'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 11

4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.

com Latest Telugu News

HOME CONTACT US DISCLAIMER PRIVACY POLICY

‘వోణీ’ కవితకి ఒక వికటానుకరణ…. A


PARODY AGAINST ‘EXTREMISM’….
MARCH 26, 2023 BY M S R

Powered By

అనుకరణతో అల్లరి చేసే మేజిక్… పేరడీ.

పైకి వొట్టి మాటల గారడీలానే ఉంటుంది.

అందులోనే గిలిగింతలు పెట్టే కామెడీ పండుతుంది. మన తెలుగులో పేరడీ చాలా పాపులర్.

మీరజారగలడా నా యానతి – (అనగానే)

వీపు గోకగలడా… సత్యా పతి! అలా కుదరాలి.

మరో ప్రపంచం మరో ప్రపంచం

https://muchata.com/a-parody-against-extremism/ 1/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News
మరో ప్రపంచం పిలిపించి…

తన కవితనే శ్రీశ్రీ పేరడీ చేస్తూ –

పొగాకు తోటలు పొగాకు తోటలు

పొగాకు తోటలు పండితున్ అన్నా రు.

దీన్ని కంటిన్యూ చేస్తూ జర్న లిస్టు మిత్రుడు, గాయకుడు తుమ్మ లపల్లి రఘురాములు –

పొగాకు తోటలు జగానికంతా

సిగార్లు గానే నందింతున్ అన్నా డు

ఓ సాయంకాలం సరదా పార్టీలో!

***

పేరడీ అంటే జలసూత్రం రుక్మి ణీనాథ శాస్త్రి పేరే గుర్తొస్తుంది. మాచిరాజు దేవీప్రసాద్,
భమిడిపాటి రాధాకృష్ణ, ఆరుద్ర, పఠాభి, శ్రీరమణ పేలిపోయే పేరడీలు రాశారు.

శ్రీశ్రీ నవ కవితను పేరడీ చేస్తూ జరుక్ శాస్త్రి గారు

మాగాయీ, కంది పచ్చ డీ

ఆవకాయి, పెసరప్ప డమూ

తెగిపోయిన పాత చెప్పు లూ

పిచ్చా డి ప్రలాపం, కోపం

వైజాగులొ కారాకిల్లీ

సామానోయ్ సరదా పాటకు – అన్నా రు.

కన్యా శుల్కం సినిమాలో సావిత్రి డాన్స్ చేసిన

శ్రీశ్రీ ప్రసిద్ధ కవిత ‘అద్వై తం’ కి జరుక్ శాస్త్రి పేరడీ:

ఆనందం అంబరమైతే

అనురాగం బంభరమైతే

అనురాగం రెక్క లు చూస్తాం

ఆనందం ముక్క లు చేస్తాం!

C.A.T – కేటువి నీవై

R.A.T – రేటుని నేనై

రాతగ్గ కవిత్వం నీవై

పోతగ్గ ప్రభుత్వం నేనై!

తిగ్మాంశుని కిరణం లాగా

https://muchata.com/a-parody-against-extremism/ 2/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News
ఎగ్మూ రు స్టేషను నీవై

మారురంగు మణీ లాగా

నోరులేని ముక్క ను నేనై

కాలానికి ఆక్సి జన్ ఇచ్చాం

ఏలాగో తగలడి చచ్చాం!

ఇలా వెటకారాన్ని పద్యంగా పరిగెత్తించారు.

వస్తు న్నా య్ వస్తు న్నా య్ జగన్నా థ రథచక్రాల్ – శ్రీశ్రీ కవితకి జరుక్ శాస్త్రి అద్భు తమైన
పేరడీ రాశారు.

లలాటాన కుంకుమాగ్ని , భుజం మీద మబ్బు దుబ్బు

కాళ్ళ కింద కిర్రు చెప్పు , అంగోస్త్రం పొడుంకాయ

వ్య వధి లేని అవధానం వెళిపోయిందెళిపోయింది

చెళ్లపిళ్ల పద్యా వళి చిలకమర్తి గయుడికథా

వడ్డా దీ, పానుగంటి, బావిలీలు, బ్రహ్మ సమాజ్

తాటికాయ నీటికాడ, ఫుల్లు మూను టాటాలూ

ప్రచారిణీ చింతామణి వెళిపోయాయెళిపోయాయి

గిరజాలూ లాల్చీ లూ, వల్లెవాటు కళ్ళ జోళ్ళు

టాగూరూ, పొడుగురైక, రిస్టు వాచి, రోషనార

ఎంకిపాట, హనీడ్యూ లు, కాంతం కథ, జలవైద్యం

టాల్మా డ్జీ, గృహలక్ష్నీ , లారెన్సూ , లాంగ్ ఫెలో

సాయ్ బాబా, ఫెవర్ లూబా వెళిపోయాయ్యె ళిపోయాయి

చీరాలా పేరాలా హోమ్ రూలు, మాగ్డో నాల్డు

ముద్దు కృష్ణ జ్వా లగోల అయిపోయిందయిపోయింది

మా కళ్ళ ముందు కాళ్ళ ముందు వెళిపోయాయ్యె ళిపోయాయి

కపిలవాయి, గంధర్వా , స్థా నం నటి, చలం వ్య ధా

రాయప్రోలు దేశభక్తి, విశ్వ నాథా విసురుళ్ళూ

డాడాయిజం, ఇమేజిజం వెళిపోయాయ్యె ళిపోయాయి – యిలా

పదాలతో కదం తొక్కించారు జరుక్ శాస్త్రి.

*** *** ***

జరుక్ శాస్త్రి తరువాత మాచిరాజు దేవీప్రసాద్

https://muchata.com/a-parody-against-extremism/ 3/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News
మంచి పేరడీలు రాశారు. నాయని వారిని

దేవీప్రసాద్ ఇమిటేట్ చేస్తూ –

ఎవ్వ డా క్రూర కర్మ కుడెవడు, నీల

జలద నిర్ము క్త శైశిర శర్వ రీ, ప్ర

శాంత మలవాటుపడిన నిశాంతమందు

అక్క ట నీల్ కాలుబుడ్డి తన్నే సినాడు –

అని చమత్కా రంగా రాశారు.

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు (మాస పత్రిక ఢంకా, 1955) అని శ్రీశ్రీ రాసిన
పోయెంకి ఆయనే రాసుకున్న పేరడీ:

ఏరి తల్లీ నిరుడు మురిసిన

ఇనప రచయితలు?

కృష్ణశాస్త్రపు టుష్ట్రపక్షీ

దారి తప్పి న నారి బాబూ

ప్రైజు ఫైటరు పాపరాజూ పలకరేంచేత?

ప్రజాస్వా మ్య పు పెళ్ళి కోసం

పండితారానాధ్యు డాడిన

వంద కల్లల పంది పిల్లల

ఆంధ్రపత్రిక ఎక్క డమ్మా

ఎక్క డమ్మా ఎలక గొంతుక

పిలక శాస్త్రుల పనికిమాలిన

తలకుమించిన, వెలకు తగ్గిన

రణగొణ ధ్వ నులు?

ఏవి తల్లీ నిరుడు మురిసిన

హిమసమూహములు!

*** *** ***

కట్ చేస్తే అది… 1989. విజయవాడ.

‘ఆంధ్రభూమి’ దినపత్రిక grandగా launch చేయాలని ఎండీ తిక్క వరపు వెంకట్రామిరెడ్డి,

ఎడిటర్ ఏబీకే ప్రసాద్ ప్లా న్ చేశారు. అప్ప టికి విజయవాడ ‘ఆంధ్రజ్యో తి’లో హేపీగా ఉన్న
నన్ను కొమ్మి నేని వాసుదేవరావు ‘భూమి’కి లాక్కొ చ్చా రు.

https://muchata.com/a-parody-against-extremism/ 4/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News
“విజయవాడ ఎడిషన్ బాధ్య త పూర్తిగా మీదే.

మేం జోక్యం చేసుకోం. బాగా చేయండి” అని వాసు గారు చెప్పా రు. ట్రైనీలుగా, సబ్ ఎడిటర్లు గా
పనిచేయడానికి దాదాపు 60 మందిని రిక్రూట్ చేశాం. వాసు, ఏబీకే విప్లవ తీవ్రవాదానికి
అనుకూలురు గనక ‘విరసం’ కి సంబంధించిన వాళ్ళ నీ, విప్లవోద్య మంలో పనిచేసి
అలసిపోయిన వాళ్ళ నీ ఎక్కు వగా తీసుకున్నా రు.

‘భూమి’ విజయవాడ ఎడిషన్ బాగా వస్తోందని అందరూ ముచ్చ టపడ్డా రు. అయితే, విప్లవ
పూనకంతో వున్న కొందరు కుర్ర జర్న లిస్టు లు, వరవరరావు వార్త ఆరో పేజీలో వేశారేం?

బాలగోపాల్ ప్రెస్ మీట్ పదో పేజీలోనా వేసేది?

అని నాతో గొడవ పడేవాళ్ళు .

“నేను సీపీఐకి అనుకూలం ఐనా, మీరు నక్స లిజాన్ని ప్రేమించే వాళ్ళ యినా ఈ ‘ఆంధ్రభూమి’
ఒక కాంగ్రెస్ ఎంపీకి చెందిన పేపరు. ముష్టి నెల జీతాలకి పనిచేస్తు న్న వాళ్ళం మనం. ఓవర్
యాక్షన్ వద్దు ” అని నచ్చ జెప్ప బోయినా వినేవాళ్ళు కారు.

నిజానికి నేనక్క డ సూపర్ బాస్ ని.

వాసు గారు, ఏబీకే, మేనేజ్మెంటూ… నేనేం చేసినా కాదనేవాళ్ళు కారు. కుర్ర జర్న లిస్టు లు
మాత్రం ఎగిరెగిరి పడేవాళ్లు . నాక్కా స్త చికాగ్గా వుండేది.

అలాంటి సమయంలో ఒక దినపత్రికలోనో, వారపత్రికలోనో కవయిత్రి కొండేపూడి నిర్మ ల

పోయెం ఒకటి వచ్చింది. శీర్షిక ‘వోణీ’.

కొత్తగా వోణీ వేసుకునే ఆడపిల్ల మానసిక ఉద్వే గాన్ని చాలా బాగా రాశారామె.

అప్ప టికే ఒక్క నేనే – ఇన్ని ముక్క లు, లేబర్ రూం కవితలతో కొండేపూడి నిర్మ ల పాపులర్
అయి వున్నా రు. ఆఫీసులోనే, ‘వోణీ’ కవితకు గబగబా ఒక పేరడీ రాశాను ‘విప్లవోణీ’ శీర్షికతో.

బరువు
పెరగాలనుకుంటున్నా రా?

నేనూ విప్లవాభిమానినే అయినా, కుర్రాళ్లు పెట్టిన చిరాకు వల్ల నక్స లైట్లని శపిస్తూ contextual
change తో పేరడీ రాశాను.

‘భూమి’లో పనిచేస్తు న్న ఖమ్మం కవి ప్రసేన్, నేను రాసింది చదివి చాలా బావుందనీ
‘ఆంధ్రజ్యో తి’

వీక్లీకి యిస్తా నని తీసుకున్నా డు.

పేరు తెలియకుండా ‘ప్రకాశరావు’ అని పెట్టమన్నా ను. వీక్లీ ఎడిటర్ పురాణం సుబ్రహ్మ ణ్య శర్మ
గారికి పేరడీ నచ్చి , వెంటనే పబ్లిష్ చేశారు. అప్ప టి జ్యో తి వీక్లీలో కథో, కవితో రావడం అంటే
పెద్ద గౌరవం కిందే లెక్క .

*** *** ***

లో
https://muchata.com/a-parody-against-extremism/ 5/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News
1990లో కావొచ్చు .

కొండేపూడి నిర్మ ల కవితా సంపుటి ‘నడిచే గాయాలు’ ఆవిష్క రణ సభ విజయవాడలో


జరిగింది.

సాహిత్య సభలకి వెళ్లే పాత దురలవాటు వల్ల,

కవిగా నిర్మ ల గారిపై గౌరవం వల్లా ఆ సభకి వెళ్లా ను. భాషావేత్త చేకూరి రామారావు ముఖ్య
అతిథి.

ఆ సభలో చేకూరి మాట్లా డుతూ,

“నిర్మ ల మంచి కవయిత్రి. ‘నడిచే గాయాలు’లో కవితలన్నీ బావున్నా యి. ఎవరో ఒక కవితకి
పేరడీ రాశారని నిర్మ ల చెప్పింది. పేరడీ రాయడం అంటే కవిని గౌరవించడమే. ఒక distinct
style వున్న వాళ్ళ నే అనుకరిస్తా రు. కనుక

ఆ పేరడీని కూడా ఈ సంకలనంలో చేర్చ మని

నేను చెప్పా ను ఈ సంపుటి చివరి పేజీలో ప్రకాశరావు పేరడీ వుంది” అని చెప్పా రు.

అది రాసిందెవరో ఆ సభలో నాకొక్క డికే తెలుసు.

*** *** ***

కవికి ఒక ప్రత్యే కమైన శైలి వున్న పుడే పేరడీ పండుతుంది. వెక్కి రింత, మిమిక్రీ, చురక,
చమత్కా రం, వక్రీకరణ, అధిక్షేపం, ఒరిజినల్ ని

భగ్నం చేయడం, భ్రష్టు పట్టించడం… హాస్యం పండించడం కోసం చేసే వికటానుకరణే పేరడీ.

ఇలాంటివేవీ తెలియని చిన్న తనంలోనే రేడియోలో – అందాల ఓ చిలకా… అని పాట


వస్తుంటే –

అందుకో నా పిలకా – అని పాడేవాళ్ళం!

…. ముత్తైదు కుంకుమా బతుకంత మాయా

అనీ అనేవాళ్ళం.

“లే, లే, లే నారాజా…” అనే చిల్లర పాటని ప్రభువు గీతంగా మార్చి రా..రా..రా.. నా యేసూ –
అంటూ భక్తిపారవశ్యంతో పాడినపుడు పడీపడీ నవ్వి న రోజులు మర్చి పోగలమా?

రగులుతోంది మొగలిపొదా… అనే మన జాతీయ బూతు గీతం బాణీలో పాడిన


అయ్య ప్ప స్వా మి

భక్తి గీతం విన్నా రా? – లేదా? అయితే మీరు జీవితంలో నవ్వీ నవ్వీ తిరిగి కోలుకోలేని

హాస్యా న్ని కోల్పో యినట్టే.

***

ఇది కొండేపూడి నిర్మ ల గారి ‘వోణీ’ కవిత.

బాల్య పు పెళ్ళి యింటికీ

యవ్వ నం విడిది యింటికీ

https://muchata.com/a-parody-against-extremism/ 6/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News
పరుగులు తీసే చిత్తకారి వాన ఓణీ అంటే

ఆకతాయితనం తలుపులు మూసేస్తూ

అడ్డగడియలా వుంటుంది

గాలాడక ఉక్క పోస్తు న్న కొట్టు గదిలా వుంటుంది

మడిచీరతో మగ్గిపోయే ఛాదస్తపు హెచ్చ రికలా వుంటుంది

మధ్య తరగతి బూర్జు వా కొంపకి పెద్ద పిల్లలా వుంటుంది

పుస్తకం బోర్లించిన గ్లా సులో నిలవనీళ్ల రుచిలా వుంటుంది

రోడ్డె క్కి తే చాలు అదేదో ఎలక్ట్రిక్ పోల్ ఎక్కి నట్టు

ఇంటిల్లిపాదీ ఎదురుచూడ్డంలా వుంటుంది

పాపా అనాలో మేడమ్ అనాలో తోచనివ్వ ని

సందేహ సరసిలా వుంటుంది

గౌను మీద బెంగలా వుంటుంది

చీర మీద మనసులా వుంటుంది

మొహానికి నూన్రాసుకుని, జుట్టు ముడేసుకుని

మహా లేజీగా వున్న ప్పు డు

ఇంటికెవరో హాండ్స మ్ వచ్చి నట్టు వుంటుంది

తీరిగ్గా సింగారించుకుని గొప్ప గోలయిపోతుందనుకున్న రోజు

అసలెవ్వ రూ పట్టించుకోక పోవడంలా వుంటుంది

ఓణీ ఓణీలానే వుంటుంది

ఓణీకున్న లాలిత్య మెప్పు డూ

ఓణీ గొంతు విప్ప నట్టు వుంటుంది

బాణీకట్టని పాటలా వుంటుంది

రాయని పద్యంలా వుంటుంది

ఇవ్వ ని ముద్దు లా వుంటుంది

ఒక చంచలానంద సాయంత్రం అచ్చు ఓణీలానే వుంటుంది

నాభి మీద ఒక చెయ్యి వేసి

నడుము చుట్టూ గిరికీలు తిరిగి

ఎద మీద వాలిపోతూ

https://muchata.com/a-parody-against-extremism/ 7/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News
మెడ మీద కితకితలు పెట్టిన

నైలాన్ జార్జెట్ ఇంద్రజాలంలా వుంటుంది

అసలది కట్టు కున్న తీరే యమ గమ్మ త్తు గా ఉంటుంది

*** *** ***

‘వోణీ’కి నేను రాసిన పేరడీ…

‘విప్లవోణీ’ అని నేనంటే, పురాణం గారేమో

‘విప్లవ వోణీ’ అని శీర్షిక మార్చా రు. విప్లవకారులం అనుకుంటున్న కొందరు కుర్రాళ్ళ ‘అతి’
మీద

ఇది నా ఉక్రోషం మాత్రమే!

నిజమైన త్యా గధనులను కించపరచడం

నా ఉద్దే శం కాదు.

‘విప్లవోణీ’

(‘ఓణీ’కి ఫక్తు పేరడీ)

బాల్య పు సంకెళ్ళ ఇంటికీ

యవ్వ నం సూర్యో దయానికీ

నినదిస్తూ తిరిగే ఒంటరి గొంతు ‘ఓణీ’ అంటే –

పెట్టు బడి తలుపులు మూసేస్తూ

అడ్డగాడిదలా వుంటుంది

గాలాడక వుక్క పోస్తు న్న వ్య వస్థలా వుంటుంది

మడిచీరతో మగ్గిపోయే

ఫ్యూ డల్ హెచ్చ రికలా వుంటుంది

మధ్య తరగతి పెటీ బూర్జు వా కొంపకి

మల్టీ నేషనల్ లా వుంటుంది

నినాదం బోర్లించిన దేశంలో

నీరసపు కేకలా వుంటుంది

అడివంటే అదేదో విప్లవ జెండా పైకెత్తినట్టు

కుర్రకారంతా ఎర్రగా చూస్తా రు

ఎత్తు గడలో వ్యూ హమో తోచనివ్వ ని

జంగిల్ ఇండియా జాలంలా వుంటుంది

https://muchata.com/a-parody-against-extremism/ 8/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News
జెండానీ కర్రనీ అల్లంత దూరాన చూడగానే

చెడ్డీలో వుచ్చ పోసుకోడంలా వుంటుంది

1917 మీద బెంగలా వుంటుంది

చందాలు దండుకుని ఎన్ని కలంటూ

మహా బిజీగా వున్న ప్పు డు

ఇంటికెవరో తుపాకీ తెచ్చి నట్టు వుంటుంది

సకల ఆయుధాలూ సంధించి

వ్య వస్థ కూలిపోతుందనుకున్న ప్పు డు

ముక్కు సుబ్బా రెడ్డి పిక్క బలం చూపినట్టు వుంటుంది

విప్లవ్వో ణీ ఎర్రగానే వుంటుంది

జెండా కట్టని కర్రలా వుంటుంది

పేలని గ్రెనేడ్ లా వుంటుంది

ఒక చంచల అరుణానంద సాయంత్రం

చిమ్మ చీకటి కురిసినట్టు గా వుంటుంది

కుర్రాళ్ళ ను బలవంతంగా ఎన్ కౌంటర్లకు ఒప్పి స్తూ

నాయకత్వం నోట్లో చుట్ట తిప్పు కుంటూ

పిస్టల్ కున్న రోల్డ్ గోల్డ్ ట్రిగర్ని

నొక్కు తున్న ట్టు నటిస్తూ నే

‘రామ్మా రా’ అంటూ

విప్లవాన్ని పిలుస్తు న్న ట్టే వుంటుంది

అసలు తుపాకీ తిప్పి పట్టు కున్న తీరే

గమ్మ త్తు గా వుంటుంది!

– TAADI PRAKASH 97045 41559

Share this Article

Facebook Twitter WhatsApp Gmail Telegram

Recommended Content by muchata.com

https://muchata.com/a-parody-against-extremism/ 9/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News

ఓహో… అప్ప ట్లో మహేష్ బాబు ‘పుష్ప కథ’


వద్దన్న ది ఇందుకేనా..?!

ADVERTISEMENT

IBO Wholesale - Ranigu


Shop Top Electric
Electrical products from
Legard, Finolex near yo

https://muchata.com/a-parody-against-extremism/ 10/11
4/2/23, 11:27 PM 'వోణీ' కవితకి ఒక వికటానుకరణ.... A PARODY AGAINST 'EXTREMISM'.... - Muchata.com Latest Telugu News

SEARCH ON SITE

Search this website

LATEST ARTICLES

› బలగం జనజాతరలకు దిల్ రాజు


అడ్డు … ఇది అసాంఘికం అట, పైరసీ
అట…

› హవ్వ … అంతటి అమెరికాలో


ప్రొహిందూ ధోరణులా..? ఏమిటీ
తిరోగమనం..?!

› కవిత అరెస్టుపై మోడీకి వణుకు..?


రాధాకృష్ణా , ఏం చెప్పి తివి, ఏం
చెప్పి తివి..!

› ఇదేం సినిమార భయ్… మొత్తం


తాగుడు సీన్లే … తాగొద్దు రా అని చివరలో
నీతి…

› ఔను నిజమే… చైతూ మీద కోపంతో ఆ


ఐటమ్ సాంగ్‌కసిగాకసిగా చేసినట్టుంది…

› రాజమండ్రి టు భద్రాచలం… గోదావరి


మీద లాంచీ ప్రయాణం జ్ఞా పకాలు…

› అమెరికాకు గగనంలో చుక్క లు


చూపిస్తు న్న చైనా… వరుసగా స్పై ప్లేన్ల
కూల్చి వేత…!!

› గీత దాటిన గీతామాధురి… హఠాత్తు గా


ఏ వైరస్ తాకిందో, వెకిలి డ్రెస్సు తో
ప్రత్య క్షం…

› సల్మా న్ సినిమాలో బతుకమ్మ ఖూనీ…


మధ్య లో ఈ గొబ్బె మ్మ లెందుకు
వచ్చా యర్రా…

› ఆహా… అల్లు వారి కొత్త దినపత్రిక


త్వ రలో… ఏకంగా డమ్మీ లే ప్రత్య క్షం…

ARCHIVES

Select Month

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions

https://muchata.com/a-parody-against-extremism/ 11/11

You might also like