గిప్సన్ సంఘ 25 వ వార్షికోత్సవం సంధర్భంగా అక్షర మాల

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

గిప్సన్ సంఘ 25 వ వార్షికోత్సవం సంధర్భంగా అక్షర మాల

 అమృత జల్లు లోలికించే అనురాగాల – వనంలోకి ఆహ్వానించే ఆర్చ్-

ముగియక తప్పదెందరో మనఃశాంతి – శోధకుల సెర్చ్

మనోల్లా స శాంతి సమాధాన సిరుల వైపు – సాగే లాంగ్ మార్చ్ –

చేస్తూ యేసుతో ఠీవిగా సాగిపో యే – ఈ గిప్సన్ చర్చ్ –

 ఈ సుందర మందిర స్థా పనలో – దాగున్నాడో మహా మనీషి –

మది మదిలో నిక్షిప్తం ఆ – ఉక్కు మనిషి సల్పిన కృషి –

కూర్చిన సంఘపు పునాదిలా నిలిచిన – ఓ అపర భగీరధుడు –

ఆ మహో న్నత రూపం నేటికీ – నింపింది ప్రతి హృదిలో ఖుషి –

వారి జన్మ ఈ సమాజానికిచ్చిన – దేవుని వర o –

వారే సంఘ స్థా పకులు కందుకూరి దేవవరం –

 సో లిపో యిన మనస్సులను సేదదీర్చే – ఆధ్యాత్మిక మనోల్లా సం –

ఆటుపో ట్లే న్నో సహించి నిలిచిన – వైభవోపేత విలాసం –

మహిళల యవ్వనుల సండేస్కూల్ కుడికలు రిట్రీట్ ల – అనునిత్య దైవ సహవాసం –

తన్మయం చెందిన ప్రతి మనస్సులో – నిండిన క్రీస్తు ని ఆవాసం –

అభిమాన పలకరింపులు – కురిసే అనురాగల పన్నీటి జల్లు లు –

తనుపు పులకరించేలా – స్వర రాగాల జల్లు లు కురిపించే బంగారు తల్లు లు –

 నైరాశ్యం నిస్పృహలతో నిండిన యూత్ విల్ రిక్వైర్ –

సమ్ మైండ్ రీఫ్రెష్, హియర్ – డే విల్ ఏక్వైర్ –

అంటూ రిథమిక్ గా సాగే – యూత్ ఫుల్ క్వయర్ –

పరలోక దూతల గాన రసస్వాదనం ను మరిపించే క్వయర్ –

ఈ సుప్రసిద్ద సంఘం సొంతం –

కాదు కాదు లేదు ఈ అనుభూతులకెపుడు అంతం –

 “ఈ వేళ”

 నింగిలోని తారలన్నీ భువికేగి – ముచ్చటపడి మురిశాయి

క్రీస్తు ని అబ్బురమైన ఆశీస్సులు – ఈ సంఘం పై కురిశాయి

ఆ వెలుగు జిలుగుల సంబరమే – ఈ గిప్సన్ సంఘ వార్షికోత్సవం –

పదిలమైన జ్ఞా పకాలతో 25 వసంతాలు దాటిన ఈ వార్షిక ఉత్సవం –


 తరతరాలకు ఈ అనుభూతుల పరిమళాలు – గుభాళిస్తుండాలనీ నా ఆకాంక్షలు

మీకివే నా హృదయ పూర్వక – గిప్సన్ సంఘ 25 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు –

 చివరిగా చివరిగా నాదో చిన్నమాట –

కాదు కాదు సంఘ కాపరి కోసం – ఓ భావోజ్వలిత పాట -

 ఆ.... ఆ .... ఆ.... కంటిన్ –

నీ నిస్వార్థ దైవ సేవా.. రీతిన్ –

ధ్యాన హృదయ .... ఓ కృపా దాన రాజా –

శాంతిన్ పంచే సతికి.... పతివయి –

కల్వరి కాంతిలో చెరో అక్షరమై –

తళుకులీనే మీ దాంపత్యంబు –

ఆ.... ఆ .... ఆ.... ఆ.... ఆ .... ఆ.... –

 యేసుని సేవలో సదాసేద దీర్చే సరస్సులై –

ఆద్యాత్మిక పయనంలో నిత్య యాత్రీకులై –

ధ్యానంతో దేవుని కృపను శాంతం లను దానం చేసే ఱెడులై –

ఒలీవ కొమ్మలై ప్రహర్షించే కల్వరి కాంతులై –

మీ దంపతులు ఆత్మీయానంద పరవశులై –

చేసే సేవ చాలా గొప్ప –

ఏం చేయగలను మాటలేమి లేక వినమ్రంగా మీకు నమస్కరించడం తప్ప –

- దేపంగి కిరణ్ కుమార్

You might also like