Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 31

పీరియడ్ ప్లాన్

------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 5 రోజు: 1

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.

2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.

3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.

4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు

● కుటుంబంలో ఎవరెవరు ఉంటారో వివరించగలరు.

● కొన్ని కుటుంబాలలో కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడానికి గల కారణాలు చెప్పగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు

కుటుంబం, కుటుంబ సభ్యులు, పోలికలు, బంధువులు

V. ఉన్ముఖీకరణ

● మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?

● మీ మామయ్య కొడుకును మీరు ఏమని పిలుస్తారు?

● మీ కుటుంబ సభ్యులను ఏమని పిలుస్తారు?

[106] | పరిసరాల విజ్ఞా నం |

VI. కృత్యాల నిర్వహణ

1. విద్యార్థుల కుటుంబ సభ్యులను తెలియజేసే కింది పట్టికను పూరింపజేయండి.

పేరు

నీ పేరు

తండ్రి

తల్లి

అన్న/ తమ్ముడు

చెల్లి/ అక్క

పిన్ని/ బాబాయి

2. విద్యార్థులు వారి మిత్రులను అడిగి వారి కుటుంబ వివరాలను పట్టికలో చూపినవిధంగా రాయమని చెప్పండి.
మిత్రుని పేరు కుటుంబ సభ్యుల పేరు కుటుంబ సభ్యుల సంఖ్య

3. వారి అమ్మ/ నాన్నను అడిగి కింది విషయాలలో వారు ఎవరి పోలికతో ఉంటారో రాయమని చెప్పండి.
అంశం ఎవరి పోలిక
నడక

రంగు

నవ్వు

జుట్టు

VII. మూల్యాంకనం

1. మీ కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటారు?

2. మీ నడక ఎవరిలాగా ఉంటుంది?

3. మీ మిత్రుల కుటుంబాలలో ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబం ఏది?

సూచన: L1 లోని వర్కుషీట్ నెం.1ను పూర్తి చేయించాలి.

[107] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4
పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 5 రోజు: 2
------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు
1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.

2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.

3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.

4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు
● కుటుంబంలో ఎవరు ఎవరికి ఏం అవుతారో వివరించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు
అత్తమ్మ, మామ, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, పిన్ని, వదిన
V. ఉన్ముఖీకరణ
● మీ ఇంట్లో మీరు ఎవరిని పోలి ఉంటారు?

● మీ తాతయ్యకు మీకు ఏ విషయాల్లో పోలికలు ఎక్కువగా ఉన్నాయి?

VI. కృత్యాల నిర్వహణ
1. ఉపాధ్యాయులు కింది చిత్రం ఆధారంగా ఎవరికి ఎవరు ఏమవుతారో చర్చింపజేసి వాటిని నల్లబల్లపై
రాసి, పిల్లల నోటుపుస్తకంలో రాయించాలి.

[108] | పరిసరాల విజ్ఞా నం |

2. పిల్లలచే వారి కుటుంబంలో బంధుత్వాలను చెప్పించి, వ్యక్తిగతంగా నోటుపుస్తకంలో రాయించాలి.

విద్యార్థి పేరు బంధుత్వం బంధువు పేరు

3. ఎవరెవరి కుటుంబంలో చిన్నమ్మ, చిన్నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న ఉన్నారో చర్చింపజేసి, వ్యక్తిగతంగా

వారి నోటుపుస్తకంలో రాయించాలి. పట్టికలో గల బంధుత్వాలు లేని పిల్లలతో అందుకు గల
కారణాలు చర్చించాలి.

బంధుత్వం పేరు
చిన్నమ్మ

చిన్నాన్న

పెద్దమ్మ

పెద్దనాన్న

VII. మూల్యాంకనం

1. మీ నాన్న చెల్లెలు మీకు ఏం అవుతారు?

2. మామ అని ఎవరిని పిలుస్తారు?

3. మీ చిన్నమ్మ కొడుకు మీకేమవుతాడు?

సూచన: L1 లోని వర్కుషీట్ నెం.1ను పూర్తి చేయించాలి.

[109] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4
పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 5 రోజు: 3
------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు
1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.

2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.

3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.

4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు

● కుటుంబంలో కొత్త సభ్యుల (పిల్లలు పుట్టడం) చేరిక వల్ల కలిగే మార్పులను వివరించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు

కుటుంబ సభ్యులు, కొత్త సభ్యుల చేరిక, అమ్మ చేసే పనులు

V. ఉన్ముఖీకరణ
● మీ అక్క భర్త మీకు ఏమౌతారు?

● ఎవరిని వదిన అని పిలుస్తారు?

● నాన్న చెల్లెలు మీకు ఏమౌతుంది?

VI. కృత్యాల నిర్వహణ

1. పిల్లలచే పాఠ్యపుస్తకంలోణి పేజి నెంబర్ 1, 2 లోని చిత్రాలను పరిశీలింపజేసి, పేజి నెంబర్ 2లో
ఉన్న ప్రశ్నలను జట్లలో చర్చించండి. వారిచ్చిన సమాధానాలను నల్లబల్లపై రాయండి.

[110] | పరిసరాల విజ్ఞా నం |

2. 'కుటుంబంలో కొత్త సభ్యుల చేరిక వలన ఇంట్లో ఏయే మార్పులు వస్తాయి?' వారి అభిప్రాయాలను

జట్లలో చర్చించి రాయించాలి.

3. చిన్న పాప పుట్టక ముందు, తరువాత ఇంట్లో చేసే పనుల పట్టికను తయారు చేయించాలి.

పాప పుట్టక ముందు పాప పుట్టిన తరువాత

VII. మూల్యాంకనం

1. ఇంట్లో చిన్న పాప చేరిక వలన ఏయే మార్పులు గమనించారు?

2. పాప పుట్టిన తరువాత అమ్మ చేసే ఏ ఏ పనులు పెరిగాయి ? తగ్గాయి ?

3. అమ్మ కొత్తగా చేసే పనులు ఏమిటి?

సూచన: L2 లోని వర్కుషీట్ నెం.1ను పూర్తి చేయించాలి.

[111] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4
పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 5 రోజు: 4
------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు
1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.
2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.
3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.
4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.
II. సూక్ష్మ సామర్థ్యాలు
● పెళ్ళి వల్ల కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.
III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!
IV. కీలక పదాలు
పెళ్ళి, బంధువులు, వధువు, వరుడు
V. ఉన్ముఖీకరణ
● చిన్న పాప పుట్టడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్యలో ఏ మార్పు వస్తుంది?
● చిన్న పాప / బాబు చేరడం వల్ల కుటుంబ పనుల్లో వచ్చే మార్పులు ఏవి?
● కుటుంబంలో అమ్మ పనులలో ఎలాంటి మార్పు వస్తుంది?
VI. కృత్యాల నిర్వహణ
1. పెళ్ళి ఫోటో తరగతిగదిలో ప్రదర్శించి, పెళ్ళి తర్వాత కుటుంబంలో వచ్చే మార్పులను గురించి
చర్చించాలి. ఉదా: పెళ్ళి వల్ల కుటుంబ సభ్యుల సంఖ్యలో మార్పు, కుటుంబ సభ్యులు చేసే పనులలో
మార్పు బంధుత్వాలను జట్లలో చర్చించండి.
2. అన్న/ అక్క పెళ్ళి తరువాత కుటుంబంలో వచ్చిన మార్పులను జట్లలో చర్చింపజేసి పట్టికలో
రాయించాలి.
* అక్క పెళ్ళి తరువాత కుటుంబాలలో వచ్చే మార్పు
* అన్న పెళ్ళి తరువాత కుటుంబాలలో వచ్చే మార్పు
అక్క పెళ్ళి తరువాత కుటుంబంలో వచ్చే అన్న పెళ్ళి తరువాత కుటుంబంలో వచ్చే
మార్పులు మార్పులు

[112] | పరిసరాల విజ్ఞా నం |

3. పెళ్ళి తరువాత ఏర్పడిన కొత్త బంధుత్వాల గురించి ఒక్కొక్కరితో మాట్లాడించాలి. కుటుంబ సభ్యులు

చేసే పనిలో వచ్చే మార్పులను చెప్పించాలి.

VII. మూల్యాంకనం

1. పెళ్ళి తరువాత కుటుంబంలో మీరు ఏ మార్పులు గమనించారు?

2. పెళ్ళి తరువాత కుటుంబంలో ఏర్పడు కొత్త బంధుత్వాలు ఏవి?

3. పెళ్ళి తరువాత కొత్తగా చేరిన వారు ఎవరు?

సూచన: L2 లోని వర్కుషీట్ నెం.1ను పూర్తి చేయించాలి.

[113] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4
పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 5 రోజు: 5
------------------------------------------------------------------

I. అభ్యసన ఫలితాలు

1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.

2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.

3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.

4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు

● కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కుటుంబంలో జరిగే మార్పులను గురించి వివరించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు

పదోన్నతి, బదిలీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, వలస

V. ఉన్ముఖీకరణ

● కుటుంబంలో మార్పులు ఎందుకు జరుగుతాయి?

● పెళ్ళి తరువాత మీ కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి ఎవరు?

● పెళ్ళి తరువాత కుటుంబంలో ఏయే మార్పులు జరిగాయి?

VI. కృత్యాల నిర్వహణ

1. కుటుంబం కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు జరిగే మార్పులను గురించి జట్లలో చర్చించండి.

2. పాఠ్యపుస్తకం పేజి నెంబర్ 3, 4 ఆధారంగా విద్యార్థులతో చర్చించాలి.

* కుటుంబ సభ్యుల సంఖ్యలో మార్పు

* కుటుంబ సభ్యులు చేసే పనులలో మార్పులు

[114] | పరిసరాల విజ్ఞా నం |

3. పాఠ్యపుస్తకం పేజి నెంబర్ 5లో గల పట్టికను జట్లలో రాయించాలి. ఒక్కొక్కరిని అడిగి విద్యార్థుల

అభిప్రాయాలను నల్లబల్లపై నమోదు చేయాలి.

VII. మూల్యాంకనం

1. కుటుంబం కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు జరిగే మార్పులను తెలపండి.

2. మీ గ్రామానికి/వీధికి కొత్త కుటుంబం వస్తే మీరు వారికి ఏవిధంగా సహాయం చేస్తారు?

సూచన: L2 లోని వర్కుషీట్ నెం.2ను పూర్తి చేయించాలి.

[115] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4
పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 6 రోజు: 1
------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు
1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.
2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.
3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.
4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.
II. సూక్ష్మ సామర్థ్యాలు
● కుటుంబాలు నాడు, నేడు ఏవిధంగా ఉన్నాయో పోల్చగలరు.
III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!
IV. కీలక పదాలు
నాడు, నేడు, ఉమ్మడి కుటుంబాలు, వ్యష్టి కుటుంబాలు
V. ఉన్ముఖీకరణ
● కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కుటుంబంలో వచ్చే మార్పులు ఏమిటి?
● మీ గ్రామానికి కొత్తగా వచ్చిన కుటుంబంలో ఎలాంటి మార్పులు జరిగాయి?
● మీ కుటుంబం మీ గ్రామం నుండి మరో
గ్రామానికి మారినదా? మారితే మీ
అనుభవాలు తెలపండి.
VI. కృత్యాల నిర్వహణ
1. ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల
చిత్రాలను ప్రదర్శించి - పిల్లలచే చిత్రాలను
పరిశీలింపజేసి, వారి అభిప్రాయాలను
వ్యక్తపరచమనాలి.
(కుటుంబాలు ఉమ్మడిగా, వ్యష్టి
కుటుంబాలుగా ఉండడానికి కారణాలు
చెప్పించాలి.)

[116] | పరిసరాల విజ్ఞా నం |

2. పాఠ్యపుస్తకం పేజి నెంబర్ 6 ఆధారంగా జట్లలో చర్చింపజేసి, పిల్లల ప్రతిస్పందనలను నల్లబల్లపై
నమోదు చేయాలి. పట్టికలో రాయించాలి.

కుటుంబాలు నాడు కుటుంబాలు నేడు

3. పిల్లలతో కుటుంబ వ్యవస్థ గురించి చర్చిస్తూ వారి కుటుంబాల వివరాలు- ఉమ్మడి కుటుంబం/ వ్యష్టి
కుటుంబంగా వేరు చేసి నమోదు చేయించాలి.

విద్యార్థి పేరు ఉమ్మడి / వ్యష్టి కుటుంబం

VII. మూల్యాంకనం

1. మీది ఏ రకమైన కుటుంబం? ఎందుకు?

2. మీ తరగతిలో తాత, అమ్మమ్మ ఎవరెవరి కుటుంబాలలో ఉన్నారు ?

3. తాత/ నానమ్మ వేరుగా నివసించడానికి కారణాలు చెప్పండి.

సూచన: L2 లోని వర్కుషీట్ నెం.2ను పూర్తి చేయించాలి.

[117] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4
పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 6 రోజు: 2
------------------------------------------------------------------

I. అభ్యసన ఫలితాలు
1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.

2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.

3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.

4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు
● ఇంట్లో ఉపయోగించే వివిధ రకాల గృహోపకరణాల ఉపయోగాలను వివరించగలరు.

● గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు
గృహోపకరణాలు, మిక్సి, కుక్కర్, వాషింగ్ మిషన్

V. ఉన్ముఖీకరణ
● పూర్వ కాలపు కుటుంబాలలో, నేటి కుటుంబాలలో మీరు గమనించిన మార్పులేమిటి?

● మీకు ఎలాంటి కుటుంబం అంటే ఇష్టం?

● మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? మీ కుటుంబంలోని మిగతా సభ్యులు ఎక్కడ ఉంటారు?

VI. కృత్యాల నిర్వహణ

1. వివిధ గృహోపకరణాల చిత్రాలను ప్రదర్శించి వాటి ఉపయోగాల గురించి విద్యార్థుల వ్యక్తిగత

అనుభవాలను చర్చించాలి. గృహోపకరణాల పేర్లు, వాటి ఉపయోగాలను నల్లబ్లపై రాయాలి.

2. పూర్వ కాలంలో వినియోగించబడిన గృహోపకరణాల చిత్రాలను ప్రదర్శించి (విసురురాయి, రోకలి

మొదలగునవి) చర్చించండి.

[118] | పరిసరాల విజ్ఞా నం |

3. పేజి నెంబర్ 7, 8లో ఇవ్వబడిన కృత్యాలను విద్యార్థులతో చర్చించి, వారి ప్రతిస్పందనలను

నల్లబల్లపై రాసి విద్యార్థులచే ఒక్కొక్కరిగా చదివించాలి. నోటుపుస్తకాలలో రాయించాలి.

4. ఏదైనా గృహోపకరణం చిత్రాన్ని గీసి రంగులు వేసి, దాని పేరు మరియు ఉపయోగాలు రాయించాలి.

VII. మూల్యాంకనం

1. అన్నం వండడానికి అమ్మ ఉపయోగించే గృహోపకరణం ఏది?

2. గ్రైండర్ మీ కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది?

3. మీకు గాలిని ఇచ్చే ఉపకరణం ఏది? అది ఎలా పని చేస్తుంది?

సూచన: L2 లోని వర్కుషీట్ నెం.3ను పూర్తి చేయించాలి.

[119] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------

విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 6 రోజు: 3

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.

2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.

3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.

4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

II. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

III. అభ్యాస కృత్యాల నిర్వహణ

1. పాఠ్యపుస్తక అభ్యాసం

తరగతి కృత్యం:

● ఉపాధ్యాయుడు తరగతిలో విద్యార్థులను ఒక్కో ప్రశ్నను అడగాలి. విద్యార్థుల ప్రతిస్పందనలను

నల్లబల్లపై రాయాలి. వారి ప్రతిస్పందనల ఆధారంగా సరైన సమాధానాలను తయారుచేసి,

విద్యార్థుల చేత రెండుసార్లు చదివించి, వారి నోటుపుస్తకంలో రాయించాలి.

(అన్ని ప్రశ్నలకు ఇలాగే సమాధానాలు తయారు చేయాలి.)

[120] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------

విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: కుటుంబ వ్యవస్థ - మార్పులు వారం: 6 రోజు: 4

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.

2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.

3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.

4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

II. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

III. అభ్యాస కృత్యాల నిర్వహణ

● ‘ప్రశ్నించడం మరియు పరికల్పనలు చేయడం’

1. పాఠ్యపుస్తకంలో ఇచ్చిన పట్టిక ఆధారంగా విద్యార్థులను వ్యక్తిగతంగా ప్రశ్నలను తయారు

చేయమని అడగాలి. ఆ ప్రశ్నలను నల్లబల్లపై రాయాలి. విద్యార్థులచే వారి నోటుపుస్తకాలలో

రాయించాలి.

2. విద్యార్థులు ఇంటి వద్ద చేసే పనుల గురించి ప్రశ్నించి సమాచారాన్ని సేకరించాలి. వారి

ప్రతిస్పందనలను నల్లబల్లపై రాయాలి. వాటిని వారి పుస్తకాలలో రాయించాలి.

[121] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------

విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: వ్యవసాయం - పంటలు వారం: 6 రోజు: 5

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. కుటుంబంలో వచ్చే మార్పులను వివరించగలరు.

2. కుటుంబంలో వచ్చే మార్పులకు గల కారణాలను తెలపగలరు.

3. గృహోపకరణాల ఉపయోగాలను తెలుసుకోగలరు.

4. వివిధ గృహోపకరణాల బొమ్మలు గీయగలరు.

II. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

III. అభ్యాస కృత్యాల నిర్వహణ

● ‘సమాచార సేకరణ - ప్రాజెక్టు పని’ లోని అభ్యాసాలు చేయించడం.

1. ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి తరగతిగదిలో ఫలితాన్ని

రాయించాలి.

2. చార్టు పైన కుటుంబ సభ్యుల చిత్రాలను గీయించి వారు చేసే వృత్తిని రాయించాలి.

3. వారి ఇళ్లలో వాడే ఏదేని ఒక గృహోపకరణం నమూనాను తయారుచేయించాలి లేదా చిత్రాన్ని

గీయించాలి.

[122] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: ఆటలు నియమాలు వారం: 5 రోజు: 1

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు
1. ఆటలో మరియు నిత్యజీవితంలో నియమాల అవసరాన్ని వివరించగలరు.

2. చూసిన/ ఆడిన ఆట గురించి వరుస క్రమంలో వివరించగలరు.

3. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరగడానికి గల కారణాలు చెప్పగలరు.

4. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారుల వివరాలు సేకరించి పట్టిక తయారు చేయగలరు.

5. ఆటలు ఆడడంలో ఆడ, మగ భేదం ఉండదని గుర్తించగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు
● ఆట వస్తువులతో ఆడే ఆటకు ఉదాహరణలు ఇవ్వగలరు.

● స్థానికంగా ఆడే ఆటల గురించి వివరించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు
ఆటలు, తొక్కుడు బిళ్ళ, ఆట వస్తువులు, ఇంట్లో ఆడే ఆటలు, బయట ఆడే ఆటలు
V. ఉన్ముఖీకరణ
1. మీరు ఆడే ఆటలేవి?

2. వాటిలో వేటికి ఆటవస్తువులు అవసరం లేదు?

VI. కృత్యాల నిర్వహణ
4. వివిధ రకాల ఆట వస్తువులు, క్రికెట్ బ్యాట్, బాల్, ఫుట్ బాల్, టెన్నిస్ బ్యాట్ , షటిల్ కాక్ వంటివి

సేకరింపజేసి తరగతిగదిలో ప్రదర్శించాలి. పిల్లలచే వాటి గురించి మాట్లాడించాలి.

[123] | పరిసరాల విజ్ఞా నం |

5. స్థానికంగా ఆడే ఆటల పేర్లు (తొక్కుడు బిళ్ళ, దాగుడుమూతలు వంటివి) నల్లబల్లపై రాసి వాటిని ఆడే

విధానం ఒక్కొక్కరిచే చెప్పించాలి.

6. తొక్కుడు బిళ్ళ ఆటను వారి చేత ఆడించాలి.

VII. మూల్యాంకనం

1. మీరు ఆడే ఆటలలో స్థానిక ఆటలేవి?

2. మీరు ఆడే ఆటల్లో ఉపయోగించే ఆట వస్తువులు చెప్పండి.

[124] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: ఆటలు నియమాలు వారం: 5 రోజు: 2

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. ఆటలో మరియు నిత్యజీవితంలో నియమాల అవసరాన్ని వివరించగలరు.

2. చూసిన/ ఆడిన ఆట గురించి వరుస క్రమంలో వివరించగలరు.

3. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరగడానికి గల కారణాలు చెప్పగలరు.

4. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారుల వివరాలు సేకరించి పట్టిక తయారు చేయగలరు.

5. ఆటలు ఆడడంలో ఆడ, మగ భేదం ఉండదని గుర్తించగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు

● స్థానికంగా ఆడే ఆటల గురించి వివరించగలరు.

● ఆట వస్తువులతో, ఆట వస్తువులు లేకుండా ఆడే ఆటలను వర్గీకరించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు

రకరకాల ఆటలు, ఆటల పోటీలు, ఆట వస్తువులు, ప్రశంస

V. ఉన్ముఖీకరణ

● పిల్లలు ఆడే ఆటలు ఏవి?

● పూర్వ కాలంలో ఆడే ఆటలు ఏవి?

[125] | పరిసరాల విజ్ఞా నం |

VI. కృత్యాల నిర్వహణ

1. వివిధ ఆటలు ఆడే చార్టును ప్రదర్శించి ఒక్కొక్క జట్టుతో చార్టులోని ఒక్కో ఆటల గురించి
మాట్లాడించాలి. విద్యార్థులు చెప్పినవి నల్లబల్లపై రాయాలి.
2. విద్యార్థులను గ్రూపులుగా చేసి వరుసగా ఆటల పేర్లు రాయించాలి. వాటిని ఇంట్లో ఆడే ఆటలు,
బయట ఆడే ఆటలుగా వర్గీకరించి పట్టికలో రాయించాలి.

ఇంట్లో ఆడే ఆటలు ఆరుబయట ఆడే ఆటలు

3. వారు ఆడే ఆటలో ఏదైనా ఆటకు చెందిన ఆట వస్తువుల బొమ్మలు గీయించాలి.

ఉదా:

VII. మూల్యాంకనం

1. వివిధ రకాల ఆటల పేర్లు చెప్పండి.

2. ఆట వస్తువులలో ఆడే ఆటలకు ఉదాహరణలు చెప్పండి.

3. ఇంట్లో ఆడే ఆటల పేర్లు చెప్పండి.

[126] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: ఆటలు నియమాలు వారం: 5 రోజు: 3

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. ఆటలో మరియు నిత్యజీవితంలో నియమాల అవసరాన్ని వివరించగలరు.

2. చూసిన/ ఆడిన ఆట గురించి వరుస క్రమంలో వివరించగలరు.

3. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరగడానికి గల కారణాలు చెప్పగలరు.

4. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారుల వివరాలు సేకరించి పట్టిక తయారు చేయగలరు.

5. ఆటలు ఆడడంలో ఆడ, మగ భేదం ఉండదని గుర్తించగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు

● ఆటలు ఆడడం పిల్లలకు ఎంతో ఇష్టం అని గుర్తించగలరు.

● స్థానిక ఆటలు, ఇతర ఆటల గురించి వివరించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు

ఆటలు, బయట ఆడే ఆటలు, ఇంట్లో ఆడే ఆటలు, కొత్త ఆటలు

V. ఉన్ముఖీకరణ

● మీరు ఆడే ఆటల పేర్లు చెప్పండి.

● ఆటలు ఎందుకు ఆడాలి?

● మీరు ఏ సమయంలో ఆటలు ఆడుతారు?

[127] | పరిసరాల విజ్ఞా నం |

VI. కృత్యాల నిర్వహణ

1. విద్యార్థులను జట్లుగా చేసి ఒక్కో ఆటకు చెందిన చిత్రాన్ని ఒక్కో జట్టుకు ఇవ్వాలి. చిత్రంలోని ఆటను

గురించి విద్యార్థులు జట్లలో చర్చించాలి (ఆట పేరు, ఆడే విధానం). ఒక్కొక్క గ్రూపుచే వారి

చిత్రంలోని ఆట గురించి మాట్లాడించాలి.

2. దాగుడుమూతలు, వీరివీరి గుమ్మడి పండు వంటి ఆటలు ఆడే విధానం చెప్పించాలి.

3. విద్యార్థులకు జట్లుగా చేసి వారు ఆడే ఆటలు వారి అమ్మా నాన్నలు ఆడిన ఆటలను రాయించి

ప్రదర్శింపజేయాలి.

మీరు ఆడే ఆటలు మీ అమ్మా నాన్న చిన్నతనంలో ఆడిన ఆటలు

VII. మూల్యాంకనం

1. మీకు ఆటలు ఆడడం ఇష్టం, ఎందుకు?

2. ఆరు బయట ఆడే ఆటల పేర్లు చెప్పండి.

3. ఆటలు ఆడకపోతే ఏమౌతుంది?

[128] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: ఆటలు నియమాలు వారం: 5 రోజు: 4

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. ఆటలో మరియు నిత్యజీవితంలో నియమాల అవసరాన్ని వివరించగలరు.

2. చూసిన/ ఆడిన ఆట గురించి వరుస క్రమంలో వివరించగలరు.

3. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరగడానికి గల కారణాలు చెప్పగలరు.

4. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారుల వివరాలు సేకరించి పట్టిక తయారు చేయగలరు.

5. ఆటలు ఆడడంలో ఆడ, మగ భేదం ఉండదని గుర్తించగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు

● ఆటలు ఆడడానికి నియమాలు ఉంటాయని వివరించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు

కబడ్డీ, పాయింట్, అవుట్, తొక్కుడు గీత, మధ్య గీత

V. ఉన్ముఖీకరణ

● మీరు ఏయే ఆటలు ఆడుతారు?

● ఆటలు అన్నీ ఒకే రకంగా ఆడుతారా? ఎందుకు?

● ఎక్కువ మంది ఆడే ఆటల పేర్లు చెప్పండి.

[129] | పరిసరాల విజ్ఞా నం |

VI. కృత్యాల నిర్వహణ

1. కబడ్డీ ఆట ఆడే విధానాన్ని పిల్లలచే జట్లలో చర్చింపజేయాలి (ఆట ఆడే వారి సంఖ్య, ఆడే విధానం).

'గొడవ జరిగినపుడు ఎవరు పరిష్కరిస్తారు?' ఏయే నియమాలతో ఆడతారో చర్చించాలి.

2. వారు ఆడే ఆటల పేర్లు - ఆట ఆడే వారి సంఖ్యను తెలిపే పట్టికను జట్లలో తయారు చేయించాలి.

ఆట పేరు ఆట ఆడే వారి సంఖ్య

3. స్కూల్ బెల్, ట్రాఫిక్ సిగ్నల్ లైట్, జీబ్రా క్రాసింగ్ చూపే చిత్రాలను జట్లలో ఇచ్చి పరిశీలింపజేయాలి.

వారి పరిశీలనలను చెప్పించాలి.

4. విద్యార్థులచే ట్రాఫిక్ సిగ్నల్స్/ జీబ్రా క్రాసింగ్ చిత్రాలు గీయించి, సిగ్నల్ లోని లైట్ల గురించి

రాయించాలి.

ఎరుపు = ఆగుము

VII. మూల్యాంకనం

1. ఆటల్లో గొడవలు ఎందుకు వస్తాయి?

2. ఆటలు ఎలాంటి గొడవ లేకుండా ఆడాలంటే ఏం చేయాలి?

సూచన: L2 లోని వర్కుషీట్ నెం. 5.

[130] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: ఆటలు నియమాలు వారం: 5 రోజు: 5

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. ఆటలో మరియు నిత్యజీవితంలో నియమాల అవసరాన్ని వివరించగలరు.

2. చూసిన/ ఆడిన ఆట గురించి వరుస క్రమంలో వివరించగలరు.

3. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరగడానికి గల కారణాలు చెప్పగలరు.

4. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారుల వివరాలు సేకరించి పట్టిక తయారు చేయగలరు.

5. ఆటలు ఆడడంలో ఆడ, మగ భేదం ఉండదని గుర్తించగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు

● ఆటలు ఆడ, మగ అనే భేదం లేకుండా ఆడవచ్చునని గుర్తించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు

అష్టా చెమ్మా, క్రికెట్, వాలీబాల్, జాతీయ క్రీడలు, ఆసియా క్రీడలు

V. ఉన్ముఖీకరణ

1. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరిగితే మీరెలా పరిష్కరిస్తారు?

2. మనకు నియమాలు ఏ విధంగా సహాయపడతాయి?

VI. కృత్యాల నిర్వహణ

1. క్రికెట్, టెన్నిస్, చదరంగం, మహిళలు-పురుషులు ఆడే చిత్రాలను/ పేపర్ కట్టింగ్స్ సేకరించి

విద్యార్థులను జట్లుగా చేసి ఒక్కో జట్టుకు ఒక్కోఆట చిత్రాన్ని ఇచ్చి మాట్లాడింపజేయాలి (చిత్రంలో
ఎవరు ఆడుతున్నారు, ఏ ఆట మొదలగు అంశాలు).

[131] | పరిసరాల విజ్ఞా నం |

2. తరగతిగదిలోని అమ్మాయిలు ఏయే ఆటలు ఆడుతారో జాబితా అబ్బాయిలతో రాయించాలి.

ప్రదర్శింపజేయాలి.

3. భారతదేశం నుండి వివిధ క్రీడలలో పాల్గొనే క్రీడాకారుల చిత్రాలు జట్లుగా విద్యార్థులచే సేకరింపజేసి

(పేపర్ కట్టింగ్స్) అతికించి, చిత్రం గురించి 2 లేదా 3 వాక్యాలు రాయించాలి.

VII. మూల్యాంకనం

1. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆడే ఆటల పేర్లు చెప్పండి.

2. ఏ ఆటనైనా ఎవరైనా ఆడవచ్చా? ఎందుకు?

సూచన: L2 లోని వర్కుషీట్ నెం. 5.

[132] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: ఆటలు నియమాలు వారం: 6 రోజు: 1

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. ఆటలో మరియు నిత్యజీవితంలో నియమాల అవసరాన్ని వివరించగలరు.

2. చూసిన/ ఆడిన ఆట గురించి వరుస క్రమంలో వివరించగలరు.

3. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరగడానికి గల కారణాలు చెప్పగలరు.

4. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారుల వివరాలు సేకరించి పట్టిక తయారు చేయగలరు.

5. ఆటలు ఆడడంలో ఆడ, మగ భేదం ఉండదని గుర్తించగలరు.

II. సూక్ష్మ సామర్థ్యాలు

● ఆటల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని గుర్తించగలరు.

III. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

IV. కీలక పదాలు

గెలుపు, ఓటమి, క్రీడా స్ఫూర్తి, పతకాలు

V. ఉన్ముఖీకరణ

● ఆటలు ఎవరైనా ఆడవచ్చా?

● ఎక్కువ మంది ఆడే ఆటల పేర్ల చెప్పండి.

● పెద్దవాళ్ళు ఏవైనా ఆటలు ఆడుతారా? వాటి పేర్లు చెప్పండి.

[133] | పరిసరాల విజ్ఞా నం |

VI. కృత్యాల నిర్వహణ

1. కింది వాటిని ప్రదర్శించండి. వాటి ఆధారంగా ప్రశ్నలు అడగండి.

● వీటిని ఏమంటారు?
● ఎవరికి ఇస్తారు?
● ఎందుకు ఇస్తారు?
2. విద్యార్థులు ఆటలు ఆడినపుడు గెలిస్తే ఎలా ఉంటారు? ఓడినప్పుడు ఎలా ఉంటారు అడిగి
చర్చించాలి.
3. వారు ఆటల్లో గెలిచినపుడు పొందిన బహుమతుల చిత్రాలు గీయించండి.

VII. మూల్యాంకనం

1. ఆటల్లో బహుమతులు ఎప్పుడు పొందుతారు?

2. ఓడిన వారితో ఎలా ఉండాలి?

3. క్రీడా స్ఫూర్తిని ఎలా పెంపొందించాలి?

సూచన: L2 లోని వర్కుషీట్ నెం. 6.

[134] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: ఆటలు నియమాలు వారం: 6 రోజు: 2

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. ఆటలో మరియు నిత్యజీవితంలో నియమాల అవసరాన్ని వివరించగలరు.

2. చూసిన/ ఆడిన ఆట గురించి వరుస క్రమంలో వివరించగలరు.

3. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరగడానికి గల కారణాలు చెప్పగలరు.

4. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారుల వివరాలు సేకరించి పట్టిక తయారు చేయగలరు.

5. ఆటలు ఆడడంలో ఆడ, మగ భేదం ఉండదని గుర్తించగలరు.

II. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

III. అభ్యాస కృత్యాల నిర్వహణ

కృత్యం-1:

● ‘విషయావగాహన’లో ఒక్కో ప్రశ్నలను చదివించి, వాటిపై ప్రతిస్పందనలను ఒక్కొక్కరిచే చెప్పించాలి.

● విద్యార్థుల అభిప్రాయాలను నల్లబల్లపై రాయాలి.
● వాటితో ప్రశ్నకు సరిపడే విధంగా జవాబును రూపొందించి నల్లబల్లపై రాయాలి.
● విద్యార్థులచే ఆ జవాబును 2 లేదా 3 సార్లు చదివించి నోటుపుస్తకంలో రాయించాలి.
(ఇలాగే ప్రతి ప్రశ్నకు రాయించాలి)

కృత్యం-2:

● ‘ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం’లోని అంశాలను చేయడం

● విద్యార్థులచే పుస్తకంలోని ఒక అంశాన్ని చదివించి, దానికి సమాధానాలు రాబట్టాలి. వాటిని
నల్లబల్లపై రాయాలి. వాటిని క్రోడీకరించి జవాబును రాసి, విద్యార్థులతో చదివించాలి.
● విద్యార్థుల నోటుపుస్తకంలో రాయించాలి.

[135] | పరిసరాల విజ్ఞా నం |

పీరియడ్ ప్లాన్
------------------------------------------------------------------
విషయం: పరిసరాల విజ్ఞానం తరగతి: 4

పాఠం పేరు: ఆటలు నియమాలు వారం: 6 రోజు: 3

------------------------------------------------------------------
I. అభ్యసన ఫలితాలు

1. ఆటలో మరియు నిత్యజీవితంలో నియమాల అవసరాన్ని వివరించగలరు.

2. చూసిన/ ఆడిన ఆట గురించి వరుస క్రమంలో వివరించగలరు.

3. ఆటలు ఆడేటప్పుడు గొడవలు జరగడానికి గల కారణాలు చెప్పగలరు.

4. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారుల వివరాలు సేకరించి పట్టిక తయారు చేయగలరు.

5. ఆటలు ఆడడంలో ఆడ, మగ భేదం ఉండదని గుర్తించగలరు.

II. పలకరింపు: శుభోదయం పిల్లలూ...!

III. అభ్యాస కృత్యాల నిర్వహణ.

● పాఠ్యపుస్తకంలోని 3, 4 అభ్యాసాలను పూర్తి చేయించడం

కృత్యం-1: విద్యార్థులను జట్లుగా చేసి వారు ఆడే ఏదైనా ఒక ఆటను ఆడే విధానాన్ని వరుస క్రమంలో రాయించాలి.

కృత్యం-2: పాఠ్యపుస్తకంలోని పేజి నెంబర్ 18లో గల సమాచార సేకరణ వివరాలు (పట్టిక) పూర్తి చేయించాలి.
విశ్లేషించి ముగింపు రాయించాలి.

కృత్యం-3: ఏదైనా ఆటకు సంబంధించిన కోర్టును కొలతల ప్రకారం గీయించాలి. ఆట వస్తువుల చిత్రాలు
గీయించాలి.

ఉదా:

[136] | పరిసరాల విజ్ఞా నం |

You might also like