Karthika Masam

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

కార్తిక మాసం మొత్తం శివారాధనకు శ్రేష్టం, అందునా సో మవారం విశేషం.

నక్త వ్రతం అని చెయ్యడం మరింత విశేషం. నక్త వ్రతం అనగా – పగలంతా ఉపవసించి, ప్రదోష సమయంలో శివార్చన చే,

శివునికి నివేదించిన ఆహార పదార్దం స్వీకరించడమే నక్త వ్రతం అన్నారు.

ఈ నక్త వ్రతం ఏ ఒక్కసారి చేసినా కూడా పాప పరిహారమై శివానుగ్రహం లభిస్తుంది. అలాంటిది ఈ కార్తిక మాసంలో

చేయడం విశేషంగా చెప్పారు. శ్రా వణ/కార్తిక మాసాలలో ఈ నక్త వ్రతం విశేషం అంటున్నాయి పురాణాలు

పైగా సో మవారాల్లో నక్త వ్రతాని కున్న గొప్పదనం ఏమంటే – ఇవి సో మ ప్రదోషం అని చెప్పారు. సో మవారం చంద్రు నికి

సంబంధించినది. చంద్రు నికి అధిదేవత గౌరీదేవి. అందుకే గౌరీ సహిత చంద్ర ఆరాధన చేసినట్లు అవుతుంది. పైగా

చంద్రు డు మనఃకారకుడు అని జ్యోతిషం చెప్తుంది. ఆ కారణం చేత సో మవారం శివారాధన చేస్తే మనస్సుకు

సంబంధించిన దోషాలు పో తాయి. మనస్సుకి శాంతి, సుఖం లభిస్తా యి. నిజానికి శాంతి, సుఖం, దుఃఖం అన్నీ

మనస్సుకే కానీ శరీరానికి కాదు, శరీరం జడం. కానీ మనస్సు ప్రధానం. మనఃశాంతి, వివేకం, జ్ఞా నం ఇత్యాదులు

లభించాలంటే సో మ వార వ్రతం గురించి శివ పురాణం చెబుతూ – పరమానంద లాభార్దం, శివ లింగం ప్రపూజ్యయేత్ –

అంటుంది. పరమానంద లాభం కావాలంటే శివ లింగారాధన చేయాలి. పైగా శివలింగారాధన చేసినపుడు గుర్తు

పెట్టు కోవలసిన విషయం ఏమంటే – ఆ లింగం శివ శక్తు ల యొక్క స్వరూపం అనే భావనతో ఆరాధన చేయాలని శాస్త్రం

చెబుతుంది. అందుకే - శివ శక్తో స్వమేళన శివలింగం – అన్నారు. అంటే శివ శక్తు ల ఐక్య స్వరూపం శివలింగం. ఆ

భావనతో ఆరాధన చేసేటప్పుడు – తా దేవి జగతోమాతష శశివో జగతో పితా – అంటున్నారు. ఇలా ప్రతి సో మవారం

చేసి శివానుగ్రహానికి పాత్రు లమవుదాం.

- ఆన్ లైన్ సత్సంగంలో డా.సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పినది.

You might also like