Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

సేవాభారతి తెలంగాణ

www.sevabharathi.org

కలియుగాబ్ది . 5125 e-bulletin, Nov 2023, Vol-2

మెగా మెడికల్ క్యాంపు ద్వారా బస్తీలలో వైద్య చికిత్స మరియు మందుల పంపిణీ
హైదరాబాద్ మహానగరం లోగల వివిధ ప్రాంతాలలో BDL
వారి సహకారంతో సేవాభారతి తలపెట్టిన మెగా మెడికల్
క్యాంపు అక్టో బర్ అక్టో బర్ 2 , 8 తేదీలలో సీతారాం భాగ్,
సనత్ నగర్, బోరబండ, అంబర్ పేట, కవాడిగూడ,
ఖైరతాబాద్ మొదలగు ప్రాంతాలలో జరిగింది. ఈ మెగా
మెడికల్ క్యాంపు ద్వారా పేదవారికి ఉచితంగా వైద్యపరీక్షలు
చెయ్యడం తద్వారా వారికి డాక్టర్ల సలహా మేరకు ఏమైనా
మందులు అవసరమైతే వాటిని ఉచితంగా పంపిణీ చెయ్యడం
ఈ మెగా మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ వైద్య
పరీక్షలు కారణంగా కాయ కష్టం చేసుకునేవారు ఆరోగ్యం పట్ల
మరింత అప్రమత్తం అవుతారని వారికి తమ ఆరోగ్యంపట్ల
మరింత అవగాహన పెరిగి జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక
చక్కటి అవకాశమని సేవాభారతి కి సంబందించిన శ్రీ వాసు
వుసులమర్తి గారు వివరించారు. ఈ రోజుల్లో ముఖ్యంగా బీపీ,
ఈ మెడికల్ క్యాంపు లో వివిధ కార్పొరేట్ హాస్పిటల్ లో విధులు షుగర్ మొదలగు పరీక్షలు ఎప్పటికప్పుడు
నిర్వహిస్తు న్న అర్హత కలిగిన డాక్టర్స్ పాల్గొ న్నారు. ముఖ్యంగా చేయించుకోవాలని, అప్పుడే ఆరోగ్యం గా ఉంటామని వారు
చిన్నపిల్లల వైద్యులు (Pediatrics), ఎముకల వైద్యులు వివరించారు.
(orthopaedic ),దంత వైద్యులు (Dental) కంటి వైద్యులు
(ophthalmologist) గుండె సంబంధిత వైద్యులు
(cardiologist) స్త్రీ సంబంధిత వైద్యులు (gynaecologist)
చర్మ సంబధిత వైద్యులు (dermatologist) జనరల్ మెడిసిన్
(General Medicine) ఊపిరితిత్తు ల సంబంధిత వైద్యులు
(pulmonologist) చెవి, ముక్కు, గొంతు,సంబంధిత వైద్యులు
(ENT) ఫిజియోథెరపిస్టు (physiotherapist) మొదలగువారు
అందుబాటులో ఉన్నారు.

సీతారాం భాగ్, సనత్ నగర్, బోరబండ, అంబర్ పేట,


కవాడిగూడ, ఖైరతాబాద్ మొదలగు బస్తీలలో జరిగిన ఈ మెగా సేవాభారతి నుండి మరిన్ని వివరములు కొరకు
మెడికల్ క్యాంపు ద్వారా 15000 మందికి పైగా క్రింద ఇవ్వబడిన సేవాభారతి సోషల్ మీడియా
లబ్ది పొందగలిగారు. ఈ మెగా మెడికల్ క్యాంపు లో అపోలో
హ్యాండిల్స్ ఫాలో అవ్వండి
హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ , ESI హాస్పిటల్, AIIMS హాస్పిటల్ ,
ప్రతిమ హాస్పిటల్, సియా లైఫ్ హాస్పిటల్ మొదలగు హాస్పిటల్స్ కి
చెందిన మరియు సేవాభారతి అనుబంధ డాక్టర్స్ కలిపి మొత్తం www.sevabharathi.org
105 మంది డాక్టర్స్, 140 మంది నర్సింగ్ మరియు సపోర్ట్ స్టా ఫ్ తో
పాటు, క్యాంపు జరిగే స్థలంలో సౌకర్యాలను సమకూర్చేందుకు
@sevabharathitg
సుమారు 200 మంది సేవాభారతి కి సంబందించిన సేవా
కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు.
నాయీ దిశా కార్యక్రమంలో మంచి ఫలితాలు
సాధించిన విద్యార్థు లు
మంచిర్యాల జిల్లా లో సేవా భారతి చేపట్టిన నయీ దిశ
కార్యక్రమం లో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత
ఆర్మీ, పోలీస్ శిక్షణను మూడు మాసములు ఇవ్వడం జరిగింది.
ఇందులో విద్యార్థు లకు రాతపరీక్ష , శారీరిక విభాగాలలో శిక్షణ
అందించారు. ఇప్పటికే పలువురు విద్యార్థు లు ఆర్మీ, అగ్నిపత్
మొదలగు వాటిలో ఎంపిక అవడం జరిగింది. పోలీస్ ఎంపిక
పరీక్షల శిక్షణలో భాగంగా 250 మంది శిక్షణ తీసుకొని 75 మంది
ఫిజికల్ ఫిట్నెస్ లో ఉత్తీర్ణత సాధించి ఫైనల్ ఎగ్జా మ్స్ కు అర్హత
పొందారు. అందులో నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి
ఉద్యోగం సంపాదించారు. V.విష్ణు ప్రియ, J. మల్లేశ్వరి, K. లక్ష్మి
AR కానిస్టేబుల్ గాను, M. అశ్విత సివిల్ కానిస్టేబుల్ గాను, K.
రాజు స్పెషల్ పోలీస్ గాను ఎంపిక అయ్యారు.
ఈ ట్రైనింగ్ మంచిర్యాలలో సేవాభారతి కి చెందిన ఏకలవ్య
ఆశ్రమం లో జరిగింది. ట్రైనింగ్ లో శారీరక శిక్షణ ఉదయం 5గం||
నుండి 8.30గం|| వరకు, మరియు రాత పరీక్షల శిక్షణ 9గం||
నుండి 5గం|| వరకు ఇచ్చారు. ఈ శిక్షణ తరువాత కొంత మంది
విద్యార్థు లు ఆర్మీ, అగ్నిపత్ మొదలగు వాటిల్లో సెలెక్ట్ అయ్యారు.
ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థు లు పోలీస్ పరీక్షలలో
ఉత్తీర్ణత సాధించి పోలీస్ గా ఎంపిక కావడం చాలా ఆనందంగా
ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఏకలవ్య ఆశ్రమం సేవా


భారతి మంచిర్యాల పూర్వ
విద్యార్థు లు పోలీస్
ఉద్యోగాలు సాధించారు.
వారికి ఏకలవ్య ఆశ్రమం
కమిటీ సభ్యులు
అభినందనలు తెలిపారు.
మడావి నాగోరావు, కుమురం
ప్రభాత్ రావు,

సేవాభారతి కుట్టు మిషన్ కేంద్రం ప్రా రంభం


స్వావలంబన విభాగంలో భాగంగా జగిత్యాల సేవాభారతి
వాల్మీకి ఆవాసం లో కుట్టు మిషన్ కేంద్రం 28 - 10 - 2023
నాడు ప్రా రంభం అయినది. ఈ కుట్టు మిషన్ కేంద్రం ద్వారా
చుట్టు పక్కన ఉన్న మహిళలకు కుట్టు , ఎంబ్రా యిడియారీ
మొదలగు వాటిపై ట్రైనింగ్ ఇస్తా రు. దీనిద్వారా మహిళలకు
వారి కాళ్ళ మీద నిలబడగలిగే ఒక స్కిల్ అలవాటవుతుంది,
ఇది మహిళలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీని ద్వారా
మహిళలకు అనేక అవకాశాలు ఏర్పడతాయి అని
నిర్వాహకులు అన్నారు.

www.sevabharathi.org
సుపోషణ దివస్ కార్యక్రమంలో భాగంగా సేవాభారతి ECIL ఆధ్వర్యంలో అనీమియా
ఉన్న యువతులకు ఉచితంగా మందుల పంపిణీ

సేవాభారతి గత నెలలో ECIL వారి సహకారంతో రక్త హీనత మైల్డ్ అండ్ మోడరేట్ గా ఉన్న వారిని వారి
నిర్వహించిన రక్తహీనత పరీక్షలలో సుమారు 1070 మంది తల్లి తండ్రు ల సమక్షంలో ఎయిమ్స్ డాక్టర్స్ ద్వారా తగిన
పాల్గొ నగా వారికి అనీమియా టెస్టు లు నిర్వహించి వారిని మందులు వాడమని సూచించి మరియు 3 నెలలకు సరిపడా
మైల్డ్ , మోడరేట్ మరియు క్రిటికల్ కేటగిరీలుగా విభజించారు. మందులను ఉచితంగా పంపిణీ చెయ్యడం జరిగింది. ఇక రక్త
సేవాభారతి కార్యకర్తలు వీరందరిని వంతుల వారీగా వారి వారి హీనత ఎక్కువ వున్నవారిని ఎయిమ్స్ ఆసుపత్రి కి
కుటుంబ సభ్యులతో కలిసి అవగాహన కార్యక్రమం తీసుకువెళ్లి తదుపరి పరీక్షలు జరిపి వారికి తగిన చికిత్స
నిర్వహించారు. ఈ అవగాహనా కార్యక్రమంలో ఆ యువతుల అందించటం జరిగింది. దీనికి సంబందించిన మందుల పంపిణీ
తల్లితండ్రు లకు ఈ రక్త హీనత వల్ల కలిగే నష్టా లు, దీనిని కార్యక్రమం సేవాభారతి ఆవాసం అయినా వాత్సల్య సింధులో
అధిగమించటానికి కావలసిన ఆహారము, శుచి, శుభ్రం ప్రా రంభమైనది. ఈ కార్యక్రమంలో ECIL ప్రతినిధులు,
గురుంచి వివరించారు. AIIMS డాక్టర్స్ మరియు సేవాభారతి కమిటీ సభ్యులు
పాల్గొ న్నారు.
సేవాభారతి మరియు ఇతర సంస్థలు అందిస్తు న్న అనేక
సేవాకార్యక్రమాలు ప్రేరణదాయక గాథ ల సమూహం సేవగాథ. www.sewagatha.org
దేశంలో జరగుతున్న మరిన్ని సేవాకార్యక్రమాలు మరియు @sewagathatg
ప్రేరణదాయకమైన కథను చదువుటకు సేవగాథ వెబ్సైటు
మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అవ్వండి
నిరుద్యోగ యువకులకు IT లో శిక్షణ
సేవాభారతి మరియు రోటరీ క్లబ్ గ్లో బల్ విజార్డ్ హైదరాబాద్ సంయుక్తంగా IT
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 2 వ బ్యాచ్ 20 -NOV - 2023 నాడు పూర్తి అయినది.
ఈ సందర్భముగా స్టూ డెంట్స్ అందరు ట్రైనర్ కి ప్రత్యేక ధన్యవాదములు
తెలియజేసారు. ఈ ట్రైనింగ్ లో ఇండస్ట్రీ కి కావలసిన రియల్ టైం కోచింగ్
లభించిందని ఇది ఇంటర్వూస్ లో కాన్ఫిడెంట్ గా వారి ఆన్సర్స్ ని చెప్పటానికి
మరియు భౌతిక ప్రపంచానికి టెక్నాలజీ ఎలా సమన్వయము అవుతుందో
ఉదాహారణలతో చెప్పటంవలన వారికి కెరీర్ లో ఇది చాలా ఉపయోగపడుతుందని
చెప్పారు. ఈ కోర్స్ లో ముఖ్యంగా Java, SQL, React, Spring, Java Script ,
మొదలైనాటిమీద ట్రైనింగ్ ఇచ్చి ఈ అన్నింటిని వుపయోగించి ఎండ్ టు ఎండ్ ఎలా
ఎగ్జిక్యూట్ చెయ్యాలో ట్రైనింగ్ ఇచ్చారు.

చాలా మంది విద్యార్థు లు వేరే వేరే ప్రాంతాలనుండి


ఆన్లైన్ లో ఈ కోర్స్ ని చెప్పమని అడుగుతున్నారు
అందువలన ఈ ౩వ బ్యాచ్ ఆన్లైన్ లో 7-Dec-
2023 నాడు ప్రా రంభమైనది. ప్రతీ రోజు ఆన్లైన్ లో
40 మంది విద్యార్థు లు ఆన్లైన్ లో java full stack
లో శిక్షణ పొందుతున్నారు.

Salesforce Admin,
Development లో శిక్షణ ప్రా రంభం
సేవాభారతి నిర్వహిస్తు న్న IT స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కూకట్
పల్లి లో 6-NOV-23 నాడు salesforce కోర్స్ ప్రా రంభం
అయినది. ఈ కోర్స్ సేవాభారతి మరియు united వే అఫ్
హైదరాబాద్ సౌజన్యంతో , క్యూస్ కార్పొరేషన్ ట్రైనింగ్ పార్టనర్
గా జరుగుతున్నది. ఈ కోర్స్ లో భాగంగా మొత్తం 40 మంది డిగ్రీ
పూర్తి చేసిన ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్ విద్యార్థు లను వారి
ఆసక్తి ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చెయ్యడం జరిగింది.
ఈ కోర్స్ లో 45 రోజుల పాటు salesforce అడ్మిన్ మరియు
salesforce డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తా రు.

సేవాభారతి సి ఎస్ ఆర్ కార్యాలయ ప్రా రంభోత్సవం

తెలంగాణా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా


చేపట్టే విధంగా సేవాభారతి తెలంగాణ, కాకతీయ హిల్స్ లో 27-
అక్టో బర్-2023 శుక్రవారం ఉదయం 8-00 గంటలకు
సేవాభారతి సి ఎస్ ఆర్ కార్యాలయాన్ని ప్రా రంభించింది. ఈ
కార్యాలయం తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్న మరియు
జరగబోయే సేవాకార్యక్రమాలకు మరియు కార్పొరేట్ సంస్థల
సమన్వయానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని
సేవాభారతి కోశాధికారి శ్రీ హరీష్ అన్నారు. ఈ కార్యాలయం
ముఖ్యంగా CSR కోఆర్డినేషన్ కొరకు ఏర్పాటు చెయ్యటం
జరిగింది. IT కంపెనీస్, ఇతర సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీస్
మరియు ఇతర NGO లకు ఈ కార్యాలయం దగ్గర్లో
అందుబాటులో ఉంటుంది.
Prasikshana News
రాష్ట్రీయ సేవాభారతి కిశోరీ వికాస్ ప్రశిక్షణ
రాష్ట్రీయ సేవాభారతి ఆధ్వర్యంలో జరిగిన అఖిల
భారతీయ కిశోరీ వికాస్ ప్రశిక్షణా కార్యక్రమం అక్టో బర్
నెల 28 , 29 తేదీలలో హైదరాబాద్ వాత్సల్య సింధు
లో జరిగింది. ఈ ప్రశిక్షణ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల
నుండి కిషోరీ వికాస్ కార్యకర్తలు పాల్గొ న్నారు. ఈ
కార్యక్రమంలో నిర్వాహకులు కిశోరీ వికాస్ కేంద్రముల
ఏర్పాటు దానికి కావలసిన శిక్షణ మరియు సలహాలు
అందించారు.
సేవా దిశా 2024 - సేవా కార్యక్రమాల
రాష్ట్రీయ సేవాభారతి ప్రతి 5 సంవత్సరములకు నిర్వహించే
సర్వేక్షణ యొక్క శిక్షణ
సేవా కార్యక్రమాల సర్వేక్షణా శిక్షణ కార్యక్రమం తెలంగాణా
ప్రాంతంలో అక్టో బర్ నెలలో పూర్తి అయినది. ఈ ప్రశిక్షణ
కార్యక్రమం దశల వారీగా వివిధ ప్రాంతాలలో జరిగింది. ఈ
ప్రశిక్షణలో భాగంగా సేవాకార్యక్రమాలు సర్వేకి సంబందించిన
డేటాని సేవా దిశా అనే యాప్ లో ఎలా ఎంటర్ చెయ్యాలి,
ఎంటర్ చేసేటప్పుడు గమనించాల్సిన విషయాలు ,మరియు
ఎవరెవరు ఎలా ఎప్పటిలోగా ఈ పని పూర్తి చెయ్యాలి అనే
విషయాలపైనా శిక్షణ ఇచ్చారు. ఈ సర్వేలో పొందుపరిచిన
సేవా కార్యక్రమాల డేటా ఆధారంగా సేవాభారతి చేస్తు న్న
కార్యక్రమాలు తద్వారా సమాజంలో వస్తు న్న మార్పు మరియు
ఇతర వివరాలను అధ్యయనం చెయ్యటం ద్వారా ఈ సేవా
కార్యక్రమాలు మరింత సమర్ధవంతముగా చెయ్యటానికి
స్నాతకోత్సవం
మరియు కార్యక్రమాల విస్తరణకు ప్రణాళికలు నవంబర్ నెలలో బోయినపల్లి GDA సెంటర్ లో ఒక బ్యాచ్
రూపొందించటానికి వీలవుతుంది. ట్రైనింగ్ పూర్తి అయినా సందర్భముగా గ్రా డ్యుయేషన్ డే
(స్నాతకోత్సవం) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్
ప్రతినిధులు శ్రీమతి సరిత గారు. శ్రీమతి కవిత గారు మరియు
GDA Corner శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ ట్రస్టీ శ్రీ జగన్మోహన్ శర్మ
గారు మరియు కిరణ్మయి గారు కిషోరి వికాస్ అధ్యక్షులు
మరియు కుల్దీ ప్ గారు శ్రీవిద్య గారు తాడూరి శ్రీనివాస్ గారు
స్టా ఫ్ మరియు స్టూ డెంట్స్ పాల్గొ నడం జరిగింది. ఈ
కార్యక్రమంలో 30 మంది విద్యార్థు లకు జీడీఏ సర్టిఫికెట్స్
ఇచ్చ్చారు.

అక్టో బర్ మొదటి వారంలో వివిధ ప్రాంతాలలో జరిగిన హెల్త్


క్యాంపులలో GDA విద్యార్థు లు పాల్గొ న్నారు. ఇలాంటి
కార్యక్రమాల వలన నర్సింగ్ అసిస్టెంట్ శిక్షణ పొందుతున్న
వారికి హెల్త్ క్యాంపు లలో తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు
ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా లభిస్తుంది.
Kishori’s Corner
ఇంటింటికీ వెళ్లి ఉచితంగా
అనీమియా కి సంబందించిన
మందుల పంపిణీ
అనీమియా టెస్టు లు నిర్వహించిన
తరువాత రక్తహీనత కలిగిన
అమ్మాయిలకు, సేవాభారతి కిశోరీ వికాస్
కార్యకర్తలు వారి ఇంటి ఇంటికి వెళ్లి మూడు
నెలలకు సరిపడా మందులను ఉచితంగా
పంపిణీ చేశారు. అంతేకాకుండా ఈ
కార్యకర్తలు అనీమియా ఎక్కువగా ఉన్న
యువతులను ప్రతీ వారము కలిసి లేదా
కాల్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటున్నారా లేదో
ఫాలోఅప్ చెయ్యడం మరియు
ఆరోగ్యకరమైన ఆహారంకోసం అవగాహన
పెంచడం మొదలైన కార్యక్రమాలు చేశారు.

కిషోర్ వికాస్ కేంద్రా ల సందర్శన

రాష్ట్రీయ సేవాభారతి ఆధ్వర్యంలో జరిగిన అఖిల


భారతీయ కిశోరీ వికాస్ ప్రశిక్షణా కార్యక్రమానికి వచ్చిన
వివిధ ప్రాంతాలకు సంబందించిన సేవాభారతి
కార్యకర్తలు భాగ్య నగరంలో, బాలాజీ నగర్,
జూబిలీహిల్స్ మొదలగు ప్రాంతాలలో జరుగుతున్న
పలు కిశోరీ వికాస్ కేంద్రా లను సందర్శించి కిశోరీ వికాస్
కేంద్ర స్వరూపం, నిర్వహణ మొదలగు వాటిని
ప్రత్యక్షంగా చూసారు. అదే సమయంలో వేరే
ప్రాంతాలనుండి వచ్చిన కార్యకర్తలు కిషోరీల ఇంటికి
కూడా వెళ్ళటం జరిగింది. కొంత మంది కిశోరీలు వీరికి
భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.
గోమయ ప్రమిదలు తయారీ లో కిశోరీలు
సేవాభారతి అయామ్ లో ఒకటయిన స్వావలంబన లో
భాగంగా ప్రతీ దీపావళికి కిషోరీ వికాస్ కార్యకర్తలు
గోమయంతో ప్రమిధులను, గిఫ్ట్ లను తయారు చేసి
కార్పోరేట్ కంపెనీలకు మరియు గేటెడ్ కమ్యూనిటీ లకు
పంపిస్తా రు. దీని ద్వారా ఈ మహిళలకు స్వావలంబనతో
పాటు, పర్యావరణ పరిరక్షణ, సృజనాత్మకత మొదలైన
విషయాలపై అవగాహన పెరుగుతుంది. ఈ దీపావళికి కూడా
కిశోరీలు పెద్ద సంఖ్యలో ఈ గోమయ ప్రమిదలు మరియు గిఫ్ట్
ప్యాక్ లను తయారు చేసి విక్రయించారు.

You might also like