Professional Documents
Culture Documents
Brs Out
Brs Out
ఇప్పుడు రాజీనామాలు చేస్తు న్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ సర్కారులో తమ సేవలందించగా.. వారిపై రేవంత్ రెడ్డి గతంలో చేసిన
ఆరోపణల ఫలితంగానే రాజీనామాలు చేస్తు న్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు తమ రాజీనామాలు సీఎస్‌కు పంపించగా.. మరికొంత
మంది కూడా సిద్ధమైనట్టు సమాచారం.
తెలంగాణలో నిన్ననే ఫలితాలు రాగా.. ఈరోజే రాజీనామాల పర్వం మొదలైంది. తెలంగాణ ఎర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రెండు
పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగగా.. ఈసారి మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే.. ఇన్నేళ్లు బీఆర్ఎస్
ప్రభుత్వంతో ప్రయాణం సాగించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు వారి పోస్టు లకు రాజీనామాలు చేస్తు న్నారు. ఇన్ని రోజులు
ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా కొనసాగిన దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. 2014 జూన్ 5 న జెన్కో సీఎండీగా
బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ రావు.. అదే ఏడాది అక్టోబర్ 25 న ట్రాన్స్‌కో ఇంఛార్జిగా నియమితులయ్యారు. మొదట ప్రభాకర్ రావును
రెండేళ్ల పదవీ కాలానికే సీఎండీగా సర్కారు నియమించినప్పటికీ.. ఆ తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. కాగా.. బీఆర్ఎస్
ఓడిపోవటంతో.. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఆయన సంస్థకు మొత్తంగా 54 ఏళ్లపాటు
సేవలందించినట్టయింది.zvfdsfdsf
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లు గా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా తమ పదవులకు రాజీనామాలు
చేస్తు న్నారు. ఇప్పటికే మొత్తం 15 మంది ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేస్తూ.. వారి రాజీనామా పత్రాలను సీఎస్‌కు
పంపించారు.