Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 9

23/12/2023, 12:04 (30) Quora

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో కొనడానికి ఒక 20 తెలుగు పుస్త కాలు సూచించగలరు?


అసలు సమాధానం ఇచ్చిన ప్ర శ్న: ఈ నెల చివర్లో (23, డిసెంబర్ 19- 01, జనవరి 20) జరగబోయే హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో కొనడానికి
ఒక 20 తెలుగు పుస్త కాలు సూచించగలరు?
“మంచినీళ్ళు త్రా గుతారా అనకూడదు, పుచ్చుకుంటారా అనాలి” వంటి మన తెలుగువారి భాష, అలవాట్ల గురించి
తెలుసుకోవాలన్నా, వడ్ల గింజలు, కలుపు మెక్కలు, మార్గ దర్శి వంటి అద్భుతమైన కథలను మనకు అందించిన ఓ అసలు
సిసలు తెలుగు రచయిత జీవితంలోకి తొంగిచూడాలనుకున్నా, అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా...
శ్రీ పాద సుబ్ర హ్మణ్యశాస్త్రి గారి ఆత్మకథ… “అనుభవాలూ - జ్ఞా పకాలూను” చదవాలి.
తెలుగుభాషకు చెప్పలేనంత సేవ చేసి కూడా, ఏమాత్రం ప్ర చారం ఆశించని మహానుభావుడొకాయన ఉన్నారు. అసాధారణ
పాండిత్యం, అబ్బురపరిచే రచనా సామర్థ్యం ఉన్నా అత్యంత వినయసంపన్నుడుగా మెలగిన సాహితీమూర్తి ఆయన. ఏ
పుస్త కానికైనా ముందుమాట రాయాల్సి వస్తే ... వినయం ఉట్టి పడేలా “మనవి మాటలు” అని శీర్షి క పెట్టే వారు. ఆ పరిచయ
వాక్యాల చివరిలో “భాషా సేవకుడు” అని మాత్ర మే తనని తాను సంబోధించుకునేవారు. ఉత్త మ స్థా యి పాత్రి కేయునిగా
వాసికెక్కిన ఆ తిరుమల రామచంద్ర గారి ఆత్మకథే “హంపీ నుంచి హరప్పా దాకా”. గత శతాబ్దంలో వచ్చిన ఆత్మకథలలో
అత్యున్నతమైనదిగా పరిగణింపబడే ఈ పుస్త కాన్ని భాషమీద అనురక్తి ఉన్న ప్ర తి ఒక్కరూ తప్పక చదవాలి.
ఈ శతాబ్దంలో జీవించిన వారిలో “మహాత్మా గాంధీయే అత్యున్నతుడు” అని యాపిల్ వ్యవస్థా పకుడు స్టీ వ్ జాబ్స్ 1999 లో
ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో గాంధీగారిపై తన ఆరాధనా భావాన్ని చాటుకున్నాడు. విఖ్యాత రచయిత “జార్జ్
బెర్నార్డ్ షా” గాంధీతో పోల్చడానికి హిమాలయా పర్వతం ఒక్కటే సరిపోతుందన్నాడు. “దక్షి ణాఫ్రి కా స్వాతంత్ర్య సాధనలో
గాంధీజీ ఆదర్శాలకీ భాగముంద”ని నెల్సన్ మండేలా ఆ మహాత్మునకు నమస్కరించాడు. దలైలామా, అంగ్ సాన్ సూకీ,
మార్టి న్ టూథర్ కింగ్‌లకు గాంధీనే స్ఫూర్తి . వకీలు అయ్యుండి కోర్టు హాలులో మాట్లా డలేక నాలుక పిడచకట్టు కుపోతుంటే,
చుట్టూ ఉన్నవారు నవ్వుతుంటే బాధతో తల దించుకున్న ఒక సాధారణ మనిషాయన. ఆ తరువాత కాలంలో ఆయన నోటి
వెంట మాట రావడమే ఆలస్యం 30 కోట్ల మంది మారుమాట్లా డకుండా ఆ మాటను అనుసరించే స్థా యికి చేరుకున్నాడు. ఆ
గాంధీ మహాత్ముని జీవితంలో మూడొంతులు భాగం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ “సత్యశోధన” చదవాలి.
“తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి”, “ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది”, “డామిట్ కథ అడ్డం తిరిగింది”
ఇలా తెలుగువారి నోళ్ళలో నానే ఎన్నో నానుడులకు వెనుకనున్న కథాకమామిషులను, గిరీశం లెక్చర్లు , మధురవాణి నవ్వు,
రామప్ప పంతులు కోతలు, ఆడవేషంలో చుట్ట కాల్చే శిష్యుడు, చీపురుకట్ట తిరగేసి కొట్టే పూటకూళ్ళమ్మ, సజ్జ నుడైన
సౌజన్యారావు పంతులు గారు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష ” అనే అగ్నిహోత్రా వధాన్లు ఇలా అందరినీ, అన్నిటినీ
ఒక చుట్టు చుట్టి రావాలంటే గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం” నాటకాన్ని చదవాలి.
ఒక చిన్న తండా నాయకుని కొడుకు జగజ్జే తగా మారిన వైనాన్నీ, ఆ జగజ్జే త జీవితాన్నీ, మనస్సునీ తెలుసుకోవాలంటే
తెన్నేటి సూరి గారి “చెంఘీజ్ ఖాన్” నవల చదవాలి.
తెలుగువారి మహాభారతంగా కీర్తించబడేది, కవిసమ్రా ట్ విశ్వనాథ వారి మహోన్నత సృష్టి , అరుంధతీ ధర్మారావుల జీవితం
చుట్టూ అల్లి న మనిషి చరిత్ర , ముళ్ళపూడి వెంకటరమణ గారు “నా తల్లీ , తండ్రీ , గురువు దైవం ఈ పుస్త కమే” అని
చెప్పుకున్న “వేయిపడగలు”ను తెలుగు వచ్చినవారంతా చదవాలి. ఆ మాటకొస్తే విశ్వనాథ వారి ప్ర తీ పుస్త కాన్నీ
తెలుగువాడన్న ప్ర తీవాడూ వదలకుండా చదవాలి.
ఎక్కడికో మండుటెండలో వెళ్ళాల్సిన పనిబడితే, బస్సు ప్ర యాణానికి డబ్బుల్లే క, ఆ ఎండ బాధ తెలియకుండా ఉండటానికి
పుస్త కం చదువుకుంటూ నడిచిన ఘట్టా న్ని... ”నాకు అలవాటైన 11వ నెంబరు బస్సెక్కాను”, “ఎర్ర ని ఎండలో 58 పేజీలు
నడిచాను” అంటూ సరదా మాటలతో నడిపించిన వారు ముళ్ళపూడి వారు. విషాదకరమైన విషయం చెబుతున్నా,
చదివేవారిని బాధపడనివ్వకుండా దానికి హాస్యపు ముసుగు కప్పేస్తా డాయన. కొన్ని వందల సరదా విసుర్లు , సినిమా
కబుర్లు కలగలసిన రచనే... ఆయన బాపూ గారితో కలిసి ఆడిన “కోతికొమ్మచ్చి”. ఈ పుస్త కం మూడు భాగాలనూ
ముచ్చటగా చదువుకోవాలి.
రెండు జెడల సీత ఒక జడ ముందుకి, ఇంకొక జడ వెనక్కీ వేసుకుని నడుస్తుంటే... తను వెళుతుందో, వస్తుందో తెలియడం
లేదంటాడు బుడుగు. ఇక జాటర్ ఢమాల్, పక్కింటి లావుపాటి పిన్నిగారు, సీగానపెసూనాంబా, రాచ్చసుడూ - పదమూడో
https://te.quora.com 1/9
23/12/2023, 12:04 (30) Quora

ఎక్కం, ఇలా ఒకటని చెప్పడానికి లేదు, పుస్త కం నిండా నవ్వులే. ముళ్ళపూడి వారి మాటలు, బాపూ గారి గీతలు కలిపి
తెలుగు హాస్య సాహిత్యంలో త్రి విక్ర ముడంతగా ఎదిగిపోయిన రచన “బుడుగు”.
“రాజు మరణించె నొకతార రాలిపోయె
సుకవి మరణించె నొకతార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్ర హములయందు
సుకవి జీవించు ప్ర జల నాల్కలయందు”
అంటూ ఈ భూమి మీద ఉన్న సుకవులందరికీ తన ఒక్క పద్యంతో వెలకట్ట లేని గౌరవాన్ని, శాశ్వతమైన కీర్తి ని కట్ట బెట్టి న
“నవయుగ కవితాచక్ర వర్తి ” శ్రీ గుఱ్ఱం జాషువా గారు.
“నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క
గడన సేయుట కాశపడను నేను
ఆలు బిడ్డ లకునై యాస్తి పాస్తు లు గూర్ప
పెడత్రో వలో పాదమిడను నేను
నేనాచరింపని నీతులు బోధించి
రానిరాగము తీయలేను నేను
సంసార యాత్ర కు చాలినంతకు మించి
గ్రు డ్డి గవ్వయు కోరుకొనను నేను”
“కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి
పంజరాన గట్టు వడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణ యించిన నాకు
తరుగు లేదు విశ్వనరుడ నేను”
అంటూ తానొక విశ్వనరుడనని ఎలుగెత్తి చాటారు జాషువా గారు. ఈ కవికోకిల కవితా విశ్వరూపం చూడాలంటే “జాషువా
సర్వలభ్యరచనలు” ఒకే పుస్త కంగా దొరికే సంకలనాన్ని కళ్ళకద్దు కొని కొనుక్కోవాలి.
“అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల…” అంటూ ఉమర్ ఖయ్యాం రుబాయితులను తేనెతో కలిపి
తెలుగువారితో త్రా గించిన మరో కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు. వారి “పానశాల”లో పద్యాలను మనం కూడా తాగి
మత్తె క్కిపోవాలి.
“ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం”
——————-
https://te.quora.com 2/9
23/12/2023, 12:04 (30) Quora

“ప్ర పంచ మొక పద్మవ్యూహం!


కవిత్వ మొక తీరని దాహం!”
———————
“నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తు రు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దా క్షి ణ్యంగా వీరే...”
—————————
“నేను సైతం
ప్ర పంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టి కి
అశ్రు వొక్కటి ధారపోశాను!”
——————————
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గ ళం, అనితర సాధ్యం నా మార్గం!
ఇలా ఒకటా రెండా ఆ పుస్త కం నిండా మహోత్కృష్ట మైన కవితలే. ఎందరో కవులను పుట్టించిన ఆ మహాకవి శ్రీ శ్రీ గారి
మహోన్నత రచన… “మహాప్ర స్థా నాన్ని” చదివి తీరాలి.
హిందూమతాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఏ సందేహాలున్నా అవన్నీ పటాపంచలు అయిపోవడానికీ, ఇక
ఇంతకుమించిన ప్రా మాణికమైన బోధలు లేవని పూర్తి విశ్వాసం కలిగించగల కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర
సరస్వతీ మహా స్వాముల వారి “జగద్గు రు బోధలు” పది పుస్త కాల సెట్టు ను పట్టు కునే ఇంటికి వెళ్ళాలి. అసలు వేదములలో
ఏముంది. వేదాంగములంటే ఏమిటి? ఉపనిషత్తు లు ఏం చెబుతున్నాయి. ఇవన్నీ సంక్షి ప్తంగా సాధికారికంగా
తెలుసుకోవాలంటే పరమాచార్య గారి ఉపన్యాసాల సంకలనం “వేదములు” చదవాలి.
ఒక ఆంగ్లే యుడు సత్యాన్వేషణ కోసం చేసిన పయనాన్ని, చివరికి తన గమ్యమైన అరుణాచలాన్ని చేరుకున్న వైనాన్నీ
తెలుసుకోవాలంటే పాల్ బ్రంటన్ రచనకు తెలుగుసేత అయిన “రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ”ను తప్పక
చదవాలి.

https://te.quora.com 3/9
23/12/2023, 12:04 (30) Quora

సంఘజీవన విధానం మీద, మన అలవాట్ల మీద సెటైర్ ఎలా వెయ్యాలో తెలుసుకోవాలన్నా, సరదా కథనంతో వెళుతూనే
చెంపలు ఛెళ్ళుమనిపించే చమక్కులు కురిపించాలన్నా, ఆ జంఘాలశాస్త్రి ని పుట్టించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు
గారి “సాక్షి ” వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి.
రెండేళ్ళుగా వర్షా లు లేక తిరుమలలో నీటికి కటకట ఏర్పడితే… వరుణ యాగం చేసి కుండపోత వర్షం కురిపించిన
పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి గురించీ, నష్టా ల్లో ఉన్న ప్ర భుత్వ రంగ సంస్థ ను ఓ IAS అధికారి పట్టా లెక్కించిన
విధానం గురించీ, అపర చాణక్యుడిగా పేరుగాంచిన పి.వి. నరసింహారావుగారి మనస్త త్వం గురించీ, తెలుగువారి ఆరాధ్య
కథా, ప్ర జా నాయకుడు ఎన్టీ యార్ పరిపాలనా విధానాల గురించీ, ఇలా ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే ఇంకెన్నో విషయాల
గురించీ తెలుసుకోవాలంటే పి.వి.ఆర్.కె ప్ర సాద్ గారి “నాహం కర్తా , హరిః కర్తా ”, “అసలేం జరిగిందంటే” పుస్త కాలు
కనబడగానే కొనేసుకోవాలి.
ఇంకా…
ఆది శంకరుల నుండి జిడ్డు కృష్ణ మూర్తి వరకూ ఉన్న భారతీయ తత్వవేత్త ల గురించి, కార్ల్ ‌మార్క్స్, ఫ్రె డరిక్ నీషే, ఆర్ధ ర్
షోపనార్ వంటి పాశ్చాత్య తత్వవేత్త ల గురించి, వాళ్ళ తత్వసారాల గురించి సులభంగా తెలుసుకోవాలంటే త్రి పురనేని
గోపీచంద్ “తత్వవేత్త లు” పుస్త కాన్ని చదవాలి.
భగవద్గీ త చదవాలి అనుకునే వారికి అమృత తుల్యమయినది, ప్ర తిపదార్థ , తాత్పర్య, వ్యాఖ్యలతో కూడినది అయిన శ్రీ శ్రీ శ్రీ
విద్యాప్ర కాశానంద స్వాములవారి “గీతామకరంద” గ్రంథాన్ని నిత్యం పారాయణ చేయాలి.
కృష్ణ లో మునకలేస్తూ , కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త ఆనందంతో అమరావతి పట్ట ణంలో తిరుగుతున్న అనుభూతి కావాలంటే,
సత్యం శంకరమంచి గారి “అమరావతి కథలు”ను తోడు తీసుకెళ్ళాలి,
ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారెవరికైనా సరే, ఉన్నతస్థా యి ఆనందాన్ని కలిగించే ఉత్త మస్థా యి పుస్త కం... పరమహంస
యోగానంద గారి “ఒక యోగి ఆత్మకథ”. మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, యుక్తే శ్వర్ గిరి వంటి
యోగిపుంగవుల గురించి, మరెందరో మహిమాన్వితుల యోగ సాధనల గురించి మనకు తెలియజేసే ఆధ్యాత్మిక ఆత్మకథ
ఈ “ఒక యోగి ఆత్మకథ”.
కథలు రాయాలి అనే కోరిక ఉన్నవాళ్ళు, కథ రాయడానికి ఏమేం సరంజామా కావాలో తెలుసుకోవాలనుకునేవాళ్ళు,
భారతీయ పాశ్చాత్య కథకుల కథన రీతుల వివరాలు గ్ర హించాలనుకునేవాళ్ళు కచ్చితంగా చదవవలసిన పుస్త కం
వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి “కథాశిల్పం”.
“రచన అన్నది అరటిపండులా ఒలిచి చదువరి చేతుల్లో పెడితే అతని మెదడుకు పనే ఉండదు. అందులో కవిత్వమూ
ఉండదు. అతడు కాసేపు ఆలోచించి అర్థం చేసుకోవడమే మంచిది” అని సముద్రా ల గారితో మల్లా ది వారన్నారట, ఒకానొక
సందర్భంలో. మల్లా ది వారి రచనలన్నింటిలోనూ ఇదే అంతస్సూత్రంగా ఉన్నట్టు కనబడుతుంటుంది. 80 యేళ్ళ క్రి తమే
పేరొందిన అన్ని పత్రి కలలో వారి రచనలు, వ్యాసాలు అచ్చయ్యేవి. స్వయానా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద
మాట్లా డటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే. నా కవి మిత్రు లు, మన
కథకులు, చలవ మిరియాలు మొదలైన శీర్షి కలతో వారు వ్రా సిన వ్యాస పరంపరకు పుస్త క రూపమే... మనం తప్పక
చదువవలసిన “చలవ మిరియాలు”.
మాయాబజార్, మిస్సమ్మ, పాతాళభైరవి ఇలా తెలుగులో ఎన్నటికీ నిలచిపోయే చిత్రా లకు మాటలు పాటలూ రాసినవారు,
గుండమ్మకథ, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాలకు గీతకర్త పింగళి నాగేంద్ర రావు గారు. వారు సినిమాలలోకి రాక
పూర్వం నాటక రచన కూడా చేశారు. వాటిలో తొమ్మిది నాటకాలు “పింగళీయం” అనే పేరుతో రెండు సంపుటాలుగా
వచ్చాయి.
“తెలుగు వారల మాట
భళియనగ చెల్లా లి

https://te.quora.com 4/9
23/12/2023, 12:04 (30) Quora

తెలుగుజెండా గగన
గగనాల యెగరాలి
తెలుగుతల్లీ నీకు జోహార్
తెలుగువారల కీర్తి
తళతళల మెరవాలి
తెలుగువారే దేశదేశల నేలాలి
తెలుగుతల్లీ నీకు జోహార్”
అనే పాట పింగళివారు తను రాసిన “నారాజు” అనే నాటకంలో ఒక పాత్ర చేత పాడించినది. ఈ పాటను బట్టే పింగళిగారి
మాతృభాషాభిమానం ఎంతటిదో అర్థ మవుతోంది.
తెలుగు సినీ కవిసార్వభౌముడైన వేటూరి సుందరరామమూర్తి గారు సినిమారంగంలోకి రాకపూర్వం చేసిన
రచన “సిరికాకొలను చిన్నది” అనే సంగీత రూపకం. సుమారు యాభై ఏళ్ళ క్రి తం ఆకాశవాణిలో ప్ర సారమయ్యి శ్రో తలను
విపరీతంగా ఆనందపరచిన ఈ వేటూరి రచన తరువాత కాలంలో పుస్త కంగా అచ్చయ్యింది. అలానే ఎందరో సినీ
ప్ర ముఖుల గురించి వేటూరిగారు హాసం పత్రి కలో వ్రా సిన వ్యాస పరంపరకు పుస్త కరూపం “కొమ్మకొమ్మకో సన్నాయి”. ఈ
రెండూ చదివితే కవిత్వంతో ఈ వేటూరి ఎంత ఎత్తు కు వెళ్ళాడో వచనంలోనూ అంతే ఎత్తు కు వెళ్ళాడన్న విషయం
అర్థ మవుతుంది.
కవి అంటే కృష్ణ శాస్త్రే నేమో అన్నంతగా తెలుగువారిని సమ్మోహ పరచిన వారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.
“సౌరభములేల చిమ్ము పుష్పవ్ర జంబు?
చంద్రి కల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రే మించు నిన్ను?”
“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు - నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?” వంటి ఆయన కవిత్వ పంక్తు లు కొన్నైనా నోటికి రాని
వారు ఆరోజులలో ఉండేవారే కారట. మనం కూడా ఆ భావకవి కవితా సంపుటులన్నీ కొనుక్కొని చదువుకొవాలి. కుదరని
పక్షంలో కనీసం కృష్ణ పక్షం అయినా కొనుక్కోవాలి.
తెలుగులో హాస్యం అంటే గుర్తు కువచ్చే మొదటి పేరు భమిడిపాటి కామేశ్వరరావు గారిది. మన వేష భాషల మీద, అలవాట్ల
మీద, మనస్త త్వం మీద వారు వేసినన్ని హాస్యోక్తు లు మరే హాస్య రచయితకూ సాధ్య పడలేదు. ‘‘మన లిపిలోనే మన
అనైక్యత తెలుస్తుంది. క-చ-ట-త-ప ఈ అక్ష రాలు చూడండి. విడివిడిగా దేని తలకట్టు దానిదే. హిందీలో అయితే ఈ
అక్ష రాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు. మనం? అబ్బే! కచటతపల గాళ్లం. మన అక్ష రాల్లా గా ఎవడి పిలక వాడిదే.
ఇంకోడితో కలిసే ప్ర సక్తే లేదు.’’ ఇలా సాగుతుంది వారి వరస. “అన్నీ తగాదాలే”, “మన తెలుగు”, “లోకో భిన్న
రుచిః” మొదలైన పుస్త కాలు చదువుతున్నంత సేపూ మన పెదాలు విచ్చుకునే ఉంటాయి.
చందమామ పత్రి కకు సంపాదకునిగా దశాబ్దా ల పాటూ పనిచేసినవారు, ఈనాటి ఎందరో సాహితీకారులకు పరోక్షంగా
ప్రే రణగా నిలచినవారు.. కొడవటిగంటి కుటుంబరావు గారు. సమాజం గురించి తెలుసుకోవాలంటే కుటుంబరావు గారి
కథలు, నవలలు చదవాలి. సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే వారి సాహిత్య వ్యాసాలు చదవాలి. ఒక్క మాటలో
చెప్పాలంటే కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్త కాలన్నీ చదవాలి.

https://te.quora.com 5/9
23/12/2023, 12:04 (30) Quora

కవిగా ఆరుద్ర ని అందరికీ చేరువ చేసిన రచన “త్వమేవా౽హమ్”. 1948లో రజాకార్ల చే చెరచబడ్డ ఓ స్త్రీ కథను
కృష్ణా పత్రి కలో చదివి “త్వమేవాహం” మొదలుపెట్టా రు ఆరుద్ర . ఈ కావ్యం చదివిన శ్రీ శ్రీ “ఇక నే పద్యాలు
రాయనవసరంలేదు” అంటూ ఆరుద్ర ని ప్ర శంసించారు.
“నువ్వు ఎక్కదలచుకొన్న రైలు - ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అనే ప్ర సిద్ధ కవితా వాక్యం ఈ పుస్త కంలోనిదే.
చలంగారి హృదయం తెలుసున్నవాళ్ళకి, ఆయన ఆరాటం దేనిగురించో ఎరిగున్నవాళ్ళకే చలం రచనలు అర్థ మవుతాయి.
స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించినవాడు చలం. తన మైదానం నవలతో తెలుగునేలపై ఒక పెద్ద అలజడి సృష్టించిన రచయిత
అతను. ఆయన పుస్త కాలన్నీ చదువవలసినవే అయినా, ప్రే మలేఖలు మాత్రం ముందుగా చదవవలసిన పుస్త కం.
నేను పుట్ట కముందే
నెత్తి మీద నీలితెర
కాళ్ళకింద ధూళిపొర
ఇవి తెలుగువారిని రెండో మారు జ్ఞా నపీఠం ఎక్కించిన “విశ్వంభర” కావ్యానికి ఆరంభాక్ష రాలు. “మానవుడే నాయకునిగా,
విశాల విశ్వంభరే రంగస్థ లంగా, ప్ర కృతి నేపథ్యంగా, తేదీలతో నిమిత్తంలేని, పేర్ల తో అగత్యంలేని మనిషి కథకు వచన
కవితారూపమే ఈ విశ్వంభర” అని కృతికర్త నారాయణ రెడ్డి గారు ఈ రచనలోని కవితా వస్తు వేమిటో చెప్పుకొచ్చారు.
మూడోమారు తెలుగువారికి జ్ఞా నపీఠం తీసుకువచ్చిన వారు రావూరి భరద్వాజ గారు. మంగమ్మ అనే నాటకాల కంపెనీలో
పనిచేసే స్త్రీ తన తెలివి తేటలతో, అందచందాలతో తెలుగు సినిమా పరిశ్ర మలో మంజరి అనే ప్ర ఖ్యాత కథానాయకురాలిగా
ఎదిగి, తిరిగి అథః పాతాళానికి పడిపోయిన కథే... పాకుడురాళ్ళు.
పుట్ట బోయెడి బుల్లి బుజ్జా యి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి
కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనము సిద్ధ పరచి పరచి
తెలవారకుండ మొగ్గ లలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమొ దేవాధిదేవ!
ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!
సృష్టి కార్యంలో అలసిపోయావా స్వామీ! అంటూ భగవంతుడి మీదే కరుణ చూపించిన కవి మన కరుణశ్రీ గారు.
“ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గ్రు చ్చి కూర్చి
https://te.quora.com 6/9
23/12/2023, 12:04 (30) Quora

ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము


అకట! దయలేనివారు మీ యాడువారు.”
అంటూ విలపించే పువ్వుల బాధని మన మనస్సులకు గుచ్చుకునేలా చేసిన కవితా ఖండిక “పుష్పవిలాపం”. అసలు
తెలుగు పద్యం సొగసు తెలియాలంటే కరుణశ్రీ గారి “ఉదయశ్రీ ” చదవాల్సిందే.
పుట్ట పర్తి నారాయణాచార్యులు గారు 14 భాషలలో ప్ర వీణులు. ఎంత ప్రా వీణ్యం అంటే.. ఆ 14 భాషలలో ఆశు కవిత్వం
చెప్పగలిగినంత. వారు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలోని కావ్యాలను తెలుగులోకి అనువదించారు. విశ్వనాథ
వారి ఏకవీరను మళయాళంలోకి అనువాదం చేశారు. పుట్ట పర్తి వారి జీవితంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..
ఆయన రాసిన పుస్త కాన్ని ఆయనే పాఠ్యాంశంగా చదువుకోవాల్సిరావడం! నారాయణాచార్యులు గారు
వ్రా సిన “శివతాండవం” చదువుతుంటే మనకు తెలియకుండానే అక్ష రాలన్నీ సంగీతంతో కలిసి పరుగులుతీస్తుంటాయి.
అందుకేనేమో! ఆ శివతాండవం కవిసమ్రా ట్ విశ్వనాథుని ఆనంద పరవశుని చేసింది. కవికోకిల జాషువా చేత “పుట్ట పర్తి
నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?” అన్న మాట అనిపించింది.
“ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని;
తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటి రత్నాలవీణ”
అని నినదించిన మహాకవి దాశరథి. “దాశరథి వ్రా సిన పద్యాలు బోలెడు - అందులో నోటు చేయదగినవి కోకొల్ల లు” అని
‘ఆరుద్ర ’చే కొనియాడబడిన కవితావన పారిజాతం మన దాశరథి. నిజాం చెరనుండి తెలంగాణా విముక్తి కై పోరాడిన
కవనయోధుడతడు. “మహాంధ్రో దయం” కోసం తన కవిత్వంతో “అగ్నిధార”లు కురిపించి “రుద్ర వీణ”లు
మ్రో గించినవాడు. లక్ష్యం నెరవేరాక, చల్ల బడ్డ మనస్సుతో సినిమా పాటలలో వేయి వేణువులు మ్రో గించి, ముత్యాల జల్లు లు
కురిపించినవాడు. ఆ కవితాగ్ని కాంతిలో దాశరథి విశ్వరూపాన్ని చూడాలంటే ఆయన సాహిత్యాన్ని తప్పక చదవాల్సిందే.
"నేనింతా ఓ పిడికెడు మట్టే కావచ్చు - కానీ కలమెత్తి తే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది!" అంటూ
నినదించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ.
"శేషేన్
నీ పోయెమ్సు చూసేన్
పసందు చేసేన్
నీది పద్యమా లేక ఫ్రెంచి మద్యమా"
అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు "శ్రీ శ్రీ ".
శేషేంద్ర శర్మగారి “షోడశి” - రామాయణ రహస్యాలను తెలియజేసే పుస్త కం. ఇందులో.. సుందరకాండ కుండలినీ
యోగమని, లంకానగరం మూలాధారమని, సీతాదేవియే కుండలినీశక్తి అని, స్వామి హనుమే కుండలినీ యోగము
అనుష్ఠించు యోగి అని వేదోపనిషత్తు లనుండి మంత్ర శ్లో కాలను ఉదహరిస్తూ నిరూపిస్తా రు శేషేంద్ర శర్మగారు.
అనువాద హనుమంతుడంటూ బాపూరమణలు ప్రే మగా పిలుచుకునే నండూరి రామ్మోహనరావు గారి రచనా శైలి చాలా
సరళంగా ఉంటుంది. మార్క్‌ట్వైన్ రచించిన “టామ్ సాయర్”, “హకల్ బెరీఫిన్” మొదలైన వాటికి నండూరి వారి
అనువాదాలు అనువాదపు వాసన తగలకుండా గుబాళిస్తుంటాయి. ఇవి కాక ఇంకొన్ని అనువాదాలయిన “రాజూ-పేద”,
“విచిత్ర వ్యక్తి ”, “కాంచనద్వీపం” వంటి పుస్త కాలు పిల్ల లతో చదివిస్తే వాళ్ళ ఊహాశక్తి , భాషా పటిమ రెంటినీ
పెంచినవాళ్ళమవుతాం.
https://te.quora.com 7/9
23/12/2023, 12:04 (30) Quora

“ఆరు సారా కథలు”, “రత్తా లు రాంబాబు”, “రాజు-మహిషి”, “గోవులొస్తు న్నాయి జాగ్ర త్త ” వంటి రచనలతో తెలుగు
సాహిత్యంలో స్థి ర నివాసం ఏర్పరచుకొన్న రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. రావిశాస్త్రి గా సుప్ర సిద్ధు లు. ఈతరం
రచయితలు ఎందరికో స్ఫూర్తి నిచ్చినవారు. ఆయన రచనాశైలి కూడా వేరెవ్వరీ అందనంత విశిష్ట మైనది. కేవలం మళ్ళా
మళ్ళా చదువుతూ ఆనందించ వలసినది.
ఇంకొక సుప్ర సిద్ధ కథా రచయిత చాసోగా పిలవబడే చాగంటి సోమయాజులు గారు. “ఎందుకు పారేస్తా ను నాన్నా”,
“ఎంపు”, “జంక్ష న్‌లో బడ్డీ ” వంటి ఆయన కథలు… కథను ఎలా నడిపించాలి అన్న విషయంలో ఔత్సాహిక కథకులకు
మార్గ దర్శనం చేస్తా యి.
అందరికీ అర్థం కాని కథలు, అర్థం అయినా తిరిగి ఇదీ ఆ కథ అని చెప్పలేని కథలు, మనసు పొరల్లో కి తవ్వుకుంటూ వెళ్ళే
కథలు... “త్రి పుర కథలు”. పాము, భగవంతం కోసం వంటి కథలు చదివిన తరువాత మరలా ఈ వాస్త విక ప్ర పంచంలోకి
రావడానికి మనకు చాలా సమయం పడుతుంది. త్రి పుర పేరుతో రచనలు చేసిన రచయిత అసలు పేరు రాయసం వెంకట
త్రి పురాంతకేశ్వరరావు గారు.
ఇంకా.. తెలుగు అందాన్ని తన అక్ష రాలలో పెట్టి పరుగులు పెట్టించిన వేలూరి శివరామశాస్త్రి గారి కథలు, తన “గాలివాన”
కథతో తెలుగు కథకు అంతర్జా తీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టి న పాలగుమ్మి పద్మరాజు గారి కథలు, “చివరకు మిగిలేది” అనే
నవలతో తెలుగు సాహిత్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండిపోయే స్థా యిని
సంపాదించుకున్న బుచ్చిబాబు గారు రాసిన కథలు, ఆనందాన్ని, హాయిని కలిగించే భానుమతి గారి “అత్త గారి కథలు”,
ఇలా వీరందరి కథలూ చదివి తీరాల్సిందే.
ఇప్పటివరకూ చెప్పుకున్న పుస్త కాల రచయితలెవ్వరూ ఇప్పుడు భూమి మీద లేరు. అయితే.. ఇప్పుడు ఉన్న రచయితల్లో
కూడా తారాపథాన్ని అందుకున్నవాళ్ళు ఇద్ద రు ఉన్నారు. అప్పట్లో లక్ష లాది తెలుగు పాఠకులకు వాళ్ళిద్ద రి పుస్త కాలే తెలుగు
సాహిత్యానికి ప్ర వేశద్వారాలుగా ఉండేవి. వారిలో ఒకరు…
యండమూరి వీరేంద్ర నాథ్ గారు. ఒక తరం నవలా సామ్రా జ్యానికి ఆయనే చక్ర వర్తి . “వెన్నెల్లో
ఆడపిల్ల ”, “అంతర్ముఖం” వంటి నవలలు ఎప్పటికీ క్లా సిక్సే. ఛాలెంజ్, రాక్ష సుడు, మరణమృదంగం, అభిలాష, ఒక రాధ
ఇద్ద రు కృష్ణు లు మొదలైన తెలుగు సినిమాలన్నీ యండమూరి నవలలకు వెండితెర రూపాలే. “విజయానికి అయిదు
మెట్లు ” తెలుగులో వచ్చిన వ్యక్తి త్వ వికాస పుస్త కాలలోకెల్లా అత్యంత విజయవంతమైన పుస్త కం.
ఇంకొక ప్ర సిద్ధ రచయిత... “షాడో” సృష్టి కర్త అయిన మధుబాబు గారు. డిటెక్టి వ్ సాహిత్యంలో ఎందరో రచయితలు
ప్ర ఖ్యాతులైనా అగ్ర స్థా నం మాత్రం మధుబాబు గారిదే. షాడో గంగారాంతో కలసి దేశవిదేశాల్లో చేసిన విన్యాసాలు చదివి
ఆనందించవలసిందే కానీ ఇలా చెప్పుకుంటే తనివితీరేది కాదు. డిటెక్టి వ్ నవలలే కాదు కాళికాలయం, వీరభద్రా రెడ్డి వంటి
ఎన్నో జానపద నవలలు కూడా మధుబాబు గారి మార్క్‌తో తెలుగు సాహిత్యంలో నిలబడిపోయాయి.
ఇంకా…
ప్ర జాకవి కాళోజీ గారి “నా గొడవ”, డైరక్ట ర్ వంశీ గారి “మా పసలపూడి కథలు”, యద్ద నపూడి సులోచనారాణి
గారి “జీవన తరంగాలు”, మల్లా ది వెంకట కృష్ణ మూర్తి గారి “నత్త లొస్తు న్నాయి జగ్ర త్త ”, మాదిరెడ్డి సులోచన గారి “పూల
మనసులు”, రంగనాయకమ్మ గారి “బలిపీఠం”, పొత్తూ రి విజయలక్ష్మి గారి “హాస్య కథలు”, కె.ఎన్.వై. పతంజలి
గారి “పతంజలి భాష్యం”, శ్రీ రమణ గారి “మిథునం”, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి “అమృతం కురిసిన
రాత్రి ” ఇలా చదవ వలసిన పుస్త కాలు ఎన్నో ఉన్నాయి.
రామాయణం 24 వేల శ్లో కాలూ టీకా తాత్పర్యాలతో సహా కావాలనుకునేవాళ్ళకు పుల్లె ల శ్రీ రామచంద్రు డు గారి 10
సంపుటాల రామాయణం, రామాయణం యథాతధంగా అత్యుత్త మ తెలుగు వచనంలో కావాలంటే.. శ్రీ నివాస
శిరోమణిగారి మూడు సంపుటాల “వాల్మీకి రామాయణము”, శ్రీ లలితా త్రి పుర సుందరీ ధార్మిక పరిషత్ వారు 18
సంపుటాలుగా తేట తెలుగులో ప్ర చురించిన “వ్యాస మహాభారతం”, రామాయణంలో మనకు కలిగే ధర్మసందేహాలకు
సమాధానాలుగా బ్ర హ్మశ్రీ మల్లా ది చన్ద్రశేఖరశాస్త్రి గారు రచించిన “శ్రీ రామాయణ రహస్యదర్శిని”, టి.టి.డి వాళ్ళు
ప్ర చురించిన ఆంధ్ర మహాభారతం పదిహేను పుస్త కాల సెట్టు , వారి ప్ర చురణే అయిన పోతన భాగవతం, రామకృష్ణ మఠం
https://te.quora.com 8/9
23/12/2023, 12:04 (30) Quora

వారు సులభశైలిలో అందరికీ అర్థ మయ్యేలా ప్ర చురించిన ఉపనిషత్తు ల పుస్త కాలు, శృంగేరీ పీఠాధిపతుల సూచన మేరకు
కాకతీయ సిమెంట్స్ వారు ప్ర చురించిన పురాణ అనువాదాలు ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
ఈ సమాధానంలో కేవలం కొందరు రచయితలను, కవులను తలుచుకుంటూ కొన్ని పుస్త కాలను మాత్ర మే ప్ర స్తా వించాను.
ఇలాంటి ఇంకొక పది వ్యాసాలు వ్రా సినా ఇంకా గుర్తు చేసుకోవలసిన, చదవ వలసిన మంచి పుస్త కాలు మిగిలే ఉంటాయి.
అంత గొప్ప సాహిత్యం ఉంది మన భాషలో. ఇప్పటికి మాత్రం ఈ పుస్త కాలతో సరిపెడుతూ, నా ఉత్సాహానికి అడ్డు కట్ట
వేసుకుంటున్నాను.
స్వస్తి !
రాజన్ పి.టి.ఎస్.కె

https://te.quora.com 9/9

You might also like