Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 8

O priya priya, Geetanjali

O priya priya
Singers : SP Balu, Chithra
Lyrics : Veturi
Music : Ilayaraja

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా


ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదోలోకం నాదోలోకం
నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా(2)
ఏల జాలి మాటలు మాసిపో వు ఆశలు
నింగి నేల తాకేవేళ
నీవే నేనైపో యేవేళాయే
నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే

నిప్పులోన కాలదు నీటిలోన నానదు


గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
రాజ శాసనలకి లొంగిపో వు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ..(ఓ ప్రియా)
కాళిదాసు గీతికి క్రిష్ణరాసలీలకి
ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్ల వి
ఆ అనారు ఆశకి తాజుమహల్ శోభకి
పేదవాడి ప్రేమకి చావు పల్ల కి
నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే
కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని
వెళ్ళిపో కు నేస్త మా ప్రా ణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపో కుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా(2)


కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి
నింగి నేల తాకే వేళ నీవే నేనైపో యే క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం
O papa laali, Geetanjali

O papa laali
Singer : SP Balasubrahmanyam
Lyricist : Veturi Sundara ramamurthy
Music : Ilayaraja

ఓ పాపా లాలి..జన్మకే లాలి..


ప్రేమకే లాలి..పాడనా తీయగా..
ఓ పాపా లాలి..జన్మకే లాలి..
ప్రేమకే లాలి పాడనా..
ఓ పాపా లాలి.

నా జోలలా లీలగా తాకాలని..


గాలినే కోరనా జాలిగా..
నీ సవ్వడే సన్నగా ఉండాలని..
కోరనా గుండెనే కోరిక..
కలలారని పసిపాప..తలవాల్చిన ఒడిలో..
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో..
చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. (ఓ పాపా)

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి..


గాలిలో..తేలిపో ..వెళ్ళిపో ..
ఓ..కోయిల పాడవే నా పాటని..
తీయని తేనెలే చల్లిపో ..
ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో..
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో..
చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి.. (ఓ పాపా)
Aamani paadave, Geetanjali

Aamani paadave
Singers : SP Balasubrahmanyam
Lyricist : Veturi Sundara ramamurthy
Music: Ilayaraja

ఆమని పాడవే హాయిగా..మూగవైపొ కు ఈ వేళ..


రాలేటి పూల రాగాలతో..పూసేటి పూల గంధాలతో..
మంచు తాకి కోయిల..మౌనమైన వేళల..
ఆమని పాడవే హాయిగా..
ఆమని పాడవే హాయిగా..

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా..


మనస్సులో నిరాశలే..రచించెలే మరీచికా
పదాల నా ఎద..స్వరాల సంపద
తరాల నా కథ..క్షణాలదే కదా
గతించిపో వు గాధలేననీ..!
ఆమని పాడవే హాయిగా..
మూగవైపో కు ఈ వేళ..
రాలేటి పూల రాగాలతో..

సుఖాలతో పిఖాలతో..ధ్వనించినా మధూదయం


దివి భువి..కలా నిజం..స్ప్రుశించినా మహో దయం..
మరో ప్రపంచమే..మరింత చేరువై
నివాళి కోరిన..ఉగాది వేళలో గతించిపో వు గాధలేననీ..!
ఆమని పాడవే హాయిగా..
ఆమని పాడవే హాయిగా..
Jallanta kavvinta, Geetanjali

Jallanta kavvinta
Singer : Chithra
Lyrics : Veturi
Music : Ilayaraja

జల్లంత కవ్వింత కావలి లే


ఒళ్ళంత తుళ్ళింత రావలిలే.. (2)
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొ గసు
కొండమ్మ కోనమ్మ మెచ్చింది లే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చింది లే (2)

వాగులు వంకలు గల గల చిలిపిగా పిలిచినా..


గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా..
మనసు ఆగదు ఇదేమి అల్ల రో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు బొండుమల్లె తేనేనొక్క ముద్దు లాడి
వెళ్ళదాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి.. (జల్లంత)

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలపగా..


తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా..
వాన దేవుడే కళ్ళాపి జల్ల గా
వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టు కొచ్చె ఎవరి కోసమో ఓహో .. (జల్లంత)

You might also like