Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

లఘు గృహ ప్రవేశ పూజ

కావసిన సామాగ్రి

1. పసుపు - 200 గ్రా

2. కుంకుమ - 50 గ్రా

3. గంధం - 50 గ్రా

4. కర్పూరం బిళ్ల లు 15 నుండి 20

5. తమలపాకులు - 20

6. మామిడి ఆకులు 2 కొమ్మలు, షుమారు 30 ఆకులు

7. వక్కపొ డి – 50 గ్రా

8. బియ్యం – 2 కిలోలు

9. బెల్లం – 250 గ్రా

10.పాలు - 1 లీటరు

11.జాకెట్ ముక్క – 1

12.ఉత్త రీయం ( షాలువా) – 1

13.చీర (మీ ఇష్టా నుసారం) – 1

14.ధోవతి ( మీ ఇష్టా నుసారం) – 1


15.అరటి పళ్లు – 1 డజను

16.దీపారాధనకు దీపం, వత్తు లు, నూనె, అగ్గిపెట్టె

17.నెయ్యి దీపం

18.కొబ్బరికాయలు – కనీసం 2 ( ప్రతి ఒక ద్వారం వద్ద మీరు కొబ్బరికాయలు

కొట్టవచ్చు.ఇది బయటి ద్వారం నుండి ప్రా రంభించి, లోపలికి చేసుకుంటూ వెళ్లా లి.

19.కలశం(రాగి లేదా ఇత్త డి లేదా వెండితో చేసిన పెద్ద పాత్ర)

20.పంచపాత్ర,ఉద్ధరిణ(రాగి లేదా వెండితో చేసినవి)

21.చిన్న పళ్లె ములు – 4 (రాగి,ఇత్త డి, వెండి, గాజు, లేదా పేపరు ప్లే ట్స్)

22.పెద్ద పళ్లె ములు – 4 లేదా 5

23.అగ్గిపెట్టె – 1

విధి

1. గ్యాస్ సిలెండర్ మరి ఏ ఇతర వస్తు వులు ముందుగానే ఇంటిలోకి తీసుకు

వెళ్ల రాదు. అయితే, ఫ్యాన్ లు, ఫ్రిజ్ ఇటువంటి ముందునుండే ఇన్ స్టా ల్

చేయవలసిన వస్తు వులకు ఫరవాలేదు.

2. ఇంటి సింహద్వారం లేదా ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీపూజ చేయవలెను.(పూజా

విధానము జతకూర్చబడినది).

3. నిర్ణయించబడిన ముహూర్తా నికి ఇంటిలోనికి ప్రవేశించవలెను. ముందు ఆ ఇంటికి

సంబంధించిన స్త్రీ కలశం(పాలతో లేదా నీటితో నింపి ఉండాలి) తో ఇంటిలోనికి

ప్రవేశించాలి. ఆమె వెంట ఆ ఇంటికి సంబంధించిన పురుషుడు దేవతా చిత్రములను

చేతిలో ఉంచుకుని, ఇంటిలోనికి ప్రవేశించాలి. వారి వెంటనే వారి పిల్ల లు,

బంధువులు, మిత్రు లు అందరూ చేతిలో పళ్లు లేదా పూలు ఉన్న పళ్లె రములు,
లేదా, పసుపు, కుంకుమ వంటి మంగళకర వస్తు వులు చేతిలో ఉంచుకుని

ప్రవేశించాలి.

4. లోపలకు ప్రవేశించిన తరువాత తీసుకువచ్చిన కలశము, దేవతా చిత్రములను ఒక

చాప మీద కాని, టీపాయ్ మీద కాని ఉంచాలి.

5. ఇప్పుడు ఇంటిలోనికి గ్యాస్ సిలెండర్, పొ య్యి, పూజకు కావలసిన ఇతర సామాగ్రి

లోపలకు తీసుకురావాలి.

6. వంట ఇంటిలోనికి వెళ్లి స్టవ్ వెలిగించాలి. ఒకటి కంటే ఎక్కువ బర్నర్ లు ఉంటే,

ఆగ్నేయం వైపుకు ఉన్న బర్నర్ ను వెలిగించాలి(వెలిగించే వారు తూర్పుకు తిరిగి

ఉండాలి.)

ఈ పని చేసేటప్పుడు అగ్ని మంత్రమును పఠించాలి.

అగ్నిం దూతం వృణీమహే హో తారం విశ్వ వేదసమ్। అస్య యజ్ఞస్య సుక్రతుమ్।

రాం రీం రుం రైం రౌం రః రమలవరయూం అగ్ని మండలాయ నమః అగ్నిమ్

ఆవాహయామి

అగ్నికి అక్షతలు సమర్పించాలి.

పాయసం చేయవలసిన పాత్రను చేతితో పట్టు కుని, ఈ క్రింది సూర్య మంత్రా న్ని

జపించాలి.

ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ |

హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్ ||

హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హ్ర మలవరయూం సూర్య మండలాయ నమః

సూర్యమ్ ఆవాహయామి
పాత్రను అగ్ని పైన ఉంచాలి.

7. పాత్రలోకి సన్నని ధారగా పాలను పో యాలి. పాలు పో సేటప్పుడు ఈ క్రింది చంద్ర

మంత్రం జపించాలి.

ఓం ఆప్యాయ స్వ సమేతు తే విశ్వతః వృష్ణియమ్।

భవా వాజస్య సంగధే ।।

సాం సీం సూం సౌం సః సమలవరయూం సో మ మండలాయ నమః సో మం

ఆవాహయామి.

పాలు కాగిన తరువాత,మిగిలిన వారి చేత బియ్యము, బెల్ల ము, యాలకులు వంటి

పదార్థములు వేయించవలెను. ఈ మధ్యలోనే మీరు పూజ ప్రా రంభించవచ్చును.

8. పూజా సామాగ్రి సర్దు కుని, ఉత్త ర దిశలో దేవతా చిత్రములను ఉంచి, గణపతి పూజ

ప్రా రంభించ వలెను(గణపతి పూజ జతపరచ బడింది). పైన వండిన పాయసాన్ని

నైవేద్యంగా సమర్పించవలెను.

అవకాశం ఉన్నవారు ఇక్కడ గణపతి మరియు నవగ్రహ హో మం చేసుకోవచ్చును.

9. ఇంటి యొక్క ప్రతి ద్వారము వద్ద (ముందు, వెనుక) కొబ్బరి కాయ కొట్టవలెను.

కొబ్బరికాయను మూడుసార్లు సవ్య దిశలోను, మూడు సార్లు అపసవ్య దిశ లోను

తిప్పిన తరువాత కొట్టవలెను.

You might also like