Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

శ్రీమద్రామాయణము

శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్ర నామ తత్తు ల్యం రామనామ వరాననే!

రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేధసే

రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః!

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవర

రామ దూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో!

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా

అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాత్ భవేత్

సుందరకాండ

రావణాసురునిచే అపహరింపబడిన జానకీమాతను వెదకుటకై అరివీర భయంకరుడగు అంజనీపుత్రు డు ఆంజనేయుడు చారణులు సంచరించు మార్గముననుసరించి పోదలచాడు.

అనితర సాధ్యమైన ఈ బృహత్కార్యమును ఎట్టి అవరోధములూ లేకుండా సాధింపవలెనన్న దృఢ సంకల్పముతో మహాబలుడగు హనుమంతుడు ఆకలితోనున్న బలిష్టమైన
మృగరాజు వలె, పచ్చిక తో యోజనములదూరమువరకూ విస్తరించియుండి, మహాసముద్రమును తలపించుచున్న ఆ ప్రదేశమునందు తన ఆపాద మస్తకమునూ విదిలించగా ఆ
శబ్దమునకు మహావృక్షములు నేలకూలినవి, పక్షులు భయకంపితులై చెట్లను వదలి చెల్లా చెదురుకాగా, అనేక జీవరాశులు తమ ఉనికిని కోల్పోయినవి.

ఆ పర్వత ప్రదేశము అనేక సర్పజాతులకు, దేదీప్యమాన కాంతులను వెదజల్లు మణులు,రత్నాలు,కెంపులు,పచ్చలతో సహా అనేక దివ్య రత్నములకు ,కామరూపులగు
యక్ష,గంధర్వ,కిన్నెర,కింపురుషాది దేవజాతులకు ఆలవాలమై అలరారుచుండగా , ఆ సమయమున, ఆ పర్వతమునందు వాయుపుత్రు డగు ఆంజనేయుడు సరోవరము మధ్యలో
నున్న ఆదిశేషువు ను తలపించినాడు.

అనంతరం హనుమంతుడు ఆదిత్యునికి,మహేంద్రు నకు, తండ్రియైన వాయుదేవునికి,పరమేశ్వరునికి,సమస్త ప్రకృతి కీ ప్రణామములనర్పించుచూ తూర్పు దిక్కునకు తిరిగి
కార్యసాధనకై ఉపక్రమింపదలచినాడు.ముందుగా తన ఆరాధ్య దైవమగు శ్రీరామచంద్రు నకు నమస్కరించి,రామకార్యమును సాధింపవలెనన్న దృఢ నిశ్చయముతో ,సముద్రానికి
ఆవలవొడ్డు న దక్షిణ తీరాన్ని చేరుటకై వానర శ్రేష్టు లందరూ చూచుచుండగా పూర్ణిమనాటి రాత్రి అంతకంతకూ విస్తరించు సముద్రమును వోలె ఆ మహాశక్తిశాలి యైన
హనుమంతుడు తన శరీరాన్ని అనంతంగా పెంచాడు.

మహా సముద్రాన్ని లంఘించుటకై విరాట్రూపాన్ని ధరించిన మారుతి నేలకు ఆనించిన తన పాదములతో,హస్తములతో ఆ పర్వతమును బలంగా తాడించగా ఆ క్షణమున ఆ
పర్వతము ఒక్కసారిగా ప్రకంపనలకు గురియైనది.అనేక వృక్షజాతులకు ఆలవాలమైన ఆ పర్వతము మారుతి పాదతాడన ధాటికి, నిండుగా పుష్పములతో అలరారుచుండిన ఆ
వృక్షములన్నియూ ఒక్కసారిగా పుష్ప వర్షమును కురిపించగా ఆ పర్వతమంతయూ పుష్పములతో పూర్తిగా కప్పబడి,ఆ ప్రదేశమంతయూ వివిధరకములైన పుష్పములనుండి
వెలువడిన సువాసనలతో గుబాళించినది.

మహాకాయుడగు హనుమంతుని శరీర భారమును మోయలేని ఆ మహేంద్ర పర్వతము నుండి, మదన తాపమునకు లోనైన మత్త గజము కణతల నుండి జాలువారిన మదరసము
ను వోలినట్లు గా నీటిధారలు పైకి ఎగజిమ్మినవి.

ఆ కపివరేణ్యుని పాదతాడన ధాటికి ఆ పర్వతము నుండి కొండ చరియలు,బండరాళ్లు విరిగి పడినవి, ఆ కొండ చరియల మట్టినుండి బంగారము,వెండి వంటి అనేక అమూల్యమైన
ఖనిజరాశులు రాలిపడినవి, ఎరుపు వర్ణములోనున్న ఆ మట్టి ఆకాశమునకెగిరి, మండుచున్న కొలిమి నుండి వెలువడిన ధూమము వలే ఆ ప్రాంతమంతటినీ ఆవరించినది.

ఆ కపీంద్రు ని పాదతాడనకు ఆ పర్వత శిఖరాలు కూలిపోవగా , ఆ పర్వతగుహలలో తలదాచుకున్న అనేక మూగజీవాలు ఆ శిధిలాల క్రిందన నలిగిపోయి చేసిన ఆర్తనాదాలతో
భూనభోంతరాళాలు దద్దరిల్లినవి.

ప్రముఖ సర్పరాజములనేకములు పడగలు విప్పి , బుసలు కొట్టు చూ, తమ కోరల నుండి భయంకర విష జ్వాలలను విరజిమ్ముచూ, ఆ పర్వతమునందలి బండరాళ్లను కాటు
వేయగా, ఆ బండరాళ్లు వేయి ముక్కలగుచూ భయంకరముగా చెల్లచెదురగుచున్నవి.ఆ విధంగా ఆ ప్రదేశమునావరించిన విషవాయువులను ఆ పర్వతమునంతటానావరించియున్న
అత్యంత ప్రభావవంతమైన ఔషధ వన మూలికలు సైతం నిలువరింపలేకపోయినవి.

ఆ మహేంద్ర పర్వతమునందు తపమాచరించుకొనుచూ అక్కడే ఆవాసముండిన అనేక తాపసులు భయకంపితులై అక్కడినుండి పారిపోయిరి, అటులనే తమ స్త్రీలతో సహా
విద్యాధరులు సైతం ఆ ప్రదేశమును వదలి వెళ్లిపోయిరి. భోజన శాలయందు బంగారు ఆసనములు,సువర్ణ,రత్న,మణిభూషితమైన పాత్రలు,కూజాల వంటి అమూల్యమైన
వస్తు వులూ, మధుర పానీయములూ, షడ్రసోపేత భోజ్యములూ మున్నగు వాటినన్నింటినీ విడిచి వెడలిరి. మదిరాపాన మత్తు లై,కంఠమునందు అమూల్యమైన రత్నహారములను
ధరియించి,పుష్పమాలాలంకృతులై,చందనాది సుగంధలేపనములతో శోభిల్లు చున్న శరీరములతో ,నీలికలువల ను వోలిన కన్నులతోనుండిన స్త్రీలు నింగికెగిరిపోయిరి.
కంఠమునందు ముత్యాలహారములను, అంగుళీయకములను,కరభూషణములను ధరించిన సుందరాకారులు ఉలిక్కిపడి ఒక్కసారిగా ఆకసమునందుకెగసి తమవారిని
చేరుకొనుటకై పారిపోయిరి.

అంబరమునుండి మహర్షులు,విద్యాధరులు క్రిందనున్న మహేంద్రపర్వతముపై జరుగుచున్న అద్భుతమును వీక్షించుచూ " వాయునందనుడు,మహా బలశాలియగు
హనుమంతుడు తన తోటి వానరులు చూచుచుండగా రామకార్యార్ధియై ఇంతటి సువిశాలమైన సాగరమును లంఘించి ఆవల తీరమునకు చేరుకొను బృహత్కార్యమును
తలపెట్టినాడు".
మహర్షుల వాక్కులను వినిన విద్యాధరులు నిట్టనిలువుగా అగ్నిజ్వాల వలె నున్న ఆ మహా కపివరుండు పిడుగు పడిన ద్వనిని తలపించునటుల భయంకరముగా గర్జించగా
ఆలకించిరి. గ్రద్ద చే వెంటాడబడిన పాము మెలికలు తిరిగినట్లు గా చుట్టలుగా పడియున్న తన తోకను హనుమంతుడు ఒక్కసారిగా ఈడ్చి నిటారుగా నిలబెట్టి ముందుకూ
వెనుకకూ కదుపుచూ, తన వీపునకు చుట్టు కుని ఉండగా అది గరుత్మంతునిచే తన్నుకుపోబడిన మహా సర్పమువలే ఉన్నది.

హనుమంతుడు తన రెండు మోచేతులనూ బలమైన గదల వలే దృఢంగా చేసి,శరీరమందలి అంగములన్నింటినీ క్రిందకు నక్కించి,మెడను,మోచేతులనూ రిక్కించి తన
శరీరమునందలి శక్తినంతటినీ కూడదీసుకున్నాడు. కపివరేణ్యులలో సర్వశ్రేష్ఠు డైన హనుమ తాను ప్రయాణించబోయే మార్గాన్ని ఒకసారి అవలోకనంచేసుకుని,తాను
అధిగమించవలసిన దూరాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుని శ్వాసను ఒక్కసారిగా బిగబట్టి, తన రెండు పాదములనూ భూమికి బాగా తన్నిపెట్టి యుంచి, చెవులను
రిక్కించి,శరీరాన్నంతటినీ ముందుకు లంఘించుటకు సిద్ధమైన భంగిమలోనుంచి అక్కడ కొలువుదీరియున్న వారందరినీ ఉద్దేశించి ఈ విధంగా పలికాడు

"శ్రీరాముని ధనస్సునుండి విడివడిన బాణము ఏ విధంగా వాయువేగాన్ని మించి ప్రయాణము చేయునో అంతే వేగము గా నేను కూడా రావణాసురుని రక్షణ లో నున్న లంకను
అతిశీఘ్రముగా చేరుకొనెదను.నేనే కనుక అచ్చట జనకరాజపుత్రి , శ్రీరామపత్ని యైన సీతాదేవి జాడ ను కనిపెట్టు టలో విఫలుడనైననేని, అంతే వేగమున అచ్చటినుండి దేవలోకమున
వెదకెదను, అక్కడనూ లేనిచో రాక్షసలోకమునకు పోయి రాక్షసులనందరినీ సంకెళ్లతో బంధించి తెచ్చెదను.కార్యసాధన లో విజయం సాధించితినేని, విజయుడనై తిరిగి వత్తు ను
లేనిచో రావణాసురునితో సహా సమస్త లంకానగరాన్ని పెకలించి తెచ్చెద"నని పలికిన అనంతరం అంజనీపుత్రు డు ఊ పిరిని బిగబట్టి, అభినవ గరుత్మంతుని వలె ఒక్కసారిగా గాలిలోకి
ఎగిరాడు.అలా గాలి లోకి ఎగిరినప్పుడు ఏర్పడిన సుడిగాలికి ఆ పర్వతముపై నున్న తరుశాఖలన్నియూ నాలుగుదిక్కులా గింగిరాలు తిరుగుతూ గాలిలోకి ఎగసిపడినవి.

ప్రచండమైన వేగముతో నారంభించిన హనుమ తన తో పాటు గా ఆ పర్వతముపైనున్న అనేక మహా వృక్షములను మకరందమును గ్రోలుచున్న తుమ్మెదలతో నిండిన
పుష్పగుఛ్చాలతో సహా తేజోమండలము వైపు కొనిపోవసాగాడు. దేశాంతరములకు పయనమగుచున్న తన ప్రియతములను సాగనంపుటకు బయలుదేరిన బంధుమిత్రు ల వలే ఆ
తరువులన్నియూ హనుమ వెంట ఆకసమునందు బయలుదేరినవా అనినట్లు గా ఆ దృశ్యము గోచరించినది. హనుమంతుడు పర్వతమునుండి లంఘించినపుడు వీచిన
ప్రభంజనమునకు సాళవృక్షములవంటి మహావృక్షములు సైతము కూకటి వ్రేళ్లతో పెకలింపబడి, నాయకుని అనుసరించు సైన్యము వలె హనుమ వెంట గాలిలో ఎగిరిపోవుచున్నవి.
తనననుసరించగా వచ్చిన ఫలపుష్పభరిత వృక్షములతో చూచువారికి హనుమంతుడే ఒక మహా పర్వతాన్ని తలపించుచున్నాడు. అలనాడు దేవేంద్రు నికి భయపడిన
పర్వతములన్నియూ సముద్రమునందు దాగుని యున్నటుల కొంతదూరము వరకూ హనుమను అనుసరించిన మహా వృక్షాలన్నియూ అక్కడినుండి సముద్రములో
పడిపోవుచున్నవి .వివిధ రకములైన పుష్పములతో, మొగ్గలతో, అప్పుడే విచ్చుకుంతున్న పూమొగ్గలతో శరీరమంతా కప్పబడియున్న అంజనాపుత్రు డు చూచుటకు మిణుగురు
పురుగులతో కప్పబడియున్న మేఘమండలమా లేక మహాపర్వతమా అన్నట్లు గోచరించినాడు.తమను వేడి పోవుచున్న మిత్రు నితో పాటు కొంతదూరం నడిచి అటుపిమ్మట అతనికి
వీడ్కోలు పలికిన అనంతరం వెనుదిరుగు విధముగా పర్వత శిఖరమునుండి హనుమ లంఘించిన వేగానికి వ్రేళ్ళతో సహా పెకలింపబడిన వృక్షములన్నియూ ఫలపుష్పాదులతో సహా
సముద్రములో పడిపోయినవి.

వివిధ పరిమళములను కలిగిన అనేక పుష్పములతో కప్పబడియుండిన దేహముతో హనుమ, చూచుటకు మెరుపులతో అలంకరింపబడిన దట్టమైన మేఘములను
పోలియున్నాడు.లంఘించునపుడు తనదేహమును తాకిన నీటిబిందువులు వినీలాకాశమునందు నక్షత్రముల వలె ప్రకాశించుచున్నవి.

చేతులూ చాచి ఆకాశములో ఎగురుతున్న ఆ కపిశ్రేష్ఠు ని రెండు చేతులూ పర్వత శిఖరమునుండి బుసలుకక్కుచున్నఐదు తలల మహాసర్పములను తలపించుచున్నవి.

ఆ విధంగా సాగుచున్న హనుమ ఒక్కొక్కసారి భూమిపైయున్న అనంత సాగర జలాలను మ్రింగివేయుదుడా లేక అనంతాకాశాన్ని మ్రింగివేయుదుడా అని భ్రమ
కలుగుచున్నది.వాయు మార్గాన్న పయనిస్తు న్న ఆ కపివరేణ్యుడి నయనాలు విద్యుల్లతలను తలపించుచున్నవి,పర్వత శిఖరముపై ప్రజ్వరిల్లు తున్న దీపశిఖలవలె ప్రకాశించుచున్నవి.

మెరయుచున్న ఆ వాయుపుత్రు ని కన్నులు సూర్యచంద్రు లను తలపించుచున్నవి. తామ్రవర్ణములో నున్న అతని ముఖ కవళికలు మరియు ఆతని నాసిక సంధ్యా సమయమున
సూర్యమండలమును తలపించుచున్నవి.

నిటారుగా నిలిచియున్న ఆ కపివరుని వాలము రెపరెపలాడుచున్న ఇంద్రధ్వజము వలె అగుపించినది.చుట్టలుగా చుట్టు కొనియున్న అతని తోక ,అతని తెల్లని దంతములు
తేజోవంతమైన కిరణములతో భాసిల్లు తున్న ఉదయభానుని వలె ప్రకాశించుచున్నది.తామ్రవర్ణములో బలిష్టముగా నున్న అతని దేహము ఎర్రమట్టి కొరకు తవ్విన పర్వతము ను
పోలియున్నది.సముద్రమును లంఘించుచున్న హనుమంతుని బాహుమూలలయందు చిక్కుబడిన వాయువు పిడుగుల శబ్దమును సంతరించుకొనుచూ వెలువడుచున్నది.

ఊర్ధ్వలోకములనుండి ఆకాశమునకు దూసుకువస్తు న్న మండుతున్న అగ్నిగోళము వలె,పక్షులలోకెల్ల అగ్రగణ్యుడైనట్టి గరుత్మంతుడు గాలిలో ఎగురుతున్నట్లు గా, గొలుసులతో
బంధింపబడిన మదించిన ఏనుగు వలె ప్రకాశించుచున్న హనుమంతుని ప్రతిబింబము సముద్రము లో తుఫాను లో చిక్కుకుని మునిగిపోయిన ఒక అతిపెద్ద నౌకను
తలపించుచున్నది.

పైన హనుమంతుడు పయనించుచున్న మహా వేగానికి క్రిందనున్న సముద్రము అల్లకల్లోలంగా మారి కెరటాలు పర్వతమంత ఎత్తు కు ఎగిసిపడుతున్నాయి.తాను పయనించు
మార్గమునకు అడ్డు వచ్చుచున్న సముద్రపు అలలను తొలగించుకొన ప్రయత్నములో హనుమ భూమ్యాకాశాములను వేరుచేయుచున్నట్లు గా కనిపించినది. మందర
పర్వతము,మేరుపర్వతముల శిఖరములను తలపించునటులగా ఎగిసిపడుచున్న అలలు వాయువేగముతో ప్రయాణిస్తు న్న హనుమంతుని వక్షస్థలమును తాకిన పిదప చెల్లా చెదురై
ఆకాశమంతా శరత్కాల మేఘముల వలె విస్తరించినవి.

హనుమంతుని వాయువేగమునకు సముద్రమందలి నీరంతయూ అలలరూపములో పైకెగసి పడుటచే తిమింగలములూ,మొసళ్లూ, భారీ ఆకారం గల చేపలూ, తాబేళ్లూ,సముద్రపు
పాములూ వంటి జలచరములన్నియూ ఆఛ్చాదన కోల్పోయినవి.

ఆకాశమార్గాన ప్రయాణించుచున్న హనుమంతుని ఛాయ నలుబది మైళ్ల పొడవు , ముప్పది మైళ్ల వెడల్పు తో హనుమంతుని తో వేగంతో పాటు అంతకంతకూ విస్తరించుచూ
అందమైన తెల్లని మేఘముల వలె సముద్రము పై హనుమతో పాటు సాగిపోవుచున్నది.

విసుగూ, విరామమెరుగక ప్రయాణము చేయుచున్న హనుమ బలిష్ఠమైన దేహము రెక్కలు గల పర్వతము ఆకాశమార్గాన విహరిస్తు న్నట్లు గా అనిపించినది.

హనుమంతుడు ప్రయాణించుచున్న మార్గమంతయూ సముద్రము ఉవ్వెత్తు న ఎగిసిపడుచూ ఉండగా పక్షిరాజైన గరుత్మంతుని వలే తనకు అడ్డు వచ్చిన మేఘములను ప్రక్కకు
నెట్టు చూ ముందుకు సాగిపోవుచున్నాడు.ఎరుపు, నీలము,పాలిపోయిన,తెల్లని రంగులు కలిగిన మేఘములు హనుమ వేగమునకు చెల్లా చెదురగుచుండగా కొన్నిసార్లు మబ్బుల
మాటున, మరికొంతదూరం మబ్బులనుండి బయటికి వస్తూ ప్రయాణం చేయుచున్న హనుమ చంద్రు ని తలపించినాడు.

అలా మహావేగంతో పయనించుచున్న హనుమంతుని చూచి దేవ,దానవ, గంధర్వజాతులు ఆ మహాపురుషునిపై పూల వర్షము కురిపించిరి, రామ కార్యార్ధియై పయనమగుచున్న
హనుమకు సూర్య కిరణముల వేడి నుండి ఉపశమనము కలుగునట్లు గా సూర్యుడు తన ప్రతాపమును కొంత తగ్గించినాడు, వాయుదేవుడు చల్లని గాలులను ప్రసరింపజేసినాడు.
గగన మార్గాన అప్రతిహతంగా మహావేగంగా పయనిస్తు న్న కపిశేఖరుని ఆ సమయంలో పరిపరి విధాలుగా మహర్షులందరూ స్తు తించగా దేవ గంధర్వులు ఆ కపివరేణ్యుడిని తమ
గానంతో వేనోళ్ల పొగిడారు.

నాగ,రాక్షస,యక్ష జాతులన్నీ హనుమంతుని అనితరసాధ్యమైన ప్రయత్నానికి తన్మయులై తమ హర్షామోదాలు తెలియజేయగా ఇక్ష్వాకు వంశానికి ఆజన్మాంతం ఋణపడిన
సముద్రు డు " ఇక్ష్వాకు వంశస్థు డైన సగరచక్రవర్తి కారణం గా ఆవిర్భవించిన నేను వారి వంశమునకే చెందిన శ్రీరాముని కార్యమును నెరవేర్చుటకై బద్ధు డైన హనుమ కు సహయం
చేయకుండిన నేను కృతఘ్హ్నుడనగుదును కనుక రామకార్యార్ధియై పోవుచున్న హనుమ డస్సిపోయి సముద్ర కెరటాలకు బలి కావలసిన పరిస్థితిని రానివ్వను, కొంత తడవు ఆతడికి
విశ్రాంతిని కల్పించి తిరిగి తన కార్యమును కొనసాగించునటుల ప్రయత్నింతున"న్న ఆలోచన వచ్చినదే తడవుగా తనయందే దాగియున్న పర్వతరాజమైన మైనాకపర్వతము తో
సముద్రు డు ఈ విధంగా పలికాడు.

" ఓ మైనాకా! పాతాళ లోకమునున్న అసురులు దేవలోకంపై దండెత్తి దేవతల ప్రభువగు ఇంద్రు ని సింహాసనమునకు ఎక్కడ హానితలపెట్టెదరో నన్న దూరదృష్టి తో నిన్ను ఈ
సముద్రమునందు వారి పాతాళమార్గమునకు అడ్డు గోడ గా నిలిపినాడు. నీకు సర్వకాలసర్వావస్థలయందు సముద్రము నందు పైకి,క్రిందకూ, అటూ ఇటూ కదలగల సామర్ధ్యము
కలవాడవు.

కపిశ్రేష్టు డైన వాయుపుత్రు డు హనుమంతుడు ఇక్ష్వాకు వంశస్థు డైన శ్రీరాముని కార్యమును నెరవేర్చుటకై లంకానగరమును చేరుటకు సముద్రాన్ని లంఘిస్తు న్నాడు.అతడీ
ప్రయత్నములో అలసిపోకుండా మార్గమధ్యములో కొద్దిసేపు విశ్రమించుటకై నీపై కాలు మోపునటుల నీవు సముద్రమునుంచి పైకి రమ్మ"ని ఆదేశించాడు.

సముద్రు డి విన్నపమును మన్నించి, బంగారు వర్ణము తో ప్రకాశించుచూ, ఎత్తైన వృక్షములతో,లతలతో అలరారుచూ సముద్ర గర్భమునందాగియున్న మైనాక పర్వతము
మేఘములను చీల్చుకుని దూసుకువచ్చిన అరుణ కిరణములవలె ఒక్కపాటున సముద్రగర్భమునుండి కదిలి పైకిలేచిన ఆ పర్వత శిఖరములు ఆకాశపుటంచులను తాకుచుండగా,
కిన్నెరులకూ,సర్పశ్రేష్టు లకూ ఆలవాలమైన ఆ మైనాక పర్వతము ఉదయ భానునివలే అత్యంత శోభాయమానముగా ప్రకాశించుచున్నది .ఆ పర్వత శిఖరములు వాడి
కరవాలపుటంచులవలె తళతళ మెరిసిపోవుచుండగా,బంగారు వర్ణము తో ఆ పర్వతము సహస్ర సూర్యకాంతితో మెరిసిపోవుచున్నది.

జానకీమాత జాడ ను శోధించు ఏకైక లక్ష్యముతో ఆకాశమార్గాన పయనించుచున్న హనుమ కు తన మార్గమునందు హఠాత్తు గా పైకి లేచిన ఈ మైనాక పర్వతమును జూచి "ఈ
పర్వతము నా మార్గమునకు అవరోధముగా నిలిచినది" యని మనంబున దలచి తన మార్గమునకు అడ్డు గా నిలిచిన పర్వత శిఖరములను దట్టమైన మేఘములను చెల్లచెదురు
చేసిన వాయుదేవుని వలె తన వక్షస్థలముతో నుగ్గు నుగ్గు చేశాడు.ఆ దెబ్బతో హనుమంతుని అమోఘమైన శక్తిని అర్ధంచేసుకున్న మైనాకుడు ఆనందించి, మానవ రూపమును
ధరించి ఆ శిఖరాలలో ఒకానొక ఉన్నత శిఖరము పై నిలబడి హనుమనుద్దేశించి" ఓ కపివరా! అంజనీపుత్రా! నీవు ఒక అనితర సాధ్యమైన లక్ష్యసాధనకై బయలు దేరితివి, ఈ
ప్రయత్నములో నీవు అలసట కు గురికాకూడదన్న సముద్రు ని సూచనతో నీకు విశ్రాంతి నివ్వదలచి సముద్రగర్భమున దాగియున్ననేను పైకి వచ్చి నీ మార్గమునకు అడ్డు గా వచ్చితిని
కనుక నీవు నా విన్నపమును మన్నించి నా శిఖరముపై కాలుమోపి కాసేపు సేదదీరుము, అనంతరము తిరిగి నీవు నీ ప్రయాణమును కొనసాగించుము. నీ ప్రభువైన శ్రీరాముడు
జన్మించిన ఇక్ష్వాకు వంశమునందే సగరచక్రవర్తి కూడా జన్మించినాడు, ఆ అభిమానంతో నీకాతడు ఆతిధ్యమివ్వజూపాడు,ఉపకారికి ఉపకారము చేయడమన్నది
లోకాచారము,రఘువంశమునకు సేవచేయ సంకల్పించిన సముద్రు డు రామకార్యార్ధియై బయలుదేరిన నీకు ఆతిధ్యమిమ్మని నన్ను నియమింపగా నేడు నిన్ను అర్ధిస్తు న్నాను. గగన
మార్గాన నూరు యోజనాలు ప్రయాణించిన నీవు అలసిపోయినావు కనుక కొద్దిసేపు నా పర్వత శిఖరములయందు కాలుమోపి సేదదీరుము,ఇచ్చట లభించు అనేక పరిమళ
భరితమైన ,మధుర ఫలములను,కందమూలములను ఆరగించి క్షుద్బాధను దీర్చుకుని తిరిగి పయనము సాగించుము, ఓ కపివరా! నీ ఖ్యాతి ముల్లోకమలయందూ
వ్యాపించినది,ఓ పవనపుత్రా! కపిశ్రేష్ఠు లందరిలో అగ్రగణ్యుడివి, సాధారణ వ్యక్తిని సైతము అతిధి గా గౌరవించు సంస్కారవంతులమే! అట్లైన విశిష్ట అతిధివైన నిన్ను కూడా సముచిత
రీతిన గౌరవించుట మా ధర్మము కాదా? దిక్ఫాలకులలో ఒకరైన వాయుదేవుని పుత్రు డవు, వాయువేగము తో సమానమైన వేగమును కలిగినవాడవు, ఓ మారుత తనయా! నీకు
ఆతిధ్యమిచ్చుట ద్వారా నీ తండ్రి పట్ల మాకు గల భక్తిని ప్రకటించుకొను అవకాశము కలిగినది. మరొక్క మాట వినుము.

కుమారా! పూర్వము పర్వతములకు రెక్కలుండెడివి, ఆ రెక్కల సాయంతో ఈ పర్వతములన్నియూ ఈ జగత్తు న నాలుగు దిక్కులా గరుత్మంతుని వేగము తో
పయనించుచుండెడివి,అలా వేగముగా పయనించెడి పర్వతములనుండి పడిపోవుదుమేమోనని దేవతలు,ఋషులు,అనేకానేక జీవులు ప్రాణాలను అరచేత చిక్కబట్టు కుని
భయపడిపోవసాగిరి. పర్వతముల గర్వమునకు ఆగ్రహించిన దేవేంద్రు డు తన వజ్రాయుధం తో పర్వతముల రెక్కలను తెగ నరికాడు. అదే తీవ్రమైన ఆగ్రహంతో వజ్రాయుధాన్ని
ధరించిన దేవలోకాధిపతి నా రెక్కలను ఖండింప ప్రయత్నించగా అంతలో వాయుదేవుడు మహావేగంగా వచ్చి నన్ను అమాంతం అక్కడినుండి ఎత్తు కు పోయి నన్ను ఆ దేవేంద్రు డి
బారినుండి కాపాడినాడు. ఓ కపివరేణ్యా! ఆ విధంగా ఆనాటినుంచి ఈ సముద్రగర్భంలో నేను నా రెక్కలను కోల్పోకుండా ,దేవేంద్రు ని వలన భయము లేకుండా
తలదాచుకుంటున్నాను. కనుక ఈ సందర్భమున నీకు ఆతిధ్యము ఇచ్చి మన బంధమును మరింత బలపరచు అవకాశము వచ్చినది ,కనుక ఓ మహానుభావా! నాకు,
సముద్రు డికి నీకు ఆతిధ్యమునిచ్చి నిన్ను గౌరవించుకొను అవకాశమునిమ్ము. పెద్ద మనసుతో మా ఆతిధ్యాన్ని అంగీకరింపుము.నిన్ను చూచిన తరువాత మాకు చాలా ఆనందము
కలిగినది" అని దిక్కులు ప్రతిధ్వనించే కంఠధ్వని తో పర్వత శ్రేష్ఠు డైన మైనాకుడు కపిశ్రేష్ఠు డైన హనుమ తో పలుకగా హనుమ మైనాకుని ఆరదాభిమానములకు ఎంతో సంతసించి,
మైనాకునితో " ఓ పర్వతరాజమా! నీ ఆతిధ్యానికి ఎంతో ఆనందం కలిగినది కానీ ఇప్పుడు నేను కార్యార్ధినై పోవుచుంటిని, కాలాతీతమగుచున్నది, సంధ్యాసమయం
కావచ్చుచున్నది, లక్ష్య సాధన కై పయనించునపుడు మార్గమధ్యలో విశ్రమించనని ప్రతిన జేసితిని కనుక ఇప్పుడు నీ ఆతిధ్యమును నేను స్వీకరించలేను , నన్ను
మన్నింపుమ"నుచూ హనుమ ఆ పర్వత శిఖరమును ఒక్కమారు చేతితో తాకుచూ, చిరునవ్వుతో ఆకాశ మార్గాన మరల పయనము సాగించగా సముద్రు డు,మైనాకుడు నిండు
మనస్సుతో హనుమను ఆశీర్వదించినారు. అలా వాయుమార్గాన, అంబరాన మహా వేగంగా సాగిపోవుచున్న హనుమ క్రిందన ఉన్న అనంత సాగరమును, అందున్న
పర్వతశిఖరమును వీక్షించినాడు.

కష్టసాధ్యమైన కార్యాన్ని నిర్వహించడానికి సాగిపోవుచున్న హనుమను జూచిన దేవతలు, మహర్షులు ఎంతగానో కొనియాడారు.తరువాత హనుమకు ఆతిధ్యమివ్వజూపిన బంగారు
శిఖరములతో కూడిన మైనాకుని కూడా ఎంతగానో ప్రశంసించారు.దేవతల కు అధిపతియైన దేవేంద్రు డు కూడా తన సతియగు శచీదేవి తో సహా మైనాక పర్వత శిఖరాన్ని
అభినందించాడు.

ఓ మైనాకా! నీ ప్రవర్తన నన్నెంతగానో ఆకట్టు కున్నది.నీకు నేను అభయమిస్తు న్నాను, భవిష్యత్తు లో నావలన నీకు ఎటువంటి ఆపదలూ కలుగవు కనుక నీవు ఇకముంది ఎక్కడైనా
స్వేచ్ఛ గా విహరించవచ్చునని అభయమిచ్చాడు. నాలుగువందల మైళ్ళ దూరమును ప్రయాణమును చేసి అలసిపోయిన వాయునందనుడు హనుమకు నీవు ఎంతో ధైర్యంగా
ఆతిధ్యమును ఇవ్వజూపినావు.అయోధ్యానగర ప్రభువగు దశరధ మహారాజు తనయుడైన శ్రీరామచంద్రు ని కార్యార్ధమై సాగిపోవుచున్న హనుమకు నీ శక్తికొలది
ఆతిధ్యమివ్వజూపినావు, నాకెంతో ఆనందము కలిగినది"

హనుమకు ఆతిధ్యమివ్వజూపిన మైనాకుని విజ్నతకు మెచ్చిన దేవేంద్రు డిచ్చిన అభయం తో మైనాకుడు సముద్రగర్భమును వీడి స్వేచ్ఛ ను పొంది తాను ఇచ్చవచ్చిన చోటుకు
పోయినాడు.

హనుమంతుడు అతివేగంగా ఆ సముద్రాన్ని దాటే ప్రయత్నం చేస్తు న్నాడు.

అప్పుడు దేవతలూ, గంధర్వులూ సిద్ధగణములూ వీరందరూ కలిసి ఆ సముద్రమునందు సూర్యతేజో సమానురాలైన "సురస" యను సర్పమాత ను పిలిచి " అమ్మా!
వాయునందనుడు, మహాబలవంతుడునూ అగు హనుమంతుడు రామకార్యార్ధియై సముద్రమును లంఘించి ఆవలఒడ్డు నున్న లంకానగరమును చేరుకొను ప్రయత్నమును
జేయుచున్నాడు కనుక ఈ కపివరేణ్యుని శక్తి సామర్ధ్యములు యేపాటివో పరీక్షించెదము. కనుక నీవు ఆకాశమును తాకునా అనునటులున్న పర్వతమంత పరిమాణముతో,
పదునైన దంతములతో, ఎర్రని అగ్నిగోళములవంటి కన్నులతో అతి భయంకరమైన మహా రాక్షసి రూపమును ధరించి ఆంజనేయుడు పయనించుచున్న మార్గమును అడ్డగించి
ఆతని ప్రయాణమున కు అంతరాయము కలిగించుము, అతడు నిన్ను ఎదిరించి, విజయుడగునో? లేక నీకు భయపడి లక్ష్యసాధనౌంది వైదొలగునో ? మేము నేడాతని శక్తి
సామర్ధ్యములను పరీక్షింపదలచితిమి ఏమగునో చూతము" అని పలికినవి.

దేవ గణముల కోరికను మన్నించిన సురస లోకమునందలి జీవులన్నియునూ భీతిల్లు నటుల భయంకరమైన రాక్షస స్త్రీ గా రూపమును దాల్చి హనుమంతుడు పయనించుచున్న
మార్గమును అడ్డగించి ఈ విధముగా పలికినది" ఓ కపివరేణ్యా! నిన్ను నేడు నాకు ఆహారము గా విధాత నిర్ణయించినాడు కనుక నేను నిన్ను తక్షణమే భక్షించెదను , జాగుచేయక
నీవు నా నోటిలోనికి ప్రవేశించుము, ఈ వరము నాకు విధాత ఇచ్చినాడ"నంటూనే సురస తన నోటిని బ్రహ్మాండమంత విశాలము జేసి హనుమను అడ్డగించినది.

సురస పలుకులను చిరునవ్వు తో ఆలకించిన హనుమ బదులిచ్చుచూ" అయోధ్యా నగర ప్రభువగు దశరధుని తనయుడగు శ్రీరామచంద్రు డు భార్యయైన వైదేహి, సోదరుడగు
లక్షణునితో సహా దండకారణ్యమునకు వచ్చినాడు.కొంతమంది దురాశ ఫలితంగా రామునిపై రాక్షసులు శతృత్వమును పెంచుకున్నారు.ఫలితంగా శ్రీరాముని
ధర్మపత్ని,యిష్టసఖియునూ అగు సీతాదేవి ని రాక్షసరాజైన రావణాసురుడు అపహరించుకుపోయాడు. నేడు నేను రామకార్యార్ధియై , శ్రీరామపత్ని యగు జానకీదేవి జాడను
కనుగొని శ్రీరామునికి నివేదించు కార్యమున నిమగ్నుడనైయుంటిని,ఈ పవిత్ర కార్యమునందు నీవునూ తగు విధముగా సహాయముసేయుము .రామకార్యము ముగిసిన
వెనువెంటనే నేను నీ నోటియందు ప్రవేశించి నీకు ఆహారము కాగలనని వాగ్దా నము చేయుచున్నాను, నన్ను నమ్ము" మన్నాడు.

కామరూపిణియగు సురస హనుమ ఇచ్చిన సమాధానమునకు సంతృప్తినొందక " ఓ ఆంజనేయా! నేను పొందిన వరం ఫలితంగా ఎవరికీ నన్ను దాటి సజీవంగా ముందుకుబోవ
శక్యము కాద"న్ననూ హనుమ తన దారిన తాను బోవుచుండగా సురస " ఓ హనుమా! నాకు బ్రహ్మ ఇచ్చిన వరమిది కనుక నీవు నా నోటియందు ప్రవేశించి నన్ను దాటి
బోవలసినదే" యనుచూ సురస తన నోటిని అమాంతం వెడల్పు చేయగా సురస పలుకులనందలి మర్మమును పసిగట్టిన హనుమ ఆగ్రహంగా " సరే! నన్ను మ్రింగుటకు తగిన
విధముగా నీ నోటిపరిమాణమును పెంచుమన"గా సురస తన నోటిని నలభై మైళ్ళ వెడల్పు చేయగా హనుమ కూడా తన దేహాన్ని అంతే పరిమాణమునకు పెంచాడు. తదుపరి
సురస తన నోటిని ఏభైమైళ్ల వెడల్పు చేసి, తన పదునైన కోరలను ప్రదర్శించుచూ , భయంకరంగా నాలుకను చాచినది, పర్వతాకారమును ధరించి చూపరులకు భీతి గొల్పునటుల
తన శరీరాకృతిని పెంచగా హనుమ కూడా తన దేహాన్ని అమితంగా పెద్దది చేశాడు. తరువాత సురస తన శరీరాన్ని అరువది మైళ్ల వెడల్పు చేయగా హనుమ తాను డెబ్బదిమైళ్ళు
పెంచాడు, అనంతరం ఎనభై మైళ్లు ,తొంభైమైళ్లు దాటి నూరు మైళ్ళ వెడల్పు చేయగా వెనువెంటనే హనుమంతుడు బొటనవ్రేలంత సూక్ష్మరూపాన్ని ధరించి ఒక్కసారిగా సురస
నోటిలోనికి ప్రవేశించి వెంటనే వెలుపలికి వచ్చి అంతరిక్షంలో నిలబడి సురస నుద్దేశించి" అమ్మా! దాక్షాయిణీ! నీకు అభివాదములు,నీవు చెప్పినటులే నేను నీ నోటియందు ప్రవేశించి
వెలుపలికి వచ్చి, నీ వరమును ఔదలదాల్చితిని కనుక ఇప్పుడు నన్ను జానకీదేవిని వెదుకుకార్యంపై పోనిమ్ము" మని విన్నవించాడు.

గ్రహణఅంత్యకాలమున రాహువు నోటినుండి వెలువడిన చంద్రు ని వలె తన నోటినుండి బయటకు వచ్చిన హనుమను చూసిన సురస రాక్షసరూపమును విడిచి దేవతారూపమును
ధరించి " ఓ కపిశ్రేష్ఠా ! నీవు సాధించిన కార్యము అద్భుతము. సీతాదేవిని వెదకు కార్యక్రమంలో నీవు తప్పక విజయము సాధించెదవు! జానకీదేవి ని జాడ ను వెదకి రాఘవునికి
నివేదించు కార్యక్రమమునందు నీకు జయము కలుగుగాక! పోయి రమ్ము" అని ఆశీర్వదించినది.

హనుమంతుడు సాధించిన ఈ మహాద్భుత ఘట్టమును దర్శించిన జీవులన్నియూ హనుమ ను వేనోళ్ల పొగడుచూ" అద్భుతము! అద్భుతము!" అంటూ ప్రశంసించిరి.

ఆ విధంగా హనుమ అక్కడినుంచి గరుత్మంతుని వేగమునకు మించినవేగంతో సముద్రం మీదనుండి సాగిపోతూ వరుణమండలంలో ప్రవేశించి మేఘముల మధ్యనుండి
దూసుకొనిపోవుచూ అక్కడినుంది విద్యాధరులుచరించు మార్గమున బోవుచుండగా సింహాలూ, ఏనుగులూ, పులులూ,రెక్కలు కలిగిన సర్పములూ లాగుచుండగా
ధగధగలాడుచూ మెరయుచున్న వాహనములను కాంచినాడు. ఆకసమునందు విహరించు గరుత్మంతుని వలె హనుమంతుడు ఆ మబ్బులమాటున పయనించుచుండగా
విద్యుల్లతల కాంతిలో ప్రకాశించుచూ, పంచాగ్నులను పోలియున్నాడు,పుణ్యకార్యములను చేయుట వలన దేవలోకమున స్థా నమును పొందిన దేవలోకమున నున్న అగ్నిహోత్రు నివలె
ప్రకాశించుచున్నాడు. అంతరిక్షమార్గము గ్రహ కూటములు,సూర్యచంద్రు లు,నక్షత్రమండలము,దేవ,యక్ష,గంధర్వ, కిన్నెర, కింపురుష,సిద్ధ, మహర్షి గణములు , విశ్వావసు ,
ఐరావతము నడయాడు మార్గము, సూర్యచంద్రు ల గమన మార్గము,ఈ జగత్తు నకు ఛత్రముగానున్న స్వర్గలోకము లతో శోభాయమానముగానున్నది.

దట్టమైన మబ్బులు కాలయముని వలె ఎరుపు,నలుపు,బంగారు వర్ణము తో అద్భుతముగానున్నవి, వర్షఋతువు నందలి దట్టమైన మబ్బుల చాటుననున్న చంద్రు ని వలె బయటికి
వస్తూ మరల మబ్బున మాటున దాగుచూ దోబూచులాడునటుల హనుమంతుడు కూడా ఆ మబ్బులమాటునుండి వెలుపలికి వచ్చుచూ మరల కనుమరుగగుచూ , గాలిని
చీల్చుకొనుచూ రెక్కలు కలిగిన పర్వతరాజము వలె తన పయనమును విరామమెరుగక కొనసాగించుచున్నాడు.

ఆ విధముగా గగన మార్గాన అప్రతిహతంగా అమోఘమైన వేగంతో సాగిపొవుచున్న హనుమను భయంకారాకారిణియునూ, కామరూపిణీయునూ ఐన సింహిక యను ఒక రాక్షసి
చూచినది. మహాబలవంతుడునూ ,

విరాట్రూపుడునూ అయిన హనుమను జూచిన సింహిక కు చాలాకాలం తరువాత తనకు తృప్తికరమైన ఆహారము హనుమ రూపములో లభించినదని సంబరపడినది.

ఈ విధంగా తలంచిన సింహిక వెనువెంటనే గగన మార్గాన పయనించుచున్న ఆంజనేయుని అనుసరించుచూ క్రిందన సముద్రమునందు పయనించుచున్న ఛాయను అడ్డగించగా,
అంతవరకూ మహావేగంగా పయనించుచున్న హనుమకు అకస్మాత్తు గా తన వేగమునకు ఎవరో అడ్డు పడుచుంటిరన్న శంక కలిగినది, నిండుగా అలంకరింపబడిన రధము
పయనించుచుండగా వ్యతిరేకముగా వీచిన తుఫాను గాలి ధాటికి మందగించిన రధము వలె నా వేగము తగ్గిపోవుటకు కారణమేమి ?యని మధనపడుచున్న హనుమ అన్ని
దిక్కులా పరికించి చూడగా మహాసముద్ర జలములను చీల్చుకుంటూ ఉత్తుంగ తరంగము వోలి పైకి వచ్చుచున్న ఆ భయంకర రాక్షస స్త్రీ ని గాంచిన వాయునందనుడు " ఆహా!
ఏమి ఈ సృష్టి అద్భుతము! జీవి ఛాయననుసరించి తన ఆహారమును సంపాదించుకొను ఈ రాక్షసి ని సృష్టించిన విధాత ఎంతటి ప్రజ్నావంతుడు! ఆ రాక్షసిని సింహిక గా నెరింగిన
హనమంతుడు తన దేహమును అనేకరెట్లు పెంచి పెద్దది చేసి చూచుటకు భయంకరమైన దట్టమైన నల్లని వర్షించు మేఘము వలె కన్పట్టు చున్నాడు.

అలాగ భీకరాకారమును ధరించిన హనుమను జూచిన సింహిక కూడా తన నోటిని ఆకాశమంత వెడల్పుచేసి, కత్తు లలాంటి దవడలను చూపించుచూ పిడుగులను తలపించు నటుల
పెద్దపెట్టు న అరచుచూ అమాంతం ఆ కపివరేణ్యుడిపైకి దుమికినది. ఆ క్షణమునందే ఆమె శరీరమునందలి సున్నితభాగములను గమనించిన వజ్రకాయుడగు హనుమ తన
శరీరమును బిగించి ఒక్కసారిగా ఆమె నోటిలోనికి లంఘించాడు.

గ్రహణ ఘడియలలో రాహువు చే మ్రింగివేయబడి అదృశ్యమైన చంద్రు నివలే సింహిక నోటిలోనికి ప్రవేశించిన ఆంజనేయుడిని సిద్ధ,చారణ గణములు దర్శించినవి.అలాగ రాక్షసి లో
ప్రవేశించిన హనుమ తన వాడి గోళ్ళతో ఆమె శరీరమునందలి సున్నిత భాగములను చీల్చి , చెండాడి ఆమె దేహమును తుత్తు నియలు జేసి మరల ఆమె దేహమునుండి వెలుపలికి
వచ్చిన తక్షణమే హనుమ తన పూర్వ శక్తిని పొందాడు. ఆ విధముగా ఆమె అంతమును జూడుమని బ్రహ్మదేవుడు తనకు విధించిన విధిని విజయవంతంగా పూర్తిచేశాడు
అంజనీపుత్రు డు.హనుమ చేతిలో మరణించిన ఆ రాక్షసి మృతదేహము ఆ సముద్రమునందు పడిపోయినది.

మహాకాయుడైన ఆంజనేయుడు రెప్పపాటు కాలములో సింహిక ను అంతమొందించిన వైనాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన దేవగంధర్వులు ఆంజనేయుడిని వేనోళ్ల కీర్తిస్తూ"
మహానుభావా! ఓ కపివరేణ్యా! ఈరోజు నీవు మహాద్భుత కార్యమును సాధించినావు, నీవు అంతమొందించిన ఈ రాక్షసి అసామాన్యురాలు.నాయనా! ఇక ముందు నీవు నీ
మనోసంకల్పమైన రామకార్యమును సాధించుటకు నిర్విఘ్నంగా పయనమును సాగించుము. ఓ కపీంద్రా! కార్యసాధకుడికి నాలుగు లక్షణాలు ఉండును అవి యేమన
లక్ష్యశుద్ధి,వివేచన లేక జాగరూకత, జ్నానం,సమర్ధత. అవన్నియునూ నీయందు సంపూర్ణంగానుండినవి, క్షేమముగా పోయి, కార్యసాధకుడివై మరలి రమ్ము! " అని ఆశీర్వదించిరి.
యక్ష,గంధర్వ,దేవ,కిన్నెర,సిద్ధ గణాల పరీక్షలో తన సామర్ధ్యమును నిరూపించుకొనిన ఆంజనేయుడు గరుత్మంతునివలె ఆకాశమార్గాన పయనించుచూ సముద్రపు ఆవలి తీరమును
చేరుకొనిన అనంతరం హనుమ నలుదిక్కులా పరికించి చూడగా దట్టమైన వృక్షములతో కూడిన అడవి వంద మైళ్ళ దూరము వరకూ విస్తరించియున్నటుల గమనించినాడు.
హనుమంతుడు ఆ అరణ్యమునందు అలా అడుగులు వేయుచూ ముందుకు బోవుచుండగా కొంతదూరమునందు మలయపర్వతమునందు నిలయమైన వివిధరకములైన
వృక్షజాతులు,పొదలు,లతల జాతులను పోలిన అనేక వృక్షజాతులతో అలరారుచున్న ఒక ద్వీపమును చూచినాడు, సముద్రము,భూమి కలియుచోటును, సముద్రపుటొడ్డు న
ఏపుగా పెరిగిన వృక్షాలను నిశితంగా పరిశీలించాడు.

అటుపిమ్మట హనుమ అనంతమైన,దట్టమైన నల్లనిమేఘమును పోలిన తన విరాట్రూపాన్ని ఒకమారు పరికించి చూసుకొని, ప్రచండమైన వేగముతో పయనించుచూ ఇంతటి
భీకరమైన ఆకారముతో నున్న నన్ను రాక్షసులు చూచితిరేని వారు భయవిఫ్వలగుదురని భావించిన హనుమ కామరూపుడు కనుక తన విరాట్రూపాన్ని ఉపసంహరించుకుని
సాధారణ రూపాన్ని ధరించినాడు.నాడు బలిచక్రవర్తి వద్ద దానము గా స్వీకరించిన మూడడుగుల నేలను తన అనంతమైన ఆకారముతో మూడడుగులతో ముల్లోకాలనూ ఆక్రమించి
బలిచక్రవర్తి శక్తిని ఉపసంహరించిన వామనమూర్తి నిపోలిన తన అనంతమైన శరీరాకృతిని ఉపసంహరిస్తూ సాధారణ రూపాన్ని ధరించినాడు.

అనుక్షణమూ తాను సాధించవలసిన కార్యము పట్ల జాగరూకతతో నుంటూ అనితర సాధ్యమైన సాగరలంఘనమును అవలీలగా పూర్తిచేసిన కామరూపుడగు హనుమ
విరాట్రూపమును ఉపసంహరించి తన సహజ శరీరాకృతిని ధరించినాడు.

అటుపిమ్మట , ఆ మహోన్నతుడగు హనుమ శంభుపర్వతమునందలి నల్లని మేఘములను తలపించుచున్న అనేక సమున్నత శిఖరములను కలిగియుండి కేతక,ఉద్దా లక,నారికేళ
వృక్షములతో నిండుగా అలరారుచున్న ఒకానొక శిఖరముపై పాదము మోపినాడు.

సముద్రపుటొడ్డు నకు చేరిన హనుమ తాను పోగోరిన లంకా నగరమును తలంచుకుని, తన సహజరూపమును ధరించి అక్కడనున్న పర్వతశిఖరమున పాదమును మోపగా ఆ
పర్వతమును ఆశ్రయించి బ్రతుకుచున్న జింకలు,పక్షులు మొదలగు వన్యప్రాణులు భీతిల్లినవి.

ఉత్తుంగ తరంగాలతో అలరారుచూ,దానవ,పన్నగశ్రేష్ఠు లకు ఆలవాలమైన మహాసాగరాన్ని అవలీలగా లంఘించి ఆవలి ఒడ్డు నకు చేరిన ఆంజనేయుడు అక్కడ దేవేంద్రు డు
పరిపాలించు అమరావతి ని మించి అందచందాలతో అలరారుచున్న లంకానగరాన్ని చూశాడు.

అనితరసాధ్యమైన మహాసాగరమును లంఘించిన ఆంజనేయుడు త్రికూటపర్వత శిఖరమున నిలబడి లంకానగరాన్ని పరికించి చూశాడు.వందల యోజనాల దూరమును
విరామమెరుగక, అలుపెరుగక , అలసటన్నదియే లేకుండా అవలీలగా మహాసముద్రము మీదుగా అధిగమించిన ఆ కపివరేణ్యుడిని ఆ పర్వత శిఖరమునందలి నలుదిక్కులానున్న
అసంఖ్యాకమైన వృక్షముల నుండి జాలువారిన సుగంధభరిత పుష్పములు కప్పివేయగా హనుమకు ఆహ్లా దము కలిగించినది.

" అపరిమితమైన శక్తిని కలిగి యుండిన నేను ఎన్నో వందల, వేల మైళ్ళ దూరమును అధిగమింపగల సామర్ధ్యము కలిగిన నాకు కేవలము నాలుగు వందల మైళ్ళ దూరమును
అధిగమించితిని కదా!" యని తలంచుచూ , చిక్కటి పచ్చిక బయళ్ళతో అలరారుచూ, దట్టమైన అరణ్యములో చందన వృక్షములనుండి వీయుచున్న సువాసనలు ఆ ప్రాంతమంతా
నిండియుండగా , పుష్పములనుంచి మకరందపు సువాసనలు గుబాళించుచుండగా ,మహాకాయుడగు ఆంజనేయుడు ఆ వనమునందు అడుగులు వేయుచూ లంకానగర దిశగా
పోవసాగాడు.

ఆ ప్రదేశమునందు క్షణకాలము నిలబడి నిండుగా దట్టమైన అడవులతో ,చెట్లతోపులతో అలరారుచున్న ఆ పర్వతశిఖరమునందు ఠీవిగా కనిపించుచున్న లంకాపట్టణమును
కాంచినాడు.

నిండుగా పుష్పములతో అలరారుచున్న సారల,కర్ణికార,ఖర్ఝూర వృక్షములతో,సువాసనాభరితమైన ప్రియళ,ముచులింద,కూటజ,కేతక,ప్రియంగు వృక్షములు, తమ కొమ్మలపై పక్షులు


విశ్రాంతినొందుచుండగా పూమొగ్గలతో కనువిందుచేయుచూ నున్న నిప,సప్తఛ్ఛద,అసన,కోవిదార, కరవీర వృక్షములు మొదలగునవి చల్లగాలికి అటునిటూ ఊగుచుండగా,
సమృద్ధిగా నీటితో నిండిన కొలనులలో శ్వేత,నీలి వర్ణములలోనున్న కలువలు ఆ కొలను అందాలకు కొత్త సొబగులు దిద్దగా, అందు తిరుగాడుచున్న అందమైన హంసలు
చూచుటకు ఎంతో మనోహరంగా నున్న దృశ్యమును, అందముగా తీర్చిదిద్దబడిన ఉద్యానవనములలో అన్ని ఋతువులయందునూ ఫలపుష్పములతో విరాజిల్లెడు వృక్షములతో
ఆ ప్రదేశము అత్యంత రమణీయముగా కన్పట్టు చున్నది.

శ్రీరామపత్ని, మహాసాధ్వి,జనకరాజపుత్రి, సాక్షాత్తూ లక్ష్మీదేవి అవతారమైన జానకీమాతను అపహరించిన తరువాత లంకాధిపతి రావణుడు తన నగరమునకు శతృదుర్బేధ్యముగా
రక్షణ ను కల్పించినట్లు గా కుశాగ్రబుద్ధియగు హనుమ గ్రహించాడు. లంకానగరము చుట్టూ నిండుకుండ ని తలపించుచూ, శ్వేత,ధవళ వర్ణశోభితమైన కలువపుష్పములతో
కన్నులవిందు జేయుచూ, స్వఛ్ఛమైన జలముతో కందకము, ఆ నగరమునకు కాపలాగా నలుదిక్కులా యెల్లవేళలా మహా పరాక్రమవంతులగు రాక్షస యోధులను నియమించాడు,
సుందరమైన ఆ లంకానగరమునకు చుట్టూ స్వర్ణ మయశోభితమైన యెత్తైన కుడ్యమును నిర్మించినాడు. ఆ నగరమునందున్న సౌధములన్నియూ అత్యంత సుందరముగా
,శరత్కాలపు మేఘములను ఓలి పర్వతములంత యెత్తు గా నున్నవి. నగరమునందలి ప్రధానరహదారులకు ఇరువైపులా ధవళ కాంతులతో వెలుగొందుచూ యెత్తైన సౌధములు
వందల సంఖ్యలో బురుజులతో , ఆబురుజులపై వివిధవర్ణములలో మెరిసిపోతూ రెపరెపలాడుచున్న ధ్వజములు,తోరణములతో అత్యంత రమణీయంగానున్నవి. సువాసనలతో
కూడిన లతలచే అల్లు కొనబడిన బంగారు స్వాగత ద్వారములతో హనుమకు ఆ నగరము చూచుటకు అత్యంత అద్భుతంగా నుండి అమరలోకమును
తలపించుచున్నది.పర్వతమునందు అత్యున్నత శిఖరమున నిర్మింపబడిన ఆ నగరము నలుదిక్కులా ధవళ వర్ణశోభితమైన సౌధములతో ప్రకాశించుచూ అంతరిక్షమునందు
నగరమున్నదా ! అని నటుల భ్రమింపజేసినది.దేవశిల్పియైన విశ్వకర్మ నిర్మించబడి, రాక్షసరాజగు రావణాసురుని ఆధీనములోనున్న లంకాపట్టణము చూచుటకు గగనమునందు
ఎట్టి ఆధారమూ లేక వ్రేలాడుచున్నట్లు గా హనుమకు గోచరించినది. ఆ నగర ప్రాకారములే ఊరువులుగా, నగరమునందలి సెలయేళ్ళు,అడవులే వస్త్రములుగా , భవనమునందలి
బురుజులలో అమర్చిన శతఘ్నులు,శూలములే కేశములుగా,భవనశిఖరములే కిరీటముగా శోభిల్లు చున్నవిశ్వకర్మ నిర్మితమైన ఆ ఆ నగరము ఒక అందమైన స్త్రీ రూపమును
సంతరించుకున్నది.

నగరమునకు ఉత్తరదిక్కుగా నున్న ద్వారమును పరికించి చూడగా అది కైలాసపర్వత శిఖరమును తలపించుచూ అది ఆ కాశమును చీల్చుచున్నదా యన్నంత యెత్తు గా నుండి ఆ
ద్వారపు శిఖరములు అంతరిక్షమునకు ఊతమిచ్చుచున్నవా అనునటుల అత్యంత సంభ్రమాశ్చర్యములు గొలుపురీతిన ఉన్నవి.ఆ నగరమంతయూ అత్యంత భయంకర రూపులైన
రాక్షసులు అనునిత్యమూ గుంపులుగుంపులుగా తిరుగాడుచూ, గుహ నందు ఆవాసమున్న విషపు సర్పములకు సముద్రము రక్షణ కల్పించినటుల రావణాసురుడి చే ఈ
రాక్షసులందరూ రక్షింపబడుచుండిరి.ఇదంతయూ జూచిన ఆంజనేయుడికి మదిలో ఈవిధముగా తలంపు కలిగినది.

" రాఘవుడు ఎన్నో అవరోధములను అధిగమించి ఇంతటి భీతిని గొల్పు శతృదుర్బేధ్యమగు రావాణాసురుని రక్షణ లోనున్న ఈ లంకా పట్టణమును చేరుకొనిననూ ఏమి
చేయగలడు? ఈ రాక్షసులతో చర్ఛలు జరుపుట వలన గాని, లంచమిచ్చుటచే గాని, వారిలోవారికి అభిప్రాయభేదములను కల్పించుటవలన గాని, చివరగా వారితో యుద్ధము
చేయుటచేగాని వీరిని జయించుట సాధ్యము కాదే! వానర వీరులలో నాతో సహా వాలిసుతుడగు అంగదుడు,నీలుడు,సుగ్రీవుడు మాత్రమే సాగరమును దాటి లంకను చేరగల
సామర్ధ్యము కలవారము.ముందుగా జానకీమాత జీవించియున్నదా? అట్లైనచో ముందుగా వైదేహి జాడ కనుగొనిన అనంతరం ఈ విషయములన్నింటినీ ఆలోచించెదను" అని
తలంచుచూ హనుమ ఆ పర్వత శిఖరమునందు నిలబడి రామపత్ని యగు సీతాదేవి జాడను కనుగొనుటెట్లని మదిలో తలంచుచూ" నగర రక్షణ బాధ్యతలను వహించుచున్న
అతిభయంకరరూపులూ,పరాక్రమవంతులూనూ అగు ఈ రాక్షసుల కన్నుగప్పి ప్రస్తు తమున్న నా ఈ దేహముతో నగరములో ప్రవేశించుట తగదు, అట్లని వారితో తలబడు
ప్రయత్నము జేయుట కూడా ఈ సమయమున తగదు కనుక జానకీ మాత అన్వేషణ కై నిశీధ సమయమునందు ఎవరికంటనూబడని సూక్షరూపమును ధరించి ఈ విశాలమైన
మహా నగరము నందు ప్రవేశించి ఈ నగరము అణువణునా వెదకుట ప్రారంభించెదన"ని నిశ్చయించుకున్నాడు.
దేవదానవులకు కూడా ప్రవేశింపసాధ్యముకాని ఆ లంకాపట్టణమును చూచుచూ హనుమ దీర్ఘంగా శ్వాసను పీల్చుచూ" రాక్షసరాజైన ద్రోహి రావణాసురుని కన్నుగప్పి జనక రాజపుత్రి
యగు మైథిలి జాడను నేనెట్లు కనుగొనగలను? రామకార్యమును నేనెట్లు సాధింపగలను? శతృవుల కంటబడకుండా జనకరాజపుత్రికను రహస్యముగా నేనెట్లు చూడగలను?
కాలమానపరిస్థితులకెదురొడ్డి రామకార్యమును సాధించుట యెటుల? సూర్యోదయము చేత అంధకారము తొలగిపోవునటుల దూత చేతగానితనముచే కార్యము చెడరాదు.ఏదేని
ఒక కార్యము సిద్ధించవలెనన్ననూ లేదా వైఫల్యము చెందవలెనన్ననూ అది ఆ కార్యమునకు నియోగింపబడిన సాధకుని సామర్ధ్యము లేక అహంకారము తో కూడిన అజాగ్రత్త లే
బాధ్యులు గా తెలియవలెను.

ప్రస్తు తమూ నేను నియోగింపబడిన రామకార్యమునందు వైఫల్యము చెందకూడదనిన, నేనేవిధముగా నడచుకొనవలెను? సముద్రాన్ని లంఘించిన నాకు ఎట్టి ఫలితము
కలగబోవుచున్నది? ఈ సమయమునందు నేను రాక్షసుల కంట బడితినేని, రావణాసురుడు చేసిన అపరాధమునకు ఆతడిని సంహరించవలెనన్న రాముని అభిమతమునకు
విఘాతము కల్గును.నేను కూడా రాక్షసరూపమును గాని లేక మరే ఇతర రూపమును ధరించి వీరిమధ్యన తిరుగుచూ సీతాన్వేషణ కొనసాగింపదలచిననూ ఆ రూపమునందు
ఎక్కువ కాలము రాక్షసులను ఏమార్చుట కష్టసాధ్యము. వీరికి తెలియకుండా వాయుదేవునికి సైతం ఇక్కడ కదలాడుట సాధ్యం కాదు. ఈ భయంకర రాక్షసుల కన్నుగప్పి
చరించుట ఎవరికీ సాధ్యం కాదు. కనుక ప్రస్తు తము నేనున్న రూపమున లంకానగరమున ప్రవేశించితినేని, ఇక్కడి రాక్షసులు నన్ను గుర్తించినచో రామకార్య సాధన కు ఆదిలో నే
విఘ్నము కలుగును .అందుచే నేనిప్పుడు సాధారణ కోతి రూపమును ధరించి లంకానగరమున ప్రవేశించెదను.దుర్భేద్యమిన ఈ లంకానగరమునందు రాత్రివేళలో ప్రవేశించి ఈ
నగరమునందు అణువణువునా శోధించి జానకీమాత జాడను కనుగొను ప్రయత్నము జేసెదను.

ఈ విధముగా నిశ్చయించుకున్నవాడైన హనుమ సూర్యాస్తమయ సమయము వరకు వేచియున్నాడు.

సూర్యుడు అస్తా ద్రి కి చేరుకున్న అనంతరం చూచుటకు అద్భుతంగానున్న మార్జా ల పరిమాణమాత్ర రూపమును ధరించిన హనుమ ఒక్క గెంతు గెంతి లంకానగరమునందు
ప్రవేశించినాడు. విశాలమైన వీధులతో, బంగారు స్తంభములతో, బంగారు మేడలతో నిర్మితమై ,సుందరంగా తీర్చిదిద్దిన మనోహరంగా నున్న ఆ నగరం గంధర్వ నగరాని
తలపిస్తు న్నది.

అనంతరం అలా ముందుకు సాగుతున్న హనుమ వివిధ వర్ణములు కలిగిన రాళ్లను పొదిగి, చలువరాతి నేలలతో, బంగారు సింహద్వారములతో నిర్మితమైన ఏడెనిమిది అంతస్తు ల
భవనాలతో అద్బుతంగా నిర్మింపబడిన లంకాపట్టణ వైభవమునకు ఆశ్చర్యపడి, ఇంత సుందరపట్టణమునందు తన కర్తవ్యమైన సీతాన్వేషణను వెదకుటను తలంచుకుని కొంత
దిగులు చెందాడు.

ఆనాటి రాత్రి పున్నమినాటి రాత్రి, ఆకాశమంతా నిండుగా నక్షత్రములు మెరయుచుండగా, పున్నమిచంద్రు డు చిక్కటి వెన్నెల ను విరజిమ్ముతూ సకల లోకాలకూ తన కాంతులను
ప్రకాశింపజేస్తు న్నాడు.కపిశ్రేష్ఠు డైన హనుమ కు ఆ రాత్రియందు ఆ పున్నమిచంద్రు డు ధవళ కాంతిలో ప్రకాశిస్తు న్న శంఖము వలె, తెల్లని క్షీరమువలె,తెల్ల తామరతూడులవలె
వినీలాకాశమందు తన కాంతినంతటినీ నింపుచూ నిండు కొలనులో హాయిగా తిరుగాడుచున్న తెల్లని హంస వలె అగుపించాడు.

You might also like