Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

భద్రా చల రామదాసు గారి జయంతి 29/01/2023

భద్రా చల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా
నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని
కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధు డైనాడు. భద్రా చల దేవస్థా నమునకు, ఇతని జీవిత కథకు
అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు,
భద్రా చలం దేవస్థా నము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు
శ్రీ రఘునాథ భట్టా చార్యులు.
గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ
సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దా రు పని లభించింది. గోదావరి తీరములోని భద్రా చల
గ్రా మము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో
నివసించెననీ, భక్తు రాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థ లపురాణము.
పో కల దమ్మక్క అనే భక్తు రాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధ రింపవలెనని గోపన్నను
కోరగా, స్వతహాగా హరి భక్తు లైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి విరాళములు
సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే
పని ఆపవద్ద నీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంతసొ మ్ము మందిరనిర్మాణ
కార్యమునకు వినియోగించెను. (ఈ విషయములో అనేకమైన కథలున్నాయి.)
కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న
చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను
చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి శ్రీ రాముని కటాక్షమునకు ఆక్రో శించుచూ కాలము
గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి.
"నన్ను బ్రో వమని చెప్పవే సీతమ్మ తల్లి", "పలుకే బంగారమాయెనా", "అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా"
వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన "ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా ", కీర్తన బాగా ప్రసిద్ధి
చెందినది- "నీకోసము ఇంతింత ఖర్చు పెట్టా ను. ఎవడబ్బ సొ మ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ
మామిచ్చాడా?" - అని వాపో యి, మరలా - "ఈ దెబ్బలకోర్వలేక తిట్టా ను. ఏమీ అనుకోవద్దు . నా
బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు" - అని వేడుకొన్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు
పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు
ఇప్పటికీ దేవస్థా నములోని నగలలో ఉన్నాయి.
అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్ద కు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు
శిస్తు సొ మ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను
రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టా భిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తు డు
హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న
నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రా చల రాముని సేవా నిమిత్త మై భూమిని ఇచ్చారు. శ్రీ
సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రా లను పంపే సంప్రదాయము
అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ
కొనసాగుతున్నది,ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది.
శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను
ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?" -
ఇంకా ప్రహ్లా దవిజయములో "కలియుగమున వర భద్రా చలమున నెలకొన్న రామచంద్రు ని పాదభక్తు లకెల్ల
వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్" - అన్నాడు.

You might also like