Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

అర్జు న్

సమీక్షలు
సిలికానాంధ్ర మనబడి - డ్యూ 14వ వారం

చీమల కథ
ప్రవేశం 1లో ఒక కథ

పూర్వం, చీమలు కలిసిమెలిసి పనిచేసేవి కావు, ఎప్పటి ఆహారం అప్పుడే తినేసేవి. ఒకసారి, ఒక ఉట్టి మీద
కొన్ని లడ్డు లు ఉన్నాయి, అందుకే ఉట్టి మీదకు వెళ్ళడానికి చీమలు కొట్లా డుకున్నాయి. చివరికి అన్ని తిరిగి పుట్ట లోకి
వెళ్లి పో యాయి, ఆ పుట్ట లో ఒక ముసలి చీమ ఉంది. ముసలి చీమ ఇలా చెప్పింది: “మీరంతా ఇలా గుంపుగా
వెళ్ళకూడదు, క్రమశిక్షణతో ఒకరి తర్వాత ఒకరి వెళ్ళాలి. రాబో యే వానాకాలంకి కూడా ఆహారం దాచిపెట్టు కోవాలి.”
చీమలు అప్పుడు ముసలి చీమ మాట విన్నాయి. మిడత ఆహారం కూడ పెట్టు కోలేదు, అందుకని, చీమలు జాలిపడి
దానికి ఆహారం ఇచ్చాయి.

ఈ కథలో నీతి ఏమిటంటే పెద్దవారి మాటలు వినాలి. క్రమశిక్షణతో కలిసిమెలిసి పని చెయ్యాలి. ముందుచూపుతో
కూడబెట్టటం మంచి అలవాటు. అంతే కాదు మనకు ఉన్నదానిని మనమే అనుభవించ కూడదు. ఎంతో కొంత లేనివారికి
పంచాలి. అలా పంచడంలోని ఆనందం అంతా ఇంతా కాదు.

ఈ కథ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈ కథ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఈ కథలో రచయిత చెప్పిన
విధానం చాలా బాగుంది. మనము అది సులభంగా అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు మంచి విషయాలు నేర్చుకోవచ్చు.
ఈ కథ సరదాగా కూడా ఉంది, అందుకే నాకు నచ్చింది.

చీమలు నిజంగానే క్రమశిక్షణగా ఉంటాయి. ఆహారం కోసం వరుసగా వెళ్తా యి. అది చూసి నాకు ఆశ్చర్యం
కలుగుతుంది. ఈ కథలో రచయిత చీమలు ఆహారం కూడ పెట్టు కుని మంచి పని చేసాయి అని చెప్పడానికి మిడతను
ఉదాహరణగా తీసుకున్నారు. అలాగే చీమల సహాయం చేసే గుణాన్ని తెలిపాడు.

చీమలు, ముసలి చీమ మాట విని, క్రమశిక్షణగా ఉన్నాయి. అలాగే మనము కూడా మన పెద్దవారు చెప్పిన
మాట వినాలి. చీమలు ఆహారం చలికాలం, వానాకాలంకోసం దాచిపెట్టు కున్నాయి. అలాగే, మనము కూడా డబ్బులు
ఒకేసారి ఖర్చుచేయకుండా, దాచిపెట్టు కోవాలి. మనము కూడా చీమలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణగా ఉండాలి.

1
అర్జు న్

మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ, మన భారతదేశానికి జాతి పిత. మహాత్మా గాంధీ పూర్తిపేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో ప్రధాన పాత్ర పో షించాడు. సత్యము, అహింసతో స్వాతంత్ర్యం కొరకు పో రాడాడు.
దక్షిణ ఆఫ్రికాలో గాంధీకి “మహాత్మా గాంధీ” అనే పేరు ఇచ్చారు. ప్రపంచంలో అందరికి స్వతంత్రం మరియు హక్కుల
పో రాటాలకు స్ఫూర్తి దాయకంగా నిలిచాడు.

గాంధీ అక్టో బర్ 2, 1869లో పో ర్ బందర్, గుజరాత్ లో జన్మించారు. గాంధీ లండన్ లో యూ.సి.ఎల్ మరియు
ఇన్స్ అఫ్ కోర్ట్ స్కూల్ అఫ్ లాలో చదువుకున్నాడు. గాంధీ దక్షిణ ఆఫ్రికాలో లాయర్ గా పనిచేసాడు. దక్షిణ ఆఫ్రికాలో
ఆఫ్రికా జాతీయుల, భారతీయుల హక్కుల కోసం పో రాడాడు. గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరాడు. సహాయ
నిరాకరణ, సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమాలతో ఇండియాకి స్వతంత్రం తీసుకువచ్చాడు.

గాంధీ నాలాంటి మనుషులను ఎంతోమందిని ప్రభావితము చేసాడు. గాంధీ ఎప్పుడు సత్యం పలికాలి అని
చెప్పాడు. గాంధీ అహింసతో భారతదేశానికి స్వతంత్రం తీసుకు వచ్చారు. గాంధీ శాకాహారి, మాంసం తినడు. సంకల్పం
ఉంటే ఏదయినా సాధించవచ్చు. గాంధీని చూసి మనము చాలా నేర్చుకోవచ్చు.

గాంధీ పుట్టిన రోజుని గాంధీ జయంతి అని అంటారు. గాంధీ “నోబెల్ పీస్ ప్రైజ్”కి 5 సార్లు నామినేట్ అయ్యాడు,
కానీ ఎప్పుడూ రాలేదు. లియో టాల్స్టాయ్ గాంధీకి స్నేహితుడు. గాంధీ అహింసని పాటిస్తూ ఉపవాసం చేసాడు. నాథురాం
గాడ్సే గాంధీని జనవరి 30 1948 రోజు చంపేసాడు. గాంధీ చనిపో యే ముందు “హే రామ” అని అన్నాడు.

మహాత్మా గాంధీ చాలా గొప్పవారు. అందుకే, భారతదేశంలో, అందరు గాంధీని “బాపు” అని అంటారు (హిందీలో
తండ్రి). గాంధీ జీవితాన్ని ఆశయంగా తీసుకుని మనము జీవించాలి. గాంధీ ఎంతో కష్ట పడి మనకి స్వాతంత్ర్యం
తీసుకువచ్చారు. మనము చేసే ప్రతి పనిలో సత్యము మరియు అహింస అలవర్చుకోవాలి.

You might also like