Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

══════ஜ▲ஜ══════

AJARUDDIN GK GROUPS
1922-24 మన్య విప్ల వం

📚
📚
APPSC, TSPSC RRB,SI, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం
వాట్సాప్, టెలిగ్రా మ్, ఫేస్బుక్ గ్రూ ప్స్ లో జాయిన్ అవ్వండి .

🗞️ 📚 📖
📝
డైలీ న్యూస్ పేపర్స్ ,మెటీరియల్స్ ,కరెంట్ అఫైర్స్ ,జాబ్

👇👇👇👇👇👇👇👇
నోటిఫికేషన్.
1.వాట్సప్ లింకు(మెటీరియల్స్+కరెంట్ అఫైర్స్+న్యూస్

👇
పేపర్స్)(ఏదో ఒక వాట్సప్ గ్రూ పులో మాత్రమే జాయిన్
అవ్వండి)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

2.టెలిగ్రా మ్ లింక్(3,000 మెటీరియల్ అప్లో డ్ చేశాము) 👇


గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

👇
3.ఫేస్బుక్ లింకు(దేశంలో విడుదలవుతున్న మొత్త ం
నోటిఫికేషన్ల కోసం)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

4.GET LIVE JOBS (కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం) 👇


గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి
5. ఉద్యోగ నోటిఫికేషన్లు , ఆన్లైన్ ఫ్రీ ఎగ్జా మ్స్, కరెంట్ అఫైర్స్,

👇
ఆరోగ్యానికి సంబంధించిన సూత్రా లు, A to Z మెటీరియల్స్
కోసం వెబ్సైటు
https://www.prudhviinfo.com/

══════ஜ▲ஜ══════
1922-24 మన్య విప్ల వం
విశాఖపట్నం బీచ్ రోడ్డు లో అల్లూ రి సీతారామరాజు విగ్రహం: మన్య విప్ల వానికి తర్వాతి కాలంలో
జాతీయోద్యమంలో భాగంగా, సీతారామరాజుకు స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రఖ్యాతి లభించింది.
1922-1924 మధ్యకాలంలో రంప లేదా మన్యం అటవీ ప్రా ంతంలో అల్లూ రి సీతారామరాజు నేతృత్వంలో
బ్రిటీష్ ప్రభుత్వంపై స్థా నిక గిరిజనులు చేసిన తిరుగుబాటును మన్య విప్ల వంగా పిలుస్తా రు. పశ్చిమగోదావరి
జిల్లా లోని మోగల్లు ప్రా ంతానికి చెందిన క్షత్రియ కులస్తు డు, జాతీయోద్యమ భావాలు కలిగిన యువకుడు
అల్లూ రి సీతారామరాజు రంప ప్రా ంతానికి స్థా నికులైన గిరిజన నాయకులు గం గంటందొ ర, గం మల్లు దొ ర,
అగ్గిరాజు, యెండు పడాల్ వంటివారితో సహకారంతో గిరిజనుల మద్ద తుతో ఈ విప్ల వోద్యమానికి
నాయకత్వం వహించాడు.

గిరిజనుల జీవికలో ముఖ్యమైన భాగాలైన పో డు వ్యవసాయం, తేనె వంటి అటవీ ఉత్పత్తు ల సేకరణ
వంటివాటిని నిషేధించడం, నియంత్రించడమో చేసి అటవీ వనరులను అన్యాయంగా దో చుకుంటూండడం,
గిరిజనుల నుంచి పన్నులు వసూలుచేసే మత్తా దారుల అధికారాలు తొలగించడం, మైదాన ప్రా ంతం నుంచి
బ్రిటీష్ వారు ప్రో త్సహించగా వచ్చిన వ్యాపారులు వీరి అమాయకత్వం ఆధారంగా గిరిజనులను
నష్టా లపాలు చేయడం వంటి కారణాలతో ఈ ప్రా ంతంలో 19వ శతాబ్ది చివరి దశకాల్లో నూ, 20వ శతాబ్ది
తొలినాళ్ళలోనూ కొన్ని తిరుగబాట్లు (పితూరీలని పేరు) జరిగాయి. బ్రిటీష్ ప్రభుత్వం వీటిని అణచివేసినా
దో పిడీ కొనసాగించడం, కరువుకు ఈ విధానాలు తోడై గిరిజనులు ఆకలితోనూ, స్వతంత్ర జీవనం
కోల్పోవడంతోనూ ఆగ్రహంతో ఉండడం ఈ తిరుగుబాటుకు కొన్ని కారణాలు. అల్లూ రి సీతారామరాజు
స్వయంగా జాతీయోద్యమంలో పాల్గొ న్న వ్యక్తి. ఈ తిరుగుబాటు స్వభావంలో జాతీయోద్యమ స్ఫూర్తి,
స్వాతంత్ర్య పో రాట లక్ష్యాలు ఉన్నాయా అన్న విషయంపై చరితక ్ర ారులకు భిన్నాభిప్రా యాలు ఉన్నాయి.

1922 ఆగస్టు 22న ఈ తిరుగుబాటులోని తొలి దాడి ప్రా రంభమైంది. ప్రధానంగా రంప అటవీ ప్రా ంతంలోని
పలు పో లీసు స్టేషన్ల మీద దాడులు జరిగాయి. ఈ దాడుల అనంతరం స్టేషన్‌లోని ఆయుధాలు
తిరుగుబాటుదారులు జప్తు చేసుకుని వెళ్ళేవారు. 1922 సెప్టెంబరులో ఈ తిరుగుబాటును అణచడానికి
ఏర్పాటుచేసిన ప్రత్యేక పో లీసు దళాన్ని తిరుగుబాటులు సమర్థ వంతంగా దెబ్బతీయడంతో వారికి గౌరవం
పెరిగింది. ప్రత్యేకించి బ్రిటీష్ ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకుని పలువురుని హతమార్చారు.

1923లో ఉద్యమాన్ని దెబ్బతీయడానికి పో లీసులు గిరిజనులను చిత్రహింసలు పెట్టినా వారు


ఉద్యమకారుల పక్షానే నిలిచారు. అయితే మత్తా దారులను మాత్రం బ్రిటీష్ వారు లొంగదీసుకోగలిగారు. ఆ
మద్ద తుతో ఒక్కో నాయకుడినీ పట్టు కుని, కొందరిని మట్టు పెట్టి తుదకు సీతారామరాజును 1924 మే 7న
పట్టు కుని కాల్చిచంపి తిరుగుబాటును అణచివేశారు. ఈ తిరుగుబాటు తదనంతర కాలంలో ఆంధ్ర
ప్రా ంతంలో సాగిన జాతీయోద్యమానికి స్ఫూర్తిని అందించింది. ఉద్యమ నాయకుడైన అల్లూ రి
సీతారామరాజును ప్రజలు స్వాతంత్ర్య సమర యోధుడిగా గౌరవిస్తు న్నారు.

నేపథ్యం

బ్రిటీష్ వలస ప్రభుత్వం రంప ప్రా ంతంలోని గిరిజనుల జీవన విధానంపై వివిధ ఆంక్షలు పెట్టి, అటవీ
ప్రా ంతాన్ని దో పిడీ చేయడం ఈ విప్ల వానికి నేపథ్యంగా ఉంది. మన్య విప్ల వానికి భూమికను ఏర్పరిచిన
కారణాలుగా ఈ కిందివి చెప్పుకోవచ్చు:

పో డు వ్యవసాయంపై ఆంక్షలు
స్థా నిక గిరిజనులు తరతరాలుగా పో డు వ్యవసాయం చేస్తు న్నారు. దీనిలో భాగంగా రైతులు అడవిని
కొంతమేర కొట్టి, అక్కడే ఆ కలప తగలబెడతారు. కలప తగలబెట్టడం వల్ల భూమికి ఎరువుగా
ఉపకరిస్తు ంది, క్రమంగా నెలల వ్యవధిలో వానలు పడ్డా కా వ్యవసాయం ప్రా రంభించి జొన్నలు, రాగులు
వంటివి పండించుకుంటారు. ఏటా ఒక్క పంటే పండించినా, పో డు వ్యవసాయ పద్ధ తుల వల్ల బాగా పండి
వారి అవసరాలకు సరిపో తుంది. వారి వ్యవసాయం వారి అవసరాలకు మాత్రమే పరిమితమైనది. తర్వాతి
సంవత్సరం అడవిలో మరో చోట వ్యవసాయం చేసుకుని, ముందు వ్యవసాయం చేసిన ప్రా ంతాన్ని అడవి
పెరిగేందుకు వదిలేస్తా రు.
ఇలా అప్పటివరకూ అడవిలో ఏ ప్రా ంతాన్నైనా ఇష్టా నికి సాగుచేసుకునే గిరిజనుల పద్ధ తిపై బ్రిటీష్
ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అడవిలో చాలా ప్రా ంతాల్లో చెట్లు కొట్ట డం, పో డు వ్యవసాయం చేయడం
నిషేధించారు. బ్రిటీష్ వారు అనుమతించిన ప్రా ంతాలు రిజర్వు చేసిన ప్రా ంతాలతో పో ల్చుకుంటే అతి
స్వల్పం. ఈ చర్య నిజానికి గిరిజనులను ఆకలితో మాడిపో యేలా చేసింది. అసహజమైన కరువును
మన్యంలో సృష్టించింది.
ఈ ప్రా ంతాల్లో కల్లు కరువు సమయంలోనూ, ఆహారం లభ్యం తక్కువగా ఉండే కాలాలలోనూ ప్రధానమైన
ఆహారంగా ఉపకరిస్తూ ంటుంది. బ్రిటీష్ ప్రభుత్వం కల్లు తయారీ కోసం కాంట్రా క్టు లు మంజూరుచేసే
విధానాన్ని ఏర్పాటుచేస,ి గిరిజనులు స్వంతానికి కల్లు కాయడాన్ని నిషేధించింది.

AJARUDDIN GK GROUPS

వాట్సప్ లింకు(మెటీరియల్స్+కరెంట్ అఫైర్స్+న్యూస్

👇
పేపర్స్)(ఏదో ఒక వాట్సప్ గ్రూ పులో మాత్రమే జాయిన్
అవ్వండి)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

వనరుల దో పిడీ

బ్రిటీష్ ప్రభుత్వం అడుగుపెట్టక ముందు ఈ ప్రా ంతంలో అటవీ సంపదపై పూర్తిగా స్థా నిక గిరిజనులకే హక్కు
ఉండేద.ి అడవిలో తేన,ె గింజలు, ఇతరేతర అటవీ ఉత్పత్తు లన్నిటినీ గిరిజనులు స్వేచ్ఛగా
సేకరించుకునేవారు. ఈ అటవీ ఆర్థిక వ్యవస్థ లో బ్రిటీష్ వారు మార్పులు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది లో
కొద్దికొద్దిగా ప్రా రంభించి, 20వ శతాబ్ది వచ్చేనాటికల్లా అటవీ ఉత్పత్తు ల సేకరణ విషయంలో పూర్తిగా
ప్రభుత్వం పట్టు బిగించేసింది. అంతవరకూ గిరిజనులు సేకరించుకునే ఈ ఉత్పత్తు లను అప్పటి నుంచీ
ప్రభుత్వం నేరుగానో, కాంట్రా క్టు లకు ఇచ్చి కాంట్రా క్టర్ల ద్వారానో సేకరించి లాభసాటి ఆదాయమార్గ ంగా
మార్చుకుంది. ఈ వనరుల దో పిడీ ఇతర ఆంక్షలకు కూడా తోడై గిరిజనుల ఆర్థిక స్థితిపై ముప్పేట దాడి
చేసింది.

కొండ ప్రా ంతాల్లో కి బ్రిటీష్ వారు రోడ్డు సౌకర్యాలు ఏర్పరిచి మైదాన ప్రా ంతాలకు చెందిన వ్యాపారస్తు ల్ని
ప్రో త్సహించారు. అటవీ ఉత్పత్తు లను వ్యాపారులు అమ్మకాలు, కొనుగోళ్ళు చేయడం సాగించారు.
వీటంతటిలో గిరిజనులకు లాభించేది లేకపో గా నష్ట ం చేకూరింది. మరోవైపు అప్పటికే పో డు వ్యవసాయాన్ని
పరిమితం చేయడం, కల్లు కాచుకోవడాన్ని నిషేధించడం వంటి అనేక కార్యకలాపాల వల్ల స్వతంత్ర జీవన
మార్గా లను గిరిజనులు కోల్పోయారు. మెల్లి గా తమ భూములపై ఆధిపత్యాన్ని కోల్పోవడంతో, భూమి
ఆధారిత వ్యవస్థ లోని వారు మార్కెట్ వ్యవసాయంలోకి మళ్ళి బలవంతులైన మైదాన ప్రా ంతాల వారి వద్ద
కౌలుదారులుగానో, లేక కలప వ్యాపారంలో అడవిలో కలప కొట్టేవారిగానో మారిపో యారు.

అటవీ ప్రా ంతాల్లో కూలీలుగా మారిన గిరిజనులతో ప్రభుత్వం ప్రధానంగా రోడ్డు పనులు, కలప కొట్టే పనులు
చేయించుకునేద.ి ఐతే వారికి సరియైన కూలీ డబ్బు ఇచ్చేది కాదు, కొన్ని సందర్భాల్లో కూలీ సొ మ్ము
ఇవ్వకుండానే పనులు చేయించుకునేద.ి చాలాసార్లు వారు నిర్ణ యించే కూలీ డబ్బు మార్కెట్లో ఉన్నదాని
కన్నా తక్కువగా ఉండేద.ి ప్రభుత్వం తర్వాత అటవీ కాంట్రా క్టు రులు ఎక్కువమంది కూలీలకు పని
కల్పించేవారు. ఐతే వారు స్థా నిక అధికారులతో కుమ్మక్కై అమాయకులైన స్థా నిక గిరిజనులకు తక్కువ
కూలీ ఇచ్చి పనిచేయించుకునేవారు. దాంతో మొత్త ంగా గిరిజనులు బానిసత్వంలో మగ్గిపో యే స్థితికి
వచ్చారు.1922-24 నాటి తిరుగుబాటుకు కూలీల సమస్యతో నేరుగా సంబంధం ఉందని చాలామంది
పరిశీలకులు భావించారు.[1]
గిరిజనేతరులైన షావుకార్లు , కాంట్రా క్టర్లు విప్ల వాన్ని ఏమేరకు ప్రభావితం చేశారన్న విషయంలో
చరితక ్ర ారుల్లో భిన్నాభిప్రా యాలు వ్యక్త మౌతున్నాయి. అటవీ ఆర్థిక వ్యవస్థ లో గిరిజనేతరుల ప్రమేయం
విప్ల వానికి ప్రధాన కారణమని కొందరు చరితక ్ర ారులు ప్రతిపాదిస్తూ ండగా,

మత్తా దారుల అధికారాల తొలగింపు

బ్రిటీష్ ప్రభుత్వానికి ముందు నుంచి రంప ప్రా ంతంలో పన్నుల వసూలుకు మత్తా దారుల వ్యవస్థ
నెలకొనివుంది. మత్తా దారు అనే అధికారి లేక నాయకుడు స్థా నికుల నుంచి నిర్ధా రించిన కట్టు బడి
(పన్నులు)ని వసూలు చేసి దాన్ని పరిపాలకుడైన రాజుకు ఇస్తూ ండేవారు. ఇందుకు గాను వారికి
ప్రతిఫలంగా సొ మ్ముతో పాటుగా పలు అధికారాలు కూడా దఖలు పడేవి. వీరికి కొండపై భూములు,
వ్యవసాయం ఉండేది కాదు కానీ స్వంత వ్యవసాయంపై పన్ను కట్ట నవసరం లేకపో వడం మొదలుకొని
అనేక అధికారాలు ఉండేవి. నిజానికి రాజ ప్రతినిధిగా మత్తా దారులు నిజమైన అధికారులుగానూ, నిజమైన
అధికారాన్ని అనుభవించేవారుగానూ ఉండేవారు. బ్రిటీష్ ప్రభుత్వం వచ్చాకా వీరి అధికారాలను పరిమితం
చేసింది. స్థా నిక బ్రిటీష్ ఏజెంట్లు నిర్ధా రించిన కట్టు బడి వసూలు చేయడం, వసూలు చేసినందుకు సొ మ్మ
రూపంలోనో, గింజల రూపంలోనో, పన్నులు లేని భూములను సాగుచేసుకునే రూపంలోనో వారికి
ప్రతిఫలం దక్కే వ్యవస్థ ఏర్పాటైంది. బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని పాలసీకి అనుగుణంగా మారేదిగా చేసింది,
అవసరమైతే బ్రిటీష్ ప్రభుత్వం వంశపారంపర్య హక్కు సహా ప్రతీ హక్కునూ తొలగించే అధికారం
అట్టిపెట్టు కుంది. ఈ కారణాలన్నిటితోనూ స్థా నిక రాజుల స్థా యి నుంచి మత్తా దారులను సాధారణ ఉద్యోగుల
స్థా యికి తీసుకువచ్చారు బ్రిటీష్ వారు.దాంతో మత్తా దారులు కూడా సామాన్య గిరిజనులతో పాటుగా బ్రిటీష్
వారిపై వ్యతిరేకత పెంచుకున్నారు.
ప్రభుత్వంపై పూర్వపు తిరుగుబాటులు

ప్రభుత్వం విధించే నిషేధాలు, పరిమితులకు వ్యతిరేకంగా 1880 నుంచి 1914 వరకూ పదుల సంఖ్యలో
తిరుగుబాట్లు జరిగాయి. వీటిని పితూరీగా పిలచేవారు.1879-80 మధ్యకాలంలో రంపచోడవరం ప్రా ంతంలో
తమ్మందొ ర అనే గిరిజన నేత నాయకత్వంలో కల్లు కాయడంపై ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పితూరీ
జరిగింది. దీనిలో భాగంగా భౌతికంగా ప్రభుత్వ చిహ్నంగా కనిపించే పో లీసు స్టేషన్ల ను తగుల బెట్టా రు.
పో లీసు కానిస్టేబుల్ ఒకరిని అమ్మవారికి బలి ఇచ్చారు. తమకు బతికే అవకాశం లేనప్పుడు,
కానిస్టేబుళ్ళను చంపి మరీ చస్తా మన్నది వారి నినాదంగా ఉండేద.ి క్రమంగా విశాఖపట్నంలోని గొల్ల కొండ
అడవులు, ఖమ్మం ప్రా ంతపు అడవులకు తిరుగుబాటు వ్యాపించగా సైన్యాన్ని, పో లీసులను దీన్ని
అణచివేసేందుకు నియోగించారు. 1880 జూన్లోనే తమ్మందొ రను కాల్చి చంపగలిగినా, అప్పటికే వ్యాపించిన
తిరుగుబాటును అణచివేసేందుకు నవంబరు వరకూ సాధ్యపడలేదు. గిరిజనుల జీవన విధానంలో బ్రిటీష్
ప్రభుత్వ జోక్యం, వనరుల దో పిడీ వంటివాటికి వ్యతిరేకంగా ఇటువంటి పితూరీలు మరికొన్ని 1922
ముందునాటికే జరిగాయి. 1886లో ఇటువంటి మరో పితూరీ కూడా సాగింది.నిజానికి ఈ పితూరీలు
మొదట మత్తా దార్ల మధ్య మత్తా లు (ఎస్టేట్ల) కోసం జరిగిన లక్షణం కలిగినవే అయినా క్రమంగా బ్రిటీష్
ప్రభుత్వపు అణచివేత ధో రణి పెరిగే కొద్దీ బ్రిటీష్ వలస పాలన, అటవీ పాలసీలకు వ్యతిరేకంగా
జరుగనారంభించాయి.

తిరుగుబాటు
రామరాజు నాయకత్వం

1922-1924 మన్యం తిరుగుబాటు లేదా మన్య విప్ల వానికి నాయకత్వాన్ని మైదాన ప్రా ంతాలకు చెందిన,
క్షత్రియ కులస్తు డైన అల్లూ రి సీతారామరాజు వహించారు. సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా
మోగల్లు కు చెందినవారు. 1897న మోగల్లు గ్రా మంలో జన్మించిన రామరాజు 5వ ఫారం వరకూ
ఆంధ్రదేశంలోని పలు ప్రా ంతాల్లో చదువుకున్నారు. చిన్నతనంలోనే జ్యోతిష్యం, హస్త సాముద్రికం, ఔషధ
శాస్త ం్ర వంటివాటిపై ఆసక్తిని, అభినివేశాన్ని అభివృద్ధి చేసుకున్నారు. 18వ యేట రాజు సన్యాసాన్ని
స్వీకరించి, అటవీ ప్రా ంతాల్లో తిరుగుతూ ప్రజలకు మూలికల వైద్యం చేసేవారు. నిరాడంబరంగా జీవించడం,
మూలకల వైద్యంతో ప్రజలకు సాయం చేయడం, అడవి జంతువులను శక్తితో లొంగదీయగలగడం వంటి
వాటి వల్ల రాజుకు అక్కడి గిరిజనుల్లో మర్యాద లభించింది. ఆయన ఆధ్యాత్మికత, ఆయన చుట్టూ
అల్లు కున్న కథలు ఆయనకు దాదాపుగా దైవత్వాన్ని ఆపాదించాయి. గిరిజనులు ఆయనకు బాణాలు,
బుల్లెట్లు తాకవని, శరవర్షా న్ని కురిపించగలడనీ పలు విధాల కథలు ఆయన పరంగా చెప్పుకునేవారు.
ఇవన్నీ ఆయనపై భయాన్ని కలిగించాయి. అన్నివిధాలుగానూ గౌరవం, భయం కలసి సీతారామరాజుకు
బలమైన అనుచరులు లభించేలా చేసింది. ఆయనకు జాతీయవాదంతోనూ, జాతీయ నాయకులతోనూ
అభినివేశం ఉండేద.ి గతంలో జాతీయోద్యమంలో పనిచేసిన అనుభవమూ ఉంది. గిరిజనుల భూములుపై,
జీవన విధానంపై ఆంక్షలు విధించి, కూలీలుగా మార్చి, ఆ కూలీ కూడా సరిగా ఇవ్వని బ్రిటీష్ ప్రభుత్వ
తీరును గిరిజనులు అర్థ ం చేసుకునందుకు, తిరగబడేందుకు సీతారామరాజు సహకరించారు.
సీతారామరాజుకు ప్రధాన అనుచరులుగా గంటం దొ ర, మల్ల య్య దొ ర, అగ్గిరాజు, యెండు పడాల్ వంటివారు
సైన్యనాయకత్వం చేపట్టా రు. గం గంటయ్య దొ ర, గం మల్ల య్య దొ ర సో దరుల స్థా నికజ్ఞ తను ఆధారం
చేసుకుని సీతారామరాజు అనేకమంది గిరిజనులను తిరుగుబాటులో చేర్చుకున్నారు.

ముట్ట డులు, దాడులు, విప్ల వకారుల విజయం


దేవీ పట్నం పాత పో లీస్‌స్టేషన్: మన్య విప్ల వంలో భాగంగా అల్లూ రి సీతారామరాజు, ఇతర విప్ల వయోధులు
దాడిచేసిన పో లీసుస్టేషన్ల లో ఒకటి.
1922 ఆగస్టు 22, 23, 24 తేదీల్లో వరుసగా చింతపల్లి,కృష్ణ దేవిపేట, రాజవొమ్మంగి పో లీసు స్టేషన్ల ను
50మందితో కూడిన సాయుధ దళంతో సీతారామరాజు ముట్ట డించారు. ఈ ముట్ట డుల అనంతరం
సీతారామరాజు, అనుచరులు 26 తుపాకులు, 2,500 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి
అనంతరం రామరాజు గూడెం చేరుకుని, గిరిజనులతో పండుగలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా
గిరిజనులను చైతన్యపరచి పో రాటానికి మద్ద తుగా ఇంకొందరు కోయ యువకులను తన దళంలో
చేర్చుకున్నారు.

సీతారామరాజు దళంతో ఈశాన్యంగా కిలంకోట, అక్కణ్ణు ంచి తూర్పుకు గంగరాజుముద్గోల్ వంటి ప్రా ంతాల్లో
సంచరించారు. కొత్త గా నియమితులైన పో లీసు దళంతో వీరికి సెప్టెంబర్ 3, 1922న ఘర్షణ జరిగింది. ఈ
ఘర్షణలో పో లీసులపై రాజు దళం విజయం సాధించింది. పో రాటంలో ఒక కానిస్టేబుల్ మరణించారు. అదే
నెల 25 తేదీన సీతారామరాజు దళం దమనపల్లి ఘాట్ వద్ద బ్రిటీష్ అధికారులపై మెరుపు దాడిచేసింది.
బ్రిటీష్ వారి గుంపులో హెడ్ ను వెళ్ళిపో నిచ్చి దాడి ప్రా రంభించారు. వెనువెంటనే స్కాట్ కోవార్డ్,
ఎల్.ఎన్.హేటర్ అన్న ఇద్ద రు బ్రిటీష్ అధికారులను కాల్చి చంపారు. పో లీసులను చాలా ఇబ్బందికరమైన
ప్రదేశంలోకి రానిచ్చి ఈ మెరుపుదాడి చేశారు. పై నుంచి వారిపై బండలు దొ ర్లించారు. కొందరు పో లీసులపై
తుపాకీ దాడి సరిగా నడినెత్తి న బుల్లెట్ గాయమయ్యేలా జరిగింది. బ్రిటీష్ పో లీసు ఉన్నతాధికారులను
లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తు న్న విషయం ఈ దాడిలో స్పష్ట మైంది. ఈ మెరుపుదాడి వల్ల
తిరుగుబాటుదారులపై స్థా నికంగా గౌరవం పెరిగింది. సెప్టెంబరు నెలాఖరుకు తిరుగుబాటు దారులకు
పో లీసులు 4 వేర్వేరు ప్రదేశాల్లో ఎదురై దాడి జరుగగా, నాలుగు చోట్లా తిరుగుబాటు దారులు విజయం
సాధించారు. యుద్ధ సమయంలో అల్లూ రి సీతారామరాజు స్థా నిక గిరిజనుల్లో విస్త ృతమైన ప్రా చుర్యాన్ని,
మర్యాదను పొ ందారు. బ్రిటీష్ ప్రభుత్వం ఈ గెరిల్లా యుద్ధా న్ని ఎదుర్కోవడంలో గిరిజనుల సహాయ
నిరాకరణ వల్ల చాలా ఇబ్బందులు పడింది. మరోవైపు తిరుగుబాటు దారులు స్థా నికుల నుంచి పూర్తిగా
సహాయ సహకారాలు పొ ందారు. ఈ సహకారం వల్ల వారు వేగంగా ప్రయాణించడానికి, రహస్య
సమాచారాన్ని పంపించుకోవడానికి, అవసరాన్ని బట్టి దాక్కునేందుకూ, పో లీసుల వివరాలు
రాబట్టు కునేందుకు కూడా అవకాశం లభించింది.

పో లీసుల ఎదురుదాడులు

ఈ వరుస విజయాల వల్ల తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అటవీ


యుద్ధా లకు శిక్షణ పొ ందిన మలబారు పో లీసు కంపెనీని రప్పించింది. వారికి రహస్య రవాణా సౌకర్యాలు,
సమాచార మార్పిడికి వైర్లెస్ సెట్లు అందజేసింది. దాంతో పూర్తిస్థా యి గెరిల్లా యుద్ధా నికి మన్యం ప్రా ంతంలో
తెరలేచింది. తిరుగుబాటు దారులకు అనుకూలతలు లభిస్తు న్నా సుశిక్షితులైన పో లీసులు తీవ్రంగా
దెబ్బతినేలా దాడి చేయగలిగేవారు. డిసెంబర్ 6, 1922న మలబారు పో లీసు దళం తిరుగుబాటు దారులపై
పెదగడ్డ గూడెం గ్రా మ సమీపంలో దాడిచేసి గట్టి దెబ్బతీసింది. నలుగురు తిరుగుబాటుదారులు
మరణించగా, ఇద్ద రు పో లీసులకు దొ రికిపో యారు, మరెందరో తీవ్రగాయాల పాలయ్యారు. వెనక్కితగ్గి
అడవులు, కొండల్లో కి పారిపో తున్న తిరుగుబాటుదారుల్ని పో లీసులు వెంటాడి రాత్రి వేళ మరోదాడి చేశారు.
తిరుగుబాటుదారులు-పో లీసులు రాత్రి కొండల్లో బాహాబాహీ తలపడ్డా రు. 8మంది విప్ల వకారులు
మరణించగా, మరింతమంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన తిరుగుబాటుదారులను కోలుకోలేని
దెబ్బగా బ్రిటీష్ వారు భావించారు. ఇక వారి బెడద క్రమంగా సన్నగిల్లి పో తుందని ఆశించారు. సామాన్య
గ్రా మస్తు ల సహకారంతో తిరుగుబాటుదారులు పో లీసుల వెతుకులాట నుంచి విజయవంతంగా
తప్పించుకోవడమే కాకుండా తమ దళాన్ని విస్త రించగలిగారు.
గ్రా మస్తు ల మీద అణచివేత, మత్తా దారుల లొంగుబాటు

గ్రా మీణులు-తిరుగుబాటుదారుల అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బ్రిటీష్ వారు తిరుగుబాటుదారుల


గురించి సమాచారం అందిస్తే సొ మ్ము ఇస్తా మని రివార్డు లు ప్రకటించారు. సహకరిస్తు న్నందుకు గ్రా మీణుల్ని
శిక్షించేలా అధిక పన్నులు విధించారు. గ్రా మస్తు లను పో లీసు బలగాలు అమానుషమైన చిత్రహింసలకు
గురిచేశారు. అల్లూ రి సీతారామరాజు ఆచూకీ చెప్తే రూ.1500, గమ్ గంటం దొ ర, గమ్ మల్ల య్యదొ రలను
పట్టిస్తే చెరొక వెయ్యి రూపాయలు, పితూరీలో పాల్గొ న్నవారెవరినైనా అప్పగించినా, వారిని అరెస్టు
చేసేందుకు వీలయ్యే సమాచారం అందించిన రూ.50, 303 రైఫిల్ తెచ్చి ఇస్తే రూ.50 ఇస్తా మని
ప్రకటించారు. ప్రా ంతంలో మార్షల్ లా ప్రకటించారు, సహకరిస్తు న్న గ్రా మస్తు లను శిక్షించేందుకు
అనుగుణమైన చట్టా లను అమలులోకి తెచ్చారు. తిరుగుబాటుకు సహకరిస్తు న్నారన్న ఆరోపణపై కొందరు
మత్తా దారులను అరెస్టు చేస,ి చాలామంది మత్తా లను లాగివేసుకున్నారు.

తిరుగుబాటుదారుల ఇళ్ళు, బంధువుల ఇళ్ళు ప్రధాన లక్ష్యాలుగా గూడెంలోని ఇళ్ళలో విస్త ృతంగా సో దాలు
చేశారు. ఐతే వీటన్నిటి వల్లా బ్రిటీష్ వారి పట్ల గ్రా మస్థు లు అనుసరిస్తు న్న సహాయ నిరాకరణ విషయంలో
అంతగా మార్పు రాలేదు. కానీ బ్రిటీష్ వారు గ్రా మస్థు లు తమవైపుకు తిరగడం కన్నా, మత్తా దారులు,
గూడేల పెద్దలు నయానా భయానా తమకు సహకరిస్తా రని అంచనా వేశారు. బ్రిటీష్ వారి అంచనా
సరైనదేనని తర్వాతి పరిణామాలు రుజువు చేశాయి. కొందరు మునసబులు, మత్తా దారులు
తిరుగుబాటుదారులను పట్టించారు. ఏకంగా సీతారామరాజు తర్వాత రెండవ స్థా నంలో ఉన్న గమ్
మల్ల య్యదొ ర ఓ కొండదొ ర యువతి ఇంట్లో దాగి ఉండగా, 1923 సెప్టెంబరులో పో లీసులు పట్టు కున్నారు.
ఐతే ముగ్గు రు మునసబులు ఈ పట్టివేతకు సమాచారాన్ని ఇచ్చారు, తమ వివరాలను ఎక్కడా బయటకు
చెప్పొద్ద నీ, పూర్తిగా తిరుగుబాటు అంతం అయ్యాకే రివార్డు ఇవ్వాలని కోరారు. ఐతే సామాన్య ప్రజలు
మాత్రం తిరుగుబాటుదారులకు పూర్తి బాసటగా నిలిచారు.

సీతారామరాజు కాల్చివేత

తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తు న్న అల్లూ రి సీతారామరాజును 1924 మే 7న పో లీసులు


కాల్చిచంపారు. పో లీసుల కథనం ప్రకారం సీతారామరాజు తప్పించుకుని పారిపో తుండగా పో లీసులు
కాల్చిచంపారు. ఆయన మరణించినప్పుడు తీసిన ఫో టో ఆధారంగా పరిశోధకులు ఇది అవాస్త వమని,
తలపైన, ఛాతిలోనూ తగిలిన బుల్లెట్ దెబ్బలు ఇది పట్టు కుని చంపిన ఘటనగా తేలుస్తు న్నాయని
భావించారు.

లక్ష్యాలు

తిరుగుబాటును నాయకుడు, దళం ఏ లక్ష్యాలతో ప్రా రంభించి నడిపించారన్నది అస్పష్ట ంగానే ఉంది.
అల్లూ రి సీతారామరాజుకు అప్పటికే కాంగస్ ్రె వారి సహాయ నిరాకరణోద్యమంతోనూ, రహస్య
ఉద్యమాలతోనూ సంబంధాలున్నాయని కొందరు చరితక ్ర ారులు భావిస్తు న్నారు. తద్వారా మన్యం
విప్ల వాన్ని కూడా దేశాన్ని విముక్త ం చేసే అంతిమ లక్ష్యంతోనూ, వలస పాలనపై పూర్తి వ్యతిరేకతతోనూ
సీతారామరాజు నిర్మించినట్టు చరితక ్ర ారులు అట్లూ రి మురళి పేర్కొన్నారు. పైగా ఈ తిరుగుబాటు పూర్తిగా
బ్రిటీష్ ప్రభుత్వ వ్యతిరేకతతోనే సాగిందనీ, స్వభావపరంగా మైదాన ప్రా ంత వ్యాపారులు, కాంట్రా క్టర్లకు
వ్యతిరేకంగా లక్ష్యం చేసుకున్నది కాదని ఆయన వాదించారు. ఈ లక్షణాల వల్ల తిరుగుబాటు పూర్వపు
గిరిజనుల తిరుగుబాట్ల కు భిన్నమైనదిగా నిలిచిందని పేర్కొన్నారు.సామాజిక శాస్త వ ్ర ేత్త డేవిడ్ ఆర్నాల్డ్
దీనికి భిన్నంగా వాదిస్తూ ఈ తిరుగుబాటుకు నేపథ్యంగా పూర్వపు తిరుగుబాట్లు ఉన్నాయన్నారు. అల్లూ రి
సీతారామరాజు సాగించిన మన్యం తిరుగుబాటు తర్వాతి కాలంలోని ఆంధ్ర ప్రా ంతంలో
జాతీయోద్యమకారులను, ప్రజలను ఉత్సాహపరిచిందనీ, ఒక విధంగా జాతీయోద్యమానికి ఉత్ప్రేరకంగా
నిలవడంతో వారు దీన్ని స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా స్వీకరించారని పేర్కొంటూ ఐతే తిరుగుబాటు
జరుగుతున్న కాలంలో మాత్రం దీని స్వభావంలో జాతీయోద్యమం, వలస పాలన విముక్తి లేవన్నారు.
పైగా ఈ పో రాటానికి మూలకారణాల్లో బ్రిటీష్ ప్రభుత్వం ఎంత కారణమో, మైదాన ప్రా ంతం వారి దో పిడీ
కూడా అంతే భాగమనీ, ఈ కారణాల వల్ల దీన్ని వలసపాలనకు వ్యతిరేకమైనదిగా లెక్కకట్ట లేమని
పేర్కొన్నారు.ఐతే మురళి తన పక్షాన సీతారామరాజు ఖమ్మం అడవుల మీదుగా, బస్త ర్ పాకిపో యి పెద్ద
ఎత్తు న అటవీ ప్రా ంతపు ఉద్యమాన్ని లేవదీస్తా నని, తద్వారా దేశాన్ని విముక్త ం చేస్తా నని చేసిన వ్యాఖ్యలు,
తొలి పో లీసు స్టేషన్ దాడులు చేసినాకా తిరుగుబాటుదారులు మహాత్మా గాంధీకి జై వంటి నినాదాలు
చేయడం, మద్రా సు శాసనసభలో ప్రశ్నకు పో లీసులు దీన్ని సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా
అభివర్ణించడం వంటివి తన వాదనకు ఆధారంగా ఇచ్చారు

📚
📚
APPSC, TSPSC RRB,SI, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం
వాట్సాప్, టెలిగ్రా మ్, ఫేస్బుక్ గ్రూ ప్స్ లో జాయిన్ అవ్వండి .

🗞️ 📚 📖
📝
డైలీ న్యూస్ పేపర్స్ ,మెటీరియల్స్ ,కరెంట్ అఫైర్స్ ,జాబ్

👇👇👇👇👇👇👇👇
నోటిఫికేషన్.

1.వాట్సప్ లింకు(మెటీరియల్స్+కరెంట్ అఫైర్స్+న్యూస్

👇
పేపర్స్)(ఏదో ఒక వాట్సప్ గ్రూ పులో మాత్రమే జాయిన్
అవ్వండి)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

2.టెలిగ్రా మ్ లింక్(3,000 మెటీరియల్ అప్లో డ్ చేశాము) 👇


గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి
👇
3.ఫేస్బుక్ లింకు(దేశంలో విడుదలవుతున్న మొత్త ం
నోటిఫికేషన్ల కోసం)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి

4.GET LIVE JOBS (కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం) 👇


గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click చేయండి
5. ఉద్యోగ నోటిఫికేషన్లు , ఆన్లైన్ ఫ్రీ ఎగ్జా మ్స్, కరెంట్ అఫైర్స్,

👇
ఆరోగ్యానికి సంబంధించిన సూత్రా లు, A to Z మెటీరియల్స్
కోసం వెబ్సైటు
https://www.prudhviinfo.com/

══════ஜ▲ஜ══════

You might also like