Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ…

నవరాత్రి వెలుగైన శివ శంకరీ.

ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ..

నవరాత్రి వెలుగైన శివ శంకరీ..

ఆ సేతు కాశ్మీర కరుణాఝరీ..

ఆ సేతు కాశ్మీర కరుణాఝరీ..

ఆధారమే నీవు అమృతాక్షరీ.

ఆధారమే నీవు అమృతాక్షరీ…

ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ

నవరాత్రి వెలుగైన శివశంకరీ..

పారాణి పాదాల బాలాకృతీ…

గాయత్రి వేదాంత లీలా శృతీ..

లోకానికే అన్నపూర్ణమ్మవై..

మహిలోన సిరులిచ్చు శ్రీలక్ష్మివై..

సంగీత వేణీ… సాహిత్య వాణి..

మాజీవితాలే నీ వీణ కృతులై..

నిరతంబు వినిపించనీ….

ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ..

నవరాత్రి వెలుగైన శివ శంకరీ…..

శ్రీచక్ర నిలయాన లలితాంబికా…

దురితాలు తొలగంచు దుర్గాత్మికా..

మహిషాదులను చీల్చు మంత్రానివై..

తరియించు మార్గాల తంత్రానివై…

శ్రీ భధ్రకాళీ….. శివ నాట్యకేళీ….

శ్రీ భధ్రకాళీ…..శివ నాట్యకేళీ.

దాటించ వమ్మా వైకుంఠపాళీ.

శ్రీరాజరాజేశ్వరీ.. శ్రీరాజరాజేశ్వరీ.. శ్రీరాజరాజేశ్వరీ…….

You might also like