగ గూడదు

“తరుణికి నందమ్ము నొసగు తలపై కొమ్ముల్”

తరుణముఁ జూడగ గరిఁటెలఁ

గురిపింతురు తలలపైన గుబ్బలు పొంగన్

20/03/2019
పూరణలు

కం. అన్నముఁ బెట్టు చు గురువులు

వన్నెను నిచ్చెడి చదువును వాసిగఁ జెప్పన్

మన్నన లేకయె మరువగ

“తిన్నింటికి నిప్పుఁ బెట్టు తీరుగ నుండున్”

కం. మన్నన లిత్తు రు ముఖమున

పన్నగములఁ బో లి యుండ పబ్బము గడుపన్

యెన్నగ ఫలమును పొందియు

“తిన్నింటికి నిప్పుఁ బెట్టు తీరుగ నుండున్”


కం. అన్నువు నొందగ ఖలులిల

నున్నత బుద్ధి ని విడచుచు నురకలు వేయన్

తన్నగ కుడిచిన కంచము

“తిన్నింటికి నిప్పుఁ బెట్టు తీరుగ నుండున్”

25/04/2019
కం. తిమ్మిని బమ్మినిఁ జేయుచు

బొ మ్మను చూపును బొ రుసుగ పుడమినిఁ జూడన్

నమ్మక మమ్ముడుఁ బో వగ

వమ్మగు సర్వము కనుగొన భావ్యము కాదే!

25/04/2019
కం. కమ్మగ కవనము లల్లు చు

నెమ్మినిఁ గూర్పఁగ కవులిట నిర్మల మనమున్

ఝుమ్మను నాదము పొంగగ

కమ్మని కంఠముల తోడ గానము సలుపన్

26/04/2019
శంకరాభరణం వారి సమస్య:

తే.గీ. తెలుగు చలన చిత్రములు గన తెరపి లేక

పదుగు రెదుటను కుఱుచగ వస్త్రములను

దాల్చి నాయికల్ నటియించు తరుణమందు

"రవికయే చాలుగద! చీర రమణికేల?"

తే.గీ. ఇంటి పడతి నాహ్వానింప కంటకముల

మరచి పసుపు కుంకుమలును మట్టి గాజు

లిచ్చి స్తో మతకుఁ దగిన దిచ్చ తోడ

"రవికయే చాలు గద! చీర రమణి కేల?"

27/04/2019
శంకరాభరణం వారి సమస్య:

కం. కాంక్షలఁ దూరముఁ బెట్టగ

నాంక్షల యొడ్డు న తపమును నవలంబింపన్

సంక్షోభములేని ధనా

"కాంక్షలె యుండవు జనులకు కలియుగ మందున్"

03/05/2019
దత్త పది:156 బాల్-రన్-వికెట్-విన్
కం. మన్నునుఁ దింటి*వి కెట్లి *ల

మన్ననఁ నొందెద వనుచును మాతయె కో*రన్*

కన్నయ *బాలా*ర్కునివలె

*విన్ను*ను విశ్వమును జూపె వెన్నుడు నోటన్

26/05/2019
కం. మ్రొ క్కెద వేంకటపతి నిను

మ్రొ క్కెద నుతులిడి నిరతము మోదము తోడన్

మ్రొ క్కెద తిరు సప్త గిరుల

మ్రొ క్కెద మ్రొ క్కుల నిడువగ బ్రో వుమ! శ్రీశా!

27/05/2019
కం. మనమున కలిగిన తలపును

వినయము నలరగ కవనము విరచింపంగన్

ననుగని గురువులు ముదమున

ఘనముగ దీవెన లిడగను కౌతుక మబ్బెన్

28/05/2019
కం. మధురా నగరిం గృష్ణు డు
మధురంబుగ వేణు వూద మడతులు నెమ్మిన్

మధురంపు కలలఁ దేలగ

మధురం బాయెను సుమధుర మధురము కురిసెన్

30/05/2019
కం. మనసారగ నినుఁ గొలిచెద

మనమున నిల్పగను నీదు మధురాకృతినే

తనువే పొంగెను నినుగని

దనుజారీ! దయ గనుమయ! తాపముఁ దీర్పన్

05/07/2019:
*వనమంజరి*

మనము తపో వనమున్ చరియించుచు మంత్ర నిష్ఠ ను పొందగన్

వనమున దైత్య దృశాన సుతుండును పాడి నొందగ దేవయా

నననువుఁ గైకొని యాతనిఁ జూచుచు నావిధంబున కోరగన్

మనువును, కోరిన యింతిని కాదని మంత్రవాటిక చేరెనే

05/07/2019
*కనకలత*
కనక లతవలె వనిని జనకజ దిగులు నలరనా

దనుజపతి మదమున మనముఁ దలచె వశము కొఱకున్

తనదుగ పసరిలుచు మనగ ధరణి వగచె కనగన్

ఘనమగు చరిత గల మగడు కపిరథు డెటు లలరున్

10/07/2019

పూరణ

కం. కవియను పేరున డంబపుఁ

గవనము లల్లు చుఁ దెలుఁగును గడతేర్చంగన్

గవియని భ్రమపడుచు వికట

కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

15/07/2019

పూరణ

ఉ. దారుణ కృత్యముల్ సలుప ధారుణి యందున తీవ్రవాదులున్

ఘోరము లెన్నియో ప్రజకుఁ గూర్పగ శాంతి నశించెఁ జూడఁగన్

దూరపు యోచనల్ గరిపి దుష్టు ల నాశము చేయఁగా నదే


“మారణ హో మమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పగన్”

18/07/2019

పూరణ

కం. ముల్లె టు లేదని తెలిసియు

చల్ల ని మనమున గ్రహించి సాకుచు నుండన్

అల్లు డె వడువుగ మారగ

నిల్ల రికమ్మేఁగ దోషమెట్ల గు జగతిన్

19/07/2019

పూరణ

కం. కులుకు లొలుకగను ముదితా!

పలుకుల తేనెలు కురియగ భాసిలె కనగన్

అలుకల దేవ గణికలకు

“చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో!”

31/07/2019
*కవికంఠ భూషణము*

పొ రఁబాటు సేయగను పో రున నిల్వరు తాపసుల్ గనన్


ధరణీశ్వరుల్ కసరు ధారులు కాగ యశంబు నీరగున్

ధరణీ తలంబు నది తానె నశింపగ తప్పులేరి కే

సరళిన్ ముగింపగను సాహస మేర్పడునో? కదా! యిటన్

01/08/2019

పూరణలు

కం. సుందర కవనము లల్లు చు

ఎందరి మనసులు సి.నా.రె! యింపుగ దోచెన్

నందము జగతికి కొఱవడ

తొందరపడి కైత పిట్ట తుఱ్ఱు న నెగిరెన్

01/08/2019
*కవికంఠ భూషణం*

ఘన పల్ల వంబులను గర్జన చేయుచు పెర్కుచుండగన్

వనధీరుఁ డాకపి నభాంతరమున్ సెగతోడ తేజరి

ల్లు నభోమణిందలప లోకము భీతిని పొందు చుండగన్

వనమున్ చరించు పశువానర పక్షులు తల్ల డిల్ల గన్


03/08/2019

పూరణ

కం. కవి తాననిఁ జెప్పుకొనుచు

నవలక్షణములను గూర్ప యాతృత తోడన్

చవుకన్ జేయుచు విలువిడ

“క, వినాశముఁ గోరి వ్రా యుఁ గావ్యము లెలమిన్”

03/08/2019
వాన-వాన-వాన-వాన దత్త పది

కం. దేవా! నగేశ! కావగ

రావా! నను కరుణతోడ రయమున జగతిన్

దావానలమును ద్రా వగ

నీవా నందమును పొంది నెమ్మి నిడితివే!

04/08/2019
శంకరాభరణం వారి సమస్య:

ఆ.వె. కవులు భావములను కవనము లల్ల గ


జనులు చదివి మదులు సంత సింప

కలతలున్న గాని, కసటు నొందకను స

కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

09/08/2019
సమస్య-3100

కం. విలువలు ధర్మము పద్ధతి

తెలియక కొందరు ధరణిని తిరుగుచు నుండన్

మలినపు మనసుల నడిచెడు

లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

10/08/2019
సమస్య:3101

ఆ.వె. మంచి చెడులు లేక మనుచుండగా నేడు

దుష్ట జనులఁ గలసి దొరల వలెను

పాప పుణ్యములను వదలి యార్జించిన

“కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము”


15/08/2019
కం. జాతికి గర్వము నింపగ

ఖ్యాతిగ గగనము నెగిరెడు త్యాగపు గురుతుల్

భాతిగ త్రివర్ణ టెక్కపు

రీతిగ జనులట నుతింప రెపరెప లాడెన్

19/08/2019

పూరణ

ఉ. మెండుగ వాన నీరరుగ మేదిని సంతసమందగా నిలన్

పండుగ తల్పగన్ జనులు బారులు దీరుచు నీటిఁజూచుచున్

దండగ యెన్ని వానలిట ధారగ నూరినఁ జేరు సంద్రమున్

దండిగ వానలే కురిసె దప్పిక దీర దదేమి చిత్రమో!

27/08/2018

పూరణ

కం. దిక్కులు నాశ్చర్య పడగ


నక్కట! చండాలుడు జగదారాధ్యు కడన్

చక్కని ప్రతిభనుఁ జూపగ

“నెక్కడి దీమేధ సుంత యెఱుగడు శాస్త్రా ల్”

కం. సాంబ సదా శివ శంకర!

సంబర మంబరము మీట సత్కవి నుతి భా

సంబలరగ ఖండిక జగ

“దంబయె మెచ్చగ కృతిగను నాకృతి నొందెన్”

28/08/2019
కం. జానకి రాముల పెండ్ల ట!

గానము చేయుచు కనంగ కల్గు ను శుభముల్

మీనము మేషము లెంచక

దేనముఁ జేయుమ! హరి! యని దీరును దొసగుల్

29/08/2019

పూరణ

కం. తీరుగ రామునికి గుడిని

నేరక గోపయ వడిగను నేర్పుగ గట్టెన్


నేరము నెంచిన ప్రభు ద

“ర్బారునఁ గూర్చున్న వాఁడె భక్త వరుడగున్”

05/09/2019

పూరణ

కం. అడుగుల నడుగిడి యొదుగుచు

బడికిని నిత్యముఁ జనంగ పాఠము నేర్పన్

నిడుముల కోర్చుచు మఱి రా

“బడి కేగని పంతులె కడు ప్రా భవ మొందెన్”

దత్తా !

కం. భారము తాళగ నైతిని

నేరము లెంచకు సురేశ! నెనరు నొసంగన్

దీరము జేర్చుమ! దుఃఖపు

సారము శీఘ్రము హరింప జై గురుదత్తా !

కం. నిండగు నీ మోమును గన

మెండుగ మోదమ్ము కలుగు మేదిని యందున్


నండగ నుండఁగ నఘములఁ

జెండఁగ జనులిల సుఖించు శ్రీ గురుదత్తా !

కం. కమలము జపమాలయు గొని

విమలపు రూపము నభయపు వెలుగుల తోడన్

శమమును నింపఁగ జగతిని

శమలముఁ దీర్చెడు విభుఁడవు సద్గు రు దత్తా !

కం. క్షత్రియుఁడు కార్త వీర్యుఁడు

శత్రు వు పో రును సహింప శక్తియు లేకన్

అత్రికిఁ గొమరుఁడ వగునిను

శత్రు వు మూకల దహింప శరణనె దత్తా !

కం. సకల చరాచర జగతిని

నొకటిగ కావఁగ వచ్చితి వోరిమి తోడన్

తకపిక లాడెడు జనులను

సకలము నీవై యరయుమ! సద్గు రు దత్తా !


కం. ధర్మము కాదట నీకును

నర్మము సల్పక దయఁగొని నన్నేలంగన్

గర్మఫలములఁ హరింపఁగ

మర్మముఁ దెలుపుమ! గురువర! మద్గు రు దత్తా !

కం. సృజియించు తాత వీవట

భుజియింపగ భుక్తి నిడెడు పుష్కరనాభా!

విజయము తుదకిల నీదట!

గజ చర్మాంబర! తిరుగుణ! కావుమ! దత్తా !

కం. కొందరు విధాత యందురు

కొందరు విష్ణు వుగఁ దలఁచి కొలిచెద రిలనే!

కొందరు లయకరుఁడనుచును

వందన శతములఁ నిడెదరు భక్తిగ దత్తా !

కం. విజ్ఞా న ధనుడ వీవట


విజ్ఞులు మెచ్చంగ నాకు విద్వత్తి డుమా!

సుజ్ఞా నము తోడను నా

యజ్ఞా నము రూపు మాపు మనయము దత్తా !

కం. కారణ జన్మముఁ దాల్చఁగ

దేవర వైతివి జగతినిఁ దీర్పఁగ వెతలన్

దారినిఁ జూపఁగ నాకును

నేరము లెంచక సరగున నెనరిడు దత్తా !

కం. వరదాభయ ముద్ర నమరి

వరదుఁడవై జనులఁ గాచ పఱదెంచంగన్

మరిమరి తపమును సల్పఁగ

దరిఁగొను వేల్పువు నుతింతు దయఁగను దత్తా !

కం. తిరుమూర్తిగ వెలసితివఁట

తిరు జగముల నరయు నట్టి త్రిగుణాత్మకుఁడా!


నరులకు బో ధలు జేయఁగఁ

జరితముఁ దెల్పితి వలరగ సద్గు రు దత్తా !

కం. సుమతిగ నామముఁ బెట్టెను

మమతగఁ పెంచుచుఁ దపించె మతి లేమిఁ గనిన్

సుమతినిఁ గూర్పు మటంచును

సుమనము తోడను నుతులిడె శుభకర! దత్తా !

కం. సంధ్యోపాసన గరపఁగ

సంధ్యా తర్పణమిడంగ సంతుని తోడన్

సంధ్య నొనర్చె సుమతికై

సంధ్యా దేవిని నుతించె సద్గు రు దత్తా !

కం. పుత్రు నిఁ జూడఁగ నపుడు ప

విత్ర జలంబులు స్రవించె విప్రు ని కంటన్

ఆత్రము నిండఁగ వేడఁగ


మిత్రు ఁడవై గాచినావు మేదిని దత్తా !

కం. కోరిన కోర్కెలుఁ దీర్చెడు

కూరిమి దేవతగ వెలసి కోవెల యందున్

భారముఁ బాపుచు జనులకు

సారము నియ్యఁగ బ్రో చెడు సద్గు రు దత్తా !

కం. ఎంచకు దోషము నేరము

లెంచకు క్రో ధము తమకము లెంచకు దేవా!

యెంచకు మత్సర మదముల

నెంచక బ్రో వుమ! నుతింతు నెలమిని దత్తా ! 68

కం. చాలవు కన్నులు నినుఁగన

చాలవు కంఠము కరములు సన్నుతిఁ జేయన్

చాలవు మంత్రము జపములు

చాలట నీదర్శన మిల సద్గు రు దత్తా !


కం. వేడఁగ నులకవు పలకవు

పీడను చీడను హరింప వేడితిఁ గాదే!

పీడిత భక్తు ఁడ నైతిని

వీడకు కడలిని దయఁగను వేగమె దత్తా !

కం. వీక్షించుచు నిలఁ బ్రో చెడు

రక్షవు నీవే! దయఁగొని రయమునఁ గావన్

భక్షణ చేయఁగ నఘముల

తక్షణమే నరులఁ గాచు దయతో దత్తా !

కం. ఇలలో నీవే దైవము

కలలో నీవే తోడుగఁ గాపాడంగన్

తలఁపే నీదై యుండఁగఁ

జలమే లేదింక బ్రతుక జైగురు దత్తా !

కం. నా పలుకులలో భక్తిని


నా పిలుపులలోన నీదు నామము వినగన్

నీపద రాజీవములను

నే పట్టగ వడిగ నీవు నెనరిడు దత్తా !

కం. సుర లెల్ల రంత నపజయ

మరయగ నాస్థ లి విడిచిరి యాయువు తోడన్

గురువర! నీకు నుతులిడుచు

వరమును కోర నొసఁగితివి వల్ల భ! దత్తా !

కం. నీవే దిక్కని తలచితి

నీవే సత్యము జగతిని నేమము నీవే!

నీవే మక్కువఁ జూపగ

నీవే యక్కునఁ గయికొని నిలుపుమ! దత్తా !

కం. దయఁ జూపుమ! శ్రీగురువర!

రయమున నరుదెంచఁగ నిల రక్షింపంగన్

భయమును నణఁచఁగఁ బ్రో వుమ!


జయము నొసంగుమ! కొలిచెద జైగురుదత్తా !

కం. మేడలు మిద్దెలు వలదయ!

వేడెదఁ గంటకముఁ దీర్ప వేగమె రాగన్

గోడును దయతోఁ గనుఁగొని

వీడక నను నాదు కొనుమ! విధిగను దత్తా !

కం. పేదయు రాజను భేదము

లేదని చాటితివి నీవు లీలారూపా!

మోదము ఖేదము లొకటను

వేదముఁ దెల్పితివి దేవ! వేడ్కఁగ దత్తా !

సుమతీ!

కం. నీరజ పత్రము పైనను

నీరపు బిందువు నిలువదు నిరతమటులనే

భారపు నిందలు తాకవు

నేరము చేయని మనుజుని నిక్కము సుమతీ!


కం. కంటికి ముఖ్యము చూపట

యింటికి భార్యయు నటులనె నెంచఁగ ధరణిన్

వింటికి నారియె మూలము

పంటకు నీరటుల వలయు పాడియె! సుమతీ!

కం. తేలుకు కొండెమున విషము

క్రూ రపు సర్పమున కుండు కోరల యందున్

కాలునకు గళము నుండగ

ధూలక మెల్ల యు నరునకు తొణకును సుమతీ!

కం. నామముఁ బెట్టగ చదువుకు

ప్రేమని దారులఁ దిరుగుచు పెద్ద లఁ దెగడన్

కామము తోడను పెండ్లి ని

తామసమున నింద నిడగ తగునా! సుమతీ!

కం. విలువలు (వి)చిత్ర జగతినిఁ

దలచిన సాంతము నశించె దారుణ రీతిన్


పలుచని పీలిక వస్త్రము

లలరగ పరుగిడె జనంబు నరయగ సుమతీ!

కం. బింకముఁ జూపఁగ నెల్లె డ

శంకలు జేరవు దరికిని సతతము ధరణిన్

వంకలఁ బెట్టకు జనులకు

జంకును వీడగ చరించు చక్కగ సుమతీ!

కం. నలిగిన పూవులు నెప్పుడు

ఫలముల నీయవు కనంగ పతనపు దశలో

కలిగిన యాశలుఁ దీరవు

కలలై మిగులును చివరికి కర్మము సుమతీ!

కం. ఇల్లా లు తత్త రఁ బడుచు

నల్లు డు తా వచ్చినంత నప్పుకుఁ బో వన్

నెల్లె డఁ దిరిగిన దక్కదు


చెల్లు న! పచ్చడి మెతుకులు చెప్పుము సుమతీ!

కం. పదుగురకు హితవుఁ బల్కిన

బెదిరింతురు పెద్దలంత వెక్కస పడుచున్

నుదురు పలకరింప నొసలు

చదురడచుచునుండు కనగ సత్యము సుమతీ!

కం. రైతుకు కష్టము దక్కదు

నేతన్నకు నూలు లేదు నేయుట కొఱకున్

వ్రా తలు మారవు చూడగ

చేతలు లేవు సవరింప చిత్రము సుమతీ! ‌

కం. సున్నమ్మన్నం బగునా?

మన్నును వెన్నగ తినగల మనుజుడుఁ గలడా?

దున్నకు నీనుట తెలియున?

తిన్నది యుండున నరుగక తెలియర! సుమతీ!


కం. అమ్మను మించిన ప్రేమయు

నమ్మను మించగను వేల్పు నరయం గలమా!

కమ్మని ప్రేమను నొసగెడు

యమ్మను మఱచుట దురితమ నర్థము సుమతీ!

కం. అల్లు డు కలియుగ మందున

పిల్ల ను పెండ్లా డి నంత ప్రియమగు నపుడున్

చెల్ల గ కాలము నాతడు

తల్ల డ పెట్టెడు వ్రణమగు తథ్యము సుమతీ!

కం. ఉన్నది లేనిది చెప్పుచు

మన్ననఁ బొందగ తలచెడు మనుజులు ధనులే!

దున్నయె యీనెను దూడను

దన్నుకు కట్టుండ నెదరు ధరణిని సుమతీ!

కం. పగయును ద్వేషము లెప్పుడు

పగవారల మనసులందు వహ్ని రగుల్చున్


పొ గ లేనిదె సెగ రాజగ

తొగరింపగఁ జేయుదురట! ధూర్తు లు సుమతీ!

కం. గాడిద గుఱ్ఱం బగునా!

బూడిద దండిగ పులిమిన బో డిగ నగునా!

చూడులుఁ బెట్టిన నక్కయె

చూడగ మారున! పులివలె చోద్యము సుమతీ!

కం. అతిఁజేయుదురు గతింపగ

మితిమీరును దానములును మేదినిఁ జూడన్

మెతుకులు పట్టెడుఁ జాలును

పితరులు జీవించి యుండ పెట్టరు సుమతీ!

కం. కులుకులు నేర్వని వనితలు

పలుకగ ముత్యములు రాలు పదుగురి యెదుటన్

వెలకాంతలు కులుకు లొలుక

చిలుకలు సిగ్గు పడు భువిని చిత్రము సుమతీ!


కం. కష్టములు దరికి చేరును

దుష్టపు మైత్రినిఁ సలుపగ దొసగులుఁ గూరున్

దుష్టు ల దూరముఁ బెట్టగ

కష్టము లేర్పడగ రావు గదరా సుమతీ!

కం. పడతుల మనసులు కనుగొన

పడరాని శ్రమను పడవలె భారము తోడన్

తడబడు నవసర మేటికి?

కడలిని దాటుట సుఖమట గదరా సుమతీ!

కం. పుబ్బనుఁ బుట్టగ మఖలో

జబ్బును పడగను జగతిని చచ్చెద రంద్రే!

పుబ్బ మఖములకు మధ్యన

నిబ్బడి ముబ్బడిగఁ బుట్టి యేలిరి సుమతీ!

కం. దూరము కలువకు చంద్రు డు


దూరము కమలానికి రవి తూర్పు పడమరల్

దూరము కావట మదులకు

దూరము భౌతిక పరమని తోచును సుమతీ!

కం. పుస్త క ముఖచిత్రముఁ గని

మస్త క మున వెల మదింప మనిషికి తరమే!

వస్తు వు రూపము దెల్సిన

కస్తు రి వాసన తెలియదు గదరా! సుమతీ!

కం. మెత్త గ మాటలుఁ జెప్పుచు

నత్త ను దూషింపలేక నటులనె యుండన్

దుత్త లు రెంటిని కోడలు

మెత్తఁగఁ జూర్ణంబుఁ జేసె మేదిని సుమతీ!

కం. చిత్త ముఁ జూపును నిల్పును

విత్త ముకడ నెప్పుడు పరి విధముల మనుజుల్

చిత్త ము! చిత్త మటంచును


సత్తె ముఁ బల్కరు ధరణిని సతతము సుమతీ!

కం. గొప్పలు పేరుకు మాత్రమె

తెప్పలుగ నసూయ మదిని తెలియదు వెలికిన్

తప్పుల నెంచెడు వారలు

మెప్పులఁ గాంచగను లేరు మేదిని సుమతీ!

కం. నేర్పగ గురువులు విద్యను

నేర్పుగ సాధింపగ గొప్ప నేర్పరు లగుచో

నేర్పడు జగతిని స్థా నము

దర్పముఁ జూపక మెలగిన ధన్యుడు సుమతీ!

కం. ఒకపరి నపజయ మందగ

తికమక పడవలదు జయము దెబ్బునఁ గలుగున్

నకముల నెంచక దిటవుగ

మెకములు సైతము తెలివిగ మెలగును సుమతీ!


కం. తప్పును నొప్పుగఁ జూపుచుఁ

దిప్పలు పడుచుండు వారు తేకువ తోడన్

తప్పుల మీదను తప్పులుఁ

దెప్పలుగ సలుపుచు నుంద్రు తెలియర సుమతీ!

కం. మీరకు తలిదండ్రు ల నుడి

మీరకు గురువుల పలుకులు మేధము సేయన్

మీరకు నతిథుల సేవలు

మీరగ తప్పవు యఘములు మేదిని సుమతీ!

కం. దోసము నెఱుగుమ! ధరణిని

వాసన వెదఁజల్లు విరులు బాధలఁ బొందున్

గ్రా సము నిచ్చెడు రైతులు

మోసము తెలియక వెతలను మోయును సుమతీ!

కం. దీనులఁ జేరగఁ దీయుచు

దానముఁ జేసిన శుభంబు తానుగ వచ్చున్


మానవ సేవను మించిన

యానందము లేదట నిల నరయుమ! సుమతీ!

కం. గొంతుకలనుఁ గోసి కసిగ

జంతువులను జంపుచు తమ జానెడు పొ ట్టన్

వింత రుచు లరగఁ దినుచును

సుంతయు కనికరమునుఁ గన జూపరు సుమతీ!

కం. నీచుల వెనుకనుఁ దిరుగుచు

దోచుకు తిను వాడి నిచట దుర్మదు డనరే!

కాచును నమ్మిన ధర్మము

నీచము వర్జించు వాడు నేర్పరి సుమతీ! ‌

కం. కవివర! బద్దెన! గొనుమయ!

సవినయ నుతులను నిడితిని సన్మతి తోడన్

భువిలో నీవు రచించిన

కవనము లమరము సతతము కనుగొని పొగడన్.


విజయ రామ!

తే.గీ. నీదు చరితము వినగను నేను మ్రొ క్క

వేద విమలము చెవులార వినగ జనులు

నట్టి చరితము వ్రా యగ నఘము దీర

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. పుత్ర కామేష్టి సలుపగ, పూపు తోడ

నవని యందున జనియించె నఘము బాప

జనుల గాచఁగ దయతోడ, సన్నుతింతు

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. తోడ బుట్టిన వారికి తోడు నిలచి

'అన్న' మాటకు సరిపడు నర్థ మిడుచు

ప్రేమ పంచిన యన్నవు ప్రేమ మూర్తి!

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ! ‌‌

తే.గీ. రామ నామమే సేమము రమ్య విధిని


రామ కీర్తన సేయఁగ రమణ మొందు

మనసు తీరగ నాహృది మననఁ జేయ

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. సీత లక్ష్మణుఁ దోడను చింతఁ బడక

జనుల కన్నీటి నడుమను చనుచు నీవు

కాన కేగిన ఘనుఁడవు, కరుణఁ జూపి

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. కాపు చేయగ సౌమిత్రి కంచె బో లె

నిదుర సైతము వర్జించి నిలిచె నతఁడు

సుగుణ సంపన్ను డతడునుఁ, జూడ నిన్ను

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. ధర్మ విగ్రహుఁడ వైతివి ధర్మ తేజ!

ధర్మమును నిగ్రహించుటే తలఁచి నావు

ధర్మ మూర్తిగ వెలసిన ధరణి నాథ!


విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. స్వర్ణ హరిణమున్ జూచి తా సరసఁ జేరి

పతిని కోరెను వేగమే పట్టు మనుచు

కాంతు లీనగ మృగమును గాంచి వేడె!

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. కాల మహిమలు నొకరీతిఁ గాన రావు

అదియె విధి యాడు నాటక మనఁగ నాడు

తెలిసి చనితివి నీదు సతి చవిఁ దీర్ప

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. వేద భూమిని పాలింప వెలసినావు

ధర్మమే నీదు నూపిరిగనుఁ దలఁచి నట్టి

క్రతువులను దాపసుల నీవు కాచినావు

విద్య వినయము లొసఁగుమా! విజయరామ!

తే.గీ. అమ్మ సీతకు నేమియు నఘము లేక

కాచు చుంటివి సతతము కాన యందు


నాదు కష్టముఁ దీర్పగ నన్ను బ్రో చి

విద్య వినయము లొసగుమ! విజయ రామ!

తే.గీ. ముగ్గు రమ్మలకును నీవు ముద్దు లొలుకు

సుతుఁడవు, కడపటమ్మకు శుభమొనర్పఁ

గానలకు నేగినావట కరుణ మూర్తి!

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. ధరణి నేలఁగ నిలపైకి దాశరథిగ

నెలమి నొసఁగి కాపాడఁగ నీరజాక్ష!

యవత రించితివయ! నీవు యసుర హారి!

విద్య వినయము లొసగుమ! విజయ రామ! ‌

తే.గీ. ఆది మధ్యాంత రహితుడౌ హరివి నీవె!

కంటకమ్ముల బాపుము కరుణ తోడ

నీవు దిక్కంచు మ్రొ క్కఁగ నీలవర్ణ!

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ! 28

తే.గీ. దాశరథి! కరుణా నిధి! దైత్యహారి!


శరణుఁ జొచ్చిన వారిని కరములఁ గొని

సతము బ్రో చెడు వాఁడవు సత్యదేవ!

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. మునులు సలుపు యాగములకు ముప్పు లేక

శరములను సంధించి యసురులనుఁ గూల్చి

యజ్ఞఫలములఁ గూర్చితి వమర వినుత!

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ! ‌

తే.గీ. తండ్రికిచ్చిన మాటకుఁ దలను వంచి

పట్టమును వీడి కానలం బడుచునేగి

కంటకముల కోర్చితివఁట కరుణ శరధి!

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. నోరు నొవ్వంగ కీర్తింపఁ గోరు చుండ

భక్తి తత్వము లూరఁగఁ బాడు చుంద్రు

నీదు ఘనరూప మిచ్చును నెమ్మిఁ బ్రజకు

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!


తే.గీ. భోగ భాగ్యములు వలదు పుడమి పైన

శాశ్వతము కాని వసతులు సతము చేటు

గౌరవముగ జీవింపంగఁ గరుణఁ జూపి

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. నీదు కల్యాణమును గాంచి నెమ్మి నొంది

సకల జనులు ధరణి యందు సన్నుతింప

నమృత జలములు వర్షించి యతిశయింప

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. మధుర మేటికి? నీదివ్య మంత్ర ముండ!

నమృత మేటికి? నీపాద మంటి యుండ!

నిత్యమే నిన్నుఁ గొలిచెద సత్యరూప!

విద్య వినయము నొసఁగుమా! విజయ రామ!

తే.గీ. అఘము లొకపరి ముసరంగ నదటు నొంద

జగము నంతయున్ గష్టమ్ము సంభవింప

ధరణి నేలంగ రాగదే! దైత్యహారి!


విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. వేద మంత్రాల నడుమను వేగిరముగ

పట్టమొందితే! కన్నుల పండువుగను

జయము జయమంచు జనులెల్ల సన్నుతింప

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. నీవు, వైదేహి, సౌమిత్రి నెమ్మి నొంది

రాజ సౌధమున్ జేరగ రవిజు తోడ

జయ నినాదాలఁ బల్కంగ జనులు చేర

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. పంచ గంగలు గంధంపుఁ బరిమళములు

కలిపి యభి షేకములొనర్చె కలలు పండ

కాంచ నాభరణాలతోఁ గాంతులీన

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!


తే.గీ. మంగళంబిదే నీకునో మహిత రామ!

దివ్య హారతుల్ గొనుమ సందీప్త జనని!

వెతలు దీర్పంగ జనులెల్ల వేడు కొనఁగ

విద్య వినయము లొసఁగుమా! విజయ రామ!

తే.గీ. విజయ పథమున రాజ్యము వెలుఁగులలర

జనులు జయము జయమనుచు సంబరముగ

నీదు పాలన శుభముల నిరత మిడగ

విద్య వినయము లొసగుమ! విజయరామ!

విజయ హనుమ!

ఆ.వె. శత్రు భంజకరుఁడ! జాంబవంతుఁడు నీకు

మంగళమునుఁ బల్క, మాత సీత

జాడ కనుగొనఁగను సాగిపోయితి వీవు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!


ఆ.వె. అన్యు లెవరికైన నలవికాని మహాబ్ది

దాటఁగోరి యెగిరి తరలినావు

దక్షిణ దిశవైపు తళుకీన కపివర!

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. కమ్ర రామకార్య కరణై క దీక్ష నీ

యది ఘనమ్ము జగతి కమృత మోయి!

రామ దూత యన్న ప్రధ గన్న నీకివే

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. సగరుఁడపుడు సలుపు సాయమ్ము స్మృతి రాగ

సాగరుండు మిగుల సౌమ్యుఁడగుచు

నిన్ను నాదరించె సన్నుతుల్ వచియించి

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. లంక యందడుగిడి బింకమ్ము తోడను


మాత సీతనుఁ గన మదిని నిరతి

కలుగఁగ నగరమంతఁ గలయఁ దిరిగినావు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. నూరు యోజనముల నీరధినే దాటి

దశ శిరముల వాని దశను మార్చి

రామ సీతల నొక సీమఁ జేర్చితివీవు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. పక్కిరాయ వంటి వాజ మలరుచుండ

దివిని దాటు వేళ దివ్య కాంతు

లొప్ప, వానరములు గొప్పగ నతియింప

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. పట్టు దలను నీవు పనిని సాధింపంగ

నీకసాధ్య మనెడు నెపము లేదు


నిన్ను మ్రొక్కు వార లన్నువు నొందంగ

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. పూజ సలుప నీకు పూవు లేరఁగలేను

నిచ్చ తీర నాదరింప లేను

కుడుప నేమి లేదు బడుగు చిత్తముఁ దప్ప

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. సింహికను హరించి సింగమైతివి నీవు

నాదు నఘము లడఁచి నన్నుఁ బ్రోచి

తోడు నిలచినావు వీడనెప్పుడు నిన్ను

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. గాన మాచరించి గడన సల్పఁగ నేను

గళము లేదు నాకుఁ గనుమ! దయను

పదము లల్లలేను భక్తితోఁ గీర్తింప


వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. సూక్ష్మ రూపముఁ గొని శోధించితివి నీవు

సీతమాత కొఱకు చింత తోడ

నాదు కొనఁగ శీఘ్ర మాదరింపఁగ నన్ను

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. కలియుగంబు నందు కలతలన్ దీర్పంగ

నవతరించి జనుల కాత్మ బంధు

వైతి విలను భక్తు లార్తినిఁ బోకార్ప

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. జపతపా లెఱుంగ సన్నుతింపఁగ నిన్ను

కనులు మూసి రూపు కనుటఁ దప్ప

విద్య వినయములను వేగమ్మొసఁగ నీవు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!


ఆ.వె. చొరవఁ జూపినావు సుగ్రీవ సచివుగా

వివరములనుఁ జెప్పి పెంచినావు

మైత్రి, యర్కజునికి మహిజా పతికి నీవు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. రామ యశముఁ దెల్పి రావణ మరణమ్ము

తధ్యమనుచుఁ బలికి ధరణి పుత్రి

హర్షమొందఁ జేసి నట్టి కపిశ్రేష్ఠ!

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. వలదు దుఃఖమంచు నెలమినిఁ గూర్పంగ

స్వామి భక్తి నీవు చాటినావు

దానవాళి కెల్ల దడను పుట్టింపంగ

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!


ఆ.వె. సుప్రభాత మందు శుద్ధోదకము తోడ

మజ్జనమునుఁ జేసి సొజ్జభక్ష్య

పాయ సాదులనిడి పరిచరింపఁగ నీవు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. రఘువరుండు నిన్ను రయముగా నంపంగ

సీత జాడ కొఱకుఁ జెలగినావు

భక్తజనులఁ బ్రోవ వానరేశ! కృపాళు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. లక్ష్మణుండు మూర్ఛిలఁగను సమరమందు

నిల్పినావె! యుసురు నిక్కముగను

సంగ్రహించి తెచ్చి సంజీవ నౌషధిన్

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. జయము రామచంద్ర! సౌమిత్రి! యంచును


శుభము పల్కినావు సుగ్రీవ సచివుగా!

నీదు పలుకులు విని నెమ్మి నొందఁగ వారు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. వాయు పుత్ర! నీదు వాలమున్ జుట్టంగఁ

బరుగు లిడిరి బెదిరి వనమునందు

దొరికి నట్టి వారి గరువమ్ము నణచంగ

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. జంబు మాలిని దనుజ పతి సప్త సుతులన్

పంచ సైనికాధి పతులఁ జంపి

వాసి కెక్కినావు పవన పుత్రా! నీవు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. బమ్మయమ్ముతోడ పౌషము నందింద్ర

జిత్తు నిన్ను కట్టు జేసితినని


మిడిసి పడగ పట్టు విడివడె వరముచే

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. రామ కార్యమొప్ప రక్కసి మూకను

పిండిఁ జేసితీవు పీచ మణఁచి

వేదవిదుల చేత వినుతింపఁ బడితివి

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. సంపదలు వలదని సంతసముగ నీదు

నామ జపమొనర్చి నీమమొప్ప

తన్మయత్వమందు తరియించి నర్పింప

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. దిక్కులేదు నాకు దీనుఁడను గనుమ!

నీవె దిక్కనుచును నిన్నుఁ గొల్వ

పిలుచు చుంటి నేను పలుమార్లు భక్తితో


వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. అహిత కృతము లెల్ల హరియింపఁగను నీవు

కలియుగమ్మునందు వెలసినావు

కోరినంత వడిగఁ గోర్కెలం దీర్పంగ

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. బంధువులు, హితులును, బంధములును మాయ

నీవు దప్ప వేరు నిగమ మేది?

నిన్ను నమ్మి నేను నిజముగా నర్పింప

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. రాముబంటు వంచు రమణమొందగ నీవు

పుడమి నెల్లరు నిను పొగడుచుండ

సంతసంబు మీర సంసేవ లర్పింప

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!


ఆ.వె. రామ భక్తి తత్త్వ సోమ పానముఁజేసి

యభినుతించి నంత నవని యందు

సకల జనులు నిన్ను శ్లా ఘించు చుండగన్

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. అంజనాంగ భవుడ! హరికి హితుఁడవయి

జయముఁ గూర్చినావు జనులు పొగడ

వినయమలర నిన్నుఁ బ్రీతితో నర్చింతు

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!

ఆ.వె. మంగళంబు నీకు మహనీయ! దేవరా!

మహిని నీదు రూపు మహిమఁ జూప

జయము జయ మటంచు జనము నర్చింపంగ

వేయి నుతులఁ గొనుమ! విజయ హనుమ!


కవి పరిచయము

నామధేయము: మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ

ధర్మపత్ని: కృష్ణకుమారి

పుత్రు డు: నాగాంజనేయ సూర్యవంశీ

జననీ జనకులు: కీ.శే. శ్రీమతి దమయంతి, కీ.శే. శ్రీ కృష్ణమూర్తి

విద్య:ఎమ్.ఎస్.సీ.,ఎల్.ఎల్.ఎమ్.,ఎమ్.ఏ.,ఎమ్.ఏ.,ఎమ్.ఏ.,
పీజీడీసీఏ.,పీజీడీడబ్ల్యూఎమ్(టి).

You might also like